ఆ జత జాడీలు అల్లావుద్దీన్‌ అద్భుత దీపంలా ఏం మాయ చేశాయి..! | A Rare Blue And White Wine Jar In The Chinese | Sakshi
Sakshi News home page

ఆ జత జాడీలతో ఓ కుటుంబం​ రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తింది..!

Published Sun, Dec 15 2024 9:25 AM | Last Updated on Sun, Dec 15 2024 9:25 AM

A Rare Blue And White Wine Jar In The Chinese

అల్లావుద్దీన్‌ అద్భుత దీపం లాగానే, జత జాడీలు చైనాలోని ఒక కుటుంబాన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేశాయి. ఫొటోలో కనిపిస్తున్న ఈ రెండు జాడీలు చైనాకు చెందిన ఒక కుటుంబంలో గత శతాబ్దంగా ఉంటున్నాయి. పాతబడిన ఈ జాడీలను పనికిరాని వస్తువులుగా భావించి, ఆ కుటుంబం వారు వాటిని ఒక మూలన పడేశారు. అయితే ఈ జాడీలే తమకు కోట్లు కురిపిస్తాయని వారు ఊహించలేదు. 

అయితే, ఒక పురావస్తు నిపుణుడి సలహాపై, ప్రస్తుతం ఈ జాడీలను వారు వేలంలో పెడితే, అప్పుడే తెలిసింది వారికి ఈ జాడీల ప్రాముఖ్యత! పదహారో శతాబ్దానికి చెందిన చక్రవర్తి జియాజియ్‌ హయాంలో ఈ జాడీలను తయారు చేసినట్లు గుర్తించి, వాటిని 9.6 మిలియన్‌ పౌండ్లకు (సుమారు రూ. 102 కోట్లు) కొనుగోలు చేశారు. 

అతి పురాతనమైన ఈ జాడీలను చైనీస్‌ మింగ్‌ రాజవంశం ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇవి వీరి దగ్గరకు ఎలా వచ్చాయో తెలియదు గాని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి నుంచి ఈ జాడీలు వారి ఇంటి వంటగదిలో నిరుపయోగంగా ఉంటున్నాయి. ఎగిరే చేపల డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ జాడీలను వారు కేవలం ఇంట్లో అలంకరణకు మాత్రమే వాడేవారట! అందుకే అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. 

(చదవండి: వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement