‘బారెంట్స్ అండ్ ఫిషింగ్.. నార్త్ అట్లాంటిక్ ఫ్రాంఛైజీలకు సీక్వెల్‌గా వచ్చిన గేమ్ షిప్స్ ఎట్ సీ. ఈ బ్రాండ్–న్యూ గేమ్‌ప్లేలో రకరకాల కొత్త ఫీచర్‌లు ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న మల్టీప్లేయర్ మోడ్‌లో వచ్చిన ఈ గేమ్ ద్వారా మహా సముద్రాలకు సంబంధించి రియలిస్టిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను సొంతం చేసుకోవచ్చు.
నెక్ట్స్ జనరేషన్ షిప్ స్టిమ్యులేషన్‌గా వచ్చిన ఈ గేమ్‌లో మొదటిసారిగా సర్వీస్, కార్గో నౌకలను పరిచయం చేశారు. వీటిలో సరికొత్త గేమ్‌ప్లే ఫీచర్‌లో ఉంటాయి. ‘స్నేహితులతో కలిసి నార్వేజియన్ సముద్రంలోకి వెళ్లండి. సినిమాటిక్–క్వాలిటీ ఓషన్ స్టిమ్యులేషన్ దీని సొంతం. సముద్ర సాహసాలు చేయాలనే ఉత్సాహం మీలో ఉందా? అయితే షిప్స్ ఎట్ సీలోకి వచ్చేయండి’ అంటుంది గేమ్ డెవలపర్ మిస్క్ గేమ్స్.
జానర్స్: ఎర్లీ యాక్సెస్, స్ట్రాటజీ వీడియో గేమ్,
ల్యాట్‌ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్,
ఇంజిన్: అన్‌రియల్ ఇంజిన్ 5.
ఇవి చదవండి: ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..!
Comments
Please login to add a commentAdd a comment