బంజారాహిల్స్: కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్‌తో పాటు మరో 5 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోర్జరీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–70లోని అశ్వని లేఅవుట్, ప్రశాసన్‌నగర్‌లో నివసించే జి.అరి్మతారెడ్డి అప్పటి ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ హిమాయత్‌నగర్ బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా ఆమెకు హౌసింగ్ లోన్ మంజూరయ్యే సమయానికి ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ కోటక్ మహేంద్ర బ్యాంక్‌లో విలీనమైంది. తనకు రుణం మంజూరైందని సమాచారంఅందడంతో ఆమె కోటక్ మహేంద్రబ్యాంక్ సోమాజీగూడ బ్రాంచ్‌ను ఆశ్రయించగా అక్కడి బ్యాంక్ అధికారులు ఆమె నుంచి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు.
ఆ సమయంలో వడ్డీ రేటు ఒక రకంగా చెప్పి ఆ తర్వాత అదనపు వడ్డీ రేట్లను నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు తెలియకుండా వేశారు. ఉద్దేశపూర్వకంగా పోర్జరీ డాక్యుమెంట్లతో ఒప్పందాలను ఉల్లంఘించి తనను మోసం చేశారంటూ బాధితురాలు 2020 జనవరి 7న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె 17వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజి్రస్టేట్‌ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్, సోమాజీగూడ బ్రాంచ్ మేనేజర్ జే ప్రదీప్‌కుమార్, హిమాయత్‌నగర్ రీజనల్ మేనేజర్ ఎన్.ప్రశాంత్‌కుమార్, సోమాజీగూడ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్రన్, బ్యాంక్ అధికారి సుదీర్, ఉద్యోగి గుత్తా ఈశ్వర్‌లపై కేసు నమోదు చేశారు.
తాను ఈ లోన్ కోసం ఎన్నోసార్లు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగా తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. తన నుంచి ఖాళీ పేపర్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్న అధికారులు ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదన్నారు. తన నుంచి బౌన్స్ చార్జెస్ అక్రమంగా వసూలు చేశారన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment