లండన్: మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్‌కు కొత్త సవాల్ ఎదురైంది. దాదాపు ట్విట్టర్ లాంటి ఫీచర్లతోనే ప్రత్యర్థి మెటా సంస్థ థ్రెడ్స్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం రాత్రి యాపిల్, గూగుల్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్‌లో థ్రెడ్స్ ఉంచారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ సహా 100 దేశాల వారికి ఇది అందుబాటులోకి వచ్చింది.
ప్రారంభించిన మొదటి ఏడు గంటల్లోనే సుమారు కోటి మంది థ్రెడ్స్‌లో చేరారని మెటా సీఈవో జుకర్‌బర్గ్ ప్రకటించడం గమనార్హం. థ్రెడ్స్‌లో లైక్, రిప్లై వంటి వాటికి ప్రత్యేకంగా బటన్లున్నాయి. ఏ పోస్ట్‌కు ఎన్ని లైక్‌లు, రిప్లైలు వచ్చాయో యూజర్లు తెలుసుకోవచ్చు. ఒక పోస్ట్ 500 క్యారెక్టర్స్‌కు మించి ఉండరాదు. ఇదే ట్విట్టర్‌లో అయితే 280 క్యారెక్టర్లే. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ అకౌంట్లు, అదే పేర్లతో కొత్త యాప్‌లోనూ కొనసాగవచ్చునని మెటా తెలిపింది.
లేకుంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొంది. కాంట్రాక్ట్స్, బ్రౌజింగ్ అండ్ సెర్చ్ హిస్టరీ వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని థ్రెడ్స్ సేకరిస్తుందని యాప్‌స్టోర్‌లోని సమాచారం చెబుతోంది. థ్రెడ్స్ రాకపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ స్పందించారు. దాదాపు అన్ని ఫీచర్లు ట్విట్టర్‌ను కాపీ కొట్టినట్లుగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment