ఈ సూట్‌ వేసుకుంటే సూపర్‌ స్పీడ్‌గా పరిగెత్తొచ్చు | Super Speed Can Be Possible With The Ultra Light Exosuit | Sakshi
Sakshi News home page

ఈ సూట్‌ వేసుకుంటే సూపర్‌ స్పీడ్‌గా పరిగెత్తొచ్చు

Published Thu, Dec 14 2023 2:59 PM | Last Updated on Thu, Dec 14 2023 3:15 PM

Super Speed Can Be Possible With The Ultra Light Exosuit - Sakshi

సూపర్‌ స్పీడ్‌ గా పరుగెత్తాలనుకుంటున్నారా? అయితే ఈ సూట్‌ మీ కోరికను నెరవేర్చనుంది. నిజం, దక్షిణ కొరియాలోని చుంగ్‌–ఆంగ్‌ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అల్ట్రా–లైట్‌ ఎక్సోసూట్‌ను రూపొందించారు.

ఇది మనిషి.. వేగంగా దూరాలను అధిగమించడంలో సహాయపడుతుంది. 2.5 కిలోల బరువు ఉండే ఈ సూట్‌ని ధరిస్తే దాదాపు సెకనుకు  200 మీటర్లు పరుగెత్తగలం. ఈ ప్రత్యేకమైన ఎక్సోసూట్‌.. పవర్‌ ప్యాక్‌ ఉన్న బ్యాక్‌ప్యాక్‌తో వస్తుంది.  

ప్రస్తుతం ఈ సూట్‌ పరిశోధన దశలోనే ఉన్నా త్వరలోనే అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు మరింత తక్కువ బరువుతో మరింత వేగంగా పరుగెత్తించగల సూట్‌నీ  తయారుచేసే పనిలో ఉన్నామనీ చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement