New game
-
ది వార్ విత్ ఇన్! అడుగడుగునా అంతులేని ధైర్యం!
మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘వరల్డ్ క్రాఫ్ట్: ది వార్ విత్ఇన్’ ఈ నెల 26న విడుదల కానుంది. ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’కు ఎక్స్΄ాన్షన్ ప్యాక్‌గా వస్తున్న గేమ్ ఇది. 2004లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’లో ప్లేయర్ ‘క్యారెక్టర్ అవతార్’ను క్రియేట్ చేసి థర్ట్ లేదా ఫస్ట్–పర్సన్ వ్యూ నుంచి ఓపెన్ గేమ్ వరల్డ్‌ను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది.ఇక ‘ది వార్ విత్ఇన్’ విషయానికి వస్తే... ఈ గేమ్‌లో ఖాజ్ అల్గార్ అనేది ప్రైమరీ సెట్టింగ్. ది ఇజెల్ ఆప్ డోర్న్, ది రింగింగ్ డీప్స్, హాలోఫాల్, అజి–కహెట్ అనే నాలుగు జోన్లుగా విభజించబడి ఉంటుంది.ఈ గేమ్‌లో ‘డైనమిక్ ఫ్లైయింగ్’ అనే ఫీచర్ ఉంది. న్యూ గేమ్స్‌ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.సిరీస్: వార్‌క్రాఫ్ట్;ప్లాట్‌ఫామ్: విండోస్, మ్యాక్వోఎస్;మోడ్: మల్టీప్లేయర్జానర్: ఎంఎంఆర్పీజీ (మాస్వ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్) -
ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్..!
డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందించిన గేమ్ ఇది. ఒరిజినల్ మాదిరిగానే ఈ గేమ్‌లోని మూమెంట్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్(పివిఇ), ప్లేయర్ వర్సెస్ ప్లేయర్(పివిపి)గా విభజించబడి ఉంటాయి.‘పివిఇ’లో ఆరు–ప్లేయర్ రైడ్స్ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్ మోడ్ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్ ‘గార్డియన్’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.సిరీస్: డెస్టిని,ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: ఫస్ట్–పర్సన్ షూటర్, ఎంఎంవోజీమోడ్: మల్టీ ప్లేయర్ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం! -
Gaming: గురి తప్పకుండా..
యాక్షన్ రోల్–ప్లేయింగ్ సర్వైవల్ గేమ్ వి రైజింగ్. ఒపెన్ వరల్డ్‌లో సెట్ చేసిన ఈ గేమ్‌ను అయిదు బయోమ్లుగా విభజించారు. కొత్తగా ఉనికిలోకి వచ్చిన రక్తపిశాచిని కంట్రోల్ చేయడం ప్లేయర్ పని. దీని కోసం రకరకాల సాధనాలను, ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.అంతేకాదు శత్రువుకు చిక్కని దుర్భేద్యమైన కోటను కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది. సూర్యకాంతి, నీడ, రక్తనమూన... ఇలా ఎన్నో అంశాలు ఈ ఆటలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ అడుగులో ప్రమాదం, నష్టం పొంచి ఉందో కనిపెట్టే స్పృహ ఆటగాడిలో ఉండాలి. ఆటలో నాన్–ప్లేబుల్ క్యారెక్టర్లు(ఎన్పీసీ) కీలకం.ప్టాట్ ఫామ్స్: విండోస్ప్లేస్టేషన్: 5జానర్స్: సర్వైవల్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: భారత్‌లోకి ఎయిర్ టాక్సీ.. ధరలు ఎలా ఉంటాయంటే? -
Gaming: యుద్ధంలో ఒకరోజు...
ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటే ఆ ఉల్లాసమే వేరు. అందులో ఆ గేమ్ అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్‌ని కలిగి ఉంటే అబ్బో చెప్పనక్కర్లేదు. అలాంటి రకాలనే ఈ గేమ్ కూడా కలిగి ఉంది. మరి అదేంటో ఆడేద్దామా!రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ గేమ్ మెన్ ఆఫ్ వార్–2. 2011లో వచ్చిన మెన్ ఆఫ్ వార్: అసల్ట్ స్వా్కడ్ సీక్వేల్‌గా వస్తున్న ఈ గేమ్ వరల్డ్ వార్–2 నేపథ్యంలో సాగుతుంది. 2016లో వచ్చిన ‘మెన్ ఆఫ్ వార్’కు ఇది మోడ్రన్ రీమాస్టర్. లార్జ్ స్కేల్ టాంక్ కంబాట్ చేసే ప్లేయర్స్ కోసం స్కీమిష్ మోడ్ ఉంది.ఇంజిన్: జెమ్ 2ప్లాట్‌ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్జానర్స్: రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..! -
గేమింగ్ వరల్డ్‌కు.. పురాణ సౌరభం నింపిన ‘చిత్తం!’
చెన్నైకి చెందిన చరణ్య కుమార్‌కు గేమింగ్ అంటే ఎంతో ఇష్టమో, పురాణాలు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే పురాణాలలోని ఆసక్తికర అంశాలను, స్ఫూర్తిదాయకమైన విషయాలను గేమింగ్‌లోకి తీసుకువచ్చింది చరణ్య కుమార్. ఆమెప్రారంభించిన ‘చిత్తం’ గేమింగ్ కంపెనీ విజయపథంలో దూసుకుపోతోంది...యూఎస్‌లో ఇంజినీరింగ్ చేసిన చరణ్య కుమార్ ఎన్నో పెద్ద కంపెనీలలో కన్సల్టింగ్ విభాగంలో పనిచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యల వల్ల పురాణాలకు దగ్గరైంది. వాటిని చదవడం తనకు ఎంతో సాంత్వనగా ఉండేది. అమ్మమ్మ ద్వారా పురాణాలలోని గొప్పదనం గురించి చిన్న వయసులోనే విన్నది కుమార్.‘జీవితంలో ప్రతి సమస్యకు పురాణాల్లో సమాధానం దొరుకుతుంది’ అంటుంది కుమార్. ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకున్న కుమార్ ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘పురాణాలు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైనవి కాదు. పౌరాణిక విషయాలు నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా దారి చూపుతాయి. కష్టకాలంలో పురాణ పఠనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు సొంతంగా ఏదైనాప్రారంభించాలనే పట్టుదలను కూడా ఇచ్చింది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు ఎంబీఏ చేయడం’ అంటున్న కుమార్ గేమింగ్ కంపెనీ ‘చిత్తం’ రూపంలో తన కలను నెరవేర్చుకుంది.తక్కువప్రాడక్ట్లతో మొదలైన ‘చిత్తం’ మొదటి సంవత్సరంలోనే పదమూడుప్రాడక్ట్స్కు చేరుకుంది. ‘ఫన్’ ఎలిమెంట్స్‌ను జత చేస్తూ ‘చిత్తం’ రూపొందించిన గేమ్స్, యాక్టివిటీస్, బుక్స్ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ సామెతలను దృష్టిలో పెట్టుకొని ‘పార్టీ టాక్స్’ అనే గేమ్‌ను డిజైన్ చేశారు. ‘భరత విలాస్’ అనేది చిత్తం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ కార్డ్ గేమ్ మన సంస్కృతిలోని రకరకాల నృత్యరూపాలు, వంటల రుచులు... మొదలైన వాటిని వెలికితీస్తుంది.‘సింపుల్ గేమ్ ప్లే–సింపుల్ కంటెంట్ అనే రూల్‌ని నమ్ముకొని ప్రయాణంప్రారంభించాం. మా నమ్మకం వృథా పోలేదు’ అంటుంది చరణ్య. వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో ఫండింగ్ విషయంలో కాస్తో కూస్తో ఇబ్బంది పడినా ఆ తరువాత మాత్రం తనదైన ప్రత్యేకతతో ఇన్వెస్టర్లను ఆకర్షించి విజయపథంలో దూసుకుపోతోంది ‘చిత్తం’.ఇవి చదవండి: కాన్స్‌లో ఆ ముగ్గురు -
షూటింగ్ బాల్.. కొత్త ఆట గురూ..!
కొత్తవలస: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో షూటింగ్‌బాల్ క్రీడను పోత్రహించేందుకు ఆ అసోసియేషన్ నాయకులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 100 మంది షూటింగ్ బాల్ క్రీడాకారులు ఉన్నారని, గతేడాది జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పులిబంటి ప్రసాద్ తెలిపారు. షూటింగ్ బాల్ అంటే.. షూటింగ్ బాల్ అంటే ఒక కంటితో గురి చూసి గన్‌తో కాల్చాలని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వాలీబాల్‌ను పోలిన ఈ షూటింగ్ బాల్లో కూడా ప్రత్యర్థి కోర్టులోకి బంతిని టెక్నిక్‌గా కొట్టి పాయింట్లు సాధించడమే షూటింగ్ బాల్. చిత్తూరు జిల్లాలో ఆదరణ పొందుతున్న ఈ క్రీడ విజయనగరం జిల్లాలో కొత్త క్రీడగా అందరి ఆదరణ పొందుతూ వడివడిగా అడుగులు వేస్తోంది. 1976 నుంచి 39 సార్లు.. 1976 నుంచి ఇప్పటివరకూ ఈ క్రీడను జాతీయ స్థాయిలో 39 సార్లు నిర్వహించారు. మన రాష్ట్రం తొలిసారిగా 2018లో విజయవాడలో, 2019లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించారు. ఈ క్రీడను అభివృద్ధి చేసేందుకు షూటింగ్బాల్తో అనుబంధం ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడలను పోత్సహించే విద్యావేత్తలు కమిటీగా ఏర్పడి రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురామ్ ఆధ్వర్యంలో 13 జిల్లాలో అసోసియేషన్లు ఏర్పాటుచేశారు. విజయనగరం జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పులిబంటి ప్రసాద్‌ను నియమించారు. ఇతని ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా జే శివకృష్ణ, ఉపాధ్యక్షుడిగా సంతోష్, ట్రెజరర్‌గా పి.అచ్చియ్యమ్మ పనిచేస్తున్నారు. వాలీబాల్‌కు, షూటింగ్బాల్కు తేడాలు.. ♦వాలీబాల్‌లో 12 మంది క్రీడాకారులు ఉండగా ఆరుగురు ఆడుతూ ఆరుగురు స్టాండ్‌బైగా ఉంటారు. ♦షూటింగ్ బాల్లో 12 మంది ఉన్నప్పటికీ ఏడుగురు మాత్రమే కోర్టులో ఆడుతారు. ఐదుగురు స్టాండ్‌బైగా ఉంటారు. ♦వాలీబాల్‌లో 20 నుంచి 25 పాయింట్లు వస్తే విజేతగా ప్రకటిస్తారు. ♦షూటింగ్ బాల్లో కేవలం 15 పాయింట్లు మూడు సెట్లలో రెండు సెట్లు ఎవరు గెలిస్తే వారే విజేతగా ప్రకటిస్తారు. ♦వాలీబాల్‌లో బాల్ ఒకచేతి వేళ్లతోనే కొట్టి పాయింట్లు సాధిస్తే, షూటింగ్ బాల్లో బంతిని రెండుచేతులతో పాస్‌చేస్తూ వేళ్లు అరచేతులు తాకకుండా చూసుకోవాలి. ♦16 ఏళ్లు నిండిన వారిని సబ్జూనియర్స్గా, 19 ఏళ్లు నిండిన వారిని జూనియర్స్‌గా, ఆపై వారిని సీనియర్స్‌గా పరిగణిస్తారు. ♦వాలీబాల్ కంటే షూటింగ్ బాల్ ఆట సమయం పరిమితంగా ఉంటుంది. ♦వాలీబాల్ కంటే షూటింగ్ బాల్ కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా వాలీబాల్కంటే షూటింగ్‌బాల్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మా కళాశాలలో తొలిసారిగా ఆడించినప్పుడు బాల్ విసురుకోవడం ఏంటా అని అనుకున్నాను. గేమ్ నేర్చుకున్న తరువాత తెలిసింది దీని విలువ ఏంటో. గతేడాది మా కళాశాల నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా చాలా సులువుగా నేర్చుకోవచ్చు. –కే గణేష్, షూటింగ్‌బాల్ క్రీడాకారుడు, ప్రగతి వ్యాయామ కళాశాల ఎంపీఈడీ విద్యార్థి, కొత్తవలస మండలం అవకాశాలు ఎక్కువ దేశంలో క్రీడామంత్రిత్వశాఖ గుర్తించిన అన్ని క్రీడలతో సమానంగా షూటింగ్బాల్కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో దీనిపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వ్యాయామ విద్యలో షూటింగ్బాల్ను భాగం చేయాలని ప్రభుత్వాన్ని మా పెద్దలు ఇప్పటికే కోరారు. –పి.ప్రసాద్, షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి