సాక్షి, న్యూఢిల్లీ : బిట్‌కాయిన్స్‌పై మోజుతో ట్రేడింగ్ చేస్తున్న ఇన్వెస్టర్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బిట్‌కాయిన్ సహా వర్చువల్ కరెన్సీలో ట్రేడింగ్ చేసే వారు సొంతంగా రిస్క్ తీసుకోవాలని, దీనికి ఎలాంటి పూచీ ఉండదని స్పష్టం చేసింది. బిట్‌కాయిన్ ధర కేవలం స్పెక్యులేషన్‌పైనే ఆధారపడి ఉంటుందని, ఫలితంగా వీటి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ తరహా పధకాల్లో అత్యధిక రిస్క్ పొంచి ఉంటుందని, వర్చువల్ కరెన్సీల్లో భారీ ఒడిదుడుకులతో రిటైల్ ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బిట్‌కాయిన్ సహా వర్చువల్ కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్, ఎలక్ర్టానిక్ ఫార్మాట్‌లో ఉండే కరెన్సీలకు హ్యాకింగ్ ముప్పుతో పాటు పాస్‌వర్డ్ కోల్పోవడం, మాల్‌వేర్ దాడి మూలంగా డబ్బును శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. బిట్‌కాయిన్, వర్చువల్ కరెన్సీల నుంచి వినియోగదారులను కాపాడే పటిష్ట యంత్రాంగం కోసం ఆర్‌బీఐ, సెబీతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment