హన్మకొండ బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర పురపాలక, పరి శ్రమల, ఐటీ, చేనేత శాఖ మంత్రి కల్వ కుంట్ల తారక రామారావు అన్నారు. ప్రా జెక్టులు, ఉద్యోగాల నోటిఫికేషన్లు, కాం ట్రాక్టు కార్మికుల రెగ్యులరైజ్.. ఏం చేద్దా మన్నా కాంగ్రెస్ నేతలు ఏదో వంక చూపి అడ్డం పడుతున్నారని విమర్శించారు. వరంగల్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘ఏనుగు పోతుంటే అవేవో మొరుగుతుంటాయి. కొంత మంది ఒర్రుతనే ఉన్నరు.... అడ్డుకుం టరట... అడ్డుకునుడు, బెదిరించుడు మస్తుగ జూసినం. నేను ఇక్కడనే జైలుకు కూడా పోయిన, వీటికి భయపడేది లేదు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. యాభై ఏళ్లుగా దేశాన్ని ఏలినోళ్లు... వాళ్ల హయాం లో ఏమీ చేయక ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరి గారు. అమ్మపెట్టదు.. అడుక్క తినని వ్వదు అన్నట్టు... ఈ రోజు జరిగే అభి వృద్ధిపై పసలేని, పనిలేని విమర్శలు చేసే కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలకు మనం జవాబుదారీ కాద ని కేటీఆర్ అన్నారు. ప్రజలే మాకు బాసులు, వాళ్లకే మేము జవాబుదారీ అన్నారు.
కొత్త పరిశ్రమలు
వరంగల్– హైదరాబాద్ మధ్య ఇండ స్ట్రియల్ కారిడార్ నెలకొల్పబోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్– వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగం గానే వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు, ఐటీ టవర్స్‌ను నెలకొల్పుతు న్నా మన్నారు. దీంతో పాటు జనగామలో ఫుడ్ ఇండస్ట్రీ, భువనగిరిలో ప్లాస్టిక్ పరిశ్రమలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. వరంగల్‌లో ఐటీ పార్కుకు రెండు పెద్ద కంపెనీలు త్వర లో రాబోతున్నాయని చెప్పారు. ఈ రెండు కంపెనీలను తానే ప్రారంభిస్తానన్నారు. వరంగల్ పర్యాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ సైతం ఇప్పి స్తామన్నారు. భద్రకాళి, వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్, రామప్ప, లక్నవరం వంటి అనేక పర్యాటక ప్రాంతాలు వరంగల్ కేం ద్రంగా ఉన్నాయన్నారు. వ్యాపార వేత్తలు, పర్యాటకులు ఇక్కడికి నేరుగా వచ్చేందుకు వీలుగా మామునూరు ఎయిర్ పోర్టును పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తామన్నారు.
నేతన్నలకు అండగా..
నేతన్నలకు ఉపాధి కల్పించే విధంగా జూన్ 24న యాదాద్రి జిల్లా పోచంపల్లిలో నేతన్న చేయూతకు కార్యక్రమాన్ని ప్రారంభించా మన్నారు. చేనేత మిత్ర పథకం ద్వారా సొసైటీల మీద ఆధారపడకుండా నేతన్న లకు నూలు, రసాయనాలు, అద్దకాల మీద 50 శాతం సబ్సిడీ అందించను న్నట్లు తెలి పారు. ఈ పథకాలతో రాష్ట్రంలో 40 వేల కుటుంబాల జీవనోపాధి మెరుగుపడను న్నట్లు వివరించారు. అంతే కాకుండా, త్వరలో గద్వాలలో 47 ఎకరాల్లో 15 కోట్ల తో హ్యాండ్లూమ్ పార్కు, వరంగల్ టెక్స్ టైల్ పార్కుతో, మహబూబ్‌నగర్, సిరి సిల్లలో నేతన్నలకు హ్యాండ్లూమ్ పార్కులు ఏర్పాటుచేసి వారికి అండగా నిలు స్తామన్నారు.
వరంగల్‌లో క్రికెట్ స్టేడియం
వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడి యం నిర్మించాలంటూ ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి కోరగా.. స్థల సేకరణ చేసి అవసరమైన భూమిని అప్పగిస్తే రూ.25 కోట్లతో వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ప్రభుత్వ సలహా దారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వివేక్ హామీ ఇచ్చారు. అం తకుముందు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ కష్టపడి సాధించిన తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసేందుకు భావసారూప్యత కలిగిన వ్యక్తులను పార్టీలో చేర్చుకుంటున్నామన్నారు.
రూ.101 కోట్ల పనులకు..
వరంగల్ నగరంలో కేటీఆర్ సుడిగాలి పర్య టన చేశారు. నగరం మొత్తం తిరిగారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో రూ.101 కోట్ల వ్యయంతో చేపడుతున్న వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పద్మాక్షి దేవాలయం జంక్షన్ అభివృద్ధి, హన్మకొండ బస్టాండ్ నుంచి హంటర్ రోడ్ రహదారి, భద్రకాళి దేవాలయం కమాన్, అలంకార్ బ్రిడ్జి నుంచి రోడ్ నంబర్ 2 రహదారి, భద్రకాళి దేవాలయం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు మొత్తం నాలుగు రహదారులు, కాకతీయ మ్యూజి కల్ గార్డెన్, పబ్లిక్ గార్డెన్, ఏకశిల పార్కు లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గేట్స్– మిలిందా ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో నిర్మించిన ట్రీట్‌మెంట్ ప్లాంటును ప్రారంభించారు. అంతకుముందు చేనేత మిత్ర పథకాన్ని వరంగల్‌లో ప్రారంభించారు.
నేరుగా రైతన్నల ఖాతాలోకి సబ్సిడీలు...
చేనేత మిత్ర ద్వారా అందే సబ్సి డీని సొసైటీలకు కాకుండా నేరుగా నేత కార్మికుల ఖాతాలోకి చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందిం చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో ముఖ్య మంత్రి రోశయ్య చీరాల నుంచి ప్రాతినిధ్యం వహించి నేతన్న రుణమాఫీకి రూ.300 కోట్లు కేటాయించగా.. ఆ డబ్బులు సొసైటీల పాలయ్యాయే తప్ప కార్మికులకు అందలేదన్నారు. వారికి ఒరిగిన ప్రయోజనం శూన్యమన్నారు. ఏ కార్యక్రమం రూపొందించినా నేతన్న లకు అందే విధంగా వేతనాలు, ఉపాధి కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నా మన్నారు.
15.65 కోట్ల వ్యక్తిగత రుణాల మాఫీ
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సమస్యలను పరిష్కరించే దిశలో వ్యక్తిగత రూ. లక్ష రుణాలు తీసుకున్న 3 వేల మంది చేనేత కార్మికులకు సంబంధించిన రూ.15.65 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్‌తో సమావేశం నిర్వ హించి చేనేత రంగానికి సంబంధించి 10.65 లక్షలు, పవర్‌లూమ్‌కు సంబంధించి రూ. 5 కోట్ల రుణమాఫీ చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment