ట్విటర్‌కు పోటీగా విడుదలైన మెటా థ్రెడ్స్ కొన్ని గంటల్లోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఒక మిలియన్ కంటే ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు మెటా సీఈఓ మార్గ్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. కొంతమంది ఈ కొత్త యాప్‌ని ట్విటర్ కిల్లర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే జుకర్‌బర్గ్ ట్విటర్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
జుకర్‌బర్గ్ ట్వీట్..
నిజానికి మెటా సీఈఓ జుకర్‌బర్గ్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేయడం చాలా రోజుల తరువాత ఇదే మొదటి సారి. సుమారు 11 సంవత్సరాల తరువాత మొదటి పోస్ట్ చేసాడు. కొత్త యాప్ లాంచింగ్ సందర్భంగా ఈ ట్వీట్ చేసాడు. ఈ పోస్టులో కనిపించే రెండు స్పైడర్‌మ్యాన్ చిత్రాలు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇది ట్విటర్ అధినేత మస్క్‌ను ఉదీసించి పోస్ట్ అని తెలుస్తోంది.
— Mark Zuckerberg (@finkd) July 6, 2023
జుకర్‌బర్గ్ 2012 జనవరి 18 తరువాత ట్విటర్ ద్వారా ట్వీట్ చేయడం ఇదే మొదటి సారి. ఈ పోస్టుకి ఇప్పటికి లెక్కకు మించిన లైకులు, కామెంట్స్ అండ్ షేర్స్ వస్తున్నాయి. థ్రెడ్స్ యూజర్ల సంఖ్య ట్విటర్‌ను మించిపోతుందా అనే ప్రశ్నకు జుకర్‌బర్గ్ ఇంకా కొంత సమయం పట్టవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
(ఇదీ చదవండి: ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!)
ఎలాన్ మస్క్ ట్వీట్..
థ్రెడ్స్ యాప్ దాదాపు ట్విటర్ మాదిరిగానే ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేసాడు. ఇందులో భాగంగా ఒక కీ బోర్డు ఇమేజ్ యాడ్ చేసి Ctrl+C+V (ట్విటర్ కాపీ పేస్ట్) అని రాసాడు. దీనికి స్పందిస్తూ ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఒక ఎమోజి పోస్ట్ చేసాడు. మొత్తానికి అనుకున్న విధంగా మెటా ఒక కొత్త యాప్ తీసుకువచ్చింది. అయితే ఇది ట్విటర్ యాప్‌ని దెబ్బతీస్తుందా.. లేదా అనేది మరి కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది.
(ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!)
😂
— Elon Musk (@elonmusk) July 6, 2023
Comments
Please login to add a commentAdd a comment