వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేసుబుక్ ట్రంప్ ఖాతాను రెండేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఫేస్‌బుక్ రెండేళ్లు నిలిపివేసింది. ట్రంప్ చర్యలు తమ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫేస్‌బుక్ తెలిపింది. తాజా చర్యతో 2023 వరకు ట్రంప్ ఫేస్‌బుక్ మీడియాకు దూరంగా ఉండాల్సిందే.
ట్రంప్‌పై నిషేధం జనవరి 7నుంచి అమలులోకి వచ్చిందని సంస్థ గ్లోబల్ ఎఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్గ్ తెలిపారు. కొంత కాలం తరువాత ఈ నిర్ణయంపై సమీక్ష చేపడతామని కూడా తెలిపారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం, జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్స్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లు చెలరేగడానికి కారణం ట్రంప్ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో చేసిన పోస్టులేనని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ చర్య తీసుకుంది.
ట్రంప్ స్పందన
తాజా నిషేధంపై సేవ్ అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ ద్వారా ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేసిన లక్షలాది మందికి ఫేస్‌బుక్ తీరు అవమానకరమని ట్రంప్ అన్నారు. రికార్డు స్థాయిలో తమకు ఓటు వేసిన 75 మిలియన్ల ప్రజలను అవమానించిదని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్‌పై ట్రంప్ విరుచుకు పడ్డారు. తదుపరి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వైట్‌హౌస్‌లో మార్క్, అతని భార్యకు ఎలాంటి విందులు ఉండవు.. అంతా వ్యాపారమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా, 2023 వరకు ఫేస్‌బుక్ బ్యాన్ ఉంటుంది.
చదవండి: Twitter దుందుడుకు చర్య: ఉపరాష్ట్రపతికి బ్లూటిక్ తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment