Uday Kotak
-
ఇక్కడి లాభాలు అక్కడికి.. ఎఫ్ఐఐల తీరుపై ఉదయ్‌కోటక్ స్పందన
భారత స్టాక్ మార్కెట్లో ఇటీవల పెద్దమొత్తంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. రోజూ సుమారు రూ.3,000 కోట్లకు పైగా విక్రయాలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెరుగుతుండటంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్‌కోటక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ‘ఛేజింగ్ గ్రోత్ 2025 ఇన్వెస్టర్ ఈవెంట్’లో ఆయన మాట్లాడారు. స్టాక్ మార్కెట్లో నిరంతరం పెట్టుబడి పెడుతున్న దేశీయ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఎఫ్ఐఐలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో వివరించారు.‘భారత్‌లో స్టాక్ వాల్యుయేషన్లు పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించడం అధికమైంది. దేశం అంతటా రిటైలర్లు రోజూ ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశీయ సంస్థాగత ప్రవాహాలకు సాయపడుతుంది. అయితే, ఎఫ్ఐఐలు లాభాలు సంపాదించడానికి కూడా ఇదే కారణమవుతుంది. భారత మార్కెట్లో వారు లాభాలు గడించి ఇతర ప్రపంచ మార్కెట్లకు వాటిని తరలిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడుతుండడంతో ఎఫ్ఐఐలు భారతదేశం సహా వర్ధమాన మార్కెట్ల నుంచి మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం 4.5 శాతానికి పైగా ఉన్న అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం కూడా భారత మార్కెట్లు కుప్పకూలడానికి కారణం’ అని చెప్పారు.ఇదీ చదవండి: తేమ నుంచి తాగునీటి ఉత్పత్తికి ఏర్పాట్లు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్ఇప్పటికే ఎఫ్ఐఐలు, ఎఫ్‌డీఐలు భారత్‌లోని చాలా కంపెనీల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకున్నాయని కోటక్ తెలిపారు. అధిక వాల్యుయేషన్ల కారణంగా వర్ల్‌పూల్, హ్యుందాయ్ వంటి కంపెనీలు భారత్‌లో తమ హోల్డింగ్స్‌ను తగ్గించుకున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ ఉపసంహరణ తంతు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇది మరింతగా పెరిగితే ఆర్బీఐ తన రిజర్వ్‌లను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. లేదా రూపాయి బలహీనపడే ప్రమాదం ఉందని అంచనా వేశారు. -
క్విక్ కామర్స్‌తో రిటైలర్లకు సవాళ్లు
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ నమూనా స్థానిక రిటైలర్లకు సవాళ్లు విసురుతోందని, రాజకీయ అంశంగానూ మారొచ్చని వెటరన్ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. భారత్‌ను ప్రపంచంలోనే వినూత్నమైన దేశంగా పేర్కొంటూ.. మరెక్కడా క్విక్ కామర్స్ నమూనా అంత సత్ఫలితాలు సాధించలేదని, ఇక్కడ మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నట్టు చెప్పారు.‘‘ఇది సానుకూల సంకేతమే. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలకు ఫలితాలు కనిపిస్తున్నాయి’’ అని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అదే సమయంలో యాపిల్, మెటా, యూనిలీవర్ వంటి బ్రాండ్లను భారత్ సృష్టించాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా ఈ విధమైన ఆవిష్కరణల బలం కనిపిస్తుందంటూ.. భారత వ్యాపార సంస్థలు ఉత్పతాదకత, సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు. దేశీయ సంస్థలకు, దేశీయ మార్కెట్ నుంచే రక్షణ కల్పించడం అన్నది దీర్ఘకాల పోటీతత్వం కోణంలో ప్రమాదకరమన్నారు.దేశీయ వ్యాపారాలను కాపాడుకోవడం కంటే అవి స్వేచ్ఛగా పోటీపడేలా చూడాలన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లలో 900 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని, ట్రంప్ పాలనలో వచ్చే మార్పులతో లేదా ఏదైనా అంతర్జాతీయ పరిణామంతో ఇందులో 5–10 శాతం మేర వెనక్కి మళ్లినా అందుకు సన్నద్ధమై ఉండాలని సూచించారు. -
దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు. గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొట్టిన దెబ్బతో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఉదయ్ కోటక్ సంపదకు కూడా భారీగా గండి పడింది.కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ చర్యల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 13 శాతం వరకు పడిపోయాయి. కంపెనీలో దాదాపు 26 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఉదయ్ కోటక్ భారీ నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10 వేల కోట్లు) తగ్గింది. ఏప్రిల్ 24 నాటికి ఉదయ్ కోటక్ నెట్‌వర్త్ 14.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు).ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 2016 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి కోటక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిన తర్వాత యాక్సిస్ షేర్లు పుంజుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కోటక్ తప్పుకొన్న తర్వాత అశోక్ వాస్వానీ ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. -
‘స్టాక్ మార్కెట్లు గాలి బుడగలా లేవు’
స్టాక్ మార్కెట్లు కొన్ని రోజుల క్రితం జీవితకాల గరిష్ఠాలను తాకాయి. దాంతో చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్లు భారీగా పెరిగాయనే అభిప్రాయానికి వచ్చారు. దాంతో కొన్నికారణాల వల్ల కొద్దికాలంగా మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయి. తాజాగా మార్కెట్ తీరుతెన్నులపై సెబీ నిర్వహించిన సదస్సులో బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్ మాట్లాడారు. భారత స్టాక్ మార్కెట్లు గాలి బుడగలా లేవని ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో షేర్ల విలువలపై నియంత్రణ సంస్థలతో పాటు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షేర్ల విలువలు కొంత అధిక స్థాయుల్లోనే ఉన్నప్పటికీ.. చేయిదాటి పోలేదని కోటక్ అన్నారు. ఇదీ చదవండి: ఏఐ ప్రభావం.. ఉద్యోగాలు పోతాయ్..? ఇప్పుడేం చేయాలంటే.. మార్కెట్లలో గాలి బుడగ ఏర్పడితే, దాన్ని పెరగకుండా చూసుకోవాలని, లేదంటే అది పేలి మదుపర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అది మంచిది కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లలో ఎప్పటికప్పుడు ముప్పులను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయని నమ్ముతున్నట్లు తెలిపారు. -
అతిజాగ్రత్తతో వృద్ధికి ఆటంకం
న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థలు జాగ్రత్త చర్యలు అతిగా అమలు చేస్తే ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. రెగ్యులేటర్లు మరీ సంప్రదాయకంగా, అతిజాగ్రత్తగా వ్యవహరించకూడదన్నారు. అయితే, ఏ రంగంలోనైనా ‘ప్రమాదాలు’ చోటు చేసుకుంటే సత్వరం స్పందించే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోటక్ ఈ విషయాలు తెలిపారు. ‘భారత్ భవిష్యత్తుపై నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను. అదే సమయంలో తగిన జాగ్రత్త లేకుండా కేవలం అవకాశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి ముందుకెళ్లడమనేది రిసు్కతో కూడుకున్న వ్యవహారం. అలాగని, మరీ అతిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అక్కడికి (సంపన్న దేశం కావాలన్న లక్ష్యానికి) చేరుకోలేం‘ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్ల పాటు 7.5–8 శాతం జీడీపీ వృద్ధి రేటును కొనసాగించాలంటే సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ చెప్పారు. -
సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే..
నియంత్రణ సంస్థలు మరీ సంప్రదాయకంగా ఉండాల్సిన అవసరం లేదని, ఆర్థిక రంగంలో ప్రమాదాలకు వేగంగా స్పందించాల్సిందేనని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. కేవైసీ నిబంధనల అమలులో వైఫల్యానికి గాను ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ నిషేధం విధించడం తెలిసిందే. ఈ తరుణంలో ఉదయ్ కోటక్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అసలు ప్రమాదాలే లేని విధానం ప్రమాదకరమైంది. వేగంగా వృద్ధి చెందాలని కోరుకునేట్టు అయితే, చక్కని నియంత్రణలు కూడా అవసరమే. కొన్ని ప్రమాదాలు తలెత్తొచ్చు. కానీ, ఎంత వేగంగా స్పందించాం, చక్కదిద్దామన్నదే కీలకం’’అని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ ఆసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన సమావేశంలో భాగంగా ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: పిల్లల కోసం ‘ఎల్ఐసీ అమృత్‌బాల్’.. ప్రత్యేకతలివే.. గతం తాలూకూ మచ్చలు నియంత్రణ సంస్థలను మరింత రక్షణాత్మకంగా లేదా అప్రమత్తంగా మార్చకూడదంటూ, అదే సమయంలో మెరుగైన నియంత్రణ వాతావరణం అవసరమేనన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ గురించి ప్రస్తావన రాగా, ‘‘విడిగా వేరే కంపెనీ గురించి నేను వ్యాఖ్యానించను. కానీ, ఆర్బీకి మీ కంటే, నా కంటే ఎక్కువే తెలుసు’’అని పేర్కొన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మార్చి 15 తర్వాత నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించరాదని ఆర్బీఐ నిషేధించడం తెలిసిందే. -
డబ్బు విషయంలో దేశ ప్రజల ధోరణి మారింది : ఉదయ్ కొటక్
న్యూఢిల్లీ: పొదుపరుల నుంచి మదుపుదారుల దేశంగా భారత్ రూపాంతరం చెందిందని ప్రముఖ బ్యాంకరు, కోటక్ మహీంద్రా బ్యాంక్ మాజీ ఎండీ ఉదయ్ కోటక్ తెలిపారు. నేడు చాలా మంది తమ మిగులు నిధులను మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. 1980ల తొలినాళ్లలో బంగారం, స్థలంతో పోలిస్తే ఆర్థిక అసెట్స్‌పై భరోసా తక్కువగా ఉండేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రజలు కొంత భాగాన్ని బ్యాంకు డిపాజిట్లు, ఎల్ఐసీ, యూటీఐ వంటి వాటిల్లోకి మళ్లించడం మొదలుపెట్టారని పేర్కొన్నారు. ‘90లలో కూడా ఈక్విటీల్లో పెట్టుబడులంటే ’స్పెక్యులేటివ్’గానే చూసేవారు. దీంతో మన కంపెనీలు నిధుల కోసం విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్ఐఐ) ఆశ్రయించాల్సి వచ్చేంది. వాటి సామర్థ్యాలను గుర్తించిన ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేశారు కానీ దేశీ పొదుపరులు మాత్రం దూరంగానే ఉండేవారు‘ అని తెలిపారు. ‘మాలో కొందరు ఇలాంటి ధోరణులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టికి తీసుకెళ్లాం. ఇది 2000 తొలినాళ్లలో ప్రైవేట్ ప్లేస్మెంట్ మార్కెట్ (క్యూఐపీ) ప్రారంభానికి దారితీసింది. -
జై కోటక్‌తో మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య వివాహం (ఫొటోలు)
-
కొన్ని గ్రూప్‌ల నుంచే పెట్టుబడులు.. రిలయన్స్‌పై ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు
ముంబై: కార్పొరేట్ పెట్టుబడులు మరింతగా విస్తరించవలసి ఉన్నట్లు వెటరన్ బ్యాంకర్ ఉదయ్ కొటక్ పేర్కొన్నారు. కొన్ని గ్రూపులు మాత్రమే పెట్టుబడులు చేపడుతున్నాయని, మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే సదస్సులో ప్రసంగిస్తూ ఇందుకు విధానాలు మార్చవలసిన అవసరంలేదన్నారు. భారీ కార్పొరేషన్లు ప్రపంచస్థాయి బిజినెస్‌లను సృష్టిస్తున్నట్లు ప్రశంసించారు. ప్రధానంగా ముకేశ్ అంబానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే కొన్ని ప్రధాన గ్రూప్‌ల నుంచి మాత్రమే కొత్త పెట్టుబడులు నమోదవుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇందుకు విధానాలను సవరించవలసిన అవసరంలేదని పేర్కొంటూ, మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించవలసి ఉన్నదని తెలియజేశారు. -
ఉదయ్ కోటక్ వారసత్వం ఎవరికి?
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి ఇద్దరు హోల్‌టైమ్ డైరెక్టర్లు కేవీఎస్ మణియన్, శాంతి ఏకాంబరం రేసులో ఉన్నారు. బ్యాంక్ ఎండీ సీఈఓగా గత వారం ఉదయ్ కోటక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కోటక్ తన పదవీకాలం ముగియడానికి నాలుగు నెలల ముందే అంటే 1 సెపె్టంబర్ 2023 నుండి బ్యాంక్ ఎండీ, సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగారు. కొత్త వ్యక్తి 2024 జనవరి 1వ తేదీనాటికి బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నందున, ఈ బాధ్యతల భర్తీపై రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంక్‌లో 26 శాతం హోల్డింగ్ ఉన్న కోటక్, బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారారు. ఉదయ్ కోటక్ రాజీనామా నేపథ్యంలో మధ్యంతర ఏర్పాటుగా సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా 2023 డిసెంబర్ 31 వరకూ ఎండీ, సీఈఓగా విధులను నిర్వహిస్తారని (ఆర్బీఐ, బ్యాంక్ మెంబర్ల ఆమోదానికి లోబడి) కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ల తెలిపింది. విశేష సేవలు.. వ్యవస్థాపకుడిగా, నేను కోటక్ బ్రాండ్‌తో ప్రగాఢ అనుబంధాన్ని కలిగి ఉన్నాను. ఈ నేపథ్యంలో సంస్థకు నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగిస్తాను. పటిష్ట బ్యాంకింగ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ మేనేజ్మెంట్ బృందం ఉంది. వ్యవస్థాపకులు దూరంగా వెళ్లిపోతారు, కానీ సంస్థ శాశ్వతంగా వరి్ధల్లుతుంది. బ్యాంక్ షేర్ హోల్డర్లకు విశేష విలువలను సమకూర్చింది. లక్షకుపై ఉపాధి అవకాశాలు కలి్పంచింది. 1985లో రూ. 10,000 పెట్టుబడితో స్థాపించిన సంస్థ ఇప్పుడు రూ. 300 కోట్ల వ్యాపారానికి విస్తరించింది. భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక శక్తిగా మార్చడంలో ఈ సంస్థ మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. – ఉదయ్ కోటక్, ఎక్స్‌లో పోస్ట్ -
వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు!
ఆసియాలోనే అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ (Uday Kotak).. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) సీఈవో, ఎండీ పదవి నంచి వైదొలిగారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎలా స్థాపించింది.. ఎలా అభివృద్ధి చేసింది వివరిస్తూ ‘ఎక్స్’ (ట్విటర్) (Twitter)లో సుదీర్ఘ ట్వీట్ చేశారు. "విశ్వసనీయత, పారదర్శకత అనే ప్రాథమిక సిద్ధాంతాలతో మేం ఏర్పాటు చేసిన సంస్థ ఇప్పడొక ప్రముఖ బ్యాంక్, ఆర్థిక సంస్థ. మా వాటాదారులకు అత్యంత విలువను సృష్టించాం. లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించాం. 1985లో సంస్థలో పెట్టిన రూ.10,000 పెట్టుబడి ఈరోజు దాదాపు రూ.300 కోట్లు అవుతుంది" అంటూ రాసుకొచ్చారు ఉదయ్ కోటక్. ఆ కలతోనే.. ‘జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి సంస్థను భారత్‌లో ఏర్పాటు చేయాలని 38 సంవత్సరాల క్రితం కల కన్నాను. ఆ కలతోనే ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల చిన్న కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో కోటక్ మహీంద్రా సంస్థను ప్రారంభించాం’ అని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో భారతీయ యాజమాన్యంలోని ఈ సంస్థ మరింత ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. రిటైర్మెంట్ కంటే ముందే పదవి నుంచి వైదొలగిన ఉదయ్ కోటక్.. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తాకు పగ్గాలు అందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ సభ్యుల ఆమోదానికి లోబడి డిసెంబర్ 31 వరకు దీపక్ గుప్తా తాత్కాలిక ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. 2024 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త ఎండీ, సీఈవో నియామకానికి ఆమోదం కోసం ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్‌కి దరఖాస్తు చేసింది. Succession at Kotak Mahindra Bank has been foremost on my mind, since our Chairman, myself and Joint MD are all required to step down by year end. I am keen to ensure smooth transition by sequencing these departures. I initiate this process now and step down voluntarily as CEO.… — Uday Kotak (@udaykotak) September 2, 2023 -
ఉదయ్ కోటక్ రాజీనామా.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్!
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత.. ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి పరిచయమే అవసరం లేదు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల 'ఉదయ్ కోటక్' రాజీనామా సందర్భంగా తన ట్విటర్ ద్వారా ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉదయ్ కోటక్ 1985లో కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే ఫైనాన్స్ సంస్థను ప్రారంభించారు. ఆ తరువాత 2003లో బ్యాంక్‌గా అవతరించింది. నిజానికి రెండు కార్పొరేట్ సంస్థల పేర్లను కలిగిన ఏకైక భారతీయ బ్యాంక్ ఈ కోటక్ మహీంద్రా కావడం గమనార్హం. ప్రారంభంలో కోటక్ ఆర్థిక సంస్థను ప్రారంభించాలని యోచిస్తున్నప్పుడు.. అందులో మహీంద్రా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా ప్రకటించినప్పుడు.. ప్రారంభంలో ఉదయ్ కోటక్‌తో ఆనంద్ మహీంద్రాకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు. ఇదీ చదవండి: మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్ ఆనంద్ మహీంద్రా.. ఉదయ్ కోటక్ గురించి మాట్లాడుతూ.. 'అప్పట్లో అల్లాయ్ స్టీల్ పరిశ్రమ చాలా కష్టాల్లో ఉంది. అప్పుడు అతను ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడని నేను అతనిని అడిగాను. కంపెనీ మేనేజ్మెంట్ రెండింటినీ అధ్యయనం చేసాను, అంతే కాకుండా నా డబ్బు సురక్షితంగా ఉంటుందని సమాధానమిచ్చాడు. మహీంద్రా ఇరవైల వయస్సులోనే అతనిలోని ప్రత్యేకమైన సంకేతాలను స్పష్టంగా చూశానన్నాడు. అయితే అతని స్టోరీకి ముగింపు లేదు. ఉదయ్ భారతీయ ఆర్థిక సేవల పరిశ్రమపై ప్రభావం చూపే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇక్కడ మరిన్ని సాహసాలు ఉన్నాయి, నా మిత్రమా.. అంటూ ట్వీట్ చేసాడు. I remember the first time I met Uday when he walked into my Office at Mahindra Ugine Steel almost 4 decades ago & offered me a bill-discounting faculty. The alloy steel industry was in a trough at that time and I asked him why he was taking the risk. He replied: “I’ve studied… https://t.co/GcUq272Ku0 — anand mahindra (@anandmahindra) September 2, 2023 -
ఉదయ్ కొటక్ రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, ప్రమోటర్ అయిన ఉదయ్ కొటక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆయన బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. సెపె్టంబర్ 1 నుంచి ఆయన రాజీనామా అమలులోకి వచి్చందని బ్యాంక్ శనివారం ప్రకటించింది. బ్యాంక్‌లో ఆయనకు 26 శాతం వాటా ఉంది. ఇక నుంచి నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉదయ్ కొటక్ వ్యవహరిస్తారని కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరైనా 15 ఏళ్లు మాత్రమే ఆ పదవిలో పనిచేయాల్సి ఉంటుంది. గడువు కంటే 3 నెలల ముందే ఉదయ్ రాజీనామా చేయడం గమనార్హం. -
బ్యాట్స్‌మన్ టు బిజినెస్‌మన్: రిచెస్ట్ బ్యాంకర్ గురించిన ఆసక్తికర విషయాలు
కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేసినట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఆయన బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. భారతదేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ గురించిన పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఉదయ్ కోటక్ ఈ సంవత్సరం డిసెంబరులో పదవీ విరమణ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పదవీ విరమణ రోజుకు నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేశారు. మొత్తంగా 38 సంవత్సరాలకుపైగా ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగారు. ఇండియన్ రిచెస్ట్ బ్యాంకర్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. 2023 సెప్టెంబరు 2 నాటికి ఉదయ్ కోటక్ దాదాపు 13.7 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో భారతదేశపు అత్యంత సంపన్న బ్యాంకర్. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఆయన ఆదాయంలో దాదాపు 26 శాతం బ్యాంకులో వాటా నుంచే వస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఉదయ్ కోటక్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 133వ స్థానంలో ఉన్నారు. కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో 1985లో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించిన ఉదయ్ కోటక్ 2003లో దాన్ని బ్యాంక్‌గా మార్చారు. ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్.. కోటక్ 811 బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ముంబయిలో పత్తి వ్యాపారం చేసే ఓ గుజరాతీ కుటుంబంలో ఉదయ్ కోటక్ జన్మించారు. 60 మంది సభ్యులున్న పెద్ద ఉమ్మడి కుటుంబం వారిది. సిడెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బీకామ్ డిగ్రీని పొందారాయన. అలాగే జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఒకప్పుడు క్రికెటర్ రిచెస్ట్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి అంతగా తెలియని విషయం ఏమిటంటే ఆయన అద్భుతమైన క్రికెటర్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అలాగే కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. వాస్తవంగా క్రికెటర్‌గానే తన కెరీర్‌ను కొనసాగించాలకున్నారు ఉదయ్ కోటక్. కానీ విధి మరోలా తలచింది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరుగుతున్న కంగా లీగ్‌లో వికెట్ల మధ్య పరిగెత్తుతుండగా ప్రమాదవశాత్తు బాల్ ఆయన తలకు బలంగా తగిలింది. మెదడులో రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేశారు. ఈ ప్రమాదం ఆయన్ను కొన్ని నెలలపాటు మంచం పట్టించింది. క్రికెట్ కెరీర్‌ను ముగించడమే కాకుండా జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక విద్యా సంవత్సరం కూడా కోల్పోవాల్సి వచ్చింది. (Warren Buffett Assets 2023: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..) ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన కుటుంబం, స్నేహితుల నుంచి కొంత పెట్టుబడి తీసుకుని ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించారు. పెట్టుబడిలో ఎక్కువ భాగం ఉదయ్ కోటక్ ప్రాణ స్నేహితుడైన ఆనంద్ మహీంద్రా నుంచే వచ్చింది. తరువాత కొన్ని సంవత్సరాలలో ఉదయ్ కోటక్ తన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఫైనాన్స్ వంటి వివిధ ఆర్థిక సేవల రంగాలలోకి విస్తరించారు. -
కోటక్ మహీంద్రా సీఎండీగా ఉదయ్ కోటక్ రాజీనామా
Uday Kotak resigns: కొటాక్ మహీంద్రా బ్యాంక్ సీఎండీ ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. షెడ్యూల్ కంటే 3 నెలల ముందుగానే తన పదవికి రాజీనామా చేయడం వార్తల్లో నిలిచింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లోవెల్లడించింది. ఆయనను బ్యాంక్ సీఎండీ బాధ్యతలనుంచి వైదొలిగినట్టు పేర్కొంది. ఈ రాజానామాను బ్యాంక్ బోర్డు ఆమోదం మేరకు సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చిందని తెలిపింది. అటు సీఎండీగా స్వచ్ఛందంగా వైదొలగుతున్నట్టు ఉదయ్ కోటక్ కూడా ట్విటర్లో వెల్లడించారు. విశ్వసనీయత , పారదర్శకత ప్రాథమిక సిద్ధాంతాలతో తాము విశిష్ట సేవలందించామనీ, లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించామని పేర్కొన్నారు. 1985లో రూ. 10వేల మొదలైన తమ ప్రస్తానం ఈరోజు దాదాపురూ. 300 కోట్లకు చేరిందన్నారు. తమ సంస్థ సామాజిక , ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. వ్యవస్థాపకుడిగా, కోటక్ బ్రాండ్‌తో చాలా అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) Succession at Kotak Mahindra Bank has been foremost on my mind, since our Chairman, myself and Joint MD are all required to step down by year end. I am keen to ensure smooth transition by sequencing these departures. I initiate this process now and step down voluntarily as CEO.… — Uday Kotak (@udaykotak) September 2, 2023 చాలా కాలం క్రితం, JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి పేర్లు ఆర్థిక ప్రపంచంలో ఆధిపత్యం చూశాను . దేశంలో అలాంటి సంస్థను సృష్టించాలని కలతోనే నేను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రాను ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో 3 మంది ఉద్యోగులతో ప్రారంభించా. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగినన్నారు.వ్యవస్థాపకులు వెళ్ళిపోతారు, కానీ సంస్థ శాశ్వతంగా వర్ధిల్లుతుందంటూ ట్వీట్ చేశారు. -
పెట్టుబడి లక్ష.. లాభం రూ. 2 వేల కోట్లు.. షాకింగ్‌గా ఉన్నా ఇదే నిజం!
మీకు కొటక్ మహీంద్రా బ్యాంక్ గురించి తెలుసే ఉంటుంది. అయితే మీరెప్పుడైనా కొటక్ మహీంద్రా బ్యాంక్ పేరులో ‘మహీంద్రా’ అనే పేరు ఎందుకు ఉందోనని అనుకున్నారా? ఆనంద్ మహీంద్రా వాళ్ల ఇంటి పేరు మీదగా కొటక్ మహీంద్రా బ్యాంక్‌గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది. అలా కొటక్‌లో మహీంద్రా అనే పేరు కలపడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? ఇదిగో ఇలా మీరెప్పుడైనా ఆలోచించారా? ఉదయ్ సురేష్ కొటక్ (ఉదయ్ కొటక్) ఉన్నత మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించారు. వంట గది తరహాలో ఉండే ఇంట్లో 60 మంది కుటుంబ సభ్యులతో కలిసుండేవారు. అయితే ఉదయ్‌లో ఉన్న ప్రతిభకు పేదరికం ఎప్పుడూ అడ్డు కాలేదు. ఉన్నత చదువులు పూర్తి చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని అనుకున్నారు. 1985లో ఉదయ్ కొటక్‌కు పల్లవిలకు వివాహం జరిగింది.పెళ్లికి అప్పుడే హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. ఆనంద్ మహీంద్రాకు ఉదయ్ కొటక్‌కు కామన్ ఫ్రెండ్ ఉండేవారు. అతను ఉదయ్ సొంతంగా ఓ బ్యాంక్‌ను ప్రారంభించాలి’అని అనుకుంటున్న విషయాన్ని ఆనంద్ మహీంద్రాకు చెప్పారు. వెంటనే తన వద్ద ఉన్న లక్ష రూపాయల్ని ఉదయ్ కొటక్ ప్రారంభించబోయే సంస్థలో పెట్టుబడి పెట్టారు. మొత్తం 30 లక్షలతో ప్రారంభమైన ఆ సంస్థకు తొలుత ఉదయ్ కోటక్, సిడ్నీ ఏఏ పింటో అండ్ కోటక్ & కంపెనీ పేరుతో కార్యకలాపాల్ని ప్రారంభించింది. ఆ తర్వాత అదే ఏడాది కొటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా అవతరించింది. ఆ మరుసటి ఏడాది హరీష్ మహీంద్రా, ఆనంద్ మహీంద్రాలో వాటా కొనుగోలు చేశారు. ఆ కంపెనీ పేరు కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్‌గా 2003లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌గా ప్రసిద్ధి చెందింది. ఆ బ్యాంక్ విలువ రూ.1.14లక్షల కోట్లకు చేరింది. కోటక్ మహీంద్రా గ్రూప్ నవంబర్ 1985లో కోటక్ గ్రూప్‌లో లక్ష పెట్టుబడి పెట్టారు. ఆ లక్ష పెట్టుబడి కాస్తా 2017 ఏప్రిల్ 1 నాటికి రూ.1,400 కోట్లుకు చేరింది. పలు ఇంటర్వ్యూల్లో ఆనంద్ మహీంద్రా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తాను తీసుకున్న మంచి పెట్టుబడి నిర్ణయాల్లో ఇదొకటని గుర్తు చేసుకుంటుంటారు. 1985. Young Uday Kotak enters my office&offers financing.He's so smart,I ask if I can invest in him.My Best decision https://t.co/cCfntHkiih — anand mahindra (@anandmahindra) March 25, 2017 ప్రస్తుతం, పలు నివేదికల అంచనాల ప్రకారం.. కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఆనంద్ మహీంద్రా వాటా అక్షరాల రూ.2 వేల కోట్లుకు చేరినట్లు తెలుస్తోంది. మహీంద్రా కుటుంబ సభ్యుల పేరు మీద కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో మొత్తం 3.68 వాటా ఉంది. ఇదీ చదవండి : నీకు జీవితాంతం రుణపడి ఉంటా -
‘డాలర్ ఫైనాన్సియల్ టెర్రరిస్ట్’..
అమెరికన్ డాలర్ ‘ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది’ అని చేసిన వ్యాఖ్యపై కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆ మాట తాను అనుకోకుండా అన్నానన్నారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘యూఎస్ డాలర్‌పై ఇటీవల జరిగిన చర్చలో నేను అనుకోకుండా "ఆర్థిక ఉగ్రవాది" అనే పదాలను ఉపయోగించాను. నా ఉద్దేశం ఏమిటంటే రిజర్వ్ కరెన్సీకి అసమాన శక్తి ఉంటుంది. అది నోస్ట్రో ఖాతా అయినా కావచ్చు. 500 బీపీఎస్ రేటు పెరుగుదల అయినా లేదా లిక్విడిటీ కోసం యూఎస్ డాలర్‌ను కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలైనా కావచ్చు’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు.. రిజర్వ్ డాలర్‌గా ఉన్న అమెరికన్ డాలర్ హోదా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే శక్తిని ఇస్తుందన్నారు. చరిత్రలో కీలకమైన ఈ తరుణంలో ప్రపంచం కొత్త రిజర్వ్ కరెన్సీ కోసం వెతుకుతోందని తాను భావిస్తున్నట్లు కోటక్ ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. యూరప్, బ్రిటన్, జపాన్, చైనాతో సహా ఇతర దేశాలు తమ కరెన్సీలను రిజర్వ్ కరెన్సీలుగా పేర్కొనడానికి ముందస్తు అవసరాలు లేవని ఆయన అన్నారు. రూపాయి రిజర్వ్ కరెన్సీ కావాలంటే దేశం బలమైన సంస్థలను, వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. గత మార్చి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభం రూ. 3,495.6 కోట్ల వద్ద 26.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం 35 శాతం పెరిగి రూ.6,102.6 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు నాల్గవ త్రైమాసికంలో రూ.1,193.30 కోట్లకు తగ్గాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1,736.71 కోట్లు. శాతాల పరంగా, నికర ఎన్పీఏ నికర అడ్వాన్స్లలో 0.64 శాతం నుంచి 0.37 శాతానికి మెరుగుపడింది. ఇదీ చదవండి: ATM Fraud Alert: ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త! -
చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!
సాధారణ ఎగువ మధ్యతరగతి కుంటుంబ నేపథ్యంనుంచి వచ్చి బ్యాంకింగ్ నేపథ్యం ఏమీ లేకుండానే దేశీయంగా టాప్ బ్యాంకర్‌గా ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. క్రికెట్లో రాణించాలనుకుని, తొలుత కుటుంబ వ్యాపారం, తదుపరి బ్యాంకింగ్ రంగంలోjకి ఎంట్రీ ఇచ్చి, ఎదురులేని లీడర్‌గా దూసుకుపోతూ ఒంటిచేత్తో కోటక్‌మహీంద్ర బ్యాంకును విజయ తీరాలకు నడిపించడమే కాదు, ప్రపంచంలోని అత్యంత సంపన్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచిన బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి తెలుసుకుందాం...! ఫోర్బ్స్ బిలియనీర్ 2023 జాబితా ప్రకారం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న బ్యాంకర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్. దేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ కూడా. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ఇండెక్స్ ప్రకారం, అతని నికర విలువ 14.8 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు). ఉదయ్ కోటక్ విజయ ప్రస్థానం 1959, మార్చి 15న పత్తి పరిశ్రమలో ఉన్న ఎగువ మధ్య తరగతికి చెందిన గుజరాతీ కుటుంబానికి చెందినవారు ఉదయ్ కోట్.ముంబైలోని సిడెన్హామ్ కాలేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీ, జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీజీ చేశారు. టాప్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పటికీ, తండ్రి ప్రోత్సాహంతో ఫ్యామిలీ వ్యాపారంలో ప్రవేశించారు. రీజినబుల్ రేట్లలో చిన్న చిన్న రుణాలివ్వడం ప్రారంభించారు. దేశ ఆర్థికపరిస్థితి క్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో 1985లో ఫైనాన్సింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒకవైపు లోన్లపై అధిక వడ్డీరేట్లు, మరోవైపు డిపాజిట్ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో ఒక విప్లవానికి బీజం పడింది. అతిస్వల్ప కాలంలోనే కేంద్ర బ్యాంకు ఆర్బీఐ నుంచి పూర్తి బ్యాంకింగ్ లైసెన్స్‌ని అందుకున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీగా అవతరించింది. ఆ తరువాత,బిల్ డిస్కౌంటింగ్, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోకి ప్రవేశించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 22 మార్చి 2003 న, భారత కార్పొరేట్ చరిత్రలో కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తొలి సంస్థగా అవతరించింది. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) క్రికెటర్ అయ్యేవాడిని భారతదేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ పురోగతికి ఉదయ్‌కోటక్ కృషి అమోఘం. తాను వ్యాపారవేత్తను కాకపోయి ఉండి ఉంటే క్రికెట్ ప్లేయర్‌గా ఉండేవాడిని అంటూ క్రికెట్‌పై తన ప్రేమను అనేక ఇంటర్వ్యూలలో వ్యక్తం చేశారు కోటక్ అలాగే గణితంలో మాంచి ప్రావీణ్యమున్న ఉదయ్ కోటక్ చిన్నతనంలో సితార్ వాయించేవారట. పెద్ద ఉమ్మడి కుటుంబంలో 60 మందితో ఉన్న ఇంట్లో సోషలిజాన్ని, పనిలో పెట్టుబడిదారీ విధానాన్ని నేర్చుకున్నానని చెబుతారు. ఆయన సతీమణి పేరు పల్లవి కోటక్. కుమారుడు జే కోటక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అలాగే బ్యాంకు, నియోబ్యాంక్ ప్లాట్‌ఫారమ్ 811కి కో-హెడ్‌గా కూడా పనిచేస్తున్నారు చిన్న కుమారుడు ధావల్ గత ఏడాది కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) నివేదికల ప్రకారం ఉదయ్ కోటక్ వార్షిక వేతనం 3.24 కోట్లు జీతం. అయితే కోవిడ్ కారణంగా మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరం కోటక్ వార్షిక వేతనం రూ.2.65 కోట్లకు పడిపోయిందని బ్లూమ్‌బెర్గ్ క్వింట్ తెలిపింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ 2022 చివరి నాటికి భారతదేశం అంతటా 1,752 శాఖలను కలిగి ఉంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర ఆదాయం 31శాతం ఎగిసి 27.9 బిలియన్ రూపాయలకు (337 మిలియన్ల డాలర్లు) చేరింది. కొత్త సీఈవో కోసం వేట, రేసులో కుమారుడు మరోవైపు ఆర్బీఐ మార్గదర్శకాలు ప్రకారం భారతీయ వ్యాపార అధిపతుల పదవీకాలాన్ని పరిమితం చేసిన తర్వాత, వచ్చే ఏడాది చివరి నాటికి బ్యాంకు సీఈవో పదవి నుండి వైదొలగాలని భావిస్తున్నారు . ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త శోధనకు గాను కన్సల్టింగ్ సంస్థ ఎగాన్ జెహెండర్ను నిమగ్నమైందని తెలుస్తోంది. గ్రూప్ ప్రెసిడెంట్లు, హోల్ టైమ్ డైరెక్టర్లు శాంతి ఏకాంబరం, కెవిఎస్ మణియన్తోపాటు, వారసుడు జేకోటక్ కూడా ఈ రేసులో ఉన్నట్టు సమాచారం. -
సామాన్యులకు ఆర్బీఐ మరో భారీ షాక్!
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో దఫా కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు– ప్రస్తుతం 6.25 శాతం)ను సమీప కాలంలో మరో పావుశాతం పెంచుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దీనితో ఈ రేటు 6.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలను వెలువరించారు. సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. తొలుత 6 శాతానికి, అటుపై నాలుగు శాతానికి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కృషి చేస్తామని బుధవారం పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కోటక్ ఉటంకించారు. ప్రపంచ పరిణామాలు, చమురు ధరలు తదితర అంశాలు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోందన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు సూచనలతో ఇతర సెంట్రల్ బ్యాంకులూ ఇదే అనుసరించడానికి సిద్ధమవుతున్నాయని అన్నారు. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్బీఐ మే నుంచి రెపో రేటును ఐదు దఫాల్లో 2.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఎకానమీ పురోగతికి అవకాశాలు... భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత గురించి కోటక్ మాట్లాడుతూ దేశం సుమారు 3.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని అన్నారు. మరింత పురోగతికి అవకాశాలు ఉన్నాయని సూచించారు. ప్రపంచంలోని మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా నిలిచేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రపంచ స్థాయి భారత్ కంపెనీలను అభివృద్ధి చేసే బాటలో, అత్యాధునిక ఉత్పత్తి ఆవిష్కరణలు, మేథో హక్కుల (ఐపీ) అభివృద్ధి సాధన, దీని ప్రాతిపదికన తయారీలో అంతర్జాతీయ స్థాయిని సాధించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. విధానాల అమలు ముఖ్యం: సంజీవ్ బజాజ్ కార్యక్రమంలో బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నిరంతర పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. కొత్త ఉత్పాదక సామర్థ్యాలను అభివృద్ధి చేసే అంశం... వాగ్దానాలకంటే విధానాల అమలుపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భారత్‌ను 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి సంబంధించి ఆయన నాలుగు కీలక సూచనలు చేశారు. పరిశ్రమ –వాణిజ్య విధానాల పరస్పర పురోగతికి చర్యలు, పటిష్ట ఫైనాన్షియల్ వ్యవస్థ స్థాపన, ప్రజల సామర్థ్యాన్ని పెంపొందించడానికి విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను పెంచడం, ఉత్పత్తి ఆధారిత స్కీమ్ (పీఎల్ఐ)ను కార్మిక ప్రభావిత రంగాలకు విస్తరించడం ద్వారా ఎకానమీలో తయారీ రంగం వాటా విస్తరణ వీటిలో ఉన్నాయి. -
Russia-Ukraine: భారత్‌పై కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ప్రముఖ కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ రష్యా - ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘర్షణ ఒక దేశానికి సంబంధించిన భౌగోళిక విషయాలను హైలైట్ చేస్తుంది అని అన్నారు. భారతదేశం 'ఆత్మనీర్భర్' లేదా స్వావలంబనగా మారాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. సైనిక సామగ్రి కోసం రష్యాపై భారతదేశం ఆధారపడటంతో ఉదయ్ కోటక్ ఈ వ్యాఖ్యలు చేశారు. "అణు సామర్ధ్యం కలిగిన చైనా, వైపు పాకిస్తాన్ దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రష్యన్ సైనిక పరికరాలపై మనం ఆధారపడటం శ్రేయస్కరం కాదు, అలాగే, మనకు అమెరికా చాలా దూరంలో ఉంది. కాబట్టి ప్రస్తుతం మనకు అనేక సవాళ్లు ఉన్నాయి. ఈ యుద్ధం ఖచ్చితంగా ఒక బోధించే విషయం: ఆత్మనీర్భర్ భారత్'గా మారాల్సిన సమయం అని!" కోటక్ తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశానికి అతిపెద్ద ఆయుధ సరఫరాదారులో రష్యా ఒకటి. గత ఏడాది డిసెంబర్ నెలలో భారత్, రష్యా మధ్య రక్షణ సహకారం కోసం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. Ukraine Russia conflict highlights that geography matters. For India, with China on one side and Pakistan on the other, both nuclear enabled, our dependence on Russian military equipment, and US far away, we have challenges. One thing this war teaches for sure : be Atmanirbhar! — Uday Kotak (@udaykotak) February 27, 2022 ఇటీవలే ఏకంగా రూ.35,000 కోట్ల విలువైన ఎస్-400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి సమకూర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా పేరున్న ఎస్-400 డీల్‌ను అమెరికా అభ్యంతరాలను తోసిరాజని మరీ ఓకే చేసుకుంది. దాంతోపాటు 6.1 లక్షల అత్యాధునిక ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల తయారీ ఒప్పందం కూడా ఇరు దేశాల మధ్య కుదిరింది. దీని విలువ రూ.5 వేల కోట్ల పైచిలుకే. రష్యాతో కలిసి యూపీలోని అమేథీ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లను తయారు చేస్తారు. (చదవండి: ఉక్రెయిన్ నుంచి మనవాళ్లు రావాలంటే.. ఇంత ఖర్చు అవుతుందా?) -
‘అదే జరిగితే బ్యాంకులకు తప్పని ముప్పు..!’
భారత్‌లో డిజిటల్ చెల్లింపులు భారీ ఎత్తున ఊపందుకున్నాయి. గత ఏడాది కాలంగా కార్డు పేమెంట్స్‌తో పోల్చుకుంటే డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోదీ కూడా వెల్లడించారు. ఇప్పుడు ఆయా డిజిటల్ చెల్లింపుల యాప్స్ టెక్నాలజీను అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు వెనకబడి ఉన్నాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ వెల్లడించారు. చిన్న చూపు తగదు..! గత రెండేళ్లుగా భారతీయ బ్యాంకర్లు డిజిటల్ చెల్లింపుల వ్యాపారాలను చిన్న చూపు చూసున్నాయని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) బ్లూమ్‌బెర్గ్ నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరమ్‌లో ఉదయ్ కోటక్ అన్నారు. 85 శాతం మార్కెట్ వాటాను పొందిన గూగుల్ పే, ఫోన్‌పే యాప్స్ ద్వారా యూపీఐ సేవలను ఆయా బ్యాంకులు అనుమతించినట్లు పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో సాంప్రదాయ మార్కెట్ల నుంచి పెద్దభాగంలో కస్టమర్లు బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో విఫలమైతే బ్యాంకులకు ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఫోన్‌పై,గూగుల్ పే అనుసరిస్తోన్న సాంకేతికతను వీలైనంత త్వరగా అందిపుచ్చుకుంటే మంచిందని, అందుకు కావాల్సిన వారిపై నియమాకాలను బ్యాంకులు చేపట్టాలని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాలను ఇచ్చేస్తాయి డిజిటల్ చెల్లింపుల యాప్స్ దూకుడు మీద ఉన్నాయి. దేశవ్యాప్తంగా గణనీయమైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. పేటీఎం లాంటి డిజిటల్ చెల్లింపుల యాప్ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పేరుతో సేవలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం గూగుల్ పే యూజర్లకు ఖాతాలను అందించే విషయంతో వెనకడుగు వేసింది. రానున్న రోజుల్లో ఆయా డిజిటల్ చెల్లింపుల యాప్స్ యూజర్లకు ఖాతాలను అందించే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రూ. 999కే ఆరోగ్య బీమా..! లాంచ్ చేసిన ఫోన్‌పే..! వివరాలు ఇవే..! -
పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..!
ఎన్నో ఆశల మధ్య భారత్‌లోనే అతి పెద్ద ఐపీవోగా వచ్చిన పేటీఎంకు మార్కెట్లలో చుక్కెదురైంది. గణనీయమైన నష్టాలను పేటీఎం చవిచూసింది. పేటీఎం ఐపీవో ధర రూ. 2,150 ప్రారంభం కాగా....సుమారు పేటీఎం షేర్లు సుమారు 27 శాతం రూ. 585కు పడిపోయి చివరికి షేర్ విలువ రూ.1564 కు చేరుకుంది. ఇన్వెస్టర్లు సుమారు రూ. 38 వేల కోట్ల మేర నష్టపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం రోజున మరోసారి కంపెనీ షేర్లు మరోసారి 10.35 శాతం మేర క్షీణించి రూ. 1402కు చేరుకుంది. చదవండి: పేటీఎంలో లావాదేవీలు రెట్టింపు మీరే కారణం..మీరే బాధ్యత వహించాలి..! పేటీఎం ఐపీవో అట్టర్‌ఫ్లాప్ కావడంతో తాజాగా ట్విటర్లో నెటిజన్లు ఒక వ్యక్తిపై విరుచుకుపడుతున్నారు. పేటీఎం ఒక్కో షేర్ ధరను తప్పుడు ప్రైజింగ్ ఇష్యూ చేసినందుకు మీరే బాధ్యత వహించాలని హర్షద్ షా అనే నెటిజన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్‌ను ట్విటర్లో ట్యాగ్ చేశారు. సుమారు రూ. 38 వేల కోట్లకు పైగా నష్టపోయినా ఇన్వెస్టర్లకు మీరే పరిహారం చెల్లించాలని కోరారు. దీంతో నెటిజన్లు ఉదయ్ కోటక్‌ను నిందిస్తూనే...ఈ గందరగోళానికి కోటక్ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. స్పందించిన ఉదయ్ కోటక్..! పేటీఎం ఐపీవో అట్టర్‌ఫ్లాప్ కావడం ఉదయ్ కోటక్ అనే భావనతో ట్విటర్లో నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు. కాగా ఈ విషయంపై ఉదయ్ కోటక్ ట్విటర్లో స్పందించారు. ఉదయ్ కోటక్ తన ట్విట్లో...మిస్టర్ షా దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. పేటీఎం ఇష్యూ ధరను కోటక్ నిర్థారించలేదంటూ అన్నారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఐపీవోకు వచ్చిన జోమాటో, నైకా కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లీడ్ మేనేజర్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. ఉదయ్ కోటక్ జొమాటో షేర్ ఇష్యూ ధర రూ. 76గా నిర్ణయించగా ఇప్పుడు అది రూ. 150 ఉందని, నైకా షేర్ ఇష్యూ ధరను రూ.1125ను నిర్ణయించగా అది రూ.2100 చేరిందని ఉదయ్ కోటక్ బదులిచ్చారు. ఈ విషయంలో ఉదయ్ కోటక్‌కు హర్షద్ షా వారిని క్షమాపణలను కోరారు. Mr. Shah please get your facts right. Kotak did not lead manage Paytm. Kotak did lead manage Zomato at issue price 76( current market price 150), Nykaa at issue price 1125(current market price 2100). https://t.co/0G5SJeslkz — Uday Kotak (@udaykotak) November 22, 2021 చదవండి: పేటీఎం అట్టర్ ప్లాప్‌షో.. 63 వేల కోట్లు మటాష్! ఇన్వెస్టర్లు లబోదిబో -
ఎకానమీని గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్!?
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్ తప్పదని భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. దిగువ మధ్య తరగతి సమాజాన్ని అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతను ఇవ్వడానికి సహాయక ప్యాకేజ్ని ప్రకటించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చిన్న పరిశ్రమలకు హామీ రహిత రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇచ్చే పరిమాణాన్ని రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచే విషయాన్ని పరిశీలించాలని ఒక ఇంటర్వ్యూలో కోరారు. కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్‌లో భాగంగా గత ఏడాది రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ ఏప్రిల్, మే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపివేసిందని కొటక్ అన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో లోబేస్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను కొటక్ ప్రస్తావిస్తూ, ‘‘నిజానికి బేస్ ఎఫెక్ట్‌తో చూసుకున్నా, వృద్ధి రెండంకెల దిగువనే నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితిని వేచి చూడాల్సి ఉంది’’ అని అన్నారు. ఇప్పటికి ప్యాకేజ్‌లు ఇలా... 2020లో కేంద్రం కరోనాను ఎదుర్కొనడానికి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ని ప్రకటించింది. ఈ విలువ రూ. 27.1 లక్షల కోట్లు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ విలువ 13 శాతం అని కేంద్రం ప్రకటించినప్పటికీ, ద్రవ్య పరంగా ఇది 2 శాతం దాటబోదని అంచనా. మిగిలినదంతా రుణ రూపంలో సమకూర్చినదేనన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రూ. 30 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీలను దశలవారీగా ప్రకటించింది. ఈ మొత్తం జీడీపీలో దాదాపు 15%. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నివేదిక విడుదల చేస్తూ, భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమేనని పేర్కొంది. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయని విశ్లేషించింది. లాక్డౌన్లు సడలించే సమయంలో ప్రకటించే అవకాశం: బెర్న్‌స్టెయిన్ సెకండ్ వేవ్ కట్టడికి వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న లాక్డౌన్లు, సంబంధిత ఆంక్షలు సడలించే సమయంలో కేంద్రం మరోదఫా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ అంచనావేసింది. ఏప్రిల్, మే నెలల్లో భారత్ ఆర్థిక క్రియాశీలత తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని తన సూచీలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఇంధన వినియోగం, విద్యుత్ డిమాండ్, ఈ–వే బిల్లులు, పారిశ్రామిక ఉత్పత్తి వంటి అంశాల్లో ప్రతికూల గణాంకాలు నమోదవుతున్నట్లు వివరించింది. అలాగే సరఫరాల సమస్యలూ తీవ్రమైనట్లు పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం పరిస్థితులు కొంత అదుపులో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సెకండ్‌వేవ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా, అది మొదటివేవ్ అంత తీవ్రంగా లేదని విశ్లేషించింది. -
క్రికెట్ బాల్ దెబ్బ- ఉదయ్ కొటక్‌కు భలే ప్లస్
ముంబై, సాక్షి: విధి చేసే విచిత్రాలు ఒక్కొక్కప్పుడు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఒకప్పుడు ప్రొఫెషనల్ క్రికెటర్కావాలని కన్న కలలు బాల్ దెబ్బకు ఆవిరికాగా.. తదుపరి ఫైనాన్షియల్ రంగంవైపు అడుగులేసేందుకు దోహదపడింది. ఫలితంగా ప్రస్తుతం ప్రపంచంలోనే సంపన్న బ్యాంకర్‌గా ఆ వ్యక్తి ఆవిర్భవించారు. ఆయన పేరు ఉదయ్ కొటక్. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవోగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. మరణం అంచులవరకూ క్రికెట్ బాల్ వల్ల తలకు దెబ్బ తగలడంతో 20 ఏళ్ల వయసులో ఉదయ్ కొటక్‌కు అత్యవసర సర్జరీ చేశారు. మరణం అంచులవరకూ వెళ్లడంతో ఆపై ఆయన క్రికెట్ ఆశలు అడియాసలయ్యాయి. అయితే ఇది ఆయనకు ఎంతో మేలు చేసిందంటున్నారు విశ్లేషకులు. క్రికెట్ ఆశయాలను వీడి కుటుంబీకులు నిర్వహిస్తున్న కాటన్ బిజినెస్‌లో ఉదయ్ కొటక్ ప్రవేశించారు. ఆపై జమన్‌లాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఎంబీఏ డిగ్రీ చేశారు. తదుపరి 1985లో 26 ఏళ్ల వయసులో ఫైనాన్స్ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయ్ కొటక్ సంపద 16 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 1.17 లక్షల కోట్లు)గా బ్లూమ్‌బెర్గ్ అంచనా. సవాళ్ల కాలంలోనూ కొన్నేళ్లుగా ఎన్బీఎఫ్సీ, బ్యాంకింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. పలు సంస్థలు మొండిబకాయిలతో డీలాపడగా, కొన్ని కంపెనీలను కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలు కుంగదీస్తున్నాయి. దీనికితోడు ఇటీవల కోవిడ్-19 కారణంగా ఫైనాన్షియల్ రంగం పలు ఇబ్బందుల్లో పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే రిస్కులు అధికంగా ఉన్న రంగాలకు తక్కువ రుణ మంజూరీ, పారదర్శక పాలన వంటి కార్యకలాపాలతో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొందినట్లు తెలియజేశారు. ఇటీవల నిధుల సమీకరణ ద్వారా బ్యాలన్స్‌షీట్‌ను పటిష్టపరచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) షేరు జూమ్ ఈ ఏడాది ఇప్పటివరకూ కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు 17 శాతం బలపడింది. ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ఇది అత్యధికంకాగా.. ప్రస్తుతం షేరు రూ.1940 వద్ద ట్రేడవుతోంది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తాజాగా రూ. 3.84 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా రెండో పెద్ద బ్యాంక్‌గా నిలుస్తోంది. గత మూడేళ్లలోనూ కొటక్ బ్యాంక్ షేరు 24 శాతం చొప్పున ర్యాలీ చేయడం విశేషం! 2020లో మొండి రుణాల విషయంలో రెండో ఉత్తమ బ్యాంకుగా నిలిచినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో పటిష్ట సీఏఆర్‌ను కలిగి ఉన్నట్లు తెలియజేశాయి. ఇటీవలే ఉదయ్ కొటక్ సీఈవో పదవీకాలం పొడిగింపునకు ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అంతేకాకుండా బ్యాంకుల వ్యవస్థాపకులు వాటాను పెంచుకునేందుకూ ఆర్బీఐ ఇటీవల ప్రతిపాదించడంతో ఈ కౌంటర్‌కు బూస్ట్ లభించినట్లు వివరించారు. (యాక్సెంచర్ పుష్- ఐటీ షేర్లు గెలాప్) మహీంద్రాతో జట్టు 1985లో పశ్చిమ గుజరాత్లో కుటుంబీకులు, స్నేహితులు అందించిన రూ. 30 లక్షల రుణాలతో కొటక్ ఫైనాన్షియల్ సేవల కంపెనీని ప్రారంభించారు. 1986లో డైవర్సిఫైడ్ దిగ్గజం మహీంద్రా గ్రూప్‌తో కొటక్ జత కట్టారు. ఫలితంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్థానానికి బీజం పడింది. తొలుత బిల్ డిస్కౌంటింగ్‌తో ప్రారంభమై, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బీమా, మ్యూచువల్ ఫండ్స్ తదితరాలకు కార్యకలాపాలు విస్తరించింది. 2003కల్లా ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ లైసెన్స్‌ను పొందింది. అయితే బ్యాంకు నిర్వహణలో కుటుంబీకులకు కాకుండా ప్రొఫెషనల్స్‌కే చోటివ్వడం ద్వారా ఉదయ్ కొటక్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పొందుతూ వచ్చారని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. -
కోటక్ బ్యాంక్ ఎమ్డీ ఉదయ్ కోటక్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎమ్‌డీగా ఉదయ్ కోటక్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. మరో మూడేళ్ల పాటు ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగుతారు. కోటక్ ఇప్పటికే గత 17 సంవత్సరాలుగా కోటక్ మహీంద్రా బ్యాంక్ అధిపతిగా పనిచేశారు. ప్రకాష్ ఆప్టేను పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా, దీపక్ గుప్తాను జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని కోటక్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 జనవరి నుంచి ఈ నియామకాలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. (జియోకు వ్యతిరేకంగా విష ప్రచారం!) (చదవండి : స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్) -
అది ‘బ్యాడ్’ ఐడియా..!
న్యూఢిల్లీ: కొన్ని కీలక అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా మొండిబాకీల వసూళ్ల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ (బ్యాడ్ బ్యాంక్) ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ‘వ్యవస్థ స్థాయిలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రెండు, మూడు కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్‌కు ఏ రేటుకు విక్రయిస్తారనేది మొదటి అంశం. పారదర్శకంగా, సముచితమైన విధంగా విలువను నిర్ధారించడం జరగాలి. ఇక బ్యాడ్ బ్యాంక్ గవర్నెన్స్‌పై అత్యంత స్పష్టత ఉండాలి. చివరిగా రికవరీ రేటు ఎలా ఉంటుందనే దానిపైనా స్పష్టత ఉండాలి. ఇదంతా ప్రజాధనం. రికవరీ బాగా ఉంటుందంటే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే అర్థం లేదు’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా సోమవారం కొటక్ తెలిపారు. గతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కూడా ఇలాగే మొండి బాకీల వసూలు కోసం స్ట్రెస్డ్ అసెట్స్ స్థిరీకరణ ఫండ్ (ఎస్‌ఏఎస్‌ఎఫ్) ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2004–05లో ఏర్పాటైన ఎస్‌ఏఎస్‌ఎఫ్‌కు 636 మొండి పద్దులకు సంబంధించి సుమారు రూ. 9,000 కోట్ల ఎన్పీఏలను బదలాయించారు. 2013 మార్చి ఆఖరునాటికి దీని ద్వారా సగానికన్నా తక్కువగా కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఎన్పీఏల రికవరీకి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మూడు–నాలుగేళ్లకోసారి తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా గత నెలలో జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కార్పొరేట్లు మారాలి..: ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా దేశీ కార్పొరేట్లు ఆలోచనా ధోరణిని కొంత మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని కొటక్ చెప్పారు. పెట్టుబడుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. స్థాయికి మించిన రుణాలు లేని కంపెనీలు ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలోనూ కనిపిస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కొటక్ సూచించారు. కొత్తగా వ్యూహాత్మక రంగాల్లో సాహసోపేతంగా మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్నారు. కరోనా పరిణామాలతో గణనీయంగా కన్సాలిడేషన్ జరగవచ్చని, పలు రంగాల్లో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మిగలవచ్చని కొటక్ చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నిర్వహణ వ్యయాలు, తక్కువ రుణభారం ఉన్న సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయని విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యంపై పెట్టుబడులు పెరగాలి.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే వైద్యం, విద్య, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని కొటక్ తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3%గా ఉన్న వైద్య రంగ పెట్టుబడులు కనీసం 5 నుంచి 10%కి పెరగాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్లు ఉండాలని కొటక్ సూచించారు. -
టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుంది: ఉదయ్ కొటక్
ముంబై: కరోనా ఉదృతి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పందిస్తూ.. కరోనా వల్ల అన్ని దేశాల అభిప్రాయాలు మారవచ్చని.. అది భారత్‌కు నూతన అవకాశాలకు మార్గం సుగుమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభ సమయంలో దేశీయ టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ కంపెనీలు భారతీయ యువతను నియమించుకోవాలని సూచించారు. టెక్ దిగ్గజం గూగుల్ లాక్డౌన్ నేపథ్యంలో అమెరికన్ ఇంజనీర్లకు రూ. 2లక్షల డాలర్లు చెల్లిస్తుందని.. అదే భారతీయ యువతను నియమిస్తే తక్కువ వేతనంతో నైపుణ్యంతో పనిచేస్తారని తెలిపారు. అయితే దేశీయ యువతను తక్కువ చేసే ఉద్దేశ్యం తనకు లేదని.. ప్రపంచ సంక్షోభ నేపథ్యంలో తక్కువ వేతనంతో కంపెనీలకు అత్యుత్తమ నైపుణ్యంతో కూడిన ఉద్యోగులు లభిస్తారని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా పీఎమ్ కేర్స్ పండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు బాధ్యతగా విరాళాలు ఇచ్చారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ సర్వే ప్రకారం 100 అత్యుత్తమ బ్యాంక్‌లో కొటక్ మహీంద్రా బ్యాంక్ పేరు నమోదవ్వడం విశేషం. చదవండి: వృద్ధి కథ.. బాలీవుడ్ సినిమాయే! -
కోటక్ బ్యాంక్ లాభం రూ. 1,905 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) మార్చి క్వార్టర్లో రూ.1,905 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం(రూ.2,038 కోట్లు)తో పోల్చితే 7 శాతం క్షీణించిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. కేటాయింపులు బాగా పెరగడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. మరిన్ని వివరాలు..... ► గత క్యూ4లో స్టాండ్అలోన్ నికర లాభం 10 శాతం తగ్గి రూ.1,267 కోట్లకు చేరింది. హా నికర వడ్డీ ఆదాయం రూ.3,036 కోట్ల నుంచి రూ. 3,560 కోట్లకు పెరిగింది. 4.72 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించింది. ► స్థూల మొండి బకాయిలు 2.14 శాతం నుంచి 2.25 శాతానికి పెరిగాయి. కేటాయింపులు రూ.171 కోట్ల నుంచి రూ. 1,047 కోట్లకు పెరిగాయి. కరోనా కేటాయింపులు కూడా దీంట్లో ఉన్నాయి. ► 2019–20 పూర్తి ఏడాదికి నికర లాభం 10% ఎగసి రూ.5,947 కోట్లకు పెరిగింది. రుణాలు 6%, డిపాజిట్లు 20% ఎగిశాయి. ► కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో సెక్యూరిటీలేని క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణాల బకాయిలు పేరుకుపోతున్నాయని, ఇది తమ రుణ నాణ్యతపై తీవ్రంగానే ప్రభావం చూప నున్నదని బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. ► ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 2.3 శాతం లాభంతో రూ. 1,186 వద్ద ముగిసింది. -
వృద్ధి కథ.. బాలీవుడ్ సినిమాయే!
ముంబై: మన దేశ వృద్ధి కథ అచ్చం బాలీవుడ్ సినిమాలాగానే ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. భారత్‌లోని ప్రస్తుత ఆరి్థక పరిస్థితులు సినిమాను తలపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆరంభంలో ప్రేమ కధలాగానే వృద్ది జోరుగానే మొదలైందని, ఆ తర్వాత మందగమనం రూపంలో విలన్ ఎదురయ్యాడని, దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని వివరించారు. ఈ మందగమన విలన్‌ను ఎదుర్కొనడానికి భారత్ తన ప్రయత్నాలు తాను చేయాలని సూచించారు. తర్వాత తర్వాత పరిస్థితులు చక్కబడుతాయని పేర్కొన్నారు. సినిమాలు సుఖాంతమైనట్లే, మన వృద్ధి కథ కూడా శుభప్రదంగానే ఉంటుందని చెప్పారు. ప్రస్తుత ఆరి్థక స్థితిగతులు సమస్యాత్మకంగానే ఉన్నప్పటికీ, అందరూ భయపడుతున్నంత అధ్వానంగా మాత్రం లేవని వివరించారు. ఒక ఎంటర్ప్రెన్యూర్ కళ్లతో చూస్తే, భారత వృద్ధి కధ గగుర్పొడిచేలా ఉందని పేర్కొన్నారు. మీరు చేస్తున్న పనినే కొనసాగించండి. సరైన సమయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైతే, దీర్ఘకాలంలో మంచి ఫలితాలే పొందవచ్చని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. ఏ దేశమూ ఇవ్వనన్ని గొప్ప అవకాశాలు భారత్‌లో కోకొల్లలుగా ఉన్నాయని వివరించారు. భారత్‌లో ఇలాంటి మందగమన పరిస్థితులు సాధారణమేనని, ప్రతి కొన్నేళ్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. సాధారణంగా 8తో ముగిసే సంవత్సరాల్లో సంక్షోభాలు వచ్చాయని పేర్కొన్నారు. 1998లో ఆసియా సంక్షోభం తర్వాత భారత్‌లో ఆరి్థక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేశారు. 2008లో అంతర్జాతీయంగా ఆరి్థక సంక్షోభం అతలాకుతలం చేసిందని, 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభంతో ముసలం మొదలైందని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. -
వచ్చే ఆరు నెలలు కీలకం
దేశీయ ఆర్థిక సేవల రంగంలో తీవ్రమైన లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొందన్నారు ప్రముఖ వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంకు అధినేత ఉదయ్ కోటక్. దేశీయ ఆర్థిక సేవల రంగం ఇప్పటికే సవాళ్లతో కూడిన కాలంలో ప్రయాణం చేస్తోందని, రానున్న రెండు త్రైమాసికాల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్లిష్ట సమయాల్లో నిలదొక్కుకునేందుకు బ్యాలన్స్ షీట్లు బలంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ‘‘ఆర్థిక సేవల రంగంలో ఎన్నో సవాళ్లతో కూడిన కాలం మధ్యలో ఉన్నాం. ఈ రంగంలోని భిన్న విభాగాలు ఏ విధంగా రూపుదిద్దుకుంటాయనే విషయంలో వచ్చే కొన్ని నెలలు ఎంతో కీలకం’’ అని కోటక్ మహీంద్రా బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాల ప్రకటన సందర్భంగా మీడియాతో ఉదయ్ కోటక్ అన్నారు. యస్ బ్యాంకు కొత్త సీఈవో రవనీత్ గిల్ బ్యాంకు రుణ పుస్తకంలో స్టాండర్డ్ ఆస్తుల్లో (ప్రామాణిక రుణాలు) రూ.10వేల కోట్లు ఎన్పీఏలుగా రానున్న త్రైమాసికాల్లో మారే రిస్క్ ఉందంటూ, రూ.2,100 కోట్ల మేర కంటింజెన్సీ ప్రొవిజన్ పేరుతో పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. దీంతో యస్ బ్యాంకు చరిత్రలో మొదటి సారి ఓ త్రైమాసికంలో రూ.1,500 కోట్ల నష్టాన్ని ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ లిక్విడిటీపై చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. బ్యాలన్స్ షీట్లకే పరీక్ష ‘‘ఫైనాన్షియల్ కంపెనీల బ్యాలన్స్ షీట్లు నాణ్యంగా ఉంచుకోవాల్సిన కీలకమైన సమయం. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కు అసలైన పరీక్ష బ్యాలన్స్ షీటే’’ అని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. మార్కెట్లు లాభాలపై దృష్టి పెట్టడం కాకుండా ఆయా సంస్థలు క్లిష్ట సమయాల్లో నిలబడగలిగే బలమైన బ్యాలన్స్ షీట్లతో ఉన్నాయా అన్నదే చూడాలన్నారు. నోట్ల రద్దుతో ఎక్కువగా ప్రయోజనం పొందింది ఆర్థిక సేవల రంగమేనని, భారీ స్థాయిలో నిధులు బ్యాంకుల్లోకి, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లోకి ప్రవేశించినట్టు చెప్పారు. అయితే, ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ఈ నిధులు ద్రవ్యత్వం లేని ఆస్తులైన భూములు, రియల్ ఎస్టేట్‌వైపు వెళ్లిపోయాయన్నారు. దీన్ని అవివేకంగా ఉదయ్ కోటక్ అభివర్ణించారు. ఒక్కసారి నిధుల లభ్యత కఠినంగా మారితే ఈ తరహా ఆస్తులకు మరింత ఇబ్బంది (వెంటనే నగదుగా మార్చుకోలేని పరిస్థితులు) ఏర్పడుతుందన్నారు. ఆర్థిక రంగాన్ని కల్లోల పరిస్థితుల నుంచి సురక్షిత జలాల వైపు తీసుకెళ్లేందుకు విధాన నిర్ణేతలు, ప్రాక్టీషనర్లు దృఢంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలను ఎదుర్కొంటున్న వాటికి మూలనిధులను అందించడం లేదా కన్సాలిడేషన్ ఉత్తమ పరిష్కారంగా సూచించారు. -
కాంగ్రెస్ అభ్యర్థికి ముఖేష్ అంబానీ బాసట
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దియోరకు మద్దతు ఇచ్చారు. మిలింద్ దక్షణ ముంబైకి సరైన నాయకుడని అంబానీ చెబుతున్న వీడియోను కాంగ్రెస్ అభ్యర్థి ట్వీట్ చేశారు. దక్షిణ ముంబై నుంచి పది సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన మిలింద్ దియోర ఈ నియోజకవర్గ సామాజికార్థిక సాంస్కృతిక వ్యవహారాలపై లోతైన అవగాహన ఉందని ఈ వీడియోలో అంబానీ చెప్పుకొచ్చారు. మరోవైపు కొటాక్ మహింద్ర బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ కూడా మిలింద్ అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఈ వీడియోలో కనిపించారు. దియోర ముంబైకి సరైన ప్రాతినిధ్యం వహించే వ్యక్తని కొనియాడారు. ముంబైలో వ్యాపారాలను పూర్వపు స్థితికి తీసుకురావడం, మన యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి తేవడం అవసరమని పేర్కొంటూ దియోర దీటైన వ్యక్తని ఉదయ్ కొటక్ ప్రశంసించారు. ఏప్రిల్ 29న జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో దియోర శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్‌తో తలపడుతున్నారు. -
నోట్ల రద్దు సరిగ్గా అమలు కాలేదు
ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కూడా దీనిపై గళమెత్తారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సరిగ్గా అమలు చేయలేదని.. దీన్ని మెరుగైన ప్రణాళికతో చేసిఉంటే ఫలితాలు విభిన్నంగా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘డీమో’పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కూడా తన పుస్తకంలో డీమోను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా, నోట్ల రద్దువల్ల చిన్న వ్యాపారాలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. అయితే, వీటి పునరుత్తేజానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ‘డీమో విషయంలో చిన్న విషయాలను పట్టించుకొని, ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉండాల్సింది. దీనివల్ల మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు.. దీనికంటే అధిక విలువగల రూ.2,000 నోట్లను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా అమలు చేయడంలో వ్యూహం కూడా సరిగ్గా లేదు. భారీ స్థాయిలో నోట్లను రద్దు చేయాలని అనుకున్నప్పుడు, అందుకు తగ్గట్లుగా సరైన విలువ(డినామినేషన్) గల నోట్లను అంతే స్థాయిలో ఎందుకు అందుబాటులో ఉంచలేదు. ఇలాంటి అంశాలన్నింటినీ పట్టించుకుంటే ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. అయితే, డీమోతో ఫైనాన్షియల్ రంగానికి మాత్రం చాలా మేలు జరిగింది, నమ్మశక్యం కానంతగా పొదుపు పెరిగింది’ అని కోటక్ అభిప్రాయపడ్డారు. -
వివేకంతోనే బ్యాంకుల్లో గుడ్ గవర్నెన్స్
ముంబై: బ్యాంకర్లు వివేకవంతంగాను, అణకువగాను వ్యవహరించినప్పుడు.. నిబంధనలను సరళంగాను ఉంచగలిగినప్పుడే బ్యాంకుల్లో గుడ్ గవర్నెన్స్ అమలు కాగలదని ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. అంతే తప్ప, బ్యాంకులు సరిగ్గా పనిచేయాలంటే పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉండాలనో లేదా యాజమాన్యం ఏ ఒక్కరికో పరిమితం కాకుండా పలువురి చేతుల్లో ఉండాలనో అనుకుంటే అమాయకత్వమే అవుతుందన్నారు. షేర్హోల్డర్లకు పంపిన వార్షిక సందేశంలో కొటక్ ఈ విషయాలు వివరించారు. ఒకవైపు ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీఈవో చందా కొచర్ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారన్న ఆరోపణలు, మరోవైపు ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 14,000 కోట్ల స్కామ్ బైటపడటం వంటి పరిణామాల నేపథ్యంలో కొటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చట్టాల్లో స్ఫూర్తిని గ్రహించి అమలు చేయడం ద్వారా బ్యాంకింగ్ రంగం మళ్లీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలదని ఆయన పేర్కొన్నారు. -
కార్పొరేట్ గవర్నెన్స్ కట్టుదిట్టం!
ముంబై: కంపెనీల్లో కార్పొరేట్ నైతికతను (గవర్నెన్స్) మరింత కట్టుదిట్టం చేసేలా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక సంస్కరణలకు తెరతీసింది. దీనికి సంబంధించి ఉదయ్ కోటక్ కమిటీ చేసిన సిఫార్సులను బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదించింది. అదే విధంగా లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును రెండుగా విభజించడం, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పథకాలపై అదనపు చార్జీలను తగ్గించడం, ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత పటిష్టం చేయడం, కంపెనీల టేకోవర్ నిబంధనల్లో సవరణలు, స్టార్టప్‌లకు మరిన్ని నిధులు వచ్చేలా చూడటం వంటి పలు ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. 80లో 40 సిఫార్సులకు పూర్తిగా ఆమోదం... కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి కోటక్ కమిటీ మొత్తం 80 సిఫార్సులు చేయగా... వాటిలో 80 శాతాన్ని సెబీ ఆమోదించింది. 40 సిఫార్సులనైతే యథాతథంగా ఆమోదించామని బోర్డు సమావేశం అనంతరం సెబీ చైర్మన్ అజయ్ త్యాగి విలేకరులతో చెప్పారు. మరో 15 సిఫార్సులను కొద్ది మార్పులతో ఆమోదించామన్నారు. ఇక ఎనిమిదింటిని ప్రభుత్వ, ఇతర విభాగాల పరిశీలనకు పంపామని, 18 సిఫార్సులను పక్కనబెట్టామని వెల్లడించారు. కీలక సమాచారాన్ని ప్రమోటర్లు, ముఖ్యమైన ్న షేర్హోల్డర్లతో పంచుకునే ప్రతిపాదన వంటివి పక్కనబెట్టినవాటిలో ఉన్నాయి. సెబీ ఆమోదించిన నిర్ణయాలివీ... ♦ లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును సీఈఓ/ఎండీ, చైర్మన్‌గా విభజించనున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) ఆధారంగా టాప్– 500 లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తారు. ♦ 2019 ఏప్రిల్ 1 కల్లా టాప్–500 లిస్టెడ్ కంపెనీలన్నీ కచ్చితంగా కనీసం ఒక స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ను నియమించాల్సి ఉంటుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి టాప్–1000 లిస్టెడ్ కంపెనీలకు దీన్ని అమలు చేస్తారు. ♦ టాప్–1000 లిస్టెడ్ కంపెనీల్లో 2019 ఏప్రిల్ 1 నుంచి కనీసం ఆరుగురు డైరెక్టర్లు ఉండాలి. 2020 ఏడాది ఏప్రిల్1 నుంచి ఈ నిబంధనను టాప్–2000 లిస్టెడ్ కంపెనీలకు వర్తింపజేస్తారు. ♦ ఒక వ్యక్తి ఎనిమిది లిస్టెడ్ కంపెనీల వరకూ మాత్రమే డైరెక్టర్‌గా ఉండొచ్చుననే నిబంధన ఏప్రిల్ 1, 2019 నుంచి అమల్లోకి వస్తుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి దీన్ని ఏడుకు తగ్గిస్తారు. ప్రస్తుతం ఒక వ్యక్తి 10 కంపెనీల్లో డైరెక్టర్ పదవిలో ఉండేందుకు అవకాశం ఉంది. ♦ స్వతంత్ర డైరెక్టర్ల అర్హత , ఆడిట్, రెమ్యూనరేషన్ (పారితోషికం), రిస్క్ మేనేజ్మెంట్ కమిటీల్లో మరింత పాత్ర ఉండేవిధంగా నిబంధనల్లో మార్పు చేశారు. లిస్టింగ్ నిబంధనలు కఠినతరం... స్టాక్ మార్కెట్లో కంపెనీల లిస్టింగ్ నిబంధనలను కూడా సెబీ మార్చనుంది. ముఖ్యంగా ప్రమోటర్ల వాటాలను ఫ్రీజ్ చేయడం, నిబంధనలను సరిగ్గా పాటించని కంపెనీల షేర్లలో ట్రేడింగ్ సస్పెండ్ చేయటం వంటి కఠిన చర్యలు ఇందులో ఉన్నాయి. ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు కూడా సెబీ కార్యాచరణను ప్రకటించింది. స్టాక్ డెరివేటివ్స్‌లో ఫిజికల్ సెటిల్మెంట్ను విడతలవారీగా ఒక క్రమపద్ధతిలో అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్, ప్రిఫరెన్షియల్ ఇష్యూల ద్వారా సమీకరించే నిధులను ఎలా వినియోగించారనే సమాచారాన్ని కంపెనీలు ఇకపై కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఆడిటర్ల వివరాలు, వాళ్లకిచ్చే ఫీజు, రాజీనామా చేస్తే దానికి గల కారణాలతో పాటు డైరెక్టర్ల నైపుణ్యం, అనుభవం వంటి అంశాలన్నీ కంపెనీలు కచ్చితంగా బహిర్గతం చేయాలి. లిస్టెడ్ కంపెనీలు, వాటికి సంబంధించిన అన్‌లిస్టెడ్ సంస్థల్లో సెక్రటేరియల్ ఆడిట్ కూడా ఇకపై తప్పనిసరి కానుంది. అదేవిధంగా లిస్టెడ్ కంపెనీలన్నీ 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి కన్సాలిడేటెడ్ త్రైమాసిక ఫలితాలను కచ్చితంగా ప్రకటించాల్సి ఉంటుంది. కంపెనీల విలీనాలు, టేకోవర్ ఒప్పందాల విషయంలో కంపెనీలు తమ ఓపెన్ ఆఫర్ ధరను పెంచేందుకు వీలుగా అదనపు గడువును ఇచ్చేందుకు కూడా సెబీ ఓకే చెప్పింది. ‘దివాలా’ కంపెనీలకు కఠిన నిబంధనలు..! దివాలా చట్టం (ఐబీసీ) ప్రకారం ఈ ప్రక్రియలో ఉన్న లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి నిబంధనలను సవరించాలని సెబీ నిర్ణయించింది. సంబంధిత కంపెనీల్లో కనీస పబ్లిక్ వాటా, ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్, ప్రమోటర్ల పునర్విభజన వంటి అంశాల్లో అదనంగా మరింత సమాచారాన్ని వెల్లడించడం వంటివి ఇందులో ఉన్నాయి. బోర్డు సమావేశం తర్వాత దీనికి సంబంధించి చర్చా పత్రాన్ని విడుదల చేసింది. మొండిబకాయిల సమస్య కారణంగా ఇటీవలి కాలంలో దివాలా చట్టం కింద పరిష్కార కేసులు పెరిగిపోవడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. ఇక కంపెనీలు రుణ బకాయిల చెల్లింపులో విఫలమైతే(డిఫాల్ట్) ఒక్కరోజులోపే(పనిదినం) దీన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించాలని గతంలో విధించిన నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని త్యాగి చెప్పారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చినప్పటికీ బ్యాంకుల అభ్యర్థన మేరకు వెంటనే దీన్ని సెబీ వాయిదా వేసింది. ఫండ్స్‌లో అదనపు చార్జీలకు కోత.. మ్యూచువల్ ఫండ్ సలహా కమిటీ (ఎంఏఏసీ) సిఫార్సులు, గణాంకాల ఆధారంగా ఎం ఎఫ్ స్కీములపై ఇప్పుడున్న 20 బేసిస్ పాయింట్ల అదనపు చార్జీలను 5 బేసిస్ పాయింట్లకు (గరిష్ట పరిమితి) తగ్గిస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఎంఎఫ్ స్కీములకు సంబంధించి 5 శాతం ఎగ్జిట్ లోడ్‌కు బదులుగా రోజువారీ నికర అసెట్ విలువపై (ఏఎన్వీ) 20 బేసిస్ పాయింట్ల వరకూ అదనపు చార్జీలను ఫండ్ సంస్థలు వసూలు చేసేందుకు గతంలో సెబీ అనుమతించింది. అయితే, ఫండ్ ఫథకాలను మరింత మందికి చేరువ చేయడం కోసం ఇప్పుడీ అదనపు చార్జీలో 15 బేసిస్ పాయింట్లను తగ్గించాలని నిర్ణయించింది. 100 బేసిస్ పాయింట్లను 1%గా లెక్కిస్తారు. కో–లొకేషన్ ఇక అందరికీ... స్టాక్ ఎక్సే్ఛంజీలు తమ ట్రేడింగ్ సభ్యులందరికీ కో–లొకేషన్ సదుపాయాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సెబీ స్పష్టం చేసింది. అదేవిధంగా కొన్ని సేవలను ఉచితంగా కూడా అందించాలని పేర్కొంది. ఎక్సే్ఛంజీలు కల్పిస్తున్న కో–లొకేషన్ సదుపాయం వల్ల ట్రేడింగ్ డేటా వేగంగా ట్రాన్స్ఫర్ అయ్యే వీలుంటుంది. నాన్ కో–లొకేటర్ సభ్యులకు (బ్రోకరేజీ సంస్థలు) ఈ అవకాశం లేదు. కో–లొకేషన్ సేవల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో (సర్వర్ల వాడకం, ఇతరత్రా చార్జీలు) చిన్న బ్రోకరేజీ సంస్థలకు ఇది అందుబాటులో లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇకపై కో–లొకేషన్ సదుపాయాన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలే ఏర్పాటు చేసి... దీన్ని సభ్యులందరికీ షేరింగ్ పద్ధతిలో అందించాలని సెబీ స్పష్టంచేసింది. దీనివల్ల వ్యయం 90%పైగానే తగ్గుతుందని అంచనా. తద్వారా మరిన్ని బ్రోకరేజీ సంస్థలు దీన్ని వినియోగించుకుని ట్రేడింగ్ వ్యవస్థలో డేటా ట్రాన్స్ఫర్ వేగంలో జాప్యాన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఆల్గోరిథమ్ ఆధారిత ట్రేడింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంబంధిత సాఫ్ట్వేర్ ఉపయోగించే సంస్థలు దీన్ని పరీక్షించుకోవడం కోసం సిమ్యులేటెడ్ మార్కెట్ పరిస్థితులను అందుబాటులో ఉంచాలని సెబీ పేర్కొంది. స్టార్టప్‌లకు బూస్ట్... దేశంలో ఆరంభస్థాయిలో ఉన్న స్టార్టప్‌లకు మరింత ఊతమిచ్చేలా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. వెంచర్ క్యాపిటల్ సంస్థలకు సంబంధించిన స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) పెట్టుబడి నిధుల గరిష్ట పరిమితిని ఇప్పుడున్న రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏఐఎఫ్ నిబంధనలకు సవరణలను ఆమోదించింది. కనీస పెట్టుబడి పరిమితి మాత్రం ఇప్పుడున్న రూ.25 లక్షలుగానే కొనసాగుతుంది. -
ఈసారి చిన్న సంస్థల వంతు..!
ముంబై: మొండిబాకీల సమస్య కేవలం పెద్ద కార్పొరేట్లకే పరిమితం కాదని... ఈసారి చిన్న సంస్థల వంతూ రానుందని ప్రముఖ బ్యాంకరు, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) ఇచ్చిన రుణాల నాణ్యతపై మరింతగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ‘మొండిబాకీలన్నీ పెద్దపెద్ద కార్పొరేట్లవేనన్న అభిప్రాయం ఉంది. అయితే, ఎస్ఎంఈ వ్యాపారాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అదింకా పూర్తి స్థాయిలో బయటపడటం లేదు అంతే..‘ అని ఉదయ్ పేర్కొన్నారు. ఐటీ దిగ్గజం నందన్ నీలేకని సమక్షంలో మంగళవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన కొటక్ మహీంద్రా బ్యాంకు ‘విజన్’ను ఆవిష్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) వర్గీకరణ విషయంలో ఫిబ్రవరి 12న ఆర్బీఐ ఇచ్చిన సర్క్యులర్‌తో మొండిబాకీల సమస్య మరింతగా ముదిరే అవకాశం ఉందన్నారు. ‘‘ఎన్పీఏల విషయంలో యూరోపియన్ దేశాలైన గ్రీస్, ఇటలీ తర్వాత మూడో స్థానానికి భారత్ చేరింది. దీన్ని చక్కదిద్దే చర్యలు అవసరం’’ అని ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో కొటక్ ఛార్టర్... తక్కువ నగదున్న వ్యవస్థలో వినియోగదారులకు టెక్నాలజీ ఆధారంగా మరింత మెరుగైన సేవలందించటమే లక్ష్యంగా కొటక్‌మహీంద్రా బ్యాంకు తాలూకు ఏబీసీడీ ఛార్టర్ను నీలేకనితో కలసి ఉదయ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఇవి...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపడ్డ యాప్, బయో మెట్రిక్ బ్రాంచ్‌లు, కస్టమర్‌కు తగ్గ సేవలు, డేటాతో నిండిన డిజైన్. ఈ సందర్భంగా నీలేకని మాట్లాడుతూ ‘‘గడిచిన దశాబ్దంలో టెక్నాలజీతో అంతరాలు తగ్గాయి. ప్రపంచమంతా ఒక్క మొబైల్లో ఒదిగిపోవటంతో మనం ముందెన్నడూ ఊహించని సేవలు, ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి’’ అన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఏడాది కిందట 811 సేవింగ్స్ ఖాతాను ప్రారంభించామని, ఇపుడు పూర్తి స్థాయి ఉత్పత్తులు, సేవలను దేశం నలుమూలలకూ అందించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నామని ఉదయ్ కొటక్ తెలియజేశారు. ‘‘ఆధార్ ఓటీపీ గుర్తింపును ఆర్బీఐ ఆమోదించిన మూడునెలలకు మేం 811 సేవల్ని ఆరంభించాం. అప్పటికి 80 లక్షల మంది ఖాతాదారులున్నారు. డిసెంబర్ 31నాటికి ఈ సంఖ్య 1.2 కోట్లకు చేరింది. దేశంలోని డిపాజిట్లలో 2 శాతం... మొబైల్ లావాదేవీల్లో 8 శాతం మా సొంతం. వచ్చే ఐదేళ్లలో ప్రయివేటు బ్యాంకుల వాటా 30 నుంచి 50 శాతానికి చేరుకుంటుందనే నమ్మకం నాకుంది’’ అన్నారాయన. మొండి బాకీలకూ టెక్నాలజీ పరిష్కారం 2008 ఆర్థిక సంక్షోభం తరవాత సరైన మదింపు లేకుండా ఇన్ఫ్రా తదితర రంగాలకు భారీ రుణాలిచ్చారని, వాటి చెల్లింపులను ఎనిమిదేళ్లుగా పొడిగించుకుంటూ రావడం మొండిబాకీల సంక్షోభానికి ప్రధాన కారణమని ఉదయ్ వ్యాఖ్యానించారు. సంక్షోభానంతరం ఇచ్చిన రుణాల అసలు మొత్తంలో కనీసం 40 శాతం వెనక్కి వచ్చినా సంతోషించవచ్చన్నారు. ప్రస్తుతం రిటైల్ రుణాల మంజూరులో టెక్నాలజీని వినియోగిస్తుండటం.. భవిష్యత్‌లో మొండిబాకీల సమస్యలను తగ్గించేందుకు తోడ్పడగలదని చెప్పారు. బ్యాంకుల జాతీయీకరణతో ఒరిగిందేమిటి .. బ్యాంకుల జాతీయీకరణ జరిగి 50 ఏళ్లు గడిచినా... అనేక కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని ఉదయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల జాతీయీకరణతో ఒనగూరిన ప్రయోజనాలేమిటని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వజ్రాభరణాల వ్యాపారస్తులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు .. పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) భారీగా మోసగించిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటివి అసాధారణ పరిస్థితులన్నారు. ఈ స్కాంతో బ్యాంకింగ్ వ్యవస్థపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడానికి బ్యాంకర్లతో పాటు నియంత్రణ సంస్థ, ప్రభుత్వం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల వ్యవస్థ ద్వారా లావాదేవీలు వంద కోట్ల స్థాయికి చేరగలవని నీలేకని చెప్పారు. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఈ లావాదేవీలు 14.5 కోట్లకు చేరాయి. -
షేర్లు ఓకే.. బిట్‌కాయిన్‌కు నో..
సాక్షి, ముంబై : దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ తన సంపదను నిర్వహించేందుకు ఏకంగా కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా షేర్లు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్టు ఫ్యామిలీ ఆఫీస్‌ను పర్యవేక్షిస్తున్న వెంకట్ సుబ్రమణియన్ చెప్పుకొచ్చారు. ఇక బ్యాంకు వ్యాపారానికి పోటీగా పరిణమించే రుణ వితరణకు దిగబోమని చెప్పారు. బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీల్లో రిస్క్ అధికంగా ఉండే క్రమంలో వాటికి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కొటక్ మహీంద్ర బ్యాంకుల్లో 30 శాతం వాటా కలిగి ఉన్న ఉదయ్ కొటక్‌కు ప్రస్తుత ధరల ప్రకారం రూ 54,000 కోట్ల పైగా సంపద ఉంది. మరోవైపు ఉదయ్ కొటక్ వద్ద పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ప్రస్తుతం రూ. 6000 కోట్ల నగదు ఇతర ఆస్తులు అందుబాటులో ఉన్నాయని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేర్కొంది. ఈ నిధులన్నీ ఇటీవల బ్యాంకులో తన వాటాను కొంతమేర విక్రయించడం ద్వారా సమకూరాయని తెలిపింది. -
మిగిలేవి ఐదు పెద్ద బ్యాంకులే!
అందులో ఎస్బీఐ ఒకటి: ఉదయ్ కోటక్ ముంబై: దేశబ్యాంకింగ్ రంగంలో బలమైన స్థిరీకరణ అవసరం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంకు వైస్‌చైర్మన్ ఉదయ్ కోటక్ అన్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఉన్నట్టే మనదేశంలోనూ ఐదు బ్యాంకులే ఆర్థిక సేవల రంగంలో నిలదొక్కుకుంటాయన్నారు. ‘‘చాలా దేశాల్లో మూడు నుంచి ఐదు పెద్ద బ్యాంకులే ఈ రంగాన్ని శాసిస్తున్నాయి. భారత్ ఇందుకు మినహాయింపు కాదు. భవిష్యత్తులో మన దేశంలోనూ ఇదే పరిస్థితి రానుంది’’ అని ఉదయ్ కోటక్ ఓ ఇంటర్వూ్యలో చెప్పారు. దేశీయంగా అలాంటి పెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటని చెప్పారు. రెండేళ్ల క్రితం కోటక్ బ్యాంకు ఐఎన్జీ వైశ్యా బ్యాంకును విలీనం చేసుకోగా, తాజాగా మరోసారి విలీన ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ ఊహాగానాలేనని ఉదయ్ చెప్పినప్పటికీ తాజా వ్యాఖ్యలు విలీనాలపై కోటక్ బ్యాంక్ ఆసక్తిగానే ఉన్నట్టు సంకేతాలిస్తున్నాయి. ‘‘మార్పునకు మేము సిద్ధం. అది సాహసోపేతంగా, ఆర్థిక సేవల రంగం దిశను మార్చేలా ఉంటుంది’’ అని ఉదయ్ చెప్పారు. ఐఎన్జీ వైశ్యా బ్యాంకు విలీనం ద్వారా తాము చాలా నేర్చుకున్నట్టు చెప్పారు. అదే సమయంలో విలీనాలకు తొందరపడడం లేదన్నారు. అయినప్పటికీ తమ కళ్లు, చెవులు విలీనాల కోసం తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. -
1.6 కోట్ల ఖాతాదారులు లక్ష్యం
ముంబై: పెద్ద ఎత్తున నిధుల సమీకరణ యత్నాల్లో ఉన్న కోటక్ మహింద్రా బ్యాంకు ఏ బ్యాంకును కొనుగోలు చేయనుందా...? అని ఆసక్తిగా ఎదురు చూసిన పరిశీలకులు, ఇన్వెస్టర్లకు... బుధవారం నాటి మీడియా సమావేశం సందర్భంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ రిటైల్ కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్టు బ్యాంకు నుంచి ప్రకటన వెలువడింది. ఇందుకోసం ‘811’ అనే డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను కోటక్ బ్యాంకు తీసుకొచ్చింది. ప్రస్తుతం 80 లక్షల ఖాతాదారులు ఉండగా వచ్చే 18 నెలల్లో వీరి సంఖ్యను 1.6 కోట్లకు పెంచుకోవాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్టు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆధార్ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణ తీసుకొస్తున్న తొలి బ్యాంకు తమదేనన్నారు. ఎన్బీఎఫ్సీ సంస్థను కొనుగోలు చేస్తుందంటూ వచ్చిన వార్తలు వదంతులుగానే పేర్కొన్నారు. దేశీయ బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మొండి బకాయిల ఒత్తిళ్ల నుంచి బయటకు రావడానికి కనీసం 100 బిలియన్ డాలర్ల తాజా మూలధనం అవసరమని చెప్పారు. మొండి బకాయిలు రూ.14 లక్షల కోట్లను దాటి మొత్తం వ్యవస్థలో 9.3%కి చేరాయన్నారు. ఐదు నిమిషాల్లో ఖాతా: 811 అనే మొబైల్ యాప్ ద్వారా జీరో బ్యాలన్స్ ఖాతాను ప్రారంభించవచ్చని ఉదయ్ కోటక్ వెల్లడించారు. నగదు నిల్వలపై 6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. కొత్తగా 80 లక్షల మంది ఖాతాదారుల్లో సగం మేర ఈ ప్లాట్ ఫామ్ ద్వారా రావచ్చని ఉదయ్‌కోటక్ చెప్పారు. జీరో బ్యాలన్స్ ఖాతాలపై ఏ విధమైన చార్జీలూ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రభుత్వరంగ ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలపై నగదు నిల్వలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే... తాము జీరో బ్యాలన్స్కే ఖాతాను అందించడం సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. 811 అన్నది వ్యాలెట్ కాదని, పూర్తి స్థాయి బ్యాంకు ఖాతాయేనన్నారు. భౌతికంగా డెబిట్ కార్డు కావాలంటే కనీస చార్జీ చెల్లించాల్సి ఉంటున్నారు. 811 ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకే అందుబాటులో ఉండగా, త్వరలో యాపిల్ స్టోర్‌లోనూ అందుబాటులోకి రానుంది. -
అతి పెద్ద మార్కెట్‌గా భారత్: ఉదయ్ కొటక్
డావోస్: రాబోయే కాలంలో ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద మార్కెట్‌గా అవతరించనుందని ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్ ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా ఉందని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచీకరణతో ఇండియాకు అధిక లబ్ధి చేకూరతోందని, ఇప్పటికే సాఫ్ట్వేర్ విప్లవం నేపథ్యంలో దేశంలోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అంతేకాక 300 బిలియన్ డాలర్ల పోర్ట్‌ఫోలియో పెట్టుబడులుగా వచ్చాయన్నారు. అనిశ్చిత అంతర్జాతీయ పరిస్థితుల మధ్య భారత్‌ను వెలుగురేఖగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారని తెలిపారు. ‘అమెరికా వృద్ధిని పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకుంటారన్న నేపధ్యంలో భారత్‌కు కూడా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తక్కువ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు అదుపులో వుండటం వంటి అంశాలతో భారత్ భారీ పెట్టుబడుల్ని ఆకర్షించగలుగుతుంది. విదేశీ ఇన్వెస్టర్లకు జనాభా పరంగా భారత్ అనువైన దేశంగా మారింది ’’అని వివరించారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం: జైట్లీ
ముంబై: ఒత్తిడిలో ఉన్న మొండి బకాయిల సమస్య పరిష్కరించుకునేలా త్వరలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)లను బలోపేతం చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అవినీతి నిరోధక చట్ట సవరణలకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ముంబైలో జరిగిన ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో జైట్లీ మాట్లాడుతూ... పీఎస్‌బీల ఆరోగ్య స్థితి ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. ఇతరులతో పోటీపడి పని చేసేలా పీఎస్బీలకు అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎస్బీలకు ప్రభుత్వ ఉద్యోగులే అడ్డుగా పేర్కొన్నారు. అలాగే, అవినీతి నిరోధానికి సంబంధించిన ప్రస్తుత చట్టం (పీసీఏ 1988) సైతం వారిని వాణిజ్య కోణంలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందని వివరించారు. చట్ట సవరణతో మార్పు వస్తుందన్నారు. గ్రామీణ భారతం, మౌలికరంగాలను పైకి తీసుకురావడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రెండు రంగాల్లో పెట్టుబడుల లోటు భారీ స్థాయిలో ఉందన్నారు. బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందాకొచర్, కోటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్, అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ తదితరులు -
ఫైనాన్షియల్ రంగంలో ఒకేఒక్కడు ఉదయ్ కొటక్
♦ ఫోర్బ్స్ ప్రపంచ టాప్-40 జాబితాలో ♦ భారత్ నుంచి చోటు... న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ రంగంలో అత్యంత శక్తివంతమైన 40 మంది జాబితాలో భారత్ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ నిలిచారు. ఫోర్బ్స్ రూపొందించిన ఈ లిస్టులో ఆయన 33వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. 7.1 బిలియన్ డాలర్ల నికర సంపద కలిగిన ఉదయ్ కొటక్.. 34.6 బిలియన్ డాలర్ల కొటక్ మహీంద్రా బ్యాంక్ అసెట్స్‌ను పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ ఈయన సారథ్యంలోని కొటక్ మహీంద్రా బ్యాంక్ సేవింగ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీని ఇస్తోందని, ఇది కష్టసాధ్యమని ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ జాబితాలో బ్లాక్‌స్టోన్ గ్రూప్ సీఈవో స్టీఫెన్ షార్జ్మాన్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన నికర సంపద విలువ 10.2 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. ఇక జాబితాలో జేపీ మోర్గాన్ ఛేజ్ సీఈవో జామీ డిమోన్(3వ స్థానం), బెర్క్‌షైర్ హాత్వే హెడ్ వారెన్ బఫెట్ (4), గోల్డ్‌మన్ శాక్స్ చైర్మన్ లాయిడ్ బ్లాన్క్ఫీన్ (9), సరోస్ ఫండ్ మేనేజ్మెంట్ చీఫ్ జార్జ్ సరోస్(10) తదితరులు ఉన్నారు. -
మంచి రోజులకు ఈ డీల్ సంకేతం!
ఐఎన్జీ వైశ్యా విలీనంపై కొటక్ బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ వ్యాఖ్య ముంబై: ఐఎన్జీ వైశ్యా బ్యాంకును విలీనం చేసుకోవడం మంచి రోజులకు(అచ్ఛే దిన్) సంకేతమని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ప్రచారంలో మోదీ వాడిన ఈ ‘అచ్ఛే దిన్’ వ్యాఖ్యలను ఉదయ్ ప్రస్తావించడం గమనార్హం. కొటక్ బ్యాంకులో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీన డీల్‌ను గత వారంలో ఇరు సంస్థలు ప్రకటించడం తెలిసిందే. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరిగే ఈ విలీన ఒప్పందం విలువ రూ.15,000 కోట్లుగా అంచనా. పరిమాణం, స్థాయి విషయంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థగా రూపొం దేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని ఉదయ్ పేర్కొన్నారు. ఐఎన్జీ వైశ్యా విలీనం తర్వాత కొటక్ బ్యాంక్ రూ. 2 లక్షల కోట్లకు పైగా బ్యాలెన్స్ షీట్, రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను అందుకోనుందన్నారు. ఈ విలీన ఒప్పందానికి 2015 మార్చికల్లా నియంత్రణపరమైన అనుమతులన్నీ లభించవచ్చని ఉదయ్ పేర్కొన్నారు. కాగా, ఈ విలీనం కారణంగా ఎలాంటి ఉద్యోగాల కోతలూ ఉండవని కూడా ఆయన తేల్చిచెప్పారు. -
సిబ్బందిని తగ్గించం
కొటక్ మహీంద్రా బ్యాంక్: ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకోవడం ద్వారా వెంటనే సిబ్బందిలో కోత పెట్టే ఆలోచనలేదని బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ స్పష్టం చేశారు. ఐఎన్జీ వైశ్యాలో 10,000 మంది, కొటక్ బ్యాంక్‌లో 29,000 మంది చొప్పున ఉద్యోగులు ఉన్నారు. కాలక్రమేణా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, వెనువెంటనే సంఖ్య తగ్గేది ఏమీ లేదని ఉదయ్ తెలిపారు. శాఖల సంఖ్య సైతం తగ్గబోదని, ఈ విలీనం వృద్ధికోసమేకానీ, కోతల కోసం కాదన్నారు. విలీన కంపెనీ మార్కెట్ వాటా చూస్తాం: సీసీఐ.... కొటక్ మహీంద్రా బ్యాంక్‌తో ఐఎన్జీ వైశ్యాబ్యాంక్ విలీన ప్రతిపాదన తమ ముందుకు వచ్చినపుడు ఆ రెండింటి పరిమాణం, మార్కెట్ వాటాను తాము పరిశీలిస్తామని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్ అశోక్ చావ్లా శుక్రవారంనాడిక్కడ విలేకరులకు చెప్పారు. -
స్వల్ప లాభాలతో సరి
మూడు రోజుల తరువాత దేశీ మార్కెట్లు కొంతమేర పుంజుకున్నాయి. అయితే రోజు మొత్తం ఒడిదుడుకులను చవిచూసి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 28,068 వద్ద నిలవగా, 20 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ మళ్లీ 8,400కు ఎగువన 8,402 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా 3%, ఎస్బీఐ 2% చొప్పున పుంజుకోగా, ఐటీ దిగ్గజాలు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ 1% స్థాయిలో పురోగమించాయి. కాగా, మరోవైపు సెసాస్టెరిలైట్, భెల్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, భారతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ 2-1% మధ్య నీరసించాయి. ఇక ట్రేడైన షేర్లలో 1,637 నష్టపోగా, 1,372 మాత్రమే లాభపడ్డాయి. -
కొటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్జీ వైశ్యా విలీనం
న్యూఢిల్లీ: పెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా.. మరో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐఎన్జీ వైశ్యాను విలీనం చేసుకోనుంది. ఇందుకు బుధవారం పూర్తిస్థాయి షేర్ల మార్పిడి ద్వారా డీల్‌ను కుదుర్చుకుంది. విలీనానికి వాటాల నిష్పత్తిని 725:1000 చొప్పున ఖరారు చేసింది. డీల్‌లో భాగంగా వాటాదారుల వద్ద ఉన్న రూ. 10 ముఖ విలువగల ప్రతి 1000 ఐఎన్జీ వైశ్యా బ్యాం క్ షేర్లను రద్దుచేసి రూ. 5 ముఖ విలువగల 725 కొటక్ మహీంద్రా షేర్లను జారీ చేయనుంది. తద్వారా ఐఎన్ఎజీ వైశ్యాను పూర్తిస్థాయిలో కొటక్ బ్యాంక్ విలీనం చేసుకోనుంది. విలీనం తర్వాత కొటక్ బ్యాంక్ ప్రైవేటు రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్‌ల తర్వాత 4వ పెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. మార్కెట్ ముగిశాక... గురువారం మార్కెట్ ముగిశాక కొటక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ ఉదయ్ కొటక్ డీల్ వివరాలను వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తామని, పారదర్శక పాలనా విధానాలు అవలంబిస్తామని కొటక్ బ్యాంక్ ఈ సందర్బంగా ఒక ప్రకటనలో వివరించింది. విలీనం వల్ల లభించే ప్రయోజనాలను ఉద్యోగులు, కస్టమర్లు, వాటాదారులకు అందించనున్నట్లు తెలి పింది. విలీనం తరువాత కొటక్ మహీంద్రా బ్రాంచీల సంఖ్య 1,214కు చేరనుండగా, ఐఎన్జీ వైశ్యా కనుమరుగుకానుంది. డీల్‌ను రెండు బ్యాంకుల వాటాదారులతోపాటు, ఆర్బీఐ, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించాల్సి ఉంది. కాగా, విలీనం అంచనాలతో బీఎస్ఈలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు 7.3% ఎగసి రూ. 1,157 వద్ద నిలవగా, ఐఎన్జీ వైశ్యా షేరు సైతం 7% జంప్‌చేసి రూ. 814 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రెండు షేర్లూ ఏడాది గరిష్టాలను తాకాయి. కొటక్ మహీంద్రా గరిష్టంగా రూ. 1,164ను తాకగా, ఐఎన్జీ వైశ్యా దాదాపు 14% దూసుకెళ్లి రూ. 865కు చేరింది. నవంబర్ 19తో ముగిసిన నెలరోజుల్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు సగటు ముగింపు ధర ఆధారంగా ఐఎన్జీ వైశ్యాబ్యాంక్ షేరును రూ. 790గా విలువకట్టి విలీన నిష్పత్తిని నిర్ణయించారు. కోటక్, ఐఎన్జీ వైశ్యాలు వేరువేరుగా నియమించిన వాల్యుయేటింగ్ సంస్థలు ఎస్ఆర్ బాట్లిబాయ్, ప్రైస్ వాటర్హౌస్లు ఈ విలీన నిష్పత్తిని సిఫార్సుచేసాయి. విలీనాల చరిత్ర ఇది... 2008లో అంతర్జాతీయ సంక్షోభం చెలరేగాక లాభాల్లో ఉన్న రెండు బ్యాంకుల మధ్య విలీనం జరగడం ఇదే తొలిసారికాగా, ఇంతక్రితం కూడా పలు బ్యాంకుల మధ్య విలీనాలు జరిగాయి. 2010లో బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్... ఐసీఐసీఐలోనూ, ఎస్బీఐ అనుబంధ సంస్థలు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండోర్, సౌరాష్ట్రలు ఎస్బీఐలోనూ విలీనమయ్యాయి. ఇక 2008లోనే సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సొంతం చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్, సెంచూరియన్ బ్యాంక్‌లు నష్టాల్లో ఉండేవి. విలీనం తరువాత... కొన్ని మెట్రో నగరాలలో మినహాయిస్తే విలీనం వల్ల దేశవ్యాప్తంగా కొటక్ మహీంద్రా కార్యకలాపాలు విస్తరించనున్నాయి. ఐఎన్జీ వైశ్యా శాఖల్లో 66% దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకల్లో విస్తరించగా, కొటక్ మహీంద్రా పశ్చిమ, ఉత్తర భారతంలో విస్తరించింది. విలీన బ్యాంకు 1,214 శాఖ లు, 1,794 ఏటీఎంలను కలిగి ఉంటుంది. చిన్న, మధ్య తరహా సంస్థల(ఎస్ఎంఈ) విభాగంపై పట్టుచిక్కుతుంది. ఐఎన్జీ వైశ్యా రుణాల్లో ఈ విభాగానికి 38% వాటా ఉంది. రూ. 2 లక్షల కోట్ల బ్యాలన్స్ షీట్‌తో నాలుగో పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా పటిష్టంకానుంది. విలీన బ్యాంకులో నెదర్లాండ్స్ దిగ్గజం ఐఎన్జీ గ్రూప్‌నకు 6.5% వాటా లభిస్తుంది. తద్వారా కొటక్ బ్యాంక్‌లో రెండో పెద్ద వాటాదారుగా నిలుస్తుంది. ప్రస్తుతం ఐఎన్జీ వైశ్యాలో ఈ సంస్థ వాటా 42.73%.కొటక్ బ్యాంక్‌లో ప్రమోటర్ ఉదయ్ కొటక్ వాటా ప్రస్తుత 39.71% నుంచి 34%కు తగ్గనుంది. ఆర్బీఐ నిబంధనల మేరకు 2016కల్లా 30%కు వాటా పరిమితం చేసుకోనున్నారు. కొటక్ మహీంద్రా, ఐఎన్జీ వైశ్యా మధ్య విలీన అంశాన్ని ప్రకటించడంలో ఉద్వేగానికి లోనవుతున్నా. వాటాదారులకు అత్యుత్తమ విలువ చేకూర్చే లక్ష్యంతో పనిచేస్తాం. -ఉదయ్ కొటక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వైస్‌చైర్మన్ ఈ డీల్ కుదుర్చుకున్నందుకు ఉదయ్‌ను అభినందిస్తున్నా. ఇది ఓ అద్భుతమైన ముందడుగు. - ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ సీఎండీ రెండు బ్యాంకులూ సరైన సమయంలో సరైన విధంగా జత కలుస్తున్నాయి. సంయుక్త సంస్థ ద్వారా మా కస్టమర్లకు అద్భుత విలువ చే కూరుతుంది. దేశ, విదేశాలలో మరింతగా విస్తరించేందుకు వీలు చిక్కుతుంది. - శైలేంద్ర భండారీ, ఐఎన్జీ వైశ్యా ఎండీ 84 ఏళ్ల మా బ్యాంకింగ్ ప్రస్థానంలో చరిత్రాత్మకమైన రోజు. జాతీయ సంస్థగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. - ఉదయ్ శరీన్, ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ కాబోయే సీఈఓ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైంది: 2004 మార్కెట్ విలువ: రూ.89,252 కోట్లు శాఖలు: 641 ఏటీఎంలు: 1103 ప్రమోటర్ వాటా: 40.07% పబ్లిక్ వాటా: 56.26% మొత్తం ఆస్తులు: రూ.1,22,237 కోట్లు 2013-14 ఏడాదికి మొత్తం ఆదాయం: రూ. 10,167 కోట్లు నికర లాభం: రూ. 1,503 కోట్లు షేరు ఏడాది గరిష్టం: రూ. 1,164 షేరు ఏడాది కనిష్టం: రూ. 631 ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ మార్కెట్ విలువ: రూ. 15,513 కోట్లు శాఖలు: 573 విదేశీ ప్రమోటర్ల వాటా: 42.73% పబ్లిక్ వాటా: 57.27% 2013-14 మొత్తం ఆదాయం: రూ. 6,072 కోట్లు నికర లాభం: రూ. 658 కోట్లు షేరు ఏడాది గరిష్టం: రూ. 865 షేరు ఏడాది కనిష్టం: రూ. 493