
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్‌బుక్ స్టేషనరీలో రూపొందించారట.
2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్‌లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్‌లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది.
ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్‌లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్‌మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్‌దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.

మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా
మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్‌బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్‌సూట్ కూడా ఇలాంటిదేనట.
Comments
Please login to add a commentAdd a comment