సిబ్బందిని తగ్గించం | do not decrease staff : uday kotak | Sakshi
Sakshi News home page

సిబ్బందిని తగ్గించం

Published Sat, Nov 22 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

సిబ్బందిని తగ్గించం

సిబ్బందిని తగ్గించం

కొటక్ మహీంద్రా బ్యాంక్: ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకోవడం ద్వారా వెంటనే సిబ్బందిలో కోత పెట్టే ఆలోచనలేదని బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ స్పష్టం చేశారు. ఐఎన్‌జీ వైశ్యాలో 10,000 మంది, కొటక్ బ్యాంక్‌లో 29,000 మంది చొప్పున ఉద్యోగులు ఉన్నారు. కాలక్రమేణా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, వెనువెంటనే సంఖ్య తగ్గేది ఏమీ లేదని ఉదయ్ తెలిపారు. శాఖల సంఖ్య సైతం తగ్గబోదని, ఈ విలీనం వృద్ధికోసమేకానీ, కోతల కోసం కాదన్నారు.

 విలీన కంపెనీ మార్కెట్ వాటా చూస్తాం: సీసీఐ....
 కొటక్ మహీంద్రా బ్యాంక్‌తో ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్ విలీన ప్రతిపాదన తమ ముందుకు వచ్చినపుడు ఆ రెండింటి పరిమాణం, మార్కెట్ వాటాను తాము పరిశీలిస్తామని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్ అశోక్ చావ్లా శుక్రవారంనాడిక్కడ విలేకరులకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement