Bitcoins
-
రూ.5,900 కోట్ల విలువైన బిట్కాయిన్లు చెత్తకుప్ప పాలు!
లండన్: అనగనగా ఒక పాత హార్డ్‌డ్రైవ్. బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల జేమ్స్ హావెల్స్ అనే వ్యక్తి క్రిప్టోకరెన్సీ తొలినాళ్లలో అంటే 2009 ఏడాదిలో 8,000 బిట్కాయిన్లను మైనింగ్ చేశాడు. వాటికి సంబంధించిన డిజిటల్ కీని ఆ పాత హార్డ్‌డ్రైవ్‌లో దాచి ఉంచాడు. అయితే అది తర్వాత కనిపించకుండా పోయింది. తన ప్రియురాలు హఫీనా ఎడీ ఎవాన్స్‌తో కలిసి ఈ హార్డ్‌డ్రైవ్ కోసం వేట మొదలెట్టాడు. అది కనిపించట్లేదని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది 2013 ఏడాదిదాకా ఇంట్లోనే ఒక గదిలో సొరుగులో ఉండిపోయింది. అయితే 2013లో ఇంటిని ప్రియురాలు హఫీనా శుభ్రంచేస్తుండగా పాత కంప్యూటర్ విడిభాగాలున్న ఒక పాత నల్ల సంచి కనిపించింది. దీనిని పడేయాలా? అని జేమ్స్‌ను హఫీనా అడగ్గా అవసరం లేదు పడేసెయ్ అని చెప్పాడు. దీంతో బయటికెళ్తూ దారిలో ఉన్న చెత్తకుప్పలో దానిని పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరూ దాని కోసం వేట కొనసాగించారు. అయితే తాజా దర్యాప్తులో.. ఆమె గతంలో పడేసిన సంచిలోనే హార్డ్‌వేర్ ఉందని తాజాగా వెల్లడైంది. హార్డ్‌వేర్‌లోని డిజిటల్ కీ సాయంతో అందుబాటులోకి వచ్చే 8,000 బిట్కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ.5,900 కోట్లు కావడం గమనార్హం. విషయం తెల్సి హఫీనా హుతాశురాలైంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడిపోయారు. ‘‘జేమ్స్ సంపదను తెలీకుండా చెత్తపాలు చేశాను. దాని కోసం అతను పడుతున్న వేదనను చూడలేకపోతున్నా’’అని తాజాగా హఫీనా వాపోయారు. హఫీనా పడేసిన చెత్తకుప్పలోని వ్యర్థ్యాలు సాధారణంగా వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో ఉన్న డాక్స్వే భారీ డంపింగ్ యార్డ్‌కు చేరుకుంటాయి. అక్కడ ఏకంగా 14,00,000 టన్నుల చెత్తకుప్ప కొండ ఉంది. అందులో ఎలాగైనా తన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి సంపాదిస్తానని జేమ్స్ బయల్దేరారు. అయితే అంత చెత్తను కింది నుంచి మొత్తం తిరగతోడితే కాలుష్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ససేమిరా అంటోంది. యార్డ్‌లోకి అతనికి అనుమతి నిరాకరించింది. దీంతో జేమ్స్ కోర్టును ఆశ్రయించాడు. మొత్తం గాలించి హార్డ్‌డ్రైవ్ దొరికితే కుబేరుడినయ్యాక సంపదలో 10 శాతాన్ని న్యూపోర్ట్ అభివృద్ధికి కేటాయిస్తానని, నగరాన్ని దుబాయ్, లాస్ వెగాస్ సిటీలా తీర్చిదిద్దుతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశాన్ని డిసెంబర్లో విచారిస్తామంటూ ఈ కేసును కోర్టు వాయిదావేసింది. -
Tamannaah Bhatia: తమన్నాను ప్రశ్నించిన ఈడీ
గువాహటి: బిట్కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని హెచ్పీజెడ్ టోకెన్ యాప్‌లో చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా భాటియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. యాప్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి నేరసంబంధ కేసు నమోదుకాలేదని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యాప్ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులుకాగా రెండు సంస్థలను విదేశీయులు నడిపిస్తున్నారు. బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని యాప్‌పై కోహిమా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, బిట్‌కాయిన్ మైనింగ్ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57వేల పెట్టుబడికి మూడు నెలలపాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తుచేసింది. అసలు డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్ ఖాతాలు, మర్చెంట్ ఐడీలు తీసుకున్నారని తేలింది. -
Bitcoin: అదే జరిగితే మహీంద్రా కంపెనీ చరిత్రకెక్కుతుంది
భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు మంచి పేరుంది. ఇప్పటికే మహీంద్రా XUV300, స్కార్పియో, బోలెరో, థార్ వంటి కార్లను విక్రయిస్తూ అత్యధిక ప్రజాదరణ పొందుతోంది. అయితే ఇటీవల ఒక ట్విట్టర్ యూజర్ బిట్‌కాయిన్‌తో మహీంద్రా కార్లను కొనవచ్చా అంటూ ప్రశ్నించారు. దీనికి స్వయంగా ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం ఏంటి? భవిష్యత్తులో బిట్‌కాయిన్ ద్వారా కంపెనీ కార్లను కొనొచ్చా.. లేదా? అనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా అప్పుడప్పుడు ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేయడమే కాకుండా, కొంత మంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక వ్యక్తి బిట్‌కాయిన్‌తో మహీంద్రా కార్లు కొనొచ్చా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి అలాంటి అవకాశం లేదు, కానీ భవిష్యత్తులో కొనొచ్చు అన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ChatGPT: ప్రపంచ దేశాలు పొగిడేస్తున్నాయ్.. స్టూడెంట్స్‌తో పోటీపడలేకపోతోంది) ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానంతో రాబోయే రోజుల్లో మహీంద్రా కార్లను కొనేయొచ్చని తెలుస్తోంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. క్రిప్టో కరెన్సీలో బిట్‌కాయిన్ అనేది చాలా పవర్ ఫుల్. ప్రపంచంలోని చాలా దేశాలు వీటి ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. అయితే భారతదేశంలో ఈ క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ కాదు. Not yet. But maybe bit by bit in the future.. https://t.co/pQS0ZQ52Qf — anand mahindra (@anandmahindra) April 20, 2023 భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని లీగల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మహీంద్రా కంపెనీ బిట్‌కాయిన్‌తో లావాదేవీలకు అనుమతిస్తే దేశంలో బిట్‌కాయిన్ ద్వారా కార్లు విక్రయించిన మొదటి కంపెనీగా చరిత్రకెక్కుతుంది. బిట్‌కాయిన్‌తో కార్లను విక్రయించడం మొదలుపెడితే ఎంతమంది ఈ పద్దతి ద్వారా కొనుగోలు చేస్తారనేది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. -
పెట్రో సెగలపై ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: దేశీయంగా రికార్డుస్థాయికి చేరుతున్న ఇంధన ధరలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండుతున్న పెట్రోధరలపై ప్రభుత్వాలు సానుకూల పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. అధిక ధరలు కార్లు, బైక్‌లను ఉపయోగించే వినియోగదారులను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు తయారీ, రవాణా రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వ్యాపార వ్యయాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజలను, దేశాన్నిఈ భారం నుంచి బయట పడవేసేందుకు అధిక మొత్తంలో డబ్బు అవసరమని తెలుసు, కానీ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ లీటరు ధర సెంచరీ దాటేసింది. వరుస బాదుడు తరువాత ప్రస్తుతం స్థిరంగా దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు కొనసాగుతున్నాయి. ఈ నెల 23న పెట్రోల్ డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్, ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరింది. (మళ్లీ రాజుకున్న పెట్రో సెగ) మరోవైపు డిజిటల్ కరెన్సీ ఆవిష్కారంపై కసరత్తు చేస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. డిజిటల్ రెవల్యూషన్లో తాము వెనకబడి ఉండాలనుకోవడం లేదంటూ క్రిప్టోకరెన్సీ లాంచింగ్‌పై ఇప్పటివరకు వస్తున్న అంచనాలపై క్లారిటీ ఇచ్చారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలి.. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి తమకు ఆందోళనలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. అయితే తమ డిజిటల్ కరెన్సీ ప్రస్తుత క్రిప్టోకరెన్సీ కంటే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలు ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయనే ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. (బిట్‌కాయిన్ బ్యాన్? సొంత క్రిప్టో కరెన్సీ ) డిజిటల్ కరెన్సీని బ్యాన్ చేయాలి : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా క్రిప్టోకరెన్సీకి డిమాండ్ భారీగా పుంజుకున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కూడా క్రిప్టోకరెన్సీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీని బ్యాన్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రెగ్యులేటర్స్ చొరవ తీసుకోవాలన్నారు. అంతేకాదు బిట్ కాయిన్లో తాను పెట్టుబడులు పెట్టేది లేదని తెగేసి చెప్పారు. మరోవైపు దేశీయంగా డిజిటల్ కరెన్సీ ఆందోళన నేపథ్యంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పెట్టుబడులతో ఇటీవలి కాలంలోబిట్కాయిన్ ధర అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. దీంతో బిట్కాయిన్పెట్టుబడులు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెరతీసింది. అయితే ధరలు చాలా హైలో ఉన్నాయంటూ ఉన్నట్టుండి ఎలాన్ మస్క్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌పై చేసిన ట్వీట్ కారణంగా భారీ నష్టాన్ని మూట గట్టుకున్నారు. దీనికి తోడు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ బిట్‌కాయన్‌పై విరుచుకుపడిన నేపథ్యంలో బిట్ కాయిన్ ఏకంగా 17 శాతం క్షీణించి 45వేల డాలర్లకు పడిపోయింది. (పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో ఫైర్) Diesel &petrol prices do have an impact on the cost side. They play as cost push factor across a range of activities. It's not just that passengers who use cars and bikes. High fuel prices also have an impact on cost of manufacturing, transportation & other aspects: RBI Governor pic.twitter.com/zn4AzB5Ag8 — ANI (@ANI) February 25, 2021 -
కొత్త ఏడాదిలో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ కొత్త ఏడాదిలో రికార్డులు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ విలువ 30వేల డాలర్లను తాకింది. అంటే మన కరెన్సీలో దీని విలువ 72 లక్షలకు సమానం. గత వారాంతంలో బిట్‌కాయిన్ విలువ 6 శాతం పెరిగింది. 2020లో బిట్‌కాయిన్ విలువ 300 శాతానికి పైగా పెరిగింది. తాజా లెగ్ హైతో కేవలం రెండు వారాల క్రితం 20,000 డాలర్లు దాటినప్పటి నుండి ఇప్పటి వరకు 50 శాతం కంటే ఎక్కువ పెరిగింది. 2021 మొదటి మూడు రోజుల్లోనే బిట్‌కాయిన్ విలువ సుమారు 5,000 డాలర్లు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు. (చదవండి: ‘వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’) కరోనా వైరస్ సంక్షోభం వల్ల గత ఏడాది మార్చిలో బిట్‌కాయిన్ విలువ 25 శాతం పడిపోయింది. అయితే తిరిగి నవంబర్ చివరలో మొదటిసారి 20,000 డాలర్లు మార్కును దాటి తిరిగి బౌన్స్ చేయగలిగింది. క్రిప్టోకరెన్సీ డిసెంబర్ 31 చివరి నాటికి బిట్‌కాయిన్ 10,000 డాలర్లు పెరిగింది. బిట్‌కాయిన్ విలువ పెరగడానికి ప్రధాన కారణం అమెరికా పెట్టుబడిదారులు పెద్దమొత్తంలో కొనుగోలు చేయడమే అని నిపుణులు తెలుపుతున్నారు. 2030 నాటికి బిట్‌కాయిన్ విలువ 1,35,000 డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్ కు పెరుగుతున్న జనాదరణ దృష్ట్యా భారత ప్రభుత్వం బిట్‌కాయిన్ లావాదేవీలపై 18 శాతం జీఎస్టీ విధించాలని యోచిస్తోంది. దీని ద్వారా ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖజానాకు జమ కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
‘నా దగ్గర గ్రెనేడ్ ఉంది.. ఎయిర్‌పోర్ట్‌ని పేల్చేస్తాను’
లక్నో : అమెరికా మియామి ఎయిర్‌పోర్ట్‌ని పేల్చేస్తానంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తోన్న 18 ఏళ్ల ఉత్తరప్రదేశ్ యువకున్ని ఆ రాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలు.. యూపీకి చెందిన సదరు నిందుతుడు కొన్ని రోజుల క్రితం 1000 అమెరికన్ డాలర్లు విలువ చేసే బిట్ కాయిన్స్‌ని కొన్నాడు. ఈ క్రమంలో అతడు మోసపోయాడు. దాంతో ఈ విషయం గురించి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేశాడు. కానీ వారి నుంచి అతనికి సరైన సమాధానం లభించలేదు. దాంతో విసుగు చెందిన సదరు యువకుడు మియామి విమానాశ్రయానికి బెదిరింపు ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించాడు. గత నెల 2, 31 తేదీలలో వరుస కాల్స్ చేశాడని అధికారులు తెలిపారు. ‘నేను మియామి విమానాశ్రయాన్ని పేల్చేస్తాను. నా దగ్గర ఏకే 47 గన్, గ్రెనేడ్, సూసైడ్ బెల్ట్ ఉన్నాయి. వాటితో మీ అందరిని చంపేస్తాను’ అంటూ మియామి విమానాశ్రయ అధికారులకు ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి ఎయిర్పోర్ట్ అధికారులు యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపీ అడ్రెస్ ట్రేస్ చేసి నిందితున్ని గుర్తించారు. బిట్‌కాయిన్స్ కొని మోసపోయిన తాను ఆ కోపంలో విమానాశ్రయానికి ఫోన్ చేసి బెదిరించినట్లు నిందుతుడు విచారణలో ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సదరు యువకుడి మీద కేసు నమోదు చేసినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. -
బిట్‌కాయిన్స్ : గుట్టు రట్టు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి వ్యాపారాల పేరిట ప్రజల్ని నిలువునా దోచుకుని ఆపై వారికి టోపీ పేట్టేయడం ఆ ఘరానా కేటుగాడి నైజం. నాడు గ్లోబల్ ఆగ్రోఫామ్స్ పేరుతో టేకు చెట్ల ప్లాంటేషన్, గోల్డెన్ ఫారెస్ట్ కంపెనీ పేరుతో పెట్టుబడికి రెట్టింపు నగదు, నేడు బిట్‌కాయిన్స్..ఇలా పేర్లు ఏవైనా పథకం మాత్రం మోసగించడమే. వంచననే వృత్తి, ప్రవృత్తిగా మార్చుకుని అమాయకుల్ని తన బుట్టలో వేసుకుంటున్న ఈ మాయగాడి ఆటల్ని నగర టాస్క్‌ఫోర్స్ కట్టిపెట్టింది. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పూర్తి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా దొనకొండకు చెందిన జి.రమేశ్ 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. అప్పట్నుంచీ పలు మోసాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాజాగా ‘బిట్ కాయిన్’ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు (ఎంఎల్ఎం) ప్రజల్ని మోసగించేందుకు పథకం వేశాడు. ఇందుకోసం ముంబైకి చెందిన సీబీ ఆన్లైన్ సంస్థ నిర్వాహకులు మోహన్, సునీల్ చౌహాన్‌కు తన పథకం వివరించి రూ.లక్ష చెల్లించాడు. వీరు కాయినెక్స్‌ట్రేడింగ్.కామ్ పేరుతో ఓ వెబ్సైట్ సృష్టించి ఇచ్చారు. దేశంలో ఎంఎల్ఎం నిర్వహణపై నిషేధం ఉన్నందున అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కేంద్రంగా, అమెరికన్ల నేతృత్వంలో ఈ సంస్థ వ్యాపారం సాగిస్తున్నట్లు చూపించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎస్.సత్తయ్య, ఎన్.వెంకటేష్, కె.హరిగోపాల్, సి.శ్రీనివాస్‌లను దళారులుగా పెట్టుకున్నాడు. నమ్మకం కలిగించేందుకు బోయిన్‌పల్లిలో జీఆర్ఎం ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం తెరిచాడు. వీరితో తమ స్కీముల్లో పెట్టుబడి పెడితే కనిష్టంగా 134 రోజుల నుంచి 500 రోజుల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందని ప్రచారం చేయించాడు. తమ ద్వారా బిట్‌కాయిన్స్‌లో 100 అమెరికన్ డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చని, 4 నుంచి 10 శాతం వరకు బోనస్ కూడా వస్తుందని ఆశ చూపాడు. అలాగే ఓ వ్యక్తి మరికొందరిని చేరిస్తే 60% వరకు కమీషన్‌గా ఇస్తానంటూ ఎంఎల్ఎం దందాకు తెరలేపాడు. రూ.10 కోట్లకుపైగా పెట్టుబడులు రమేశ్ మాయమాటలను నమ్మి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన 1200 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడువు తీరినా తమ నగదు ఊసెత్తక పోవటంతో అనుమానమొచ్చిన బాధితులు ఇతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇతడి తాజా దందా బయటకొచ్చింది. ఈ ముఠా కార్యకలాపాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి రూ.1.8 కోట్ల విలువైన నగదు, స్థలాల పత్రాలు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను సంప్రదించాలని కమిషనర్ అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన సూత్రధారి రమేశ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించాలని పోలీసులు నిర్ణయించారు. సీబీ ఆన్లైన్ సంస్థకు చెందిన సునీల్ చౌహాన్, మోహన్‌ను సైతం పోలీసులు నిందితులుగా చేర్చారు. రూ. 100 కోట్లకు చేరే అవకాశం! ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయింది రూ. కోట్లలో ఉంది. దీంతో రమేశ్ చేతిలో మోసపోయిన వారంతా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే మొత్తం రూ. 100 కోట్లకు చేరే అవకాశమున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదీ రమేశ్ నేరాల చిట్టా 1999లో గ్లోబల్ ఆగ్రో ఫామ్స్ ముసుగులో టేకుచెట్ల ప్లాంటేషన్ పేరుతో రూ.5 కోట్లను ప్రజలనుంచి రమేశ్ వసూలు చేసి మోసగించాడు. 2013లో గోల్డెన్ ఫారెస్ట్ కంపెనీ పేరుతో తన వద్ద రూ.5 వేలు పెట్టుబడి పెడితే ఎనిమిదేళ్ల తర్వాత రూ.50 వేలు ఇస్తానంటూ వసూలు చేసి మోసం చేశాడు. అదే ఏడాదిలో కొందరితో దురుసుగా ప్రవర్తించి పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మూడు కేసుల్లోనూ రమేశ్ అరెస్టయినా, ఇతగాడి బుద్ధి మాత్రం మారలేదు. -
మొబైల్ యాప్స్‌పై ఆపిల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అప్లికేషన్ల (యాప్స్)పై ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వర్చువల్ కరెన్సీ అయిన క్రిప్టో కరెన్సీ (బిట్ కాయిన్) అప్లికేషన్లను అభివృద్ధి చేసేవారు ఇకపై తప్పనిసరిగా ఒక సంస్థగా నమోదు కావాల్సి ఉంటుందని ఆపిల్ సంస్థ తెలిపింది. అలాంటి సంస్థలకు చెందిన అప్లికేషన్లకు మాత్రమే ఆపిల్ యాప్ స్టోర్‌లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఆపిల్ ఫోన్ స్టోరేజీతో సంబంధం లేకుండా కేవలం క్లౌడ్-బేస్డ్ స్టోరేజీలో క్రిప్టో మైనింగ్ చేసే అప్లికేషన్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాటరీని ఎక్కువగా వినియోగించే, మొబైల్‌ను త్వరగా వేడెక్కించే అప్లికేషన్లపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. క్రిప్టోనే ఎందుకంటే.. క్రిప్టో కరెన్సీ అప్లికేషన్లలో థర్డ్‌పార్టీ అడ్వర్టయిజింగ్లు ఉంటాయనీ.. యాప్స్‌తో సంబంధం లేని ప్రకటనలతో వినియోగదారునికి అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆపిల్ వెల్లడించింది. ‘బిట్ కాయిన్లలో ట్రేడింగ్ చేసే అప్లికేషన్లు మిగతా వర్చువల్ కరెన్సీ అప్లికేషన్లను అడ్డుకుంటాయి. డౌన్లోడ్ ప్రక్రియను మందకొడిగా మారుస్తాయి. సోషల్ మీడియా యాప్‌లపైన కూడా వీటి వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆయా యాప్స్‌ను చురుగ్గా పనిచేయనీయవు’ కనుకనే ఆపిల్ ఫోన్ స్టోరేజీలో ఎలాంటి క్రిప్టో కరెన్సీ మైనింగ్‌ని అనుమతించబోమని ఆపిల్ స్పష్టం చేసింది. న్యాయబద్ధంగా వర్చువల్ ట్రేడింగ్ సేవల్ని అందించే యాప్‌లను అనుమతిస్తామని తెలిపింది. -
బిట్కాయిన్ల ఆచూకీ చెబితే రూ.2 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద బిట్‌కాయిన్ చోరి వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్‌సెక్యుర్ నుంచి దాదాపు రూ.20 కోట్ల విలువైన 438 బిట్కాయిన్లు చోరికి గురయ్యాయి. ఈ దొంగతనానికి గురైన బిట్కాయిన్ల ఆచూకీ కోసం ఈ ఎక్స్చేంజీ తీవ్ర ఎత్తున్న ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో తాము కోల్పోయిన బిట్కాయిన్ల కనిపెట్టి, ఆచూకీ చెప్పిన వారికి రూ.2 కోట్ల రివార్డు అందిచనున్నట్టు కాయిన్‌సెక్యుర్ ప్రకటించింది. ‘మా నిధులను రికవరీ చేసుకునేందుకు హ్యాకర్లను గుర్తించడానికి మా యూజర్ల నుంచి, బిట్‌కాయిన్ కమ్యూనిటీ నుంచి సాయం కోరుతున్నాం’ అని కాయిన్‌సెక్యుర్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ వారం మొదట్లో తమ కంపెనీ వాలెట్ నుంచి రూ.20 కోట్ల విలువైన 438 బిట్కాయిన్లు చోరికి గురైనట్టు కాయిన్‌సెక్యుర్ ఢిల్లీ పోలీసు సైబర్‌సెల్ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రకటించిన రివార్డు విలువ చోరికి గురైన మొత్తం విలువలో 10 శాతం. అసలేం జరిగింది...? కాయిన్‌సెక్యుర్ అనే ఈ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్కు రెండు లక్షలకు పైగా యూజర్లున్నారు. ఆఫ్‌లైన్‌గా వారు బిట్కాయిన్లను కంపెనీ స్టోర్ చేస్తోంది. వీటిని స్టోర్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీలు అంటే పాస్వర్డ్లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ లీకేజీ ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. దీనికి గుర్తించిన కంపెనీ, హ్యాకర్లను గుర్తించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ప్రభావితానికి గురైన వాలెంట్ల డేటా అంతా అప్పటికే చోరీకి గురై, మొత్తం డేటాను హ్యాకర్లు తొలగించేశారు. బిట్కాయిన్లను కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. ఇక కంపెనీ ఏం చేయలేని పరిస్థితుల్లో గురువారం రాత్రి నుంచి ఈ విషయాన్ని తన వెబ్సైట్ ద్వారా యూజర్లకు తెలపడం ప్రారంభించింది. తమ బిట్కాయిన్ల నిధులు బయటికి బహిర్గతమయ్యాయి అని చెప్పడానికి చింతిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ఈ చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్ర ఉందని అనుమానిస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ కర్లా అన్నారు. -
అతిపెద్ద క్రిప్టో చోరీ : రూ.20 కోట్లు గోవిందా!
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ చోరీ జరిగింది. టాప్ ఎక్స్చేంజ్ సంస్థ నుంచి రూ.20 కోట్ల విలువైన 438 బిట్కాయిన్లు చోరీకి గురైనట్టు తెలిసింది. ఢిల్లీకి చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్‌సెక్యుర్ దీనిపై ఫిర్యాదు దాఖలు చేసింది. సంస్థ వాలెట్ నుంచి ఈ నగదును సీఎస్ఓ అమితాబ్ సక్సేనా చోరీ చేసినట్టు సైబర్ సెల్ వద్ద ఈ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 66, ఐపీసీ సెక్షన్స్ కింద ఈ కేసు సైబర్‌సెల్ రిజిస్ట్రర్ చేసింది. సక్సేనా దేశం విడిచి పారిపోయే సూచనలు ఉన్నాయని, ఆయన పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఈ ఎక్స్చేంజ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. అసలేం జరిగింది...? కాయిన్‌సెక్యుర్ అనే ఈ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్కు రెండు లక్షలకు పైగా యూజర్లున్నారు. ఆఫ్‌లైన్‌గా వారు బిట్కాయిన్లను కంపెనీ స్టోర్ చేస్తోంది. వీటిని స్టోర్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీలు అంటే పాస్వర్డ్లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ లీకేజీ ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. దీనికి గుర్తించిన కంపెనీ, హ్యాకర్లను గుర్తించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ప్రభావితానికి గురైన వాలెంట్ల డేటా అంతా అప్పటికే చోరీకి గురై, మొత్తం డేటాను హ్యాకర్లు తొలగించేశారు. బిట్కాయిన్లను కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. ఇక కంపెనీ ఏం చేయలేని పరిస్థితుల్లో గురువారం రాత్రి నుంచి ఈ విషయాన్ని తన వెబ్సైట్ ద్వారా యూజర్లకు తెలపడం ప్రారంభించింది. తమ బిట్కాయిన్ల నిధులు బయటికి బహిర్గతమయ్యాయి అని చెప్పడానికి చింతిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ఈ చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్ర ఉందని అనుమానిస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ కర్లా అన్నారు. ప్రైవేట్ కీలను ఆన్లైన్లో ఎక్స్పోర్ట్ చేయమని, ఉద్దేశ్యపూర్వకంగానే ఈ క్రైమ్ చేసినట్టు తాము అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ అనుమానాలన్నింటిన్నీ సైబర్‌సెల్‌తో షేర్ చేశామని, హ్యాక్ సోర్స్‌ను గుర్తించి, బిట్కాయిన్లు ఎక్కడ ఉన్నాయో కనుగొంటామని కర్లా చెప్పారు. ఒకవేళ ఈ నిధులను గుర్తించలేకపోతే, కంపెనీనే తన సొంత ప్యాకెట్ నుంచి కస్టమర్లకు పరిహారాలు చెల్లిస్తామని తెలిపారు. -
ఎస్బీఐ కార్డు యూజర్లూ జర జాగ్రత్త
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీదారి అయిన ఎస్బీఐ కార్డు తన కస్టమర్లకు హెచ్చరికలు జారీచేసింది. బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. ఇలాంటి పెట్టుబడులకు తమ క్రెడిట్ కార్డు వాడకాన్ని రద్దు చేయనప్పటికీ, యూజర్లు జాగురకతతో వ్యవహరించాలని పేర్కొంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు, ప్రజలకు జారీచేసిన ప్రకటనలో క్రిప్టోకరెన్సీ స్కీమ్‌లు, బిట్ కాయిన్ లాంటి ఇతర వర్చ్యువల్ కరెన్సీలకు ఎలాంటి లైసెన్సు లేదా అథరైజేషన్ ఇవ్వలేదని తెలుపుతూ ఎస్బీఐ కార్డు పంపిన తన కస్టమర్లకు మెసేజ్‌లు పంపింది. అంతర్జాతీయంగా, స్థానికంగా వీటిపై ఆందోళనలు ఉన్నాయని, క్రిప్టోకరెన్సీలు, వర్చ్యువల్ కరెన్సీలతో డీల్ చేసేటప్పుడు భద్రతాపరమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో కూడా ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైనవిగా గుర్తించడం లేదని తెలిపారు. పేమెంట్ సిస్టమ్‌లో వీటి వాడకాన్ని నిర్మూలించాలన్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు 50 లక్షల మందికి పైగా కస్టమర్లున్నారు. కాగ, ఈ నెల ప్రారంభంలోనే సిటీ ఇండియా బ్యాంకు తన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా క్రిప్టోకరెన్సీలు లేదా వర్చ్యువల్ కరెన్సీలు కొనుగోలు చేయడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. -
బిట్‌కాయిన్ కొనుగోలుదారులకు ఐటీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి లక్షల సంఖ్యలో నోటీసులు జారీ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చీఫ్ వెల్లడించారు. బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారి నుంచి పన్నులు రాబట్టే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. బిట్‌కాయిన్స్ ద్వారా లాభాలు ఆర్జించిన వారు వాటిపై అడ్వాన్స్ ట్యాక్స్‌లు చెల్లించలేదనే విషయం పన్ను అధికారుల దృష్టికి వచ్చిందని సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర పేర్కొన్నారు. గతంలో మరికొందరు ఈ తరహా పెట్టుబడుల గురించి తమ పన్నురిటన్స్లో పొందుపరచలేదని అన్నారు. గత ఏడాది డిసెంబర్లో బిట్‌కాయిన్స్ లావాదేవీలు నిర్వహిస్తున్న ఎక్సే్ఛంజ్లపై దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించామని చెప్పారు. బిట్‌కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేసి వాటి వివరాలను వెల్లడించని వారి వద్ద ఆయా పెట్టుబడులపై వారందరి నుంచీ పన్నులు రాబడతామని, పన్నులు చెల్లించేందుకు పలువురు ఇన్వెస్టర్లు అంగీకరించారని తెలిపారు. కొన్ని లక్షల మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. ఇక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో బిట్‌కాయిన్స్‌పై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించిన విషయం తెలిసిందే. బిట్‌కాయిన్స్ సహా క్రిప్టోకరెన్సీలన్నీ చట్టవిరుద్ధమనీ, వాటి వాడకాన్ని నిలిపివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.మరోవైపు బిట్‌కాయిన్స్ చట్టవిరుద్ధమైనవని ఆర్థిక మంత్రి ప్రకటించిన క్రమంలో భారత్‌లో బిట్‌కాయిన్ విలువ భారీగా పతనమైంది. గతంలో రూ 6,44,042గా ఉన్న బిట్‌కాయిన్ విలువ శుక్రవారం మధ్యాహ్నం రూ 5,44,735కు పడిపోయింది. -
బిట్‌కాయిన్స్‌కు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టో కరెన్సీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. వీటి వాడకాన్నిపూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ క్రిప్టో కరెన్సీల వాడకాన్ని ప్రస్తావించారు. వీటిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. చెల్లింపు వ్యవస్థల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీని పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. మరోవైపు బిట్‌కాయిన్స్ పట్ల మదుపుదారులు అప్రమత్తంగా ఉండాలని, వీటి ఒడిదుడుకులకు ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవాలని ఆర్బీఐ ఇప్పటికే హెచ్చరించింది. -
ఆ ప్రకటనలకు ఫేస్బుక్ దూరం
శాన్ఫ్రాన్సిస్కో : బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ యాడ్స్‌ను ఫేస్బుక్ తన ఫ్లాట్‌ఫాంలపై నిషేదించింది. ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్లలోనూ వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయించింది. తప్పుదారిపట్టించే ఫైనాన్షియల్ ప్రోడక్టులను ప్రోత్సహించే ప్రకటనలను నిషేధించినట్టు ఫేస్బుక్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే నూతన ప్రోడక్టుల గురించి ప్రజలు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీలు, ఐసీఓలపై పలు కంపెనీలు జారీ చేస్తున్న ప్రకటనలు విశ్వసనీయంగా లేవని ఫేస్బుక్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రాబ్ లెథెరెన్ చెప్పారు. ఈ తరహా ప్రకటనలు ఫేస్బుక్ ఫ్లాట్‌ఫాంలపై నుంచి నిషేధిస్తున్నామన్నారు. ఫేస్బుక్ యాడ్స్‌పై ప్రజలు ఎలాంటి అభ్యంతరాలున్నా తమకు నివేదించవచ్చని కోరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు ఫేస్బుక్లో తావులేదని కంపెనీ స్పష్టం చేసింది. -
బిట్‌కాయిన్స్‌పై ఐసీఏఐ అధ్యయనం
కోల్‌కతా: బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వీటిపై అధ్యయనం చేయనుంది. క్రిప్టో కరెన్సీలపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం సూచించడంతో ఈ సమగ్ర అధ్యయనం చేపడుతున్నట్లు ఐసీఏఐ సభ్యుడు (డిజిటల్ అకౌంటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్ బోర్డ్) దెబాశిష్ మిత్రా తెలిపారు. ‘‘ఈ ఏడాది మార్చికల్లా కంపెనీ వ్యవహారాల శాఖకు దీనిపై నివేదిక సమర్పించే అవకాశముంది. దీనికోసం ఆయా అంశాలపై పట్టు ఉన్న సంస్థల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం’’ అని మిత్రా వివరించారు. కార్పొరేట్ గవర్నెన్స్, కంపెనీల చట్టంపై సీఐఐ నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా మిత్రా ఈ విషయాలు చెప్పారు. -
షేర్లు ఓకే.. బిట్‌కాయిన్‌కు నో..
సాక్షి, ముంబై : దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ తన సంపదను నిర్వహించేందుకు ఏకంగా కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా షేర్లు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్టు ఫ్యామిలీ ఆఫీస్‌ను పర్యవేక్షిస్తున్న వెంకట్ సుబ్రమణియన్ చెప్పుకొచ్చారు. ఇక బ్యాంకు వ్యాపారానికి పోటీగా పరిణమించే రుణ వితరణకు దిగబోమని చెప్పారు. బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీల్లో రిస్క్ అధికంగా ఉండే క్రమంలో వాటికి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కొటక్ మహీంద్ర బ్యాంకుల్లో 30 శాతం వాటా కలిగి ఉన్న ఉదయ్ కొటక్‌కు ప్రస్తుత ధరల ప్రకారం రూ 54,000 కోట్ల పైగా సంపద ఉంది. మరోవైపు ఉదయ్ కొటక్ వద్ద పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ప్రస్తుతం రూ. 6000 కోట్ల నగదు ఇతర ఆస్తులు అందుబాటులో ఉన్నాయని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేర్కొంది. ఈ నిధులన్నీ ఇటీవల బ్యాంకులో తన వాటాను కొంతమేర విక్రయించడం ద్వారా సమకూరాయని తెలిపింది. -
ఆ రిస్క్ మీదే..
సాక్షి, న్యూఢిల్లీ : బిట్‌కాయిన్స్‌పై మోజుతో ట్రేడింగ్ చేస్తున్న ఇన్వెస్టర్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బిట్‌కాయిన్ సహా వర్చువల్ కరెన్సీలో ట్రేడింగ్ చేసే వారు సొంతంగా రిస్క్ తీసుకోవాలని, దీనికి ఎలాంటి పూచీ ఉండదని స్పష్టం చేసింది. బిట్‌కాయిన్ ధర కేవలం స్పెక్యులేషన్‌పైనే ఆధారపడి ఉంటుందని, ఫలితంగా వీటి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తరహా పధకాల్లో అత్యధిక రిస్క్ పొంచి ఉంటుందని, వర్చువల్ కరెన్సీల్లో భారీ ఒడిదుడుకులతో రిటైల్ ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బిట్‌కాయిన్ సహా వర్చువల్ కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్, ఎలక్ర్టానిక్ ఫార్మాట్లో ఉండే కరెన్సీలకు హ్యాకింగ్ ముప్పుతో పాటు పాస్వర్డ్ కోల్పోవడం, మాల్వేర్ దాడి మూలంగా డబ్బును శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. బిట్‌కాయిన్, వర్చువల్ కరెన్సీల నుంచి వినియోగదారులను కాపాడే పటిష్ట యంత్రాంగం కోసం ఆర్బీఐ, సెబీతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. -
గతవారం బిజినెస్
బిట్‌కాయిన్స్‌తో జాగ్రత్త: ఆర్బీఐ బిట్‌కాయిన్స్ వంటి వర్చువల్ కరెన్సీల ట్రేడింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని యూజర్లు, ట్రేడర్లను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. బిట్‌కాయిన్ లేదా ఇతర వర్చువల్ కరెన్సీల (వీసీ) నిర్వహణ, చెలామణికి సంబంధించి ఏ కంపెనీకి కూడా లైసెన్సులు ఇవ్వలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వీసీలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటాయి కనుక హ్యాకింగ్, మాల్వేర్ దాడుల బారినపడే ప్రమాదముంటుందని తెలిపింది. ఎల్ఐసీ ’స్టాక్’ పెట్టుబడులు రూ.44,000 కోట్లు ఎల్ఐసీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–నవంబర్ కాలానికి స్టాక్ మార్కెట్లో రూ.44,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి పెట్టిన పెట్టుబడులు రూ.29,000 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధి నమోదైనట్లు ఎల్ఐసీ చైర్మన్ వి.కె. శర్మ చెప్పారు. మార్చి 31 వరకూ పాన్–ఆధార్ అనుసంధానం కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌తో పాన్ అనుసంధాన గడువును మరోసారి పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. కొందరు పన్ను చెల్లింపుదారులు వారి పాన్ నంబర్‌ను ఇప్పటికీ ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదనే అంశం తమ దృష్టికి వచ్చిందని, అందుకే తాజాగా గడువును పొడిగిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పతంజలి ’సూర్య’ మంత్ర పతంజలి ఆయుర్వేద్ సోలార్ విద్యుత్ ఎక్విప్మెంట్ తయారీని లక్ష్యంగా ఎంచుకుంది. గ్రేటర్ నోయిడాలో ఇందుకు సంబంధించిన ఫ్యాక్టరీ వచ్చే కొన్ని నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని పతంజలి ఆయుర్వేద్ ఎండీ బాలకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వ రుణ భారం రూ.65.65 లక్షల కోట్లు ప్రభుత్వ రుణ భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో 2.53% పెరిగింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రూ.64,03,138 కోట్లున్న ప్రభుత్వ రుణ భారం, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలానికి రూ.65,65,652 కోట్లకు చేరిందని ప్రభుత్వ రుణ నిర్వహణకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించింది. మొత్తం రుణ భారంలో అంతర్గత రుణ వాటా 93%. ఇందులో మార్కెట్ బాండ్ల వాటా 82.6 %. ఎగుమతులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఎగుమతులు బలోపేతమే లక్ష్యంగా మరిన్ని ప్రోత్సాహకాలతో కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానానికి (ఎఫ్టీపీ) తాజా మెరుగులద్దింది. 2015–20 వాణిజ్య విధానాన్ని మధ్యంతరంగా సమీక్షించి పలు ప్రోత్సాహకాలతో మళ్లీ ఆవిష్కరించింది. సరుకుల ఎగుమతుల పథకం (ఎంఈఐఎస్) ప్రోత్సాహకాన్ని 2 శాతం మేర పెంచినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు ఎఫ్టీపీ విడుదల సందర్భంగా తెలిపారు. వార్షిక ప్రోత్సాహక బడ్జెట్ 34 శాతం పెంపుతో రూ.8,450 కోట్లకు చేరిందన్నారు. రేట్లలో మార్పుల్లేవు పెరుగుతున్న చమురు ధరలు, ఇతర అంశాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ సంచలనాలకు పోకుండా సాదాసీదాగా ద్రవ్యపరపతి విధాన సమీక్షను ముగించేసింది. వడ్డీ రేట్లు తగ్గించాలన్న ప్రభుత్వ, పరిశ్రమ డిమాండ్లను ప్రస్తుతానికి పక్కనపెట్టేసి కఠిన విధానానికే కట్టుబడింది. కీలకమైన రెపో రేటును 6 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగా కొనసాగిస్తూ నిర్ణయాలను ప్రకటించింది. ఇక ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలానికి 4.3–4.7 శాతానికి పెంచింది. ప్రభుత్వం చేతికి యూనిటెక్ పగ్గాలు రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్‌కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గట్టి షాకిచ్చింది. నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని ఆదేశించింది. వారి పేర్లను తదుపరి విచారణ తేదీ డిసెంబర్ 20లోగా అందించాలని కేంద్రానికి సూచించింది. భారత్‌కు గూగుల్ బొనాంజా!! భారత్ తదితర మార్కెట్లలో ఇంటర్నెట్ వినియోగాన్ని మరింత పెంచే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ పలు ఆవిష్కరణలు చేసింది. చౌక స్మార్ట్ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ ’ఓరియో గో’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ద్విచక్ర వాహనదారులకూ మరింతగా ఉపయోగపడేలా మ్యాప్స్‌కి సంబంధించి బైక్ మోడ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. అటు రిలయన్స్ జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కస్టమైజ్డ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ద్వారానే పీపీఎఫ్ అకౌంట్ ప్రైవేట్ రంగ దిగ్గజ ’ఐసీఐసీఐ బ్యాంక్’ తాజాగా ఆన్లైన్ ద్వారానే పీపీఎఫ్ ఖాతాను తెరిచేలా డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు తాజా డిజిటల్ సేవల్లో భాగంగా ఆన్లైన్లోనే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్‌ను తక్షణం తెరవొచ్చు. అంటే బ్యాంక్ కస్టమర్లు పీపీఎఫ్ అకౌంట్ కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. పెరిగిన ఫారెక్స్ నిల్వలు భారత విదేశీ మారక నిల్వలు పెరిగాయి. డిసెంబర్ 1తో ముగిసిన వారంలో ఇవి 1.2 బిలియన్ డాలర్లమేర పెరుగుదలతో 401.94 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌లో పెరుగుదలే ఫారెక్స్ నిల్వల వృద్ధికి కారణమని ఆర్బీఐ పేర్కొంది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.15 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 377.45 బిలియన్ డాలర్లకు ఎగశాయి. గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉంటూ వస్తోన్న బంగారం నిల్వల్లో 36.5 మిలియన్ డాలర్లమేర పెరుగుదల నమోదయింది. ఇవి 20.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆటోమొబైల్స్ ♦ దేశీ వాహన తయారీ కంపెనీ ’మహీంద్రా అండ్ మహీంద్రా’ తన ప్రముఖ ఎస్యూవీ ’ఎక్స్‌యూవీ 500’లో పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.15.49 లక్షలు. ♦ ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ ’యమహా మోటార్ ఇండియా’ తన సూపర్‌బైక్ ’వైజడ్ఎఫ్–ఆర్1’లో అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.20.73 లక్షలు. ఈ కొత్త బైక్‌లో 998 సీసీ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ♦ చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ’హువావే’.. ’హానర్ 7ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. 4 జీబీ ర్యామ్/ 32 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.12,999గా, 4 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ♦ ప్రముఖ వాహన కంపెనీ ’టీవీఎస్ మోటార్’ సూపర్ ప్రీమియం బైక్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ’అపాచీ ఆర్ఆర్ 310’ పేరుతో సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్‌షోరూమ్). అపాచీ ఆర్ఆర్ 310లో 4 స్ట్రోక్, 4 వాల్వ్, సింగిల్ సిలిండర్, రివర్స్ ఇన్క్లైన్డ్, 312 సీసీ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ♦ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తన కొత్త ఎస్యూవీ మోడల్ ’రేంజ్ రోవర్ వెలార్’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.78.83 లక్షల నుంచి రూ.1.38 కోట్ల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. డీల్స్.. ♦కస్టమర్లకు ప్రపంచ స్థాయి డిజిటల్ కంటెంట్‌ను అందించడంలో భాగంగా టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్టెల్.. ఆన్లైన్ బుక్‌స్టోర్ జగర్నాట్ బుక్స్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేసింది. ♦ ఫాస్ట్‌ఫుడ్ చైన్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్న హలోకర్రీ... యూకేకు చెందిన ఫుడ్ అడ్వైజర్ యాప్‌తో జత కట్టింది. ♦ టాటా ప్రాజెక్ట్స్, దక్షిణ కొరియాకు చెందిన దేవూ ఈఅండ్‌సీ కంపెనీల సంయుక్త సంస్థ రూ.5,612 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్యాకేజ్–2 రూపకల్పన, నిర్మాణం చేపడతాయి. ♦ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామి.. హీలియోస్ లైఫ్ స్టైల్లో 30 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ♦ కస్టమర్లకు డీల్స్ అందించే సంస్థలు నియర్‌బై, లిటిల్ ఇంటర్నెట్లు విలీనమయ్యాయి. ఈ విలీన సంస్థలో కొంత వాటాను పేటీఎం కొనుగోలు చేసింది. -
బిట్ కాయిన్లను నిషేధించాలా.. నియంత్రించాలా?
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీల ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో ఆ తరహా బిట్‌కాయిన్స్ వినియోగంపై కేంద్రం చర్చకు తెరతీసింది. బిట్‌కాయిన్స్‌ను నిషేధించాలా, నియంత్రించాలా లేదా స్వయం నియంత్రణకు వదిలేయాలా అన్న అంశాలపై ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేయాలని చర్చావేదిక మైగవ్డాట్ఇన్లో కోరింది. ‘ఒకవేళ వర్చువల్ కరెన్సీలను (వీసీ) నియంత్రించనవసరం లేదని భావించిన పక్షంలో సమర్ధమైన స్వయంనియంత్రణ వ్యవస్థ ఎలా ఉండాలి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోతగిన చర్యలు ఎలా ఉండాలి’ అన్నవి తెలియజేయాల్సిందిగా సూచించింది. మే 31 దాకా ప్రజలు తమ అభిప్రాయాలను మైగవ్డాట్ఇన్లో పేర్కొనవచ్చు. వన్నాక్రై రాన్సమ్వేర్తో సైబర్ దాడులకు దిగిన సైబర్ క్రిమినల్స్ బిట్కాయిన్ల రూపంలో చెల్లించాలంటూ బాధితులను డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ తరహా కరెన్సీలు మరింతగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే బిట్‌కాయిన్స్ లాంటి వర్చువల్ కరెన్సీల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
భారతీయులకూ...బిట్ కాయిన్ మోజు!
ముంబై: బిట్ కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీ (కేవలం డిజిటల్ రూపంలోనే ఉండేవి)లకు ఎటువంటి గుర్తింపు లేదని, వాటిని కొనుగోలు చేసి నష్టపోవద్దని ఆర్బీఐ దేశ ప్రజలను హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. దేశీయ యాప్ ఆధారిత బిట్ కాయిన్ ఎక్సే్చంజ్ ‘జెబ్‌పే’ను ఇప్పటి వరకు ఐదు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని, రోజూ 2,500 మందికి పైగా కొత్త యూజర్లు జతవుతున్నారని ఈ సంస్థ పేర్కొంది. బిట్ కాయిన్‌ను అత్యంత ప్రాచుర్యం పొందిన అస్సెట్ క్లాస్‌గా ఆమోదించడం పెరుగుతోందని తెలిపింది. నూతన ఆర్థిక విప్లవం అంచున దేశం ఉందని ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు సందీప్ గోయెంకా పేర్కొనడం గమనార్హం. కస్టమర్లు సంప్రదాయేతర పెట్టుబడుల దిశగా అడుగు వేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 10 లక్షల డౌన్లోడ్ల లక్ష్యాన్ని విధించకున్నట్టు చెప్పారు. బిట్ కాయిన్లో ట్రేడింగ్‌కు వీలుగా 2015లో కార్యకలాపాలు ప్రారంభించింన జెబ్‌పే గత జనవరిలో 10 లక్షల అమెరికన్ డాలర్ల నిధులను సమీకరించింది. వర్చువల్ కరెన్సీలతో లావాదేవీలు నిర్వహించేవారు సొంతంగా రిస్క్ భరిస్తున్నట్టు గుర్తించాలని ఆర్బీఐ లోగడే హెచ్చరించింది. బిట్‌కాయిన్ తరహా కరెన్సీలతో ఆర్థిక, న్యాయ, వినియోగదారు రక్షణ, భద్రతా సంబంధ సవాళ్లు నెలకొన్నాయనేది ఆర్బీఐ ఆందోళన. -
గతవారం బిజినెస్
మార్చిలో మెరుగుపడిన తయారీ కార్యకలాపాలు మూడు నెలల క్షీణత తర్వాత మార్చిలో తయారీ రంగ కార్యకలాపాలు మళ్లీ కాస్త మెరుగుపడ్డాయి. దేశీయంగా తయారీ రంగ కార్యకలాపాల తీరుతెన్నులను తెలియజేసే ఎస్బీఐ వార్షిక కాంపోజిట్ సూచీ తాజాగా కీలకమైన 50 పాయింట్ల మార్కును దాటి 50.3కి చేరడం దీనికి నిదర్శనం. ఇక నెలవారీ సూచీ కూడా మెరుగుపడింది. ఫిబ్రవరిలో 49.2గా ఉండగా.. మార్చిలో 53.3కి చేరిందని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. సూచీ విలువ 5052 మధ్యలో ఉంటే స్వల్ప వృద్ధిని, 5255 మధ్య ఉంటే ఒక మోస్తరు వృద్ధిని సూచిస్తుంది. ఏడాదిలో లక్ష ’విటారా బ్రెజా’ విక్రయాలు దిగ్గజ వాహన తయారీ కంపెనీ ’మారుతీ సుజుకీ’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్యూవీ ’విటారా బ్రెజా’ విక్రయాలు లక్ష యూనిట్ల మార్క్‌ను అధిగమించినట్లు ప్రకటించింది. విటారా బ్రెజాను ఆవిష్కరించిన ఏడాది కాలంలోపే విక్రయాలు 1.1 లక్షల యూనిట్లను దాటేశాయని కంపెనీ పేర్కొంది. మారుతీ సుజుకీ.. విటారా బ్రెజాను గతేడాది మార్చిలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎస్బీఐ కార్డ్‌లో వాటాలు పెంచుకోనున్న ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ సంస్థ ఎస్బీఐ కార్డ్‌లో జూన్ నాటికల్లా వాటాలను 74 శాతానికి పెంచుకోనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం కొన్ని నియంత్రణపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ’ఎస్బీఐ కార్డ్ ఉన్నతి’ని ఆవిష్కరించిన సందర్భంగా ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీతో రెండు క్రెడిట్ కార్డు జాయింట్ వెంచర్స్‌లో వాటాలను 74 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలకు ఎస్బీఐ బోర్డు ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. బిట్ కాయిన్లు చట్ట వ్యతిరేకం: కేంద్రం బిట్ కాయిన్లు తరహా వర్చువల్ కరెన్సీ (డిజిటల్ రూపంలో ఉండేవి) వినియోగం చట్ట విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని ఆర్బీఐ గుర్తించలేదని, వీటి కొనుగోళ్లు, లావాదేవీలు మనీలాండరింగ్ వ్యతిరేక చట్టం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. వర్చువల్ కరెన్సీ వాడకం వల్ల తలెత్తే ఆర్థిక, చట్టపరమైన, భద్రతా ముప్పు గురించి ట్రేడర్లను, వాటిని వినియోగించేవారిని ఆర్బీఐ ఇప్పటికే హెచ్చరించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ తెలిపారు. చెల్లింపుల కోసం బిట్ కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీల సృష్టికి ఏ సెంట్రల్ బ్యాంకు కూడా అనుమతించలేదన్నారు. మూడేళ్లుగా నష్టాల్లోనే 43 కేంద్ర సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన 43 సంస్థలు (సీపీఎస్ఈ) మూడేళ్లుగా (2013–16) నష్టాలతోనే ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ఎల్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉన్నాయి. వనరుల కొరత, సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకోవడం, తీవ్రమైన పోటీ, బలహీనమైన మార్కెటింగ్ విధానాలు, నిర్వహణ లోపం నష్టాలకు కారణాలు. ఈ జాబితాలో బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్, హిందుస్థాన్ యాంటీబయోటిక్స్, హెచ్ఎంటీ వాచెస్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ సైతం ఉన్నాయి. 456 బిలియన్ డాలర్లకు తగ్గిన విదేశీ రుణభారం గతేడాది మార్చి నుంచి డిసెంబర్ ఆఖరు నాటికి భారత విదేశీ రుణభారం మొత్తం 456 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీర్ఘకాలికమైన, వాణిజ్యపరమైన విదేశీ రుణాలు తగ్గడం ఇందుకు కారణం. గతేడాది మార్చి ఆఖరు నాటి పరిమాణంతో పోలిస్తే ఈ తగ్గుదల 29 బిలియన్ డాలర్లు. ఎనిమిది రంగాల గ్రూప్ పేలవ పనితీరు! ఎనిమిది పరిశ్రమల గ్రూప్ ఫిబ్రవరిలో పేలవ పనితీరు ప్రదర్శించింది. ఈ రంగాల వృద్ధి రేటు కేవలం ఒక శాతంగా నమోదయ్యింది. గడచిన ఏడాది కాలంలో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి నమోదుకాలేదు. క్రూడ్ ఆయిల్, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తి 2016 ఫిబ్రవరితో పోల్చితే 2017 ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణించడం దీనికి ప్రధాన కారణం. కాగా బొగ్గు, స్టీల్, విద్యుత్ ఉత్పత్తి బాగుండడం మొత్తం సూచీ వృద్ధిలో ముగియడానికి కారణమైంది. ఈ ఎనిమిది రంగాలు 2015లో 0.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, 2017 జనవరిలో 3.4 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 38 శాతం. లక్ష్యాన్ని దాటిన ద్రవ్యలోటు ప్రభుత్వ ఆదాయం వ్యయానికి మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని ఫిబ్రవరి ముగిసే నాటికే దాటిపోయింది.ద్రవ్యలోటు ఫిబ్రవరిలో 6.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2016–17 బడ్జెట్ లక్ష్యం (మార్చి 31తో ముగిసిన కాలం) రూ.5.34 లక్షల కోట్లు. అంటే ఇది లక్ష్యంలో ఫిబ్రవరి నాటికే 113.4 శాతానికి చేరిందన్నమాట. పన్నుయేతర ఆదాయాలు తగ్గడం దీనికి కారణం. విదేశీ మారక నిల్వలు.. 368 బిలియన్ డాలర్లు భారత్ విదేశీ మారక నిల్వలు మార్చి 24తో ముగిసిన వారంలో, అంతక్రితం ఇదే వారంతో పోలిస్తే 1.15 బిలియన్ డాలర్లు పెరిగాయి. 367.93 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మొత్తం నిల్వల్లో కరెన్సీ అసెట్స్‌గా పేర్కొనే డాలర్ నిల్వలు 344.23 బిలియన్ డాలర్లకు చేరాయి. చిన్న మొత్తాల్లో పొదుపు చేసే ఖాతాదారులకు నిరాశను మిగుల్చుతు కేంద్ర ప్రభుత్వం మరోసారి స్మాల్ సేవింగ్స్‌పై ఇచ్చే వడ్డీ రేటును తగ్గించింది. పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), కిసాన్ వికాస్ పత్రాలు, సుకన్య సమృద్ధి స్కీమ్‌లపై 0.1 శాతం వడ్డీ తగ్గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభ మయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తి కాగలదని అంచనా. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇవి ఎస్బీఐ శాఖలుగా పనిచేయనున్నాయి. మరోవైపు అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్బీఐ కొత్త లోగోతో దర్శనమివ్వనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమ్ ఇక రెక్కలు విప్పుకోనుంది. ఈ స్కీమ్ పరిధిలో విమాన సర్వీసులను అందించేందుకు దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్‌లైన్స్ సంస్థలను, 128 రూట్లను కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 70 ఎయిర్‌పోర్టు లను దీనిద్వారా అనుసంధానం చేయనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో 31 ఎయిర్‌పోర్టులు నిర్వహణలో లేనివే. మరో 12 అరకొర సర్వీసులున్న ఎయిర్‌పోర్టులను కూడా జాబితాలో చేర్చారు. బీఎస్–3 ప్రమాణాలతో ఉన్న వాహన విక్రయాలు ఇక జరగవు. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–3 వాహనాలను విక్రయించడం, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని వాహన కంపెనీలు బీఎస్–4 వాహనాలను మాత్రమే వినియోగదారులకు విక్రయించాల్సి ఉంటుంది. డీల్స్.. ⇒ వాహన విడిభాగాల కంపెనీ మదర్సన్ సుమి సిస్టమ్స్ (ఎంఎస్ఎస్ఎల్) ఫిన్లాండ్కు చెందిన పీకేసీ గ్రూప్ పీఎల్సీ కొనుగోలును పూర్తి చేసింది. ఈ డీల్ విలువ రూ.4,150 కోట్లు. ⇒ టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన మొబైల్ టవర్ల విభాగం భారతీ ఇన్ఫ్రాటెల్లో 10.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను కేకేఆర్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(సీపీపీఐబీ) కన్సార్షియమ్కు రూ.6,193.9 కోట్లకు విక్రయించామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. 10.3 శాతం వాటాకు సమానమైన 19 కోట్లకు పైగా షేర్లను ఒక్కో షేర్‌ను రూ.325 సగటు ధరకు విక్రయించామని వివరించింది. ఈ వాటా విక్రయం కారణంగా వచ్చిన నిధులను రుణభారం తగ్గించుకోవడానికి వినియోగించాలని ఎయిర్టెల్ కంపెనీ భావిస్తోంది. వాటా విక్రయానంతరం భారతీ ఇన్ఫ్రాటెల్లో భారతీ ఎయిర్‌టెల్‌కు 61.7 శాతం వాటా, కేకేఆర్, సీపీపీఐబీకు 10.3 శాతం చొప్పున వాటాలుంటాయి. ⇒ ఐటీ కంపెనీ జెన్సర్ టెక్నాలజీస్ బెంగళూరుకు చెందిన కీస్టోన్ లాజిక్ కంపెనీని కొనుగోలు చేసింది. డీల్ వివరాలు తెలియాల్సి ఉంది.