సాక్షి, ముంబై : దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ తన సంపదను నిర్వహించేందుకు ఏకంగా కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా షేర్లు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్టు ఫ్యామిలీ ఆఫీస్‌ను పర్యవేక్షిస్తున్న వెంకట్ సుబ్రమణియన్ చెప్పుకొచ్చారు. ఇక బ్యాంకు వ్యాపారానికి పోటీగా పరిణమించే రుణ వితరణకు దిగబోమని చెప్పారు.
బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీల్లో రిస్క్ అధికంగా ఉండే క్రమంలో వాటికి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కొటక్ మహీంద్ర బ్యాంకుల్లో 30 శాతం వాటా కలిగి ఉన్న ఉదయ్ కొటక్‌కు ప్రస్తుత ధరల ప్రకారం రూ 54,000 కోట్ల పైగా సంపద ఉంది. మరోవైపు ఉదయ్ కొటక్ వద్ద పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ప్రస్తుతం రూ. 6000 కోట్ల నగదు ఇతర ఆస్తులు అందుబాటులో ఉన్నాయని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేర్కొంది. ఈ నిధులన్నీ ఇటీవల బ్యాంకులో తన వాటాను కొంతమేర విక్రయించడం ద్వారా సమకూరాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment