prakash
-
బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తిరుపతి ప్రకాశ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్ స్టార్ హీరోలైనా నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, బాలయ్య, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్స్ అందరితో కలిసి పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తప్ప దాదాపు అందరితో సినిమాలు చేశానని వెల్లడించారు. ప్రస్తుతం సీరియల్స్‌లో చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ కెరీర్లో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు.తాను సినిమాల్లో నటించే రోజుల్లో బండ్ల గణేశ్, తాను ప్రాణ స్నేహితులమని ప్రకాశ్ తెలిపారు. ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని పేర్కొన్నారు. అయితే బండ్ల గణేశ్ నిర్మాత అయ్యాక ఆయన సినిమాల్లో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓ సినిమాకు డేట్స్ తీసుకుని నాకు అబద్ధం చెప్పారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.తిరుపతి ప్రకాశ్ మాట్లాడుతూ..'బండ్లగణేశ్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు. దాదాపు 60 రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు. రోజుకు 15 వేల పారితోషికం ఖరారు చేసుకున్నా. దీంతో వేరే సినిమాలకు నో చెప్పా. వినాయకచవితి పండగ మరుసటి రోజే కేరళలోని పొల్లాచ్చికి వెళ్లాలి. కానీ షూట్‌కు బయలుదేరాల్సిన ముందురోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది. భారీ వర్షాలతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. దీంతో షాక్ తిన్నా. మూడు సినిమాలు వదిలేశా. మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా. సరిగ్గా పది రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. వెంటనే రాజమండ్రికి వెళ్లా. అక్కడ రోలర్ రవి నన్ను కలిశాడు. ఏం ప్రకాశ్ అన్న మంచి సినిమా వదిలేశావ్ అన్నాడు. ఏ సినిమా అని అడిగా. కల్యాణ్ బాబు మూవీ అన్నాడు. వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా. కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లు తెలిసింది. అప్పుడు నాకు బండ్ల గణేశ్‌పై కోపం వచ్చింది. ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశాడు. అవును అని చెప్పి వెంటనే పెట్టేశా' అని అన్నారు. -
కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్‌పై ఫోర్జరీ కేసు..
బంజారాహిల్స్: కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్‌తో పాటు మరో 5 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోర్జరీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–70లోని అశ్వని లేఅవుట్, ప్రశాసన్‌నగర్‌లో నివసించే జి.అరి్మతారెడ్డి అప్పటి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ హిమాయత్‌నగర్ బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా ఆమెకు హౌసింగ్ లోన్ మంజూరయ్యే సమయానికి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ కోటక్ మహేంద్ర బ్యాంక్‌లో విలీనమైంది. తనకు రుణం మంజూరైందని సమాచారంఅందడంతో ఆమె కోటక్ మహేంద్రబ్యాంక్ సోమాజీగూడ బ్రాంచ్‌ను ఆశ్రయించగా అక్కడి బ్యాంక్ అధికారులు ఆమె నుంచి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో వడ్డీ రేటు ఒక రకంగా చెప్పి ఆ తర్వాత అదనపు వడ్డీ రేట్లను నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు తెలియకుండా వేశారు. ఉద్దేశపూర్వకంగా పోర్జరీ డాక్యుమెంట్లతో ఒప్పందాలను ఉల్లంఘించి తనను మోసం చేశారంటూ బాధితురాలు 2020 జనవరి 7న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె 17వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజి్రస్టేట్ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్, సోమాజీగూడ బ్రాంచ్ మేనేజర్ జే ప్రదీప్‌కుమార్, హిమాయత్‌నగర్ రీజనల్ మేనేజర్ ఎన్.ప్రశాంత్‌కుమార్, సోమాజీగూడ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్రన్, బ్యాంక్ అధికారి సుదీర్, ఉద్యోగి గుత్తా ఈశ్వర్లపై కేసు నమోదు చేశారు. తాను ఈ లోన్ కోసం ఎన్నోసార్లు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగా తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. తన నుంచి ఖాళీ పేపర్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్న అధికారులు ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదన్నారు. తన నుంచి బౌన్స్ చార్జెస్ అక్రమంగా వసూలు చేశారన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ సాధ్యం కాదు
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను తుమ్మిడిహెట్టి కోణంలో కాకుండా మూడు తరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ చేశారనే కోణంలో నిర్వహించాలని కోరారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట శనివారం ఆయన స్వచ్ఛందంగా హాజరై తన వాదనలను వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ కడితే 5 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోవచ్చని, అయితే మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుతో కట్టడానికి మాత్రమే అంగీకారం తెలపడంతో 1.8 టీఎంసీలకు మించి నిల్వ చేసుకోవడానికి వీలు ఉండదని ప్రకాశ్ చెప్పారు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో ఎగువ రాష్ట్రాలు వాడుకోని 63 టీఎంసీలూ ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ కమిషన్‌ను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ‘వీ’ఆకృతిలో బరాజ్ ఎక్కడా లేదు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తే వార్దా–వెన్‌గంగా నదులు కలిసే చోట ‘వీ’ఆకృతిలో బరాజ్ వస్తుందని, ప్రపంచంలో ఎక్కడా ‘వీ’ఆకృతిలో బరాజ్ లేదని స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలంలో చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతం ఉందని, రూ.7,500 కోట్లు వెచ్చించినా తుమ్మిడిహెట్టితో ఆశించిన ప్రయోజనం ఉండదని చెప్పారు. నిజాం హయాంలో తెలంగాణ ప్రాంతంలో 9 ప్రాజెక్టులు ప్రతిపాదించగా, అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి చొరవతో అందులో సాగర్, శ్రీరాంసాగర్లను మాత్రమే నిర్మాణం చేపట్టారని, అవి కూడా అసంపూర్తిగా కట్టారని తెలిపారు. 57 ఏళ్లలో తెలంగాణ నాశనం అయిందని, ఈ కారణంగానే జలయజ్ఞం ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టినట్టు వివరించారు. కాగా బరాజ్ కుంగడానికి కారణాలను తెలుపుతూ ఈ నెల 26లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించగా 28న సాక్ష్యాధారాలతో సహా నివేదిక ఇస్తానని ప్రకాశ్ వెల్లడించారు. -
రాజ్‌కోట్ గేమ్‌జోన్: మిస్సింగ్ అనుకున్నారు.. ప్రకాశ్ కూడా మృతి
గాంధీనగర్: రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో టీఆర్పీ గేమ్‌జోన్‌కు చెందిన ఒక సహ యజమాని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. శనివారం టీఆర్పీ గేమ్‌జోన్‌లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి టీఆర్పీ గేమ్‌జోన్ ఓనర్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యజమానుల్లో ఒకరైన ప్రకాశ్ హిరాన్ అదే అగ్ని ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి తన సోదరుడు కనిపించడం లేదని ప్రకాశ్ హిరాన్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్లు కూడా స్వీచ్ ఆఫ్ వస్తున్నాయిని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలోనే ప్రకాశ్ కారు ఉన్నట్లు జితేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ప్రకాశ్ ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేసిన అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారిలో తన సోదరుడిని కనిపెట్టాలని జీతేంద్ర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్ తల్లి డీఎన్ఏను తీసుకుని మృతదేహాలతో పోల్చి ప్రకాశ్ హిరాన్ మృతి చెందినట్లు ప్రకటించారు. టీఆర్పీ గేమ్‌జోన్‌లో ప్రకాశ్ హిరాన్ ప్రధానమైన షేర్ హోల్డర్‌గా ఉన్నారు. టీఆర్పీ గేమ్‌జోన్‌ను నిర్వహిస్తున్న ధావల్ ఠాకూర్‌తోపాటు మరో ఐదుగురిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో రేస్‌వే ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్లు యువరాజసింగ్, రాహుల్ రాథోడ్, టీఆర్పీ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ ఉన్నారు. -
రోజు మాదిరిగానే.. సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరుతుండగా..
మహబూబ్‌నగర్: సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరిన ఓ విద్యార్థిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈవిషాదకర ఘటన కృష్ణా మండలం ఆలంపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఆలంపల్లికి చెందిన కావలి హన్వేష్ కుమారుడు ప్రకాష్ (14) కున్సి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే గురువారం సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరగా.. గ్రామ సమీపంలో పత్తి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రకాష్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘట నా స్థలానికి చేరుకొని కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థులకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు వాపోయారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవి చదవండి: హడలెత్తిస్తున్న ఏనుగు.. దాడిలో ఇద్దరి రైతుల విషాదం! -
వివాహేతర సంబంధంతో.. ప్రియురాలి మోజులో.. భార్యను కిరాతకంగా..
సాక్షి, హైదరాబాద్/వికారాబాద్: ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధారూరు సీఐ రామకృష్ణ, బంట్వారం ఎస్ఐ ఆనంద్ వెల్లడించారు. బంట్వారం మండలం వెంకటాపూర్‌కు చెందిన ప్రకాశ్.. గత నెల 25న తన భార్య జగ్గమ్మతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యామని, బైక్ అదుపుతప్పి గుంతలో పడగా జగ్గమ్మ తలకు గాయమై చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. మృతురాలి బంధువులు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నాడు. తనకు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో జగ్గమ్మ తనను నిత్యం వేధించేదని చెప్పాడు. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనే పథకం వేశాడు. ఉద్దేశపూర్వకంగా బైక్‌ను గుంతలో పడేసి జగ్గమ్మ తలపై బండరాయితో మోది హత్యచేశాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించి.. పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు. ఇవి చదవండి: హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి.. -
మరాఠా రిజర్వేషన్ల పోరాటం.. ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు..
ముంబై: మహారాష్ట్రలో రిజర్వేషన్ ఉద్యమ నిరసనలు హింసకు దారి తీశాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని నిరసనకారులు ముట్టడించారు. మరాఠా కోటా డిమాండ్ నేపథ్యంలో బీద్ జిల్లాలోని ఎమ్మెల్యే నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బిల్డింగ్ వద్ద ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంటి సమీపంలోని కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రకాశ్ సోలంకి ఇంటి వద్ద భారీగా మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చుట్టుపక్కలా ప్రాంతమంతా దట్టమైన మంటలు వ్యాపించాయి. కాగా ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు, తెలిపారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు. అయితే మరాటా రిజర్వేషన్ల ఉద్యమం గురించి సోలంకే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటిపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ గత అయిదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సోలంకే ఈ దీక్షపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరాఠా రిజర్వేషన్ సమస్యను పిల్లల ఆటగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు ఆగ్రహంతో రగిలిపోయి.. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. చదవండి: ఈడీ ఎదుటకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు #WATCH | Beed, Maharashtra: Maratha reservation agitators vandalised and set the residence of NCP MLA Prakash Solanke on fire. pic.twitter.com/8uAfmGbNCI — ANI (@ANI) October 30, 2023 -
NCP ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
-
ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
-
టోఫెల్ తర్ఫీదుకు కీలక అడుగు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ‘టోఫెల్ సర్టిఫికేషన్’కు సన్నద్ధం చేయడంలో భాగంగా ‘లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి టోఫెల్ శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్, ఈ–కంటెంట్‌ను ఉచితంగా అందించడంతో పాటు, ఉపాధ్యాయులు, అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే మూడో తరగతి నుంచి తొమ్మిది వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రోజుకు గంట పాటు టోఫెల్ శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు. విద్యార్థుల్లో లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పెంపు, వివిధ దేశాల్లో ఇంగ్లిషు మాట్లాడే తీరును అర్థం చేసుకుని.. తిరిగి జవాబు ఇచ్చేలా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఎస్సీఈఆర్టీ ద్వారా మెటీరియల్ తయారు చేశామన్నారు. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ ఏజెన్సీ మెటీరియల్ అవసరాన్ని గుర్తించి లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకుని లిక్విడ్ సంస్థ ఉచితంగా మెటీరియల్ ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సమగ్ర శిక్ష పీడీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. వాస్తవానికి టోఫెల్ సర్టిఫికేషన్ కోసం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్విసెస్(ఈటీఎస్)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా.. విద్యార్థులను టోఫెల్ పరీక్ష కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్థల నుంచి టెండర్లు పిలిచినా.. శిక్షణ ప్రక్రియ ప్రారంభించేందుకు సమయం లేదన్నారు. అందుకే ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే లిక్విడ్ ఇచ్చే కంటెంట్ వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది టెండర్లు పిలిచి కంటెంట్ ఖరారు చేస్తామని వివరించారు. తరగతి గదుల డిజిటలైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రవీణ్‌ప్రకాశ్ చెప్పారు. ఇందులో భాగంగానే 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షల మంది ఆంగ్ల మాధ్యమం అభ్యసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో తొలిసారిగా సైన్స్, సోషల్ సైన్స్, గణితం సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యం పెంపొందించడంలో భాగంగా బైజూస్ ద్వారా ఉత్తమ కంటెంట్ అందిస్తోందన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌ను ఇన్స్టాల్ చేసి 5.18 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసిందని వెల్లడించారు. నాడు–నేడులో భాగంగా పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ), ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలతో తరగతి గదులను డిజిటలైజ్ చేసిందని చెప్పారు. డిసెంబర్ నాటికి మొత్తం తరగతి గదుల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో డిజిటల్ బోధనలు ప్రవేశపెడతామని వివరించారు. అంతర్జాతీయంగా గుర్తింపు నోయిడాకు చెందిన లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్.. కామన్ యూరోపియన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రిఫరెన్స్(సీఇఎఫ్ఆర్)తో పాటు బ్రిటీష్ కౌన్సిల్, పియర్సన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, మాక్మిలన్, ఆదిత్య బిర్లా ఫౌండేషన్, పబ్లిషింగ్ కంపెనీలకు విశ్వసనీయ సేవలందిస్తోంది. విద్యార్థుల తరగతి, వయస్సును బట్టి ఈ కంటెంట్‌ను తయారు చేసి అందిస్తోంది. కెయిర్న్ ఇండియా, అలహాబాద్ యూనివర్సిటీ, ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్, ఫ్రాంక్ఫిన్, గ్లోబల్ లాజిక్, ఇండియన్ మిలిటరీ అకాడమీ, జెట్‌కింగ్, ఒడిశా మోడల్ ట్రైబల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వంటి అనేక మందికి సేవలందిస్తోంది. -
100 జీఈఆర్‌ను నిజాయితీగా సాధించాలి
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా బనగానపల్లి గ్రామ సచివాలయం పరిధిలో వలంటీర్లు 100% విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించారని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. నంద్యాల జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన పలు పాఠశాలల పనితీరును పరిశీలించారు. బనగానపల్లిలోని వలంటీర్లు తమ పరిధిలోని గృహాల్లో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదు చేయించారు. దీంతో ఈ వలంటీర్లకు యాప్ ద్వారా బ్యాడ్జి వచ్చిది. వీరు తమ పరిధిలో ఒకటికి రెండుసార్లు డేటాను పరిశీలించి.. ‘నా సర్వే సరైంది.. ఇది నా చాలెంజ్.. మిషన్ జీఈఆర్ 100 శాతం ఆంధ్రా’ అనే క్యాప్షన్‌తో బ్యాడ్జి స్క్రీన్‌షాట్‌ను వారి వాట్సాప్ స్టేటస్‌లో ఉంచారు. వీరి సవాలును స్వీకరించిన మిగతా 60 వేల మంది వలంటీర్లు కూడా తమ పరిధిలోని డేటాను మరోసారి తనిఖీ చేసి, వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. నూరు శాతం జీఈఆర్‌ను నిజాయితీ, నిబద్ధతతో సాధించాలన్నారు. -
విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు అన్ని యాజమాన్యాల్లోని విద్యార్థుల వివరాలను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో నమోదు చేసేలా కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు అందించిన విద్యార్థుల వివరాలను అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరించాలన్నారు. ఇప్పటికే వలంటీర్లు చేసిన సర్వే ప్రకారం18 లక్షల మంది విద్యార్థుల పేర్లు ఇంకా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో అప్డేట్ కాలేదన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రారంభించి బుధవారానికి వంద రోజులు అవుతున్నందున అన్ని స్కూళ్ల హెచ్ఎంలు అప్లోడ్ చేసేలా కలెక్టర్లు తీసుకోవాలన్నారు. విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. -
కాటేస్తున్న కల్తీ కల్లు.. వణికిపోతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కల్తీ కల్లు ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరుకి చెందిన హరిజన ఆశన్న (58) మృతిచెందగా.. బుధవారం మరో మహిళ, మరో యువకుడు మరణించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స చేసినా ఫలితం లేక.. మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్ (29) ఈ నెల ఏడో తేదీన వింతగా ప్రవర్తిస్తూ జిల్లా ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం వెంటనే అతడిని వైద్యులు ఇంటికి పంపించారు. అయితే తెల్లారి కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో బంధువులు మళ్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచీ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. విష్ణుప్రకాశ్ భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో పోస్టల్ శాఖ ఏబీపీఎంగా ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చిన్నతనంలోనే చనిపోగా.. తపాలా శాఖలోనే పనిచేసే తండ్రి కూడా కొన్నాళ్ల క్రితమే మరణించాడు. తండ్రి స్థానంలో విష్ణుప్రకాశ్ ఉద్యోగంలో చేరాడు. అయితే అతనికి పెళ్లి కాకపోవడం, ఒంటరితనంతో మందు కల్లుకు బానిస అయినట్లు తెలుస్తోంది. అయితే ఫిట్స్ (మూర్ఛ) రావడంతో విష్ణుప్రకాశ్‌ను ఆస్పత్రిలో చేర్పిం చగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని మేనత్త భువనేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్ రూరల్ మండలం దొడ్డలోనిపల్లికి చెందిన రేణుక (55) కూడా బుధవారం రాత్రి మృతి చెందింది. మరోవైపు జడ్చర్ల మండలం మల్లెబోనిపల్లికి చెందిన రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. కాగా జనరల్ ఆస్పత్రిలోని సాధారణ వార్డుల్లో మరో పది మంది వరకు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో మెటబాలిక్ ఎన్సెఫలోపతి లక్షణాలు ఉన్నాయని.. పోస్టుమార్టం అనంతరం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తెలిపారు. ఆస్పత్రిలో చేరాలంటే చెప్పినట్లు వినాలి..! కల్తీ కల్లు అలవాటుతో మహబూబ్‌నగర్ మండలంలోని దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లి, కోయనగర్, అంబేడ్కర్ నగర్ కాలనీలతో పాటు జడ్చర్ల, నవాబ్‌పేట మండలాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వ చ్చారు. తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు వారిలో ఉ న్నాయి. ఇది గమనించిన వైద్యులు బాధితులతో వచ్చి న సహా యకులకు ముందస్తు సూచనలు చేసినట్లు సమాచారం. ‘ఎవరడిగినా కల్తీ కల్లు కాదు.. ఎండదెబ్బ తాకింది.. కడుపునొప్పి, ఫిట్స్‌తో వచ్చి నట్లు చెప్పాలి.. అలా అయితేనే చికిత్స అందజేస్తాం.. లేకుంటే వేరే హాస్పిటల్‌కు వెళ్లొచ్చు..’అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆశన్న, విష్ణుప్రకాశ్ బంధువులు కూడా డాక్టర్ల సూచన మేరకే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బాధితులు! కల్తీ కల్లుకు అలవాటు పడిన పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది 40 నుంచి 50 మంది వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చేరితే బయటకు తెలుస్తుందని.. పరువు పోతుందనే కారణంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. -
కొత్త ఇంటికి! హీరో మహేశ్‌బాబు.. ఎందుకంటే?
హీరో మహేశ్‌బాబు కొత్త ఇంటికి వెళ్లనున్నారట. అయితే ఇది ఆయన నటిస్తున్న తాజా చిత్రం కోసమే. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌లో షురూ కానుందని తెలిసింది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన ఓ ఇంటి సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. -
ప్రకాష్‌ను చంపేందుకు స్వామిజీతో కలిసి నాగమణి స్కెచ్.. క్షుద్రపూజలు!
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వంకరకుంటలో సంచలనం రేకెత్తించిన గుప్త నిధుల తవ్వకాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్ వెల్లడించారు. ఏం జరిగిందంటే.. నల్లమాడ పోలీసు సర్కిల్ పరిధిలోని వంకరకుంట గ్రామానికి చెందిన రైతు వెంకటాద్రి పొలంలో గుప్త నిధుల కోసం ఈ నెల 14న కొందరు తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై రైతు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు అప్పట్లో నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ యశ్వంత్ పర్యవేక్షణలో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి లోతైన దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పట్టుబడింది వీరే.. గుప్త నిధుల తవ్వకాల కేసులో పట్టుబడిన వారిలో ఖమ్మం నివాసి నిజాముద్దీన్, నల్లమాడ మండలం చెరువు వాండ్లపల్లికి చెందిన శివశంకరరెడ్డి, నరేంద్ర రెడ్డి, హైదరాబాద్ నివాసి శ్రీనివాసులు, పుట్టపర్తికి చెందిన విజయ్, తమిళనాడుకు చెందిన చాంద్‌బాషా, మురుగన్, సురేష్, అనంతపురానికి చెందిన ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ భార్య నాగమణి ఉన్నారు. వీరి నుంచి గుప్త నిధుల తవ్వకానికి వినియోగించిన ఇనుపరాడ్లు, బండను తొలగించేందుకు ఉపయోగించే 20/30 పౌడర్, పూజకు వినియోగించిన ముడుపు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇదే కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. హత్య కుట్ర వెలుగులోకి పట్టుబడిన నిందితులను విచారణ చేయడంతో అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది. ప్రకాష్, నాగమణి దంపతులు. ప్రకాష్ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని భార్యను నిర్లక్ష్యం చేయడమే కాక, వేధింపులకు గురి చేస్తుండడంతో ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్‌తో కలిసి భర్త హత్యకు నాగమణి పథకం రచించింది. దీంతో తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును అనంతపురం పోలీసులకు బదిలీ చేశారు. కాగా, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన నల్లమాడ సీఐ నిరంజన్‌రెడ్డి, నల్లమాడ, ఓడీసీ, బుక్కపట్నం, అమడగూరు ఎస్ఐలు వలీబాషా, గోపీకుమార్, నరసింహుడు, వెంకటరమణ, సర్కిల్ సిబ్బందిని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ అభినందించారు. -
అర్ధరాత్రి మహిళ ఇంట్లో ‘డిస్మిస్’ కానిస్టేబుల్.. ప్రకాష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రకాష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి హౌసింగ్ కాలనీలో లక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉన్న ప్రకాష్.. లక్ష్మి బంధువులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ప్రకాష్‌కు లక్ష్మి భర్త, బంధువులు దేహశుద్ధి చేశారు. లక్ష్మిని లోబరుచుని నగదు, బంగారం అపరిహరించాడని ఆమె భర్త, బంధువులు అంటున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి కాగా, ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆది నుంచీ నేర చరిత్ర కలిగిన వాడని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రకాష్‌పై ఉన్న కేసులు, అభియోగాలను వివరించారు. ఉన్నతాధికారులు అతన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారన్న దానిలో వాస్తవం లేదన్నారు. ప్రకాష్‌పై అభియోగాలు రుజువైనందున అండర్ రూల్ ఆఫ్-20 ‘ఏపీసీఎస్ రూల్స్ 1991’ ప్రకారం ఆగస్టు 24న ప్రకాష్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. విచారణ రిపోర్టులు అన్నీ సక్రమంగా ఉన్నాయన్నారు. ఇదీ లక్ష్మి కేసు.. ‘అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లికి చెందిన బి.లక్ష్మి ‘స్పందన’లో జిల్లా ఎస్పీకి లిఖితపూర్వక పిటిషన్ ఇచ్చింది. కానిస్టేబుల్ ప్రకాష్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించడమే కాకుండా 30 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొన్నాడని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించి, బెదిరించినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఎస్పీ తక్షణమే గార్లదిన్నె పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. గార్లదిన్నె ఎస్ఐ 2019 జూన్ 22న కేసు నమోదు చేశారు. ప్రకాష్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ఎస్పీకి నివేదిక పంపారు. దాని ఆధారంగా 2019 డిసెంబరు 19న ప్రకా‹Ùను సస్పెండ్ చేశారు. అదే రోజు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆఫీసర్‌గా ధర్మవరం ఎస్డీపీవో రమాకాంత్‌ని నియమించారు. ఓరల్ ఎంక్వైరీ ఆఫీసర్‌గా అనంతపురం సీసీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషాను నియమించారు. విచారణాధికారులు 8 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. మార్చి 1న లక్ష్మి కూడా డీఎస్పీ మహబూబ్ బాషా ముందు సాక్ష్యం ఇచ్చింది. ప్రకాష్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడని తెలిపింది. ఈ ఏడాది జూన్ 23న ప్రకాష్ ఓరల్ ఎంక్వైరీ ఆఫీసరు ముందు సంజాయిషీ ఇచ్చారు. లక్ష్మి చెప్పిన విషయాలను అతను ఖండించలేదు. దీంతో ఓరల్ ఎంక్వైరీ ఫైనల్ రిపోర్టును జూన్ 23న డీఎస్పీ మహబూబ్‌బాషా జిల్లా ఎస్పీకి అందజేశారు. అనంతరం ప్రకాష్‌కు మూడు నోటీసులిచ్చాం. చివరి నోటీసుకు అతను ఆగస్టు 17న సంజాయిషీ ఇచ్చారు’ అని ఏఎస్పీ వివరించారు. ప్రకాష్ నేరాల చిట్టా ఇది ♦2000 ఫిబ్రవరి 11న ఆర్ఎస్ఐ శేఖర్‌పై హత్యాయత్నం కేసులో ప్రకాష్ నిందితుడు. ఈ కేసులో 2001 జనవరి 1న అతన్ని అరెస్టు చేశాం. ♦2006లో హైవే పెట్రోలింగ్ వాహనం డ్రైవర్‌గా ఉన్న ప్రకాష్.. ఇందిరా ప్రియదర్శిని హోటల్ çసప్లయర్ బి.ధనుంజయబాబును ఇనుప రాడ్‌తో కొట్టాడు. ఈ కేసులో అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించి 2 ఏళ్లు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. అప్పీల్ సమయంలో నిందితుడు, ఫిర్యాదుదారు రాజీ పడ్డారు. ♦2008 అక్టోబరు 18న కదిరిలో బజాజ్ క్యాలిబర్ (ఏపీ0హెచ్ 5780) చోరీ చేశాడు. ♦2009లో అనంతపురం సాయినగర్‌కు చెందిన కురుగోడు గంగాధర్‌కు స్లె్పండర్æ బైక్(ఏపీ04ఎఫ్ 0874) చోరీ చేశాడు. ఈ కేసులో ప్రకా‹Ùను పోలీసులు 2009 జూన్ 13న అరెస్టు చేశారు. ♦2009 జూన్ 12న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద బైక్ (ఏపీ02 కే 9283) చోరీ చేశాడు. ఈ కేసులోనూ ప్రకాష్‌ను అరెస్టు చేశారు. ♦కదిరిలో 2014 ఫిబ్రవరి 11న ప్రకాష్, మరో నలుగురు ఏపీ 02 ఆర్ 1456 స్కార్పియో వాహనంలో అబ్రహాంను కిడ్నాప్ చేసి కేరళలో నిర్బంధించి, ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. దీనిపైనా కేసు నమోదు చేశారు. ♦2019లో అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుండగా కలెక్టర్ ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ♦ఈ ఏడాది అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రకాష్‌పై ఫోర్జరీ కేసు నమోదయ్యింది. ఈ తరహా 10 కేసులతో పాటు శాఖాపరమైన చర్యలు ప్రకా‹Ùపై చాలా ఉన్నాయి. ♦2008 జూన్ 25న ప్రకాష్‌ను ఓసారి సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఎస్పీ, మరో ఇద్దరు అధికారులపై కేసు నమోదు డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ కె.ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి, ఏఆర్ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, అనంతపురం సీసీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషాలపై (క్రైం నంబర్ 209/2022 అండర్ సెక్షన్ 167, 177, 182 రెడ్‌విత్ 34 ఐపీసీ 3 (1)(క్లాజ్), సెక్షన్ 3 (2) సెవెన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్) కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణాధికారిగా పలమనేరు ఎస్డీపీవో సి.ఎం. గంగన్నను నియమిస్తూ డీఐజీ ఎం.రవిప్రకాష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాష్ అందుబాటులోకి రాలేదు : గంగన్న ఎస్పీపై నమోదైన కేసులో విచారణాధికారి గంగన్న గురువారం అనంతపురం వచ్చారు. విచారణకు హాజరుకావాలని కానిస్టేబుల్ ప్రకాష్‌ను ఫోన్లో సంప్రదించామన్నారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో నోటీసు ఇంటికి, ప్రకాష్ ఫోన్‌కు మెసేజ్, వాట్సాప్ ద్వారా పంపినట్లు చెప్పారు. -
అనంతపురం ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు
సాక్షి, అనంతపురం: సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాస్తవానికి ప్రకాష్‌ను రెండు రోజుల క్రితమే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లలో 5 క్రిమినల్ కేసులు కానిస్టేబుల్ ప్రకాష్‌పై నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు, దాడి, అక్రమ ఆయుధాల సరఫరా వంటి కేసులు ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళను లొబర్చుకొని ఆమె నుంచి రూ.10లక్షల నగదు, 30 తులాల బంగారు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రకాష్‌పై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. ఆరోపణలు నిజమని తేలడంతో కానిస్టేబుల్ ప్రకాష్‌ను డిస్మిస్ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (పోలీసులపై తప్పుడు కథనాలు.. ఈనాడుకు ఎస్పీ ఫకీరప్ప నోటీసులు) డిస్మిస్ వెనుక కక్ష సాధింపు ఉందని ఎల్లో మీడియా ద్వారా ప్రకాష్ అసత్య ప్రచారం చేశాడు. సీఎం జగన్ చెన్నేకొత్తపల్లి పర్యటన సమయంలో ప్రకాష్.. ఎస్పీ ఆపీస్ సేవ్ ఏపీ పోలీస్ అంటూ ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశాడు. అందుకే ప్రకాష్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారంటూ ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన ఎస్పీ ఫక్కీరప్ప ప్రకాష్ ప్రవర్తన బాగాలేకపోవడంతో డిస్మిస్ చేసినట్లు స్పష్టం చేశారు. అయితే కక్ష సాధింపుతోనే డిస్మిస్ చేశారని ప్రకాష్ ఆరోపించారు. ఎస్పీతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలను డిఐజీ రవిప్రకాస్ చూస్తున్నారు. -
రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి: వి.ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు (ఎత్తిపోతల పథకాలు), ఇంజనీర్ పెంటారెడ్డిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి బేషరతు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.దామోదర్‌రెడ్డి, ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సోమవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. అంచనాలకు మించి వరద వచ్చినప్పుడు ఎత్తిపోతల పథకాల పంపులు మునగడం సహజమేనన్నారు. గతంలో శ్రీశైలం, కల్వకుర్తిలో పంపులు మునిగిన విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బాహుబలి లాంటి పంపులను తయారు చేయించడంలో ముఖ్యపాత్ర పోషించిన పెంటారెడ్డిని ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అన్నారం, మేడిగడ్డ పంపులు నీట మునగడంతో వేల కోట్ల నష్టమేమీ జరగలేదన్నారు. నీళ్లు తగ్గిన తర్వాత మళ్లీ బురదని తొలగించి సర్వీసు చేస్తే పంపులు నడుస్తాయని తెలిపారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం సాయం త్రం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడి యం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించగా, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురవడంతో బరిలో టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు మాత్రమే మిగిలారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు సాయంత్రం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమకు చట్టసభలో అవకాశమిచ్చిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను చూసి ఓర్వలేకనే..: కడియం శ్రీహరి ‘అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తాం. అభివృద్ధిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ అన్ని ప్రాంతాలు, వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తుండగా, జీడీపీ భారీగా తగ్గి కరోనా సమయంలో అట్టడుగుకు పడిపోయింది. మోదీ పాలనాదక్షుడైతే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు వివరించాలి. ధాన్యం సేకరణ అంశం కేంద్రం పరిధిలోనిదే అయినప్పటికీ కొనుగోలు చేయకుండా సమస్యలు సృష్టిస్తోంది’ అని శ్రీహరి అన్నారు. -
సన్యాసం తీసుకున్న ముఖేశ్ అంబానీ స్నేహితుడు
ముంబై: రిలయన్స్ పరిశ్రమల అధినేత ముఖేశ్ అంబానీ వెన్నంటి ఉండే తన బాల్య మిత్రుడు.. కుడిభుజంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా సన్యాసం స్వీకరించాడు. కోట్ల ఆదాయం వదులుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించారు. ఆయన సన్యాసం తీసుకుని చాలా రోజులైనా ఇప్పటికీ ఆ విషయం బహిర్గతమైంది. అయితే ఆయన ఎందుకు సన్యాసం స్వీకరించాడో.. ఎందుకు ఆ మార్గంలోకి వెళ్లారో చదవండి. ముఖేశ్ అంబానీకి ప్రకాశ్ షా (64) బాల్య మిత్రుడు. రిలయన్స్ పరిశ్రమల వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తుండేవాడు. ముఖేశ్ అంబానీకి కుడి భుజంలాంటివాడు. అతడి జీతం సంవత్సరానికి రూ.70 కోట్ల పైమాటే. అలాంటి ప్రకాశ్ షా ఏప్రిల్ 25వ తేదీన జైన మత సంప్రదాయం ప్రకారం గచ్చిధిపతి పండిత్ మహారాజ్ సమక్షంలో మహావీరుడి జన్మ కల్యాణ దినాన సన్యాస దీక్ష తీసుకున్నారు. ఇప్పుడు ఆయన నూతన్ మునిరాజుగా మారిపోయారు. ఆయన భార్య నయనా బెన్ కూడా సన్యాసం స్వీకరించారు. వాస్తవంగా జైన మతంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సన్యాసం స్వీకరించడం సహజమే. ఆయన స్వచ్ఛందంగా సన్యాసం పొందారు. అయితే ఆయన సన్యాసం స్వీకరించిన విషయం వ్యాపార వర్గాల్లో కానీ జాతీయ మీడియాలో కానీ ఎలాంటి వార్తలు కనిపించలేదు. ఈ సన్యాస దీక్షపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. ప్రకాశ్ షాకు కోట్ల జీతం రాదని.. ముఖేశ్ అంబానీకి కుడి భుజం కాదని ఆ సందేశంలో వివరించారు. ప్రకాశ్ షా కెమెకల్ ఇంజనీరింగ్ చేశారు. ఐఐటీ బాంబేలో పీజీ చదివారు. రిలయన్స్ సంస్థల పనుల్లో ప్రకాశ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సన్యాస దీక్ష గతేడాదే స్వీకరించాల్సి ఉండగా కరోనా వలన ఆలస్యమైందని సమాచారం. ఆయన భార్య నయన్ కామర్స్‌లో పట్టభద్రురాలు. వీరికి ఇద్దరు కుమారులు. వీరిలో ఒక కుమారుడు కొన్నేళ్ల కిందట సన్యాసం స్వీకరించగా మరో కుమారుడు వివాహం చేసుకున్నాడు. భార్య, ఒకరు సంతానం. చదవండి: తీరని విషాదం.. తొక్కిసలాటలో 44 మంది మృతి చదవండి: సీఎం వెంట నిత్యం ఉండే ప్రభుత్వ ప్రతినిధే కరోనాకు బలి Mukesh Ambani’s right hand man Prakash Shah, Vice President of Reliance Industries, with an annual salary of Rs 75 crore, renounced the materialistic world and took sanyas on 25/04/21 and became Nutan Muniraj in Mumbai. Real renunciation. pic.twitter.com/5gSFb8S6yj — Rakesh Thiyyan (@ByRakeshSimha) April 27, 2021 -
నవ వరుడు ఆత్మహత్య
చెన్నై ,తిరువొత్తియూరు: వివాహమైన మూడు నెలలకే నవ వరుడు కుటుంబ కలహాలతో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. పల్లావరం క్రోంపేట రంగానగర్‌కు చెందిన ప్రకాష్(24) ఇనుప వస్తువుల తయారీ పట్ర నడుపుతున్నాడు. రమ్య అనే యువతిని ప్రేమించి మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. గురువారం రమ్య సమీపంలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంట్లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వెళ్ళింది. భార్య లేకపోవడంతో గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు ప్రకాష్. ఇది చూసిన అతని తల్లిదండ్రులు గట్టిగా మందలించారు. దీంతో విరక్తి చెందిన ప్రకాష్ ఇంట్లోని గదిలోకి వెళ్లి ప్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న శంకర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
తుపాకీ అవ్వలు
ఉత్తర ప్రదేశ్‌లో 80 ఏళ్ల వయసులో కూడా షార్ప్ షూటర్లు రాణించి వందల కొద్దీ మెడల్స్ గెలుస్తున్న చంద్రు తోమర్, ప్రకాషి తోమర్‌లపై ఇప్పుడు సినిమా సిద్ధమవుతోంది. అరవై ఏళ్లు దాటితే కృష్ణా రామా అనుకోవాలని ఈ సంఘం ఒక ఆనవాయితీని విధించి ఉంది. ఇక స్త్రీలు అరవై దాటాక మనవలు మనవరాళ్లను చూసుకుంటూ ఏదో ఒక మగతోడు లేకుండా గడప దాటే వీలు లేకుండా ఉండాలని కూడా సంఘం భావిస్తుంది. అయితే ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు అవ్వలు ఈ ఆనవాయితీని భగ్నం చేశారు. వారు కూరగాయలు కోసే కత్తిని, కత్తి పీటను వదిలి ఏకంగా తుపాకిని పట్టుకున్నారు. షార్ప్ షూటర్లు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వందలకొద్దీ మెడల్స్ సంపాదిస్తున్నారు. మెడల్స్ వల్ల వారి వ్యక్తిగత కీర్తి పెరిగి ఉండవచ్చు. కాని వారు చేస్తున్న ఈ పని వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆడపిల్లల ధైర్యం పెరిగింది. వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. మగాళ్ల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదని వారు కూడా రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నారు. ఇది వారి ఆత్మ విశ్వాసానికే కాదు అవసరమైతే ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతోంది. బుల్లెట్టు ఇలా దిగింది ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంత జిల్లా అయిన భాగ్‌పట్‌లోని చిన్న ఊరు జొహ్రీ. ఆ ఊరులోని అందరిలాంటి గృహిణి చంద్రు తోమార్. అప్పటికి ఆమె వయసు 65. ఎనిమిది మంది పిల్లలు, 15 మంది మనమలు, మనమరాళ్లు. ఆ ఊళ్లో రైఫిల్ క్లబ్ ఉంది. అయితే ఎక్కువగా అబ్బాయిలే అక్కడ ప్రాక్టీసు చేస్తుంటారు. కాని చంద్రు మనుమరాలు ఆ క్లబ్లో చేరాలనుకుంది. ఒక్కత్తే వెళ్లడానికి కొంచెం బిడియపడి నానమ్మను తోడు రమ్మంది. మనవరాలికి తోడుగా రెండు రోజులు వెళ్లిన చంద్రు అక్కడ ప్రాక్టీసులో మనవరాలు పడుతున్న తిప్పలు చూసి ‘అలా కాదు ఇలా కాల్చాలి తుపాకిని’ అని కోచ్ చెప్పినదాన్ని బట్టి కాల్చి చూపింది. ఆశ్చర్యం. అది నేరుగా వెళ్లి గురిని తాకింది. కోచ్ ఆశ్చర్యపోయి, ఇది పొరపాటున తగిలిందేమోనని మళ్లీ కాల్చమన్నాడు. చంద్రు సరిగ్గా మళ్లీ గురి తగిలేలా కాల్చింది. బాగా ప్రాక్టీసు ఉన్న పిల్లల కంటే చంద్రు గురి ఎక్కువగా గ్రహించిన కోచ్ ఆమెను షార్ప్ షూటర్‌గా ట్రైనింగ్ తీసుకోమన్నాడు. కాని ఆ వెనుకబడిన ప్రాంతంలో అలాంటి పని ఆ వయసులో చేయడానికి అనుమతి లేదు. అందుకని వారానికి ఒకసారి వచ్చి చంద్రు ప్రాక్టీసు చేసేది. ఇంట్లో ఎవరూ చూడకుంటే చేతిలో పట్టుకోసం జగ్గులో నీళ్లు నింపి తుపాకీని పట్టుకుని నిలుచున్నట్టు నిలుచునేది. ఆమె కంటి చూపు బాగుండటం, చేతిలో పట్టు ఉండటంతో ఆమె గురి తప్పని షూటర్‌గా కొద్ది రోజులలోనే అవతరించింది. వయోజనుల క్రీడా పోటీలకు తీసుకు వెళితే మెడల్‌తో తిరిగి వచ్చేది. మొదట ఆమె భర్త అభ్యంతరం చెప్పాడు. కాని ఊళ్లో ఆమెకు వస్తున్న పేరు, గుర్తింపు చూసి అతను కూడా ప్రోత్సహించసాగాడు. ఇది చూసి ఆమె ఆడపడుచు ప్రకాషి తోమార్‌కు కూడా ఆసక్తి కలిగింది. ఆమె కూడా తన వదిన చంద్రుతో కలిసి షూటింగ్‌ను ప్రాక్టీస్ చేసింది. ఇద్దరూ అనతికాలంలోనే ఆ ప్రాంతంలో ‘షూటర్ దాదీస్’ (తుపాకీ అవ్వలు)గా ఖ్యాతి పొందారు. ఇప్పుడు చంద్రు వయసు 87. ప్రకాషి వయసు 82. అయినప్పటికీ లక్ష్యం చేరుకోవడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తున్నారు. సినిమాగా ఇద్దరి కథ గత పది పదిహేను ఏళ్లలో దేశమంతా స్ఫూర్తినింపిన ఈ కథ ఎట్టకేలకు బాలీవుడ్‌కు చేరింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనే నిర్మాతగా మారి వీరి కథను తెరకెక్కిస్తున్నాడు. సినిమా పేరు ‘సాండ్ కీ ఆంఖ్’. తెలుగువారికి సుపరిచితురాలైన తాప్సీ, ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’లో నటించిన భూమి పెడ్నెకర్ ఈ ఇద్దరు అవ్వల పాత్రలను పోషిస్తున్నారు. ఇందుకోసం వారు ప్రొస్థెటిక్స్ పద్ధతిలో మేకప్ వేసుకుంటున్నారు. ఈ మేకప్ వల్ల, షూటింగ్‌లోని ఎండల వల్ల నటి భూమి ముఖం మీద రాషెస్ వచ్చేశాయి. అయినప్పటికీ ఈ పాత్ర కోసం ఎంతటి కష్టమైనా పడతాను అంటూ భూమి పేర్కొంది. తుషార్ హీరానందానీ ఈ సినిమాకు దర్శకుడు. దాదాపు హర్యాణ్వి గ్రామీణ జీవితంలో స్త్రీల మనోభావాలు, మగ పెత్తనం, దానిని దాటి స్త్రీలు తమ ఉనికిని చాటుకోవడం ఈ కథ. స్ఫూర్తిదాయకమైన నిజ జీవితాలు గతంలో పత్రికలకెక్కడమే గొప్పగా ఉండేది. కాని ఇవాళ అవి ఏకంగా సినిమాలే అవుతున్నాయి. దీపావళికి రిలీజయ్యి ఎడాపెడా పేలనున్న ఈ తుపాకీ చప్పుళ్లను విని గురి తప్పని చప్పట్లు మనం కూడా కొడదాం. -
ఒక పౌరునిలా అలా అన్నా: కుమారస్వామి
మండ్య: జేడీఎస్ నాయకుడిని చంపేసిన దుండగులను వెంటనే కాల్చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘జేడీఎస్ నేత ప్రకాశ్‌ను చంపేశారని తెలియగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి, ఆవేశానికి గురయ్యాను. అందుకే కాల్చేయాలని ఆవేశంగా అన్నాను’ అని కుమారస్వామి వివరణ ఇచ్చారు. సీఎం హోదాలో కాకుండా సాధారణ పౌరుడిలా ఆవేశంతో అలా స్పందించానని చెప్పారు. మంగళవారం ఆయన మండ్య జిల్లా మద్దూరు తాలూకాలో హత్యకు గురైన నేత కుటుంబాన్ని పరామర్శించారు. హత్యకు గురైన ప్రకాశ్ తనకు ఆప్తుడంటూ కుమారస్వామి కంటతడి పెట్టుకున్నారు. కాగా, హత్యకు కారకులని ఆరోపిస్తూ తుప్పనహళ్లిలో కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లపై జేడీఎస్ కార్యకర్తలు దాడులు చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాగా, ముఖ్యమంత్రికి మతిభ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. -
నాణ్యత ప్రమాణాలు లేకే డిగ్రీ కాలేజీల మూత!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం అవసరం లేకున్నా రాష్ట్రంలో అడ్డగోలుగా డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిందని, ఒక్క కాలేజీ అవసరం ఉన్న చోట ఐదు కాలేజీలను ఇచ్చిందని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం పేర్కొంది. తద్వారా విద్యార్థులను తెచ్చుకోవాలన్న పోటీలో కొన్ని యాజమాన్యాలు నాణ్యత ప్రమాణాలకు నీళ్లొదిలాయని, అలాంటివే ఇప్పుడు మూత పడ్డాయని తెలిపింది. గత ప్రభుత్వం తప్పులకు ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడారు. కేజీ టు పీజీ జేఏసీ పేరుతో కొంతమంది నాయకులు గత మూడేళ్లుగా రాజకీయ పదవులకోసం పైరవీ చేసుకొని భంగపడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతం నుంచే ఉన్న సమస్యలను ఇప్పుడే మొదలైన సమస్యల్లా చూపుతూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఏకపక్షంగా రాజకీయ మద్దతుపై తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తామే విద్యా సంస్థల ప్రతినిధులుగా చెప్పుకోవడాన్ని ఖండించింది. 50 శాతం ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీలు వారివెంట లేవని, మెజారిటీ సభ్యులు కలిగిన గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కూడా వారితో లేదన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫలితాలు రాబట్టుకోవాలే తప్ప ఒక రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించడాన్ని అనేక యాజమాన్యాలు అంగీకరించడం లేదని వివరించారు. వారు కేజీ టు పీజీ జేఏసీ పేరుతో నాయకులుగా వ్యవహరిస్తూ కాలేజీల సంఘాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి 75 శాతం ఫీజు బకాయిలను చెల్లించిందని, అయినా ఇవ్వలేదంటూ విమర్శలు చేయడాన్ని యాజమాన్యాలు నమ్మవద్దన్నారు. సంఘం నేతలు నరేందర్‌రెడ్డి, సిద్ధేశ్వర్ మాట్లాడారు. -
విశ్వ విజేత ఓం ప్రకాశ్
చాంగ్వాన్ (కొరియా): అంతర్జాతీయ స్థాయిలో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. ఇటీవల కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాల పంట పండించిన భారత షూటర్లు అదే జోరును ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పునరావృతం చేస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నమెంట్‌గా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో మంగళవారం భారత పిస్టల్ షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకొని జగజ్జేతగా అవతరించాడు. 50 మీటర్ల పిస్టల్ విభాగంలో 23 ఏళ్ల ఓం ప్రకాశ్ 564 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఓం ప్రకాశ్ 10 మీ., 50 మీ. ఎయిర్ పిస్టల్ విభాగాల్లో కాంస్యాలు గెలుచుకున్నాడు. దమిర్ వికెట్ (సెర్బియా–562 పాయింట్లు), డెమ్యుంగ్ లీ (దక్షిణ కొరియా–560 పాయింట్లు) రజతం, కాంస్యం నెగ్గారు. అయితే, 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుపొందిన జీతూ రాయ్... ఈసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 552 పాయింట్లతో అతను 17వ స్థానంలో నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లేనందున ఎవరికీ ఒలింపిక్ బెర్త్‌లు దక్కలేదు. ఇక జూనియర్ స్థాయి 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తాజా ఏషియాడ్ స్వర్ణ విజేత సౌరభ్ చౌదరి, అభిద్న్య పాటిల్ జోడీ కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో మను భాకర్ (574 పాయింట్లు) 13వ స్థానంలో, హీనా సిద్ధూ 571 పాయింట్లతో 29వ స్థానంలో నిలిచారు. సోమవారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం నెగ్గిన అంజుమ్ మౌద్గిల్, నాలుగో స్థానంలో నిలిచిన అపూర్వీ చండేలాలు భారత్‌కు రెండు ఒలింపిక్ కోటా బెర్త్‌లు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన నాలుగో భారతీయ షూటర్‌గా ఓం ప్రకాశ్ గుర్తింపు పొందాడు. గతంలో అభినవ్ బింద్రా (2006), మానవ్‌జిత్ సంధూ (2006), తేజస్విని సావంత్ (2010) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
ప్రకాశ్‌కు పసిడి
న్యూఢిల్లీ: మలేసియా ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ మెరిశాడు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో ప్రకాశ్ పసిడి పతకం గెలిచాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో ప్రకాశ్ ఒక నిమిషం 58.08 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి. -
ఓసీకి ఒకటి.. బీసీకి రెండు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ ఆ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అధినేత కేసీఆర్ ఈ ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించారు. మొదటి నుంచీ అనుకున్న విధంగా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన సంతోష్‌కు అవకాశం దక్కగా, మిగిలిన ఇద్దరు అభ్యర్థుల విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. యాదవుల కోటాలో చాలా మంది పోటీ పడినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశమిచ్చిన కేసీఆర్ అదే రీతిలో వరంగల్ జిల్లాకు చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్‌ను కూడా పెద్దల సభ రేసులో నిలబెట్టి పార్టీ నేతలను సైతం ఆశ్చర్యపరిచారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బడుగుల లింగయ్య 2015లో టీఆర్ఎస్లో చేరారు. బండ ప్రకాశ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. వీరిద్దరి ఎంపికతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు అవకాశం ఇచ్చారనే చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే, సామాజిక సమీకరణల్లో భాగంగానే బండ ప్రకాశ్‌ను ఎంపిక చేశారని తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. ముదిరాజ్ మహాసభ ద్వారా బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రకాశ్‌ను రాజ్యసభకు పంపడం బీసీలకు పెద్దపీట వేయడమేనని, అందులో భాగంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. ముఖ్యంగా బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలను పంపడం ద్వారా ఆయా వర్గాలను ఆకర్షించాలనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మూడింటిలో రెండు స్థానాలను బీసీలకు కేటాయించారని గులాబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున గతంలో ఒక ఓసీ నేతను రాజ్యసభకు పంపగా, ఇప్పుడు మరో ఓసీ అభ్యర్థిని పెద్దల సభ రేసులో నిలబెట్టారు. గతంలో ఈ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైన ముగ్గురిలో కూడా ఇద్దరు బీసీలుండగా, ఇప్పుడు మళ్లీ ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బడుగుల లింగయ్య యాదవ్ తల్లిదండ్రులు: అంతయ్య, యలమంచమ్మ ఊరు: భీమారం, కేతేపల్లి మండలం, నల్లగొండ జిల్లా వయసు: 58 ఏళ్లు చదువు: బీఏ, బీఈడీ భార్య: నాగమణి, పిల్లలు: డాక్టర్ యస్వంత్, దీప్తి రాజకీయ అనుభవం: 1982లో టీడీపీలో చేరారు. 1985–87 వరకు కేతేపల్లి మండల తెలుగు యువత అధ్యక్షుడిగా, 1987–97లో కేతేపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా, 1995లో భీమారం ఎంపీటీసీగా, 1998 –2012 వరకు టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2009లో మహాకూటమి తరఫున స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి 26 ఓట్లతో నేతి విద్యాసాగర్ చేతిలో ఓడిపోయారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ 2015, మార్చి 16న టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. జోగినపల్లి సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు: రవీందర్రావు, శశికళ ఊరు: కొదురుపాక, బోయినపల్లి మండలం, కరీంనగర్ జిల్లా వయసు: 42 ఏళ్లు చదువు: ఎంబీఏ, ఎంపీఎం భార్య: రోహిణి పిల్లలు: ఇషాన్, శ్రేయాన్ అనుభవం: సంతోష్ చదువు పూర్తయి ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన జెండా చేపట్టిన కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. 2004లో హరీశ్ మంత్రి అయిన తర్వాత ఈ బాధ్యతలను తీసుకున్న సంతోష్ అప్పటి నుంచి కేసీఆర్‌కు తోడు నీడగా ఉన్నారు. గత 13 ఏళ్లుగా కేసీఆర్ కన్నా ముందే ప్రారంభమయ్యే సంతోష్ దినచర్య కేసీఆర్ నిద్రకు విశ్రమించిన తర్వాతే ముగుస్తుంది. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా సంతోష్ ఆయన వెన్నంటి ఉండాల్సిందే. అటు పార్టీలో, ఇటు కేసీఆర్ కుటుంబంలో అందరికీ తలలో నాలుకగా ఉండే సంతోష్ వ్యక్తిగతంగా కూడా మంచిపేరు సాధించుకున్నారు. ప్రస్తుతం టీన్యూస్ ఎండీగా కూడా ఉన్నారు. బండ ప్రకాశ్ ముదిరాజ్ వయసు: 63 ఏళ్లు చదువు: ఎంఏ, పీహెచ్డీ అనుభవం: కుడా సభ్యుడిగా, వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కూడా. -
100 అవకాశాలొచ్చాయి.. కానీ : నటి
సాక్షి, చెన్నై: కమర్షియల్ కథా చిత్రాలు సక్సెస్ కావచ్చు. తద్వారా కలెక్షన్ల వర్షం కురిపించవచ్చు. అందులో నటించిన నటీనటులకు మరిన్ని అవకాశాలు రావడానికి కారణం కావచ్చు. అయితే నటీనటులు, సాంకేతిక వర్గాల ప్రతిభకు సాన పెట్టేవి, పేరు తెచ్చిపెట్టేవి, పది కాలాల పాటు గుర్తుండిపోయేవి ప్రయోగాత్మక కథా చిత్రాలే. అలాంటి కథా పాత్రలే నటీనటుల నట దాహార్తిని తీరుస్తాయి. అలాంటి ఒక చిత్రంలో హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్నారన్నది తాజా సమాచారం. పాత్ర నచ్చితేనే అంగీకరించే అతి కొద్దిమంది హీరోయిన్లలో ఈమె ఒకరు. నచ్చకపోతే నటించడానికి ససేమీరా అంటారు. ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో తనకు 100 అవకాశాలు వచ్చాయని, అందులో నాలుగే నాలుగు చిత్రాలను అంగీకరించి నటించానని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఇటీవల తెరపైకి వచ్చిన తెలుగు చిత్రం ‘అ’లో వివాదాస్పద పాత్రలో నటించడానికి వెనుకాడలేదీ జాణ. ప్రస్తుతం తాను మాత్రమే నటించే ఒకే ఒక్క పాత్రతో కూడిన ప్రణా అనే చిత్రంలో నటిస్తున్నారట. ఈ విషయాన్ని ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ తన ట్విటర్లో పేర్కొన్నారు. ఇది బహుభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. దీనికి వీకే.ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుందన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ తెలిపారు. ఒక్క పాత్రతో తెరకెక్కుతున్న చిత్రం అంటే ప్రణా కచ్చితంగా వైవిధ్యంగానూ, ప్రయోగాత్మకంగానూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. అందులోనూ ఆ ఒక్క పాత్రను ప్రతిభాశాలి నిత్యామీనన్ పోషిస్తున్నారంటే అందులో విషయం ఉండే ఉంటుంది. -
సీఎం సమక్షంలో నన్ను కొట్టారు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో, సీఎం సమక్షంలోనే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయం ఖండించింది. ఆధారాల్లేకుండానే తమ ఎమ్మెల్యేలపై విపరీత నిందలు వేస్తున్నారని పేర్కొంది. మరోవైపు మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అసలేం జరిగింది? సీఎస్ అన్షు ప్రకాశ్ దాడిపై ఢిల్లీ ఉత్తర డీసీపీకి ఫిర్యాదు చేశారు. ‘సోమవారం రాత్రి 8.45 గంటలకు సీఎం సలహాదారు నాకు ఫోన్ చేసి అర్ధరాత్రి సీఎం నివాసంలో సమావేశానికి హాజరుకావాలని చెప్పారు. ఆప్ ప్రభుత్వ మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కొన్ని ప్రచార కార్యక్రమాలు, ప్రకటనల గురించి మాట్లాడేందుకు ఆ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. నేను సీఎం నివాసానికి వెళ్లేటప్పటికి అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతోపాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నేను వెళ్లాక తలుపులు మూసి నన్ను ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, మరో ఎమ్మెల్యే మధ్య కూర్చోబెట్టారు. ప్రచార ప్రకటనల విడుదలకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిందిగా సీఎం నన్ను ఆదేశించారు. నేను నిరాకరించడంతో నన్ను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని ఎమ్మెల్యేలు బెదిరించారు. నాకు ఇరువైపులా కూర్చున్న ఎమ్మెల్యేలు అకారణంగా నా తలపై కొట్టారు. నా కళ్లద్దాలు కూడా కింద పడిపోయాయి. నేను ఎలాగోలా అక్కడ నుంచి బయటపడగలిగాను’ అని సీఎస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడున్న అందరూ ముందుగానే కుట్ర పన్ని, పక్కా ప్రణాళికతో తనపై దాడి చేశారనీ, వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలసి ఈ విషయం ఆయనకు చెప్పానన్నారు. ఖండించిన ఆప్.. మరోవైపు సీఎస్‌పై దాడి ఆరోపణలను ఆప్ ఖండించింది. తమ ప్రభుత్వంపై నిరాధారమైన, విపరీత నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలో రేషన్ సరుకులు సరిగ్గా అందడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో దానిపై మాట్లాడేందుకే సీఎస్‌ను పిలిచామంది. ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు ఆయనను పిలిచామనడం అబద్ధమని ఆప్ అంటోంది. ఎమ్మెల్యే అజయ్ దత్ సీఎస్‌పై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తూ అన్షు తనను, మరో ఎమ్మెల్యేను కులం పేరుతో దూషించారన్నారు. తన నియోజకవర్గంలో రేషన్ సరుకులు సరిగా అందడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించగా.. సీఎస్ తనతో పాటు మరో ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌ను తిడుతూ సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారని అజయ్ పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేలకు, సీఎంకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనీ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మాత్రమే తాను జవాబుదారీనంటూ సీఎస్ అన్నారని అజయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ ఓ పట్టణ నక్సలైట్: బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలు గూండాలనీ, కేజ్రీవాల్ ఓ పట్టణ నక్సలైట్ అని బీజీపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను పట్టణ నక్సలైట్‌గా పేర్కొన్న తివారీ, ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ విఫల మై దాదాగిరికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ అన్నారు. సీఎస్‌పై దాడికి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలన్నారు. ఐఏఎస్‌ల నిరసనలు ఈ ఘటనపై ఐఏఎస్‌ల ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. సంఘాల నాయకులు లెఫ్టినెంట్ గవర్నర్‌ను, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తనకు బాధ కలిగించిందనీ, ప్రభుత్వోద్యోగులు గౌరవంగా, నిర్భయంగా పని చేసుకునే వాతావరణం ఉండాలని రాజ్‌నాథ్ అన్నారు. మరోవైపు మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించగా దాదాపు వంద మంది ఉద్యోగులు ఆయనను ఘెరావ్ చేశారు. హుస్సేన్ వ్యక్తిగత సహాయకుడిని కొట్టారు. ఇందుకు సంబంధించి మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎస్‌తోపాటు మంత్రి ఇమ్రాన్ హుస్సేన్‌ల ఫిర్యాదులపై రెండు ఎఫ్ఐఆర్లు నమో దు చేశామని పోలీసులు చెప్పారు. -
డిసెంబర్లో కొత్త పార్టీ
కోలారు: డిసెంబర్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ వెల్లడించారు. బెగ్లిహసహళ్లి గ్రామ సమీపంలోని తన ఫాం హౌస్‌లో మంగళవారం ఆయన కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్య, మంత్రి రమేష్కుమార్లు అసలైన కాంగ్రెస్ వాదులు కాదని, వారు జేడీఎస్ నుంచి వలస వచ్చిన వారన్నారు. సీఎం సిద్దరామయ్య మంత్రి రమేష్‌కుమార్ మాటలు విని తనను కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావద్దని ఫోన్ చేసి చెప్పారన్నారు. దీని వల్ల తన స్వాభిమానం దెబ్బతిందని అన్నారు. శ్రేయోభిలాషుల సలహా మేరకు నమ్మ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. తనను కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్న వారికి వచ్చే ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికలలో తాను కోలారు నుంచి పోటీ చేస్తానని తెలిపారు. -
‘నాన్న’కు సాయం
ప్రకాశ్ కుటుంబానికి రూ.75 వేలు అందజేత కోరుట్ల: మానవత్వం పరిమళించింది. ‘మా నాన్నను.. ఆదుకోరూ..’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ మెయిన్‌లో వచ్చిన కథనానికి దాతలు స్పందించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఎక్కల్దేవి ప్రకాశ్ స్వైన్‌ఫ్లూతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. ‘చికిత్స కోసం రోజుకు రూ.లక్షకు మించి ఖర్చు వస్తోంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి’ అని ఆయన కుమా ర్తెలు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని సాక్షి’ వెలు గులోకి తీసుకురావడంతో దాతలు స్పందించి రూ. 75 వేల ఆర్థిక సాయాన్ని శనివారం వారికి అందించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ప్రకాశ్ కూతుళ్లు మాధురి, లక్ష్మీప్రసన్నలకు అందించారు. ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి టీవీ శేఖర్ రూ.10 వేలు, వ్యాపారవేత్త మంచాల జగన్ రూ.5 వేలు, డాక్టర్ సుమన్ రూ.5 వేలు, శికారి రామకృష్ణ రూ.5 వేలు, మున్సిపల్ కమిషనర్ అల్లూరి వాణిరెడ్డి రూ.5 వేలు, టీఆర్ఎస్ నాయకులు సాయిని రవీందర్ రూ.5 వేలు సేకరించారు. అలాగే, స్థానిక లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎలిమిల్ల రాంనారాయణ రూ.5 వేలు, దావనపల్లి రాజలింగం రూ. 5 వేలు, గుంటక చంద్రప్రకాశ్ రూ.5 వేలు, రవూఫ్ రూ.5 వేలు, మీనా ఫుట్‌వేర్ గోపం రాజు రూ.5 వేలు, డాక్టర్ జగదీశ్వర్ రూ.2,500, చాప కిషోర్ రూ.2 వేలు, బాస రాజగంగాగారం రూ.2 వేలు, బండారి నర్సయ్య రూ.2 వేలు, కటుకం శంకర్ రూ.1,500, కొమ్ము జీవన్‌రెడ్డి రూ.1,500, పిడుగు గుణాకర్‌రెడ్డి రూ.1,500, వనపర్తి చంద్రమోహన్ రూ.1,000, పోతని ప్రవీణ్ రూ.1,000 అందించారు. మానవత్వంతో స్పందించి ఆర్థిక సాయం అందించిన దాతలకు ప్రకాశ్ కూతుళ్లు మాధురి, లక్ష్మీప్రసన్న, మనీషలు ధన్యవాదాలు తెలిపారు. -
ధరిత్రికి పూర్వవైభవం తెద్దాం
పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య పెద్దాపురం: ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించి ధరిత్రికి పూర్వ వైభవం తీసుకువద్దామని వృక్ష రక్షకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య అన్నారు. ధరిత్రి పరిరక్షణలో భాగంగా కోటి మొక్కలు నాటి రామయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో డైరెక్టర్ సిహెచ్.విజయ్ ప్రకాష్ అ«ధ్యక్షతన శనివారం ధరిత్రీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు మాదిరిగా నేటి మొక్కలే రేపటి వృక్షాలన్నారు. ప్రతి విద్యార్థీ మొక్కలు నాటి ప్రాణవాయువును సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయ్‌ప్రకాష్ మాట్లాడుతూ రామయ్య విద్యలో అంతంత మాత్రమైనప్పటికీ కోటి మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం రామయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఒడిస్సీ నృత్య కళాకారిణి రాధాగోపాల్ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల డీన్ రాజేశ్వరి, ఆధ్యాపక బృందం, లైజాన్ ఆఫీసర్ ఎం. సతీష్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
మడకశిర : పావగడ మున్సిపల్ జూనియర్ ఇంజినీర్ ప్రకాశ్ ఓ కాంట్రాక్టర్‌తో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. పట్టణంలోని తన ఇంటిలో నిందితుడు ప్రకాశ్ కొన్ని కాంట్రాక్టు పనుల విషయంలో ఓ కాంట్రాక్టర్‌తో లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా అప్పటికే పక్కా సమాచారంతో తుమకూరు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి - అమరవెల్లిలో విషాదం కొత్తపల్లి : అనారోగ్యం కారణంగా ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని అమరవిల్లిలో గురువారం జరిగింది. అమరవెల్లి గ్రామానికి చెందిన తాగల భూలక్ష్మీ ముగ్గురు కుమారులు ఉన్నారు. వారందరికీ రక్తహీనత ఒకరి తరువాత మరొకరి వచ్చింది. తరచూ రక్తం మార్పిడి చేసుకోవాల్సి వస్తుందని వేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ముగ్గురు కొడుకులతో కలిసి అమరవెల్లి సమీపంలోని ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలో భూలక్ష్మీ (45), ప్రభు ప్రకాష్ (22), అనిల్ (20), ప్రేమ ప్రకాష్ (17) మృతి చెందారు. వారి కుటుంబంలో త్రీవ విషాదం నెలకొంది. -
బ్యాంకు ముందు బట్టలిప్పి నిరసన
అబిడ్స్: హైదరాబాద్ నగరంలోని గన్‌ఫౌండ్రీ ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం ఓ వ్యాపారి హల్చల్ సృష్టించాడు. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ప్రకాష్ అనే వ్యాపారి బాసరలో హోటల్ నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం తన బిల్డింగ్‌ను నిజామాబాద్ జిల్లా ఎస్బీహెచ్ శాఖలో మార్టిగేజ్ చేశాడు. మార్టిగేజ్ తొలగించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో బ్యాంకు రీజనల్ అధికారిని కలిసేందుకు వచ్చాడు. కానీ అక్కడ సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో తన షర్టు, బనియన్‌ను విప్పేసి అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. దీంతో బ్యాంకు వినియోగదారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. సిబ్బంది సైతం కలవరానికి గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ గంగారాం బ్యాంక్‌కు చేరుకొని వ్యాపారి ప్రకాష్‌కు నచ్చజెప్పారు. బ్యాంకు రీజనల్ అధికారితో అపాయింట్మెంట్ ఇప్పించారు. అనంతరం అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కొద్దిసేపు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
రోహ్తక్ సందర్శించనున్న ప్రకాష్ సింగ్ కమిటి
ప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలోని జాట్ కమిటి శుక్రవారం రోహ్తక్ సందర్శించనుంది. జాట్ రిజర్వేషన్ల ఆందోళన ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కమిటి జిల్లాలోని వివిధ విభాగాల అధికారులను కలిసి సమాచారాన్ని సేకరించనుంది. ఆందోళన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారి వివరాలను కూడ ఈ సందర్భంగా తెలుసుకోనుంది. అదే సమయంలో సమాజంలోని వివిధ విభాగాల ప్రజలను కూడ కమిటి సభ్యులు కలసి అధికారుల పాత్రపై ఆరా తీయనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆందోళన ప్రభావితన ప్రాంతాల్లో ఉదయం పది గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పర్యటించనున్న కమిటి... మధ్యాహ్నం మూడు గంటలనుంచీ, సాయంత్రం ఐదు గంటల వరకూ పోలీసు, సివిల్ అధికారులతో సమావేశమవ్వనుంది. అనంతరం 5వ తేదీ కూడ పలువురు ప్రజలను కలసి సమాచారం సేకరించిన సభ్యులు సాయంత్రం నాలుగ్గంటల సమయంలో మీడియాకు వివరాలను సంక్షిప్తంగా వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. జాట్ల రిజర్వేషన్ ఆందోళనపై.. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్ సింగ్ అధ్యక్షతన హర్యానా ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
స్ఫూర్తిదాత.. విద్యాప్రదాత.. చాయ్ వాలా!
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నారు. అనుకున్నది సాధించాలన్న తపన, బలమైన కోరిక ఉండాలే గానీ అందుకు వయసు, డబ్బు, చదువుతో సంబంధం ఉండదని నిరూపించాడా వృద్ధుడు. ఒడిషాకు చెందిన డి. ప్రకాశ్ రావు చాయ్‌వాలాగా జీవితాన్ని కొనసాగిస్తూనే విద్యా ప్రదాతగా... స్ఫూర్తిదాతగా నిలుస్తున్నాడు. మురికివాడల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడదన్నదే ప్రకాష్ ఆకాంక్ష.. అందుకే చాయ్ వాలాగా ఉంటూ విద్యాప్రదాతగా మారాడు. కపటం లేని, సంతోషకరమైన జీవితం గడపడంతో పాటు.. తాను చదువుకు దూరమైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదనుకున్నాడు. చిన్నతనంలో చదువుపై అత్యంత మక్కువ చూపిస్తున్నా తండ్రి స్కూల్లో చేర్పించకపోవడంతో ఏమాత్రం చదువుకోలేకపోయాడు. తనకు ఎంతగానో ఇష్టమైన చదువు మురికివాడల్లోని పిల్లలకు దూరం కాకూడదన్నదే ధ్యేయంగా నడుం బిగించాడు. ప్రకాష్‌ను.. అతడి తండ్రి ఓ చాయ్ దుకాణంలో చేర్పించాడు. 1976 నుంచే ప్రకాష్ రావు టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. కానీ అతడిలో చదువు నేర్చుకోవాలన్న తపన చావలేదు. స్కూలు చదువునైనా పూర్తి చేయాలన్నఅతడి కోరిక.. పట్టుదల అతడ్ని ఓ పాఠశాల నడిపించే స్థాయికి చేర్చింది. ఉదయం చాయ్ దుకాణంలో పనిచేస్తూనే ఆ డబ్బుతో నర్సరీ నుంచి మూడో తరగతి వరకూ ఉండే 70 మంది పేద పిల్లలతో పాఠశాల నడుపుతున్నాడు. మూడో క్లాస్ తర్వాత తన స్కూలునుంచి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వాళ్లు చదువుకు దూరం కాకుండా తనవంతు కృషి చేస్తున్నాడు. పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారిలో బలహీనంగా ఉన్నవారిని గుర్తించి వారికి బిస్కెట్లు, పాలు అందిస్తున్నాడు. ప్రకాష్ రావుకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ కూడా తన స్కూల్లోనే మూడోతరగతి వరకూ చదివారని చెబుతుంటే అతడి కళ్లు మెరుస్తాయి. తాను చదువు చెప్పలేకపోయినా, అనుకున్నది సాధించాడు. చాయ్ వాలా స్ఫూర్తిదాయక జీవనంపై మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడొచ్చు. -
మాజీ సర్పంచ్ ఇంట్లో చోరీ
అనంతపురం: అనంతపురం జిల్లాలో గురువారం రాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాడిమర్రి మండలం పెద్దకోట గ్రామ మాజీ సర్పంచ్ పాటిల్ ప్రకాశ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ప్రకాశ్ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి 30 తులాల బంగారం, రూ.40 వేల నగదును ఎత్తికెళ్లారు. ప్రకాశ్ కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబసభ్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చిన పక్రాశ్ ఇంట్లో వస్తువులు చిందరబందరగా ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాలో మాకు నచ్చేవి అవే..! - ప్రకాశ్, కనిక
ఒక కోడలి కథ మంచి లావు ఛాన్స్ కొట్టేసింది - కోడలు పిల్ల. ‘సైజ్ జీరో’ సినిమా కథ ఆమెదే. లావుగా ఉన్నా మాకు ఓకే అంటున్నారు అత్తింటివారు. ఎంత లావు సక్సెస్ కొడుతుందో చూడాలి. రాఘవేంద్రరావు కొడుకు - కోడలుతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. సాక్షి: మాకు పూనమ్ ధిల్లాన్ తెలుసు. ఇప్పుడు రాఘవేంద్రరావుగారి కోడలు కనికా ధిల్లాన్ అనేసరికి తెలుగువారు మీ పట్ల కుతూహలంగా ఉన్నారు. కనిక: ఓ... అవునా... థ్యాంక్యూ. ‘సైజ్ జీరో’ సినిమాకు కథ అందించిన రచయిత్రిగా కూడా దక్షిణాదిలో మీరిప్పుడు వార్తల్లో ఉన్నారు. కనిక: అవును... ఆ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సంతోషంగా ఉంది. ఇంతకూ మీ నేపథ్యం ఏంటి? ప్రకాశ్‌కు మీరెలా పరిచయం అయ్యారు. కనిక: మాది అమృత్సర్. నాన్నది వ్యాపారం. అమ్మ ప్రిన్సిపాల్. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వల్ల కథలు అలవాటయ్యాయి. అలా రచయిత్రి కావాలనే కోరిక పుట్టింది. ముంబైలో షారూక్ ఖాన్ సంస్థలో పని చేశాను. ప్రకాశ్ ముంబైలో పని చేస్తూ కథలు రాసే వాళ్ల కోసం వెతుకుతూ నా గురించి తెలుసుకున్నారు. అలా మా పరిచయం అయ్యి, ప్రేమగా మారింది. ఐదేళ్లకు పెళ్లి చేసుకున్నాం. అక్కడే ఉన్న రాఘవేంద్రరావుతో: కనికను పెళ్లి చేసుకుంటానని మీ అబ్బాయి చెప్పగానే ఎలా అనిపించింది? రాఘవేంద్రరావు: అంతకు ముందు పెళ్లి గురించి ప్రకాశ్ అంతగా ఇంట్రస్ట్ చూపించేవాడు కాదు. అందుకని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఆనందపడ్డాను. అయితే మా ఆవిడ ఒప్పుకోదనుకున్నాను. వెంటనే ఒప్పుకుని నన్ను ఆశ్చర్యపరిచింది. కథ, డెరైక్టర్ భార్యాభర్తల్లాంటివాళ్లు. కనిక రచయిత. ప్రకాశ్ డెరైక్టర్. కనుక మంచి జోడీ అనిపించింది. తను కూడా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న అమ్మాయిలాగా మా ఇంట్లో కలిసిపోయింది. నా సిస్టర్స్, బ్రదర్స్.. వాళ్ల పిల్లలతో చాలా బాగుంటుంది. మాకు ఒకే ఒక్క కొడుకు కాబట్టి.. మా కోడలినే కూతురిలా భావిస్తున్నాం. పెళ్లయిన ఈ ఏడాది కాలంలో మీ అత్తామామలు మీకిచ్చిన భరోసా గురించి? కనిక: మా అత్తామామలు నన్ను ఓ కోడలిలా చూడలేదు. కూతురిలానే అనుకున్నారు. ఎప్పుడైనాసరే అత్తామామల నుంచి ఎంకరేజ్మెంట్ లభిస్తే ఆ కోడలు కెరీర్‌పరంగా రాణించే వీలుంటుంది. పెళ్లయిన తర్వాత కూడా నేను సక్సెస్‌ఫుల్‌గా కథలు రాసుకుంటూ, ప్రకాశ్‌తో కలిసి సినిమాలు చేయగలుగుతున్నానంటే మా అత్తామామలు ఇచ్చే ఎంకరేజ్మెంటే కారణం. మీ భార్య అత్తగారి దగ్గర ఉత్తమ కోడలనిపించుకోగలిగారా? ప్రకాశ్: (నవ్వుతూ) అమ్మ ముందు నుంచీ హౌస్ వైఫ్. గుళ్లకు ఎక్కువగా వెళుతుంది. కనిక ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇద్దరూ మాటా మాటా అనుకోవడం, లేనిపోని పట్టింపులు, పంతాలకు పోవడం చేయరు. కనికకు తెలుగు తెలియదు కాబట్టి మీ అమ్మగారు, తన మధ్య సంభాషణకు తావు లేకపోవడం కూడా ఓ అడ్వాంటేజ్ ఏమో? ప్రకాశ్: (నవ్వుతూ). మాటలకన్నా సైగలు ఎక్కువ. అమ్మ మాట్లాడింది అర్థం చేసుకోవడానికి గూగుల్ ట్రాన్స్‌లేటర్ సహాయం తీసుకుంటుంది. అదంతా భలే ఉంటుంది. కనిక: కానీ, తెలుగు నేర్చుకుని ఒకరోజు అత్తయ్యతో గడాగడా తెలుగులో మాట్లాడి, ఆమెను సర్ప్రైజ్ చేయాలని ఉంది. ఇక్కడి సంప్రదాయాల గురించి మీ అత్తగారు చెబుతుంటారా? కనిక: ఇక్కడి ఫంక్షన్లకు ఎలా రెడీ అవ్వాలో నాకు తెలియదు. ఎలాంటి చీరలు కట్టుకోవాలో, ఎలాంటి నగలు పెట్టుకోవాలో అత్తమ్మే చెబుతుంది. ఎలాంటి కలర్స్ సెలక్ట్ చేసుకోవాలో కూడా చెబుతుంది. మీ కోసం మీ అత్తగారు ఏమైనా వంటలు చేసి పెడుతుంటారా? కనిక: దోసలాగ పెద్దగా ఉంటుందే.. అది దోస కూడా కాదు (ప్రకాశ్: దిబ్బరొట్టె గురించి చెబుతోంది). అది చాలా బాగుంటుంది. ఉప్మా చేసి పెడుతుంది. ఒక్కోసారి మా నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చేసి పెడుతుంది. ఒకవేళ నాకు ఏదైనా నచ్చకపోతే ‘ఓకే... వేరే చేసి పెడతాను’ అని చెబుతుంది. మీకు ఎవరైనా అక్కా, తమ్ముళ్లు, చెల్లెళ్లు ఉన్నారా? వాళ్లతో ప్రకాశ్ ఎలా ఉంటారు? కనిక: నాకు ఓ అక్క, తమ్ముడు ఉన్నారు. అక్క లండన్‌లో జాబ్ చేస్తోంది. తమ్ముడు ముంబైలో బ్యాంకర్. ప్రకాశ్ మా ఫ్యామిలీతో చాలా బాగుంటారు. వాళ్లు కూడా ఆయన తో అలాగే ఉంటారు. ప్రకాశ్‌తో మాట్లాడటం మొదలుపెట్టాక ఆయన ఎవరికైనా నచ్చేస్తాడు. మావాళ్లందరికీ చాలా త్వరగా దగ్గరయ్యాడు. లవ్ ప్రపోజల్ ముందు ఎవరు చేశారు? ఎలా చేశారు? ప్రకాశ్: నేనే చేశాను. సినిమాటిక్‌గా అయితే కాదు. {పకాశ్ ప్రపోజ్ చేస్తారని మీరు ముందే ఊహించారా? కనిక: ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఉందని మా ఇద్దరికీ తెలుసు. మా అమ్మానాన్నలకి ఓ విచిత్రమైన సంఘటన ద్వారా తెలిసింది. నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి, ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. అప్పుడు ప్రకాశ్ చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడే మా అమ్మగారు ప్రకాశ్‌ని కలిసింది. ‘ఎవరీ కుర్రాడు.. ఇంత కేర్ తీసుకుంటున్నాడు. చాలా బాగున్నాడు’ అని అడిగింది. మీ నాన్నగారు ఫుల్ మాస్. మీరు క్లాస్ అనిపిస్తోంది. చిన్నప్పట్నుంచీ నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగినా ఆయన ప్రభావం మీ మీద పడలేదనుకోవచ్చా? ప్రకాశ్: బేసిక్‌గా చిన్నప్పట్నుంచీ సినిమాలు చూసినా సినిమాలంటే నాకు ఇంట్రస్ట్ లేదు. థియేటర్ (రంగస్థలం) ద్వారా సినిమాలంటే ఇష్టం ఏర్పడింది. కాలేజ్‌లో థియేటర్ చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లి నేర్చుకున్నాను. థియేటర్ కథలు కమర్షియల్‌గా ఉండవు. నా మీద వాటి ప్రభావమే ఎక్కువగా ఉంది. ముందు ఆర్టిస్ట్‌గానే పరిచయం అయ్యారు కదా.. తర్వాత డెరైక్షన్ వైపు వెళ్లిపోయారేంటి? ప్రకాశ్: అమెరికాలో థియేటర్లో నేర్చుకున్నది యాక్టింగే. అక్కడ నేర్చుకున్న యాక్టింగ్‌కీ, ఇక్కడ సినిమాలకు చేసే యాక్టింగ్‌కీ చాలా వ్యత్యాసం ఉందనిపించింది. నేను ఏదైతే ట్రైన్ అయ్యానో అందుకు పూర్తి డిఫరెంట్‌గా ఇక్కడ చేయమన్నారు. ఓ రెండు సినిమాలు చేసిన తర్వాత ఇక్కడ చేసే తరహా యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఏర్పడలేదు. డెరైక్షన్ మీద ముందు నుంచీ ఇంట్రస్ట్ ఉండటంతో అటువైపు వెళ్లిపోయాను. ‘అనగనగా ఓ ధీరుడు’ తర్వాత మీరు చాలా గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ప్రకాశ్: ఆ సినిమా తర్వాత ఓ ఏడాది కొన్ని కథలు రాసుకున్నాను. ‘గాన్ ఆఫ్ హంటర్స్’ అని ఒక హిందీ టెలివిజన్ షో చేశాను. అది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. దానికి రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత కమర్షియల్ బారామీటర్స్కు అతీతంగా సినిమా చేయాలనుకున్నాను. ఆ సమయంలోనే కనిక చెప్పిన కథ నచ్చింది. కథలో మానవీయ విలువలు ఉన్నాయనిపించింది. అందుకని ‘సైజ్ జీరో’ చేశాను. వంద చిత్రాలకు పైగా చేసిన మీ నాన్నగారు ఎక్కువ సినిమాలు తీయమని ఒత్తిడి చేయలేదా? మీరు నాన్నగారి మేకింగ్ స్టయిల్ని అడాప్ట్ చేసుకోవాలనుకోలేదా? ప్రకాశ్: నేను ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విషయం మీద మా ఫ్యామిలీలో ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదు. నాన్నగార్ని ఫాలో కావాలనుకోలేదు. ఆయన అన్ని సినిమాల్లోనూ ఫ్రూట్స్ లాంటి కలర్‌ఫుల్ థింగ్స్ వాడలేదు. ‘జ్యోతి’లో కానీ, ‘ఆమె కథ’లో కానీ అలాంటివి కనిపించవు. ఎందుకంటే, ఆ కథలకు అవి అవసరంలేదు. మేకింగ్ స్టయిల్ అనేది స్టోరీ జానర్‌ని బట్టే ఉంటుంది. నేను ఎన్నుకునే కథలు ఎలాంటి మేకింగ్ స్టయిల్ని డిమాండ్ చేస్తే అదే చేస్తాను. ఓకే... మళ్లీ కనికతో మాట్లాడదాం... మీ భర్త టాలెంటెడ్ అయినప్పటికీ ఇప్పటివరకూ చేసిన బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు కమర్షియల్‌గా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. మీరు ఇచ్చిన కథతో ఆయన తీసిన ‘సైజ్ జీరో’ ఆ కొరతను తీస్తుందంటారా? కనిక: ప్రకాశ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. జాతీయ అవార్డు సాధించాడు. ఇక.. కమర్షియల్ సక్సెస్‌కి వస్తే.. ‘సైజ్ జీరో’ ఫన్ మూవీ, ఫ్యామిలీ ఫిల్మ్. సో.. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అంతే తప్ప ఆ సినిమా ఇంత సక్సెస్ కావాలని నేను లెక్కలేసుకోవడంలేదు. మంచి సినిమా తీశాం. అందరూ ఎంజాయ్ చేయాలన్నది నా ఆకాంక్ష. మీ మామగారి మేకింగ్ స్టయిల్‌తో ప్రకాశ్ మేకింగ్ స్టయిల్ని కంపేర్ చేస్తే మీకేమనిపిస్తుంది? కనిక: మా మామగారిది విభిన్న శైలి. ప్రకాశ్‌ది మరో శైలి. ఇద్దరి టేకింగ్‌నీ కంపేర్ చేయలేం. మా మామగారి టేకింగ్ గురించి బాలీవుడ్లో కూడా మాట్లాడుకుంటారు. అక్కడి దర్శకుల్లో చాలామంది ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటారు. మామగారి ప్రభావం ప్రకాశ్ మీద అంతగా లేదు. ఎందుకంటే, ప్రకాశ్ ఎంచుకునే కథలు మామగారి కథలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. కనికా.. మీరు కథలు రాస్తుంటారు కాబట్టి, ఓ స్టోరీ రైటర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? కనిక: నేను తెలుసుకున్నదేంటంటే.. ఏ కథకైనా మంచి కథావస్తువు ముఖ్యం. కథలో ఎమోషన్ ఉండాలి. వేగం ఉండాలి. ఆ కథకు తగ్గ స్క్రీన్‌ప్లే-డైలాగ్స్ ఉండాలి. నేను కథలు రాసేటప్పుడు ఆ విషయాల్నే దృష్టిలో పెట్టుకుంటాను. ఇంట్లో మామగారు ఉంటారు కాబట్టి, కథ రాసేటప్పుడు ఇంకా జాగ్రత్తపడాలి. ఎందుకంటే, తెలియకుండా ఆయన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. {పకాశ్లో ఉన్న మూడు బెస్ట్ క్వాలిటీస్ చెబుతారా? కనిక: ప్రకాశ్ గురించి మా అమ్మ దగ్గర చెప్పగానే ఆవిడ కూడా ఇలానే అడిగారు (నవ్వుతూ). బేసిక్‌గా నేను క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, తనూ ఈ ఫీల్డ్‌లో ఉండటం, స్టోరీ టెల్లింగ్‌లో తను చూపించే కొత్తదనం నాకు చాలా నచ్చాయి. ప్రకాశ్ చాలా టాలెంటెడ్. ఆ టాలెంట్‌ని ఇష్టపడ్డాను. ఎదుటి వ్యక్తుల కోసం తనను తాను మార్చుకోడు. ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటాడు. ఎవరి దగ్గరా నటించడు. ఈ రోజుల్లో ఇలాంటి లక్షణాలున్నవాళ్లు చాలా అరుదు. {పకాశ్.. కనికలో మీకు నచ్చిన లక్షణాలు? ప్రకాశ్: మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. చాలా మంచి వ్యక్తి. పంతం నెగ్గించుకోవాలనుకోదు. పట్టువిడుపుగా వ్యవహరిస్తుంది. స్నేహంగా ఉంటుంది. టోటల్‌గా కూల్ పర్సన్. ఇద్దరం ఒకే ఫీల్డ్‌లో ఉంటాం కాబట్టి, చాలా విషయాల్లో ఇద్దరం కనెక్ట్ అవుతాం. ప్రొఫెషనల్లీ ఎదగడానికి మేం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. మీ చేతి వంటను ప్రకాశ్‌కు రుచి చూపించారా? కనిక: వంట చేస్తాను. అది తినే ధైర్యం ఒక్క ప్రకాశ్ మాత్రమే చేస్తాడు. రెగ్యులర్‌గా కుక్ చేయను. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. ప్రకాశ్ వద్దనకుండా తింటాడు. మరి.. మీకు వంట వచ్చా? ప్రకాశ్: అంత కాదు.. అస్సలు రాదనే చెప్పాలి. కనిక: శాండ్విచెస్ చేస్తాడు (నవ్వుతూ). ఓకే.. ఈ ఏడాది జీవితం ఎలా అనిపించింది? కనిక: ముందు మీరే చెప్పండి. ప్రకాశ్: వెరీ గుడ్ అండి. కనిక వేరే సిటీ నుంచి వచ్చిన అమ్మాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి. నేను షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఇంట్లో లేకపోతే తాను ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. బాగానే ఎడ్జస్ట్ అయింది. పైగా మంచి రచయిత కావడంతో సెట్‌కు వచ్చి మంచి డెసిషన్స్ కూడా తీసుకునేది. నాకు ఆన్ సెట్లో మంచి సపోర్ట్ ఇస్తుంది. అఫ్ సెట్.. అంటే ఇంట్లో మేం హ్యాపీ కపుల్. కనిక: ఏడాది ఎలా గడిచిపోయిందో తెలియడంలేదు. కొత్త వ్యక్తులు, కొత్త వాతావరణం, కల్చర్ అన్నీ కొత్తే. కానీ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. బర్త్‌డేస్‌కి సర్ప్రైజ్ చేసుకోవడం వంటివి? ప్రకాశ్: నా 40వ పుట్టిన రోజుకి కనిక సర్ప్రైజ్తో కూడిన షాక్ ఇచ్చింది. కనిక: ఆయనకు సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. అందుకే పుట్టిన రోజున మంచి సర్ప్రైజ్ ఇచ్చాను. ప్రకాశ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ సూపర్ హీరో గెటప్‌లో పార్టీకి హాజరయ్యేలా చేశా. ఆయనకు నిజంగా ఆ రోజున అది స్వీట్ షాక్. మీ ఇద్దరి కాంబినేషన్లో వస్తోన్న తొలి చిత్రం ‘సైజ్ జీరో’ ఎలా ఉంటుంది? కనిక: అందరూ మంచి సినిమా తీశారని అంటారు. ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదు. అందర్నీ ఆకట్టుకుంటుంది. యూత్, ఫ్యామిలీస్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు. మీరింత సన్నగా ఉన్నారు. జీరో సైజ్ అని ఓ లావుగా ఉన్న అమ్మాయి గురించి రాయాలని ఎందుకనిపించింది? కనిక: నా చుట్టూ ఉన్న వాళ్లల్లో కొంతమంది జీవితం ఆధారంగా ఈ కథ రాశాను. పెళ్లి అవుతుందంటే నాలుగు నెలల ముందు నుంచి అమ్మాయిని బరువు తగ్గమంటారు. నార్త్, సౌత్ ఎక్కడైనా ఈ పద్ధతి ఒక్కటే. ముఖ్యంగా న్యూస్ పేపర్స్ తెరిస్తే స్లిమ్ సెంటర్స్ గురించే ఉంటున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని కథ రాశాను. ఓ లావుగా ఉన్న అమ్మాయి జీవితం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఆ అమ్మాయికి కొన్ని వెయిట్ ఇష్యూస్ ఉంటాయి. ఆ అమ్మాయి వాటిని ఎలా ఫేస్ చేసింది? అనేది సినిమా. ఎమోషనల్‌గా ఉంటూ నవ్విస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో కనిక ‘సైజ్ జీరో’లోలా అనుష్క అంత బరువు పెరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్రకాశ్: చెప్పాలంటే... నేను తనను బరువు పెరగమనే చెబుతున్నాను. వినడం లేదు. కనిక: ఆయనకు నేను బరువు పెరిగితే హ్యాపీనే. -
చచ్చాడు.. బతికాడు.. మళ్లీ చచ్చాడు
ముంబయి: చనిపోయిన వ్యక్తి పోస్టు మార్టానికి తీసుకెళ్లాక లేచి అందరినీ అవాక్కయ్యేలా చేసి రెండు రోజులు ప్రాణాలతో ఉండి తిరిగి మళ్లీ చనిపోయాడు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. గత ఆదివారం ముంబయి నగరంలో ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. రోడ్లు వెంట పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ క్రమంలో ఓ ఆస్పత్రికి సమీపంలో ప్రకాశ్(50) అనే ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా నాడీ పరీక్షించిన వైద్యుడు అతడిని చనిపోయినట్లు నిర్ధారించాడు. దీంతో పోస్టుమార్టానికి కావాల్సిన ప్రక్రియ పూర్తి చేసి పోస్టుమార్టం ప్రారంభించే సమయంలో లేచి కూర్చుని మొత్తం ఆస్పత్రినే కాకుండా పోలీసులను కూడా అవాక్కయ్యేలా చేశాడు. అయితే, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో బతికి ఉన్న వ్యక్తిని చనిపోయాడని చెప్పారని పలు రకాలుగా విమర్శించారు. ఆ వెంటనే అతడిని ఐసీయూలోకి తరలించారు. అయితే, అలా బతికిన వ్యక్తి రెండు రోజులు మాత్రమే ప్రాణాలతో ఉండి ఐసీయూలో మంగళవారం చనిపోయాడు. ఆస్పత్రి డీన్ సులేమాన్ మర్చంట్ ఈ విషయం ధ్రువీకరించారు. -
ఇసుక అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు
వి.కోట(చిత్తూరు): ఇసుక అక్రమరవాణా చేస్తూ ఓ టీడీపీ నేత పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలానికి చెందిన టీడీపీ నేత ప్రకాశ్ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి వెళ్లి జేసీబీ, లారీలను సీజ్ చేశారు. అనంతరం ఈ తంతకు పాల్పడుతున్న ప్రకాశ్‌పై కేసు నమోదు చేశారు. -
గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం
హిందూపురం: గణేశ్ నిమజ్జనం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ అనే వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణానికి చెందిన ప్రకాశ్ (35) నిమజ్జన వేడుకుల్లో పాల్గొన్నాడు. అయితే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలొదిలాడు. ప్రకాశ్‌కు భార్య, ఒక కూతురు ఉంది. -
తలలో బాణం.. 240 కిలోమీటర్ల ప్రయాణం
తలలో బాణం గుచ్చుకున్న ఈ యువకుడి పేరు ప్రకాశ్. ఇంట్లో నిశ్చితార్ధం సమయంలో పొరుగింట్లో ఉండే అర్జున్ కుటుంబసభ్యులతో జరిగిన గొడవ పెద్దదై ఇలా బాణాలు వేసుకునేదాకా వచ్చింది. బాణం గుచ్చుకున్న ఇతన్ని అంబులెన్స్‌లో 240కిలోమీటర్లు ప్రయాణించి ధార్, బడ్వానీ, ఖర్గోన్ జిల్లాలు దాటి ఇండోర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు మెదడును చేరిన బాణం మొనను గంటపాటు శస్త్రచికిత్స చేసి వైద్యులు తొలగించారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజనులైన భిల్లులు.. గొడవలైన ప్రతిసారీ బాణాలకు పనిచెప్తారన్న విషయం తెలిసిందే. -
కడుపునొప్పితో యువకుడి ఆత్మహత్య
మహబూబ్‌నగర్: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా రేగడి మైలారంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రకాశ్ (18) ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఇంటివద్దే ఉంటూ తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేసేవాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోంచి వెళ్లిన ప్రకాశ్ బావివద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడుపు నొప్పితోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అతని తండ్రి అంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు భాషల్లో...సైజ్ జీరో...
బొద్దుగుమ్మ అనుష్క ఏంటి?... సైజ్ జీరో ఏంటి? అనుకుంటున్నారు కదూ! అయితే ఆ వివరాలు సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడినే అడగాలి. చాలా విరామం తర్వాత ప్రకాశ్ ‘సైజ్ జీరో’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. ఇందులో అనుష్క, ఆర్య ప్రధాన తారలు. శ్రుతీహాసన్ అతిథి పాత్ర ధారిణి. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రం ముహూర్తం జరిగింది. నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి సతీమణి ఝాన్సీ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు ప్రకాశ్ భార్య కణికా థిల్లాన్ క్లాప్ ఇచ్చారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ప్రసాద్ పొట్లూరి తెలిపారు. భరత్, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: నీరవ్‌షా, ఆర్ట్: ఆనందసాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణికా థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం. -
పెళ్లి చూపులకెళుతూ తిరిగిరాని లోకాలకు..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు కెలమంగళం : పెళ్లి చూపులకు వెళుతున్న ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన డెంకణీకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తళి కొత్తనూరు గ్రామానికి చెందిన ఎన్.ప్రకాష్(28), స్నేహితుడు ప్రకాష్(22), వెంకటేశ్(40) కలిసి ద్విచక్ర వాహనంలో పెళ్లి చూపుల కోసం డెంకణీకోట సమీపంలో అర్తకూరుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. డెంకణీకోట- తళి రోడ్డు కాళేనట్టి వద్ద టెంఫో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎన్.ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్నేహితుడు వెంకటేశ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ప్రకాష్ తీవ్ర గాయాలపాలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని టెంపో డ్రైవర్ సలీంను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కట్టం తక్కువ.. లాభాలెక్కువ!
ఆకు కూరల సాగుతో ఎంతో మంది రైతులు తక్కువ కాలంలో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే దీనికి పెట్టుబడి, శ్రమ కూడా చాలా తక్కువ. విత్తిన నెల రోజుల్లో రైతన్న చేతికి డబ్బు అందించే పంటల్లో ప్రధానమైనవి ఆకు కూరలేనంటే అతిశయోక్తి కాదు. అతి తక్కువ నీటితో ఈ తోటలను సాగు చేయవచ్చు. కొద్ది విస్తీర్ణంలో పంట వేసుకుంటే వాటరింగ్ కేన్ల (నీటిని తుంపరగా పోసే డబ్బాలు)తో కూడా నీటిని అందించొచ్చు. తోట కూరల్లో ఏడెనిమిది రకాలు ఉన్నాయి. వీటిలో ఆర్ఎన్, ఏ-1, కో-1, పూసా చోటీ చౌలై, పూసాబడి చౌలై, పూసా కీర్తి, పూసా కిరణ్, పూసాలాల్, ఔలై, అర్కసుగుణ, అర్కఅరుణ (ఎర్ర తోటకూర) రకాలు ఎంపిక చేసుకోవచ్చు. నాటిన 25 రోజులకే కోసి విక్రయించే వీలున్న సిరికూర రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. సస్యరక్షణ చర్యలు... తోట కూరకు తెల్ల మచ్చ తెగులు, ఆకులను తినే గొంగళి పురుగుల బెడద ఉంటుంది. తెల్ల మచ్చ తెగులు ఆశిస్తే ఆకుల అడుగు భాగాన తెల్లని బుడిపెలు ఏర్పడుతాయి. పైభాగంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పండుబారి ఆకులు ఎండిపోతాయి. తెల్ల మచ్చల నివారణకు గాను లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా క్లోరోథలోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మలాథీన్ కలిపి స్ప్రే చేయాలి. ఆకు కూరలకు సాధ్యమైనంత వరకు వేప సంబంధ మందులతోనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తప్పని పరిస్థితుల్లో మాత్రమే తక్కువ విషపూరితమైన మందులను వినియోగించాలి. ముందు చల్లే ముందు ఆకులను కోసుకోవాలి. పురుగు మందు పిచికారీ చేసిన నాలుగైదు రోజుల వరకు కూర కోయకూడదు. విత్తే విధానం... తోటకూర సాగుకు ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం. నీరు నిలిచే బంకమట్టి ఇసుక నేలలు పనికి రావు. విత్తనాలు అలికే ముందు నేలను 4-5 సార్లు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 6 టన్నుల పశువుల ఎరువు వేసి దున్నుకోవాలి. అనంతరం చదను మళ్లు చేసుకోవాలి. సన్నటి ఇసుకతో విత్తనాలు కలిపి మళ్లలో వెదజల్లాలి. నారు పెంచి మొక్కల్ని కూడా నాటుకోవచ్చు. విత్తనం చల్లే విధానంలో ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. నారు నాటే పద్ధతిలో అయితే కిలో విత్తనం సరిపోతుంది. కలుపు నివారణ కోసం విత్తనం చల్లిన ఒకటి రెండు రోజుల తర్వాత వ్యవసాయ అధికారుల సూచన మేరకు గడ్డి మందుల పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు ఎకరాకు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చె ఎరువులను వేసి కలియదున్నాలి. కత్తిరింపుల ద్వార ఆకు కోసుకొనే రకాలకు 30 కిలోల నత్రజని మూడు భాగాలు చేసి కత్తిరింపు తరువాత ఒక భాగం వేసి నీరు పెట్టాలి. -
రెండోరోజూ బుజ్జగింపులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతారనే వార్తలతో అప్రమత్తమైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వరుసగా రెండోరోజూ బుధవారం కూడా బుజ్జగింపుల పర్వానికి దిగారు. మంగళవారం జరిపిన సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్‌లు చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆరా తీసిన ఆయన... ముగ్గురు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, వాటిని తట్టుకునే నిలబడితేనే భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గులాబీ శిబిరం వలలో చిక్కవద్దని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన మీరు.. ఈ సమయంలో అనవసర ఆలోచనలు పెట్టుకోవద్దని హితోపదేశం చేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చే సేందుకు సమావేశాలు నిర్వహించుకోవాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మరోవైపు పార్టీ మారుతారనే ప్రచారంపై ఎమ్మెల్యేలు నర్మగర్భంగా వ్యవహరించినట్లు తెలిసింది. టీఆర్ఎస్లో చేరడంలేదని, పత్రికల్లో వస్తున్న కథనాలు నిరాధారమని పేర్కొన్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ ఆడుతున్న మైండ్‌గేమ్‌లో భాగంగానే తమపై దుష్ర్పచారం జరుగుతోందని చంద్రబాబుతో అన్నట్లు సమాచారం. -
కేఎంఎఫ్ అధ్యక్షుడిగా రవీంద్ర?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కర్ణాటక పాడి సమాఖ్య (కేఎంఎఫ్) అధ్యక్షుడుగా దావణగెరె జిల్లా హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ. రవీంద్ర ఎన్నిక కావచ్చని తెలిసింది. దివంగత మాజీ మంత్రి ఎంపీ ప్రకాశ్ తనయుడైన రవీంద్రను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై సహకార శాఖ మంత్రి హెచ్ఎస్. మహదేవ ప్రసాద్ నివాసంలో రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్, న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్రలు సోమవారం రాత్రి సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నాయకుడు పీ. నాగరాజ్ కూడా ఆ పదవిని ఆశిస్తున్నందున, వెంటనే నిర్ణయం తీసుకోలేక పోయినట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 13 ప్రధాన పాడి సంఘాలకు డెరైక్టర్లు ఉండగా, వీరిలో 11 మంది కాంగ్రెస్ వారే. ఇద్దరి మధ్య పోటీ ఉన్నందున బుధవారం కేఎంఎఫ్ అధ్యక్ష అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తామని సమావేశం అనంతరం మహదేవ ప్రసాద్ తెలిపారు. గతంలో కేఎంఎఫ్ అధ్యక్షుడిగా గాలి సోమశేఖర రెడ్డి కొనసాగగా, ఆయన పదవీ కాలం జులై 15తో ముగిసింది. సుమారు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ఈ పదవి దక్కనుంది. కాగా అధ్యక్ష అభ్యర్థి ఎంపికపై తమ పార్టీ మద్దతుదార్లయిన డెరైక్టర్ల అభిప్రాయాలను సేకరించినట్లు మహదేవ ప్రసాద్ తెలిపారు. -
గల్లంతై పదేళ్లు..ధ్రువీకరణకు ఇంకెన్నేళ్లు?
పిఠాపురం :ఆచూకీ లేని మేరుగు మసేనుకు భార్య నాగమణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కోడ తాతబాబుకు అప్పటికిఐదు నెలల క్రితమే వివాహమైంది. తిర్రి మరిడియ్య, నూకరాజు తండ్రీకొడుకులు. వారిద్దరి కోసం బెంగ పెట్టుకున్న మరిడయ్య భార్య కాశమ్మ అదే బాధతో మరణించింది. ప్రకాష్‌కు భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు ఉండగా, తిర్రి కొండయ్యకు భార్య కొయ్యమ్మ, మేరుగు కొండయ్యకు భార్య కొండమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పదేళ్లుగా వారి కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలు ఆసరా కోల్పోయి రోడ్డున పడ్డాయి. పదేళ్లయినా ధ్రువీకరణ లేదు అప్పట్లో కలెక్టర్ సహా ఉన్నతాధికారులంతా బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఏడుగురు మత్స్యకారులు ఆచూకీ లేకుండా పోయి పదేళ్లయినా, వారు చనిపోయినట్టుగా ఇప్పటికీ అధికారులు ధ్రువీకరించలేదు. దీంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం పూర్తిగా అందలేదు. సాధారణంగా సముద్రంలో ఎవరైనా ఆచూకీ లేకుండా పోతే ఏడేళ్ల అనంతరం వారు చనిపోయినట్టుగా అధికారులు ధ్రువీకరిస్తారు. తద్వారా ఆయా కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందుతుంది. ఈ ఏడుగురి విషయంలో మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు. తూతూమంత్రంగా సాయంఆచూకీ లేకుండా పోయిన ఐదో రోజు రూ.ఐదు వేలు, మూడు నెలల అనంతరం రూ. ఐదు వేలు, మూడేళ్ల అనంతరం రూ.40 వేల ఆర్థికసాయం అందించిన అధికారులు.. ఏడేళ్ల తర్వాత వారు చనిపోయినట్టు ప్రకటించి, పూర్తి ఆర్థికసాయం అందిస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఇప్పటికీ పదేళ్లయినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాగోడు వినే నాథుడు లేడు మా వాళ్ల ఆచూకీని గుర్తించాలని, లేకుంటే వారు చనిపోయినట్టుగానైనా ప్రకటించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా, వారు పట్టించుకోవడం లేదు. ఏ దిక్కూ లేక, అయిన వారు దూరమై మానసిక వేదనతో అలమటిస్తున్నాం. అన్నీ కోల్పోయి వీధులపాలయ్యాం. - తిర్రి కొయ్యమ్మ, సుబ్బంపేట ఆ ఏడుగురు వీరే.. అది 2004 జూన్ రెండో తేదీ. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన మేరుగు మసేను (45), కోడ తాతబాబు(22), తిర్రి మరిడియ్య(53), తిర్రి నూకరాజు(18), మారిపల్లి ప్రకాష్(25), తిర్రి కొండయ్య, మేరుగు కొండయ్య అనే మత్స్యకారులు మేరుగు సుబ్బారావు బోటుపై చేపల వేటకు వెళ్లారు. సొర చేపల వేటకు సముద్రంలోకి వెళితే ఐదు రోజులకు కాని, తీరానికి చేరే అవకాశం లేదు. తుపాను రావడంతో అన్ని బోట్లు తీరానికి చేరుకోగా, వీరి బోటు మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు. మాకు న్యాయం చేయండి కుటుంబ ఆసరా కోల్పోయాం. హామీలు ఇచ్చిన వారు కనిపించడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. మా బతుకులు దుర్భరమయ్యాయి. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. బోటు గల్లంతైతే బీమా ఇస్తున్నారు. మనుషులు పోతే పట్టించుకోవడం లేదు. - మారిపల్లి పద్మ, సుబ్బంపేట మా బతుకులు అగమ్య గోచరమే కుటుంబ యజమాని అదృశ్యమైపోయాడు. మేము వీధుల పాలయ్యాం. అయినా కనికరించే నాధుడు కనిపించడం లేదు. ఎవరికి చెప్పుకున్నా విని వదిలేస్తున్నారు. ఇక ప్రభుత్వం పట్టించుకోకపోతే మా బతుకులు అగమ్యగోచరమే. - మేరుగు నాగమణి, బాధితురాలు సుబ్బంపేట. ఆచూకీ చెబుతారా..ఆసరా కల్పిస్తారా? ప్రభుత్వ తీరు మమ్మల్ని కలిచివేస్తోంది. మొదట్లో నాయకులు అధికారులు వచ్చి మీ కుటుంబాలను ఆదుకుంటామంటూ వాగ్దానాలు చేశారు. పదేళ్లయినా మావాళ్ల ఆచూకీ లేదు. ఇప్పటికైనా అధికారులు మావాళ్ల ఆచూకీ అయినా తెలపాలి లేదా మాకు ఆసరా కల్పించాలి. - మేరుగు కొండమ్మ, బాధితురాలు, సుబ్బంపేట. -
తాగుబోతు అల్లుడి దురాగతం
తాగిన మైకంలో ఓ ప్రబుద్ధుడు అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెట్టడమే కాకుండా బావమరుదుల వాహనాలు దహనం చేశాడు. బాధితుల కథనం ప్రకారం.. స్థానిక వెంకంపేటకు చెందిన పంతగాని లక్ష్మీరాజం కూతురు లావణ్య వివాహం సాయినగర్‌కు చెందిన గంగుల ప్రకాశ్‌తో పదేళ్ల క్రితం జరిగింది. పెళ్లి సమయంలో రూ.రెండు లక్షలు కట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దిరోజుల తర్వాత అదనపు కట్నం తేవాలని ప్రకాశ్ భార్య లావణ్యను వేధించాడు. దీంతో లక్ష్మీరాజం అల్లుడికి గణేశ్‌నగర్‌లో ప్లాటు కొనిచ్చాడు. వ్యసనాలకు బానిసైన ప్రకాశ్ దానిని అమ్ముకున్నాడు. పలుమార్లు లావణ్యను వేధించడంతో పలుమార్లు డబ్బులు కూడా ఇచ్చాడు. ఇటీవల ప్రకాశ్ అత్తారింటికి వచ్చి అందరిపై దాడిచేసి డబ్బులను డిమాండ్ చేశాడు. దీంతో వారు సిరిసిల్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో గురువారం రాత్రి 11 గంటలకు అత్తారింటి గేటుదూకి బావమరుదుల వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనలో రూ.లక్ష ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. -
ఇంట ఆమె గెలిచింది... రచ్చ ఆయన గెలిచాడు
చెఫ్... అని గూగుల్‌లో ఇమేజెస్ వెతకండి... అందులో ఎంతమంది ఆడవాళ్లున్నారో లెక్కపెట్టండి. మౌస్‌ను ఎంత కిందికి దించినా కనపడటం లేదా? ప్రతి ఇంట్లోనూ స్త్రీ చేతి వంటే మనం తింటున్నాం. కానీ దాదాపు ప్రతి హోటల్లోనూ పురుషుడే మనకు వండి పెడుతున్నాడు. దీనికి కారణాలేంటని ఆరా తీస్తే సమాధానాలు, విశ్లేషణలు బోలెడొచ్చాయి. స్త్రీకి మానసికంగా సహనం ఎక్కువే ఉండచ్చు గాని శ్రమతో కూడిన సహనాన్ని భరించడానికి ఆమె శరీర నిర్మాణం అనుకూలంగా ఉండదు. గతంలో గ్యాస్ స్టౌలు, పనిని సులువు చేసే ఆధునిక పాత్రలు, ఇతర సదుపాయాలు లేకపోవడంతో, ఎక్కువమందికి ఒకేసారి వంట చేయడం స్త్రీలకు కష్టమయ్యేది. సహాయకులను పెట్టుకుందామన్నా, మగసహాయ కులు కావాలి. అప్పటి సమాజం దీనిని పూర్తిస్థాయిలో అనుమతించలేదు. వంట బాగా వచ్చిన స్త్రీలు... సొంత ఇంటి వేడుకల వరకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేవారు. వృత్తిగా స్వీకరించడానికి అనువైన పరిస్థితు లు ఉండేవి కావు. దీంతో స్త్రీలకు సామర్థ్యాలున్నా ఈ రంగంలోకి రాలేదు. ఎక్కువమంది స్త్రీలు చెఫ్‌లుగా లేకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఏదైనా ఒక రంగంలో స్త్రీలు అసలు వేలు పెట్టే పరిస్థితులే లేనపుడు, తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారినా అది అందరికీ తెలిసి, దానిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ విషయం సమాజం అంగీకరించడానికి మరింత సమయం పడుతుంది. అందుకే స్త్రీలు చెఫ్‌లుగా రాణించే పరిస్థితులు కొన్నేళ్ల క్రితమే వచ్చినా వారు ఈ రంగం వైపు మొగ్గు చూపలేకపోయారు. ఇంకో విషయం.. వంట ఓ కళ. స్త్రీలకు మాత్రం వంట ఒక దినచర్య. పైగా ఇళ్లలో కుటుంబసభ్యుల ఆకలి తీర్చడం ప్రధానం. అందువల్ల వంటను ఒక కళగా, ప్రయోగాలు చేసే అంశంగా స్త్రీలు చూసేవారు కాదు. మరో కారణం ఏంటంటే... ఈ రంగంలో గతంలో వేతనాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఖరీదైన రెస్టారెంట్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లు రావడం, ప్రజలు తినడానికి బయటకు వెళ్లడాన్ని ఇష్టపడుతుండటం వల్ల అవకాశాలు బాగా పెరిగాయి. వాటితోపాటు ఆదాయం కూడా పెరిగింది. దీంతో ఇప్పుడు స్త్రీలు చెఫ్ లుగా రాణించే అవకాశాలు పెరుగుతున్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరుతున్న స్త్రీల శాతం పెరుగుతోంది. కాకపోతే ఈ టైమింగ్స్ వారిని ఇంకా నియంత్రిస్తున్నాయి. కొత్తగా వచ్చిన వెసులుబాటు ఏంటంటే... గతంలోలా భారీ పాత్రలతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే... ఆర్డర్లకు అనుగుణంగా ‘చెఫ్’లు వాటిని ఇద్దరు, ముగ్గురు, మహా అయితే ఏడెనిమిది మందికి సరిపడే తక్కువ పరిమాణాల్లో వండితే చాలు. ఏదేమైనా తమకు బాగా తెలిసున్న పనిలో స్త్రీలు ఇంత ఆలస్యంగా రావడం ఒక విచిత్రం! - ప్రకాశ్ చిమ్మల -
మగాళ్ల కోసం, మగాళ్ల చేత..!
మగాళ్లు, ఆడాళ్లు సమానమే ... ఈ వాక్యంలో మీకేమైనా తేడా కనిపిస్తోందా? జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది. మగాళ్లు అంటున్నారు ఈ నినాదం స్త్రీలది కాదు, మగాళ్లదని! సాధారణంగా ఇంతవరకు మహిళలు అనేవారు ‘స్త్రీ పురుషులు సమానం’ అని. ఇపుడు సీన్ మారింది. ఎందుకు? ఏంటి? ఎపుడు?... అన్నది ఇపుడు చూద్దాం. మగాళ్లు మమ్మల్ని అణచివేస్తున్నారు... మాకు రక్షణ కల్పించండి అన్న వారి వేదనతో స్త్రీల ప్రాణ, మాన రక్షణకు, జీవిత భరోసాకు చట్టాలు వచ్చాయి. ‘ఆ చట్టాలు ఇపుడు మమ్మల్ని వేధిస్తున్నాయి’ అని పురుషులు ఇపుడు నినదిస్తున్నారు. అయితే, స్త్రీలను వేధిస్తున్నవారు, మహిళా చట్టాల ద్వారా బాధలు అనుభవిస్తున్న వారు వేర్వేరు. రక్షణ కోసం చేసిన చట్టాలను కొందరు స్త్రీలు దుర్వినియోగం చేయడంతో దేశంలో కొందరు మగాళ్లు తమ హక్కుల కోసం పోరాటాలు మొదలుపెట్టారు. ‘‘స్త్రీలు, పురుషులూ సమానమే మేము ఒప్పుకుంటాం, కానీ, పురుషులను మహిళా చట్టాలతో అణిచి వేస్తే మాత్రం ఒప్పుకోం. ఎవరికో న్యాయం చేయబోయి, ఇంకెవరికో అన్యాయం చేస్తారా?’’ అని ప్రశ్నిస్తున్నాయి పురుషుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాలు. ఇటీవల దేశంలో ఇలాంటి సంఘాలు పెరిగిపోయాయి. ఆ సంఘాలు పెరిగాయంటే.. బాధిత మగాళ్ల సంఖ్య పెరిగిందని అర్థం చేసుకోవాలి. నేషనల్ కొయలిషన్ ఫర్ మెన్ (జాతీయ పురుషుల కూటమి) ఒకడుగు ముందుకు వేసింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ‘‘ఎంతసేపూ స్త్రీల గురించే పట్టించుకుంటున్నారు. పురుషుల సమస్యలను గాలికొదిలేస్తున్నారు’’ అని ఎన్సీఎం కన్వీనర్ అమిత్ గుప్తా రాజకీయ పార్టీలను నిందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి పార్టీ మగాళ్ల హక్కుల గురించి మ్యానిఫెస్టోలో ప్రస్తావించాలి. పురుషుల హక్కుల పరిరక్షణ దిశగా అడుగులు వేయాలి. స్త్రీలకు మల్లే పురుషులకూ మహిళా కమిషన్, మహిళా మంత్రిత్వ శాఖలున్నట్లే పురుషులకూ ఉండాలంటున్నారు. మీరు మ్యానిఫెస్టోలో మా హక్కుల గురించి ప్రస్తావించండి అని కరాఖండిగా అడిగినా అక్కడి నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో ఏకంగా పురుషుల కోసం ఓ రాజకీయ పార్టీయే పెట్టడానికి సిద్ధమైంది ఆ కూటమి. పార్టీ లక్ష్యాలేంటి? అన్నపుడు వారి వద్ద ప్రామాణికమైన లెక్కలున్నాయట. వరకట్న వేధింపుల చట్టం, గృహహింస చట్టాల కారణంగా మహిళలు పొందుతున్న రక్షణ కంటే మగాళ్లకు జరుగుతున్న నష్టమే ఎక్కువంటున్నారు. ‘‘దేశంలో గృహహింస చట్టాన్ని 70 శాతం మంది దుర్వినియోగం చేస్తున్నారు. మా పోరాటం ఆ చట్టాలపై కాదు, వాటిని దుర్వినియోగం చేస్తున్నా వారిపై మాత్రమే’’ అంటున్నారు అమిత్ గుప్తా. దేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని మతాల్లో మగాళ్లకు ఇదే సమస్య. పురుషాధిక్య సమాజం అన్న ముద్ర ఉండటం వల్ల పురుషులు తమ సమస్యలను చెప్పుకోవడానికి వేగంగా ముందుకురారు. అందుకే పురుషుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వారికి కూడా ఓ వేదిక కావాలి. మగాళ్లు బాధలు చెప్పుకోవడం అవమానకరం ఏమీ కాదు, అవసరం. మొత్తానికి ఈ ప్రకటన వెలువడ్డాక ఎక్కడా ఎవరూ వింతగా చూడలేదు. నిజమే కాబోలని కొందరంటే... దాదాపు అన్ని పురుష సంక్షేమ సంఘాలు, సమాఖ్యలు పార్టీ వస్తే మంచిదే అంటున్నాయి. మరి భవిష్యత్తు ఏంటో! - ప్రకాష్ చిమ్మల -
ఘనంగా ముగిసిన హంపి ఉత్సవాలు
హంపి ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి ఎంపీ ప్రకాష్ వేదికపై ఏర్పాటు చేసిన న్యూఢిల్లీకి చెందిన ప్రతిభా ప్రహ్లాద్ బృందం భరత నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. సుమారు గంట పాటు సాగిన భరత నాట్యానికి సందర్శకులు తన్మయత్వం చెందారు. శ్రీకృష్ణదేవరాయ వేదికపై కన్నడ సినీ గాయకులు అర్చన ఉడుప పాడిన పాటలతో పాటు హిందీ సినీ గాయకుడు కూనాల్ గాంజావాల వినిపించిన పాటలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆదివారం కడ్డి రాంపురం వద్ద నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ సత్తా చాటారు. హంపి ఉత్సవాలకు రాష్ట్రం వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా హంపి ఉత్సవాలను చూసేందుకు విచ్చేశారు. ఉదయం నుంచే హంపిలో సందర్శకుల తాకిడి మొదలైంది. విరుపాక్షేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న బసన్న వీధిలో కృష్ణదేవాలయం రహదారిలో, గాయత్రి పీఠం రహదారిలో, రాణి స్నాన మందిర రహదారిలో పర్యాటకులు భారీగా కనిపించారు. సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హంపిలోని గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంటల పోటీకి అనూహ్య స్పందన హంపి ఉత్సవాల్లో మహిళలకు నిర్వహించిన సంప్రదాయ రుచికర వంటల పోటీకి మంచి స్పందన లభించింది. ఆదివారం ఉత్సవాలు ముగియనుండటంతో రుచికర వంటల పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు ఆసక్తి కనబరిచారు. కాజు, ఓళిగ, రాగిరొట్టె, జొన్నరొట్టె, రాగి ముద్ద, అరిసెలు, బర్ఫీ, గోధుమ సేమియా పాయసం, రోటీ తదితర రుచికరమైన 35 రకాల వంటకాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. వంటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందిన విజేతకు రూ.25 వేలు, ద్వితీయ స్థానం విజేతకు రూ.15 వేలు, తృతీయ స్థానం విజేతకు రూ.10 వేల చెక్కులను పంపిణీ చేశారు. - న్యూస్‌లైన్, బళ్లారి/ హొస్పేట -
సృజనం: అదే - ఇది
‘‘ఏం చేయమంటావు రవి పాత్రను?’’ అని మా అన్నని అడిగాను. ‘‘చంపెయ్’’ అన్నాడు. మొదట్లో నాకది కరెక్ట్ అనిపించింది. కానీ, కుటుంబం కోసం బతికే ప్రకాష్ గుర్తుకు వచ్చాడు. ‘‘నేను రచయితని!’’ ‘‘ఏం కూశావురా!’’ అని నాన్న అనినా, ఈ భావం నా మనస్సులో బలంగా నాటుకుపోయింది. నా పిచ్చి రాతలకు పైసా రాకపోయినా పర్లేదు, ఒకటైనా రాయాలి. నాకా పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఇప్పటివరకు జీవితం మొత్తం మీద పాఠ్యపుస్తకాలు కాకుండా, చదివింది ఒకే ఒక పుస్తకం. కానీ, ఎప్పుడూ చదువుతూనే ఉంటాను. పేపర్లు, వారపత్రికలు లాంటివి. సర్లే ఈ పురాణం అంతా ఎందుకు? నేరుగా రాయడానికి వెళ్లిపోదాం రండి! నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఉన్నాడు. పేరెందుకు లెండి! ఒకరోజు ఫోన్ చేసి వాడి కష్టాలు చెప్పి, నాకు కన్నీళ్లు తెప్పించాడు. ఆ కష్టమే నా కథ చదివేవారికి కలగాలని వాడి పాత్రకు నా ఆలోచనలు తగిలించి, వాడినే ముఖ్య పాత్రను చేశాను. ఆ పాత్రకు రవి అని నామకరణం చేశాను. రవి అనే పేరే ఎందుకు? రవి అంటే సూర్యుడు. కుర్రాడు ఎప్పుడూ ఉదయించే సూర్యుడిలా ఉండాలనీ, అలా ఎప్పటికీ ఉండిపోవాలని, ఈ పేరు పెట్టాను. పేరుకే పిచ్చెకించేశాను కదా! నా ఫ్రెండ్ మూడుపూటలా వేరు వేరు చోట్ల పనిచేసేవాడిని అని చెప్పాడు. కానీ, ఎక్కడెక్కడ చేస్తున్నాడో చెప్పలేదు. వాడు చెప్పకపోతే ఏం? నేను రవిని ఉద్యోగంలో చేర్పిస్తాను. నేను రోజూ వెళ్లే ఇంటర్నెట్లో పనిచేసే కుర్రాడు గుర్తుకు వచ్చి, ఒక షిఫ్ట్‌కి రవిని ఇంటర్నెట్లో చేర్చాను. మరి సినిమా హాలూ! నాకు విపరీతంగా నచ్చేది సినిమా, సినిమా హాలే. కాబట్టి రవిని హాల్లో టికెట్లు చించే పనిలో చేర్పించాను. రవి కీతా పని అనుకుంటాడేమో అని ‘ఐమ్యాక్స్’లో చేర్పించాను. వద్దు వద్దు రవిగాడికి పొగరెక్కిపోద్ది. పేరు లేని హాల్లో, చెప్పుకోలేని జీతంతో తోసేశాను. మరి మూడో షిఫ్ట్. దీని కోసం చాలా ఆలోచించా! ఒకరోజు మా పెద్దనాన్న కొడుకుతో రోడ్డుమీద నడుస్తున్నాను. నాకు వరుసకు వాడు అన్నే అయినా, ఏ రోజూ వాడిని ‘అన్నా’ అని పిలిచిన పాపాన్ని మూటగట్టుకోలేదు. ఆ అంగడీ, ఈ అంగడీ తిరిగి ఏం కొనకుండా బాగా అలసిపోయాం. టిఫిన్ తినాలని వాడు అనడంతో నీరసంగా ఉన్న నాకు కొంత ఉత్సాహం వచ్చింది. మేము నడిచే వీధిలోనే ఒక టిఫిన్ అంగడి ఉంది. పెద్ద హోటల్ కాకపోయినా, అక్కడి నెయ్యి దోశ తింటే నాలుగేళ్లు మర్చిపోలేరు. ఒకసారి నా ఫ్రెండ్‌తో అక్కడికి వెళ్లాను. ఇన్నేళ్లు ఇదే ఊరిలో ఉన్నా, అక్కడ తిననందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. మళ్లీ అక్కడ తినడం అనే ఆలోచనతో తొందరగా హోటల్ దగ్గరకు చేరుకున్నాం. నేను హోటల్ లోపలికి వెళ్లబోతుంటే, అన్న మాత్రం నేరుగా నడుచుకుంటూ హోటల్ దాటి వెళ్లడం చూసి, నేను అన్న దగ్గరకు వెళ్లి, ‘‘ఏమయ్యా?’’ అన్నాను పరిస్థితి అర్థం కాక. ‘‘అక్కడ వద్దులే. ఇంకో దగ్గరకు వెళ్దాం’’ అన్నాడు హోటల్ వైపు చూపిస్తూ. ‘‘ఇక్కడ నెయ్యి దోశ అదిరిపోద్ది తెలుసా?’’ అని నోట్లో ఊరుతున్న లాలాజలాన్ని మింగేశాను. ‘‘అక్కడ నా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు. బాగుండదు, వద్దులే’’ అన్నాడు. వెంటనే నాకు నా సొంత అన్న గుర్తుకు వచ్చాడు. కొన్ని రోజుల క్రితం వాడు కూడా ఇలానే అన్నాడు. అప్పుడు ఏమనకపోయినా, ఈసారి మాత్రం కోపం పొడుచుకొచ్చింది. ‘‘ఓహో! ఫ్రెండ్ పనిచేసే దగ్గర తింటే నామోషి కదా!’’ అన్నాను వ్యంగ్యంగా. ‘‘నామోషియా! నా తలకాయా! ఫ్రెండ్ పనిచేసే దగ్గరకు వెళ్లి, వాడినే చెట్నీ వెయ్యి, సాంబారు పొయ్యి అని ఎలా అడగను? వాడి టైమ్ బాగలేక ఇలా చదువు మానేసి పనికి కుదిరాడు.’’ ఆ సమాధానం నాకు చాలా తేడాగా అనిపించింది. అలాంటి సందర్భాల్లో మనం నామోషీగా ఫీల్ అవుతుంటాం. కానీ ఎదుటివాడు ఏం అనుకుంటాడు అని ఆలోచించం! అంతే, వెంటనే ఇంటికి వచ్చి రవిని మూడో షిఫ్ట్ కింద హోటల్లో చేర్పించి, వాడికి ఈ సన్నివేశాన్ని జతచేశాను. హాల్లో ఒకణ్ని పరిచయం చేసుకుని మరీ, రిలీజ్ సినిమాకు టికెట్ సంపాదించేవాడిని. నాలాగే రవి స్నేహితులు రవిని ఉపయోగించుకునేటట్లు చేశాను. రవితో పాటు పనిచేసేవాళ్లు టికెట్లను డబ్బుకు అమ్ముకున్నా, రవికి స్నేహితుల దగ్గర డబ్బు తీసుకోవడం ఇష్టం లేదు. మరి హీరో పాత్ర అన్నాక, ఆ మాత్రం మంచి లక్షణాలు లేకపోతే ఎలా? చదివిన బీటెక్ చదువుకు సరిపడేలా ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నాలు కూడా చేసేవాడు రవి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్వ్యూ ఉంటే, చేసే పనికి సెలవు పెట్టడం, వెళ్లి రావడం, ఉద్యోగం రాకపోవడం చాలా తొందరగా జరిగిపోయేవి. ఒక మంచి రోజున, రవి ఇంటర్నెట్లో తన ముందు షిఫ్ట్‌లో పనిచేసే కుర్రాడితో చెప్పడం, వాడు ‘‘ఎన్నిసార్లు చెప్తావురా?’’ అన్న మాటతో రవి గాలి తీసేట్టు చేశాను. ఇంత చేసినా, రాసినా నాకు తృప్తి లేదు. ఇప్పటివరకు జరిగిన వాటిలో బాధపడటానికి ఏమీ లేదు అని తెలుసుకున్నాను. మళ్లీ ఆలోచనలో పడ్డాను. మొదటి నుండి కష్టాలు పడేవాడిని చూస్తే ఎవరికీ జాలి కలగదు అన్న విషయాన్ని గ్రహించి, కొన్ని మార్పులు చేశాను. రవికి మొదట్లో ఇంట్లో నుండే డబ్బు వచ్చేది. అది చాలక, జల్సాల కోసం ఇంకా ఎక్కువ అడిగేటట్టు చేశాను. ఇంట్లో వాళ్లు లేవనడంతో ఇంటర్నెట్లో మూడు గంటలు పనిచేసేవాడు. ఇంటర్వ్యూ ఉన్నప్పుడు వాటికి వెళ్తూ, స్నేహితులతో కలిసి హైదరాబాద్ మొత్తం తిరిగేటట్టు చేశాను. ఇలాంటి సందర్భంలో రవికి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చేటట్టు చేసి, జాయినింగ్ మూడు నెలల తర్వాత పెట్టించాను. ‘రవిగాడు బాగా కష్టపడుతున్నా’డని ఇంటర్నెట్ ఫ్రెండ్ ఫీల్ అయ్యి, ‘‘ఎందుకు మామా కష్టపడతావు? ఇంటికెళ్లి జాయినింగ్ అప్పుడు రా’’ అని నీరసంగా అనేలా చేసి సంతోషపడ్డాను. ఇలాంటి సమయంలో రవికి ఒక పెద్ద షాక్ తగలాలి. అప్పుడే కిక్. అందుకని రవి కుటుంబాన్ని అప్పులపాలు చేశాను. సరిగ్గా ఇంటికి బయలుదేరుతున్న సమయంలో రవికీ అతని అంకుల్ సుబ్రమణ్యానికీ జరిగే సంభాషణలో, ‘‘నేను ఇచ్చిన డబ్బుతో చదువుకున్నావ్, నిజం చెప్పాలంటే నేనే నిన్ను చదివించాను. అలాంటిది కనీసం వడ్డీ కూడా కట్టవా?’’ అని అనిపించాను. ‘సంఘ సేవ చేసినవాడు మాట్లాడినట్లు మాట్లాడి, మళ్లీ వడ్డీ అడుగుతున్నాడు దొంగ సచ్చినోడు’ అని రవి మనస్సులో అనుకున్న మాట, ఈ ప్రపంచంలో నుంచే పుట్టింది. ఇది నాకు చాలా నచ్చి రాశాను. ఒకరోజు నా ఫ్రెండ్ ప్రకాష్ నన్ను కలిసినప్పుడు, తను చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం తనకు ఇష్టం లేదని చెప్పాడు. వాడు, పాపం ఆ ఉద్యోగం సంపాదించడం కోసం చాలా కష్టపడ్డాడు. రాత్రి, పగలు అని తేడా లేకుండా చదివాడు. ప్రకాష్ కలిసిన తర్వాతి రోజే పేపర్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడని చదివాను. దానికి కారణం తన బోరింగ్ లైఫే అన్న ఆ కుర్రాడి సూసైడ్ నోట్, ఈ కథ క్లైమాక్స్‌కు నాంది పలికింది. నేనంటే తేడాగా ఆలోచించి రచయితను కావాలనుకున్నాను. కానీ, నేను సృష్టించిన రవి పాత్రకు అంత సీన్ లేదు. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచం ఒకేలా నడుస్తోంది. డిగ్రీ చేయడం, ఉద్యోగంలో ఇరుక్కుపోవడం, రవిని కూడా అలాగే తయారుచేశాను. చాలా కష్టాలు పడి మూడు పూటలా పనిచేసి నెలనెలా వడ్డీ కట్టడం కోసం ఇంటికి డబ్బులు పంపించేవాడు. అలా జరిగిన మూడు నెలల తర్వాత, ఒక మంచి రోజున ఉద్యోగంలో చేరాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ హోదా వచ్చేసింది రవికి. సారీ, వచ్చేలా చేశాను. వారం రోజులు ఏ పనీ చెప్పకపోవడంతో రవికి భయం పట్టుకుంది. ‘ఎక్కడ తనని ఉద్యోగంలో నుంచి తీసేస్తారో’ అని. కానీ నేను అలా చేయలేదు. వారం తర్వాత రవికి ప్రాజెక్ట్ మేనేజర్ చేత పని చెప్పించాను. ఒక మూడు, నాలుగుసార్లు తప్పుగా చేశాక, తిట్లు తిన్నాక, కరెక్ట్‌గా చేశాడు. రోజూ ఉదయాన్నే ఎనిమిదికి బయలుదేరి, ఆఫీస్‌కి వెళ్తే, తిరిగి ఇంటికొచ్చేది రాత్రి తొమ్మిదికే. ఎన్ని రోజులు గడిచినా ఆఫీస్‌లో ఎవ్వరూ స్నేహితులు కాలేదు. రవిని చాలా మూడీ ఫెలోగా తీర్చిదిద్దాను. ఏ పని చేసినా ఆసక్తి ఉండదు. దాంతో ఎప్పుడూ ఎవరితో మాట్లాడకుండా, మూలన ఉన్న తన క్యాబిన్ దగ్గర కూర్చొని పని చేసుకునేవాడు. చిన్నప్పటినుండి జనాలు పరిగెత్తితే పరిగెత్తడం, పడుకుంటే పడుకోవడం, ఇంతే తప్ప తనకు ఒక ఇష్టం ఉందని కూడా గ్రహించలేనివాడు రవి. ఒంటరిగా రూమ్‌లో కూర్చొని బుక్ ముందు పెట్టుకుని కాసేపు చదివి, తర్వాత జుట్టు పీక్కొని, బుక్‌ని విసిరికొట్టిన సంఘటనలు రవి జీవితంలో చదువుకునేటప్పుడు ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి. ఇవన్నీ భరించలేక ఒకరోజు ఆఫీస్ బిల్డింగ్ పైకి ఎక్కాడు. ఒక్కడుగు వేస్తే వీటన్నిటికీ దూరంగా వెళ్లిపోవచ్చు. ‘‘ఏం చేయమంటావు రవి పాత్రను?’’ అని మా అన్నని అడిగాను. ‘‘చంపెయ్’’ అన్నాడు. మొదట్లో నాకది కరెక్ట్ అనిపించింది. కానీ, కుటుంబం కోసం బతికే ప్రకాష్ గుర్తుకు వచ్చాడు. ‘‘రవిని చంపి నేను హంతకుడిని కాలేను.’’ రవి మేడమీద నిలబడి కళ్లు మూసుకున్నాడు. అమ్మ, చెల్లెలు గుర్తుకువచ్చి, ఆ అడుగుని వెనకకు వేశాడు. ఆ తర్వాత నుంచి రవి రోజూ బతుకుతూ చస్తున్నాడు. నా కథ పూర్తయింది. పత్రికకు పంపి చాలా రోజులు ఎదురుచూశాను. లాభం లేదు. మళ్లీ రాయాలనుకున్నాను. కానీ, రవి కథ చాలా మంచిదే! అందుకే ఒక ఆలోచన వచ్చింది. రవి పాత్రను అలాగే ఉంచి, కథనంలో మార్పు చేశాను. పనిచేయడం, ఉద్యోగం కోసం వెతుకులాట, చివరికి బతకడం అన్నీ అలానే ఉంచి, ఇలా రాశాను. ఇప్పటివరకు మీరు చదివిన ఇదే - అది. - చక్రతానం యుగంధర్ -
ఎంపీ ఇల్లు ముట్టడి
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటిని ఆర్టీసీ, రెవెన్యూ, మెడికల్, ఉపాధ్యాయ జేఏసీ(ఉద్యోగ జేఏసీ) సమైక్యవాదులు ముట్టడించారు. శుక్రవారం కపిలతీర్థం మార్గంలోని రామచంద్రానగర్ ఉన్న ఎంపీ నివా సం వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు మునిసుబ్రమణ్యం, ప్రకాష్, సురేంద్రబాబు, లతారెడ్డి, పీసీబాబు, ఎన్జీవో జేఏసీ నాయకులు నరసింహారెడ్డి, మంజూనాథ్, కోటీశ్వరరావు, సురేష్, విజయలక్ష్మి, నిర్మల, ఉదయలక్ష్మి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇంటి ముందు బైఠాయించి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి వైఎస్సార్ సీపీ నాయకుడు వరప్రసాద్‌రావు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఎంపీ రాజీనామా చేయకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన ఊర్లో లేని సమయంలో ఆందోళన చేయడం సరికాదని, వెళ్లిపోవాలని సూచించారు. వరప్రసాద్‌రావు, మునిసుబ్రమణ్యం మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతం నుంచి దళిత, బడుగు, బలహీన వర్గాల ఓట్లతో గెలిచిన ఎంపీ చింతామోహన్ వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సీమాంధ్ర ఉనికికే ప్రమాదకరంగా మారిన రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన ఎంపీ విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల్లో ఊడిపోయే పదవి కోసం ఎంపీ చింతా పాకులాడడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఎంపీని ఇండిపెండెంట్‌గానైనా గెలిపించి తిరిగి చట్టసభకు పంపిస్తామని సమైక్యవాదుల తరఫున బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏపీఎన్జీవో నాయకులు ఆంజేయులు, శేషారెడ్డి, కిరణ్, బాలాజి, భారతి, గోపాల్ హాజరయ్యారు. -
శభాష్ ప్రకాష్..
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ప్రయాణికురాలు ఆటోలో మర్చిపోయిన రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులకు అప్పగించి ఆటోడ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. బేగంబజార్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. వినోద్, సరిత దంపతులు వనస్థలిపురంలో ఉంటున్నారు. శనివారం తన ఇంటికి వచ్చిన నలుగురు చెల్లెళ్లతో కలిసి సరిత తన భర్తతో అబిడ్స్ వచ్చారు. సరిత తన 50 తులాల బంగారు నగల్ని భద్రపర్చిన హ్యాండ్ బ్యాగును వెంట తెచ్చుకున్నారు. షాపింగ్ అనంతరం రామకృష్ణ థియేటర్లో మొదటి ఆట సినిమా చూశారు. తరువాత వనస్థలిపురానికి ఆటో మాట్లాడుకున్నారు. ఆటోలో వెళ్తుండగా కుమార్తె ఏడవటంతో సరిత తన చేతిలోని బ్యాగును ఆటో సీటు వెనుక ఉంచారు. ఇల్లు రాగానే బ్యాగు మర్చిపోయి ఆటో దిగారు. సరిత దంపతులు కొద్దిసేపటికి ఆటోలో మర్చిపోయామని గుర్తించి అదేరోజు రాత్రి సరూర్‌నగర్, అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సరిత బృందాన్ని దింపిన అనంతరం ఎంజేమార్కెట్‌కు చేరుకునేసరికి ఆటో వెనుక సీట్లో శబ్దం వస్తుందని గ్రహించిన డ్రైవర్ ప్రకాష్ ఆటో నిలిపి చూడగా హ్యాండ్ బ్యాగు, అందులో నగలు, 2 సెల్ఫోన్లు, రూ.3వేల నగదు కనిపించాయి. వాటిని అదేరోజు రాత్రి బేగంబజార్ పోలీసులకు అప్పగించాడు. సెల్‌ఫోన్‌ల్లో చార్జింగ్ లేకపోవడంలో పోలీసులు చార్జింగ్ పెట్టారు. ఆదివారం ఉదయం వినోద్, సరిత దంపతులు ఫోన్ చే యగా, విషయం చెప్పారు. దీంతో వారు బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వివరాలను సేకరించిన అనంతరం ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ వారికి సొత్తు అందజేశారు. కాగా, ఆటో డ్రైవర్ ప్రకాశ్ మంగళ్‌హాట్‌కు చెందిన వారు. వికలాంగుడైన ఆయన 20 ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని నిజాయితీకి మెచ్చిన సరిత దంపతులు, ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ రూ.వెయ్యి చొప్పున ప్రకాశ్‌కు అందచేసి అభినందించారు.