టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మెటా ఏఐ కొత్త ఫీచర్ ఆవిషక్రయించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నచ్చిన స్టైల్‌లో ఫోటోలు క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలో కూడా మెటా సీఈఓ వీడియోలో చూపిస్తారు. యూజర్ తన ముఖాన్ని స్కాన్ చేయి తనకు నచ్చిన విధంగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.
జుకర్‌బర్గ్ వీడియోలో మొదట తన ముఖాన్ని స్కాన్ చేసుకున్నారు. ఆ తరువాత సెర్చ్ బార్‌లో నచ్చిన విధంగా ఎలాంటి ఇమేజ్ కావాలో సెర్చ్ చేయాలి. అప్పుడు మెటా మీరు అడిగినట్లుగా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. జుకర్‌బర్గ్ తనను గ్లాడియేటర్‌గా చూపించమని సెర్చ్ చేశారు. అప్పుడు మెటా అలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ తరువాత బాయ్ బ్యాండ్, గోల్డ్ వేసుకున్నట్లు ఇలా ఫోటోలను క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ వీడియోలో చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment