Do You Know About World Shortest Escalator In Japan - Sakshi
Sakshi News home page

Japan Smallest Escalator: ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్‌.. కానీ ఎందుకు పెట్టారో?

Published Mon, Jul 24 2023 11:26 AM | Last Updated on Mon, Jul 24 2023 12:23 PM

Do You Know World Smallest Escalator In Japan - Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్‌. ఎత్తయిన అరుగులు ఉన్న ఇళ్లకు ఉండే మెట్ల కంటే తక్కువ మెట్లతో ఈ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఎస్కలేటర్‌గా గిన్నిస్‌బుక్‌లో చోటు పొందింది.

జపాన్‌లోని కవాసాకి నగరంలో ఉందిది. కవాసాకి రైల్వే స్టేషన్‌ దక్షిణం వైపు ద్వారం నుంచి బయటకు వస్తే, ఎదురుగా కనిపించే ‘మోర్‌’’ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో ఉంది ఈ బుల్లి ఎస్కలేటర్‌. దీనికి ఉన్నవి కేవలం ఐదు మెట్లు మాత్రమే!

చిన్నపిల్లలు కూడా ఆమాత్రం మెట్లు ఎక్కగలిగినప్పుడు ఈ ఎస్కలేటర్‌ను ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ అర్థంకాదు. అయినా, వింతగా ఉండటంతో దీనిని చూడటానికి జనాలు ఇక్కడకు వస్తుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement