మంచి రోజులకు ఈ డీల్ సంకేతం! | This deal is a good sign of the day! | Sakshi
Sakshi News home page

మంచి రోజులకు ఈ డీల్ సంకేతం!

Published Sun, Nov 23 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

మంచి రోజులకు ఈ డీల్ సంకేతం!

మంచి రోజులకు ఈ డీల్ సంకేతం!

ఐఎన్‌జీ వైశ్యా విలీనంపై కొటక్ బ్యాంక్ చీఫ్
ఉదయ్ కొటక్ వ్యాఖ్య

 
ముంబై: ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకును విలీనం చేసుకోవడం మంచి రోజులకు(అచ్ఛే దిన్) సంకేతమని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ప్రచారంలో మోదీ వాడిన ఈ ‘అచ్ఛే దిన్’ వ్యాఖ్యలను ఉదయ్ ప్రస్తావించడం గమనార్హం. కొటక్ బ్యాంకులో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ విలీన డీల్‌ను గత వారంలో ఇరు సంస్థలు ప్రకటించడం తెలిసిందే. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరిగే ఈ విలీన ఒప్పందం విలువ రూ.15,000 కోట్లుగా అంచనా.

పరిమాణం, స్థాయి విషయంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థగా రూపొం దేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని ఉదయ్ పేర్కొన్నారు. ఐఎన్‌జీ వైశ్యా విలీనం తర్వాత కొటక్ బ్యాంక్ రూ. 2 లక్షల కోట్లకు పైగా బ్యాలెన్స్ షీట్, రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను అందుకోనుందన్నారు. ఈ విలీన ఒప్పందానికి 2015 మార్చికల్లా నియంత్రణపరమైన అనుమతులన్నీ లభించవచ్చని ఉదయ్ పేర్కొన్నారు. కాగా, ఈ విలీనం కారణంగా ఎలాంటి ఉద్యోగాల కోతలూ ఉండవని కూడా ఆయన తేల్చిచెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement