గాంధీనగర్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. మరో 15 మందిపైగా జనం జాడ తెలీడంలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనను సూమోటోగా స్వీకరించిన గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
‘‘అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ నిద్ర పోతున్నారు? మాకు గుజరాత్ ప్రభుత్వంపై మీద ఏ కోశానా కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ‘‘ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న రెండు గేమింగ్ జోన్లను గత రెండు దశాబ్దాలుగా రాజ్‌కోట్‌లో నిర్వహింస్తున్నారు. వాటి నిర్వహణకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. ఫైర్ సేఫ్టీ అనుమతి పత్రాలు కూడా లేవు. అందుకే గుజరాత్ ప్రభుత్వం పట్ల కొంచం కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘రెండున్నరేళ్ల నుంచి రాజ్‌కోట్ గేమింగ్ జోన్ నడుస్తోంది. ప్రభుత్వం కళ్లు ముసుకుందని మేము అనుకోవాలా? అసలు అధికారులు ఏం చేస్తున్నారు?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. గేమింగ్ జోన్‌కు సంబంధించిన ఫొటోలను చూపించిన రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కూడా హైకోర్టు మండిపడింది. ‘‘ఈ అధికారులంతా ఎవరూ? అక్కడికి వారంతా ఆడుకోవడానికి వెళ్లారా?’’ అని కోర్టు విమర్శించింది. ‘‘అంతపెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీకు కంటి చూపు పోయిందా? లేదా నిద్రపోతున్నారా? ఇంత జరిగాక మాకు స్థానిక వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజ్‌కోట్‌లోని మనా-మవా ప్రాంతంలో ఉన్న టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 33 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గేమింగ్ జోన్‌లో వెల్డింగ్ పనులు జరగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment