
శాన్‌ఫ్రాన్సిస్కో : బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ యాడ్స్‌ను ఫేస్‌బుక్ తన ఫ్లాట్‌ఫాంలపై నిషేదించింది. ఇన్‌స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్‌వర్క్, మెసెంజర్‌లలోనూ వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయించింది. తప్పుదారిపట్టించే ఫైనాన్షియల్ ప్రోడక్టులను ప్రోత్సహించే ప్రకటనలను నిషేధించినట్టు ఫేస్‌బుక్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే నూతన ప్రోడక్టుల గురించి ప్రజలు ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
క్రిప్టోకరెన్సీలు, ఐసీఓలపై పలు కంపెనీలు జారీ చేస్తున్న ప్రకటనలు విశ్వసనీయంగా లేవని ఫేస్‌బుక్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ రాబ్ లెథెరెన్ చెప్పారు. ఈ తరహా ప్రకటనలు ఫేస్‌బుక్ ఫ్లాట్‌ఫాంలపై నుంచి నిషేధిస్తున్నామన్నారు. ఫేస్‌బుక్ యాడ్స్‌పై ప్రజలు ఎలాంటి అభ్యంతరాలున్నా తమకు నివేదించవచ్చని కోరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు ఫేస్‌బుక్‌లో తావులేదని కంపెనీ స్పష్టం చేసింది.