Threads App
-
Mark Zuckerberg: భారత్‌లో మెటా థ్రెడ్స్ జోరు
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (ఇప్పుడు ఎక్స్)కు పోటీగా ఏడాది క్రితం ప్రవేశపెట్టిన థ్రెడ్స్ యాప్‌కి గణనీయంగా ఆదరణ లభిస్తోందని సోషల్ మీడియా దిగ్గజం మెటా తెలిపింది. అంతర్జాతీయంగా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉందని పేర్కొంది. క్రియాశీలక వినియోగదారులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ఎక్కువగా సినిమాలు, టీవీ, ఓటీటీ, సెలబ్రిటీలు, స్పోర్ట్స్‌కి సంబంధించిన కంటెంట్ ఉంటోందని మెటా వివరించింది. క్రికెట్లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఆకాశ్ చోప్రా మొదలైన వారు క్రియాశీలకంగా ఉంటున్నారని పేర్కొంది. టీ20 క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 మొదలైనవి హాట్ టాపిక్‌లుగా నిల్చాయని, 200 మంది పైచిలుకు క్రియేటర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌పై అప్డేట్స్ ఇచ్చారని వివరించింది. 2023 జూలైలో ప్రవేశపెట్టిన వారం రోజులకే 10 కోట్లకు పైగా యూజర్ సైనప్లతో థ్రెడ్స్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచి్చంది. అయితే, క్రమంగా దానిపై యూజర్ల ఆసక్తి తగ్గుతూ వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్.. విడుదలకు ముందే లీక్ - వివరాలు
ఈ ఏడాది ప్రారంభమైన థ్రెడ్స్ (Threads) అప్పుడే కొత్త ఫీచర్స్ పొందనున్నట్లు, త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓకే ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటా లేటెస్ట్ సోషల్ మీడియా యాప్ 'థ్రెడ్'లో ఓ కొత్త ఫీచర్ రానున్నట్లు ఒక ఉద్యోగి పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్‌లో కనిపించింది. మెటా ప్రత్యర్థి ఎక్స్ (ట్విటర్)కి సరైన పోటీ ఇవ్వడానికి సంస్థ సిద్దమవుతున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. థ్రెడ్స్ ట్రెండింగ్ టాపిక్ ఫీచర్ కొత్త ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను యాప్ డెవలపర్ విలియం మాక్స్ మొదటిసారిగా ఒక పేరు తెలియని మెటా ఉద్యోగి తీసిన స్క్రీన్‌షాట్ ద్వారా గుర్తించారు. దీనిని అతడు అనుకోకుండా థ్రెడ్లలో పోస్ట్ చేశాడు. ఈ లేటెస్ట్ ఫీచర్ సర్చ్ బార్ కింద నెంబర్ వైస్ టాపిక్‌లను ర్యాంక్ చేస్తుంది, అంతే కాకుండా ప్రతి అంశంపై పోస్ట్‌ల సంఖ్యను కూడా చూపుతుంది. ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్! థ్రెడ్ గత నెలలో ఒక అప్డేటెడ్ కీవర్డ్ సర్చ్ ఫీచర్‌ను మాత్రమే ఆవిష్కరించింది. ఆ సమయంలో మెటా బాస్ 'మార్క్ జుకర్‌బర్గ్' ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపాడు. ప్రారంభంలో ఇది ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుందని.. ఆ తరువాత మరిన్ని భాషల్లోనే అందుబాటులోకి వస్తుందని తెలిపాడు. -
ఎక్కడైనా సరే 'తగ్గేదేలే'.. ఐకాన్ స్టార్ అరుదైన రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో బన్నీ. ఐకాన్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. బన్నీ విషయానికోస్తే ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇప్పటికే ఇన్‌స్టాలో ఆయనకు 21.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవల ట్విటర్‌కు పోటీగా కొత్తగా థ్రెడ్స్ యాప్‌ను జుకర్ బర్గ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) ఈ యాప్‌లోను ఐకాన్ రికార్డ్ సృష్టించాడు. ఇండియాలోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న తొలి నటుడిగా నిలిచారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. యాప్ ఏదైనా ఐకాన్ స్టార్ తర్వాతే ఎవరైనా అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!) Icon star @alluarjun is ruling threads as he becomes the first Indian actor to hit 1 Million followers on the app. Not only is he setting the silver screen on fire with his incredible performances, but he's also ruling the digital world and has managed to create a deep connection… pic.twitter.com/sejrIV8Nv5 — Sarath Chandra Naidu (@imsarathchandra) July 24, 2023 -
Twitter vs Threads: అసలేంటీ మెటా థ్రెడ్స్? ట్విటర్ కంటే ఎందుకంత స్పెషల్?
మెటా వారి ‘థ్రెడ్స్’ ట్విట్టర్–కిల్లర్ అవుతుందా లేదా అనేది తెలియదుగానీ ఈ యాప్‌పై యువత అమిత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ట్విట్టర్ కంటే ‘థ్రెడ్స్’ ఏ రకంగా భిన్నమైనది అనే విశ్లేషణ ఒక కోణం అయితే, కొత్తవాటిపై సహజమైన ఆసక్తి మరో కోణం... మెటా వారి టెక్ట్స్ ఆధారిత సంభాషణ యాప్ ‘థ్రెడ్స్’ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. యాప్ మొదలైన రెండు గంటలోనే ఇరవై లక్షల మంది యూజర్లు సైనప్ అయ్యారు. నాలుగు గంటలలో ఆ సంఖ్య యాభై లక్షలకు చేరడం చూస్తుంటే థ్రెడ్స్ ‘ట్విట్టర్’కు గట్టిపోటీ ఇవ్వనుందనే విషయం అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ‘థ్రెడ్స్’ డేటా ప్రైవసీ నిబంధనల కారణంగా యూరప్‌లో అందుబాటులోకి రాలేదు. థ్రెడ్స్‌కు సంబంధించి ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోని రెడీ–మేడ్ యూజర్ బేస్ వల్ల ‘థ్రెడ్స్’ ట్విట్టర్‌ని మించిపోతుంది అనే అంచనా ఉంది. ‘థ్రెడ్స్‌పై యూత్ ఆసక్తి ప్రదర్శించడానికి కారణం ఏమిటి?’ ఈ ప్రశ్నకు దేశంలోని వివిధ నగరాలకు చెందిన యువగళాల మాటల్లోనే జవాబు దొరుకుతుంది. ► ట్విట్టర్ ఎలాన్ మస్క్ అధీనంలోకి వచ్చిన తరువాత ప్రయోజనకరమైన మార్పుల కంటే అవసరం లేని మార్పులే ఎక్కువ జరిగాయి. యూజర్ల ట్వీట్ల మీద ఆంక్షలు, బ్లూటిక్స్ పై కొత్త రూల్స్... మొదలైనవి చిరాకు తెప్పించాయి’ అంటుంది ముంబైకి చెందిన ఎంబీఏ స్టూడెంట్ మనీష. ► థ్రెడ్స్ అనేది ట్విట్టర్‌కు కాపీ–పేస్ట్’ అనే విమర్శ మాట ఎలా ఉన్నా ‘ట్విట్టర్‌తో పోల్చితే భిన్నంగా ఉంది’ అని చెప్పుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ‘జుకర్ బర్గ్ కాపీ–పేస్ట్ విధానాన్ని నమ్ముకొని బాహుబలి లాంటి ట్విట్టర్‌ను ఢీ కొనడానికి రంగంలోకి దిగుతాడని నేను అనుకోవడం లేదు. ట్విట్టర్‌తో పోల్చితే థ్రెడ్స్ కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. థ్రెడ్స్‌లో పోస్ట్ చేసే వీడియోల నిడివి అయిదు నిమిషాలు. ట్విట్టర్లో అయితే రెండు నిమిషాల ఇరవై సెకండ్లు. థ్రెడ్స్‌లో పోస్ట్ పరిమితి అయిదు వందలు. ట్విట్టర్లో రెండు వందల ఎనభై. భవిష్యత్తులో మరిన్ని మార్పులు జరగవచ్చు’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ చైత్ర. ► ‘థ్రెడ్స్’లోని వినూత్నమైన ఫీచర్ ‘ఫెడివర్స్’ యూత్‌కు నచ్చింది. ఆల్టర్నేటివ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘మాస్టడన్’లాంటి వాటితో ‘థ్రెడ్స్’ యూజర్లు ఇంటరాక్ట్ కావచ్చు. ఎప్పటికప్పుడు ప్లాట్‌ఫామ్ మైగ్రేషన్‌లో యూత్ చురుగ్గా ఉంటుంది. ► యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో బౌండర్’కు చెందిన ప్రొఫెసర్ కేసీ ఫైస్లర్ ఆన్లైన్ కమ్యూనిటీని లోతుగా అధ్యయనం చేసిన ‘ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్’గా పేరు తెచ్చుకుంది. ప్లాట్‌ఫామ్ మైగ్రేషన్స్’ గురించి రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసింది. ► ప్లాట్‌ఫామ్‌ను ఎందుకు మార్చారు? మార్చడం ద్వారా ఎదురైన సవాళ్లు, అనుభవాలు’ అనే అంశంపై యువతరంలో ఎంతోమందితో మాట్లాడింది. ► ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందులోని ఆన్లైన్ కమ్యూనిటీ తట్టాబుట్టా సర్దుకొని కొత్త ప్లాట్ఫామ్లోకి వెళుతుంది. మైగ్రేషన్‌కు సంబంధించి తొలి దశలో కొత్త ప్లాట్‌ఫామ్ గురించి ప్రోత్సాహకరంగా మాట్లాడుకుంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అందరి కంటే ముందు తామే ఉండాలనుకునేవారితోపాటు, స్నేహితులు కదిలేవరకు కదలని వారు కూడా ఉంటారు’ అంటుంది ఫైస్లర్. ► ట్విట్టర్‌తో పోల్చితే హ్యాష్‌ట్యాగ్స్, వెబ్ వెర్షన్, ఎడిట్ పోస్ట్‌లు, డీఎం ఆప్షన్, ఎఐ జనరేటెడ్ ఆల్ట్ టెక్ట్స్, ట్రెండింగ్ టాపిక్స్, క్రోనలాజికల్ ఫీడ్... మొదలైన ఫీచర్స్ ‘థ్రెడ్స్’లో లేవు అనే మాట వినిపిస్తోంది. ►ఎన్నో అంచనాలతో ‘థ్రెడ్స్’లోకి వచ్చిన నవతరాన్ని మెటా నిరుత్సాహ పరుస్తుందా? ఒక మీమ్‌లో చూపినట్లు వేగంగా వచ్చిన వాళ్లు అంతే వేగంగా వెళ్లిపోతారా? ‘థ్రెడ్స్ ద్వారా జుకర్‌బర్గ్ కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాడు’ అనే ఆశావాదంతో ఎంతకాలమైనా ఎదురుచూసే వాళ్లు ఉంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. ట్విట్టర్ vs థ్రెడ్స్ ఈ మీమ్స్ చూస్తే పొట్టచక్కలు ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ నేపథ్యంలో యువ నెటిజనులు మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు. ‘ఎట్ ది రేట్ ఆఫ్’ సింబల్‌ని పోలిన ‘థ్రెడ్స్’ లోగో అచ్చం జిలేబిలా ఉందని కొందరు రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఒక మీమ్‌లో... ట్విట్టర్ ఆఫీస్ కిటికీ నుంచి మార్క్ జుకర్‌బర్గ్ దొంగచాటుగా తొంగి చూస్తుంటాడు. ‘థ్రెడ్స్‌లోకి వెళ్లిన వారు కేవలం 5 నిమిషాల తరువాత బ్యాక్ టు ట్విట్టర్ అంటూ ఎలా పరుగెత్తుకు వస్తున్నారో చూడండి’ అంటూ ట్విట్టర్ వీరాభిమానులు వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. నసీబ్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, సూర్యవంశ్... మొదలైన బాలీవుడ్ సినిమాల క్లిప్‌లకు ట్విటర్–థ్రెడ్స్‌కు సంబంధించి ఫన్నీ కామెంట్స్ జత చేస్తున్నారు. Elon Musk: I am tweeting Mark Zuckerberg: pic.twitter.com/oVciHtsgWU — Sagar (@sagarcasm) July 6, 2023 People right now balancing on twitter and threads😂 pic.twitter.com/njRzO4tayh — Rishabh Kaushik (@RishabhKaushikk) July 6, 2023 They said this was Mark Zuckerberg at Twitter offices coming up with Threads 🤣 pic.twitter.com/AudgcfE7QS — O.T.G (@365OTG) July 7, 2023 Is it just a coincidence ? Jalebi lovers should sue Mark Zuckerberg .. pic.twitter.com/xMHSQKZGfh — Lost in Paradise 🇮🇳 (@Lost_human19) July 7, 2023 -
మెటా థ్రెడ్స్ తో వండర్స్ క్రియేట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కిన వ్యక్తి
-
థ్రెడ్స్ సరికొత్త సంచలనం!
థ్రెడ్స్ యాప్ సరికొత్త సంచలనం సృష్టించింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా లాంచ్ చేసిన వారం రోజుల్లోపే ఈ యాప్ 100 మిలియన్ల యూజర్లు దాటినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం మధ్యాహ్నాం 12.30 గంటలకు 100 మిలియన్ యూజర్లను దాటింది. ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్ యాప్‌కు లింక్ చేస్తూ థ్రెడ్స్ అనే యాప్‌ను యూజర్లకు అందించారు. యురోపియన్ యూనియన్ మినహాయించి 100కి పైగా దేశాల యూజర్లు ఈ యాప్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించారు. Post by @quiverquantitative View on Threads రాకెట్ వేగంతో అలా ఈ యాప్ లాంచ్ అయ్యిందో లేదో తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఖాతాలు తెరవగా.. 4గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. రోజులు గడిచే కొద్దీ యూజర్ల సంఖ్య రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. యూజర్లు అంతకంతకూ పెరగడానికి ముఖ్య కారణం ఇన్‌స్టాగ్రామ్‌కు థ్రెడ్స్‌ను జత చేయడమే. ఇన్‌స్టా నెలవారీ 2.35 బిలియన్లకు పైగా యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. వారే థ్రెడ్స్ యాప్‌నూ ఉపయోగించేందుకు మక్కువ చూపుతున్నారు. Post by @real_eastdakota View on Threads విడివిడిగానే థ్రెడ్స్ యాప్‌ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు ఇంటిగ్రేషన్ చేసి ఉంది. ఇక్కడే యూజర్లకు సమస్యలు తలెత్తుతున్నాయి. థ్రెడ్స్‌ను లాగిన్ అవ్వాలంటే..ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాల్సి వస్తుంది. దానికి పరిష్కారం చూపేందుకు ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో, వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో వారి ప్రొఫైల్, పోస్ట్‌లను హైడ్ చేసి థ్రెడ్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టా నుంచి థ్రెడ్స్ యాప్‌ను విడగొడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది? యూజర్లు ఏమైనా తగ్గుతారా? అనే అంశంపై నిపుణులతో మోస్సేరి చర్చిస్తున్నారు. చివరిగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నంగా కాకుండా ఉంటే ఇన్‌స్టాను, థ్రెడ్స్‌ను విడివిడిగా వినియోగించుకునే అవకాశం కలగనుంది. ప్రస్తుతం, థ్రెడ్స్‌కు పెరిగిపోతున్న యూజర్లు ఎలాన్ మస్క్‌ను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. మెటాపై దావా థ్రెడ్స్ మాతృ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టేలా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెటా కాపీరైట్ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందని, ట్విటర్ ఫీచర్లు, ఇతర సంబంధిత రహస్యాలను సేకరిస్తుందని ఆరోపిస్తూ మెటాపై దావా వేస్తున్నట్లు తెలిపారు. ట్విటర్ ర్యాకింగ్ పడిపోయింది. థ్రెడ్లు వారంలోపే 100 మిలియన్ల యూజర్ మార్క్‌ను దాటగా.. యాక్టీవ్ యూజర్లు ఎంతమంది ఉంటారో చూడాల్సి ఉంది. ఈ సందర్భంగా క్లౌడ్‌ఫ్లేర్ సీఈవో మాథ్యూ ప్రిన్స్ థ్రెడ్స్‌లో ట్విటర్ డీఎన్ఎస్ ర్యాంకింగ్ సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో పడిపోయిందని చెప్పారంటూ వెర్జ్ నివేదించింది. -
మూడు పోస్టులు.. మిలియన్ ఫాలోవర్స్ - ఒక్క రోజులోనే గిన్నిస్ రికార్డ్!
Meta Threads: ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన మెటా థ్రెడ్స్ గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. విడుదలైన ఒక రోజుకే సంచలనం సృష్టించి ట్విటర్‌కు షాక్ ఇచ్చిన ఈ యాప్ ఏకంగా 1 మిలియన్ మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకున్న ఒక వ్యక్తి కొన్ని గంటల వ్యవధిలోనే 10 లక్షల ఫాలోవర్స్ సాధించిన సరి కొత్త రికార్డ్ నెలకొల్పాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ 'జిమ్మీ డోనాల్డ్సన్' (Jimmy Donaldson) మెటా థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) పాతిక సంవత్సరాల డోనాల్డ్సన్ 'మిస్టర్ బీస్ట్' అనే పేరుతో యూట్యూబ్ ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాడు. తాజాగా విడుదలైన థ్రెడ్స్ యాప్‌లో కూడా తన హవా చూపించాడు. ఇతడు మెటా థ్రెడ్స్‌లో కేవలం మూడు పోస్టులు మాత్రమే చేసినట్లు సమాచారం. ఈ మూడు పోస్టులకు 1 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారంటే ఇతడెంత ఫెమస్ అనేది ఇట్టే అర్థమైపోతుంది. ఫాలోవర్స్ పెరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో తీసి ట్విటర్ ద్వారా పోస్ట్ చేసాడు. The moment @mrbeast reached one million followers on Threads... (yes, this is how we monitored the record) (and yes, it drained the battery from our phone a lot) pic.twitter.com/PwzrUNPa2t — Guinness World Records (@GWR) July 6, 2023 -
మెటా థ్రెడ్స్‌లోకి టాలీవుడ్ హీరోలు.. ఫస్ట్ ఎంట్రీ ఎవరిదంటే?
Meta Threads: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' ప్రత్యర్థిగా మెటా ఇప్పుడు కొత్త 'థ్రెడ్స్' (Threads) అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇది విడుదలైన అతి తక్కువ సమయంలో మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సాధారణ పౌరులు మాత్రమే కాకుండా ఈ యాప్‌ని సెలబ్రిటీలు సైతం డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మొదటి సెలబ్రిటీ అని భావిస్తున్నారు. ఆ తరువాత రామ్ చరణ్ కూడా ఈ కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యాన్స్‌ని ఫిదా చేశారు. దీంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుని వారిని ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నారు. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!) నివేదికల ప్రకారం మెటా థ్రెడ్స్ యాప్ కొన్ని గంటల్లోనే ట్విటర్‌ను షేక్ చేసినట్లు తెలిసింది. దీనిని కేవలం 2 గంటల్లో 20 లక్షలు, 4 గంటల్లో 50 లక్షల మంది డౌన్లోడ్ చేకున్నట్లు సంస్థ సీఈఓ జూకర్ బర్గ్ అధికారికంగా తెలిపాడు. ఈ సందర్భంగా అతడు సుమారు 11 సంవత్సరాల తరువాత ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసాడు. ఇది ఎలాన్ మస్క్‌ని ఉద్దేశించి చేసినట్లు చాలామంది అభిప్రాయపడ్డారు. -
ట్విట్టర్‌కు కొత్త సవాల్
లండన్: మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్‌కు కొత్త సవాల్ ఎదురైంది. దాదాపు ట్విట్టర్ లాంటి ఫీచర్లతోనే ప్రత్యర్థి మెటా సంస్థ థ్రెడ్స్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం రాత్రి యాపిల్, గూగుల్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్‌లో థ్రెడ్స్ ఉంచారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ సహా 100 దేశాల వారికి ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రారంభించిన మొదటి ఏడు గంటల్లోనే సుమారు కోటి మంది థ్రెడ్స్‌లో చేరారని మెటా సీఈవో జుకర్‌బర్గ్ ప్రకటించడం గమనార్హం. థ్రెడ్స్‌లో లైక్, రిప్లై వంటి వాటికి ప్రత్యేకంగా బటన్లున్నాయి. ఏ పోస్ట్‌కు ఎన్ని లైక్‌లు, రిప్లైలు వచ్చాయో యూజర్లు తెలుసుకోవచ్చు. ఒక పోస్ట్ 500 క్యారెక్టర్స్‌కు మించి ఉండరాదు. ఇదే ట్విట్టర్లో అయితే 280 క్యారెక్టర్లే. ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ అకౌంట్లు, అదే పేర్లతో కొత్త యాప్‌లోనూ కొనసాగవచ్చునని మెటా తెలిపింది. లేకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొంది. కాంట్రాక్ట్స్, బ్రౌజింగ్ అండ్ సెర్చ్ హిస్టరీ వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని థ్రెడ్స్ సేకరిస్తుందని యాప్‌స్టోర్‌లోని సమాచారం చెబుతోంది. థ్రెడ్స్ రాకపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ స్పందించారు. దాదాపు అన్ని ఫీచర్లు ట్విట్టర్‌ను కాపీ కొట్టినట్లుగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
మార్గ్ జుకర్‌బర్గ్ ట్వీట్! ఎలాన్ మస్క్ రిప్లై ఇలా..
ట్విటర్‌కు పోటీగా విడుదలైన మెటా థ్రెడ్స్ కొన్ని గంటల్లోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఒక మిలియన్ కంటే ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు మెటా సీఈఓ మార్గ్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. కొంతమంది ఈ కొత్త యాప్‌ని ట్విటర్ కిల్లర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే జుకర్‌బర్గ్ ట్విటర్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జుకర్‌బర్గ్ ట్వీట్.. నిజానికి మెటా సీఈఓ జుకర్‌బర్గ్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేయడం చాలా రోజుల తరువాత ఇదే మొదటి సారి. సుమారు 11 సంవత్సరాల తరువాత మొదటి పోస్ట్ చేసాడు. కొత్త యాప్ లాంచింగ్ సందర్భంగా ఈ ట్వీట్ చేసాడు. ఈ పోస్టులో కనిపించే రెండు స్పైడర్‌మ్యాన్ చిత్రాలు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇది ట్విటర్ అధినేత మస్క్‌ను ఉదీసించి పోస్ట్ అని తెలుస్తోంది. pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 జుకర్‌బర్గ్ 2012 జనవరి 18 తరువాత ట్విటర్ ద్వారా ట్వీట్ చేయడం ఇదే మొదటి సారి. ఈ పోస్టుకి ఇప్పటికి లెక్కకు మించిన లైకులు, కామెంట్స్ అండ్ షేర్స్ వస్తున్నాయి. థ్రెడ్స్ యూజర్ల సంఖ్య ట్విటర్‌ను మించిపోతుందా అనే ప్రశ్నకు జుకర్‌బర్గ్ ఇంకా కొంత సమయం పట్టవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. (ఇదీ చదవండి: ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!) ఎలాన్ మస్క్ ట్వీట్.. థ్రెడ్స్ యాప్ దాదాపు ట్విటర్ మాదిరిగానే ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేసాడు. ఇందులో భాగంగా ఒక కీ బోర్డు ఇమేజ్ యాడ్ చేసి Ctrl+C+V (ట్విటర్ కాపీ పేస్ట్) అని రాసాడు. దీనికి స్పందిస్తూ ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఒక ఎమోజి పోస్ట్ చేసాడు. మొత్తానికి అనుకున్న విధంగా మెటా ఒక కొత్త యాప్ తీసుకువచ్చింది. అయితే ఇది ట్విటర్ యాప్‌ని దెబ్బతీస్తుందా.. లేదా అనేది మరి కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా థ్రెడ్స్' (Meta Threads) యాప్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి? ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. మెటా థ్రెడ్స్ లాగిన్ విధానం.. ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన కొత్త 'మెటా థ్రెడ్స్' వినియోగించాలనుకునే వ్యక్తి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా థ్రెడ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తరువాత ఇన్‌స్టాగ్రామ్‌తో లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఆధారాలను నమోదు చేయండి ప్రొఫైల్ ఫోటో, పేరు, బయో, లింక్‌లు వంటి ఇన్పుట్ వివరాలు ఫిల్ చేయండి.. లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా తీసుకోవచ్చు. పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రొఫైల్‌ను ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు ప్రైవేట్ ప్రొఫైల్ ఎంచుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు మాత్రమే మీ పోస్టులు, ఇతర వివరాలు కనిపిస్తాయి. చివరగా జాయిన్ థ్రెడ్‌లపై క్లిక్ చేయండి. ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. మెటా థ్రెడ్స్ ఉపయోగాలు.. మెటా థ్రెడ్స్ యాప్ ద్వారా కంటెంట్‌ని సృష్టించవచ్చు, లింక్స్ పెట్టవచ్చు, ఫొటోలు, అయిదు నిమిషాల నిడివితో వీడియోలు పోస్ట్ చేయవచ్చు. చాలా ఫీచర్స్ దాదాపు ట్విటర్ ఫీచర్స్ మాదిరిగానే ఉంటాయి. ఇందులో ట్విటర్లో లేని కొన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ వినియోగించాలనుకునే వారు అప్పటికి ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అందరూ ఇందులో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!) మెటా థ్రెడ్స్ యాప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాల్లో ఈ రోజు (గురువారం) నుంచి అందుబాటులో వచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుడు 500 అక్షరాలా వరకు పోస్ట్ చేయవచ్చు. కొత్తగా వచ్చిన ఈ థ్రెడ్స్ యాప్ "ట్విటర్ కిల్లర్" అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. -
ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా కొత్త యాప్! గంటల వ్యవధిలో..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్‌కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లక్షలు దాటుతున్న యూజర్లు.. నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు. పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్‌ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్‌లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 ఎలాన్ మస్క్ స్పందన.. మెటా థ్రెడ్స్ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్‌బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి జుకర్‌బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
ట్విట్టర్‌కు పోటీగా మెటా ‘థ్రెడ్స్’
లండన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్‌్కకు చెందిన సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌కు మరో సవాల్ ఎదురవనుంది. ట్విట్టర్‌ను ఢీకొట్టేందుకు మెటా తాజాగా థ్రెడ్స్ అనే యాప్‌ను సిద్ధం చేసింది. యాపిల్‌కు చెందిన యాప్ స్టోర్లోఇది కనిపిస్తోంది. ట్విట్టర్లో మాదిరిగానే దీనిలోనూ టెక్ట్స్ రూపంలో మెసేజీలను లైక్ చేయవచ్చు. షేర్, కామెంట్ కూడా చేయవచ్చని యాప్ స్టోర్ లిస్టింగ్‌లోని స్క్రీన్‌షాట్‌ను బట్టి తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఇది ఇన్‌స్టాగ్రామ్‌కు లింకై ఉన్న ‘టెక్ట్స్ బేస్డ్ కన్వర్జేషన్ యాప్’. ‘నేటి నుంచి రేపటి ట్రెండింగ్‌లో ఉండే అన్ని అంశాల వరకు చర్చించుకునే సమూహాల కోసమే థ్రెడ్స్’ అని మెటా తెలిపింది. ఇన్‌స్ట్రాగామ్ యూజర్లు అదే అకౌంట్లతో కొత్త యాప్‌లోనూ కొనసాగవచ్చునని చెబుతున్నారు. దీనిపై మెటా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎలాన్ మస్క్ గత ఏడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక చేపట్టిన పలు మార్పులపై యూజర్లు అసంతృప్తితో ఉన్న సమయంలో మెటా ‘థ్రెడ్స్’ను తేనుండటం గమనార్హం. -
విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్’కు ఎదురు దెబ్బ!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ట్విటర్ తరహాలో థ్రెడ్స్ పేరుతో యాప్‌ను లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ విచిత్రంగా స్పందించారు. ఇటీవల,ట్విటర్లో రోజుకు వీక్షించే ట్వీట్లపై ఎలాన్ మస్క్ ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ట్విటర్ బాస్ మాత్రం తాను చేస్తున్న చర్యల్ని సమర్ధించుకున్నారు. యూజర్లు ట్విటర్‌కు బానిసయ్యే ప్రమాదం ఉంది. దాని నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. నేను ప్రపంచానికి మంచి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. అదే సమయంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న థ్రెడ్ యాప్‌ను యూజర్లకు అందిస్తున్నట్లు మెటా తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ సైతం ఆ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈనేపథ్యంలో ఎన్ ఎఫ్టీ టెక్నాలజీ సీఈవో మారియో నౌఫల్ థ్రెడ్ యాప్ గురించి ట్వీట్ చేశారు. థ్రెడ్ యాప్ విడుదలపై స్పష్టత వచ్చింది. జులై 6న అమెరికాలో విడుదల కానుంది. మెటాలోని ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్లుగా.. మెటా లక్ష్యం నీతి, నిజాయితీ, విలువలతో కూడిన సోషల్ మీడియా సైట్‌ను అభివృద్ది చేయడం. అయినప్పటికీ, యాప్ తన వివరణలో పేర్కొన్నట్లుగా ‘సనేలీ రన్’ అనే పదం యాప్ మీ మొత్తం డేటాను సేకరిస్తుంది అని సూచించేలా ఉంది. వ్యక్తిగతంగా, అది నిజమేనని నేను గట్టిగా నమ్ముతాను. 🚨BREAKING: META's Answer to Twitter (Threads) Release Date CONFIRMED 'Threads' will be released on Thursday in the U.S. The app has been described as a competitor to Twitter. According to an executive at Meta, its goal is to establish a "sanely run" social media site.… pic.twitter.com/PxQxAERnB1 — Mario Nawfal (@MarioNawfal) July 4, 2023 ట్విటర్ ఉన్నత ఆశయాలతో పనిచేస్తుంది. జుకర్ బర్గ్ అందుకు విరుద్ధం. వాక్ స్వాతంత్య్రానికి నిజమైన ఛాంపియన్ అతనే అంటూ వెటకారంగా ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూలం అంశం ఏంటంటే? థ్రెడ్ యాప్ విషయంలో జుకర్ బర్గ్‌తో పోటీ పడేందుకు ఎలాన్ మస్క్ ఇప్పటికే సిద్ధంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. Great tweet on this story, further demonstrating Meta's COMPLETE lack of care about privacy! https://t.co/jJ6WxsGlJy — Mario Nawfal (@MarioNawfal) July 4, 2023 అందుకు ఇయాన్ జెల్బో అనే మరో నెటిజన్.. ఆశ్చర్యం పోవడానికి అందులో ఏమీ లేదు. ఎందుకంటే ట్విటర్ ప్రత్యర్ధి మెటా మన డేటాను కలెక్ట్ చేస్తుందంటూ కొన్ని ఆధారాలు చూపిస్తూ వాటిని ట్వీట్ చేశాడు. Thank goodness they’re so sanely run — Elon Musk (@elonmusk) July 4, 2023 ఆ ట్వీట్లకు మస్క్ తనదైన శైలిలో స్పందించారు. కృతజ్ఞత, వాళ్లు చాలా తెలివిగా నడుచుంటున్నారని పేర్కొన్నారు. మరి థ్రెడ్స్ విడుదల, డేటా గోప్యతపై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందించాల్సి ఉంటుంది. చదవండి👉 ట్విటర్ పోటీగా మెటా ‘థ్రెడ్’.. ఫస్ట్ లుక్ ఇదే!