రాజమౌళి ఈగ సినిమా గుర్తుంది కదా.. అందులో విలన్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. చివరకు ఈగను చంపడానికి ప్రయత్నించి ఏకంగా ఇంటిని తగలబెట్టుకోవడమే కాక.. తాను చస్తాడు. సరిగ్గా ఇలాంటి సీన్ జపాన్‌లో రిపీట్ అయ్యింది. బొద్దింకను చంపే ప్రయత్నంలో ఓ వ్యక్తి ఏకంగా ఇంటిని తగటబెట్టాడు.
ఏమైందంటే.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి బొద్దింక చొరబడింది. దీంతో ఎలాగైనా దాని భరతం పడదామని, పెద్ద మొత్తంలో బొద్దింకల్ని చంపే స్ప్రేను పిచికారీ చేశాడు. అంతే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఒక్కసారిగా మంటలు అంటుకొని పేలుడు సంభవించింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై స్పై చేయడంతో మంటలు చెలరేగాయి.
ఈ ధాటికి అపార్ట్‌మెంట్ మొత్తం మంటలు వ్యాపించగా, సదరు వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌ల దగ్గర పురుగుమందులను పిచికారీ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ది స్ట్రెయిట్స్ టైమ్స్‌లోని ఒక నివేదిక పేర్కొంది. పిచికారీ స్ప్రేలల్లో ప్రొపేన్, బ్యూటేన్‌తో పాటు ఆల్కహాల్ వంటి మండే స్వభావం ఉన్న ప్రొపెల్లెంట్‌లు ఉంటాయని, వీటి వల్ల ఒక్కోసారి ఇలా పేలుడు జరిగే అవకాశం ఉందని రిపోర్టులో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment