ING Vysya Bank
-
రూ. 981 కోట్ల విలువైన 7 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రూ.981 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిల్లో హైదరాబాద్‌కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్ ప్రతిపాదన కూడా ఆమోదం పొందింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్-ఎఫ్ఐపీబీ) సూచనల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో ఆరు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. హాత్వే కేబుల్ అండ్ డేటా కామ్‌లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి పరిమితిని ప్రస్తుతమున్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్ రూ.16 కోట్ల విదేశీ పెట్టుబడి ప్రతిపాదన ఆమోదం పొందింది. ఇటీవలనే ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ విదేశీ పెట్టుబడులను 55 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
7న ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాభాల్లో నడుస్తున్న పాతతరం ప్రైవేటు రంగ బ్యాంక్ ఐఎన్జీ వైశ్యాను కొత్త తరం ప్రైవేటు రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రాలో విలీనం చేయడంపై ఐఎన్జీ వైశ్యా బ్యాంకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోటక్ బ్యాంక్‌లో విలీనాన్ని నిరసిస్తూ జనవరి 7న దేశవ్యాప్తంగా సమ్మె చేయునున్నట్లు ఐఎన్జీ వైశ్యా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా వైశ్యా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ కె.జె.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యూనియున్లతో మాటమాత్రమైనా చెప్పకుండా కోటక్ బ్యాంక్‌లో వీలనం చేయాలన్న ఐఎన్జీ వైశ్యా యాజమాన్య నిర్ణయాన్ని తప్పు పట్టారు. -
మంచి రోజులకు ఈ డీల్ సంకేతం!
ఐఎన్జీ వైశ్యా విలీనంపై కొటక్ బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ వ్యాఖ్య ముంబై: ఐఎన్జీ వైశ్యా బ్యాంకును విలీనం చేసుకోవడం మంచి రోజులకు(అచ్ఛే దిన్) సంకేతమని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ప్రచారంలో మోదీ వాడిన ఈ ‘అచ్ఛే దిన్’ వ్యాఖ్యలను ఉదయ్ ప్రస్తావించడం గమనార్హం. కొటక్ బ్యాంకులో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీన డీల్‌ను గత వారంలో ఇరు సంస్థలు ప్రకటించడం తెలిసిందే. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరిగే ఈ విలీన ఒప్పందం విలువ రూ.15,000 కోట్లుగా అంచనా. పరిమాణం, స్థాయి విషయంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థగా రూపొం దేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని ఉదయ్ పేర్కొన్నారు. ఐఎన్జీ వైశ్యా విలీనం తర్వాత కొటక్ బ్యాంక్ రూ. 2 లక్షల కోట్లకు పైగా బ్యాలెన్స్ షీట్, రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను అందుకోనుందన్నారు. ఈ విలీన ఒప్పందానికి 2015 మార్చికల్లా నియంత్రణపరమైన అనుమతులన్నీ లభించవచ్చని ఉదయ్ పేర్కొన్నారు. కాగా, ఈ విలీనం కారణంగా ఎలాంటి ఉద్యోగాల కోతలూ ఉండవని కూడా ఆయన తేల్చిచెప్పారు. -
బ్యాంకుల ‘కుమ్మక్కు’పై కాంపిటీషన్ కమిషన్ దృష్టి
న్యూఢిల్లీ: పొదుపు ఖాతాల వడ్డీ రేట్లపై ఆర్బీఐ నియంత్రణ ఎత్తివేసినప్పటికీ చాలా మటుకు బ్యాంకులు దాదాపు ఒకే రేటును పాటిస్తుండటంపై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దృష్టి సారించనుంది. ఈ విషయంలో అవి కుమ్మక్కయ్యాయా అన్న కోణాన్ని పరిశీలించనుంది. శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ఈ విషయాలు తెలిపారు. నియంత్రణ ఎత్తివేతతో వడ్డీ రేట్లను తమ ఇష్టానుసారం మార్చుకునే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికీ చాలా మటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ), మరికొన్ని ఇతర బ్యాంకులు నాలుగు శాతం మాత్రమే ఇస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆయన చెప్పారు. అవి కుమ్మక్కయ్యే ఇలా చేస్తున్నాయా లేక ఇతరత్రా మరో కారణమేదైనా ఉందా అన్నది పరిశీలిస్తామన్నారు. మరోవైపు, ఆన్లైన్ షాపింగ్ సంస్థలపై ఫిర్యాదుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమకు ఈ మధ్యనే సంబంధిత సమాచారం చేరిందని ఆయన చెప్పారు. దాని ఆధారంగా తదుపరి విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే నెలన్నర- రెండు నెలల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. సంప్రదాయ షాపులతో పోలిస్తే ఆన్లైన్ రిటైలింగ్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇస్తుండటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఏపీలో సిమెంటు సంస్థల కుమ్మక్కుపై ఫిర్యాదు కొట్టివేత.. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో సిమెంటు కంపెనీలు కుమ్మక్కై సిమెంటు రేట్లు పెంచేశాయన్న ఫిర్యాదును సీసీఐ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలను ధృవీకరించేలా తగిన ఆధారాలేమీ లేవని స్పష్టం చేసింది. మేలో ఎన్నికల తర్వాత నెల రోజుల వ్యవధిలో సిమెంట్ కంపెనీలన్నీ కూడబలుక్కుని బస్తాకు రూ. 75 మేర రేట్లను పెంచేశాయని ఫిర్యాదిదారు ఆరోపించారు. మరోవైపు, సిమెంటు దిగ్గజాలు హోల్సిమ్-లఫార్జ్‌ల విలీన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి దాదాపు రెండు నెలలు పడుతుందని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా చెప్పారు. అటు ఫార్మా దిగ్గజాలు సన్-రాన్‌బ్యాక్సీ డీల్‌పై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోగలమని వివరించారు. రాన్‌బాక్సీని దాదాపు 4 బిలియన్ డాలర్లతో సన్‌ఫార్మా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
సిబ్బందిని తగ్గించం
కొటక్ మహీంద్రా బ్యాంక్: ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకోవడం ద్వారా వెంటనే సిబ్బందిలో కోత పెట్టే ఆలోచనలేదని బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ స్పష్టం చేశారు. ఐఎన్జీ వైశ్యాలో 10,000 మంది, కొటక్ బ్యాంక్‌లో 29,000 మంది చొప్పున ఉద్యోగులు ఉన్నారు. కాలక్రమేణా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, వెనువెంటనే సంఖ్య తగ్గేది ఏమీ లేదని ఉదయ్ తెలిపారు. శాఖల సంఖ్య సైతం తగ్గబోదని, ఈ విలీనం వృద్ధికోసమేకానీ, కోతల కోసం కాదన్నారు. విలీన కంపెనీ మార్కెట్ వాటా చూస్తాం: సీసీఐ.... కొటక్ మహీంద్రా బ్యాంక్‌తో ఐఎన్జీ వైశ్యాబ్యాంక్ విలీన ప్రతిపాదన తమ ముందుకు వచ్చినపుడు ఆ రెండింటి పరిమాణం, మార్కెట్ వాటాను తాము పరిశీలిస్తామని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్ అశోక్ చావ్లా శుక్రవారంనాడిక్కడ విలేకరులకు చెప్పారు. -
‘రియల్’ లాభాలు కావాలంటే..
భారత్ వంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులపరంగా రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, షాపు, అభివృద్ధి చేయని భూమి... దేని లాభాలు దానికున్నాయి. వీటిని కొనుగోలు చేసే వారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక ధరకు తిరిగి అమ్మడం ద్వారా లాభం (క్యాపిటల్ గెయిన్స్) పొందడానికి కొంటున్నారా లేక వీటిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందడానికి కొనుగోలు చేస్తున్నారా అనే అంశంలో ఇన్వెస్టర్లకు స్పష్టత ఉండాలి. బాండ్లు, ఈక్విటీల వంటి ఆస్తులకు భిన్నమైనది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో అపార్ట్మెంటు లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నపుడు ఆ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయా అనేది పరిశీలించాలి. బిల్డర్ ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి. ఇంకా పొందాల్సిన పర్మిట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. సదరు ఆస్తిపై మీ పెట్టుబడిని, ఎంత ఆదాయం వస్తుందన్న అంశాలను గమనించాలి. పోర్టుఫోలియోలో ప్రాధాన్యతలు... భూమిని కొంటున్నట్లయితే నిర్వహణ వ్యయం ఎంతవుతుందో లెక్కించాలి. ఆక్రమణలను నివారిం చడానికి ఆ భూమిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలతోపాటు స్థిరాస్తి కొనదలుచుకున్న ప్రాంతంలో పరిస్థితులను గమనిస్తుండాలి. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలు, బంగారం, సెక్యూరిటీలకు ప్రాధాన్యతను పరిస్థితులకు అనుగుణంగా మారుస్తుండాలి. ఆదాయ సామర్థ్యం దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగం ధనికులకు అత్యంత ఆకర్షణీయమైనది. క్యాపిటల్ గెయిన్స్‌తో పాటు స్థిరాదాయం కూడా ఇస్తుంది. షేర్లయినా, రియల్ ఎస్టేట్ అయినా అన్ని అంశాలనూ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. నిర్దిష్ట ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి.