Kotak Mahindra Bank
-
ప్రముఖ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై విధించిన పర్యవేక్షక ఆంక్షలను ఎత్తివేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ కింద 2024 ఏప్రిల్ 24న విధించిన ఆంక్షలను తొలగించింది. బ్యాంక్ తన ఆన్లైన్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి, తిరిగి కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు అనుమతించింది.ఐటీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్యాచ్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీతో సహా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ మౌలిక వసతుల్లో లోపాలను గతంలో ఆర్బీఐ గమనించింది. దాంతో నిబంధనలు పాటించకపోవడం వల్ల బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. ఫలితంగా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) కార్యకలాపాలు, ఆన్లైన్, డిజిటల్ బ్యాంకింగ్ ఛానళ్లు కొంతకాలంగా అంతరాయాలు ఎందుర్కొంటున్నాయి.నివారణ చర్యలుఆర్బీఐ ఆందోళనలకు ప్రతిస్పందనగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నివారణ చర్యలను ప్రారంభించింది. లోపాలు సవరించుకునేందుకు బ్యాంకు అనుసరిస్తున్న విధానాలను నిత్యం ఆర్బీఐకు నివేదికల రూపంలో సమర్పించింది. ఈ కాంప్లయన్స్ను ధ్రువీకరించడానికి ఆర్బీఐ ఆమోదించిన ఎక్స్టర్నల్ ఆడిట్‌ను బ్యాంక్ పూర్తి చేసింది. బ్యాంకు తీసుకున్న పరిష్కార చర్యలతో సంతృప్తి చెందిన ఆర్బీఐ గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: స్టార్‌లింక్ సేవలను ధ్రువీకరించిన మస్క్ఆంక్షలు ఎత్తివేయడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు మార్గం లభించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు లైన్‌క్లియర్ అయింది. ఈ చర్య వల్ల సమర్థవంతమైన కస్టమర్ సేవలను అందించడానికి వీలవుతుంది. బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఆంక్షలు ఎత్తివేయడం కీలకంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. -
దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు. గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్‌పై ఫోర్జరీ కేసు..
బంజారాహిల్స్: కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్‌తో పాటు మరో 5 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోర్జరీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–70లోని అశ్వని లేఅవుట్, ప్రశాసన్‌నగర్‌లో నివసించే జి.అరి్మతారెడ్డి అప్పటి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ హిమాయత్‌నగర్ బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా ఆమెకు హౌసింగ్ లోన్ మంజూరయ్యే సమయానికి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ కోటక్ మహేంద్ర బ్యాంక్‌లో విలీనమైంది. తనకు రుణం మంజూరైందని సమాచారంఅందడంతో ఆమె కోటక్ మహేంద్రబ్యాంక్ సోమాజీగూడ బ్రాంచ్‌ను ఆశ్రయించగా అక్కడి బ్యాంక్ అధికారులు ఆమె నుంచి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో వడ్డీ రేటు ఒక రకంగా చెప్పి ఆ తర్వాత అదనపు వడ్డీ రేట్లను నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు తెలియకుండా వేశారు. ఉద్దేశపూర్వకంగా పోర్జరీ డాక్యుమెంట్లతో ఒప్పందాలను ఉల్లంఘించి తనను మోసం చేశారంటూ బాధితురాలు 2020 జనవరి 7న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె 17వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజి్రస్టేట్ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్, సోమాజీగూడ బ్రాంచ్ మేనేజర్ జే ప్రదీప్‌కుమార్, హిమాయత్‌నగర్ రీజనల్ మేనేజర్ ఎన్.ప్రశాంత్‌కుమార్, సోమాజీగూడ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్రన్, బ్యాంక్ అధికారి సుదీర్, ఉద్యోగి గుత్తా ఈశ్వర్లపై కేసు నమోదు చేశారు. తాను ఈ లోన్ కోసం ఎన్నోసార్లు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగా తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. తన నుంచి ఖాళీ పేపర్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్న అధికారులు ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదన్నారు. తన నుంచి బౌన్స్ చార్జెస్ అక్రమంగా వసూలు చేశారన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్: బాలికలకు స్కాలర్షిప్స్..
సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలలో భాగంగా కోటక్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఈఎఫ్) తమ కన్య స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా 500 మందికి స్కాలర్షిప్లను ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికల ఉన్నత విద్యార్జనకు వీలుగా ఏటా రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని 4–5 సంవత్సరాల పాటు అందిస్తామని చెప్పారు. రూ.6లక్షల లోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారై, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో 75 శాతం ఆ పైన మార్కులు సాధించిన వారు ఈ స్కాలర్షిప్స్ దరఖాస్తుకు అర్హత పొందుతారని తెలియజేశారు.ఇవి చదవండి: ‘ఒలింపిక్’ స్ఫూర్తిని పంచేందుకు.. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ చార్జీల్లో మార్పులు
కోటక్ మహీంద్రా బ్యాంక్ శాలరీ అకౌంట్, పొదుపు ఖాతాలపై కొన్ని సేవలకు ఛార్జీలను సవరించింది. మే 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. యావరేజ్ బ్యాలెన్స్, నగదు, ఏటీఎం లావాదేవీలకు పరిమితులు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజు, ఉచిత చెక్‌బుక్‌ల పరిమితికి సంబంధించిన ప్రమాణాలను బ్యాంక్ అప్డేట్ చేసింది.కీలక మార్పులు ఇవే..⇒ సగటు బ్యాలెన్స్ ప్రమాణాలుసంకల్ప్ సేవింగ్స్ అకౌంట్: సెమీ అర్బన్ అండ్ రూరల్‌లో రూ.2,500.రోజువారీ పొదుపు ఖాతా: మెట్రో అండ్ అర్బన్‌లో రూ.15,000, సెమీ అర్బన్‌లో రూ.5,000, రూరల్‌లో రూ.2,500.⇒ ఉచిత నగదు లావాదేవీ పరిమితులుడైలీ సేవింగ్స్/శాలరీ అకౌంట్, ప్రో సేవింగ్స్, క్లాసిక్ సేవింగ్స్ అకౌంట్లలో ఇప్పుడు నెలకు 5 ఉచిత లావాదేవీలు లేదా గరిష్టంగా రూ .2 లక్షలకు పరిమితం చేసింది.ప్రివీ నియాన్/మాక్సిమా ఖాతాలకు సంబంధించి ఇప్పుడు నెలకు 7 ఉచిత లావాదేవీలు లేదా రూ.5 లక్షలకు పరిమితం చేసింది. అలాగే సోలో సేవింగ్స్ ఖాతాకు నెలకు ఒక ఉచిత లావాదేవీ లేదా రూ.10,000 కు తగ్గించింది.⇒ ఏటీఎం లావాదేవీ పరిమితులుఎవ్రీడే సేవింగ్స్, క్లాసిక్ సేవింగ్స్, ప్రో సేవింగ్స్, ఏస్ సేవింగ్స్, ప్రివీ ఖాతాదారులకు కోటక్ ఏటీఎంలలో నెలకు 7 ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే నెలకు 7 ఉచిత లావాదేవీలు ఉంటాయి.కోటక్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో కలిపి నెలకు గరిష్టంగా 30 ఉచిత లావాదేవీలు ఉంటాయి.ఇక ఎవ్రీడే శాలరీ, ఎడ్జ్ శాలరీ అకౌంట్లకు కోటక్ ఏటీఎంలలో నెలకు 10 ఉచిత ట్రాన్సాక్షన్స్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎలాంటి మార్పు లేదు. అపరిమిత ఉచిత లావాదేవీలు ఉంటాయి.⇒ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజుసేవింగ్స్, శాలరీ అకౌంట్లన్నింటికీ రూ.200 చొప్పున కొత్త రుసుము విధించనున్నారు. గతంలో ఎలాంటి చార్జీలు ఉండేవి కావు.⇒ చెక్ బుక్ లిమిట్సోలో సేవింగ్స్ అకౌంట్: ఏడాదికి 25 ఉచిత చెక్ లీవ్స్ నుంచి 5 ఉచిత చెక్ లీఫ్లకు తగ్గించారు.⇒ లావాదేవీ వైఫల్య రుసుముడెబిట్ కార్డు/ఏటీఎం వినియోగ రుసుము: సరిపడా నిధులు లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే ఒక్కో లావాదేవీకి రూ.25 చార్జీ ఉంటుంది. చెక్ జారీ చేసినప్పుడు, రిటర్న్ చేసినప్పుడు తీసుకునే ఫీజు రూ.250కి పెరిగింది. -
ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొట్టిన దెబ్బతో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఉదయ్ కోటక్ సంపదకు కూడా భారీగా గండి పడింది.కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ చర్యల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 13 శాతం వరకు పడిపోయాయి. కంపెనీలో దాదాపు 26 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఉదయ్ కోటక్ భారీ నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10 వేల కోట్లు) తగ్గింది. ఏప్రిల్ 24 నాటికి ఉదయ్ కోటక్ నెట్‌వర్త్ 14.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు).ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 2016 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి కోటక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిన తర్వాత యాక్సిస్ షేర్లు పుంజుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కోటక్ తప్పుకొన్న తర్వాత అశోక్ వాస్వానీ ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. -
కోటక్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.అయితే, క్రెడిట్ కార్డు కస్టమర్లు సహా ప్రస్తుతమున్న ఖాతాదారులందరికీ బ్యాంకు యథాప్రకారం సేవలు అందించడాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. మే 4న కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకు ఎక్స్టర్నల్ ఆడిట్‌ను నిర్వహించి, అందులో బయటపడే సమస్యలను, తాము గు ర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్బీఐ పేర్కొంది. పదే పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్న కారణంగా 2020 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై కూడా ఆర్బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐటీ సంబంధ తనిఖీలో కీలకాంశాలు2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధ తనిఖీల్లో తీవ్ర ఆందోళనకరమైన అంశాలను గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ‘ఐటీ ఇన్వెంటరీ నిర్వహణ, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు, నిబంధనలను పాటించకపోవడం మొదలైన వాటిని గుర్తించాం‘ అని వివరించింది. వాటిని సమగ్రంగా, సకాలంలో పరిష్కరించడంలో బ్యాంకు నిరంతరం వైఫల్యం చెందుతున్న కారణంగా తాజా చర్యలు తీసుకోవాల్సి వచి్చందని ఆర్బీఐ తెలిపింది. పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల కోర్ బ్యాంకింగ్ సిస్టం (సీబీఎస్), ఆన్లైన్ .. డిజిటల్ బ్యాంకింగ్ మాధ్యమాలు గత రెండేళ్లుగా తరచూ మొరాయిస్తూ, కస్టమర్లను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన నిర్దిష్ట వ్యాపార విభాగాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
అతిజాగ్రత్తతో వృద్ధికి ఆటంకం
న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థలు జాగ్రత్త చర్యలు అతిగా అమలు చేస్తే ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. రెగ్యులేటర్లు మరీ సంప్రదాయకంగా, అతిజాగ్రత్తగా వ్యవహరించకూడదన్నారు. అయితే, ఏ రంగంలోనైనా ‘ప్రమాదాలు’ చోటు చేసుకుంటే సత్వరం స్పందించే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోటక్ ఈ విషయాలు తెలిపారు. ‘భారత్ భవిష్యత్తుపై నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను. అదే సమయంలో తగిన జాగ్రత్త లేకుండా కేవలం అవకాశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి ముందుకెళ్లడమనేది రిసు్కతో కూడుకున్న వ్యవహారం. అలాగని, మరీ అతిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అక్కడికి (సంపన్న దేశం కావాలన్న లక్ష్యానికి) చేరుకోలేం‘ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్ల పాటు 7.5–8 శాతం జీడీపీ వృద్ధి రేటును కొనసాగించాలంటే సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ చెప్పారు. -
సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే..
నియంత్రణ సంస్థలు మరీ సంప్రదాయకంగా ఉండాల్సిన అవసరం లేదని, ఆర్థిక రంగంలో ప్రమాదాలకు వేగంగా స్పందించాల్సిందేనని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. కేవైసీ నిబంధనల అమలులో వైఫల్యానికి గాను ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ నిషేధం విధించడం తెలిసిందే. ఈ తరుణంలో ఉదయ్ కోటక్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అసలు ప్రమాదాలే లేని విధానం ప్రమాదకరమైంది. వేగంగా వృద్ధి చెందాలని కోరుకునేట్టు అయితే, చక్కని నియంత్రణలు కూడా అవసరమే. కొన్ని ప్రమాదాలు తలెత్తొచ్చు. కానీ, ఎంత వేగంగా స్పందించాం, చక్కదిద్దామన్నదే కీలకం’’అని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ ఆసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన సమావేశంలో భాగంగా ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: పిల్లల కోసం ‘ఎల్ఐసీ అమృత్‌బాల్’.. ప్రత్యేకతలివే.. గతం తాలూకూ మచ్చలు నియంత్రణ సంస్థలను మరింత రక్షణాత్మకంగా లేదా అప్రమత్తంగా మార్చకూడదంటూ, అదే సమయంలో మెరుగైన నియంత్రణ వాతావరణం అవసరమేనన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ గురించి ప్రస్తావన రాగా, ‘‘విడిగా వేరే కంపెనీ గురించి నేను వ్యాఖ్యానించను. కానీ, ఆర్బీకి మీ కంటే, నా కంటే ఎక్కువే తెలుసు’’అని పేర్కొన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మార్చి 15 తర్వాత నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించరాదని ఆర్బీఐ నిషేధించడం తెలిసిందే. -
కోటక్ ఇన్సూరెన్స్‌లో ‘జ్యూరిక్’కు వాటాలు
ముంబై: సాధారణ బీమా సంస్థ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో (కేజీఐ) స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిక్ ఇన్సూరెన్స్ 51 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఇందుకోసం రూ. 4,051 కోట్లు వెచి్చంచనుంది. తదుపరి అదనంగా మూడేళ్లలో అదనంగా 19 శాతం వాటాలు కూడా జ్యూరిక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయనున్నట్లు కేజీఐ మాతృ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్న కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, కేజీఐ తమకు పటిష్టమైన భాగస్వామి కాగలదని జ్యూరిక్ సీఈవో (ఆసియా పసిఫిక్) తులసి నాయుడు తెలిపారు. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇరు సంస్థల వనరులు, అనుభవం తోడ్పడగలవని కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. ప్రీమియంలపరంగా నాన్–లైఫ్ మార్కెట్లో సెపె్టంబర్లో కేజీఐకి 0.52 శాతం వాటా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 1,148 కోట్ల మేర స్థూల ప్రీమియం సాధించింది. కొత్త పెట్టుబడుల అనంతరం సంస్థ విలువ రూ. 7,943 కోట్లుగా ఉండనుంది. -
కొటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది (2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్ (క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24% జంప్‌చేసి రూ. 4,423 కోట్లను తాకింది. వడ్డీ ఆదా యం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 2,581 కోట్ల నుంచి రూ. 3,191 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 21% వృద్ధితో రూ. 6,297 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 5.22 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం రూ. 1,832 కోట్ల నుంచి రూ. 2,314 కోట్లకు పుంజుకుంది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.08% నుంచి రూ. 1.72%కి తగ్గాయి. అశోక్ వాశ్వానికి సై: కొటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా బయటి వ్యక్తి అశోక్ వాస్వాని ఎంపికకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ నాలుగు నెలల ముందుగానే ఎండీ, సీఈవో బాధ్యతల నుంచి వైదొలగుతున్న నేపథ్యంలో అశోక్‌ను బ్యాంక్ బోర్డు ప్రతిపాదించింది. -
కోటక్ బ్యాంకుకు కొత్త సీఈఓ, ఎండీ నియామకం
దేశీయ దిగ్గజ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రాకు కొత్త సీఈఓ, ఎండీగా అశోక్ వాస్వానీ నియమితులయ్యారు. బ్యాంక్ ఎండీగా ఉదయ్ కోటక్ వైదొలిగిన తర్వాత తాజా నియామకం జరిగింది. వాస్వానీ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. షేర్ హోల్డర్లు ఆమోదం తెలపాల్సి ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. 2024 జనవరి 1లోగా అశోక్ వాస్వానీ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్యాంకింగ్ రంగంలో అశోక్ వాస్వానీకి దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది. గతంలో అంతర్జాతీయ బ్యాంక్ సిటీ గ్రూప్‌లో పనిచేశారు. బార్క్లేస్ బ్యాంక్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎస్-ఇజ్రాయెల్ ఏఐ ఫిన్‌టెక్ పగాయా టెక్నాలజీస్ లిమిటెడ్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతేకాదు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ (యూకే) బోర్డు సభ్యులుగానూ ఉన్నారు. ప్రథమ్, లెండ్ హ్యాండ్ వంటి దాతృత్వ సంస్థల్లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. కోటక్ బ్యాంక్ సీఈఓ, ఎండీగా నియమితులు కావడం పట్ల వాస్వానీ సంతోషం వ్యక్తంచేశారు. స్వదేశానికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ను నిలిపే ప్రయాణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచస్థాయి బ్యాంకర్ అయిన అశోక్.. కోటక్ బ్యాంక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దగలరని ఉదయ్ కోటక్ విశ్వాసం వ్యక్తంచేశారు. కోటక్ బ్యాంక్‌ను ఖాతాదారులకు అనుకూల సంస్థగా మార్చేందుకు అశోక్ అనుభవం అక్కరకొస్తుందని తాత్కాలిక ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా పేర్కొన్నారు. -
కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్
ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్బీఐ భారీ షాకిచ్చింది. రెగ్యులేటరీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా విధించింది. లోన్ అడ్వాన్స్‌లు చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు; మోసాల వర్గీకరణ, కమర్షియల్ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఈ పెనాల్టీకి బ్యాంకుల కస్టమర్లకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. కాగా, ఇటీవల కేవైసీ నిబందల్ని పాటించడంలో విఫలమైందంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రూ.5.39 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
మరో ఘటన.. ఫార్మసీ ఉద్యోగి అకౌంట్లో రూ.753 కోట్లు.. ఏం చేశాడంటే..
సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లో వందలాది కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. కొన్ని బ్యాంకులు పొరపాటున సమాన్యుల అకౌంట్లలో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తున్నాయి. ఆశ్చర్యానికి లోనైన ఖాతాదారులు తేరుకునే లోపు పొరపాట్లను తెలుసుకుని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఓ ఫార్మసీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమయ్యాయి. మహమ్మద్ ఇద్రీస్ తన కోటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra bank) ఖాతా నుంచి శుక్రవారం (అక్టోబర్ 6) రూ.2000 లను స్నేహితుడికి బదిలీ చేశారు. ఈ లావాదేవీ తర్వాత, తన అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోగా రూ. 753 కోట్ల బ్యాలెన్స్ కనిపించింది. బ్యాంక్ అకౌంట్లో అంత పెద్ద మొత్తం కనిపించేసరికి ఆశ్చర్యానికి, ఆందోళనకు గురైన ఇద్రిస్ వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. దీంతో బ్యాంకు అధికారులు వెంటనే ఆయన అకౌంట్‌ను స్తంభింపజేశారు. ఈ పెద్ద మొత్తం కనిపించిన దురాశకు పోకుండా బ్యాంకు అధికారులకు తెలియజేసిన ఇద్రిస్‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. గతంలో చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్లో ఖాతాలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రూ.9,000 కోట్లు డిపాజిట్ చేసింది. పొరపాటును గుర్తించిన బ్యాంకు ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. అంతకు ముందు తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలోనూ రూ. 756 కోట్లు జమయ్యాయి. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవోగా దీపక్ గుప్తా
ఉదయ్ కోటక్ రాజీనామా తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా దీపక్ గుప్తా (Dipak Gupta) నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ బీఎస్ఈ (BSE) ఫైలింగ్‌లో తెలిపినట్లుగా 2023 సెప్టెంబర్ 2 నుంచి రెండు నెలల కాలానికి గుప్తా నియామకాన్ని ఆర్బీఐ (RBI) ఆమోదిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ తాత్కాలిక పదవీకాలం ముగిసేలోపు బ్యాంకు పూర్తికాల ఎండీని ఆర్బీఐ నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. ఉదయ్ కోటక్ తన పదవీ కాలానికి దాదాపు నాలుగు నెలల ముందే సెప్టెంబర్ 1న బ్యాంక్ ఎండీ, సీఈవో పదవి నుంచి వైదొలిగారు. మధ్యంతర ఏర్పాటుగా దాని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గుప్తా.. ఆర్బీఐ పేర్కొన్న రెండు నెలల పాటు ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తారు. (Uday Kotak: బ్యాట్స్‌మన్ టు బిజినెస్‌మన్.. రిచెస్ట్ బ్యాంకర్ గురించిన ఆసక్తికర విషయాలు) ఎండీ పదవీకాలాన్ని 15 సంవత్సరాలకు పరిమితం చేసే రెగ్యులేటరీ ఆదేశం ప్రకారం.. బ్యాంక్ బోర్డు ఈ సంవత్సరం ప్రారంభంలో ఉదయ్ కోటక్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించింది. (వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు!) బ్యాంక్‌లో 26 శాతం హోల్డింగ్ ఉన్న ఉదయ్ కోటక్.. ఎండీ, సీఈవో పదవికి రాజీనామా చేసిన తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారారు. ఆయన 2004లో బ్యాంక్ ప్రారంభమైనప్పటి నుంచి ఎండీగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన 64 ఏళ్ల ఉదయ్ కోటక్.. దేశంలోనే అత్యంత సంపన్న బ్యాంకర్. బ్యాంక్‌లో 26 శాతం వాటా కలిగి ఉన్నారు. సెప్టెంబరు 1 నాటికి ఆయన వాటా విలువ రూ. 3.5 లక్షల కోట్లు. -
ఉదయ్ కోటక్ వారసత్వం ఎవరికి?
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి ఇద్దరు హోల్‌టైమ్ డైరెక్టర్లు కేవీఎస్ మణియన్, శాంతి ఏకాంబరం రేసులో ఉన్నారు. బ్యాంక్ ఎండీ సీఈఓగా గత వారం ఉదయ్ కోటక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కోటక్ తన పదవీకాలం ముగియడానికి నాలుగు నెలల ముందే అంటే 1 సెపె్టంబర్ 2023 నుండి బ్యాంక్ ఎండీ, సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగారు. కొత్త వ్యక్తి 2024 జనవరి 1వ తేదీనాటికి బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నందున, ఈ బాధ్యతల భర్తీపై రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంక్‌లో 26 శాతం హోల్డింగ్ ఉన్న కోటక్, బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారారు. ఉదయ్ కోటక్ రాజీనామా నేపథ్యంలో మధ్యంతర ఏర్పాటుగా సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా 2023 డిసెంబర్ 31 వరకూ ఎండీ, సీఈఓగా విధులను నిర్వహిస్తారని (ఆర్బీఐ, బ్యాంక్ మెంబర్ల ఆమోదానికి లోబడి) కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ల తెలిపింది. విశేష సేవలు.. వ్యవస్థాపకుడిగా, నేను కోటక్ బ్రాండ్‌తో ప్రగాఢ అనుబంధాన్ని కలిగి ఉన్నాను. ఈ నేపథ్యంలో సంస్థకు నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగిస్తాను. పటిష్ట బ్యాంకింగ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ మేనేజ్మెంట్ బృందం ఉంది. వ్యవస్థాపకులు దూరంగా వెళ్లిపోతారు, కానీ సంస్థ శాశ్వతంగా వరి్ధల్లుతుంది. బ్యాంక్ షేర్ హోల్డర్లకు విశేష విలువలను సమకూర్చింది. లక్షకుపై ఉపాధి అవకాశాలు కలి్పంచింది. 1985లో రూ. 10,000 పెట్టుబడితో స్థాపించిన సంస్థ ఇప్పుడు రూ. 300 కోట్ల వ్యాపారానికి విస్తరించింది. భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక శక్తిగా మార్చడంలో ఈ సంస్థ మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. – ఉదయ్ కోటక్, ఎక్స్‌లో పోస్ట్ -
వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు!
ఆసియాలోనే అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ (Uday Kotak).. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) సీఈవో, ఎండీ పదవి నంచి వైదొలిగారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎలా స్థాపించింది.. ఎలా అభివృద్ధి చేసింది వివరిస్తూ ‘ఎక్స్’ (ట్విటర్) (Twitter)లో సుదీర్ఘ ట్వీట్ చేశారు. "విశ్వసనీయత, పారదర్శకత అనే ప్రాథమిక సిద్ధాంతాలతో మేం ఏర్పాటు చేసిన సంస్థ ఇప్పడొక ప్రముఖ బ్యాంక్, ఆర్థిక సంస్థ. మా వాటాదారులకు అత్యంత విలువను సృష్టించాం. లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించాం. 1985లో సంస్థలో పెట్టిన రూ.10,000 పెట్టుబడి ఈరోజు దాదాపు రూ.300 కోట్లు అవుతుంది" అంటూ రాసుకొచ్చారు ఉదయ్ కోటక్. ఆ కలతోనే.. ‘జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి సంస్థను భారత్‌లో ఏర్పాటు చేయాలని 38 సంవత్సరాల క్రితం కల కన్నాను. ఆ కలతోనే ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల చిన్న కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో కోటక్ మహీంద్రా సంస్థను ప్రారంభించాం’ అని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో భారతీయ యాజమాన్యంలోని ఈ సంస్థ మరింత ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. రిటైర్మెంట్ కంటే ముందే పదవి నుంచి వైదొలగిన ఉదయ్ కోటక్.. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తాకు పగ్గాలు అందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ సభ్యుల ఆమోదానికి లోబడి డిసెంబర్ 31 వరకు దీపక్ గుప్తా తాత్కాలిక ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. 2024 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త ఎండీ, సీఈవో నియామకానికి ఆమోదం కోసం ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్‌కి దరఖాస్తు చేసింది. Succession at Kotak Mahindra Bank has been foremost on my mind, since our Chairman, myself and Joint MD are all required to step down by year end. I am keen to ensure smooth transition by sequencing these departures. I initiate this process now and step down voluntarily as CEO.… — Uday Kotak (@udaykotak) September 2, 2023 -
ఉదయ్ కొటక్ రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, ప్రమోటర్ అయిన ఉదయ్ కొటక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆయన బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. సెపె్టంబర్ 1 నుంచి ఆయన రాజీనామా అమలులోకి వచి్చందని బ్యాంక్ శనివారం ప్రకటించింది. బ్యాంక్‌లో ఆయనకు 26 శాతం వాటా ఉంది. ఇక నుంచి నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉదయ్ కొటక్ వ్యవహరిస్తారని కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరైనా 15 ఏళ్లు మాత్రమే ఆ పదవిలో పనిచేయాల్సి ఉంటుంది. గడువు కంటే 3 నెలల ముందే ఉదయ్ రాజీనామా చేయడం గమనార్హం. -
బ్యాట్స్‌మన్ టు బిజినెస్‌మన్: రిచెస్ట్ బ్యాంకర్ గురించిన ఆసక్తికర విషయాలు
కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేసినట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఆయన బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. భారతదేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ గురించిన పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఉదయ్ కోటక్ ఈ సంవత్సరం డిసెంబరులో పదవీ విరమణ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పదవీ విరమణ రోజుకు నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేశారు. మొత్తంగా 38 సంవత్సరాలకుపైగా ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగారు. ఇండియన్ రిచెస్ట్ బ్యాంకర్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. 2023 సెప్టెంబరు 2 నాటికి ఉదయ్ కోటక్ దాదాపు 13.7 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో భారతదేశపు అత్యంత సంపన్న బ్యాంకర్. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఆయన ఆదాయంలో దాదాపు 26 శాతం బ్యాంకులో వాటా నుంచే వస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఉదయ్ కోటక్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 133వ స్థానంలో ఉన్నారు. కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో 1985లో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించిన ఉదయ్ కోటక్ 2003లో దాన్ని బ్యాంక్‌గా మార్చారు. ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్.. కోటక్ 811 బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ముంబయిలో పత్తి వ్యాపారం చేసే ఓ గుజరాతీ కుటుంబంలో ఉదయ్ కోటక్ జన్మించారు. 60 మంది సభ్యులున్న పెద్ద ఉమ్మడి కుటుంబం వారిది. సిడెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బీకామ్ డిగ్రీని పొందారాయన. అలాగే జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఒకప్పుడు క్రికెటర్ రిచెస్ట్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి అంతగా తెలియని విషయం ఏమిటంటే ఆయన అద్భుతమైన క్రికెటర్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అలాగే కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. వాస్తవంగా క్రికెటర్‌గానే తన కెరీర్‌ను కొనసాగించాలకున్నారు ఉదయ్ కోటక్. కానీ విధి మరోలా తలచింది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరుగుతున్న కంగా లీగ్‌లో వికెట్ల మధ్య పరిగెత్తుతుండగా ప్రమాదవశాత్తు బాల్ ఆయన తలకు బలంగా తగిలింది. మెదడులో రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేశారు. ఈ ప్రమాదం ఆయన్ను కొన్ని నెలలపాటు మంచం పట్టించింది. క్రికెట్ కెరీర్‌ను ముగించడమే కాకుండా జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక విద్యా సంవత్సరం కూడా కోల్పోవాల్సి వచ్చింది. (Warren Buffett Assets 2023: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..) ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన కుటుంబం, స్నేహితుల నుంచి కొంత పెట్టుబడి తీసుకుని ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించారు. పెట్టుబడిలో ఎక్కువ భాగం ఉదయ్ కోటక్ ప్రాణ స్నేహితుడైన ఆనంద్ మహీంద్రా నుంచే వచ్చింది. తరువాత కొన్ని సంవత్సరాలలో ఉదయ్ కోటక్ తన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఫైనాన్స్ వంటి వివిధ ఆర్థిక సేవల రంగాలలోకి విస్తరించారు. -
కోటక్ మహీంద్రా సీఎండీగా ఉదయ్ కోటక్ రాజీనామా
Uday Kotak resigns: కొటాక్ మహీంద్రా బ్యాంక్ సీఎండీ ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. షెడ్యూల్ కంటే 3 నెలల ముందుగానే తన పదవికి రాజీనామా చేయడం వార్తల్లో నిలిచింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లోవెల్లడించింది. ఆయనను బ్యాంక్ సీఎండీ బాధ్యతలనుంచి వైదొలిగినట్టు పేర్కొంది. ఈ రాజానామాను బ్యాంక్ బోర్డు ఆమోదం మేరకు సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చిందని తెలిపింది. అటు సీఎండీగా స్వచ్ఛందంగా వైదొలగుతున్నట్టు ఉదయ్ కోటక్ కూడా ట్విటర్లో వెల్లడించారు. విశ్వసనీయత , పారదర్శకత ప్రాథమిక సిద్ధాంతాలతో తాము విశిష్ట సేవలందించామనీ, లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించామని పేర్కొన్నారు. 1985లో రూ. 10వేల మొదలైన తమ ప్రస్తానం ఈరోజు దాదాపురూ. 300 కోట్లకు చేరిందన్నారు. తమ సంస్థ సామాజిక , ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. వ్యవస్థాపకుడిగా, కోటక్ బ్రాండ్‌తో చాలా అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) Succession at Kotak Mahindra Bank has been foremost on my mind, since our Chairman, myself and Joint MD are all required to step down by year end. I am keen to ensure smooth transition by sequencing these departures. I initiate this process now and step down voluntarily as CEO.… — Uday Kotak (@udaykotak) September 2, 2023 చాలా కాలం క్రితం, JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి పేర్లు ఆర్థిక ప్రపంచంలో ఆధిపత్యం చూశాను . దేశంలో అలాంటి సంస్థను సృష్టించాలని కలతోనే నేను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రాను ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో 3 మంది ఉద్యోగులతో ప్రారంభించా. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగినన్నారు.వ్యవస్థాపకులు వెళ్ళిపోతారు, కానీ సంస్థ శాశ్వతంగా వర్ధిల్లుతుందంటూ ట్వీట్ చేశారు. -
కోటక్ బ్యాంక్ పనితీరు భేష్
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం వృద్ధితో రూ.3,452 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్‌గా చూసుకుంటే (బీమా, ఏఎంసీ, బ్రోకరేజీ తదితర వ్యాపారాలు కలిసిన) నికర లాభం 51 శాతం పెరిగి రూ.4,150 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.6,234 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 5.57 శాతంగా నమోదైంది. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచగా, ఈ మొత్తాన్ని రుణగ్రహీతలకు బ్యాంక్ బదలాయించింది. కానీ, అదే సమయంలో డిపాజిట్లపై బదిలీ చేసిన ప్రయోజనం ఇంతకంటే తక్కుగానే ఉండడం గమనార్హం. అయితే డిపాజిట్లపై రేట్ల సవరణ ప్రభావం దృష్ట్యా నికర వడ్డీ మార్జిన్ ప్రస్తుత స్థాయిలో కొనసాగడం కష్టమేనని బ్యాంక్ డిప్యూటీ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ మార్జిన్ 5.25 శాతంగా ఉండొచ్చన్నారు. ఫీజుల ఆదాయంలో వృద్ధి : ఫీజులు, సేవల ఆదాయం 20 శాతం పెరిగి రూ.1,827 కోట్లుగా నమోదైంది. కాసా రేషియో 49 శాతానికి చేరుకుంది. మార్కెట్ గెయిన్ రూపంలో రూ.240 కోట్ల మొత్తం సమకూరింది. బ్యాంకు రుణాలు 19 శాతం పెరిగి రూ.3,37,031 కోట్లకు చేరాయి. అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలు (మైక్రోఫైనాన్స్ సహా) మొత్తం రుణాల్లో 10.7 శాతానికి పెరిగాయి. క్రెడిట్ కార్డుల రూపంలో రుణ పుస్తకంపై కొంత ఒత్తిడి ఉన్నట్టు దీపక్ గుప్తా తెలిపారు. అయినప్పటికీ ఈ విభాగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకైతే ఈ విభాగం విషయంలో సౌకర్యంగానే ఉన్నట్టు తెలిపారు. రుణ ఆస్తుల నాణ్యత మెరుగు బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యత కొంత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 1.77 శాతానికి (రూ.6,587కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి 2.24 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు 0.40 శాతానికి పరిమితమయ్యాయి. ఇవి క్రితం ఏడాది ఇదే కాలంలో 0.62 శాతంగా ఉన్నాయి. తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో రూ.1,205 కోట్లు ఎన్పీఏలుగా మారాయి. -
రత్తన్‌ఇండియా పవర్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ పెట్టుబడులు
ముంబై: రెండు అనుబంధ సంస్థల ద్వారా రత్తన్‌ఇండియా పవర్ లిమిటెడ్(ఆర్ఐపీఎల్)లో రూ. 732 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీఏలు) జారీ ద్వారా చేపట్టిన తాజా పెట్టుబడులతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ రుణ చెల్లింపు వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనున్నట్లు పేర్కొంది. కొటక్ స్ట్రాటజిక్ సిట్యుయేషన్స్ ఇండియా ఫండ్–2 ద్వారా రూ. 582 కోట్లు, కొటక్ ప్రయివేట్ క్రెడిట్ ఫండ్(కేపీసీఎఫ్) ద్వారా రూ. 150 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేసింది. తగిన రిస్క్ సర్దుబాటు చేసిన రాబడుల కోసం క్యాపిటల్ స్టాక్‌లో పాల్గొన్న తమ కొత్త క్రెడిట్ ఫండ్స్ నుంచి ఇది మొదటి పెట్టుబడి అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని శ్రీనివాసన్ పేర్కొన్నారు.ృ -
భారీ నష్టాల్లో సూచీలు: హెచ్‌సీఎల్, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించిన సూచీలు ఆ తరువాత మరింత నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టంతో 61500 దిగువన ట్రేడవుతుండగా, 130 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,150 స్థాయిని కోల్పోయింది. ఐటీ , ఫైనాన్షియల్ షేర్లలో నష్టాలు ప్రభావితం చేస్తున్నాయి. నష్టాలు మరింత కొనసాగుతున్నాయి. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) హీరో మోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, భారతి ఎయిర్టెల్ బాగా లాభపడుతుండగా హెచ్‌సిఎల్ టెక్, కోటక్ బ్యాంక్ టాప్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటన్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అదానీ హిండెన్‌బర్ వివాదంలో సెబీ అప్పీల్‌ను స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన నేపథ్యంల నేటి (బుధవారం)సెషన్లో అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. -
డెబిట్ కార్డు చార్జీల పెంపు!
ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు చేదు వార్త చెప్పింది. డెబిట్ కార్డ్ వార్షిక చార్జీలను రూ.60 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఇదీ చదవండి: అనుకోకుండా అన్నా.. ‘డాలర్ ఫైనాన్సియల్ టెర్రరిస్ట్’ వ్యాఖ్యపై ఉదయ్ కోటక్ వివరణ రూ.60 బాదుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పటివరకు డెబిట్ కార్డ్ వార్షిక చార్జీ కింద రూ.199 వసూలు చేస్తోంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ చార్జీని ఇప్పుడు రూ.259 లకు పెంచింది. దీంతో పాటు జీఎస్టీ అదనంగా ఉంటుంది. అంటే రూ.60 మేర చార్జీ పెరుగుతుందన్న మాట. పెరిగిన చార్జీలు మే 22 నుంచి అమలులోకి వస్తాయి. అలాగే ఈ చార్జీలు బ్యాంకులోని అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తాయి. ఇక జూన్ 1 నుంచి సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు సంబంధించి అమలయ్యే ఛార్జీలు ఇలా ఉన్నాయి.. అకౌంట్లో కనీస బ్యాలెన్స్ లేకుంటే.. 6 శాతం లేదా గరిష్టంగా రూ. 600 వరకు ఛార్జీ వసూలు చేస్తుంది. ఇష్యూ చేసిన చెక్ ఏదైనా నాన్ ఫైనాన్షియల్ కారణంతో రిటర్న్ అయితే రూ. 50 ఛార్జీ పడుతుంది. అలాగే చెక్ డిపాజిట్ అయిన తర్వాత రిటర్న్ అయితే రూ.200 చార్జీ ఉంటుంది. ఇదీచదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...? -
కొటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14 శాతంపైగా వృద్ధితో రూ. 4,566 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 34 శాతం జంప్‌చేసి రూ. 3,496 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం రూ. 8,573 కోట్ల నుంచి రూ. 10,939 కోట్లకు ఎగసింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 35 శాతం బలపడి రూ. 6,103 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.75 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం 30 శాతం పుంజుకుని రూ. 2,186 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.34 శాతం నుంచి 1.78 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 21.80 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ4లో అనుబంధ సంస్థలలో కొటక్ ప్రైమ్ నికర లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు వెనకడుగు వేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. అకౌంటింగ్ విధానాలలో మార్పు ఇందుకు కారణమైనట్లు పేర్కొంది. ఆటుపోట్ల మార్కెట్ కారణంగా క్యాపిటల్ మార్కెట్ ఆధారిత అనుబంధ సంస్థ అసెట్ మేనేజ్మెంట్ లాభం మాత్రం రూ. 192 కోట్లకు మెరుగుపడినట్లు తెలియజేసింది. -
‘డాలర్ ఫైనాన్సియల్ టెర్రరిస్ట్’..
అమెరికన్ డాలర్ ‘ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది’ అని చేసిన వ్యాఖ్యపై కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆ మాట తాను అనుకోకుండా అన్నానన్నారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘యూఎస్ డాలర్‌పై ఇటీవల జరిగిన చర్చలో నేను అనుకోకుండా "ఆర్థిక ఉగ్రవాది" అనే పదాలను ఉపయోగించాను. నా ఉద్దేశం ఏమిటంటే రిజర్వ్ కరెన్సీకి అసమాన శక్తి ఉంటుంది. అది నోస్ట్రో ఖాతా అయినా కావచ్చు. 500 బీపీఎస్ రేటు పెరుగుదల అయినా లేదా లిక్విడిటీ కోసం యూఎస్ డాలర్‌ను కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలైనా కావచ్చు’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు.. రిజర్వ్ డాలర్‌గా ఉన్న అమెరికన్ డాలర్ హోదా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే శక్తిని ఇస్తుందన్నారు. చరిత్రలో కీలకమైన ఈ తరుణంలో ప్రపంచం కొత్త రిజర్వ్ కరెన్సీ కోసం వెతుకుతోందని తాను భావిస్తున్నట్లు కోటక్ ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. యూరప్, బ్రిటన్, జపాన్, చైనాతో సహా ఇతర దేశాలు తమ కరెన్సీలను రిజర్వ్ కరెన్సీలుగా పేర్కొనడానికి ముందస్తు అవసరాలు లేవని ఆయన అన్నారు. రూపాయి రిజర్వ్ కరెన్సీ కావాలంటే దేశం బలమైన సంస్థలను, వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. గత మార్చి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభం రూ. 3,495.6 కోట్ల వద్ద 26.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం 35 శాతం పెరిగి రూ.6,102.6 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు నాల్గవ త్రైమాసికంలో రూ.1,193.30 కోట్లకు తగ్గాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1,736.71 కోట్లు. శాతాల పరంగా, నికర ఎన్పీఏ నికర అడ్వాన్స్లలో 0.64 శాతం నుంచి 0.37 శాతానికి మెరుగుపడింది. ఇదీ చదవండి: ATM Fraud Alert: ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త! -
కోటక్ మహీంద్ర బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాల వ్యవధిలోని ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి) వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు సోమవారం( ఏప్రిల్ 10, 2023)నుంచి అమల్లోకి వచ్చాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు 2.75 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ రేటును కోటక్ మహీంద్రా బ్యాంకు చెల్లిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుండి 7.70 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తుంది. సాధారణ ఖాతాదారులతో పోల్చితే, సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తుంది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అలాగే 390 రోజుల నుంచి రెండేళ్ల లోపు ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు గరిష్టంగా 7.20 శాతం, అలాగే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. (మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్!) ఎఫ్డీలపై కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లు 2 నుంచి మూడేళ్ల లోపు కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం 3 నుంచి నాలుగేళ్ల లోపు పరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.50 శాతం 4- 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం 5 - 10 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.20 శాతం వడ్డీ రేటును బ్యాంకు చెల్లిస్తుంది. -
చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!
సాధారణ ఎగువ మధ్యతరగతి కుంటుంబ నేపథ్యంనుంచి వచ్చి బ్యాంకింగ్ నేపథ్యం ఏమీ లేకుండానే దేశీయంగా టాప్ బ్యాంకర్‌గా ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. క్రికెట్లో రాణించాలనుకుని, తొలుత కుటుంబ వ్యాపారం, తదుపరి బ్యాంకింగ్ రంగంలోjకి ఎంట్రీ ఇచ్చి, ఎదురులేని లీడర్‌గా దూసుకుపోతూ ఒంటిచేత్తో కోటక్‌మహీంద్ర బ్యాంకును విజయ తీరాలకు నడిపించడమే కాదు, ప్రపంచంలోని అత్యంత సంపన్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచిన బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి తెలుసుకుందాం...! ఫోర్బ్స్ బిలియనీర్ 2023 జాబితా ప్రకారం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న బ్యాంకర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్. దేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ కూడా. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ఇండెక్స్ ప్రకారం, అతని నికర విలువ 14.8 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు). ఉదయ్ కోటక్ విజయ ప్రస్థానం 1959, మార్చి 15న పత్తి పరిశ్రమలో ఉన్న ఎగువ మధ్య తరగతికి చెందిన గుజరాతీ కుటుంబానికి చెందినవారు ఉదయ్ కోట్.ముంబైలోని సిడెన్హామ్ కాలేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీ, జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీజీ చేశారు. టాప్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పటికీ, తండ్రి ప్రోత్సాహంతో ఫ్యామిలీ వ్యాపారంలో ప్రవేశించారు. రీజినబుల్ రేట్లలో చిన్న చిన్న రుణాలివ్వడం ప్రారంభించారు. దేశ ఆర్థికపరిస్థితి క్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో 1985లో ఫైనాన్సింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒకవైపు లోన్లపై అధిక వడ్డీరేట్లు, మరోవైపు డిపాజిట్ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో ఒక విప్లవానికి బీజం పడింది. అతిస్వల్ప కాలంలోనే కేంద్ర బ్యాంకు ఆర్బీఐ నుంచి పూర్తి బ్యాంకింగ్ లైసెన్స్‌ని అందుకున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీగా అవతరించింది. ఆ తరువాత,బిల్ డిస్కౌంటింగ్, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోకి ప్రవేశించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 22 మార్చి 2003 న, భారత కార్పొరేట్ చరిత్రలో కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తొలి సంస్థగా అవతరించింది. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) క్రికెటర్ అయ్యేవాడిని భారతదేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ పురోగతికి ఉదయ్‌కోటక్ కృషి అమోఘం. తాను వ్యాపారవేత్తను కాకపోయి ఉండి ఉంటే క్రికెట్ ప్లేయర్‌గా ఉండేవాడిని అంటూ క్రికెట్‌పై తన ప్రేమను అనేక ఇంటర్వ్యూలలో వ్యక్తం చేశారు కోటక్ అలాగే గణితంలో మాంచి ప్రావీణ్యమున్న ఉదయ్ కోటక్ చిన్నతనంలో సితార్ వాయించేవారట. పెద్ద ఉమ్మడి కుటుంబంలో 60 మందితో ఉన్న ఇంట్లో సోషలిజాన్ని, పనిలో పెట్టుబడిదారీ విధానాన్ని నేర్చుకున్నానని చెబుతారు. ఆయన సతీమణి పేరు పల్లవి కోటక్. కుమారుడు జే కోటక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అలాగే బ్యాంకు, నియోబ్యాంక్ ప్లాట్‌ఫారమ్ 811కి కో-హెడ్‌గా కూడా పనిచేస్తున్నారు చిన్న కుమారుడు ధావల్ గత ఏడాది కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) నివేదికల ప్రకారం ఉదయ్ కోటక్ వార్షిక వేతనం 3.24 కోట్లు జీతం. అయితే కోవిడ్ కారణంగా మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరం కోటక్ వార్షిక వేతనం రూ.2.65 కోట్లకు పడిపోయిందని బ్లూమ్‌బెర్గ్ క్వింట్ తెలిపింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ 2022 చివరి నాటికి భారతదేశం అంతటా 1,752 శాఖలను కలిగి ఉంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర ఆదాయం 31శాతం ఎగిసి 27.9 బిలియన్ రూపాయలకు (337 మిలియన్ల డాలర్లు) చేరింది. కొత్త సీఈవో కోసం వేట, రేసులో కుమారుడు మరోవైపు ఆర్బీఐ మార్గదర్శకాలు ప్రకారం భారతీయ వ్యాపార అధిపతుల పదవీకాలాన్ని పరిమితం చేసిన తర్వాత, వచ్చే ఏడాది చివరి నాటికి బ్యాంకు సీఈవో పదవి నుండి వైదొలగాలని భావిస్తున్నారు . ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త శోధనకు గాను కన్సల్టింగ్ సంస్థ ఎగాన్ జెహెండర్ను నిమగ్నమైందని తెలుస్తోంది. గ్రూప్ ప్రెసిడెంట్లు, హోల్ టైమ్ డైరెక్టర్లు శాంతి ఏకాంబరం, కెవిఎస్ మణియన్తోపాటు, వారసుడు జేకోటక్ కూడా ఈ రేసులో ఉన్నట్టు సమాచారం. -
మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్
సాక్షి,ముంబై: దేశీయంగా ప్రధాన బ్యాంకులు తమ డెబిట్‌కార్డులపై వినియోగదారులకు ఉచిత ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తాయి. అలాగే పోయిన సామాన్లు, లావాదేవీలకు రక్షణ కల్పిస్తాయి. డెబిట్ కార్డులతో, మెజారిటీ బ్యాంకులు కాంప్లిమెంటరీ బీమా కవరేజీని అందిస్తాయి. డెబిట్ కార్డులకు ఉచిత బీమా ఉంటుంది. వాస్తవానికి ఈ విషయం చాలామంది కస్టమర్లకు తెలియదు. ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తోపాటు, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే కవరేజ్‌ని ఒకసారి చూద్దాం. (కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!) కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద మరణ ప్రయోజనాన్ని రూ. 25 లక్షల వరకు అందిస్తుంది. బీమా కవరేజీని యాక్టివేట్ చేయడానికి, ఏటీఎం లావాదేవీ, పాయింట్-ఆఫ్-సేల్ లావాదేవీ లేదా ఆన్లైన్ కొనుగోలు లాంటి విషయాల్లో ఘటనకు, లేదా ప్రమాద తేదీకి 90 రోజుల ముందు కనీసం ఒక్క సారైనా కార్డ్‌ని ఉపయోగించి ఉండాలి. అంతేకాకుండా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీని అందజేస్తుంది. దీని రూ. 6 లక్షల వరకు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన కార్డ్‌లతో మర్చంట్, ఆన్లైన్ పోర్టల్లలో చేసిన కొనుగోళ్లకు రక్షణ కల్పిస్తుంది. (మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్: నామినీ నమోదు ఎలా?) ఎస్బీఐ ఎయిర్‌లైన్ అందించే కవరేజీకి అదనంగా, ఎస్బీఐ డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి విభిన్న విమానయాన ప్రమాద మరణ బీమాను అందిస్తుంది. స్థానిక, అంతర్జాతీయ విమానాలకు బ్యాగేజ్ నష్ట బీమాను కూడా అందిస్తుంది. అయితే ఎయిర్‌లైన్ టిక్కెట్‌ను కొనుగోలుకు బ్యాంకు డెబిట్ కార్డ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అదీ ప్రమాదం జరిగిన 90 రోజులలోపు ఉపయోగించాలి. అలా చేయడంలో విఫలమైతే బీమా ప్రయోజనం ఉండదు. ఒక వేళ కార్డ్ దారుడు విమాన ప్రమాదంలో మరణిస్తే, బీమా కవరేజ్ దాదాపు రెట్టింపు అవుతుంది. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) ఎస్బీఐకి సంబంధించి వివిధ రకాల కార్డులపై ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఎస్బీఐ గోల్డ్‌కు రూ. 2 లక్షలు, ప్లాటినం కార్డ్‌కు రూ. 5 లక్షలు, ప్రైడ్ కార్డ్‌కు రూ. 2 లక్షలు, ప్రీమియం కార్డ్‌కు రూ. 5 లక్షలు, వీసా, సిగ్నేచర్, మాస్టర్‌కార్డ్‌కు రూ. 10 లక్షలు బీమా కవరేజ్ ఉంటుంది. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసిన 90 రోజులలోపు, రూ. 1 లక్షల వరకు నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 1 కోటి వరకు లభించే ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మినహా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే ప్రమాద బీమా కవరేజీ రూ. 5 లక్షలు. -
అదానీ కంపెనీల్లో కోటక్ బ్యాంక్ ఎక్స్పోజర్
ముంబై: అదానీ గ్రూపు కంపెనీల్లో కోటక్ మహీంద్రా బ్యాంకుకు సైతం కొంత ఎక్స్పోజ ర్ (పెట్టుబడులు/రుణాలు) ఉన్నట్టు బ్యాంక్ అంగీకరించింది. అయితే, ఇది తమ క్రెడిట్ సూత్రాలకు లోబడే ఉన్నట్టు హోల్‌సేల్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ పరితోష్ కాశ్యప్ తెలిపారు. ‘‘అదానీ గ్రూపు చుట్టూ ఉన్న అంశాలు అన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్, మార్కెట్ విలువలకు సంబంధించినవి. రుణ పరపతి గురించి కాదు. మాకు స్వల్ప ఎక్స్పోజర్ ఉంది. దేశంలోని ప్రతి కార్పొరేట్‌తో మాకు వ్యాపారం ఉంటుంది. కాకపోతే ఇది మా క్రెడిట్ సూత్రాలకు లోబడే ఉంది’’అని చెప్పారు. అదానీ గ్రూప్ కంపెనీలకు రుణ భారం సహేతుక స్థాయిలో ఉందన్నారు. అలాగే, బలమైన లాభదాయకత, బ్యాలన్స్ షీట్లను కలిగి ఉన్నట్టు చెప్పారు. అమె రికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ.. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు ఉన్నా యని, కంపెనీల షేర్లను కృత్రిమంగా పెంచినట్టు ఆరోపణలు చేయడం తెలిసిందే. దీన్ని అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ.. కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు సెబీ దర్యాప్తునకు కూడా ఆదేశించడం గమనార్హం. -
బయోకాన్‌లో ‘కోటక్ ఫండ్’ రూ. 1,070 కోట్ల పెట్టుబడి
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో భాగమైన కోటక్ స్పెషల్ సిట్యుయేషన్స్ ఫండ్ (కేఎస్‌ఎస్‌ఎఫ్) తాజాగా బయోకాన్ బయాలాజిక్స్లో రూ. 1,070 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. బయోసిమిలర్స్ వ్యాపారంలో తమ భాగస్వామి వయాట్రిస్ వాటాలను బయోకాన్ కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ఈ డీల్‌తో తాము మొత్తం 1 బిలియన్ డాలర్ల నిధిని పూర్తిగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుందని కేఎస్‌ఎస్‌ఎఫ్ సీఈవో ఈశ్వర్ కర్రా తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ వ్యాపార విభాగానికి సంబంధించిన పూర్తి ఆదాయాలు బయోకాన్‌కు దఖలుపడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమీకృత బయోసిమిలర్స్ కంపెనీగా ఎదిగేందుకు ఈ కొనుగోలు డీల్ ఉపయోగపడుతుందని వివరించారు. వయాట్రిస్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు బయోకాన్ గతేడాది ప్రకటించింది. -
డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదే...
ముంబై: దేశంలో డేటా సెంటర్ల వ్యాపారంపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రూ.590 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,835 కోట్లు) సమీకరించింది. కోటక్ డేటా సెంటర్ ఫండ్ కింద 800 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు కోటక్ బ్యాంక్‌కు చెందిన కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ (కేఐఏ) ప్రకటించింది. దేశంలో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదేనని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న డేటా సెంటర్ సామర్థ్యం మన అవసరాల కంటే తక్కువగానే ఉన్నట్టు కేఐఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్‌షా పేర్కొన్నారు. ‘‘ఇది భారీ పెట్టుబడులు అవసరమైన రంగం. కనుక భారీ ఈక్విటీ పెట్టుబడుల అవకాశాలు ఉంటాయని మేం భావిస్తున్నాం’’అని చెప్పారు. (ఇదీ చదవండి: మనకు ఎడాదికొక ఎలక్ట్రిక్ కారు.. వోల్వో ప్రామిస్!) -
కమెడియన్ నోటి దురుసు.. షాకిచ్చిన బ్యాంక్!
ప్రైవేట్ బ్యాంక్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రముఖ కమెడియన్ తన్మయ్ బట్‌తో కుదుర్చుకున్న వ్యాపార ప్రకటనల నుంచి తప్పించింది. అందుకు కారణం తన్మయ్ నోటి దురుసేనని తెలుస్తోంది. 11 ఏళ్ల క్రితం తన్మయ్ బట్ ఓ సామాజిక వర్గంతో పాటు, దేవుళ్ల విగ్రహాలు, చిన్న పిల్లల గురించి అసభ్యకర వ్యాఖ్యలను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారమే చెలరేగింది. ఆ అభ్యంతర వ్యాఖ్యలు మరో సారి సోషల్ మీడియాలో చర్చనీయాంశగా మారాయి. తాజాగా కొటక్ మహీంద్రా బ్యాంక్ 811 పేరుతో కమెడియన్ గ్రూప్ ఆల్ ఇండియా బక్ చోడ్తో కలిసి కమెడియన్ తన్మయ్ బట్, సమయ్ రైనాలతో ఓ యాడ్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే పలువురు నెటిజన్లు దశాబ్దం నాటి ట్వీట్లను వెలుగులోకి తెచ్చారు. వాటిని రీట్వీట్ చేస్తూ కొటక్ మహీంద్రా బ్యాంక్ బాయ్ కాట్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో హోరెత్తించారు. Hi @KotakBankLtd @udaykotak I am a customer of your bank but the fact that you have hired a hinduphobic, woman and child abuser Tanmay Bhat for a campaign is making me consider closing my account. Discontinue the association with him and apologise? pic.twitter.com/W57pdic4jf — Monica Verma (@TrulyMonica) February 12, 2023 బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సైతం తన్మయ్ బట్‌తో అడ్వటైజ్మెంట్ చేయడాన్ని తప్పు పట్టింది. ఆమెకు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. పలువురు వినియోగదారులు తమకు కొటక్ బ్యాంక్‌లో అకౌంట్లు ఉన్నాయని, వాటిని వెంటనే క్యాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో కొటక్ బ్యాంక్ ఖాతాదారులకు క్షమాపణలు చెప్పింది. కమెడియన్ గ్రూప్ ఆల్ ఇండియా బక్ చోడ్తో కలిసి చేసే ఈ వ్యాపార ప్రకటన నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపింది. We, at Kotak Mahindra Bank Ltd. do not support or endorse the views of actors made in their personal capacity that harm or offend any individual or group. We have withdrawn the campaign. — Kotak 811 (@kotak811) February 12, 2023 -
కోటక్ మహీంద్రా బ్యాంక్ చేతికి సొనాటా, ఎన్ని కోట్ల డీల్ అంటే!
ముంబై: సూక్ష్మ రుణాల సంస్థ సొనాటా ఫైనాన్స్‌ను రూ. 537 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోటక్ మహీంద్ర బ్యాంక్ (కేఎంబీ) వెల్లడించింది. ఇది పూర్తి నగదు రూపంలోనే జరిగిందని సంస్థ వివరించింది. 2017లో బీఎస్ఎస్ మైక్రోఫైనాన్స్‌ను దక్కించుకున్న తర్వాత ఈ తరహా డీల్స్‌లో కేఎంబీకి ఇది రెండోది. దీనితో 9 లక్షల మంది పైచిలుకు మహిళా కస్టమర్లు, 10 రాష్ట్రాల్లో 502 శాఖలు లభిస్తాయని సంస్థ తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సొనాటా .. నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ-మైక్రోఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐ)గా కార్యకలాపాలు సాగిస్తోంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థ నిర్వహణలో రూ. 1,903 కోట్ల ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని కేఎంబీ కమర్షియల్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ మనీష్ కొఠారీ చెప్పారు. -
ఎఫ్డీ చేసేవారికి గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు పెంపు
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచిన 24 గంటల్లోనే కోటక్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను సవరించింది. రుణ రేట్లు డిపాజిట్ రేట్లతో అనుసంధానమై ఉంటాయని తెలిసిందే. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతానికి చేరింది. రూ.2–5 కోట్ల డిపాజిట్లపై రేటు 7.25 శాతానికి చేరింది. ‘‘ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ ప్రయోజనాన్ని మా విలువైన కస్టమర్లకు బదిలీ చేయాలని, వారి పొదుపు నిధులపై అధిక రాబడులను ఆఫర్ చేయాలని నిర్ణయించాం’’అని కోటక్ బ్యాంక్ ప్రకటించింది. -
సామాన్యులకు ఆర్బీఐ మరో భారీ షాక్!
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో దఫా కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు– ప్రస్తుతం 6.25 శాతం)ను సమీప కాలంలో మరో పావుశాతం పెంచుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దీనితో ఈ రేటు 6.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలను వెలువరించారు. సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. తొలుత 6 శాతానికి, అటుపై నాలుగు శాతానికి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కృషి చేస్తామని బుధవారం పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కోటక్ ఉటంకించారు. ప్రపంచ పరిణామాలు, చమురు ధరలు తదితర అంశాలు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోందన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు సూచనలతో ఇతర సెంట్రల్ బ్యాంకులూ ఇదే అనుసరించడానికి సిద్ధమవుతున్నాయని అన్నారు. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్బీఐ మే నుంచి రెపో రేటును ఐదు దఫాల్లో 2.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఎకానమీ పురోగతికి అవకాశాలు... భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత గురించి కోటక్ మాట్లాడుతూ దేశం సుమారు 3.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని అన్నారు. మరింత పురోగతికి అవకాశాలు ఉన్నాయని సూచించారు. ప్రపంచంలోని మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా నిలిచేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రపంచ స్థాయి భారత్ కంపెనీలను అభివృద్ధి చేసే బాటలో, అత్యాధునిక ఉత్పత్తి ఆవిష్కరణలు, మేథో హక్కుల (ఐపీ) అభివృద్ధి సాధన, దీని ప్రాతిపదికన తయారీలో అంతర్జాతీయ స్థాయిని సాధించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. విధానాల అమలు ముఖ్యం: సంజీవ్ బజాజ్ కార్యక్రమంలో బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నిరంతర పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. కొత్త ఉత్పాదక సామర్థ్యాలను అభివృద్ధి చేసే అంశం... వాగ్దానాలకంటే విధానాల అమలుపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భారత్‌ను 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి సంబంధించి ఆయన నాలుగు కీలక సూచనలు చేశారు. పరిశ్రమ –వాణిజ్య విధానాల పరస్పర పురోగతికి చర్యలు, పటిష్ట ఫైనాన్షియల్ వ్యవస్థ స్థాపన, ప్రజల సామర్థ్యాన్ని పెంపొందించడానికి విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను పెంచడం, ఉత్పత్తి ఆధారిత స్కీమ్ (పీఎల్ఐ)ను కార్మిక ప్రభావిత రంగాలకు విస్తరించడం ద్వారా ఎకానమీలో తయారీ రంగం వాటా విస్తరణ వీటిలో ఉన్నాయి. -
కోటక్ మహీంద్రా లాభం ప్లస్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 21 శాతం పుంజుకుని రూ. 3,608 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 27 శాతం జంప్‌చేసి రూ. 2,581 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 8,408 కోట్ల నుంచి రూ. 10,047 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం బలపడి రూ. 5,099 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.17 శాతానికి చేరాయి. అయితే ఆటోమాటిక్ పద్ధతిన రుణాలపై మార్కెట్‌కు అనుసంధానమైన రేట్లతో మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు దోహదం చేసినప్పటికీ భవిష్యత్‌లో 4.25–4.35 శాతం స్థాయిలో ఇవి కొనసాగగలవని బ్యాంక్ వివరించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19 శాతం నుంచి 2.08 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.06 శాతం నుంచి 0.55 శాతానికి దిగివచ్చాయి. తాజా స్లిప్పేజీలు రూ. 983 కోట్లుగా నమోదయ్యాయి. అనుబంధ సంస్థల తీరు ఇదీ.. కోటక్ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ లాభం రూ. 155 కోట్ల నుంచి రూ. 270 కోట్లకు ఎగసింది. సెక్యూరిటీస్ లాభం రూ. 243 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు తగ్గింది. కొటక్ ప్రైమ్ లాభం రూ. 18 కోట్లు తక్కువగా రూ. 222 కోట్లకు పరిమితమైంది. ట్రస్టీ విభాగం నుంచి రూ. 9 కోట్లు అధికంగా రూ. 106 కోట్లు లభించినట్లు కొటక్ బ్యాంక్ వెల్లడించింది. కోటక్ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 11 కోట్లు తగ్గి రూ. 78 కోట్ల లాభం ఆర్జించింది. మైక్రోఫైనాన్స్ లాభం రూ. 8 కోట్ల నుంచి ఏకంగా రూ. 70 కోట్లకు దూసుకెళ్లింది. అయితే కోటక్ క్యాపిటల్ లాభం రూ. 58 కోట్ల నుంచి రూ. 22 కోట్లకు క్షీణించింది. చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్! -
రుణ రేట్లను పెంచిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. రెండు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు– కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన ఆయా బ్యాంకుల వ్యక్తిగత, గృహ, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటు (మే నుంచి 1.9 శాతం పెంపుతో 5.9 శాతానికి అప్) పెంపు బాట పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ, కోటక్, ఫెడరల్ బ్యాంక్ రేట్ల పెంపు వివరాలు ఇలా.. ► ఎస్బీఐ బెంచ్‌మార్క్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 7.95 శాతానికి చేరింది. ఈ రేటు అక్టోబర్ 15 నుంచీ అమల్లోకి వస్తుంది. మెజారీటీ కస్టమర్ల రుణ రేటు ఏడాది రేటుకే అనుసంధానమై ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితుల ఎంసీఎల్ఆర్ పావుశాతం చొప్పున పెరిగి వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి ఎగసింది. ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.60–7.90 శాతం శ్రేణిలో ఉన్నాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ వివిధ కాలపరిమితులపై 7.70–8.95 శ్రేణిలో ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75 శాతం. అక్టోబర్ 16 నుంచి తాజా నిర్ణయం అమలవుతుంది. ► ఫెడరల్ బ్యాంక్ ఏడాది రుణ రేటు అక్టోబర్ 16 నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ రేటు కోత కాగా, ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 2.70 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. రూ.10 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తాజా రేటు అమలవుతుంది. కాగా, రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీరేటును 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. నిధుల భారీ సమీకరణ లక్ష్యంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చేసిన ఈ సర్దుబాట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై బీఓబీ రేట్ల పెంపు కాగా, ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వడ్డీరేట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, మెచ్యూరిటీ కాలపరిమితులపై 135 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేటు పెరిగినట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుంచి నవంబర్ 15 వరకూ తాజా రేట్లు అమలవుతాయని కూడా వివరించింది. -
కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!
న్యూఢిల్లీ: ఆర్కాడియా షేర్, స్టాక్ బ్రోకర్లకు సంబంధించిన షేర్ తనఖా కేసులో కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ డిపాజిటరీ సీడీఎస్ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్–ఇండియా) జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. నాన్-ట్రేడింగ్ సభ్యునికి ఆదేశాలు జారీ చేసే అధికారాలు ఎన్ఎస్ఈ, సీడీఎస్ఎల్కు ఉండబోవని అప్పీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కేసు వివరాలు ఇవీ... మార్చి 2008లో, ఆర్కాడియా తన షేర్ల తాకట్టు ఆధారంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రుణాన్ని పొందింది. తనఖా షేర్ల చట్టపరమైన, ప్రయోజనం పొందిన యజమాని ఆర్కాడియా మాత్రమేనని, సెక్యూరిటీ స్వాధీన చర్యలను బ్యాంక్ చేపట్టకూడదని ఈ మేరకు జరిగిన ఒప్పందం పేర్కొంది. అయితే డిసెంబర్ 2020 నాటికి, ఆర్కాడియా తన రీపేమెంట్ బాధ్యతల విషయంలో విఫలం అవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆర్కాడియాకు బ్యాంక్ 2021 ఫిబ్రవరి 15వ తేదీన తెలియ జేసింది. దీనితో ఆర్కాడియా ఈ వ్యవహారంపై ఎన్ఎస్ఈ న్యాయ విభాగాన్ని ఆశ్రయించింది. తనఖా పెట్టిన ఆర్కాడియా అనుమతి లేకుండా షేర్ల స్వాధీనం కుదరదని ఎన్ఎస్ఈ బ్యాంక్‌కు స్పష్టం చేసింది. ఎన్ఎస్ఈ ఆదేశాల నేపథ్యంలో ఆర్కాడియా డీమ్యాట్ అకౌంట్‌ను సీడీఎస్ఎల్ స్తంభింపజేసింది. దీనితో ఆర్కాడియా తనఖా పెట్టిన షేర్లను బ్యాంక్ తన స్వాధీనంలోకి తీసుకోలేకపోయింది. ఈ వివాదంపై అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కోటక్ బ్యాంక్ ఆశ్రయించింది. (Vivo Y35: స్లిమ్ ఫోన్ ‘వై35’ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?) రూలింగ్ ఇలా... స్టాక్ ఎక్స్చేంజ్గా ప్రతివాది (ఎన్ఎస్ఈ) దాని ట్రేడింగ్ సభ్యులపై మాత్రమే అధికార పరిధిని కలిగి ఉంటుందని శాట్ స్పష్టం చేసింది. ట్రేడింగ్ సభ్యుడు కాని అప్పీలుదారు (కోటక్ మహీంద్రా బ్యాంక్)తో సహా మరే ఇతర సంస్థకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. అదేవిధంగా, డిపాజిటరీ కూడా తన అధికార పరిధిలో లేని ఏ ఇతర సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని, లేదా అప్పీలుదారుకు అనుకూలంగా తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను స్తంభింపజేయ జాలదని స్పష్టం చేసింది.ఆర్కాడియా తనఖా షేర్లపై -
కొటక్ చేతికి డీఎల్ఎల్ రుణాలు
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ డచ్ ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ డీఎల్ఎల్ ఇండియాకు చెందిన ఆస్తుల (రుణాలు)ను సొంతం చేసుకుంది. రూ. 650 కోట్లకుపైగా విలువైన అగ్రి, హెల్త్‌కేర్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను చేజిక్కించుకున్నట్లు కొటక్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. వీటిలో రూ. 582 కోట్ల రుణాలను క్లాసిఫైడ్, స్టాండర్డ్‌గా వర్గీకరించగా.. మరో రూ. 69 కోట్లు మొండి బకాయిలు (ఎన్పీఏలు)గా తెలియజేసింది. తమ పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకోవడం ద్వారా కొటక్ బ్యాంక్ 25,000 అత్యంత నాణ్యమైన కస్టమర్లను పొందనున్నట్లు రాబోబ్యాంక్కు అనుబంధ సంస్థ అయిన డీఎల్ఎల్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. -
షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..?
న్యూఢిల్లీ: గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఈఎంఐల భారం పెరిగే దిశగా బ్యాంకులు దాదాపు మూడేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను (ఎంసీఎల్ఆర్) 0.10 శాతం వరకు పెంచాయి. మిగతా బ్యాంకులు కూడా అదే బాట పట్టనున్నాయి. దీంతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలు తీసుకున్న వివిధ రకాల రుణగ్రహీతలకు .. నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు (ఈఎంఐ) మరింత భారం కానున్నాయి. వివరాల్లోకి వెడితే.. ఎస్బీఐ తమ ఎంసీఎల్ఆర్ వివిధ కాలావధులకు సంబంధించి 0.10 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధికి ఈ రేటు 7 శాతం నుంచి 7.10 శాతానికి చేరింది. అలాగే, రెండు.. మూడేళ్ల వ్యవధికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ వరుసగా 7.30 శాతం, 7.40 శాతానికి చేరింది. కొత్త ఎంసీఎల్ఆర్ ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తమ వెబ్సైట్లో పేర్కొంది. అటు ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు బీవోబీ కూడా ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం పెంచడంతో ఇది 7.35 శాతానికి చేరింది. ఏప్రిల్ 12 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా (కేఎంబీ) బ్యాంకులు కూడా ఏడాది కాలావధి ఎంసీఎల్ఆర్ను సవరించడంతో ఇది 7.40 శాతానికి చేరింది. యాక్సిస్ బ్యాంక్ కొత్త రేటు ఏప్రిల్ 18 నుంచి, కేఎంబీ రేటు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకివచ్చాయి. ఈబీఎల్ఆర్ రేట్లు యథాతథం ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై ఈఎంఐలు స్వల్పంగా పెరగనున్నప్పటికీ .. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ ఆధారిత రుణాల నెలసరి వాయిదాలు యథాతథంగానే కొనసాగనున్నాయి. ఎస్బీఐకి సంబంధించి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఈబీఎల్ఆర్) ఏప్రిల్ 1 నుంచి 6.65 శాతంగాను, రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతం స్థాయిలో ఉన్నాయి. హౌసింగ్, ఆటో లోన్స్ సహా రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్పై కొంత క్రెడిట్ రిస్క్ ప్రీమియం అధికంగా వసూలు చేస్తున్నాయి. ద్రవ్య పరపతి విధానంలో మార్పుల ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ అయ్యేలా చూసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని పాటించాలంటూ బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. దీని ప్రకారం 2019 అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు.. రుణ మంజూరీలో ఈబీఎల్ఆర్ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..! -
ఇంటి యజమానులుగా మహిళలు .. స్పష్టంగా కనిపిస్తోన్న మార్పు
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగులు ఇంటి యజమానులుగా మారడం అన్నది గత రెండు మూడేళ్లలో పెరిగినట్టు కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రెసిడెంట్ (కన్జ్యూమర్ బ్యాంకింగ్) శాంతి ఏకాంబరం తెలిపారు. అయినప్పటికీ మొత్తం మీద చూస్తే వీరి శాతం తక్కువగానే ఉన్నట్టు చెప్పారు. ఈ ధోరణి వారి ఆర్థిక స్వతంత్రత, నిర్ణయాలు తీసుకోవడాన్ని బలపరుస్తుందన్నారు. మహిళా సాధికారత కోటక్ బ్యాంకు ప్రాధాన్యతల్లో ఒకటని.. కోటక్ సిల్క్ పేరుతో మహిళల కోసం వినూత్నమైన సేవింగ్స్ ఖాతాను ఆఫర్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ‘‘నేడు వృత్తి/వ్యాపారం/ఉద్యోగాల్లో ఉన్న మహిళలు ఇళ్లను కొంటున్నారు. ఇలా కొనుగోలు చేసే వారి సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. ప్రధాన దరఖాస్తుదారుగా వారు ఉంటూ, భర్త లేదా తండ్రిని సహ దరఖాస్తుదారుగా చేరుస్తున్నారు. గడిచిన 2–3 ఏళ్లలో ఇది గణనీయంగా పెరిగింది’’ అని శాంతి ఏకాంబరం వివరించారు. ఒక్క మెట్రోల్లోనే ఇది కనిపించడం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నట్టు చెప్పారు. మహిళలు గృహ రుణాలు తీసుకోవడం ఆహ్వానించతగినదిగా పేర్కొన్నారు. చదవండి: డ్రెస్ ఫర్ సక్సెస్..: విజయానికి కావాలి ఓ డ్రెస్! -
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త..!
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కోటక్ నిర్ణయం తీసుకుంది. ఈ వడ్డీరేట్ల పెంపు డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనుంది. కొత్త వడ్డీ రేట్ల అమలు 2022 మార్చి 9 నుంచి సవరించిన కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. రూ.2 కోట్ల వరకు బ్యాలెన్స్ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. దీంతో 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 5 శాతానికి పెరిగింది. గతంలో ఈ ఎఫ్డీలపై 4.9 శాతం వడ్డీ రేటును కోటాక్ అందించింది. సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. కాగా గత నెలలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. సవరించిన వడ్డీరేట్లు ఇలా..! ► 7 రోజుల నుంచి 30 రోజుల కాలపరిమితి ఎఫ్డీలపై 2.5 శాతం ► 31 నుంచి 90 రోజుల ఎఫ్డీలపై 2.75 శాతం ► 91 నుంచి 120 రోజుల ఎఫ్డీలపై 3 శాతం వడ్డీ ► 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి ఎఫ్డీలపై వడ్డీ రేటు 2.5 శాతం నుంచి 5.8 శాతం వరకు ఉంటుంది. ► 181 రోజుల నుంచి 363 రోజుల ఎఫ్డీలపై 4.4 శాతం ► 364 రోజుల ఎఫ్డీలపై 4.5 శాతం ► 390 రోజుల నుంచి 23 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.1 శాతం ► 3 నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.45 శాతం ► 5 ఏళ్లుపై మించిన ఎఫ్డీలపై 5.5 శాతం చదవండి: క్రెడిట్‌కార్డు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ వార్త..! -
భారత్‌పే ఎండీకి ఉద్వాసన! అసలేం జరుగుతోందంటే..
ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే ఎండీ, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు ఉద్వాసన దిశగా కంపెనీ నిర్ణయం తీసుకోనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. తెర వెనుక వ్యవహారం మరోలా ఉందని తెలుస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను హడావిడిగా సెలవుల మీద బయటికి పంపింది. తాజాగా మార్చి చివరినాటి వరకు ఆయన సెలవుల్ని పొడిగిస్తున్నట్లు భారత్‌పే ఒక ప్రకటనలో పేర్కొంది. శాశ్వతంగా..? ‘ఇది పూర్తిగా అష్నీర్ తీసుకున్న నిర్ణయం.. కంపెనీ, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అష్నీర్ నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది కంపెనీ. అయితే అష్నీర్ లాంగ్ లీవ్ వెనుక బోర్డు ఒత్తిడి ఉన్నట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అష్నీర్ స్థానంలో సీఈవో సుహాయిల్ సమీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శక్తివంతమైన మేనేజ్మెంట్ టీంతో ముందుకు వెళ్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేయడం ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు సెలవుల పరిణామంపై స్పందించేందుకు అష్నీర్ విముఖత వ్యక్తం చేయడంతో.. భారత్‌పే ఎండీ ఉద్వాసన దాదాపు ఖరారైనట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాంటిదేం లేదు! 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పేలో ఇలాంటి విషపూరిత సంప్రదాయం మంచిది కాదనే ఉద్దేశానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చినట్లు సమాచారం. బోర్డు సభ్యులతో పాటు ఇన్వెస్టర్లుగా సెకోయియా ఇండియా, రిబ్బిట్ క్యాపిటల్, కోవాట్యు మేనేజ్మెంట్తో పాటు పలువురు బ్యాంకింగ్ దిగ్గజాలు ఉన్నారు. వీళ్లంతా ప్రతిపాదించినందునే.. అష్నీర్ లాంగ్ లీవ్ మీద వెళ్లాడే తప్ప.. ఉద్వాసన లాంటి పరిణామం ఏం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రచురించింది. ‘బోర్డుకు ఆయన్ని తొలగించే ఉద్దేశం లేదు. కానీ, మీడియా ఊహాగానాల్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఉంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం. ప్రొఫెషనల్‌కి సంబంధించింది కాదు’.. అంటూ బోర్డులోని ఓ కీలక సభ్యుడు వెల్లడించాడు. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్రా మీద దావా వేశారు. అంతటితో ఆగకుండా అష్నీర్, ఆయన భార్య మాధురి.. కాల్లో బ్యాంక్ ప్రతినిధిని అసభ్యంగా దూషించడంతో.. కొటక్ మహీంద్రా బ్యాంక్ లీగల్ నోటీసులు పంపింది. సంబంధిత వార్త: 500 కోట్ల పరిహారం.. ఆపై భార్యతో ఫోన్లో బండబూతులు! -
500 కోట్లకు దావా.. అదనంగా ఫోన్‌కాల్‌లో అసభ్య పదజాలం!
కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫిన్‌టెక్ కంపెనీ ‘భారత్‌పే’ ఎండీ అష్నీర్ గ్రోవర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. కొటక్ బ్యాంక్ నుంచి నష్టపరిహారం కోరుతూ 500 కోట్ల రూపాయలకు దావా కూడా వేశాడు అష్నీర్ గ్రోవర్. అయితే తాజాగా ఈ పరిణామంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అష్నీర్, ఆయన భార్య మాధురి ఫోన్‌కాల్‌లో తమ ప్రతినిధిని అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది కొటక్ మహీంద్రా బ్యాంక్. ఈ మేరకు ఆదివారం ఆ జంటకు నోటీసులు సైతం పంపింది. అష్నీర్ గ్రోవర్-కొటక్ బ్యాంక్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. అష్నీర్ జంట నుంచి అక్టోబర్ 30న లీగల్ నోటీసులు అందుకున్నట్లు ఒప్పుకున్న కొటక్ మహీంద్రా బ్యాంక్.. అది ఎందుకనో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే టైంకి మాత్రం బదులు ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే గ్రోవర్ ఆడియో కాల్లో తమ ప్రతినిధిని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాత్రం న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఒక మీడియా స్టేట్మెంట్లో వెల్లడించింది. నా గొంతు కాదు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గతవారం ఒక ఆడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్‌తో దురుసుగా ఒక జంట మాట్లాడిన క్లిప్ అది. ఆ కాల్లో ఒక వ్యక్తి అసభ్య పదజాలం ఉపయోగిస్తుండగా.. అవతలి వ్యక్తి అతన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ క్లిప్‌లో గొంతు భారత్‌పే ఎండీ అష్నీర్ గ్రోవర్దే అంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ, అష్నీర్ అది తన గొంతు కాదని ఖండించాడు కూడా. మరోవైపు లీగల్ నోటీసులు స్పందించేందుకు భారత్‌పే నిరాకరించింది. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు పెంపు
ముంబై: ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీరేటు స్వల్పంగా 0.05 శాతం పెరిగింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుంది. దేశంలో వడ్డీరేట్ల పెంపునకు అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ విషయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ బ్యాంక్ గృహ రుణ రేటు 6.50 శాతం అయితే, ఇది 6.55 శాతానికి పెరిగింది. నిజానికి పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంక్ సెప్టెంబర్‌లో వడ్డీరేటును తగ్గించింది. పోటీరీత్యా మిగిలిన బ్యాంకులూ ఈ దిశలో నిర్ణయం తీసుకున్నాయి.తమ ప్రత్యేక 60 రోజుల పండుగల సీజన్ ఆఫర్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు బ్యాంక్ కన్జూమర్ బిజినెస్ వ్యవహారాల ప్రెసిడెంట్ అంబుజ్ చందనా పేర్కొనడం గమనార్హం. కోటక్ కీలక ట్వీట్ నేపథ్యం... కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ ఆదివారం చేసిన ట్వీట్ నేపథ్యంలో బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి’ అని ఉదయ్ కోటక్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఇండిగో, కొటక్ కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్
ముంబై: విమానయాన సంస్థ ఇండిగో, ప్రైవేట్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇండిగో, ఇతర వ్యాపార సంస్థలకు ఈ కార్డుతో చెల్లింపులు చేయడం ద్వారా రివార్డ్ పాయింట్స్ అందుకోవచ్చు. వాటిని ఉపయోగించి కాంప్లిమెంటరీ ఎయిర్ టికెట్స్, డిస్కౌంట్స్, చెక్–ఇన్ ప్రాధాన్యత, సీట్ ఎంపిక, కాంప్లిమెంటరీ మీల్ వంటి ప్రయోజనాలు పొందవచ్చని ఇండిగో తెలిపింది. ఇండిగో విమాన టికెట్లను కొనుగోలు చేసేందుకూ ఈ పాయింట్లను వాడొచ్చు. -
టీవీఎస్ లాజిస్టిక్స్‌లో కోటక్ పెట్టుబడి
ముంబై: ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ కుటుంబ కంపెనీలో కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. టీవీఎస్ కుటుంబం ప్రమోట్ చేసిన థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్(3పీఎల్)లో అనుబంధ సంస్థ కోటక్ స్పెషల్ సిట్యుయేషన్స్ ఫండ్ ద్వారా పెట్టుబడులకు దిగుతోంది. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌లో రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా టీఎస్ రాజమ్ రబ్బర్స్ ప్రయివేట్ లిమిటెడ్‌కు రూ. 800 కోట్ల రుణ సౌకర్యాలను కలి్పంచింది. ఇందుకు మార్పిడిరహిత డిబెంచర్ల మార్గాన్ని కోటక్ స్పెషల్ ఎంచుకుంది. ఈ రుణం సహాయంతో టీవీఎస్ సప్లై చైన్‌లో కెనడియన్ పెన్షన్ ఫండ్కుగల వాటాను టీవీఎస్ ఎస్సీఎస్ ప్రమోటర్ ఆర్.దినేష్ సొంతం చేసుకోనున్నారు. తద్వారా టీవీఎస్ సప్లై చైన్‌లో టీవీఎస్ కుటుంబ వాటా బలపడనుంది. కోటక్ స్పెషల్ సిట్యుయేషన్స్.. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ విభాగంలో రిజస్టరైంది. బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,400 కోట్లు) పెట్టుబడులను నిర్వహిస్తోంది. -
దశాబ్దం కనిష్టానికి కోటక్ మహీంద్రా గృహ వడ్డీ
ముంబై: పండుగల సీజన్లో గృహ రుణ మార్కెట్లో వాటా పెంచుకోవడమే ప్రధాన ధ్యేయంగా ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ విభాగంలోని వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గృహ రుణ వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గింది. దీనితో ఈ రుణ రేటు 6.50 శాతం నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘ఈ గృహ రుణ రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి’ అని కన్జూ్యమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుచ్ చందన తెలిపారు. అయితే ఆ ఆఫర్ రెండు నెలలు అంటే నవంబర్ 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగిన ఉద్యోగులకు మాత్రమే దిగువ స్థాయి రుణ రేటు ఆఫర్‌ను అందిస్తున్నట్లు వివరించారు. బ్యాంక్ గృహ రుణ విభాగం మంచి పనితీరును కనబరుస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
ఈ బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో షాపింగ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ పొందొచ్చు
సాధారణంగా మనకు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. కానీ కొటాక్ మహీంద్రా బ్యాంక్ మాత్రం డెబిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనల్ని అత్యవసర సమయాల్లో ఆర్ధికంగా ఆదుకునేది క్రెడిట్ కార్డ్‌లే. ఆ కార్డ్‌లపై అవగాహన ఉండి సరైన పద్దతిలో మితంగా వాడుకుంటే మంచిది. పరిధి దాటితే చివరికి అప్పులు పాలు కావాల్సి వస్తుంది. అయితే కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అవసరం లేకుండా 'కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్' స్కీమ్ లో భాగంగా డెబిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే క్రెడిట్ కార్డు ప్రయోజనాలు అందిస్తోంది. అంటే డెబిట్ కార్డుతో చేసిన బిల్లును ఈఎంఐలుగా మార్చుకుని మన బడ్జెట్‌కి అనువుగా వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తోంది. 'కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్' స్కీమ్‌లో వినియోగదారులు ఫ్యాషన్ యాక్ససరీస్,ఎలక్ట్రానిక్ వస్తువులు, కిరాణా సామాగ్రిని కొనుగోలు చేవవచ్చు. అనంతరం షాపింగ్‌కి సంబంధించిన బిల్లును డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తూ వాటిని ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఆ అవకాశం వినియోగించుకోవాలంటే తప్పని సరిగా రూ.5,000లకు పైగా షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని కల్పించినందుకు ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకోవడం లేదని కొటక్ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ♦ వినియోగదారులు ఆఫ్ లైన్ లో లేదంటే ఆన్ లైన్ లో డెబిట్ కార్డ్‌తో రూ.5వేల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. ♦ మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐకి అర్హులా? కాదా అనేది బ్యాంక్ అధికారుల్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ♦ మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐకి అర్హులైతే బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. ♦ అనంతరం మీ ట్రాన్సాక్షన్ ను రివ్వ్యూ చేసి మీకు ఈఎంఐ సదుపాయాన్ని ఎన్ని నెలలు ఇవ్వాలనేది బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది. ♦ మీకు బ్యాంక్ కల్పించిన ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే రిక్వెస్ట్ చేయాలి. అపై మీకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు. ♦ వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఈఎంఐలో భాగంగా ఆటో మెటిగ్గా మీ అకౌంట్ నుంచి మీరు ఎంత ఈఎంఐ చెల్లిస్తారో అంతే కట్ అవుతుంది. -
డెబిట్ కార్డ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్, ఫ్రూప్ లేకుండానే
ముంబై: అర్హత కలిగిన డెబిట్ కార్డుహోల్డర్లందరికీ ప్రత్యేకమైన నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) ఆఫర్ అందిస్తున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీఎల్) వెల్లడించింది. దీని ప్రకారం మధ్య స్థాయి, అధిక విలువ చేసే కొనుగోళ్లు అన్నింటికీ డెబిట్ కార్డుపై ఈఎంఐల ద్వారా చెల్లించే సదుపాయం ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో దీన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇప్పటిదాకా ఇది కేవలం ఎంపిక చేసిన కొన్ని స్టోర్స్‌కి మాత్రమే పరిమితమై ఉండేదని కేఎంబీఎల్ తెలిపింది. రూ. 5,000 అంతకు పైబడిన లావాదేవీలన్నింటినీ ఎలాంటి పేపర్‌వర్క్ లేదా పత్రాల అవసరం లేకుండానే ఈఎంఐల కింద మార్చుకోవచ్చని వివరించింది. చదవండి : ఏంటీ..ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా! -
పుల్లెల గోపిచంద్ అకాడమీతో పనిచేయనున్న కోటక్ బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: టోక్యోలో జరగబోయే ఒలంపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి భారత బృందం సిద్ధమవుతుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కెఎమ్‌బిఎల్), పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (గోపిచంద్ అకాడమీ) సంయుక్తంగా ‘గర్ల్ పవర్ గోల్డ్ పవర్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఒలంపిక్స్‌లో పాల్గొనే మహిళా అథ్లెట్లలో స్పూర్తిని నింపడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశ్యం. భారత అత్యుత్తమ మహిళా అథ్లెట్లకు, వారి అడుగుజాడల్లో నడుచుకోవాలని కలలు కనే యువతులందరికీ ‘గర్ల్ పవర్ గోల్డ్ పవర్’ క్యాంపెయిన్ ప్రత్యేక సందేశాన్ని అందిస్తోంది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. కామన్వెల్త్ గేమ్స్-2010లో గోల్డ్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప, సౌత్ ఏసియన్ గేమ్స్-2016లో గోల్డ్ మెడల్ సాధించిన ఎన్. సిక్కిరెడ్డి ప్రచార వీడియోలో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఒక నిమిషంపాటు ఉన్న ఈ వీడియోలో.. తమ కలలను అనుసరించే యువతులను గౌరవించడంతోపాటు, వారి కలలను నిజం చేయడానికి కృషి చేసిన వ్యక్తులను గౌరవిస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ జాయింట్ ప్రెసిడెంట్ & గ్రూప్ చీఫ్ సిఎస్ఆర్ ఆఫీసర్ రోహిత్ రావు మాట్లాడుతూ... కోటక్ మహీంద్రా బ్యాంక్ సామాజిక బాధ్యతగా భావించి కోటక్ కర్మను ప్రకటించాము. కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద కోటక్ మహీంద్రా బ్యాంక్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయనుంది. ఆధునాతన మౌలిక సదుపాయాలను, ఆత్యాధునిక బాడ్మింటన్ శిక్షణా సదుపాయాలను కోటక్ కర్మ అభివృద్ది చేసింది. క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలను కల్పిండంతో భారత్‌ను క్రీడా రంగంతో గర్వించదగిన దేశంగా చూడవచ్చునని పేర్కొన్నారు. -
క్రికెట్ బాల్ దెబ్బ- ఉదయ్ కొటక్‌కు భలే ప్లస్
ముంబై, సాక్షి: విధి చేసే విచిత్రాలు ఒక్కొక్కప్పుడు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఒకప్పుడు ప్రొఫెషనల్ క్రికెటర్కావాలని కన్న కలలు బాల్ దెబ్బకు ఆవిరికాగా.. తదుపరి ఫైనాన్షియల్ రంగంవైపు అడుగులేసేందుకు దోహదపడింది. ఫలితంగా ప్రస్తుతం ప్రపంచంలోనే సంపన్న బ్యాంకర్‌గా ఆ వ్యక్తి ఆవిర్భవించారు. ఆయన పేరు ఉదయ్ కొటక్. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవోగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. మరణం అంచులవరకూ క్రికెట్ బాల్ వల్ల తలకు దెబ్బ తగలడంతో 20 ఏళ్ల వయసులో ఉదయ్ కొటక్‌కు అత్యవసర సర్జరీ చేశారు. మరణం అంచులవరకూ వెళ్లడంతో ఆపై ఆయన క్రికెట్ ఆశలు అడియాసలయ్యాయి. అయితే ఇది ఆయనకు ఎంతో మేలు చేసిందంటున్నారు విశ్లేషకులు. క్రికెట్ ఆశయాలను వీడి కుటుంబీకులు నిర్వహిస్తున్న కాటన్ బిజినెస్‌లో ఉదయ్ కొటక్ ప్రవేశించారు. ఆపై జమన్‌లాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఎంబీఏ డిగ్రీ చేశారు. తదుపరి 1985లో 26 ఏళ్ల వయసులో ఫైనాన్స్ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయ్ కొటక్ సంపద 16 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 1.17 లక్షల కోట్లు)గా బ్లూమ్‌బెర్గ్ అంచనా. సవాళ్ల కాలంలోనూ కొన్నేళ్లుగా ఎన్బీఎఫ్సీ, బ్యాంకింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. పలు సంస్థలు మొండిబకాయిలతో డీలాపడగా, కొన్ని కంపెనీలను కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలు కుంగదీస్తున్నాయి. దీనికితోడు ఇటీవల కోవిడ్-19 కారణంగా ఫైనాన్షియల్ రంగం పలు ఇబ్బందుల్లో పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే రిస్కులు అధికంగా ఉన్న రంగాలకు తక్కువ రుణ మంజూరీ, పారదర్శక పాలన వంటి కార్యకలాపాలతో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొందినట్లు తెలియజేశారు. ఇటీవల నిధుల సమీకరణ ద్వారా బ్యాలన్స్‌షీట్‌ను పటిష్టపరచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) షేరు జూమ్ ఈ ఏడాది ఇప్పటివరకూ కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు 17 శాతం బలపడింది. ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ఇది అత్యధికంకాగా.. ప్రస్తుతం షేరు రూ.1940 వద్ద ట్రేడవుతోంది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తాజాగా రూ. 3.84 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా రెండో పెద్ద బ్యాంక్‌గా నిలుస్తోంది. గత మూడేళ్లలోనూ కొటక్ బ్యాంక్ షేరు 24 శాతం చొప్పున ర్యాలీ చేయడం విశేషం! 2020లో మొండి రుణాల విషయంలో రెండో ఉత్తమ బ్యాంకుగా నిలిచినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో పటిష్ట సీఏఆర్‌ను కలిగి ఉన్నట్లు తెలియజేశాయి. ఇటీవలే ఉదయ్ కొటక్ సీఈవో పదవీకాలం పొడిగింపునకు ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అంతేకాకుండా బ్యాంకుల వ్యవస్థాపకులు వాటాను పెంచుకునేందుకూ ఆర్బీఐ ఇటీవల ప్రతిపాదించడంతో ఈ కౌంటర్‌కు బూస్ట్ లభించినట్లు వివరించారు. (యాక్సెంచర్ పుష్- ఐటీ షేర్లు గెలాప్) మహీంద్రాతో జట్టు 1985లో పశ్చిమ గుజరాత్లో కుటుంబీకులు, స్నేహితులు అందించిన రూ. 30 లక్షల రుణాలతో కొటక్ ఫైనాన్షియల్ సేవల కంపెనీని ప్రారంభించారు. 1986లో డైవర్సిఫైడ్ దిగ్గజం మహీంద్రా గ్రూప్‌తో కొటక్ జత కట్టారు. ఫలితంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్థానానికి బీజం పడింది. తొలుత బిల్ డిస్కౌంటింగ్‌తో ప్రారంభమై, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బీమా, మ్యూచువల్ ఫండ్స్ తదితరాలకు కార్యకలాపాలు విస్తరించింది. 2003కల్లా ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ లైసెన్స్‌ను పొందింది. అయితే బ్యాంకు నిర్వహణలో కుటుంబీకులకు కాకుండా ప్రొఫెషనల్స్‌కే చోటివ్వడం ద్వారా ఉదయ్ కొటక్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పొందుతూ వచ్చారని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. -
కోటక్ బ్యాంక్ ఎమ్డీ ఉదయ్ కోటక్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎమ్‌డీగా ఉదయ్ కోటక్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. మరో మూడేళ్ల పాటు ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగుతారు. కోటక్ ఇప్పటికే గత 17 సంవత్సరాలుగా కోటక్ మహీంద్రా బ్యాంక్ అధిపతిగా పనిచేశారు. ప్రకాష్ ఆప్టేను పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా, దీపక్ గుప్తాను జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని కోటక్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 జనవరి నుంచి ఈ నియామకాలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. (జియోకు వ్యతిరేకంగా విష ప్రచారం!) (చదవండి : స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్) -
కొటక్ మహీంద్రా- ఏంజెల్ బ్రోకింగ్ హైజంప్
ఆటుపోట్ల మధ్య మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 111 పాయింట్లు పుంజుకుని 40,256 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 33 పాయింట్లు బలపడి 11,801 వద్ద కదులుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో ఏంజెల్ బ్రోకింగ్ సైతం ఆకర్షణీయ పనితీరు చూపడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. కొటక్ మహీంద్రా బ్యాంంక్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో కొటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం దాదాపు 27 శాతం ఎగసి రూ. 2,185 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17 శాతం పెరిగి రూ. 3,913 కోట్లను అధిగమించింది. అయితే లోన్‌బుక్ 4 శాతం క్షీణించి రూ. 2.04 లక్షల కోట్లను తాకగా.. డిపాజిట్లు 12 శాతంపైగా పెరిగి రూ. 2.61 లక్షల కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.61 శాతం నుంచి 4.52 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 9.6 శాతం క్షీణించి రూ. 369 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 0.15 శాతం తగ్గి 2.55 శాతానికి చేరగా.. నికర ఎన్పీఏలు సైతం 0.23 శాతం తక్కువగా 0.64 శాతంగా నమోదయ్యాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 2,947 కోట్లను తాకింది. దీంతో వరుసగా రెండో రోజు కొటక్ బ్యాంక్ షేరు జోరు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 1,559 సమీపంలో ట్రేడవుతోంది. ఏంజెల్ బ్రోకింగ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఏంజెల్ బ్రోకింగ్ నికర లాభం రూ. 74 కోట్లకు జంప్ చేసింది. ఒక త్రైమాసికంలో ఇది అత్యధిక లాభంకాగా.. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో రూ. 48 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం 29 శాతం పెరిగి రూ. 318 కోట్లను తాకింది. రోజువారీ సగటు టర్నోవర్ 107 శాతం పుంజుకుని రూ. 1281 బిలియన్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిట్ మార్జిన్లు 6.3 శాతం బలపడి 49 శాతాన్ని అధిగమించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏంజెల్ బ్రోకింగ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 16.5 శాతం దూసుకెళ్లి రూ. 290 సమీపంలో ట్రేడవుతోంది. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం 22% అప్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.2,947 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 2,407 కోట్లతో పోలిస్తే 22% వృద్ధి చెందింది. మొత్తం ఆదా యం రూ.12,543 కోట్ల నుంచి రూ.13,591 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌గా చూస్తే... కేవలం బ్యాంకింగ్ కార్యకలాపాలపై (స్టాండెలోన్) క్యూ2లో కోటక్ బ్యాంక్ రూ.2,184 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,724 కోట్లతో పోలిస్తే 27 శాతం ఎగబాకింది. బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.7,986 కోట్ల నుంచి రూ.8,288 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.3,913 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 4.6 శాతం నుంచి 4.53 శాతానికి క్షీణించింది. ‘గడిచిన కొద్ది త్రైమాసికాలుగా బ్యాంక్ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, వాణిజ్య బాండ్లు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు వంటి రుణేతర సాధనాలపై అధికంగా ఆధారపడుతోంది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ మేం అనుసరిస్తున్న అప్రమత్త ధోరణికి గత ఆరు నెలల రుణ వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి ఇది మరింత భద్రమైన మార్గంగా మేం భావిస్తున్నాం‘ అని కోటక్ బ్యాంక్ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. మొండిబాకీలు ఇలా... మొత్తం రుణాల్లో నికర మొండిబకాయిలు (ఎన్పీఏ) గతేడాది క్యూ2లో 0.85 శాతం (రూ.1,811 కోట్లు) నుంచి ఈ ఏడాది క్యూ2లో 0.64 శాతానికి (రూ.1,304 కోట్లు) తగ్గుముఖం పట్టాయి. స్థూల ఎన్పీఏలు మాత్రం 2.32 శాతం (రూ.5,034 కోట్లు) నుంచి 2.55 శాతానికి (రూ.5,336 కోట్లు) పెరిగాయి. మొండిబాకీలు, కంటింజెన్సీలకు మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.408 కోట్ల నుంచి రూ.369 కోట్లకు దిగొచ్చాయి. -
ఇండస్‌ఇండ్‌పై కోటక్ కన్ను!
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో చాలాకాలం తర్వాత ఓ భారీ డీల్ కుదరవచ్చన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకును దిగ్గజ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంకు (కేఎంబీ) కొనుగోలు చేయొచ్చన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది పూర్తి స్టాక్ డీల్‌గా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ వార్తలను ఇండస్ఇండ్ బ్యాంక్, దాని ప్రమోటర్లు ఖండించారు. ‘ఇవన్నీ వదంతులే. ఇవి నిరాధారమైనవి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) ప్రమోటర్లుగా వీటిని ఖండిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్‌నకు ఎల్లవేళలా తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దేశీ ఎకానమీ, ఆర్థిక సంస్థలకు ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తాము సానుకూలంగా స్పందించామని, బ్యాంకును నిలబెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. హిందుజా గ్రూప్ ఆధ్వర్యంలో ఐఐహెచ్ఎల్ నడుస్తోంది. ఒకవేళ ఈ డీల్ గానీ కుదిరితే.. 2014లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను కోటక్ మహీంద్రా బ్యాంక్ విలీనం చేసుకున్న ఒప్పందం తర్వాత ప్రైవేట్ రంగంలో ఇదే అత్యంత భారీ డీల్ కానుంది. కేఎంబీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 2.75 లక్షల కోట్లు కాగా, ఇండస్ఇండ్ బ్యాంక్ది సుమారు రూ. 50,000 కోట్లుగా ఉంది. అవకాశాలు పరిశీలిస్తుంటాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ కొనుగోలు వార్తలపై వ్యాఖ్యానించేందుకు కోటక్ మహీంద్రా గ్రూప్ నిరాకరించింది. అయితే, ఇటీవలే నిధులు సమీకరించిన నేపథ్యంలో కంపెనీలు, అసెట్ల కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామని పేర్కొంది. గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైమిన్ భట్ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా గ్రూప్ రూ. 7,000 కోట్లు సమీకరించింది. ‘క్యూ1లో ఈ నిధులను సమీకరించినప్పుడే మేం .. అసెట్స్, కంపెనీల్లాంటివి కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పాం. కాబట్టి అలాంటి అవకాశాలేమైనా వస్తే కచ్చితంగా పరిశీలిస్తాం. కాకపోతే దీనిపై (ఇండస్ఇండ్) వ్యాఖ్యానించడానికేమీ లేదు‘ అని భట్ చెప్పారు. డీల్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కేఎంబీ షేరు 2.36 శాతం పెరిగి రూ. 1,416 వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు దాదాపు 1 శాతం పెరిగి రూ. 616 వద్ద క్లోజయ్యింది. -
కొటక్ మహీంద్రా బ్యాంక్ క్యూ2 గుడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ2(జులై- సెప్టెంబర్)లో బ్యాంక్ నికర లాభం దాదాపు 27 శాతం ఎగసి రూ. 2,185 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17 శాతం పెరిగి రూ. 3,913 కోట్లను అధిగమించింది. అయితే లోన్‌బుక్ 4 శాతం క్షీణించి రూ. 2.04 లక్షల కోట్లను తాకగా.. డిపాజిట్లు 12 శాతంపైగా పెరిగి రూ. 2.61 లక్షల కోట్లకు చేరాయి. ఎన్ఐఎం వీక్ నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.61 శాతం నుంచి 4.52 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 9.6 శాతం క్షీణించి రూ. 369 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 0.15 శాతం తగ్గి 2.55 శాతానికి చేరగా.. నికర ఎన్పీఏలు సైతం 0.23 శాతం తక్కువగా 0.64 శాతంగా నమోదయ్యాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 2,947 కోట్లను తాకింది. కొటక్ సెక్యూరిటీస్ లాభం 34 శాతం పెరిగి రూ. 199 కోట్లకు చేరగా.. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం 19 శాతం వృద్ధితో రూ. 171 కోట్లను తాకింది. అయితే ప్రైమ్ లాభం 23 శాతం క్షీణించి రూ. 133 కోట్లుగా నమోదైంది. క్యూ2లో కొటక్ బ్యాంక్‌లో వాటాను ఎల్ఐసీ 2.45 శాతం నుంచి 3.18 శాతానికి పెంచుకుంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం కొటక్ మహీంద్రా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం ఎగసి రూ. 1,406 వద్ద ట్రేడవుతోంది. -
ఇండస్‌ఇండ్‌పై కొటక్ మహీంద్రా కన్ను?!
హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్‌పై ప్రయవేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ దృష్టి సారించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆల్ స్టాక్ డీల్(షేర్ల మార్పిడి) ద్వారా ఒప్పందం కుదుర్చుకునే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. సంయుక్త సంస్థలో ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్లు హిందుజా గ్రూప్ కొంతమేర వాటాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై వ్యాఖ్యలు చేయబోమంటూ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రతినిధి స్పందించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇక మరోపక్క.. ఇవి వట్టి పుకార్లు మాత్రమేనని ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో సుమంత్ కథప్లియా కొట్టిపారేశారు. బ్యాంక్ యాజమాన్యం ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని, ఈ వార్తలు నిరాధారమని వివరించారు. డీల్ జరిగితే.. ఇటీవల ఆస్తుల(రుణ) నాణ్యతపై ఆందోళనలతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు డీలాపడుతూ వస్తోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండస్ఇండ్ షేరు 64 శాతం పతనమైంది. దీంతో బ్యాంక్ మార్కెట్ విలువలో 60 శాతం కోత పడినట్లు నిపుణులు తెలియజేశారు. ఒకవేళ ఇండస్‌ఇండ్‌ను కొటక్ మహీంద్రా బ్యాంక్ టేకోవర్ చేస్తే.. సంయుక్త సంస్థ ప్రయివేట్ రంగంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా ఆవిర్భవించే వీలున్నట్లు వివరించారు. బ్యాంక్ ఆస్తులు 83 శాతం పెరిగే అవకాశమున్నట్లు తెలియజేశారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇంతక్రితం 2014లో ఐఎన్జీ గ్రూప్‌ను 2 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇండస్ఇండ్ ప్రమోటర్లు హిందుజా గ్రూప్‌తో కొటక్ మహీంద్రా గ్రూప్ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. 11.2 బిలియన్ డాలర్ల విలువైన హిందుజా గ్రూప్‌లోని నలుగురు సోదరుల మధ్య విభేధాల నేపథ్యంలో బ్యాంక్ విక్రయానికి చర్చలు ప్రారంభమైనట్లు భావిస్తున్నాయి. హిందుజా సోదరులు ఇండస్‌ఇండ్‌లో వాటా పెంచుకునేందుకు చేసిన ప్రతిపాదనను ఈ ఏడాది జూన్‌లో ఆర్బీఐ తిరస్కరించినట్లు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. షేర్ల తీరిలా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 1,382 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,399 వద్ద గరిష్టాన్ని, రూ. 1,372 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 2.4 శాతం జంప్‌చేసి రూ. 623 వద్ద కదులుతోంది. తొలుత గరిష్టంగా రూ. 633ను అధిగమించగా.. ఒక దశలో రూ. 617 వద్ద కనిష్టాన్ని చేరింది. -
కోటక్ మహీంద్రా లాభం 9 శాతం డౌన్
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంకు స్టాండలోన్ నికర లాభం (బ్యాంకు వరకే) జూన్ త్రైమాసికంలో 8.5 శాతం తగ్గి రూ.1,244 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,360 కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి త్రైమాసికం లాభం రూ.1,266 కోట్లతో పోల్చి చూస్తే పెద్దగా మార్పులేదు. ఆదాయం సైతం రూ.7,945 కోట్ల నుంచి రూ.7,685 కోట్లకు తగ్గింది. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు), కంటింజెన్సీలకు చేసిన కేటాయింపులు గణనీయంగా పెరిగి రూ.962 కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.316 కోట్లతో పోలిస్తే 3 రెట్లు పెరిగాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో కేటాయింపులు రూ.1,047 కోట్లతో పోల్చుకుంటే జూన్ క్వార్టర్లో తగ్గాయి. స్థూల ఎన్పీఏలు 2.19% నుంచి 2.70%కి (రూ.5,619 కోట్లు) చేరాయి. నికర ఎన్పీఏలు 0.73% నుంచి 0.87%కి (రూ.1,777 కోట్లు) చేరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 4.1% తగ్గి రూ.1,853 కోట్లుగా ఉంటే, ఆదాయం రూ.12,129 కోట్ల నుంచి రూ.12,323 కోట్లకు ఎగసింది. ఆర్థిక మందగమనం కారణంగా రుణ ఎగవేతలు పెరగొచ్చని, దీంతో రానున్న కాలంలో గ్రూపు స్థాయిలో కేటాయింపులు పెరుగుతాయని కోటక్ బ్యాంకు పేర్కొంది. -
అది ‘బ్యాడ్’ ఐడియా..!
న్యూఢిల్లీ: కొన్ని కీలక అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా మొండిబాకీల వసూళ్ల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ (బ్యాడ్ బ్యాంక్) ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ‘వ్యవస్థ స్థాయిలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రెండు, మూడు కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్‌కు ఏ రేటుకు విక్రయిస్తారనేది మొదటి అంశం. పారదర్శకంగా, సముచితమైన విధంగా విలువను నిర్ధారించడం జరగాలి. ఇక బ్యాడ్ బ్యాంక్ గవర్నెన్స్‌పై అత్యంత స్పష్టత ఉండాలి. చివరిగా రికవరీ రేటు ఎలా ఉంటుందనే దానిపైనా స్పష్టత ఉండాలి. ఇదంతా ప్రజాధనం. రికవరీ బాగా ఉంటుందంటే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే అర్థం లేదు’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా సోమవారం కొటక్ తెలిపారు. గతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కూడా ఇలాగే మొండి బాకీల వసూలు కోసం స్ట్రెస్డ్ అసెట్స్ స్థిరీకరణ ఫండ్ (ఎస్‌ఏఎస్‌ఎఫ్) ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2004–05లో ఏర్పాటైన ఎస్‌ఏఎస్‌ఎఫ్‌కు 636 మొండి పద్దులకు సంబంధించి సుమారు రూ. 9,000 కోట్ల ఎన్పీఏలను బదలాయించారు. 2013 మార్చి ఆఖరునాటికి దీని ద్వారా సగానికన్నా తక్కువగా కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఎన్పీఏల రికవరీకి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మూడు–నాలుగేళ్లకోసారి తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా గత నెలలో జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కార్పొరేట్లు మారాలి..: ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా దేశీ కార్పొరేట్లు ఆలోచనా ధోరణిని కొంత మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని కొటక్ చెప్పారు. పెట్టుబడుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. స్థాయికి మించిన రుణాలు లేని కంపెనీలు ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలోనూ కనిపిస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కొటక్ సూచించారు. కొత్తగా వ్యూహాత్మక రంగాల్లో సాహసోపేతంగా మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్నారు. కరోనా పరిణామాలతో గణనీయంగా కన్సాలిడేషన్ జరగవచ్చని, పలు రంగాల్లో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మిగలవచ్చని కొటక్ చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నిర్వహణ వ్యయాలు, తక్కువ రుణభారం ఉన్న సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయని విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యంపై పెట్టుబడులు పెరగాలి.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే వైద్యం, విద్య, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని కొటక్ తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3%గా ఉన్న వైద్య రంగ పెట్టుబడులు కనీసం 5 నుంచి 10%కి పెరగాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్లు ఉండాలని కొటక్ సూచించారు. -
టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుంది: ఉదయ్ కొటక్
ముంబై: కరోనా ఉదృతి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పందిస్తూ.. కరోనా వల్ల అన్ని దేశాల అభిప్రాయాలు మారవచ్చని.. అది భారత్‌కు నూతన అవకాశాలకు మార్గం సుగుమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభ సమయంలో దేశీయ టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ కంపెనీలు భారతీయ యువతను నియమించుకోవాలని సూచించారు. టెక్ దిగ్గజం గూగుల్ లాక్డౌన్ నేపథ్యంలో అమెరికన్ ఇంజనీర్లకు రూ. 2లక్షల డాలర్లు చెల్లిస్తుందని.. అదే భారతీయ యువతను నియమిస్తే తక్కువ వేతనంతో నైపుణ్యంతో పనిచేస్తారని తెలిపారు. అయితే దేశీయ యువతను తక్కువ చేసే ఉద్దేశ్యం తనకు లేదని.. ప్రపంచ సంక్షోభ నేపథ్యంలో తక్కువ వేతనంతో కంపెనీలకు అత్యుత్తమ నైపుణ్యంతో కూడిన ఉద్యోగులు లభిస్తారని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా పీఎమ్ కేర్స్ పండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు బాధ్యతగా విరాళాలు ఇచ్చారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ సర్వే ప్రకారం 100 అత్యుత్తమ బ్యాంక్‌లో కొటక్ మహీంద్రా బ్యాంక్ పేరు నమోదవ్వడం విశేషం. చదవండి: వృద్ధి కథ.. బాలీవుడ్ సినిమాయే! -
కోటక్ బ్యాంక్ లాభం రూ. 1,905 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) మార్చి క్వార్టర్లో రూ.1,905 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం(రూ.2,038 కోట్లు)తో పోల్చితే 7 శాతం క్షీణించిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. కేటాయింపులు బాగా పెరగడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. మరిన్ని వివరాలు..... ► గత క్యూ4లో స్టాండ్అలోన్ నికర లాభం 10 శాతం తగ్గి రూ.1,267 కోట్లకు చేరింది. హా నికర వడ్డీ ఆదాయం రూ.3,036 కోట్ల నుంచి రూ. 3,560 కోట్లకు పెరిగింది. 4.72 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించింది. ► స్థూల మొండి బకాయిలు 2.14 శాతం నుంచి 2.25 శాతానికి పెరిగాయి. కేటాయింపులు రూ.171 కోట్ల నుంచి రూ. 1,047 కోట్లకు పెరిగాయి. కరోనా కేటాయింపులు కూడా దీంట్లో ఉన్నాయి. ► 2019–20 పూర్తి ఏడాదికి నికర లాభం 10% ఎగసి రూ.5,947 కోట్లకు పెరిగింది. రుణాలు 6%, డిపాజిట్లు 20% ఎగిశాయి. ► కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో సెక్యూరిటీలేని క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణాల బకాయిలు పేరుకుపోతున్నాయని, ఇది తమ రుణ నాణ్యతపై తీవ్రంగానే ప్రభావం చూప నున్నదని బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. ► ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 2.3 శాతం లాభంతో రూ. 1,186 వద్ద ముగిసింది. -
కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారితో సంక్షోభంలో పడిన వివిధ వ్యాపార సంస్థలు ఉద్యోగులపై వేటు వేయడంతోపాటు, హై స్థాయి ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు వేతనాల కోతను ప్రకటించింది. సంవత్సరానికి రూ. 25 లక్షలకు పైగా సంపాదించే ఉద్యోగులకు 10 శాతం వేతన కోత నిర్ణయించింది. సంవత్సరానికి రూ. 25 లక్షల కంటే ఎక్కువ వేతనం ఆర్జిస్తున్న ఉద్యోగులందరికీ సీటీసీలో 10 శాతం తగ్గింపును నిర్ణయించామని, 2020,మే - 2021, మే నెల వరకు ఈ నిర్ణయం అమల్లో వుంటుందని బ్యాంకు ఒక నోటీసులో తెలిపింది. వ్యాపార స్థిరత్వం కోసం జీతాల రీకాలిబ్రేట్ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. బ్యాంకుకు చెందిన టాప్ మేనేజ్ మెంట్ 2020-21 సంవత్సరానికి తమ జీతాల్లో 15 శాతం కోతను స్వచ్ఛందంగా ప్రకటించిన కొన్ని వారాల తరువాత తాజా నిర్ణయం వెలుగులోకి వచ్చింది. (కరోనా : ఉబెర్ ఉద్యోగాల కోత) కరోనా వైరస్ విస్తృతి ప్రారంభంలో 2-3 నెలల విషయంగా కనిపించినా, క్రమేణా మహమ్మారిగా విజృంభించడంతో జీవితాలు, జీవనోపాధి రెండింటిపై తీవ్ర ప్రభావాన్ని చూపిందనీ, మరీ ముఖ్యంగా ఇప్పట్లో కనుమరుగయ్యే సూచనలేవీ లేవని స్పష్టంగా తెలుస్తుందని కోటక్ గ్రూప్ హెచ్ ఆర్ ముఖ్య అధికారి సుఖ్జిత్ ఎస్ పస్రిచా ఉద్యోగుల నోట్లో పేర్కొన్నారు. కాగా కోటక్ మహీంద్ర గ్రూపు పీఎం కేర్స్ పండ్ తో పాటు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. (విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్జీ కెమ్ స్పందన) -
లాభాలు భేష్, బ్యాడ్ లోన్ల బెడద
సాక్షి, ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత కొటాక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 27 శాతం పెరిగి రూ.1,595.90 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇది 1,290.93 కోట్ల రూపాయలు. ప్రధాన ఆదాయం లేదా నికర వడ్డీ ఆదాయం 3,429.53 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.2 శాతం పెరిగింది. మొత్తం త్రైమాసికంలో మొత్తం ఆస్తుల శాతం 2.46 శాతంగా, స్థూల నిరర్థక ఆస్తులు డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా క్షీణించాయి. అంతకుముందు త్రైమాసికంలో 2.32 శాతంగా ఉన్నాయి. బ్యాడ్‌లోన్లు భారీగా ఎగిసాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో 5,413.20 కోట్ల రూపాయలుగా ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.5,033.55 కోట్లు. ఈ త్రైమాసికంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ 2,16,774 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేసింది. మొత్తం 1,539 శాఖల బ్యాంక్ బ్రాంచ్ నెట్వర్క్ కలిగి ఉందని బ్యాంక్ ఆదాయ ప్రకటనలో తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 4 శాతం పడిపోయి ఇంట్రాడే కనిష్టం రూ. 1,630 వద్ద కొనసాగుతోంది. -
కోటక్ ఖాతాలో యస్ బ్యాంక్!
ముంబై: యస్ బ్యాంక్‌ను విలీనం చేసుకోవడానికి కోటక్ మహీంద్రా బ్యాంకే కరెక్టని ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ చీఫ్‌లు అభిప్రాయపడ్డారు. అయితే విలీన ప్రయత్నాలు లేవని యస్‌బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు స్పష్టం చేశాయి. కోటక్‌కే ఆ సత్తా... యస్‌బ్యాంక్‌ను కొనుగోలు చేయగల సత్తా ఉదయ్ కోటక్‌కే ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. యస్‌బ్యాంక్‌ను టేకోవర్ చేయడానికి భారీగా నిధులు అవసరమని, ఆ సత్తా కోటక్ మహీంద్రా బ్యాంక్‌కే ఉందని వివరించారు. ఇక్కడ జరిగిన టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. కాగా ఇదే అభిప్రాయాన్ని యాక్సిస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ అమితాబ్ చౌధురి వ్యక్తం చేశారు. తమ బ్యాంక్ ఇప్పటికింకా చిన్నదేనని, పెద్ద బ్యాంక్‌గా వృద్ధి చెందే ప్రయత్నాలు చేస్తున్నామని, పెద్ద బ్యాంక్‌గా మారినప్పుడే ఇతర బ్యాంక్‌లను కొనుగోలు చేయగలమని ఆయన పేర్కొన్నారు. ఊసుపోని ఊహాగానాలు... ఈ కొనుగోలు వార్తలు ఊసుపోని ఊహాగానాలని యస్ బ్యాంక్ చీఫ్ రవ్నీత్ గిల్ కొట్టిపడేశారు. విలీనప్రయత్నాలు ఏమీ లేవని తెగేసి చెప్పారు. కాగా విలీన వ్యాఖ్యలు ఆయా వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమేనని, తమకెలాంటి సంబంధం లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ రోహిత్ రావు పేర్కొన్నారు. యస్‌బ్యాంక్ చీఫ్‌గా రవ్నీత్ గిల్ పగ్గాలు చేపట్టి మొండి బకాయిల గుర్తిపు ప్రక్రియను మరింత వేగిరం చేశారు. మరోవైపు నిధుల సమీకరణ ప్రయత్నాలు ఫలప్రదం కావడం లేదు. దీంతో ఈ బ్యాంక్‌ను చేజిక్కించుకోనే యత్నాలు ఊపందుకుంటున్నాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక, పుష్కలమైన నిధులతో పటిష్టంగా ఉన్న కోటక్ బ్యాంక్... చిన్న బ్యాంక్‌లను టేకోవర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. బలమైన బ్యాంకులే నిలుస్తాయ్ బలమైన బ్యాంక్‌లే నిలబడగలుగుతాయని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. బలం ఉన్న జీవులే మనగలుగుతాయని చార్లెస్ డారి్వన్ పేర్కొన్నారని, ఈ సిద్ధాంతం ఇప్పుడు భారత్ బ్యాంకులకూ వర్తిస్తుందని వివరించారు. బలహీనమైన కంపెనీలను బలమైన కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయని, వివిధ రంగాల్లో విలీనాల జోరు పెరుగుతోందని పేర్కొన్నారు. సమస్యల్లో ఉన్న ప్రైవేట్ బ్యాంక్‌లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో విలీనమైన దృష్టాంతాలు గతంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. -
వృద్ధి కథ.. బాలీవుడ్ సినిమాయే!
ముంబై: మన దేశ వృద్ధి కథ అచ్చం బాలీవుడ్ సినిమాలాగానే ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. భారత్‌లోని ప్రస్తుత ఆరి్థక పరిస్థితులు సినిమాను తలపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆరంభంలో ప్రేమ కధలాగానే వృద్ది జోరుగానే మొదలైందని, ఆ తర్వాత మందగమనం రూపంలో విలన్ ఎదురయ్యాడని, దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని వివరించారు. ఈ మందగమన విలన్‌ను ఎదుర్కొనడానికి భారత్ తన ప్రయత్నాలు తాను చేయాలని సూచించారు. తర్వాత తర్వాత పరిస్థితులు చక్కబడుతాయని పేర్కొన్నారు. సినిమాలు సుఖాంతమైనట్లే, మన వృద్ధి కథ కూడా శుభప్రదంగానే ఉంటుందని చెప్పారు. ప్రస్తుత ఆరి్థక స్థితిగతులు సమస్యాత్మకంగానే ఉన్నప్పటికీ, అందరూ భయపడుతున్నంత అధ్వానంగా మాత్రం లేవని వివరించారు. ఒక ఎంటర్ప్రెన్యూర్ కళ్లతో చూస్తే, భారత వృద్ధి కధ గగుర్పొడిచేలా ఉందని పేర్కొన్నారు. మీరు చేస్తున్న పనినే కొనసాగించండి. సరైన సమయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైతే, దీర్ఘకాలంలో మంచి ఫలితాలే పొందవచ్చని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. ఏ దేశమూ ఇవ్వనన్ని గొప్ప అవకాశాలు భారత్‌లో కోకొల్లలుగా ఉన్నాయని వివరించారు. భారత్‌లో ఇలాంటి మందగమన పరిస్థితులు సాధారణమేనని, ప్రతి కొన్నేళ్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. సాధారణంగా 8తో ముగిసే సంవత్సరాల్లో సంక్షోభాలు వచ్చాయని పేర్కొన్నారు. 1998లో ఆసియా సంక్షోభం తర్వాత భారత్‌లో ఆరి్థక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేశారు. 2008లో అంతర్జాతీయంగా ఆరి్థక సంక్షోభం అతలాకుతలం చేసిందని, 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభంతో ముసలం మొదలైందని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. -
‘కొటక్’కు భారీ వడ్డన
సాక్షి, విశాఖ : వినియోగదారునికి సేవా లోపం కలిగించినందుకు నష్టపరిహారం చెల్లించాలని నగరంలోని 2వ వినియోగదారుల మండలి అధ్యక్షురాలు చావలి సూర్య భాస్కరం మంగళవారం తీర్పునిచ్చారు. వినియోగదారుడు తనఖా పెట్టిన ఇంటిని తక్షణమే విడుదల చేయాలని, చెల్లించిన లక్షా 15వేలు తిరిగి చెల్లించాలని, నష్టపరిహారం కింద రూ.4 లక్షలు, కోర్టు ఖర్చులకు మరో 2,500 ఇవ్వాలని నగరంలోని వాల్తేరు ప్రాంతంలోని కొటక్ మహీంద్ర బ్యాంక్‌ని ఫోరం ఆదేశించింది. బాధితులు ఎస్.వినీత్ (3) విజయశ్రేయల్(4)ల తరఫున వారి పెద్దనాన్న డాక్టర్ ఎస్. శ్రీనివాసరావు ఫిర్యాదు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. చిన్నారుల తండ్రి ఎస్.విజయ్‌కుమార్ (శ్రీనివాసరావు సోదరుడు) మధురవాడ దగ్గర ఎఆర్ ఎన్‌క్లేవ్‌లో 2015 నవంబర్ నెలలో ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇందుకోసం కొటక్ మహీంద్ర బ్యాంక్ వాల్తేరు శాఖలో రూ.22 లక్షలు అప్పుగా తీసుకున్నారు. పూచీకత్తుగా విజయ్‌కుమార్ భార్య ఎన్.శాంతిరత్నం ఉన్నారు. ఇంటిపై అప్పు తీసుకున్నప్పుడే ఐసీఐసీఐ లంబా బీమా కంపెనీలో బీమా చేయించారు. ఈ నేపథ్యంలో శాంతిరత్నం 2017 ఫిబ్రవరి 11వ తేదీన గుండె పోటుతో మరణించారు. తర్వాత నెల రోజులకే విజయ్‌కుమార్ కూడా తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలకు పెద్దనాన్న శ్రీనివాసరావే ఆసరా అయ్యారు. రుణం వాయిదాలు చెల్లించాల్సిందేనంటూ బ్యాంక్ సిబ్బంది చేసిన ఒత్తిడితో అతను లక్షా 15వేలు చెల్లించారు. ఇంటిని బీమా చేయించిన విషయం తెలియడంతో సంబంధిత పత్రాలను తన న్యాయవాది ఏవీసీఎన్ నాగేశ్వరరావు ద్వారా ఫోరంకి సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇంటిపై అప్పుతీసుకుని, తనఖా పెట్టినప్పుడు బీమా కలిగి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. బీమా అమల్లో ఉన్న సమయంలో రుణగ్రహీత, జామీనుదారురాలు మృతి చెందినందున బీమా కంపెనీయే రుణం చెల్లించాలన్నారు. బీమా కంపెనీ నుంచి బ్యాంక్ డబ్బులు తీసుకోవాలన్నారు. ప్రధాన వ్యక్తులు ఇద్దరూ మృతి చెందిన నాటికి బీమా అమల్లో ఉన్నా ఆ విషయాన్ని బ్యాంకు దాచిపెట్టడాన్ని ఫోరం ఆక్షేపించింది. తాకట్టులో ఉన్న ఇంటిని తక్షణమే రద్దుచేసి బాధితులకు అప్పగించాలని తీర్పులో పేర్కొన్నారు. -
కోటక్ బ్యాంక్ లాభం 1, 932 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.1,932 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ1లో వచ్చిన నికర లాభం(రూ.1,574 కోట్లు)తో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. నికర లాభంలో 30 శాతం వాటా అనుబంధ కంపెనీల వల్లనే వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.9,904 కోట్ల నుంచి రూ.12,130 కోట్లకు చేరిందని పేర్కొంది. స్టాండెలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.1,052 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ. 1,360 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇక ఆదాయం రూ.6,644 కోట్ల నుంచి రూ.7,945 కోట్లకు పెరిగిందని పేర్కొంది. తగ్గిన కేటాయింపులు.. రుణ నాణ్యత తగిన స్థాయిలోనే ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. గత క్యూ1లో 2.17 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 2.19 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు 0.86 శాతం నుంచి 0.73 శాతానికి తగ్గాయని పేర్కొంది. మొండి బకాయిలకు, అత్యవసరాలకు కేటాయింపులు రూ.499 కోట్ల నుంచి రూ.350 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 3 శాతం నష్టంతో రూ.1,454 వద్ద ముగిసింది. -
కోటక్ మహీంద్రకు ఆర్బీఐ షాక్
సాక్షి,ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకునకు ఆర్బీఐ గట్టి షాక్ ఇచ్చింది. ప్రమోటర్ల వాటాలను సంబంధించి సరిమైన సమాచారం అందించలేదన్నకారణంగా భారీ పెనాల్టీ విధించింది. రూ. 2 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రమోటార్ల వాటాల విలీనానికి సంబంధించి ఆర్బీఐ నిబంధనలను, సూచనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ వెల్లడించింది. దీంతో 2 కోట్ల రూపాయల నగదు జరిమానా విధించామని పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ అమలుచేస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంక్‌లో ప్రమోటార్ల వాటా వివరాలను సమర్పించాల్సిందిగా ఇప్పటికే ఆర్బీఐ ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని, నిబంధనలు పాటించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో తెలియజేయాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తరువాతజరిమానా విధించేందుకు నిర్ణయించామని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
వచ్చే ఆరు నెలలు కీలకం
దేశీయ ఆర్థిక సేవల రంగంలో తీవ్రమైన లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొందన్నారు ప్రముఖ వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంకు అధినేత ఉదయ్ కోటక్. దేశీయ ఆర్థిక సేవల రంగం ఇప్పటికే సవాళ్లతో కూడిన కాలంలో ప్రయాణం చేస్తోందని, రానున్న రెండు త్రైమాసికాల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్లిష్ట సమయాల్లో నిలదొక్కుకునేందుకు బ్యాలన్స్ షీట్లు బలంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ‘‘ఆర్థిక సేవల రంగంలో ఎన్నో సవాళ్లతో కూడిన కాలం మధ్యలో ఉన్నాం. ఈ రంగంలోని భిన్న విభాగాలు ఏ విధంగా రూపుదిద్దుకుంటాయనే విషయంలో వచ్చే కొన్ని నెలలు ఎంతో కీలకం’’ అని కోటక్ మహీంద్రా బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాల ప్రకటన సందర్భంగా మీడియాతో ఉదయ్ కోటక్ అన్నారు. యస్ బ్యాంకు కొత్త సీఈవో రవనీత్ గిల్ బ్యాంకు రుణ పుస్తకంలో స్టాండర్డ్ ఆస్తుల్లో (ప్రామాణిక రుణాలు) రూ.10వేల కోట్లు ఎన్పీఏలుగా రానున్న త్రైమాసికాల్లో మారే రిస్క్ ఉందంటూ, రూ.2,100 కోట్ల మేర కంటింజెన్సీ ప్రొవిజన్ పేరుతో పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. దీంతో యస్ బ్యాంకు చరిత్రలో మొదటి సారి ఓ త్రైమాసికంలో రూ.1,500 కోట్ల నష్టాన్ని ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ లిక్విడిటీపై చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. బ్యాలన్స్ షీట్లకే పరీక్ష ‘‘ఫైనాన్షియల్ కంపెనీల బ్యాలన్స్ షీట్లు నాణ్యంగా ఉంచుకోవాల్సిన కీలకమైన సమయం. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కు అసలైన పరీక్ష బ్యాలన్స్ షీటే’’ అని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. మార్కెట్లు లాభాలపై దృష్టి పెట్టడం కాకుండా ఆయా సంస్థలు క్లిష్ట సమయాల్లో నిలబడగలిగే బలమైన బ్యాలన్స్ షీట్లతో ఉన్నాయా అన్నదే చూడాలన్నారు. నోట్ల రద్దుతో ఎక్కువగా ప్రయోజనం పొందింది ఆర్థిక సేవల రంగమేనని, భారీ స్థాయిలో నిధులు బ్యాంకుల్లోకి, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లోకి ప్రవేశించినట్టు చెప్పారు. అయితే, ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ఈ నిధులు ద్రవ్యత్వం లేని ఆస్తులైన భూములు, రియల్ ఎస్టేట్‌వైపు వెళ్లిపోయాయన్నారు. దీన్ని అవివేకంగా ఉదయ్ కోటక్ అభివర్ణించారు. ఒక్కసారి నిధుల లభ్యత కఠినంగా మారితే ఈ తరహా ఆస్తులకు మరింత ఇబ్బంది (వెంటనే నగదుగా మార్చుకోలేని పరిస్థితులు) ఏర్పడుతుందన్నారు. ఆర్థిక రంగాన్ని కల్లోల పరిస్థితుల నుంచి సురక్షిత జలాల వైపు తీసుకెళ్లేందుకు విధాన నిర్ణేతలు, ప్రాక్టీషనర్లు దృఢంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలను ఎదుర్కొంటున్న వాటికి మూలనిధులను అందించడం లేదా కన్సాలిడేషన్ ఉత్తమ పరిష్కారంగా సూచించారు. -
కోటక్ బ్యాంక్ లాభం 2,038 కోట్లు
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.2,038 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం( 2017–18) ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.1,789 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించామని కోటక్ బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం పెరగడం, తక్కువ కేటాయింపుల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.10,874 కోట్ల నుంచి రూ.13,823 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు 80 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కోటక్ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 4.48 శాతం స్డాండ్ఎలోన్ పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం రూ.1,408 కోట్లకు ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.1,124 కోట్లు. నికర వడ్డీ ఆదాయం రూ.2,580 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.3,048 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 2.07 శాతం నుంచి 2.14 శాతానికి, నికర మొండి బకాయిలు 0.71 శాతం నుంచి 0.75 శాతానికి పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో స్థూల మొండి బకాయిలు రూ.4,468 కోట్లుగా, నికర మొండి బకాయిలు రూ.1,544 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ 4.48 శాతంగా నమోదైంది. కేటాయింపులు రూ.171 కోట్లుగా ఉన్నాయి. నిర్వహణ లాభం రూ.2,018 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,282 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.1,270 కోట్లకు పెరిగింది. కేటాయింపులు దాదాపు సగానికి తగ్గాయి. రూ.307 కోట్లుగా ఉన్న కేటాయింపులు రూ.171 కోట్లకు తగ్గాయి. 21 శాతం రుణ వృద్ధి ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.6,201 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,204 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.38,724 కోట్ల నుంచి రూ.45,903 కోట్లకు పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి 1.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 1.94%కి, నికర మొండి బకాయిలు 0.86% నుంచి 0.70%కి తగ్గాయి. గత ఏడాది మార్చి నాటికి రూ.1,69,718 కోట్లుగా ఉన్న రుణాలు ఈ ఏడాది మార్చి నాటికి 21 శాతం వృద్ధితో రూ.2,05,695 కోట్లకు పెరిగాయి. తొలిసారిగా బ్యాలన్స్ షీట్ సైజు రూ.3,00,000 కోట్లకు చేరింది. ఆ కంపెనీలకు రుణాలివ్వలేదు... లిక్విడిటీ సమస్యల కారణంగా రుణ మార్కెట్లో సవాళ్లున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి మించి రుణ వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కోటక్ పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 4.2–4.5 శాతం రేంజ్లో కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా దివాలా తీసిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు గానీ, సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు గానీ, అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు గానీ ఎలాంటి రుణాలివ్వలేదని కోటక్ స్పష్టం చేశారు. ప్రమోటర్ షేర్ హోల్డింగ్‌కు సంబంధించిన కేసు తొమ్మిది నెలల తర్వాత విచారణకు రానున్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 0.65 శాతం లాభంతో రూ.1,379 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో ఈ షేర్ 16 శాతం లాభపడింది. -
ఫలితాల్లో అదరగొట్టిన కోటక్ మహీంద్ర
సాక్షి, ముంబై: కోటక్ మహీంద్ర బ్యాంకు 2018-19 సంవత్సరంలోని క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్చి 31తో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో రూ.1408కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 25.24 శాతం లాభాలు పుంజుకున్నాయి. ఆదాయం కూడా 19శాతం ఎగిసి రూ.7672కోట్లను సాధించింది. మరోవైపు ప్రతీ ఈక్వీటీ షేరుకు 80పైసల డివిడెండ్‌ను చెల్లించేందుకు బ్యాంకు బోర్డు ప్రతిపాదించింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలో కోటక్ బ్యాంకు షేరు స్వల్పంగా లాభపడుతోంది. -
బ్యాంకింగ్ రంగంలో టెక్ సంస్థలకు చోటు లేదు
ముంబై: టెక్నాలజీ రంగానికి చెందిన గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలకు బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టేందుకు అనుమతించరాదని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ సంస్థలు నియంత్రణ పరిధిలో పనిచేయడానికి ఇష్టపడవని, అందుకే వాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో చోటు కల్పించరాదని పేర్కొన్నారు. అసంఖ్యాక ప్రజల నమ్మకంపై బ్యాంకింగ్ వ్యవస్థ పని చేస్తుందని, భద్రతకు మారుపేరుగా ఉంటుందని చెప్పారాయన. ‘గూగుల్ లేదా ఫేస్బుక్ బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తే పెద్ద సమస్యే. బ్యాంకుల్లా అవి నియంత్రణ పరిధిలో పనిచేయడానికి ఇష్టపడవు‘ అని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన వార్షిక లీడర్షిప్ సదస్సులో కోటక్ చెప్పారు. గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు గూగుల్ పే వంటి యాప్స్‌తో భారత ఆర్థిక సేవల రంగంలో కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో కోటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులు తమ వద్ద ఉండే ప్రతి రూపాయిపైనా రూ.10 మేర రుణం ఇస్తుంటాయని, ఇంతటి భారీ రిస్కులున్న వ్యాపారమైనప్పటికీ.. బ్యాంకింగ్ సురక్షితమైనదే అనే పేరును నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు. -
గోపీచంద్ అకాడమీలో మరో శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో క్రీడాకారుల కోసం మరో శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ఆవరణలో అదనంగా ఆరు ఎయిర్ కండిషన్డ్ కోర్టుల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల కాలంలో రూ. 30 కోట్ల నుంచి రూ. 35 కోట్లు వెచ్చించి ఈ శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా తెలిపారు. ఈ కేంద్రంలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను కూడా నెలకొల్పుతామని, కోచ్‌లకు శిక్షణ కా ర్యక్రమాలు ఉంటాయని అన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సౌకర్యాలు లభిస్తే భారత ఆటగాళ్లు మున్ముందు మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తారు. అంతర్జాతీయ మ్యాచ్‌లను ఎయిర్ కండిషన్డ్ కోర్టులలో నిర్వహిస్తారు. అకాడమీలో ఎయిర్ కండిషన్డ్ కోర్టులు ఉండాలని కోరుకున్నాం. త్వరలోనే వీటి నిర్మాణ పనులు మొదలవుతాయి. ఇందులో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తారు’ అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. -
కోటక్ బ్యాంక్ లాభం 23% అప్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో(క్యూ3) 23% ఎగిసింది. రుణాల వృద్ధి, నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు తోడ్పడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ3లో నికర లాభం రూ. 1,291 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం రూ. 1,053 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.6,049 కోట్ల నుంచి రూ. 7,214 కోట్లకు పెరిగింది. మూడో త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 23% వృద్ధితో రూ. 2,394 కోట్ల నుంచి రూ. 2,939 కోట్లకు పెరిగిందని, మార్జిన్ 4.33%గా నమోదైందని బ్యాంకు జాయింట్ ఎండీ దీపక్ గుప్తా తెలిపారు. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన లాభం 13.5% వృద్ధితో రూ. 1,624 కోట్ల నుంచి రూ. 1,844 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 10,104 కోట్ల నుంచి రూ. 11,347 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) 2.31% నుంచి 2.07%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.09% నుంచి 0.71%కి తగ్గాయి. ఎస్ఎంఈ రుణాల తగ్గుదల.. అసంఘటిత రంగం ఇంకా డీమోనిటైజేషన్, జీఎస్టీ అమలు ప్రభావాల నుంచి తేరుకోవాల్సి ఉన్నందున.. చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలివ్వడం కొంత తగ్గించినట్లు గుప్తా తెలిపారు. అటు బ్యాంకులో ప్రమోటర్ల షేర్ హోల్డింగ్‌కి సంబంధించిన వివాదంపై కోర్టులో విచారణ కొనసాగుతోందని, దీనిపై ఆర్బీఐ నుంచి తమకేమీ సూచనలు రాలేదని గుప్తా చెప్పారు. బయోమెట్రిక్స్ ఆధారంగా ఖాతాలను తెరవడంపై ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు 5,000 పైచిలుకు పొదుపు ఖాతాలు తెరుస్తున్నామని చెప్పారు. -
‘కోటక్ బ్యాంక్’కు కోర్టులో చుక్కెదురు
ముంబై: ప్రమోటర్ల వాటా తగ్గింపునకు సంబంధించిన గడువు వివాదంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీ)కి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన డిసెంబర్ 31 డెడ్‌లైన్‌పై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేఎంబీ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే ఏడాది జనవరి 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆర్బీఐని ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రమోటర్ల వాటాను పెయిడప్ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్‌లో 20 శాతానికి, 2020 మార్చి 31 నాటికి 15 శాతానికి తగ్గించుకోవాలంటూ 2018 ఆగస్టు 31న ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేఎంబీ గతవారం హైకోర్టును ఆశ్రయించింది. గతంలో కేవలం పెయిడప్ క్యాపిటల్‌కి సంబంధించి మాత్రమే ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్‌ను తగ్గించుకోవాలన్న ఆర్బీఐ తాజాగా పెయిడప్ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్ కింద మార్చిందంటూ కేఎంబీ తరఫు న్యా యవాది డేరియస్ ఖంబాటా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టత కోరుతూ సెప్టెంబర్‌లో రెండు సార్లు ఆర్బీఐకి లేఖ రాసినప్పటికీ, ఇప్పటిదాకా స్పందన రాలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కొత్త గవర్నర్ తాజాగా మరోసారి పరిశీలించాలని, అందుకు వీలుగా డెడ్‌లైన్‌ను నెల రోజులు పొడిగించాలని కోరుతున్నామన్నారు. మరోవైపు, ఎప్పుడో ఆగస్టులో ఆదేశాలిస్తే.. డెడ్‌లైన్ దగ్గరకొస్తుండగా స్టే ఇవ్వాలంటూ కేఎంబీ న్యాయ స్థానా న్ని ఆశ్రయించిందంటూ ఆర్బీఐ తరఫు న్యాయవాది వెంకటేష్ ధోండ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
పెరిగిన కోటక్ బ్యాంకు లాభాలు
సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంకు కోటక్ మహీంద్ర క్యూ2లో మెరుగైన ఫలితాలను సాధించింది. 1747 కోట్ల రూపాయలను నికర లాభాలు నమోదు చేసింది. గత ఏడాదితో రూ. 1,441 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 21 శాతం లాభాలు ఎగిశాయి. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 10,829 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. ఆదాయం 9,140 కోట్లుగా ఉంది. ఎన్పీఏలు 2.14శాతంనుంచి 1.91 శాతానికి దిగి వచ్చాయని కంపెనీ ఫలితాల సందర్భంగా వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం 1,025 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,025 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.913 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.6,644 కోట్లకు ఎగసిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.2,246 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2,583 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 4.3 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలను కూడా కలుపుకుంటే, బ్యాంక్ నికరలాభం (కన్సాలిడేటెడ్) 17% వృద్ధితో రూ.1,574 కోట్లకు పెరిగింది. బ్యాంక్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ బ్యాంక్ నికర లాభం 28 శాతం వృద్ధితో రూ.1,165 కోట్లకు చేరుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. మెరుగుపడిన రుణనాణ్యత...: గతేడాది క్యూ1లో 2.58 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 2.17 శాతానికి తగ్గాయని బ్యాంక్ తెలిపింది. అలాగే నికర మొండి బకాయిలు 1.25 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయని పేర్కొంది. ‘‘తాజా మొండి బకాయిలు రూ.594 కోట్ల నుంచి రూ.321 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలకు ఇతరాలకు కేటాయింపులు రూ.204 కోట్ల నుంచి 131 శాతం పెరిగి రూ. 470 కోట్లకు ఎగిశాయి. రుణాలు 24 శాతం వృద్ధితో రూ.1.76 లక్షల కోట్లకు, కాసా నిష్పత్తి 43.9 శాతం నుంచి 50.3 శాతానికి పెరిగాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 18.3 శాతంగా, టైర్ వన్ రేషియో 17.6 శాతంగా ఉన్నాయి’’ అని బ్యాంకు వివరించింది. 3 % నష్టపోయిన షేర్.. ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో బీఎస్ఈలో కోటక్ బ్యాంక్ నష్టపోయింది. ఇంట్రాడేలో రూ.1,335–రూ.1,412 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన ఈ షేర్ చివరకు 3.69% నష్టంతో రూ.1,350 వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా జోరుగా పెరుగుతున్న ఈ షేర్లో ఫలితాల అనంతరం లాభాల స్వీకరణ చోటు చేసుకుందని నిపుణులంటున్నారు. కాగా, బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.9,874 కోట్లు ఆవిరై రూ.2,57,375 కోట్లకు పడిపోయింది. -
బ్యాంకు మెసేజ్‌లు ఇక వాట్సాప్‌లో..
న్యూఢిల్లీ : వాట్సాప్‌లో బ్యాంకు మెసేజ్‌లు రావడం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! కానీ ఇక నుంచి చూడబోతారు. భారత్‌లో టాప్ బ్యాంకులన్నీ ఇక నుంచి వాట్సాప్ ద్వారానే తన కస్టమర్లతో సంభాషించాలని చూస్తున్నాయి. అలర్ట్‌లను, ఏదైనా బ్యాంకు సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపాలని యోచిస్తున్నాయని తెలిసింది. ఇప్పటికే ఐదు టాప్ బ్యాంకులు దీనిపై టెస్టింగ్ ప్రారంభించాయని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. టెస్టింగ్ ప్రారంభించిన బ్యాంకుల్లో కొటక్ మహింద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు ఉన్నట్టు తెలిసింది. తొలుత వాట్సాప్ ఆధారిత కమ్యూనికేషన్ కలిగి ఉన్న కస్టమర్లకు ఈ సేవలను లాంచ్ చేయనున్నట్టు రిపోర్టులు తెలిపాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తప్పనిసరి చేసిన పాయింట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం విత్‌డ్రా అలర్ట్‌లను పంపడానికి బ్యాంకులు ఇక నుంచి వాట్సాప్‌ను వాడనున్నాయి. దీని కోసం కస్టమర్లు తమ వాట్సాప్ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌ను అందించాల్సి ఉంటుంది. ఆ అనంతరం ప్లాట్‌ఫామ్‌పై బిజినెస్, రిసీవ్ కమ్యూనికేషన్‌తో అకౌంట్లను లింక్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం బ్యాంకులు తమ అలర్ట్‌లను ఎస్ఎంఎస్ల ద్వారా అందిస్తున్నాయి. ఎస్ఎంఎస్తో పాటు అదనంగా వాట్సాప్ మెసేజ్‌లను బ్యాంకులు పంపించాలనుకుంటున్నాయి. కేవలం అలర్ట్‌లకే కాకుండా.. బ్యాంకులతో కమ్యూనికేషన్ కోసం కూడా వాట్సాప్‌ను వాడుకోవచ్చు. కస్టమర్ సర్వీసు విషయాలకు, క్వరీస్ నిర్వహించడానికి బ్యాంకులు దీన్ని ఉపయోగించనున్నాయి.