Suit
-
సరికొత్త స్పేస్ సూట్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అర్టిమిస్–3 ప్రయోగం కోసం సన్నద్ధమవుతోంది. చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రాడా కంపెనీ తన వంతు సాయం అందిస్తోంది. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం అత్యాధునిక స్పేస్ సూట్‌ను(అక్సియోమ్ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్–ఏఎక్స్ఈఎంయూ) అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఏరోసేŠస్స్ అండ్ ఫ్యాషన్, అక్సియోమ్ స్పేస్ సంస్థల సహకారం తీసుకుంది. ఇటలీలోని మిలన్ నగరంలో ఇంటర్నేషనల్ అస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో ఈ స్పేస్ సూట్‌ను ప్రదర్శించింది. మిగిలి ఉన్న కొన్ని పరీక్షల్లో సైతం ఈ స్పేస్‌సూట్ నెగ్గితే చంద్రుడిపైకి వెళ్లే నాసా వ్యోమగాములు ఇదే ధరించబోతున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రాడా కంపెనీ చెబుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ఈ స్పేస్‌సూట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రాడా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి లోరెంజో బెర్టిలీ చెప్పారు. దృఢత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో దీనికి తిరుగులేదని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో ప్రాడా స్పేస్‌సూట్ నెగ్గింది. 2025లో తుది పరీక్షలు జరుగబోతున్నాయి. వివిధ రకాల వ్రస్తాల ఉత్పత్తిలో ప్రాడాకు మంచి పేరుంది. -
‘హిజాబ్’ ఉదంతంలో న్యాయం.. బాధితులకు రూ. 146 కోట్ల పరిహారం!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2017లో ఇద్దరు ముస్లిం మహిళలకు అవమానం జరిగింది. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వారికి న్యాయం లభించింది. ఇందుకు పరిహారంగా బాధితులకు 17.5 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించడానికి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. వివరాల్లోకి వెళితే 2017లో స్థానిక చట్టాలను, నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో న్యూయార్క్ పోలీసులు ఇద్దరు ముస్లిం మహిళలను అరెస్టు చేశారు. ఆ తరువాత వారిని జైలుకు పంపే ముందు నిబంధనలలో భాగంగా వారికి ఫొటోలు తీశారు. వీటిని మగ్ షాట్ అంటారు. ఈ ఫొటోల కోసం పోలీసులు ఆ మహిళల హిజాబ్‌ను తొలగించారు. దీనిని బాధిత మహిళలు అవమానంగా భావించారు. ఈ ఉదంతంపై బాధితులు 2018లో కోర్టును ఆశ్రయించారు. కోర్టులో బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ బాధితుల మత విశ్వాసాలను పరిగణించకుండా పోలీసులు వారి హిజాబ్ తొలగించి తీవ్రంగా అవమానించారని, వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ కేసు నేపధ్యంలో మగ్ షాట్ నిబంధనలపై అమెరికా అంతటా చర్చ జరిగింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో 2020లో మగ్ షాట్ నిబంధనలలో పోలీసులు పలు మార్పులు చేశారు. ఈ ఫొటోల కోసం ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించనవసరంలేదని, ముఖం కనిపించేలా ఉంటేచాలని పేర్కొన్నారు. ఈ నిబంధన మిగతా మతాల వారికీ వర్తిస్తుందని, సిక్కులు కూడా తమ టర్బన్‌ను తొలగించాల్సిన అవసరం పోలీసులు వివరించారు. ఆదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం పోలీసులు బాధిత మహిళలతో పాటు గతంలో ఈ విధంగా ఇబ్బంది పడిన వారికీ కూడా పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. ఈ ఇద్దరు బాధిత మహిళలకు ఒక్కొక్కరికీ 7 వేల నుంచి పది వేల డాలర్ల చొప్పున మొత్తం 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. మన రూపాయల్లో ఇది సుమారు రూ. 146 కోట్లకు సమానం. -
IPL 2024- MI Punishment Jumpsuit: ఆలస్యం చేశారో అందరికీ ఇదే పనిష్మెంట్! (ఫోటోలు)
-
క్యాజువల్ వేర్ ఆర్ పార్టీ వేర్: లుక్ మాత్రం అదుర్స్ ! (ఫోటోలు)
-
అదిరిపోయే పవర్ సూట్లో అలియా భట్! దాని ఖరీదే ఏకంగా..!
బాలీవుడ్ నటి అలియా భట్ ప్యాషన్‌కి ఐకాన్‌లా తనదైన శైలిలో ఉంటుంది. ఏ వేడుకకు తగ్గ ట్రెండీ డ్రస్‌తో అందర్నీ మిస్మరైజ్ చేస్తుంటుంది. ఎప్పటి కప్పుడూ ఓ ట్రెండీ లుక్‌తో వస్తూ.. సరికొత్త డ్రస్సింగ్ స్టయిల్ని పరిచేయం చేస్తుంది అలియా. అందుకు నిదర్శనం ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఘటన, అయోధ్య వేడుకలే. జాతీయ అవార్డుల ఫంక్షన్ తగ్గట్టుగా హుందాగా స్టన్నింగ్ శారీతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాత ఇటీవల అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో చీరపై రామాయాణ ఇతిహాస చిత్రాలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పడూ కొంగొత్త స్టయిలిష్ డ్రస్‌లతో వార్తల్లో నిలుస్తుంటారు అలియా. మళ్లీ ఈ పవర్ ఫుల్ పవర్ సూట్‌తో సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేసి హాట్‌టాపిక్‌గా మారారు. ఈ మేరకు అలియా గురువారం తన రాబోయే సిరీస్ పోచర్ ట్రైలర్ లాంచర్ కోసం అలియా ఓంబ్రే పవర్ సూట్‌ని ధరించారు. ఈ లుక్‌లో ఆమె పవర్ ఫుల్ విమెన్లా ఉంది. అందరీ కళ్లు ఆమె డ్రస్ పైనే ఉన్నాయి. ఆ సూట్‌కి తగ్గ హైహిల్స్, చెవిపోగులు, లైట్ మేకప్‌తో కళ్లు తిప్పుకోలేనంత కలర్ఫుల్గా కనిపించింది అలియా. ఇంతకీ ఆ సూట్ ధర ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి. ఆ ఓంబ్రే ప్యాంట్ సూట్ ధర ఏకంగా రూ. 3.15 లక్షలు/- (చదవండి: మిస్ వరల్డ్ 2023 పోటీల్లో భారత్ తరఫున సినీ శెట్టి ప్రాతినిధ్యం!!) -
రియల్ ఐరన్ మ్యాన్ సూట్‌ని రూపొందించిన యూట్యూబర్!
నటులడు రాబర్ట్ డౌనీ జూనియర్ నటించిన హాలీవుడ్ సినిమా ఐరన్ మ్యాన్ విడుదలైనప్పటి నుంచి ఆ క్యారక్టర్‌కి విశేష ప్రజాధరణ లభించింది. ఆ క్యారక్టర్‌కి స్ఫూర్తిగా చాలామంది పలు రకాలుగా ఐరన్ సూట్లు రూపొందించారు. అయినప్పటికీ, రష్యన్ కంటెంట్ సృష్టికర్త ఇంజనీర్ అలెక్స్ బుర్కాన్ సృష్టి వేరుగా ఉంది, అతను మొదటి నుంచి ఐరన్ మ్యాన్ సూట్‌ను జాగ్రత్తగా జీవం పోసాడు. అతను రూపొందించిన సూట్ సౌందర్యానికి మించి, ఆధునాతన లక్షణాలతో నిండిన సాంకేతిక అద్భుతం. ఇతరులు రూపొందించినట్లుగా కాకుండా యూట్యూబర్సూ అలెక్స్ బుర్కాన్ సూట్లో సెల్ఫ్ పవర్డ్ హైడ్రోజన్ రియాక్టర్, రిపల్సర్ అప్‌గ్రేడ్, బుల్లెట్ ప్రూఫ్ ఆర్మర్ వంటి సాకేంతికత ఉంది.ఈ రష్యన్ ఇంజినీర్, యూట్యూబర్ అలెక్స్ బుర్కాన్ రూపొందించిన రియల్ ఐరన్ మ్యాన్ సూట్ ఆన్లైన్ కమ్యూనిటీని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘రియల్–లైఫ్ ఐరన్ మాన్ సూట్ విత్ ఏ రిపల్సర్ బ్లాస్ట్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘క్లిష్టమైన డిజైన్‌తో రూపొందించిన ఐరన్ మ్యాన్ సూట్‌కు సంబంధించి అలెక్స్ బుర్కాన్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను నెటిజనులు ప్రశంసిస్తున్నారు. తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి అలెక్స్ ఎదుర్కొన్న సాంకేతిక సవాళ్లు, టెస్టింగ్ దశలను తెలియజేసేలా ఉంటాయి ఈ వైరల్ వీడియోలు. ‘రియల్ లైఫ్ టోనీ స్టార్క్’ అంటూ అలెక్స్‌ను ఆకాశానికెత్తాడు ఒక నెటిజెన్. నిజానికి సైన్స్–ఫిక్షన్ టెక్కు సంబంధించి అలెక్స్‌కు ఇది ఫస్ట్ ఎక్స్పరిమెంట్ ఏమీ కాదు. గతంలో కూడా ఆశ్యర్యం కలిగించే ఎన్నో పరికరాలను తయారు చేసి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. View this post on Instagram A post shared by Factpro (@thefactpro) (చదవండి: చీరకట్టులో జిమ్ వర్క్ఔట్స్!) -
ఈ సూట్ వేసుకుంటే సూపర్ స్పీడ్‌గా పరిగెత్తొచ్చు
సూపర్ స్పీడ్ గా పరుగెత్తాలనుకుంటున్నారా? అయితే ఈ సూట్ మీ కోరికను నెరవేర్చనుంది. నిజం, దక్షిణ కొరియాలోని చుంగ్–ఆంగ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అల్ట్రా–లైట్ ఎక్సోసూట్ను రూపొందించారు. ఇది మనిషి.. వేగంగా దూరాలను అధిగమించడంలో సహాయపడుతుంది. 2.5 కిలోల బరువు ఉండే ఈ సూట్‌ని ధరిస్తే దాదాపు సెకనుకు 200 మీటర్లు పరుగెత్తగలం. ఈ ప్రత్యేకమైన ఎక్సోసూట్.. పవర్ ప్యాక్ ఉన్న బ్యాక్‌ప్యాక్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ సూట్ పరిశోధన దశలోనే ఉన్నా త్వరలోనే అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు మరింత తక్కువ బరువుతో మరింత వేగంగా పరుగెత్తించగల సూట్నీ తయారుచేసే పనిలో ఉన్నామనీ చెబుతున్నారు. -
ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!
సాక్షి,ముంబై: ట్రాక్ సూట్‌లా బాడీ స్కానర్గురించి విన్నారా. కొత్త తరహా ట్రాక్‌సూట్ నిజానికి ట్రాక్‌సూట్ కాదు, బాడీ స్కానర్! అమెరికన్ కంపెనీ ‘జోజోఫిట్’ ఇటీవల తేలికగా ట్రాక్సూట్లా తొడుక్కోవడానికి అనువైన ఈ త్రీడీ బాడీ స్కానర్‌ను రూపొందించింది. ఇది యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తొడుక్కుని, యాప్‌ను ఆన్ చేసుకున్నట్లయితే, క్షణాల్లోని శరీరంలోని పది కీలక భాగాలకు చెందిన కొలతలను అత్యంత కచ్చితంగా తెలియ జేస్తుంది. (రోబోటిక్ వీడియో కెమెరా: ధర తెలిస్తే షాకవుతారు) అంతేకాదు, శరీరంలోని ఏయే భాగాల్లో ఏ మేరకు కొవ్వు పేరుకుపోయి ఉందో కూడా ఇట్టే చెప్పేస్తుంది. ఎత్తు, బరువు వివరాలతో పాటు శరీరం కొలతలతో పోలిస్తే కొవ్వు నిష్పత్తి ఎంత ఉందో ఏమాత్రం తేడా లేకుండా చెప్పేస్తుంది. ప్రొఫెషనల్ క్రీడాకారులతో పాటు ఔత్సాహికులకు కూడా పనికొచ్చేలా దీన్ని తీర్చిదిద్దినట్లు ‘జోజోఫిట్’ సంస్థ చెబుతోంది. ఈ త్రీడీ బాడీ స్కానర్ ట్రాక్‌సూట్ విక్రయాల కోసం ‘జోజోఫిట్’ త్వరలోనే టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో షోరూమ్‌ను ప్రారంభించనుంది. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!) -
ఇదేం ఖర్మ.. ఆ తిక్కకు ఓ లెక్కంటూ లేదా?
వైరల్: పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. వెరైటీ పేరిట చేసే ప్రయత్నాలు ఒక్కోసారి విపరీతమైన ఆదరణ తెచ్చిపెడుతుంటాయి. కానీ, ఆ ప్రయత్నం అతిగా ముందుకెళ్తే? మనిషికి తిక్క ఉండొచ్చు. కానీ, దానికి ఓ లెక్కంటూ లేకపోతేనే సమస్య మొదలయ్యేది.. ఈ తిక్కకు ఓ లెక్కంటూ లేదా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. జపాన్‌లో ఆ మధ్య ఒకడు కుక్కలా బతకాలని ఉందంటూ లక్షలు పోసి.. కుక్క కాస్టూమ్ను తయారు చేయించుకున్నాడు. రాత్రికి రాత్రే వైరల్ అయిపోయాడు. అయితే.. ఈ మధ్య ఓ బ్రిటన్ టాబ్లాయిడ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోకో అనే ఆ వ్యక్తి.. కుక్కలా బతకడం వల్ల ఇంట్లోవాళ్లు, స్నేహితులు ఏం అనుకుంటారో అని తెగ ఫీలైపోతున్నాడు. త్వరలోనే ఆ వేషానికి ముగింపు వేయాలని అనుకుంటున్నాడట. ఈ వ్యవహారం మరిచిపోక ముందే.. #WATCH: Ever wanted to know what it would be like to live life as a dog? One #Japanese man actually has an answer to this question. Toco spent a whopping two million Yen on a realistic #Collie breed costume. @zeppetJP (🎥 via @toco_eevee)https://t.co/025Pbky6qZ pic.twitter.com/e5WCMNmJkd — Arab News Japan (@ArabNewsjp) May 27, 2022 అదే జపాన్‌లో మరొకడు తోడేలులా కనిపించేందుకు డబ్బు కుమ్మరించాడు. ఈసారి ఇంకా ఎక్కువే ఖర్చు చేశాడు. మన కరెన్సీలో ఆ విలువ రూ. 19 లక్షల దాకా ఉంటుంది. కుక్క కోసం టోకో ఆశ్రయించిన జెప్పెట్ కంపెనీనే.. ఇతని కోసం సూట్ తయారు చేసింది. అయితే నిజమైన తోడేలులాగా నడిచేందుకు అతనికి కాస్త కష్టంగా ఉందంట. అందుకే రెండు కాళ్లతో నడుస్తూ.. తన తోడేలు కల నెరవేరిందని సంతోషిస్తున్నాడు. ఇది చూసి నెటిజన్స్.. ఒకరిని చూసి మరొకరు ఇలా తయారు అవుతున్నారంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆ కంపెనీకి మరిన్ని జంతువుల ముసుగులు కావాలంటూ ఆర్డర్లు పెడుతున్నారంట ఇదంతా చూస్తున్న వాళ్లు. View this post on Instagram A post shared by 特殊造型ゼペット (@zeppet_jp) -
ఎలన్ మస్క్‌పై కోర్టుకెక్కిన కన్నకొడుకు!
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయన కన్నకొడుకు గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్.. కోర్టుకెక్కాడు. అయితే అది ఆస్తి కోసం మాత్రం కాదు. తండ్రి పేరుతో సంబంధం లేకుండా బతకడానికి, ఆయన నీడలో బతకడం ఇష్టం లేక.. అంతకు మించి సొసైటీలో ‘జెండర్’ గుర్తింపు కోసం! ఎలన్ మస్క్ మొదటి భార్య.. కెనడా నటి జస్టిన్ విల్సన్. 2000 సంవత్సరంలో జస్టిన్ను మస్క్ వివాహం చేసుకుని.. ఎనిమిదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఈ ఇద్దరికీ ఆరుగురు సంతానం. తొలి దఫాలో ఐవీఎఫ్ ద్వారా కవలలను కంది జస్టిన్. ఇందులో ఒకడే గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్. ఇక విడాకుల తర్వాత తల్లిదండ్రులు పిల్లల సంరక్షణను సమానం చూస్తున్నారు. అయితే గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్ ‘ట్రాన్స్‌జెండర్’. సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయాడు. వివియన్ జెన్నా విల్సన్‌గా పేరు మార్చుకున్నాడు. తాజాగా.. 18 ఏళ్లు నిండడంతో ఎలన్ మస్క్‌తో తనకు సంబంధాలు వద్దంటూ కోర్టుకు ఎక్కాడు(ఎక్కింది). ‘‘నేను ఇకపై ఏ విధంగా, ఆకారం, రూపం, గుర్తింపులో.. కన్నతండ్రి నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నా. ఆయన గుర్తింపు ఇకపై నాకు అక్కర్లేదు. నా పేరు మార్పిడికి అనుమతించండి. నా లింగమార్పిడికి చట్టబద్ధత ఇవ్వండి’’ అంటూ.. శాంటా మోనికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ఏప్రిల్ నెల చివర్లోనే వివియన్ తన పిటిషన్ దాఖలు చేసింది. కానీ, అందులోని ఆసక్తికర వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. గ్జావియర్ పాత ఫొటో కాలిఫోర్నియాలో ఉంటున్న గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్(వివియన్ జెన్నా విల్సన్).. తన కొత్త పేరుకు అధికారిక గుర్తింపు ఇవ్వడంతో పాటు.. కన్నతండ్రి ఎలన్ మస్క్ గుర్తింపును, ఆయన అందించే సాయాలను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొంది. తండ్రి నీడలో బతకడం ఇష్టం లేదంటూ పిటిషన్లో పేర్కొంది వివియన్. ఇదిలా ఉంటే.. ఆ తండ్రి, ట్రాన్స్‌జెండర్ కూతురు మధ్య గొడవ ఏంటన్నదానిపై స్పష్టత లేదు. ఇరు పక్షాల లాయర్స్ సైతం దీనిపై స్పందించలేదు. మరోవైపు ట్రాన్స్‌జెండర్ హక్కుల విషయంలో రిపబ్లికన్ పార్టీకి మద్దతు ప్రకటించాడు ఎలన్ మస్క్. తాజా చట్టం ప్రకారం.. అమెరికాలో ట్రాన్స్‌జెండర్ హక్కులపై పరిమితులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో.. తండ్రి వైఖరిపై అసంతృప్తితోనే గ్జావియర్ అలియాస్ వివియన్.. ఇలా పిటిషన్ వేసి ఉంటుందని భావిస్తున్నారు. -
‘నన్ను ఎందుకు అమ్మేశారు’.. పేరెంట్స్‌పై కోర్టుకెక్కిన కొడుకు!
పుట్టగానే ఆ తల్లిదండ్రులు అతన్ని వేరే వాళ్లకు అమ్మేశారు. నాలుగేళ్లు గడిచాక ఆ పిలగాడిని దురదృష్టం వెంటాడింది. దత్తత తీసుకున్న జంట కూడా ఓ ప్రమాదంలో చనిపోవడంతో మళ్లీ అనాథ అయ్యాడు. గత్యంతరం లేక ఆ పెంపుడు తల్లిదండ్రుల బంధువుల ఇళ్లలో పెరిగి పెద్దయ్యాడు. గూడు చెదిరి పోవడంతో ఎగురుకుంటూ కన్నవాళ్ల చెంతకు చేరే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ బిడ్డకు భంగపాటే ఎదురైంది.. చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో ఉంటున్నాడు 17 ఏళ్ల లియు జుజౌ. బంధువుల ఇళ్లలో జీవనం కష్టమవుతుండడంతో.. మరో దారి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో తనకి అసలు తల్లిదండ్రులు వేరే ఉన్నారని తెలుసుకున్న లియు వారి కోసం వెతకడం ప్రారంభించాడు. ఎంత కాలం వెతికినా ప్రయోజనం లేకపోయింది. దారులు ఇరుకు అవుతున్న క్రమంలో.. ఆన్లైన్లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆపై ఇంటి పేరు ఆధారంగా.. ఎలాగోలా కన్నతండ్రిని కనిపెట్టగలిగాడు. 21 డిసెంబర్ 2021లో లియు.. తన తండ్రిని కలిశాడు. కానీ, అక్కడ అతనికి ట్విస్ట్ ఎదురైంది. లూయు తన కొడుకే కాదని డింగ్ షుంజిక్కులన్ బయటికి పొమ్మన్నాడు. దీంతో పోలీసుల సహకారంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా లియు.. డింగ్ కుమారుడే అని తేలింది. కథలో మరో ట్విస్ట్ ఏంటంటే.. డింగ్‌తో ఉంది లియు కన్నతల్లి కాదు. తన భార్యకు(లియు కన్నతల్లి).. ఆమె ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వడానికే పుట్టిన బిడ్డను(లియు) అమ్మేసినట్లు డింగ్ ఒప్పుకున్నాడు. లియుని అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బును పంచుకుని ఆ జంట విడాకులతో వేరు పడింది. కొంతకాలానికి మళ్లీ వివాహం చేసుకుని వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారు. పేరెంట్స్ దరిద్రపుగొట్టు ప్లాష్‌బ్యాక్ గురించి తెలిశాక లియు ఛీ అనుకున్నాడు. ఆపై కన్నతల్లిని వెతుక్కుంటూ వెళ్లాడు లియు. కొడుకుని సాదరంగా హత్తకున్న తల్లి.. కొడుకు వినిపించిన డిమాండ్ విని షాక్ తింది. తనకు ఇల్లు లేదని, సాయం చేయాలని కోరాడు ఆమెను. ఆమె దానికి నిరాకరించింది. దీంతో కన్నవాళ్లను ఒక దగ్గరికి చేర్చి పంచాయితీ పెట్టాడు లియు. తనకు ఇల్లు కట్టించి తీరాల్సిందేనని లియు డిమాండ్ చేయగా.. చదువుకోవడానికి ఫీజులు చెల్లిస్తామని, బతకడానికి కొంత డబ్బు ఇస్తానని ఆ తండ్రి మాత్రం అంగీకరించాడు. దీంతో లుయు కొర్టుకెక్కాడు. తనకు కోర్టులో న్యాయం జరుగుతందని ఆశిస్తున్నాడు. తనను పెంచుకున్న తల్లిందండ్రులు ఇచ్చిన ఇల్లు మొత్తం శిధిలావస్థలో ఉందని, కనీసం దానిని బాగు చేసిచ్చినా చాలని అంటున్నాడు పాపం లియు. -
టెస్లాలో కీచక పర్వం! అసభ్యంగా తాకుతూ వేధింపులు
అసభ్యంగా తాకడం, వెకిలి సందేశాలతో ఇబ్బంది పెట్టడం.. తట్టుకోలేక ఫిర్యాదులు చేస్తే మరింతగా వేధించడం.. ఇది ప్రపంచంలోనే ఆటోమొబైల్ దిగ్గజంగా పేరున్న టెస్లాలో మహిళా ఉద్యోగులకు ఎదురవుతున్న పరిస్థితి. పైగా బాస్‌ను బట్టే ఉద్యోగులు రెచ్చిపోతున్నారంటూ విమర్శలు చెలరేగడం ఇక్కడ కొసమెరుపు. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీ మోడల్- 3 యూనిట్లో పనిచేసే ఓ ఉద్యోగిణి.. ప్రొడక్షన్ అసోసియేట్ కోర్టులో ఆమధ్య టెస్లాకు వ్యతిరేకంగా దావా వేసిన విషయం తెలిసిందే. ఇది విచారణ జరుగుతుండగానే.. ఏకంగా ఆరుగురు మహిళా ఉద్యోగులు మంగళవారం(డిసెంబర్ 14, 2021) కాలిఫోర్నియా కోర్టును ఆశ్రయించారు. ఫ్రీమాంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఐదుగురు, దక్షిణ కాలిఫోర్నియా టెస్లా సర్వీస్‌సెంటర్‌లో పనిచేసే ఓ ఉద్యోగిణి ఇందులో ఉన్నారు. వీళ్లంతా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పరిణామంపై స్పందించేందుకు టెస్లా నిరాకరించింది. ‘టెస్లా అనేది మగ ఉద్యోగుల విలాసాలకు కేరాఫ్. కానీ, ఆడవాళ్లకు మాత్రం అదో నరక కూపం’ అని ఓ దావాలో బాధితురాలు పేర్కొంది. ఇక మస్క్ చేష్టల వల్లే ఉద్యోగులు రెచ్చిపోతున్నారంటూ మరో దావాలో బాధితురాలు పేర్కొంది. ‘బాస్‌ను బట్టే ఉద్యోగులు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేష్టల వల్లే ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. ఆయన చేసే ట్వీట్లు వర్క్ప్లేసులో రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. మాదక ద్రవ్యాలు-శృంగారం గురించి ఆయన చేసే ట్వీట్ల గురించి ఉద్యోగుల మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తుంటుంది. ఆయనే అలా ఉన్నప్పుడు మేం లేకుంటే ఎలా అని తెగ ఫీలైపోతున్నారు’ అని ఆ దావాలో ఉంది. ఇక మరో దావాలో మహిళా ఉద్యోగులపై జరుగుతున్న అఘాయిత్యాల తాలుకా వివరాలను తెలిపింది బాధితురాలు. ఇష్టమొచ్చినట్లు ముట్టుకుంటున్నారు. అసభ్య సందేశాలతో ఇబ్బంది పెడుతున్నారు. ఫిర్యాదులు చేస్తే ప్రతీకారం తీర్చుకుంటున్నారు. మా బాధలు వినేవారు కరువయ్యారు. ఏళ్ల తరబడి ఇది కొనసాగుతోంది’ అంటూ పేర్కొంది మరో బాధితురాలు. టెస్లా మోడల్ వై లాంఛ్ సమయంలో.. S, 3, X, Y అనే పదాల్ని చేర్చి.. తోటి ఉద్యోగిణిని ఉద్దేశిస్తూ సెక్సీ అంటూ ఎలన్ మస్క్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రస్తావనను కూడా ఓ బాధితురాలు తన పిటిషన్లో పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే టెస్లా కంపెనీ ఈమధ్య వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతోంది. తోటి ఉద్యోగుల నుంచి జాతి వివక్ష ఎదుర్కొన్న ఓ ఉద్యోగికి 137 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ జాబితాలో ఆరో ప్లేస్‌లో కొనసాగుతున్న టెస్లాకు.. ఓవైపు ఎలన్ మస్క్ చేష్టలు(నష్టం చేకూరేలా చేస్తున్న ట్వీట్లు.. షేర్ల అమ్మకం), మరోవైపు తాజా దావాలు తలనొప్పిగా మారాయి. చదవండి: ఎలన్ మస్క్.. ఏమైంది నీకు? -
మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి!
Suit Made of Men's Mustache: తలపై జుట్టు ఉన్నప్పుడు, చాలా అందంగా కనిపిస్తుంది. అవే వెంట్రుకలు ధరించే దుస్తులపై కనిసిస్తే చాలా ఆసహ్యంగా ఉంటుంది కదూ! కానీ, మొత్తం మీసాల వెంట్రుకలతో తయారైన ఈ సూటు ఎంత అందంగా ఉందో చూడండి! ఫొటోలో ఉన్న ఈ సూట్ పేరు ‘పొలిటిక్స్ మువెంబర్’. నో షేవ్ నవంబర్‌లో భాగంగా ఎంతోమంది క్యాన్సర్ రోగులకు దానం చేసే వెంట్రుకలను ఉపయోగించి, మెల్బోర్న్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ పమేలా క్లీమన్ పాస్సీ దీనిని రూపొందించారు. నిజానికి ఈ రూపకల్పన వెనుక ఓ కథ ఉంది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించకపోవడమే తన భర్త క్యాన్సర్‌తో మరణించడానికి కారణమైందని పమేలా భావించింది. ఆ అవగాహనా కార్యక్రమమేదో తానే మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అలా 2016 నుంచి వివిధ సెలూన్ల నుంచి మీసాల వెంట్రుకలను పోగు చేయసాగింది. రీసైక్లింగ్ ద్వారా వీటిని శుభ్రం చేసి, కాటన్‌తో కలిపి నేయించి, ఓ ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్‌ను తయారుచేసింది. ఇందుకు ప్రముఖ సంస్థ ‘పొలిటిక్స్’ సహకారం అందించడంతో అద్భుతమైన ఈ సూటు రూపొందింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన ఎంతోమంది ఆమెకు నేరుగా వెంట్రుకలను పంపిస్తున్నారు. వీటిని ఉపయోగించి మరెన్నో డిజైన్స్‌ను రూపొందించి, మరింత అవగాహన కల్పిస్తానని డిజైనర్ పమేలా క్లీమన్ పాస్సీ చెప్పింది. -
ఏం తిప్పావు అంకుల్?!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరలవుతున్నాయి. అందులో కొన్ని అద్బుతంగా ఉంటే మరి కొన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి కూడా ఉంటాయి. తాజాగా ఈ కోవకు చేందిన వీడియో ఒకటి ట్విట్టర్లో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. క్రిస్టియన్ డీ హారిస్ అనే వ్యక్తి.. ‘నా భార్యతో డేట్‌కి వెళ్లడానికి ముందు నా మోడలింగ్ వీడియో’ అంటూ దీన్ని షేర్ చేశాడు. 22 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో హారిస్ పింక్ కలర్ సూట్ ధరించి రూమ్‌లోకి నడుచుకుంటూ వస్తాడు. సూట్ లోపల డార్క్ పర్పుల్ కలర్ టై... బ్రౌన్ కలర్ ఫార్మల్ షూ ధరించాడు. ఆ తర్వాత మైక్రోవేవ్ స్పిన్ డ్యాన్స్ స్టెప్‌తో తన సూట్‌ని ప్రదర్శించాడు. (చదవండి: ఈ ‘బనాన గర్ల్’ డైటేమిటంటే....) Me modeling for my wife before we leave to go on our date: pic.twitter.com/bPNOUk5Po0 — Christian D. Harris (@chrxstianh__) October 6, 2020 ఈ సింపుల్ యాక్షన్ ట్విట్టర్ జనాలకు తెగ నచ్చింది. ఇప్పటికే దీన్ని 38.6కే మంది వీక్షించారు. అంకుల్ ఏం తిప్పారు.. నా తల ఇంకా తిరుగుతూనే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. మీరు ఓ సారి ఈ అంకుల్ స్లో మోషన్ మోడలింగ్ వీడియో చూడండి. -
ట్రంప్‌ను కోర్టుకీడ్చిన పోర్న్‌స్టార్
లాస్ఏంజెల్స్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోర్న్‌స్టార్ దావా వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు తమ మధ్య ఉన్న సంబంధాలను బహిర్గతం చేయరాదన్న (నాన్డిస్క్లోజర్) ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయమూర్తిని కోరింది. లాస్ఏంజెల్స్లో బుధవారం దాఖలు చేసిన దావాలో ఈ ఒప్పందంపై ట్రంప్ స్వయంగా సంతకం చేయనందున ఇది చెల్లుబాటు కాదని ఆమె వాదించింది. పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్ తాను ట్రంప్‌తో ఒకసారి లైంగికంగా కలిశానని, ఏడాది పాటు తాము సన్నిహితంగా ఉన్నా తమ మధ్య శారీరక సంబంధం లేదని తెలిపింది. అయితే ఒప్పందం ప్రకారం పోర్న్‌స్టార్‌కు ట్రంప్ 1,30,000 డాలర్లు చెల్లించారని, ఆమెతో ఆయనకు ఎప్పుడూ ఎఫైర్ లేదని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కొహెన్ చెప్పారు. మరోవైపు ట్రంప్‌తో సంబంధాలపై తనను నోరు మెదపకుండా ఆయన న్యాయవాది కోహెన్ ఒత్తిడి చేస్తున్నారని పోర్న్‌స్టార్ న్యాయమూర్తికి నివేదించారు. పలువురు మహిళలతో ట్రంప్ కొనసాగించిన లైంగిక సంబంధాలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. -
గూగుల్‌పై సంచలన ఆరోపణలు, దావా
శాన్‌ఫ్నాన్సిస్కో: గూగుల్ పై మాజీ ఉద్యోగులు సంచలన ఆరోపణలతో దావా వేశారు. గూగుల్ విధానాల్ని ప్రశ్నించినందుకే తమ పై వేటు వేశారని ఆరోపిస్తూ ఉద్వాసనకు గురైన ఇద్దరు గూగుల్ ఇంజనీర్లు పిటిషన్ దాఖలు చేశారు. శాంటా క్లారా కౌంటీ సుపీరియర్ కోర్ట్‌లో దాదాపు 161 పేజీల ఫిర్యాదును నమోదు చేశారు. గూగుల్ నిబద్ధతను ప్రశ్నించడం వల్లే తమని తొలగించారన్నారు. కార్పోరేట్ కల్చర్, తెల్లవారిపై వివక్ష కారణంగా తమను తొలగించారని వారు విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు దారులతో పాటు కన్సర్వేటివ్ దృక్పథం ఉన్న వారి పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందని జేమ్స్ దామోర్ (28), మరో మాజీ గూగుల్ ఇంజనీర్ మండిపడ్డారు. ఉన్నతమైన సంస్థగా వ్యవహరిస్తున్న గూగుల్ ఉదారవాద ఎజెండా నుంచి వైదొలగాలని ధైర్యం చేస్తున్న అనేక మంది ఉద్యోగులపై వేటు వేస్తోందని ఆరోపించారు. గూగుల్ సహా ఇతర ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో కన్సర్వేటివ్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే లేదా బహిరంగంగా ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న డజన్ల కొద్దీ ఉద్యోగులపై వేటుపడుతోందనీ, దీంతో మిగిలిన ఉద్యోగులు కూడా భయపడుతున్నారని దామెర్ లాయర్ రిపబ్లికన్ పార్టీ అధికారి హర్మీత్ డల్లాన్ వ్యాఖ్యానించారు. గూగుల్ ఉద్యోగం పొందడానికి అధ్యక్షుడికి ఓటు వేయలేదని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరోవైపు దామోర్ ఆరోపణలపై తమవాదనలను కోర్టులో వినిపిస్తామని గూగుల్ చెప్పింది. అయితే అతని రాజకీయ అభిప్రాయాల నేపథ్యంలో తొలగించలేదని వెల్లడించింది. సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకే చర్య తీసుకున్నామని గూగుల్ తెలిపింది. ఏ విధమైన వేధింపులను తాము సహించమని పేర్కొంది. కాగా సిలికాన్ వ్యాలీ టెక్ నియామాకాల్లో లింగ వివక్ష ఉందన్న వాదనను సమర్ధిస్తూ ఒక లేఖ రాయడం కలకలం రేపింది. గత ఏడాది ఆగస్టు 7 న గూగుల్ అతణ్ని తొలగించింది. -
ఇన్ఫీలో వివక్షపై మాజీ ఉద్యోగి దావా
బెంగళూరు: దక్షిణాసియాయేతర ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందంటూ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై సంస్థ మాజీ ఉద్యోగి దావా వేశారు. దక్షిణాసియా వారికి అందునా భారతీయ ఉద్యోగులకే ప్రాధాన్యమిస్తోందంటూ ఇమ్మిగ్రేషన్ విభాగం అధిపతిగా పనిచేసిన ఎరిన్ గ్రీన్ పిటీషన్లో పేర్కొన్నారు. గ్లోబల్ ఇమిగ్రేషన్ వాసుదేవ నాయక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బినోద్ హంపాపూర్లపై ఈ మేరకు ఆయన ఆరోపణలు చేశారు. తాను నాలుగున్నరేళ్ల పాటు ఇన్ఫీలో పనిచేశానని, క్రమశిక్షణ ఉల్లంఘనలాంటి రికార్డు కూడా ఏమీ లేకపోయినప్పటికీ .. ముందస్తు హెచ్చరికలేమీ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ తనను తొలగించిందని పేర్కొన్నారు. విధుల్లో భాగంగా నాయక్‌కు గ్రీన్ రిపోర్టు చేసేవారు. నాయక్ గతేడాది ఇన్ఫోసిస్ నుంచి తప్పుకున్నారు. నాయక్, హంపాపూర్ తనతో పాటు దక్షిణాసియాయేతర ఉద్యోగులపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న సంగతి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినందుకు ప్రతీకారంగానే తనను తొలగించారని గ్రీన్ ఆరోపించారు. మరోవైపు, విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము వ్యాఖ్యానించబోమని ఇన్ఫోసిస్ పేర్కొంది. -
చాయ్‌వాలాకు సూటు ఎందుకు..?
ఎంïసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సభ్యుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి నర్సంపేట : చాయ్‌వాలాగా చెప్పుకొని గద్దెనెక్కిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సూటు, బూటు ఎలా ధరిస్తున్నాడని ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సభ్యుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఓంకార్ భవన్లో ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా జనరల్ బాడీసమావేశం నాగెల్లి కొంరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ పాలన లేదని, మోదీ సామ్రాజ్యవాద దేశాలకు పెట్టుబడిదారులకు నమ్మకమైన పెద్ద ఏజెంట్‌గా పని పనిచేస్తున్నారన్నారు. అందులో భాగమే అన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎఫ్‌డీఐ నూటికి నూ రు శాతం అనుమతించడమన్నారు. రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల ఏడు నెలల కాలంలో కొత్తగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సమావేశంలో రూరల్ జిల్లా కార్యదర్శి గాదగోని రవి, గోనె కుమారస్వామి, నాగెల్లి కొంరయ్య, కొత్త కొండ రాజమౌళి, బాపురావు, రవి, హంసారెడ్డి, బుచ్చన్న, మల్లికార్జున్, సుల్తాన్, సారయ్య, లక్ష్మినారాయణ, మాషుక్, సదానందం, మొగిళిచర్ల సందీప్, కొంరయ్య, సాంబయ్య, యాదగిరి, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్‌పై అరుణ్ జైట్లీ విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించారు. రాహుల్ గాంధీ సూటు, బూటు పేరుతో ప్రభుత్వంపై ద్వేషం ప్రదర్శిస్తూ బంగారంపై ప్రేమను ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. బంగారు,వజ్రపు ఆభరణాలపై ఒక శాతం పన్ను పెంపునకు నిరసనగా వ్యాపారులు చేస్తున్న ఆందోళనకు రాహుల్ మద్దతు పలకడాన్ని జైట్లీ తప్పుబట్టారు. గతంలో ఉన్న పన్నునే తిరిగి పునరుధ్దరించామని, చిన్న వ్యాపారులపై పన్ను విధించలేదని జైట్లీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా బంగారు వ్యాపారులపై ప్రేముంటే ఆపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 5 శాతం వ్యాట్ ను ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని జైట్లీ నిలదీశారు. 2012-13లోనే వరుసగా గత ప్రభుత్వం బంగారం దిగుమతులపై 10 శాతం పన్నును విధించిందని అన్నారు. తమ ప్రభుత్వం దేవాలయాల్లో, ఇళ్లలో వృధాగా ఉన్న బంగారాన్ని సమీకరించడానికి కృషి చేస్తోందని జైట్లీ తెలిపారు. -
మోదీ సూటుకు అక్షరాలా 'కోటి'
సూరత్ : అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ధరించిన సుమారు రూ.10లక్షల విలువైన సూట్ వేలానికి రంగం సిద్ధమైంది. రాజకీయపరంగా తీవ్ర వివాదం రేపిన ఈ సూట్‌తోపాటు గడిచిన తొమ్మిది నెలలుగా ప్రధానికి కానుకలుగా అందిన 455 వస్తువులను కూడా వేలానికి పెట్టనున్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం సూరత్ లోని సైన్స్ సెంటర్ ఈ వేలానికి వేదిక కానుంది. సూరత్ కు చెందిన వ్యాపారవేత్త సురేష్ అగర్వాల్ ఈ సూట్ కోసం రూ.కోటికి బిడ్ చేయటం విశేషం. ఈ సూట్ ను దక్కించుకునేందుకు ఈరోజు సాయంత్రం అయిదు గంటల వరకూ వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఇలా వచ్చిన సొమ్మును బాలికా విద్య కోసం నమామి గంగా ట్రస్ట్ ఫండుకు విరాళంగా ఇవ్వనున్నారు. మూడు రోజులు పాటు ఈ వేలం జరుగుతుందని కలెక్టర్ డా.రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. అధిక మొత్తంలో నిధుల సమీకరణ కోసమే డైమండ్ సిటీ సూరత్ ను ఎన్నుకున్నామని తెలిపారు. సూరత్ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్టుగా వారు తెలిపారు.