
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువ జీఎస్టీ వృద్ధి నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో తమిళనాడు 8.2%, కేరళ 7.8%, కర్నాటక 10.4%, తెలంగాణ 5.6%, మరో సరిహద్దు రాష్ట్రం ఒడిశా 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏపీ కేవలం 4 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన ఏడాది ఫిబ్రవరిలో రూ.3,678 కోట్లుగా ఉన్న ఏపీ జీఎస్టీ వసూళ్లు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.3,817 కోట్లకు చేరాయి. అంటే.. జీఎస్టీ వసూళ్లలో ఏపీ నాలుగు శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు (సీజీఎస్టీ, ఐజీఎస్టీ కాకుండా) 10 శాతం వృద్ధితో రూ.1,28,760 కోట్ల నుంచి రూ.1,41,945 కోట్లకు చేరాయి. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.40,791 కోట్లకు చేరుకుంది. గతేడాది 11 నెలలతో పోలిస్తే రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో కేవలం 1.4 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment