కంప్యూటర్ గేమ్ ఆడుతున్న కేటీఆర్ కుమారుడు హిమాన్షు. పక్కన కుమార్తె అలేఖ్య, గేమర్ కనెక్ట్‌లో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఐటీ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ‘గేమర్ కనెక్ట్’ డెమోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గేమింగ్ ఇండస్ట్రీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల రెవెన్యూ వస్తుండగా, మన దేశంలో 1.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ మాత్రమే వస్తుందన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని నగరాలు గేమింగ్ రంగంలో మరింత రాణించాల్సి ఉందన్నారు. మౌలిక వసతులు ఉన్న హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గేమింగ్ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాలసీ రూపొందించిందని చెప్పారు.
గేమింగ్‌లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎన్‌వీడియా మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ దూపర్ చెప్పారు. ఈ స్పోర్ట్స్‌లో 2.75 మిలియన్ డాలర్ల వింబుల్డన్ ప్రైజ్‌మనీ ఉందన్నారు. హైదరాబాద్‌లో గేమింగ్ కనెక్ట్‌కు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. గేమ్ ప్లేయర్స్‌గా కాకుండా గేమ్ డెలపర్స్, యానిమేటర్స్, స్టోరీ ప్లేయర్స్, ఈ స్పోర్ట్స్ ప్రొఫెషనల్ ప్లేయర్స్‌గా ఎదిగేందుకు యువతకు అవకాశం ఉందని ఎన్‌వీడియా మార్కెటింగ్ ఇండియా హెడ్ వంశీ కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో డెల్ కంజ్యూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్, జుటాక్ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ కెన్హో, ఎల్‌జి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ ఉంచుల్ పార్క్ తదితరులు పాల్గొన్నారు. స్టేజిపై నిలుచుని తలకు వీఆర్ గ్లాస్ పెట్టుకున్న కేటీఆర్.. తనకు నిజంగా ఎవరెస్ట్ ఎక్కిన అను భూతి కల్గిందన్నారు. మంత్రి కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య కార్యక్రమంలో సందడి చేశారు.
గేమింగ్‌పై అవగాహన...
ఎన్‌వీడియా, డెల్, ఎల్‌జీ, జుటాక్, హైపర్‌ఎక్స్, కూలెక్స్ మాస్టర్ తదితర 8 కంపెనీలు గేమర్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కోల్‌కతా, అహ్మదాబాద్, కొచ్చిన్, లక్నోలలో నిర్వహించారు. యువతకు గేమింగ్ రంగంపై అవగాహన కల్పిస్తున్నారు. యువతకు డెమోలో రేసింగ్, జాంబీగేమ్స్, ఈ స్పోర్ట్స్‌లో పలు గేమ్స్‌ను చూపించి అనుభవాలను పంచుతారు. దాదాపు 28 డెమో స్టేషన్స్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment