అనంతపురం: అనంతపురం జిల్లాలో గురువారం రాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాడిమర్రి మండలం పెద్దకోట గ్రామ మాజీ సర్పంచ్ పాటిల్ ప్రకాశ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.
ప్రకాశ్ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి 30 తులాల బంగారం, రూ.40 వేల నగదును ఎత్తికెళ్లారు. ప్రకాశ్ కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబసభ్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చిన పక్రాశ్ ఇంట్లో వస్తువులు చిందరబందరగా ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.