గాంధీనగర్: రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌కు చెందిన ఒక సహ యజమాని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. శనివారం టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి టీఆర్‌పీ గేమ్‌జోన్ ఓనర్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యజమానుల్లో ఒకరైన ప్రకాశ్ హిరాన్ అదే అగ్ని ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి తన సోదరుడు కనిపించడం లేదని ప్రకాశ్ హిరాన్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్లు కూడా స్వీచ్ ఆఫ్ వస్తున్నాయిని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలోనే ప్రకాశ్ కారు ఉన్నట్లు జితేంద్ర పోలీసులకు తెలిపారు.
దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ప్రకాశ్ ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో డీఎన్‌ఏ టెస్ట్ చేసిన అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారిలో తన సోదరుడిని కనిపెట్టాలని జీతేంద్ర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్ తల్లి డీఎన్‌ఏను తీసుకుని మృతదేహాలతో పోల్చి ప్రకాశ్ హిరాన్ మృతి చెందినట్లు ప్రకటించారు.
టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో ప్రకాశ్ హిరాన్ ప్రధానమైన షేర్ హోల్డర్‌గా ఉన్నారు. టీఆర్‌పీ గేమ్‌జోన్‌ను నిర్వహిస్తున్న ధావల్ ఠాకూర్‌తోపాటు మరో ఐదుగురిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో రేస్‌వే ఎంటర్‌ప్రైజెస్ పార్ట్‌నర్లు యువరాజసింగ్, రాహుల్ రాథోడ్, టీఆర్‌పీ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment