gaming
-
ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’
భారతీయ ఈస్పోర్ట్స్ రంగంలో ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి క్రాఫ్టన్(Krafton) ఇండియా ఈస్పోర్ట్స్(Esports) ‘రైజింగ్ స్టార్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక ఈస్పోర్ట్స్ అథ్లెట్లను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, వారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని కంపెనీ తెలిపింది.రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించనున్నారు. గేమింగ్ నైపుణ్యాలను పెంచడంతోపాటు కంటెంట్ సృష్టి, మానసిక శ్రేయస్సు, సమతుల్య జీవనశైలి నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి పరిశ్రమకు చెందిన కొంతమంది టాప్ ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు అందిస్తారు. వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ఈస్పోర్ట్స్ లో దీర్ఘకాలిక విజయాల కోసం బలమైన పునాదిని ఏర్పరుచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: గగనతలంలోకి 16.13 కోట్ల మందిరైజింగ్ స్టార్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు యూట్యూబ్, ఫేస్బుక్ లేదా ఇతర స్ట్రీమింగ్ సర్వీసెస్ వంటి ప్లాట్ఫామ్ల్లో కనీసం 1,000 మంది ఫాలోవర్లు లేదా సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)కు సంబంధించిన కంటెంట్‌ను క్రమం తప్పకుండా తయారు చేస్తుండాలి. అభ్యర్థుల వయసు కనీసం 16 ఏళ్లు ఉండాలి. -
పిల్లల కంటెంట్‌లో అసభ్య యాడ్స్..
న్యూఢిల్లీ: పిల్లలు సహా అన్ని వర్గాలకు అనువైనదిగా మార్క్ చేసిన కంటెంట్‌లో తరచుగా అసభ్య ప్రకటనలు వస్తున్నాయని ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ సర్వే నివేదికలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది తల్లిదండ్రులు ఈ విషయం తెలిపారు. గత మూడేళ్లుగా గ్యాంబ్లింగ్/గేమింగ్, లోదుస్తులు, సెక్సువల్ వెల్నెస్కి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వివరించారు. పిల్లలకు అనువైనదిగా పేర్కొన్న కంటెంట్‌లో గ్యాంబ్లింగ్/గేమింగ్ (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) సంబంధ ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని 41 శాతం మంది తెలిపారు. లోదుస్తుల ప్రకటనలు తరచుగా ఉంటున్నాయని 35 శాతం మంది, సెక్సువల్ వెల్నెస్ యాడ్స్ ఉంటున్నాయని 29 శాతం మంది, మద్యం .. పొగాకు సంబంధ ప్రకటనలు ఉంటున్నాయని 24 శాతం మంది పేర్కొన్నారు. వయస్సుకు తగని ప్రకటనలు ప్రసారం చేస్తే నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించాలని 88 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల డివైజ్‌నే ఉపయోగిస్తారు కాబట్టి .. డివైజ్ ఓనర్ ప్రొఫైల్‌ను బట్టి కాకుండా లైవ్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ ప్రకారం ప్రకటనలు ఉండేలా ఆయా ప్లాట్‌ఫాంలు, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. 10,698 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వివిధ ప్రశ్నలకు దేశవ్యాప్తంగా 305 జిల్లాల నుంచి 30,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి. -
బెస్ట్ గేమింగ్ ఫోన్స్: ధర రూ.15000 కంటే తక్కువే..
భారతీయ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే వీటి కోసం భారీ మొత్తంలో వెచ్చించాలంటే కొందరు తప్పకుండా వెనుకడుగు వేస్తారు. అయితే ఈ కథనంలో రూ. 15,000లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ ఫోన్లను గురించి వివరంగా తెలుసుకుందాం.సీఎంఎఫ్ ఫోన్ 1: సీఎంఎఫ్ అనేది నథింగ్ సబ్ బ్రాండ్. రూ.14,999 వద్ద లభించే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో 6జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం గేమ్ ఆదుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మోటో జీ64: మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో గేమింగ్ ఫోన్ మోటో జీ64. దీని ధర కూడా రూ.14,999 మాత్రమే. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025తో పాటు 8జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 6000 mAh కలిగిన ఈ ఫోన్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. తక్కువ ధరలో గేమింగ్ ఫోన్ కోసం ఎదురు చూసేవారికి దీనిని పరిశీలించవచ్చు.పోకో ఎక్స్6 నియో: రూ.12,999 వద్ద లభిస్తున్న.. పోకో ఎక్స్6 నియో ఫోన్ కూడా తక్కువ ధరలో లభించే ఉత్తమ గేమింగ్ ఫోన్. ఇది 8 జీబీ రామ్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ పొందుతుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. సుదీర్ఘ గేమింగ్ సెషన్ల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది.రెడ్మీ 13 5జీ: రెడ్మీ 13 5జీ ధర రూ.14,999. ఇది వినియోగదారులకు లేటెస్ట్ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి పెద్ద డిస్ప్లే పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో 6 జీబీ రామ్ పొందుతుంది. అత్యుత్తమ పనితీరును అందించే ఈ ఫోన్ 5030 యాంపియర్ బ్యాటరీతో వస్తుంది.ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్: రూ. 15వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే గేమింగ్ ఫోన్లలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఒకటి. దీని ధర రూ. 13999. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో 8జీబీ రామ్ పొందుతుంది. శక్తివంతమైన ఈ స్మార్ట్‌ఫోన్.. మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. -
సిటీలో.. ఏఐ గేమింగ్ జోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత తరానికి అనుగుణంగా వస్తున్న నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగానే నగరంలో మొట్టమొదటి ఏఐ–గేమింగ్ జోన్ అడుగుపెట్టింది. దేశంలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ కంప్యూటర్ స్టోర్ విశాల్ పెరిఫెరల్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వేదికగా ఏఐ–గేమింగ్ జోన్ మంగళవారం ప్రారంభమైంది. డైరెక్టర్ రాహుల్ మల్హోత్రా, ఇంటెల్ ఇండియా సీనియర్ మేనేజర్ ఛానెల్ డి్రస్టిబ్యూషన్ అరుణ్ రాఘవన్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు.ఏ రంగంలోని విద్యార్థులైనా సరే తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు దోహదపడేలా ఈ సెంటర్ రూపొందించడం విశేషం. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కలి్పస్తున్నట్లు, ఏఐ గేమింగ్ జోన్లో సదుపాయాలను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్, ఏఐ–గేమింగ్ జోన్లో ప్రోగ్రామింగ్, ఏఐ డెవలప్మెంట్, గేమింగ్ తదితర విభాగాల్లో సేవలు పొందవచ్చు.ఐడీ కార్డులు తప్పనిసరి..నగరంలో ప్రతి విద్యార్థి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ ఏఐ–గేమింగ్ జోన్‌ను ఆవిష్కరించాం. ఈ ఉచిత సేవలు పొందడానికి, అధునాతన టెక్నాలజీ పై అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులు తమ ఐడీ కార్డులను వెంట తీసుకురావాలి. ప్రస్తుత టెక్ యుగంలో విద్యార్థులు విజయాలను సాధించేందుకు ఈ ఏఐ–గేమింగ్ జోన్ ఎంతో ఉపయోగపడుతుంది. – విశాల్ పెరిఫెరల్స్, విశాల్ కంప్యూటెక్ డైరెక్టర్ వికాష్ హిసరియాఇవి చదవండి: తెలంగాణకు అలర్ట్.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు -
క్లౌడ్ గేమింగ్ సూపర్ ‘క్లిక్’!
సరికొత్త వీడియో గేమ్‌లు మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే ఆడేయాలని ఎవరికుండదు చెప్పండి! నేటి జెన్ జడ్, యువతరానికి గేమ్స్ అంటే మరీ క్రేజ్. వీటిని ఆడాలంటే హై ఎండ్ పీసీతో పాటు ఖరీదైన గేమింగ్ కన్సోల్స్ తప్పనిసరి కావడంతో చాలా మందికి అందని ద్రాక్షగానే ఊరిస్తున్నాయి. అయితే, క్లౌడ్ గేమింగ్ ఎంట్రీతో వీడియో గేమ్స్ ముఖ చిత్రమే మారిపోతోంది. అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉన్న సాధారణ పీసీతోనే అదిరిపోయే లేటెస్ట్ వీడియో గేమ్స్ ఆడే అవకాశం లభిస్తుండటంతో గేమర్స్ క్లిక్.. క్లిక్.. హుర్రే అంటున్నారు!గేమింగ్ ఆన్ డిమాండ్... గేమ్ స్ట్రీమింగ్.. క్లౌడ్ గేమింగ్... పేరేదైనా కానీ గేమర్ల పాలిట వరంలా మారింది. కేవలం హైస్పీడ్ ఇంటర్నెట్, గేమ్ ప్యాడ్/కంట్రోలర్ ఉంటే చాలు.. ఇప్పుడు ఎవరైనా తమ ఫేవరెట్ గేమ్స్‌ను డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టీవీలోనే ఎంచక్కా స్ట్రీమ్ చేసేయొచ్చన్నమాట! హై క్వాలిటీ గేమ్‌ను మన సొంత సిస్టమ్‌లో రన్ చేయాలంటే, ఆడటానికి ముందే ఆ గేమ్‌ను ఫిజికల్‌గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా ఎక్కడో క్లౌడ్ సర్వర్లలో ఉన్న నచ్చిన గేమ్‌ను ఏ డివైజ్ లేదా ప్లాట్‌ఫామ్‌లోనైనా ఆడేందుకు (స్ట్రీమ్ చేసేందుకు) వీలవుతోంది. ఒకేసారి పలు డివైజ్‌లలోనూ గేమ్ ఆడొచ్చు. అంతేకాదు, గేమ్‌ను ఆపిన చోట నుంచే మళ్లీ ఆడుకోవచ్చు కూడా. అందుకే గేమర్స్ దీన్ని ‘నెట్‌ఫ్లిక్స్ ఫర్ గేమ్స్’ అని కూడా పిలుచుకుంటారు! రెండేళ్లలో మూడింతలు... మార్కెట్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్.యూఎస్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ గేమింగ్ యూజర్ల సంఖ్య 2021లో దాదాపు 10.27 కోట్ల మంది కాగా, 2023లో ఈ సంఖ్య ఏకంగా 29.1 కోట్లకు ఎగబాకింది. అంటే రెండేళ్లలోనే మూడింతలైంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ గేమింగ్ మార్కెట్ కూడా ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తోంది. 2030 నాటికి ప్రపంచ క్లౌడ్ గేమింగ్ మార్కెట్ 46.9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 85 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని ఫార్చూన్ బిజినెస్ లెక్కగట్టింది. 2022లో ఈ మార్కెట్ విలువ కేవలం 3.37 బిలియన్ డాలర్లు మాత్రమే. మరోపక్క, క్లౌడ్ గేమింగ్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్.. 2033 నాటికి పరిశ్రమ లీడర్‌గా ఎదుగుతుందని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తాజా నివేదిక పేర్కొనడం గమనార్హం. ‘అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన సీఎస్జీ (క్లౌడ్–స్ట్రీమ్డ్ గేమింగ్) మార్కెట్లు, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో మూడో వంతుకు పైగా ఆక్రమిస్తున్నాయి. వచ్చే పదేళ్లలో దక్షిణ, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు భారీగా వృద్ధి చెందనున్నాయి. ముఖ్యంగా యువతరంతో ఉప్పొంగుతున్న భారత్‌లో, 5జీ విప్లవం ఆన్లైన్ గేమింగ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేయనుంది’ అని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ ఎనలిస్ట్ నాథన్ నాయుడు పేర్కొన్నారు. భారత్.. అవకాశాల ‘క్లౌడ్’ భారీ అవకాశాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, ఎన్‌వీడియో, సోనీ మొబైల్ విభాగాలు వర్ధమాన దేశాల మార్కెట్లలో విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. యాపిల్ కూడా తన గేమ్–స్ట్రీమింగ్ యాప్‌లను ఈ మార్కెట్లలో అందుబాటులోకి తెస్తోంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఒక్కో గేమింగ్ యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 10% వార్షిక వృద్ధి సాధిస్తుండగా.. భారత్‌లో 15% చొప్పున పెరుగుతుండటం విశేషం. ‘మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ లభ్యత, చౌక డేటా ప్లాన్లు, 4జీ/5జీ భారీ విస్తరణ, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, అవి మరింత చౌక రేట్లతో మరింత పవర్ఫుల్ ఫీచర్లతో లభిస్తుండటం వంటి అనేక అంశాలు భారత్‌లో క్లౌడ్ గేమింగ్ జోరుకు దన్నుగా నిలుస్తున్నాయి’ అని యాంట్క్లౌడ్ సీఈఓ హిమాన్షు జైన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో సేవలు ప్రారంభించిన ఈ క్లౌడ్ గేమింగ్, పీసీ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పటికే 10,000 మంది యూజర్లను సంపాదించింది. ఈ ఏడాది చివరికల్లా 50,000 సబ్‌్రస్కిప్షన్లను లక్ష్యంగా పెట్టుకుంది.టెల్కోలకు భలే చాన్స్..దూసుకెళ్తున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్లో టెల్కోలు తమ సహజ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో రిలయన్స్ జియో ‘జియో గేమ్స్ క్లౌడ్’ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.199 ప్లాన్‌తో గేమ ర్లు చెలరేగిపోవచ్చన్న మాట! 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా అందుబాటులో ఉంది. వొడాఫోన్ ఐడియా కూడా క్లౌడ్ ప్లే పేరుతో గేమింగ్ సరీ్వస్ మొదలుపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ హ్యాండ్సెట్లలో ఎలాంటి డౌన్లోడ్లు లేకుండానే అదిరిపోయే గేమింగ్ అనుభూతిని యూజర్లకు అందిస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆ కొండకు చేరాలంటే.. కొండంత గుండె కావాలి!
డార్కెస్ట్ డంజన్కు సీక్వెల్‌గా వస్తున్న డార్కెస్ట్ డంజన్ 2 ఈ నెల 15న విడుదల అవుతుంది. గత గేమ్స్లాగే తాజా గేమ్ కూడా రోగ్‌లైక్ రోల్–ప్లేయింగ్ వీడియో గేమ్. తమవైన శక్తిసామర్థ్యాలతో ఉండే విభిన్నమైన క్యారెక్టర్లు దీనిలో ఉంటాయి.ఈ గేమ్ అంతిమ లక్ష్యం కొండకు చేరడం. కొన్ని శక్తులు ప్రపంచాన్ని ఆక్రమించడంలో కీలక పాత్ర పోషించిన కొండ ఇది. కొండను అన్వేషించే క్రమంలో ప్లేయర్‌కు రకరకాల అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఈ టర్న్–బేస్డ్ గేమ్‌లో రాంగ్ స్పాట్లో ఉన్నప్పుడు ప్లేయర్ తన స్కిల్స్‌ను ఉపయోగించలేరు.డెవలపర్స్: రెడ్ హుక్ స్టూడియోస్ఇంజిన్: యూనిటీ ప్లాట్‌ఫామ్స్: విండోస్, ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5, నిన్టెండో స్విచ్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: రోల్–ప్లేయింగ్, రోగ్‌లైక్ మోడ్ సింగిల్–ప్లేయర్ఇవి చదవండి: Artificial Intelligence: ఫీచర్ జెమిని ఏఐ టూల్స్.. -
'ది ఫస్ట్ డిసెన్‌డెంట్'.. ఇదొక హైక్వాలిటీ గ్రాఫిక్స్ గేమ్!
థర్డ్–పర్సన్ షూటర్ గేమ్ ‘ది ఫస్ట్ డిసెన్‌డెంట్’ విడుదల అయింది. హైక్వాలిటీ గ్రాఫిక్స్‌తో కూడిన ఈ స్ట్రాటజిక్ గేమ్‌లో యూనిక్ క్యారెక్టర్లు ఉంటాయి. ‘ఇన్గ్రిస్’ కాంటినెంట్‌ను కాపాడడానికి ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్లేయర్ పోరాడవలసి ఉంటుంది.ఇది మాత్రమే కాదు ప్లేయర్ రకరకాల మిషన్లలో పాల్గొనవలసి ఉంటుంది. డిస్టింక్టివ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ గేమ్‌లో యూనిక్ స్కిల్ సెట్స్, ఫ్రీ మూమెంట్స్, చైన్ యాక్షన్స్, గ్రాప్లింగ్ హుక్స్, కలర్‌ఫుల్ ఫైర్ఆర్మ్... మొదలైనవి గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటాయి.డెవలపర్: నెక్సన్ గేమ్స్,ఇంజిన్: యునైటెడ్ ఇంజిన్ 5,జానర్: థర్డ్–పర్సన్ షూటర్ యాక్షన్ ఆర్పీజీ,మోడ్: కోఆపరేటివ్ మల్టీప్లేయర్.ఇవి చదవండి: ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి! -
ఆటల రాజ్యంలో.. గెలుపు పాట!
గేమ్ ప్లేలోకి వెళితే... యాక్షన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘ఫైనల్ ఫాంటసీ’లో క్లైవ్ రాస్పెల్ అవుతారు. సాహస దారుల్లో ప్రయాణం చేస్తారు. జియోలొకేషన్–బేస్డ్ రోల్‌ప్లేయింగ్ గేమ్ ‘డ్రాగన్ క్వెస్ట్ వాక్’లోకి వెళ్లి మాన్స్టర్లతో తలపడతారు. హిట్ పాయింట్స్ కొడతారు. గేమింగ్ జోన్లోకి అడుగు పెడితే యూత్‌కు ఉత్సాహమే ఉత్సాహం. నిన్నటి వరకు అయితే ‘గేమింగ్’ అనేది యూత్‌కు ప్యాషన్ మాత్రమే. ఇప్పుడు మాత్రం ఫ్యాన్సీ కెరీర్ కూడా. గేమ్ డెవలపర్ నుంచి నెరేటివ్ డిజైనర్ వరకు ఎన్నో అవకాశాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయి. ఆన్లైన్ కోర్సులు చేయడం నుంచి పుస్తకాలు చదవడం వరకు ఎన్నో విధానాల ద్వారా గేమింగ్‌కు సంబంధించిన సాంకేతిక విషయాలపై పట్టు సాధిస్తున్నారు...వీడియో గేమ్స్ అనేవి యూత్‌కు ఇక ‘జస్ట్ ఫర్ ఫన్’ ఎంతమాత్రం కాదు. తమకు నచ్చిన రంగంలోనే యువత ఉపాధి అవకాశాలు చూసుకుంటోంది. వీడియో గేమ్‌లపై అంతకంతకూ పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో డెవలపర్లు, డిజైనర్లు, టెస్టర్స్... మొదలైన నైపుణ్యవంతులకు డిమాండ్ పెరిగింది.‘గేమింగ్ అనేది ఇప్పుడు కేవలం రీక్రియేషన్ కాదు. సీరియస్ కెరీర్ ఆప్షన్’ అంటుంది భోపాల్‌కు చెందిన అనీష. ఆమె గేమింగ్ లోకంలోకి వెళితే మరో లోకం తెలియదు. అలాంటి అనీష ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలోనే కెరీర్‌ను వెదుక్కునే ప్రయత్నం చేస్తోంది.‘గేమింగ్’ అనే మహాప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు... ఇన్–డిమాండ్ రోల్స్, స్కిల్స్, కోర్సులు....మొదలైన వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటుంది యువతరం. ‘గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కు వ్యయప్రయాసలు అక్కర్లేదు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు’ అంటుంది ముంబైకి చెందిన కైరా. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఆన్లైన్ కోర్సు చేయడంతో పాటు బుక్స్ చదువుతోంది. గేమ్ డిజైన్‌కు సంబంధించి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ చేసింది.గేమ్ మెకానిక్స్ క్రియేట్ చేసే గేమ్ డెవలపర్లు, వోవరాల్ కాన్సెప్ట్, స్టోరీలైన్, క్యారెక్టర్లు, గేమ్‌ప్లేపై దృష్టి పెట్టే గేమ్ డిజైనర్లు, బగ్స్ బాధ లేకుండా చూసే అసూరెన్స్ టెస్టర్లు, విజువల్ ఎలిమెంట్స్‌ను క్రియేట్ చేసే గ్రాఫిక్ ఆర్టిస్లు, యానిమేటర్లు, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, వాయిస్ వోవర్లాంటి ఆడియో యాస్పెక్ట్స్కు సంబంధించిన సౌండ్ డిజైనర్లు...గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.‘ఆసక్తి, ప్రతిభ ఉండాలేగానీ యువతరం తమను తాము నిరూపించుకోవడానికి గేమింగ్ ఇండస్ట్రీలో బోలెడు అవకాశాలు ఉన్నాయి’ అంటున్నాడు వీఆర్ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆటోవీఆర్’ సీయివో, కో–ఫౌండర్ అశ్విన్ జైశంకర్. ‘ఎలాంటి అవకాశాలు ఉన్నాయి’ ‘ఏ కోర్సు చేస్తే మంచిది’లాంటి వాటి గురించి అశ్విన్ జైశంకర్లాంటి నిపుణులు చెబుతున్న విషయాలను యువతరం జాగ్రత్తగా వింటోంది.‘అన్రియల్ ఇంజిన్ డెవలపర్ కోర్సు, యూనిటీ సర్టిఫైడ్ డెవలప్ కోర్సు, గేమ్ డిజైన్ అండ్ క్రియేషన్ స్పెషలైజేషన్... మొదలైనవి గేమ్ క్రియేషన్‌కు సంబంధించిన సరిౖయెన దారులు’ అంటున్నాడు అశ్విన్ జైశంకర్. గేమింగ్ కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్, గేమింగ్ కంపెనీల విస్తరణ కారణంగా గేమింగ్ పరిశ్రమలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం క్యాంపస్ నియామకాలు గణనీయంగా పెరిగాయి. ఎన్నో కంపెనీలు తమప్రాజెక్ట్లను దృష్టిలో పెట్టుకొని యూనివర్శిటీల నుంచి ప్రతిభావంతులైన వారిని నియమించుకుంటున్నాయి.మరోవైపు గేమింగ్ సెక్టార్లో ‘ఫ్రీలాన్సింగ్ ట్రెండ్’ పెరుగుతోంది. గేమ్ డెవలప్మెంట్కు సంబంధించి కీలక దశలో ఫ్రీలాన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ డెవలపర్ల నుంచి నెరేటివ్ డిజైనర్ల వరకు ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.మార్పు వచ్చింది..గేమింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే విషయంలో పిల్లల ఆసక్తి సరే, తల్లిదండ్రుల స్పందన ఏమిటి? అనే విషయానికి వస్తే... కొన్ని సంవత్సరాల క్రితం వరకు ‘గేమింగ్ అనేది కెరీర్ ఆప్షన్ కాదు’ అనే భావన వారికి బలంగా ఉండేది. ఈ పరిస్థితిలో ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది.‘ఒకప్పుడు గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సందేహాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం తమ పిల్లలను గేమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన కోర్సులలో చేర్పించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీకి ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్నాడు గేమింగ్ కంపెనీ ‘బ్యాక్‌స్టేజ్ పాస్’ ఫౌండర్ సూర్య. -
Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!
పురాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసం కాదు. వయసు మళ్లిన వారి కోసం మాత్రమే కాదు. మిలీనియల్స్ నుంచి జెన్ జెడ్ వరకు యువతరం పురాణాలను ఇష్టపడుతోంది. అయితే అది చదువు రూపంలో కాదు. గేమింగ్ రూపంలో. ఇండియన్ మైథలాజికల్ గేమ్స్‌ను ఆడడానికి గేమర్స్‌లో 82 శాతం మంది ఇష్టపడుతున్నట్లు చెబుతోంది గేమింగ్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా ఫండ్ సంస్థ లుమికై. అర్జునుడి నుంచి కర్ణుడి వరకు రకరకాల పురాణపాత్రలలో ‘ప్లేయర్’ రూపంలో పరకాయ ప్రవేశం చేస్తోంది యువతరం...వెల్కమ్ టు గేమ్ జోన్..అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శాన్వీకి గేమింగ్ అంటే బోలెడంత ఇష్టం. ఎక్కువ సమయాన్ని టెక్ట్స్బుక్స్తోనే గడిపే శాన్వీ కాసేపు వీడియో గేమ్స్ ఆడడం ద్వారా రిలాక్స్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డెత్స్ డోర్’ నుంచి ‘మాన్స్టర్ హంటర్’ వరకు ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఒక ఫ్రెండ్ సలహా ప్రకారం కొన్ని నెలల క్రితం తొలిసారిగా ఇండియన్ మైథలాజికల్ గేమ్ ఆడింది. ఇక అప్పటి నుంచి అలాంటి గేమ్స్ మాత్రమే ఆడుతోంది.‘మైథలాజికల్ గేమ్స్‌కు ఇతర గేమ్స్‌కు తేడా ఏమిటో తొలిసారిగా తెలుసుకున్నాను. ఇవి కేవలం కాలక్షేప ఆటలు కావు. పురాణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని పెంచుతాయి’ అంటుంది శాన్వీ. ‘చిన్న పట్టణాలతోపాటు గ్రామీణ ్రపాంతాలలో కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగింది. మన దేశంలో పెద్ద గేమింగ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. గతంతో ΄ోల్చితే వచ్చిన మార్పు ఏమిటంటే మన సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న పాత్రలను యువ గేమర్స్ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్–క్లాస్ టెక్నాలజీతో మనవైన పాత్రలను ఇండియన్ స్టూడియోలు డెవలప్ చేస్తున్నాయి’ అంటుంది ‘విన్జో గేమ్స్’ కో–ఫౌండర్ సౌమ్య సింగ్ రాథోడ్.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాలు, చరిత్ర, సంస్కృతి, జానపద సాహిత్యంలోని పాత్రల ఆధారంగా మరిన్ని గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ నుంచి రానున్నాయి అంటుంది సౌమ్య. ‘పురాణాలను గేమింగ్‌తో మిళితం చేయడంతో ప్లేయర్స్ కొత్త రకం అనుభూతికి గురవుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ గేమ్స్ ఆకట్టుకుంటున్నాయి’ అంటున్నాడు ‘ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్’ ఫౌండర్ చిన్మయ్ శర్మ. ‘మన పురాణాల్లో దాగున్న ఎన్నో ఇతివృత్తాలు డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ పాత్రలు యూత్‌ను ఆకట్టుకునేలా గేమ్‌ను డిజైన్ చేస్తున్నారు’ అంటున్నాడు యుగ్ మెటావర్స్ సీయీవో ఉత్కర్ష్ శుక్లా.మైథలాజికల్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్–పర్సన్ షూటర్(ఎఫ్‌పీఎస్) గేమ్స్. మెయిన్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడే గేమ్స్.‘టెస్ట్ యువర్ స్కిల్స్ ఇన్ దిస్ ఎపిక్ స్ట్రాటజీ గేమ్’ అంటూ ఆహ్వానించిన ‘కురుక్షేత్ర: అసెన్షన్’ దిల్లీకి చెందిన సజనికి బాగా నచ్చింది. ఈ వీడియో గేమ్‌లో అర్జునుడు, భీముడు, కర్ణుడులాంటి ఎన్నో పాత్రలు ఉంటాయి.‘మైథలాజికల్ గేమ్స్ మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళతాయి. మన పురాణాలు, జానపదాల ఆధారంగా గేమ్స్‌ను రూపొందించే అద్భుత అవకాశం ఇప్పుడు గేమ్ డెవలపర్లకు వచ్చింది. దేవ, దానవుల మధ్య యుద్ధానికి సంబంధించి సెకండ్ గేమ్‌ను రూపొందిస్తున్నాం’ అంటున్నాడు ‘కురుక్షేత్ర’ గేమ్‌ను రూపొందించిన ‘స్టూడియో సిరా’ కో–ఫౌండర్ అభాస్ షా.‘కురుక్షేత్ర’ను తక్కువ సమయంలో ఆరు లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు.మన దేశంలోనే కాదు ఆగ్నేయాసియా దేశాలలో కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన గేమ్స్‌ను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టాన్ని క్యాష్ చేసుకోవడం అని కాకుండా ఈ గేమ్స్ ద్వారా యువతలో నైతిక విలువలు పాదుకొల్పే, ఆత్మస్థైర్యం పెంచగలిగే ప్రయత్నం చేస్తే భవిష్యత్ కాలంలో వాటికి మరింత ఆదరణ పెరుగుతుంది. రాజీ పడకుండా...నోడింగ్ హెడ్స్ గేమ్స్ కంపెనీ రూపొందించిన ‘రాజీ: యాన్ ఏన్షియెంట్ ఎపిక్’ మనల్ని మన పురాణ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మన దేవాలయాల సౌందర్యం నుంచి ఇతిహాస కళ వరకు ఈ గేమ్‌లో ప్రతిఫలిస్తుంది. కంపెనీ ్రపారంభం నుంచి మన పురాణాల ఆధారంగా గేమ్‌ను రూపొందించాలని కల కన్నది పుణేకు చెందిన ‘నోడింగ్ హెడ్స్ గేమ్స్’ కంపెనీ ఫౌండర్ శృతి ఘోష్.‘రాజీ’ రూపంలో తన కలను నిజం చేసుకుంది.‘గ్రీకు ఇతర పురాణాలు సినిమాలు, గేమ్స్ రూపంలో మనల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలో మన పురాణాలు గుర్తింపు పొందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాణాల ఆధారంగా రాజీ గేమ్‌కు రూపకల్పన చేశాం. ఇది ఎంతో మంది డెవలపర్లకు స్ఫూర్తిని ఇచ్చింది. ఎంత చెప్పినా మన పురాణాల్లో నుంచి చెప్పడానికి ఇంకా ఎంతో ఉంటుంది’ అంటుంది శృతి ఘోష్.– శృతి ఘోష్ -
హైటెక్స్ వేదికగా దేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్!
క్రాఫ్టాన్ (KRAFTON) ఇండియా సమర్పించు బ్యాటిల్ రాయల్ ఎస్పోర్ట్స్ ఈవెంట్ 2024 ఫినాలే (BGIS) హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా ఈనెల (జూన్) 28, 29, 30 తేదీల్లో జరుగనుంది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్లలో ఒకటైన BGISలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జట్లు రిజిస్టర్ చేసుకున్నాయి. పలు దఫాల పోటీల అనంతరం టాప్ 16 జట్లు తుది పోటీలకు అర్హత సాధించాయి. ఈ ఈవెంట్లో పోటీ పడే జట్లు రూ. రెండు కోట్ల ప్రైజ్‌మనీని షేర్ చేసుకుంటాయి.KRAFTON సంస్థ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని కేటాయించడం భారత్‌లో ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధికి నిదర్శనం. BGIS 2024 Finaleతో హైదరాబాద్ నగరం గేమింగ్ గమ్యస్థానంగా తమ ప్రతిష్ట మరింత పెంచుకోనుంది. ఈ ఈవెంట్‌కు ప్రవేశ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోగా.. ప్రీమియం సీటింగ్, భోజన సదుపాయం కల ఎలైట్ పాస్‌లు (పెయిడ్ టికెట్లు) అందుబాటులో ఉన్నాయి.ఎలైట్ పాస్‌ల ధర రూ. 5000గా నిర్ణయించారు. ఎలైట్ పాస్‌ల విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని సంప్రదాయ క్రీడలకు మద్దతుగా అభినవ్ బింద్రా ఫౌండేషన్‌కు అందిస్తారు. గేమింగ్ ఔత్సాహికులు, అభిమానులు ఈ ఈవెంట్‌ను KRAFTON India Esports YouTube ఛానెల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం కలిగిన KRAFTON, Inc. ఆకర్షణీయమైన ఆటలను కనుగొనే ఆన్లైన్ గేమింగ్ సంస్థ. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డెవలపర్లకు నిలయంగా ఉంది. ఇందులో PUBG స్టూడియోస్, స్ట్రైకింగ్ డిస్టెన్స్ స్టూడియోస్, వెక్టర్ నార్త్, నియాన్ జెయింట్, క్రాఫ్టాన్ మాంట్రియల్ స్టూడియో, బ్లూహోల్ స్టూడియో, రైజింగ్ వింగ్స్, 5మిన్ల్యాబ్స్, డ్రీమోషన్, రెలుగేమ్స్, ఫ్లైవేగేమ్స్ వంటి స్టూడియోలు ఉన్నాయి.ప్రతి స్టూడియో నిరంతరం కొత్త సవాళ్లను స్వీకరించడానికి, వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌లు, సేవలను విస్తృతం చేయడం ద్వారా మరింత మంది అభిమానులను గెలుచుకోవడం KRAFTON లక్ష్యం. -
యానిమేషన్, గేమింగ్‌లో మనమే టాప్
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 3 వేలకుపైగా హాలివుడ్ సినిమాలకు యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు సబంధించిన అవుట్ సోర్సింగ్ పనులు చేశారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ–హబ్ ప్రాంగణంలో శనివారం వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, యానిమేషన్, ఫిల్మ్, గేమింగ్ అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అలాగే తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్, ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సేవలపైనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ నుంచి యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, సినిమాల ప్రచారంతోపాటు ప్రపంచ యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, సినిమాలలో భారతదేశంలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని ఆయన వివరించారు. సోనీ, కామ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి పెద్ద కంపెనీలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడంలో ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడు పంకజ్ బొహ్ర మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్, నిరంతర ఆవిష్కరణలు భారత్‌లో ఈ రంగాన్ని తాము ప్రోత్సహించడానికి ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అమెరికన్ కాన్సులేట్ వాణిజ్య వ్యవహరాల సలహాదారు రాఘవన్ శ్రీనివాసన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రాజెక్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. మధుసూదన్ ప్రసంగించారు. -
ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్..!
డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందించిన గేమ్ ఇది. ఒరిజినల్ మాదిరిగానే ఈ గేమ్‌లోని మూమెంట్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్(పివిఇ), ప్లేయర్ వర్సెస్ ప్లేయర్(పివిపి)గా విభజించబడి ఉంటాయి.‘పివిఇ’లో ఆరు–ప్లేయర్ రైడ్స్ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్ మోడ్ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్ ‘గార్డియన్’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.సిరీస్: డెస్టిని,ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: ఫస్ట్–పర్సన్ షూటర్, ఎంఎంవోజీమోడ్: మల్టీ ప్లేయర్ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం! -
Gaming: గురి తప్పకుండా..
యాక్షన్ రోల్–ప్లేయింగ్ సర్వైవల్ గేమ్ వి రైజింగ్. ఒపెన్ వరల్డ్‌లో సెట్ చేసిన ఈ గేమ్‌ను అయిదు బయోమ్లుగా విభజించారు. కొత్తగా ఉనికిలోకి వచ్చిన రక్తపిశాచిని కంట్రోల్ చేయడం ప్లేయర్ పని. దీని కోసం రకరకాల సాధనాలను, ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.అంతేకాదు శత్రువుకు చిక్కని దుర్భేద్యమైన కోటను కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది. సూర్యకాంతి, నీడ, రక్తనమూన... ఇలా ఎన్నో అంశాలు ఈ ఆటలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ అడుగులో ప్రమాదం, నష్టం పొంచి ఉందో కనిపెట్టే స్పృహ ఆటగాడిలో ఉండాలి. ఆటలో నాన్–ప్లేబుల్ క్యారెక్టర్లు(ఎన్పీసీ) కీలకం.ప్టాట్ ఫామ్స్: విండోస్ప్లేస్టేషన్: 5జానర్స్: సర్వైవల్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: భారత్‌లోకి ఎయిర్ టాక్సీ.. ధరలు ఎలా ఉంటాయంటే? -
సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే!
‘బారెంట్స్ అండ్ ఫిషింగ్.. నార్త్ అట్లాంటిక్ ఫ్రాంఛైజీలకు సీక్వెల్‌గా వచ్చిన గేమ్ షిప్స్ ఎట్ సీ. ఈ బ్రాండ్–న్యూ గేమ్‌ప్లేలో రకరకాల కొత్త ఫీచర్లు ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న మల్టీప్లేయర్ మోడ్‌లో వచ్చిన ఈ గేమ్ ద్వారా మహా సముద్రాలకు సంబంధించి రియలిస్టిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను సొంతం చేసుకోవచ్చు.నెక్ట్స్ జనరేషన్ షిప్ స్టిమ్యులేషన్గా వచ్చిన ఈ గేమ్‌లో మొదటిసారిగా సర్వీస్, కార్గో నౌకలను పరిచయం చేశారు. వీటిలో సరికొత్త గేమ్‌ప్లే ఫీచర్లో ఉంటాయి. ‘స్నేహితులతో కలిసి నార్వేజియన్ సముద్రంలోకి వెళ్లండి. సినిమాటిక్–క్వాలిటీ ఓషన్ స్టిమ్యులేషన్ దీని సొంతం. సముద్ర సాహసాలు చేయాలనే ఉత్సాహం మీలో ఉందా? అయితే షిప్స్ ఎట్ సీలోకి వచ్చేయండి’ అంటుంది గేమ్ డెవలపర్ మిస్క్ గేమ్స్.జానర్స్: ఎర్లీ యాక్సెస్, స్ట్రాటజీ వీడియో గేమ్,ల్యాట్ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్,ఇంజిన్: అన్రియల్ ఇంజిన్ 5.ఇవి చదవండి: ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..! -
ప్రభుత్వం నిద్ర పోతుందా? రాజ్‌కోట్ ఘటనపై హైకోర్టు సీరియస్
గాంధీనగర్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. మరో 15 మందిపైగా జనం జాడ తెలీడంలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనను సూమోటోగా స్వీకరించిన గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.‘‘అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ నిద్ర పోతున్నారు? మాకు గుజరాత్ ప్రభుత్వంపై మీద ఏ కోశానా కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ‘‘ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న రెండు గేమింగ్ జోన్లను గత రెండు దశాబ్దాలుగా రాజ్‌కోట్‌లో నిర్వహింస్తున్నారు. వాటి నిర్వహణకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. ఫైర్ సేఫ్టీ అనుమతి పత్రాలు కూడా లేవు. అందుకే గుజరాత్ ప్రభుత్వం పట్ల కొంచం కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రెండున్నరేళ్ల నుంచి రాజ్‌కోట్ గేమింగ్ జోన్ నడుస్తోంది. ప్రభుత్వం కళ్లు ముసుకుందని మేము అనుకోవాలా? అసలు అధికారులు ఏం చేస్తున్నారు?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. గేమింగ్ జోన్‌కు సంబంధించిన ఫొటోలను చూపించిన రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కూడా హైకోర్టు మండిపడింది. ‘‘ఈ అధికారులంతా ఎవరూ? అక్కడికి వారంతా ఆడుకోవడానికి వెళ్లారా?’’ అని కోర్టు విమర్శించింది. ‘‘అంతపెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీకు కంటి చూపు పోయిందా? లేదా నిద్రపోతున్నారా? ఇంత జరిగాక మాకు స్థానిక వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.రాజ్‌కోట్‌లోని మనా-మవా ప్రాంతంలో ఉన్న టీఆర్పీ గేమింగ్ జోన్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 33 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గేమింగ్ జోన్లో వెల్డింగ్ పనులు జరగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు. -
వారం క్రితమే వివాహం.. గేమింగ్ జోన్లో అగ్నికి ఆహుతై..
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. వినోదం కోసం వచ్చిన జనం ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొత్తగా పెళ్లయిన జంట అక్షయ్ ధోలారియా, ఖ్యాతి ఉన్నారు. ఈ జంటకు వారం క్రితమే వివాహం జరిగింది. ఈ నేపధ్యంలో వారు ఆనందంగా గేమింగ్ జోన్‌కు వచ్చారు. అయితే ఊహించని విధంగా సంభవించిన అగ్నిప్రమాదానికి వారిద్దరూ బలయ్యారు. 24 ఏళ్ల అక్షయ్ తన తల్లిదండ్రులతో కలిసి కెనడాలో ఉంటున్నాడు. ఖ్యాతి(20)ని వివాహం చేసుకునేందుకు కొద్దిరోజుల క్రితమే రాజ్‌కోట్‌కు వచ్చాడు. గత శనివారం వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లయిన ఏడు రోజులకే ఈ జంట లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. వారి శరీరాలు గుర్తించలేని విధంగా అగ్నికి మాడిపోయాయి. వేలికి ధరించిన ఉంగరం ఆధారంగా అక్షయ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ దంపతుల మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలకు తరలించారు.ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నామని, విచారణ తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే ఈ వినోద కేంద్రం నడుస్తున్నదని విచారణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీఆర్పీ గేమింగ్ జోన్ యజమానిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు తెలిపారు. -
TRP గేమింగ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం..
-
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్ మీ కోసమే.అడ్వెంచర్ సిమ్యూలెషన్ గేమ్ ‘ఎండ్లెస్ ఒషియన్ లుమినస్’ విడుదలైంది. జపాన్ గేమింగ్ కంపెనీ ‘అరిక’ డెవలప్ చేసిన గేమ్ ఇది. ‘ఎండ్లెస్ ఓషన్’ సిరీస్‌లో వస్తున్న థర్డ్ గేమ్. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్ చేయడానికి ఈ గేమ్‌లో ప్లేయర్ స్కూబా డైవర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.ప్లాట్‌ఫామ్: నిన్టెండో స్విచ్,జానర్స్: అడ్వెంచర్, సిమ్యులేషన్,మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
స్టెల్లర్ బ్లేడ్..! గ్రహాంతరవాసులతో వార్..!!
యాక్షన్ అడ్వెంచర్ గేమ్ ‘స్టెల్లర్ బ్లేడ్’ ఈ నెల 26న విడుదల కానుంది. కథ విషయానికి వస్తే భూమి మీద ఉన్న మనుషులకు, గ్రహాంతవాసులకు మధ్య యుద్ధం జరుగుతుంది. గ్రహాంతరవాసులతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత మానవాళి తరిమివేయబడుతుంది. కోల్పోయిన తమ స్వస్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈవ్‌తో పాటు ఆమె దళం ‘నయతిబా’ అనే గ్రహాంతరవాసులతో పోరాటానికి సిద్ధం అవుతుంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. శత్రువు వ్యూహాల ఆధారంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు సంబంధించిన డెమోను గత నెల విడుదల చేశారు. జానర్స్: యాక్షన్, అడ్వెంచర్.. ఇంజిన్: అన్రియల్ ఇంజిన్4 మోడ్స్: సింగిల్–ప్లేయర్ ప్లాట్‌ఫామ్: ప్లేస్టేషన్ 5 ఇవి చదవండి: ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా? -
Gaming: 'టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది..
సర్జెంట్ స్టూడియోస్ వారి ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ గేమ్‌లో ప్రధాన పాత్ర జావ్. డబుల్ జంప్, వాల్ జంప్, గాల్లో గంతులు వేయడంలో దిట్ట. మూడు ఆత్మలను బంధించి మృత్యుదేవత కలుంగకు అర్పిస్తుంది. సన్ మాస్క్, మూన్ మాస్క్ అనేవి జావ్ ప్రధాన ఆయుధాలు. శత్రువుల ఆటకట్టించడంలో ఈ రెండు ఆయుధాలకు తమదైన ప్రత్యేకత ఉంది. శత్రువులను జయించినప్పుడు వారి నుంచి ‘ఉలోగి’ అనే సోల్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ అనేది 2.5డీ ప్లాట్‌ఫామ్ అడ్వెంచర్ గేమ్. ప్లేయర్స్ క్రమంగా కొత్త కొత్త స్కిల్స్‌ను సొంతం చేసుకుంటారు. ప్లాట్‌ఫామ్స్: మైక్రోసాఫ్ట్ విండోస్, నిన్టెండో స్విచ్, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ మోడ్: సింగిల్ ప్లేయర్ -
పాపులర్ వీడియో గేమర్‌కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!
ఇటీవల కాలంటో ప్రముఖ సెలబ్రెటీలు, ఆటగాళ్లు కేన్సర్ బారిన పడుతున్నారు. ఒక్కసారిగా వారిలో చురుకుదనం కోల్పోయి డల్‌గా అయిపోతున్నారు. పాపం అక్కడకి లేని మనో నిబ్బరాన్నంతా కొని తెచ్చుకుని మరీ ఈ భయానక వ్యాధితో పోరాడుతున్నారు. కొందరూ ప్రాణాలతో బయటపడగా.. మరికొందరూ ఆ మహమ్మారికి బలవ్వుతున్నారు. అచ్చం అలానే ఓ ప్రసిద్ధ వీడియో గేమర్ ఈ కేన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. అతని కొచ్చిన కేన్సర్ ఏంటంటే.. ప్రోఫెషనల్ వీడియో గేమ్ ప్లేయర్ ట్విచ్ స్ట్రీమర్ నింజా చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయం విని ఒక్కసారిగా అతని అభిమానులంత షాక్‌కి గురయ్యారు. అతడి పాదాలపై ఒక పుట్టుమచ్చ ఉంది. అది అసాధారణంగా పెద్దది అవ్వడం ప్రారంభించింది. దీంతో వైద్యులను సంప్రదించాడు స్ట్రీమర్. అన్ని పరీక్షలు చేసి మెలనోమా కేన్సర్ అని నిర్థారించారు వైద్యులు. అయితే వైద్యులు ప్రారంభ దశలోనే ఈ కేన్సర్‌ని గుర్తించారని పేర్కొన్నాడు సోషల్ మీడియా ఎక్స్‌లో. దయచేసి అందరూ చర్మానికి సంబంధించిన చెకప్‌లు చేసుకోండి అని అభిమానులను కోరాడు. ఇంతకీ అతనికి వచ్చిన మెలనోమా కేన్సర్ అంటే..! మెలనోమా అనేది మెలనోసైట్స్ నుంచి ఉద్భవించే ఒక రకమైన చర్మ కేన్సర్. ఇది మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలనోమా సాధారణంగా సూర్యరశ్మికి బహిర్గతమయ్యే చర్మంపై ప్రారంభమవుతుంది. చాలా మెలనోమాలు అతినీలలోహిత కాంతికి గురికావడం వల్ల సంభవిస్తాయి. మెలనోమా దశను అనుసరించి చికిత్స విధానం మారుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. ఈ మెలనోమా కేన్సర్ చర్మంపై ఎక్కడైనా తలెత్తుతుందని నిపుణుల చెబుతున్నారు. చాలా పుట్టుమచ్చలు, గోధుమ రంగు మచ్చలు వంటి వాటిల్లో చర్మంపై అసాధారరణ పెరుగదల ఉంటే ఇది వస్తుంది. వీటిని ఏబీసీడీఈలు అనే అగ్లీ డక్లింగ్ గుర్తు ద్వారా మెలనోమాని గుర్తించడం జరుగుతుంది. అంతేగాదు ఆ ప్రదేశంలోని అనుమానాస్పద కణజాలాన్ని చర్మవ్యాధి నిపుణుడు బయాప్సీ చేయించి , క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేదా అని నిర్ణయిస్తాడు. అలా ఈ కేన్సర్‌ని గుర్తించడం జరిగాక, సిటీ స్కాన్లు, పీఈటీ స్కాన్లు సాయంతో ఏ దశలో ఉందనేది నిర్థారిస్తారు. చికిత్స.. ఇతర కేన్సర్ల కంటే ఇందులో చర్మం వద్ద కణాజాలం కాబట్టి తీసివేయడం కాస్త సులభం. గాయాన్ని తొలగించేటప్పడే క్యాన్సర్ ప్రమేయం ఎంతవరకు ఉందో నిర్థారించి తొలగించాక, పూర్తిగా తొలగిపోయాయా లేదా అని నిర్ధారించుకోవడానికి పాథాలజీ పరీక్షలకు కూడా పంపడం జరుగుతుంది. మెలనోమా చర్మంలోని పెద్ద ప్రాంతాలో ఉంటే మాత్రం చర్మాన్ని అంటుకట్టుట వంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేన్సర్ శోషరస కణుపులకు వ్యాపించే ప్రమాదం ఉంటే.. శోషరస కణుపు బయాప్సీని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ వంటివి కూడా అవసరమవ్వచ్చు. ఇక నింజా 2011 నుంచి వృత్తిపరంగా పలు వీడియో గేమ్‌లు ఆడి స్ట్రీమర్‌గా మారాడు. ఇక్కడ ట్విచ్ అనేది ప్రధానంగా వీడియో గేమ్‌లపై దృష్టి సారించే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్. అయితే ఇది సంగీతం, సృజనాత్మక కళలు, వంట మరిన్నింటిని కవర్ చేసే స్ట్రీమ్‌లను కూడా కలిగి ఉంటుంది. దీనిద్వారా ఎంతో మంది ప్రముఖులతో లైవ్‌స్ట్రీమ్‌లో వీడియో గేమ్‌లు ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీని కారణంగానే అతనికి వేలాదిమంది ఫాలోవర్లుఉన్నారు. మైక్రోసాఫ్ట్ స్ట్రీమిగ్ ఫ్లాట్‌ఫాం మిక్సర్ కోసం 2019లో ట్విచ్ని వదిలిపెట్టాడు. ఆ మిక్సర్ షట్‌డౌన్ అయ్యాక మళ్లీ ట్విచ్కి తిరిగి వచ్చాడు. ఈ స్ట్రీమింగ్ ద్వారా అంతర్జాతీయ ప్రశంసల తోపాటు మిలయన్ల డాలర్లును సంపాదించాడు. (చదవండి: తండ్రి మిలియనీర్..కానీ కొడుక్కి 20 ఏళ్ల వరకు ఆ విషయం తెలియదు!) -
Gaming: యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్.. 'హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్'
హరైజన్ జీరో డాన్ (2017) గేమ్‌కు సీక్వెల్‌గా వచ్చిన యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్ హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్(పీసీ) విడుదలైంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్లో ఆడే గేమ్ ఇది. ప్రమాదకరమైన ఆయుధాలతో నిండిన ‘అలోయ్’ అనే హంటర్‌ను ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. నోరా తెగకు చెందిన యంగ్ హంటర్ అలోయ్ శాస్త్రవేత్త ఎలిజబెత్ సోటెక్ క్లోన్. ‘మిస్టీరియస్ ప్లేగ్’ మూలాన్ని తెలుసుకోవడానికి తన బృందాన్ని ఫర్బిడెన్ వెస్ట్ అని పిలవబడే సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళుతుంది. ఆలోయ్ తన ప్రయాణంలో భారీ తుఫానులను, సంచార తెగలతో యుద్ధాలను ఎదుర్కొంటుంది. పచ్చనిలోయల నుంచి శిథిలమైన నగరాల వరకు ఆలోయ్ ప్రయాణంలో ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. గత గేమ్‌తో ΄ోల్చితే ఈ గేమ్ మ్యాప్ పెద్దగా ఉంటుంది. షీల్డ్వింగ్, ఫోకస్ స్కానర్, డైవింగ్ మాస్క్, పుల్కాస్టర్లాంటి టూల్స్‌ను కంబాట్‌లో ఉపయోగించవచ్చు. ప్లాట్‌ఫామ్స్: ప్లే స్టేషన్ 4, ప్లే స్టేషన్ 5 విండోస్ జానర్: యాక్షన్, అడ్వెంచర్ మోడ్: సింగిల్–ప్లేయర్ ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్‌మేకర్! -
అసలు వీటి గురించి మీకు తెలుసా..!
పోరాటమే ఊపిరిగా.. ట్యాక్టికల్ రోల్ ప్లేయింగ్ గేమ్ ‘యూనికార్న్ వోవర్లార్డ్’ మార్చి 8న విడుదల కానుంది. తన జెనోయిరాన్ సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రాజ్యం నుంచి బహిష్కృతుడైన యువరాజు అలైన్ తన మిత్రులను సమీకరించి చేసే పోరాటమే ఈ గేమ్. అలైన్, అతడి బలగాల పోరాటాన్ని గేమ్‌ప్లే ఫాలో అవుతుంది. అన్ని క్యారెక్టర్లు, లొకేషన్లు, స్ప్రైట్స్ 2డీ ఆర్ట్‌తో డిస్ప్లే అవుతాయి. జానర్: ట్యాక్టికల్ రోల్–ప్లేయింగ్ మోడ్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ ప్లాట్‌ఫామ్స్: నిన్టెండో స్విచ్/ప్లేస్టేషన్ 4/ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ అవును...ఇది నిజమే! ‘ది ఫేస్బుక్’తో కాలేజీ క్యాంపస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్బుక్ ఎంతోమంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు పాపులర్ అయిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ‘ఫ్రెండ్ స్టర్’ ఫేస్‌బుక్‌ను కొనుగోలు చేయడానికి ముందుకువచ్చింది. వచ్చిన బంపర్ ఆఫర్లను తిరస్కరించడం ద్వారా మరింత సంచలనం సృష్టించాడు జుకర్ బర్గ్. ఫేస్బుక్ అమ్మడంపై కాకుండా ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరువ కావాలి’ అంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. పెనిషియస్ చెడు ప్రభావం, హాని కలిగిస్తుంది అనే చెప్పే సందర్భంలో వాడే మాట...పెనిషియస్ ఉదా: ది పెనిషియస్ ఎఫెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పోల్యూషన్ పెర్ఫిడీ నమ్మకద్రోహం, మోసం జరిగిన సందర్భంలో వాడే మాట పెర్ఫిడీ ఉదా: ఇట్ వాజ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ పెర్ఫిడీ పెన్యూరీ కొరత. పేదరికం, వేదన.... మొదలైన సందర్భాలలో ఉపయోగించే మాట పెన్యూరీ. ఉదా: హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ పెన్యూరీ. విత్ఔట్ ఎడ్యుకేషన్ ఇవి చదవండి: ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి! -
Microsoft layoffs: 1,900 మందిని ఇంటికి పంపిస్తున్న మైక్రోసాఫ్ట్!
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా దాని వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ గత ఏడాది 69 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ను బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ సమీక్షించింది. మైక్రోసాఫ్ట్ 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మంది తొలగించనున్నట్లు ఈమెయిల్లో మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలును ఖరారు చేసిన మూడు నెలల్లోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టడం గమనార్హం. భవిష్యత్తుకు అనుగుణంగా తమ వనరులను రీసెట్ చేయడానికే తొలగింపులు చేపడుతున్నట్లు యాక్టివిజన్ పబ్లిషింగ్ చీఫ్ రాబ్ కోస్టిచ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. -
CES 2024: హెచ్‌పీ నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లు
ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హెచ్‌పీ సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లను ఆవిష్కరించింది. లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2024)లో తమ OMEN, HyperX సబ్-బ్రాండ్ల కింద కొత్త గేమింగ్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేసింది. కంపెనీ కొత్త లాంచ్‌లలో గేమర్లకు గేమింగ్, ఇతర క్రియేటివ్ టాస్క్‌ల కోసం ఒమెన్ ట్రాన్సెండ్ 14 (Omen Transcend 14) గేమింగ్ ల్యాప్‌టాప్ ఉంది. దీంతోపాటు 240Hz రిఫ్రెష్ రేట్‌తో 2.5K OLED డిస్ప్లేతో OMEN ట్రాన్స్‌సెండ్ 16-అంగుళాల ల్యాప్‌టాప్‌ను కూడా హెచ్‌పీ ఆవిష్కరించింది. HP Omen 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్, Victus 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్ రెండూ సరికొత్త Intel i7 HX ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ముఖ్యమైన ఫీచర్లు.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, కంటెంట్ క్రియేషన్‌కు అనువైన IMAX కూడిన సర్టిఫైడ్ 2.8K OLED డిస్ప్లే లాటిస్-లెస్ స్కై-ప్రింటెడ్ RGB కీబోర్డ్ ఎక్కడికైనా తీసుకెళ్ళేందుకు వీలుగా 1.6 కేజీల బరువుతో తేలికనది 140W ఛార్జింగ్ అడాప్టర్‌తో 11.5 గంటల బ్యాటరీ లైఫ్ NVIDIA GeForce RTX 4070 GPUతో ఇంటెల్ అల్ట్రా 9 185H ప్రాసెసర్ -
ఇండియాలో దూసుకుపోతున్న గేమింగ్ ఇండస్ట్రీ, 2028 నాటికి..
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియా గేమ్ డెవలప్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ)లో విడుదల చేసిన ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్’ మన దేశంలో డిజిటల్ గేమింగ్ ఇండస్ట్రీ ఉజ్వల భవిష్యత్తు గురించి చెప్పకనే చెప్పింది. డిజిటల్ గేమ్స్‌కు యూత్ మహారాజ పోషకులే అయినప్పటికీ ‘యూజర్’ స్థానానికి మాత్రమే పరిమితం కావడం లేదు. గేమింగ్ ఇండస్ట్రీ ముఖ చిత్రాన్ని మార్చడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. సొంతంగా గేమ్ బిల్డింగ్ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు. ఇండియా గేమ్ డెవలప్ కాన్ఫరెన్స్(ఐజీడీసీ)లో గేమింగ్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ లుమికై గూగుల్‌తో కలిసి ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్’ విడుదల చేసింది. మన దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ స్పీడ్‌కు ఇది అద్దం పడుతుంది. మన గేమింగ్ ఇండస్ట్రీ 2028 నాటికి అరవై రెండు వేల కోట్లను దాటుతుందని ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది. ‘డిజిటల్ గేమ్స్’ అనగానే గుర్తుకు వచ్చేది యువతరమే. వారు డిజిటల్ గేమ్స్ వైపు ఆకర్షితం కావడానికి ప్రధాన కారణాలు... ∙సోషల్ కనెక్షన్: ఫోర్ట్‌నైట్, మైన్క్రాఫ్ట్లాంటి గేమ్స్ ఫిజికల్ లొకేషన్‌తో పనిలేకుండా వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ప్లేయర్స్ ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే, స్నేహం చేసే, ఆన్లైన్ కమ్యూనిటీలను నిర్మించుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. జెన్ జెడ్ హైలీ సోషల్ జెనరేషన్‌గా పేరు తెచ్చుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి, పోటీ పడడానికి తమ గేమ్స్‌లో సోషల్ ఫీచర్స్‌ను తీసుకువస్తున్నాయి కంపెనీలు. ►యూజర్–జనరేటెడ్ కంటెంట్: యూజర్లు తమ సొంత కంటెంట్‌ను క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో పాపులర్ గేమ్స్ అనుమతిస్తున్నాయి. తమ స్వీయ అనుభవాలను ఉపయోగించి యూజర్–జనరేటెడ్ కంటెంట్‌ను వర్చువల్ వరల్డ్‌లో వైబ్రెంట్ అండ్ డైనమిక్‌గా క్రియేట్ చేయడానికి వీలవుతుంది. ∙ఎన్నో ఎన్నెన్నో: యూత్ ప్లేయర్స్‌కు మోడ్రన్ గేమ్స్ కాంపిటేటివ్, కో–ఆపరేటీవ్ గేమ్‌ప్లే, ఎక్స్΄్లోరేషన్, స్టోరీ టెల్లింగ్‌కు సంబంధించి సరికొత్త అనుభవాలను అందిస్తున్నాయి. ప్లేయర్స్‌కు గ్రాఫిక్స్, సౌండ్, గేమ్ ప్లే మెకానిక్స్‌ను చేరువచేయడంపై దృష్టి పెడుతున్నాయి. ►స్ట్రేస్ ఫ్రీ–క్రియేటివిటీ: యూత్‌లో కొద్దిమంది ఒత్తిడి నుంచి బయట పడడానికి గేమింగ్‌కు దగ్గరవుతున్నారు. ఆర్ట్, డిజైన్, స్టోరీ టెల్లింగ్లాంటి సృజనాత్మక ప్రక్రియలను ఇష్టపడే యువతరం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కోసం వీడియో గేమ్స్ ఆడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు తమ గేమ్స్‌లో ప్లేయర్స్‌కు సొంత గేమ్ మోడ్స్, మ్యాప్స్ క్రియేట్ చేయడానికి అనుమతిస్తున్నాయి. యువతరమే కారణం... మొబైల్ డివైజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మొబైల్ గేమింగ్ అభివృద్ధికి యూత్ ఉపయోగపడుతుంది. సంప్రదాయ గేమింగ్ కన్సోల్స్ కంటే అఫర్డబుల్ అండ్ యాక్సెసబుల్‌గా ఉండే మొబైల్ డివైజ్‌లకే ప్రాధాన్యత ఇస్తోంది యువతరం. ఇ–స్పోర్ట్స్ లేదా కాంపిటీటివ్ గేమింగ్ మెయిన్ స్ట్రీమ్‌లోకి రావడానికి ప్రధాన కారణం యువత. యువతరం చూపిస్తున్న ఆసక్తి వల్ల ఎన్నో టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఇ–స్పోర్ట్స్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రొఫెషనల్ ఇ–స్పోర్ట్స్ ప్లేయర్స్ తయారవుతున్నారు. బోలెడు ఉపాధి అవకాశాలు... గేమ్స్ నుంచి అపారమైన ఆనందాన్ని సొంతం చేసుకోవడమే కాదు గేమింగ్ ఇండస్ట్రీ నుంచి ఉపాధి అవకాశాలను కూడా వెదుక్కుంటోంది యువతరం. ఇ- స్పోర్ట్స్ ఇటీవల కాలంలో మల్టీ–బిలియన్–డాలర్ ఇండస్ట్రీగా ఎదిగింది. ప్రొఫెషనల్ ప్లేయర్స్‌కు జీతాలతో పాటు స్పాన్సర్షిప్ అవకాశాలు కూడా వస్తున్నాయి. గేమింగ్ ఇండస్ట్రీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగావకాశాలు ఉన్నాయి అంటుంది టీమ్‌లీజ్ డిజిటల్ ఫర్మ్ రిపోర్ట్ ‘గేమింగ్: టుమారోస్ బ్లాక్‌బస్టర్. ప్రోగ్రామింగ్ (గేమ్ డెవలపర్స్, యూనిటీ డెవలపర్స్), టెస్టింగ్ (గేమ్స్ టెస్ట్ ఇంజనీరింగ్, క్వాలిటీ అండ్ అసూరెన్స్), యానిమేషన్, డిజైన్(మోషన్ గ్రాఫిక్ డిజైనర్స్, వర్చువల్ రియాలిటీ డిజైనర్స్), ఆర్టిస్ట్స్ (వీఎఫ్ఎక్స్ అండ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్), కంటెంట్ రైటింగ్, గేమింగ్ జర్నలిజం మొదలైన విభాగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్ఫూర్తిదాయక సూపర్‌స్టార్స్ యువతలో ఎంతోమందిలాగే ఈ ముగ్గురికి గేమ్స్ అంటే చాలా ఇష్టం. గేమింగ్‌ను వీరు అభిరుచిగా మాత్రమే చూడలేదు. గేమింగ్ రంగంలో తమ వ్యాపారదక్షతను నిరూపించుకోవాలకున్నారు. సొంతంగా గేమ్ బిల్డింగ్ కంపెనీ ప్రారంభించి తమ సత్తా చాటారు. యువతరంలో ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తున్నారు. సూపర్ గేమింగ్ యూనివర్శిటీ ఆఫ్ ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది క్రిస్టెల్ డీక్రూజ్. ఆ తరువాత కొలరాడో స్టేట్ యూనివర్శిటీ(యూఎస్)లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. ‘టాప్టూలెర్న్’లో ఎడ్యుకేషనల్ గేమ్ డెవలపర్‌గా ఉన్నప్పుడు గేమ్స్‌కు ఉండే పవర్ ఏమిటో దగ్గర నుంచి చూసింది. ఆ కంపెనీలో చేరిన తొలి మహిళా ఉద్యోగి క్రిస్టెల్. ఆ తరువాత ఫ్రెండ్స్‌తో కలిసి ‘సూపర్ గేమింగ్’ అనే గేమ్బిల్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసింది. అపార్ గేమ్స్ ముంబై యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేసిన లక్ష్మీ కానోల్కర్ ముంబైలోని వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఇంటరాక్టివ్ ఇ–లెర్నింగ్ చిల్డ్రన్స్ కంటెంట్‌ను డిజైనింగ్ చేయడం ద్వారా గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. గేమింగ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో సొంతంగా గేమ్ డెవలపింగ్ కంపెనీ ‘అపార్ గేమ్స్’ ప్రారంభించింది. వినో జో ది యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్(ఇంగ్లాండ్)లో సైకాలజీలో మాస్టర్స్ చేసిన తరువాత కేపీఎంజీ కన్సల్టింగ్ వింగ్‌లో చేరింది సౌమ్యా సింగ్ రాథోడ్. టైమ్స్ గ్రూప్‌లో పనిచేసిన తరువాత ‘వినో జో’ పేరుతో సొంతంగా ఆన్లైన్ సోషల్ గేమింగ్ కంపెనీని మొదలు పెట్టింది. ‘ఒక విషయంపై మనకు ఇష్టం ఉన్నప్పుడు అదే మన బలంగా మారుతుంది. ఆ బలంతోనే విజయం సాధించవచ్చు’ అంటుంది సౌమ్యా సింగ్. -
డ్రీమ్ సిటీలో డ్రీమ్‌హాక్ గేమింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్ ‘డ్రీమ్‌హాక్’కు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికైంది. శుక్రవారం ప్రారంభమైన యాక్షన్–ప్యాక్డ్ గేమింగ్ మహోత్సవం మూడ్రోజులపాటు కొనసాగనుంది. గేమింగ్, స్పోర్ట్స్ టోర్నమెంట్, చెస్ డెత్ మ్యాచ్, రెట్రో గేమింగ్ వంటి వినూత్న గేమ్లతోపాటు వర్క్‌షాప్‌లు, అభిమానుల మీట్ అండ్ గ్రీట్, డ్యాన్స్ షో, మ్యూజిక్ జోన్, స్టాండప్ కామిక్స్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో నోడ్వింగ్ గేమింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డ్రీమ్‌హాక్ గేమింగ్ మహోత్సవంలో ఇంటెల్, మాన్స్టర్, హ్యుందయ్, బింగో వంటి ప్రముఖ సంస్థలు గేమింగ్ వేదికలను ఏర్పాటు చేశాయి. పీసీ మోడ్, మొబైల్ మోడ్ విధానంలో గేమ్స్ నిర్వహించగా హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ నగరాల డిజిటల్ గేమర్స్ పాల్గొంటున్నారు. డ్రీమ్‌హాక్ రాపిడ్ ఓపెన్ టోర్నమెంట్, డ్రీమ్‌హాక్ బ్లిట్జ్ ఓపెన్ టోర్నమెంట్, కేఓ ఫైట్ నైట్, పబ్జీ ఆధారిత గేమ్‌లు, రెట్రో జోన్ గేమ్స్ మోనోపోలీ, లూడో, క్యారమ్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, యూఎన్వో వంటి ప్రసిద్ధ బోర్డ్ గేమ్‌లతో డ్రీమ్‌హాక్ అలరిస్తుంది. వివిధ విభాగాల విజేతలకు లక్షల్లో నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు డ్రీమ్‌హాక్ ప్రకటించింది. -
అక్టోబర్ 7న జీఎస్టీ మండలి కీలక భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో వచ్చే నెల 7వ తేదీన జీఎస్టీ మండలి కీలక సమావేశం జరగనుంది. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ జీఎస్టీ మండలి 52వ సమావేశం జరగనుందని ఎక్స్‌లో ఒక అధికారిక ప్రకటన పోస్టయ్యింది. జీఎస్టీ మండలి నిర్ణయాల్లో కేంద్ర ఆర్థికమంత్రితోపాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు కూడా భాగస్వాములుగా ఉండే సంగతి తెలిసిందే. ఆగస్టు 2వ తేదీన జరిగిన గత జీఎస్టీ మండలి భేటీలో క్యాసినోలు, గుర్రపు పందాలు, ఆన్లైన్ గేమింగ్ల పన్ను విధానాలపై కీలక నిర్ణయాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడింటికి సంబంధించిన పందాల పూర్తి ఫేస్ వ్యాల్యూపై 28 శాతం జీఎస్టీ విధించాలని ఈ సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. -
కంప్యూటర్ సైన్స్‌లో ఫెయిల్.. పట్టుదలతో గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ని నెలకొల్పాడు
స్కూల్ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ యూనిట్ టెస్ట్‌లో ఫెయిలైన ఏకైక విద్యార్థికి సాంకేతికతపై పట్టు సాధించాలనే పట్టుదల పెరిగితే ఎలా ఉంటుంది? అచ్చం... అభిక్ సాహ లా ఉంటుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన అభిక్ సాహ పదిహేను సంవత్సరాల వయసులోనే దేశీ సెర్చ్ ఇంజిన్‌ను డెవలప్ చేసి భేష్ అనిపించుకున్నాడు. స్నేహితుడు హర్షిత్ జైన్‌తో కలిసి మొదలు పెట్టిన డీ సెంట్రలైజ్డ్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోన్లీ గేమ్’ విజయపథంలో దూసుకుపోతోంది. కంప్యూటర్ సైన్స్ యూనిట్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన ఏకైన విద్యార్థి అభిక్ సాహ. అది తనపై బలమైన ప్రభావం చూపించింది. సాంకేతికతపై పట్టు సాధించాలనే పట్టుదలను పెంచింది. కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్చుకోవడాన్ని ఒకప్పుడు బోర్‌గా ఫీలైన సాహ ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్ను విశ్వవిద్యాలయం చేసుకున్నాడు. కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్చుకోవడాన్ని ఒకప్పుడు బోర్‌గా ఫీలైన సాహ ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్ను విశ్వవిద్యాలయం చేసుకున్నాడు.ఆన్లైన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఆన్లైన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. బేసిక్ సాఫ్ట్వేర్ నుంచి వెబ్సైట్ బ్లాకింగ్ వరకు ఎన్నో విషయాలపై పట్టు సాధించాడు. పదమూడవ పుట్టిన రోజు సందర్భంగా తండ్రి తనకు స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రపంచ సాంకేతికతపై అవగాహన పెంచుకోవడానికి, రకరకాల మొబైల్ అప్లికేషన్లను క్రియేట్ చేయడానికి ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగపడింది. పదిహేను సంవత్సరాల వయసులో వినూత్నమైన దేశీ సెర్చ్ ఇంజిన్ ‘ఒరిగాన్’ను డెవలప్ చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చి ‘భేష్’ అనిపించుకున్నాడు అభిక్ సాహ. పశ్చిమబెంగాల్లోని చల్స పట్టణానికి చెందిన సాహ హైస్కూల్ రోజుల్లోనే మొబైల్ అప్లికేషన్లు, వెబ్సైట్ బిల్డింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ డెవలపింగ్ లాంగ్వేజిలపై ఉచిత వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడంలో తలమునకలై ఉండేవాడు. ఇండియన్ ఇ–స్పోర్ట్స్ వృద్ధిరేటు ఆశాజనకంగా, ఉత్సాహంగా ఉందని, 2027 కల్లా భారీ వృద్ధిరేటు కనిపిస్తుందని కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) రిపోర్ట్ తెలియజేస్తుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రకరకాల టోర్నమెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షిస్తున్నారు. మన దేశంలో ఇ–గేమ్స్‌కు పెరుగుతున్న పాపులారిటీని గమనించి హర్షిత్ జైన్, అభిక్ సాహ డీసెంట్రలైజ్డ్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోన్లీ ప్లే’ ప్రారంభించారు. దీన్ని ‘నెక్ట్స్ బిగ్ వోటీటీ’ లక్ష్యంగా మొదలు పెట్టారు. గేమ్ ఆడాలనే ఉత్సాహం ఒక కోణం అయితే ఖర్చును దృష్టిలో పెట్టుకొని దూరంగా ఉండడం మరో కోణం. పీసీ, కీబోర్డ్, హై–కంప్యూటింగ్ సీపీయూ సెటప్ వరకు ఎంతో ఖర్చు అవుతుంది. అయితే క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోన్లీ ప్లే’తో యూజర్లు మంత్లీ ప్లాన్ రూ.499 ద్వారా డిఫరెంట్ స్టోర్స్ నుంచి ఎన్నో టైటిల్స్‌తో యాక్సెస్ కావచ్చు. హై ప్రాసెసింగ్ సీపీయూలాంటి అడ్వాన్స్డ్ గేమింగ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు. యూజర్స్ తమ దగ్గర ఉన్న ఏ డివైజ్ ద్వారా అయినా గేమ్స్‌తో యాక్సెస్ కావచ్చు.‘ఒక విధంగా చెప్పాలంటే ఇది సైబర్ కేఫ్లాంటిది అనుకోవచ్చు. నిర్ణీతమైన టైమ్‌కు కొంత డబ్బు చెల్లించి ఇంటర్నెట్తో యాక్సెస్ కావడంలాంటిది’ అంటాడు కంపెనీ కో–ఫౌండర్, సీయివో హర్షిత్ జైన్. బేరింగ్ క్యాపిటల్, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ ‘వోన్లీ ప్లే’కు సీడ్ ఫండింగ్ చేశాయి. కునాల్ షా, సూరజ్ నళిన్, అమృత్ శ్రీవాస్తవ, జితేంద్ర గుప్తా ఏంజెల్ ఇన్వెస్టర్లు. గత నెలలలో అధికారికంగా లాంచ్ అయిన ‘వన్ ప్లేయర్’కు 27,000 రిజిస్టర్డ్ యూజర్లు, 5,000 ప్లేయింగ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.‘కేవలం గేమ్స్ ఆడడం మాత్రమే కాదు క్లౌడ్‌లో ప్రతీది చేయవచ్చు. ఉదాహరణకు 3డీ సాఫ్ట్‌వేర్‌ను రన్ చేయడంలాంటివి’ అంటున్నాడు కంపెనీ కో–ఫౌండర్, సీటీవో అభిక్ సాహ. -
గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో , ఫీచర్లు చూస్తే!
Infinix gt 10 pro: ఇన్ఫినిక్స్ ఇండియా తాజాగా జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మొబైల్ గేమింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన ధరలో దీన్ని లాంచ్ చేసింది. సుపీరియర్ ప్రాసెసింగ్ పవర్, కూల్ టెక్నాలజీ,10-బిట్ FHD+AMOLED డిస్ప్లేను దీన్ని తీసుకు రావడం విశేషం. రియర్ కెమెరా ద్వారా 4K వీడియో రికార్డింగ్, సెల్ఫీ కెమెరా 2K వీడియో రికార్డింగ్ సదుపాయంతోపాటు AI ఫిల్మ్ మోడ్‌ను కూడా జోడించింది. ఇండియాలోదీని లాంచింగ్ ప్రైస్ రూ. 19,999గా ఉంది. అయితే బ్యాంక్ డిస్కౌంట్ల కారణంగా, ప్రస్తుతం రూ. 17,999కి అందుబాటులో ఉంది. ఫోన్‌తో పాటు,తొలి 5,000 మంది కస్టమర్లు ప్రో గేమింగ్ కిట్‌ను కూడా అందుకునోఛాన్స్ ఉంది. సైబర్ మెకా డిజైన్, రంగు మార్చే వెనుక ప్యానెల్, 6.67 ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. 108 ఎంపీ అల్ట్రా క్లియర్ ట్రిపుల్ కెమెరా, ప్రకాశవంతమైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 5జీ సిమ్ దీనిలో ఉన్నట్లు సంస్థ సీఈవో అనీష్ కపూర్ తెలిపారు. ఇది సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుందని పేర్కొన్నారు. జీటీ 10 ప్రో స్పెసిఫికేషన్స్ 6.67-అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 1300ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునేసదుపాయం 5000mAh బ్యాటరీ -
ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?
MG unveils Comet EV Gamer Edition ఎంజీ మెటార్ ఇండియా తన బుల్లి ఈవీ కామెట్ లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ‘గేమర్ ఎడిషన్’గా పేరుతో కామెట్ ఈవీ ఆల్-ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈసీ సెగ్మెంట్లో ఇది కస్టమైజ్ చేసిన ఫస్ట్కారుగా నిలిచింది. గేమర్ ఎడిషన్ ట్రిమ్ గేమర్లు, యువ కొనుగోలుదారులే లక్ష్యంగా స్టీరింగ్ వీల్ కవర్, థీమ్డ్ మేట్స్ లాంటి స్పెషల్ యాక్ససరీస్‌తో ఆకర్ణణీయంగా తీసుకొచ్చింది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) కామెట్ ఈవీ బేస్ ధరతో పోలిస్తే ఈ ఎడిషన్ ధర రూ. 64,999 ఎక్కువ. రూ. 8.65 లక్షలతో ఎక్స్‌క్లూజివ్ గేమర్ ఎడిషన్ ఎంజీ కామెట్ ఈవీ - పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కామెట్ 'గేమర్ ఎడిషన్'ను ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా ఎంజీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) బోల్డ్, వైబ్రంట్, డైనమిక్ , టెక్నో వైబ్ ప్రేరణగా ఈ కామెట్ EV ఎడిషన్, గేమింగ్‌లో అడ్రినలిన్ రష్‌ని ఇష్టపడే Gen Z కోసం డార్క్ అంట్ లైట్ తేలికపాటి థీమ్‌లలో డార్క్ క్రోమ్, మెటల్ ఫినిషింగ్‌తో రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ మెటీరియల్‌తో స్పెషల్ఎట్రాక్షన్గా ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈస్తటిక్ అండ్ డిజైన్ ఓరియంటెడ్‌గా, గేమింగ్ స్ట్రీమర్, ఇన్ఫ్లుయెన్సర్ మోర్టల్ (నమన్ మాథుర్) సహకారంతో దీన్ని రూపొందించింది. సైడ్ మౌల్డింగ్‌లు, కార్పెట్ మ్యాట్లు, ఇంటీరియర్ ఇన్సర్ట్లు, బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్లు వంటి ప్రత్యేకతలున్నాయి. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) ఇంకా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS +EBD, ఫ్రంట్ & రియర్ 3 pt తోపాటు, సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, TPMS (పరోక్ష) , ISOFIX చైల్డ్ సీట్లు లాంటి ఇతర ఫీచర్లున్నాయి. ఎంజీ కామెట్ EV 17.3 KWH Li-ion బ్యాటరీతో 230 కిమీ (క్లెయిమ్) బ్యాటరీ పరిధితో వస్తుంది మరియు దాదాపు 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) కాగా ఎంజీ మోటార్స కామెట్ ఎలక్ట్రిక్ వాహనం ఏప్రిల్ 2023లో భారతదేశంలో లాంచ్ చేసింది. దేశీయంగా ఇదే కాంపాక్ట్కారుగా పాపులర్ అయింది. పేస్ వేరియంట్ కోసం 7,98,000 నుండి (ఎక్స్-షోరూమ్), రూ. ప్లష్ వేరియంట్ కోసం 9,98,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్న సంగతి తెలిసిందే. -
మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. కీలక తీర్పును వెలువరించిన అమెరికా ఫెడరల్ కోర్ట్!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు అమెరికా ఫెడరల్ కోర్ట్ భారీ షాకిచ్చింది. 69 బిలియన్ డాలర్లకు గేమింగ్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజార్డ్ (Blizzard)ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో అమెరికా ఫెడరల్ కోర్ట్ బిలియన్ డాలర్ల భారీ కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని దీర్ఘకాలిక నిషేధం విధించాలనిఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) పెడరల్ కోర్ట్‌ను కోరింది. ఆ మరుసటి రోజు జరిగిన విచారణలో అమెరికా ఫెడరల్ జడ్జ్ ఎడ్వర్డ్ దవిలా గేమింగ్ సంస్థ క్రయ, విక్రయాలు లేకుండా ఆదేశాలు జారీ చేసినట్ల తీర్పులో తెలిపారు. ఇదే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు జూన్ 22, జూన్ 23న విచారణ జరపనుంది. ఇక బ్లిజార్డ్ కొనుగోలు దేశ (యూఎస్) యాంటీట్రస్ట్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదంటే విరుద్దంగా ఉన్నాయని నిర్ధారించనుంది. అప్పుటి వరకు కంపెనీ కొనుగోలుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కలిక కొనుగోళ్లకు వాయిదా వేస్తున్నట్లు రెగ్యులేటర్ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ సంస్థగా చైనా టెన్సెంట్, జపాన్ ప్లేస్టేషన్ తయారీదారు సోనీ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ సంస్థగా అవతరించేలా మైక్రోసాఫ్ట్ గత ఏడాది ప్రారంభంలో బ్లిజార్డ్ కొనుగోలు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కొనుగోళ్లపై యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. కానీ ఈ విక్రయం క్లౌడ్ గేమింగ్‌లో పోటీని నిరోధిస్తుందని భావించిన బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) వ్యతిరేకించింది. కొనుగోలును నిలిపివేస్తూ ఈ తరుణంలో ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సిరీస్‌ను విడుదల చేసేలా యాక్టివిజన్ పేరెంట్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో జరిపిన లావాదేవీలు జరగకుండా ఆపాలని, ఈ లావాదేవీలు వీడియో గేమ్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని అణిచివేస్తుందనే ఆందోళనపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌లో దావా నమోదైంది. తాజాగా, ఫెడరల్ కోర్ట్ సైతం యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం గేమింగ్ పరిశ్రమలో చర్చాంశనీయంగా మారింది. మైక్రోసాఫ్ట్ ఏం చెబుతోంది? ఎఫ్‌టీసీ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అంతేకాదు కాల్ ఆఫ్ డ్యూటీ తరహా వీడియో గేమ్ సిరీస్‌లను రాబోయే 10 ఏళ్లలో సోనీతో పాటు ఇతర ప్రత్యర్ధి సంస్థలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ డీల్ ద్వారా గేమర్స్, గేమింగ్ కంపెనీలకు లాభదాయకంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ వాదిస్తోంది. ఇదీ చదవండి : భారత్‌లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే? -
అమెజాన్ నుంచి 100 మంది అవుట్!
అమెజాన్ లేఆఫ్స్‌లో భాగంగా తాజాగా 100 మందిని తొలగించింది. వీడియో, గేమ్ విభాగాలలో పని చేస్తున్న సుమారు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, కంపెనీ శాన్ డియాగో స్టూడియోలో పనిచేస్తున్న సిబ్బంది ఇందులో ఉన్నారు. ఈ మేరకు కంపెనీ గేమ్స్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ హార్ట్మన్ ఏప్రిల్ 4న ఉద్యోగులకు మెమోలు పంపించారు. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) ట్విచ్ స్ట్రీమింగ్ సర్వీస్‌లో భాగంగా ఉన్న క్రౌన్ చానెల్ ఎంటర్టెయిన్మెంట్ షో సహా గేమింగ్ విభాగంలో మానవ వనరుల నిర్వహణకు అమెజాన్ కంపెనీ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ట్విచ్ ఇటీవల 400 మంది ఉద్యోగులను తొలగించింది. 2012లో ఈ డివిజన్ ప్రారంభించినప్పటి నుంచి పలు సార్లు అమ్మకానికి ఉంచినా విక్రయించకుండా అలాగే కొనసాగిస్తూ వస్తోంది. అమెజాన్ ఇప్పటి వరకూ అభివృద్ధి చేసింది కేవలం ఒకే ఒక్క గేమ్. అది కూడా 2021 సెప్టెంబర్ లాంచ్ తర్వాత దాని ప్లేయర్ బేస్ బాగా క్షీణించింది. (విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు) తొలగింపులు ఉన్నప్పటికీ, శాన్ డియాగో స్టూడియోలో ప్రకటించని ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు గేమ్ ప్రీ ప్రొడక్షన్ దశలో రెట్టింపు అవుతారని హార్ట్మన్ చెప్పారు. అలాగే మాంట్రియల్‌లోని అమెజాన్ స్టూడియోలో కూడా ఓ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా ఆన్లైన్ రోల్-ప్లేయింగ్ గేమ్ లాస్ట్ ఆర్క్ను ప్రచురించడం ద్వారా అమెజాన్ విజయాన్ని సాధించింది. థర్డ్ పార్టీ పబ్లిషింగ్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నట్లు హార్ట్మన్ పేర్కొన్నారు. NCSoft Corpతో ఇటీవలి ఒప్పందం కూడా అందులో భాగమేనని చెప్పారు. -
గేమింగ్ హబ్‌గా భారత్..
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ పరిశమ్ర దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఒక ట్రిలియన్ డిజిటల్ ఆర్థిక వ్యవ స్థకు గణనీయమైన వాటాను సమకూర్చే సామర్థ్యం ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు ఉందని ప్రైమస్ పార్ట్నర్స్ సంస్థ ‘భారత్‌లో ఆన్లైన్ గేమింగ్: పన్నుల సందిగ్ధత’ పేరుతో విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ అనేది ఆర్థిక అవకాశాలకు ద్వారాలను తెరవడమే కాకుండా, పలు సామాజిక అంశాలకు పరిష్కారం చూపిస్తుందని ఇది అభిప్రాయపడింది. 2023–24 బడ్జెట్ లో ఆన్లైన్ గేమింగ్ రంగానికి సంబంధించి చేసిన ప్రకటనలు సానుకూలంగా ఉన్నాయని, ఆన్లైన్ గేమింగ్‌లో వచ్చే లాభాల నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకునే డిమాండ్‌ను పరిష్కరించినట్టు పేర్కొంది. ఆన్లైన్ గేమింగ్ లాభాలపై టీడీఎస్ అమలుకు యంత్రాంగాన్ని బడ్జెట్లో పేర్కొనడాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘సెక్షన్ 194బీ కింద చేసిన సవరణలు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. సెక్షన్ 194బీఏ కింద ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు ప్రత్యేక నిబంధనను 2023 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా ప్రతిపాదించారు. కానీ, ఇది లోపంగా కనిపిస్తోంది. రెండూ కూడా ఒకే తేదీ నుంచి అమల్లోకి వస్తే సరైన విధంగా ఉంటుంది. రెండూ 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాలి. లేదంటే ప్రత్యామ్నాయంగా ప్రస్తుత పన్ను విధానాన్నే ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు అమలయ్యేలా చూస్తే వ్యత్యాసాలు తొలగిపోతాయి’’అని సూచించింది. స్థూల ఆదాయం మెరుగైనది.. పరిశ్రమకు సంబంధించి సుస్థిరత అవసరమని, అదే పనిగా పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల పరిశ్రమకు అధిక వ్యయాలకు దారితీస్తుందని ఈ నివేదిక పేర్కొంది. అవనసర వ్యయాలతో చిన్న, మధ్య స్థాయి గేమింగ్ కంపెనీలు నిలదొక్కుకోవడం కష్టమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పరిశ్రమకు సంబంధించి జీఎస్టీ అనేది స్థూల ఆన్లైన్ గేమింగ్ ఆదాయంపై అమలు చేయడం వల్ల పరిశ్ర మ వృద్ధికి సాయపడుతుందని సూచించింది. అలా కాకుండా మొత్తం ముఖ విలువపై అమలు చేయ డం ఈ రంగానికి ఆచరణ సాధ్యం కాదని పేర్కొంది. ఏటా 27 శాతం వృద్ధి ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ఏటా కాంపౌండెడ్‌గా 27 శాతం చొప్పున, వచ్చే ఐదేళ్లపాటు వృద్ధి చెందుతుందని, దేశ జీడీపీకి పెద్ద మొత్తంలో వాటా సమకూర్చే, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సామర్థ్యాలు ఈ రంగానికి ఉన్నట్టు పేర్కొంది. 2030 నాటికి లక్ష ఉద్యోగాలను కల్పించగలదని పేర్కొంది. ఇందుకోసం బాధ్యాతాయుత, పారదర్శకమైన, భద్రత వాతావరణం ఉండాలని అభిప్రాయపడింది. -
సూపర్ ఫీచర్లతో హెచ్‌పీ పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్‌ట్యాప్: షాకింగ్ ప్రైస్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌పీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఒమెన్ 17 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ,Nvidia GeForce RTX 4080 ను జోడించింది. హెచ్‌పీ ఒమన్ ధర రూ.2,69,990గా నిర్ణయించింది. ఇండియాలో ఒమెన్ ప్లేగ్రౌండ్ స్టోర్స్, HP వరల్డ్ స్టోర్స్ , HP ఆన్లైన్ స్టోర్ వంటి వివిధ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ టెక్నాలజీతో ఒమెన్ 17 ఒమెన్ గేమింగ్ హబ్‌గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. గేమింగ్ ల్యాప్‌టాప్ హెచ్‌పీ ఒమెన్ 17 ఫీచర్లు 17.3-అంగుళాల IPS డిస్ప్లే క్వాడ్ HD (2560 × 1440 పిక్సెల్‌లు) రిజల్యూషన్ 24 కోర్ 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ప్యానెల్ 240Hz రిఫ్రెష్ రేట్ 32 జీబీ DDR5 ర్యామ్, 1TB PCIe NVMe SSD నిల్వ Nvidia RTX 4080 ల్యాప్‌టాప్ GPUతో వస్తుంది. ఇంకా ఒమెన్ 17 బ్యాంగ్ & ఒలుఫ్సెన్ డ్యూయల్ స్పీకర్స్, 720p HD వెబ్‌క్యామ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అర్రే డిజిటల్ మైక్రోఫోన్ల Wi-Fi 6E కనెక్టివిటీ, థండర్‌బోల్ట్ 4 టైప్-C పోర్ట్, మూడు USB టైప్-A పోర్ట్స్, HDMI పోర్ట్, మినీ డిస్ప్లే పోర్ట్, RJ-45 పోర్ట్ , RTX 40 సిరీస్ ల్యాప్‌టాప్ 330W ఛార్జింగ్‌కు మద్దతుతో 83 Wh Li-ion పాలిమర్ బ్యాటరీ మొదలైనవి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
గేమింగ్ రంగంలో అవకాశాలకు ఆకాశమే హద్దు!
గత కొద్ది సంవత్సరాలుగా గేమింగ్, ఈస్పోర్ట్స్ పరిశ్రమ అసాధారణ వృద్ధి నమోదు చేస్తోంది. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు కలిగిన రెండవ దేశంగా నిలువడంతో పాటుగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బాగా పెరగడంతో దేశంలో ఈ రంగం అనూహ్య వృద్ధి నమోదు చేస్తోంది. దేశంలో ఈస్పోర్ట్స్ పరిశ్రమ ఏటా 45% (సీఏజీఆర్) వృద్ధితో 2025 నాటికి 11 బిలియన్ రూపాయలకు చేరుకోవచ్చని తాజాగా ఈవై అధ్యయనం ‘రెడీ.సెట్.గేమ్ ఆన్! ’ వెల్లడించింది. ఇప్పటికే దేశంలో 450కు పైగా గేమింగ్ కంపెనీలు, 450 మిలియన్లకు పైగా గేమర్లు ఉన్నారని కూడా తేల్చింది. అయితే దురదృష్టవశాత్తు యువతతో పాటుగా వారి తల్లిదండ్రులకు కూడా గేమింగ్ కెరీర్ పట్ల సరైన అవగాహన లేదంటున్నారు హీరో విరెడ్ ఫౌండర్–సీఈఓ అక్షయ్ ముంజాల్. ఈ రంగంలో అపారమైన అవకాశాలున్నాయంటూ ఆ అవకాశాలను అందిపుచ్చుకునేలా తాము యువతకు తోడ్పడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఔత్సాహికులకు ప్రత్యేకంగా గేమింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ముంజాల్ వెల్లడించారు. కేవలం ఆరు నెలల కోర్సుతో గేమ్ డిజైనింగ్, విజువలైజింగ్, పబ్లిషింగ్, లీగ్ ఆపరేషన్స్, కంటెంట్ క్రియేషన్, లైవ్ ప్రొడక్షన్ వంటి విభాగాల్లో విధులు నిర్వహించవచ్చని అన్నారు. కోర్సులో మొదటి రెండు నెలలూ ప్రైమర్‌గా ఉన్నప్పటికీ, ఆ తరువాత నాలుగు నెలలు మాత్రం స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి కోర్సుల ఫీజు రూ.4 లక్షలు కు అటూ ఇటుగా ఉన్నాయి. అయితే గ్యారెంటీడ్ 5 నెలల ఇంటర్నెషిప్ ద్వారా ఈ ఫీజులో 50 శాతం వరకూ తిరిగి పొందే అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. గేమింగ్ పరిశ్రమతో అతి సన్నిహిత సంబంధాలున్న శిక్షణా సంస్థలు వల్ల కెరీర్ ఆధారిత కోర్స్ కరిక్యులమ్ తీర్చిదిద్దడం జరుగుతోంది . పరిశ్రమ నిపుణులతో కలిసి పనిచేయడం వల్ల అభ్యాసకులను భవిష్యత్‌కు సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దగలుగుతున్నారు. ఇవి అంతర్జాతీయ స్టూడియోలు, ప్రచురణ సంస్థలైన నోడ్విన్ తో పాటుగా యునిటీ, ఎన్ఎస్డీసీ , ఎంఈఎస్సీ వంటివి సర్టిఫికెట్ భాగస్వాములుగా, గేమ్ఆన్, హోలీ కౌ ప్రొడక్షన్స్, గాడ్స్పీడ్ గేమ్స్,మూన్‌ఫ్రాగ్ వంటివి ఇండస్ట్రీ భాగస్వాములుగా సంస్థలు కొనసాగుతున్నాయి గేమింగ్, ఈస్పోర్ట్స్ పరిశ్రమలో రాణించడానికి సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారు గేమ్ డెవలపర్,గేమ్ ఆర్టిస్ట్, గేమ్ డిజైనర్. గేమ్ ఆడియో ఇంజినీర్ వంటి ఉద్యోగాలలో రాణించవచ్చు..ఈ –స్పోర్ట్స్‌ను స్పెషలైజేషన్‌గా తీసుకుంటే లీగ్ ఆపరేషన్స్, కమ్యూనిటీ మేనేజ్మెంట్, గేమ్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ తదితర బాధ్యతలను నిర్వర్తించవచ్చు. ఉజ్వల భవిత... భారతదేశంలో గేమింగ్ పరిశ్రమ అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ఈ రంగం ఏటేటా అనూహ్యవృద్ధిని నమోదు చేస్తోంది. అయితే ఈ రంగంలో ఉన్న అవకాశాల పట్ల యువతలో సరైన అవగాహన లేదు. అవగాహన పెంచుకుని ప్రయత్నిస్తే మంచి కెరీర్‌ను స్వంతం చేసుకోవచ్చు. –అక్షయ్ ముంజాల్, సిఇఒ, హీరోవిరెడ్ -
కొత్త ఏడాది టెక్కీలకు గుడ్ న్యూస్.. జీతాలు పెరగనున్నాయ్!
టెక్ దిగ్గజాలు తమ సిబ్బందిని భారీగా ఇంటికి సాగనంపడం, పింక్ స్లిప్పుల కలకలంతో ఉద్యోగుల్లో భయాందోళనల నడుమ వారికి వేతన పెంపుపై శుభవార్త వెలువడింది. భారతదేశంలో ఈ ఏడాది సగటు జీతం 10 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది గత ఏడాది కంటే కేవలం 0.4 శాతం ఎక్కువని కాన్ ఫెర్రీ తాజా వేతన సర్వే సర్వే వెల్లడించింది. "మాంద్యం, ఆర్థిక మందగమనమంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ భయాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆశాజనకంగా ఉందని కార్న్ ఫెర్రీ ఛైర్మన్, రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవనిత్ సింగ్ సర్వేలో పేర్కొన్నారు. 818 సంస్థలు, 8 లక్షలకు పైగా ఉద్యోగులపై జరిపిన సర్వేలో, భారతీయ కార్పొరేట్ ఉద్యోగులు 2023లో సగటున 9.8 శాతం సాలరీ పెంపు ఉండొచ్చని సర్వే పేర్కొంది. అత్యుత్తమ నైపుణ్యాలను కనబరిచే ఉద్యోగులకు ఆయా కంపెనీలు ఏకంగా 15 శాతం నుంచి 30 శాతం వరకూ వేతన పెంపు వర్తింపచేయవచ్చని తెలిపింది. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్‌తో సహా రంగాలు ఈ ఏడాది జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ పెంపు వివిధ రంగాల పరంగా చూస్తే.. టెక్నాలజీలో 10.4 శాతం, మీడియా 10.2 శాతం, గేమింగ్ 10 శాతం. అదనంగా, కొన్ని ఇతర రంగాల జీతాల పెంపు అంచనాలలో సేవా రంగం 9.8 శాతం, ఆటోమోటివ్ 9 శాతం, రసాయనం 9.6 శాతం, వినియోగ వస్తువులు 9.8 శాతం, రిటైల్ 9 శాతం ఉన్నాయి. అదనంగా, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా చాలా వ్యాపారాలు తమ శ్రామిక శక్తిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సర్వే సూచిస్తుంది. సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం సంస్థలు తాము ఒక రకమైన హైబ్రిడ్ మోడల్‌ను స్వీకరించినట్లు సూచించాయి. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
గేమింగ్, యానిమేషన్ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ హబ్ (ఏవీజీసీ)గా మార్చేందుకు ప్రగతిశీల, స్థిరమైన వ్యక్తిగత పన్నుల విధానం అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గేమింగ్ ఆదాయంపై అత్యధికంగా 30 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయడం అన్నది ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. ఆఫ్‌షోర్ పాŠల్ట్ఫామ్లు ఎలాంటి పన్నులు చెల్లించకుండా, నియంత్రణల పరిధిలోకి రాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విధమైన పన్నుల ఎగవేత అన్నది ప్రభుత్వ ఖజానాకు పెద్ద నష్టమని, అంతిమంగా దేశీ పరిశ్రమకు మరణశాసనమని పేర్కొన్నారు. ఆన్లైన్లో నైపుణ్యాల ఆధారిత గేమింగ్ పరిశ్రమ పరిమాణం 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఏటా 38 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధితో 2030 నాటికి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. లాటరీల మాదిరి ఆన్లైన్ స్కిల్ గేమ్‌ల్లో భారీ ఆర్జన ఉండదని, కేవలం కొద్ది మందే ఆడతారని గేమ్స్24ఇంటూ7 వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ థంపి తెలిపారు. కనుక ఒక ఆటగాడు 70 శాతం గేముల్లో గెలిచినా, పెద్ద ఎత్తున పన్నులు చెల్లించాల్సి వస్తున్నట్టు చెప్పారు. లాటరీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పన్ను చట్టాలను ఆన్లైన్ గేమింగ్‌కు అమలు చేయడం వల్ల ప్రతికూతల ఫలితాలు చూడాల్సి వస్తుందన్నారు. స్టాక్ మార్కెట్ మాదిరి కాకుండా, ఆన్లైన్ గేమర్లు అంతర్జాతీయంగా నడిచే చట్ట విరుద్ధమైన, పన్నుల పరిధిలో లేని గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫామ్‌లపైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు చెప్పారు. అక్కడ అయితే గేమర్లు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదన్నారు. పన్నుల్లో మార్పులు అవసరం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రోషన్‌షా మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలంటే, 1970 నాటి నిబంధనలను ప్రస్తుత నూతన తరం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇతర దేశాలు గేమింగ్ పరిశ్రమ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయో చూడాల్సి ఉంది. అమెరికాలో గేమింగ్ ఆదాయాన్ని సాధారణ ఆదాయంగానే పరగణిస్తున్నారు. అక్కడ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్రిటన్‌లో గెలుచుకున్న మొత్తంపై ఎలాంటి పన్నులేదు’’అని షా చెప్పారు. ఊహించతగిన, ప్రగతిశీల పన్నుల విధానం భారత్‌కు అవసరమన్నారు. -
గేమింగ్ విభాగంలో భారత్‌కు అరుదైన ఘనత
గేమింగ్ విభాగంలో భారత్ అరుదైన ఘనంగా సాధించింది. నికో పార్ట్నర్స్ ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 39.6 కోట్ల కోట్ల (దాదాపు 40 కోట్లు) గేమర్స్ ఉన్నారని కంపెనీ వెల్లడించింది. ది ఆసియా 10 గేమ్స్ మార్కెట్ పేరుతో తయారు చేసిన రిపోర్ట్‌లో.. ఆసియాలోని పది దేశాలతో పోల్చి చూస్తే ఒక్క భారత్‌లో 50.2 శాతం గేమర్స్ ఉన్నారని, వారానికి సగటున 14 గంటలు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడతారని తెలిపింది. ఆన్లైన్ గేమింగ్‌తో డబ్బులు సంపాదించేందుకు గేమర్స్ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. వెరసీ గత ఐదేళ్లలో భారత్‌లో వీడియోగేమ్స్‌తో పాటు కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కంప్యూటర్, మొబైల్ గేమ్ మార్కెట్‌కు 35.9 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని, 2026 నాటికి ఆదాయం 41.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని నికో పార్ట్నర్స్ వెల్లడించింది. కాగా, చైనా తర్వాత భారత్, థాయ్‌లాండ్, ఫిలీప్పీన్స్ వంటి దేశాల్లో గేమర్స్ సంఖ్య పెరుగుతోందని ఈ నివేదిక చెప్పింది. ఆసియాలోని పది దేశాల్లో జపాన్, కొరియాలు 77 శాతం మార్కెట్ ఉందని నికో పార్ట్నర్స్ తెలిపింది. -
టాప్ గేర్ లో గేమింగ్.. లక్షల్లో ఉద్యోగాలు..
-
బాధితులే నిందితులుగా..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.903 కోట్లు వసూలు చేసి దేశం దాటించేసిన ఘరానా స్కామ్ దర్యాప్తులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. గేమింగ్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ల వెనుక చైనీయులు ఉన్నట్లు తేల్చారు. ఒకదాంట్లో బాధితులుగా మారిన వారిని సంప్రదిస్తూ మరో స్కామ్‌లో తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వారితో అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరిపిస్తూ నిందితులుగా మారుస్తున్నారని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్‌తో కలసి మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ విన్‌తో సహా ప్రత్యేక ప్రో గ్రామింగ్తో కూడిన గేమ్‌లను అనేక యాప్‌లను చైనీయులు తయారు చేస్తున్నారు. ఆన్లైన్లో వీటిలోకి ప్రవేశిస్తున్న యువతకు ప్రోగ్రామింగ్ కారణంగా తొలినాళ్లల్లో లాభాలు వస్తాయి. నమ్మకం పెరగడంతో వాళ్లు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతారు. ఆపై అదృశ్యమైపోయే ఆ యాప్‌లు బాధితుడిని నిలువుగా ముంచేస్తాయి. తొలుత గేమింగ్ యాప్‌ల్లో నష్టపోయిన వారి చిట్టా ఫిలిప్పీన్స్‌లోని అలెన్‌కు చేరుతోంది. ఇతనికి.. రూ.903 కోట్ల ఫ్రాడ్‌లో ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన చైనీయుడు చుచున్ యోతో సంబంధాలున్నా యి. బాధితుల చిట్టా అందుకున్న అలెన్.. దాన్ని చుచున్‌కు పంపిస్తాడు. తమకు అవసరమైన బ్యాంక్ ఖాతాలు తెరిచి అందిస్తే నెలకు రూ.60 వేల వరకు జీతం, కమీషన్లు ఇస్తామని బాధితులకు చుచున్ ఎరవేస్తాడు. దీంతో అనేక మంది తమ పేర్లతోపాటు కుటుంబీకులు, బంధువుల పేర్ల తో ఖాతాలు తెరిచారు. వాటి నెట్ బ్యాంకింగ్ వివరాలు, లింకై ఉన్న ఫోన్ నంబర్ సిమ్ కార్డు ముంబైలో ఉన్న చుచున్‌కు చేరతాయి. అతను వాటిని అలెన్‌కు పంపిస్తున్నాడు. అక్కడ నుంచి అసలుకథ మొదలవుతుంది. ఖాతాదారుల నుంచి యాప్‌ల ద్వారా సంప్రదించే అలెన్ ఆ ఖాతాల్లో డబ్బు జమ చేయిస్తాడు. ఆ మొత్తం తమ ఖాతాల్లోకి మారుస్తూ.. సహకరించినవారికి జీతం, కమీషన్ ఇస్తున్నాడు. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు చెందిన నాగప్రసాద్ గేమింగ్ యాప్‌లో రూ.20 లక్షలు నష్టపోయాడు. అదే యాప్ ద్వారా అలెన్ వల్లో పడి ముంబైలో ఉన్న చున్ ద్వారా తన బ్యాంక్ ఖాతా వివరాలు పంపాడు. ఇతడి మాదిరిగానే రామ్ అనే బాధి తు డు తన బావమరిది అనిల్ బ్యాంకు ఖాతా వివరాలు, సాగర్ తన స్నేహితుడైన శ్రీనివాస్ భార్య బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. యాప్‌ల ద్వారా వచ్చే డబ్బు ఈ ఖాతాల్లో పడేలా చేసే అలెన్.. రూ.కోట్లు స్వాహా చేసేవాడు. చున్ విచారణ, అతడి ఫోన్ విశ్లేషణతో ఈ వివరాలు గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రామ్, శ్రీనివాస్, సాగర్, నాగప్రసాద్‌ను అరెస్టు చేశారు. చుక్తోపాటు అప్పట్లో నగరా నికి చెందిన బ్యాంక్ ఖాతాదారులు సయ్యద్ సుల్తాన్, మిర్జా నదీమ్ బేగ్, పర్వేజ్ పట్టుబడిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో ఉంటున్న ఇమ్రాన్ ద్వారా వీరు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు తేలడంతో పోలీసులు అతడిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఇమ్రాన్ దుబాయ్ నుంచి వస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌కు చిక్కాడు. ఈ క్రమంలో సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనతో వీఓఐపీ కాల్స్ ద్వారానే సంప్రదించాలంటూ నాగప్రసాద్‌తో అలెన్ చెప్పాడని, దీని కోసం ఓ యంత్రాన్ని పంపాడని, దాన్నీ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
గేమింగ్‌లో గెలుపు జెండా.. ‘పాయల్ ధారే’ విజయపథం
‘ఉమన్ గేమర్! వినడానికి కొత్తగా ఉంది’ అని ఒకరు ఎగతాళిగా నవ్వారు. ‘ఆడడం బాగానే ఉంటుందిగానీ, కెరీర్‌కు బాగుండదు’ అని గంభీరస్వరంతో నిరాశ పరిచారు మరొకరు. అంతా అయోమయంగా ఉంది. అలా అని ఆగిపోలేదు. ఓనమాలు నేర్చుకుంటూనే, కొత్త విషయాలపై పట్టు సంపాదిస్తూనే మేల్–డామినేటెడ్ స్పేస్ అనుకునే గేమింగ్‌లో బిగ్గెస్ట్ యూట్యూబ్ ఉమన్ గేమర్(ఇండియా)గా గెలుపు జెండా ఎగరేసింది పాయల్ ధారే... కరోనా మహమ్మారి పదునుగా కోరలు చాస్తున్న సమయంలో, లాక్డౌన్ రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన పాయల్ ధారే గేమింగ్–ఫోకస్డ్ ఛానల్‌కు శ్రీకారం చుట్టింది. నిజం చెప్పాలంటే యూట్యూబ్ వీడియో ప్లాట్‌ఫామ్‌పై లైవ్‌స్ట్రీమింగ్ కంటెంట్ గురించి ఆమెకు అంతగా అవగాహన లేదు. కాలేజీలో స్నేహితులతో కలిసి ‘పబ్జీ’ గేమ్ ఇష్టంగా ఆడేది. ‘పబ్జీ’ని నిషేధిస్తారనిగానీ, గేమింగ్‌ను తాను కెరీర్‌గా ఎంచుకుంటాననిగానీ అనుకోలేదు పాయల్. గేమింగ్‌పై ఇష్టం పెరుగుతున్న క్రమంలో తన మనసులో మాటను ఇంట్లో చెప్పింది. ‘గేమింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటాను’ తల్దిదండ్రులు ససేమిరా అన్నారు. ‘చదువుపై దృష్టి పెట్టు’ అని మందలించారు. వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా తొలి విజయం సాధించింది పాయల్. తాము ఉండే చింద్వారా పట్టణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతంత మాత్రమే. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో గేమింగ్ సెషన్స్ క్లిప్స్‌ను పోస్ట్ చేసేది. 100కె ఫాలోవర్స్‌తో తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఈ సమయంలోనే యూట్యూబ్‌లో ప్రయత్నించమని స్నేహితులు, ఫాలోవర్స్ నుంచి ఒక సూచన వచ్చింది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం సులభం కాబట్టి మొదట దాన్నే ఎంచుకున్నాను. మీ గేమింగ్ స్కిల్స్‌కు యూట్యూట్ అనేది సరిౖయెన వేదిక అనే సలహాతో పాయల్ గేమింగ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను’ అంటుంది పాయల్. ఛానల్ మొదలైన తరువాత రకరకాల విషయాలు స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రేక్షకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేది. లైవ్‌స్ట్రీమింగ్ గురించి ఎన్నో రోజులు రిసెర్చ్ చేసింది. ఎలాంటి కంటెంట్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారు? లైవ్‌స్ట్రీమింగ్ పనితీరు ఎలా ఉంటుంది? ఇప్పుడున్న గేమింగ్ ఛానల్స్‌కు భిన్నంగా ఎలా ప్రయత్నించవచ్చు....ఇలా రకకరాల విషయాలపై లోతైన పరిశోధన చేసింది. పాయల్ కాస్త సిగ్గరి. నలుగురి ముందు మాట్లాడాలంటే భయం. కెమెరా ఫేస్ చేయాలంటే కష్టం. ‘ఒకటి సాధించాలని బలంగా అనుకొని బరిలోకి దిగితే, వారిలోని రెండు లోపాలు మాయమవుతాయి’ అంటారు. పాయల్ విషయంలోనూ అదే జరిగింది. బరిలోకి దిగిన తరువాత కెమెరాను హాయిగా ఫేస్ చేయడం నేర్చుకుంది. బెటర్ ఇంటర్నెట్ కోసం సొంత పట్టణం వదిలి, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి మారాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు వద్దని గట్టిగా చెప్పారు. వారిని ఒప్పించడానికి చాలా సమయమే పట్టింది. అయితే ఇక్కడికి మారిన తరువాత సబ్స్కైబర్ల సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో తనకు పేరున్న గేమర్స్లాగా పర్సనల్ కంప్యూటర్ సెటప్ లేదు. లైవ్‌స్ట్రీమ్, అప్‌లోడ్‌కు తన దగ్గర ఉన్న ఫోన్ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు మాత్రం తన దగ్గర డ్యూయల్ మానిటర్స్‌తో కూడిన మంచి పీసీ సెటప్ ఉంది. ‘పాయల్ గేమింగ్’ ఛానల్ 2.5 మిలియన్ సబ్స్రైబర్లతో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని పాయల్ ఊహించలేదు. అయితే ఇది అంత సులువుగా దక్కిన విజయం కాదు. ‘సబ్స్క్రైబర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడు పెద్దగా ఎవరి దృష్టి ఉండదు. అయితే అదే ఛానల్ విజయవంతంగా దూసుకుపోతున్నప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ప్రోత్సహించే వారి కంటే రాళ్లు రువ్వే వాళ్లే ఎక్కువగా ఉంటారు. నా లైవ్స్ట్రీమ్స్పై కొందరు హేట్ కామెంట్స్ చేశారు. కొందరు బాడీ షేమింగ్ చేశారు. మొదట్లో బాధపడేదాన్ని. వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే విషయం అర్థమైన తరువాత వాటిని తేలికగా తీసుకున్నాను’ అంటుంది పాయల్. విజయం కోసం పోరాటం ఎంత ముఖ్యమో, ఆ విజయాన్ని నిలుపు కోవడం కోసం గట్టిగా నిలబడడం కూడా అంతే ముఖ్యం. పాయల్ ధారే ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉంది. ఇదీ చదవండి: విలేజ్ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే! -
Bengaluru: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!
ఇండియా గేమింగ్ మార్కెట్లో వెస్ట్రన్ డెవలపర్స్ టాప్‌లో ఉన్నారు. అయితే అఫ్సర్ అహ్మద్, గోవింద్ అగర్వాల్‌లు వెస్ట్రన్ గేమింగ్ కంపెనీలకు సవాలు విసురుతూ, సత్తా చాటుతున్నారు. అవును. మన ఆట మొదలైంది... లాక్డౌన్ సమయంలో యూట్యూబ్‌లో వీడియోలు చూసీచూసీ విసుగెత్తి పోయాడు ముంబైకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి సంజీవ్ మెహతా. తన మొబైల్ ఫోన్లో ‘లూడోస్టార్’ గేమ్ ఆడడం మొదలుపెట్టడంతో విసుగు మాయమై హషారు ప్రత్యక్షమైంది. తమ ఫోనే లోకంగా ఎవరికి వారు విడిపోయిన ఆ ఇంట్లో కుటుంబసభ్యులందరినీ ఒకచోట చేర్చింది లూడో స్టార్. బాల్యం నాటి తన ఫేవరెట్ ఆటకు ఆన్లైన్ రూపమైన ‘లుడో స్టార్’ 57 సంవత్సరాల మెహతాకు స్ట్రెస్‌బస్టర్‌గా పనిచేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో ఒక హౌజింగ్ సొసైటీలో వాచ్‌మన్‌గా పనిచేసే రాజా సాహు ఇష్టమైన ఆట లుడో స్టార్. ‘లాక్డౌన్ టైమ్‌లో నేను ఇక్కడ ఉంటే, మా ఆవిడ ఊళ్లో ఉండేది. నేను ఊరికి వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో లూడో స్టార్ మమ్మల్ని ఒకటి చేసింది. ఒకరిని ఒకరు ఓడించుకుంటూ, ఆటపట్టించుకుంటూ ఉండేవాళ్లం’ ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు రాజా సాహు. ‘గేమ్ బెర్రీ ల్యాబ్స్’ ఈ లుడో స్టార్ సృష్టికర్త. ఐఐటీ–ఖరగ్‌పూర్ గ్రాడ్యుయెట్స్ అఫ్సర్ అహ్మద్, గోవింద్ అగర్వాల్‌లు బెంగళూరు కేంద్రంగా ఈ కంపెనీ ప్రారంభించారు. ఐఐటీ రోజుల్లోనే రకరకాల గేమ్స్ రూపకల్పన గురించి ఆలోచన చేస్తుండేవారు ఈ ఇద్దరు మిత్రులు. చదువు పూర్తయిన తరువాత ‘మూన్‌ఫ్రాగ్ ల్యాబ్స్’ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తున్న మాటేగానే వారి మనసంతా ఆన్లైన్ ఆటలతోనే నిండిపోయింది. ఇక ఇలా అయితే కుదరదనుకొని ఒక ఫైన్‌మార్నింగ్ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. మొబైల్లో క్లాసిక్ బోర్డ్ గేమ్స్‌ను ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు కనెక్ట్ అయ్యోలా తీర్చిదిద్దడానికి కసరత్తులు ప్రారంభించారు. తమ సేవింగ్స్‌తో బెంగళూరులో ‘గేమ్ బెర్రీ ల్యాబ్స్’ మొదలుపెట్టారు. కంపెనీకి సంబంధించిన ప్రాడక్ట్, యుఎక్స్ వెర్టికల్స్కు సంబంధించిన వ్యవహారాలను అహ్మద్ పర్యవేక్షించేవాడు. ఇక ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలను అగర్వాల్ చూసుకునేవాడు. మొదటి సంవత్సరంలోనే కంపెనీ లాభాల బాట పట్టడం విశేషం. గేమ్ బెర్రీ ల్యాబ్స్‌కు చెందిన రెండు పాపులర్ సోషల్ మల్టీప్లేయర్ గేమ్స్ లుడో స్టార్, పర్చిసి స్టార్ 200 మిలియన్ డౌన్‌లోడ్స్‌తో టాప్‌లో ఉన్నాయి. ఫ్రీ–టు–ప్లే– బిజినెస్ మోడల్లో మొదలైన ‘గేమ్ బెర్రీ ల్యాబ్స్’కు ఇన్ యాప్ పర్చెజెస్(ఐఏపి), యాడ్స్ ప్రధాన ఆదాయ వనరు. ‘గేమ్ అంటే గేమే’ కాన్సెప్ట్నే నమ్ముకుంటే ‘లుడో గేమ్’ అంత పెద్దహిట్టై ఉండేది కాదు. అహ్మద్, అగర్వాల్ మాటల్లో చెప్పాలంటే ఆటకు అనుబంధాలను జోడించారు. ‘సంప్రదాయంగా లూడోను ప్లేయర్స్ చూసే పద్ధతిని గేమ్బెర్రీ ల్యాబ్స్ మార్చేసింది’ అంటారు సగౌరవంగా ఇద్దరు. ‘ఇండియన్ గేమింగ్ మార్కెట్లో వెస్ట్రన్ డెవలపర్స్ అగ్రస్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిని గేమ్బెర్రీ ల్యాబ్స్, గేమ్షన్లాంటి కంపెనీలు మార్చి మన సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాయి’ అంటున్నారు ఆల్ ఇండియన్ గేమింగ్ ఫెడరేషన్ సీయివో రోలాండ్. రాబోయే పన్నెండు నెలల సమయంలో టీమ్ సభ్యులను రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉంది కంపెని. అంతేకాదు టెక్నాలజీ క్రియేషన్‌లో పెట్టుబడులను పెంచాలనుకుంటుంది. చదవండి: Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్ Divya Mittal: ఐ.ఏ.ఎస్ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి -
బెస్ట్ గేమింగ్ టీవీ కోసం చూస్తున్నారా, ఇదిగో కళ్లు చెదిరే టీవీల లిస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఫెస్టివ్ సీజన్లో మంచి గేమింగ్ టెలివిజన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. ఇటీవలి కాలంలో మొబైల్స్, టీవీల్లో గేమింగ్ బాగా పాపులర్ అవుతోంది. తమ స్నేహితులతో కలిసి వర్చువల్‌గా మల్టీప్లేయర్ గేమ్స్‌తో కొత్త ప్రపంచాలని అన్వేషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మానిటర్ లేదా టీవీ చాలా ముఖ్యం. గేమింగ్ టీవీలు అధిక రిఫ్రెష్ రేట్ 4K డిస్ప్లేలు గేమ్‌లలో అద్భుతమైన విజువల్స్‌ను ఫిక్స్డ్ ఫ్రేమ్ రేట్‌తో అందిస్తాయి. ఈ టీవీలు శక్తివంతమైన ప్రాసెసర్లతో పాటు, VRR, G-Sync, FreeSync కి సపోర్ట్‌తో కస్టమర్లకు మంచి గేమింగ్ అనుభవాన్నిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నదిగ్గజ కంపెనీలుఎల్జీ, సోనీ, శాంసంగ్ , టీసీఎల్ తదితర ది బెస్ట్ టీవీలను ఒకసారి చూద్దాం ఎల్జీ సీ 2 ఎల్జీ సీ 2 OLED 4K స్మార్ట్ టీవీ C1కి సక్సెసర్ ఇది. α9 Gen5 AI ప్రాసెసర్‌తో వస్తుంది, 42, 48, 55 ,65,77 , 83 అంగుళాల సైజుల్లో లభ్యం. ఇది పిక్సెల్ డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది . 100 శాతం కలర్ ఫిడెలిటీతో మంచి గేమింగ్ అనుభవాన్నిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో Nvidia G-Sync, AMD ఫ్రీసింక్ , VRRలకు సపోర్ట్ దీని స్పెషాలిటీ. ఇది పీసీగానూ కన్సోల్ గేమింగ్‌కు పనికొస్తుంది. ఇండియాలో ఈ టీవీ ధర రూ. 1,39,990 నుండి ప్రారంభం. LG అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సోనీ X90J కంపెనీ ఫ్లాగ్షిప్ 4K LED స్మార్ట్ టీవీఇది. సోనీ X90J అనేది బ్యాక్‌లైటింగ్ లోకల్ డిమ్మింగ్‌తో గేమింగ్‌కోసం బెస్ట్ ఆప్షన్ ఇది. ఇమేజ్ క్వాలిటీని పెంపొందించే Bravia XR ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ VRRకి సపోర్టు చేస్తుంది. ఇందులోని ఫార్-ఫీల్డ్ మైక్స్‌తో మీ వాయిస్‌ని ఉపయోగించి ఆపరేట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో లభిస్తుంది భారతదేశంలో రూ. 1,18,740 నుండి ప్రారంభం. ఈ టీవీని క్రోమా ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ Q90B QLED TV అద్భుతమైన 4K చిత్రాలను అందించడానికి నియో క్వాంటం ప్రాసెసర్‌ని కలిగి ఉంది. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ లైట్‌ని ఎడ్జస్ట్ చేసుకుని, 4K గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ టీవీకి VRR మద్దతు లేదు. 50, 55, 65, 75, 85 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,09,990 నుండి ప్రారంభం Samsung అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. TCL C835 4K TV క్వాడ్-కోర్ 4K ప్రాసెసర్, లోకల్ డిమ్మింగ్ , 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఈ టీవీ వస్తుంది. మినీ LED ప్యానెల్ అద్భుతమైన కాంట్రాస్ట్, VRR మద్దతును దీని స్పెషల్. TCL C835 TV 55,65 ,75 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర భారతదేశంలో రూ. 1,19,990 నుండి ప్రారంభం. TCL స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ది ఫ్రేమ్ 2022 శాంసంగ్ నుంచి మరో సూపర్ గేమింగ్ టీవీ శాంసంగ్ ది ఫ్రేమ్ 2022అద్భుతమైన డిజైన్‌తో అధునాతన ఫోటో ఫ్రేమ్‌గా కనిపిస్తుందీ టీవీ.120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఫ్రేమ్ 100 శాతం కలర్ వాల్యూమ్‌ను అందించే క్వాంటం డాట్ టెక్, క్వాంటం ప్రాసెసర్ కలిగి ఉంది. భారతదేశంలో రూ. 53,990 నుండి ప్రారంభం, దీన్ని Samsung స్టోర్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు -
చెమటకే చెమటలు పట్టాయి!
గేమ్స్‌లో హారర్ గేమ్స్ మజాయే వేరయా... అంటారు. ‘మాడిసన్’ కూడా అలాంటిదే. ఈ ఫస్ట్ పర్సన్ సైకలాజికల్ హారర్ గేమ్‌లో ఎన్నో పజిల్స్ ఛేదిస్తూ ముందుకు సాగాలి. ప్రతి అడుగును పదివిధాలుగా ఆలోచించి వేయాలి. ఎవరి ఇంటి తలుపైనా తడితే...తలుపు తెరుచుకోవచ్చు. కానీ దెయ్యం కనిపించవచ్చు. డార్క్కార్నర్లో నీడలు వెంటాడవచ్చు. ప్రతి గదిలో గోడలకు వేలాడుతున్న బ్లాక్ అండ్ వైట్ఫోటోలు, హిడెన్ మెసేజ్‌లు! ఈ గేమ్‌లో ప్రతి క్యారెక్టర్ ఒక డిస్టర్బింగ్ స్టోరీ. దుష్టశక్తి నుంచి రక్షించుకోవడానికి ‘ఇన్స్టంట్ కెమెరా’ను మాత్రమే ఆయుధంగా వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన కండ్లు చూడలేని దృశ్యాలను కెమెరా కన్ను చూస్తుంది. ప్రధాన పాత్ర ‘లూకా’గా మారతారా? సవాలుకు సై అంటే పదండి మరీ! ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, నిన్టెండో స్విచ్, ఎక్స్‌బాక్స్–1, మైక్రోసాఫ్ట్ విండోస్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, సిరీస్ 5, ప్లే స్టేషన్ 5 -
కోవిడ్ పూర్వ స్థాయికి మీడియా, వినోదం
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద రంగం నెమ్మదిగా కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకుంది. 10–12% వార్షిక వృద్ధితో 2030 నాటికి 55–70 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ మొదలై నవి గణనీయంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు ఊతంగా నిలవనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటల్ వీడియోల వినియోగం మిగతా విభాగాలన్నింటినీ మించి భారీ స్థాయిలో పెరుగుతోందని నివేదిక పేర్కొంది. చైనాతో పాటు అంతర్జాతీయంగా అత్యధికంగా వృద్ధి నమోదు చేస్తున్న మార్కెట్లలో ఒకటిగా దేశీ మీడియా, వినోద రంగం కూడా ఒకటని తెలిపింది. ‘టీవీల్లో ప్రకటనల పరిమాణాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. భవిష్యత్ లో కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాంతీయ చానళ్లలో అడ్వర్టైజింగ్ పెరగడం, కొత్తగా వచ్చే ప్రకటనకర్తల సంఖ్య వృద్ధి చెందనుండటం ఇందుకు దోహదపడగలవు‘ అని నివేదిక వివరించింది. చౌక డేటాతో అందుబాటులోకి ఓటీటీలు.. డేటా ధరలు మరింతగా తగ్గిపోవడంతో ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ చెల్లింపుల విధానాలు గణీయంగా పెరిగాయని నివేదిక తెలిపింది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలు, డిజిటల్ వీడియోలు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. వివిధ రకాల కంటెంట్ అందిస్తున్న 40 పైచిలుకు సంస్థలతో తీవ్రమైన పోటీ నెలకొన్న వర్ధమాన మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉందని వివరించింది. గత కొన్నేళ్లుగా ఎస్‌వీవోడీ (సబ్స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)లకు డిమాండ్ బాగా పెరిగిందని.. రాబోయే రోజుల్లో ఇది ఏవీవోడీ (అడ్వర్టైజింగ్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)ని మించిపోగలదని పేర్కొంది. యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థలు .. ధరల విషయంలో వినూత్న విధానాలు పాటించడం, కంటెంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడం మొదలైనవి ఇందుకు దోహదపడుతున్నాయని నివేదిక తెలిపింది. గేమింగ్ వృద్ధికి మరింతగా అవకాశం.. గేమింగ్ విషయానికొస్తే.. అమెరికా, చైనాతో పోల్చినప్పుడు ప్రస్తుతం తక్కువగానే ఉన్నప్పటికీ మొబైల్ వినియోగం పెరిగే కొద్దీ ఇది పటిష్టంగా వృద్ధి కనపర్చవచ్చని వివరించింది. ‘భారత్ ప్రతిభావంతులకు హబ్‌గా మారుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో గేమింగ్ కంపెనీల సంఖ్య పది రెట్లు పెరిగింది. గత కొన్నాళ్లుగా ఈ రంగంలో వెంచర్ క్యాపిటల్ సంస్థల పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి‘ అని సీఐఐ, బీసీజీ నివేదిక తెలిపింది. -
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న అజయ్.. అతడి ఖాతాలో 30.2 మిలియన్ల సబ్స్క్రైబర్స్!
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు....పాట గురించి గుజరాతీ కుర్రాడు అజయ్‌కి తెలియకపోవచ్చు. కాని అతడికి బాగా తెలుసు... ప్రతి నిమిషం ఇష్టమైన పనిపై దృష్టి పెడితే సక్సెస్‌ను కరెక్ట్‌గా ఊహించవచ్చు అని. అందుకే అజయ్ అలియాస్ అజ్జూభాయ్ విజేత అయ్యాడు. ‘టాప్ 10 ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్–2021’ గేమర్స్ జాబితాలో టాప్‌లో ఉన్నాడు... అజ్జూభాయ్గా ప్రసిద్ధుడైన అహ్మదాబాద్‌కు చెందిన అజయ్ ఇంటర్మీడియట్ తరువాత ‘ఇక చదువుకోవడం నా వల్ల కాదు’ అనుకున్నాడు. అలా అని ఖాళీగా తింటూ కూర్చోలేదు. బలాదూర్‌గా తిరగలేదు. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన విషయాలంటే అతడికి చాలా ఇష్టం. ఆన్లైన్ వేదికగా సొంతంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అజయ్ బాల్యం ‘స్కూల్ టు హోమ్....హోమ్ టు స్కూల్’ అన్నట్లుగా ఉండేది. అలాంటి అజయ్ చదువు మధ్యలోనే మానేయడం తల్లిదండ్రులకు నచ్చిందో లేదో కానీ వారు పెద్దగా ఏమీ అనలేదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ‘గ్రోత్ హ్యాకర్’గా పనిచేశాడు అజయ్. తనకు గేమింగ్ అంటే చా...లా ఇష్టం. అయితే తన ఫ్రెండ్స్, పరిచయస్తులలో గేమ్స్ గురించి పెద్దగా తెలిసినవాళ్లు, బాగా ఇష్టపడేవాళ్లు లేరు. గేమర్స్ తమదైన గేమింగ్ కమ్యూనిటీని ఎలా క్రియేట్ చేసుకుంటారు? అనే సందేహం అతనికి ఎప్పుడూ వచ్చేది. ఇక తానే సొంతంగా ఆన్లైన్లో తనలాంటి ఆసక్తి ఉన్నవారిని పరిచయం చేసుకొని గేమ్స్ ఆడేవాడు. మొదటిసారి యూట్యూబ్‌లో ‘ఫ్రీ ఫైర్’ గేమ్స్ చూసినప్పుడు బాగా ఆకర్షితుడయ్యాడు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. ఒకరోజు తన సోదరుడితో అన్నాడు... ‘యూట్యూబ్ గేమింగ్ చానల్ మొదలుపెడదామనుకుంటున్నాను. ఎలా ఉంటుంది?’ ‘నీకంత సీన్ లేదు’ అని ఆ సోదరుడు వెక్కిరించి ఉంటే ఎలా ఉండేదోగానీ ‘బాగుంటుంది. నువ్వు బ్రహ్మాండంగా చేయగలవు’ అని ధైర్యం ఇచ్చాడు. అలా మన అజయ్ ‘టోటల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. ఇది సూపర్ హిట్టు. దీనిలో గేమింగ్ కంటెంట్ ఎప్పటికప్పుడూ అప్లోడ్ చేస్తుంటారు. ‘టీజీ టోర్నమెంట్స్’ అనే రెండో చానల్ మొదలుపెట్టాడు. అది కూడా సూపర్‌డూపర్ హిట్ అయింది. ఇందులో ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్ నిర్వహిస్తుంటారు. వెరైటీస్ ఆఫ్ గేమింగ్, ఎంటర్టైనింగ్, మోటివేషనల్....మొదలైనవాటితో కంటెంట్ క్రియేటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు అజ్జూభాయ్. అతడి ఖాతాలో 30.2 మిలియన్ల సబ్స్క్రైబర్స్!! మన దేశంలో ‘లీడింగ్ గేమర్’గా పేరు తెచ్చుకున్న అజ్జూభాయ్ విజయరహస్యం ఏమిటి? అతని మాటల్లోనే చెప్పాలంటే... ‘క్లీన్ కంటెంట్’ స్మార్ట్టీవిలు మొదలైన తరువాత కుటుంబంతో కలిసి గేమ్స్ ఆడే కాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో క్లీన్ కంటెంట్ ఉండాలని, అభ్యంతరకరం కాని భాష ఉండాలనేది అతని నమ్మకం. ఆ నమ్మకమే అతడిని విజేతను చేసింది. కర్వ్డ్ హెచ్డీ టచ్‌స్క్రీన్ ∙40 ప్లస్ డైలీ లైవ్క్లాసెస్. పాప్లర్ మ్యూజిక్. బ్యాలెన్స్డ్ డిజైన్. మాగ్నెటిక్ రెసిస్టెన్స్. డ్యుయల్ బాటిల్ హోల్డర్స్. బ్లూటూత్ రెసిస్టెంట్ కంట్రోల్.సూపర్‌ఫాస్ట్ స్ట్రీమింగ్ స్క్రాచ్. రెసిస్టెన్స్ బరువు: 56కిలోలు చదవండి: ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో! -
ఉత్తుత్తి కంపెనీలు.. ఊళ్లు దాటిన వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: చైనా, హాంకాంగ్‌లకు చెందిన గేమింగ్, డేటింగ్ యాప్స్ కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. యాప్స్ నిర్వహిస్తున్న కంపెనీల లావాదేవీలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్.. రూ.1,500లకో సంతకంతో వేల కోట్లు దేశం దాటేలా సహకరించాడని వెల్లడించింది. షెల్ కంపెనీల లావాదేవీలకు బోగస్ సర్టిఫికెట్లు జారీ చేసి రూ.1,100 కోట్లు చైనా, హాంకాంగ్ చేరేలా చేశాడని చెప్పింది. హెయిర్ మర్చంట్స్.. క్రిప్టో కరెన్సీ రూపంలో ఢిల్లీకి చెందిన చార్టెట్ అకౌంటెంట్ రవికుమార్.. చైనా, హాంకాంగ్‌కు చెందిన లింక్యూన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డోకిపే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లావాదేవీలు చూస్తున్నాడు. సంబంధిత కంపెనీలు మన దేశంలో డేటింగ్, గేమింగ్ యాప్‌ల ద్వారా వేల కోట్లు వసూలు చేసి మోసం చేశాయి. ఈ డబ్బు ను మనీలాండరింగ్ ద్వారా రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. నకిలీ ఎయిర్ వే బిల్లులు, సీసీ కెమెరాల క్లౌడ్ స్టోరేజ్ మెయింటెనెన్స్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి ఎస్బీఐ, ఎస్‌బీఎమ్ బ్యాంకుల ద్వారా రూ.1,100 కోట్ల డబ్బును రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. కొంత డబ్బును హవాలా రూపంలో హెయిర్ మర్చంట్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో సింగపూర్‌కు మళ్లించినట్టు తేల్చింది. సంతకానికి రూ. 1,500 మనీ లాండరింగ్ ద్వారా రూ.1,100 కోట్లను దేశాన్ని దాటించేందుకు చైనా, హాంకాంగ్‌లో ఉన్న మాఫియా నేతృత్వంలో రవికుమార్ 621 బోగస్ కంపెనీలు సృష్టించాడని, అలాగే బోగస్ ఫామ్ 15 సీబీ సర్టిఫికెట్లు జారీ చేశాడని ఈడీ గుర్తించింది. చార్టెడ్ అకౌంటెంట్‌గా బ్యాలెన్స్ షీట్లను చూడకుండానే షెల్ కంపెనీలకు సంతకాలు చేశాడంది. ఈ మొత్తం వ్యవహారంలో రవికుమార్ తన ప్రతి సంతకానికి రూ.1,500 చొప్పున తీసుకున్నట్టు గుర్తించింది. బోగస్ కంపెనీల సృష్టికర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రవికుమార్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టామని ఈడీ తెలిపింది. రవికుమార్‌ను విచారించేందుకు కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించినట్టు చెప్పింది. -
JIO: ఇ గేమింగ్ టోర్నమెంట్.. భారీ క్యాష్‌ప్రైజ్
MEDIATEK AND JIO GAMING MASTERS 2.0: గేమర్లకు శుభవార్త తెలిపింది జియో నెట్వర్క్! ఇండియాలో ఇ గేమ్స్ ఆడే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ జియో, చిప్సెట్ల తయారీ సంస్థ మీడియాటెక్‌లు సంయుక్తంగా గేమింగ్ మాస్టర్ 2.ఓ పేరుతో ఆలిండియా రేంజ్లో గేమింగ్ పోటీలను నిర్వహిస్తున్నాయి. క్యాష్ ప్రైజ్ గేమింగ్ మాస్టర్ 2.ఓ పోటీలో పాల్గొనే ప్రొఫెషనల్ గేమర్స్, ఇ గేమింగ్‌లో ఉత్సాహం ఉన్నవారి కోసం భారీ క్యాష్ ప్రైజులు రెడీగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కోసం రూ. 12.50 లక్షల వరకు ప్రైజ్‌పూల్‌ను ప్రకటించారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సిరీస్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. రిజిస్ట్రేషన్లు గేమింగ్ మాస్టర్ 2.ఓకి సంబంధించి రిజిస్ట్రేషన్లు నవంబరు 12 నుంచి ప్రారంభం అవుతాయి. వెబ్‌పోర్టల్ https://play.jiogames.comకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గేమింగ్ మాస్టర్ 2.ఓ టోర్నమెంట్ నవంబరు 23 నుంచి జనవరి 10 వరకు జరుగుతాయి. జియో యూజర్లు, జియో నాన్ యూజర్లు ఈ గేమింగ్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. ఎటువంటి పార్టిసిపేషన్ ఫీజు లేదు. ఇలా చూడొచ్చు గేమింగ్‌మాస్టర్ 2.ఓలో జరిగే అన్ని గేమ్స్‌ని ఆసక్తి ఉన్న వారు జియోగేమ్స్ వాచ్, జియోటీవీ హెచ్డీ ఈస్పోర్ట్స్ ఛానల్, ఫేస్బుక్ గేమింగ్, జియోగేమ్స్ యూట్యూబ్ ఛాన్సల్‌లో చూడవచ్చు. మీడియాటెక్ జియో రాకతో ఇండియాలో ఇంటర్నెట్ యూసేజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో ప్రముఖ మొబైల్ నెట్వర్క్ కంపెనీగా జియో సుస్థిర స్థానం దక్కించుకుంది. మరోవైపు మీడియాటెక్ ప్రాసెసర్‌తో ఇండియాలో అనేక మొబైల్ ఫోన్లు తయారయ్యాయి. ముఖ్యంగా మీడియా టెక్ అందిస్తోన్న హెలియో జీ సిరీస్ చిప్సెట్లపై గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. కాగా 5జీ నెట్‌వర్క్‌పై మరింత సమర్థంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు మీడియాటెక్ సంస్థ డైమెన్సిటీ 5జీ పేరుతో సరికొత్త చిప్సెట్లను అందుబాటులోకి తెచ్చింది. -
ఫేస్బుక్ గేమింగ్ ఈవెంట్ విశేషాలివీ: ఎఫ్బి ప్రతినిధి
కరోనా కారణంగా పెరిగిన ఆన్లైన్ యాక్టివిటీలో గేమింగ్ కూడా ఒకటి. కరోనా అనంతరం పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ ఆన్లైన్ వ్యూహాలకు పదనుబెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాదే సరికొత్తగా రూపుదిద్దిన ఆన్లైన్ క్రీడా కార్యక్రమం ఫేస్బుక్ గేమింగ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ హట్చందానీ సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... ఆటకు...ఊపు.. గేమింగ్ కమ్యూనిటీకి ఊపునిచ్చేందుకు, ఆటగాళ్లకు మద్ధతుని అందించేందుకు ఫేస్బుక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మా తొలి గేమింగ్ ఈవెంట్‌కి దేశవ్యాప్తంగా గేమ్స్ లవర్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వర్చ్యువల్ కార్యక్రమంలో ఫేస్‌బుక్‌పై తమ గేమింగ్ స్కిల్స్‌ని ఎలా నిర్మించుకోవాలి? ఎలా మెరగుపరచుకోవాలి? తదితర అంశాలపై గేమ్ డెవలపర్స్, పబ్లిషర్స్, క్రియేటర్స్‌కు అవగాహన సదస్సులు జరిగాయి. మద్ధతు ఇలా... గేమింగ్ క్రియేటర్స్‌కు ఫేస్బుక్ గేమింగ్ క్రియేటర్ ప్రోగ్రామ్ లెవలప్ వంటివాటి ద్వారా మద్ధతు అందిస్తున్నాం. ఫేస్బుక్ మీద ఎంటర్టైనింగ్ గేమింగ్ వీడియోస్ చూడవచ్చు. అలాగే గేమ్ టైటిల్స్‌ని, క్రియేటర్స్ని ఫాలో చేయవచ్చు. గేమింగ్ గ్రూప్స్‌తో అనుసంధానం కావచ్చు. ఇక చిన్నా పెద్దా గేమ్ డెవలపర్స్ కూడా మా ప్లాట్ఫార్మ్ ద్వారా తమ గేమ్స్‌కు ఆడియన్స్‌తో పాటే అభివృద్ధిని కూడా అందుకోవచ్చు. ఫన్ టూ విన్... ల్యూడో కింగ్ లాంటి క్యాజువల్ టైటిల్స్ నుంచీ అస్పాల్ట్ 9 లాంటి రేసింగ్గేమ్స్ దాకా మా ప్లే ప్లాట్‌ఫామ్ మీద అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేయకుండా నేరుగానే ఆడవచ్చు. ఆడడం మాత్రమే కాదు ఇతరులు ఆడడాన్ని చూడడం కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇతర కమ్యూనిటీస్‌తో అనుసంధానం ద్వారా దానికి ఫేస్బుక్ అవకాశం కల్పిస్తుంది. మేమిస్తున్న మద్ధతు కల్పిస్తున్న అవకాశాల నేపధ్యంలో కేవలం గత జులై, ఆగస్టు నెలల్లోనే దాదాపు 20 మిలియన్ల మంది ఫేస్బుక్ గేమింగ్ గ్రూప్స్‌లో సభ్యులుగా మారారు. -
గేమింగ్ ప్రియుల కోసం ఐక్యూ నుంచి కొత్త ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనా మార్కెట్లలోకి ఐక్యూ జెడ్5 స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 23న లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లలోకి కూడా వస్తుందని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి ఐక్యూ జెడ్5 భారత్‌లో ఆవిష్కరించే అవకాశం ఉందని జీఎస్ఎమ్ఎరీనా పేర్కొంది. రాబోయే ఐక్యూ జెడ్5 భారత మార్కెట్లలో సుమారు రూ. 30వేల లోపే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఐక్యూ జెడ్5 అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌తో గేమింగ్ ప్రియులకు సౌకర్యవంతంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఉంటుందని తెలుస్తోంది. (చదవండి: బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్) ఐక్యూ జెడ్5 ప్రో స్పెసిఫికేషన్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ LPDDR5 ర్యామ్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 64 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో , హై-రెస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: ఆన్లైన్లో వైరల్ అవుతున్న రియల్మీ జీటీ నియో 2 ఫీచర్స్ -
కంటి చూపుతో కాదు కత్తితో..
న్యూ మినీగేమ్స్, న్యూ టెక్నిక్స్, న్యూ ఎనిమీ టైప్స్తో యాక్షన్ ఎడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ తుషిమా డైరెక్టర్స్ కట్’ నేడు విడుదలవుతుంది. ఇకీ ద్వీపం నేపథ్యం ఉన్న ఈ బ్రాండ్ న్యూ ఎడిషన్‌ను మోస్ట్ రిక్వెస్టెడ్ ఫీచర్స్‌తో తీర్చిదిద్దారు. ఇక కత్తి యుద్ధాల గురించి చెప్పాల్సిన పని లేదు. మనకు ఇష్టమైన జిన్ సకై సమురాయ్ ఉండనే ఉన్నాడు. కొత్త విలన్లు కూడా పరిచయం అవుతున్నారు. ‘మీకు సవాలుగా నిలిచే గేమ్ ఇది’ అంటున్నాడు ఆర్ట్ డైరెక్టర్ జాసన్ కనెల్. ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5 -
Asus ROG Phone 3 : చేతిలో ఇమిడిపోయే గేమింగ్ ఫోన్
గేమింగ్ మార్కెట్ లో విడుదలయ్యే గేమ్స్ ను అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ లో ఆడే సౌకర్యం ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్నారా? పాత స్మార్ట్‌ఫోన్‌ను పక్కనపెట్టి కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు గేమింగ్ కోసం కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనాలని చూస్తున్నట్లైతే ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త ఫోన్లపై ఆఫర్లని ప్రకటించింది. జూన్ 13 నుంచి జూన్ 16 మధ్య ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆసుస్ ROG Phone 3 ధరపై భారీ ఆఫర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఫోర్ట్‌నైట్, ఎపిక్ గేమ్స్, పబ్జీ లేదా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ ను ఈ స్మార్ట్ ఫోన్లలో ఆడుకోవచ్చని ఆసుస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఆసుస్ ROG Phone 3 ను కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. ఆసుస్ ROG Phone 3 ఫీచర్స్ ఆసుస్ ROG Phone 3 లో 6.59-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ , 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 1,000 నిట్స్, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ తో వస్తుంది ఆన్-డిస్ప్లే, HDR10 మరియు HDR10 + టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తోంది ఆసుస్ ROG Phone 3 ప్రాసెసర్ ఆసుస్ ROG Phone 3 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ 5 జి ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది క్వాల్కమ్ అడ్రినో 650 GPU తో కలిసి ఉంటుంది. 12జీబీ RAM మరియు 512జీబీ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆసుస్ ROG Phone 3 కెమెరా కెమెరా ముందు భాగంలో ఆసుస్ ROG Phone 3 లో 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. వెనుక భాగంలో, సోనీ IMX686 సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆసుస్ ROG Phone 3 కనెక్టివిటీ కనెక్టివిటీ కోసం ఆసుస్ ROG Phone 3 లో బ్లూటూత్ V5.1, Wi-Fi, డ్యూయల్-స్టాండ్‌బై సపోర్ట్ డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆసుస్ ROG Phone 3 బ్యాటరీ ఇది 30W పవర్ అడాప్టర్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీకి మద్దతునిస్తుంది. చదవండి : జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త! -
గేమింగ్ ప్రియుల కోసం రెడ్మీ సూపర్ ఫోన్!
చైనా: గేమింగ్ కిల్లర్ రెడ్ మీ కే40 సిరీస్‌లో కొత్త ఫోన్ రెడ్ మీ కే40 గేమింగ్ ఎడిషన్ ను చైనాలో లాంచ్ చేసింది. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో కొన్ని గేమింగ్ ఫీచర్లను షియోమీ తీసుకొచ్చింది. షోల్డర్ బటన్లు, మూడు మైక్‌లు, డాల్బీ అట్మాస్, జేబీఎల్ ఆడియో సపోర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఈ మొబైల్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 30వ తేదీన చైనాలో జరగనుంది. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారో అనే విషయం తెలియదు. రెడ్మీ కే40 గేమింగ్ ఎడిషన్ ఫీచర్స్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెట్ రేట్ హెచ్డీఆర్10+ సపోర్ట్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా + 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా + 2 ఎంపీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా 5065 ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 1,999 యువాన్లు (సుమారు రూ.23,000) 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,199 యువాన్లు (సుమారు రూ.25,300) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,600) 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,500) 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,699 యువాన్లు (సుమారు రూ.31,100) చదవండి: 65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు! -
గేమింగ్ స్కామ్‌లో మల్టీలెవల్ మార్కెటింగ్...!
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వ్యాపారం పేరుతో సంస్థల్ని రిజిస్టర్ చేసుకుని, కలర్ ప్రెడిక్షన్ గేమ్ ముసుగులో బెట్టింగ్ దందా నిర్వహించిన బీజింగ్ టీ పవర్ కంపెనీ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు పాల్పడినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ పంథాలోనే అనేక మంది కొత్త ‘కస్టమర్ల’ను ఆకర్షించినట్లు తేల్చారు. ఈ స్కామ్ మొత్తం విలువ రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సౌత్ ఈస్ట్ ఏసియా ఆపరేషన్స్ హెడ్ యాన్ హూపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీసర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్ కింద ఆరోపణలు జోడించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు సమాచారం అందించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన యాన్ హూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్లను తదుపరి విచారణ కోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం నాలుగు రోజులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ విచారణ ప్రారంభం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు యాన్ హూపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీసర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్ కింద ఆరోపణలు జోడించారు. ప్రాథమికంగా ఈ కేసుల్ని కుట్ర, మోసంతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని సెక్షన్ల కింద నమోదు చేశారు. ఈ గ్యాంగ్ వారిని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన యువత సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫోన్లు చేస్తున్నారు. తాము కూడా ఆ గేమ్ వల్లో పడి భారీగా నష్టపోయామని చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు తన తల్లి వైద్యం కోసం దాచిన రూ.2.5 లక్షల్ని ఈ గేమ్‌లో నష్టపోయానని, ఆ మొత్తం తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాడు. అయితే తెలంగాణలో మాదిరిగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ గేమింగ్ నిషేధం కాదు. దీంతో ఆయా చోట్ల కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. గత వారం నుంచి ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులకు సంబంధిం చిన 30 బ్యాంకు ఖాతాలు గుర్తించి ఫ్రీజ్ చేశారు. వీటికి సంబంధిం చిన స్టేట్మెంట్స్ అందించాల్సిందిగా ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అవన్నీ అందిన తర్వాతే ఆర్థిక లావాదేవీలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని చెప్తున్నారు. కీలక నిందితుల కోసం గాలింపు.. ఇక ఈ–కామర్స్ పేరుతో ఢిల్లీలో ఆ సంస్థల్ని రిజిస్టర్ చేయించిన గుర్గావ్ వాసులే ఈ ఖాతాలను తెరిచారని తేలింది. తాము చైనా ఈ–కామర్స్ యాప్స్ మానిటర్ చేస్తుంటామని, ఆ ఆదాయం ఈ ఖాతాల్లోకి వస్తుందని బ్యాంకు, పేమెంట్ గేట్వేస్ నిర్వాహకుల్ని నమ్మించారు. అయితే వీటిని నిర్వహించింది మాత్రం యాన్ హూ సహా ఆయా కంపెనీల్లోని చైనా డైరెక్టర్లే కావడం గమనార్హం. ఈ స్కామ్‌లో కీలక నిందితులుగా ఉన్న ఢిల్లీ వాసులు రాహుల్, హేమంత్ల కోసం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రాథమికంగా ఈ స్కామ్ రూ.1,100 కోట్లని భావించినా... ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు ఈ మొత్తం రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నగదు లావాదేవీలు డాకీ పే, లింక్ యూ పే యాప్ ద్వారా జరిగినట్లు చెప్తున్నారు. దీంతో వీరికి నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 20 మందిని చేరిస్తే రూ.500 ఈ గేమ్‌లోకి కొత్తవారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. ఇప్పటికే ఈ గేమ్ ఆడుతున్నవారు లేదా దళారులు ఇచ్చే రిఫరల్‌తో మాత్రమే ఇందులోకి ఎంటర్ అయ్యే వీలుంటుంది. ఇలా రిఫరల్ కోడ్ ఇవ్వడం, ఒక వ్యక్తి మరికొందరిని చేర్చడం మల్టీ లెవల్ మార్కెటింగ్ కిందికే వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికోసం పనిచేసే దళారులు.. ఓ వ్యక్తిని యాప్‌లోకి ఇన్వైట్ చేసిన తర్వాత కనీసం రూ.200 రీచార్జ్ చేసుకోమంటారు. ఇలా 20 మందిని ఆకర్షించి వారితో రూ.200 చొప్పున రీచార్జ్ చేయిస్తే వీరు రూ.500 కమీషన్ పొందుతున్నారు. ఇలా మనీ సర్క్యులేషన్ దందా నిర్వహిస్తున్నారు. -
ఆసుస్ సూపర్ గేమింగ్ ఫోన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆసుస్ కంపెనీ సూపర్ గేమింగ్ ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. నెక్స్ట్-జెన్ గేమింగ్-ఫోకస్‌గా రోగ్ ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ స్క్రీన్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ సాక్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బీఫీ బ్యాటరీ, గేమ్ కూలింగ్, డ్యూయల్ వైబ్రేషన్ మోటార్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. రోగ్-2లో ప్రాసెసర్ 15 శాతం వేగవంతమైన గ్రాఫిక్స్ పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది. రెండు వేరియంట్లలో 18 వాట్స్, 30వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీని అమర్చింది. బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో భాగంగా ఈ హ్యాండ్సెట్ దేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి లభ్యం కానుంది. ఆసుస్ రోగ్ ఫోన్ -2 ఫీచర్లు 6.59-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0పై 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 48+13 ఎంపీ రియర్ కెమెరా 24 ఎంపీ సెల్పీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ .37,999 12జీబీ ర్యామ్ /512 జీబీ స్టోరేజ్ వేరియంట్, రూ. 59,999 -
లెనొవొ నుంచి అధునాతన గేమింగ్ ల్యాప్‌టాప్
న్యూఢిల్లీ: ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ (పీసీ) తయారీ కంపెనీ ‘లెనొవొ’.. తాజాగా తన అధునాతన గేమింగ్ ల్యాప్‌టాప్, పీసీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘లెజియన్ వై 540’ పేరుతో ల్యాప్‌ట్యాప్.. ‘లెజియన్ వై 740’ పేరిట డెస్క్‌టాప్‌లను మంగళవారం విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 70,000 నుంచి రూ. 1.3 లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శైలేంద్ర కటియల్ మాట్లాడుతూ.. ‘గతేడాది మొదటి త్రైమాసికంలో లెజియన్ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. దీనికి 14.6% మార్కెట్ వాటా లభించింది. నూతన మోడళ్లతో ఈ ఏడాది మూడవ క్వార్టర్లో 20% మార్కెట్ వాటాకు ఎగబాకుతుందని భావిస్తున్నాం. ఇక రెండేళ్ల కిందట శాతంగా ఉన్న గేమింగ్ మార్కెట్.. ఇప్పుడు 5 శాతానికి పెరిగింది. రూ. 60,000– రూ. 80,000 మధ్య శ్రేణి గేమింగ్ ల్యాప్‌టాప్‌ల మార్కెట్ భారత్‌లో శరవేగంగా వృద్ధిచెందుతోంది’ అని వ్యాఖ్యానించారు. -
మూడేళ్ల డిగ్రీగా గేమింగ్, యానిమేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్నాళ్లు అధికారిక గుర్తింపు లేకుండా కొనసాగిన గేమింగ్, యానిమేషన్ వంటి కోర్సులు ఇకపై మూడేళ్ల డిగ్రీ కోర్సులుగా కొనసాగించేందుకు యాజమాన్యాలు ముందుకొచ్చాయి. దీంతో వాటికి ప్రభు త్వం నుంచి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా జవహర్‌లాల్‌నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఒప్పం దం చేసుకొని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే 17 విద్యా సంస్థలు వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అయితే వాటిపై అనేక ఫిర్యాదులు రావడం, విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించని కోర్సులను డిగ్రీలుగా ఎలా కొనసాగిస్తున్నారని, వాటి నిర్వహణకు జేఎన్ఏఎఫ్ఏయూ ఎలా ఒప్పందం చేసుకుంటోందంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూజీసీ గుర్తించిన కోర్సులను వాటిల్లో నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కోర్సులు నిర్వహించడానికి వీల్లేదని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. అయితే సదరు అధికారి సెలవులో ఉన్న సమయంలో వాటి గుర్తింపునకు ఉత్తర్వులు జారీ చేసేలా పావులు కదిపారు. ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే సెలవుపై వెళ్లిన సదరు అధికారి తిరిగొచ్చాక విషయం తెలుసుకొని ఆ ఉత్తర్వులను అమలు చేయొద్దని లేఖ రాశారు. దీంతో యాజమాన్యాలు దిగివచ్చాయి. నాలు గేళ్లు కాకుండా మూడేళ్ల కోర్సులుగానే నిర్వహిస్తామని, వాటికి గుర్తింపు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. -
అధికారుల అడ్డగోలు ‘గేమింగ్’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న యానిమేషన్, గేమింగ్ వంటి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల గుర్తింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఏళ్ల తరబడి ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోర్సుల విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలతో అధికారులు కుమ్మక్కైన్నట్లు తెలిసింది. 2018–19లో గుర్తింపు విషయంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెలవులో ఉన్న సమయలలో నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచే ఉత్తర్వులు వచ్చేలా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాటికి అనుమతులు ఇవ్వబోమని ముందుగానే స్పష్టం చేసినా, సదరు అధికారి సెలవులో ఉన్న సమయంలో సాంకేతిక విద్యా శాఖ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించడం, ఆయన్ని తప్పుదోవ పట్టించి ఉత్తర్వులు జారీ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి తిరిగి విధుల్లో చేరాక, విషయం తెలుసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేస్తారంటూ సాంకేతిక విద్యా శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులను అమలు చేయవద్దని ఇటీవల లేఖ రాయడంతో గందరగోళం నెలకొంది. ఎలాంటి గుర్తింపు లేకుండానే.. హైదరాబాద్‌లో వివిధ రంగాలతోపాటు, సినీ ఇండస్ట్రీకి ఉపయోగపడే పలు స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చే 17 ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అవి కాలేజీలు కాదు. వాటికి యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు కూడా లేదు. అవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్ అండ్ గేమింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, ఈవెంట్ ప్లానింగ్, కాస్మెటాలజీ వంటి కోర్సుల్లో 6 నెలల డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి. అవే కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించేందుకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)తో అవి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందం ద్వారా కోర్సుల నిర్వహణకు అనుమతిచ్చే అధికారం ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి లేదు. పైగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఉండాలి. సాంకేతిక విద్యా కోర్సులు ఉన్నందున ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవీ లేకుండానే ఆయా సంస్థలు కోర్సులను నిర్వహిస్తూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి. వర్సిటీ పాత్రపై అనుమానాలు! యూజీసీ నుంచి, ఏఐసీటీఈ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, కాలేజీలుగా గుర్తింపు లేకున్నా యూజీ, పీజీ కోర్సులను హైదరాబాద్‌లోని 17 సంస్థలు నిర్వహిస్తుండటం, వాటితో జేఎన్ఏఎఫ్ఏయూ ఒప్పందం చేసుకోవడంపై అనేక ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2016లోనే ఆయా సంస్థలు కోర్సులను నిర్వహించవద్దని చెప్పినా జేఎన్ఏఎఫ్ఏయూ ఒప్పందాన్ని కొనసాగించడంలో మతలబు ఏంటన్నది అధికారులే చెప్పాల్సి ఉంది. తప్పు జరుగుతోందని తెలిసినా, విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా.. 2017–18లో కోర్సులను కొనసాగించేందుకు యూనివర్సిటీ అధికారులు భారీ మొత్తంలో దండుకొని అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పెషల్ సీఎస్ లేని సమయం చూసి.. 2018–19లో ఆ కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ససేమిరా అన్నారు. దీంతో సదరు అధికారి అనారోగ్యం కారణంగా గత నెలలో సెలవుపై వెళ్లారు. అదే అదనుగా భావించిన సంస్థలు తమ కోర్సుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సాంకేతిక విద్యా శాఖను ఆశ్రయించాయి. వాస్తవానికి వాటికి ప్రతిపాదనలు పంపాల్సింది ఉన్నత విద్యా శాఖ అయినా సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి ఫైలు పంపించింది. ఈ వ్యవహారం తెలియని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గత నెల 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుపై వెళ్లిన అధికారి తిరిగి వచ్చే సరికి జీవో వెలువడటంతో విస్మయానికి గురయ్యారు. వెంటనే ఆ జీవోను అమలు చేయవద్దని లేఖ రాశారు. -
అతి ‘స్మార్ట్’ అనర్ధమే..!
డిజిటల్ అడిక్షన్ అదేనండీ.. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్ రూపాల్లోని పరికరాలు, వస్తువుల వినియోగం ఓ వ్యసనంగా మారుతోందా..? మనమంతా వాటికి బానిసలుగా మారే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నామా? దీనికి అవుననే సమాధానమే వస్తోంది. స్మార్ట్ఫోన్ల అతి వినియోగం నాడీ మండలంలో మార్పులకు కారణమవుతోందని ఓ తాజా అధ్యయనంలో బయటపడింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా తలమునకలైతే ఎదుటివారిని నిందించే స్వభావం, ప్రవర్తన పెరగడంతోపాటు సామాజికంగా ఇతరులకు దూరమై, ఒంటరితనానికి గురైనట్టుగా భావిస్తారని ఇటీవలే ‘న్యూరో రెగ్యులేషన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ స్టడీ వెల్లడించింది. ప్రతీక్షణం.. పక్కనే ఉండాలి ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కక్షణం కూడా వదిలి ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లలో వచ్చే మెసేజ్ అలర్ట్‌ల పట్ల స్పందిస్తున్న తీరు పురాతన కాలంలో ఏదైనా అనుకోని ముప్పు లేదా కీడు సంభవిస్తుందా అని నాటి మానవుడు పడిన ఆందోళనతో పోల్చదగినదిగా ఉంటోందని ఈ పరిశీలన పేర్కొంది. సిగరెట్ల మాదిరిగానే డిజిటల్ టెక్నాలజీ కూడా ఓ వ్యసనంగా మారేలా రూపొందించారని నిఫుణులు భావిస్తున్నారు. వివిధ రూపాల్లో వచ్చే నోటిఫికేషన్లు, పింగ్‌లు, వైబ్రేషన్లు, అలర్ట్‌ల పట్ల ఏదో ప్రమాదం సంభవిస్తుందేమో అన్నట్టుగా చాలామంది స్పందిస్తున్నారు. ఒకవైపు తమ మనసులోని భావాలను ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ అదే సమయంలో ఇతర పనులు(మల్టీటాస్కింగ్) చేస్తున్నందు వల్ల మెదడు, శరీరం రిలాక్స్ కావడంలేదు. దాంతో చురుకుదనం మందగిస్తోంది. ఒకేసారి రెండు, మూడు పనులు చేస్తున్నవారు వాటిపై పూర్తిగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ పనులను సగం మాత్రమే సక్రమంగా నిర్వహిస్తున్నారని శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతీ చిన్న విషయానికి స్మార్ట్ఫోన్లపైనే ఆధారపడటం ఎక్కువైపోయింది. మనలో 40 శాతానికిపైగా ఉదయం నిద్రలేచిన 5 నిముషాల్లోనే ఫోన్లు చెక్ చేసుకుంటున్నట్టు, యాభై శాతానికిపైగా రోజుకు 25 సార్లు అంతకంటే ఎక్కువగానే ఫోన్లు పరీక్షించుకుంటున్నట్టు డెలాయిట్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. గేమింగ్ డిజార్డరే అంటున్న డబ్ల్యూహెచ్ఓ పరిసరాలను పట్టించుకోకుండా నిరంతరం వీడియోగేమ్‌ల్లో మునిగిపోయే‘గేమింగ్ డిజార్డర్’ను కూడా ‘రివిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్’(ఐసీడీ–11)లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చేర్చనుంది. దీనిలోభాగంగా ఈ డిజార్డర్‌ను అంతర్జాతీయ రోగాల వర్గీకరణ(ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్) జాబితాలో ప్రచురించనుంది. ప్రపంచంలోని ఆరోగ్య పోకడలు, సమస్యల తీరును గుర్తించి, వాటి నిర్థారణతోపాటు వర్గీకరణకు ఉద్ధేశించి ఐసీడీ–11ను ఓ ప్రామాణిక సాధనంగా డాక్టర్లు, పరిశోధకులు, ఎపిడమియోలాజిస్ట్‌లు ఉపయోగిస్తున్నారు. భారత్‌లో పరిస్థితి ఇదీ.. మనదేశంలో తొలిసారిగా 2016లో ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు ఈ గేమింగ్ డిజార్డర్‌ను గుర్తించారు. సైకియాట్రీ వార్డులో 22, 19 ఏళ్ల వయసున్న అన్నదమ్ములు నెలపాటు చికిత్స తీసుకున్నారు. వారి తల్లిదండ్రులు వైద్యుల సహాయం కోరే నాటికే కొన్నిరోజులపాటు తిండి, నిద్ర అనే ఆలోచన లేకుండా ఎడతెగని గేమింగ్ కారణంగా ఈ యువకులు సామాజికంగా ఇతరులతో కలవకుండా, శారీరకంగానూ పూర్తి నిస్సత్తువలో మునిగిపోయారు. అధిగమించేందుకు ఏం చేయాలి? - స్మార్ట్ఫోన్లలోని అలర్ట్‌లు, నోటిఫికేషన్లను ఆపేయాలి. - ఆన్లైన్ కంటే ఆఫ్‌లైన్‌లో ఇతర కార్యక్రమాలు చేపట్టాలి. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంభాషించాలి. - నిద్రపోవడానికి గంట ముందు అన్ని పరికరాలు ఆఫ్ చేసేయాలి లేదా మరో గదిలో ఫోన్‌ను ఉంచాలి. ఎందుకంటే ఫోన్లలోని‘బ్లూ వేవ్ లెంథ్ లైట్’ మెదడులో నిద్రకు సమయం ఆసన్నమైనదని సూచించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. - రాత్రి భోజనమప్పుడు ఫోన్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ ఇంటి వద్దే వదిలేసి కొంతదూరం నడవాలి. - ప్రతీ చిన్న విషయానికి వెబ్‌లో సెర్చ్ మానుకోవాలి - ఫేస్బుక్, ట్వీటర్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్ వంటి వాటిలో మునిగిపోకుండా సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ పాటించాలి. - కంప్యూటర్ లేదా మొబైల్ చూడాలనే కోరిక కలిగినపుడు నచ్చిన పుస్తకంలో కనీసం 30 పేజీలు చదివాకే వాటిని ముట్టుకోవాలని మనం సవాల్ చేసుకోవాలి. -
‘గేమింగ్’లో మరింత రాణించాలి
హైదరాబాద్: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఐటీ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ‘గేమర్ కనెక్ట్’ డెమోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గేమింగ్ ఇండస్ట్రీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల రెవెన్యూ వస్తుండగా, మన దేశంలో 1.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ మాత్రమే వస్తుందన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని నగరాలు గేమింగ్ రంగంలో మరింత రాణించాల్సి ఉందన్నారు. మౌలిక వసతులు ఉన్న హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గేమింగ్ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాలసీ రూపొందించిందని చెప్పారు. గేమింగ్‌లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎన్వీడియా మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ దూపర్ చెప్పారు. ఈ స్పోర్ట్స్‌లో 2.75 మిలియన్ డాలర్ల వింబుల్డన్ ప్రైజ్‌మనీ ఉందన్నారు. హైదరాబాద్‌లో గేమింగ్ కనెక్ట్‌కు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. గేమ్ ప్లేయర్స్‌గా కాకుండా గేమ్ డెలపర్స్, యానిమేటర్స్, స్టోరీ ప్లేయర్స్, ఈ స్పోర్ట్స్ ప్రొఫెషనల్ ప్లేయర్స్‌గా ఎదిగేందుకు యువతకు అవకాశం ఉందని ఎన్వీడియా మార్కెటింగ్ ఇండియా హెడ్ వంశీ కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో డెల్ కంజ్యూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్, జుటాక్ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ కెన్హో, ఎల్జి హోమ్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ ఉంచుల్ పార్క్ తదితరులు పాల్గొన్నారు. స్టేజిపై నిలుచుని తలకు వీఆర్ గ్లాస్ పెట్టుకున్న కేటీఆర్.. తనకు నిజంగా ఎవరెస్ట్ ఎక్కిన అను భూతి కల్గిందన్నారు. మంత్రి కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య కార్యక్రమంలో సందడి చేశారు. గేమింగ్‌పై అవగాహన... ఎన్వీడియా, డెల్, ఎల్జీ, జుటాక్, హైపర్‌ఎక్స్, కూలెక్స్ మాస్టర్ తదితర 8 కంపెనీలు గేమర్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కోల్‌కతా, అహ్మదాబాద్, కొచ్చిన్, లక్నోలలో నిర్వహించారు. యువతకు గేమింగ్ రంగంపై అవగాహన కల్పిస్తున్నారు. యువతకు డెమోలో రేసింగ్, జాంబీగేమ్స్, ఈ స్పోర్ట్స్‌లో పలు గేమ్స్‌ను చూపించి అనుభవాలను పంచుతారు. దాదాపు 28 డెమో స్టేషన్స్ ఏర్పాటు చేశారు. -
రాష్ట్రాల్ని ఊరిస్తున్న గేమింగ్!
బెట్టింగ్‌కూ చట్టబద్ధత కల్పిస్తున్న చిన్న రాష్ట్రాలు • ముందు వరుసలో సిక్కిం, దానివెంటే నాగాలాండ్ • త్వరలో పాండిచ్చేరిలో అనుమతులు: ఏఐజీఎఫ్ • 2010కే దేశీ బెట్టింగ్ పరిశ్రమ రూ.4 లక్షల కోట్లు: కేపీఎంజీ • ప్రస్తుతం దాని విలువ రూ.10 లక్షల కోట్లు: ఐసీఎస్ఎస్ • అంతా చట్ట విరుద్ధంగానే: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా • చట్టబద్ధం చేస్తే ఆర్థిక వ్యవస్థకూ మంచిదని సూచన సాక్షి ప్రతినిధి కొత్త ఆదాయ వనరులు వెతుక్కుంటున్న రాష్ట్రాలనిపుడు గేమింగ్, బెట్టింగ్ పరిశ్రమ ఊరిస్తోంది. కొన్ని నైతిక అంశాలు ఇమిడి ఉండటంతో పాటు... ప్రతిపక్షాలు, ఇతర వర్గాల నుంచి గట్టిగా వ్యతిరేకత వచ్చే అవకాశాలుండటంతో పెద్ద రాష్ట్రాలు ముందుకెళ్లటానికి వెనకంజ వేస్తున్నాయి. పెద్దగా ఆదాయ వనరులు లేని, బలమైన నాయకత్వం ఉన్న చిన్న రాష్ట్రాలు మాత్రం గేమింగ్, బెట్టింగ్ పరిశ్రమకు గేట్లు తెరిచేస్తున్నాయి. 2010 నాటికే దేశంలో ఈ పరిశ్రమ విలువ దాదాపు 60 బిలియన్ డాలర్లున్నట్లు (రూ.4 లక్షల కోట్లు) కేపీఎంజీ తన నివేదికలో అంచనా వేసింది. ఇదంతా సంఘటితంగా లేదని, దీన్లో చట్టవిరుద్ధంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్, గాంబ్లింగ్ కూడా ఇమిడి ఉన్నాయని సంస్థ వెల్లడించింది. అయితే అంతర్జాతీయ స్పోర్ట్స్ సెక్యూరిటీ సెంటర్ (ఐసీఎస్ఎస్) తాజా నివేదికలో మాత్రం ప్రస్తుతం దేశంలో 150 బిలియన్ డాలర్ల చట్ట విరుద్ధ బెట్టింగ్ జరుగుతోంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.10 లక్షల కోట్లు. ఈ మార్కెట్ పరిమాణం అంతర్జాతీయంగానైతే ఏకంగా 4 లక్షల కోట్ల డాలర్లు!!. సిక్కింతో మొదలు... ఆదార్లో మరిన్ని!! దేశంలో క్యాసినోలంటే మొదట గుర్తొచ్చేది గోవానే. కాకపోతే అక్కడ క్యాసినోలకు సముద్రంపై ఏర్పాటు చేయటానికి మాత్రమే అనుమతి ఉంది. ఈ క్యాసినోల వల్ల ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పర్యాటకులు కూడావెళుతున్నారు. ఇదంతా చూసిన ఈశాన్య రాష్ట్రం సిక్కిం... 2009లో కొత్త గేమింగ్ చట్టం తీసుకొచ్చింది. ఆన్లైన్ గేమ్స్‌కు అనుమతిచ్చింది. అయితే అవి ఇంట్రానెట్ ద్వారా ఆ రాష్ట్రంలో మాత్రమే అందుబాటులోఉంటాయి. జీ ఎంటర్టైన్ మెంట్‌కు చెందిన ఎస్సెల్ గ్రూపు దీన్ని అందిపుచ్చుకుని... తన సంస్థ ‘ఈజీటీ’ ద్వారా ఫ్రాంచైజీ పద్ధతిన ఆన్లైన్ గేమింగ్ సేవల్ని ఆరంభించి... ఇప్పుడక్కడ 120 ఔట్లెట్ల ద్వారాకార్యకలాపాలు సాగిస్తోంది. ఇక స్థానిక సంస్థ గోల్డెన్ గేమింగ్ కూడా ఇదే పద్ధతిలో 140 ఔట్లెట్లను తెరిచింది. గోవాలో క్యాసినోలున్న డెల్టా కార్ప్... గాంగ్టక్లోనూ క్యాసినో ఏర్పాటు చేస్తోంది. తాజాగా సిక్కిం... క్రికెట్బెట్టింగ్కు కూడా చట్టబద్ధమైన అనుమతులివ్వటం గమనార్హం.ఏటా రూ.100 కోట్ల ఆదాయంగేమింగ్, బెట్టింగ్‌కు అనుమతులివ్వటం వల్ల సిక్కింకు ఏటా రూ.100 కోట్లకు పైగా లైసెన్సు ఫీజుల రూపంలో ఆదాయం వస్తోంది. దీనికోసం సిక్కింలో డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఓ విభాగం కూడా పనిచేస్తోంది.క్యాసినోలు టూరిస్టుల్ని తప్ప స్థానికుల్ని అనుమతించకుండా... గేమింగ్‌లో నిబంధనల్ని పాటించేలా చూడటం దీని విధి. ఇది లాటరీలనూ పర్యవేక్షిస్తుంది. నాగాలాండ్, పాండిచ్చేరి కూడా!! మరో ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో ఇప్పటికే లాటరీలకు అనుమతి ఉంది. ఇక్కడ కూడా గేమింగ్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) సీఈఓ రోలాండ్ల్యాండర్స్ చెప్పారు. ‘‘చిన్న, పెద్ద రాష్ట్రాలు చాలావాటితో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. చట్టవిరుద్ధంగా సాగుతున్న బెట్టింగ్, గేమింగ్‌ను చట్టబద్ధం చేస్తే కనీసం ఆయా సంస్థలు ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి.మో సాలు జరగకుండా ఉంటాయి. ప్రభుత్వాలకూ ఆదాయం వస్తుం ది. ఈ విషయంలో పాండిచ్చేరి ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. త్వరలో అక్కడ గేమింగ్ చట్టం రాబోతోంది. ఇక క్యాసినోల ఏర్పాటుపై తెలంగాణప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. అక్కడి ప్రభుత్వ ముఖ్యులతో ప్రతింపులు జరుపుతున్నాం. పర్యాటకుల్ని ఆకర్షించడానికిది ఉపకరిస్తుందన్న భావనతో వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు’’ అని సాక్షి ప్రతినిధితో ల్యాండర్స్ చెప్పారు. గట్టి నియంత్రణలు తప్పనిసరి! నిజానికి స్కిల్ ఆధారిత గేమ్స్‌కు ఇప్పటికీ ఒరిస్సా, అస్సాం తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ అనుమతి ఉంది. ఈ ముసుగులో ఆన్లైన్ రమ్మీ వంటివి విజృంభిస్తున్నాయి కూడా. వీటివల్ల రాష్ట్రాలకు పన్నులు మాత్రం రావటంలేదు. ‘‘చట్టబద్ధం చేస్తే ఈ రంగం వృద్ధి చెందుతుంది. పకడ్బందీ నియంత్రణలతోనే ఇది చెయ్యాలి. విదేశాల్లో ఇప్పటికే ఈ పరిస్థితి ఉంది. చట్టబద్ధం చేస్తే ఉద్యోగాల కల్పనతో పాటు ఆర్థిక వ్యవస్థకూ మంచిదే’’ అని సీబీఐమాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఇటీవల సిక్కింలో నిర్వహించిన ఏఐజీఎఫ్ సదస్సులో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. హార్స్ రేసింగ్‌ను స్కిల్ గేమ్ ముసుగులో అనుమతిస్తున్నారని, మరి దానిపై బెట్టింగ్స్కిల్ ఎలా అవుతుందని ఫిక్కీ డైరెక్టర్ రాజ్‌పాల్ సింగ్ ప్రశ్నించారు. అలాంటపుడు క్రికెట్ ఎందుకు కాదని కూడా అడిగారాయన. ‘‘రూ.3 లక్షల కోట్ల మేర చట్టవిరుద్ధ బెట్టింగ్ జరుగుతోంది. ఒకవేళ వారిని పట్టుకున్నాశిక్షించడానికి సరైన చట్టాల్లేవు. అందుకే దీన్ని చట్ట బద్ధం చేసి, తగిన చట్టాలు తీసుకొస్తే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది’’ అని చెప్పారాయన. జనం ఫిక్సింగ్కే వ్యతిరేకమని, బెట్టింగ్‌కు కాదని... రెండిటినీ విడదీసి చూడాలనిచెప్పారు. ఈ సందర్భంగా రంజిత్ సిన్హా నోట్ల రద్దుపైనా విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానాలిచ్చారు. దేశంలో బ్లాక్‌మనీని పూర్తిగా నిర్మూలించటం కష్టమన్నారు. కాకపోతే ఇది ఆ దిశగా నిజాయితీతో వేసిన ఓ అడుగు’’అని వ్యాఖ్యానించారు. -
కొత్త సరకు
గేమింగ్ కోసం ప్రత్యేక ల్యాప్‌టాప్... ల్యాప్‌టాప్‌లతో ఆఫీసు పనులు చక్కపెట్టుకోవడంతోపాట ఓ మోస్తరుగా గేమ్స్ కూడా అడుకోవచ్చునని మనం అనుకుంటాం. కానీ ఎంఎస్ఐ సంస్థ గేమింగ్ కోసమే తయారు చేసిన ప్రత్యేకమైన ల్యాప్‌టాప్‌లను ఇటీవలే భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జీఎస్60 ఘోస్ట్ శ్రేణిలో లభిస్తున్న ఈ ల్యాప్‌టాప్‌ల ధర రూ.లక్ష పైమాటే. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. జీఎస్ 60 2 పీఈ, 2పీసీ, 2పీఎల్ పేర్లతో అందుబాటులో ఉన్న మూడు రకాల ల్యాప్‌టాప్‌లలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ సామర్థ్యంలో మాత్రమే తేడాలుంటాయి. మూడింటి స్క్రీన్‌సైజు 15.6 అంగుళాలు. ప్రాసెసర్ వేగం 2.5 గిగాహెర్ట్జ్, క్వాడ్‌కోర్. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కలిసి వస్తుంది ఈ ల్యాప్‌టాప్. ఒక టెరాబైట్ హార్డ్‌డిస్క్, మూడు గంటలపాటు పనిచేసే 6 సెల్స్ బ్యాటరీ, ఎనిమిది గిగాబైట్ల ర్యామ్ దీని సొంతం. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నిట్రో... స్మార్ట్‌ఫోన్ తయారీలో దేశీయంగా తనదైన ముద్ర వేసుకున్న మైక్రోమ్యాక్స్ కంపెనీ తాజాగా తన కాన్వాస్ శ్రేణిలో నిట్రో పేరుతో సరికొత్త ఫోన్‌ను విడుదల చేసింది. స్నాప్‌డీల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే లబ్యమవుతున్న ఈ ఫోన్ హై ఎండ్ ఫీచర్లతో కూడి ఉంది. ధర రూ.12,990. లేటెస్ట్ స్మార్ట్ఫోన్ల తరహాలోనే దీంట్లోనూ కిట్‌క్యాట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్సిస్టమ్ను ఉపయోగించారు. మైక్రోప్రాసెసర్ వేగం 1.7 గిగాహెర్ట్జ్ కాగా, మొత్తం ఎనిమిది కోర్లు ఉంటాయి. కాబట్టి మల్టీటాస్కింగ్ సులువుగా జరిగిపోతుంది. స్క్రీన్ సైజు అయిదు అంగుళాలు. రెజల్యూషన్ ఫుల్హెచ్డీ కంటే కొంచెం తక్కువగా 1280 బై 720గా ఉంది. నిట్రో ఏ 310 ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 మెగాపిక్సెల్స్. కాకపోతే దీంటో లైవ్ఫోటోలు (ఫొటోతోపాటు శబ్దాలు కూడా రికార్డ్ చేయడం) తీసే ఫీచర్ ఉంది. సెల్ఫీ కెమెరా 5 ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉంది. టైమర్ కూడా ఏర్పాటు చేశారు. మెమరీ 8 జీబీ మాత్రమే. ఎస్డీకార్డు ద్వారా 32 జీబీకి పెంచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2500 ఎంఏహెచ్. సెల్కాన్ మిలినియం అల్ట్రా క్యూ500... దేశీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సెల్కాన్ తన మిలినియం శ్రేణిలో తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే విడుదల చేసింది. అయిదు అంగుళాల స్క్రీన్‌సైజు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ దీని గ్రాఫిక్ప్రాసెసింగ్ యూనిట్. వీడియోకోర్ 4 జీపీయూను వాడటం ద్వారా దీంట్లో గేమింగ్ అనుభూతి బాగా ఉండే అవకాశముంటుంది. రెండు జీబీల ర్యామ్ కూడా మల్టీటాస్కింగ్‌కు, గేమింగ్కూ దోహదపడే అంశమే. మైక్రోప్రాసెసర్ విషయానికొస్తే... అల్ట్రా క్యూ500లో 1.2 గిగాహెర్ట్జ్ క్లాకళ్స్పీడ్తో పనిచేసే బ్రాడ్‌కామ్ ప్రాసెసర్‌ను వాడారు. దీంట్లో కాలుగు కోర్లు ఉంటాయి. ఇంటర్నల్ మెమరీ 16 జీబీ దాకా ఉండగా, మైక్రోఎస్డీ కార్డు ద్వారా దీన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 8 ఎంపీ కాగా, దీంట్లోనే హెచ్డీ రికార్డింగ్, పనోరమా, జీయోట్యాగింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 2 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వాడకం కారణంగా బ్యాటరీ సామర్థ్యం 2500 మాత్రమే ఉన్నప్పటికీ ఏడు గంటల టాక్‌టైమ్, 300 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ధర రూ.12,999. -
బెంగళూరులో కామిక్ సంబరాలు
సాక్షి, బెంగళూరు : ఆర్కావతి లే అవుట్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజాకోర్టులో హాజరుకావాలని రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....ఆర్కావతి లే అవుట్ కోసం దాదాపు 16 గ్రామాల భూములను ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. ఆ సమయంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారని, సేకరించిన భూముల నుంచి దాదాపు 40 శాతం వరకు తిరిగి అభివృద్ధి పరిచిన భూములను రైతులకు అప్పగించాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అయితే ఇలా అభివృద్ధి చేసిన భూముల్లో నిర్మించిన ఇళ్లను రైతులకు కాకుండా ఇతరులకు కేటాయించడం వివాదాస్పదంగా మారిందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎన్ని విచారణలు జరిపినా అసలైన అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోలేక పోయారని విమర్శించారు. ఇక స్వతహా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నందున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలతో విచారణ చేయించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండబోదని అన్నారు. అందువల్ల ఆర్కావతి లే అవుట్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజా కోర్టులో హాజరుకావాలని డిమాండ్ చేశారు. భూములను పోగొట్టుకొని నష్టపోయిన రైతులు ప్రజాకోర్టులో అడిగే ప్రశ్నలకు సిద్ధరామయ్యే స్వయంగా సమాధానం చెప్పాలని కోరారు.