intresting things
-
నిషాలో తూగడం...ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచం నలుమూలలా ఉన్న మానవ నాగరిక సమాజమంతటికి ఒక విషయం సర్వ సాధారణం : మత్తుపదార్ధం. కొన్ని పదార్ధాలు పవిత్రమైనవాటివిగా పరిగణింపబడతాయి, కానీ ఎక్కువ సార్లు, మనం కేవలం వేడుకలకో లేదా నిషా కోసమో తాగుతాం.మత్తులో స్పృహ తప్పడం మానవుల హక్కేమి కాదు. చాలా జంతువులు మత్తులో తూగడానికి ఎంతో శ్రమకోడుస్తాయి. తమిళనాడులోని బానేట్ మాకాక్‌లు అడవిలో దాచే అక్రమ సారాయి పీపాలను కొల్లగొట్టేవయితే, కరీబియన్ వెర్వేట్ కోతులు క్రమం తప్పక తప్పతాగి తూగుతుంటాయి. ఆ దీవిలో ఏడాది పొడుగునా సెలవల సందడి ఉండడంతో అక్కడ మత్తు పానీయాలకు ఏమి కొదవలేదు.పనికిమాలినట్టుగా అనిపించినా, వెర్వేట్ కోతుల తాగుడు అలవాట్లపై చేసిన ఒక శాస్త్రీయ అధ్యయనం, అవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తాయని చూపడం ఆశ్చర్యకరం. వాటిలో కొన్ని అతిగా తాగేవి ఉంటాయి - అవి త్వర త్వరగా, ఎక్కువ ఎక్కువ, తరచూ తాగుతుంటాయి. కొన్ని స్థిరంగా ఉండే తాగుబోతులు ఉంటాయి - అవి సరాసరి మద్యాన్ని సోడాగానీ, నీళ్లుగానీ కలపకుండా, క్రమం తప్పకుండా కొట్టేస్తాయి. కానీ చాలామటుకు కోతులు సామాజిక జీవనంలో భాగంగా తాగుతుంటాయి. అటువంటి కోతులు కాక్టైల్స్ ఇష్టపడతాయి. మరికొన్ని మద్యాన్ని అసలు తాకవు. అక్కడితో వాటికీ మనకీ పోలికలు ఆగవు. కొన్ని కోతులు తాగినప్పుడు నిషాలో బాగా మునిగిపోయి దూకుడుగా తయారవుతాయి, కొన్ని కఠినంగా దుర్భాషలాడతాయి, మరికొన్ని దిగాలుగా, ముభావంగా తయారవుతాయి. కానీ చాలామటుకు సంతోషంగా నిషాలో మునిగిపోతాయి…. బహుశా గులాబీ రంగు ఏనుగులను చూసిన భ్రమలో ఊగుతాయి.మామూలు నలుపురంగు ఏనుగులు కూడా కాస్త మద్యం ఎక్కువైత ఒళ్లు మర్చిపోయేంతగా విజ్రుoభిస్తాయి. జార్ఖండ్‌లో ఆశియా ఏనుగులు పాకల లోపల కాగుతున్న మద్యాన్నిగైకొనడానికి పాకలని నాశనం చేస్తాయని విషయం తెలిసినది. కొన్ని ఏళ్ల క్రితం, ఒక మత్తెక్కిన ఏనుగులగుంపు ఊరుమీద విరుచుకుపడి, విద్యత్ స్థంభాలను పాడగొట్టి తిరిగితూ, ఆ ప్రక్రియలో అవే విద్యుత్ షాకు తగిలి కాలిపోయాయి.పశ్చిమ దేశాలలో పిల్లులు పుదీనాలా ఉండే క్యాట్నిప్ అనే మొక్క మత్తులో మునిగిపోతాయి. పిల్లులు ఆ పుదీనా వంటి మొక్క కొమ్మల మీద పడి మూలుగుతూ, చోంగకారుస్తూ, మళ్ళీ మళ్ళీ దొర్లుతాయి. నేను కొంచం ఆ మొక్కను తెచ్చి ఇవ్వగానే, ముందెన్నడూ ఆ మొక్కని చూడని మా నాన్నగారి పిల్లి కూడా మతిపోయినట్టు ప్రవర్తించింది. కానీ కొద్ది నిముషాల తరవాత అది బాగా తేరుకుని మళ్ళీ హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏళ్ల తర్వాత అమెరికా జంతు ప్రదర్శనశాలను సందర్శించే సమయంలో, మేము ఒక కౌగర్ క్యాట్నిప్తో నింపివున్న మేజోడు పట్టుకుని వెర్రివేషాలు వేయడం చూశాము. అన్ని జాతుల పిల్లులూ ఈ క్యాట్నిప్కు ఆకార్షితమవుతాయని స్పష్టంగా తెలుస్తోంది.రాకీ కొండలలో పెద్ద కొమ్ముల గొర్రెలు మత్తు కోసం, ఒక రకమైన బూజు గోకి తినడానికి, ఎంతో ప్రమాదకరమైన కొండ చరియలుఎక్కుతాయని తెలిసినది. మరి ఈమెన్లో మేకలైతే వారి కాపారులలాగే ఖట్ ఆకుల మత్తుకు బానిసలు.ఎంతో అందంగా మిఠాయిలా కనిపించి, ఎర్ర టోపీలతో, పైన కాస్త పంచదార చల్లినట్టు ఉండీ, యాక్షినిల కథలలో కనిపించే బొమ్మల్లో అమ్మాయాకంగా కనిపించే పుట్టగొగుల పేరు ఫ్లై ఆగారికస్ పుట్టగొడుగులు. నన్ను తినకండి అని హెచ్చరించే రంగులో ఉన్నాకూడా రెయిన్ డీర్లు వాటిని తిని మత్తులో గెద్దలంత ఎత్తు ఎగురుతాయి. ఎన్నో మత్తు పదార్ధాలను రెయిన్ డీర్ మూత్ర పిండాలు వడగొట్టగలవు కనుక, వాటి మూత్రం పుట్టగొడుగులు తినటం కాంటే స్పష్టంగా ఎంతో శక్తివంతమైన మత్తు పదార్థం. మరి మత్తు కోసం ప్రాకులాడే యూరోప్ మారియు ఉత్తర ఆసియాలో గొర్రెకాపరులు చేసేది అదే!ఎన్నో శాంతా క్లాస్ పుట్టుక కథలలో ఒకటైన కథ మనని సైబీరియా వైపుకు దారితీస్తుంది. ఒక సీతాకాలం మధ్యలో వచ్చే పండుగలో, ఒక నాటు వైద్యుడు, పోగాకమ్ముకున్న ఒక ముఖం ద్వారoగుండా ఫ్లై ఆగారిక్ నిండిన సంచీని మోస్తూ ఒక యూర్ట్ ( జూలుతో చేయబడ్డ గుండ్రటి డేరా) లోపలకి ప్రవేశిస్తాడు. ప్రజలు ఈ గొడుగుల నిషాలో పడ్డ వేళ, వారి ముఖము - ముఖ్యంగా వారి బుగ్గలు, ముక్కు, ఎర్రగా మారతాయి. శాంతా, అతని ఎర్ర ముక్కు రెయిన్ డీర్ రుడోల్ఫ్, ఆకాశంలో దీనిపై ఎగురుతున్నారన్న అంచనా వేసినందుకు ఏమి బహుమతులు లేవు!శతాబ్దాలా నుంచీ సమాజం ఈ పదార్ధాలను భయంకరమైన చెడుతో కూడిన వాటిగా పరిగణించి బహిష్కరించడానికి ప్రయత్నించింది. అయినా వాటిలో మునిగి తెలడం మన ఆచ్చారాలలో ఎంత బలంగా నాటుకుందో, అది అంతే బలంగా మన జన్యువులో కూడా నాటుకుని ఉండి ఉంటుంది. పిల్లలు కూడా ఆ అనుభూతి పొందడానికి కళ్ళుతిరిగి, కాలపై నిలబడడానికి తడబడేదాకా పదే పదే గుండ్రంగా తిరిగితారు. దెర్విషలు (సన్యాసులు) కూడా మనకుకి అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి ఇటువంటి పద్దతే వాడతారు. పార్స్వ ఆలోచన అనే భావాన్ని పెంపొందించిన ఎడ్వర్డ్ డి బోనో ప్రస్తావన ఇక్కడే వస్తుంది. అతను మత్తుపదార్థాలు మనని పోతపోసిన ఆలోచనా విధానాలనుంచి బయటకులాగి, ఎంతో సృజనత్మాకంగా ఆలోచింపచేయగలదని అతను సూచించాడు. అదే గనక నిజమైతే, మనసుని మార్చేటువంటి ఈ మత్తు అనుభూతులతో, ఖచ్చితంగా ఈ పాటికి ప్రపంచంలో ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మారియు ప్రయత్నలు చూసుండేవాళ్ళం. రచన : జానకి లెనిన్ ఫోటోలు: సిద్దార్థ్ రావు -
పుష్ప.. మేక్ ఇన్ ఇండియా.. తగ్గేదే లే.. ఇంతకీ కథ ఎలా పుట్టిందంటే..
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమా గురించి చర్చ సుకుమార్-అల్లు అర్జున్‌ల ‘పుష్ప’తోనే నడిచింది. దాదాపు 70 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎట్టకేలకు ఓ తెలుగు నటుడిని వరించింది ఈ చిత్రంతోనే. మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్ర మొదటి భాగం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పుడు రెండో భాగం భారీ అంచనాల నడుమ ఆరు భాషల్లో.. 12వేలకు పైగా స్క్రీన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మేనియా నడుమే అసలు పుష్పగాడి కథ ఎలా పుట్టిందో ఓసారి గుర్తు చేసుకుందాం. పుష్పరాజ్.. తన ఇంటిపేరును కూడా చెప్పుకోలేని స్టేజ్‌లో అవమానాలు ఎదుర్కొనే ఓ మొరటు యువకుడు. అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ‘నీ యవ్వ.. తగ్గేదే లే’’ అంటాడు. ఓనర్ ముందే ఇస్టయిల్‌గా కుర్చీలో కూర్చుని ఆ ఉద్యోగానికి కాలదన్ని మరీ ఎర్ర చందనం ముఠాలో చేరతాడు. అడవిలో స్మగ్లింగ్ కోసం కూలీగా వెళ్లి.. క్రమక్రమంగా శత్రువుల్ని పెంచుకుంటూ ఆ మాఫియాకి కింగ్‌గా ఎలా ఎదిగాడన్నది పుష్ప ది రైజ్ కథ. ఈ మధ్యలో తల్లి పార్వతమ్మ, సవతి అన్న ఫ్యామిలీ సెంటిమెంట్.. దానికి సమాంతరంగానే శ్రీవల్లితో ప్రేమాయణం కూడా నడుస్తుంది. ఆఖర్లో షెకావత్ సర్‌తో నడిచే బ్రాండ్ ట్రాక్‌తో కథకు కొనసాగింపుగా పుష్పగాడి పెళ్లిలోనే ‘‘శుభం కార్డు’’ పడుతుంది. మొదటిపార్ట్‌లో పుట్టుకొచ్చిన ఎనిమీస్ మధ్యే పుష్పగాడి రూల్ ఎలా నడుస్తుందనే దానితో సుకుమార్ రెండో పార్ట్‌ను చూపించబోతున్నారు!. అయితే..👉పుష్ప కథ, కాస్టింగ్ దగ్గరి నుంచి.. చాలా విషయాల్లో దర్శకుడు సుకుమార్ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు!. దశాబ్దాల కిందట ఏపీలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో పుష్ప కథను రాసుకున్నాడు సుక్కూ. ఆయన దానిని ఓ వెబ్ సిరీస్‌గా తీయాలని భావించాడు. కానీ, ఆ తర్వాత ఎందుకనో నిర్ణయం మార్చుకుని ఫీచర్ ఫిల్మ్ వైపు మొగ్గు చూపాడు. 👉ఈ కథతో ఓ అగ్రహీరోను సంప్రదిస్తే.. ఆయన సై అన్నాడు. ప్రాజెక్టు ప్రారంభ పనుల్లోనూ ఆ హీరో సుక్కూతో కలిసి పాలుపంచుకున్నాడు. తీరా.. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోగా.. తాను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడే హీరో అల్లు అర్జున్ దగ్గరకే ఆ కథ చేరింది. అయితే ఆ స్టార్ హీరోతో తీయాలనుకున్న కథ వేరైనా.. బ్యాక్‌డ్రాప్ మాత్రం ఇదేనని సుకుమార్ తర్వాత క్లారిటీ ఇచ్చారు కూడా.👉కాస్టింగ్‌లో విషయంలోనూ సుక్కూ లెక్క తప్పింది. కీలక పాత్రలకు అనుకున్నవాళ్లతో కాకుండా వేరే వాళ్లను ఎంచుకోవాల్సి వచ్చింది. మైత్రి మేకర్స్ సుకుమార్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేసింది 2019 జులైలో. అదే ఏడాది దసరాకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈలోపు అయితే అది కాస్త ఆలస్యమై.. అక్టోబర్ 30వ తేదీన కొంతమంది కాస్టింగ్‌తో పూజా కార్యక్రమం ద్వారా ముహూర్తం షాట్‌తో లాంఛనంగా ప్రారంభమైంది. 👉ఇక రెగ్యులర్ షెడ్యూల్‌ను అదే ఏడాదిలో కేరళలో యాక్షన్ షూట్‌తో ప్రారంభించాలనుకున్నప్పటికీ.. అప్పటికే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో ఉండడంతో ఆలస్యమైంది. ఆపై 2020 మార్చ్‌లో కేరళ షెడ్యూల్‌తో షూటింగ్ మొదలుకావాల్సింది.కానీ, కరోనాతో సినిమాకు అడ్డుపడింది. అక్కడి నుంచి పుష్పకు సినిమా కష్టాలే నడిచాయి.👉2020 ఏప్రిల్ 8వ తేదీ.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రగ్డ్ లుక్‌తో పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి హాట్ టాపిక్‌గా మారింది.First Look and the Title of my next movie “ P U S H P A “ . Directed by dearest Sukumar garu . Music by dearest friend @ThisIsDSP . Really excited about this one. Hoping all of you like it . @iamRashmika @MythriOfficial #MuttamsettyMedia pic.twitter.com/G8ElmLKqUq— Allu Arjun (@alluarjun) April 8, 2020👉అయితే చిత్ర షూటింగ్ ఏరకంగానూ మేకర్స్ అనుకున్న విధంగా జరగలేదు. కరోనా పరిస్థితులే అందుకు కారణం. ఆంక్షల కారణంగా లిమిట్ మెంబర్స్‌తో.. ముందుగా అనుకున్న లోకేషన్లలో కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో షూట్ కానిచ్చారు. ఏపీ, తమిళనాడు అటవీ ప్రాంతంలో 200 రోజులు షూటింగ్ జరుపుకోవడం, అదీ కరోనా లాంటి టైంలో.. మాములు విషయం కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. 👉కరోనాతో కుదేలైన రంగాల్లో చలన చిత్ర రంగం కూడా ఉంది. షూటింగ్‌లు లేక వేల మంది టెక్నీషియన్లకు ఉపాధి లేకుండా పోయింది. ఆ టైంలో ధైర్యంగా షూటింగ్‌తో ‘పుష్ప’ ఎంతో మందికి ఆసరాగా నిలబడింది. అంతేకాదు విదేశీ టెక్నిషియన్లను ప్రాధాన్యత ఇస్తున్న టైంలో.. స్వదేశీ వాళ్లకు అవకాశం ఇవ్వాలని మేకర్లు భావించారు. అలా కరోనా టైంలో ప్యూర్ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టుగానూ పుష్ప ది రైజ్ గుర్తింపు దక్కించుకుంది. 👉కరోనా వైరస్ టైంలో అష్టకష్టాలు పడినా రిలీజ్ విషయంలోనూ అనుకున్నది జరగలేదు. 2021 పంద్రాగష్టు వారంలో విడుదల చేయాలనుకుంటే.. అది కాస్త డిసెంబర్ 17కి చేరింది. పుష్ప ది రైజ్ లాంటి సినిమా తీయడం అసమాన విషయం. నా ఒక్కడికే కాదు రెండేళ్లపాటు ఈ చిత్రం కోసం పని చేసిన వాళ్లందరికీ ఇది నాలుగు చిత్రాలతో సమానం. ::: పుష్ప ప్రమోషన్లో అల్లు అర్జున్ 👉2021 డిసెంబర్లో అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయ్యింది పుష్ప ది రైజ్. అయితే.. రిలీజ్ అయ్యాక తెలుగులో మిక్స్డ్ రివ్యూస్ రాబట్టింది. కానీ, హిందీతో పాటు మిగతా భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.👉ముఖ్యంగా డీఎస్పీ అందించిన పాటలు.. అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యి గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం ఆ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. బన్నీ స్టెప్పులు రీల్స్ రూపంలో సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇంకోవైపు.. ‘‘తగ్గేదే లే’’, ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు”లాంటి డైలాగులు పొలిటికల్ గానూ ఒక ఊపు ఉపడం గమనార్హం. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)#PushpaCelebrityFanatics" Now a days, all around everyone discussing about one film #Pushpa " ❤️🔥When Defence Minister of India @rajnathsingh ji mentioned about Pushpa euphoria & dialogue. This shows to what extent the reach & impact @alluarjun made 🙏💥 pic.twitter.com/Cuu1K0TXnX— Ghouse Allu Arjun fans Wgl (@AlluWgl) October 23, 2024👉సుకుమార్ ‘పుష్ప ది రైజ్’.. 2022లో రష్యన్ భాషలో డబ్ అయ్యి అక్కడి థియేటర్లలో సందడి చేసింది. అంతేకాదు అదే ఏడాది మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ‘‘బ్లాక్‌బస్టర్ హిట్స్ ఫ్రమ్ ఎరౌండ్ ది వరల్డ్’’ కేటగిరీలో ప్రదర్శితమైంది. అలా పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసుకుంది.👉హిందీలో పుష్ప కేరక్టర్‌కు డబ్బింగ్ చెప్పింది నటుడు శ్రేయాస్ తల్పడే. తమిళంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ కేపీ శేఖర్ చెప్పారు. ఇక మలయాళంలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు నుంచి మలయాళంలో డబ్ అయ్యే ఆయన ప్రతీ చిత్రానికి ఫిల్మ్ మేకర్ జిస్ జాయ్ వాయిస్ ఇస్తున్నారు. పుష్పకి కూడా ఆయనే డబ్ చెప్పారు. 👉షెకావత్ కేరక్టర్‌కు ఒక్క హిందీలో తప్ప(రాజేష్ ఖట్టర్) మిగతా అన్ని భాషల్లో ఫహద్ ఫాజిల్ సొంత వాయిస్ ఇచ్చుకున్నారు. ఈ కేరక్టర్‌కు సుకుమార్ మొదట బెంగాలీ నటుడు ‘జిషు సేన్ గుప్తా’(భీష్మ ఫేం) అనుకున్నారు. ఆ తర్వాత కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో.. విక్రమ్, మాధవన్, ఆర్య, బాబీ సింహా ఇలా పలువురి పేర్లను పరిశీలించారు. చివరకు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌తో సుకుమార్ ఫిక్స్ అయ్యారు.:: వెబ్ డెస్క్ ప్రత్యేకం -
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి.. కానీ ఇక్కడ ఒక్కరు కూడా..?
ప్రపంచంలోని చూడచక్కని దీవుల్లో ఇదొకటి. ఈ దీవి చుట్టూ అందమైన పగడపు దిబ్బలు కనువిందు చేస్తాయి. దీవి తీరం దాటి లోపలకు వెళితే, పచ్చని చెట్లు, రకరకాల అరుదైన పక్షులు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇక్కడ ఎలాంటి కట్టడాలూ కనిపించవు. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ దీవి పేరు ‘పామీరా’ దీవి.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి. అయితే, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేదు. ప్రస్తుతం ఇది అమెరికా అధీనంలో ఉంది. ఈ దీవి గురించి న్యాయపోరాటాలు కూడా జరిగాయి. చివరకు అమెరికా ప్రభుత్వం 2000 సంవత్సరంలో 27.26 మిలియన్ డాలర్లు (రూ.228.49 కోట్లు) చెల్లించి దీనిని సొంతం చేసుకుంది.ఈ దీవి అమెరికా ప్రభుత్వం అధీనంలోకి వచ్చినా, ఇక్కడ మనుషులెవరూ ఉండరు. దీనికి గల చీకటి చరిత్రే అందుకు కారణం. ఈ దీవి అందానికి ముగ్ధులైన కొందరు ఔత్సాహికులు ఇదివరకు అప్పుడప్పుడూ వచ్చేవారు. వారిలో కొందరు అంతుచిక్కని కారణాలతో మరణించారు. మరికొందరు ఎలాంటి ఆచూకీ లేకుండా గల్లంతైపోయారు. అందువల్ల ఈ దీవి ఎంత అందంగా ఉన్నా, ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదభరితంగా ఉన్నా ఇక్కడ అడుగుపెట్టాలంటేనే జనాలు భయంతో వణికిపోతారు. అయితే, అప్పుడప్పుడు కొందరు శాస్త్రవేత్తలు బృందాలుగా ఇక్కడకు వచ్చి, పరిశోధనలు జరిపి వెళుతుంటారు. వారు కూడా ఇక్కడ రాత్రివేళల్లో బస చేయరు.ఇది కిరీటం కాదు.. లైటర్!చూడటానికి కిరీటం పైభాగంలా కనిపిస్తోంది గాని, నిజానికి ఇది సిగార్ లైటర్. ఇందులో విశేషమేంటనేగా మీ అనుమానం? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగార్ లైటర్. మిగిలిన లైటర్ల మాదిరిగా ఇదేమీ తేలికపాటి లైటర్ కాదు. దీని బరువు దాదాపు అరకిలో ఉంటుంది. దీని తయారీకి 400 గ్రాముల మేలిమి బంగారం, 41 కేరట్ల బరువు గల 152 అరుదైన నీలాలను ఉపయోగించారు.ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘ఎస్.టి.డ్యూపాంట్’ ఈ సిగార్ లైటర్‌ను ‘లూయీ గీఐఐఐ ఫ్లర్ డి పార్మ్’ పేరుతో హాంకాంగ్ వ్యాపారవేత్త స్టీఫెన్ హంగ్ ఆర్డర్‌పై 2013లో ప్రత్యేకంగా తయారు చేసింది. దీని తయారీ కోసం ఎనబై మంది నిపుణులైన స్వర్ణకారులు ఆరునెలల పాటు అహర్నిశలు శ్రమించారు. దీని ధర 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.19 కోట్లు).అయితే, షోకేసులో అలంకరించుకోవడానికే తప్ప తేలికగా వాడుకోవడానికి అనువుగా లేకపోవడం దీని లోపం. అందుకే, ఇదే కంపెనీ వాడుకోవడానికి అనువుగా ఉండే పరిమాణంలో ఇదే నమూనాలో నీలాలు పొదిగిన బంగారంతో తయారు చేసిన చిన్న లైటర్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి 15,900 డాలర్లు (రూ.13.33 లక్షలు) -
డయాబెటిక్ న్యూరోపతికి లక్షణాలు ఇవే
-
రావికమతం మండలం కొమిర వద్ద బయట పడిన సొరంగం
-
టాప్ టెన్ మోస్ట్ పాపులర్ కె-పాప్ గ్రూప్స్ (ఫోటోలు)
-
10 Best Hill Stations In India: భారతదేశంలోని అందమైన హిల్ స్టేషన్లు (ఫోటోలు)
-
ఈ విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
భారతదేశంలోనే మొట్టమొదటిగా..! (ఫోటోలు)
-
World Longest Train Trips: ప్రపంచంలోని పొడవైన రైలు ప్రయాణాలు (ఫోటోలు)
-
వేర్వేరు ఏడాదుల్లో పుట్టిన కవలలు.. ఇదెలా సాధ్యం?
సాధారణంగా కవల పిల్లలంటే కొన్ని నిమిషాల తేడాతోనే, లేక గంటల వ్యవధిలోనే పుడుతుంటారు. కానీ న్యూజెర్సీలో మాత్రం గమ్మత్తైన సంఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణీకి రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. అదేంటి కవల పిల్లలు ఏడాది తేడాతో పుట్టడమేంటి అనుకుంటున్నారా..?అవును మీరు చదివింది నిజమే. వివరాల ప్రకారం.. న్యూజెర్సీకి చెందిన బిల్లి హంఫ్రీ, అతని భార్య ఈవ్ ఈ ఏడాది నూతన సంవత్సరంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. నిండు గర్భిణీ అయిన ఈవ్‌కు డిసెంబర్ 31న పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త ఏడాదికి కొన్ని నిమిషాల ముందు రాత్రి 11.48 నిమిషాలకు ఓ బాబు జన్మించగా, మరుసటి రోజు 12:28 నిమిషాలకు మరో బాబు జన్మించారు. దీంతో కేవలం 40 నిమిషాల తేడాతో ఇద్దరు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టినట్లయ్యింది. ఇది తమకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని ఈవ్ దంపతులు పేర్కొన్నారు. అయితే తన ఇద్దరు పిల్లలు పేరుకు మాత్రమే కవలలని, వారి ముఖ కవలికల్లో, దినచర్యలోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తుందని, ఇదో విచిత్ర అనుభవం అని తెలిపారు. మొదటి బాబు ఎజ్రా 6 పౌండ్ల బరువుతో ఉంటే, అతని తమ్ముడు ఎజెకియల్ 4 పౌండ్ల బరువుతో ఉన్నాడని వివరించారు. కాగా అయితే కవలలు ఇలా కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక రోజు, ఒక నెల, ఒక ఏడాది తేడాతో వేర్వేరుగా జన్మించడం ‘20 లక్షల్లో ఒక్క ఛాన్స్’ అని వైద్యులు అంటున్నారు. -
భారతదేశంలోని అత్యంత అందమైన గ్రామాలు చూసారా..? (ఫోటోలు)
-
అత్యంత ఖరీదైన మొక్కలు ధర మీకు తెలుసా..? (ఫోటోలు)
-
కలికాలం అంటే ఇదే..అమెరికాలో చద్దన్నంకి సూపర్ క్రేజ్
పెద్దల మాట.. సద్దన్నం మూట అంటారు. అంటే పెద్దవాళ్లు ఏం చెప్పినా మంచే చెబుతారన్నది దాని సారాంశం. ఇప్పుడంటే మనకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోస, వడ వంటి పదార్థాలు వచ్చాయి.. కానీ పాతకాలం రోజుల్లో అందరూ చద్దన్నమే తినేవాళ్లు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదంటారు. అందుకే ఇప్పుడు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పల్లెటూరి బ్రేక్‌ఫాస్ట్ చద్దన్నంకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ డబ్బులిచ్చి మరీ చద్దన్నంను కొనుగోలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి చాలామందిని మళ్లీ పాతకాలం అలవాట్లవైపు తిప్పింది. ఒకప్పుడు గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ చద్దన్నం కల్చర్ ఇప్పుడు నగరాలకు, విదేశాలకు కూడా పాకింది. అందుకే ఇప్పుడు కొన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నాయి. ఆన్లైన్ ఆర్డర్స్లోనూ చద్దన్నం స్పెషల్ మెనూ లిస్ట్‌లో చేరిపోయింది. ఒకప్పుడు రాత్రి మిగిలిన అన్నం పొద్దున తినడం అంటే నామోషీగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇందులో ఉన్న పోషక విలువలు తెలుసుకున్నాక చద్దన్నం తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలోనూ చద్దన్నం భారీ ధరకు అమ్ముడవుతుంది. దీనికి సంబంధించిన ఓ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని ఓ స్టోర్‌లో చద్దన్నం దాదాపు వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారని, కలికాలం అంటే ఇదేనంటూ ఓ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పటికే 4.2 వ్యూస్‌తో నెట్టింట హల్చల్ చేస్తుంది. దీంతో మరోసారి చద్దన్నంపై చర్చ నడుస్తుంది. ఇంతకీ న్యూట్రీషియన్స్ పరంగా చద్దన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. ►చద్దన్నంలో ఐరన్, కాల్షియం,పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ► అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది ► యాంగ్జయిటీని దూరం చేయడంతో చద్దన్నం కీ రోల్ పోషిస్తుంది. ► ఒంట్లో వేడిని తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ► ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత నుంచి బయటపడొచ్చు ► చద్దన్నం తింటే అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు దూరమవుతాయి ► ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. ► తరచూ చద్దన్నం తింటే బద్దకం, నీరసం లేకుండా ఉంటుంది. చద్దన్నం ఇలా తయారుచేయాలి? రాత్రి మిగిలిన అన్నాన్ని మట్టి పాత్రలో ఉండలు లేకుండా ఉంచుకోవాలి. దీంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తర్వాత కొన్ని గోరువెచ్చని పాలు, పెరుగు, నాలుగైదు పచ్చి మిరపకాయలు కొంచెం ఉప్పు వేసి కలియబెట్టాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా కదలించకుండా ఉంచాలి. పెరుగు పులియడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ప్రొబ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే రుచిగా ఉండటంతో పాటు శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి మరి. View this post on Instagram A post shared by Bigg boss telugu spy, Spy Akka (@biggbossteluguspy) -
పిజ్జాతో రికార్డ్ బ్రేక్, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..
పిజ్జా.. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఫేవరెట్ రెసిపి. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్ రికార్డ్ కోసం ఇద్దరు ఫ్రెంచ్ చెఫ్‌లు చీజీ మాస్టర్ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్‌లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్ఎయిర్లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్‌లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ వెయ్యి చీజ్‌లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు. ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్‌లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్‌కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్‌ను పిజ్జాపై టోపింగ్ చేసి ఈ వెరైటీ డిష్‌ను అందించారు. -
చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంటుందా? యూకేలో వింత ఘటన
చనిపోయిన తర్వాత మళ్లీ బతకడం సాధ్యమేనా? కానీ ఈ వింత సంఘటన నిజంగానే జరిగింది. లండన్‌కు చెందిన ఓ మహిళ చనియినట్లు నిర్థారించిన 40 నిమిషాల తర్వాత ప్రాణాలతో బయటపడింది. స్పృహలో లేని ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఆమె తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో సోషల్ మీడియాలో పంచుకుంది. ''చనిపోయాక మనిషికి ఇంకో జన్మ ఉంటుందా? అనిపిస్తుంది. ఎందుకంటే మళ్లీ బతుకుతాను అన్న ఆశ లేని సమయంలో జీవితం మరో అవకాశాన్ని ప్రసాదించింది. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా భర్త స్టూ, నేను డిన్నర్ డేట్‌కు ప్లాన్ చేసుకున్నాం. ఇంకాసేపట్లో బయలుదేరుతున్నాం అనుకునేలోపు సోఫాలో కుప్పకూలిపోయాను. స్టూ ఎంత పిలుస్తున్నా నాలో ఎలాంటి చలనం లేదు. నా ఆత్మ నా శరీరం నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. ఇంతలో నన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లడం, వాళ్లు పరీక్షించి బతికే అవకాశాలు లేవని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. నా కుటుంసభ్యులకు కూడా ఇదే విషయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పారు. నన్ను పరీక్షించిన తర్వాత చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు కూడా. కానీ నన్ను నేనే నమ్మలేకపోతున్నా. కోమాలోకి వెళ్లిన దాదాపు 40 నిమిషాల తర్వాత నాకు స్పృహ వచ్చి ఇప్పుడు మళ్లీ మామూలు మనిషి అయిపోయాను'' అంటూ క్రిస్టీ బోర్టోస్ తెలిపింది. ఆమె చనిపోయిందని ప్రకటించిన 40 నిమిషాల తర్వాత క్రిస్టీ ప్రాణాలతో బయటపడడం డాక్టర్లను కూడా ఆశ్చర్యపరిచింది. మెదడుకు 5 నుంచి 10 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోతే మనిషి బతికే ఛాన్స్ లేదు. మరి క్రిస్టీ విషయంలో జరిగిన మెడికల్ మిరాకిల్ ఏంటన్నది ఇప్పటికీ వైద్యులకు అర్థం కావడం లేదు. గతంలోనూ పలుమార్లు ఆమె గుండెపోటుకు గురయ్యింది. అలాంటిది దాదాపు చావు వరకు వెళ్లి తిరిగిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోతే దెబ్బతింటుంది. కానీ క్రిస్టీని పరీక్షించినప్పుడు ఆమెకు గుండె, ఊపిరితిత్తులు, మెదడు అన్నీ అవయవాలు బాగానే ఉన్నాయని పరీక్షల్లో వెల్లడి కావడం మరో ఆశ్చర్యం. -
నీలివర్ణంతో తళుక్కునే మెరిసే పాలపిట్ట.. అందుకే అంత స్పెషల్
పాల పిట్ట చుట్టూ ఎన్ని కథలో.. పసిడి పంటల్లే పచ్చని రంగునలుముకుంది, ఆకాశమళ్లే నీలి రంగు పులుముకుంది,అశ్వినీ మాసంలో అడుగులెడుతుంది,శుక్ల పక్షంలోశోభనిస్తుంది..పంటచేనుల్లో పరుగులెడుతుందివిజయ దశమికి విజయాలనిస్తుంది! ప్రపంచానితో పోటీ పడనంటుంది,నాగరికతతో నగరాలకు దూరమవుతుంది. అందాల హరివిల్లై విశ్వమంతా విస్తరించింది.పసిడి పరువాల విహంగం అద్భుతాల పాల పిట్ట !! దసరా రోజు.. పాలపిట్టను చూడకుంటే ఆ పండగకు అర్థమే లేదని చిన్న వెలతి ఉంటుంది. దాని ప్రత్యేకత అలాంటిది మరి! ఓటమి మీద గెలుపుకు నిదర్శనంగా చేసుకునే దసరా పండగ రోజు పాల పిట్టను చూస్తే ఎన్నో విజయాలతో పాటు సుఖ సంతోషాలు వరిస్తాయని అంటారు. అంటే పక్షులు కేవలం ప్రకృతిలో ఉండే ఒక జీవ రాశి మాత్రమే కాదు అవి మనుషుల జీవన విధానాలతో సంప్రదాయాలతో మమేకమై ఉంటాయి అన్నదానికి పాల పిట్ట ఒక ఉదాహరణ.అలాగని ఇది ఒక్క భారత దేశంలోనే కనిపించే పక్షి కాదు. కెనడా, అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన పసిడి, నీలం లాంటి రంగుల కలయికతో కనిపిస్తుంది. భారత దేశంలో పాల పిట్టకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిచుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు కూడా ముడిపడి ఉన్నాయి. పాలపిట్టతో మనిషికి యుగయుగాల సంబంధం ఉందంటే విడ్డూరమే కదా? కానీ ప్రతి యుగంలోనూ, పురాణ, ఇతిహాసాల్లో పాల పిట్ట ప్రస్తావన ఎదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది.దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల పిట్టను నీల కంఠ పక్షి అని పిలుస్తారు(నీల కంఠ అంటే శివుడికి ఉన్న మరో పేరు) దాని గొంతు విషం తాగిన తర్వాత మారిన శివుడి గొంతు (నీలం) రంగులో ఉండటమే కారణం. అలాగే త్రేతా యుగంలో రాముడు రావణాసురుని మీద యుద్దానికి వెళ్లే ముందు పాల పిట్ట ఎదురు వచ్చిందట. అందుకే రాముడు రావణాసురుడిని చంపిన రోజు చెడు మీద మంచి విజయం సాధించిన రోజుకి ఆదర్శంగా దసరాగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం అయ్యింది. అదే రోజు పాల పిట్టలు ఎక్కడ ఉన్నా గ్రామాల్లోని పంట చేన్లలో, ఊరి పొలిమేరల్లో తిరగడం జరుగుతుంది. అశ్విని మాసంలో (అక్టోబర్ నెల) లో పంటలు చేతికి వచ్చే కాలం, అదే సమయంలో నవరాత్రులు, దసరా పండగలు జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఈ పాల పిట్టలు ఆహారం కోసం ఆ సమయాల్లో ఊర్లలో పంట పొలాల్లో కనిపిస్తాయి. పండగలు వాటి ప్రత్యేకతలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే.ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలన్నీ జమ్మీ చెట్టు మీద దాచి ఉంచుతారు. అప్పుడు ఇంద్రుడు పాల పిట్టలా మారి ఆ చెట్టు మీద పాండవుల ఆయుధాలకు రక్షణగా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటారు. అందుకే దసరా రోజు ఆయుధ పూజ అంటే అన్ని కుల వృత్తుల వారు వారి వారి జీవన ఆధారాలకు సంబందించిన వాటికి పూజలు చెయ్యడం కూడా జరుగుతుంది. ఇలా ఒక్కో యుగంలో ఒక్కో ప్రాంతానికి చెందిన సంప్రదాయాలతో ఒకే నెలలో జరిగే పండుగలకు పాల పిట్టకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే పాల పిట్ట అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది మనుషుల సాంఘిక సమైక్యతను ప్రతిబింబిస్తుంది. ఒక భావోద్వేగం. పాల పిట్ట జీవన విధానం మనకు ఒక చిన్నపాటి పాఠం లాంటింది దాన్ని నిశితంగా పరీక్షిస్తే అది ఉదయం లేవగానే దాని చుట్టూ ఉన్న పరిస్థితులపైన నిఘా వేస్తుంది. ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయి, అది నివసించే ప్రాంతం సురక్షితంగా ఉంటుందా? ఉండదా? అని విశ్లేషించుకుంటుంది. దాని పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కానీ అవసరానికి అది దాని పరిమాణం రెండింతలు రెట్టింపు చేస్తుంది. పాల పిట్టలు ఎప్పుడు కూడా ఒక సమూహంలో ప్రయాణం చేస్తాయి అందువల్ల మిగతా బలవంతమైన పక్షులు దాడి చేసినప్పుడు కలిసి కట్టుగా పోరాడుతాయి. మనుషులు కూడా సామాజిక సాంఘిక జీవితంలో సంఘటితమై జీవించాలని అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిబడొచ్చు అని మనకు చూపిస్తాయి. పాల పిట్టల గొంతు దూకుడుగా ఉన్నా ఒకదానితో ఒకటి ఎంతో మృదు స్వభావంతో పలకరించుకుంటాయి. అందుకే పాల పిట్టలు నమ్మకానికి ఐక్యమత్యానికి ప్రతీకలు. ఎంతో ఎత్తులో ఎగురుతున్నా కూడా నెల మీద వాటి ఆహారం మీద దృష్టిని మాత్రం పోగొట్టుకోవు. వాటి కంటి చూపు చాలా సూక్షమైన క్రిమి కీటకాలను కూడా గుర్తిస్తాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న వాన పాములు వీటి ఆహారం. చెట్లు వీటి ప్రాథమిక నివాస స్థలాలు అందుకే ఇవి ఎక్కువగా అడవుల్లో ఉద్యానవనాల్లో నివసిస్తాయి ఆహారం కోసం నీటి పరివాహక ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. పక్షులు మన చుట్టూ కనిపించకపోవడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే గుర్తొస్తుంది. కానీ అవి అంతరించిపోతున్నప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని మనుషుల జీవన ప్రమాణాలు కూడా మెల్లి మెల్లిగా అంతరించి పోతున్నాయనే విషయం చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో విరివిగా విచ్చల విడిగా, చిన్న చిన్న నగరాలలోని ఉద్యానవనాల్లో చెట్ల మీద కనిపించిన పాల పిట్ట ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో కనిపిస్తే మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం. మరికొంత మంది వీటిని పంజరాల్లొ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే దానికున్న ప్రత్యేకతలు అలాంటివి. అలాగే మనం నాగరిత ముసుగులో అడవులను, చెట్లను దూరం చేస్తూ వాటి మీద ఆధారపడుతున్న పక్షులను జంతువులను కూడా దూరం చేసుకుంటున్నాము. రచయిత : ప్రదీప్ మాడురి ఫోటో : అల్బిన్ జాకబ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
ఊబకాయానికి విరుగుడీ మాత్ర!
స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే. అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్ కలిగించే ట్యాబ్లెట్స్ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం.. సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్పి-1 వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది. దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్‌ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్‌గా మెదడుకు హార్మోన్లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు. ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తోందని సీనియర్ సైంటస్ట్ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. పిల్లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్, ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు. -
బోర్ కొడుతుందా? వెరైటీగా ఇలా ట్రై చేయండి..
సాధారణంగా మీకు బోర్ కొడితే ఏం చేస్తారు? సోషల్ మీడియాలోకి దూరిపోయి ఇన్‌స్టా రీల్స్ చూడటమో, వీడియో గేమ్స్ ఆడటమో చేస్తుంటాం. లేదా మరీ బోర్ కొడితే సరదాగా సినిమాలు,సిరీస్‌లు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇవి ఎప్పుడూ చేసే పనులే. ఖాళీగా ఉన్నప్పుడే క్రియేటివ్ ఆలోచనలు బయటపడతాయి. అందుకే ఈసారి మీకు బోర్ కొడితే కాస్త వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి. ►రూమ్ క్లీనింగ్ అనేది ఓ మంచి థెరపీ లాంటిది. మీకు బోర్ కొట్టినప్పుడు మీ క్లాసెట్ను ఓపెన్ చేసి బట్టలు అన్నీ చక్కగా సర్దుకోండి. ఇలా చేస్తే మీకు మంచి టైంపాస్ అవడంతో పాటు ఓ పెద్ద టాస్క్ కూడా కంప్లీట్ అయినట్లుంటుంది. మనం ఉండే రూమ్, వాడే వస్తువులను నీట్‌గా, ఆర్డర్లో పెట్టుకుంటే ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా అబ్బుతాయి. ► మీ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి కాసేపు సరదాగా మాట్లాడుకోండి. కొన్నిసార్లు బిజీ లైఫ్‌లో పాత ఫ్రెండ్స్‌ని మర్చిపోతుంతాం. అందుకే బోరింగ్‌గా ఫీల్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ లిస్ట్‌ని గుర్తు చేసుకొని ఆడియో, లేదా వీడియో కాల్ చేసి తనివితీరా మాట్లాడండి. ► కొత్త రెసిపీ ప్రయోగం చేయండి. వంట చేస్తున్నప్పుడు మన దృష్టి అంత దానిమీదే ఉంటుంది కాబట్టి కొత్తగా ఏం చేయాలి? ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడాలి అన్న ఆలోచనలు వస్తాయి. మీకు బేకింగ్ ఇష్టమైతే, కుకీస్, కప్ కేక్స్ వంటివి ట్రై చేసి చూడండి. ► మీ దగ్గర బోలెడన్ని బట్టలు ఉన్నాయా? పాత బట్టలు ఏం చేయాలో తెలియకుండానే, కొత్తవి అవసరం లేకపోయినా కొంటున్నారా? అయితే ఓ పని చేయండి. మీకు అవసరం లేవు అనుకున్న బట్టలను లేనివాళ్లకు అయినా సహాయం చేయండి. కొంతమంది ఒక్కసారి వేసిన అవుట్‌ఫిట్స్‌ను మళ్లీ రిపీట్ చేయడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్లు చాలా బట్టలు ఇతరులకు హెల్ప్ చేయగలిగితే మంచిది. మీకు బొర్ కొట్టినప్పుడు మీ పాత దుస్తులు, ఫర్నీచర్.. ఇలా అవసరం లేని వస్తువులను ప్యాక్ చేసి చారిటీకి ఇవ్వడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండానే ఎంతోమందికి సహాయం చేసిన వాళ్లవుతారు. ►ఖాళీగా ఏం చేయాలో తెలియడం లేదా? అయితే మీ క్రియేటివి మొత్తం బయటకు తీయడానికి ఇంతకన్నా బెస్ట్ టైం దొరకదు. క్రాఫ్ట్స్‌లో అసలు సమయమే కనిపించదు. ఇంట్లోనే క్యాండిల్స్ చేయడం, ఇంటికి అవసరమైన వస్తువులను సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో గూగుల్‌లో వెతకండి. దీనివల్ల మీ టైంని కరెక్ట్‌గా ఉపయోగించుకున్నవాళ్లవుతారు. ► బోర్ కొడుతుంది..కానీ బయటికి వెళ్లే మూడ్ లేదా? అయితే ఇంట్లోనే కూర్చొని నేషనల్ పార్క్‌లను ఓ లుక్కేయండి. మన దేశంలోనే ఎన్నో అందమైన పార్కులు ఉన్నాయి. NationalParks.org అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే బోలెడన్నీ పార్కులు లైవ్‌గా ఇంట్లోనే చూసి ఆస్వాదించొచ్చు. వీటితో పాటు ఎన్నో పర్యాటక ప్రదేశాలను కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని వీక్షొంచొచ్చు. ► మీకు బోర్ కొట్టినప్పుడు కాస్త పెరట్లోకి వెళ్లి ఓ హాయ్ చెప్పేసి రండి. అదేనండి మీ మొక్కలకు. గార్డెనింగ్‌లో మునిగిపోతే అసలు సమయమే కనిపించదు. కొత్త మొక్కలు నాటడం, ఉన్నవాటికి నీళ్లు పట్టడం, పాడైనవి తీసేయడం వంటివి చేయండి. రెగ్యులర్‌గా చేస్తూ ఇదొక రొటీన్‌లా మారిపోతుంది. ► చాలా సమయాన్ని ఏం చేయాలో తెలియక వృథా చేస్తుంటాం. బోర్ కొట్టినప్పుడు అయినా అసలు భవిష్యత్తులో ఏం చేయాలి? ఇప్పటివరకు ఏం చేశాం, నెక్ట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది అనే విషయాలపై దృష్టి పెడితే మంచిది. కొత్త భాష నేర్చుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం, కొత్త లక్ష్యాలు ఏర్పరుచుకోవడం.. ఇలా మీ ఇంట్రెస్ట్‌కి తగ్గట్లు ఓ చార్ట్ ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్లు మీ సమయాన్ని కేటాయిస్తే కొన్ని రోజుల్లోనే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. -
కోట్లల్లో పెరిగిపోతున్న పెట్ డాగ్స్ ఇండస్ట్రీ..
పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ భారత్‌లో ఏటా 13.9% పెరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్లలో ఒకటని ఇండియన్ పెట్ ఇండస్ట్రీ జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ (IPICA) పేర్కొంది. దీనికి సంబంధించి జస్ట్ డాగ్స్ మార్కెటింగ్ హెడ్ కషాప్ సంఘాని మాట్లాడుతూ..గతంలో వెటర్నరీ క్లినిక్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెట్ కేర్ మార్కెట్ విస్తృతంగా అభివృద్ది చెందుతుంది. ఐదేళ్ల క్రితం భారతదేశంలో దత్తత తీసుకున్న పెంపుడు జంతువుల సంఖ్య 28 మిలియన్లు ఇప్పుడు 38 మిలియన్లకు చేరుకుందని, వచ్చే ఐదేళ్లలో అదే సంఖ్య 45 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పెంపుడు జంతువుల పరిశ్రమ మొత్తం రూ. 8000 కోట్లని, అందులో 65% భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారమని మార్కెట్ అని పేర్కొన్నారు. భారతీయ పెంపుడు జంతువుల పరిశ్రమ ప్రకారం.. పెంపుడు పిల్లల సంరక్షణ కోసం పెట్ పేరెంట్స్ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత దత్తత తీసుకోవడం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం, పెంపుడు జంతువులను ఇంట్లో పిల్లలతో సమానంగా పరిగణిస్తున్నారు. వాటి సంరక్షణ కోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తున్నారు. పెంపుడు జంతువుల కోసం నెలకు సగటున రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది. వాటి ఆహారం, దుస్తులు, మందులు,బొమ్మలు.. ఇలా వాటి జాతి, వయస్సు, నగరాన్ని బట్టి ఖర్చు మారుతుంది. బడ్జెట్లో దాదాపు 70%-75% ఎక్కువగా పెట్స్ కోసం ఫుడ్, ట్రీట్మెంట్ కోసమే ఖర్చవుతుంది. పెంపుడు జంతువుల దత్తత పెరగడం ప్రధాన నగరాల్లో మాత్రమే కాదు. ఇది టైర్ 2 మరియు 3 నగరాలకు కూడా విస్తరించింది. దీంతో గత రెండేళ్లలో కొత్తగా 70 పెట్ కేర్ కంపెనీలు ఆవిర్భవించాయి. పెంపుడు కుక్కలలో 6% కుక్కలకు మాత్రమే బ్రాండెడ్ ఆహారం ఇస్తారు. మిగిలినవి దాదాపు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటాయి. ఇక పిల్లుల్లో 2% వాటికి మాత్రమే బ్రాండెడ్ ఆహారం తింటాయని డాగ్-ఓ-బో సహ వ్యవస్థాపకుడు ఇబాదత్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..15 ఏళ్ల క్రితం గ్రూమింగ్ సెలూన్లు లేవు. అప్పట్లో చైనా నుంచి కొన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పెట్ గ్రూమింగ్ సెలూన్లు చాలా ఉన్నాయి. అన్ని ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెట్ డాగ్స్ కోసం స్విమ్మింగ్ పూల్,ప్రత్యేక ఆహారం, డాగ్ ట్రైనర్లు, డాగ్ సిట్టర్లు, డాగ్ రిసార్ట్స్, డాగ్ గ్రూమింగ్ సెలూన్లు, నోబిల్ ట్రీట్మెంట్ వ్యాన్లు, పెట్ ఫుడ్ ఇలా ఎన్నో వచ్చేశాయి. అంతేకాకుండా ఇప్పుడు పెంపుడు జంతువులను రవాణా చేసే స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లు ఉన్నాయి. TRASNFERET మొబిలిటీ జనరల్ మేనేజర్ బిజు వర్గీస్ ప్రకారం.. గత ఎనిమిదేళ్లలో వారు దాదాపు 8500 పెంపుడు జంతువులను రవాణా చేసినట్లు తెలిపారు. పెట్ కేర్‌లో ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో త్వరలోనే సెవెన్ ఓక్స్ పెట్ అనే అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ పెట్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ పార్టనర్ అర్చన నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికి ఇది రెడీగా ఉంటుందని ఆమె పేర్కొంది. హైదరాబాద్‌ను వెటర్నరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారని అమెరికికు చెందిన ప్రముఖ వెటర్నరీ డాక్టర్ శ్రీరెడ్డి తెలిపారు. ఇందులో యానిమల్ బ్లడ్ బ్యాంక్, ఎలక్ట్రిక్ శ్మశానవాటిక వంటి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. -
అర్థరాత్రుళ్లు.. ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా? దీనివల్లే కావొచ్చు
కొంతమందికి ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఓ పట్టాన నిద్రపట్టదు. మరికొందరు నిద్రలేమి సమస్యతో తెగ ఇబ్బంది పడతారు. ఇంకొందరు అర్థరాత్రుళ్లు 1-4 గంటల మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు మేలుకుంటారు. ఆ తర్వాత ఎంత నిద్రపోదాం అని ప్రయత్నించినా నిద్రపట్టదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. రాత్రి పడుకున్నామంటే తెల్లారే వరకు లేవకూడదు. అలా అయితేనే మంచి నిద్ర పట్టినట్లు. నిద్రలో పదేపదే మెలకువ వస్తే వారు జాగ్రత్త పడాల్సిందే. అర్థరాత్రుళ్లు మనం లేచే సమయాన్ని బట్టి మనం ఏ విషయం గురించి ఆందోళన చెందుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చట. అర్థరాత్రి 1 గంటలకు.. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో సాధారణంగా గాఢ నిద్రలో ఉంటారు. కానీ ఆ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీరు మానసికంగా చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు అర్థం. 2 గంటలకు.. ఈ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీ శరీరం చాలా అలిసిపోతుందని, దానికి కాస్త రెస్ట్ అవసరమని గ్రహించాలి. దీనికోసం ఎక్సర్సైజ్, మంచి డైట్ వంటివి రెగ్యులర్ రొటీన్లో అలవాటు చేసుకోవాలి. 3 గంటలకు.. తెల్లవారుజామున 3 గంటలకు మెలవకువ వస్తుందంటే కాస్త భయానకంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయాన్ని డెవిల్స్ అవర్ అని పిలుస్తారు. ఈ సమయంలో ఆత్మలు కలలోకి వస్తాయని కొందరి విశ్వాసం. అయితే మరికొందరు పరిశోధకులు మాత్రం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేవడం మంచిదని సూచిస్తున్నారు. ఇది ధ్యానం చేయడానికి సరైన సమయంగా చెబుతున్నారు. ఎంత త్వరగా పడుకుంటే అంత త్వరగా నిద్రలేవొచ్చు అని, కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే అంటున్నారు. రాత్రి 3.30 నిమిషాలు ఈ సమయంలో నిద్ర లేస్తున్నారంటే మీరు మంచి అభివృద్ది పథంలో కొనసాగుతున్నట్లు అర్థమట. ఈ సమయంలో దేవతలు సంచరిస్తుంటారనే విశ్వాసం కూడా ఉంది. తెల్లవారుజామున 4గంటలకు.. తెల్లవారుజామున 4 గంటలకు ఉలిక్కి పడి లేస్తున్నారంటే మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు అర్థం. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, చాలా నిరాశతో ఉన్నట్లు ఈ సమయం సూచిస్తుందట. ఉదయం 4.30 గంటలకు.. ఈ సమయంలో మీరు మేల్కొనడం మంచిదే అని పరిశోధనల్లో వెల్లడైంది. చాలా పాజిటివ్ మైండ్‌తో జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలకు విశ్వం మీకు మార్గనిర్దేశం చేస్తుందని కొందరి నమ్మకం. ఉదయం 5గంటలకు.. అకస్మాత్తుగా 5 గంటలకు తరచూ లేస్తున్నారంటే జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్యల వల్ల కావొచ్చట. సాయంత్రం వేళల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఇందుకు కారణం. అంతుకే నైట్ టైం లైట్ ఫుడ్‌ను తీసుకోవాలి. ఇలాంటి వాళ్లు రాత్రి 7 గంటలు లేదా అంతకంటే ముందే భోజనాన్ని తినేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. -
భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం
గీతా జయంతి ప్రత్యేకం.. సర్వధర్మములను విడనాడి నన్నే శరణు పొందు. నేను నిన్ను అన్ని పాపముల నుండి విడిపించెదను. నీవు శోకింప తగదు! — అధ్యాయం 18: శ్లో 66 మహర్షి వ్యాసులవారు రచించిన భగవద్గీతకు పరమహంస యోగానంద చేసిన విస్తారమైన అనువాదము, వివరణలో ఆ మహా యోగివర్యులు కృష్ణ భగవానుడు తన శిష్యుడైన అర్జునునికి చేసిన వాగ్దానానాన్ని ఈ విధంగా అనువదించారు; “నీవు అహంకార జనితాలైన కర్తవ్యాలను విస్మరించి, నేను నిర్దేశించిన దివ్య కర్తవ్యాలను నిర్వహిస్తూ, నాలోనే ఆనందిస్తే, విముక్తిని పొందుతావు.” ఆధ్యాత్మిక గ్రంథరాజమైన ‘ఒక యోగి ఆత్మ కథ’ రచయిత, ఒక శతాబ్ది కంటే ఎక్కువ కాలం క్రితమే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించిన పరమహంస యోగానంద ఈ విశ్వంలోని మొత్తం సమాచారం గీతలోని 700 శ్లోకాల్లో నిబిడీకృతమై ఉన్నదనీ, “భగవంతుని చేరుకోవడానికి చేసే ప్రయాణంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, వారి ఆధ్యాత్మిక ప్రయాణంలోని ఆ భాగం పైన గీత తన కాంతిని ప్రసరిస్తుందనీ” వివరించారు. యోగానందగారు గీతా వ్యాఖ్యానం పై తమ పనిని తన గురువు అయిన శ్రీయుక్తేశ్వర్ గిరి, శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు మరియు శ్రీకృష్ణ భగవానుడు గీతలో రెండుసార్లు ప్రస్తావించిన పవిత్ర క్రియాయోగ ప్రక్రియను పునరుజ్జీవింపచేసిన మహావతార్ బాబాజీ తమ అంతర్దృష్టితో చేసిన మార్గదర్శకత్వంలో ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభించారు. యోగానంద ఈ విధంగా విశదపరిచారు; “ఒక దైవ సాక్షాత్కారం పొందిన గురువు సహాయంతో, సహజావబోధాజనిత అంతర్దృష్టితో కూడిన గ్రహణశక్తి అనే ఆడకత్తెరను ఉపయోగించడం ద్వారా భాష ,నిగూఢత అనే గట్టి పెంకును పగలగొట్టి, ధార్మిక బోధలలోని లోపలి సారమైన సత్యాన్ని అందుకోవడం ఎలాగో మనం నేర్చుకోగలుగుతాము.“ 1952 లో జరిగిన తమ మహా సమాధికి కొద్ది నెలల ముందు గీతలోని లోతైన అధ్యాత్మిక భావాల అంతిమ సమీక్ష మరియు వివరణ కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలోని ఒక చిన్న ఆశ్రమంలో ఏకాంతవాసంలో గురుదేవులు చేపట్టారు. “ఆ గదిలోని స్పందనలు (యోగానంద ఈ రచనా వ్యాసంగం చేపట్టిన గదిలో) నమ్మశక్యం కాకుండా ఉన్నాయి; ఆ గదిలోకి వెళ్తుంటే భగవంతుడిలోకి ప్రవేశిస్తున్నట్లే ఉండేది.” అని అక్కడి సన్న్యాసి ఒకరు గుర్తుచేసుకొన్నారు. యోగానంద బృహత్కృషి కేవలం గీతను తన స్వంత భావాల ప్రకారం, మేధస్సుతో మెలితిప్పి అర్థం చేప్పి వివరించడంలో కాకుండా, శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగిన నిజమైన సంభాషణను మహర్షి వ్యాసులవారికి తమ ‘బ్రహ్మానంద స్థితిలోని వివిధ స్థాయిలలో’ ఏవిధంగా వెల్లడి అయిందో దానిని ప్రపంచానికి వివరించడంలో ఉంది. అలా ‘గాడ్ టాక్స్ విత్ అర్జున’ సర్వవ్యాప్త పరమాత్మ (శ్రీకృష్ణుడు) కు, అర్జునుడి రూపంలోని ఒక ఆదర్శ భక్తుడి ఆత్మకు మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. గ్రహించగలిగిన భక్తుడికి మొట్టమొదటి అధ్యాయం నుండే కురుక్షేత్ర యుద్ధం యొక్క చారిత్రక నేపథ్యాన్ని ప్రతి వ్యక్తిలోనూ — ఆత్మతో సంబంధం కలిగిన స్వచ్చమైన విచక్షణాయుత మేధస్సు (పాండు పుత్రులు) కు,అహంకారం అనే మాయకు లోనైన ఇంద్రియబద్ధమైన గుడ్డి మనస్సు (గ్రుడ్డి వాడైన ధృతరాష్ట్రుడు, అతడి కుటిల సంతానం) కు మధ్య — జరుగుతున్న ఆధ్యాత్మిక,మానసిక యుద్ధాన్ని వివరించడానికి పోలికగా ఊపయోగిస్తున్నారని స్పష్టమౌతుంది. కృష్ణుడి (గురువు లేక జాగృతమైన ఆత్మ చైతన్యం, లేక ధ్యాన జనిత సహజావబోధం) సహాయంతో యుద్ధం చేయాలి; భౌతికంగా, మానసికంగా, అధ్యాత్మికంగా ‘రాజ్యాన్ని అహంకారం నుండి, మరియు దుష్ట మానసిక ప్రవృత్తులనే దాని సైన్యం నుండి తిరిగి స్వాధీనపరచుకోవడం,’ తద్ద్వారా సర్వసమర్థ ఆత్మ సామ్రాజ్యాన్ని స్థాపించడం. కృష్ణుడు శోకతప్తుడైన అర్జునునికి నిశ్చయమైన ఓదార్పును అందించినట్టే, యోగానంద ప్రతి నిజమైన అధ్యాత్మిక అన్వేషకుడిలో ఉన్న అర్జునునికి తన అపూర్వమైన పలుకులతో ఈ విధంగా సలహా ఇచ్చారు. ”ప్రతి వ్యక్తీ తన కురుక్షేత్ర యుద్ధాన్ని తానే పోరాడి గెలవాలి. ఇది కేవలం గెలవ తగిన పోరు మాత్రమే కాదు, ఈ విశ్వానికి నిర్దేశింపబడిన దివ్య న్యాయాన్ని అనుసరించి, జీవాత్మకు పరమాత్మతో ఉన్న శాశ్వత సంబంధాన్ననుసరించి, ముందో తరువాతో తప్పక గెలవాల్సిన యుద్ధమిది.” గాడ్ టాక్స్ విత్ అర్జున‘, క్రియాయోగం గురించిన మరింత సమాచారంకోసం:yssofindia.org -
నది మధ్యలో ఫోటోషూట్: అనుకోని అతిథిని చూసి భయంతో యువతి..
ఈరోజుల్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. కళ్లు చెదిరే లొకేషన్లలో అద్భుతమైన సెట్టింగులతో, ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేనకడుగు వేయడం లేదు. సినిమా స్టైల్‌ను తలపించే లైటింగ్స్, ఎఫెక్ట్స్, రిచ్‌నెస్‌తో ఫోటోషూట్స్ పెట్టుకుంటున్నారు. దీనికోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెట్టి ఢిపరెంట్ స్టైల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు అందరి దృష్టని ఆకర్షిస్తున్నాయి. రీసెంట్గా ఓ జంట తీయించుకున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ నదిలో కాబోయే జంట అందంగా ఫోటోలకు ఫోజులిస్తుండగా పాము అనుకోని అతిథిలా ఫ్రేమ్‌లోకి వచ్చింది. దీంతో యువతి భయపడి కేకలు వేయగా, ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పాడు. కాసేపట్లోనే ఆ పాము అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్తం తతంగాన్ని ఫోటోగ్రాఫర్ కెమెరాలో బంధించాడు. వైల్డ్ ఫోటోషూట్ అంటూ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఇప్పటికే 53 లక్షల మంది ఆ వీడియోను చూశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పాము ఒంటిపై నుంచి వెళ్లినా అదరకుండా, బెదరకుండా చాలా చిల్ మూడ్‌లో ఉన్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పామును చూసి ఆ అమ్మాయి భయపడినప్పుడు ఆమె కాబోయే భర్త ధైర్యం చెప్పిన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by 🅟🅐🅡🅢🅗🅤 🅚🅞🅣🅐🅜🅔 🅟🅗🅞🅣🅞🅖🅡🅐🅟🅗🅨 (@parshu_kotame_photography150) -
ట్రావెలింగ్‌లో బెస్ట్.. ఈ కెటిల్‌ని మడిచి బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు
డ్రై బర్న్ ప్రొటెక్షన్, ఆటోమేటిక్ షట్ ఆఫ్ వంటి ఆప్షన్స్‌తో రూపొందిన ఈ ఫోల్డబుల్ కెటిల్.. టూరిస్ట్‌లకు ఎంతో ఉపయుక్తం. హై క్వాలిటీ 304 స్టెయిన్ లెస్ స్టీల్, ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్‌తో తయారైన ఈ పరికరం చాలా తేలికగా.. ట్రావెలింగ్ బ్యాగ్స్‌లో పెట్టుకునేందుకు అనువుగా ఉంటుంది. స్టీమింగ్ అండ్ ఇన్సులేషన్ ఫంక్షన్ తో ఉన్న ఈ కెటిల్లో ఆన్ ఆఫ్ బటన్‌తో పాటు టెంపరేచర్ బటన్ కూడా కలసి ఉంటుంది. ఇందులో కాఫీ, టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, వేడినీళ్లతో పాటు.. సూప్స్ వంటివీ చేసుకోవచ్చు. అలాగే గుడ్లు, జొన్న కండెలను ఉడికించుకోవచ్చు. అవసరాన్ని బట్టి కెటిల్‌ని మడిచి, హ్యాండిల్‌ని ఎడమవైపు 90 డిగ్రీస్ తిప్పి ప్యాక్ చేసుకోవచ్చు. లేదంటే చిత్రంలో చూపించిన విధంగా హ్యాండిల్‌ని పెద్దగా చేసుకుని కెటిల్‌ని పట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.ధర 33డాలర్లు (రూ.2,752) -
Tallest Statues In The World: ప్రపంచంలోని ఎత్తయిన విగ్రహాలు (ఫోటోలు)
-
350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణమిదే!
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవుడి ప్రసాదాన్ని అక్కడి భక్తులు దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తుందట. ఆలయల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు,పూజలు అయ్యాక దేవుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. కానీ రాజస్థాన్‌లోని రాజసమంద్ని శ్రీనాథ్జీ ఆలయంలో మాత్రం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయడం ఆచారంగా వస్తోంది. దాదాపు 350 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుంది. ప్రసాదాన్ని దొంగిలించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ నైవేద్యాలను లూటీ చేసి తింటే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి వద్ద నుంచి దొంగిలించే బియ్యాన్ని భక్తులు తమతమ ఇళ్లలో భద్రంగా దాచుకుంటారు. దీనివల్ల తమ కష్టాలు, దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వచ్చి పోతుంటారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోరు. ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే శ్రీనాథ్జీ స్వామివారికి ఇష్టమట. ఇలా చేయకపోతే అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని అంటారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి ఎత్తుకెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవలె మమోత్సవం జరగగ్గా అన్నకూటాన్ని కొల్లగొట్టే సంప్రదాయాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. -
ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడటానికి ఎగబడుతున్న జనాలు!
చిమ్మచీకటి వణికిస్తుంది. కానీ కొన్ని సార్లు.. ఆ చీకటిని చీల్చే వెలుతురు కూడా వణికిస్తుంది. అమాంతం ప్రత్యక్షమై.. అర్ధాంతరంగా మాయమై.. గజగజ వణికిస్తోన్న ఆ మిస్టరీ ఏంటీ? అది దక్షిణ అమెరికా, ఆర్కన్సా (Arkansas) రాష్ట్రంలో గుర్డాన్ సిటీ. చీకటిపడేవరకు ఆత్రంగా ఎదురుచూసిన.. ఓ నలుగురు చిన్నారులు నక్కి నక్కి.. పాత రైల్రోడ్ ట్రాక్ వైపు అడుగులు వేశారు. కాళ్లకు చెప్పులుంటే అలికిడి అవుతుందని ఒట్టికాళ్లతో మెల్లమెల్లగా నడుస్తూ.. ఓ బండకు ఆనుకుని ఒకరి తల మీంచి మరొకరు తల పెట్టి తొంగి తొంగి చూస్తున్నారు. చీకట్లో నల్లరాయిలా.. వాళ్లు ఎవరికీ కనిపించడం లేదు. వాళ్లకీ ఏమీ కనిపించడం లేదు.‘ఏది వచ్చిందా? ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? వచ్చేసిందా?’ అనే గుసగుసలు.. వారి గుండె అలికిడి కంటే చిన్నగా వినిపిస్తున్నాయి. ‘అదిగో’ అన్న మాట ఆ నలుగురిలో ఎవరి నుంచి బయటికి వచ్చిందో తెలియదు కానీ.. కాస్త గట్టిగానే వచ్చింది. నిదానిస్తే అది వాళ్ల వైపే దూసుకొస్తోంది. అది, గుండ్రంగా, చిన్నబంతిలా మెరుస్తోంది. దగ్గరకు వచ్చేసరికి వాలీబాల్ అంత పెద్దదైపోయింది. కెవ్వుమనే కేకలతో వణుకుతూ నలుగురూ నాలుగు దిక్కులకు పరుగెత్తారు. ఆ అతీంద్రియశక్తికి ‘గుర్డాన్ లైట్’ అని పేరు పెట్టిన రిపోర్టర్స్.. ఈ మిస్టరీని ప్రపంచానికి పరిచయం చేశారు. అదో కాంతి. ఓ దీపం ప్రకాశించినట్లుగా.. మిలమిలా మెరిసిపోతుంది. అది తరుముతూ వెనుకే వస్తుంటే.. పరుగెత్తే వారికి చీకట్లో తోవ కనిపించడమే ఇక్కడ గమ్మత్తైన విషయం. సీన్ కట్ చేస్తే.. ఆ నలుగురు పిల్లలకు నాలుగు రోజులు నిద్ర లేవలేదు. అది ఆ నలుగురి అనుభవం మాత్రమే కాదు. చాలా ఏళ్లుగా గుర్డాన్ వాసుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామందికి కలిగిన వింత అనుభవం. ఈ హడలెత్తించే కథనాలను విన్న వారంతా దీని వెనుకున్న ఉదంతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినవారే. అయితే పోలీస్ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆ వ్యథ.. విన్నవారిని ఇంకాస్త బెదరగొడుతుంది. 1931 డిసెంబరు 10న విలియమ్ మెక్‌క్లెయిన్ అనే వ్యక్తిని తన కింద పనిచేసే 38 ఏళ్ల లూయీ మెక్‌బ్రైడ్.. గుర్డాన్ రైల్రోడ్ ట్రాక్ సమీపంలో నరికి చంపేశాడు. అయితే మొదట అనుమానితుడిగా అరెస్ట్ అయిన లూయీ.. చివరికి స్వయంగా తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. అక్కడితో లూయీ కథ కూడా ముగిసింది. అయితే మెక్‌క్లెయిన్ హత్య జరిగిన చోట దాదాపు పావు మైలు పొడవున రక్తపు అడుగుజాడలు ఉన్నాయని.. లూయీ దాడి నుంచి తప్పించుకోవడానికి మెక్‌క్లెయిన్ చాలా ప్రయత్నించాడని.. చేతిలో లాంతరు పట్టుకుని.. ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీశాడని.. పోలీస్ క్రైమ్ రికార్డ్‌లో ఉంది. తల తెగిన కారణంగానే మరణం సంభవించిందని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ తేల్చింది. అయితే మెక్‌క్లెయిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. అతడి పిడికిలి పట్టులో లాంతరు ఉండటమే కీలకంగా మారింది. నాటి నుంచి ఆ సమీపంలో గుర్డాన్ ఘోస్ట్లీ లైట్.. స్థానికులను పరుగులెత్తిస్తోందనేది చాలామంది నమ్మకం. తెగిపడిన తన తలను వెతుక్కోవడానికే మెక్‌క్లెయిన్ ఆత్మ లాంతరు పట్టుకుని.. ఆ పరిసరాల్లోనే తిరుగుతోందనే ప్రచారం మొదలైంది. ఈ దయ్యం కాంతి.. భూమి నుంచి 3 అడుగుల ఎత్తులో ఉరకలేస్తుందని.. ముందుకు వెనక్కు కదులుతుందని, కొన్ని సార్లు పసుపు, నారింజ, నీలం, ఎరుపు రంగుల్లో కనిపిస్తోందని సాక్షులు చెప్పారు. అయితే ఇది ఏంటి అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. గుర్డాన్ నివాసి మార్తా రామీ అనే ప్రత్యక్ష సాక్షి.. ‘నేను కూడా చిన్నప్పుడు ఆ దీపాన్ని చూడటానికి రాత్రి పూట స్నేహితులతో వెళ్లాను. అది నన్ను తరమడం నాకు ఇప్పటికీ గుర్తుంది’ అని చెప్పుకొచ్చింది.ఈ లైట్ దయ్యం కాదని.. పీజో ఎలక్ట్రిక్ ప్రభావం అంటూ కొందరు వాదన లేవదీశారు. స్ఫటికాలు, సిరామిక్స్ వంటి కొన్ని పదార్థాలకు తేమగాలులు సోకినప్పుడు ఒత్తిడికి గురై.. విద్యుదుత్పత్తి జరుగుతుందని.. ఆ వెలుతురుని చూసి చాలామంది భయపడుతున్నారని వారు తేల్చేశారు.బాబ్ థాంప్సన్ అనే క్లార్క్ కౌంటీ హిస్టారికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్.. దీనిపై ఎన్నో పరిశోధనలు చేశాడు. ‘మేము ఒక రకమైన ఎర్రటి, బంగారు కాంతిని చాలాసార్లు చూశాం. అది చూడటానికి ఎవరో ఒక బేస్‌బాల్ క్యాప్‌తో ఫ్లాష్‌లైట్‌ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కాసేపటికి అదృశ్యమైపోతుంది. కొన్నిసార్లు ఆ బాల్ లాంటి కాంతి.. స్వింగ్ అవుతున్నట్లుగా వలయాల్లా కనిపిస్తుంది. ఎంతటి ధైర్యవంతులైనా అది చూసి భయపడతారు’ అని చెప్పుకొచ్చారు. అయితే ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు మాత్రం ఇక్కడకు ఎగబడుతూ ఉంటారు.ఇప్పటికీ చాలామంది ఆ వెలుగును చూసి జడుసుకుంటూంటారు. ఏదేమైనా ఈ కాంతికి అసలు కారణం తేలియకపోవడంతో ఈ ఘోస్ట్ లైట్ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
బొద్దింకను చంపబోయి.. ఏకంగా ఇంటినే తగలబెట్టాడు
రాజమౌళి ఈగ సినిమా గుర్తుంది కదా.. అందులో విలన్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. చివరకు ఈగను చంపడానికి ప్రయత్నించి ఏకంగా ఇంటిని తగలబెట్టుకోవడమే కాక.. తాను చస్తాడు. సరిగ్గా ఇలాంటి సీన్ జపాన్‌లో రిపీట్ అయ్యింది. బొద్దింకను చంపే ప్రయత్నంలో ఓ వ్యక్తి ఏకంగా ఇంటిని తగటబెట్టాడు. ఏమైందంటే.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి బొద్దింక చొరబడింది. దీంతో ఎలాగైనా దాని భరతం పడదామని, పెద్ద మొత్తంలో బొద్దింకల్ని చంపే స్ప్రేను పిచికారీ చేశాడు. అంతే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఒక్కసారిగా మంటలు అంటుకొని పేలుడు సంభవించింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై స్పై చేయడంతో మంటలు చెలరేగాయి. ఈ ధాటికి అపార్ట్మెంట్ మొత్తం మంటలు వ్యాపించగా, సదరు వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఎలక్ట్రికల్ అవుట్లెట్ల దగ్గర పురుగుమందులను పిచికారీ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ది స్ట్రెయిట్స్ టైమ్స్‌లోని ఒక నివేదిక పేర్కొంది. పిచికారీ స్ప్రేలల్లో ప్రొపేన్, బ్యూటేన్తో పాటు ఆల్కహాల్ వంటి మండే స్వభావం ఉన్న ప్రొపెల్లెంట్లు ఉంటాయని, వీటి వల్ల ఒక్కోసారి ఇలా పేలుడు జరిగే అవకాశం ఉందని రిపోర్టులో వెల్లడైంది. -
అత్యంత అరుదైన పిల్లి.. అక్కడ మాత్రమే నివసిస్తాయట
ఇవి మీకు తెలుసా? ► ఐస్‌ల్యాండ్‌లో క్రిస్మస్ పండగ కానుకలుగా పుస్తకాలను ఒకరికి ఒకరు పంచుకునే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అంటారు. ఇతర దేశాలతో పోల్చితే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రచురణ కర్తలు అత్యధిక సంఖ్యలో పుస్తకాలు అమ్ముతారు కాబట్టి దీనికి ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అని పేరు వచ్చింది. ►‘జిమ్నాస్టిక్స్’ అనేది పురాతన గ్రీకు పదం ‘జిమ్నాజీన్’ నుంచి పుట్టింది. దీని అర్థం నగ్నంగా వ్యాయామం చేయడం. యువకులకు యుద్ధవిద్యలలో శిక్షణ ఇచ్చే విధానం ‘జిమ్నాజీన్’ కాలక్రమంలో ఎన్నో మార్పులకు లోనైంది. ► ‘బే క్యాట్’ అనేది అత్యంత అరుదైన పిల్లి జాతి. ఇవి ఆగ్నేయ ఆసియాలోని బోర్నియో ద్వీపంలో మాత్రమే నివసిస్తాయి. అటవీ నిర్మూలన వల్ల వీటి సంఖ్య విపరీతంగా తగ్గి ప్రమాదపు అంచున ఉన్నాయి. అంతరించి పోతున్న జాతుల జాబితాలో వీటిని చేర్చారు. -
చనిపోయి.. 24 నిమిషాల తర్వాత మళ్లీ బతికిన మహిళ
వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతమని చెప్పాలి. గుండెపోటుతో ఓ మహిళ చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఆశ్చర్యంగా ఆమె 24 నిమిషాల తర్వాత లేచి కూర్చుంది. ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ పరిణామంతో డాక్టర్లు సైతం షాక్‌కి గురయ్యారు. తాను స్పృహలో లేని ఆ 24 నిమిషాల్లో తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, అనుకోని పరిస్థితుల్లో చచ్చి బతికాం అనే సామెతను వాడుతుంటారు. అంటే చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డప్పుడు ఇలా అంటుంటారు. కానీ అమెరికాకు చెందిన లారెన్ కెనడే అనే మహిళ మాత్రం చచ్చి బతికింది. తనకు ఎదురైన ఈ విచిత్ర అనుభవం గురించి లారెన్ నెటిజన్లతో ఈ విధంగా పంచుకుంది. ''గత ఫిబ్రవరిలో నాకు గుండెపోటు వచ్చింది. ఆంబులెన్స్‌కి కాల్ చేసి ఆలోగా నాకు సీపీఆర్ చేశాడు. కానీ ఎలాంటి చలనం లేదు. హాస్పిటల్‌కి వెళ్లగానే నన్ను పరిశీలించిన అనంతరం నేను చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. కానీ సరిగ్గా 24 నిమిషాల అనంతరం నా గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే వెంటనే కోమాలోకి వెళ్లిపోయాను. రెండు రోజులకు గానీ స్పృహలోకి రాలేదు. మెదడుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాక సాధారణ స్థితికి వచ్చాను. దాదాపు 9 రోజుల పాటు ఐసీయూలో వైద్య బృందం నన్ను పరీక్షించింది. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాను. ఇప్పుడు నాకు చావు అంటే ఏమాత్రం భయం లేదు.హార్ట్ ఎటాక్‌కి గురైనప్పుడు సరైన సమయంలో నా భర్త సీపీఆర్ చేయడం వల్ల నా ప్రాణాలు దక్కాయి. తను ఎప్పటికీ నా హీరో'' అంటూ ఆమెపేర్కొంది. లారెన్‌కు ఎదురైన ఈ పరిస్థితిని వైద్య శాస్త్రంలో లాజరస్ ఎఫెక్ట్ అని అంటారు.అంటే చనిపోయిన సందర్భంలో చాలా అరుదుగా ఇలా మళ్లీ జీవం పోసుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి కేసుల్లో మళ్లీ బతికిన వారు ఎక్కువ కాలం జీవించలేరని, అయితే లారెన్ కేసు ఆశ్చర్యంగా ఉందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. గతంలో 1982 నుంచి 2018 మధ్య ఇలాంటి కేసులు 65 నమోదయ్యాయని,అందులో 18 మంది మాత్రమే పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేసింది. -
మీకు తెలుసా..?
-
ఈ ఏడాది అక్కడికి వెళ్లేందుకు తెగ ఎగబడ్డారు,అంత స్పెషల్ ఏముందంటే..
2023 మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుంది. మరి ఈ ఏడాదిలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన టూరిస్ట్ ప్లేస్ ఏంటి? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిస్ట్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 2023లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన టూరిస్ట్ ప్రాంతమేంటి?అన్నదానిపై స్పెషల్ స్టోరీ. ప్రతి ఏడాది ప్రజలు ఎక్కువగా సందర్శించే టూరిస్ట్ ప్రాంతాలను ట్రావెల్ ఏజెన్సీలు రిలీజ్ చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కూడా లిస్ట్‌ను విడుదల చేశాయి. గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం 2023లో ఎక్కువ మంది ప్రజలు హాంకాంగ్ వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. అలా టాప్ టూరిస్ట్ ప్లేస్‌లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది బ్యాంకాక్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, 2023లో మాత్రం హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హాంకాంగ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సుమారు 29.2మిలియన్ల మంది అంటే 2 కోట్ల 92లక్షల మంది హాంకాంగ్‌ను సందర్శించారు. ఆగ్గేయ చైనాను ఆనుకొని ఉన్న ఈ నగరంలో ప్రతి ఏడాది సుమారు 5మిలియన్లకు తగ్గకుండా ప్రజలు విజిట్ చేస్తుంటారట. అంతలా ఎక్కడ ఏముందబ్బా అని పరిశీలిస్తే.. హాంకాంగ్‌లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిస్నీల్యాండ్, విక్టోరియాస్ పీక్, మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియం, ఓషియన్ పార్క్,రిపల్స్ బే,లాంటూ ఐస్‌ల్యాండ్, స్టార్ ఫెర్రీ సహా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2025 నాటికి సుమారు 44 మిలియన్లకు పైగా ప్రజలు హాంకాంగ్‌ను సందర్శిస్తారని సమాచారం. బ్యాంకాక్ హాంకాంగ్ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన ప్రదేశం బ్యాంకాక్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో బ్యాంకాక్ నగరం రెండోదిగా నిలిచింది. 2023 నాటికి 24 మిలియన్ల మంది అంటే సుమారు 2 కోట్ల 44 లక్షల మంది ప్రజలు బ్యాంకాక్‌ను సందర్శించారు. ఇక్కడి ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, వెరైటీ వంటలతో బ్యాంకాక్ పర్యాటకులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. లండన్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ జాబితాలో లండన్ మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది 19.2 మిలియన్లు(కోటి 2 లక్షల మంది) ప్రజలు లండన్‌ను సందర్శించారు. టూరిస్టులే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా 2023లో ఎక్కువగా లండన్‌ను విజిట్ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఎక్కువగా సింగపూర్,చైనా,దుబాయ్, ప్యారిస్, న్యూయార్క్ ప్రాంతాలను పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు. -
యుద్దంతో మొదలై, కుందేళ్ల దీవిగా మారింది
జపాన్‌లోని ఒకునోషిమా దీవి కుందేళ్ల దీవిగా పేరుమోసింది. ఈ దీవిలో మనుషుల కంటే కుందేళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కుందేళ్లు గుంపులు గుంపులుగా గంతులేస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఈ దీవి సాధారణ జనావాసంగానే ఉండేది. వ్యవసాయం సహా అన్ని పనులూ సాగేవి. ఈ దీవిలో కొన్ని మత్స్యకారుల కుటుంబాలు కూడా ఉండేవి. దీవి రక్షణ కోసం జపాన్ ప్రభుత్వం ఇక్కడ కట్టుదిట్టమైన పది కోటలను నిర్మించింది. తర్వాత రష్యాతో యుద్ధం మొదలైంది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జపాన్ సైన్యం 1925లో దీనిని రహస్య పరిశోధన కేంద్రంగా మార్చుకుని, ఇక్కడి జనాలను ఇతర ప్రదేశాలకు తరలించింది. రసాయనిక ఆయుధాల ప్రయోగాలలో భాగంగా ఇక్కడకు కొన్ని కుందేళ్లను తీసుకొచ్చింది. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన కొన్నాళ్లకు జపాన్ సైన్యం కూడా ఈ దీవిని ఖాళీ చేసింది. అయితే, మొదట్లో తీసుకొచ్చిన కుందేళ్లు ఆ తర్వాత అంతకంతకూ వృద్ధి చెంది, ఇది కుందేళ్ల దీవిగా మారింది. ఇక్కడి కుందేళ్లను చూడటానికి పర్యాటకులు తరచు ఇక్కడకు వస్తుంటారు. -
భర్తతో విడాకులు.. పెళ్లికి మించిపోయేలా గ్రాండ్‌గా పార్టీ
'ఆహ్వానం' అనే తెలుగు సినిమా మీకు గుర్తుందా? రమ్యకృష్ణ- శ్రీకాంత్ నటించిన ఆ సినిమాలో హీరోయిన్ రమ్యకృష్ణ.. పెళ్లిలాగే విడాకుల మహోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని ఇంటింటికీ వెళ్లి విడాకుల ఆహ్వానాన్ని అందిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే చైనాలోనూ చోటుచేసుకుంది. తన భర్తతో విడాకులు తీసుకున్న ఓ మహిళ కూడా డివోర్స్ పార్టీ చేసుకుంది. ఇష్టంలేని బంధంలో కొనసాగే కంటే విడాకులు తీసుకొని నచ్చిన లైఫ్ ఎంజయ్ చేద్దాం అంటూ ఫ్రెండ్స్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చింది. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘట్టం. లైఫ్‌లో అన్నిటికన్నా పెళ్లి వేడుకకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ వివాహాన్ని ఎప్పటికి గుర్తుండేలా జరుపుకోవాలని ఎన్నో కలలు కంటారు. విందు, వినోదాలతో అట్టహాసంగా జరుపుకుంటారు. తాజాగా ఓ మహిళ విడాకుల కోసం పార్టీ ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచింది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన సాంగ్ అనే మహిళ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. ఈ ఘట్టాన్ని మరుపులేని వేడుకలా జరుపుకోవాలని భావించి సన్నిహితులకు ఘనంగా పార్టీ ఏర్పాటు చేసింది. దీన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఫోటోగ్రాఫర్లను కూడా పిలిపించింది. ఈ సందర్భంగా సాంగ్.. తన నాన్సెన్స్ మ్యారేజ్ ఇక్కడితో ముగిసిందని, మరోసారి సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తన మాజీ భర్త మోసం చేశాడని, అతని ఫోన్లో మెసేజ్‌లు చూసి తట్టుకోలేకపోయానని సాంగ్ సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకుంది. విడాకుల తర్వాత ఇంత ఆనందం ఉంటుందని తెలిస్తే, చాలా కాలం క్రితమే డివోర్స్ తీసుకునేదాన్ని అని పేర్కొనడం విశేషం. -
ఈ సూట్ వేసుకుంటే సూపర్ స్పీడ్‌గా పరిగెత్తొచ్చు
సూపర్ స్పీడ్ గా పరుగెత్తాలనుకుంటున్నారా? అయితే ఈ సూట్ మీ కోరికను నెరవేర్చనుంది. నిజం, దక్షిణ కొరియాలోని చుంగ్–ఆంగ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అల్ట్రా–లైట్ ఎక్సోసూట్ను రూపొందించారు. ఇది మనిషి.. వేగంగా దూరాలను అధిగమించడంలో సహాయపడుతుంది. 2.5 కిలోల బరువు ఉండే ఈ సూట్‌ని ధరిస్తే దాదాపు సెకనుకు 200 మీటర్లు పరుగెత్తగలం. ఈ ప్రత్యేకమైన ఎక్సోసూట్.. పవర్ ప్యాక్ ఉన్న బ్యాక్‌ప్యాక్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ సూట్ పరిశోధన దశలోనే ఉన్నా త్వరలోనే అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు మరింత తక్కువ బరువుతో మరింత వేగంగా పరుగెత్తించగల సూట్నీ తయారుచేసే పనిలో ఉన్నామనీ చెబుతున్నారు. -
వివిధ రాష్ట్రాల అత్యంత ప్రసిద్ధ ఆహారం ఫోటోలు
-
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన పర్యాటక ప్రాంతాలివే
ప్రస్తుతమున్న రోజుల్లో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎలాంటి సందేహాలు ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. 2023కి త్వరలోనే ఎండ్‌కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్ లిస్ట్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. మరి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాలేంటి? టాప్ 10 లిస్ట్ ఏంటన్నది చూసేద్దాం. వియత్నాం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో వియత్నాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రకృతి సోయగాలు,బీచ్‌లు,రుచికరమైన ఆహారం, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నవంబర్ నుంచి ఏప్రిల్ సీజన్లో వియత్నంలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గుహకు నిలయమైన సోన్డూంగ్, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్, హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్,నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. View this post on Instagram A post shared by Vietnam 🇻🇳 Travel | Hotels | Food | Tips (@vietnamtravelers) గోవా 2023లో మోస్ట్ సెర్చ్డ్ డెస్టినేషన్స్‌లో భారత్‌లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోవా ట్రిప్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడి బీచ్‌లు, చర్చ్‌లు, పచ్చదనం సహా ఎన్నో అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం సలీం అలీ బర్డ్ శాంక్చురీ,దూద్‌సాగర్ జలపాతాలు, బామ్ జీసస్, సే కేథడ్రల్ చర్చిలు, బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. బాలి భూతల స్వరంగా పిలిచే బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య లో బాలి దీవి ఉంటుంది. 17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిఉస్తుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, ఉబుద్ ప్యాలెస్,ఉలువతు ఆలయం, లొవియానా వంటి ప్రాంతాలు ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు. చదవండి: 2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా? View this post on Instagram A post shared by Bali - The Island of the Gods (@bali) శ్రీలంక గూగుల్ సెర్చ్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్‌లో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది.అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. పురాతన శిథిలాలు, దేవాలయాలు, అందైన బీచ్‌లు, తేయకు తోటలు.. ఇలా ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సిగిరియా రాక్ ఫారెస్ట్,యాలా నేషనల్ పార్క్,మిరిస్సా బీచ్,ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, డచ్ స్టైల్లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్ మ్యూజియంలు, రెయిన్ ఫారెస్ట్లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. థాయ్‌లాండ్ అందమైన ప్రకృతికి థాయ్‌లాండ్ పెట్టింది పేరు. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్‌గా దీనికి పేరుంది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. థాయ్ టూర్లో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. వీటితో పాటు కశ్మీర్, కూర్గ్, అండమాన్ నికోబార్ దీవులు,ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా టాప్-10 డెస్టినేషన్ లిస్ట్‌లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. -
అలాంటి ఏకైక పోస్టాఫీస్ ఇదొక్కటే.. ఏడాదికి ఐదు నెలలే పని
ప్రపంచానికి అత్యంత సుదూరాన మంచుదీవిలో నడుస్తున్న ఏకైక పోస్టాఫీసు ఇది. అంటార్కిటికాలోని పోర్ట్ లాక్రాయ్లో ఉన్న ఈ పోస్టాఫీసును యునైటెడ్ కింగ్డమ్ అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఇది కేవలం పోస్టాఫీసు మాత్రమే కాకుండా, మ్యూజియమ్ కూడా. ప్రస్తుతం ఈ పోస్టాఫీసులో నాలుగు పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టాఫీసు ఏడాదిలో ఐదు నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడి ఖాళీలపై ఉద్యోగ ప్రకటన ఇటీవల వెలువడగానే ప్రపంచం నలుమూలల నుంచి వందలాదిగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇందులో పనిచేసేవారు పోస్టాఫీసు బాధ్యతలతో పాటు మ్యూజియం నిర్వహణను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వాటికి తోడు ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే పెంగ్విన్లను లెక్కించడం కూడా వారి బాధ్యతే! పెంగ్విన్లను లెక్కించడంలో నైపుణ్యం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అదనపు అర్హత. సూదూరంగా ఏకాంత ప్రదేశంలో ఉన్న ఈ పోస్టాఫీసులో పనిచేయడం ఏమంత ఆషామాషీగా ఉండదని, ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు పనిచేసే ఈ పోస్టాఫీసులో ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటూ పనిచేయడమే కష్టమని యునైటెడ్ కింగ్డమ్ అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ సీఈవో కామిలా నికోల్ తెలిపారు. ఇక్కడ రోజుకు పన్నెండు గంటల సేపు పనిచేయాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు తమ ప్రకటనకు స్పందనగా రెండున్నర వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని పనిచేసే శారీరక దారుఢ్యం, శాస్త్ర పరిశోధనల కోసం ఇక్కడకు వచ్చే పర్యాటకులతో తగిన రీతిలో మెలిగే కలివిడితనం, ఓర్పు, సహనం ఉన్న అభ్యర్థుల కోసం చూస్తున్నామని చెప్పారు. -
విడాకులు తీసుకున్నారా? మరి పెళ్లి ఫోటోల సంగతేంటి?
ఫొటోలు బాగా తీసే స్టూడియోలున్నట్లే.. ఫొటో హార్డ్ కాపీలను చిత్తు చిత్తుగా చించేసే స్టూడియో కూడా ఉంది.. రష్యాలో! పెళ్లి ఫెయిలై.. విడాకులు తీసుకున్న చాలామంది దంపతులు తమ పెళ్లి ఫొటో హార్డ్ కాపీలను చించేయడానికో, కాల్చేయడానికో సెంటిమెంట్ అడ్డొచ్చి, బయట పడేస్తే ఆ ఫొటోలను మిస్ యూజ్ చేసే ప్రమాదం ఉంటుందని భయపడి.. ఇలా రకరకాల కారణాలతో వాటిని ఏమీ చేయలేక.. అలాగని ఇంట్లో పెట్టుకోనూలేక సతమతమవుతుంటారు. ఆ బాధను అర్థం చేసుకున్న లియు బైలు అనే వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంటే చేశాడు ‘వెడ్డింగ్ ఫొటోస్ ష్రెడింగ్ బిజనెస్’ స్టూడియోతో! డైవోర్స్ తీసుకున్న కపుల్స్ తమ పెళ్లి ఫొటోలను ఈ స్టూడియోకి తెచ్చిస్తే.. ఫోటోలను స్ప్రే పెయింట్‌తో కప్పేసి.. వాటిని ష్రెడింగ్ మెషిన్లో వేసి నుజ్జు నుజ్జు చేసేస్తాడట. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి ఆ ఫుటేజ్‌ని క్లయింట్‌కు పంపుతాడు. ఇప్పుడు ఇతని స్టూడియోకి విపరీతమైన గిరాకీ పెరిగి మూడు ఫొటోలు ఆరు రూబుళ్లుగా బిజినెస్ సాగుతోందట. -
వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు
ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి. మలేషియా ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. శ్రీలంక: భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది. కెన్యా: సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్: భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్‌లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్‌ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు. ఫిజీ: అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు. భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. బార్బడోస్: బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. కాస్ట్లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు. -
డాక్టర్లు లేకుండానే ఆరోగ్య పరీక్షలు... ఏఐ మహత్యం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) కొత్త పుంతలు తొక్కుతుంది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మనిషి చేసే దాదాపు అన్ని పనులను యంత్రాలు చేయగలిగేలా తయారు చేస్తున్నారు. ఇప్పుడు వైద్య రంగంలోనూ సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది ఏఐ. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. బీపీ, షుగర్ నుంచి స్కానింగ్ వరకు అన్ని రకాల ట్రీట్మెంట్లను కృత్రిమంగా అందిస్తుంది. మనకు ఏదైనా జ్వరం వచ్చినా, అనారోగ్యంగా అనిపించినా ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ వద్దకు పరుగులు తీస్తాం. సమస్యను బట్టి ఆయా డాక్టర్‌ను ఎంచుకుంటాం. కానీ ఇప్పుడు హాస్పిటల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొభైల్లోనే మన హెల్త్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఆధారితమైన వినూత్న హెల్త్ క్లినిక్ ఫ్లాట్ఫారమ్ను ఇప్పుడు పరిశోధకులు అభివృద్ది చేశారు. జిమ్, మాల్స్, ఆఫీసుల్లో ఏఐ ఆధారిత కేర్పాడ్స్ను అమెరికాలో ఈమధ్యే ప్రారంభించారు. పేషెంట్స్ లోపలికి అడుగుపెట్టగానే రొబాటిక్ వాయిస్ మెసేజ్‌తో గైడెన్స్ లభిస్తుంది. మన మొబైల్లో లాగిన్ అయ్యి స్క్రీన్‌పై చూపిస్తున్న ఫీచర్లలో మన అనారోగ్యానికి సంబంధించిన వాటిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు మీకు బాడీ స్కానింగ్ చేయించుకోవాలనిపిస్తే స్క్రీన్‌పై కనిపించే ఆఫ్షన్‌ను ఎంచుకొని చెకప్ చేయించుకోవచ్చు. మన బాడీలో సూది గుచ్చకుండానే బ్లాడ్ సాంపిల్స్ కలెక్ట్ తీసుకొనే అరుదైన ఫీచర్ ఇందులో ఉంది. హార్ట్ హెల్త్, బ్రెయిన్, బీపీ.. ఇలా మీ సమస్యకు సరిపోయే వైద్య సహకారం క్షణాల్లో లభిస్తుంది. కేర్ పాడ్స్‌లో నమోదైన పేషెంట్ డేటాను డాక్టర్‌కు పంపిస్తుంది. నిమిషాల్లో మీ పరిస్థితిని సమీక్షించి మొభైల్లో రిపోర్ట్స్‌ను పంపిస్తారు. ప్రైమరీ డాక్లర్ల కొరతను కేర్ పాడ్స్ రిప్లేస్ చేస్తుందన్నమాట. నెలకు 8200 మెంబర్ షిప్ కట్టి ఎప్పుడైనా మీ హెల్త్ అప్డేట్ను తెలుసుకోవచ్చు. ఇప్పటికే అమెరికాలో కొన్ని మాల్స్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో చాండ్లర్, అరిజోనా,చికాగో సహా మరిన్ని ప్రాంతాల్లో చేరువ చేసేందుకు ప్రణాళికులు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ డాక్టర్ కేర్‌ను కొందరు కొట్టిపారేస్తున్నారు. ప్రత్యక్షంగా డాక్టర్‌ను కలిసినప్పుడే పేషెంట్స్ చెప్పే కొన్ని విషయాలను బట్టి సమస్యను తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు కూడా బయటకొచ్చిన సందర్భాలు ఎన్నో. కానీ ఇలా మెషీన్ సహాయంతో పేషెంట్ పరిస్థితి పూర్తిగా అంచనా వేయకపోవచ్చు అనే కొందరు విమర్శిస్తున్నారు. -
ప్రపంచంలో ఇప్పటివరకు వర్షం కురవని ఊరు!ఎక్కడ ఉందంటే..
ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే, మరికొన్ని చోట్ల నెలల తరబడి వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల అయితే విపరీతంగా చలి కమ్మేస్తుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో వాతవరణ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ అసలు వర్షమే కురవని గ్రామం ఈ భూమ్మీద ఉంటుందని మీకు తెలుసా? మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. వర్షం మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా కష్టమే. కానీ ఈ ఊర్లో మాత్రం ఇప్పటివరకు అసలు వర్షం ఊసే లేదు. ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఇదే. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఎర్రటి రాతి కొండపై ఉంది. ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఉదయం సూర్యుడు ఉదయించగానే వాతావరణం వేడుక్కిపోతుంది. సాయంత్రం కాగానే విపరీతమైన చలి కమ్మేస్తుంది. ఈ ఊర్లో అసలు ఎప్పుడూ వర్షం పడకపోవడానికి కారణం.. గ్రామం మేఘాలు పేరుకుపోని ఎత్తులో ఉండడమే. సాధారణంగా ఘాలు భూమి నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ఊరు ఏకంగా భూమికి మూడు కిలో మీటర్ల ఎత్తులో ఉంటుంది. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు.అందుకే ప్రపంచంలోనే ‘డ్రై సిటీ’గా దీనికి పేరుంది. ఇక్కడ అల్ బోహ్రా ( అల్ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. మరి వర్షం లేకుండా అక్కడి ప్రజలు ఎలా బతుకున్నారు అని సందేహమా? ఇక్కడి నీటి సమస్యలు తీర్చడానికి మొబైల్ ట్యాంకర్లతో ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తారట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతానికి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. చేతికి తాకే దూరంలో మేఘాలు, ఇక్కడి ప్రజల లైఫ్‌స్టైల్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా అల్ హుతైబ్ కొండపై ‘క్వాట్’ అనే ఆకర్షణీయమైన మొక్కలను ఎక్కువగా పండిస్తారు. Hutaib village in Haraz. Some of the best #Yemen coffee made here. Sipping on hot cup to the sound of birds and literally being above the clouds..priceless. So much to lose, and next to nothing to gain by current ugly war. Need cooler heads and compromise for any chance of peace. pic.twitter.com/264McKUgaF — Hisham Al-Omeisy هشام العميسي (@omeisy) September 18, 2019 -
మీకు తెలుసా ?
-
ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
ఈ కోటలోకి వెళ్లిన వాళ్లెవరూ ఇప్పటివరకు తిరిగి రాలేదు
అదో రహస్య కోట. సూర్యస్తమయం తర్వాత ఆ కోటలోకి వెళ్లడం నిషేధం. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసినా వెళ్లినా తిరిగి వచ్చిన సందర్భాలు లేవు. ఇప్పటివరకు అలా వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రాలేదు. మిస్టీరియస్ కోటగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఏంటీ హిస్టరీ అన్నది తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని వారసత్వ కోటలలో ఒకటి ఈ గర్కుందర్ ఫోర్ట్. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ అంతుచిక్కని రహస్యమైన కోట చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా పేరుగాంచింది. మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటను 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా సమాచారం. చందేలా, బుందేలా, ఖంగర్ వంటి రాజవంశస్థులు ఈ ప్రాంతంలో పాలన సాగించారు. తర్వాత ఈ కోటను తుగ్లక్‌లు సొంతం చేసుకొని బుందేలాలకు అప్పగించారు. ఈ కోటను ఎప్పుడు, ఎవరు నిర్మించారు అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ కోటలో చాలా నిధి ఉందన్న ప్రచారం కూడా ఉంది. దీంతో కోట లోపల ఏం ఉందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అదేంటంటే.. సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ఎవరూ ప్రవేశించకూడదని. కొంతమంది క్యూరియాసిటీతో కోట లోపల రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ కోట గురించి తెలుసుకోవాలని వెళ్లిన సుమారు 50-60మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సంఘటన తర్వాత కోటలోకి వెళ్లే అన్ని తలుపులు మూసివేశారు. ఈ కోట వెనక ఆసక్తికరమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక తాంత్రికుడు యువరాణి సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై మంత్రించిన నూనెతో వశం చేసుకోవాలని ప్రయత్నించాడు. అది పసిగట్టిన యువరాణి ఆ నూనెల ఓ రాయిపై పడేలా చేసింది. దీంతో ఆ రాయి తాంత్రికుణ్ణి హతమార్చింది. ఆ తాంత్రికుడు చనిపోతూ శపించడం వల్ల ఊరంతా నాశనమైందని చెబుతారు. మొత్తం ఐదు అంతస్తుల్లో ఉండే గర్కుందర్ కోటలో మూడు అంతస్తులు పైన, రెండు అంతస్తులు నేలకింద నిర్మించడం విశేషం. రాత్రిపూట ఇక్కడికి ఎవరైనా ప్రవేశిస్తే మరుసటి రోజుకు కనిపించకుండా పోతారని అంటారు. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా నిలిచింది. -
మీకు తెలియని నిజాలు తెలుగులో (ఫోటోలు)
-
ఈ ఆరోగ్య విషయాలు గురించి మీకు తెలుసా? (ఫోటోలు)
-
గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పయిరీ డేట్ తెలుసుకోవడం ఎలా?
ప్రతి ఇంట్లో దాదాపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు తప్పనిసరిగా ఉంటాయి. ఇంతకు ముందు అయితే వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి వాడేవాళ్లు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో పల్లెటూర్లలో కూడా కట్టెల పొయ్యి వాడకం బాగా తగ్గిపోయింది. దాదాపు అందరి ఇళ్లలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్లనే వాడుతున్నారు. అయితే కొందరు సిలిండర్ ఎన్ని రోజులు వాడాలి? దాని ఎక్స్‌పయిరీ డేట్ ఏంటన్నది చాలామందికి అవగాహన ఉండదు. అయితే సిలిండర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దానిపై ఉండే ప్రత్యేక రకం కోడ్‌ను తప్పకుండా చెక్ చేసుకున్నాకే తీసుకోవాలి. ఇంతకీ ఆ కోడ్ ఏంటి? ఎక్స్‌పయిరీ డేట్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలు చూస్తుంటాం. అందుకే గ్యాస్ వాడకంలో కొన్ని జాగ్రత్లు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందుకే గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు సీలు తీసి, పరీక్షించి ఇవ్వమని తెచ్చిన వ్యక్తిని అడగండి లీకేజీ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. వంటగదిలోకి గాలి, వెలుతురు బాగా రావాలి. సిలెండర్‌ను షెల్ఫ్‌లో పెట్టి తలుపులు మూయడం లాంటివి చేయకండి. కాస్త చల్లదనం ఉండే చోటే పెట్టండి. కొంతమంది సిలెండర్‌ను కింద పెట్టి, ఆ పక్కనే స్టౌ పెట్టి వండేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. స్టౌ ఎప్పుడూ సిలెండర్ కంటే ఎత్తులోనే ఉండాలి. గ్యాస్ సిలెండర్‌కు ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుందని చాలామందికి తెలియదు. అందులో ఉండే కోడ్ నెంబర్లను బట్టి గడువు ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ కోడ్ అంటే ఏమిటి..? గ్యాస్ సిలిండర్ పైభాగంలో ప్రత్యేక కోడ్ రాసి ఉంటుంది. ఈ కోడ్ అక్షరాలు, సంఖ్యల రూపంలో ఉంటుంది. ఈ కోడ్ సిలిండర్ గడువు తేదీని సూచిస్తుంది. సిలిండర్‌పై రాసిన A, B, C, D..సంవత్సరంలో 12 నెలలను చూపిస్తుంది. ఈ సిలిండర్ ఎక్స్‌పయిరీ డేట్ గురించి చెబుతుంది.ఏడాదిలో 12 నెలలను నాలుగు భాగాలుగా విభజిస్తారు. A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి. B అంటే ఏప్రిల్, మే, జూన్. C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా సిలిండర్‌పై ఉండే ఏబీసీడీలు నెలలను సూచిస్తుంది. ఉదాహరణకు సిలిండర్లోపై A 23 అని రాసి ఉన్నట్లయితే ఈ సిలిండర్ గడువు 23- జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ముగుస్తుంది అని అర్థం. B 24 అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు ఏప్రిల్, మే, జూన్లలో ముగుస్తుందని అర్థం. దీన్ని బట్టి సిలిండర్ గడువు తేదీని అంచనా వేయొచ్చు. గడువు తేదీ దాటక సిలిండర్‌ను ఉపయోగించడం చాలా ప్రమాదం. సిలిండర్ పేలి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే తీసుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్ అయిపోయిన గ్యాస్ సిలిండర్‌ను తీసుకోరాదు. -
ఈ విషయాలు మీకు తెలుసా?
-
జంతువులను, పక్షులను ఫోటోలను తీయడం అంత ఈజీ కాదు (ఫోటోలు)
-
ప్రపంచంలోని గొప్ప మతపరమైన భవనాలు (ఫోటోలు)
-
ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే
పర్యావరణ కాలుష్యం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి. ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే పర్యావరణ ఫోటోగ్రఫీ. పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల్ని హైలైట్ చేయడమే కాకుండా, తమ కెమెరా పనితీరుతో పర్యావరణ సంరక్షణ గురించి అనుక్షణం గుర్తు చేస్తారు. అలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ పర్యావరణ ఫోటోగ్రాఫర్ ఆప్ ది ఇయర్ విజేతలను ప్రకటించారు. చార్టర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ (CIWEM) ఆద్వర్యంలో గత 16 ఏళ్లుగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 159 దేశాల నుంచి ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఆరుగురిని విజేతలుగా ప్రకటించారు. వాళ్లు తీసిన ఫోటోలు ఏంటి అన్నది తెలియాలంటే ఫోటోగ్యాలరీని క్లిక్ చేయండి. (ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ సంగతులు మీకు తెలుసా?
-
రాగితో చౌకగా క్యాన్సర్ మందులు తయారు చేయొచ్చు: సైంటిస్టులు
ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్స్‌ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధరణంగా క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్ అన్నారు. క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్, N6-మిథైలాడెనోసిన్ను సులువుగా అమైన్గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతమున్న క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
-
హైదరాబాద్‌లో అడ్వెంచర్స్.. వీకెండ్లో చిల్ అవ్వండి
హైదరాబాద్‌లో అంటేనే నోరూరించే కమ్మని వంటకాలు, అనేక పర్యాటక ప్రదేశాలకు ఫేమస్. వీకెండ్ వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చి రిలాక్స్ అవుతుంటారు. అడ్వెంచర్ యాక్టివిటిస్కి కూడా హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. ఒకప్పుడు పారాగ్లైడింగ్ అంటే గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఎన్నో అడ్వెంచర్ స్పాట్స్, అది కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. బంగీ జంపింగ్ లైఫ్‌లో ఒక్కసారైనా బంగీ జంపింగ్‌ను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొండలు, బ్రిడ్జి వంటి ఎత్తైన ప్రదేశాల నుంచి తాళ్లతో శరీరాన్ని కట్టుకొని కిందకు దూకండి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బంగీజంపింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ యాక్టివిటి కోసం మన హైదరాబాద్‌లోనే చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. వాటిలో రామోజీ ఫిల్మ్ సిటీ,లియోనియా రిసార్ట్, డిస్ట్రిక్ గ్రావిటి పార్క్ వంటి ప్రాంతాల్లో అందుబాలో ఉంది. దీని ధర సుమారు రూ.3500 నుంచి 4500 వరకు ఉంటుంది. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా బంగీ జంప్ చేయొచ్చు. దీనికోసం ముందుగానే బీపీ, హార్ట్‌రేట్ వంటివి చెక్ చేస్తారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులకే బంగీ జంపింగ్ అనుమతిస్తారు. పారాగ్లైడింగ్ రెక్కలు కట్టుకొని ఆకాశలో ఎగురుతూ భూమిపై ఉన్న ప్రకృతి అందాలను చూడాలంటే పారాగ్లైడింగ్ బెస్ట్ ఛాయిస్.ఆకాశంలో పక్షలతో పోటీ పడి ఎగురుతూ భూమి పై అందాలను ఆస్వాదించవచ్చు. అయితే పారాగ్లైడింగ్ అన్ని చోట్ల వీలు పడదు. ఇందుకు కొంత ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. హైదరాబాద్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర్లో అందుబాటులో ఉంది. ధర రూ.3500 జిప్‌లైన్ చాలా ప్రాంతాల్లో జిప్‌లైన్ కోసం 50 మీటర్ల నుంచి ఎత్తులో బ్యూటిఫుల్ నేచర్‌ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్‌లో శామీర్‌పేట్‌లోని డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్, ఎక్సోటికా బొటిక్ రిసార్ట్ వంటి ప్రాంతాల్లో జిప్‌లైన్ యాక్టివిటి అందుబాలో ఉంటుంది. ధర రూ. 700-1000 వరకు ఉంటుంది. వీకెండ్స్‌లో ధర మారుతుంది) స్కై డైవింగ్ ఎత్తుగా ఉండే ప్రాంతాల నుంచి గాల్లోకి దూకే సాహసక్రీడను స్కై డైవింగ్ అంటారు. వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండోర్‌లో కూడా పొందచ్చు. అది ఎక్కడంటే..గండిపేట సమీపంలో గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఈ ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందిచ్చు. ఇందుకోసం ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. ధర సుమారు రూ. 3300 నుంచి 4300 వరకు ఉంటుంది. (వీకెండ్స్‌లో ధర మారుతుంటుంది) ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కోసం సిటీలో చాలా ప్రాంతాలు ఉన్నా అనంతగిరి హిల్స్ బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. వీకెండ్ వస్తే చాలు ఇక్కడికి ఫ్రెండ్స్‌తో ఎక్కువగా హైదరబాదీలో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఇందుకోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. క్లౌడ్ డైనింగ్ సాధారణంగా రెస్టారెంట్లో ఎవరైనా భోజనం చేస్తారు. కానీ ఆకాశానికి, భూమికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో భోజనం చేస్తే ఆ ఫీలింగే వరే. గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకు చూస్తూ భోజనం చేస్తే ఆ థ్రిల్లింగ్ చెప్పక్కర్లేదు. ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే హైదరాబాద్‌లోని క్లౌడ్ డైనింగ్‌కు వెళ్లాల్సిందే. ఇది హైటెక్ సిటీ సమీపంలో ఉంటుంది. ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ భోజనం చేయాలంటే.. రూ.5,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
ఇది మీకు తెలుసా? (ఫోటోలు)
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
కుక్కలకు పచ్చిమాంసం తినిపిస్తున్నారా? ఆ ఇన్ఫెక్షన్ మనుషుల్లోనూ..
ఈరోజుల్లో కుక్కల్ని పెంచుకోవడం కామన్ అయిపోయింది. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కుక్కలు బెస్ట్ స్ట్రెస్ బస్టర్‌గానూ ఉంటాయి. అందుకే చాలామంది తమ ఇంట్లో మనిషిలాగే కుక్కలను కూడా ట్రీట్ చేస్తుంటారు. కుటుంబసభ్యులకు చేసినట్లు కుక్కలకు కూడా ఘనంగా బర్త్‌డే పార్టీలు, సీమంతాలు నిర్వహిస్తుంటారు. మరికొందరైతే కుక్కలకి పెట్టకుండా ఏమీ తినరు. అయితే కొన్నిసార్లు అతి ప్రేమతో తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. ఇష్టంగా తింటున్నాయి కదా అని ప్రతిరోజూ వాటికి ఆహారంలో పచ్చి మాంసం పెడుతుంటారు. దీని వల్ల మనుషులకు అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది. కుక్కలకు పచ్చిమాంసం పెట్టడం వల్ల యాంటీ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకు కారణం అవుతుందని తేలింది. యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు వాడతారు. కానీ మితిమీరి యాంటీబయోటిక్స్‌ను వాడితే శరీరం బాక్టీరియాను నిరోధించే శక్తిని క్రమంగా కోల్పోతుంది. అయితే కుక్కులకు పచ్చి మాంసం తినిపించడం వల్ల సిప్రోఫ్లోక్సాసిన్ నిరోధక E. కోలిని విసర్జిస్తుందని తాజాగా యూకేకు చెందిన బ్రిస్టోల్ సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధారణంగా Fluoroquinolones అనే యాంటిబయోటిక్స్‌ను మనుషులకు, పశువైద్యంలోనూ ఉపయోగిస్తారు. కుక్కలకు పచ్చి మాంసం తినిపించం వల్ల బాక్టీరియా ఏర్పడి యాంటీబయాటిక్-రెసిస్టెంట్ E. కోలితో కలుషితమవుతుందని శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్‌లో కనుగొన్నారు. సుమారు 600 ఆరోగ్యకరమైన కుక్కలను పరిశీలించగా వాటి నమూనాల్లో మానుషులు, జంతువుల ప్రేగుల్లో E. coli బాక్టీరియా రకాన్ని గుర్తించారు. ఇది పరిశుభ్రత సరిగా లేని, పచ్చి మాంసం తినడం వల్ల పేరుకుపోయిందని తేలింది. దీనివల్ల యాంటిబయోటిక్స్ నిరోధం తగ్గిపోతుందని, ఫలితంగా బాక్టీరియా ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. పచ్చిమాంసాన్ని కుక్కలకు స్వయంగా తినిపించం వల్ల మనుషుల్లోనూ అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అంతేకాకుండా ఇది ప్రేగుల్లో కొన్ని సంవత్సరాల పాటు పేరుకుపోయి తర్వాత ట్రీట్మెంట్ అందివ్వడానికి సైతం కష్టమవుతుంది. సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో సుమారు 7.3% గ్రామీణ కుక్కలు, 11.8% పట్టణాల్లో కుక్కల మలంలో సిప్రోఫ్లోక్సాసిన్-రెసిస్టెంట్ E. కోలి ఉన్నట్లు గుర్తించారు. వండని మాసం తినిపించడే ఈ బాక్టీరియాకు కారణమని నమూనాల్లో తేలింది. అందుకే కుక్కల నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
కృత్రిమ ఆకులతో మంచినీటిని తయారు చేయొచ్చు.. సైంటిస్టుల వెల్లడి
ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అసాధ్యాన్ని కూడా సుసాధ్యమని నిరూపిస్తున్నారు మన సైంటిస్టులు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎడారి ప్రాంతంలోనూ మంచినీళ్లు తయారు చేయొచ్చని నిరూపిస్తున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు. కృత్రిమ ఆకులతో స్వచ్చమైన తాగునీటితో పాటు హైడ్రోజన్ ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేయొచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తాగునీరు, ఇంధనం వంటి సంక్లిష్ట ఇబ్బందులకు ఆర్టిఫిషియల్ లీఫ్ పద్దతి మంచి పరిష్కారమని కేంబ్రిడ్జి యూనివర్సిటీ సైంటిస్టులు వివరించారు. ఆ సరికొత్త ఆవిష్కరణ ఎడారి వంటి ప్రాంతాల్లో సరైన పరిష్కారణమని వారు తెలిపారు. మొక్కలకు నీరు, సూర్యరశ్మే ప్రధాన ఆహారం. గాలిలోని కార్భన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని మొక్కలు మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. అచ్చం ఇదే పద్దతిలో ఇప్పుడు(Artificial Leaf) ఆర్టిఫిషియల్ ఆకులను సృష్టించారు. ఇవి నిజమైన వాటి మాదిరిగానే ఆకుల్లా పనిచేసే గాడ్జెట్లు (కృత్రిమ ఆకులు). ఇవి నీరు, సూర్యరశ్మిని తీసుకొని ఇంధనంతో పాటు స్వచ్చమైన మంచినీటిని అందిస్తుంది. ప్రపంచంలో సుమారు 1.8 బిలియన్ల మందికి ఇప్పటికి తాగునీరు అందుబాటులో లేదు. ఆర్టిఫిషియల్ లీఫ్స్ టెక్నాలజీ ద్వారా నీటి సంక్షోభం నుంచి ఉపశమనం పొందొచ్చు.ఇది విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ లీఫ్‌పై ఉన్న చతురస్రాకారపు గ్రీన్ ఫొటోనోడ్.. సన్‌లైట్‌ను కలెక్ట్ చేస్తుంది. సూర్యుడికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ కృత్రిమ ఆకుల్లోని కనెక్టెడ్ సిలిండర్స్ సాధారణ మొక్కల థియరీ కిరణజన్య సంయోగ క్రియ తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది.ఆర్టిఫిషియల్ లీఫ్స్ ద్వారా సౌరశక్తిని ఉపయోగించి ఏకకాలంలో స్వచ్చమైన మంచినీటితో పాటు ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాకుండా గాలి కూడా శుభ్రమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం.. సంవత్సరానికి మూడు మిలియన్ల మరణాలకు కాలుష్యమే కారణమని తేలింది. ఈ నేపథ్యంలో అటు గాలిని శుభ్రం చేస్తూనే ఇటు ఇంధనాల ఉత్పత్తి చేసుకోవచ్చని ప్రొఫెసర్ ఎర్విన్ రీస్నర్ అన్నారు.వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించడంతోపాటు ప్రయోజనకరంగా మార్చుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.. -
జంతువుల గురించి మీకు తెలియని పది అద్భుతమైన విషయాలు
-
సూట్‌కేస్‌లా కనిపిస్తుంది, కానీ సూట్‌కేస్ కాదు.. మరి ఏంటేంటే..
ఇప్పటి దాకా పోర్టబుల్ గ్రిల్, పోర్టబుల్ స్టవ్, పోర్టబుల్ కుకర్ ఇలా చాలానే చూసుంటారు కానీ.. పోర్టబుల్ మైక్రోవేవ్‌ని చూశారా? లేటెస్ట్ వెర్షన్ గా వచ్చిన ఈ కుక్వేర్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీన్ని ఓపెన్ చేసి సెట్ చేస్తే ఓవెన్‌లా.. ఫోల్డ్ చేసి లాక్ చేస్తే చిన్న సూట్‌కేస్‌లా ఉంటుంది. ఇది జపానీస్ టెక్నాలజీతో రూపొందింది. బ్యాటరీతో పని చేస్తుంది. హ్యాండిల్‌ని వెనక్కి జరిపితే లాక్ ఓపెన్ అవుతుంది. అప్పుడు సూట్‌కేస్ ఓపెన్ అయ్యి.. ఓవెన్ లా మార్చుకోవడానికి వీలుంటుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చిత్రాల్లో చూడొచ్చు. అయితే ఈ మోడల్ వినియోగదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. -
పక్షి ప్రపంచంలోని ఆసక్తికరమైన విషయాలు (ఫోటోలు)
-
సంగీతంతో ఒత్తిడి, డిప్రెషన్ దూరం.. అధ్యయనాల్లో వెల్లడి
పాటకు రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందంటారు. అంతేకాదు.. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఎలాంటి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం మ్యూజిక్ వింటూనే చేయించుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. కొన్ని క్లిష్టమైన రోగాలను సైతం నయం చేయగలిగే సత్తా సంగీతానికి ఉంటుంది. మరి సంగీతం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా.. సంగీతం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? మనసు బాగోకపోయినా, సంతోషంగా ఉన్నా, జర్నీలో ఉన్నా.. ఇలా ఏ సందర్భంలో అయినా పాటలు వింటూ ఉంటే చెప్పలేని సంతోషం.ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన ఇదే విషయాన్ని వెల్లడి చేస్తోంది. రెండు రూములను ఎంచుకొని, ఒకే విధమైన విత్తనాలను వాటిలో పెంచడం మొదలుపెట్టారు. వీటిలో ఒక రూములో శాసీ్త్రయ సంగీతం అదనంగా ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఈ మొక్కల ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉన్నట్లు పరిశోధన ఫలితం వెల్లడైంది. ►గుండె పనితీరు సక్రమంగా ఉండేందుకు సంగీతం కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ► ప్రతిరోజు ఒక అరగంటపాటు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల గుండె పనితీరు పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు సంగీతం వింటూ తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల శరీరంలో గుండెకు మేలు కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ► డిప్రెషన్, యాంగ్జయిటీ, పెయిన్, స్ట్రెస్ మొదలైన సమస్యలకు ఇప్పుడు సంగీతం కూడా చికిత్సగా ఉపయోగపడుతోంది. సంగీతం వినడం వల్ల విద్యార్థులు మరియు ఉద్యోగులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ► సంగీతం వినడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. ► మనకు నచ్చిన సంగీతం వింటే శరీరంలో హ్యాపీహార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని పూర్తి స్ధాయిలో పోగొడతాయి. ► సంగీతం వినడం వల్ల మతిమరుపు సమస్య కూడా దూరమవుతుంది. దీనికారణంగా అల్జీమర్స్ వంటి సమస్యలు చాలా వరకూ దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మ్యూజిక్ థెరపీ అనేది చాలా మంది మతిమరుపు సమస్యల్ని దూరం చేశాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నారు. ► ప్రతిరోజూ సంగీతం వినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
పురిటి కోసం విదేశాల నుంచి వస్తున్న పక్షులు.. ఎక్కడో తెలుసా?
తేలినీలాపురం.. సైబీరియా పక్షుల విడిది కేంద్రం. పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం. అల్లంత దూరం నుంచి పక్షులను చూడడం, చెట్టుపై వాలిన వాటి అందాలు గమనించడం సహజం. అవే పక్షులను దగ్గరగా చూస్తే..? వాటి ఆహారం, ఆహార్యం, అలవాట్లను తెలుసుకోగలిగితే..? చింత, రావి, తుమ్మ, గండ్ర, వెదురుపై వాలే అతిథి విహంగాల జీవన క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే..? ఎంత బాగుంటుందో కదా. ఆ సరదాను తీర్చడానికి తేలినీలాపురంలో పక్షుల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆహార అన్వేషణ, ఆవాసాలపై జీవించే క్రమంలో ఆయా పక్షుల ప్రత్యేకతలను వివరంగా తెలియజేస్తూ పక్షుల బొమ్మలను ఏర్పాటు చేశారు. పెలికాన్ పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు సుమారు 14 సెంటీమీటర్లు. దీని రెక్కల పొడవు సుమారు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకే సారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాశంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతీ సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. పెయింటెడ్ స్టార్క్ పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 సంవత్సరాలు కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. 120 రకాల పక్షుల్లో కొన్నింటి ప్రత్యేకతలు.. పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది. పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాశంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది. నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మ్యూజియం చూసొద్దామా... టెక్కలి సమీపంలోని తేలినీలాపురంలొ ఈ మ్యూజియం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎంత దూరం 70 కిలోమీటర్లు ఉంటుంది. రవాణా: టెక్కలి వరకు రైలు సదుపాయం ఉంది. బస్సు సదు పాయం కూడా ఉంది. టెక్కలి నుంచి పూండి మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి బస్సులు, ఆటోలు కూడా ఉన్నాయి. సందర్శనీయ వేళలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. -
ఆ ఊరి అబ్బాయిలకు ఎవరూ పిల్లనివ్వడం లేదు.. కారణం తెలిస్తే షాక్
పెళ్లి అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు. అందుకే సంబంధం చూసేటప్పుడు ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. అయితే బీహార్‌లోని ఓ గ్రామంలో కొన్నేళ్లుగా అబ్బాయిలకు పెళ్లిళ్లు జరగట్లేదట. మంచి ఉద్యోగాలు చేస్తున్నా ఆ ఊరి అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు నో అంటున్నారట. ఇంతకీ విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈకాలంలో సంబంధాలు కుదరాలంటే అంత ఈజీ కాదు. ఉద్యోగం,జాతకాలు శాలరీ, బ్యాంక్ బ్యాలెన్స్, వంటివి గట్టిగానే చూస్తున్నారు. ఏ ఒక్కటి మ్యాచ్ కాకపోయినా అమ్మాయిని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. అయితే బీహార్‌లోని జముయి జిల్లా సదర్ నగరానికి దగ్గర్లో ఉన్న 'బరుఅట్టా' అనే గ్రామంలో ఒక్క అమ్మాయికి కూడా పెళ్లి కావడం లేదు. అసలు ఆ ఊరి అబ్బాయిలకు సంబంధాలు రావడం లేదు. వాళ్లు ఉద్యోగాల కంటే పెళ్లి చేసుకోవడానికే ఎక్కువ కష్టపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. పెళ్లి కుదరడానికి ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటీ కుదరడం లేదట. దీనికి కారణం ఏంటంటే..బారుఅట్ట గ్రామంలో సుమారు 50 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే గ్రామంలో రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. వర్షాల సమయంలో ప్రాంతమంతా బురదమయంగా మారుతుండటంతో ఆ ఊరి అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వడానికి తల్లిదండ్రులు నో చెబుతున్నారట. -
దట్టమైన అడవిలో,చిమ్మ చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు
1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి. జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె. అయోమయంగా చూశాడు డాక్టర్. ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… ‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి… ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది… ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు… తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు… ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు… కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు… డాక్టర్ కదా… ఊరుకోలేకపోయాడు…నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు… ఆమెను అడిగాడు… ‘అసలు ఎవరు నువ్వు..? ఇక్కడికి ఎలా వచ్చావు..? ’‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు… నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ… ‘‘మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు… అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు… అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను… ఈ కడుపు ఆ ప్రేమ వల్లే… కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు… ఇటువైపు ఎవరూ రారు… నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు…’’ అంటూ రోదించసాగింది…డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది… కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు… పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది… డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి… నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్… ’కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు… పిల్ల ఏడ్చింది… ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి… అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే… తన జీతమే 75 రూపాయలు… ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది… ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు… ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు…‘‘సంతోషమో, దుఖమో.. మన చేతుల్లో ఏమీ లేవు… జరిగిందేదో జరిగిపోయింది… అన్నీ మరిచిపో… నీ జీవితం నీది… ప్లాన్ చేసుకో… ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది… అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు… వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు… తను తప్పక సాయం చేస్తాడు… ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు… ఏళ్లు గడిచాయి… కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు… ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు… అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు… ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది… ‘సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా..?’ అనడిగింది…‘అవును, చాలా ఏళ్ల క్రితం.,. నాకు ఆ ఊరితో బంధముంది… అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’ ‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’ ‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్… నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’ ‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది. డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది… కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది… జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా… ఆయన పాదాలపై పడింది… ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్… ఆయన గందరగోళంలో పడిపోయాడు… తరువాత ఆమె చెప్పింది… ‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు… ఆరోజు పుట్టింది ఈ బిడ్డే… మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను… స్టాఫ్ నర్స్ అయ్యాను… నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను… మీరే స్పూర్తి… ఆశీర్వదించండి సార్…’ అంది చేతులు జోడిస్తూ…ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి… తన తొలి డెలివరీ కేసు ఆమె… అదీ ఓ గడ్డు స్థితిలో… డాక్టర్ చంద్రను అడిగాడు… ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’ అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను… అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది… సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు… అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను… ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే… మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది… ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది… సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే…’ ఆమె చెబుతూనే ఉంది…ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు… ఆగడం లేదు… జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు… కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే… ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే అనుభూతి... -
ఇలా దీపాలు వెలిగిస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందట!
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాలు లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణమనే చెప్పాలి. దీపావళి నాడు దీపాలను వెలిగించడమనేది సాంప్రదాయంగా వస్తోంది. దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకి వెలిగించే దీపాల వల్ల నరకం వల్ల విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ దీపాల ప్రత్యేకత ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. నరక చతుర్దశి రోజున వస్తువులను దానం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది ఆరోజు యమధర్మరాజు పూజలు కూడా చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఇంటి ప్రధాన ద్వారాల వద్ద పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం లభించి అకాల మరణాలు సంభవించకుండా కాపాడుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. అందుకే ఈ పూజలో భాగంగా పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. దక్షిణం దిక్కున అభిముఖంగా ఈ పిండి దీపాలను వెలిగించి యమునికి ప్రీతికరమైన శ్లోకాలను పాటిస్తే మంచి జరుగుతుందని అంటారు. ఇలా చేయడం వల్ల అనుగ్రహంతో పాటు యమధర్మరాజు అనుగ్రహం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా ఈ దీపాలను తయారు చేసుకోవడానికి ఒక కప్పులు గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని దీపాల ఆకారంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన దీపాలలో నూనె వేసి వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించడం వల్ల చనిపోయిన తర్వాత నరకం నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటారు. దీపంతో దోషం పరిహారం జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. పిండి దీపం వెలిగించడం ద్వారా మీ కోరిక నెరవేరుందట. పిండి దీపాల వల్ల ఈ సమస్యలు తొలిగిపోతాయట ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రతిరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయట. బియ్యపు పిండితో చేసిన దీపారాధన వల్ల అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. -
గ్రహాంతరవాసులతో ఆ ఊరి వాళ్లకి సంబంధం ఏంటి? అడుగుపెట్టగానే..
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపూట భోజనం అయినా మానేస్తాం గానీ ఫోన్ లేకుండా ఉండలేం అనేంతగా అడిక్ట్ అయిపోతున్నాం. అయితే ఓ ఊళ్లో నివసించే ప్రజలు మాత్రం మొబైల్, టీవీ , రేడియో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. వినడానికి వింతగా ఉన్నా ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే నియమాన్ని పాటిస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ ఊరు ఎక్కడుంది? సెల్‌ఫోన్స్ లేకుండా అక్కడివాళ్లు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా వెస్ట్ వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్‌పై ఇక్కడ నిషేధం ఉండటంతో ఎవరూ స్మార్ట్‌ఫోన్స్, వైఫై వంటివేవీ ఉపయోగించడానికి వీల్లేదు. ఈ ఊళ్లు సెల్‌ఫోన్స్, వాటి సిగ్నల్ టవర్స్ ఎక్కడా కనిపించవు. గత యాభై ఏళ్లుగా ఇదే నిబంధన అమల్లో ఉంది. ఈ రూల్స్ పాటించేవాళ్లు ఊళ్లో ఉంటారు. అందుకు తగ్గట్లుగా ముందే రెంటల్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేకపోతే ఊరు ఖాళీ చేయొచ్చు కానీ రూల్స్ మాత్రం మార్చరు. నో సిగ్నల్స్.. కారణమిదే 2010 గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 150 మంది కంటే తక్కువే.(ఆ తర్వాత అధికారులు డాటాను వెల్లడించలేదు) సోలార్ పవర్, పాడిపరిశ్రమే అక్కడి వారి జీవనాధారం. వారంతంలో పర్యాటకులు అక్కడికి వచ్చినా సెల్ఫోన్లు పనిచేయకుండా ప్రత్యేకంగా జామర్లు కూడా ఏర్పాటు చేశారు. గ్రీన్‌బ్యాంక్ సిటీలోని ప్రజలు టెక్నాలజీకి దూరంగా ఉండటానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియా టెలిస్కోప్ ఉంది. ఖగోళంలోని రహస్యాలను చేధించేందుకు సుమారు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం పరిశోధనులు కొనసాగుతున్నాయి. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. అందుకే రేడియా టెలిస్కోప్కి ఎలాంటి డ్యామేజీ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పని చేసే ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అనుమతించరు.అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై ఇక్కడ నిషేధం ఉంది.మరి కమ్యూనికేషన్ ఎలా అంటారా?.. ఊరికి దూరంగా ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్ బూత్‌లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. -
Interesting World Facts: ఆశ్చర్యం కలిగించే ప్రపంచ నిజాలు
-
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇండియాలోనే నెం1 ప్లేస్
స్ట్రీట్ఫుడ్స్కి ఇప్పుడు ప్రాధాన్యత బాగా పెరిగింది. వెరైటీ స్టైల్లో, రుచికరమైన టేస్ట్‌తో స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ బాగా ఫేమస్ అవుతుంది. ఇటీవలె Borzo గ్లోబల్ ఇంట్రా-సిటీ డెలివరీ సర్వీస్ స్ట్రీట్ ఫుడ్స్‌పై సర్వేను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఏయే ప్రాంతాల్లో ఏ స్ట్రీట్‌ఫుడ్ ఫేమస్, టాప్10 స్ట్రీట్ ఫుడ్స్ ఏంటన్నదానిపై ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. టాప్-10 స్ట్రీట్ ఫుడ్స్.. 1. బిర్యానీ 2. వడపావ్ 3. మోమోస్ 4. చోలేబతురే 5. సమోసా 6. పావ్‌భాజీ 7. మసాలా దోశ 8. టుండే కబాబ్ 9. పోహ జలేబి 10. కచోరి టాప్10 స్ట్రీట్ జ్యూస్‌లు, షేక్స్: 1. మ్యాంగో మిల్క్ షేక్ 2. కోల్డ్ కాఫీ 3. మోసంబి జ్యూస్ 4. ఫలూదా 5. లస్సీ 6. నిమ్మరసం 7. ఆపిల్ జ్యూస్ 8. బాదం షేక్ 9. కాలా ఖట్టా 10. చెరకు రసం -
మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిన టాప్15 స్ట్రీట్‌ఫుడ్స్ ఇవే
మన దేశంలో స్ట్రీట్‌ఫుడ్‌కి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఎందుకంటే వీటిలో దొరికే రుచి పెద్దపెద్ద ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనూ లభించదు కాబట్టి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆహార పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇక మన దేశంలో ఎన్నో రకాల ప్రత్యేకమైన, విభిన్నమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్స్ వద్ద కనిపించే జససందోహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మధ్య బీటెక్ చాయ్వాలీ దగ్గర్నుంచి, గ్రాడ్యుయేట్ పానీపూరీ వరకు.. ఎంతోమంది యువత సైతం స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ తమకంటూ సొంత గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఏ వీధి చూసినా స్ట్రీట్‌ఫుడ్ వద్ద జనం కిటకిటలాడుతుంటారు. మరి మన దేశంలో తప్పకుండా రుచి చూడాల్సిన స్ట్రీట్‌ఫుడ్స్ ఏంటన్నది చూసేద్దామా.. ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్, అవి ఎక్కడ దొరుకుయన్నది ఓసారి పరిశీలిస్తే.. 1. ముంబైలోని జోగేశ్వరిలో- ఫరీద్ సీఖ్పరాట 2. అర్సలన్ బిర్యానీ- పార్క్ స్ట్రీట్, కోల్‌కతా 3. అంబర్ వడాపావ్- కల్యాణ్, ముంబై 4. బటర్ చికెన్- రాజీందర్ దా డాబా- సఫ్దర్‌జంగ్, ఢిల్లీ 5. మిసల్ పావ్ బేడ్కర్- మిసల్, ఫూణె 6. ప్యాజ్ కచోరి రావత్ మిస్తాన్ బాంఢర్- జైపూర్ 7. మూల్‌చంద్ పరాటా- లాజ్‌పత్ నగర్, ఢిల్లీ 8. షాదాబ్ బిర్యానీ- హైదరాబాద్ 9. సర్దార్ పావ్ భాజీ- ముంబై 10. సౌత్ ఇండియా బెస్ట్ ఉడిపి శ్రీ దర్శిని- ఎల్లిస్ బ్రిడ్జ్, అహ్మదాబాద్ 11. రసగంగా మీల్స్- బెల్లందూర్, బెంగళూరు 12. కొరియన్ వ్రాప్- బెంగళూరు 13. నటరాజ్దహీ భల్లే - చాందిని చౌక్, ఢిల్లీ 14. తండా కబాబ్- లక్నో 15. జోషి దహి వడ- ఇండోర్ ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో స్ట్రీట్‌ఫుడ్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉందనే చెప్పాలి. అక్కడ చాట్, చట్పటా, పావ్‌బాజీ లాంటి ఎన్నో రెసిపిలు బాగా ఫేమస్. దేశంలో టాప్ 10 స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయంటే.. ఢిల్లీ: రోహిణి, చాందిని చౌక్, రాజౌరు గార్డెన్, లాజ్పుట్ నగర్. ముంబై: మహమ్మద్ అలీ రోడ్, బాంద్రా, అంధేరీ, మలద్, ఘట్కోపర్ హైదరాబాద్: కూకట్పల్లి, ఓల్డ్‌సిటీ, టోలిచోకి పూణె: శివాజీ నగర్, జేఎమ్ రోడ్ -
మీరు తెలివైన వాళ్లని ఫీల్ అవుతున్నారా? ఈ లక్షణాలు ఉన్నాయా మరి
అందరికీ తెలితేటలుంటాయి. కానీ ఐక్యూ ప్రకారం కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ తెలివితేటలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారిగా నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వాళ్లుగా గుర్తించాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తారు? మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? చెక్ చేసుకోండి.. ►వీళ్లు ఒక పనిపై గంటల సమయం దృష్టి కేంద్రీకరించగలరు. విషయం చిన్నదైనా వారి ఆలోచన మాత్రం పరిధికి మించి ఉంటుందట. ► ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ► దేన్నైనా ఓపెన్ మైండ్‌తో ఆలోచించేవారిలో ఐక్యూ కూడా ఎక్కువేనట. ► దేన్నైనా క్రియేటివ్‌గా, కొత్తగా ఆలోచిస్తారట. ► ఐక్యూ అధికంగా ఉండే వారు ఎక్కువగా సింగిల్‌గా ఉంటారట..వేరే వాళ్ల మీద ఆధారపడకుండా తమ సొంత ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. ► బ్యాలెన్స్డ్ థింకింగ్, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఏ సందర్భంలో అయినా నిగ్రహం కోల్పోకుండా సెల్ఫ్ కంట్రోల్‌తో ఉంటారట. వీళ్లు ఎక్కువ మాట్లాడటం కంటే అవతలి వాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడతారు. ► తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. తొందరగా ఎవరితోనూ మాట్లాడరు, కలవరు. ►లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్‌ని సాధారణంగా తెలివైన వారుగా పరిగణిస్తారు. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉంటారట. ► పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరిలొ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ ఇదే.. వారిలో రిస్క్ తక్కువ
మానన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం. ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి.. శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్ను కూడా కణాల నుంచి తొలగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం. సాధారణంగా మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు (Human Blood Groups) కనిపిస్తాయి. A, B, AB, O పాజిటివ్.. అలాగే నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయన్నది తెలిసిందే. వీటిలో రేర్ బ్లడ్ గ్రూప్ ఏది? ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారన్నది ఇప్పుడు చూద్దాం. మామూలు బ్లడ్ గ్రూపులలోని ఎర్ర రక్త కణాల్లో షుగర్ మాలిక్యుల్స్ ఉంటాయి. ఆ మాలిక్యుల్స్ని బట్టి బ్లడ్ గ్రూపులను నిర్ణయిస్తారు. A- యాంటిజన్ ఉంటే A గ్రూపు, B-యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్‌గా లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు. Group A –ఇందులో యాంటిజన్ A, యాంటిబాడీస్ B ఉంటుంది Group B –యాంటిజన్ B and యాంటిబాడిస్ A ఉంటుంది Group AB –యాంటిజన్స్ AB ఉంటుంది కానీ యాంటిబాడీస్ ఉండవు (neither A nor B). Group O – యాంటిజన్స్ ఉండవు కానీ AB యాంటిబాడీస్ ఉంటాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అందించిన వివరాల ప్రకారం.. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారంటే.. O పాజిటివ్ బ్లడ్: 42% A పాజిటివ్ బ్లడ్: 31% B పాజిటివ్ బ్లడ్: 15% AB పాజిటివ్ బ్లడ్ : 5% O నెగిటివ్ బ్లడ్ : 3% A నెగిటివ్ బ్లడ్ : 2.5% B నెగిటివ్ బ్లడ్ : 1% AB నెగిటివ్ బ్లడ్ : 0.5% మందిలో ఉంది. ఈ గణాంకాలు బట్టి అరుదైన బ్లడ్ గ్రూపులు ఏంటన్నది సులభంగా అర్థమవుతోంది. దేశంలో B నెగిటివ్ బ్లడ్ కేవలం 1% మందిలోనే ఉండగా, అత్యల్పంగా AB నెగిటివ్ బ్లడ్ 0.5% మందిలో ఉంది. దీంతో దీంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి రక్తం లభించడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కోసారి సమయానికి సమయానికి రక్తం లభించక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే B నెగిటివ్, AB నెగిటివ్ బ్లడ్ గ్రూపులను అరుదైన బ్లడ్ గ్రూప్స్‌గా పేర్కొంటారు. అన్ని బ్లడ్ గ్రూప్స్‌లో కంటే O పాజిటివ్ బ్లడ్ ఉన్నవారు ఎవరికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందుకే వీరిని యూనివర్సల్ డోనర్స్ అంటాం. అంతేకాకుండా మిగిలిన బ్లడ్ గ్రూపుల వారికంటే వీరికి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తక్కువని పలు పరిశోధనల్లో వెల్లడైంది. భారత్‌లో O(+,-) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు సుమారు 29% మంది ఉండగా అత్యధికంగా పెరు దేశంలో O(+,-) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 71% మంది ఉండటం విశేషం. -
ఇంట్లోనే కూర్చొని స్మార్ట్‌ఫోన్‌తో డబ్బు సంపాదించడం ఎలా?
ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలా? ఈరోజుల్లో రెండు చేతులా సంపాదించడం అనివార్యం అయిపోయింది. దీంతో ఆన్లైన్లో ఎక్స్ట్రా ఎన్‌కమ్ కోసం ఏవేవో వెబ్సైట్లను ఆశ్రయించి మోసపోతుంటారు. కానీ కాస్త తెలివిగా ఆలోచించి జెన్యూన్ వెబ్‌సైట్స్, యాప్స్‌ను సంప్రదిస్తే నెలకు ఈజీగా రూ.20-30వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ ఫోన్‌తో రెండు చేతూలా డబ్బులు సంపాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రీలాన్సింగ్: మీలో స్కిల్ ఉంటే చాలు అనేక వెబ్‌సైట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో Upwork, Fiverr, Freelancer.com వంటి పలు ప్లాట్‌ఫామ్స్ జెన్యూన్ అని చెప్పొచ్చు. ఈ వెబ్‌సైట్స్ క్లయింట్‌కి, యూజర్‌కి మధ్య మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఒక్కసారి ప్రాజెక్ట్ డీల్ కుదిరాక ఆ వెబ్‌సైట్స్ కొంత వాటాను తీసుకుంటాయి. అయితే ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా ఒకే రోజులో ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు. Affliate marketing (అఫిలియేట్ మార్కెటింగ్ ) అఫిలియేట్ మార్కెటింగ్ ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఉదాహరణకు మొబైల్, టీవీ లాంటి ఏదైనా వస్తువులపై రివ్యూ చెప్తూ అది సూపర్ ప్రొడక్ట్ అని భ్రమ కల్పిస్తారు. అలా ప్రమోట్ చేసి ఆ వస్తువులను అమ్మడం , అలా అమ్మినందుకు మీకు కొంత కమిషన్ ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది . ఆన్లైన్ సర్వే: ఆన్లైన్ సర్వే కోసం మార్కెట్లో చాలా వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫ్రీగా ఉంటే మరికొన్ని యూజర్లకు డబ్బులు ఇస్తాయి. వెబ్‌సైట్‌పై సర్వే చేయడం ద్వారా డబ్బు సపాందించవచ్చు. బ్లాగింగ్: ఏదైనా ప్రత్యేకమైన సబ్జెక్ట్‌పై మీకు స్కిల్ ఉంటే దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు వంటలు బాగా వచ్చిన వాళ్లు, ప్రత్యేక కుకింగ్ బ్లాగ్ వ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదివచ్చు. గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ప్రకటనలు, అనుబంధ మార్కెటింగ్, ప్రొడక్ట్ రివ్యూలు వంటి బ్లాగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఆన్లైన్ ట్యూటరింగ్: ఆన్లైన్ ట్యూటరింగ్ ద్వారా ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. Chegg India, Vedantu వంటి ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో క్లాసులు చెప్పి డబ్బులు సంపాదించొచ్చు. పాడ్‌కాస్టింగ్: ఈమధ్య కాలంలో డబ్బు సంపాదించడానికి ట్రెండ్ అవుతున్న మరో మార్గం పాడ్‌కాస్టింగ్. ప్రత్యేకమైన గొంతు ఉంటే చాలు పాడ్కాస్ట్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంచుకొని డిజిటల్ ఆడియో రూపంలో పాడ్‌కాస్టింగ్ చేయొచ్చు. యూట్యూబ్ మనలో చాలామంది టైంపాస్ కోసమో, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసమో గంటలకొద్దీ యూట్యూబ్ చూస్తుంటాం. కానీ యూట్యూబ్ వల్లే ఈమధ్య కాలంలో పలువురు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంచుకొని వీడియోలు చేసి వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడమే. యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. అలా యాడ్స్, వీడియో రన్‌టైం, వ్యూస్‌ని బట్టి మీకు గట్టిగానే ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఇండియాలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆన్లైన్ రైటింగ్: మీలో స్క్రిప్ట్ రాసే నేపుణ్యం ఉంటే ఈ అవకాశం మీకోసమే. ఆన్లైన్లో ఈమధ్యకాలంలో చాలా వెబ్‌సైట్స్ పార్ట్‌టైమ్ జాబ్ చేసేవాళ్ల కోసం వెతుకుతుంది. రైటింగ్ టాలెంట్‌తో బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌కి కంటెంట్ రాయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్స్లేషన్: తెలుగు, హిందీ, ఇంగ్లీష్..ఇలా పలు భాషలపై మీకు పట్టుంటే చాలు ఈజీగా ట్రాన్స్‌లేట్ చేసి డబ్బులు సంపాదిచుకోవచ్చు. వెబ్‌సైట్స్, డాక్యుమెంట్స్, బ్లాగ్స్లో కంటెంట్‌ను అనువాదం చేయడం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆన్లైన్ డేటా ఎంట్రీ: ఆన్లైన్లో ఎక్కువ మొత్తంలో ఈ తరహా జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా ఎంట్రీకి పెద్దగా ఎక్సీపీరియన్స్ అవరసం లేదు. -
సర్జరీ లేకుండా మతిమరుపును పోగొట్టొచ్చు, శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం
విద్యుత్ షాక్‌ని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని శాస్త్రవేత్తలు కొత్తరకం ప్రయోగం చేశారు. హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందట. అంతేకాకుండా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే ఈ చికిత్స నిర్వహించనున్నట్లు సైంటిస్టులు తెలిపారు. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్ ఒకటి. అల్జీమర్స్ కారణంగా మానసిక, ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి. ఈ న్యూరోలాజిక్ డిజార్డర్ కారణంగా బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటాయి. కాలక్రమేణా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి. మెదడులోని టెంపోరలో అనే భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి. అల్జీమర్స్ బారినపడినవాళ్ల లో ఈ కణాలు సన్నగా, చిన్నగా అవుతాయి. దాంతో టెంపోరల్ చిన్నగా అవుతుంది. అంతేకాదు 'హైపోమెటబాలిజం' ఉంటుంది. అంటే గ్లూకోజ్ తక్కువ అందుతుంది. దాంతో మెదడు చురుకుదనం కోల్పోతుంది. దాంతో ఆలోచనా శక్తి తగ్గిపోవడమే. కాకుండా జ్ఞాపకాలు చెదిరిపోయి, మతిమరుపు మొదలవుతుంది. హిప్పోకాంపస్లోని న్యూరాన్లను ఉత్తేజపరిచేందుకు కొత్త హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని రీసెంట్గా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ (ICL) శాస్త్రవేత్తల నేతృత్వంలో టెంపోరల్ ఇంటర్ఫెరెన్స్ (TI) బ్రెయిన్ స్టిమ్యులేషన్‌తో మతిమరుపును పోగొట్టచ్చని కనిపెట్టారు. ఇందులో భాగంగా హై ఫ్రీక్వెన్సీ విద్యుత్ కణాలకు బ్రెయిన్‌కు పంపించి జ్ఞాపకశక్తిని తిరిగి పొందేందుకు సహాయపడుతుందట. ఇందులో భాగంగా2,000 Hz,2,005 Hz, వద్ద విద్యుత్ కణాలను పంపిస్తాయి. ఇది ఒకరకంగా కరెంట్ షాక్ లాంటిదే. 5-Hz కరెంట్‌తో అదే ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. దీని వల్ల సెల్-పవర్ చేసే మైటోకాండ్రియాను పునరుజ్జీవింపజేస్తాయని, ఇది మతిమరుపును పోగొడుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో వివరించారు.''ఇప్పటివరకు మెదడుకు సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తితే రోగికి ఎలక్ట్రోడ్లను శస్త్రచికిత్స ద్వారా అమర్చాల్సి వచ్చేది. కానీ ఈ హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో ఎలాంటి నొప్పిలేకుండా రోగికి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేలా చేయొచ్చు.'' అని సైంటిస్ట్ నిర్ గ్రాస్మాన్ తెలిపారు. ఈ టెక్నిక్‌తో సర్జరీ అవసరం లేకుండా మనిషి మెదడులోని కణాలను ప్రేరేపించడం సాధ్యమవుతుంది. ఇది బ్రెయిన్ సెల్స్‌ను ప్రభావితం చేస్తుంది అని పేర్కొన్నారు. -
భూకంపాలను తట్టుకొని నిలబడే ఇల్లు, కేవలం 26 గంటల్లోనే..
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అంటే జీవితంలో ఈ రెండు పనులు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనేది దాని అర్థం. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నది చాలామందికి కలగా ఉంటుంది. అయితే ఇదంత చిన్న విషయం కాదు. ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. పునాది మొదలు పైకప్పు దాకా కొన్ని నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా భారత నిర్మాణ రంగంలో త్రీ డైమెన్షనల్ ప్రింటింగ్ అనే కొత్త టెక్నాలజీ వచ్చి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేదు.జస్ట్.. ఇంటి స్థలం ఒక్కటి చాలు. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు భూకంపాలను తట్టుకొని నిలబడి ఇంటి నిర్మాణాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ప్రముఖ సిమెంట్ కంపెనీ ప్రోగ్రెసో తన మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ ఇంటిని నిర్మించింది. ప్రోటోటైప్ డిజైన్‌తో భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ ఇంటిని డిజైన్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం 26 గంటల్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు భూకంపాలను తట్టుకొని నిలబడగలదు. 49 స్క్వైర్ఫీట్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఇందులో COBOD ప్రింటర్‌ను ఉపయోగించారు. రీసెంట్గా బెంగళూరులో తొలి 3డి ప్రింటింగ్‌తో ఏర్పాటైన పోస్టాఫీస్ నిర్మాణంలోనూ ఇదే తరహా ప్రింటర్‌ను ఉపయోగించారు. ఇంటి పైకప్పులను రాంచో రకం తాటాకులతో నిర్మించారు. ఈ తరహా నిర్మాణం సాధారణంగా కొన్నేళ్లుగా లాటిన్ అమెరికాలో ఉపయోగిస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో పాటు ఇంటిని కాస్త వేడిగా ఉంచుతుంది. 3డీ ప్రింటింగ్ నిర్మాణం ముఖ్యంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలాకు బాగా సరిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో 3డీ నిర్మాణం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేకుండా కేవలం ఇంటి స్థలం ఉంటే చాలు అందమైన ఇంటిని కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. రోబోల మాదిరిగా రోజుల్లోనే ఇంటిని కట్టిపడేస్తోందీ ఈ 3డీ టెక్నాలజీ. జస్ట్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇల్లు రెడీ అవుతుంది మరి. 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి? సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్‌ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు.అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్‌లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు. -
యూట్యూబ్ ఛానల్‌తో కోటీశ్వరుడు అయ్యాడు, అలాంటి వీడియోలతొ..
‘అసాధ్యం’ అనే మాటలో కొందరు ‘అ’ అనే అక్షరాన్ని ఎప్పటికీ పట్టించుకోరు. అజయ్ అక్షరాలా అలాంటి కుర్రాడే. ‘మనం అనుకోవాలేగానీ సాధ్యం కానిది అంటూ ఏముంది’ అనేది అతడి నమ్మకం. అంతులేని బలం. చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి వచ్చాడు హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అజయ్ నాగర్. ఇరవై ఏళ్లు దాటే లోపే వైరల్ యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్‌మోడల్ అయ్యాడు. చిన్నప్పుడు ఫుట్‌బాల్ ట్యుటోరియల్ వీడియోలు చూస్తూ వాటి నుంచి స్ఫూర్తి పొంది యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు అజయ్. ‘అడిక్టెడ్’ పేరుతో ఉన్న అతడి యూట్యూబ్ చానల్ ఆ తరువాత ‘క్యారీ డియోల్’గా పేరు మార్చుకుంది. కొత్త పేరే కాదు...కొత్త కంటెంట్ వచ్చింది. గేమ్‌ప్లే ఫుటేజిని అప్లోడ్ చేయడం నుంచి హీరో సన్నీ డియోల్‌ను అనుకరించడం వరకు ఎన్నో చేశాడు. అజయ్ వీడియో ‘యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్: ది ఎండ్’ ఆరు రోజుల్లోనే 72.2 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. అజయ్ ఫాలోవర్స్ ఒక రేంజ్‌కు చేరుకునే సమయానికి చానల్ పేరు ‘క్యారీమినటీ’గా మారింది. ‘ఇంతకీ క్యారీమినటీ అంటే?’ అని అడిగితే ‘నాకు కూడా తెలియదు. ఇట్ జస్ట్ సౌండ్స్ కూల్ అని అలా డిసైడైపోయాను’ నవ్వుతూ అంటాడు అజయ్. ఒక వీడియో హిట్ అయిన తరువాత సంతోషం మాటేమిటోగానీ దాని ప్రభావం చేయబోయే వీడియో మీద పడుతుంది. ‘గత వీడియోను మించి వ్యూస్ రావాలి’ అనుకునే సమయంలో ఒత్తిడి వచ్చి తల మీద కూర్చుంటుంది. దాన్ని కిందికి దించడం కష్టమైన పని. మరి ఈ సమస్యను అజయ్ ఎలా ఎదుర్కొన్నాడు? అతడి మాటల్లోనే... ‘వీడియోలు చేస్తుప్పుడు ఒత్తిడికి గురవుతుంటారా? అని నన్ను చాలామంది అడిగే వాళ్లు. ఒత్తిడి ఏమిటి! అని ఆశ్చర్యపడేవాడిని. అయితే అది ఒకప్పటి సంగతి. ఆ తరువాత నాలో కూడా మెల్లగా ఒత్తిడి మొదలైంది. ఎన్నో లక్షల మంది నా వీడియోలు చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా చేయాలి. నెగెటివ్ కామెంట్స్ రావద్దు...అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాడిని. అయితే చివరి సమయంలో మాత్రం ఏదైతే అది అవుతుంది అనుకొని నా మనసుకు నచ్చినట్లు చేసేవాడిని. నా అంచనా ఎప్పుడూ తప్పలేదు’ఎవరి పిల్లలు వారికి ముద్దు అన్నట్లు ఎవరు చేసిన వీడియోలు వారికి మురిపెంగానే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన వీడియోలను యూట్యూబ్‌లోకి వదిలే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాడు. బయటి ప్రేక్షకుడు ఎవరో చూస్తున్నట్లుగా తన వీడియోను చూస్తాడు.జీవితం పర్సనల్ లైఫ్,ప్రొఫెషనల్ లైఫ్ అని రెండు ప్రపంచాలుగా విడిపోయిన కాలంలో ఉన్నాం మనం. ప్రొఫెషనల్ లైఫ్‌లోనే అజయ్ ఎక్కువ కాలం గడపడం వల్ల కాలేజీ, యూనివర్శిటీలలో చదువుకునే అవకాశం రాలేదు. ఫ్రెండ్స్‌తో సరదాలు లేవు. వినోదాలు లేవు. అయితే అజేయపథంలో దూసుకుపోతున్న అజయ్ నాగర్‌కు వాటి గురించి గుర్తు రావడం అరుదే. ‘అజయ్ నాగర్, క్యారీమినటీ ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరి అవసరం మరొకరికి ఉంది. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ లేడు అనే బాధ నాకు లేదు’ అంటాడు అజయ్.‘చాలా కష్టసమయంలో మీ వీడియో ఒకటి చూశాను. ఉత్సాహం పుంజుకోవడానికి అది నాకు ఔషధంలా పనిచేసింది’ ఇలాంటి ఈమెయిల్స్ అజయ్‌కు వస్తుంటాయి. వాటిని చదివినప్పుడల్లా తన బలం రెట్టింపు కావడంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది.హార్డ్‌వర్క్, టాలెంట్‌తో అయిదు యూట్యూబ్ అవార్డ్‌లతో పాటు అజయ్ ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. ఆర్థిక కోణంలో కోటీశ్వరుడు అయ్యాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్‌మోడల్‌గా మారాడు. -
స్మార్ట్‌ఫోన్‌లో వేల కొద్ది బాక్టీరియా.. ఇలా క్లీన్ చేసుకోండి
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్‌లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి. ఫోన్ నీట్‌గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్‌లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్‌ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్లెస్ మెషిన్లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ! -
ఈ స్కూళ్లో ఫీజులుండవు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే చాలు..
అస్సాంలోని పామోహి ప్రాంతంలో ఉన్న ‘అక్షర్ స్కూల్’ ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూల్లో ఫీజులకు బదులు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుంటారు. పరిమిత శర్మ, మజిన్ ముఖ్తార్ అనే దంపతులు ఈ స్కూల్‌ను స్థాపించారు. ఫీజుల రూపంలో వచ్చిన బాటిల్స్‌ను వివిధ రూపాల్లో పునర్వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ను ఎలా రీసైకిల్ చేయాలో విద్యార్థులకు నేర్పుతున్నారు. నాగాలాండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి టెమ్జెన్ ఈ స్కూల్ గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ‘గుడ్ ఐడియా’ అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపించారు. If this doesn't surprise you, what does?#Incredible_NorthEast Credit: northeastview_ pic.twitter.com/6RO1SqhaNa — Temjen Imna Along (@AlongImna) October 12, 2023 -
అలాంటి వాళ్లతో స్నేహం, విరోధం రెండూ వద్దు
దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. వాళ్ళతో విరోధం కూడా కూడదు. వారిని పట్టించుకోకుండా ఉండడమే మేలు. నిప్పును పట్టుకుంటే కాలుతుంది. చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అవుతుంది. కనుక దాని జోలికి పోకపోవడమే మేలు. విలువలేని దుమ్ము కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి విలవిలలాడేలా చేస్తుంది. విలువ లేని కొందరు మనుషులు కూడా చాలాసార్లు తమ మాటలతో బాధపెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం. నమ్మకం అనేది గాజు పాత్ర లాంటిది. గాజు పాత్ర ఒక్కసారి చేతి నుండి కింద పడితే దాన్ని అతికించడం ఎలా అసాధ్యమో, ఒకసారి మనం ఒక వ్యక్తి దగ్గర నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించడం అలా అసాధ్యం... అసంభవం. కాబట్టి కలుషితమైన ఈ రోజుల్లో కల్మషం లేకుండా నిన్ను ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నీ ప్రాణాన్ని అయినా పణంగా పెట్టు తప్పులేదు కానీ నమ్మకాన్ని కోల్పోకు... -
శీతాకాలం విడిది కోసం వలస వెళ్తున్న పక్షులు, వేలకిలోమీటర్ల ప్రయాణం
శీతాకాలం విడిది కోసం పక్షుల వలసలు మొదలయ్యాయి. దేశీయంగానూ ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు పక్షులు వలస వెళ్తాయి.ఎన్నో జాతుల పక్షులకు వలస వెళ్ళడం వాటి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ప్రపంచ పక్షి జాతుల్లో సుమారు 40శాతం దాకా వలస వెళ్తాయని అంచనా. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. శీతోష్ణస్థితిలో ఏర్పడిన అననుకూల పరిస్థితుల వల్ల, ఆహారం కోసం, గుడ్లను పెట్టి పొదిగి సంతానాభివృద్ధికి, వ్యాధుల నుంచి రక్షణకు పక్షులు వలస వెళ్తాయి. వలసలో భాగంగా పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.వాతావరణం అనుకూలంగా మారిన తరవాత మళ్ళీ వెనుదిరుగుతాయి. ముఖ్యంగా శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి పక్షులు భారత్‌లోకి వలస వస్తుంటాయి. అయితే శీతాకాల విడిది కోసం వలస వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు ఓనోన్ కుకూ. ఏప్రిల్29న ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పక్షి ఈరోజు(శనివారం)మధ్యప్రదేశ్‌కి చేరుకుంది. అరేబియా సముద్రానికి 150 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఈ పక్షి ప్రయాణం సాగింది. మరో వారం రోజుల్లో ఇది 5వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.దీనిలాగే ఇతర పక్షులు కూడా మార్గమధ్యంలో ఆహారం, విశ్రాంతి కోసం కొంతకాలం ఆగుతాయి. He is Onon a Cuckoo. This bird was in Kenya on 29th April. Today he is in Madhya Pradesh. He has completed his crossing of the Arabian Sea to India and, for good measure, flown another 600 km inland also. It is 5000 Kms flying in a week. Feel that amazing feat. @BirdingBeijing pic.twitter.com/SGfuGO3MkS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 4, 2020 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే విభిన్న రకాల విదేశీ పక్షులను చూసేందుకు, కెమెరాలతో క్లిక్ మనిపించేందుకు బర్డ్ వాచర్లు క్యూ కడుతుంటారు. అయితే ఒకప్పుడు వందల సంఖ్యలో వచ్చే విదేశీ పక్షుల రాక క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ పక్షులు ఆవాసాలుగా చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవడం, చెరువుల చుట్టూ నిర్మాణాలు పెరిగిపోతుండటంతో వాటి రాక క్రమంగా తగ్గిపోతోంది. 📢Today is the day! Let’s celebrate bird migration on #WorldMigratoryBirdDay! On their epic journeys, migratory birds help inspire many people and cultures along the way. Learn more about their migration & how you can protect them: ➡️https://t.co/SoAJkVyx3z pic.twitter.com/OIiFGSPaTp — World Migratory Bird Day (@WMBD) October 14, 2023 ప్రస్తుతం ఈ సీజన్లోనూ సిటీకి విదేశీ పక్షులు వచ్చినప్పటికీ మునుపటితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని బర్డ్వాచర్లు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే రాను రాను ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రయాణాల్లో సులువుగా..ఈ గిటార్‌ను మడిచేసుకోవచ్చు...
గిటార్ సంగీతాన్ని ఇష్టపడనివారు ఉండరు. గిటార్ వాద్యంలో విద్వత్తును సాధించిన వారు కొద్దిమంది ఉంటే, కాలక్షేపంగా గిటార్ వాద్యాన్ని సాధన చేసేవారు ఎందరో ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు గిటార్‌ను తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనే! పొడవాటి గిటార్‌ను జాగ్రత్తగా బాక్స్‌లో భద్రపరచి తీసుకుపోవాల్సి ఉంటుంది. లగేజీలో ఇది చాలా చోటును ఆక్రమిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, గిటార్ ధ్వంసమయ్యే ప్రమాదాలూ లేకపోలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికన్ సంగీత పరికరాల తయారీ కంపెనీ ‘కియరీ గిటార్స్’ సులువుగా మడిచేసుకునే గిటార్‌ను ‘ఎసెండర్ పీ90 సోలో’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీన్ని తేలికగా మడిచి, ప్యాక్ చేసుకోవచ్చు. దీని ధర 1599 డాలర్లు (రూ.1.32 లక్షలు) మాత్రమే! -
పిచ్చి పీక్స్ అంటే ఇదే.. పచ్చిగుడ్డుతో వెరైటీ టీ
మనలో చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. ఎన్ని పనులున్నా మొదట టీ తాగిన తర్వాతే ప్రారంభించే వాళ్లు బోలెడు మంది ఉన్నారు. నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఒక్క టీ అయినా పడాల్సిందే అనేలా ఫీల్ అవుతుంటారు. అంతగా మనోళ్లు ఛాయ్‌కి ప్రాధాన్యత ఇస్తారు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ లాంటి ఎన్నో వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎగ్ టీ గురించి మీకు తెలుసా? ఈ వెరైటీ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా టీ తయారు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ ఓ యూట్యూబర్ తయారు చేసిన వింత టీ గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఈ టీ టేస్ట్ సంగతి అటు ఉంచితే, దీన్ని తయారు చేయడం చూస్తేనే కడుపులో తిప్పేస్తుంది. ఎందుకంటే ఈ టీని పచ్చిగుడ్డుతో, పండ్లతో తయారు చేస్తారు. సాధారణంగా ఎగ్ టీ అనేది వెస్ట్రన్ దేశాల్లో బాగా ఫేమస్. వియత్నాం, స్వీడన్ వంటి దేశాల్లో గుడ్డును తరచూ టీ, కాఫీల్లో కలుపుకొని తాగేస్తారు. ఇంకెందుకు ఆలస్యమని ఇప్పుడు అదే ట్రెండ్‌ను మనవాళ్లూ ట్రై చేస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ షేర్ చేసిన ఎగ్ టీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఏం చేసిందంటే.. ముందుగా టీ గిన్నె పెట్టుకుని అందులో షుగర్, టీ పొడి వేసి వేయించింది. ఇప్పుడు యాపిల్ ని ముక్కలుగా కోసి వేసి వేయించింది. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసి కాసేపు మరగ బెట్టింది. కాసేపు అయ్యాక పచ్చి గుడ్డును పగుల కొట్టి ఆ టీలో కలిపేసింది. ఆ తర్వాత ఫైనల్ టచ్ కోసం యాలకులు, దాల్చిన చెక్క వేసి మళ్లీ మరిగించి ఓ కప్పులో సర్వ్ చేసింది. ప్రస్తుతం ఈ వెరైటీ ఎగ్ టీకి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. ఈ టీని తాగిన వాళ్లు బతికే ఉన్నారా? ఇలాంటి పిచ్చి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టీ తాగే ముందు, లేదా తర్వాత వెంటనే పండ్లను, గుడ్డును తినకూడదంటూ డైటీషియన్లు చెబుతున్న వీడియోలను కొందరు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఎంత వెస్ట్రన్ కల్చర్‌ను ఫాలో అవుతున్నా, కొన్ని మన ఆరోగ్యానికి కూడా నప్పేలా ఉండాలి, ప్రతీది ఇలా కాపీ కొట్టందంటూ హితవు పలుకుతున్నారు. -
గడ్డకట్టిన మంచుతో భారీ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
గడ్డకట్టిన మంచుతో శిల్పాలు చెక్కి ప్రదర్శనకు పెట్టడం చలి ప్రదేశాల్లో మామూలే! స్వీడన్లోనైతే ఏకంగా గడ్డకట్టిన మంచుతో ఒక భారీ హోటల్‌నే నిర్మించారు. ఇందులోని మంచాలు, కుర్చీలు, బల్లలు వంటివన్నీ గడ్డకట్టిన మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. జేమ్స్‌బాండ్ సినిమా ‘డై ఎనదర్ డే’లో కనిపించిన భవంతి నమూనా ఆధారంగా ఈ హోటల్‌ను నిర్మించడం విశేషం. టోర్నె నదిలో గడ్డ కట్టిన మంచును తవ్వి తెచ్చి, నదికి సమీపంలోనే దీనిని ఐదువందల టన్నుల మంచుతో నిర్మించారు. ఇందులో పన్నెండు ఆర్ట్ స్వీట్రూమ్స్, ఒక డీలక్స్ స్వీట్‌రూమ్, థీమ్డ్ రూమ్‌లు, బార్ సహా పలు వసతులు ఉన్నాయి. ఈ హోటల్లో పది ఒలింపిక్ స్విమింగ్ పూల్స్, ముప్పయిమూడు చిన్న స్విమింగ్‌పూల్స్ కూడా ఉన్నాయి. లూకా రోంకొరోని నేతృత్వంలో ఇరవై నాలుగు మంది హిమశిల్పులు దీనిని నిర్మించారు. దీని లోపలి భాగంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఏడాది పొడవునా అతిథులకు అందుబాటులో ఉంటుంది. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన వాటర్ బాటిల్ ఇదే..టేస్ట్ అదిరిపోతుంది!
ఒక వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. అదే హోటల్స్‌లో అయితే వంద రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ వాటర్ బాటిల్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే దీని ధర అక్షరాలా రూ. 45 లక్షలు. అవును మీరు విన్నది నిజమే. ఆ వాటర్ బాటిల్ మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. మరి ఆ స్పెషల్ ఏంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచి నీళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా?లీటర్ కూడా ఉండని ఈ బాటిల్ ధర దాదాపు 45 లక్షల రూపాలుంటుందట!మనం రోజూ తాగే మంచి నీళ్ల బాటిల్ ధరలు కూడా.. ఊహించని స్థాయిలో ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు.అక్వా డి క్రిస్టలో ట్రిబ్యుటొ ఎ మోడిగ్లియాని అనే వాటర్ బాటిల్ గురించే ఈ చర్చంతా. దీనిలో కేవల 750 మిల్లీ లీటర్ల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంత చిన్న వాటర్ బాటిల్ ధర అక్షరాలా 45 లక్షల రూపాయలు. ఇప్పుడు ప్రపంచంలోని అతి ఖరీదైన మంచినీళ్లు ఇవేమరి. లీటర్ కూడా లేని ఈ నీళ్లకు ఎందుకింత డిమాండ్? అంటే..ఈ నీళ్లను ఫ్రాన్స్, ఫిజీలలోని సహజ నీటిబుగ్గల నుంచి సేకరిస్తారట. భూగర్భ జలాలు ఉబికి భూమిపైన ప్రవహించే సహజ నీటి బుగ్గల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ఇది వింతేమీ కాదే!! ఈ రోజుకీ మార్కెట్లో అనేక మినరల్ వాటర్ బాటిల్లు ఈ విధమైన సహజ నీటి బుగ్గల నుంచి సేకరించిన నీళ్లను అమ్ముతున్నారు. మన దేశంలో కూడా ఈ విధమైన నీళ్ల బాటిల్లను రూ. 50 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. అయినప్పటికీ ఈ వాటర్ బాటిల్ ఎందుకంత ధర పలుకుతుంది? ఇదేనా మీ అనుమానం.. అనేకానేక కారణాల్లో ఈ వాటర్ బాటిల్ డిజైన్ కూడా ఒక కారణమే. ఎందుకంటే.. ►ఈ బాటిల్ లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారుచేయడం. ►ఈ బాటిల్ ఆకారాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ధ బాటిల్ డిజైనర్ అయిన ఫెర్నాండో అల్టామిరానో డిజైన్ చేశాడు. ప్రపంచంలోనే అతి ఖరీదైన హెన్రీ 4 హెరిటేజ్ డ్యుడోగ్నన్ కోగ్న్యాక్ అనే వైన్ బాటిల్ కూడా ఇతనే డిజైన్ చేశాడు. ►ఈ బాటిల్లోని నీళ్లు కూడా ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో లభించే సగటు తాగునీటి కంటే ఎక్కువ శక్తిని అందిస్తుందట. అంతఖరీదు పెట్టి కొని తాగే వారు ఎవరుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! సెలబ్రెటీలు, ప్రముఖ వ్యక్తులు మనలా సాధారణ నీళ్లను తాగరు. వాళ్లు తాగే నీళ్లు ఇవే మరి.. ! -
60 పైసల చెక్ ఇచ్చిన బ్యాంకు.. ఇదా అసలు విషయం!
నంగునూరు (సిద్దిపేట): ‘చారాణా కోడికి బారాణా మసాల’ అనే సామెత నిజం చేస్తూ 60 పైసల బ్యాంక్ చెక్కును చూసి ముక్కున వేలు వేసుకున్నారు ప్రజలు. సిద్దిపేట జిల్లా నర్మేటకు చెందిన దాచవరం రాజశేఖర్‌కు రెండు రోజుల కిందట స్పీడ్‌పోస్ట్ ద్వారా కవర్ వచ్చింది. అందులో కేరళలోని సౌత్ ఇండియా బ్యాంక్ త్రిసూర్ బ్రాంచ్ నుంచి అకౌంట్‌పే ద్వారా 60 పైసల చెక్కు రావడంతో రాజశేఖర్ అవాక్కయ్యాడు. చెక్కు ఎవరు పంపారు.. తనకు డబ్బులు ఎందుకు వచ్చాయో.. తెలియక జుట్టు పీక్కున్నాడు. రెండు రోజులపాటు కష్టపడి విచారిస్తే గతంలో క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న లోన్ క్లియరెన్స్ చేయగా 60 పైసలు ఎక్కువ కట్టినట్లు తేలగా చెక్కు పంపారని తెలుసుకున్నాడు. రాజశేఖర్‌కు చెల్లించే డబ్బులకంటే చెక్కు ఓచర్, స్పీడ్ పోస్ట్‌కు అయ్యే ఖర్చులు ఎక్కువైనా న్యాయ బద్ధంగా చెక్కు పంపినందుకు లోన్ ఇచ్చిన కంపెనీ వారిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇంతకీ 60 పైసల చెక్కు తన అకౌంట్లో వేసుకోవాలా.. వద్దా అని రాజశేఖర్ డైలమాలో పడిపోయారు. -
సముద్రంలో రెస్టారెంట్.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు
సముద్రంలో రెస్టారెంట్ సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఒక కొండ మీద పూరిగుడిసెలా కనిపిస్తున్నది ఒక రెస్టారెంట్. కొండ కొమ్ముమీద నిర్మించడం వల్ల దీనికి ‘ది రాక్’ అని పేరుపెట్టారు. టాంజానియాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉందిది. ఈ రెస్టారెంట్లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే! పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ వంటి సీఫుడ్‌కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్‌కు వచ్చి, ఇక్కడి రుచులను ఆరగించి వెళుతుంటారు. View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) విగ్గుతో గిన్నిస్ రికార్డ్ విగ్గుల వాడకం అందరికీ తెలిసిందే! సినీ నాటక రంగాల్లో విగ్గుల వాడకం ఎక్కువ. ఇటీవలి కాలంలో బట్టతలలు గల సాధారణ వ్యక్తులు కూడా విగ్గులు వాడుతున్నారు. సాధారణంగా వాడుకలో ఉన్న ఈ విగ్గులు నెత్తిని జుట్టుతో నిండుగా కప్పేంత పరిమాణంలో ఉంటాయి. కొన్ని విచిత్రవేషాల కోసం వాడే విగ్గులైతే తల మీద దాదాపు ఒక అడుగు మందం వరకు కూడా ఉంటాయి. అయితే, అలాంటి విగ్గులు చాలా అరుదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ డిజైనర్ డానీ రేనాల్డ్స్ రూపొందించిన అతిభారీ విగ్ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. బైక్ హెల్మెట్‌ను చట్రంగా చేసుకుని రూపొందించిన ఈ విగ్గు వెడల్పు ఎనిమిది అడుగుల ఆరంగుళాలట. దీని తయారీకి పీవీసీ పైపులు, అల్యూమినియం రాడ్లు, కేబుల్ వైర్లు వంటి వస్తువులను ఉపయోగించడం విశేషం. ఈ విగ్గు ప్రపంచంలోనే అత్యంత వెడల్పాటి విగ్గుగా గిన్నిస్ రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
గోదావరి అందాలు.. ఒక్కసారి చూస్తే మైమరిచిపోవాల్సిందే!
కోనసీమ అందాల సీమ. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని.. సప్త నదీపాయల మధ్య కొలువైన సీమ. పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే చేలు, కొబ్బరితోపులు, గోదావరి నదీపాయలు, వంపులు తిరుగుతూ పారే పంట కాలువలు, తెరచాప పడవలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మడ అడవులు, గోదావరి మధ్య లంక గ్రామాలు, మండువా లోగిళ్లు, రైతుల మకాంలు.. వీటన్నింటికీ మించి ఆత్మీయత, మమకారంతో కలిసిన ఆతిథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం. రైతులు, కూలీలు, మత్స్యకారులు, మహిళల జీవనం విధానం, కట్టూబొట్టూ, పండగలు, పబ్బాలు, జాతరలు.. ఇలా ఇక్కడ అన్నింటా ఒక ప్రత్యేక ముద్ర. ఇటీవల కాలంలో గోదావరి, సముద్ర తీరంలో వెలుస్తున్న రిసార్ట్స్, రైతుల పొలాల వద్ద ఫామ్ హౌస్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా కోనసీమకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘సప్త’వర్ణాల కోనసీమ.. పర్యాటకంగా కూడా ‘సప్త’రకాలుగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 27 ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం. ఆధ్యాత్మికంగా.. ఆధ్యాత్మిక రంగంలో కోనసీమ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. లెక్కలేనన్ని ఆలయాలు, పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కోనసీమ సొంతం. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక విమానాలలో భక్తులు వస్తున్నారు. వీటితోపాటు అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ విఘేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. బౌద్ధులు.. రాజుల చారిత్రక ఆనవాళ్లు చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యాటకానికి వస్తే రామచంద్రపురంలో 17వ శతాబ్ధం నాటి కోట ఉంది. మామిడికుదురు మండలం ఆదుర్రులో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధం నాటి పురాతన బౌద్ధ స్థూపాలున్నాయి. కపిలేశ్వరపురం జమీందార్ల పురాతన భవనాలు, రాజుల కోటలను తలపించే మండువా లోగిళ్ల ఇళ్లు పర్యాటకులకు ముచ్చటగొల్పుతాయి. అగ్రి టూరిజం పర్యాటకంలో ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది అగ్రి టూరిజానికే. దేశంలో కేరళలో మొదలైన ఈ పర్యాటకం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఐటీ వంటి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అగ్రి టూరిజం బాట పడుతున్నారు. ఇటువంటి వారికి కోనసీమ అగ్రి టూరిజం ఒక అద్భుతం. పచ్చని తివాచీ పరచినట్టు ఉండే వరిచేలు, కొబ్బరి, అరటి తోటలు, లంక గ్రామాల్లో పలు రకాల పంటలు, పాడి, ఆక్వా చెరువులు, తోటల్లోని రైతుల మకాం (వ్యవసాయ శాలలు) విశేషంగా ఆకర్షిస్తాయి. గోదావరి హొయలు గోదావరి నదీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. నది మధ్యలో లంక గ్రామాలు, వాటిలో సాగయ్యే పంటలు, ఇసుక తిన్నెలు, చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు, తెరచాప పడవలు, పంటులు, హౌస్బోట్లపై సాగే ప్రయాణం, నదీపాయలపై వంతెనలు.. గోదావరి కాలువలకు లాకులు,ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి హొయలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మైమరపించే మడ అడవులు ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి అంతర్వేది సముద్ర తీరం వరకు నదీపాయలతోపాటు, మురుగునీటి కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఉన్న మడ అడవులలో పర్యాటకం అద్భుతమనే చెప్పాలి. నదీ, కాలువ పాయల మధ్య మడ అడవులు మీదుగా సాగే ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది. ఆతిథ్యం అద్భుతం అతిథి మర్యాదంటేనే గోదావరి జిల్లాలు. మరీ ముఖ్యంగా కోనసీమ ఆహారం.. అతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీర్చే రకరకాల స్వీట్లు, హాట్లు, టిఫిన్లు, బిర్యానీలు, మాంసహార కూరలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవా, మినప రొట్టి, చెరుకుపానకం, పెసరెట్టు ఉప్మా, పనస పొట్టు కూర, ముద్దపప్పు.. గుమ్మడి పులుసు, ఉల్లి గారెలు... నాటు కోడి కూర, చుక్కపీత ఇగురు.. పులసల పులుసు ఇలా ఎన్నో రకాల వంటకాలు పర్యాటకులను లోట్టలు వేయిస్తాయి. -
ప్రకృతికి మించిన గురువు లేరు.. పిల్లల్లో అలాంటి సమస్యకు కారణమదే!
ప్రకృతి,వన్యప్రాణుల జీవనంపై చిన్ననాటి గుర్తులు ఏమైనా గుర్తు ఉన్నాయా? నేను పట్టణవాసిని అయినా ఒక కొండముచ్చు మా ఇంట్లోకి జొరబడి హడావుడి చేయటం, ఇంటి బాల్కని నుంచి చూసిన లకుముకి,గిజిగాడు పిట్టలు, రాత్రిపూట మిణుగురు పురుగులు పట్టుకొని అవి మెరుస్తుంటే చూసి ఆనందించిన క్షణాలు నాకింకా గుర్తు ఉన్నాయి. పిల్లలకు ప్రకృతితో విడదీయరాని అనుబంధం,ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి మెండుగా ఉంటాయి. కానీ పట్టణవాసంవల్ల ప్రకృతితో అనుబంధం అనుకున్నంత ఉండటం లేదు. తగిన అవకాశం, ప్రోత్సాహం లభిస్తే, ప్రకృతితో పిల్లల అనుబంధం మరింత బలపడి వారి భౌతిక, మానసిక వికాసానికి దోహదకారి అవుతుంది. ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం పిల్లల సర్వతోభివృద్దికి ఎంతో అవసరమని ఎన్నో అధ్వయనాలు చెపుతున్నాయి. అవి వారి ఏకాగ్రత, పరిసీలనాశక్తిని, ప్రావీణ్యతసి, మానసికాభివృద్దికి తోడ్పడుతుంది అని అందరికి తెలిసిన విషయమే. కాని,పట్టణవాసం వల్ల ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం తగినంత లేకపోవటంతో మనలో చాలామంది Nature deficit Disorder తో బాధపడటం ఉండటం గమనార్హం. దీంతో చాలామంది పిల్లల్లో స్థూలకాయం, ఎకాగ్రతాలోపం, నిరాశ వంటి సమస్యలు తలెత్తడం గమనిస్తున్నాము. అయితే ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతితో మమేకమవటం ఎలా? ప్రకృతిలో ఒక భాగమయిన పక్షులు, జంతువులు, కీటకాలు, సరీసృపాలు కేవలం గ్రామాలు, అడవుల్లోనే ఉంటాయి అనుకోవటం పొరపాటు.ఇవి అన్నిచోట్లా మన పరిసరాలలో కనిపిస్తూనే ఉంటాయి.పిల్లలను తరచుగా మన దగ్గరలో ఉన్న పార్కులు, చెరువులు,స్కూల్ ఆటస్తలలో కనపడే పక్షులను, కీటకాలను మరియు ఇతర జంతువులను పరిసీలించటం నేర్పితే వారికి బయటకు వెళ్ళాలనే ఉత్స్యాహం కలిగించిన వారవుతారు. పక్షులు ప్రకృతిలోని ఒక ప్రధాన భాగస్వాములు. భూమిఫై మన మనుగడకు విడదీయరాని అనుబంధం కలిగి ఉంటాయి. అది పిల్లలలోని పరిశీలనాశక్తిని, ఊహాశక్తిని మేల్కొలిపి నూతన ఉత్శాహం కలిగిస్తాయి.పక్షులు తమ ఆహ్లదమయిన రంగులతో, ప్రత్యేకమయిన కూతలతో మన పరిశీలనాశక్తిని పెంపొందిస్తాయి. చాలా వలస పక్షులు వింత వింత విన్యాసాలతో అబ్బురపరచే క్రమశిక్షణతో గుంపులు గుంపులుగా వలస పోవటం గమనిస్తే రోజువారీ జీవితంలోని అలవాట్లు, అరుపులు గమనిస్తే మనకు ఎంతో ప్రేరణ, ఆనందం కలుగుతాయి.ప్రకృతిలో భాగమయిన పక్షులను వీక్షించి ఆనందించటం ప్రకృతితో మమేకం అవటానికి మీ జీవితాంతం దొరికే అపూర్వ అవకాశం. మీ పిల్లలు, విధ్యార్ధులకు ప్రకృతితో పరిచయయంకల్పించటానికి పక్షులను వీక్షించే కార్యక్రమంతోప్రారంభిచటం శ్రేయస్కరం. దీనికి మీకు ఎటువంటి పరిజ్ఞానం లేదని అనుకోవద్దు. పక్షి శాస్త్రం గురించి విశేష పరిజ్ఞానం లేకపోయినా సరైన సహనం, ఆసక్తితో మీరు చూసిన పక్షులు,వాటి భౌతిక లక్షణాలు, ప్రత్యేకమయిన కూతల గురించిన సమాచారం విధ్యార్ధులతో పంచుకోవటంలో ఉండే ఆనందం, అనుభవం ఎంతో వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తాయి. రేపు లేదనే ఆలోచనతో జీవించు, కలకాలం ఉంటాననే భావంతో విజ్ఞానాన్ని సంపాదించు అని మహాత్మా గాంధీ ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఎన్నో కొత్త ప్రయోగాలకు నాంది పలికాడు. పక్షుల గురించి ఆయనకు ఉన్న ఆసక్తితో విద్యార్థుల కోసం ird Bingo అనే ఒక వినూత్న కార్యక్రమం రూపొందించటానికి దోహదం చేసింది. దీనికి నలుగురు విద్యార్దులను ఒక జట్టుగా ఏర్పరచి, వారికి ఒక బింగో షీట్, పెన్సిల్, పుస్తకం ఇచ్చి స్కూల్ ఆవరణలో వారు చూసిన విశేషాలను అన్నిటిని రాయమని చెప్పి తర్వాత వాళ్లను క్లాస్‌రూమ్‌లో సమావేశపరిచి వాళ్లు సేకరించిన సమాచారం ఇతర విద్యార్థులకు వివరించడం జరగుఉతుంది. తగిన తగిన బహుమతులు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలవల్ల ప్రకృతిని పక్షులను గుర్తించటమే కాకుండా విద్యార్దుల పరిశీలనాశక్తిని , సమాచారాన్ని రాతపూర్వకంగా పదిలపరిచే నిపుణత, తమ చుట్టూ ఉన్న పకృతి విశేషాలను నిశితంగా పరిశీలించే అవకాశం తప్పకుండా కలుగుతుందని భావిస్తాము. ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్దులలో ప్రకృతిపట్ల అనురక్తిని కలిగించే విలువైన సాధనాలుగా భావించి ఎన్నో వినూత్న కార్యక్రమాలు Indian wild life society ద్వారా విద్యార్దుల ప్రయోజనంకోసం రూపొందించటం జరిగింది. ఈ క్రమంలో నదేశంలో సాధారణంగా కనిపించే పక్షుల గురించి రూపొందించిన ఒక ఫ్లాష్ కార్డు ఆట అయితే “ Shell Shoker” తాబేళ్ల గురించి ఆడే కార్డు ఆట మరియు Snake-O-Doo పాములు,నిచ్చనలు ఉండే పరమపదసోపాన పటం/ వైకుంఠ పాళీ ఆట. ఇవన్నీ మనకు online లో దొరుకుతాయి. మరికొన్ని ఆటలు ఆన్లైన్ వెబ్‌సైట్స్ ద్వారా డైన్లోడ్ ఉచితంగా చేసుకోవచ్చు. వివిధ కళాత్మక,సృజనాత్మక కార్యకలాపాలద్వారా పిల్లలలో ఎంతో సంతులనాత్మక అభివృద్దిని సాధించగలం. వివిధ కళాత్మక కార్యకలాపాలద్వారా పిల్లల పరిశీలన దృష్టిని గమనించి వారిని సంబంధిత పాత్రికెయులుగా, వివిధ కళాత్మక ప్రయోగాలు చేయగలిగేవారిగా తయారు చేయగలం. మన దేశంలో సాధారణంగా కనిపించే పక్షుల బాహ్యలక్షణాలు, వాటి చరిత్ర గురించి వేరు వేరు సంసృతులలో ప్రస్తావించిన విశేషాలఫై అవగాహన కలిగి ఉండటం వల్ల పక్షల గురించి కోత్తవారికి ఆసక్తికరంగా మరింత ఉత్సుకత కలిగే విధంగా వివరించే అవకాశం కలిగి ఉండి వారిలో ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించిన వారవుతారు. కాకి వంటి సాధారణ పక్షి తెలివితేటల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పిల్లలకు పంచతంత్ర కధలలోని ‘ నీటి కుండలోని నీరు గులకరాళ్ళువేసి పయికితెచ్చి దాహం తీర్చుకున్న తెలివయిన కాకి” కధ చెప్పి వారిని ఆనందింపచేయవచ్చు.మీ పరిసరాలలో కనపడే సాధారణ పక్షుల గురించిన సమాచారం ఎన్నో మాధ్యమాల ద్వారా పొందగలరు. ఇందులో ప్రముఖంగా మెర్లిన్అనే అప్ ద్వారా మీ పరిసరాలలో ఉన్న పక్షుల గురించిన సమాచారం పొందవచ్చు. Early bird అనే App నుంచి వివిధ రకాల పక్షుల ఫోటోలు తీసి వాటి లక్షణాలను, కూతలను కూడా వినే అవకాశం ఉంది. ఈ యాప్స్ అన్ని భారతీయ బాషలలో అందుబాటులో ఉంది. పిల్లలకు ప్రకృతితో అనుబంధం కల్పించడం చాలా అవసరం. పర్యావరణ అనిస్టితి కారణంగా పిల్లలలో ప్రకృతి పట్ల మరింత అవగాహన కల్పించటం వలన వారిలో మరింత ఆసక్తి, ప్రకృతి పట్ల స్నేహభావం,కలిగించి భూ వాతావరణంపట్ల మరింత జాగరూకతతో తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో శ్రీ డేవిడ్ సోరెల్ అన్నట్లు.. పిల్లలు ఉజ్వల భవిష్యత్తు, బముముఖ సాధికారత పొందడానికి మొదట ఈ భూమిని ప్రేమించేలా చేయడం, తర్వాత దాని సంరక్షణ కోసం చర్యలు తీసుకునేలా చేసి ప్రకృతిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. Author - గరిమా భాటియా ఫోటోలు: సౌమిత్రా దేశ్‌ముఖ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
అబద్ధమని కొట్టిపారేయకండి.. దెయ్యాలతో మాట్లాడిన చిన్నారి!
దెయ్యాల కథలు సృష్టించే ప్రకంపనాలకు సాక్ష్యాలు తక్కువ. నిజమా? అబద్ధమా? అనే సంశయం నుంచి పుట్టే ఆత్రానికి.. వాదోపవాదాలు ఎక్కువ. అందుకే ‘పుట్టుకకు ముందు.. చావు తర్వాత..’ అనే ఆత్మాన్వేషణ కథలెప్పుడూ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. అలాంటిదే సరిగ్గా 34 ఏళ్ల క్రితం.. ఓ నాలుగేళ్ల అమ్మాయి జీవితంలో జరిగింది. అది 1989. ఫిబ్రవరి మొదటి వారం. ఆండ్రూ వైరిక్, లీసా దంపతులు తమ నాలుగేళ్ల కూతురు హెడీతో కలసి.. కొత్తింట్లోకి అడుగుపెట్టారు. రావడం రావడమే హెడీ ఆడుకోవడానికి పరుగులు తీస్తే.. భార్యభర్తలు మాత్రం ఇల్లంతా సర్దుకునే పనిలో పడ్డారు. ఆ ఇల్లు అమెరికా, జార్జియాలోని ఎల్లెర్స్లీలో ఉంది. హెడీకి ఆ ఇల్లు బాగా నచ్చేసింది. అక్కడున్న ఓ పెద్దాయన కూడా. ఆ ఇంటికి రావడం రావడమే పెరట్లో ఉన్న ఆయనతో ఆటలాడటం మొదలుపెట్టింది. పనుల హడావిడి నుంచి తేరుకున్న హెడీ తల్లి లీసా.. ఆ పెద్దాయన సంగతులన్నీ హెడీ నోట విని షాక్ అయ్యింది. అతడి పేరు గోర్డీ అని హెడీ చెప్పింది. అసలు లీసా.. ఆ ఇంటి చుట్టు పక్కల హెడీ చెప్పిన పోలికలతో ఎవరినీ చూసింది లేదు. ‘హెడీని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా నాటకం ఆడుతున్నారా?’ అనే అనుమానం లీసాని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే భర్తకు విషయం చెప్పింది. హెడీని బయటికి పోనీకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత హెడీ ప్రవర్తనపై దృష్టిపెట్టిన లీసా.. ఆమె ఎవరితోనో మాట్లాడుతోందని.. ఆమె చేతిని ఎవరో పట్టుకుని నడుస్తున్నారని గుర్తించింది. పైగా అర్ధరాత్రులు ఊయల ఊగడం, నిద్రలో లేచి నడవడం ఇలా చాలానే చేసేది హెడీ. లీసాకి ఏం అర్థం కాలేదు. కానీ వెన్నులో కాస్త భయం మొదలైంది. హెడీకి స్నేహితులు లేకపోవడంతో అలా ఏదో ఊహించుకుని ఆడుకుంటోందని సరిపెట్టుకుంది. అయితే హెడీ.. గోర్డీతో పాటు లోన్ అనే మరో ముసలాయన పేరు చెప్పడం మొదలుపెట్టింది. లోన్ ఎడమ చేతికి రక్తంతో కట్టు ఉందని.. అతడి షర్ట్ నిండా రక్తం ఉందని చెప్పేది హెడీ. వెంటనే లీసా.. తన భర్తతో కలసి.. ‘హెడీ చెబుతున్న పేర్లతో ఎవరైనా ఉన్నారా?’ అంటూ ఆ చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. లోన్, గోర్డీ ఇద్దరు కాదేమో.. ఒకే వ్యక్తి అయ్యి ఉంటాడని వాళ్లు నమ్మారు. ‘లోన్ గోర్డీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా?’ అంటూ అందరినీ ఆరా తీశారు. ఆ ప్రయత్నంలోనే లోన్ గోర్డీ గురించి పక్కింట్లో ఉండే తన సోదరితో చర్చించింది లీసా. అయితే.. లీసా చెప్పింది విని లీసా సోదరి షాక్ అయ్యింది. అతడి పూర్తి పేరు జేమ్స్ ఎస్. గోర్డీ అని.. అతడు తమ ఇంటి మాజీ యజమాని అని, అతడు చనిపోయి చాలా ఏళ్లు అయ్యిందని చెప్పింది ఆమె. సాక్ష్యం కోసం తన ఇంటి దస్తావేజులు కూడా చూపించింది. అది చూడగానే లీసాకి చెమటలు పట్టేశాయి. వెంటనే ఇద్దరూ.. గోర్డీ బంధువైన కేథరీన్ లెడ్ఫోర్డ్ అనే స్థానికురాలి దగ్గరకి పరుగుతీశారు. జేమ్స్ గోర్డీ 1974లోనే మరణించాడని, అతడికి కొలంబస్లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేదని, చాలా సంవత్సరాలు అతను జార్జియాలో ఎల్లెర్స్లీలో ఉండే ఎల్లిసన్ మెథడిస్ట్ ^è ర్చ్‌లో సండే స్కూల్ సూపరింటెండెంట్‌గా పనిచేశాడని వివరాలిచ్చింది కేథరీన్. అచ్చం హెడీ చెప్పినట్లే.. గోర్డీ మెరిసిన జుట్టుతో.. సూట్, టై, నల్లటి బూట్లు వేసుకుని ఎప్పుడూ నీట్‌గా ఉండేవాడని నిర్ధారించింది. వెంటనే హెడీని కేథరీన్ ఇంటికి తీసుకుని వెళ్లిన లీసా.. తన పాపకి ఆ ఇంట్లోని పాత ఫొటోలన్నీ చూపించమని కోరింది. ఆశ్చర్యకరంగా ఆ ఫొటోల్లో లోన్ ఫొటోని గుర్తుపట్టింది హెడీ. ‘ఎడమ చేతికి కట్టుతో ఉన్న ముసలాయన ఇతడే’ అంటూ లోన్ ఫొటోని చూపించింది. అతడ్ని హెడీ గుర్తు పట్టగానే బిత్తరపోయింది కేథరీన్. వరుసగా లీసా, ఆండ్రూ, హెడీ, జోర్డాన్, జోయిస్ (హెడీ మేనత్త) ‘ఇతడు మా అంకుల్ లోన్’ అంది షాక్‌లో. లోన్ 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే గడిపేవాడని, అతడు 1957లో క్యాన్సర్‌తో చనిపోయాడని, అతడు ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడని చెప్పింది. దాంతో లీసాకి.. హెడీ మాట్లాడే గోర్డీ, లోన్లు కల్పితపాత్రలు కాదని.. వారు నిజంగా చనిపోయిన వ్యక్తులని స్పష్టమైంది. (హెడీ విషయంలో హెడీ మేనత్త జోయిస్ కూడా లీసాకు చాలా సాయం చేసింది).అలా గోర్డీ, లోన్లతో హెడీ సంభాషణ సుమారు నాలుగేళ్ల పాటు సాగింది. 1993లో హెడీ తల్లి గర్భవతి అయింది. అప్పుడొచ్చింది మరో ఆత్మ. అది చీకట్లో బొమ్మల రూపంలో కదలడం హెడీని తీవ్రంగా భయపెట్టింది. కొన్నిసార్లు ఆ ఆత్మ చేసిన హింసకు హెడీ చాలా ఏడ్చేది. అప్పుడప్పుడు హెడీ ముఖంపైన రక్తపు చార లు కనిపించేవి. 1994 ఫిబ్రవరి 3న హెడీకి జోర్డాన్ అనే చెల్లెలు పుట్టింది. 2 వారాల తర్వాత, హెడీ మరింతగా వణకసాగింది. అయితే ఆ ఆత్మ గురించి.. హెడీ తండ్రి ఆండ్రూ మొదట్లో నమ్మలేదు. కానీ కొన్ని రాత్రుల తర్వాత ఆండ్రూ కూడా ఆ ఆత్మ దాడికి గురయ్యాడు. ఆ సమయంలోనే హెడీ ఒంటి మీద గోళ్ల చారికలు తీవ్రమైన నొప్పిని కలిగించేవి. వెంటనే పారా సైకాలజిస్ట్ డాక్టర్ విలియం రోల్‌ని ఇంటికి పిలిపించింది లీసా. హెడీ చెప్పే మాటలు నిజమేనన్న నిర్ధారణకు వచ్చిన రోల్.. చనిపోయిన వారితో కమ్యూనికేట్ చేయడానికి హెడీ.. ఏదైనా రహస్యమైన శక్తిని కలిగి ఉందా? అంటూ హెడీపై ఎన్నో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏ విషయాన్నీ తేల్చలేకపోయాడు. కొన్నేళ్లకు హెడీ కుటుంబం ఆ ఇంటికి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత గోర్డీ, లోన్ ఆత్మలు హెడీకి కనిపించడం మానేశాయి. కానీ ఇప్పటికీ హెడీని చీకటి బొమ్మలు, వికృత రూపాలు, జంతు ఆత్మలు భయపెడుతూనే ఉన్నాయట. హెడీకి సాధారణమైన జీవితం గడపాలనే ఆశే ఆమెని ప్రపంచానికి దూరంగా బతికేలా చేస్తోంది. కానీ హెడీకి ఆత్మలు, దుష్టశక్తులు కనిపించడం మాత్రం ఆగలేదు. దురదృష్టవశాత్తూ హెడీ తండ్రి ఆండ్రూ 45 ఏళ్ల వయసులో 2012లో మరణించాడు. అసలు హెడీ చెప్పింది నిజమేనా? అబద్ధమైతే అంత చిన్ని పిల్ల గోర్డీ, లోన్ల ఆత్మల కథలను ఎలా ఊహించగలిగింది? చనిపోయిన వారితో మాట్లాడే శక్తి హెడీకి నిజంగానే ఉందా? ఇలా వేటికీ సమాధానాల్లేవు. పైగా ఆ కుటుంబం మీడియాకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడంతో సమగ్ర సమాచారమూ దొరకలేదు. ఈ కథ ఆధారంగా ఎన్నో నవలలు, డాక్యుమెంటరీలు, సినిమాలు పుట్టుకొచ్చాయి. అయితే హెడీ చెప్పింది నిజమే అనేవాళ్లు ఎంతమందో.. అబద్ధమని కొట్టిపారేసేవాళ్లూ అంతేమంది. అందుకే ఈ కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. హెడీ మాటల్లో.. ఎప్పుడైతే దుష్ట ఆత్మలు కనిపించడం మొదలయ్యాయో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ప్రతిరోజూ ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నా జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఇలాంటి వాటితో పేరు పొందాలనుకోను.. ప్రజలు కొంతమంది విశ్వసిస్తారు, కానీ మరికొంత మంది మమ్మల్ని పిచ్చివాళ్లుగా భావిస్తారు. ఇప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి.. ధైర్యంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ∙సంహిత నిమ్మన -
ఆ ముగ్గురి మరణాలు.. 20 ఏళ్లుగా మూతబడిన డిస్నీపార్కు
డిస్నీపార్కుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వాల్ట్ డిస్నీ నెలకొల్పిన డిస్నీ థీమ్ పార్కులు ప్రపంచంలో పన్నెండు ఉన్నాయి. ఈ పార్కులన్నీ సందర్శకులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. రోజూ వేలాది సందర్శకులు వీటిని సందర్శిస్తుంటారు. ఇవి ఈనాటికీ దేశ విదేశాల సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, డిస్నీ థీమ్ పార్కుల్లో ఒకటైన ‘డిస్నీ రివర్ కంట్రీ’ మాత్రం దాదాపు ఇరవై ఏళ్లుగా మూతబడింది. ఇప్పుడు ఈ పార్కు పాడుబడి దెయ్యాల నివాసాన్ని తలపించేలా తయారైంది. డిస్నీ థీమ్ పార్కుల్లో భాగంగా వాల్ట్ డిస్నీ కంపెనీ 1976 జూన్ 20న ఫ్లోరిడాలోని బే లేక్ తీరం వద్ద ‘డిస్నీ రివర్ కంట్రీ’ పార్కును నెలకొల్పింది. వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన మిగిలిన డిస్నీ పార్కుల్లాగానే ఇది కూడా సందర్శకులతో కిటకిటలాడేది. నిత్యం కోలాహలంగా కనిపించేది. వ్యాపారపరంగా లాభసాటిగానే నడిచేది. ఇందులో రెండు స్విమింగ్‌పూల్స్, ఐదు వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. సమీపంలోని బే లేక్ నుంచి వీటికి నీరు చేరవేసేవారు. బే లేక్ నుంచి వచ్చే నీటిని వడబోసేందుకు అడుగు భాగాన ఇసుక నింపిన ఫిల్టర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు తలెత్తడం, దీనిపై జనాల్లో ఆందోళన మొదలవడంతో ఇది 2001 నవంబర్ 2న మూతబడింది. అప్పటి నుంచి దీనిని మళ్లీ తెరిచే ప్రయత్నాలేవీ ఇంతవరకు జరగలేదు. ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు 1980లోనే మొదలయ్యాయి. ఇక్కడి స్విమింగ్‌పూల్‌లో ఈత కొట్టిన ఒక పదకొండేళ్ల బాలుడికి మెదడులో అమీబిక్ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఆ ఇన్ఫెక్షన్తోనే అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత 1982లో ఒకరు, 1989లో మరొకరు ఇలాగే నీటివల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారినపడి మరణించారు. చాలామంది ఇన్ఫెక్షన్ల బారిన పడినా, చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ పార్కులో అడుగుపెట్టడానికి జనాలు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ 2001 నవంబర్ 2న ఈ పార్కును మూసివేస్తున్నప్పుడు దీనిలోని నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించి, 2002 ఏప్రిల్ 11న పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే, ‘వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన తొలి వాటర్ థీమ్ పార్కు శాశ్వతంగా మూతబడినట్లే’ అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ ప్రకటించినట్లుగా ఇది పునఃప్రారంభం కాలేదు. వార్తాకథనాలు ఊహించినట్లుగానే జరిగింది. ప్రస్తుతం ఇది పూర్తిగా పాడుబడి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. వాల్ట్ డిస్నీ కంపెనీ చరిత్రలో ఇలాంటి వైఫల్యం ఇదొక్కటే! -
నిమిషాల్లో ఐస్‌క్యూబ్స్.. జర్నీలో చక్కగా పనికొస్తుంది
ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే, కొన్ని గంటల ముందుగానే ట్రేలో నీరు నింపి, డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలు రిఫ్రిజిరేటర్లలో ఐస్ తయారవడానికి ఆరు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ నిమిషాల్లోనే తయారవుతాయి. ఇళ్లల్లో వాడుకునే ఫ్రిజ్‌లను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోలేం. ఈ ఫ్రిజ్నైతే ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. ఇది పోర్టబుల్ ఫ్రిజ్. సాధారణ ఫ్రిజ్‌ల కంటే చాలా తేలిక కూడా. కాస్త పెద్ద సూట్‌కేసు సైజులో ఉండే ఈ ఫ్రిజ్‌కు చక్రాలు కూడా ఉంటాయి. కాబట్టి మోత బరువు లేకుండానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తరలించవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే పద్దెనిమిది ఐస్‌క్యూబ్స్ తయారవుతాయి. ఇందులో నీళ్లు, పాలు, కూల్‌డ్రింక్స్, కూరగాయలు, పండ్లు వంటివి భద్రపరచుకునేందుకు కూడా వీలవుతుంది. ఇది పూర్తిగా సోలార్ చార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్‌చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దీనిలోని అడ్జస్ట్మెంట్స్ను ఎక్కడి నుంచైనా మార్చుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘ఎకో ఫ్లో’ కంపెనీ ఈ అత్యాధునిక పోర్టబుల్ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించింది. దీని ధర 899 డాలర్లు (రూ.73,402) మాత్రమే! -
Interesting Facts: షేక్స్పియర్ విషయంలో అది నిజమైంది,ఆయన పిల్లలందరూ..
Intresting Facts: ► సంతోషంగా ఉండడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? అయితే కొందరు మాత్రం సంతోషంగా ఉండడానికి భయపడతారు. దీనికి కారణం సంతోషంగా కనిపిస్తే కీడు జరుగుతుందనే మూఢ నమ్మకం. సంతోషంగా ఉండడానికి భయపడే లక్షణాన్ని చెరోఫోబియా అంటారు. ► ‘ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ వోవర్ ది లేజీ డాగ్’ అనే వాక్యంలో ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపిస్తాయి. ► ఒక దురలవాటు దూరం కావాలంటే గట్టిగా 21 రోజులు దాని జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుందట. ► ‘వోవర్ మారో’ అంటే ఏమిటో కాదు ది డే ఆఫ్టర్ టుమారో(ఎల్లుండి) అని. ► ‘పండిత పుత్ర పరమ శుంఠ’ అనే నానుడి ఇంగ్లిష్ కవి, రచయిత షేక్స్పియర్ విషయంలో నిజమేననిపిస్తుంది. షేక్స్పియర్ ప్రపంచ ప్రఖ్యాతి పొందినా, ఆయన పిల్లలందరూ నిరక్షరాస్యులే! ► కొందరు కూరగాయలను చూస్తే చాలు విపరీతంగా భయపడతారు. కూరగాయల పట్ల ఉండే ఈ అరుదైన భయాన్ని ‘ల్యాకనోఫోబియా’ అంటారు. ► ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత తెలిసిందే గాని, నిజానికి రొయ్య కొంచెం కూత ఘనం అనడమే సమంజసం. ఎందుకంటారా? ‘పిస్టల్ ష్రింప్’ జాతికి చెందిన రొయ్య మహా అయితే రెండు సెంటీమీటర్లు ఉంటుంది. ఇది చేసే ధ్వని మాత్రం కాంకోర్డ్ విమానాల స్థాయిలో ఉంటుంది. ఇది తన డెక్కలను వేగంగా మూసి తెరవడం ద్వారా 230 డెసిబల్స్ ధ్వనిని పుట్టించగలదు. ► బ్రిటన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఎనిమిదో హెన్రీ వద్ద ‘గ్రూమ్స్ ఆఫ్ స్టూల్స్’ పనిచేసేవాళ్లు. వాళ్ల పనేమిటంటే రాజావారు గురుశంక తీర్చుకున్నాక శుభ్రం చేయడం. తన హయాంలో ఈ ఉద్యోగంలో పనిచేసిన నలుగురికీ నైట్‌హుడ్ అనుగ్రహించారు రాజావారు. ► అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్‌కు బ్రకోలీ అంటే విపరీతమైన అయిష్టం ఉండేది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల్లో బ్రకోలీ పై నిషేధం విధించారు. -
Pudami Sakshiga :పక్షిగూడు గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
“ఋతుపవనాలు అడవుల గుండా పయనిస్తున్నపుడు మన ప్రపంచంలోనే ఉన్న మరో చిన్న ప్రపంచంలోని ఆకర్షణ, రమ్యత చూసే కనులు పరవశమొందే హృదయం ఉన్న ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది." - Dr. Salim Ali, eminant Ornithologist నిజమేనండి, పక్షుల ప్రపంచం ఎంతో అద్భుతమైనది. కొంచెం పరికించి చూస్తే ఆ చిన్ని ప్రపంచం లోని వింతలు విడ్డూరాలు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పక్షులు చిన్నగా కనిపించినప్పటికీ అవి నివసించే తీరు వాటి జీవన విధానం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆ చిన్ని గూటిలో ఎదుగుతున్న ఆకలితో ఉన్న పిల్లలు తమలో తాము సామరస్యంగా సర్దుబాటు చేసుకునే విధానం నిజంగా ఆశ్చర్యకరం. కుటుంబంలోని ఈ ఇచ్చి పుచ్చుకోవడం మనందరం అలవర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. ఆ పక్షి ప్రపంచంలోకి వెళ్ళి అవి గూడు కట్టుకునే విధానం గురించిన కొన్ని విశేషాలని తెలుసుకుందామా! గూడు (ఇల్లు) మనందరి మౌళిక అవసరం. సాయంత్రమైతే చాలు ఎప్పుడు ఇంటికి చేరి కొంత సేదదీరుదామా అని మనమందరం ఎదురు చూస్తాం. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నామంటే చాలు బెంగ పట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా అని మనసు గొడవ పెడుతూ ఉంటుంది. మరి పక్షులు సాయంత్రమైతే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం ప్రశ్న గూటికి పోతాయి అనుకుంటున్నారు కదూ, అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. పక్షులు జతకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలను సాకే కాలంలోనే గూళ్ళు కట్టుకుంటాయి. మిగతా సమయాలలో గుబురుగా పెరిగిన పొదలలోనో, బొరియలు చెట్టు తొర్రలలోనో, కొమ్మ వంచలలో శత్రువుల బారిన పడకుండా ఉండేలా చూసుకుని పడుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో రకరకాల పక్షులు వివిధ రకాలుగా గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని గడ్డి పరకలను అల్లిగూడు కడితే, కొన్ని ఆకులను కుట్టి గూటిని కడతాయి. పుల్లలు, పుడకలు, బూజు, గరిక, మట్టి వంటి వాటితో ఎలాంటి సివిల్ ఇంజనీరు సాయం లేకుండా తమంతట తామే గూటిని నిర్మించుకుంటాయి. కొన్ని చెట్ల కాండాలపై రంధ్రాలు చేసి గూడును కడితే, కొన్ని నేలలో బొరియలను తవ్వి గూటిని నిర్మించుకుంటాయి. నీళ్ళపై తేలియాడే గూళ్ళు, వేలాడే గూళ్ళు అబ్బో ఎన్నో రకాల గూళ్ళు. కొన్ని కప్పు లాగా ఉంటే మరికొన్ని సాసర్ లా. ఇంకొన్ని గూళ్లయితే నేల మీదే. ఇలా పక్షులు కట్టుకునే గూళ్లను గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందామనుకుంటుంటే చదవడం కొనసాగించండి మరి. ►తీతువ, తెల్ల బొర్ర నీటి కోడి వంటి నీటి పక్షులు నీటి అంచుకు దగ్గరగా ఆకులు, గడ్డితో నేల మీదే గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్ల రంగు వాటిపై ఉండే మచ్చలు నేల, గడ్డి రంగులతో కలిసిపోయి శత్రువుల బారిన పడకుండా ఉంటాయి. కబోద పక్షి( నైట్ జార్) రాలిన ఆకులలోనే గుడ్లు పెడుతుంది. ► కాకులు, కొంగలు, గ్రద్దలు, పావురాలు పుల్లలతో గూడును నిర్మించుకుంటాయి. గూడు లోపల మెత్తని పీచు వంటి వాటిని పరిచి గుడ్లను పెడతాయి. ► చెట్ల తొర్రలలో గుడ్లగూబలు, కొమ్ముకసిరి (హార్న్ బిల్), చిలకలు, మైనాలు గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. కంసాలి పిట్ట,వడ్రంగి పిట్టలు మొదట చెట్లకు రంధ్రాలు చేసి గూటిని నిర్మించుకుంటే, తరువాత చిలుకలు, మైనాలు వాటిని తమకు అనువుగా మార్చుకుంటాయి. మనం పాత ఇంటిని రీ మోడలింగ్ చేసుకున్నట్లు. ► కొమ్ము కసిరి గూడు కట్టుకుని పిల్లలను సాకే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆడ మగ పక్షులు జతకట్టి గూటిని ఎంచుకోగానే ఆడ పక్షి ఆ తొర్రలో చేరి తన ముక్కు పట్టేంత ఖాళీ మాత్రం ఉంచి ద్వారాన్ని తన విసర్జకాలు, మట్టితో మెత్తి మూసేస్తుంది. ► గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు కనీసం ఒక వారం వయసు వచ్చే వరకు ఆడ పక్షి అలా నిర్భందం లోనే ఉండిపోతుంది. ఈ నిర్భందం సమయంలో మగ పక్షే ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారం వయసు వచ్చాకకట్టిన గోడను ముక్కుతో పొడుచుకుని ఆడ పక్షి బయటకు వచ్చి, మరలా అడ్డుగోడను కట్టేస్తుంది. అక్కడి నుంచి అమ్మానాన్నలిద్దరు పిల్లలను సాకడంలో నిమగ్నమైపోతారు. ► పసరిక పిట్టలు (బీ ఈటర్స్), లకుముకి పిట్ట (కింగ్ ఫిషర్), కూకూడు పిట్ట (హూపో) వంటి పక్షులు కొంచెం ఎత్తైన నేల మీద మట్టిలో బొరియలు చేసుకుని లేదా కొండ అంచులలో బొరియలు తవ్వి గూడు కట్టుకుంటాయి. ► పికిలి పిట్టలు (బుల్బుల్), పిచ్చుకలు, వంగ పండు (గోల్డెన్ ఓరియల్), పసుపు జిట్ట (ఐయోర) వంటి పక్షులు కొమ్మ వంచలలో దొన్నె లాంటి గూటిని కట్టుకుంటాయి. ► చుక్కల జీనువాయి (మునియ) గడ్డితో గుండ్రటి బంతి లాంటి గూటిని కట్టుకుంటుంది. ఆకుల పోతడు (దర్జీ పిట్ట) ఆకుల అంచులను కలిపి గొట్టంలా కుట్టి గూడు పెడుతుంది. ► తేనె పిట్టలు ఆకులు, గడ్డి, బూజును వాడి వేలాడే గూటిని కడితే, గిజిగాడు (బాయా వీవర్) గడ్డి పోచలతో వేలాడే అందమైన గూటిని అల్లుతుంది. గిజిగాడు నీటి అంచులలో ఉన్న చెట్లపై బాగా వాలి ఉన్న కొమ్మల చివర గడ్డితో గూటిని అల్లుతుంది. ► మొదట గడ్డితో ముడి వేసి, చట్రాన్ని అల్లి మిగిలిన గూటిని అల్లుతుంది. ఇదంతా మగ పక్షి మాత్రమే చేస్తుంది. ఇలా అల్లిన గూటిని ఆడ పక్షి పరిశీలించి నచ్చితే జతకట్టి గూటిని నిర్మించడం కొనసాగిస్తాయి. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షి మరో గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఇలా సంతానోత్పత్తి కాలంలో రెండు నుండీ మూడు గూళ్లను కడుతుంది. ఒక వేళ ఆడపక్షికి గూడు నచ్చక పోతే పని మళ్ళీ మొదటికే, ఆ గూటిని పీకి కొత్త గూటిని అల్లాల్సిందే. ఈ గూటిని కట్టడానికి వెయ్యి దాకా గడ్డి పోచలు అవసరపడతాయట. గూడు పచ్చగా ఉన్నపుడే ఆడ పక్షి పరిశీలించేది, గూడు అల్లటం ఆలస్యం అయినా కధ మళ్ళీ మొదటికే. ఇంతే కాదు, నీటికాకులు, కొంగలు, పసరిక పిట్టలు, అడవి పిచ్చుకలు, వలస పక్షులు కలిసికట్టుగా కాలనీలుగా గూళ్ళు నిర్మించుకుంటాయి. పిల్లలను శత్రువుల బారినుండి సంరక్షించుకునేందుకు కాలనీ సహాయపడుతుంది. ఇక్కడ తమంతట తాము గూటిని నిర్మించుకోలేని కోకిల జాతి పక్షులను గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కోకిల సొంతంగా గూటిని కట్టుకోలేదు, కాకి గూటిలోనో, బొంత పిచ్చుకల గూటిలోనో గుడ్లను పెడుతుంది. పిల్ల పెరిగి పెద్దదయిన తర్వాత గాని పెంచిన తల్లిదండ్రులకు తెలియదు. ఇలా పక్షులు రకరకాలుగా గూటిని నిర్మించుకునే విశేషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ! చాలా వరకు పక్షులు మే నుంచి సెప్టెంబరు లోపు అంటే వానలు పడి పురుగులు, గడ్డి, గడ్డి గింజలు, పళ్ళు ఎక్కువగా దొరికే కాలంలో గూటిని కట్టుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. మీరు కొంచెం బద్దకం వీడి నాలుగడుగులు వేసి మీ చుట్టుపక్కల పరిశీలిస్తే తప్పకుండా ఒకటి రెండు గూళ్లను చూసే అవకాశం దక్కించుకోవచ్చు. ఏమిటి లేచే ప్రయత్నం చేస్తున్నారా? రచయిత : రవి కుమార్ ద్వాదశి, ravikumardwadasi@gmail.com తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
డేంజర్ జోన్లో భారత్, తీవ్రవైన కరువు దేశంగా..
భూతాపం కారణంగా తీవ్రమైన కరువును ఎదుర్కోవాల్సిన దేశాలలో భారత్ కూడా ఉంది.రాబోయే 30 ఏళ్ళల్లో ఈ తీష్ణత మరింతగా పెరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారతదేశంలోని 50 శాతం మందిపై కరువు బరువు పడే సూచనలు కనిపిస్తున్నాయి.భూతాపం 3డిగ్రీల సెల్సియస్ పెరిగితే చాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయి.ముఖ్యంగా వ్యవసాయభూమి దాదాపు సగానికి పైగా కరువుక్షేత్రంగా మారిపోతుందని పరిశోధకులు చెబుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ప్యారిస్ ఒప్పందంలో చెప్పినట్లుగా ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం నాటికి తీసుకురాగలిగితే చాలా వరకూ ముప్పును తప్పించుకో గలుగుతాం. ఆచరణలో అది జరిగేపనేనా? అన్నది పెద్దప్రశ్న. భూమి వేడిక్కిపోతోందిరా! బాబూ అంటూ శాస్త్రవేత్తలు నెత్తినోరు మొత్తుకుంటూనే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఎప్పటి నుంచో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలు కలుసుకున్నప్పుడల్లా చర్చించే అంశాల్లో ఇదొకటి.ఉపన్యాసాలు, ఒప్పందాలు, నినాదాలు తప్ప అంతటా ఆచరణ శూన్యం. భూమి వేడిక్కిపోతున్న ప్రభావంతో శీతోష్ణస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతలను కొలవడం ద్వారా దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలను సంబంధిత విభాగాలు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాయి.వాతావరణంలో మార్పులు చేర్పులు అన్నది అనాదిగా జరిగే పరిణామం. శీతోష్ణస్థితుల ప్రభావం ప్రపంచంపై, మానవుల మనుగడపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా, 20వ శతాబ్దం మధ్యకాలం నుంచీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అసాధారణ స్థితికి చేరిపోయింది.ఈ ప్రభావంతో రుతువుల ప్రయాణం కూడా గతితప్పింది. అకాల వర్షాలు, ప్రకృతి భీభత్సాలు, కరువుకాటకాలు, వింత వింత జబ్బులు అన్నింటికీ భూమి వేడెక్కిపోవడమే ప్రధాన కారణం. పారిశ్రామికం వెర్రితలలు వేసి,ఆర్ధిక స్వార్థం ప్రబలి, హరిత చైతన్యం అడుగంటడం వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి.ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవరోధాలు పెరుగుతున్నాయి.కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారమే కొంప ముంచుతోంది. భూమి వేడెక్కిపోవడం వల్ల ఏర్పడుతున్న పరిణామాలు విస్తృతంగా ఉంటాయి.సముద్ర మట్టాలు పెరిగిపోవడం, మహా సముద్రాల ఆమ్లీకరణం,అడవులు మండిపోవడం, అనేక జాతులు అంతరించిపోవడం, పంటల దిగుబడి తగ్గిపోవడం, ఆహారకొరత చుట్టుముట్టడం మొదలైన ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు కూడా తరలిపోవాల్సి వస్తుంది.భూతాపాన్ని అడ్డుకోవడం అందరి సమిష్టి బాధ్యత. ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు, ప్రజలు అందరూ కలిసి రంగంలోకి దిగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దుస్థితికి కారణం మనిషి. మనిషిలోని స్వార్ధ చింతన, బాధ్యతా రాహిత్యం, రేపటి పట్ల ఏ మాత్రం స్పృహ లేకపోవడం ఈ దుస్థితికి చేర్చాయి. ఐక్య రాజ్య సమితి ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశం బలంగా చర్చకు వచ్చింది. ఉద్గారాలను పెద్దఎత్తున తగ్గించాలి.భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలని 2016లో పారిస్ లో ఒప్పందం జరిగింది. ఈ ఆరేడేళ్లలో అది తగ్గకపోగా మరింత పెరిగింది.భూమిని, వనరులను వాడుకొనే విధానంలో పెను అనారోగ్యకరమైన విధానాలు వచ్చాయి. నివాసయోగ్య భూమి -అటవీ భూమి మధ్య ఉన్న నిష్పత్తులు మారిపోయాయి. వ్యవసాయభూమిని వాడుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. వ్యవసాయం కంటే మిగిలిన వాటికి ఆ భూమిని వాడే సంస్కృతి పెరిగిపోయింది. పర్యవసానంగా అటవీ భూమి, వ్యవసాయ భూమి తగ్గిపోయింది. కొన్ని రసాయనాల సమ్మేళనం మేఘాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.భూమికి చేరే సూర్యకాంతి పరిమాణంలో కూడా తగ్గుదల మొదలైంది. దీనిని 'గ్లోబల్ డిమ్మింగ్ ' అంటారు. భూమికి సూర్యుడే ప్రధానమైన శక్తి.ఆ వనరులు తగ్గిపోవడం అత్యంత ప్రమాదకరం.ఇప్పటికైనా మేలుకోవాలి. గ్రీన్ వాయివులను తగ్గించుకోవాలి. సౌరశక్తి, పవన శక్తిని ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. కార్బన్ వాడకాన్ని తగ్గించడం ఎంత ముఖ్యమో,అడవులను పెంచడం అంతకంటే ముఖ్యం. పబ్లిక్ రవాణా విధానంలో చాలా మార్పులు రావాలి.కార్లు మొదలైన వాహనాల వాడకం తగ్గించి, నడక, సైకిళ్ల వాడకం పెంచమని నిపుణులు సూచిస్తున్నారు.భూతాపం వల్ల 2030 నాటికి మరో 12 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్ళనున్నారని నివేదికలు చెబుతున్నాయి.వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆరోగ్యకరమైన విధానాలను పాటిస్తే ఉధృతి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ప్రకృతిని గౌరవిస్తే, అది మనల్ని కాపాడుతుంది. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
ఐదేళ్ల ప్రాయం నుంచే సంగీతంలో శిక్షణ.. స్టార్ సింగర్‌గా గుర్తింపు
అమ్మమ్మ నోటి నుంచి భక్తి భావనతో వినిపించే కీర్తనలు, గురుద్వారాలో విన్న కీర్తనలు బనత్ నోటి నుంచి తీయగా వినిపించేవి. బనత్ కౌర్ బగ్గాకు చిన్నప్పటి నుంచే సంగీతంతో చక్కని స్నేహం ఉంది. స్కూల్ ఫంక్షన్లలో, ఫ్యామిలీ ఫంక్షన్లలో తన పాట తప్పకుండా ఉండాల్సిందే. అయిదు సంవత్సరాల వయసులోనే హార్మోనియం వాయించి శ్రోతలను అబ్బురపరిచింది. లా స్టూడెంట్‌గా ఉన్నప్పుడు డెబ్యూ సింగిల్ ‘మూన్’ వచ్చింది. పంజాబీ నేపథ్యం ఉన్న బనత్ హిందీ, పంజాబీ పాటలకు తనదైన మెరుపు ఇస్తుంది. సింగర్–సాంగ్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న బనత్ కౌర్ బగ్గా పాప్ అండ్ రాక్, నియో క్లాసికల్ అండ్ ఫోక్లో మంచి పేరు తెచ్చుకుంది. తీరికవేళల్లో చక్కటి కవిత్వాన్ని ఆస్వాదించడం తనకు ఇష్టం. కొన్నిసార్లు మ్యూజిక్ కంటే కవిత్వ పంక్తులు రాసుకోవడం అంటేనే ఇష్టం. పిల్లల కోసం ముంబైలో ‘క్లాస్రూమ్’ పేరుతో మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసింది బనత్ కౌర్ బగ్గా. -
యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు విపరీతమైన డిమాండ్.. అలా చేస్తే సూపర్ సక్సెస్
అద్భుత దృశ్యాలను వర్ణించడానికి...‘రెండు కళ్లు సరిపోవు’ అంటాం. అద్భుత దృశ్యాలను సృష్టించడానికి రెండు కళ్లతో పాటు మూడోకన్ను కూడా అవసరం.దాని పేరే... క్రియేటివ్ ఐబూమింగ్ మార్కెట్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం ఒక కోణం అయితే, ఉపాధి అవకాశాలు పెరగడం, యువతరం క్రియేటివిటీకి విశాలమైన వేదిక దొరకడం అనేది మరో కోణం... ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఇరవై ఏడు సంవత్సరాల అభినవ్ భరద్వాజ్ ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్. వీఎఫ్ఎక్స్, యానిమేషన్లో డిగ్రీ పూర్తి చేసిన అభినవ్‌కు ఎన్నో పురాణ పాత్రలపై అవగాహన ఉంది. ఇరవై సంవత్సరాల వయసులో ఆర్ట్, డిజైనింగ్‌ను కెరీర్‌గా చేసుకున్న అభినవ్ లాక్డౌన్ సమయంలో ట్రెండింగ్ టాపిక్స్‌పై లెక్కలేనన్ని డిజైన్లను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో సృష్టించాడు. వాటికి మంచి స్పందన రావడం ఒక ఎత్తయితే పాపులర్ బ్రాండ్ల నుంచి అవకాశాలు రావడం మరో ఎత్తు. ‘మనకు ఉన్న రెండు కళ్లతో పాటు క్రియేటివ్ ఐ అనే మూడో కన్ను కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే బ్రాండ్ డిజైనింగ్ నుంచి సినిమా వీఎఫ్ఎక్స్ వరకు రాణించగలం’ అంటాడు అభినవ్. కలర్స్ నుంచి డ్రెస్సింగ్ సెన్స్ వరకు అతడి యూనిక్ స్టైల్ స్టేట్మెంట్కు యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల్లో బెంగళూరుకు చెందిన శ్రీతేజస్వి ఒకరు. డిగ్రీ రెండోసంవత్సరం చదువుతున్న తేజస్వి వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను విడుదలైన మొదటి రోజే చూస్తుంది. ఆ సాంకేతికత గురించి తన అభిప్రాయాలను ఫేస్బుక్లో రాస్తుంది. వినోద రంగంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీకి ఇది బంగారు కాలం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్ స్టూడియోల సంఖ్య పెరుగుతోంది. ముంబై, చెన్నై, బెంగళూరు... మొదలైన నగరాలు యానిమేషన్ కంపెనీలు, అకాడమీలకు కేంద్రాలుగా మారాయి. మన దేశానికి పెద్ద ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం ఈ రంగంలో 2025 కల్లా 75,000 నుంచి 1,25,000 ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. కమర్షియల్స్, వెబ్ సిరీస్, మూవీస్, వోటీటీకి హై–క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఈ నేపథ్యంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు ప్రాధాన్యత పెరిగింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ బిజినెస్ కాంబినేషన్ యువతను ఆకర్షిస్తుంది. కొత్త ఆలోచనలకు అవకాశం కల్పిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ యానిమేషన్‌కు డిమాండ్‌ను పెంచే కథలను సిద్ధం చేస్తోంది. ‘వీఎఫ్ఎక్స్, యానిమేషన్లకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ పెరిగింది. అంచనాలకు అందని విధంగా ఈ రంగం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. వీఎఫ్ఎక్స్ అనేది సాంకేతికత మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. కథాసం విధానంలో భాగం’ అంటున్నాడు వీఎఫ్ఎక్స్ నిపుణుడు రాజీవ్ కుమార్. స్కూల్ రోజుల నుంచే వీఎఫ్ఎక్స్ అంటే రాజీవ్‌కు ఆసక్తి. అయితే దాన్ని కెరీర్‌గా ఎలా చేసుకోవాలనే దానిపై స్పష్టత ఉండేది కాదు. పుణెలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన రాజీవ్ ముంబైకి వెళ్లి వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీతో ప్రయాణం మొదలుపెట్టి భారీ విజయం సాధించాడు. మలయాళ చిత్రం కందిట్టుండు (అది చూడు) బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. 25 సంవత్సరాల అదితి క్రిష్టదాస్ ఈ చిత్రానికి దర్శకురాలు. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (ఎన్ఐడీ) లో యానిమేషన్ కోర్సు చేసిన అదితి క్రిష్ణదాస్ తొలి చిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకుంది చెన్నైకి చెందిన ప్రియాంక సుబ్రమణియన్. లండన్ ఫిల్మ్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్ ద్వారా మూవింగ్ పిక్చర్ కంపెనీకి తరచు వెళ్లేది. ఇండస్ట్రీ ధోరణులను అర్థం చేసుకోవడం కోసం ఎందరో కళాకారులతో మాట్లాడేది. పుస్తకాలు చదివేది. స్టూడియోలలో అవసరమైన వారికి టీ, కాఫీలు, వోల్డ్ టేప్‌లు, హార్డ్ డిస్క్‌లు అందించేది. వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన ప్రియాంక సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని కలలు కనేది. వీఎఫ్ఎక్స్ స్టూడియో రూపంలో తన కలను సాకారం చేసుకుంది. మీ శక్తి వృథా చేయవద్దు వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అప్పుడు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా చేసే శక్తి ఉంటుంది. ఆ శక్తి నిరుపయోగం కాకుండా చూసుకోవాలి. – ప్రియాంక సుబ్రమణియన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ అ కథలు మళ్లీ ఇప్పుడు మనకు తరతరాల కథల సంపద ఉంది. అమ్మమ్మలు, నానమ్మల నోటి నుంచి కథలు వినే దృశ్యాలు అరుదైపోయాయి. ఈ నేపథ్యంలో యానిమేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. మరుగున పడిన ఎన్నో కథలను పిల్లలకు ఆకట్టుకునేలా చెప్పవచ్చు. యానిమేషన్ ఫిల్మ్స్ అంటే ఫన్నీ కార్టూన్స్‌ను మాత్రమే కాదు. – అదితి క్రిష్ణదాస్, డైరెక్టర్ -
ప్రపంచంలోనే ఇలాంటి హోటల్ ఎక్కడా లేదు.. అంత స్పెషల్ ఏంటంటే..
ప్రపంచంలో అక్కడక్కడా కాలంచెల్లిన బోయింగ్ విమానాల్లో నడిపే హోటళ్లు ఉన్నాయి. అయితే, టర్కీలో మాత్రం ఏకంగా విమానం ఆకారంలోనే నిర్మించిన విలాసవంతమైన హోటల్ ఉంది. ప్రపంచంలో ఇలాంటి హోటల్ ఇదొక్కటే! ప్రైవేట్ బీచ్, ఒక ‘పెద్దలకు మాత్రమే’ స్విమ్మింగ్‌పూల్ సహా నాలుగు స్విమ్మింగ్‌పూల్స్, ఒక ఆక్వా పార్క్ ఈ హోటల్ ప్రత్యేకతలు. టర్కీలోని అంతాల్యా నగరానికి చేరువలోని లారా సముద్రతీరం వద్దనున్న ఈ హోటల్ పేరు ‘కాంకోర్డ్ డీలక్స్ రిసార్ట్’. అంతాల్యా విమానాశ్రయం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనున్న ఈ హోటల్ టర్కీలో పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ హోటల్లో పిల్లల ఆటపాటల కోసం ప్రత్యేకమైన కిడ్స్ క్లబ్, మినీ గోల్ఫ్‌కోర్స్, టెన్నిస్ కోర్ట్ తదితరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో విందు వినోదాల కోసం పన్నెండు రెస్టారెంట్లు, పదహారు బార్లు కూడా ఉన్నాయి. ఇద్దరు మనుషులు ఇందులో ఒకరోజు బస చేసేందుకు 73 పౌండ్లు (రూ.7,245) మాత్రమే! -
హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోండి
ఈమధ్య కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య బట్టతల. దీనికి అనేక కారణాలున్నాయి. తీసుకునే ఆహారం, నిద్ర, లైఫ్‌స్టైల్, జన్యపరమైన సమస్యలు.. ఇవన్నీ జుట్టు రాలడానికి కారణం కావొచ్చు. ఇవి కాకుండా హెల్మెట్ రోజూ ధరించడం వల్ల కూడా బట్టతల వస్తుందని చాలామంది అనుకుంటారు. మరి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నిజంగా జుట్టు రాలుతుందా? బట్టతల రాకుండా ఏం చేయాలి అన్నది ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలో తెలుసుకుందాం. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. బైక్‌పై రయ్రయ్ మని తిరగాలంటే హెల్మెట్ ఉండాల్సిందే. అయితే నిత్యం హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఇదే కారణంగా యువత హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే. హెల్మెట్‌కి, బట్టతలకి ఎలాంటి సంబంధం లేదు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి నుంచి జుట్టు పొడిపారకుండా ఉంటుంది. అయితే ఎక్కువసేపు ధరిస్తే మాత్రం తలలో వేడి పెరిగి దాని వల్ల జుట్టులో చెమటకి దారితీస్తుంది.నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. మంచి క్వాలిటీ హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు కాపాడటమే కాకుండా జుట్టుకు ఎలాంటి ఇబ్బంది రానివ్వదు. అందుకే మంచి సౌకర్యవంతమైన, నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి. బట్టతల రాకుండా ఏం చేయాలి? ►హెల్మెట్‌ను వాడిన తర్వాత గాలి తగిలే చోట ఉంచాలి. రెండు, మూడు రోజులకోసారి ఎండలో ఉంచాలి. ► హెల్మెట్ లోపల ఉండే కుషనింగ్ మీద ఉన్న మురికిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ► హెల్మెట్ తీసేటప్పుడు కొందరు చాలా ఫాస్ట్‌గా తీస్తుంటారు. అలా చేయరాదు. ► ఎందుకంటే అప్పటికే చాలాసేపటి వరకు హెల్మెట్ జుట్టుకు అతుక్కొని ఉంటుంది. కాబట్టి హెల్మెట్ తీసేటప్పుడు మెల్లిగా తీయండి ► చండ్రు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వేరేవాళ్ల హెల్మెట్లు వాడకపోవడమే మంచిది. ► హెల్మెట్ వాడటానికి ముందు లోపలిభాగంలో ఒక క్లాత్ ఉంచండి. దీనివల్ల జుట్టు దెబ్బతినదు. ► చాలామంది తలస్నానం చేసిన వెంటనే తడి ఆరకుండానే హెల్మెట్ ధరిస్తుంటారు. అలా అస్సలు చేయొద్దు. ► జుట్టు పూర్తిగా పొడిగా మారిన తర్వాతే హెల్మెట్ ధరించాలి. లేకపోతే ఫంగల్, దురద సమస్యలు వస్తాయి. ► అంతేకాకుండా తడిజుట్టుపై హెల్మెట్ ధరిస్తే జుట్టు బలహీనంగా మారి త్వరగా ఊడిపోతుంది కూడా. ► వీటన్నింటితో పాటు తరచుగా నూనెతో మర్దనా చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ► మంచి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. ►మానసిక ఒత్తిడితో బాధపడేవాళ్లలో జుట్టు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్ సిస్టమ్ మీద ప్రభావితం చూపిస్తుంది. -
హార్ట్ ఎటాక్ రెస్టారెంట్.. ఫుడ్ తింటే నిజంగానే గుండెనొప్పి వస్తుందేమో!
ఈమధ్యకాలంలో రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు హోటల్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని బాగా విస్తరిస్తున్నారు. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ పేరు వింటే మాత్రం మీకు గుండెదడ వచ్చేస్తుంది. ఎందుకంటే, ఆ రెస్టారెంట్ పేరు హార్ట్ ఎటాక్. పేరుకు తగ్గట్లే హాస్పిటల్ థీమ్ మొత్తం హాస్పిటల్ మాదిరి ఉంటుంది. మరి ఈ వెరైటీ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? ఎలాంటి వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ అక్కడ దొరుకుతాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు రకరకాల వెరైటీ రెస్టారెంట్ పేర్లను విన్నాం, చూశాం. కానీ ఈ రెస్టారెంట్ పేరు వింటేనే గుండెనొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రెస్టారెంటపేరు హార్ట్ ఎటాక్ రెస్టారెంట్. అక్కడి ఫుడ్ ఐటెమ్స్ తింటే నిజంగానే మీకు హార్ట్ ఎటాక్ వస్తుందేమో. ఇక్కడ దొరికే బైపాస్ బర్గర్లు తింటే ఏకంగా 10వేల క్యాలరీల శక్తి లభిస్తుంది. బైపాస్ బర్గర్ అంటే ఒకదానిపై మరొకటి పెడుతూ వాటిలో ఉంచే పదార్థాల మోతాదును కూడా పెంచుకుంటూ పోతారు. కేవలం బర్గర్లు మాత్రమే కాదు, అక్కడ దొరికే ప్రతీ ఫుడ్ ఐటెంలో కొవ్వు అతిగానే ఉంటుంది. 2005లో జాన్ బాసో అనే వ్యక్తి ఈ ''హార్ట్ ఎటాక్ గ్రిల్'' రెస్టారెంట్‌ను ప్రారంభించగా వెరైటీగా ఉండటంతో కొద్ది నెలల్లోనే ఈ రెస్టారెంట్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్లగానే రెస్టారెంట్‌కి వచ్చామా? లేక హాస్పిటల్‌కి వచ్చామా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్ పేషెంట్స్‌లా గౌనులు వేసుకొని వెళ్లాలనే రూల్ ఉంది. ఇక అక్కడి వెయిటర్స్ నర్సులు, డాక్టర్లుగా డ్రెస్ చేసుకుంటారు. అంతేకాకుండా కస్టమర్లు ఇచ్చే ఆర్డర్స్‌ను ‘ప్రిస్క్రిప్షన్’ అంటారు. ఒకవేళ ఆర్డర్ చేశాక ఫుడ్ ఐటెమ్స్ తినకపోతే మీకు శిక్ష కూడా ఉంటుంది. అదేంటంటే నర్సులు వచ్చి సరదాగా బెల్ట్‌తో కొడతారట. ఇవన్నీ వింటుంటే..పిచ్చోళ్ల గురించి వినడమే కాదు.. చూడటం ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది కదా. ఈ రెస్టారెంట్లో మరో వింత ఏమిటంటే 350 పౌండ్ల కన్నా అధిక బరువున్న వాళ్లకు ఎంత తింటే అంత ఫుడ్ ఫ్రీగా పెడతారట. View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) అయితే కస్టమర్ల ఆరోగ్యాన్ని హానిచేసేలా విపరీతమైన జంక్‌ను ఎంకరేజ్ చేసేలా ఈ రెస్టారెంట్ ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో తరచూ ఈ రెస్టారెంట్ వార్తల్లో నిలుస్తుంది. అయితే అక్కడ తినడం వల్ల ఆరోగ్యానికి హానీ అని తెలిసినా కస్టమర్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉండటం మరో విశేషం. -
అత్యంత అరుదైన డాల్ఫిన్లు.. ఎక్కడో తెలుసా?
ఈ విషయాలు మీకు తెలుసా? డాల్ఫిన్లు సాధారణంగా శరీరంపై వైపున బూడిదరంగులోను, పొట్ట భాగంలో తెలుపు రంగులోను ఉంటాయి. అరుదుగా నలుపు తెలుపు మచ్చలతో కూడా ఇవి కనిపిస్తుంటాయి. ఫొటోలో కనిపిస్తున్న చారల డాల్ఫిన్లు అంత్యంత అరుదైనవి. ఇటీవల ఇవి ఇంగ్లండ్ తీరానికి ఆవల సముద్రంలో కనిపించాయి. ‘ఏకే వైల్డ్‌లైఫ్ క్రూజెస్’ పడవలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పడవ కెప్టెన్ కీత్ లీవ్స్ వీటిని గమనించాడు. సముద్రంలో ఈ చారల డాల్ఫిన్లు సయ్యాటలాడుతుండగా, తన కెమెరాను క్లిక్‌మనిపించాడు. ఫాల్ముత్ తీరానికి ఆవల ఇవి కనిపించినట్లు కీత్ వెల్లడించాడు. వీటి ఫొటోలను అతడు ‘సీ వాచ్ ఫౌండేషన్’కు అందించాడు. వీటిని పరిశీలించిన ‘సీ వాచ్ ఫౌండేషన్’ నిపుణులు, ఇవి అంత్యంత అరుదైనవని తెలిపారు. -
పెళ్లికాని శ్రీమంతుడు.. రెడీ టూ మింగిల్ అంటున్నా పట్టించుకోని అమ్మాయిలు
అతనో బిలియనీర్.. అమెరికాలోని సంపనుల్లో అతడొకడు. పేరు బ్రియాన్ జాన్సన్. కండలు తిరిగిన దేహంతో చూడటానికి కూడా చాలా అందంగానే ఉంటాడు. పైగా ఆల్కహాల్ కూడా ముట్టుకోడు పక్కా హెల్తీ డైట్‌ను ఫాలో అవుతాడు. అయినా అతనికి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కోసం బ్రియాన్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. కానీ ఏం చేస్తాం.. ఇప్పటికీ పెళ్లికాని కోటీశ్వరుడిగానే మిగిలిపోయాడు.ఇన్ని మంచి అలవాట్లు ఉన్న జాన్సన్ ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. చాలా సార్లు డేటింగ్‌కు పిలిచినా అమ్మాయిలు నో చెప్పి పారిపోతున్నారట. ఇంతకీ ఈ బిలియనీర్ పెళ్లి కహానీ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. బ్రియాన్ జాన్సన్.. అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. అందంగా ఉంటాడు, మద్యం కూడా తాగడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ బిజినెస్‌మ్యాన్ వందల కోట్లకు అధిపతి. వయసు 45. పెళ్లీడు ఎప్పుడో వచ్చి వెళ్లిపోయింది కూడా. కానీ జాన్సన్‌కు ఇంకా పెళ్లి కాలేదు. భాగస్వామి కోసం అతను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడట. వందల కోట్లున్నా తన జీవితంలో ఇంకా అమ్మాయి లేదని తెగ ఫీల్ అవుతున్నాడు. వయసు మీద పడుతున్నా యంగ్‌గా కనిపించేందుకు బ్రియాన్ జాన్సన్ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కూడా. దీనికోసం ఏడాదికి ఏకంగా రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అయినా నో యూజ్.. అమ్మాయిలు ఇతను చెప్పే కండిషన్స్ విని దూరంగా పారిపోతున్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో జాన్సన్.. పెళ్లికోసం తను పడుతున్న ఇబ్బందులను వివరించాడు. కోట్లున్నా తనకింకా పెళ్లి కాలేదని, భాగస్వామి దొరకడం కష్టమైపోయిందని ఆవేదన చెందాడు. అతను ఏమన్నాడంటే.. ''నేను రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాను. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలనే తీసుకుంటాను. రోజుకు ఐదు గంటలు ఏకాగ్రత, మంచి లైఫ్‌స్టైల్ కోసమే కేటాయిస్తాను. పక్కా న్యూటిషియన్లు చెప్పిన డైట్‌నే ఫాలో అవుతాను. దీంతో పాటు ముడుచుకొని పడుకోవడం నాకు అలవాటు. ఇదే విషయాల గురించి అమ్మాయిలతో ప్రస్తావిస్తే వాళ్లు షాకవుతున్నారు.మొదట డేట్‌కు వస్తామని చెప్పిన వాళ్లు నా కండిషన్స్ లిస్ట్ చూసి నో చెబుతున్నారు.అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకుముందు మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. కానీ దానివల్ల అదనపు క్యాలరీలు వచ్చి బరువు పెరుగుతానని దీనికి కూడా దూరంగా ఉంటున్నా. అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్స్ వేసుకుంటా. ఇన్ని చేస్తున్నా నాకింకా పెళ్లి కాలేదు'' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు జాన్సన్. -
పల్లె నుంచి పట్నం దాకా..యూట్యూబ్‌తో సూపర్‌స్టార్స్
భారతదేశంలో పదిహేను వసంతాలను పూర్తి చేసుకున్న యూట్యూబ్ (ఇండియా) పల్లె నుంచి మహా పట్నం వరకు యువతరంలో ఎంతోమందిని కంటెంట్ క్రియేటర్స్‌గా మార్చింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల నాడిని తెలుసుకుంటూ, యూట్యూబ్ కొత్త టూల్స్‌ను అందిపుచ్చుకుంటూ తమ సృజనాత్మక శక్తులను బలోపేతం చేసుకుంటున్నారు యంగ్ క్రియేటర్లు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ యువత రంగుల కలలను సాకారం చేసే రంగస్థలం అయింది. ప్యారే దోస్తుగా మారింది... ‘మన దేశ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పదిహేను సంవత్సరాల యూట్యూబ్ ప్రయాణంలో కనిపిస్తుంది’ అంటాడు యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మాట ఎలా ఉన్నా యువతరం క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్ ఎంతోమంది క్రియేటర్లను సృష్టించింది. కొత్త కెరీర్ దారులను పరిచయం చేసింది. చెన్నైకి చెందిన మలర్ సరదాగా యూట్యూబ్‌లో ఇంగ్లీష్–స్పీకింగ్ కోర్సు మొదలుపెట్టింది. ఆ తరువాత ఆఫ్‌లైన్‌లో కూడా సక్సెస్ అయింది. తన యూట్యూబ్ కుకింగ్ చానల్‌తో సక్సెస్ అయిన పశ్చిమబెంగాల్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన పుష్పరాణి సర్కార్ ‘ఈ చానల్ ద్వారా నలుగురికి నా పేరు తెలియడమే కాదు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది’ అంటుంది. ఎబిన్ జోస్ పాపులర్ యూట్యూబ్ చానల్ ‘ఫుడ్ అండ్ ట్రావెల్’కు 7,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘అనుకరణతో ఫలితం ఉండదు. ఎవరి సక్సెస్ ఫార్ములాను వారు రూపొందించుకోవాల్సిందే’ అంటాడు జోస్. 2008లో మన దేశంలోకి యూ ట్యూబ్ లోకలైజ్డ్ వెర్షన్ అడుగు పెట్టింది. ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఎన్నో అవతారాలు ఎత్తింది. ఎన్నో ట్రెండ్స్‌ను పరిచయం చేసింది. ఈ ట్రెండ్స్‌లో యువతరానిదే పై చేయిగా మారింది.యూట్యూబ్ ట్రెండ్స్–2023 రిపోర్ట్ ప్రకారం జెన్ జడ్లో 69 శాతం మంది ప్రేక్షకులు షార్ట్ ఫామ్, లాంగ్ ఫామ్, లైవ్‌స్ట్రీమ్... ఇలా ఏ ఫార్మట్‌లోనైనా తమ అభిమాన క్రియేటర్ కంటెంట్‌ను చూడడానికి ఇష్టపడుతున్నారు. నిర్దిష్టమైన కంటెంట్, ఆర్టిస్ట్‌లు, పబ్లిక్ ఫిగర్స్‌కు సంబంధించి ఫ్యాన్స్ రూపొందించిన వీడియోలను చూడడానికి ఇష్టపడుతున్నట్లు జెన్ జడ్లో 48 శాతం మంది చెబుతున్నారు. పదిహేను సంవత్సరాల కాలంలో యూట్యూబ్ యూత్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్‌గా మారింది. మహానగరంలో ఉన్నా, మారుమూల పల్లెలో ఉన్నా ఒక చిన్న బ్రైట్ ఐడియాతో అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోయేలా ఈ వేదిక యూత్‌కు ఉపకరించింది. డ్యాన్స్ ట్యుటోరియల్స్ నుంచి హౌ–టు వీడియోల వరకు యువతరంలో ఎంతోమందిని ఫేమ్ చేసింది. యూ ట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (2011) లాంచ్‌తో ఎంతోమంది క్రియేటర్లకు ఒక వేదిక దొరికింది. ఈ ఫస్ట్ వేవ్ క్రియేటర్లు తమ విజయాలతో ఎంతోమందిని ప్రభావితం చేశారు.మ్యూజిక్, సినిమాలు ఆరాధించే మన దేశంలో యూట్యూబ్ వేదికగా యువతరం చేతిలో కంటెంట్ క్రియేషన్ అనేది కొత్త పుంతలు తొక్కింది. కంటెంట్ క్రియేషన్‌కు సంబంధించి యూట్యూబ్ అడ్వాన్సింగ్ టూల్స్‌ను తీసుకువచ్చింది. ఫార్మట్లను విస్తరించింది. క్రియేటర్లు తమ వీడియోలను ఇతర భాషల్లోకి తీసుకువచ్చే ఏఐ పవర్డ్ డబ్బింగ్ టూల్‌ను తీసుకురానుంది. భవిష్యత్‌లో ఈ టూల్ ద్వారా వాయిస్ ప్రిజర్వేషన్, లిప్ రీ–యానిమేషన్, ఎమోషన్ ట్రాన్స్ఫర్... మొదలైనవి చేయవచ్చు. ఫిల్మ్ స్టూడియోలు, మ్యూజిక్ కంపెనీలు కూడా యూట్యూబ్ చానల్స్‌ను స్టార్ట్ చేయడం మొదలు పెట్టాయి. దీనిద్వారా యువతలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ‘యూట్యూబ్ తొలిసారిగా పరిచయం అయినప్పుడు అది టైమ్‌పాస్ మాత్రమే. అయితే మన టైమ్‌ను కూడా మార్చుకొని ఎదగవచ్చని ఎంతోమంది నిరూపించారు’ అంటుంది బెంగళూరుకు చెందిన ప్రజ్వల. స్ఫూర్తినిచ్చే సూపర్‌స్టార్స్ మన దేశంలోని మోస్ట్ పాపులర్ యూట్యూబ్ స్టార్ల స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ‘ది యూట్యూబ్ స్టార్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాడు దిల్లీకి చెందిన అజితాభ బోస్. ఇది బోస్ నాన్–ఫిక్షన్ బుక్. ఈ పుస్తకంలో సక్సెస్ఫుల్ యూట్యూబర్ల స్ట్రగుల్‌ను కళ్లకు కట్టేలా రాశాడు. అశిష్, అమిత్ బదన, ప్రజక్త కోలి, కునాల్ చాబ్రియ, శృతి, అర్జున్ ఆనంద్‌లాంటి పదిహేను మంది యూట్యూబర్ల గురించి రాశారు. విజయం అనేది ఎంత కష్టపడితే వస్తుంది అనేది వీరి గురించి చదివితే బోధపడుతుంది. అహ్మదాబాద్‌కు చెందిన హర్ష్ పమ్నానీ వృత్తిపరంగా బ్రాండ్ ఎక్స్పర్ట్. ప్రవృత్తి పరంగా స్టోరీటెల్లర్. ‘బూమింగ్ బ్రాండ్స్’ పేరుతో పుస్తకం రాసి పేరు తెచ్చుకున్న హర్ష్ ‘బూమింగ్ డిజిటల్ స్టార్స్’ పేరుతో సక్సెస్ఫుల్ యూ ట్యూబ్ స్టార్స్ గురించి మరో పుస్తకం రాశాడు. క్రియేటర్ ఎకనామీలో భాగం కావడానికి వారి పరిచయాలు పాఠాలుగా ఉపయోగపడతాయని అంటాడు రచయిత. కవితా సింగ్, ఉజ్వల్ చౌరాసియ, యశ్వంత్ ముఖ్తే... లాంటి పదకొండుమంది యూట్యూబ్ స్టార్ల గురించి ఈ పుస్తకంలో రాశాడు హర్ష్. -
ఇలా చేస్తే వాటర్ బాటిల్స్‌ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు
ఈ రోజుల్లో ప్రతి యంత్రం, ప్రతి పరికరం.. న్యూ టెక్నాలజీని అందుకుంటూ.. ఈజీ ప్రొసెస్‌ను వినియోగదారులకు అందిస్తున్నాయి. సాధారణంగా వాటర్ బాటిల్స్, పాల బాటిల్స్, వాటి చిన్న చిన్న మూతలను క్లీన్ చేయడానికి పొడవాటి బ్రష్ ఉండేది. అయితే చిత్రంలోని బ్రష్ చూడటానికి అలానే కనిపిస్తుంది కానీ, ఇది టెక్నాలజీతో ముడిపడిన పరికరం (ఎలక్ట్రిక్ వాటర్‌ప్రూఫ్ డివైస్). ఒక్క బటన్ నొక్కితే చాలు గిర్రున తిరుగుతూ బాటిల్ మూల మూలలను శుభ్రం చేసి పెడుతుంది. ఈ హ్యాండ్‌హెల్డ్ క్లీనర్‌కి తగినంత చార్జింగ్ పెట్టుకుని.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. అవసరం అయితే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు వేసుకుని సులభంగా వాడుకోవచ్చు. ఒంపులు తిరిగిన మగ్గులు, గ్లాసులు, చెంబులు, బేబీ బాటిల్స్, బాటిల్ నిపుల్స్ వంటివి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. అందుకు అనువైన రెండు వేరు వేరు బ్రష్‌లు.. బేస్ డివైస్‌కి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మధ్యలో ఉన్న పవర్ బటన్ ఆన్ చేసుకోవడంతో ఈ డివైస్ పని చేస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్ కావడంతో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని ధర 14 డాలర్లు (రూ.1,158) -
రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ డివైస్ ఉంటే చాలు
ఈ హైటెక్ హెడ్‌బ్యాండ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అర్గో’ దీనిని ‘అర్గోనైట్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. తొలిసారిగా దీనిని 2019 సీఈఎస్ ప్రదర్శనలో ప్రదర్శించినప్పుడు ఇది విశేషంగా ఆకట్టుకుంది. నిద్రపోయేటప్పుడల్లా దీనిని తలకు తొడుక్కోనక్కర్లేదు. ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కుంటే చాలు. ఇలా వారానికి కనీసం మూడుసార్లు– ప్రతిసారి ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కున్నట్లయితే, ఇది ఈఈజీ మాదిరిగా పనిచేస్తుంది. మెదడును స్కాన్ చేసి, ఆ చిత్రాలను యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. ఒత్తిడిని, ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. కొద్దినెలలు దీన్ని వాడితే నిద్రలేమి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిని వినియోగించిన వారు కూడా దీని పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ధర 499 డాలర్లు (రూ.40,940). -
ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్‌తో నడిచే విమానం
ప్రపంచంలోనే తొలి విద్యుత్ విమాన సేవలు మరో రెండేళ్లలో ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ నుంచి ఎడిన్బర్గ్ వరకు ఈ విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. కాలుష్యానికి దారితీసే పెట్రో ఇంధనాల వాడుకను పూర్తిగా నిలిపివేయాలనే లక్ష్యంతోనే పూర్తి విద్యుత్ విమాన సేవలను ప్రారంభించేందుకు ‘ఎకోజెట్’ సంస్థ సన్నాహాలు చేస్తోంది. బ్రిటిష్ సంపన్నుడు డేల్ విన్స్ ఈ కంపెనీని నెలకొల్పారు. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు భూరి విరాళాలు అందిస్తూ వస్తున్న డేల్ విన్స్, కర్బన ఉద్గారాలను విడుదల చేయని విమాన సేవలను అందించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ విమాన సేవలు సౌతాంప్టన్–ఎడిన్‌బర్గ్‌ల మధ్య 2025 నుంచి ప్రారంభం కానున్నాయని విన్స్ ప్రకటించారు. ‘ఎకోజెట్’ రెండు రకాల విమానాల ద్వారా ఈ సేవలను అందించనుంది. పంతొమ్మిది సీట్ల సామర్థ్యం గల విమానాలు, డెబ్బయి సీట్ల సామర్థ్యం గల విమానాలు ఈ సేవల కోసం ‘ఎకోజెట్’ వాహనశ్రేణిలో కొలువుదీరనున్నాయి. ఈ విమానాల్లోని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తవుతుంది. ఈ విద్యుత్తుతోనే విమానాలు నిరాటంకంగా రాకపోకలు సాగించగలుగుతాయి. ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా పాత విమానాలకు మరమ్మతులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను అమర్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని ‘ఎకోజెట్’ అధికారులు చెబుతున్నారు. ఈ విమానాల వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం ఏడాదికి 90వేల టన్నుల వరకు తగ్గుతుందని వారు అంటున్నారు. -
Pudami Sakshiga : అంతరించిపోతున్న అరుదైన పక్షులు.. అక్రమంగా విదేశాలకు
ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణ మార్పులతో ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అదే కోవలో ఎన్నో పక్షిజాతులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే పలు జాతులు అంతరించిపోయాయి. స్టేట్ అప్ బర్డ్స్ వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 48% పక్షుల జనాభా తీవ్రంగా తగ్గిపోయింది. మన దేశంలో ఇప్పటికే 50% పక్షుల జనాభా తగ్గిపోయింది. వాటిలో అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు కూడా ఉంది. ఈ రకం పక్షుల గురించి ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అక్రమ విదేశీ విక్రయాల వల్ల వీటి జనాభా తీవ్రంగా దెబ్బతింటుంది. మన దేశంలో దాదాపు 8 పక్షిజాతులు ఉన్నాయి. వీటిలో అత్యంత అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు. ఇవి ఆకారంలో చిన్నదిగా, బాహ్యబాగల్లో ఆకుపచ్చరంగుతో, ఉదరబాగల్లో లేత పసుపు వర్ణంతో,నలుపు తెలుపు చారాలతో (జీబ్రా స్ట్రిప్స్), ఎర్రటి కళ్ళు, ఎరుపు ముక్కుతో రామచిలుకను పోలిఉండటంతో చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వీటి శాస్త్రీయ నామం Amandava formosa Formosa. అంటే లాటిన్ భాషలో అందంగా తయారైందని అర్థం. వీటిని గ్రీన్ స్ట్రాబెర్రీ ఫించ్, గ్రీన్ టైగర్ ఫించ్ అని కూడా పిలుస్తారు. ఆకుపచ్చ ముణియా,ఎరుపు ముణియా మాత్రమే ఎరుపు ముక్కు కలిగివుంటుంది. ఇది మరే ఇతర ముణియా జాతి పక్షుల్లో కనిపించని లక్షణం. బాల్యదశలోని పక్షులు గోధుమ వర్ణంలోనూ, ఉదరబాగంలో లేత పసుపు రంగుతో ఆకర్షణీయంగా కనబడుతోంది. ఇవి దాదాపు 10 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. మగ పక్షులు ఆడపక్షుల కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఇవి మధ్య, దక్షిణ భారతదేశానికి మాత్రమే స్థానికమైన పక్షులు. పొద అడవులు, పొడి నేల , వ్యవసాయ నేల , చెరుకు ,మక్కజాన్న ,రాగులు , సజ్జల పంట పొలాల్లో విరివిగా వీటి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.పెద్ద పెద్ద ఆకులతోను లేదా చెరుకు ఆకుల మధ్య వీటి గూళ్ళును వేలాడదీస్తుంది. జనవరి నుండి మే నెలలో సంతానోత్పత్తి కొరకు 4-6 గుడ్లు పెట్టి 16-25 రోజుల వరకు ఆడ,మగ పక్షుల చేత పొదగబడుతుంది. ఆహార సేకరణ కొరకు చిన్న చిన్న గుంపులు గుంపులుగా వెళ్లి పంట పొలాల్లోని చీడ పురుగులను, చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటుంది. వీటి కూత హై పిచ్ గానంతో చెవులకు ఇంపుగా స్వీ...స్వీ అంటూ ముగుస్తుంది. ఆది నుండి అక్రమ రవాణ:- నిజానికి మనదేశంలో దాదాపు 250 దేశీయ అడవి పక్షులు,70 విదేశీ పక్షులు ,అక్రమ పక్షులవిక్రయం ( illegal bird trade ) లో ఉన్నాయి . ఇందులో ఆకుపచ్చ ముణియాలు ఆకర్షణగా కనిపించడంతో,మెలోడియస్ గానంతో, వేటగాళ్ల వలక సులభంగా చిక్కిపోవటం,పెంపరులతో స్నేహంగా మెలగడం,పెంచటం సులభ తరం కనుక పంజర పక్షులుగా మారాయి. 19 వ శతాబ్దంలో అహ్మదాబాద్ లోని ఒక కరప్షన్ ప్రాంతం అవడవత్ వీటి విక్రయానికి చిరునామాగా మారింది . అందువలనే వీటికి Green Avadavat అనే పేరు కూడా వచ్చింది. 1960 నుండి 1980 వరకు రెండు వేల ఆకుపచ్చ ముణియా పక్షుల మార్కెట్లలో బహిరంగంగా అమ్మకానికి గురైంది. దాదాపు 2000 నుంచి 3000 పక్షులు వరకు ప్రతియేటా ఇండియా నుంచి ఐరోపా ,ఉత్తర అమెరికా వంటి ఖండాంతర దేశాలకు అక్రమంగా ఎగుమతుల్లో తరలిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తంతు 1980 నుండి యిప్పటి వరకు కొనసాగుతుంది. శతాబ్దాల నుంచి అక్రమ విదేశీ విక్రయాల వలన స్వేచ్చగా గాలిలో విహరించల్సిన పక్షులు ఇప్పుడు బాధిత పక్షులుగా పంజరాలకు పరిమితమైంది. ఆవాస విధ్వంసమే ప్రధాన ముప్పు:- ఈ పక్షులు మొదట్లో రాజస్థాన్ లోని మౌంట్ అభు కొండల్లో విరివిగా కనిపించేవి కానీ ఇప్పుడు వాటి ఉనికిని కోల్పోయి దక్షిణ భారతదేశానికి పరిమితమైంది. వీటిని సాంప్రదాయ వైద్య పద్దతిలో ఉపయోగించడం వలన జనాభా భారీగా తగ్గిందని అక్కడ ఆదివాసీ గిరిజన ప్రజలు చెబుతున్నారు.1980 లో అరకు లోయ పాదాల చెంత సుంకర మిట్ట ప్రాంతం ప్రధాన ఆవాస కేంద్రంగా పరిగణంపబడుతున్న సమయంలో అక్కడ బాక్సైట్ గనుల తవ్వకాల వలన ఆవాసం కోల్పోయి కనిపించకుండా పోయింది. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వలన రసాయన పదార్థాలు జైవిక వ్యవస్థాపన జరిగి చనిపోతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో నివాస విధ్వంసం, అక్రమ విదేశీ విక్రయాలు, పంజార పక్షులుగా బంధించడం, ఆహారం కోసం వేటాడం వంటివి ప్రధాన ముప్పులుగా ఉన్నాయి. చట్టాలున్న రక్షణ కరువైంది:- భారత ప్రభుత్వం వీటి పరిరక్షణ నిమిత్తం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ (1972) లో షెడ్యూల్ 4 లో చెర్చింది.1981లో ఆకుపచ్చ మునియాలు అమ్మకానికి బాన్ విధించింది. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండెంజర్డ్ స్పీసీస్ (CITES) లో అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చోటుచేసుకుంది. స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2020 నివేదిక ప్రకారం.. ఇది తీవ్ర భయాందోళనకు గురికావడం, నిర్లక్ష్యం మరియు తక్కువ సమృద్ధిలో ఉండటం చాలా ప్రమాదకరం,ఆందోళనకరం అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ 3 వ అనుకూల ఆవాసం:- అడుగడుగునా అంతరాలు ఎదురుకొంటున్న పక్షికి అంధ్రప్రదేశ్ లోని గుడిస రిజర్వు ఫారెస్ట్ భారతదేశంలోనే 3 వ అతిపెద్ద అనుకూల ఆవాస కేంద్రంగా ఆశ్రయమిస్తుంది.అక్కడ సంతానోత్పత్తికి కూడా అనువైన ప్రాంతంగా మారింది. అంతే కాకుండా విశాఖపట్నంలోని దారకొండ మారేడుమిల్లి అడవుల్లో కూడా నాలుగు సైటింగ్స్ చేసినట్లు బర్డ్ వాచేర్స్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. పరిరక్షణ అవసరం :- ''ప్రపంచవ్యాప్తంగా ప్రమాద స్థితిలోన్న ఆకుపచ్చ మునీయాలు మరలా పచ్చదనం సంతరించుకోవాలంటే అడవులను పెంచాలి, అడవుల్లో వర్షపు నీతి నిల్వ కుంటలు ఏర్పాటుచేయాలి ,అడవుల్లో విజిలెన్స్ విభాగం తనిఖీ విధిగా చేయాలి , వీటి గుడ్లను పొదిగించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ,వీటి ఆవాస మనుగడ పై పరిశోధనలు చేసేలా ప్రభుత్వాలు పూనుకోవాలి'' అని ఎస్వీ యూనీవర్సిటీ జువాలజి విభాగ ఆచార్య మారం రాజశేఖర్ తెలిపారు . - గిడ్డకింద మాణిక్యం అసోసియేట్ ప్రొఫెసర్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి. ఫోటోగ్రాఫర్- అసీమ్ కొఠిలా డా. గుండులూరు స్వాతి,అసోసియేట్ ప్రొఫెసర్ జంతు శాస్త్ర విభాగం , ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుత్తూరు. తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా?
వాన.. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యం. అయితే, అది ఎక్కువైనా నష్టమే.. తక్కువైనా కష్టమే.. ఎక్కువగా కురిస్తే కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు.. తక్కువగా పడితే కరువు, కాటకాలు. గతవారం రాష్ట్రంలో వానలు దంచి కొట్టాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు నీట మునిగి, జనం ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కావడంతో మొన్నటి వరకు లోటు వర్షపాతం నమోదు కాగా, పది రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. పది రోజుల క్రితం 54శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరింది.ఈ సంగతి అలా ఉంచితే.. మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్న వాన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చూద్దామా? చినుకు ఎలా ఉంటుందంటే.. సాధారణంగా వర్షపు చినుకులు బిందువుల మాదిరిగా ఉంటాయనుకుంటాం. కానీ అవి బన్ ఆకారంలో ఉంటాయి. ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ వ్యాసార్ధం కలిగిన చినుకులు గోళాకారంలో ఉంటాయి. కాస్త పెద్ద చినుకులు హాంబర్గ్ బన్‌లా ఉంటాయి. అదే 4.5 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కంటే పెద్ద చినుకులు పారాచూట్ తరహాలో మారి చిన్నచిన్న చినుకులుగా కింద పడతాయి. నిమిషంలో31.2 మిల్లీమీటర్ల వర్షం.. ఒక్క నిమిషంలో అత్యధికంగా కురిసిన వర్షం ఎంతో తెలుసా? 31.2 మిల్లీమీటర్లు. 1956 జూలై 4న అమెరికా మేరీల్యాండ్‌లోని యూనియన్విల్లేలో ఇది నమోదైంది. ఇక 1966 జనవరి 7 నుంచి మరుసటి రోజు వరకు 24 గంటల్లో కురిసిన 1825 మిల్లీమీటర్ల వర్షమే ఇప్పటివరకు నమోదైన అత్యధిక వర్షపాతం. అదే మనదేశంలో అయితే.. మేఘాలయలోని మౌసిన్రామ్లో 2022 జూన్ 17న 1003.6 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డు సృష్టించింది. మేఘాలయలోని చిరపుంజిలో 1860 నుంచి 1861 వరకు 365 రోజుల వ్యవధిలో కురిసిన 1,042 అంగుళాల (26,470 మిల్లీమీటర్లు) వర్షమే ఇప్పటివరకు ఉన్న మరో రికార్డు. మన రాష్ట్రం విషయానికి వస్తే.. మొన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 24 గంటల్లో నమోదైన 649.8 మిల్లీమీటర్ల వర్షపాతమే అత్యధికం. ఒక్క చినుకూ చూడని ప్రదేశం.. భూమిపై అస్సలు వర్షమే పడని ప్రాంతం అంటార్కిటికాలోని మెక్ ముర్డో డ్రై వ్యాలీస్. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇప్పటి వరకు ఒక్క వర్షపు చినుకు కూడా చూడలేదు. ఇక చిలీలోని అటకామా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి సగటున 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అంటే దాదాపు లేనట్టేనన్నమాట. ప్రతి చుక్కా కిందకు పడదు.. వర్షపు చినుకు అన్ని సార్లూ భూమిని చేరదు. కొన్ని సందర్భాల్లో అవి భూమిపై పడకుండానే మాయమైపోతాయి. గాలి వేడిగా ఉన్నచోట్ల అక్కడే ఆవిరైపోతాయి. ఇలా భూమిని చేరకుండానే ఆవిరైపోయిన వర్షపు చినుకును విర్గా అంటారు. వర్షానికి వాసన ఉంటుందా? వర్షం వాసన భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి స్వచ్ఛమైన నీటికి రంగు, వాసన ఉండవు. అయితే, వర్షం పడటం ప్రారంభమైనప్పుడు మట్టి వాసన వస్తుంది. ఇది నేల తేమ నుంచి వెలువడుతుంది. వర్షం నుంచి వచ్చే సువాసనను పెట్రిచోర్ అంటారు. 14 మైళ్ల వేగం.. 2 నిమిషాలు.. ఒక్క వర్షపు చుక్క భూమిని చేరుకోవడానికి సగటున దాదాపు 2 నిమిషాలు పడుతుంది. మేఘాల నుంచి వర్షపు చినుకులు పడే ఎత్తును బట్టి ఇది మారుతూ ఉంటుంది. వర్షపు చినుకులు గంటకు 14 మైళ్ల వేగంతో భూమి మీదకు పడతాయి. పెద్ద చినుకులైతే 20 మైళ్ల వేగంతో వస్తాయి. వర్షపు నీటిలోనూ విటమిన్.. వర్షపు నీటిలో విటమిన్ బీ12 ఉంటుంది. ప్రకృతిలో సహజంగా ఉండే అనేక సూక్ష్మజీవులు విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. వర్షపు నీరు గాలిలోకి రాగానే ఈ సూక్ష్మజీవులు అందులో చిక్కుకుని విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. కనురెప్ప కంటే తక్కువ బరువు.. సగటు వర్షపు చినుకు బరువు కేవలం 0.001 ఔన్సులు (0.034 గ్రాములు). అంటే మన కనురెప్ప కంటే తక్కువ బరువు అన్నమాట. -
స్మశానంలో కూతురికి ప్రేమపెళ్లి జరిపించిన తండ్రి
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే తమ వివాహ వేడుకను ఎప్పటికి గుర్తుండేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వధూవరులు ఆశపడుతుంటారు. కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటే, మరికొందరు రిచ్ ప్యాలెస్‌లోనో, సముద్రానికి దగ్గరగా ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్లు వాళ్లుపెళ్లి వేడుకను ప్లాన్ చేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ పెళ్లి వేడుక స్మశానంలో జరిగింది. సంప్రదాయబద్దంగా బంధువుల సమక్షంలో ఈ తంతు పూర్తైంది. పైగా ఇది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఇంతకీ స్మశానంలో పెళ్లి చేసుకోవడం కొత్త కాన్సెప్టా? దీని వెనుక ఇంకేమైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు చూద్దాం. స్మశానంలో ప్రేమికుల పెళ్లి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రహతా పట్టణానికి చెందిన గంగాధర్ గైక్వాడ్.. స్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. కుటుంబంతో కలిసి ఎన్నో ఏళ్లుగా స్మశానవాటికలోనే నివాసం ఉండేవారు. ఆయనకు మయూరి అనే కూతురు ఉంది. 12 తరగతి వరకు చదువుకున్న ఆమె ఉద్యోగం కోసం షిర్డీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పని చేస్తున్న సంస్థలో మనోజ్ అనే యువకుడు ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరి పరిచయం స్నేహం నుంచి ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబ వర్గాలు కూడా అంగీకరించాయి. అయితే తనకు జీవనాధారాన్ని ఇచ్చిన స్మశాన వాటికలోనే కూతురి పెళ్లి చేయాలని గంగాధర్ ఎప్పట్నుంచో భావించాడట. ఈ విషయాన్నే అబ్బాయి కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఇక ఆయన కోరికను కాదనలేక మయూరి పెరిగిన స్మశానంలోనే బంధువుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పెళ్లిని జరిపించారు. ప్రస్తుతం ఈ వేడుక గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. -
కుక్కల కోసం ప్రత్యేకంగా ఆలయం.. రోజూ ప్రత్యేక పూజలు
కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదేమో. కాస్త ప్రేమ చూపిస్తే చాలు యజమానుల కోసం కుక్కలు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడుగువేయవు. అందుకే పెంపుడు కుక్కలను చాలామంది ఇంట్లో మనిషిలాగే చూసుకుంటారు. వాటికేమైనా అయితే తల్లడిల్లిపోతారు. అయితే కర్ణాటకకు చెందిన చన్నపట్న అనే ప్రాంతంలో ఏకంగా కుక్కలకు గుడి కట్టించేశారన్న విషయం మీకు తెలుసా? సాధారణ దేవాలయాల్లాగే ఇక్కడ కూడా ప్రతిరోజూ పూజలు జరుగుతాయి. ఈ వింతైన ఆలయం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అందరూ దేవుడిని పూజిస్తే ఆ గ్రామంలో మాత్రం కుక్కలకు గుడికట్టి మరీ పూజిస్తున్నారు. గ్రామ దేవతకు ముందు ఈ శునకాలకే తొలిపూజలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని చన్నపట్న అనే నగరంలో అగ్రహార వలగెరెహల్లి అనే చిన్న గ్రామంలో ఈ శునక దేవాలయం ఉంది. ఊరి ప్రధాన దేవత కెంపమ్మ ఆలయాన్ని నిర్మించిన కొన్ని నెలలకే ఆ గ్రామానికి చెందిన రెండు కుక్కలు అకస్మాత్తుగా అదృశ్యం అయ్యాయట. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకి ఓ వ్యాపారవేత్త కలలోకి వచ్చిన గ్రామ దేవత గ్రామస్తుల రక్షణ కోసం తన ఆలయానికి దగ్గరగా కనిపించకుండాపోయిన ఆ కుక్కల కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని కోరిందట. ఆ రకంగా రెండు శునకాల విగ్రహాలను ప్రతిష్టించి ఆరోజు నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా శునకాల పేరుతో ప్రతి ఏడాది పండగ కూడా నిర్వహిస్తున్నారు. ఆనోటా ఈ నోటా విషయం తెలిసి ఈ గుడికి మంచి పాపులారిటీ రావడంతో భారీగా టూరిస్టులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారట. -
మీకు తెలుసా? ఒక్క రాత్రిలో దెయ్యాలు ఆలయాన్ని కట్టించాయట
మన దేశంలో ఎన్నో మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది, సైన్స్‌కు అందని రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఓ ఆలయాన్ని దయ్యాలు రాత్రికి రాత్రే కట్టించాయట. అసలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? అయినా వాటికి ఆలయం కట్టించాల్సిన పనేంటి? ఇంతకీ ఈ వింతైన ఆలయం ఎక్కడ ఉంది? దీని వెనుకున్న కథేంటి అన్నది ఈ స్టోరీలో చూసేయండి.. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లు దయ్యాలు కూడా ఉంటాయని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. మన దేశంలో కొన్ని ఆలయాలు స్వయంగా దేవతలే నిర్మించాలని విన్నాం. అదే విధంగా దెయ్యాలు కట్టించిన ఆలయాలు కూడా మనదేశంలో ఉన్నాయట. కర్ణాటకలోని దొడ్డబళాపురం-దేవనహళ్ళి మార్గం మధ్యలో వచ్చే బొమ్మావర గ్రామంలోని శివాలయాన్ని దెయ్యాలే కట్టించాయని నమ్ముతారు అక్కడి గ్రామస్తులు. సుందరేశ్వర దేవాలయంగా ఆ గుడికి పేరుంది. సాధారణంగా దేవాలయాలపై దేవుళ్ళ రాతి శిల్పాలు, ప్రతిమలు కనిపిస్తాయి. కానీ దేవాలయంలో మాత్రం రాక్షసుల నమునాలు చెక్కబడి ఉన్నాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆలయం ఉందట. ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు తెగ భయపెట్టేవట. బయటకు రావాలంటనే జనాలు భయపడిపోయేవారట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థంకాక మాంత్రికుడిని ఆశ్రయించారు. వాటిని తరిమికొట్టేందుకు మంత్ర విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారు. దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో దెయ్యాలను వశపర్చుకొని బంధీగా చేశాడట. దీంతో బుచ్చయ్యను బతిమాలగా, కూలదోసిన ఆలయాన్ని తిరిగి కట్టివ్వాలని దెయ్యాలకు శరతు విధించాడట. మాంత్రికుడి ఆదేశంతో దిగి వచ్చిన దెయ్యాలు రాత్రికి రాత్రే దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాయట. అప్పటి నుంచి దెయ్యాలు కట్టిన దేవాలయంగా ఆ ఆలయాన్ని పిలిచేవారు. ఇక కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయటపడిందట. అప్పట్నుంచి ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎవరికైనా దెయ్యాలు పట్టినా ఈ ఆలయానికి తీసుకొస్తే దెయ్యం వదులుతుంది అని స్థానికుల నమ్మకం. -
పిజ్జా మేకర్.. వెకేషన్‌కు పర్ఫెక్ట్, ధర ఎంతో తెలుసా?
ఎన్ని రుచులున్నా పిజ్జా రుచి దేనికీ రాదంటుంటారు పిజ్జా లవర్స్. రకరకాల ఇన్‌గ్రీడియెంట్స్‌తో నచ్చిన విధంగా పిజ్జాలు చేసుకోవాలన్నా.. టూర్స్‌లో కూడా ఓన్ ఫ్లేవర్ పిజ్జా తినాలన్నా.. ఇలాంటి మేకర్ వెంట ఉండాల్సిందే. దీన్ని సులభంగా ఆరుబయటనైనా, ఇంటి బాల్కనీలోనైనా పెట్టుకోవచ్చు. ఏ పార్కులోనో, ఏ రివర్ సైడ్ ఖాళీ స్థలంలోనో.. స్నేహితులతో కానీ బంధువులతో కానీ బాతాఖానీ కొడుతూ చక్కగా ఇందులో నచ్చిన పిజ్జాలను తయారు చేసుకోవచ్చు. దీన్ని క్యాంపింగ్‌కి వెంట తీసుకెళ్లొచ్చు. కుడివైపు ఆప్షన్స్‌తో పాటు రెగ్యులేటర్స్ ఉంటాయి. దానికే గ్యాస్ కరెక్టర్ అమర్చి ఉంటుంది. పిజ్జా కటర్, పిజ్జా పీల్, పిజ్జా మెనూ బుక్ వంటివి మెషిన్‌తో పాటు లభిస్తాయి. డివైస్ కింద అటోమేటిక్ రోటరింగ్ సిస్టమ్ బాక్స్ అటాచ్ అయ్యి ఉంటుంది. డివైస్‌కి ఇరువైపులా అవసరమైన ఉప్పు, కారం డబ్బాలు పెట్టుకునేందుకు.. కొద్దిగా ప్లేస్ ఉంటుంది. ఇక మెషిన్ ఆన్‌లో ఉన్నప్పుడు, లోపలుండే పిజ్జా స్టోర్ 360 డిగ్రీలు తిరుగుతూ బేక్ అవుతుంది. ఈ పిజ్జా మేకర్ ధర 299 డాలర్లు (రూ.24,605) -
ఈ మాత్రం దానికి ఎస్కలేటర్ ఎందుకో? గిన్నిస్ రికార్డు మళ్లీ..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్. ఎత్తయిన అరుగులు ఉన్న ఇళ్లకు ఉండే మెట్ల కంటే తక్కువ మెట్లతో ఈ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఎస్కలేటర్‌గా గిన్నిస్‌బుక్‌లో చోటు పొందింది. జపాన్‌లోని కవాసాకి నగరంలో ఉందిది. కవాసాకి రైల్వే స్టేషన్ దక్షిణం వైపు ద్వారం నుంచి బయటకు వస్తే, ఎదురుగా కనిపించే ‘మోర్’’ డిపార్ట్మెంట్ స్టోర్‌లో ఉంది ఈ బుల్లి ఎస్కలేటర్. దీనికి ఉన్నవి కేవలం ఐదు మెట్లు మాత్రమే! చిన్నపిల్లలు కూడా ఆమాత్రం మెట్లు ఎక్కగలిగినప్పుడు ఈ ఎస్కలేటర్‌ను ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ అర్థంకాదు. అయినా, వింతగా ఉండటంతో దీనిని చూడటానికి జనాలు ఇక్కడకు వస్తుంటారు. -
రాజమౌళి ఈగలాగ.. దోమలు కూడా రివెంజ్ తీర్చుకుంటాయా?
వర్షాకాలం వచ్చేసింది.. ఈ సీజన్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే దోమలు మనుషులనే ఎందుకు కుడతాయి? ఎంతమంది ఉన్నా అదేపనిగా కొందరినే ఎందుకు టార్గెట్ చేసి అటాక్ చేస్తాయి? మరికొందరిని మాత్రం అస్సలు కుట్టవు ఎందుకో? ఇలా మనలో మనమే చాలాసార్లు ప్రశ్నలు వేసుకుంటుంటాం. అయితే నిజానికి ఈ విషయంలో దోమలకేమీ పక్షపాతం ఉండదట. దీని వెనుక సైన్స్ ఉందంటున్నారు పరిశోధకులు. మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకున్నట్లే దోమలు కూడా వాటికి నచ్చిన వాళ్ల రక్తం తాగేస్తాయి. అంతలా దోమలను ఆకర్షించే అంశాలేంటి? దీని వెనకున్న స్టోరీ ఏంటీ చదివేద్దాం. ► సాధారణంగా దోమల్లో మగదోగమలు మనిషిని కుట్టవు. ఇవి చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. ఆడదోమల్లోనే మనిషిని కుట్టేందుకు అవసరమైన ముఖ విన్యాసం ఉంటుంది. అందువల్ల ఇవే మనిషి రక్తాన్ని పీలుస్తాయి.అట్లాగని రక్తం వీటి ఆహారం అనుకోవద్దు. కేవలం గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్ దోమలకు మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దీనికోసమే అవి మనుషులను కుడతాయి. Yesterday, we visited Kyenjojo SS who are making mosquito repellent Vaseline.In 2021, Uganda had the 3rd highest global burden of malaria cases (5.1%) and the 7th highest level of deaths (3.2%). In creating this Vaseline, the students are looking to prevent rather than cure. pic.twitter.com/97EEujl6Tl— Investors Club Ltd Ug (@InvestorsClubUg) July 12, 2023 ► ఏ, బీ బ్లడ్ గ్రూపుల వారితో పాటు ఏబీ పాజిటివ్ ఉన్న బ్లడ్ గ్రూపుల వారిని దోమలు ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీరి శరీరం నుంచి వచ్చే ఒక రకమైన వాసనను పసిగట్టి దోమలు అటాక్ చేస్తాయట. ► చర్మంపై సహజంగా లభించే యాసిడ్ల వచ్చే వచ్చే వాసనకు దోమలు ఆకర్షితమం అవుతాయని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ► ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవారి శరీర ఉష్ఱోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు దోమ కాటుకు గురికాక తప్పదట. Imagine not killing a mosquito that is sitting on your arm sucking your blood pic.twitter.com/jv7ts5uSvt— greg (@greg16676935420) July 17, 2023 ► కార్బన్ డై ఆక్సైడ్ అంటే దోమలుకు అమితమైన ఇష్టం, ఎకువగా సిఓ2 వదిలేవాళ్ళ చుట్టూ దోమలు వాలిపోతుంటాయట. ► గర్బవతులు, ఒబేసిటీతో బాధపడేవారి రక్తంలో మెటబాలిక్ రేట్స్ అధికంగా ఉంటాయట. అందుకే వీరిని దోమలు టార్గెట్ చేస్తాయట. ► చెమట ఎక్కువగా వచ్చేవారిలో లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా రసాయనాల వల్ల దోమలు కుడతాయి. ► అంతేకాకుండా నల్లరంగు దుస్తులు ఎక్కువగా వేసుకుంటే దోమలు అట్రాక్ట్ అవుతాయట. దోమతెరల్లో ఎన్నో వినూత్న రకాలు, ఇవి ట్రై చేయండి The mosquitoes in Haiti would just fold it back https://t.co/RJi3hXsrQG— 💲LEX💲 (@Zoboylex) July 17, 2023 -
పానీపూరీ గురించి నమ్మలేని నిజాలు.. ఇంత చరిత్ర ఉందా?
పానీపూరి.. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. పానీపూరీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. మన దేశంలో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇప్పటికీ పానీపూరీనే చాలామందికి ఫేవరెట్ స్ట్రీట్‌ఫుడ్. గోల్ గప్పా, గప్ చుప్ అని వివిధ పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. సాయంత్రం అయిందంటే చాలు వీధి చివరన పానీపూరీ బండి వద్ద జనాలు గుమిగూడతారు. లొట్టలేసుకొని మరీ పానీపూరీని ఆరగిస్తుంటారు. ఎంతో ఇష్టంగా తినే పానీపూరీ వంటకం ఇప్పటిది కాదట. మహాభారత కాలం నుంచే ఉందట. మరి అప్పట్లో పానీపూరీని కనిపెట్టింది ఎవరు? ఏంటా స్టోరీ అన్నది ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం.. పానీపూరీని ద్రౌపది తొలిసారిగా కనిపెట్టిందని అంటారు.పెళ్లయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదికి కుంతీదేవి ఓ టాస్క్ ఇచ్చిందట. మిగిలిపోయిన ఒక ఆలుగడ్డ, ఒక్క చనాతీకి మాత్రమే సరిపడా పిండిని అందించి తన ఐదుగురు కొడుకుల ఆకలిని తీర్చి భర్తల మెప్పు పొందాల్సిందిగా సవాల్ విసురుతుందట. అప్పుడు ద్రౌపది ఉన్న వస్తువులతోనే చిన్నచిన్న పూరీలు చేసి భర్తల ఆకలిని తీర్చిందట. ద్రౌపది తెలివికి మెచ్చుకున్న కుంతిదేవి ద్రౌపది కనిపెట్టిన పానీపూరీ శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట. అప్పట్నుంచి పానీపూరీ ప్రజలకు పరిచయం అయ్యిందని అంటుంటారు. -
Intresting Facts: పేరుకు మాత్రమే చెట్లు.. కానీ అవి చెట్ల సమాధులు
నమ్మలేని నిజాలు.. ఇది మీకు తెలుసా? ► నమీబియాలోని ‘డెడ్ వ్లయ్’లో 900 ఏళ్ల వయసు ఉన్న చెట్లు ఉన్నాయి. అయితే అవి పేరుకు మాత్రమే చెట్లు. పచ్చదనం లేకుండా ఎండిపోయిన చెట్లు! అందుకే దీన్ని ‘చెట్ల ఎడారి’ ‘చెట్ల సమాధులు’ అని పిలుస్తారు. ► చిలకలలో ‘డ్రాకూన్ చిలకలు వేరయా’ అని చెప్పుకోవచ్చు. పపువా న్యూ గినియాలోని రెయిన్ ఫారెస్ట్‌లో కనిపించే డ్రాకూల ప్యారట్స్ నలుపు, చార్కోల్ గ్రే రంగుల్లో ఉండి కొంచెంచెం భయపెట్టేలా ఉంటాయి. ► నార్వేలో ‘హెల్’ పేరుతో ఒక విలేజ్ ఉంది. టూరిస్ట్ ఎట్రాక్షన్లో భాగంగా ఆ పేరు పెట్టారు! -
Oscars 2022: ఆస్కార్.. వచ్చినా ఏం లాభం?
Oscar Trophy Birth And Intresting Facts: సినీ జగత్‌కు పెద్ద పండుగ ‘ఆస్కార్’ కౌంట్ డౌన్‌కి మరొక రోజే మిగిలి ఉంది. ఫైనల్ నామినేషన్ల లిస్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి విజేతల గురించి మూవీ లవర్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. కరోనా జోరు తగ్గడంతో ఈసారి కాస్త హడావిడిగానే ఈవెంట్‌ను జరపాలని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెన్స్(ఎఎంపీఏఎస్) నిర్ణయించుకుంది. ఇంతకీ ఆస్కార్ వస్తే ఏం లాభం? నటులకు, టెక్నిషీయన్లకు అంతగా ఏం ఒరుగుతుంది?.. ఆస్కార్ అవార్డులకు ప్రామాణికం.. వేడుకల్లో అందించే ట్రోఫీ. ఈ ట్రోఫీకి చాలా చరిత్రే ఉంది. ఈ గోల్డెన్ స్టాచ్యూ ట్రోఫీని ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’ అంటారు. ఫ్రాన్స్‌కి చెందిన డెకో స్టయిలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అమెరికా డిజైనర్ కెడ్రిక్ గిబ్సన్ ఈ ట్రోఫీ డిజైన్‌ను స్కెచ్ చేయగా, ఐరిష్ ఆర్ట్ డైరెక్టర్ జార్జ్ స్టాన్లీ ఆస్కార్ ట్రోఫీ బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మను కంచుతో తయారు చేస్తారు. పైన బంగారు పూత పూస్తారు. ఒక్కో విగ్రహం తయారీకి ఐదు నుంచి 900ల డాలర్ల ఖర్చు అవుతుంది. యాభై విగ్రహాల తయారీకి మూడు నెలల టైం పడుతుంది. ట్రోఫీ పొడవు 34 సెంటిమీటర్లు, బరువు మూడున్నర కేజీలు ఉంటుంది. 1929 నుంచి ఇప్పటిదాకా 3,160 ట్రోఫీలను ఇచ్చింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. కానీ, సినిమావాళ్లు గొప్పగా భావించే ఈ ట్రోఫీని.. ఒకవేళ అమ్మితే వచ్చేది మాత్రం కేవలం ఒక్క డాలర్!. 2021 ఆస్కార్ విజేతలు కోర్టుకెక్కి మరీ 1950కి ముందుదాకా.. అవార్డు గెల్చుకున్నవాళ్లకే ట్రోఫీపై అన్ని హక్కులు ఉండేవి. ఆ తర్వాత అకాడమీ తన రూల్స్ సవరించింది. విజేతలు ఎవరైనా సరే ఆస్కార్ ట్రోఫీని.. వేరే వాళ్లకు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మాలంటే.. అకాడమీకే అమ్మాలని ముందుగానే కాంట్రాక్ట్ మీద విజేతలతో సైన్ చేయించుకుంటారు. అలా అమ్మేయగా ఒక్కటంటే ఒక్క డాలర్ మాత్రమే ఇస్తారు. ఒప్పందాన్ని కాదని వేరేవాళ్లకు అమ్మితే.. కోర్టుకు ఇడుస్తుంది అకాడమీ. అయినప్పటికీ కొందరు ట్రోఫీలను అమ్మడం విశేషం. ‘ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్’(1956) బెస్ట్ మూవీగా ఆస్కార్ ట్రోఫీ గెల్చుకుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ మైకేల్ టాడ్స్. ఈయన మనవడు 1989లో ట్రోఫీని వేలం వేయాలని ప్రయత్నించాడు. కోర్టులో కేసు వేసి ఆ వేలంపాటను అకాడమీ అడ్డుకుంది. 1992లో ‘బెస్ట్ సపోర్ట్ యాక్టర్’ ట్రోఫీ గెల్చుకున్న హరోల్డ్ రస్సెస్.. తన భార్య ఆరోగ్యం కోసం అరవై వేల డాలర్లకు ఆస్కార్ ట్రోఫీని అమ్మేశాడు. ఈ విషయంలో అకాడమీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే తన భార్య ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని పోరాడి మరీ కేసు గెలిచాడు హరోల్డ్. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘సిటిజన్ కేన్’(1941) ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కేటగిరీలో ఆస్కార్ గెల్చుకుంది. స్క్రీన్‌ప్లే రైటర్ ఓర్సన్ వెల్స్ వారసులు ఆ ట్రోఫీని వేలం అమ్మేయాలని ప్రయత్నించారు. ఈ కేసు కోర్టులో నడిచినప్పటికీ.. వెల్స్ వారసులే కేసు నెగ్గారు. ఆ టైంలో అకాడమీ కాంట్రాక్ట్‌లో వెల్స్ సైన్ చేయకపోవడం ఆ వారసులకు కలిసొచ్చింది. కోర్టు తీర్పు తర్వాత 2011లో ఆ ట్రోఫీని వేలం వేయగా.. ఎనిమిదిన్నర లక్షల డాలర్లు వచ్చింది. ఇంత సమస్యలున్నప్పుడు.. అసలు ఆస్కార్ ట్రోఫీ గెలవడం వల్ల లాభం ఏంటంటారా?. ఆర్టిస్టులు, ఇతర టెక్నిషియలు తమ రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసం, తమ బ్రాండ్లను మార్కెటింగ్ చేసుకోవడం కోసమే పనికొస్తుంది. అన్నింటికి మించి సినీ ప్రపంచంలో ఇదొక ఔనత్యమైన అవార్డు అనే గుర్తింపు దక్కుతుంది కదా!. ఆస్కార్‌పై కథలు 1939 వరకు అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే ట్రోఫీని పిలిచేవాళ్లు. ఆ తర్వాత అఫీషియల్‌గా ‘ఆస్కార్’ అనే ముద్దుపేరుతో పిలుస్తున్నారు. ఆ పేరు అసలు ఎలా వచ్చిందనే దానిపై రకరకాల కథలు వినిపిస్తుంటాయి. అమెరికన్ నటి బెట్టె డేవిస్ అప్పట్లో అకాడమీ ఆర్గనైజేషన్‌కి ప్రెసిడెంట్ పని చేసింది. తన మొదటి భర్త పేరు హర్మన్ ఆస్కార్ నెల్సన్. ఆయన పేరు మీదుగా ఆమె ట్రోఫీలకు ఆ పేరు పెట్టిందని చెప్తారు. మరో వెర్షన్ ఏంటంటే.. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్, ఆ బొమ్మ రూపం తన అంకుల్ ఆస్కార్‌ని పోలి ఉండడంతో ఆమె ఆ పేరు పెట్టించిందని చెప్తారు. అమెరికన్ కాలమిస్ట్ సిడ్నీ స్కోలిస్కై మాత్రం తన కాలమ్‌లో ‘అకాడమీ ఎంప్లాయిస్ ముద్దుగా ఆ పేరు పెట్టుకున్నార’ని రాశాడు. అయితే 1934లో ట్రోఫీ అందుకున్న తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ వాల్టర్ ఎలియాస్ డిస్నీ(వాల్ట్ డిస్నీ) ఫస్ట్ టైం ‘ఆస్కార్’ అనే పదాన్ని స్టేజ్ మీద ఉపయోగించడం కొసమెరుపు. అకాడమీ మోషన్ పిక్చర్స్ అవార్డులకు ‘ఆస్కార్’ అనే ట్రేడ్ మార్క్ ఉంది. అయితే ఇటలీలో ఏ రంగంలో అవార్డులు ఇచ్చినా ఆస్కార్ అనే పిలుస్తుంటారు. 2020.. వరస్ట్! 1930లో ఆస్కార్ వేడుకల ఈవెంట్‌ను రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశారు. 1953 నుంచి టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఆర్కీవ్స్ మాత్రం 1949 నుంచి భద్రపరుస్తున్నారు. రీల్, వీడియో, డిజిటల్ కాపీలుగా వాటిని భద్రపరిచారు. వేదికలు.. మారుతూ వస్తున్నాయి. కొడాక్ థియేటర్.. డాల్బీ థియేట్లో జరుగుతున్నాయి. అయితే 2018లో ఈవెంట్‌ను టెలికాస్ట్ చేయలేదు. కొన్ని ఆస్కార్ వేడుకల్లో.. బ్రేక్ టైంలో అవార్డులూ ఇచ్చారు. కొత్తగా కొన్ని కేటగిరీలను కలిపారు. రాను రాను కొన్ని కేటగిరీలను ఎత్తేశారు. వీటిపై విమర్శలు వచ్చాయి. అయినా అకాడమీ తగ్గడం లేదు. 1998 ఆస్కార్ విజేతలు అంతకు ముందు ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ఫలితాల్ని ఫిబ్రవరి మొదటి వారంలో అనౌన్స్ చేసేవాళ్లు. 2004 నుంచి అకాడమీ అవార్డుల నామినేషన్ ఫలితాల్ని జనవరి మధ్యలోనే ప్రకటిస్తున్నారు. ఆస్కార్ వేడుకల టెలికాస్టింగ్‌కు సంబంధించి.. 1980 నుంచి టీఆర్పీని లెక్కిస్తున్నారు. హయ్యెస్ట్ టీఆర్పీ 1998లో వచ్చింది. 57 టీఆర్పీతో అస్కార్ చరిత్రలోనే రికార్డ్ నెలకొల్పింది. మరి లోయెస్ట్ టీఆర్ఫీ అంటారా? అది.. 2020లోనే రికార్డయ్యింది. ఫస్ట్ .. రీసెంట్ ప్రపంచంలోనే చాలాకాలం నుంచి జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ అవార్డుల ఈవెంట్.. ఈ ‘అకాడమీ’(ఆస్కార్) అవార్డులు. మొదటి వేడుక ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరిగింది. 1929, మే 16న లాస్ ఏంజెలెస్‌లోని హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో ప్రైవేట్ డిన్నర్ ఫంక్షన్ ఏర్పాటు చేసి అవార్డులను ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు 270 మంది హాజరయ్యారు. అమెరికన్ యాక్టర్ డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్ ఈ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. 1927–28 మధ్య రిలీజ్ అయిన సినిమాలకు ఈ అవార్డులు దక్కాయి. అయితే ఈవెంట్‌ను కేవలం పదిహేను నిమిషాల్లోనే ముగించారు. మొత్తం పదిహేను ట్రోఫీలను ఇచ్చారు. మొదటి ఈవెంట్లో గెలిచినవాళ్ల పేర్లను మూడు నెలల ముందే మీడియాకు రిలీజ్ చేయడం విశేషం. ఈ రూల్‌ను రెండో ఆస్కార్ వేడుకలకు(1930) మార్చేశారు. అకాడమీ అవార్డుల మొదటి వేడుక అవార్డులిచ్చే రాత్రి విన్నర్ల పేర్ల లిస్ట్‌ను పేపర్ హౌజ్‌లకు పంపించేవాళ్లు. 1940 వరకు ఇదే జరిగింది. అయితే లాస్ఏంజెలెస్ టైమ్స్ వాళ్లు సరిగ్గా అవార్డు వేడుక జరిగే ముందే పేర్లను అనౌన్స్ చేసేది. ఇది చూసి అకాడమీ వాళ్లు సీల్డ్ కవలర్‌లో విన్నర్స్‌ను అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు జరగబోయే అవార్డుల వేడుక 94వది. మార్చి 27న 2022న కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. మార్చి 28 సోమవారం ఉదయం ఐదుగంటలకు ఈ ఈవెంట్ మొదలవుతుంది. Disney+Hotstar App ద్వారా మన దేశంలో ఆస్కార్ వేడుకల్ని లైవ్‌గా వీక్షించొచ్చు. :::సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
కేంద్ర బడ్జెట్ 2022: మీకు ఈ విషయాలు తెలుసా..
మళ్లీ కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కేంద్రం ఎవరెవరికి ఉపశమనం కలిగిస్తుంది, ఎవరిపై భారం పెరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడేకాదు ఏటా బడ్జెట్ వచ్చిందంటే ఉత్కంఠగానే ఉంటుంది. అయితే బడ్జెట్లో లెక్కలే కాకుండా.. మరెన్నో విశేషాలు కూడా ఉంటుంటాయి. అలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందామా? నెహ్రూ.. ఇందిర.. రాజీవ్ 1958లో అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేసినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్‌ను సమర్పించి అలా చేసిన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు. 1970లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి ఉన్నారు. 1987–88లో ఆర్థికమంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసినప్పుడు, అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు. తెల్లారింది లేవండోయ్.. 2000 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు, సభలో మొదటి కార్యక్రమంగా మార్చారు. 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, 2.5 గంటలపాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిని బడ్జెట్ సమర్పణలలో సుదీర్ఘ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. రైల్వేను కలిపేశారు.. 2017 వరకు, ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్లు సమర్పించేవారు. ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి, రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు బడ్జెట్లను కలిపి ఉమ్మడి బడ్జెట్‌ను తీసుకొచ్చింది. 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైటీ తొలి ఉమ్మడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొదటి బడ్జెట్‌కు 162 ఏళ్లు.. మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్‌నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. -
ATM History: మొట్టమొదటి ఏటీఎం ఎక్కడ ఏర్పాటు చేశారంటే..
కొత్త ఏడాదిలో మొదటి రోజునే ఆర్బీఐ ఏటీఎం విత్‌డ్రా కొత్త రూల్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ఉచిత ట్రాన్జాక్షన్స్ పరిధి గనుక అయిపోతే.. 21రూ. చొప్పున ఛార్జీలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి బాదేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఈ విషయం పక్కనపెడితే.. మొట్టమొదటి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అలియాస్ ఏటీఎం Automated teller machine ఎక్కడ నెలకొల్పారో తెలుసా? ►1987లో హెచ్ఎస్బీసీ ముంబైలో తొలి ఏటీఎంను నెలకొల్పింది. ►ఆ తర్వాత పన్నెండేళ్లకు దేశవ్యాప్తంగా 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ►మార్చ్ 31, 2021 నాటికి మన దేశంలో 1,15,605 ఆన్సైట్ ఏటీఎంలు, 97, 970 ఆఫ్‌సైట్ ఏటీఎంలు ఉన్నాయి. ►2021, మార్చ్ నెల చివరినాటికి.. మొత్తం బ్యాంకులన్నీ కలిపి 90 కోట్ల డెబిట్ కార్డులు కస్టమర్లకు జారీ చేశాయి. ► ఏటీఎంను ఎవరు రూపొందించారనే విషయంపై రకరకాల వాదనలు, థియరీలు, వివిధ దేశాల వెర్షన్లు వినిపిస్తుంటాయి. ► పేటెంట్ విషయంలో అమెరికా సహా పలు దేశాలు వాదులాడుకుంటాయి. ►అయితే బ్రిటన్ ఆవిష్కరణకర్త జాన్ షెపెర్డ్ బారోన్ ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎంను రూపొందించిన వ్యక్తిగా కీర్తి గడించారు. ►1965లో నగదును అందించే స్వీయ సేవ పరికరాన్ని ఈయన ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ►1967లో నార్త్ లండన్‌లోని ‘బార్క్లేస్ బ్యాంక్’ ఎన్ఫీల్డ్ టౌన్ బ్రాంచ్ బయట జూన్ 27న మొట్టమొదటిసారి ఏటీఎంను ఏర్పాటు చేశారు. ►విశేషం ఏంటంటే.. ఆయన పుట్టింది భారత్‌లోనే!. 1925లో మేఘాలయాలో ఓ ఆస్పత్రిలో జన్మించారాయన. ►ప్రతిగా 53 ఏళ్ల తర్వాత ఎస్బీఐ బ్యాంక్ 2021 ఆగష్టులో ఆయన జన్మించిన ఆస్పత్రిలో ఏటీఎంను ఏర్పాటు చేసింది. \ ►అమెరికాలో ఏటీఎం(ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్), కెనడాలో ఆటోమేటెడ్ బ్యాంకింగ్ మెషిన్(ABM), బ్రిటిష్ నేలపై క్యాష్ పాయింట్, క్యాష్ మెషిన్, హోల్ ఇన్ ది వాల్ అని కూడా పిలుస్తుంటారు. ►క్యాష్‌లైన్, ఏనీ టైం మనీ, టైమీ మెషిన్, క్యాష్ డిస్పెన్సర్, క్యాష్ కార్నర్, బ్యాంకోమాట్ అని పిలుస్తారు. ►ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ ఆధీనంలో ఉండని వాటిని వైట్ లేబుల్ ఏటీఎంలు అని పిలుస్తారు. ►2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల ఏటీఎంలు ఉన్నట్లు ఏటీఎం ఇండస్ట్రీ అసోషియేషన్ వెల్లడించింది. ►అయితే క్యాష్‌లెస్ పేమెంట్లు పెరుగుతుండడంతో ఏటీఎంల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది. ► ఏటీఎంల కంటే ముందు 1960ల్లో కంప్యూటర్ లోన్ మెషిన్ అనే డివైజ్ జపాన్‌లో ప్రాచుర్యంలో ఉండేది. ►ఏటీఎంలను ఎక్కడపడితే అక్కడ నెలకొల్పడానికి అనుమతులు ఉన్నాయి. ►క్రూయిజ్ షిప్స్, యూఎస్ నేవీ షిప్స్‌లో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ►ఈమధ్యకాలంలో సోలార్ పవర్డ్ ఏటీఎంలను నెలకొల్పుతున్నారు. ► ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఏటీఎం పాకిస్థాన్ ఖున్‌జెరబ్ పాస్‌లో ఉంది. సుమారు 15వేల అడుగుల ఎత్తులోలున్న ఈ ఏటీఎం.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌లోనూ పని చేస్తుంది. ►సాధారణంగా ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డులు, టెక్నికల్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని సైతం నియమిస్తుంటారు. శుభ్రం చేయడం, ఇతర మెయింటెనెన్స్ ఇందులో భాగంగా ఉండేవి. ఏటీఎంలు నెలకొల్పిన తొలినాళ్లలో ఈ తరహా ఉద్యోగాలు పెరుగుతాయని భావించారంతా. 2010 నాటికి ఆరు లక్షల మందిని ఈ తరహా ఉద్యోగాల్లో నియమించుకున్నారు. కానీ, సెక్యూరిటీ గార్డులకే ఆ పని అప్పగించడం, పైగా ఆన్లైన్ బ్యాంకింగ్ వల్ల ఈ తరహా నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయి. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
Travel: కివి, అప్రికాట్, ఎర్రటి యాపిల్ పండ్లు.. నది పాయలు, మంచు..
Reasons to Discover Sangti Valley: కనుచూపు మేరలో ఎటుచూసినా ధీరగంభీరంగా హిమాలయ పర్వతాలు. చడీచపుడు చేయకుండా సన్నగా కురిసే మంచు. మంచుకు ఆవల కనుచూపుమేర విస్తారమైన పండ్లతోటలు. కివి, అప్రికాట్, పెద్ద సీమ కమలాలు, కశ్మీర్ యాపిల్‌ను తలదన్నే ఎర్రటి యాపిల్ పండ్లు... రంగురంగుల్లో నోరూరిస్తుంటాయి. నల్ల మెడ తెల్ల కొంగలు ఈ తోటల్లో సొంతదారుల్లా విహరిస్తుంటాయి. ఈ తోటల వాలులో ఝమ్మని మంద్రంగా శబ్దం చేస్తూ కనిపించీ కనిపించకుండా ప్రవహించే నది పాయలు. ఇది అరుణాచల్ ప్రదేశ్, సంగ్తిలోయకు సొంతమైన ప్రకృతి సౌందర్యం. బస ఇలాగ! సంగ్తి వ్యాలీ పూర్తిగా ప్రకృతి ఒడి. ఇక్కడ ఆధునికత అంటే పర్యాటక ప్రధానమైన అభివృద్ధి మాత్రమే. పర్యాటకులు ప్రకృతితో మమైకమై జీవించిన అనుభూతి పొందడం కోసం బసకు గుడారాలుంటాయి. గుడారపు బసలు విలాసవంతంగా ఉండవు. కానీ చక్కటి బెడ్, లైట్లు, ఫ్యాన్, అటాచ్డ్ బాత్రూమ్తో సౌకర్యవంతంగానే ఉంటాయి. గుడారాలన్నీ నది తీరానే ఉంటాయి. ఈ ట్రిప్‌లో... రాత్రి భోజనం తర్వాత నది తీరాన చలిమంట వేసుకుని ఆ మంట చుట్టూ తిరుగుతూ డాన్స్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ ఏమి తినాలి? ఆహారంలో మసాలాలు తక్కువగా ఉంటాయి. భోజనం రుచిగానే ఉంటుంది. స్థానిక భోజనం రుచి చూడాలంటే కొంచెం కష్టమే. ఇక్కడి హోటళ్లలో టూరిస్టుల కోసం నార్త్, సౌత్ ఇండియన్ రుచులనే ఎక్కువగా వండుతారు. ఇంకా! ►మొబైల్ సిగ్నల్స్ ఉండవు. కాబట్టి రూట్‌ని ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ ఉండదు, కాబట్టి టూర్‌ని ఆసాంతం ఆస్వాదించవచ్చు. ►ఇక్కడి మనుషులు అత్యంత వినయశీలురు, నిజాయితీపరులు. క్యాబ్ డ్రైవర్లు డ్యూటీ టైమ్‌కి పది నిమిషాల ముందే సిద్ధంగా ఉంటారు. ►పర్యాటకులు క్యాబ్‌లో పర్సు మర్చిపోతే ఫోన్ చేసి మరీ ఆ పర్సును డబ్బుతో సహా జాగ్రత్తలగా పర్యాటకులకు చేరే ఏర్పాటు చేస్తారు. ►టూరిస్టు ప్రదేశాలన్నీ ప్లాస్టిక్ రహితంగా ఉంటాయి. కానీ స్థానికులకు ప్లాస్టిక్ వాడకం పట్ల పెద్దగా పట్టింపులు ఉన్నట్లు కనిపించదు. ►యధేచ్ఛగా వాడేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకం పట్ల ప్రపంచం స్వీయనియంత్రణలు అనుసరిస్తున్న సంగతి బహుశా వాళ్లకు తెలియకపోవచ్చు. చదవండి: Chikmagalur: చిక్‌మగళూరు.. మంచి కాఫీలాంటి విహారం -
ఆడ దోమలు మాత్రమే ఎందుకు కుడతాయో తెలుసా?!
దోమ కాటు బారిన పడకుండా ఉండాలంటే, మన నివాసాలకు దగ్గరలో వాటి ఆవాసాలు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే దోమలు ఇంట్లో తిరగకుండా పరిశుభ్ర వాతావరణం కల్పించుకోవాలి. చికిత్స కన్నా నివారణే ఉత్తమమని గుర్తించాలి. దోమ కాటు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ►ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ చేరకుండా జాగ్రత్త పడాలి. నిల్వ నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఎక్కడైనా నీరు నిలిచినట్లు ఉంటే దాన్ని శుభ్రం చేయడం లేదా ఆ నీటిలో కాస్త కిరోసిన్ వేయడం ద్వారా దోమలు చేరకుండా చూడొచ్చు. అలాగే మురికి నీటిలో నడవడం కూడా మంచిది కాదు. ►ఇంట్లో పగిలిన కిటికీలు, ద్వారాలు సరిచేయించడం, కిటికీలకు, ద్వారాలకు తెరలను అమర్చడం మంచిది. రిపెల్లెంట్లు, దోమల బ్యాట్లు చాలా వరకు దోమల నివారణకు ఉపయోగపడతాయి. ►బెడ్‌పై దుప్పట్లు దిండ్లు ఇష్టారీతిన ఉంచకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. దోమతెరను వాడడం అత్యుత్తమ నివారణా మార్గం. ►ఆరుబయట సాయంకాలాలు, ఉదయాలు అచ్ఛాదన లేకుండా తిరగవద్దు. ఈ సమయంలో దోమకాటు ప్రమాదకరం. మిగిలిన సమయాల్లో కూడా శరీరమంతా కప్పే దుస్తులు వాడడం వల్ల దోమకాటునుంచి కాపాడుకోవచ్చు. ►శరీరంలో సరైన ఇమ్యూనిటీ పెంచుకోవడం మంచిది. ఇందుకోసం సమతుల ఆహారం, నియమిత వ్యాయామం అవసరం. వీలైనంత ఎక్కువగా ద్రవరూప ఆహార పదార్ధాలు తీసుకోవాలి. నిల్వ ఆహారానికి దూరంగా ఉండాలి. ►కొన్ని రకాల వ్యాధులకు టీకాలున్నాయి. అవసరమనుకుంటే ఈ వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుంది. ►శరీరంలో ఏదైనా అనారోగ్య చిహ్నాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించాలి. అశ్రద్ధ ప్రమాదకరం. దద్దుర్లు.. దురద దోమ కుట్టగానే వెంటనే మనకు తెలియదు. ఎందుకంటే దోమ విడుదల చేసే ఒక రసాయనం మనకు నొప్పి, జిల తెలియకుండా అవి రక్తం పీల్చేందుకు సాయం చేస్తాయి. అయితే దోమలు కుట్టిన కొద్ది సేపటికి బెందులు(దద్దుర్లు) రావడం జరుగుతుంది, అలాగే జిల కూడా ఆరంభమవుతుంది. దోమ లాలాజలంలో ఉండే యాంటీ కోయాగ్యులెంట్(రక్తం గడ్డ కుండా ఉంచే రసాయనం) వల్ల ఈ రియాక్షన్లు వస్తాయి. వీటిని గీరిన కొద్దీ పెద్దవి అవుతుంటాయి. ఈ దద్దుర్లు, దురద నివారణకు కొన్ని మార్గాలు.. యాంటీ హిస్టమైన్ క్రీమ్ లేదా అలెర్జీ నివారణ ఆయింట్మెంట్ పూయవచ్చు. ఇవి లేనప్పుడు గ్రీన్ టీ బ్యాగును తడిపి కుట్టిన చోట ఉంచడం వల్ల రిలీఫ్ వస్తుంది. ∙ దద్దుర్ల ద్వారా వచ్చే దురద నివారణకు తేన అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అలోవీరా జెల్ కూడా దురద నివారణకు ఉపయోగపడుతుంది. ∙ తులసి ఆకుల రసం దద్దుర్లను నయం చేయడం, దురదను తగ్గించడమే కాకుండా దోమలు దరి చేరకుండా రక్షణనిస్తుంది. లాంవడర్ పుష్పాల ద్వారా వచ్చే ఆయిల్ దోమలను తరిమివేస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ రక్షణ ఇస్తుంది. చర్మానికి కూడా మంచిది. ∙ లెమన్ యూకలిప్టస్ ఆయిల్, గ్రీక్ కాట్నిప్ ఆయిల్ సైతం దోమలను తరిమి వేయడంలో, దురద నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ∙ పైవేవీ దొరక్కపోతే వెనిగర్, వంట సోడా, వెల్లుల్లి, టూత్‌పేస్టును ట్రై చేయవచ్చు. వీటివల్ల దురద తగ్గుముఖం పడుతుంది. ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. దోమల్లో మగదోమలు మనిషిని కుట్టవు. ఇవి సాధారణంగా చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. ఆడదోమల్లోనే మనిషిని కుట్టేందుకు అవసరమైన ముఖ విన్యాసం ఉంటుంది. అందువల్ల ఇవే మనిషి రక్తాన్ని పీలుస్తాయి. అట్లాగని రక్తం వీటి ఆహారం అనుకోవద్దు. కేవలం గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్ దోమలకు మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దీనికోసమే అవి మనుషులను కుడతాయి. కుట్టి ఊరుకోకుండా పలు వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అలాగే దోమలన్నీ ప్రమాదకారులు కాకపోవచ్చు. కొన్ని ప్రజాతులు మాత్రమే ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా క్యూలెక్స్, అనాఫిలస్, ఏడిస్ జాతుల దోమల కాటు వల్ల పలు డేంజరస్ వ్యాధులు సంక్రమిస్తుంటాయి. కొందరికే ప్రత్యేకం? మనుషుల్లో కొందరు మిగిలినవారి కన్నా ఎక్కువగా దోమలను ఆకర్షిస్తారని, అందువల్ల వీరినే ఎక్కువగా కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొందరి శరీరాల జోలికి పొమ్మన్నా దోమలు పోవు. ఈ వ్యత్యాసానికి కారణాలేంటి అంటే దోమల్లో ఉండే ఘ్రాణ శక్తి అని చెప్పవచ్చు. దోమలకు కార్బన్ డై ఆక్సైడ్(సీఓ2) ఇష్టం. అందువల్ల ఎక్కువ సీఓ2 వదిలేవాళ్ల చుట్టూ ఎక్కువగా దోమలు మూగుతాయి. అంటే అధికంగా పనిచేసేవాళ్లు, వర్కౌట్లు చేసేవాళ్లకు దోమకాటు అవకాశాలు ఎక్కువ. అలాగే శరీరం నుంచి ఎక్కువ వేడి ఉత్పత్తి చేసేవాళ్లను కూడా దోమలు ఇష్టపడతాయి. ఉదాహరణకు గర్భిణీ స్త్రీలు. అలాగే శ్వాసలో లాక్టిక్ ఆసిడ్ వాసన ఉన్నవాళ్లను కూడా దోమలు ప్రేమిస్తాయి. రిపెల్లెంట్లు ఎంత సేఫ్? ఆధునిక యుగంలో దోమల నుంచి కాపాడటానికి పలు రకాల రిపెల్లెంట్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రిపెల్లెంట్లను అగ్గిపుల్లతో వెలిగించి వాడాలి, కొన్నింటిని కరెంట్ ద్వారా వాడవచ్చు. వీటి ద్వారా విడుదలయ్యే రసాయనాలు దోమలను తరిమి కొడతాయి. అయితే అన్ని రకాల రిపెల్లెంట్లు మనిషికి మంచివి కావు. వీటివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. శ్వాస సంబంధమైన సమస్యలు, కళ్లు ఎర్రబారడం, జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు రిపెల్లెంట్ల కారణంగా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కెమికల్ రిపెల్లెంట్లను వాడే బదులు సహజసిద్ధమైన రిపెల్లెంట్లు లేదా ఎలక్ట్రానిక్ తరంగాలు ఉత్పత్తిచేసే రిపెల్లెంట్లను వాడడం మంచిదని సిఫార్సు చేస్తున్నారు. -డి. శాయి ప్రమోద్ చదవండి: Mosquitoes: బోదకాలు, చికున్ గున్యా, కాలా అజర్.. ఇంకా -
పర్లేదు.. కాస్త బద్దకం అలవరుచుకోండి.. ‘లేజీ డే’ ముచ్చట్లు!
అందరివీ బిజీబిజీ గజిబిజి జీవితాలు.. ఉన్న 24 గంటలూ సరిపోనంతగా ఉరుకులు పరుగులు పెడుతుంటాం.. మరి కొందరేమో సోఫాలోనో, బెడ్ మీదనో గంటలు గంటలు అలా గడిపేస్తారు. అయితే పని తప్పించుకోవడం, లేకుంటే ఎలాగోలా త్వరగా పూర్తిచేసి మళ్లీ ‘రెస్ట్ మోడ్’లోకి వెళ్లిపోవడమే వారి పని. బద్ధకం, సోమరితనం, మందకొడితనం.. ఇలా ఎలా పిలిచినా సరే.. లేజీనెస్ ఎంతో కొంత మంచిదేనట. దాని ప్రయోజనాలు దానికీ ఉన్నాయట. మరి ఈ మంగళవారం (ఆగస్టు 10) ‘లేజీ డే’ నేపథ్యంలో.. ఈ లేజీ క్రేజీ ముచ్చట్లేంటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఉరుకులు.. పరుగుల నుంచి.. ముందే చెప్పుకున్నట్టు ఇప్పుడు అందరివీ ఉరుకులు, పరుగుల జీవితాలు. ఏ రోజు, ఏ గంటలో ఏమేం చేయాలో ముందే రాసిపెట్టుకుని యంత్రాల్లా గడిపేస్తున్న.. ‘టు–డు’ లిస్టుల బతుకులు. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయి.. మనసులో గంపెడన్ని ఆందోళనలతో.. నిద్రకూడా సరిగా పట్టని పరిస్థితి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే.. మళ్లీ ‘రీఫ్రెష్’ అయిపోతామని అంటుంటారు. కానీ అది జస్ట్ ‘రిపేర్’ చేసుకోవడం మాత్రమేనని శాస్త్రవేత్తలు, వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి పునరుత్తేజం రావాలంటే.. కాస్త ‘లేజీనెస్’ అలవర్చుకోవాలని చెప్తున్నారు. 8 విశ్రాంతి అంటే కాసేపు నిద్రపోవడమో.. లేకుంటే సినిమా, షికారు వంటి పనులు పెట్టుకోవడమో చేస్తుంటారని.. అక్కడ నిజంగా విశ్రాంతి ఎక్కడుంటుందని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ‘లేజీనెస్’ అంటే.. ఆందోళనలు, సమస్యలు అన్నీ పక్కనపడేసి.. మీకు నచి్చన ఫుడ్ తిని, మీకు నచ్చినట్టుగా సోఫాలోనో, బెడ్ మీదో బద్ధకంగా పడిపోవడం అని చెప్తున్నారు. ‘సోమరితనం’ కూడా చికిత్సనే.. బద్ధకంగా గడపడం కూడా ఒక రకంగా చికిత్స వంటిదేనని.. శరీరాన్ని, మనసును పూర్తిస్థాయిలో పునరుత్తేజితం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. కానీ లేజీగా గడపడం కోసం.. సమయం వృధా చేస్తున్నామనే ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు మీ గురించి మీరు తీసుకునే శ్రద్ద.. రేపటి మీ జీవితంపై శ్రద్ధకు తోడ్పడుతుందని అంటున్నారు. పరిమితి దాటితే ప్రమాదం.. లేజీగా ఉండాలన్నారు కదా అని.. బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోవద్దు. ఇది ఒకస్థాయి దాటితే జీవితంలో మనకు అవసరమైన వాటిపైనా నిర్లక్ష్యం చేసే దశకు చేరుతామని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల దురలవాట్లకు కారణాల్లో సోమరితనం ఒకటి. ఏదైనా సులువుగా చేయలనుకోవడం ‘లేజీనెస్’ ప్రధాన లక్షణమైతే.. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డాదారిలో వెళ్లడమూ అందులో భాగమే. కేవలం ‘రీఫ్రెష్’ కావడానికి మాత్రమే లేజీనెస్‌ను పరిమితం చేయాలి మరి. లేజీ లేజీగా.. ఏం చేద్దాం? మీకు నచ్చిన ఏదో ఒక రోజును పూర్తిగా మీకు కేటాయించుకోండి. ముఖ్యంగా డబ్బు, ఇతర సమస్యలను పూర్తిగా పక్కనపెట్టండి. ఆందోళనలను పూర్తిగా వదిలేయండి. పొద్దున్నే లేవడం, అలారం పెట్టుకోవడాన్ని పక్కనపెట్టి.. మీకు ఇష్టమైనప్పుడు నిద్ర లేవండి. హాయిగా వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. సోఫాలో, బెడ్‌పై ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా సుఖంగా ఉండేలా చూసుకోండి. టీవీలోనో, ఫోన్లోనో నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ గడపండి. ఎట్లాంటి ఆలోచనలూ పెట్టుకోకండి. అలా బద్ధకంగా కూలబడి.. నచి్చన సంగీతం, పాటలు వినండి. ఫోన్లో నోటిఫికేషన్లను ఆఫ్ చేసేయండి. వీలైతే ఆ రోజు ఫోన్‌ను పూర్తిగా పక్కనపెట్టేయండి. వంట పని వంటివి కూడా పెట్టుకోవద్దు. అలాగైతే తిండి ఎలా అనే డౌట్ వద్దు. ఆ ఒక్కరోజు బయటి నుంచి నచ్చిన ఫుడ్ తెప్పించుకుని.. నచ్చినట్టుగా తినండి. ఇవన్నీ మీరు మానసికంగా, శారీరకంగా పునరుత్తేజితం కావడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నారు. లేజీ.. ముచ్చట్లు ఎన్నో.. లేజీనెస్పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. చాలా మంది శాస్త్రవేత్తలు తాము కనుగొన్న అంశాలతో రిపోర్టులు విడుదల చేశారు. మనం చురుగ్గా ఉండటానికి డోపమైన్ అనే ప్రొటీన్ కీలకం. అది మెదడును ఉత్తేజపరుస్తుంది. కానీ కొందరిలో మెదడులోని డోపమైన్ గ్రాహకాల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దాంతో వారు ఎంతగా ప్రయత్నించినా యాక్టివ్‌గా ఉండలేకపోతారు. స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు దీనికి మందు రూపొందించే పనిలో ఉన్నారు. ఎవరైనా లేజీగా ఉండిపోతే.. మెదడు రెగ్యులర్ యాక్టివిటీని ఆపేసి, పగటికలలు, సృజనాత్మక అంశాలపై దృష్టిపెడుతుందని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. చిత్రమేమిటంటే ఆ సమయంలో మెదడులో యాక్టివ్‌గా ఉండే భాగమే.. మనం మన భవిష్యత్తుపై ఆలోచనలు కూడా చేస్తుందని వెల్లడించారు. లేజీగా ఉండేవారు సమస్యలను పరిష్కరించడానికి సులువైన మార్గాలను వెతుకుతారని పరిశోధకులు నిరూపించారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘పెర్ల్’ను రూపొందించిన లారీ వాల్ కూడా ఇదే చెప్పారు. ప్రోగ్రామ్‌ల కోసం వేల లైన్ల కోడ్ రాయాల్సి ఉంటుందని.. అదే లేజీగా ఉండేవారు తక్కువ లైన్లలో ప్రోగ్రామ్ రాసే ప్రయత్నం చేస్తారన్నారు. ఇది అనారోగ్య సమస్య కాదు సోమరితనం అనారోగ్య సమస్య అని చాలా మంది అనుకుంటారని.. ఆ ఆలోచనే తప్పు అని ‘కాంటెంపరరీ సైకోఅనలైసిస్ గ్రూప్’కు చెందిన సైకాలజిస్టు లారా మిల్లర్ తెలిపారు. ఇతరుల్ని తప్పుపట్టడానికి దీన్ని వాడతారన్నారు. కొందరు లేజీగా కనిపించడానికి చదువు, పని, ఏదైనాగానీ తమ వల్ల కాదేమోనన్న భయం అందుకు కారణమవుతుందని వివరించారు. ఏదైనా కోల్పోవడం, కోల్పోతామన్న భయం, ఓటమి, డిప్రెషన్ వంటివి లేజీనెస్‌కు దారితీస్తాయని.. మనసులో గట్టిగా కోరుకుంటే సులువుగా బయటపడొచ్చన్నారు. నేనైతే లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటా! ‘ఏదైనా కష్టమైన పని చేయాలంటే.. నేను లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటాను. ఎందుకంటే కష్టమైన పనిని సులువుగా చేయగల మార్గాలను అలాంటివారే గుర్తించగలరు..’ – మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చదవండి: గిన్నిస్ రికార్డు పసికందు.. శ్రమించి ఊపిరి నిలిపిన డాక్టర్లు -
Milkha Singh: శరణార్థి శిబిరం నుంచి ఒలింపిక్స్.. వయా తీహార్ జైలు!
ఒలంపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో పరుగు పందేలతో, పతకాలతో దేశ ప్రతిష్టను పెంచిన దిగ్గజం మిల్కా సింగ్. పోస్ట్ కొవిడ్ సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల వయసున్న ఆయన కన్నుమూయగా.. క్రీడా లోకం, దేశం ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. అయితే ఈ పరుగుల దిగ్గజం గురించి అతితక్కువ మందికి తెలిసిన విషయాలెంటో చూద్దాం. 1929 నవంబర్ 20న గోవింద్‌పుర(ప్రస్తుతం పాక్‌లో ఉన్న పంజాబ్)లో పుట్టిన మిల్కా సింగ్.. విభజన అల్లర్లలో తల్లిదండ్రుల్ని పొగొట్టుకున్నాడు. బలవంతంగా శరణార్థ శిబిరాల్లో గడిపిన మిల్కా.. చివరికి 1947లో ఢిల్లీలో ఉంటున్న తన సొదరి దగ్గరికి చేరుకున్నాడు. ఆ టైంలో టికెట్ లేకుండా ప్రయాణించిన నేరానికి కొన్నాళ్లు తీహార్ జైలులోనూ గడిపాడాయన. అల్లర్లలో తల్లిదండ్రుల్ని కోల్పోవడం, చేదు అనుభవాలు తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని, ఒకానొక టైంలో దొపిడీ దొంగగా మారాలని అనుకున్నాడని ఆయన తరచూ ఇంటర్వ్యూలలో చెప్తుండేవాడు. అయితే సోదరుడి ప్రోత్సాహంతో ఆర్మీలో చేరి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ‘పరుగులు’ తీశాడు ఇండియన్ ఆర్మీ పరీక్షల్లో మూడుసార్లు విఫలమైన మిల్కా సింగ్.. 1951 నాలుగో అటెంప్ట్‌లో సెలక్ట్ అయ్యాడు. ఆర్మీలో టెక్నికల్ జవాన్‌గా మిల్కా సింగ్ ప్రస్థానం మొదలైంది. అయితే అక్కడి నుంచే ఆయన రన్నింగ్ రేసుల్లో పాల్గొనేవాడు. మన దేశంలో రన్నింగ్‌లో ‘ట్రాక్ అండ్ ఫీల్డ్’ను ఇంట్రడ్యూస్ చేసింది మిల్కా సింగే. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత.. తన విజయానికి గౌరవంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించాలన్న మిల్కా సింగ్ విజ్ఞప్తిని అప్పటి ప్రధాని నెహ్రూ సంతోషంగా అంగీకరించారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో నాలుగో స్థానంలో నిలిచాడు మిల్కా సింగ్. అయితే అప్పుడు ఆయన నెలకొల్నిన 45 సెకన్ల రికార్డు బ్రేక్ చేయడానికి మరో భారత రన్నర్‌కి 40 ఏళ్లు పట్టింది. ఆసియా పరుగుల వీరుడి ట్యాగ్ దక్కించుకున్న అబ్దుల్ ఖలిక్‌పై 200 మీటర్లపరుగుపందెంలో విజయం సాధించాడు మిల్కా సింగ్. అది చూసి పాక్ జనరల్ ఆయూబ్ ఖాన్ ‘ఫ్లైయింగ్ సిక్’ అని పిలిచాడు. అప్పటి నుంచి అది ఆయన బిరుదు అయ్యింది. మొత్తం 80 రేసుల్లో 77 విజయాలతో అరుదైన రికార్డు ఆయన సొంతమని చెప్తారు. 2001లో కేంద్రం ఆయనకు అర్జున అవార్డు ప్రకటించగా.. ‘40 ఏళ్లు ఆలస్యమైంద’ని పేర్కొంటూ ఆయన తిరస్కరించారు. ఆయన తన పతకాలన్నింటిని దేశానికే దానం చేశాడు. తొలుత ఢిల్లీ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన వాటిని.. తర్వాత పటియాలాలోని స్పోర్ట్స్ మ్యూజియానికి తరలించారు. 1999లో కార్గిల్ వార్‌లో అమరుడైన బిక్రమ్ సింగ్ ఏడేళ్ల కొడుకును మిల్కా సింగ్ దత్తత తీసుకున్నాడు మిల్కా సింగ్ తన కూతురు సోనియా సాన్వాకాతో కలిసి ఆత్మకథ ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ రాసుకున్నాడు. ఈ బుక్ ఆధారంగానే బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ మెహ్రా, ఫర్హాన్ అక్తర్‌ను లీడ్ రోల్ పెట్టి ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమా తీశాడు. అయితే ఈ సినిమా కోసం తన బయోపిక్ హక్కుల్ని ఒక్క రూపాయికే ఇచ్చేసి ఆశ్చర్యపరిచాడు ఈ దిగ్గజం. కానీ, సినిమాకొచ్చే లాభాల్లో కొంత వాటాను పేద క్రీడాకారుల కోసం నెలకొల్పిన మిల్కా సింగ్ ఛారిటబుల్ ట్రస్ట్‌కి ఇవ్వాలనే కండిషన్ పెట్టాడనే విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్ కన్నుమూత -
పాముల్లాగే.. మన లాలాజలంలో విషం ఊరే అవకాశం!
పాముకు కోరల్లో విషం ఉంటుంది.. తేలుకు తన తోకలో ఉంటుంది.. అయితే మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది అంటుంటారు.. ఇప్పటివరకైతే మనిషి శరీరంలో విషం (వెనమ్) ఉన్న ఆనవాళ్లు లేవు కానీ.. సమీప భవిష్యత్తులో పాముల మాదిరిగానే మన లాలాజలంలో విషం ఊరే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఇదీ మానవ పరిణామంలో ఒక భాగమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు జపాన్‌లోని ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పిట్ వైపర్ (రక్త పింజర) పాములపై పరిశోధనలు చేశారు. ఈ పాముల్లోని కోరల్లో విషానికి సంబంధించిన జన్యువుల గురించి తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు సాగాయి. ఈ క్రమంలో నోటిలో విష స్రావాలు వచ్చేందుకు దోహదపడే జన్యువులు.. సరీసృపాల (పాము జాతి)తో పాటు మానవుల్లో కూడా ఉన్నాయని, దీన్నిబట్టి మానవులు కూడా భవిష్యత్తులో విషం కక్కే రోజులు వస్తాయని చెబుతున్నారు. మానవుల లాలాజల గ్రంథులు, పాముల్లోని విష గ్రంథుల అమరిక కణ స్థాయిలో ఒకేరకంగా ఉంటాయని రుజువులు చూపిస్తున్నారు. అందుకే తాము ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నామని పేర్కొంటున్నారు. విషం అనేది ప్రోటీన్ల మిశ్రమం అని, జంతువులు తమ ఆహారాన్ని కదలకుండా చేసేందుకు, స్వీయ రక్షణ కోసం ఈ ఆయుధాన్ని వాడుతాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న అగ్నీశ్ బారువా అనే పరిశోధకుడు వివరించారు. ఇలాంటి విషం కొన్ని క్షీరదాలతో పాటు జెల్లీఫిష్, తేళ్లు, సాలీళ్లు, పాముల్లో ఉంటుంది. చాలా జంతువులు తమ నోటి ద్వారానే విషం విడుదల చేస్తాయి. విషంలోని ప్రోటీన్ల మిశ్రమం తయారయ్యేందుకు ప్రభావితం చేసే జన్యువుల గురించి గతంలో పరిశోధనలు జరిగాయి. కానీ తాజాగా వివిధ జన్యువులు ఎలా ఒకదానిపై ఒకటి ప్రభావితం చేసుకుంటాయని పరిశోధనలు చేస్తున్నాయి. ‘విషం, విష గ్రంథులు ఆవిర్భవించక ముందు ఉన్న జన్యువులు, విష వ్యవస్థ అభివృద్ధి చెందడానికి సహకరించిన జన్యువుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అని బారువా చెప్పారు. ఇందుకోసం తైవాన్‌కు చెందిన హబు పాముల విషంపై కూడా అధ్యయనం చేశారు. దాదాపు 3 వేల ‘సహకార’ జన్యువులను వీరు గుర్తించారు. చాలా జంతువుల్లో గుర్తింపు.. ఇలాంటి జన్యువులు మరే జంతువుల్లోనైనా ఉన్నాయా అని పరిశోధకులు వెతికారు. కుక్కలు, చింపాంజీలు, మానవుల వంటి క్షీరదాల్లో వాటి వెర్షన్లలో ఈ జన్యువులు ఉన్నట్లు గుర్తించారు. క్షీరదాల్లోని లాలాజల గ్రంథుల నిర్మాణం, కణాల అమరిక అచ్చు.. పాముల్లోని విష గ్రంథులలాగే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ రెండు జాతులు కోట్ల సంవత్సరాల కింద వేరు పడటానికి ముందు నుంచీ ఈ గ్రంథులకు సంబంధించి ఒకే మూలాలు కలిగి ఉన్నాయని నమ్ముతున్నారు. పర్యావరణ పరిస్థితులు కనుక మనకు అనుకూలంగా లేకపోతే త్వరలోనే మన లాలాజల గ్రంథులు కాస్తా విష గ్రంథులుగా రూపాంతరం చెందినా ఆశ్చర్యపోనక్కర్లేదు! – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. అయినా వాటికి అదే ఇష్టం! యాంటీ బయోటిక్స్ అని వాడితే.. చివరికి అవే విషంలా -
‘మమ్మీ కంగ్రాట్యులేషన్, ఐ లవ్యూ’
సాక్షి, హిమాయత్‌నగర్ : బల్దియా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం.. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందర్భంగా గురువారం పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ► మేయర్ పదవి రావడం లేదనే సమాచారంతో టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి అసంతృప్తితో దోమలగూడలోని తన తల్లి నివాసానికి వెళ్లిపోయారు. ఎంపీ సంతోష్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకే, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆమెకు ఫోన్ చేశారు. ►సుమారు పది నిమిషాల పాటు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలోగా ఆమె తిరిగి వచ్చారు. ఈ మాత్రం దానికి అలగడం ఎందుకు.. తిరిగి రావడం ఎందుకంటూ బీజేపీ సభ్యులు మాట్లాడుకోవడం వినిపించింది. ►మేయర్ ఎన్నికకు మద్దతుగా టీఆర్ఎస్కు సభ్యులు చేతులెత్తి ఓట్లు వేయడంతో బీజేపీ సభ్యుల అరుపులతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ►ఓ పక్క మంత్రి కేటీఆర్ మజ్లిస్‌తో పొత్తు ఉండదని చెబుతూనే ఇక్కడ మాత్రం కవిత, ఎంపీ సంతోష్‌లు పొత్తు కుదుర్చుకుని, ఏ రకంగా నీతి మాటలు మాట్లాడతారంటూ ఎన్నిక ముగిశాక పలువురు మీడియాతో మాట్లాడారు . ►మేయర్ ఎన్నికకు ముందే హాల్ వెలుపలకు వచ్చిన కొందరు ఎంఐఎం సభ్యులు ఏం చేద్దాం.. అధిష్టానం చెప్పినట్లు మనం వినాల్సిందేగా.. హ్యాండ్స్ రేజ్ చేద్దామంటూ మాట్లాడుకున్నారు. ►ఎన్నిక పూర్తయ్యాక బయటకు వచ్చిన ఎంఐఎం సభ్యులను పలకరిస్తూ మీడియా ప్రతినిధులు టీఆర్ఎస్తో పొత్తు ఉండదని మీ అధినాయకులు చెప్పారని గుర్తుచేయగా, మాకు పర్సనల్ ఇంట్రస్ట్ ఉండదు కదా.. అంటూ వెళ్లిపోయారు. ►కాంగ్రెస్ కార్పొరేటర్లు రజిత, సింగిరెడ్డి శిరిషా రెడ్డిలు ప్రమాణ స్వీకారం ముగియగానే బయటకు వచ్చారు. ►సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందాలకు తెరతీశారంటూ ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాతో.. ఇక్కడ మజ్లిస్ స్నేహాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు హైడ్రామా క్రియేట్ చేశారన్నారు. ►టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తుపై ఎమ్మెల్సీ కవితను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఇద్దరు మహిళలు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉందంటూ సమాధానాన్ని దాటవేశారు. జైతెలంగాణ నినాదాలు చేసుకుంటూ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి కార్పొరేటర్లతో కలిసి వెళ్లారు. ►డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత ఎన్నిక కావడంతో ఆమె కుమార్తె తేజస్వి భావోద్వేగానికి గురయ్యారు. హాలు నుంచి బయటకు వచ్చిన తల్లిని హత్తుకుని విషెస్ చెప్పారు. తల్లిని కిస్ చేస్తూ మమ్మీ కంగ్రాట్చులేషన్, ఐ లవ్యూ అంటూ ఎగిరి గంతేశారు. -
గూగుల్ క్రోమ్ గురించి ఇవి తెలుసుకోండి..
మీరు గూగుల్ క్రోమ్‌ను వాడుతున్నారా .. అయితే కచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే. ప్రస్తుత నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు గూగుల్ క్రోమ్‌ను విరివిగా వాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. మరి అలాంటి గూగుల్ క్రోమ్‌లో ఇటివలే కొన్ని కొత్త ఫ్యూచర్స్ వచ్చి చేరాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ►గెస్ట్చర్ నావిగేషన్ : వినియోగదారులు క్రోమ్‌ను వాడే సమయంలో ఒక వెబ్ పేజీ నుంచి మరొక వెబ్‌పేజ్‌కు వెళ్లేందుకు క్రోమ్‌లో ఒక గెస్ట్చర్(నావిగేటర్)ను ప్రవేశపెట్టింది. దీనిని యాక్టివేట్ చేయాలంటే మీ యూఆర్ఎల్ బార్లో 'క్రోమ్ ://ఫ్లాగ్స్/# ఓవర్ స్క్రోల్-హిస్టరీ-నావిగేషన్'ను టైప్ చేయాలి. ►గూగుల్ ఓమ్నిబాక్స్ : ఈ ఆప్షన్ క్రోమ్‌లో ఉంటుందని సాధారణంగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ క్రోమ్‌లోని అడ్రస్ బార్లో సాధారణంగా యూఆర్ఎల్ ఉండేదానినే గూగుల్ ఓమ్నిబాక్స్ అంటారు. ఇది నేరుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానమై ఉంటుంది. ఓమ్నిబాక్స్‌లో టైప్ చేసే విషయాలను గూగుల్ నేరుగా తీసుకుంటుందని వినియోగదారులు గమనించాలి. ►రికవరింగ్ లాస్ట్ టాబ్స్ : మీరు ఎప్పుడైనా పొరపాటుగా మీ ట్యాబ్‌లను క్లోజ్ చేస్తే పేజ్ రీలోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు.. అలా కుదరకపోతే మళ్లీ కొత్తగా పేజ్ ఓపెన్ చేయాల్సిందే. ఇక మీదట అలా చేయకుండా క్రోమ్ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు చేయాల్సిందల్లా విండోస్‌లో 'కంట్రోల్ + షిఫ్ట్ + టి' నొక్కగానే మీరు ఇంతకు ముందు వాడిన పేజ్‌కు యాక్సెస్ అవుతుంది. ►డార్క్ మోడ్ : గూగుల్ క్రోమ్‌లో డార్క్ మోడ్ అనే ఆప్షన్ 2019 లోనే ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్ధేశం కళ్ళపై ఒత్తిడి ఏర్పడకుండా ఓఎల్ఈడీ రూపంలో ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేసుకోవాలంటే 'విండోస్>సెట్టింగ్స్> అప్పియరెన్స్'అనే ఆప్షన్‌కు వెళ్లి థీమ్‌ను 'మెటీరియల్ ఇగ్నిటో డార్క్' ఎంచుకోవాలి. అయితే ఈ డార్క్‌మోడ్ ఆప్షన్ అనేది మాక్ ఓఎస్ 10.14, విండోస్ 10 వర్షెన్లలో మాత్రమే పనిచేస్తుంది. ►మ్యూటింగ్ సైట్స్ : అప్పుడప్పుడు బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో పాపప్ యాడ్స వస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. అయితే పాపప్‌ను ఆపేందుకు కొత్తగా గూగుల్ క్రోమ్‌లో మ్యూట్ సైట్ అనే ఆప్షన్ వచ్చి చేరింది.ఆడియో ప్లే అవుతున్న సమయంలో టాబ్‌పై కుడివైపు క్లిక్ చేసి మ్యూట్ సైట్ క్లిక్ చేస్తే పాప్అప్ యాడ్స్ ఇక కనిపించవు. -
బతికున్న తాబేలు కీచైన్లు..
సాక్షి: కొన్ని దేశాల పేర్లు చెబితే అక్కడ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, వస్తువులు, కట్టడాలు గుర్తుకురావడం సహజం. అలాగే చైనా పేరు చెబితే గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా, నెల రోజుల పాటు జరిగే నూతన సంవత్సర వేడుకలు.. లాంటివి గుర్తుకు వస్తాయి. కానీ వీటికి మించిన ప్రత్యేకత లు చైనా షాపింగ్‌లో ఉన్నాయి. ఆ ప్రత్యేకతలేమిటో, ఆ షాపింగ్ విశేషాలేమిటో ఈ రోజు తెలుసుకుందాం..! వెరై 'టీ'.. చైనాలో పాండా డంగ్ టీ ప్రత్యేకమని తెలుసు. దాని తర్వాత ఇక్కడ మరో టీ కూడా ప్రసిద్ధి. ఎందుకంటే ఇది పెళ్లికాని అమ్మాయిలు నోటితో తీసిన టీ. చాలా వింతగా అనిపిస్తుంది కదూ! కాని అక్కడ ఒక టీ కంపెనీ అవలంభిస్తున్న వ్యాపార టెక్నిక్ ఇది. ఇందులో పెళ్లి కాని అమ్మాయిలను మాత్రమే పనికి తీసుకుంటారు. ఆ అమ్మాయిలు టీ ఆకులను తమ చేతితో కోయరు. నోటితో కత్తిరిస్తారు. ఆకులు వేసుకునే బుట్టను కూడా చేతితో పట్టుకోకుండా మెడలో తగిలించుకుంటారు. ఈ కంపెనీ తయారు చేసే టీకి చైనాలో చాలా డిమాండ్ ఉంది. రోబోలు తయారు చేసే ఆహారం.. నూడుల్స్ నుంచి చిల్లీ చికెన్ వరకు రోబోలు తయారుచేసే ఆహారం చాలా రుచిగా ఉంటుందట. రోబో చేతులకున్న మెటాలిక్ వేళ్లు ఆహారానికి కొత్త రుచిని చేకూరుస్తున్నాయని అంటున్నారు. 2011లో క్యురన్కాన్ అనే వ్యక్తి ప్రయోగాత్మకంగా వంటచేసే రోబోలను తయారు చేశాడు. అది విజయం సాధించడంతో రోబో వంటను అందించే అనేక రెస్టారెంట్లు వెలిశాయి. ప్రజలు కూడా వీటికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అతడు ఒక్కో రోబోను రూ. 1,50,000 కు విక్రయించాడు. డబ్బాల గాలి.. చైనాలో వాతావరణ కాలుష్యం అక్కడి ప్రజలను అనారోగ్య సమస్యలకు గురిచేస్తోంది. దీన్ని సొమ్ము చేసుకోవాలని కొన్ని కంపెనీలు స్వచ్ఛమైన గాలిని డబ్బాలలో బంధించి అమ్ముతున్నాయి. మిలియనీర్లు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మనం స్వచ్ఛమైన నీటికి డబ్బులు ఖర్చుపెట్టినట్టు చైనా వాసులు ఇప్పుడు స్వచ్ఛమైన గాలికోసం ఎక్కువగా ఖర్చుచేస్తున్నారట. మరుగుజ్జు పార్కు.. చైనాలో మరుగుజ్జులందరినీ ఒక చోటికి తరలించారు. సుమారు 13,000 ఎకరాల విస్తీర్ణంలో వారికి అన్ని వసతులు కల్పించి, దాన్ని ఒక ప్రత్యేక పార్కుగా మార్చేశారు. అక్కడి ప్రజలతో పాటు, పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి వీరితో కాసేపు సరదాగా గడపొచ్చు. బతికున్న తాబేలు కీచైన్లు.. మీరు చాలా రకాల కీచైన్లను వాడుంటారు. బతికున్న జీవులను ఎప్పుడైనా కీచైన్లుగా ఉపయోగించారా.. ఇలాంటి సరదా తీరాలంటే చైనాలో షాపింగ్ చేయాల్సిందే. ఒక ప్లాస్టిక్ కవరులో కావలసిన ఆక్సిజన్, విటమిన్లు ఉన్న నీటిని నింపి అందులో తాబేలు వంటి చిన్న చిన్న జీవులను ఉంచి, వాటిని కీ చైన్లుగా అమ్ముతారు. కొందరు వీటిని అదృష్టంగా భావించి కొంటుంటే, మరికొందరు ఆ అమాయక జీవులకు స్వేచ్ఛ కల్పించడానికి కొంటున్నారు. ట్రాఫిక్ జాం నుంచి తప్పిస్తారు.. జనాభాలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్న చైనాలో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం. ఒక్కోసారి అవి క్లియర్ అవడానికి గంటల నుంచి రోజుల సమయం పట్టొచ్చు. ఇలా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వారి కోసం ఒక ప్రైవేటు కంపెనీ ప్రత్యేక సర్వీసును ప్రారంభించింది. వారికి ఫోను చేస్తే వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వ్యక్తిని బైక్‌పై ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానం చేరుస్తారు. కారును కూడా ట్రాఫిక్ తగ్గాక వారే తెచ్చి ఇంటి దగ్గర అందచేస్తారు. దీనికి తగిన రుసుము చెల్లించాలి.