speculation
-
అఖిలేష్‌పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య తన కొత్త పార్టీని ఫిబ్రవరి 22న ప్రకటిస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మౌర్య నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ, అధినేత అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాశారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అఖిలేష్ యాదవ్‌కు రాసిన లేఖలో మౌర్య.. తాను సమాజ్‌వాదీ పార్టీలో చేరినప్పటి నుండి, పార్టీకి మద్దతు కూడగట్టేందుకు నిరంతరం ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే పార్టీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వందలాది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, గుర్తులు మారిన తర్వాత కూడా పార్టీ మద్దతును పెంచుకోవడంలో విజయం సాధించానన్నారు. ఫలితంగా ఎస్పీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని, ఒకప్పుడు పార్టీలో 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వారి సంఖ్య 110కి చేరిందని పేర్కొన్నారు. తన కృషితో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిన తర్వాత కూడా తనను శాసనమండలికి పంపారని, ఆ వెంటనే తనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారని మౌర్య తెలిపారు. ఇంతటి గౌరవం అందించినందుకు ధన్యవాదాలని మౌర్య పేర్కొన్నారు. -
.. ఈ విషయం కాస్తా ముందు తెలిస్తే ఓడించేవాళ్లం!
.. ఈ విషయం కాస్తా ముందు తెలిస్తే ఓడించేవాళ్లం! -
తెరపైకి పుతిన్ బాడీ డబుల్ థియరీ!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలో పాశ్చాత్య మీడియా వీలైనంత వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ పోతోంది. ఉక్రెయిన్ యుద్ధం వంకతో వీలైనంత రీతిలో పుతిన్‌ను బద్నాం చేస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఎక్కువ కాలం బతకడంటూ వీడియో కథనాలతో ఊదరగొడుతోంది. ఇప్పుడు ఏకంగా మరో థియరీని తెరపైకి తెచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం బాగోలేదని చాలాకాలం నుంచి వెస్ట్రన్ మీడియా వరుస కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో 69 ఏళ్ల పుతిన్ తనకు బాడీ డబుల్‌ను తెరపైకి తెచ్చాడంటూ ఉక్రెయిన్ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్.. నిత్యం మెడికల్ చెకప్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే అధికారిక కార్యక్రమాలకు ఆయన తన బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నాడని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైర్య్లో బుడానోవ్ చెప్తున్నాడు. పుతిన్ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తే.. చాలా భేటీల్లో ఆయన హైట్, వెయిట్, చెవుల భాగంలో తేడాలను పరిశీలించవచ్చని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మనిషి చేతి వేళ్లు యూనిక్‌గా ఉన్నట్లే.. చెవి భాగం సైతం యూనిక్‌గా ఉంటుంది. అలాంటిది పుతిన్‌లో ఆ భాగంలో తేడాను సులువుగా గమనించవచ్చు. బహుశా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్.. ప్రజలకు కనిపించేందుకు వీలుగా తన బాడీ డబుల్స్‌ను ఉపయోగించుకుంటున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశాడు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్. అంతేకాదు ఇరాన్ పర్యటనకు సైతం పుతిన్ తన బాడీ డబుల్నే పంపించాడని, పైగా ఆ పర్యటనలో పుతిన్ బాగా జోష్‌లో కనిపించిన విషయం ఆ అనుమానాల్ని మరింత బలపరుస్తోందని చెప్పాడాయన. మరోవైపు ఈ వాదనపై క్రెమ్లిన్ గప్‌చుప్‌గా ఉండిపోయింది. పుతిన్ బాడీ డబుల్ థియరీ ఇలా తెర మీదకు రావడం ఇదే కొత్త కాదు. 2018లో పుతిన్ లాగ ముగ్గురు ఉన్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆసక్తికర కథనం ప్రచురించింది. ఆ సమయంలో ట్విటర్లోనూ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మూడు భిన్నమైన రూపాలున్న పుతిన్ ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. బాడీ డబుల్ అంటే.. ఒక వ్యక్తి బదులుగా అలాంటి కవళికలు ఉన్న వ్యక్తి ఆ పనిని పూర్తి చేయడం. చరిత్రలో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, ఫీల్డ్ మార్షల్ బెర్నార్డ్ లా మోంట్‌గోమెరీ, సద్దాం హుస్సేన్, జోసెఫ్ స్టాలిన్లు బాడీ డబుల్‌ను ఉపయోగించేవాళ్లన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదీ చదవండి:: గొప్పలకు పోతున్న రష్యా!... కౌంటర్ ఇచ్చిన ఆర్మీ ఇంటెలిజెన్స్ -
వెయ్యి కోట్ల లక్ష్యం వైపు విజయ డెయిరీ: తలసాని
మాదాపూర్ (హైదరాబాద్): మూతపడిపోతుందని ఊహాగానాలు వినిపించిన విజయ డెయిరీ రూ.650 కోట్ల టర్నోవర్ సాధించి రూ.1000 కోట్ల లక్ష్యం వైపు దూసుకుపోతోందని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మాదాపూర్ లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరగనున్న డెయిరీ, ఫుడ్ ఎక్స్పోను హోంమంత్రి మహమూద్ అలీతో కలసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నగరంలో పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. ఈ ఎక్స్పోను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మీడియా డే మార్కెటింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రదర్శనలో 100కు పైగా ఎగ్జిబిటర్లు, 120 బ్రాండ్లు తమ ఉత్పత్తులను, సేవలను ప్రదర్శిస్తున్నాయన్నారు. మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్, నీరు రైతులకు సమృద్ధిగా లభిస్తున్నాయని చెప్పారు. నగరంలో పాల డిమాండ్‌లో 30 శాతం మాత్రమే తీర్చగలుగుతున్నామన్నారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. -
‘దయచేసి పుకార్లను ప్రచారం చేయకండి’
వాస్తవాలు తెలియకుండా పుకార్లను ప్రచారం చేయోద్దంటూ అభ్యర్ధిస్తున్నారు రణ్‌దీర్ కపూర్. విషయం ఏంటంటే కొన్ని రోజులుగా రణధీర్ కపూర్ సోదరుడు, రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారని .. అది కూడా అడ్వాన్స్ స్టేజిలో బయటపడిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రణ్‌ధీర్ కపూర్ అవాస్తవాలను ప్రచారం చేయోద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా సోదరుని అనారోగ్యం గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. తనకు ఎలాంటి వ్యాధి సోకిందో మా సోదరునికే తెలియదు. వ్యాధి నిర్ధారణకు సంబంధంచి ఇంకా ఎటువంటి పరీక్షలు కూడా ప్రారంభించలేదు. కానీ ఇంతలోనే రిషి కపూర్‌కి క్యాన్సర్.. అది కూడా చివరి దశలో ఉంది అంటూ పుకార్లను ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి మా మనోధైర్యాన్ని దెబ్బకొట్టకండి. మా సోదరున్ని ప్రశాంతంగా పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చేలా సహకరించండి. టెస్ట్‌ల్లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అంటూ తెలిపారు. గత శనివారం రిషి కపూర్ తన భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్‌తో కలిసి వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా రిషి కపూర్ తన శ్రేయోభిలాషులను అధైర్య పడవద్దంటూ.. వారి ప్రేమాభిమానాలు, ఆశీర్వాద బలం వల్ల తాను త్వరలోనే క్షేమంగా తిరిగి వస్తానంటూ ట్వీట్ చేశారు. రిషి కపూర్ అమెరికా వెళ్లిన రెండు రోజులకే ఆయన తల్లి కృష్ణ రాజ్ కపూర్ మృతి చెందారు. దాంతో వారు ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాలేక పోయారు. -
ఆ రిస్క్ మీదే..
సాక్షి, న్యూఢిల్లీ : బిట్‌కాయిన్స్‌పై మోజుతో ట్రేడింగ్ చేస్తున్న ఇన్వెస్టర్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బిట్‌కాయిన్ సహా వర్చువల్ కరెన్సీలో ట్రేడింగ్ చేసే వారు సొంతంగా రిస్క్ తీసుకోవాలని, దీనికి ఎలాంటి పూచీ ఉండదని స్పష్టం చేసింది. బిట్‌కాయిన్ ధర కేవలం స్పెక్యులేషన్‌పైనే ఆధారపడి ఉంటుందని, ఫలితంగా వీటి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తరహా పధకాల్లో అత్యధిక రిస్క్ పొంచి ఉంటుందని, వర్చువల్ కరెన్సీల్లో భారీ ఒడిదుడుకులతో రిటైల్ ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బిట్‌కాయిన్ సహా వర్చువల్ కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్, ఎలక్ర్టానిక్ ఫార్మాట్లో ఉండే కరెన్సీలకు హ్యాకింగ్ ముప్పుతో పాటు పాస్వర్డ్ కోల్పోవడం, మాల్వేర్ దాడి మూలంగా డబ్బును శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. బిట్‌కాయిన్, వర్చువల్ కరెన్సీల నుంచి వినియోగదారులను కాపాడే పటిష్ట యంత్రాంగం కోసం ఆర్బీఐ, సెబీతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. -
మరోజలప్రళయం రాబోతోందా ?
-
అది ద్రోహుల పార్టీ
ఠాణే: ఎన్సీపీ... ద్రోహుల పార్టీ అని శివసేన నాయకుడు ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు శరద్‌పవార్ పార్టీలో చేరడంపై స్పందిస్తూ ఎన్సీపీని మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. అంతేకాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ లోపాలను ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపారు. శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ల నేతృత్వంలో డోంబివలిలో ఆదివారం రాత్రి జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ విశ్వసనీయత కలిగిన కూటమిని ఎంపిక చేసుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘దివంగత అధినేత బాల్‌ఠాక్రే పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించినవారిని గుర్తించి వారికి కీలక బాధ్యతలను అప్పగించారు. అయితే అత్యాశ కారణంగా కొందరు సొంత పార్టీకి ద్రోహం చేసి ఇతర పార్టీలలో చేరుతున్నారు. అందులో ఆనంద్ పరాంజపే ఒకరు. ప్రజలు అటువంటి నాయకులకు తగు బుద్ధి చెబుతారు. ప్రజల్లో మాకు ఎంతో పట్టు ఉంది. అదే మా ఆస్తి. వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏమిటో చూపుతాం. ఎన్సీపీలో చేరుతున్న వారికి అదొక మునిగిపోయే నావ అని అర్ధం కావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా పర్భణి ఎంపీ గణేశ్ దుధ్గావ్కర్ ఎన్సీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘శివసేనలో ప్రజాస్వామ్యం. నా మాటే వేదం. నా నిర్ణయమే అంతిమం’ అని అన్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు పెరోల్ మంజూరు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇటువంటి వెసులుబాటు కల్నల్ శ్రీకాంత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్, అసీమానంద్‌లకు కూడా కచ్చితంగా కల్పించాలన్నారు. అనంతరం బీజేపీ అగ్రనాయకుడు గోపీనాథ్ ముండే మాట్లాడుతూ ఎన్సీపీ తమ బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదన్నారు.