
తలలో బాణం.. 240 కిలోమీటర్ల ప్రయాణం
తలలో బాణం గుచ్చుకున్న ఈ యువకుడి పేరు ప్రకాశ్. ఇంట్లో నిశ్చితార్ధం సమయంలో పొరుగింట్లో ఉండే అర్జున్ కుటుంబసభ్యులతో జరిగిన గొడవ పెద్దదై ఇలా బాణాలు వేసుకునేదాకా వచ్చింది. బాణం గుచ్చుకున్న ఇతన్ని అంబులెన్స్‌లో 240కిలోమీటర్లు ప్రయాణించి ధార్, బడ్వానీ, ఖర్‌గోన్ జిల్లాలు దాటి ఇండోర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
దాదాపు మెదడును చేరిన బాణం మొనను గంటపాటు శస్త్రచికిత్స చేసి వైద్యులు తొలగించారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజనులైన భిల్లులు.. గొడవలైన ప్రతిసారీ బాణాలకు పనిచెప్తారన్న విషయం తెలిసిందే.