mark zuckerberg
-
నాకు మరణశిక్ష పడేలా ఉంది: జుకర్ బర్గ్
వాషింగ్టన్ : ఎవరో ఫేస్బుక్లో (Facebook) పోస్ట్‌లు పెడితే.. దానికి నన్ను బాధ్యుడ్ని చేస్తూ.. నాకు మరణశిక్ష విధించాలని పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నాకు మరణశిక్ష పడేలా ఉంది అని’ మెటా (Meta) సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్ (Joe Rogan Podcast)లో జూకర్బర్గ్ పై విధంగా మాట్లాడారు.ఆ పాడ్‌కాస్ట్‌లో జూకర్ బర్గ్ పాకిస్తాన్ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ఫేస్బుక్ చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఓ నెటిజన్ దైవదూషణకు సంబంధించిన పోస్టులను ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఆ పోస్టు పెట్టినందుకు నాపై పలువురు కోర్టును ఆశ్రయించారు. నాకు మరణశిక్ష విధించాలని కోరారు. ప్రస్తుతం, ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది.ఆ కేసు విచారణపై జూకర్ బర్గ్ ప్రస్తావించారు. స్థానిక నిబంధనలు, సాంస్కృతిక విలువల విషయంలో మెటా నిబద్ధతతో ఉంది. ఉదాహరణకు, పాకిస్తాన్‌కు చెందిన ఓ యూజర్ దైవాన్ని దూషిస్తూ పోస్టులు పెట్టారు. అలా పోస్టులు పెట్టడంపై పలువురు నాపై దావా వేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పాకిస్తాన్‌కు వెళ్లాలని అనుకోవడంలేదు. కాబట్టి నేను దాని గురించి ఆందోళన చెందడం లేదు’ అని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. Power of Pakistan 😂 pic.twitter.com/V4qokhbq76— Kreately.in (@KreatelyMedia) February 11, 2025👉చదవండి : తగ్గేదేలే.. మరోసారి ఎల్ అండ్ టీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్) రాయని డైరీ
వాషింగ్టన్ లో ప్రెసిడెంట్ ఇనాగరేషన్ కు వెళ్లి, తిరిగి క్యాలిఫోర్నియాలో మేము ఉంటున్న పాలో ఆల్టోకి వచ్చేసరికి వైట్ హౌస్ నుండి ఫోన్ కాల్!‘‘మిస్టర్ జుకర్‌బర్గ్! నేను అలెక్స్ ఎన్ వాంగ్, యునైటెడ్ స్టేట్స్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌ని మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ లైన్ లోకి రావటం కోసం దయచేసి కొద్ది క్షణాలు మీరు వేచి ఉండగలరా?’’ – అని !! ‘‘ఎస్... ప్లీజ్’’ అన్నాను.‘ఎవరు?!’ అన్నట్లు ప్రిసిల్లా నావైపు చూసింది. టేబుల్ మీద ఉన్న ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ లో ట్రంప్ ఫొటోను కనుసైగగా ఆమెకు చూపించాను.పిల్లల్ని తీసుకుని ప్రిసిల్లా పక్క గదిలోకి వెళ్లిపోయింది. మాక్సిమా, ఆగస్ట్, ఆరేలియా ఎప్పుడూ తల్లిని చుట్టుకునే ఉంటారు. తొమ్మిదేళ్లొకరికి, ఏడేళ్లొకరికి. రెండేళ్లొకరికి! కాలేజ్‌లో ప్రిసిల్లా అంటే... ప్రిసిల్లా–నేను. ఇప్పుడు ప్రిసిల్లా అంటే ‘ఆల్ గర్ల్ టీమ్’ లా పిల్లలు–తను! కలిసి తిరుగుతుంటారు. కలిసి ఆడుతుంటారు. బుద్ధి పుడితే ఎప్పుడైనా ‘పోన్లే పాపం డాడ్...’ అన్నట్లు నన్ను తమ జట్టులోకి చేర్చుకుంటారు.‘‘మిస్టర్ జుకర్‌బర్గ్! లైన్ లోనే ఉన్నారా...?’’ అన్నారు అలెక్స్ ఎన్ వాంగ్, నిర్ధారణ కోసం.‘‘ఎస్... మిస్టర్ వాంగ్! నేను లైన్ లోనే ఉన్నాను...’’ అన్నాను.హఠాత్తుగా ‘‘హాయ్ జాక్...’’ అంటూ లైన్ లోకి వచ్చేశారు ట్రంప్!‘‘సర్ప్రైజింగ్, మిస్టర్ ప్రెసిడెంట్!’’ అన్నాను.‘‘నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే నీకు ఫోన్ చేశాన్ జాక్...’’ అన్నారు ట్రంప్!!‘‘ఏ విషయం గురించి మిస్టర్ ప్రెసిడెంట్!!’’ అని అడిగాను.‘‘వెల్... జాక్! నా ఇనాగరేషన్ లో నువ్వు నీ పక్కనున్న స్త్రీమూర్తిని – ఆమె కంఠానికి దిగువనున్న భాగం వైపు – ఆపేక్షగా చూశావని అంతా నిన్ను ట్రోల్ చేయటం గురించే అంటున్నా! మగవాళ్లు నిప్పులా ఉన్నా నిందలు తప్పవు. లుక్! స్త్రీ విషయంలో నోరు జారిన మగాడినైనా ఈ లోకం క్షమిస్తుంది కానీ, చూపు జారిన మగాడికి ఏ లోకంలోనూ క్షమాపణ లభించదు...’’ అన్నారు ట్రంప్.‘‘థ్యాంక్యూ మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నాను.ఆయన అంటున్న ఆ స్త్రీ మూర్తి లారెన్ సాంచెజ్! జెఫ్ బెజోస్ ప్రియురాలు. ఇనాగరేషన్ లో నాకు ఒక పక్క నా భార్య,ఇంకో పక్క ఆమె ఉన్నారు. ఆమెకు అటువైపున నిలబడి ఉన్న జెఫ్ బెజోస్ ఏదో చెబుతుంటే, నేను తలతిప్పి చూసినప్పుడు, నా చూపు ఆమె ‘లో–నెక్’ లోపలికి స్లిప్ అయినట్లుంది. అంత బ్యాడ్ మోమెంట్ లేదు నా లైఫ్‌లో!ఇలాంటి సంక్షోభ సమయంలో లోకంలోని ఒక మగవాడు నాకు సపోర్ట్‌గా రావటం బాగుంది. అయితే ఆ మగవాడు డోనాల్డ్ ట్రంప్ కాకపోయుంటే నాకు మరింత సపోర్టివ్‌గా అనిపించేది.‘‘వింటున్నావా జాక్? నువ్వు ఆమెను చూడాలని చూడలేదని నాకు తెలుసు. చూడటం వేరు. చూపు పడటం వేరు. కానీ జాక్, నీపైన వచ్చిన లక్ష కామెంట్లలో ఒకటైతే నాకు భలే నచ్చింది. మొదటిసారి నువ్వొక హ్యూమన్ లా స్పందించావట! హాహ్హహా...’’ అంటూ పెద్దగా నవ్వారు ట్రంప్. నేనూ నవ్వాపుకోలేకపోయాను.‘హాయ్ జాక్’ అంటూ లైన్ లోకి వచ్చినంత హఠాత్తుగా ‘బాయ్ జాక్’ అంటూ లైన్ లోంచి వెళ్లిపోయారు ట్రంప్.ఫోన్ పెట్టేశాక, ‘‘ఏమిటట?’’ అని ప్రిసిల్లా.పక్కన పిల్లల్లేరు! నిద్రబుచ్చి వచ్చినట్లుంది.‘‘అదే, ఆ బ్యాడ్ మోమెంట్ గురించి ట్రంప్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు... ’’ అని చెప్పాను.ప్రిసిల్లా నవ్వింది.‘‘అది బ్యాడ్ మోమెంట్ కాదు బాస్, బ్యాడ్ ఫొటోగ్రాఫ్... ‘ అంది, నన్ను అతుక్కుపోతూ.ప్రిసిల్లా అంటే... ఇప్పుడు మళ్లీ ప్రిసిల్లా–నేను... కాలేజ్ డేస్ తర్వాత ఇన్నేళ్లకు! -
త్వరలో స్మార్ట్ ఫోన్ అంతం!! తర్వాత రాబోయేది ఇదే..
విశ్వవ్యాప్త సాంకేతికతను అంగీకరించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. దానిని అంతే వేగంగా ఒడిసిపట్టుకుని అంగీకరిస్తుంటాడు కూడా. అయితే దశాబ్దాలపాటు మనందరి జీవితంలో భాగమైన మొబైల్ ఫోన్.. త్వరలో అంతం కానుందా?. అన్నింటికీ నెక్స్ట్(అడ్వాన్స్డ్) లెవల్ కోరుకునే మనిషికి వాటి స్థానంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది?..మనిషి జీవితంలో మొబైల్ ఫోన్లు(Mobile Phones) రాక ఒక క్రమపద్ధతిలో జరిగింది. కమ్యూనికేషన్లో భాగంగా.. రాతి కాలం నుంచి నేటి ఏఐ ఏజ్ దాకా రకరకాల మార్గాలను మనిషి అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పొగతో సిగ్నల్స్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పావురాల సందేశం, డ్రమ్ములు వాయించడం, బూరలు ఊదడం లాంటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేవాడు. కొన్ని ఏండ్లకు అది రాతపూర్వకం రూపంలోకి మారిపోయింది. ఆపై.. ఆధునిక యుగానికి వచ్చేసరికి టెలిగ్రఫీ, టెలిఫోనీ, రేడియో కమ్యూనికేషన్, టెలివిజన్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్-ఈమెయిల్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా.. ఆపై మోడ్రన్ కమ్యూనికేషన్(Modern Communication)లో భాగంగా ఏఐ బేస్డ్ టూల్స్ ఉపయోగం పెరిగిపోవడం చూస్తున్నాం. అయితే.. ఇన్నేసి మార్పులు వచ్చినా దశాబ్దాల తరబడి మొబైల్ ఫోన్ల డామినేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్ ఒక అవసరంగా మారిపోయిందది. మరి అలాంటిదానికి అసలు ‘అంతం’ ఉంటుందా?అమెరికా వ్యాపారవేత్త, ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు, ప్రస్తుత మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) సెల్‌ఫోన్ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్ఫోన్ల అంతం త్వరలోనే ఉండబోతోందని, వాటి స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో వేరబుల్ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) అనేది మనిషి జీవితంలో భాగం కానుంది. సంప్రదాయ ఫోన్ల కంటే స్మార్ట్ గ్లాసెస్‌ను ఎక్కువగా వినియోగిస్తాడు. వీటిని వాడడం చాలా సులువనే అంచనాకి మనిషి త్వరగానే వస్తాడు. అవుట్‌డేటెడ్ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే. నా దృష్టిలో రాబోయే రోజుల్లో తమ చుట్టుపక్కల వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు స్మార్ట్ గ్లాసెస్(Smart Glasses)లాంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఆ సంఖ్య ఫోన్ల కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి’’ అని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.అలాగే 2030 నాటికి సెల్ఫోన్ల వాడకం బాగా తగ్గిపోతుందని.. దానికి బదులు స్మార్ట్‌గ్లాసెస్ తరహా టెక్నాలజీ వాడుకలో ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వేరబుల్ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని.. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదని, అంచలంచెలుగా అది జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్ యాక్ససరీస్‌కు మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది. తాజా సర్వేల ప్రకారం.. గత ఐదేళ్లుగా స్మార్ట్ వేరబుల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ వేరబుల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్‌గ్లాసెస్ వినియోగమూ పెరిగింది కూడా. రేబాన్ మెటా, ఎక్స్ రియల్ ఏ2, వచుర్ ప్రో ఎక్స్ఆర్, సోలోస్ ఎయిర్‌గో విజన్, అమెజాన్ ఎకో ఫఫ్రేమ్స్, లూసిడ్ తదితర బ్రాండ్లు మార్కెట్లోకి అందుబాటులోకి ఉన్నాయి. యాపిల్ కంపెనీ యాపిల్ విజన్ ప్రో పేరిట మార్కెట్‌కు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. మరికొన్ని కంపెనీలు కూడా ఇంకా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ చేతికి అత్యంత అరుదైన వాచ్!! -
మెటా క్షమాపణలు చెప్పాలి.. పార్లమెంటరీ కమిటీ సమన్లు..?
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్(Meta) చర్యలను భారత పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచిస్తోంది.అసలేం జరిగిందంటే..2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నిక(2024 Lok Sabha elections)ల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ మార్క్ జూకర్బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని చెప్పారు. జూకర్బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.తప్పుడు సమాచారం..కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దూబే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసినందుకు కమిటీ(parliamentary panel) మెటాపై చర్య తీసుకోవాలని చూస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా తప్పుడు సమాచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అన్నారు దూబే అన్నారు.ఇదీ చదవండి: పనితీరు సరిగాలేదా? సర్దుకోవాల్సిందే..సమాచార నిర్ధారణకు బాధ్యతమెటాకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ తీసుకున్న నిర్ణయం.. తప్పుడు సమాచారం వ్యాప్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలను నొక్కి చెబుతుంది. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పాత్రపై కూడా చర్చ జరగాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ ప్లాట్ఫామ్లో పంచుకునే సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో టెక్ దిగ్గజాలు బాధ్యత వహించాలని చెబుతున్నారు. -
జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు భారత్ సమన్లు
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలపై ఆ సంస్థ బాస్ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ‘అసత్య ప్రచారపు’ వ్యాఖ్యలే అందుకు కారణం. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. అయితే.. జుకర్‌బర్గ్ చేసిన వాదనను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ఎంపీ, ఐటీ & కమ్యూనికేషన్ పార్లమెంటరీ హౌజ్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధృవీకరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకే సమన్లు అని ఎక్స్ వేదికగా తెలిపారాయన. मेरी कमिटि इस ग़लत जानकारी के लिए @Meta को बुलाएगी । किसी भी लोकतांत्रिक देश की ग़लत जानकारी देश की छवि को धूमिल करती है । इस गलती के लिए भारतीय संसद से तथा यहाँ की जनता से उस संस्था को माफ़ी माँगनी पड़ेगी https://t.co/HulRl1LF4z— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 14, 2025ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ తప్పునకు భారత దేశ ప్రజలకు, చట్ట సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందే అని దుబే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అంతకు ముందు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కౌంటర్ బదులిచ్చారు.‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్-19 తర్వాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్‌బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు. .. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోదీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి’’ అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే జుకర్‌బర్గ్ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందన్న అశ్వినీ వైష్ణవ్.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.జుకర్‌బర్గ్ ఏమన్నారంటే..జనవరి 10వ తేదీన ఓ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడారు. 2024 సంవత్సరం భారీ ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ఉదాహరణగా.. భారత్‌తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అన్నిచోట్లా అక్కడి ప్రభుత్వాలు అక్కడ ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్ చేసిన విధానం.. అది దారితీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం అని అన్నారాయన. -
యాపిల్‌పై జుకర్‌బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు
దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్గ్రేడ్లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్‌బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్పాడ్లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాతమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్‌ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్‌బర్గ్ చెప్పారు.యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ గురించి జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు. -
జుకర్‌బర్గ్ చేతికి అరుదైన వాచ్: ధర అన్ని కోట్లా?
ప్రపంచ ధనవంతులలో ఒకరు, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) ఇటీవల ఓ ఖరీదైన, అరుదైన వాచ్ కట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వాచ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.మార్క్ జుకర్‌బర్గ్ కట్టుకున్న వాచ్ గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1'. దీని ధర 9,00,000 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ ధర కోట్లలో ఉండటం వల్ల దీనిని కొనొగోలు చేసేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే ఈ వాచ్ కలిగిన కుబేరుల జాబితాలో జుకర్‌బర్గ్ ఒకరు.గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్'హ్యాండ్ మేడ్ 1' (Hand Made 1) అనేది విలాసవంతమైన, ఖరీదైన వాచ్‌ల జాబితాలో ఒకటి. దీనిని ప్రఖ్యాత స్విస్ వాచ్‌మేకర్ గ్రూబెల్ ఫోర్సే ఎస్ఏ ఉత్పత్తి చేసింది. ఇవి చాలా అరుదైన వాచ్‌లు. ఎందుకంటే కంపెనీ కూడా వీటిని తక్కువ సంఖ్యలో (ఏడాదికి రెండు లేదా మూడు) మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన వాచ్‌లు కట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన పటెక్ ఫిలిప్, ఎఫ్పీ జర్న్ వంటి బ్రాండ్ వాచ్‌లను కట్టుకుని కనిపించారు. కాగా ఇప్పుడు గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్‌తో కనిపించారు. ప్రస్తుతం ఫేస్బుక్ సీఈఓ ధరించిన వాచ్ మీద పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన గడియారాన్ని కట్టుకోవడం వెనుక ఏమైనా ఆలోచన ఉందా? అని ఒకరు అన్నారు. ఫేస్బుక్ సత్యం, వాస్తవాలపై దృష్టి పెట్టాలని మరొకరు పేర్కొన్నారు. ఈ వాచ్ ఖరీదు చాలామంది ఇళ్ల ఖరీదు కంటే ఎక్కువ అని ఇంకొకరు అన్నారు. ఇలా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.వాచ్‌ల మీద అమితాసక్తి కలిగిన మార్క్ జుకర్‌బర్గ్.. అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ల వివాహానికి హాజరైనప్పుడు కూడా వాచ్‌ల ప్రస్తావన వచ్చింది. జుకర్‌బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్, అనంత్ ధరించిన విలాసవంతమైన గడియారాన్ని మెచ్చుకోవడానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్అనంత్ అంబానీ వాచ్ముకేశ్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ ఇటీవల రూ. 22 కోట్ల విలువైన వాచ్ కట్టుకుని కనిపించారు. ఆ వాచ్ ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. -
అమెజాన్ రూ.8.3 కోట్లు విరాళం
కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి అమెజాన్ ఒక మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. తన ప్రైమ్ వీడియో సర్వీస్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనుందని కంపెనీ ప్రతినిధి ఇప్పటికే ధ్రువీకరించారు. ఇందుకోసం అమెజాన్ మరో రూ.8.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో బెజోస్ ట్రంప్‌ను కలవబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.ఇప్పటికే మెటా ఛైర్మన్ మార్క్ జూకర్బర్గ్ ఇటీవల ట్రంప్ నివాసంలో కలిసి తన ప్రమాణ స్వీకార నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాబోయే అధ్యక్షుడితో తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రధాన టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తుంది. కాగా, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అమెజాన్‌ను విమర్శించారు. గతంలో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాజకీయ కవరేజీపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో ట్రంప్ మొదటి హయాంలో పెంటగాన్ కాంట్రాక్ట్‌కు సంబంధించి అమెజాన్‌కు విరుద్ధంగా వ్యవహరించారనే వాదనలున్నాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెజోస్ న్యూయార్క్‌లో జరిగిన డీల్ బుక్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న ప్రణాళికలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. 2023 ప్రారంభంలో కంపెనీ తన ఖాతాను పునరుద్ధరించింది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..ఎలాన్‌మస్క్ ఇప్పటికే ట్రంప్‌నకు పూర్తి మద్దతినిచ్చారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్, వివేక్రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే. -
రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ ఏఐ లామాకు సంబంధించిన విషయాలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో తాను ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని వాచ్‌ను మార్క్ ధరించినట్లు నెటిజన్లు గుర్తించారు. ఈ బల్గారి ఆక్టో ఫినిసిమో ఆల్ట్రా సీఓఎస్సీ(Bulgari Octo Finissimo Ultra COSC) మోడల్ వాచ్ కేవలం 1.7 మిల్లీమీటర్ మందంతో ఉంటుంది. అంటే దాదాపు రెండు క్రెడిట్ కార్డ్‌ల మందం కంటే సన్నగా ఉంటుంది.ఈ వాచ్ ప్రత్యేకతలు..ఈ వాచ్ కేవలం 1.7 మిమీ మందంతో ఉంటుంది.ఈ వాచ్ బీవీఎల్ 180 క్యాలిబర్‌తో గంటకు 28,800 వైబ్రేషన్స్ (4 హెర్ట్జ్) ఫ్రీక్వెన్సీతో మాన్యువల్ వైండింగ్ మూవ్‌మెంట్‌ను కలిగి ఉంటుంది.ఈ గడియారాన్ని సాండ్బ్లాస్టెడ్ టైటానియంతో తయారు చేశారు. వాచ్ పట్టీలు కూడా పూర్తిగా టైటానియంతోనే రూపొందించారు. కాబట్టి ఇది చాలా ఏళ్లు మన్నికగా ఉంటాయి. దాంతోపాటు తేలికపాటి డిజైన్ దీని సొంతం.ఇది COSC సర్టిఫైడ్ గడియారం. అంటే ఇది కఠినమైన కచ్చితత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఈ వాచ్ లిమిటెడ్ ఎడిషన్. ప్రపంచంలో ఇవి 20 మాత్రమే ఉన్నాయి. అందుకే ఇది అంత ప్రత్యేక సంతరించుకుంది.దీని ధర సుమారు 5,90,000 అమెరిన్ డాలర్లు. అంటే రూ.5 కోట్లకు పైనే.లామా 3 కంటే పది రెట్లు ఎక్కువజుకర్బర్గ్ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. మెటా ఏఐ లామా 4 వెర్షన్‌ను 2025 ప్రారంభంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇది తదుపరి తరం ఏఐ మోడల్ అని, లామా 3 కంటే ఇది మరింత మెరుగ్గా పని చేస్తుందన్నారు. ఇందులో రీజనింగ్ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుందని చెప్పారు. లామా 4కు సుమారు 1,60,000 జీపీయూలు(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్- కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ కోసం చిత్రాలు, వీడియోలను రియల్ టైమ్‌లో అందించడానికి ఇది ఉపయోగపడుతుంది) అవసరమని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది లామా 3 కంటే పది రెట్లు ఎక్కువ. -
రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్ ధరించిన మార్క్
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో సుమారు రూ.ఒక కోటి వాచ్ ధరించి కనిపించారు. ఈయన ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తికి ఉన్నారు. తాను ధరించిన వాచ్‌కు సంబంధించి వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు.మార్క్ జుకర్‌బర్గ్ పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించి తన భార్య ప్రిస్సిల్లా చాన్‌తో కలిసి ఉన్న ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తాను షేర్ చేసిన ఇమేజ్‌లోని వాచ్‌కు సంబంధించి నెట్టింట చర్చ జరిగింది. దాంతో పలు సమాజిక మాధ్యమాల్లో తన రిస్ట్‌వాచ్ వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ దాని వివరాలు వెల్లడించింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!జుకర్‌బర్గ్ ధరించిన వాచ్ ప్రతిష్టాత్మక స్విస్ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ తయారు చేసిన టైమ్పీస్గా గుర్తించారు. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. మార్క్ ఈ కంపెనీకు చెందిన దాదాపు రూ.1 కోటి కంటే ఎక్కువ ధర ఉంటే ‘5236పీ’ మోడల్ వాచ్‌ను ధరించినట్లు వాచ్.న్యూజ్ పేర్కొంది. మార్చిలో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడులకు వచ్చిన జుకర్‌బర్గ్ దంపతులు తను వాడిన పాటక్ ఫిలిప్ వాచ్‌ను చూసి బాగుందని కితాబిచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by watchnewz (@watch.newz) -
హంతకుని గెటప్‌లో మార్క్ జుకర్‌బర్గ్ (ఫోటోలు)
-
కుమార్తె కోసం నెయిల్ ఆర్టిస్ట్‌గా జుకర్‌బర్గ్ - వీడియో
కూతుళ్ళ కోసం తండ్రులు ఎంత దూరమైనా వెళ్తారు. కోతి కావాలంటే కొండ మీదకు ట్రెకింగ్ చేస్తారు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కోసం ఆకాశమెత్తు చెట్టునైనా సునాయాసంగా ఎక్కేస్తారు. జుకర్‌బర్గ్ కూడా అంతే! ఆయనెంత టెక్నాలజీ కింగ్ అయినా కూతురి దగ్గర ఒక మామూలు తండ్రే. మానవాళి కలలకు రంగులు అద్దటానికి ప్రపంచం నిరంతరం అప్డేట్లతో పరుగులు తీస్తుండే మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' కూతురి గోళ్లకు రంగు వేయడం కోసం ఎలా కుదురుగా కూర్చున్నారో చూడండి. మొత్తానికి టాస్క్ ఫినిష్ చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.జుకర్‌బర్గ్ టేబుల్‌పైకి వంగి, తన కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేసి నెయిల్ ఆర్టిస్ట్ అయ్యారు. చిన్నారి తన నెయిల్ ఆర్ట్‌ని ప్రదర్శించడంతో క్లిప్ ముగుస్తుంది. నెటిజన్లు ఈ వీడియో చూసి తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇప్పటికే 20వేల కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ వీడియో 6,25,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. తన కుమార్తె కోసం సీఈఓ నుంచి స్టైలిస్ట్‌గా మారారని ఒకరు కామెంట్ చేశారు. ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని ఇంకొకరు చమత్కరించారు.క్వెస్ట్ 3ఎస్కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేయడానికంటే ముందు జుకర్‌బర్గ్ 'క్వెస్ట్ 3ఎస్'లో మల్టిపుల్ స్క్రీన్స్ చూసారు. క్వెస్ట్ 3ఎస్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్సెట్. దీనిని మెటా 2024 సెప్టెంబర్ 25న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రారంభించింది. దీని ధర రూ. 25,210 నుంచి రూ. 33,610 వరకు ఉంది.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!మెటా క్వెస్ట్ 3ఎస్ హెడ్సెట్.. సినిమా సైజ్ స్క్రీన్‌పై మీకు ఇష్టమైన షోలను చూడటానికి మాత్రమే కాకుండా, మీరు ఎక్కడికెళ్లినా మీతో పాటు తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గేమ్స్ వంటివి ఆడటానికి కూడా అనుమతిస్తుంది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్!
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్'.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత స్థానాల్లో జుకర్‌బర్గ్, బెజోస్ ఉన్నారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇలాన్ మస్క్ నికర విలువ రూ. 256 బిలియన్ డాలర్స్, జుకర్‌బర్గ్ నికర విలువ 206 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ విలువ 205 బిలియన్ డాలర్లు. మెటా ప్లాట్‌ఫామ్ షేర్లు పెరగడంతో.. మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.నికర విలువ పరంగా జుకర్‌బర్గ్.. బెజోస్ కంటే 1.1 బిలియన్ డాలర్ల ముందు, టెస్లా సీఈఓ కంటే 50 బిలియన్ల వెనుకంజలో ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా.. బెర్నార్డ్ ఆర్నాల్ట్, లారీ ఎల్లిసన్, బిల్ గేట్స్, లారీ పేజీ, స్టీవ్ బాల్మెర్, వారెన్ బఫెట్, సెర్గీ బ్రిన్ వరుస పది స్థానాల్లో ఉన్నారు.ఇదీ చదవండి: కేంద్రం శుభవార్త.. ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో భారతీయులుప్రపంచ ధనవంతుల జాబితాలో భారతీయ ధనవంతులైన ముకేశ్ అంబానీ 14వ స్థానంలో, గౌతమ్ ఆదానీ 17వ స్థానంలో ఉన్నారు. 37వ స్థానంలో శివ నాడార్, 38వ స్థానంలో షాపూర్ మిస్త్రీ, సావిత్రి జిందాల్ 49వ స్థానంలో, 61వ స్థానంలో దిలీప్ శాంఘ్వీ, 62వ స్థానంలో అజీమ్ ప్రేమ్ జీ, సునీల్ మిట్టల్ 72వ స్థానంలో, 89వ స్థానంలో రాధాకిషన్ దమాని, 90వ స్థానంలో కుమార మంగళం బిర్లా, 97వ స్థానంలో లక్ష్మీ మిట్టల్, 100వ స్థానాల్లో సైరస్ పూనావల్ల ఉన్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు (ఫొటోలు)
-
రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది.ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉన్నారు. జుకర్‌బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్‌ను వెనక్కినెట్టారు.ఇదీ చదవండి: వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు..ఇలోన్ మస్క్జెఫ్ బెజోస్బెర్నార్డ్ ఆర్నాల్ట్మార్క్ జూకర్బర్గ్లారీ ఎల్లిసన్బిల్గేట్స్లారీపేజ్స్టీవ్ బామర్వారెన్బఫెట్సెర్జీబ్రిన్ -
200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్‌ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్‌బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్‌బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్‌లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్‌బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్‌మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
రూ.4.48 లక్షల కోట్లు: సంపాదనలో ఇతడే టాప్
ప్రపంచ కుబేరుడు ఎవరు అనగానే వినిపించే పేరు టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk). అయితే ఈ ఏడాది అత్యధికంగా సంపాదించినవారి జాబితాలో మాత్రం మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' స్థానం సంపాదించుకున్నారు.2024లో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 54 బిలియన్ డాలర్లు పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 4.48 లక్షల కోట్లు. ఈ ఒక్క సంవత్సరమే ఈయన సంపద 40 శాతం పెరిగి 182 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో జుకర్‌బర్గ్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నారు. మెటా సీఈఓ కంటే 7 బిలియన్ డాలర్లు ఎక్కువ సంపాదనతో 'బెర్నార్డ్' మూడో స్థానంలో నిలిచారు.2024 ప్రారంభంలో ఎన్వీడియా కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జెన్సన్ హువాంగ్' షేర్స్ కూడా గత రెండు రోజులుగా భారీగా తగ్గాయి. దీంతో ఈయన ఏకంగా 11.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. సంవత్సర ఆదాయం పరంగా హువాంగ్ 44 బిలియన్ డాలర్ల లాభాలను పొందారు. దీంతో ఈయన నికర విలువ 93 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఇదీ చదవండి: ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ జుకర్‌బర్గ్ నాయకత్వంలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌లో భారీ పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులు ఇన్వెస్టర్లను కొంత ఆందోళనకు గురి చేసింది. దీంతో 2021 సెప్టెంబర్ - 2022 నవంబర్ మధ్య మెటా స్టాక్ 75 శాతం కంపెనీ ఎక్కువ తగ్గిపోయింది.ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుండటంతో ఇన్వెస్టర్లకు కంపెనీ మీద విశ్వాసం ఏర్పడింది. ఫలితంగా మెటా షేర్లు మళ్ళీ రికార్డు స్థాయికి చేరాయి. దీంతో కంపెనీ విలువ ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మెటాలో జుకర్‌బర్గ్ వాటా 13 శాతానికి చేరింది. 2022లో 35 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే కలిగి ఉన్న జుకర్‌బర్గ్.. ఇప్పుడు 182 బిలియన్ డాలర్ల నికర విలువకు చేరారు. -
జీవిత పాఠాలు నేర్పిన గురువులు
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.వారెన్బఫెట్జీవితంలో కష్టనష్టాలు వారెన్బఫెట్కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.బిల్గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ తనకు వారెన్‌బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్‌బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.జెఫ్బెజోస్అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్‌బెజోస్ వారెన్‌బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్‌బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.ఇలాన్మస్క్ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్‌మస్క్ స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్‌ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్‌మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్‌ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు. -
జుకర్ బర్గ్... ప్రేమ మార్క్
షాజహాన్‌కు భార్య పై ఉన్న ప్రేమ పాలరాతి తాజ్‌మహల్‌లో ప్రతిఫలించింది. మెటా బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ విషయానికి వస్తే... భార్యపై ఆయనకున్న ప్రేమ ఇంటి పెరట్లోని సుందరమైన నీలిరంగు విగ్రహంలో ప్రతిఫలిస్తోంది. రొమాంటిక్ హావభావాలతో కూడిన భార్య ప్రిస్కిల్లా చాన్ భారీ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశాడు జుకర్ బర్గ్. ఆ విగ్రహం పక్కన నిలబడి ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహం చిత్రాలు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాయి...ఫేస్బుక్ విజయం గురించి చెప్పుకోవడం కంటే తన ప్రేమ విజయం గురించి చెప్పుకోవడం అంటేనే మార్క్ జుకర్ బర్గ్‌కు ఇష్టం. ప్రిస్కిల్లా చాన్‌తో ఎలా పరిచయం అయింది, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది కథలు కథలుగా చెబుతుంటాడు. అవి ఎప్పుడో జరిగినట్లుగా ఉండవు. నిన్నా మొన్న జరిగినట్లుగానే ఉంటాయి. అది అతడి మాటల చాతుర్యం కాదు. ప్రేమలోని మాధుర్యం!19 మే, 2012 అనేది జుకర్ బర్గ్, చాన్లకు మరచిపోలేని సుదినం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ ఔట్‌డోర్ వెడ్డింగ్లోని విశేషం ఏమిటంటే... పెళ్లి నాటి ప్రమాణాలను కాగితాల రూపంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు.జుకర్‌బర్గ్ చాన్‌కు ఇచ్చిన పేపర్లో ఇలా రాసి ఉంది.... ‘ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో... ఎప్పుడూ ఇలాగే’ అదృష్టవశాత్తు ఆ సంతోషం ఇప్పటివరకు వారికి దూరం కాలేదు. ‘మార్క్ అప్పుడు ఎంత ప్రేమతో ఉన్నాడో ఇప్పుడూ అంతే. అప్పుడు ఎలా నవ్వించేవాడో ఇప్పుడూ అంతే’ అంటూ భర్త గురించి మురిపెంగా చెబుతుంటుంది ప్రిస్కిల్లా చాన్.ఏడు అడుగుల సిల్వర్ అండ్ బ్లూ ప్రిస్కిల్లా చాన్ విగ్రహం వారి బలమైన ప్రేమ బంధానికి ప్రతీకలా కనిపిస్తోంది. ప్రవహిస్తున్నట్లుగా కనిపించే వెండి వస్త్రం విగ్రహాన్ని మరింత ఆకర్షణీయం చేసింది. ఈ విగ్రహం కోసం న్యూయార్క్‌కు చెందిన ఆర్టిస్ట్, అర్కిటెక్చర్, శిల్పి డేనియల్ ఆర్షమ్ను సంప్రదించాడు మార్క్. విగ్రహం ఎలా ఉండాలి? అనే దాని గురించి ఇద్దరి మధ్య ఎన్నోరోజుల పాటు చర్చలు జరిగాయి.చాన్ విగ్రహం పుణ్యమా అని ‘ఎవరీ డేనియల్’ అనే శోధన మొదలైంది. ఈ డేనియల్‌కు ‘ఇన్స్టాగ్రామ్ శిల్పి’ అని పేరు. డ్యాన్స్, డిజైన్, అర్కిటెక్చర్, ఆర్ట్‌ను మిక్స్ చేసిన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో పెద్ద ప్రాజెక్ట్‌లకు పని చేశాడు. ‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు జుకర్ బర్గ్.టీ సేవిస్తూ తన విగ్రహం దగ్గర ఫొటో దిగిన ప్రిస్కిల్లా చాన్ ఆ ఆర్ట్‌వర్క్‌ను ‘అద్భుతం’ అని ప్రశంసించింది.ఏడు అడుగుల ప్రిస్కిల్లా చాన్ విగ్రహంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. భార్యపై మార్క్ జుకర్‌బర్గ్‌కు ఉన్న ప్రేమను ఎంతోమంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీలిరంగులో ఉన్నందుకు కావచ్చు... కొందరు మాత్రం ఈ విగ్రహాన్ని అవతార్ క్యారెక్టర్లతో పోలుస్తూ జోక్‌లు పేలుస్తున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా... ప్రిస్కిల్లా చాన్ విగ్రహం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.కన్నీళ్లు తుడిచే విగ్రహం‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని జుకర్ బర్గ్ అంటున్నాడుగానీ మన వాళ్లు ఆ పని ఎప్పుడో చేశారు. చేస్తున్నారు! కోల్‌కత్తాకు చెందిన 65 సంవత్సరాల తాపస్ అనే రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి 2.5 లక్షలు ఖర్చు చేసి తన భార్య ఇంద్రాణి సిలికాన్ స్టాచ్యూను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. జీవకళ ఉట్టిపడే ఈ విగ్రహంతో తాపస్ ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు. తన భార్య చనిపోలేదని, విగ్రహం రూపంలో ఇంట్లోనే ఉంది అనుకొని దుఃఖానికి దూరం అయ్యాడు. తాపస్లాంటి భర్తల కథలు మన దేశ నలుమూలలా ఉన్నాయి. -
భార్యకు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన మార్క్ జుకర్‌బర్గ్ (ఫోటోలు)
-
మెటా ఏఐలో కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మెటా ఏఐ కొత్త ఫీచర్ ఆవిషక్రయించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.నచ్చిన స్టైల్లో ఫోటోలు క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలో కూడా మెటా సీఈఓ వీడియోలో చూపిస్తారు. యూజర్ తన ముఖాన్ని స్కాన్ చేయి తనకు నచ్చిన విధంగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.జుకర్‌బర్గ్ వీడియోలో మొదట తన ముఖాన్ని స్కాన్ చేసుకున్నారు. ఆ తరువాత సెర్చ్ బార్లో నచ్చిన విధంగా ఎలాంటి ఇమేజ్ కావాలో సెర్చ్ చేయాలి. అప్పుడు మెటా మీరు అడిగినట్లుగా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. జుకర్‌బర్గ్ తనను గ్లాడియేటర్‌గా చూపించమని సెర్చ్ చేశారు. అప్పుడు మెటా అలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ తరువాత బాయ్ బ్యాండ్, గోల్డ్ వేసుకున్నట్లు ఇలా ఫోటోలను క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ వీడియోలో చూడవచ్చు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
అంబానీ పెళ్లి సందడి : జెఫ్ బెజోస్, ఇతర దిగ్గజాల కళ్లు చెదిరే కానుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్‌కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్‌లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్‌లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్‌లుగా అందించారట. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు. అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్‌ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
‘అమెరికా ఇండిపెండెన్స్ డే’..మార్క్ జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలు
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ జులై 4న వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో విడుదల చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.జులై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖులు వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో అమెరికా జెండాతో నీటిపై హైడ్రోఫాయిల్(నీటిపై కదలడం) చేశారు. ఇందులో మార్క్ బ్లాక్ యాప్రాన్, వైట్ షర్ట్ ధరించారు. కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టి అదిరిపోయే పోజు ఇచ్చారు. ఈ వీడియోను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే అమెరికా’ అని రాశారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)జుకర్‌బర్గ్ ఆరు నెలల కిందట మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో శిక్షణ పొందుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దాంతో తన మోకాలికి తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల కోలుకున్న మార్క్ తన 40వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జురుపుకున్నారు. తాజాగా ఇలా హైడ్రోఫాయిల్ చేయడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
Mark Zuckerberg: భారత్‌లో మెటా థ్రెడ్స్ జోరు
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (ఇప్పుడు ఎక్స్)కు పోటీగా ఏడాది క్రితం ప్రవేశపెట్టిన థ్రెడ్స్ యాప్‌కి గణనీయంగా ఆదరణ లభిస్తోందని సోషల్ మీడియా దిగ్గజం మెటా తెలిపింది. అంతర్జాతీయంగా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉందని పేర్కొంది. క్రియాశీలక వినియోగదారులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ఎక్కువగా సినిమాలు, టీవీ, ఓటీటీ, సెలబ్రిటీలు, స్పోర్ట్స్‌కి సంబంధించిన కంటెంట్ ఉంటోందని మెటా వివరించింది. క్రికెట్లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఆకాశ్ చోప్రా మొదలైన వారు క్రియాశీలకంగా ఉంటున్నారని పేర్కొంది. టీ20 క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 మొదలైనవి హాట్ టాపిక్‌లుగా నిల్చాయని, 200 మంది పైచిలుకు క్రియేటర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌పై అప్డేట్స్ ఇచ్చారని వివరించింది. 2023 జూలైలో ప్రవేశపెట్టిన వారం రోజులకే 10 కోట్లకు పైగా యూజర్ సైనప్లతో థ్రెడ్స్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచి్చంది. అయితే, క్రమంగా దానిపై యూజర్ల ఆసక్తి తగ్గుతూ వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఒత్తిడి చేస్తే భారత్ నుండి వెళ్ళిపోతాం !..వాట్సా ప్ వార్నింగ్
-
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
Anant-Radhika జుకర్‌బర్గ్ భార్య నగ మిస్..? నెటిజనుల కామెంట్స్ వైరల్
రిలయన్స్ అధినేత, బిలియనీర్ ముఖేష్ ,నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో ఒక ఆశ్యర్యకరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భార్య పెండెంట్‌ను కోల్పోయిందట. దీంతో సోషల్ మీడియా సంస్థలు ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ డౌన్‌కి ఇదే కారణమంటున్న నెటిజన్లు ఛలోక్తులు వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని జామ్ నగర్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్, క్రీడారంగ సెలబ్రిటీలతోపాటు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ , భార్య న్, బిల్ గేట్స్ ఆయన భార్య, గ్లోబల్ పాప్ ఐకాన్, రిహన్నా సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ భార్యప్రిస్సిల్లా చాన్ లాకెట్ మిస్ అయింది. దీంతో భారీ గందరగోళం ఏర్పడి, జుకర్‌బర్గ్ దంపతులతో పాటు అతిథులంతా మూడున్నర గంటలపాటు లాకెట్టు కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఈ ఘటనపై రెడిట్యూజర్ వెల్లడించడంతో నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేశారు. అందుకే ఫేస్బుక్, ఇన్‌స్టా పనిచేయ లేదంటూ కమెంట్ చేశారు. ఈ సంఘటన దురదృష్టకరం అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే చాన్ లాకెట్టు నిజంగానే పోయిందా? ఒక వేళ పోతే మళ్లీ దొరికిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాగా మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్లు నాలుగు రోజుల క్రితం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిన సంగతి తెలిసిందే. -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రెటీల స్పెషల్ ఫొటోలు..
-
కత్తులు తయారు చేస్తున్న టెక్ బాస్.. వీడియో వైరల్!
Mark Zuckerberg viral video: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం, ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కత్తుల తయారీపై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇటీవల జపనీస్ కత్తి మాస్టర్ అకిహిరా కోకాజీ నుంచి కత్తి తయారీ పాఠాన్ని నేర్చుకున్నారు. పదునుకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ జపనీస్ కత్తి ‘కటనా’ను తయారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జుకర్‌బర్గ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్‌లను షేర్ చేశారు. అందులో ఆయన కత్తి మాస్టర్‌తో పోజులివ్వడాన్ని చూడవచ్చు. మరొక చిత్రంలో తాను తయారు చేసిన కత్తిని చూపించాడు. అలాగే కత్తి తయారు చేస్తున్న వీడియోను, తయారు చేసిన కత్తిని వాడుతున్న వీడియోను కూడా షేర్ చేశారు. "మాస్టర్ అకిహిరా కోకాజీతో కటనాల తయారీ గురించి నేర్చుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. మీ (అకిహిరా కోకాజీ) కళా నైపుణ్యాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!" అని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. షేర్ చేసినప్పటి నుంచి 3.6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి. “తయారు చేసిన కటానాను మీతోనే ఉంచుకుంటారా?” అని ఓ యూజర్ ప్రశ్నించారు. “మీరు నిజమైన నింజాగా మారే మార్గంలో ఉన్నారు. చేతులతో యుద్ధంలో ఆరితేరాక కత్తులపై దృష్టిపెట్టారు!” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
మస్క్, జుకర్‌బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత..
చెన్నైలో పుట్టి అమెరికాలోని అగ్ర కంపెనీలలో పనిచేసిన 'శ్రీరామ్ కృష్ణన్' ఇటీవల యూఏఈలో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఫేస్బుక్ సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్', మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల', ఎక్స్ (ట్విటర్) అధినేత 'ఇలాన్ మస్క్'తో సహా టాప్ సిఇఓలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. యుక్త వయసులోనే కోడింగ్ నేర్చుకున్నట్లు, అదే తనను టెక్నాలజీ వైపు అడుగులు వేసేలా చేసిందని శ్రీరామ్ కృష్ణన్ వెల్లడించారు. 2007లో మైక్రోసాఫ్ట్‌లో చేరి కొన్ని సంవత్సరాల పాటు సత్య నాదెళ్లతో కలిసి పనిచేశారు, అప్పటికే సత్య నాదెళ్ల సీఈఓ కాలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన తరువాత ఫేస్బుక్లో చేరి 'మార్క్ జుకర్‌బర్గ్'తో కూడా కలిసి పనిచేశారు. ఇలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసిన సమయంలో శ్రీరామ్ అక్కడే పనిచేసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాన్ మస్క్, జుకర్‌బర్గ్‌లు చిన్న చిన్న విషయాలను సైతం వారే చూసుకుంటారని, ఇతరులకు అప్పగించరని చెబుతూ.. మెటా సీఈఓ ప్రతి అంశం మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఒక ప్రాజెక్టు తీసుకున్న తరువాత అందులో పనిచేసే ఉద్యోగుల కంటే ఆయనే ఎక్కువ తెలుసుకుంటారని శ్రీరామ్ చెప్పారు. నా భార్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం మెటాలో పనిచేసింది, జుకర్‌బర్గ్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నారని ఆమె నాకు చెప్పిందని అన్నారు. ఇలాన్ మస్క్ విషయానికి వస్తే.. అందరూ అనుకున్నట్లు ఎక్కువ సమయంలో ఎక్స్(ట్విటర్)లో పోస్టులు చేయడానికి సమయం కేటాయించరని, ఆయనతో నేను ఉన్నప్పుడు 95 శాతం మీటింగులు జూనియర్ ఇంజనీర్లతో జరిగాయని తెలిపారు. ఆయన ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారని అన్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు! -
బిల్ గేట్స్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్
ప్రపంచ కుబేరుల జాబితాలోని మొదటి స్థానంలో మార్పుల ఏర్పడ్డ తరువాత.. మెటా సీఈవో 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) కూడా ఓ అడుగు ముందుకు వేసి బిల్ గేట్స్‌ను వెనక్కు నెట్టారు. దీంతో జుకర్‌బర్గ్ ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మెటా స్టాక్ ధరలు 22 శాతం పెరగడం వల్ల జుకర్‌బర్గ్ సంపద 28 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన నికర విలువ.. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 170 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బిల్ గేట్స్ నికర విలువ 145 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బిల్ గేట్స్ విలువ కంటే జుకర్‌బర్గ్ విలువ 25 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడు జుకర్‌బర్గ్ కంటే ముందున్న ధనవంతులు బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ మాత్రమే ఉన్నారు. మెటా తన మొట్టమొదటి డివిడెండ్‌ను మార్చిలో పంపిణీ చేసినప్పుడు జుకర్‌బర్గ్ సుమారుగా 174 మిలియన్ డాలర్ల నగదును పొందవచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్.. జుకర్‌బర్గ్ దాదాపు 350 మిలియన్ క్లాస్ A, B షేర్లకు యజమానిగా కంపెనీలో వాటాలను కలిగి ఉన్నారు. అయితే మెటా తన 50-సెంట్స్ త్రైమాసిక డివిడెండ్ కొనసాగిస్తే.. జుకర్‌బర్గ్ వార్షిక ఆదాయాలు 690 మిలియన్ డాలర్లకు మించిపోతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ధనవంతుల జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్న మెటా సీఈఓ మరింత ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. -
మా సీఈవో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు.. ఆందోళన చెందుతున్న కంపెనీ
నేటి ఆధునిక ప్రపంచంలో టెక్ దిగ్గజాల ప్రతి కదలికను మార్కెట్లు నిశితంగా గమనిస్తుంటాయి. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ మెటా.. తమ సీఈవో గురించి తెగ ఆందోళన పడిపోతోంది. హై రిస్క్ పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడని, దీని ప్రభావం కంపెనీ భవిష్యత్తుపై పడుతుందని బెంగపడుతోంది. మెటా తమ తాజా ఆర్థిక నివేదికలో కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు పొంచిఉన్న ముప్పును వెల్లడించింది. జుకర్‌బర్గ్ అలవాట్లు, జీవనశైలితో మెటా స్పష్టంగా సంతోషంగా లేన్నట్లు కనిపిస్తోంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ , హానికరమైన క్రీడలతో జుకర్‌బర్గ్ థ్రిల్ కోరుకుంటున్నారని, ఇది కేవలం ఆయన వ్యక్తిగతంగానే కాకుండా కంపెనీకి, అందులో పెట్టుబడివారికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. "జుకర్‌బర్గ్‌తోపాటు మేనేజ్మెంట్లోని కొంతమంది తీవ్రమైన గాయాలు, ప్రాణాల మీదకు తెచ్చే క్రీడలు, ఇతర హై రిస్క్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. జుకర్‌బర్గ్ ఏ కారణం చేతనైనా అందుబాటులో లేకుంటే మా కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు" అని మెటా తన వార్షిక నివేదికలో పేర్కొంది. మస్క్‌తో కేజ్ ఫైట్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర హానికరమైన క్రీడల పట్ల జుకర్‌బర్గ్‌కు ఉన్న మక్కువ తెలిసిందే. గత నవంబర్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో మోకాలికి గాయం కావడంతో ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో కేజ్ ఫైట్‌కి సిద్ధమైనప్పుడు జుకర్‌బర్గ్ సాహసాలు మరోసారి ముఖ్యాంశాలుగా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై గొడవలకు పేరుగాంచిన ఇద్దరు బిలియనీర్లు తమ విభేదాలను పరిష్కరించడానికి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్‌ని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఒకరినొకరు వెనక్కు తగ్గినట్లు ఆరోపణలు చేయడంతో ఆ ఫైట్ రద్దయింది. "హై రిస్క్ = హై రివార్డ్" ఈ కొత్త రిస్క్‌ల గురించి చర్చలకు ప్రతిస్పందనగా, జుకర్‌బర్గ్ "హై రిస్క్ = హై రివార్డ్" అనే సందేశంతో థ్రెడ్స్‌లో జిఫ్ పోస్ట్ చేశారు. జుకర్‌బర్గ్ డేర్‌డెవిల్ సాహసాలతో ప్రమాదాలు ఉన్నప్పటికీ, మెటా శుక్రవారం తన షేర్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. కంపెనీ నాల్గవ త్రైమాసిక లాభాలలో మూడు రెట్లు పెరిగినట్లు నివేదించింది. దానితో పాటు దాని మొట్టమొదటి డివిడెండ్ ప్రకటించింది. -
కీలక నిర్ణయం.. వందల కోట్ల విలువైన మెటా షేర్లు అమ్మిన మార్క్ జూకర్ బర్గ్!
సోషల్ మీడియా దిగ్గజం మెటాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వందల కోట్లలో విలువైన కంపెనీ షేర్లను ఒకే రోజు రెండు సార్లు అమ్ముకున్నారని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. దాదాపూ రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నవంబర్ నెల ముగిసే సమయానికి మెటా షేర్ల విలువ 172 శాతం పెరిగింది. అయితే అదే రోజు కంపెనీ షేర్లను అమ్ముకునేందుకు అనుమతి కోరుతూ జుకర్ బర్గ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫారమ్ 4కు అప్లయ్ చేసుకున్నారు. అనంతరం తొలిసారి 560,180 షేర్లు, కొద్ది సేపటి తర్వాత అదనంగా 28,009 షేర్లను అమ్ముతూ 144 ఫారమ్ అప్లయ్ చేసుకున్నట్లు సెక్యూరిటీ ఎక్ఛేంజ్ ఫైలింగ్ తేలింది. ఆ మొత్తం షేర్ల విలువ రూ.1,600 కోట్లు. మార్క్ జూకర్ బర్గ్ సంస్థ షేర్లు అమ్ముకున్నారన్న నివేదికలతో యూఎస్ మార్కెట్లు ముగిసే సమయానికి మెటా షేర ధర 320.02 డాలర్ల వద్ద ముగిసింది. ఇక కంపెనీలో షేర్లు అమ్మగా సేకరించిన నిధుల్ని ఆయన ఎందుకు వినియోగిస్తారనే అంశంపై స్పష్టత లేదు. మెటా.. తీవ్ర వాద సంస్థ : రష్యా ఈ అక్టోబరులో రష్యా అధికారిక వర్గాలు మెటాను ఓ తీవ్రవాద సంస్థగా పేర్కొనడం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా 2019 నుంచి 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్ల సమాచారాన్ని తీసుకుందని ఆరోపిస్తూ 33 రాష్ట్రాలు పలు న్యాయ స్థానాల్ని ఆశ్రయించడం వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం మెటా షేర్లు ఈ ఏడాదిలో వరుసగా పాజిటీవ్‌గా ట్రేడయ్యాయి. దీంతో నవంబర్ 22న మెటా షేర్ విలువ గరిష్టా స్థాయికి 341.49 డాలర్లకు చేరుకోగా.. చివరి సారిగా అదే షేర్ విలువ డిసెంబరు 30, 2021 నుంచి తగ్గుతూ వస్తుంది. -
మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సమయంలో మోకాలికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అసలు మోకాలి గాయం అంటే ఏంటీ? ఎందువల్ల అవుతుంది తదితరాల గురించే కథనం. మోకాలి గాయం అంటే.. క్రీడాకారులు ఎక్కువగా ఈ మోకాలి గాయం బారిన పడతారు. మోకాలి గాయాన్ని పూర్వ క్రూసియేట్ లిగ్మెంట్ (Anterior Cruciate Ligament(ACL)) గాయం అని కూడా అంటారు. అంటే మోకాలి ఏసీఎల్ నిర్మాణంపై ఏర్పడిన గాయంగా కూడా చెబుతారు. ఈ ఏసీఎల్ అనేది మోకాలిలో ఉండే మృదువైన కణజాల నిర్మాణం. ఈ క్రూసియేట్ లిగ్మెంట్ తొడను ముందు ఎముక(టిబియా)తో కలిపే జాయింట్. దీనివల్లే మనం నిలబడటానికి నుంచొవడానికి వదులుగా మోకాలు కదులుతుంది. మనం ముందుకు వంగడానికి, నిలుచున్నప్పుడు కదిలే ఈభాగంలో గాయం అయితే పాపింగ్ లాంటి ఒక విధమైన సౌండ్ వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ ప్రాంతంలో అంతర్లీనంగా లిగ్మెంట్ చీరుకుపోవడం లేదా ఎముకలు తప్పి ఒక విధమైన శబ్దం వస్తుంది. దీంతో మోకాలు ఉబ్బి, అస్థిరంగా ఉంటుంది. భరించలేని నొప్పిని అనుభవిస్తాడు పేషెంట్. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఏసీఎల్ లిగ్మెంట్కి చికిత్స ఎలా అందిస్తారంటే.. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ప్రకారం..దెబ్బతిన్న ఏసీఎల్ లిగ్మెంట్ స్థానంలో కొత్త ACL గ్రాఫ్ట్ కణజాలంతో భర్తీ చేసి శస్త్ర చికిత్స చేస్తారు. అయితే ఈ కొత్త ఏసీఎల్ కణజాలం రోగి నుంచే తీసుకోవచ్చు లేదా మరొకరి నుంచైనా స్వీకరించొచ్చు. ఈ చికిత్స రోగికి తగిలిన గాయం తాలుకా తీవ్రత ఆధారంగా వివిధ రకాలుగా చికిత్స అందిస్తారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఇలాంటి గాయాల్లో తీవ్రత తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించడం, రోగిని రెస్ట్ తీసుకోమనడం వంటివి సూచిస్తారు వైద్యులు. అదే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే ఏసీఎల్ పునర్నిర్మాణ శస్త్ర చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సాధారణ ఆర్థోస్కోపిక్ పద్ధతులను ఉపయోగించే నిర్వహించడం జరుగుతుంది. మోకాలిపై కోతలు పెట్టి పాటెల్లార్ స్నాయువుని(మోకాలి చిప్ప), తొడ ఎముకను కొత్త లిగ్మెంట్తో జాయింట్ చేసేలా మోకాలి అంతటా ఆపరేషన్ నిర్వహిస్తారు. ఫలితంగా పటేల్లార్ స్నాయువు ముందుకు వెనక్కు కదిలేందుకు ఉపకరిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ మోచిప్పలనే తొలగించడం లేదా ఇతర స్నాయువులతో పునర్నిర్మించవడం వంటివి చేస్తారు వైద్యులు. (చదవండి: దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!) -
హాస్పిటల్ బెడ్‌పై జుకర్‌బర్గ్ - ఇన్‌స్టా పోస్ట్ వైరల్
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) మోకాలికి గాయం కావడంతో ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సమయంలో మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ ప్రకారం, ఏఎల్సీ (Anterior Cruciate Ligament) తొలగించి రీప్లేస్ చేయించుకోవడానికి ఆపరేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్‌లోని వైద్య సిబ్బంది తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో వచ్చే ఏడాది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొనటానికి ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, దీని వల్ల శిక్షణకు ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి ఉందని, కోలుకున్న తరువాత మళ్ళీ శిక్షణ ప్రారంభిస్తానని జుకర్‌బర్గ్ వెల్లడించారు. నాపైన ప్రేమ చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
నెలవారీ 10కోట్ల యూజర్లను సంపాదించిన సంస్థ!
మెటా సంస్థలో భాగంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ నెలవారీగా దాదాపు 100 మిలియన్ల(10కోట్లు) వినియోగదారులను చేరుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఇటీవల కంపెనీ త్రైమాసిక ఆదాయాల గురించి మాట్లాడుతున్నపుడు ఈ విషయాన్ని చెప్పారు. సానుకూలంగా సంభాషణలు సాగించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ టూల్‌ను తీసుకొచ్చిందన్నారు. ఇన్స్టాథ్రెడ్లు రానున్న రోజుల్లో మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయని మెటా సీఎఫ్ఓ సుసాన్ లి అన్నారు. ఇన్స్టాగ్రామ్ వార్తలకు వ్యతిరేకం కాదని, సంబంధిత ప్లాట్ఫామ్లో థ్రెడ్లు వార్తలను విస్తరించట్లేదని ఇన్‌స్టా ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎక్స్(ట్విటర్)కు పోటీగా మెటా ఇన్స్టాథ్రెడ్లను జులైలో ప్రారంభించింది. -
మాజీ మహిళా ఉద్యోగి దెబ్బ, కదులుతున్న లక్షల కోట్ల విలువైన కంపెనీ పునాదులు?
ఒక్క మహిళా ఉద్యోగి. 8.48 నిమిషాల నిడివి గల వీడియో. వందల కొద్దీ డాక్యుమెంట్లు.వెరసీ ప్రపంచంలో అత్యంత విలువైన సోషల్ మీడియా కంపెనీ మెటా పునాదులు ఒక్కొక్కటిగా కదులుతున్నాయా? 2021లో మెటా (అప్పడు ఫేస్బుక్)లోని అక్రమాల్ని బయటపెట్టింది తానేనంటూ వెలుగులోకి వచ్చిన ఓ వీడియోతో గంటల వ్యవధిలో ఆ సంస్థ రూ.50 వేల కోట్లు నష్టపోయింది. ప్రారంభంలో మహిళ చేసిన ఆరోపణల్ని సీఈవో జూకర్ బెర్గ్ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ మెటాను ముంచే విధ్వంసానికి దారితీస్తుందనుకోలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాజాగా, ఆ వీడియో తాలుకు ప్రభావం మరోసారి మెటాపై పడింది. మెటా, ఆ సంస్థకు చెందిన ప్రముఖ ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు భారీ షాక్ తగిలింది. 41 రాష్ట్రాలకు చెందిన పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు యువతను వ్యసనపరులుగా మార్చడం ద్వారా వారిలో మానసిక రుగ్మతలు పెరిగేలా ఆజ్యం పోస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల వెల్లువ మెటా, ఇన్‌స్టాగ్రామ్‌పై ఓక్లాండ్, కాలిఫోర్నియా, ఫెడరల్ కోర్టులో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కాలిఫోర్నియా, న్యూయార్క్‌తో పాటు మరో 33 రాష్ట్రాల పిటిషనర్లు.. ఈ రెండు ఫ్లాట్‌ఫామ్‌లు తప్పుడు ప్రచారాలు చేస్తూ పదే పదే తప్పుదారి పట్టిస్తున్నాయని.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రలోభపెట్టి.. ఆన్లైన్లో గంటల కొద్ది గడిపేలా శక్తివంతమైన టెక్నాలజీని మెటా ఉపయోగించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఆదాయాన్ని గడించి లాభపడుతుందని అన్నారు. యూజర్ల కన్నా.. డబ్బులే ముఖ్యం ఓ వైపు అడ్వటైజర్లు చేజారిపోకుండా యువతను కట్టిపడేయడంలో మెటా వ్యూహాత్మకంగా ఎలా వ్యాపారం చేస్తుందో వారు వివరించారు. ముఖ్యంగా, పలు అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా చిన్న వయస్సు వారినే తమ వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నాయి. ఇలా చేయడం వల్ల పిల్లలు యుక్తవయస్సు వచ్చే వరకు తమ సంస్థ బ్రాండ్లను వినియోగించుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ తరహా వ్యాపార వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వారికి లాభం చేకూరేలా మెటా,ఇన్‌స్టాగ్రామ్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి’ అని కోర్టు దావాలో తెలిపారు. పిల్లల్ని నాశనం చేస్తున్నాయ్ అంతేకాదు, ‘నిరాశ, ఆందోళన, నిద్రలేమి, విద్య, రోజువారీ జీవితంలో జోక్యం, అనేక ఇతర ప్రతికూల ఫలితాలు పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నాయని పిటిషన్లు కోర్టు మెట్లెక్కారు. దీంతో మెటాపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వివిధ రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించినందుకు మెటా 1,000 వెయ్యి నుంచి 50,000 డాలర్ల వరకు సివిల్ పెనాల్టీలను ఎదుర్కొంటుంది. కేసు తీవ్రతను బట్టి భారీ మొత్తంలో మెటా చెల్లించాల్సి ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించే మిలియన్ల మంది పిల్లలు, యవకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాన్సెస్ హౌగెన్ దెబ్బే ఇలా మెటా వరుస ఇబ్బందులు ఎదుర్కొవటానికి ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ కారణం. ఆమె గతంలో ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేశారు. 2021లో ఫ్రాన్సెస్ హౌగెన్ మెటా తీరును తప్పుబట్టారు. ప్రజల భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ముఖ్యమని..ద్వేషాన్నిరెచ్చగొట్టే తప్పుడు సమాచారాన్ని ఎంతగా వ్యాప్తి చెందిస్తున్నదీ కంపెనీ సొంత పరిశోధన కూడా చెబుతోందంటూ కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేశారు. ఇద్దరు టీనేజర్ల అభిప్రాయాలు ఆ డాక్యుమెంట్లలో వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోల్లో ఇద్దరు టీనేజర్లు మెటాకి చెందిన సోషల్ సైట్లపై తమ అభిప్రాయాల్ని వివరించారు. ‘‘14ఏళ్ల ఎలీనార్, ఫ్రేయా’లు ఇద్దరూ తమ వయస్సు వారిలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. ఓ టీనేజర్‌గా మేం ఇందులో మోడల్స్‌ను ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను చూస్తుంటాం. వాళ్లందరూ స్కిన్నీగా పర్ఫెక్ట్ బాడీతో ఉంటారు. వాళ్లని చూసినప్పుడు అనుకోకుండానే వాళ్లతో మనల్ని పోల్చి చూసుకుంటాం. ఇదే అన్నింటికన్నా ప్రమాదకరమైందని నాకు అనిపిస్తుంది. ‘‘మనసుకు ఏదీ తోచనప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళుతుంటాం. అందులో చాలా వరకు మనల్ని టార్గెట్ చేసేవే మనకి కనిపిస్తుంటాయి. అంటే ఉదాహరణకు మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను సెలబ్రిటీస్ మనకి కనిపిస్తుంటారు. అప్పుడనప్పిస్తుంది. ఓహ్! ‘అలా మనం ఎప్పటికీ అవ్వలేమని’ ఫ్రేయా అన్నారు. ఎలీనార్, ఫ్రేయాల ఆందోళనని షేర్ చేసింది.మానసిక ఆరోగ్య సమస్యలపై బాధపడుతున్న టీనేజర్ల పరిస్థితిని ఇన్ స్టాగ్రామ్ మరింత దారుణంగా చేస్తుందని లీకైన ఫేస్బుక్ అంతర్గత పత్రాల్లో ఉంది. ఈ డాక్యుమెంట్స్‌ను ఫ్రాన్సెస్ హౌగెన్ లీక్ చేసింది. లీకైన కొద్ది సేపటికే రూ.50 వేల కోట్లు నష్టం ఇలా లీకైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో అంతరాయం ఏర్పడడంతో ఫేస్‌బుక్‌కు 7 బిలియన్ డాలర్లు అంటే సుమారు మన కరెన్సీలో రూ.50 వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది. ఈ ప్రభావం ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజీ జరగడం ఇదే మొదటి సారి. అంతేకాదు ఈ అంతరాయంతో అపరకుబేరుల జాబితా నుంచి మార్క్ జూకర్ బర్గ్ స్థానం కిందకి దిగజారింది. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. కోలుకోలేని నష్టం నాటి నుంచి మెటా ఊహించని విధంగా నష్టపోతూ వస్తుంది. లీకైన పత్రాల వల్ల కొన్ని గంటల వ్యవధిలో వేల కోట్ల నష్టంతో పాటు, సంస్థ పేరును మార్చడంతో పాటు అన్నీ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. అయితే తాజాగా, 41 రాష్ట్రాల్లో మెటాపై దాఖలైన వాజ్యం ఆ సంస్థ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కొనుందో చూడాల్సి ఉంది. చదవండి👉సంచలన నిర్ణయం.. భారత్‌కు గుడ్‌బై చెప్పిన రెండు దిగ్గజ కంపెనీలు -
జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్!
మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ 'మెటా' (Meta) 2024 నుంచి యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను యాడ్స్ లేకుండా వినియోగించాలనుకుంటే తప్పకుండా డబ్బు చెల్లించాల్సిందే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అంటూ కంపెనీ కూడా ప్రకటించింది. అయితే యాడ్స్ వచ్చినా వినియోగించుకోవచ్చు అనుకునేవారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ప్రవేశపెట్టడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ట్రయల్ తరువాత అధికారికంగా 2024 మధ్యలో గానీ లేదా ఆ సంవత్సరం చివరి నాటికి గానీ అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వినియోగదారుని అనుమతి లేకుండా ప్రకటనలు పంపినందుకు ఐర్లాండ్ ప్రైవసీ కమీషన్ మెటాకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రకటనలు పంపించాలంటే తప్పకుండా యూజర్ అనుమతి అవసరం అనే రీతిలో యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ విధానం తీసుకువచ్చింది. ఇదీ చదవండి: ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే? ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత యూజర్ యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు ఇన్స్టాగ్రామ్ 14 డాలర్లు, ఫేస్బుక్ 17 డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. దీనికి సంబందించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ప్రారంభంలో ఫ్రీ అన్న జుకర్‌బర్గ్ ఇప్పుడు ఎక్స్ (ట్విటర్) బాటలో పయనించడానికి సిద్దమవడం గమనార్హం. -
ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!
Meta Layoffs: ఐటీ రంగంలో లేఆఫ్స్ పర్వానికి ఇంకా తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాలో మరోసారి ఉద్యోగాల కోత వార్త కలకలం రేపుతోంది. త్వరలోనే మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విడత తొలగింపుల్లో కంపెనీలోని చిప్ డెవలప్మెంట్ టీమ్‌పై ప్రభావం చూపుతుంది. గత నవంబర్ నుండి 21వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన Meta, ఈసారి తన Metaverse డివిజన్ నుండి ఎంప్లాయిస్‌పై వేటు వేయనుంది. దీంతో ఆగ్మెంటెడ్ , వర్చువల్ రియాలిటీ ఉత్పత్తుల సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రభావితం చేయవచ్చు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఫేస్బుక్ ఎజైల్ సిలికాన్ టీమ్ లేదా ఫాస్ట్ టీంలో ఉద్యోగులను సాగనంపాలని భావిస్తోంది. కంపెనీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బాధిత ఉద్యోగులకు సమాచారం అందిందనీ, దాదాపు 600 మంది ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ బుధవారం ఉంటుందని భావిస్తున్నారు. అయితే తొలగింపులపై మెటా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. కృత్రిమ మేధస్సు పనిపై దృష్టి కేంద్రీకరించిన మెటాలోని మరొక చిప్-మేకింగ్ యూనిట్ కష్టాల్లో పడింది. ఆ ప్రయత్నాలకు బాధ్యత వహించిన ఎగ్జిక్యూటివ్ ఇటీవల రాజీనామా చేశారు. కాగా Meta ప్రస్తుతం క్వెస్ట్ వంటి మిశ్రమ రియాలిటీ హెడ్సెట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరికరాలు AI వర్చువల్ అసిస్టెంట్ ద్వారా వీడియోను ప్రసారం చేయగలవు మరియు ధరించిన వారితో కమ్యూనికేట్ చేయగలవని కంపెనీ తెలిపింది. కంపెనీ సాధారణ కళ్లద్దాలను పోలి ఉండే సరళమైన డిజైన్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన AR గ్లాసెస్, స్మార్ట్‌వాచ్‌లపై కూడా పని చేస్తోంది. కాగా గ్లోబల్ ఆర్థిక మాంద్య పరిస్థితులు, ఆదాయాల క్షీణత నేపథ్యంలో ఐటీ సహా చాలాకంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ లాంటి దిగ్గజాలు వేలాది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. -
కత్రినా క్రేజే వేరు.. ఏకంగా ఫేస్ బుక్ సీఈవోను వెనక్కి నెట్టి!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న సినీ తారల్లో కత్రినా ఎప్పుడు ముందు వరసలోనే ఉంటారు. ఇన్‌స్టాలో ఆమెకు 76.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ సైతం ఛానెల్స్ సదుపాయం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ కూడా కత్రినా కైఫ్ 14 ఫాలోవర్స్‌లో ముందు వరుసలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా ఫేస్బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్, ప్రముఖ రాపర్ బ్యాడ్ బన్నీ కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. (ఇది చదవండి: కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్) ఇప్పటివరకు వాట్సాప్ ఛానెల్‌కు అత్యధికంగా 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్ 16.8 మిలియన్లతో రెండోస్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ అధికారిక ఛానెల్ 14.4 మిలియన్లతో మూడోస్థానంలో నిలవగా.. కత్రినా తన 14.2 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాపర్ బ్యాడ్ బన్నీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో 5వ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్‌ను 9.2 మిలియన్లతో కొనసాగుతున్నారు. కత్రినా కైఫ్ సెప్టెంబర్ 13న వాట్సాప్ ఛానెల్‌ను ప్రారంభించింది. కొత్త ఛానెల్‌కు స్వాగతం చెబుతూ తన ఫోటోలు కూడా పంచుకుంది. సెలబ్రీటీల పరంగా చూస్తే కత్రినా కైఫ్ టాప్‌లో ఉంది. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది) కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్-3 చిత్రంలో నటిస్తోంది. యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో నటించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్-3. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్ మేకర్స్ ప్రకటించారు. -
Facebook New Logo: ఫేస్బుక్ లోగో మారిందోచ్.. తేడా గుర్తించగలరా?
Facebook logo changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ లోగో మారింది. కొన్ని నెలల క్రితం ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ ‘X’గా రీబ్రాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రసిద్ధ పిట్ట (లారీ ది బర్డ్) లోగోను కూడా తొలగించి దాని స్థానంలోకి సాధారణ ‘X’ అక్షరం లోగోను తీసుకొచ్చింది. తాజాగా మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్ (Facebook) కూడా తమ లోగోలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ సూక్ష్మ మార్పులను చాలా మంది గమనించలేకోపోయారు. తదేకంగా గమనించే కొందరు యూజర్లు మాత్రం పసిగట్టేశారు. ఫేస్బుక్ కొత్త లోగో తమ “ఐడెంటిటీ సిస్టమ్” అప్డేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫేస్బుక్ లోగోను మెటా సర్దుబాటు చేసింది. ట్విటర్ లాంటి భారీ మార్పు కాకుండా సూక్ష్మమైన సర్దుబాటును మాత్రమే ఫేస్బుక్ చేసింది. అయితే తదేకంగా గమినిస్తే తప్ప లోగోలో ఏమి మారిందో గుర్తించడం కష్టం. ఫేస్బుక్ బ్రాండ్‌కు డిఫైనింగ్ మార్క్‌ను సృష్టించడం తమ లక్ష్యమని, కొత్త లోగో సుపరిచితంగా, డైనమిక్‌గా, సొగసైనదిగా భావించేలా ఉండాలనుకున్నట్లు ఫేస్బుక్ డిజైన్ డైరెక్టర్ డేవ్ ఎన్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఏం మారింది? ఫేస్బుక్ తమ లోగోలో చాలా సూక్ష్మమైన మార్పులు చేసింది. లోగోలోని ‘f’ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అలాగే లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది. అయితే ఫాంట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఫాంట్ ఇప్పటికీ Facebook Sansగానే ఉంది. ఇది ‘f’ అక్షరాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. (Google AI Chatbot Bard: గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!) ఇది "ఫేస్బుక్ కోసం రిఫ్రెష్ చేసిన గుర్తింపు వ్యవస్థ" మొదటి దశలో భాగమని మెటా పేర్కొంది. ఈ మార్పును వివరిస్తూ మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటన చేసింది. ఫేస్బుక్ యాప్‌లో రియాక్షన్లకు మరింత వైవిధ్యత తీసుకురావడానికి రియాక్షన్స్ కలర్ ప్యాలెట్‌ను అప్డేట్ చేసినట్లు ప్రకటించింది. కొత్త లోగోపై ట్రోల్స్ ఫేస్బుక్ కొత్త లోగోపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ‘తేడా గుర్తించండి.. చూద్దాం’ అంటూ ఒకరు, ‘మరింత నీలం’ అంటూ మరొకరు..యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ‘ఇది అత్యంత భారీ మార్పు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. -
మెటాకు కీలక మార్కెట్‌గా భారత్
న్యూఢిల్లీ: స్థూలఆర్థిక వృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో భారత్‌లో అపరిమిత అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియా హెడ్ సంధ్య దేవనాథన్ చెప్పారు. వీటితో పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి తమ యాప్స్ గణనీయంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్‌ను తాము కీలక మార్కెట్‌గా పరిగణిస్తున్నామని ఆమె వివరించారు. కేంద్రం కొత్తగా రూపొందించిన డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టంతో ఇటు యూజర్ల వివరాల గోప్యతను పాటించడం, అటు నూతన ఆవిష్కరణలు చేయడం మధ్య సమతౌల్యం పాటించడానికి సంబంధించి టెక్ కంపెనీలకు స్పష్టత లభించిందని సంధ్య తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్‌పై తప్పుడు సమాచారాన్ని, విద్వేషపూరిత కంటెంట్‌ని క్రియాశీలకంగా కట్టడి చేసేందుకు కృత్రిమ మేధను తాము సమర్థంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. పెరుగుతున్న యూజర్లు.. కీలక మార్కెట్లలో టీనేజర్లు, యువతలో ఫేస్‌బుక్‌కు ఆదరణ తగ్గుతోందన్న అభిప్రాయం సరికాదని.. మెటాలో భాగమైన ఫేస్‌బుక్‌కు భారత్‌లో 40 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారని వివరించారు. భారత్‌లో తాము వివిధ నవకల్పనలను పరీక్షించి, అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 2030 నాటికల్లా 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా ఎదగాలన్న భారత్ విజన్ అనేది వ్యాపారాలకు గణనీయంగా ఊతమివ్వగలదని సంధ్య చెప్పారు. -
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో ఫేస్బుక్, ఇన్‌స్ట్రామ్ యూజర్లకు గట్టి షాకివ్వనుంది. ఆ రెండు ఫ్లాట్‌ఫామ్‌లలో యాడ్స్‌ప్లే అవ్వకూడదనుకుంటే అందుకు యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన యురేపియన్ యూనియన్‌లో అందుబాటులోకి రానుందని సమచారం. త్వరలో మిగిలిన దేశాలకు సైతం వర్తించనుంది. దీనిపై మెటా అధినేత మార్క్ జుకర్ బెర్గ్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. 2019 నుంచి మెటా సేవలపై యూరోపియన్ యూనియన్ దేశాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మెటా అనుమతి లేకుండా వినియోగదారుల డేటాను సేకరిస్తుందని ఆరోపిస్తున్నాయి. నాటి నుంచి న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో మెటా యాజమాన్యం పెయిడ్ సర్వీసులపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవలు అందుబాటులోకి వస్తే యూజర్లు పేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు ఏ ఒక్కదానికి చెల్లించినా.. మరొకటి ఉచితంగా ఇవ్వనున్నది. ఇక పెయిడ్ వెర్షన్లో యూజర్ల నుంచి ఎంత వసూలు చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఒకేసారి చెల్లించి వాడుకోవడంతో పాటు.. లేదంటే వేర్వేరుగా ప్లాన్ సైతం ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. -
మస్క్ & జుకర్‌బర్గ్ పోరుకి అంతా సిద్ధం.. వేదిక అక్కడే?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఎలాన్ మస్క్ & మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి చరమ దశ వచ్చిందా అన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్లేస్ కూడా ఫిక్స్ చేసినట్లు టెస్లా సీఈఓ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ ఫైట్ మస్క్ అండ్ జుక్ ఫౌండేషన్ల ద్వారా నిర్వహిచనున్నట్లు తెలుస్తోంది. దీనికి రోమ్ నగరం వేదిక కానున్నట్లు, ఇప్పటికే ఇటలీ ప్రధానితో, అక్కడి సాంస్కృతిక శాఖామంత్రితో మాట్లాడినట్లు మస్క్ ట్వీట్ చేశారు. దీని ద్వారా వచ్చే డబ్బు మొత్తం స్వచ్చంద సంస్థలకు వెళ్లనున్నట్లు ఇదివరకే తెలియజేసారు. మెటా అండ్ ఎక్స్ ద్వారా ఈ ఫైట్ లైవ్ చూడవచ్చని వెల్లడించారు. ఇప్పటికే జరగాల్సిన ఈ ఫైట్ మస్క్ ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అంతే కాకుండా ఈ పోరుకి తానూ ఎప్పుడూ సిద్దమే అన్నట్లు గతం నుంచి జుకర్‌బర్గ్ చెబుతూనే ఉన్నాడు. అయితే ఇప్పటికి కూడా ఈ ఫైట్ జరుగుతుందా? లేదా అనేదాని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డేట్ కూడా ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: మొబైల్ కనిపించకుండా పోయిందా? డోంట్ వర్రీ - పరిష్కారమిదిగో..! ఈ కేజ్ ఫైట్ కోసం ఇప్పటికే ప్రపంచంలోని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ పోరు జరిగితే ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఎంతోమందిలో రోజురోజుకి ఎక్కువవుతోంది. బహుశా ఇది త్వరలోనే జరిగే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. The fight will be managed by my and Zuck’s foundations (not UFC). Livestream will be on this platform and Meta. Everything in camera frame will be ancient Rome, so nothing modern at all. I spoke to the PM of Italy and Minister of Culture. They have agreed on an epic location. — Elon Musk (@elonmusk) August 11, 2023 -
రింగ్‌లో ఫైటింగ్‌కు సిద్ధమౌతున్న మస్క్, జుకర్ బర్గ్
-
‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో..
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని తెలిసిందే. అయితే ఈ ఫైట్‌ను తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు. ఈ ఇద్దరు టెక్ టైటాన్లు గత నెలలో కేజ్ ఫైట్‌లో ఒకరినొకరు ఎదుర్కొనే సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆన్లైన్ షేక్ అవుతోంది. తరచూ వరి ఫైట్ గురించే చర్చ జరుగుతోంది. వారి ప్రత్యక్ష యుద్ధాన్ని వీక్షించేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జుక్ Vs మస్క్ ఫైట్ ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని వెటరన్స్ సంక్షేమానికి వెచ్చిస్తాం’ ట్వీట్ చేశారు. పోరాటానికి తాను సిద్ధమవుతున్నానని, రోజంతా బరువులు ఎత్తుతున్నానని అంతకుముందు చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తనకు వర్కవుట్ చేసేందుకు సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. ఈ సందర్భంగా వారి ఫైట్ గురించి ఓ యూజర్ ప్రస్తావించగా మస్క్ స్పందిస్తూ "ఇది ఒక నాగరిక యుద్ధం. మగాళ్లు యుద్ధాన్ని ఇష్టపడతారు" అని బదులిచ్చారు. 51 ఏళ్ల మస్క్, 39 ఏళ్ల జుకర్‌బర్గ్ మధ్య అన్ని విషయాల్లోనూ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ మధ్య ట్విటర్‌కు పోటీగా మెటా కొత్త యాప్ థ్రెడ్స్ ప్రకటించినప్పుడు అది తారస్థాయికి చేరింది. జుకర్‌బర్గ్‌తో కేజ్ ఫైట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ ట్విటర్లో తన అభిమానులకు చెప్పారు. ఆ మధ్య మార్షల్ ఆర్ట్స్ వీడియోలను జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా "ఫైట్ లొకేషన్ పంపించు" అంటూ ప్రతిస్పందించారు ఎలాన్ మస్క్. కేజ్ ఫైట్‌పై ఇద్దరూ పరస్పర పోస్టులు పెడుతూ ఫాలోవర్లలో ఉత్తేజం నింపుతున్నారు. Zuck v Musk fight will be live-streamed on 𝕏. All proceeds will go to charity for veterans. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
ఫేస్బుక్ సీఈవోలో ఈ టాలెంట్ కూడా ఉందా? రింగులో దిగితే..
టెక్ రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న మెటా 'సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) గురించి అందరికి తెలుసు. ఈయన కేవలం సాంకేతిక రంగంలో మాత్రమే కాకుండా యుద్ధ కలల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందాడు. ఇందులో భాగంగానే తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ బిలియనీర్ జాబితాలో ఒకరైన జుకర్‌బర్గ్ ఈ విజయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో గర్వంగా పంచుకున్నారు. ఇందులో అతని కోచ్ డేవ్ కామరిల్లోతో కలిసి కొత్త బెల్ట్ ప్రమోషన్లను జరుపుకున్నారు. ఇందులో 5వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించిన డేవ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఒక గొప్ప కోచ్, మీ ట్రైనింగ్‌లో ఫైటింగ్ గురించి చాలా నేర్చుకున్నాను, బ్లూ బెల్ట్ సాధించే స్థాయికి ఎదగటం చాలా గౌరవంగా భావిస్తున్నా అని ఫోటోలను పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!) జుకర్‌బర్గ్ చేసిన పోస్టుకి డేవ్ రిప్లై ఇస్తూ.. మీ ఆసక్తికి ధన్యవాదాలు, ట్రైనింగ్ సమయంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని గొప్పగా కొనియాడాడు. ఈ పోస్టుకి నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎలాన్ మస్క్ అండ్ మార్క్ మధ్య కేజ్ ఫైట్ జరుగుతుందనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనే దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
ఆరంభ శూరత్వం..ట్విటర్ దెబ్బకు చాప చుట్టేసిన ‘థ్రెడ్స్’!
ఆరంభంలో శూరత్వం అన్నట్టు.. ట్విటర్‌కు పోటీగా ఎదురైన కొన్ని రోజులకే థ్రెడ్స్ యూజర్ల విషయంలో చాప చుట్టేస్తున్నట్లు తెలుస్తోంది. రోజులు గడిచే కొద్ది యాక్టీవ్ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్.. థ్రెడ్స్‌ను యూజర్లకు పరిచయం చేసిన ప్రారంభంలో దాని రోజూ వారీ యూజర్లు 10 మిలియన్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. కానీ ఇటీవల విడుదలైన నివేదిక మాత్రం పూర్తి భిన్నంగా చూపిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. యాప్‌లో రోజువారీ యాక్టీవ్ యూజర్ల సంఖ్య వరుసగా రెండవ వారం పడిపోయింది. ఇప్పుడు 13 మిలియన్లకు చేరుకుంది. జూలై ప్రారంభంలో గరిష్ట స్థాయి నుండి 70 శాతం యూజర్లు తగ్గినట్లు సూచిస్తుంది. అదే సమయంలో ట్విటర్ రోజువారీ యాక్టీవ్ యూజర్లు 200 మిలియన్లు ఉన్నారు. దీంతో ట్విటర్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే థ్రెడ్స్‌కు భారీ ఎత్తున యూజర్లు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు సైన్ ఆప్‌ల విషయంలో మార్క్ జుకర్ బెర్గ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నారు. జులై 5న అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్ ప్రారంభం రోజుల్లో.. లాగిన్ అయ్యేందుకు యూజర్లు పోటెత్తేవారు. రాను రాను అలా సైన్ అప్ అయ్యే వారి సంఖ్య సైతం తగ్గింది. వినియోగదారుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తుంది. యూజర్ల సంఖ్య భారీగా పడిపోతున్నప్పటికీ మెటా యాజమాన్యం ట్విటర్‌కు పోటీ థ్రెడ్సేనన్న సంకేతాలిస్తుంది. యాప్‌ను పునరుద్ధరిస్తూ కొత్త ఫీచర్లను పరిచయం చేసేలా దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. అయినప్పటికీ, వినియోగదాలు తగ్గిపోకుండా ట్విటర్ ఎలాంటి ఫీచర్లను యూజర్లకు అందిస్తుందో.. థ్రెడ్స్ సైతం అవే ఫీచర్లను ఎనేబుల్ చేయాలని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
చాట్‌జీపీటీ, గూగుల్‌లకు పోటీగా మెటా ఏఐ.. ఉచిత వెర్షన్ విడుదల
ఫేస్బుక్ యజమాన్య సంస్థ మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు పెట్టింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ (Google) లకు పోటీగా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను పరిచయం చేసింది. ఉచిత వెర్షన్‌ను విడుదల చేసింది. ఓపెన్ ఏఐ, గూగుల్ సంస్థలు అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ, బార్డ్ చాట్బాట్లు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మానవ సృజనాత్మకత, నైపుణ్యాన్ని అనుకరిస్తూ వారిని ఆకర్షించేలా వీటిని రూపొందించారు. అయితే ఇందుకు భిన్నంగా జెనరేటివ్ ఏఐ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాకుండా పరిశోధకుల కోసం ప్రత్యేకంగా ‘లామా’ (Llama) అనే భాషా నమూనాను అభివృద్ధి చేసింది మెటా. ఈ లామా అనేది ఓపెన్ సోర్స్. అంటే ఓపెన్ ఏఐ, గూగుల్‌లు అభివృద్ధి చేసిన ఏఐలకు భిన్నంగా మెటా లామా ఏఐలో అంతర్గతంగా జరిగే పనులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వాటిని సవరించే వీలుంటుంది. ఇదీ చదవండి ➤ Meta: ‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని.. ఏం జరిగిందంటే.. "ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది చాలా మంది డెవలపర్లను కొత్త టెక్నాలజీతో నిర్మించడానికి వీలు కల్పిస్తుంది" అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. అలాగే ఇది సేఫ్టీ, సెక్యూరిటీని కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు ఎక్కువ మంది పరిశీలించి సంభావ్య సమస్యలను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునేలా మెటా ఏఐ మోడల్ సరికొత్త, శక్తివంతమైన వర్షన్ లామా 2 త్వరలో అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీస్ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
కలిసిపోయిన మస్క్, జుకర్‌బర్గ్.. బీచ్‌లో హగ్గులు, ఆటలు!
ట్విటర్ బాస్ 'ఎలాన్ మస్క్' & మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్' మధ్య ఉన్న పోటీ గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ ఇద్దరూ కేజ్ ఫైట్‌కు సిద్దమవుతున్నట్లు గత కొన్ని రోజులకు ముందు సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు వీరిరువురూ కలిసిపోయినట్లు కనిపించే ఫోటో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఎలాన్ మస్క్ అండ్ జుకర్‌బర్గ్ కలిసిపోయినట్లు కనిపించే ఈ ఫోటో 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' (AI) రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇద్దరూ చేతులు పట్టుకుని టైటాన్లు బీచ్‌లో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: భారత్‌లో ఈ కార్లకు డిమాండ్ ఎక్కువ - వీటి ప్రత్యేకతేంటంటే?) సర్ డోజ్ ఆఫ్ ది కాయిన్‌తో అనే ఒక ట్విటర్ యూజర్ ఏఐ ద్వారా ఈ చిత్రాలను రూపోంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరి చేయి మరొకరు పట్టుకున్నట్లు, కౌగిలించుకున్నట్లు, బీచ్‌లో ఎంజాయ్ చేతున్నట్లు చూడవచ్చు. ఇప్పటికి ఈ ఫొటోలు మిలియన్ల మంది వీక్షించారు. లక్షల మంచి లైక్ చేశారు. దీనిపై స్పందించిన మస్క్ ఒక నవ్వుతున్న ఎమోజి ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు. మొత్తం మీద ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 😂 — Elon Musk (@elonmusk) July 14, 2023 -
‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని
Lawsuit on Meta: యూఎస్ టెక్ దిగ్గజం మెటా (Meta) జాతి వివక్షకు పాల్పడుతోందని, ఆసియన్లను చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ వైష్ణవి జయకుమార్ అనే సింగపూర్‌కు చెందిన భారతీయ సంతతి ఉద్యోగిని కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగంలో దావా వేశారు. 2020 జనవరిలో మెటా కంపెనీలో చేరిన ఆమె అంతకు ముందు డిస్నీ, గూగుల్, ట్విటర్ సంస్థల్లో పనిచేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనను తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల కింద చేర్చి అవకాశాలు లేకుండా చేశారని వైష్ణవి వాపోయారు. ఆసియన్ మహిళ అయిన తనపై ఎలా జాతి వివక్ష చూపారో వైష్ణవీ జయకుమార్ ఇటీవలి లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. గత నెలలో మాస్ లేఆఫ్‌ల రూపంలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మెటా కంపెనీలో యూత్ పాలసీ హెడ్‌గా ఉన్న వైష్ణవీ జయకుమార్ మెటా యాప్‌లన్నింటిలో వయసు ఆధారిత పాలసీలు, ఉత్పత్తి లక్షణాలపై పనిచేసే బృందానికి నాయకత్వం వహించేవారు. మొదటి రెండేళ్లు అంతా బాగానే జరిగిందని, ఆ తర్వాత ప్రమోషన్ గురించి అడిగినప్పుడు జాతి వివక్షను ఎదుర్కొన్నట్లు వైష్ణవి పేర్కొన్నారు. తన మేనేజర్ ఉన్నట్టుండి జాతి వివక్ష చూపడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. తనకు ఇతర అభ్యర్థుల కంటే ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ నాయకత్వ బాధ్యతలకు తాను సీనియర్ని కానంటూ యాజమాన్యానికి తప్పుడు నివేదిక ఇచ్చారని వాపోయారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతమే.. వైష్ణవీ జయకుమార్ తన దావాలో ఆసియా, పసిఫిక్ ద్వీపవాసుల నిపుణుల నెట్వర్క్ ‘అసెండ్’ 2022లో చేసిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించారు. దాని ప్రకారం మెటా కంపెనీలోని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 49 శాతం మంది ఆసియన్లు ఉంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతం మంది మాత్రమే ఆసియన్లు ఉన్నారు. 2022 చివరి నాటికి మెటా కంపెనీ 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మార్చిలో మరో రౌండ్ మాస్ లేఆఫ్‌లలో మరో 10,000 మందికి ఉద్వాసన పలికింది. సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలంగా ఉన్న జాతి వివక్షకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని కోరుతూ టెక్ పరిశ్రమలో ఆసియా అమెరికన్లు దాఖలు చేసిన అనేక వ్యాజ్యాలలో వైష్ణవీ జయకుమార్ వేసిన దావా కూడా ఒకటి. అయితే ఈ ఆరోపణలపై మెటా కంపెనీ వర్గాల నుంచి ఇంతవరకు ఎటువంటి వివరణ రాలేదు. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌పై కోర్టులో దావా: ఇష్టమొచ్చినట్లు తొలగించడం కాదు.. కట్టు రూ. 4వేల కోట్లు! -
దెయ్యాలు వేదాలు వల్లిస్తే.. ఎవరూ ఊహించనిది ఇది!
ఎలన్ మస్క్‌తో పాటు ఎవరూ కూడా ఇలాంటి ఓ పరిణామం జరుగుతుందని ఊహించి ఉండరు. అదేంటో తెలుసా?.. తాలిబన్ల ఆయన్ని ఆరాధించడం. అవును.. ట్విటర్‌ను అద్భుతంగా నడిపిస్తూ తమకెంతో ప్రియపాత్రుడిగా నిలిచిపోయాడంటూ ఎలన్ మస్క్‌ను ఇష్టపడుతున్నారు వాళ్లు. అదే సమయంలో మార్క్ జుకర్‌బర్గ్ పేరు చెబితేనే అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే.. అఫ్గనిస్తాన్‌లో అనధికార ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తాలిబన్లు ట్విటర్‌పై.. దాని ఓనర్ ఎలన్ మస్క్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తాలిబన్ నేత అనాస్ హక్కానీ సైతం మస్క్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. భావ ప్రకటనకు సోషల్ మీడియాల్లో ట్విటర్ మాత్రమే సరైన వేదిక. దానిని సమర్థవంతంగా నడిపిస్తున్న ఎలన్ మస్క్‌కు తాలిబన్ల తరపున అభినందనలు. అందుకే ఆయనంటే మాకు ఎంతో గౌరవం అంటూ పేర్కొన్నారు. ‘‘ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కంటే Twitter ద్వారా రెండు అడ్వాంటేజ్‌లు ఉన్నాయి. మొదటిది వాక్ స్వాతంత్ర్యం హక్కు. రెండోది Twitter స్వభావమైన విశ్వసనీయత. మెటాలాంటి అసహన విధానానికి ట్విటర్ దూరంగా ఉంటుంది. వేరొకటి దానిని భర్తీ చేయలేదు అంటూ మెటా థ్రెడ్స్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారాయన. Twitter has two important advantages over other social media platforms. The first privilege is the freedom of speech. The second privilege is the public nature & credibility of Twitter. Twitter doesn't have an intolerant policy like Meta. Other platforms cannot replace it. pic.twitter.com/oYQTI3hgfI — Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) July 10, 2023 కారణం ఇదే.. మెటాను(ఒకప్పటి ఫేస్బుక్)ను తాలిబన్లు ద్వేషించడానికి ప్రధాన కారణం .. తాలిబన్ అనే పదాన్ని ఆ ప్లాట్‌ఫారమ్ పరిగణించే విధానం. పక్కా టైర్ 1 ఉగ్రవాద సంస్థగా తాలిబన్‌ను చూపిస్తోంది ఇది. పైగా తాలిబన్‌కు మురికి అనే అర్థం కట్టబెట్టింది. ఈ కారణం వల్లే ఫేస్బుక్(మెటా)లో తాలిబన్ లీడర్లు తమ అభిప్రాయాలను పంచుకోలేకపోతున్నారు.. అసహ్యించుకుంటున్నారు. అదే ట్విటర్లో అయితే యధేచ్ఛగా తమ పోస్టులను పెడుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ అఫ్గ్ పేరిట తాలిబన్ గ్రూప్‌కు ట్విటర్లో ఓ అధికారిక అకౌంట్ కూడా ఉంది. నాటో బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు తిరిగి అఫ్గనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఇకపై ప్రజాస్వామ్య యుతంగా.. పాలన సాగిస్తామని, ఏ వర్గానికి హక్కుల్ని దూరం చేయబోమని ప్రకటించుకుని పాలన మొదలుపెట్టింది. పైగా ఈ ప్రచారంతోనే గ్లోబల్ గుర్తింపు, అటుపై ఆర్థిక సాయం.. ఒప్పందాల కోసం తాలిబన్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కానీ, తుపాకీ రాజ్యంలో మహిళలు, పిల్లల హక్కులను కాలరాస్తూనే వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తాలిబన్లు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది కదా!. ఇదీ చదవండి: ఒంటి కన్ను దొంగ.. భలే భలే కథ -
చట్టపరమైన చిక్కుల్లో థ్రెడ్స్.. మార్క్ జుకర్ బర్గ్‌కు నోటీసులు!
ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విటర్‌కు పోటీగా మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ మాతృసంస్థ) అధినేత మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్స్’ను విడుదల చేశారు. ఈ యాప్ సంచలనాలకు కేంద్రం బిందువుగా మారింది. లాంఛ్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 30 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. అదే సమయంలో చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. తమ మేధో సంపత్తిని (intellectual property rights)ను కాపీ కొట్టారంటూ ఎలాన్ మస్క్ తన లాయర్ అలెక్స్ స్పిరో ద్వారా జుకర్ బర్గ్‌కు నోటీసులు పంపించారు. ట్విటర్ వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నోటీసుల్లో అలెక్స్ స్పిరో పేర్కొన్నారు. వీటితో పాటు ట్విటర్ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలున్న డజన్ల కొద్దీ మాజీ ట్విటర్ ఉద్యోగులను మెటా నియమించుకుందని లేఖలో ఆరోపించింది. NEWS: Twitter is threatening to sue Meta over "systematic, willful and unlawful misappropriation" of Twitter's trade secrets and IP, as well as scraping of Twitter's data, in a cease-and-desist letter sent yesterday to Zuckerberg by Elon's lawyer Alex Spiro. pic.twitter.com/enWhnlYcAt — T(w)itter Daily News (@TitterDaily) July 6, 2023 తమ సంస్థ వ్యాపార రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఉపయోగించడం మెటా మానుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే మెటాకు ట్విటర్ నోటీసులంటూ వచ్చిన వార్తలను ఉటంకిస్తూ చేసిన ట్వీట్‌కు మస్క్ స్పందించారు. ‘పోటీ మంచిదే.. కానీ మోసం చేయకూడదు’ అని అన్నారు. ఇక, థ్రెడ్స్‌లో ట్విటర్ మాజీ ఉద్యోగులున్నారంటూ ట్విటర్ పంపిన నోటీసుల్ని మెటా ఖండించింది. థ్రెడ్స్ ఐటీ విభాగంలో మాజీ ట్విటర్ ఉద్యోగులు ఎవరూ లేరని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ థ్రెడ్స్ పోస్ట్‌లో తెలిపారు. మేధో సంపత్తి అంటే? మేధో సంపత్తి అనేది కంటికి కనిపించని ఆస్తుల్లోని ఓ భాగం. మనుషులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణ, సాహిత్య, కళాత్మక పని, డిజైన్లు, చిహ్నాలు (సింబల్స్), పేర్లు, చిత్రాలు (ఇమేజెస్) వంటివి ఈ జాబితాలో ఉంటాయి. వీటికి వ్యక్తుల మనసు, తెలివితేటలు ప్రాణం పోస్తాయి. వీటి సృష్టికి సంబంధించిన ఐడియాలు కంటికి కనిపించవు. ఈ ఐడియాలనే మేధో సంపత్తి అంటారు. -
మార్గ్ జుకర్‌బర్గ్ ట్వీట్! ఎలాన్ మస్క్ రిప్లై ఇలా..
ట్విటర్‌కు పోటీగా విడుదలైన మెటా థ్రెడ్స్ కొన్ని గంటల్లోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఒక మిలియన్ కంటే ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు మెటా సీఈఓ మార్గ్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. కొంతమంది ఈ కొత్త యాప్‌ని ట్విటర్ కిల్లర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే జుకర్‌బర్గ్ ట్విటర్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జుకర్‌బర్గ్ ట్వీట్.. నిజానికి మెటా సీఈఓ జుకర్‌బర్గ్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేయడం చాలా రోజుల తరువాత ఇదే మొదటి సారి. సుమారు 11 సంవత్సరాల తరువాత మొదటి పోస్ట్ చేసాడు. కొత్త యాప్ లాంచింగ్ సందర్భంగా ఈ ట్వీట్ చేసాడు. ఈ పోస్టులో కనిపించే రెండు స్పైడర్‌మ్యాన్ చిత్రాలు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇది ట్విటర్ అధినేత మస్క్‌ను ఉదీసించి పోస్ట్ అని తెలుస్తోంది. pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 జుకర్‌బర్గ్ 2012 జనవరి 18 తరువాత ట్విటర్ ద్వారా ట్వీట్ చేయడం ఇదే మొదటి సారి. ఈ పోస్టుకి ఇప్పటికి లెక్కకు మించిన లైకులు, కామెంట్స్ అండ్ షేర్స్ వస్తున్నాయి. థ్రెడ్స్ యూజర్ల సంఖ్య ట్విటర్‌ను మించిపోతుందా అనే ప్రశ్నకు జుకర్‌బర్గ్ ఇంకా కొంత సమయం పట్టవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. (ఇదీ చదవండి: ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!) ఎలాన్ మస్క్ ట్వీట్.. థ్రెడ్స్ యాప్ దాదాపు ట్విటర్ మాదిరిగానే ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేసాడు. ఇందులో భాగంగా ఒక కీ బోర్డు ఇమేజ్ యాడ్ చేసి Ctrl+C+V (ట్విటర్ కాపీ పేస్ట్) అని రాసాడు. దీనికి స్పందిస్తూ ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఒక ఎమోజి పోస్ట్ చేసాడు. మొత్తానికి అనుకున్న విధంగా మెటా ఒక కొత్త యాప్ తీసుకువచ్చింది. అయితే ఇది ట్విటర్ యాప్‌ని దెబ్బతీస్తుందా.. లేదా అనేది మరి కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్’కు ఎదురు దెబ్బ!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ట్విటర్ తరహాలో థ్రెడ్స్ పేరుతో యాప్‌ను లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ విచిత్రంగా స్పందించారు. ఇటీవల,ట్విటర్లో రోజుకు వీక్షించే ట్వీట్లపై ఎలాన్ మస్క్ ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ట్విటర్ బాస్ మాత్రం తాను చేస్తున్న చర్యల్ని సమర్ధించుకున్నారు. యూజర్లు ట్విటర్‌కు బానిసయ్యే ప్రమాదం ఉంది. దాని నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. నేను ప్రపంచానికి మంచి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. అదే సమయంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న థ్రెడ్ యాప్‌ను యూజర్లకు అందిస్తున్నట్లు మెటా తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ సైతం ఆ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈనేపథ్యంలో ఎన్ ఎఫ్టీ టెక్నాలజీ సీఈవో మారియో నౌఫల్ థ్రెడ్ యాప్ గురించి ట్వీట్ చేశారు. థ్రెడ్ యాప్ విడుదలపై స్పష్టత వచ్చింది. జులై 6న అమెరికాలో విడుదల కానుంది. మెటాలోని ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్లుగా.. మెటా లక్ష్యం నీతి, నిజాయితీ, విలువలతో కూడిన సోషల్ మీడియా సైట్‌ను అభివృద్ది చేయడం. అయినప్పటికీ, యాప్ తన వివరణలో పేర్కొన్నట్లుగా ‘సనేలీ రన్’ అనే పదం యాప్ మీ మొత్తం డేటాను సేకరిస్తుంది అని సూచించేలా ఉంది. వ్యక్తిగతంగా, అది నిజమేనని నేను గట్టిగా నమ్ముతాను. 🚨BREAKING: META's Answer to Twitter (Threads) Release Date CONFIRMED 'Threads' will be released on Thursday in the U.S. The app has been described as a competitor to Twitter. According to an executive at Meta, its goal is to establish a "sanely run" social media site.… pic.twitter.com/PxQxAERnB1 — Mario Nawfal (@MarioNawfal) July 4, 2023 ట్విటర్ ఉన్నత ఆశయాలతో పనిచేస్తుంది. జుకర్ బర్గ్ అందుకు విరుద్ధం. వాక్ స్వాతంత్య్రానికి నిజమైన ఛాంపియన్ అతనే అంటూ వెటకారంగా ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూలం అంశం ఏంటంటే? థ్రెడ్ యాప్ విషయంలో జుకర్ బర్గ్‌తో పోటీ పడేందుకు ఎలాన్ మస్క్ ఇప్పటికే సిద్ధంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. Great tweet on this story, further demonstrating Meta's COMPLETE lack of care about privacy! https://t.co/jJ6WxsGlJy — Mario Nawfal (@MarioNawfal) July 4, 2023 అందుకు ఇయాన్ జెల్బో అనే మరో నెటిజన్.. ఆశ్చర్యం పోవడానికి అందులో ఏమీ లేదు. ఎందుకంటే ట్విటర్ ప్రత్యర్ధి మెటా మన డేటాను కలెక్ట్ చేస్తుందంటూ కొన్ని ఆధారాలు చూపిస్తూ వాటిని ట్వీట్ చేశాడు. Thank goodness they’re so sanely run — Elon Musk (@elonmusk) July 4, 2023 ఆ ట్వీట్లకు మస్క్ తనదైన శైలిలో స్పందించారు. కృతజ్ఞత, వాళ్లు చాలా తెలివిగా నడుచుంటున్నారని పేర్కొన్నారు. మరి థ్రెడ్స్ విడుదల, డేటా గోప్యతపై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందించాల్సి ఉంటుంది. చదవండి👉 ట్విటర్ పోటీగా మెటా ‘థ్రెడ్’.. ఫస్ట్ లుక్ ఇదే! -
ట్విటర్ పోటీగా మెటా ‘థ్రెడ్’.. ఫస్ట్ లుక్ ఇదే!
Instagram Threads : యూజర్లు చూసే ట్వీట్లపై ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, మస్క్ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న యూజర్లు ట్విటర్‌కు ప్రత్యామ్నాయమైన బ్లూ స్కై, మాస్టోడాన్ లాంటి మైక్రోబ్లాగింగ్ యాప్స్‌ను వినియోగించేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ తరుణంలో మస్క్‌ను మరింత ఇబ్బందుల్లో నెట్టేలా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్’ పేరుతో ట్విటర్ తరహా మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ యాప్‌ను జులై 6న విడుదల చేయనున్నారు. ఈ యాప్ విడుదల తేదీపై స్పష్టత లేనప్పటికీ.. థ్రెడ్ యాప్ వివరాలు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. థ్రెడ్ యాప్ విడుదల తర్వాత ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు వారి ఇన్‌స్టా ఐడీతో ఈ మైక్రోబ్లాగింగ్ యాప్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందంటూ ప్లేస్టోర్‌లో కనిపిస్తున్న థ్రెడ్ యాప్‌లో లాగిన్ వివరాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ యాప్ గురించి సంస్థ ఉద్యోగులతో మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ ప్రివ్యూ మీటింగ్ నిర్వహించారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. థ్రెడ్ కోసం డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్రోటోకాల్ సంస్థ యాక్టివిటీపబ్తో మెటా చేతులు కలిపింది. ఈ సంస్థ వెబ్ సర్వర్లకు - వెబ్బ్రౌజర్లు థ్రెడ్ యాప్ ఇంటర్ ఫేస్‌కు అనుసంధానం చేసేలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ యాప్ ఇంటర్నల్ కోడ్ నేమ్ ‘ప్రాజెక్ట్ 92’ అని తెలుస్తోంది. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు? -
ముష్టియుద్ధానికి సిద్ధమవుతున్న మస్క్, జుకర్‌బర్గ్.. ట్రైనింగ్ కూడా..
సాధారణంగా ధనవంతులైన ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ ఉంటుంది, అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈఓ 'ఎలన్ మస్క్' (Elon Musk), ఫేస్బుక్ వ్యవస్థాపకుడు 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) నిజమైన పోరుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. I’m up for a cage match if he is lol — Elon Musk (@elonmusk) June 21, 2023 మాటలతో మొదలైన ఈ పోరు చేతల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. వీరు ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ వరకూ వెళ్లారని కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ప్రారంభంలో.. జుకర్‌బర్గ్ ఒకే అంటే కేజ్ ఫైట్ చేయడానికి తాను సిద్దమేనని మస్క్ ట్విటర్ పోస్ట్ చేసాడు. దీనికి రిప్లై ఇస్తూ జుకర్‌బర్గ్ 'ప్లేస్ ఎక్కడో చెప్పు' అన్నట్లు సమాచారం. I did an impromptu training session with @elonmusk for a few hours yesterday. I'm extremely impressed with his strength, power, and skill, on the feet and on the ground. It was epic. It's really inspiring to see Elon and Mark doing martial arts, but I think the world is served… pic.twitter.com/cq00A9Xnmw — Lex Fridman (@lexfridman) June 27, 2023 అంతటితో ఆగకుండా మస్క్ 'వెగాస్ ఆక్టాగాన్' వచ్చేయ్ అక్కడ చూసుకుందాం.. అన్నాడట. అయితే ఇది కేవలం పోస్టులకు మాత్రమే పరిమితం అనుకున్న నెటిజన్లకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే వీరిద్దరూ కూడా ఈ ఫైట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ఫైట్ తథ్యమే అని చాలా మంది అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) Here's a highlight video of Mark Zuckerberg and I training jiu jitsu. I look forward to training with @elonmusk as well. It's inspiring to see both Elon and Mark taking on the martial arts journey. See the full video here: https://t.co/G1ubUuxILK pic.twitter.com/WsLaRiFf1o — Lex Fridman (@lexfridman) June 25, 2023 నిజంగా వీరిద్దరి మధ్య పోరు జరుగుతుందా.. లేదా? అనేది ఖచ్చితంగా తెలియకపోయినా, ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే జరిగితే ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలిసిన జుకర్‌బర్గ్ చేతిలో మస్క్ ఓటమి ఖాయమని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. -
సొంత ఉద్యోగులే భారీ షాకిచ్చారు
-
లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు మింగుడు పడని వార్త ఇది. మెటా నిర్వహించిన ఉద్యోగుల సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడైనాయి. కేవలం 26 శాతం మంది సిబ్బంది మాత్రమే మెటా మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక నివేదికలో పేర్కొంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఐదు శాతం పడిపోయిందని తెలిపింది. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) వాల్ స్ట్రీట్ జనరల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం మెటా ఉద్యోగులలో 74 శాతం మంది అసంతృప్తితో ఉన్నారట. వేలాది మంది ఉద్యోగులను తొలగించిన రెండు నెలల తర్వాత ఏప్రిల్ 26- మే 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో నాలుగింట ఒక వంతు మంది అంటే 26 శాతం మంది మాత్రమే మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారు. ఇది అక్టోబర్‌లో 58 శాతం నుండి 5 శాతం క్షీణించి 43 శాతానికి పడిపోయింది. (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు) ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ బాటపట్టాయి. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సహా గూగుల్, మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి అనేక టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులపై వేటు వేశాయి. ముఖ్యంగా మెటా అనేక దశల్లో 21వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఆకస్మిక తొలగింపులు మెటాలో పనిచేస్తున్న వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రస్తుత , మాజీ ఉద్యోగులు భావిస్తున్నారు. -
మెటా కీలక నిర్ణయం వర్క్ ఫర్మ్ హోమ్..!
-
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి.. కొత్త వర్క్ పాలసీని అమలు చేయనున్న మెటా!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. వర్క్ ప్రమ్ హోమ్‌ను తగ్గించేలా చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్త వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త పని నిబంధనలు అమల్లోకి వస్తే ఉద్యోగులు కనీసం వారానికి మూడు రోజులు కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. వర్క్‌లో సమర్ధత, ఉత్పాదకత వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకున్న మెటా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త పాలసీని అమలు చేయనుంది. అయితే, ఇప్పటికే రిమోట్ వర్క్‌కి పరిమితమైన ఉద్యోగులు వారి ప్రస్తుత స్థానాల నుంచి విధులు నిర్వహించేందుకు మెటా అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మెటా ప్రతినిధులు కొత్త వర్క్ పాలసీ విషయంలో ఉద్యోగులు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యాలయం నుంచి లేదంటే ఇంటి నుంచి పని చేసినా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పులు ఉండవని, సమర్ధవంతంగా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సహకారం, సంబంధాలు, అనుకూలమైన పని సంస్కృతిని పెంపొందించేందుకే కొత్త పని విధానంపై పనిచేస్తున్నట్లు మెటా ప్రతినిధి ప్రస్తావించారు.ఈ నిర్ణయం మెటా గత కొంతకాలంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో జరిగిన ఇంటర్నల్ మీటింగ్‌లో ఇంజినీర్లు వారంలో కనీసం మూడు రోజులు సహచరులతో కలిసి పనిచేసినప్పుడే మెరుగైన పనితీరు కనబరుస్తామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మెటా వర్క్ పాలసీ అమలు చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
మెటాలో తొలగింపులు! వారికి జుకర్‌బర్గ్ ఇస్తానన్న ప్యాకేజీ ఏంటో తెలుసా?
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా (Meta Platforms Inc) ఆఖరు రౌండ్ లేఆఫ్స్‌ను మొదలు పెట్టింది. మొత్తం 10,000 ఉద్యోగాలను తొలగించడానికి మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగా ఇది చివరి రౌండ్ తొలగింపు. మొదటి, రెండో విడత తొలగింపులు ఇప్పటకే పూర్తయ్యాయి. ఈ మేరకు కొంతమంది మెటా ఉద్యోగులు లింక్డ్ఇన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తమ తొలగింపు గురించి తెలియజేశారు. ఈ రౌండ్ లేఆఫ్స్‌లో కంపెనీ యాడ్ సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. సీవెరెన్స్ ప్యాకేజీ అంటే? గతంలో 11,000 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు మెటా కంపెనీ వారికి సీవెరెన్స్ ప్యాకేజీని వాగ్దానం చేసింది. సీవెరెన్స్ ప్యాకేజీ అంటే ఉద్యోగులను తొలగించినప్పుడు కంపెనీ వారికి చెల్లించే మొత్తానికి సంబంధించిన ప్యాకేజీ. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ ప్యాకేజీ కింద 16 వారాల మూల వేతనం చెల్లిస్తారు. అదనంగా ఉద్యోగుల అనుభవాన్ని బట్టి వారు పనిచేసిన ఒక్కో సంవత్సరానికి రెండు వారాల మూల వేతనం చొప్పున తొలగింపునకు గురైన ఉద్యోగులు అందుకుంటారు. అలాగే ఈ ప్యాకేజీ కింద ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరు నెలలపాటు వైద్య ఖర్చులను కంపెనీనే భరిస్తుంది. 2022 నవంబర్‌లో 11,000 మందికిపైగా ఉద్యోగులను మెటా తొలగించింది. తర్వాత ఈ ఏడాది మార్చిలో మళ్లీ 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సారి తొలగిస్తున్న ఉద్యోగాలతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2021 ఏడాది మధ్య నాటికి ఉన్న స్థాయికి పడిపోయింది. 2020 తర్వాత మెటా నియామకాలను రెట్టింపు చేస్తూ వచ్చింది. మొత్తంగా లేఆఫ్స్ ప్రభావం ఈ సారి నాన్-ఇంజనీరింగ్ ఉద్యోగులపై పడింది. అంటే కోడింగ్, ప్రోగ్రామింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీతో ఇంజనీర్లు, నాన్ ఇంజనీరింగ్ ఉద్యోగుల మధ్య సమతూకం పాటించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత మార్చిలో హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
మెటాకు భారీ షాక్
-
మెట్‌గాలాలో బిలియనీర్లు అంబానీ, మస్క్, రతన్ టాటా, ఆనంద్ మహీంద్ర: ఫోటోలు వైరల్
సాక్షి,ముంబై: మెట్‌గాలాలో బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు సందడి చేశారు. అదేంటి ఫ్యాషన్ ఈవెంట్లో వ్యాపారవేత్తలకు ఏం పని అనుకుంటున్నారా? ఇదంతా ఏఐ ఆర్ట్ మహిమ. ఏఐ ఆర్టిస్ట్ అబూ సాహిద్ బుర్రలో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ చిత్రాలు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఇంట్రస్టింగ్ ఫోటోలతో ఇన్‌స్టాలో పాపులర్ అవుతున్నారు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ట్విటర్ అధినేత, ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్‌జుకర్ బర్గ్ మెట్ గాలాకు హాజరవుతున్నట్లు ఊహించి ఈ ఫోటోలను సృష్టించారు. మిడ్ జర్నీ సాయంతోరూపుదిద్దిన ఈ ఫోటోల్లోబాబా రాందేవ్, అజీం ప్రేమ్‌జీతో పాటు, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ లాంటి దిగ్గజాల ఫోటోలు కూడా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి మెట్‌గాలా. ఈ ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్‌ను న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రతీ ఏడాది నిర్వహిస్తుంటారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా కృత్రిమ మేధస్సుతో (ఏఐ) రూపొందించిన చిత్రాలు ఇంటర్నెట్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు , డిజిటల్ ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రూపొందించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇండియన్ డిజిటల్ ఆర్టిస్ అబూ సాహిత్ ప్రముఖంగా నిలుస్తున్నారు. ఇన్‌స్టాలో ఆయనకు 21.6వేల గ్రామ్ ఫాలోవర్లున్నారు. ఆయన పేజీ నిండా ఇలాంటి ఫోటోలు చాలానే ఉన్నాయి. View this post on Instagram A post shared by SK MD ABU SAHID (@sahixd) -
రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్‌బర్గ్ ఫోటో వైరల్
ముగ్గురు ఆడపిల్లల మురిపాల తండ్రి మెటా సీయివో మార్క్ జుకర్‌బర్గ్. మాగ్జిమా (7), ఆగస్ట్(5)లకు తోడుగా గత మార్చి నెలలో ఈ లోకంలోకి వచ్చింది ఔరేలియ. ‘వెల్కమ్ టూ ది వరల్డ్’ అంటూ ఆ చిట్టి ఫోటోను పోస్ట్ చేసి స్వాగతం పలికాడు జుకర్‌బర్గ్. తాజా విషయానికి వస్తే... పెద్దమ్మాయి, రెండో అమ్మాయిల కోసం తానే స్వయంగా త్రీడీ ప్రింటింగ్ డ్రెస్‌లను డిజైన్ చేయడంతో పాటు కుట్టుపని కూడా నేర్చుకున్నాడు జుకర్‌బర్గ్. తాను డిజైన్ చేసిన గౌన్‌ను పిల్లలు ధరించారు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు జుకర్‌బర్గ్. ఈ ఫొటో బాగా వైరల్ అయింది. చదవండి: కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల.. ‘జుకర్ బర్గ్... మీరు ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే, పిల్లల డ్రెస్ కోసం కేటాయించిన సమయం అత్యంత విలువైనది. భవిష్యత్‌లో మీ పిల్లలకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలువైన సందర్భం ఇది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
వినతుల వెల్లువ.. వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్!
న్యూఢిల్లీ: వాట్సాప్ ఓ అనుకూల సదుపాయాన్ని తన యూజర్ల కోసం రూపొందించింది. ఒకటికి మించిన ఫోన్లలో ఒక్కటే వాట్సాప్ ఖాతాను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు, రానున్న వారాల్లో ప్రతి ఒక్కరికీ ఇది వినియోగంలోకి వస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్ కావాలంటూ వాట్సాప్ యూజర్లలో ఎక్కువ మంది నుంచి వినతులు రావడంతో దీన్ని రూపొందించినట్టు సంస్థ తెలపింది. వాట్సాప్‌ను వెబ్ బ్రౌజర్‌కు కనెక్ట్ చేసిన మాదిరే, ఒకటికి మించిన ఫోన్లలోనూ అనుసంధానించడం ద్వారా కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకే ఖాతా అనుసంధానమై ఉన్న ఏ ఫోన్లో అయినా చాట్, మీడియా, కాల్స్ సేవలు వాడుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. ఒకవేళ ప్రైమరీ ఫోన్ (మొదట ఇన్స్టాల్ చేసుకున్న)లో వాట్సాప్ చాలా కాలంగా యాక్టివ్‌గా లేకపోతే, అప్పుడు ఆ అకౌంట్ కనెక్ట్ అయి ఉన్న ఇతర ఫోన్లలోనూ దానంతట అదే లాగవుట్ అవుతుందని పేర్కొంది. సైనవుట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్‌కు ‘నౌ స్విచ్’ను ఎంపిక చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. -
షాకిచ్చిన మెటా.. ఊహించినట్టే భారీగా ఊడుతున్న ఉద్యోగాలు!
ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరో సారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రచురించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. తాజా లేఆఫ్స్‌పై మేనేజర్లుకు మెటా మెమో పంపింది. ఆ మెమోలో ఉద్యోగుల్ని కోత విధించే విషయంలో సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంతో ఫేస్బుక్, వాట్సాప్,ఇన్‌స్టా, వర్చువల్ రియాలిటీ సంస్థ రియాలిటీ ల్యాబ్స్,క్విస్ట్ హార్డ్ వంటి విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. కాస్ట్ కటింగ్ విషయంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు10 వేల మంది ఉపాధి కోల్పోనున్నట్లు జుకర్ బర్గ్ ఈ ఏడాది మార్చి నెలలో ప్రకటించిన విషయం తెలిసింది. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే ఇప్పుడు తొలగింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మేనేజర్లకు పంపిన మెమోలో ఉద్యోగులు సైతం కొత్త మేనేజర్ల పర్యవేక్షణలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, వర్క్‌ను విభజించినప్పుడు వివిధ విభాగాల ఉద్యోగులు వారితో పనిచేయాల్సి వస్తుందని సూచించింది. కాగా, ఈ సందర్భంగా మెటా ప్రతినిధి లేఆఫ్స్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. 5 నెలల్లో ఇది రెండోసారి 5 నెలల్లో మెటా భారీగా ఉద్యోగాలను తొలగించడం ఇది రెండో సారి. గత నవంబరులో 13శాతంతో 11,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల్ని మరోసారి తొలగిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలియజేసింది. కొత్త నియామకాల్ని నిలిపివేసింది. ‘ప్రతికూల వ్యాపార’ పరిస్థితుల నేపథ్యంలో, సంస్థ ఆర్థిక స్థితిని కాపాడుకునేందుకు వ్యయాలు తగ్గించుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి👉 ఉద్యోగులపై వేలాడుతున్న లేఆఫ్స్ కత్తి, 2.70 లక్షల మంది తొలగింపు..ఎప్పుడు? ఎక్కడా? -
బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్
సాక్షి,ముంబై: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మార్క్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోసారి అమ్మాయి పుట్టడం పట్ల జుకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. లిటిల్ బ్లెస్సింగ్.. అరేలియా చాన్కి స్వాగతం అంటూ జుకర్ బర్గ్ ప్రకటించారు. దీంతో 1 మిలియన్‌కు పైగా లైక్స్ అభినందనలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) (ఇదీ చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) కాగా గతంలోనే తనకు పాప పుడుతుందని జుకర్ బర్గ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రిసిల్లా చాన్ మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని, మ్యాక్స్, ఆగస్ట్ (కుమార్తెలు) కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోందంటూ అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్న ప్రిసిల్లా చాన్,జుకర్‌బర్గ్.. 2003 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరి అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ జంట.ఇటీవలే పదో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపు కున్నారు. (జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు) -
ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇటీవలికాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలోదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉద్యోగులకు జుకర్‌బర్గ్ అంతర్గత ఇమెయిల్ ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 2010లో ఉద్యోగులకు రాసిన ఈమెయిల్ తాజాగా (మంగళవారం. మార్చి 21) లీక్ అయింది. తాజా నివేదికల ప్రకారం ఫేస్బుక్ సొంత మొబైల్ ఫోన్లో పనిచేస్తోందని టెక్ క్రంచ్ కథనానికి ప్రతిస్పందనగా 2010 ఇమెయిల్ పంపించారు. ఈ వార్తను ఖండిస్తూ సిబ్బందిపై జుకర్ బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నెట్వర్క్ భవిష్యత్తు ప్రణాళికల గురించి తప్పుడు సమాచారాన్ని లీక్ చేశాడనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కంపెనీ రహస్యంగా ఫోన్‌ను నిర్మిస్తోందన్న టెక్ క్రంచ్ కథనంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా నమ్మక ద్రోహమే.. ఈ పని ఎవరు చేశారో దయచేసి తక్షణమే రాజీనామా చేయండి అని జుకర్‌బర్గ్ మండిపడ్డారు. 2010, సెప్టెంబరులో నాటి ఈ ఇ-మెయిల్ "కాన్ఫిడెన్షియల్-డోంట్ షేర్" అనే లైన్‌తో మొదలవుతుంది. ఒక ప్రశ్నోత్తరాల సమయంలో తాను ఫోన్ తయారీ గురించి అస్సలు మాట్లాడలేదని, అన్ని ఫోన్లు, యాప్స్ మరింత సోషల్ కావడం, భవిష్యత్తు ప్రణాళికలపై మాత్రమే సుదీర్ఘంగా మాట్లాడాను అంటూ టెక్ క్రంచ్ కథనాన్ని కోట్ చేశారు. ఈ విషయాన్ని ఎవరు లీక్ చేసినా వెంటనే రాజీనామా చేయాల్సిందేనంటూ ఆగ్రహించారు. సంస్థ అంతర్గత సమాచారాన్ని లీక్ చేసిన వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి.. లేదంటే అదెవరో ఖచ్చితంగా తెలుసుకుంటామని జుకర్‌బర్గ్ హెచ్చరించారు. కాగా గత ఏడాదంతా మెటాకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతికూల ఆర్థిక వాతావరణామాలు, ఆదాయాలు పడిపోవడంతో వేలాదిమందిని తొలగించింది. అంతేకాదు మిడిల్ మేనేజ్మెంట్ను లక్ష్యంగా రాబోయే నెలల్లో 10వేల మందిని మెటా తొలగిస్తుందని, అలాగ 5 వేల ఇతర జాబ్స్‌ను కూడా భర్తీ చేయడంలేదని మార్చి నెల ప్రారంభంలో జుకర్‌బర్గ్ ఉద్యోగులకు ఇమెయిల్ సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు మార్క్‌జుకర్ బర్గ్ షాక్ .. మరో 10,000 మందిని
న్యూయార్క్: ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా మరో 10,000 మందికి ఉద్వాసన పలకనున్నట్టు మంగళవారం ప్రకటించింది. అలాగే కొత్తగా 5,000 మందిని విధుల్లోకి తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. నాలుగు నెలల్లోనే రెండవ పర్యాయం ఉద్యోగుల కోతకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సంస్థ చరిత్రలో అత్యధికంగా 2022 నవంబర్‌లో 13 శాతం (11,000) మంది ఉద్యోగులను మెటా తొలగించిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల కోత రాబోయే రెండు నెలల్లో జరుగుతుందని సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు. ‘పునర్నిర్మాణాలు, తొలగింపులను మా సాంకేతిక సమూహాలలో ఏప్రిల్ చివరలో, వ్యాపార సమూహాలలో మే నెలాఖరులో ప్రకటించాలని భావిస్తున్నాము’ అని తెలిపారు. ఉద్యోగుల కోత పూర్తి అయితే మొత్తం సిబ్బంది సంఖ్య సుమారు 66,000లకు వచ్చి చేరనుంది. 2022 సెపె్టంబర్ చివరినాటికి 87,314 మంది సంస్థలో పనిచేస్తున్నారు. -
జుకర్‌బర్గ్‌పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు!
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. ట్విటర్ తరహా వికేంద్రీకృత సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. సాధ్యాసాధ్యాలపై మెటా కసరత్తు చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన వార్తను ట్విటర్లో షేర్ చేయగా ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే.. ట్విటర్ లాంటి సోషల్ నెట్‌వర్క్‌ను మెటా ప్రారంభించనున్నట్లు వచ్చిన వార్తలపై డిజీ కాయిన్ సహ వ్యవస్థాపకుడు బిల్లీ మార్కస్ ట్విటర్లో షిబెటోషి నకమోటో పేరుతో ఓ మీమ్ వీడియోను పోస్ట్ చేశారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్విటర్‌కు పోటీగా అలాంటి నెట్వర్క్ ప్రారంభిస్తే ఎలాన్ మస్క్‌తో విసుగు చెందిన యూజర్లు జకర్బర్గ్ను అమితంగా ఇష్టపడతారని రాశారు. దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ జుకర్‌బర్గ్‌ను ‘కాపీ క్యాట్’ అని సంభోదించారు. అయితే పిల్లి అని అక్షరాల్లో రాయకుండా పిల్లి ఎమోజీని ఉపయోగించారు. ఇదీ చదవండి: Microsoft: మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు.. టెక్కీ ఆవేదన ఫేస్బుక్ కసరత్తు చేస్తున్న ఈ కొత్త సోషల్ నెట్‌వర్క్‌కు ‘P92’ అనే కోడ్‌నేమ్‌ను పెట్టింది. దీనిపై అప్పుడప్పుడూ కొంతమంది తమ అభిప్రాయాలతో అప్డేట్లు ఇస్తున్నారు. కొత్త సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మెటా ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. అయితే ఇతర వివరాలేవీ ఆయన చెప్పలేదు. Copy 🐈 — Elon Musk (@elonmusk) March 11, 2023 -
మెటాలో భారీ లేఆఫ్స్...ఈ సారి ఎంతమంది అంటే?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ వారంలో వేలాది మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 13శాతంతో 11వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్ధిక అనిశ్చితితో మరోసారి సిబ్బందిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైంది మెటా. మేనేజర్లకు ప్యాకేజీలు ఇచ్చి వెళ్లగొట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. రెండో దఫా తొలగింపులపై బ్లూమ్‌బర్గ్ ఫిబ్రవరిలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆ కథనానికి కొనసాగింపుగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసేందుకు మెటా సిద్ధమైంది. జుకర్ బర్గ్ నిర్ధేశించిన ఆర్ధిక లక్ష్యాలను చేరుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటూ మెటా ఇంటర్నల్ మీటింగ్‌లో పాల్గొని..పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఉద్యోగి తెలిపారు. కంపెనీల నుంచి మెటాకు వచ్చే యాడ్స్ తగ్గిపోవడంతో సంస్థ వర్చువల్ రియాలిటీ మెటావర్స్‌పై దృష్టిసారించింది. పొదుపు మంత్రం జపిస్తూనే ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే ఏ ఉద్యోగిని ఉంచాలి? ఎవర్ని తొలగించాలో చెప్పాలంటూ డైరెక్టర్లను, వైస్ ప్రెసిడెంట్లను అడుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాక్!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ బాటలో మెటా (facebook) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పయనిస్తున్నారు. ఇన్ని రోజులు ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవల్ని ఉచితంగా అందించిన జుకర్ బర్గ్.. ఇప్పుడు యూజర్ల నుంచి ప్రతినెలా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఫ్రీగా వినియోగించుకునే మెటా, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఇకపై మరింత కాస్ట్లీగా మారనున్నాయి. ట్విటర్ తరహాలో మెటా సైతం.. మెటా, ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ హోల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ఐడీలతో ఫేస్బుక్ బ్లూటిక్ హోల్డర్ల అకౌంట్ల పరిశీలించి.. తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వెరిఫికేషన్ ఛార్జీలను విధించనున్నారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో బ్లూ టిక్ యూజర్ల నుంచి పెద్ద మొత్తంలో యూజర్ల ఛార్జీలు వసూలు చేయనున్నారు. బ్లూ వెరిఫికేషన్‌తో ఫేక్ అకౌంట్ల నుంచి యూజర్లు సురక్షితంగా ఉండొచ్చని ఈ సందర్భంగా జుకర్ బర్గ్ తెలిపారు. ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్లలో విశ్వసనీయత పెరగడంతోపాటు రీచ్,సెక్యూరిటీ పెరుగుతుందన్నారు.ఇక మెటా ప్రకటించినట్లుగా ఐఓఎస్ యూజర్లు నెలకు 14.99 డాలర్లు, వెబ్ యూజర్ల నుంచి నెలకు 11.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. -
ఉద్యోగాల కోతలు.. మార్క్ జూకర్బర్గ్ కు సెక్యూరిటీ పెంపు
-
మార్క్ జుకర్ బర్గ్ అలవెన్స్ భారీగా పెంచిన ఫేస్బుక్
-
340 కంపెనీల్లో లక్షమందికి పైగా ఉద్యోగుల తొలగింపు...తాజాగా మెటాలో
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా గత ఏడాది నవంబరులో 13శాతంతో 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా మరికొంత మందిని తొలగించే యోచనలో ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. గత కొన్ని వారాలుగా విభాగాలకు కేటాయించే బడ్జెట్‌తో పాటు, హెడ్ కౌంట్ విషయంలో అస్పష్టత నెలకొందంటూ మెటాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు చెప్పినట్లు తెలిపింది. ఇదే అంశంపై మెటా ఇప్పటి వరకు స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ టీం లీడర్లు, డైరెక్టర్లను తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఈ ఏడాదిని సమర్ధత కనబరిచే సంవత్సరంగా (year of efficiency) అభివర్ణించిన జుకర్ బర్గ్... పైన పేర్కొన్నట్లుగా ఉన్నత స్థాయి ఉద్యోగులు వర్క్ విషయంలో వ్యక్తి గతంగా శ్రద్ద వహించాలని లేదంటే సంస్థను వదిలి వెళ్లిపోవచ్చని అన్నారు. దీంతో పాటు పనితీరు తక్కువగా ఉన్న ప్రాజెక్టులను షట్‌డౌన్ చేయడంతో పాటు ఆ ప్రాజెక్ట్‌లలో లీమ్ లీడర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించేందుకు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది గడ్డు కాలమే గత ఏడాది సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందించిన విషయం తెలిసింది. ఆ కోతలు ఈ ఏడాదిలో సైతం కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 340 కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపినట్లు అంచనా. ఇటీవలే టిక్‌టాక్ ఇండియా భారత్‌లోని తమ ఉద్యోగులందరినీ తొలగించింది. యాహూ 1,600 మందిని, డెల్ 6,500 మందిని ఇంటికి సాగనంపాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కలిపి దాదాపు రూ.50,000 మందిని తొలగించాయి. -
మేనేజర్లు అయితే ఏంటీ.. పనిచేయకపోతే రాజీనామా చేయండి: జుకర్‌బర్గ్
మెటా కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రానున్న రోజుల్లో మరికొంత మంది ఉద్యోగులను తొలగించేలా ఉన్నారు. తాజాగా ఆయన కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు ఇచ్చిన వార్నింగ్ చూస్తే లేఆఫ్స్‌పై హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గతేడాది నవంబర్‌లో ట్విటర్ సగం మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని రోజులకే జుకర్‌బర్గ్ కూడా మెటా సంస్థలో 11 వేల ఉద్యోగాలను పీకేశారు. జుకర్‌బర్గ్ తాజా హెచ్చరికలతో ఉద్యోగుల్లో మళ్లీ లేఆఫ్ భయాలు నెలకొన్నాయి. గత వారం కంపెనీలో జరిగన అంతర్గత సమావేశంలో సీఈఓ జుకర్‌బర్గ్.. మేనేజర్లు, డైరెక్టర్ల స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పలు హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ కనబర్చాలన్నారు. కేవలం సిబ్బందితో పనిచేయించడమే కాదు.. పనిలో వ్యక్తిగత పాత్ర కూడా ఉండాలని, లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. లేఆఫ్స్ ప్రారంభ దశలో జుకర్‌బర్గ్ మరింత ఎఫీషియన్సీ దిశగా పనిచేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. రానున్న రోజుల్లో మెటా కంపెనీలో సీనియర్ మేనేజర్లు సైతం కింద స్థాయి ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి వాటిపై దృష్టి పెట్టకుండా కేవలం ఇన్‌చార్జ్‌లుగా ఉంటామంటే కుదరదు. ఉద్యోగుల పనితీరుపై కంపెనీలో నిరంతర సమీక్షలు కొనసాగుతున్నాయి. పనితీరు బాగా లేని ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. (ఇదీ చదవండి: Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్.. భారీగా జీతం వదులుకున్న సీఈఓ!) -
ఉద్యోగాల ఊచకోత తరువాత ‘మెటా’ మరో షాకింగ్ డెసిషన్
న్యూఢిల్లీ: వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ఫుల్ టైం ఉద్యోగ ఆఫర్లను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వేల ఉద్యోగులను తొలగించిన సంస్థ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసు కోవడం ఇదే తొలిసారని పలువురు వ్యాఖ్యానించారు. నియామక అవసరాలను తిరిగి అంచనా వేయడం కొనసాగిస్తున్నాం. చాలా స్వల్ప సంఖ్యలో అభ్యర్థుల ఆఫర్లను ఉపసంహరించుకుంటూ కష్టమైన నిర్ణయం తీసుకున్నామన్న మెటా ప్రతినిధి వ్యాఖ్యలను టెక్ క్రంచ్ నివేదించింది. మెటా ఇటీవల 20 మంది ఆఫర్లను రద్దు చేసిందని ఇంజనీర్ ,రచయిత గెర్గెలీ ఒరోస్జ్ ట్వీట్ చేశారు. ప్రపంచ మాంద్యం భయాలు నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2022 నవంబరులో ప్రపంచవ్యాప్తంగా 11,000 మంది ఉద్యోగులను ఫేస్బుక్ తొలగించడం టెక్ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతంలో తన లండన్ కార్యాలయంలో 2023 వేసవి ఇంటర్న్‌షిప్ ఆఫర్లను రద్దు చేసింది Just in: Meta has rescinded fulltime offers in London, as I confirmed with devs impacted. New grads with offers due to start in February have been taken back in bulk. I know of about 20 people so far. This is the first time I'm aware that Meta is taking back signed, FTE offers. — Gergely Orosz (@GergelyOrosz) January 9, 2023 -
ఇన్ఫ్లుయెన్సర్లకు భారీ షాక్, మెటా మరో సంచలన నిర్ణయం!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ల కోసం 2020లో ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు అదే యాప్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆపేస్తున్నట్టు మెటా వెల్లడించింది. దాంతో ఫిబ్రవరి 15 నుంచి సూపర్ యాప్ నిలిచిపోనుంది. దాంతో యూజర్లు కొత్త పోస్టులను క్రియేట్ చేయలేరు. లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ను షట్‌డౌన్ చేయనున్న మెటా ఇప్పటికే పలు రకాల ప్రొడక్ట్‌లు, ప్రాజెక్ట్‌లను నిలిపివేసింది. ఈ వారం మొదట్లో 10 ఏళ్ల నాటి కనెక్టవిటీ డివిజన్‌ను షట్‌డౌన్ చేయనుంది. డెన్మార్క్‌లోని ఒడెన్సే సిటీలో రెండు కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని ఆపేసింది. 344 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. 2023లో బుల్లెటిన్ అనే న్యూస్ లెటర్ ప్రొడక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు అక్టోబర్ నెలలో ప్రకటించింది. ఆగష్టులో క్వెస్ట్ 1 వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తయారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్ల బదులు ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయలనుకున్నట్టు మెటా తెలిపింది.