అంతర్జాతీయంగా 17.5 కోట్ల యాక్టివ్ యూజర్లు
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (ఇప్పుడు ఎక్స్)కు పోటీగా ఏడాది క్రితం ప్రవేశపెట్టిన థ్రెడ్స్ యాప్‌కి గణనీయంగా ఆదరణ లభిస్తోందని సోషల్ మీడియా దిగ్గజం మెటా తెలిపింది. అంతర్జాతీయంగా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉందని పేర్కొంది. క్రియాశీలక వినియోగదారులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్‌లో ఎక్కువగా సినిమాలు, టీవీ, ఓటీటీ, సెలబ్రిటీలు, స్పోర్ట్స్‌కి సంబంధించిన కంటెంట్ ఉంటోందని మెటా వివరించింది. క్రికెట్‌లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఆకాశ్ చోప్రా మొదలైన వారు క్రియాశీలకంగా ఉంటున్నారని పేర్కొంది. టీ20 క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 మొదలైనవి హాట్ టాపిక్‌లుగా నిల్చాయని, 200 మంది పైచిలుకు క్రియేటర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌పై అప్‌డేట్స్ ఇచ్చారని వివరించింది. 2023 జూలైలో ప్రవేశపెట్టిన వారం రోజులకే 10 కోట్లకు పైగా యూజర్ సైనప్‌లతో థ్రెడ్స్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచి్చంది. అయితే, క్రమంగా దానిపై యూజర్ల ఆసక్తి తగ్గుతూ వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment