Gaming: గురి తప్పకుండా.. | Action Role Playing Survival Action And Adventure Game | Sakshi
Sakshi News home page

Gaming: గురి తప్పకుండా..

Published Fri, Jun 7 2024 10:29 AM | Last Updated on Fri, Jun 7 2024 2:39 PM

Action Role Playing Survival Action And Adventure Game

యాక్షన్‌ రోల్‌–ప్లేయింగ్‌ సర్వైవల్‌ గేమ్‌ వి రైజింగ్‌. ఒపెన్‌ వరల్డ్‌లో సెట్‌ చేసిన ఈ గేమ్‌ను అయిదు బయోమ్‌లుగా విభజించారు. కొత్తగా ఉనికిలోకి వచ్చిన రక్తపిశాచిని కంట్రోల్‌ చేయడం ప్లేయర్‌ పని. దీని కోసం రకరకాల సాధనాలను, ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

అంతేకాదు శత్రువుకు చిక్కని దుర్భేద్యమైన కోటను కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది. సూర్యకాంతి, నీడ, రక్తనమూన... ఇలా ఎన్నో అంశాలు ఈ ఆటలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ అడుగులో ప్రమాదం, నష్టం పొంచి ఉందో కనిపెట్టే  స్పృహ ఆటగాడిలో ఉండాలి. ఆటలో నాన్‌–ప్లేబుల్‌ క్యారెక్టర్లు(ఎన్‌పీసీ) కీలకం.

ప్టాట్ ఫామ్స్‌: విండోస్
ప్లేస్టేషన్‌: 5
జానర్స్‌: సర్వైవల్‌
మోడ్స్‌: సింగిల్‌–ప్లేయర్, మల్టీప్లేయర్‌

ఇవి చదవండి: భారత్‌లోకి ఎయిర్ టాక్సీ.. ధరలు ఎలా ఉంటాయంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement