vessel
-
ఆ జత జాడీలు అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఏం మాయ చేశాయి..!
అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగానే, జత జాడీలు చైనాలోని ఒక కుటుంబాన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేశాయి. ఫొటోలో కనిపిస్తున్న ఈ రెండు జాడీలు చైనాకు చెందిన ఒక కుటుంబంలో గత శతాబ్దంగా ఉంటున్నాయి. పాతబడిన ఈ జాడీలను పనికిరాని వస్తువులుగా భావించి, ఆ కుటుంబం వారు వాటిని ఒక మూలన పడేశారు. అయితే ఈ జాడీలే తమకు కోట్లు కురిపిస్తాయని వారు ఊహించలేదు. అయితే, ఒక పురావస్తు నిపుణుడి సలహాపై, ప్రస్తుతం ఈ జాడీలను వారు వేలంలో పెడితే, అప్పుడే తెలిసింది వారికి ఈ జాడీల ప్రాముఖ్యత! పదహారో శతాబ్దానికి చెందిన చక్రవర్తి జియాజియ్ హయాంలో ఈ జాడీలను తయారు చేసినట్లు గుర్తించి, వాటిని 9.6 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 102 కోట్లు) కొనుగోలు చేశారు. అతి పురాతనమైన ఈ జాడీలను చైనీస్ మింగ్ రాజవంశం ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇవి వీరి దగ్గరకు ఎలా వచ్చాయో తెలియదు గాని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి నుంచి ఈ జాడీలు వారి ఇంటి వంటగదిలో నిరుపయోగంగా ఉంటున్నాయి. ఎగిరే చేపల డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ జాడీలను వారు కేవలం ఇంట్లో అలంకరణకు మాత్రమే వాడేవారట! అందుకే అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. (చదవండి: వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!) -
South Atlantic: మత్స్యకారుల పడవ మునక.. ఆరుగురు మృతి
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదం సంభవించింది. మత్స్యకారుల పడవ మునిగిపోవడంతో ఆరుగురు మృతిచెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఫాక్లాండ్ దీవుల తీరానికి 200 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 27 మంది ఉన్నారని, వారంతా చేపలు పట్టేందుకు వెళ్తున్నారని బ్రిటిష్, స్పానిష్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పడవ పేరు అర్గోస్ జార్జియా అని, ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిందని స్పెయిన్ అధికారులు తెలిపారు. ప్రమాదం బారినుంచి 14 మందిని రక్షించి, లైఫ్బోట్లో ఎక్కించారని తెలిపారు. చేపల వేటకు వెళ్లినవారిలో స్పెయిన్ దేశానికి చెందినవారితో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం. -
కిచెన్‌ని కళాత్మకంగా సర్దుకోండిలా..!
వంటిల్లు అంటే నూనె జిడ్డు, మాడు వాసన కాదు. వంటిల్లు అంటే.. సమతూకంలో ఉడికే దినుసుల కమ్మదనం, ఆరోగ్యాన్ని వడ్డించే నైపుణ్యం! మనసుండాలే కానీ కిచెన్కూ కళాత్మకతతో పోపు పెట్టొచ్చు ఇలా..ఇండిపెండెంట్ ఇంట్లో సరే.. అపార్ట్మెంట్లలోనూ కిచెన్‌కి బాల్కనీ ఉంటుంది చిన్నదో పెద్దదో! ఇందులో తులసి సరే.. కొత్తిమీర, మెంతి, పుదీనా, పాలకూర, బచ్చలి వంటివి వేసి.. దీన్ని హెర్బల్ గార్డెన్‌గా మలచుకోవచ్చు. తాజా ఆకు కూరలతో ఆరోగ్యమే కాదు.. పచ్చదనంతో మనసూ మురుస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో వంటిల్లూ మెరుస్తుంది. కాస్తోకూస్తో ఖర్చూ కలిసొస్తుంది. అందమైన పాత్రలు ఇప్పుడు మళ్లీ రాగి, ఇత్తడి పాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. యాంటిక్ డిజైన్‌లో దొరికే ఆ పాత్రలతో అరలను సర్దితే.. రాజసం ఉట్టిపడుతుంది వంటిల్లు. పింగాణీ పాత్రలతో దీనికి టచప్ ఇవ్వొచ్చు. ఫుడ్ థీమ్ ఆర్ట్కిచెన్ వాల్స్‌ని షెల్వ్స్తో నింపేయకుండా.. ఒక్క చోటనైనా ఖాళీగా ఉంచాలి. దాన్ని నచ్చిన వంటకాలు లేదా నట్స్.. లేదా ఫ్రూట్స్.. వెజిటబుల్స్ పెయింటింగ్స్‌తో అలంకరించాలి. కుక్ బుక్స్వంటింట్లో వంట సామాగ్రికే కాదు వంటకు సంబంధించిన పుస్తకాలకూ స్పేస్ ఇవ్వొచ్చు. స్థానిక సంప్రదాయ వంటల పుస్తకాల నుంచి వరల్డ్ ఫేమస్ షెఫ్‌లు రాసిన కుక్ బుక్స్ దాకా అన్నిటినీ ర్యాక్స్‌లో పేర్చుకుంటే.. కిచెన్‌కి ఇంటలెక్చువల్ లుక్ వస్తుంది. వెరైటీ వంటకాల పట్ల మనకు ఇంట్రెస్టూ పెరుగుతుంది. తెలుసు కదా.. కుకింగ్ అనేది ఆర్టే కాదు.. స్ట్రెస్ బస్టర్ కూడా! వంటలకు రుచెంతో.. అలంకరణకు అభిరుచీ అంతే! సో.. టేస్ట్‌కి తగ్గట్టు సర్దుకోండిక!.(చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..) -
ఇంట్లో వాడే పాత్రల వెనుక ఇంత కష్టం ఉంటుందా?
మనం నిత్యం ఎలా పడితే అలవాడే పాత్రలు ఎలా తయారవ్వుతాయో వింటే షాకవ్వుతారు. ఇంత శ్రమ ఉంటుందా! అనుకుంటారు. మనం పాత సామాన్లను అమ్మేస్తుంటాం. ఎంతో కొంత డబ్బులు తీసుకుని పనికిరాని సామాన్లను పాత సామాన్ల వాడికి ఇచ్చేస్తుంటాం. అలా వచ్చిన వాటిని వాళ్లు ఏం చేస్తారో తెలుసా..? మనం నిత్యం కూరలు వండేది అల్యూమినియం పాత్రల్లోనే. వాటిల్లో వండొద్దని హెచ్చరిస్తున్నా.. మనం వాటిల్లోనే వండేస్తుంటాం. అవే అయితే కడగడం ఈజీ. పైగా అంత బరువు ఉండవు. వాడుకునేందుకు సౌలభ్యంగా ఉండటంతో ప్రజలు ఆ పాత్రలకే అలవాటు పడిపోయారు. అదీగాక పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో కూడా వీటిని వాడుతుంటారు. కడిగేందుక వీలుగానూ, ఎక్కువ మొత్తంలో వండే కూరకు ఈ గిన్ని కాస్త వెసులుబాటుగా ఉంటుంది. బరువు కూడా ఓ మోస్తారుగా ఉంటుంది. అలాంటి ఈ అల్యూమినియం పాత్రలను మనం ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం వీటి వెనుక ఇంత కష్టం ఉంటుందా? అని నోరెళ్లబెడతారు. వాడిపడేసిన అల్యూమినయం చెత్తను బొగ్గుల వేడిపై కరిగించి వాటిని మంచిగా మరిగించి ఓ పాత్ర రూపంలో ఉన్న బట్టిలో వేసి అల్యూమినియం గిన్నెలను తయారు చేస్తారు. అవి అందంగా ఉండేలా మంచి పాలిష్ పెట్టడం ఒక వంతు. ఆ తర్వాత ఆ గిన్నెలను పట్టుకునేలా హ్యాండిల్స్ బిగించి చక్కగా గిన్నె తయారయ్యిందని నిర్థారించుకున్నాక కంపెనీ స్టిక్కర్ వేసి పొద్దికగా పెట్టడం ఒక ఎత్తు. ఇంత తతంగం అయితే గానీ ఒక గిన్నే తయారవ్వదు. అయితే ఇలా తయారయ్యిన గిన్నెలు తక్కువ స్వచ్ఛతను కలిగి ఉంటాయని అంటున్నారు నిపుణులు. వీటిలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియం తదితర మెటల్ మలినాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వంట ప్రకియలో ఆయా కూరలు తయారు చేసేటప్పుడూ ఉప్పు, పులుపు వంటివి ఉంటాయని, వాటితో ఈ అల్యూమినియం రియాక్షన్ చెంది రంధ్రాలను ఏర్పరచటం లేదా అల్యూమినయంలోని విషపదార్థాలు ఈ కూరలో కలవడం జరుగుతుందని అన్నారు. ఇది ఆహారంగా తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తయాని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. Using recycled aluminium to make pans What issues immediately stick out here? pic.twitter.com/i0QceNsTgx — Science girl (@gunsnrosesgirl3) March 13, 2024 (చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి!) -
ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’
ఇరాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకను ఇండియన్ నేవి సిబ్బంది రక్షించించినట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 700 నాటికల్ మైల్స్ దూరంలో ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇరాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజార్ల నుంచి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. Indian Navy warship INS Sumitra is rescuing fishermen hijacked by Somali pirates 700 nautical miles west of Kochi in the Arabian Sea. The Iranian fishing vessel MV Iman with around 17 crew members was hijacked by Somali pirates: Indian Defence officials pic.twitter.com/EOEs7zgQHn — ANI (@ANI) January 29, 2024 అయితే.. సోమాలియా సముద్రపు దొంగల చేత హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన ఎంవీ ఇమాన్ మత్స్యకార నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇక.. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎర్ర సముద్రంతో పాటు అరేబియా సముద్రంలో వరుసుగా జరుగుతున్న విషయం తెలిసిందే. చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన -
భారత సిబ్బందితో ఉన్న నౌకపై దాడి.. రంగంలోకి ఐఎన్ఎస్ విశాఖ
ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్ దేశానికి చెందిన తిరుబాటుదారులు హౌతీ రెబల్స్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో సముద్రంలో ప్రయాణిస్తున్న బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై హౌతీ రెబల్స్ మిస్సైల్ దాడికి తెగపడ్డారు. దాడికి గురైన బ్రిటిష్ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ ఉద్యోగి ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ సహాయక చర్యలకోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బందిని పంపించినట్లు శనివారం వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే ఎంవీ మార్లిన్ లువాండా అనే బ్రిటిష్ నౌక నుంచి ఓ అత్యవసర సందేశం ఇండియాన్ నేవీ వచ్చింది. #IndianNavy's Guided missile destroyer, #INSVisakhapatnam, deployed in the #GulfofAden responded to a distress call from MV #MarlinLuanda on the night of #26Jan 24. The fire fighting efforts onboard the distressed Merchant Vessel is being augmented by the NBCD team along with… pic.twitter.com/meocASF2Lo — SpokespersonNavy (@indiannavy) January 27, 2024 ‘ఎంవీ మార్లిన్ లువాండా నుంచి వచ్చిన అత్యవసర సందేశంతో అప్రమత్తమైన సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది రంగంలో దిగారు. నౌకల భద్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ ఇండియాన్ నేవి ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొంది. -
కడలిలో కరెంట్ బోట్.. ఆసక్తికర విషయాలు..
విద్యుత్ వాహనాల(ఈవీల) వినియోగం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రజల్లో ఇప్పుడిప్పుడే వీటిపై అవగాహన పెరుగుతోంది. రానున్న రోజుల్లో వీటి వినియోగం మరింత హెచ్చవుతుందని భావిస్తున్నారు. అయితే ఈవీలు కేవలం రోడ్లకే పరిమితం కాకుండా నీటిలో సముద్రంపై వాటి మార్కును నిలుపుకోనున్నాయి. చాలా కంపెనీలు నీటిలో వినియోగించే చిన్నబోట్లను నడిపేందుకు సైతం విద్యుత్తును వినియోగించేలా పరిశోధనలు సాగిస్తున్నాయి. ఆ పరిశోధనల్లో భాగంగా అమెరికాకు చెందిన ‘క్రౌలి’ సంస్థ ‘ఈ-వోల్ఫ్’ అనే షిప్పింగ్ వెజెల్‌ను తయారుచేసింది. 70 టన్నులు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ వెజెల్ 82 అడుగుల పొడవు ఉంటుంది. దీన్ని క్రౌలికు చెందిన ఇంజినీర్లు మాస్టర్బోట్ బిల్డర్స్ షిప్‌యార్డ్‌లో రూపొందించినట్లు తెలిసింది. ఇందులో ప్రయాణించే వారికి చుట్టూ(360 డిగ్రీ వ్యూ) ప్రదేశాలు కనిపించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ వెజెల్‌ను ఈ ఏడాది చివర్లో శాన్ డియాగో పోర్ట్‌లో విధుల్లో ప్రవేశపెట్టనున్నారు. దీన్ని తీరప్రాంతంలో పెట్రోలింగ్ కోసం వినియోగంచనున్నట్లు సమాచారం. ఈ వెజెల్లో 6.2 మెగావాట్ హవర్ మాడ్యులర్ బ్యాటరీ సిస్టమ్‌ను అమర్చారు. ఇది దాదాపు గంటకు 30 కిలోమీటర్లు గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. 2,100 కిలోవాట్ శక్తినిచ్చే రెండు థ్రస్టర్ మోటార్లతో కూడిన ప్రొపల్షన్ సిస్టమ్‌కు అమర్చారు. అయితే ఇందులో అత్యవసర సమయాల్లో బ్యాటరీ అయిపోయినా మరింత దూరం ప్రయాణించడానికి వీలుగా రెండు చిన్న డీజిల్ జనరేటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీన్ని భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో సాన్‌డియాగో పోర్ట్ తీరప్రాంతంలో మైక్రోగ్రిడ్ ఛార్జింగ్, స్టోరేజ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఈ-వోల్ఫ్ సేవలు వినియోగించుకోనున్నారు. సాంప్రదాయ వెజెల్‌తో పోలిస్తే ఇది మొదటి 10 సంవత్సరాల కాలంలో 2.5 టన్నుల డీజిల్ పార్టికల్స్, 3,100 మెట్రిక్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను ఆదా చేస్తుందని క్రౌలీ తెలిపింది. సముద్రగర్భంలో ఏర్పడుతున్న శబ్దకాలుష్యం వల్ల జీవులకు ఎంతో హానికలుగుతుందని అయితే అది ఈవీ బోట్లతో నివారించవచ్చని చెప్పింది. -
భారత్‌తో వివాదం వేళ.. చైనా నౌకను ధ్రువీకరించిన మాల్దీవులు
భారత్-మాల్దీవుల మధ్య ఇటీవల చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో మాల్దీవుల చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. చైనా పరిశోధక నౌక ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ మాలె తీరానికి చేరినట్లు ధృవీకరిస్తూ మాల్దీవుల ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సిబ్బంది రాకపోకలు, భర్తీ కోసం చైనా దౌత్యపరమైన అభ్యర్థన చేసిందని మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది. తమతో స్నేహంగా ఉండే పలు దేశాలకు చెందిన నౌకలకు మాల్దీవుల ద్వీపం ఓ గమ్యస్థానమని పేర్కొంది. తాము ఎప్పుడు ఆ దేశాల నౌకలకు స్వాగతం చెబుతామని తెలిపింది. మాల్దీవుల తీరంలోకి తమ దేశం పరిశోధక నౌక వస్తున్నట్లు చైనా సమాచారం అందించిందని మాల్దీవుల విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా తమ దేశ నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి మాల్దీవుల దౌత్యపరమైన అనుమతి తీసుకుందని పేర్కొంది. ఇక.. గతంలో చైనా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించటంపై భారత్ తీవ్ర అభ్యంతం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చైనా అనుకూల వ్యక్తి పేరు ఉందన్న విషయం తెలిసిందే. ఒక వైపు భారత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలో మొయిజ్జు.. చైనా పర్యటించారు. తమ దేశంలోని సైన్యాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. చైనా పరిశోధక నౌక.. నిఘా సమాచారాన్ని సేకరించే సాధనాలను కలిగి ఉంటుందని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇటువంటి నౌకలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలు, గగన తలంపై నిఘా ఉంచగలవని తెలుస్తోంది. అందుకే భారత్.. చైనా నౌకలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది చదవండి: ఫిబ్రవరి 8న పాక్ ఎన్నికలు...‘బ్యాట్’ పట్టని ఇమ్రాన్! -
రాగిపాత్రల్లో ఈ పానీయాలను అస్సలు తాగొద్దు!
రాగి గిన్నెల్లో నీరు తాగడం మంచిదని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెగ వాడేస్తుంటారు. రాగి పాత్రలో తినడం కూడా మంచిదే కానీ కొన్నింటికి దీన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. కేవలం కొన్ని పదార్థాలకే పరిమితం. భోజనానికి కూడా రాగి ప్లేట్లు వాడుతుంటారు. కానీ కొన్ని రకాలు పులుపు వంటి పదార్థాలు రాగి గిన్నెలో తినకపోవటమే మంచిది. ముఖ్యంగా పెరుగు లాంటివి తింటే చాలా ప్రమాదం. అసలు రాగి పాత్రలో ఎలాంటి పదార్థాలు ఎలాంటి పానీయాలు తాగకూడాదో చూద్దామా! ముఖ్యంగా మామిడికాయ, పచ్చళ్లు, జామ్‌లు ఎప్పుడు రాగిపాత్రల్లో తినకూడదు, భద్రపరచకూడదు. ఈ ఆహారాలతో రాగి రియాక్షన్ చెందుతుంది. తత్ఫలితంగా వికారం లేదా వాంతులు వంటివి రావొచ్చు. లేదా పాయిజనింగ్‌కి దారితీయొచ్చు. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం, తేనె కలుపుకుని తాగే అలవాటు ఉంటుంది చాలమందికి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. అయితే ఇలాంటి పానీయాలు కూడా రాగి గిన్నెల్లో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే నిమ్మకాయలోని ఆమ్లం రాగితో చర్య పొంది కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు సంబంధిత సమ్యలు తలెత్తుతాయి. అలాగే రాగి పళ్లెంలో అన్నం తినేటప్పుడు పెరుగు అన్నం అస్సలు తినొద్దు. పెరుగులోని గుణాలు రాగితో ప్రతిస్పందిస్తాయి దీంతో జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఇక ఇతర పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచడం కూడా హానికరమే. పాలలోని ఖనిజాలు విటమిన్లలు రాగితో రియాక్షన్ చెంది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతుంది. (చదవండి: రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!) -
ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి యువకుడు మృతి
సాక్షి, తమిళనాడు: ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ విషాధ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..వివాహ వేడుకలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు కాలేజీ విద్యార్థి అని, పార్ట్ టైం జాబ్‌గా క్యాటరింగ్ పనిచేస్తున్నట్లు తెలిపారు. అతిధులకు వడ్డన చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించినప్పటికీ తీవ్ర కాలిన గాయలవ్వడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అతను తీవ్రంగా గాయపడటంతో శరీరం ట్రీట్మెంట్కి సహకరించలేదని అందువల్లే అతడి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: గజరాజులను చూసి తోకముడిచిన పులి: వీడియో వైరల్) -
అమెరికాకు గట్టి షాక్ ఇచ్చిన ద్వీప దేశం.. చైనా అండతోనే?
హోనియారా: ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికాకు ఓ చిన్న దేశం గట్టి షాక్ ఇచ్చింది. తమ తీరప్రాంత జలాల్లోకి అమెరికాకు చెందిన మిలిటరీ నౌక వచ్చేందుకు నో చెప్పింది. పసిఫిక్ దేశమైన సోలమన్ ఐలాండ్స్ ప్రధాని అధికార ప్రతినిధి ఈ మేరకు వెల్లడించారు. విదేశాలకు చెందిన మిలిటరీ నౌకలు సోలమన్ ఐలాడ్స్ నౌకాశ్రయాల్లోకి రావటంపై తాత్కాలిక నిషేధం విధించినట్లు చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. దేశంలోని నౌకాశ్రయంలో ఇంధనం నింపుకోవాలని భావించిన అమెరికా కోస్ట్ గార్డ్ షిప్‌కు అనుమతించలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో నిషేధం అంశాన్ని మంగళవారం వెల్లడించారు సోలమన్ ప్రధాని మనస్సే సోగవరే. ‘ఈ నిర్ణయం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుంది. ఏ ఒక్క దేశానికి ప్రత్యేక అనుమతి లేదు. నౌకల అనుమతి ప్రక్రియను పునఃపరిశీలించే అంశంపై నిర్ధిష్ట సమయం ఏమీ లేదు.’ అని ప్రధాని ప్రతినిధి తెలిపారు. తాత్కాలిక నిషేధం దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు.. ఈ నిర్ణయంతో సోలమన్ ఐలాడ్స్ తమ మిత్ర దేశం చైనాకు మరింత దగ్గరవుతోందని సూచిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరు దేశాలు భద్రతాపరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరోవైపు.. పశ్చిమ దేశాల మీడియా తమ దేశంలో అధికార మార్పిడికి, గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారని సోలమన్ ఐలాడ్స్ ప్రధాని కార్యాలయం ఇటీవలే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మిలిటరీ నౌకలపై తాత్కాలిక నిషేధం విధించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: అమెరికా సైన్యం షాకింగ్ నిర్ణయం.. చినూక్ హెలికాప్టర్లు నిలిపివేత.. ఆందోళనతో భారత్ లేఖ -
300 మందితో వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం
స్టాక్‌హోమ్: స్వీడన్ తీరంలో సుమారు 300 మందితో వెళ్తున్న ఓ భారీ నౌకలో మంటలు చెలరేగాయి. అందులోని ప్రయాణికులను కాపాడేందుకు అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని స్వీడన్ నౌకాదళ అధికారులు తెలిపారు. ‘కార్ డెక్‌లో మంటలు చెలరేగాయి. మూడు హెలికాప్టర్లు, ఏడు నౌకలను సంఘటనా స్థలానికి పంపించాం. ప్రయాణికుల తరలింపు జరుగుతోంది.’ అని స్వీడన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధిని జోనస్ ఫ్రాంజెన్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, మంటలు అంటుకునేందుకు గల కారణాలేంటనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు జోనస్ ఫ్రాంజెన్. మరోవైపు.. మంటలు అదుపులోకి వచ్చినట్లు మరో అధికారి తెలిపారు. స్వీడన్ ఈశాన్య తీర ప్రాంతంలోని గోట్‌స్కా సాండన్ ద్వీపం సమీపంలో ప్రమాదానికి గురైన స్టేనా స్కాండికా నౌక ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రకృతి విలయం చేజేతులారా పాక్ చేసుకున్న పనే! మిత్రదేశం చైనా ప్రకటన తప్ప సాయానికి నో! -
గుళ్లో నిద్రిస్తున్న పూజారిపై కత్తితో దాడి.. హుండీ మాయం!!
జలోర్: గుళ్లో దొంగతనానికి వచ్చి, అడ్డుకున్న 70 యేళ్ల పూజారిని కడతేర్చారు గుర్తుతెలియని అంగతకులు. తాజాగా జిల్లాలో చోటుచేసుకున్నఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో దుంబాడియా గ్రామానికి చెందిన నెనుదాస్ వైష్ణవ్ (70) అనే పూజారి గత 30 యేళ్లుగా హనుమాన్ దేవాలయంలో పూజలు చేస్తున్నాడు. ఐతే సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎప్పటిలాగే పూజా కార్యక్రమాలు ముగించుకుని పూజారి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో దొంగతనం చేయాడానికి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు, అక్కడ నిద్రిస్తున్న పూజారిపై కత్తితో దాడిచేశారు. పూజారి కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పూజారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐతే పూజారి చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 30) ఉదయం మరణించాడు. ఘటన అనంతరం దేవాలయంలోని విరాళం పాత్ర కూడా కనిపించకుండా పోయింది. కాగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో అర్చకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు డీఎస్పీ (భీన్మల్) శంకర్ లాల్ తెలిపారు. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి: OCD Wife: నావళ్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి! -
వైరల్: పెళ్లంటే ఇదేరా.. వంట పాత్రలో వెడ్డింగ్ హాల్‌కి వచ్చిన కొత్త జంట
అలప్పజ( కొచ్చి): కేరళను వరదలు ముంచెత్తడంతో అక్కడి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల రవాణా కూడా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఓ జంట పెద్దలు నిశ్చయించిన ముహుర్తానికే తమ పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకుని, ఆటంకాలను దాటుకుంటూ వివాహ తంతుని పూర్తి చేశారు. అయితే ఇందులో ఏముందనుకుంటున్నారా.. వానలు కాబట్టి పడవ మీద వచ్చుంటారు అనుకుంటే పొరపాటే. పెండ్లి మంటపానికి వారిద్దరు అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని వచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో స్థానిక టీవీ చానెల్లో ప్రసారమవడంతో పాటు ఆ జంట సెలబ్రిటీగా మారంది. వివరాల్లోకి వెళితే.. ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్న ఆకాష్, ఐశ్వర్యల వివాహం సోమవారం జరపాలని పెద్దలు నిశ్చయించారు. అయితే ప్రస్తుతం కేరళలోని వరదల కారణంగా అది వీలుపడదని అనుకున్నారంతా. కానీ తమ జీవితంలో ముఖ్యమైన రోజుని వాయిదా వేయడం ఇష్టంలేని ఆ వధూవరులు మాత్రం ధైర్యంతో ముందుకు కదిలారు. చుట్టూ ఎటు చూసిన నీళ్లు ఉండడంతో వారు ఏకంగా ఓ భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని తలవడిలోని ఫంక్షన్ హాల్‌కు అతి కష్టం మీద చేరుకున్నారు. అఖరికి పెండ్లి మంటపం సైతం నీటితో నిండిపోయింది అయినా అవేవి వారి నిర్ణయాన్ని ఆపలేకపోయింది. ఈ పెళ్లికి పరిమిత అతిధులు, బంధువులను ఆహ్వానించి వారి సమక్షంలోనే తమ వివాహ తంతు ముగించేశారు. ఇక నవ దంపతులు ఇద్దరూ చెంగనూర్‌లోని దవాఖానలో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. #Kerala couple uses a huge cooking vessel as a makeshift boat to reach their wedding venue amidst #heavyrains #KeralaFloods #KeralaRains pic.twitter.com/NiIUpRcrnc — Diksha Yadav (@DikshaY62646349) October 18, 2021 చదవండి: లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది -
తాడు పేనినట్లే రక్తనాళాలను కూడా....!
శరీరంలో ఏదైనా రక్తనాళం దెబ్బతిని.. దాన్ని తొలగించాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కృత్రిమ రక్తనాళాలను శరీరం ఓర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా రోగి కొలేజన్తోనే రక్తనాళాలను తయారు చేసేందుకు ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. మానవ కణాలను పరిశోధన శాలలో పెంచడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ పదార్థాన్ని ఉపయోగించుకుని ఈ రక్తనాళాలు సిద్ధమవుతాయి. పొరలు పొరలుగా లభించే ఈ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ పదార్థన్ని చిన్న చిన్న పోగుల్లా కత్తిరించడం, చేంతాడును పేనినట్లు ఈ పోగులతో రక్తనాళాలను పేనడం ఈ కొత్త పద్ధతిలోని ప్రక్రియ. ఇవి కుట్లు వేసినా పగిలిపోనంత దృఢంగా ఉంటాయని, ఒత్తిడికి పగిలిపోనూ పోవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. రోగి శరీరం నుంచి సేకరించిన కణాలతోనే రక్తనాళాలను తయారు చేయడం వల్ల వీటిని రోగ నిరోధక వ్యవస్థ తిరస్కరించే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఈ కొత్త రకం రక్తనాళాలు కావాల్సిన ప్రమాణాలన్నీ కలిగి ఉన్నట్లు ఇప్పటికే రుజువు కాగా, త్వరలోనే ఈ రక్తనాళాలను జంతువులపై ప్రయోగించి చూడనున్నారు. ఆ తరువాత మానవుల్లోనూ ప్రయోగాలు చేపట్టి అందరికీ అందుబాటులోకి తెస్తారు. పరిశోధన పూర్తి వివరాలు అక్ట్రా బయో మెటీరిలియా అనే జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. -
నైజీరియా తీరంలో భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ: నైజీరియా తీరంలో హాంకాంగ్ జెండాతో వెళ్తున్న ఒక నౌకపై మంగళవారం సముద్ర దొంగలు దాడి చేశారని ఏఆర్ఎక్స్ మారిటైమ్ అనే సంస్థ తెలిపింది. నౌకలోని 19 మంది సిబ్బందిని బందీలుగా తీసుకెళ్లారని, వారిలో 18 మంది భారతీయులని తెలిపింది. సమాచారం తెలియగానే నైజీరియాలోని భారతీయ దౌత్యాధికారులు నైజీరియా ప్రభుత్వాన్ని సంప్రదించి, భారతీయులు విడుదలయ్యేందుకు సహకరించాలని కోరారు. -
ఆ నౌక జాడ తెలియరాలేదు
న్యూఢిల్లీ: దాదాపు ఐదు నెలల క్రితం కేరళలో 243 మందితో బయలుదేరిన నౌక అదృశ్యమైన ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ నౌక గురించి అన్ని దేశాలను అప్రమత్తం చేశామని.. అయితే ఆయా దేశాల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం వెల్లడించారు. కేరళలోని ఎర్నాకులం జిల్లా మునంబమ్ నుంచి జనవరి 12న బయలుదేరిన ‘దేవ మాతా–2’అనే పేరున్న నౌక గల్లంతైన విషయం తెలిసిందే. ‘ఇది పసిఫిక్ సముద్రం దిశగా వెళ్లినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆ రీజియన్‌లోని అన్ని దేశాలనూ అప్రమత్తం చేశాం’అని రవీశ్ చెప్పారు. కాగా, గల్లంతైన నౌకలో 85 మంది చిన్నారులు ఉన్నట్లు వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. వీరిలో 12 రోజుల వయసున్న చిన్నారి కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలు, జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా గుర్తించారు. నెలలు గడుస్తున్నా తమ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ వారిని కనిపెట్టాల్సిందిగా కేంద్ర హోం శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పోలీసులు, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు సైతం లేఖ రాశారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి సంబంధించి త్వరలో విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్‌ను కలవాలని వారు యోచిస్తున్నారు. -
ఆ నౌకలో రూ 600 కోట్ల విలువైన డ్రగ్స్..
ముంబై : గుజరాత్ తీరంలో రూ 600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను తరలిస్తున్న పాకిస్తాన్‌కు నౌకను భారత తీరప్రాంత గస్తీ దళం సీజ్ చేసింది. కోస్ట్ గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో 100 కిలోల హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఈ ఫిషింగ్ నౌక పట్టుబడింది. ఈ నౌక నుంచి 194 నార్కోటిక్ పదార్ధాలున్న ప్యాకెట్లను భారత కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పాకిస్తానీ నౌక అల్ మదీనాను సీజ్ చేసి, సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. అల్ మదీనా పేరుతో పాక్ నౌకను కరాచీలో రిజిస్టర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం పట్టుబడిన సిబ్బందితో సహా నౌకను జకువ హార్బర్‌కు తరలించారు. -
ఉత్తర కొరియా నౌకను సీజ్ చేసిన దక్షిణకొరియా
సియోల్ : ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ఎక్కువయ్యేట్టుంది. ఉత్తర కొరియాకు చెందిన నౌకను దక్షిణ కొరియా సీజ్ చేసింది. తమ సముద్ర జలాల నుంచి అక్రమంగా ఆయిల్‌ను తరలిస్తున్న లైట్ హౌజ్ విన్మోర్ అనే నౌకను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇది ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమైనందునే సీజ్ చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉత్తర కొరియాకు ఎలాంటి వస్తువును రవాణా చేయకూడదని యూఎన్ సాంక్షన్స్ చెబుతున్నాయని పేర్కొంది. ఉత్తర కొరియాకు రిఫైండ్ ఆయిల్‌ను మొత్తం 11 ప్రధాన నౌకలు రహస్యంగా అందిస్తుంటాయని, అందులో ఇదొకటని, ఇవి కనిపిస్తే వెంటనే సీజ్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని గతంలోనే అమెరికా ఐక్యరాజ్యసమితిని కోరిందని, ఆ ప్రకారమే తాము నౌకను సీజ్ చేసినట్లు తెలిపారు. -
పొరపాటున బాంబు వేశాం: ఫ్రెంచ్ ప్రధాని
ఇరవై ఐదేళ్ళ తర్వాత ఫ్రాన్స్, న్యూజిల్యాండ్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్ న్యూజిల్యాండ్ లో పర్యటించడం అందుకు పెద్ద నిదర్శనంగా చెప్పాలి. అక్కడకు వెళ్ళడమేకాక, ఫ్రాన్స్ 31 ఏళ్ళ క్రితం న్యూజిల్యాండ్ పై జరిపిన దాడి పెను తప్పిదమంటూ వాల్స్ విశ్లేషించడం ఇరు దేశాలమధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గ్రీన్ పీస్ పై 31 ఏళ్ళ క్రితం జరిపిన బాంబు దాడి పెను తప్పిదమేనన్నారు ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్. 25 సంవత్సరాల అనంతరం మొదటిసారి ఫ్రెంచ్ ప్రధాని న్యూజిల్యాండ్ ను సందర్శించారు. ఈ సందర్శన ఫ్రెంచ్, న్యూజిల్యాండ్‌ల మధ్య మైత్రిని పెంపొందించే అవకాశం ఉన్నట్లు జిన్హువా వార్తా సంస్థ అభిప్రాయపడింది. 1985 జూలైలో ఫ్రెంచ్ గూఢచారులు... ఆక్లాండ్ ప్రధాన పట్టణం పై.. రెండు భారీ మైన్లతో దాడికి పాల్పడ్డాయి. ఫసిఫిక్ లో ఫ్రాన్స్ జరుపుతున్న అణ్వస్త్ర పరీక్షలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ప్రచారం కొనసాగిస్తున్నసమయంలో రైన్బో వారియర్ నౌక.. బాంబుదాడితో నిమిషాల్లో నీటిలో మునిగిపోయింది. అనంతరం దాడిలో పాల్గొన్న ఇద్దరు ప్రెంచ్ సీక్రెట్ ఏజెంట్లను న్యూజిల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 సంవత్సరాలక్రితం మా సంబంధం పెద్ద పవాలుగా ఉండేదని, అప్పట్లో జరిగిన బాంబు దాడి తప్పిదమేనని, దాడితో చెరిగిపోయిన ఇరుదేశాల మధ్య బంధం... తిరిగి చిగురించాలని కోరుకుంటున్నట్లు ఫ్రాన్స్ ప్రధాని వెల్లడించారు. జరిగిన తప్పిదాలను గుర్తుంచుకొని, అటువంటివి మరెప్పుడూ జరగకుండా చూసుకుంటూ...ఇరు దేశాలు కలసి అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలని వాల్స్ ఆకాంక్షించారు. మరోవైపు.. బాంబు దాడి ఘోరమైన తప్పిదంగా ఫ్రాన్స్ అంగీకరించడం మంచి పరిణామమని న్యూజిల్యాండ్ ప్రధాని జాన్ కీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆక్లాండ్ లో వాల్స్ తో చర్చలు జరిపిన అనంతరం న్యూజిల్యాండ్ నష్టాన్ని, బాధను ఫ్రాన్స్ అర్థం చేసుకొందని అటువంటి సమస్యలు తిరిగి తెచ్చే అవకాశం లేదని తాను నమ్ముతున్నట్లు జాన్ కీ తెలిపారు. ఫ్రాన్స్ తన చర్యలను పెద్ద లోపంగా భావించిందని, ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రధాని రాక ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంచుతుందని న్యూజిల్యాండ్ ప్రధాని కీ అభిప్రాయపడ్డారు. -
మరో 26/11 కుట్ర?
-
మరో 26/11 కుట్ర?
* పాక్ ఉగ్రవాదుల మర పడవను అడ్డుకున్న తీరదళం * కరాచీ నుంచి ఆయుధాలు, మందుగుండుతో భారత్‌లోకి మరపడవ! * దేశంలో విధ్వంసానికేనని అనుమానం * అడ్డుకున్న కోస్ట్ గార్డ్ నౌక; గంటపాటు కొనసాగిన వేట * తప్పించుకునే మార్గం లేక పేల్చేసుకున్న దుండగులు; పడవలో భారీ పేలుళ్లు * మంటల్లో చిక్కుకుని సముద్రంలో మునిగిపోయిన పాక్ పడవ దేశంలో ముంబై 26/11 తరహాలోనే మరో మారణహోమానికి పొరుగుదేశపు ఉగ్రవాదులు కుట్రపన్నారా? నూతన సంవత్సర వేడుకల్లో భారతావని మునిగి ఉండగా.. చీకటి మాటున అరేబియా సముద్రం ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఆయుధాలను, ఆధునిక పేలుడు సామగ్రిని దేశంలోకి చేరవేసి మరో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్ర రాక్షసులు ప్రణాళికలు రచించారా?.. డిసెంబర్ 31 అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ఉంది. గుజరాత్ తీరంలో కరాచీ నుంచి వస్తున్న మరపడవను.. నిఘా సమాచారం ఆధారంగా భారతదేశ తీర రక్షక దళం అడ్డుకుంది. పడవను ఆపేయాలని, సోదాకు సహకరించాలని కోస్ట్ గార్డ్ చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టిన పడవ సిబ్బంది(ఉగ్రవాదులు?) తప్పించుకునేందుకు ప్రయత్నించి.. సాధ్యం కాక పడవను పేల్చేశారు. భారీ పేలుడు శబ్దాల అనంతరం మంటల్లో చిక్కుకున్న ఆ మరపడవ సముద్రంలో మునిగిపోయింది. అందులోని నలుగురు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మొత్తం మీద మరో ఉపద్రవాన్ని తీర రక్షక దళం విజయవంతంగా అడ్డుకుంది. న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ‘డిసెంబర్ 31 అర్ధరాత్రి... మరికాసేపట్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది.. దేశవ్యాప్తంగా వేడుకల్లో మునిగితేలుతున్న ప్రజలు. చిమ్మ చీకట్లో అరేబియా సముద్రం. గుజరాత్‌లోని పోర్‌బందరు తీరానికి దాదాపు 350కి.మీల దూరంలో పాకిస్తాన్ సముద్రజలాల్లోంచి చేపలు పట్టేందుకు ఉపయోగించే ఒక మర పడవ భారత్ వైపు దూసుకువస్తోంది. అందులో పెద్ద ఎత్తున ఆయుధాలు. మందుగుండు సామగ్రి. భారత సముద్ర జలాల్లో 8 కి.మీ.ల లోపలికి వచ్చిన ఆ పడవను గుర్తించిన తీరప్రాంత నిఘా వ్యవస్థ అక్కడి కోస్ట్‌గార్డ్ షిప్‌ను అప్రమత్తం చేసింది. దాంతో కోస్ట్‌గార్డ్ షిప్, తీర రక్షణ దళానికే చెందిన డోర్నియర్ యుద్ధ విమానం ఆ మరపడవ వైపుకు దూసుకువెళ్లాయి. వీటిని గుర్తించిన మరపడవ సిబ్బంది తమ పడవను గుర్తించకుండా అందులోని లైట్లను ఆర్పేశారు. మళ్లీ పాక్ జలాల్లోకి తప్పించుకుని వెళ్లేందుకు పడవ వేగం పెంచారు. ఆ వెనకే వారిని వెంటాడుతూ భారత తీర రక్షక దళ నౌక.. ఆకాశంలో యుద్ధవిమానం..! దాదాపు గంటపాటు ఛేజింగ్ కొనసాగింది. మరపడవ చేరువలోకి వెళ్లిన తీర రక్షక దళ నౌక ఆ పడవను అడ్డుకుంది. ఆ మర పడవను, అందులోని సామగ్రిని సోదా చేసేందుకు వీలుగా ఆ పడవను ఆపేయాలని తీరరక్షక దళ సిబ్బంది హెచ్చరించారు. హెచ్చరికగా పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇక తప్పించుకోవడం అసాధ్యం అని అర్థమైన ఆ మరపడవలోని ముష్కరులు.. తమ పడవలోని డెక్ కిందకు వెళ్లారు. ఆ కాసేపటికే అందులోంచి భారీ స్థాయిలో పేలుళ్లు ప్రారంభమయ్యాయి. మంటల్లో చిక్కుకున్న ఆ పడవ నెమ్మదిగా మునిగిపోయింది. అప్పటికి జనవరి 1 తొలి వెలుగులు ప్రారంభమయ్యాయి...’ ఇదేం బాలీవుడ్ యాక్షన్ సిని మా సీన్ కాదు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నిజంగా జరిగిన ఘటన. భారత్‌లో మరో ఉగ్రవాద దారుణం జరగకుండా విజయవంతంగా అడ్డుకున్న ఘటన. 1993, 2008 నవంబర్ 26 (26/11)ల నాటి ముంబై దాడులను గుర్తు చేసిన ఘటన. అప్పుడు ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారానే ముంబైలో ప్రవేశించి నరమేధం సాగించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా మరోమారు దేశంలో విధ్వంసం సృష్టించే లక్ష్యంతో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండుతో మరపడవలో ఉగ్రవాదులు వస్తూ ఉండి ఉండొచ్చని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ పడవే.. తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఆ పడవ కరాచీ దగ్గర్లోని కేతిబందర్కు చెందినదని, అరేబియా సముద్రంలో ఏదో అక్రమ కార్యకలాపాల నిర్వహణలో భాగంగానే అది భారతజలాల్లోకి వచ్చిందని భారత రక్షణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిఘా వ్యవస్థ సమాచారం ఆధారంగా కోస్ట్‌గార్డ్ షిప్, యుద్ధవిమానం సమన్వయంతో ఆపరేషన్ ప్రారంభించాయని పేర్కొంది. ‘ఆ బోట్ డెక్‌పై నలుగురు వ్యక్తులు కనిపించారు. బోట్‌ను ఆపేయాల్సిందిగా భారత తీరరక్షణ దళం చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టి, లోపలికి వెళ్లి వారు ఆ పడవను పేల్చేశారు. చీకటి, బలమైన గాలులు, ప్రతికూల వాతావరణం వల్ల ఆ పడవను స్వాధీనం చేసుకోలేకపోయాం. అలాగే, అందులోని వారిని ప్రాణాలతో పట్టుకోలేకపోయాం’ అని ఆ ప్రకటనలో రక్షణ శాఖ తెలిపింది. ఆ పడవలో నుంచి ఎవరైనా తప్పించుకున్నారా? అనే కోణంలో తీర రక్షక దళానికి చెందిన నౌకలు, విమానాలు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా గాలింపు జరుపుతున్నాయని వెల్లడించింది. పాక్‌కు చెందిన ఆ పడవలోని సిబ్బంది తమను తాము పేల్చేసుకోవడం.. ఆ పడవలో పేలుడు పదార్థాలున్నాయన్న విషయాన్ని నిర్ధారిస్తుందని తీరరక్షక దళ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ కేఆర్ నౌతియాల్ వ్యాఖ్యానించారు. తప్పుడు ఉద్దేశం లేకుంటే వారు తప్పించుకునేందుకు, పడవలోని లైట్లు ఆర్పేందుకు ప్రయత్నించేవారు కాదని వివరించారు. దీన్ని తీవ్రమైన అంశంగానే పరిగణిస్తున్నామని ఆ పడవ గమ్యస్థానం ఏంటో ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు. నిఘా, నౌకాదళ వర్గాల అద్భుత సమన్వయం వల్లనే ఆ పడవను అడ్డుకోగలిగామన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 26 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటన చోటు చేసుకోవడంతో భద్రతాదళాలు, నిఘా వర్గాలు మరింత అప్రమత్తమయ్యా యి. మరోవైపు, గుజరాత్లో త్వరలో వైబ్రాంట్ గుజరాత్- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీరప్రాంత భద్రతను, నిఘాను కట్టుదిట్టం చేశారు. సముద్రం మీదుగా మరోసారి ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించే అవకాశముందన్న వివిధ నిఘా సంస్థల సమాచారంతో గత కొన్ని నెలలుగా సముద్రజలాల్లో, తీర ప్రాంతంలో గస్తీని మరింత తీవ్రం చేశారు. కోస్ట్‌గార్డ్‌కు ప్రశంసలు.. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నవారిని, తీరరక్షణ దళాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రశంసించారు. భారత్‌లో ఉగ్ర దాడులకు పాక్ సహకరిస్తోందనేందుకు ఇది తాజా ఉదాహరణ అని బీజేపీ వ్యాఖ్యానించింది. పొరుగుదేశం నిస్పృహకు ఇది అద్దం పడుతోందని విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ సాయుధ దళాలకు మరిన్ని అధికారాలు ఇచ్చినందువల్లనే.. ఆదేశాల కోసం ఢిల్లీ వైపు చూడకుండా సమయానికి స్పందించాయని పేర్కొంది. ఆపరేషన్ ఇలా జరిగింది..! * సాంకేతికపర నిఘా సమాచారం అందించే ‘జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)’ ఒక అనుమానాస్పద టెలిఫోన్ సంభాషణను గుర్తించింది. భారత్‌కు దగ్గర్లో డెలివరీ చేయాల్సిన ఒక ‘ఖరీదైన’ రవాణా సామగ్రి గురించిన సంభాషణ అది. ఆ తరువాత ‘ఆ సామగ్రిని ఎవరికి అందించాలో వారికి డబ్బులు చెల్లించాం. వారు సిద్ధంగా ఉన్నారు’ అనే మరో సంభాషణనూ గుర్తించింది. * డిసెంబర్ 31 ఉదయం 9.30కు పాక్ వైపు నుంచి వస్తున్న అనుమానాస్పద పడవ గురించి తీరరక్షక దళానికి మొదటి నిఘా సమాచారం అందింది. * ఉదయం 11.30 గంటలకు నౌకాదళానికి చెందిన డోర్నియర్ యుద్ధ విమానం ఆ అనుమానాస్పద పడవ గురించి గాలింపు ప్రారంభించింది. దానికి కాసేపటి తరువాత మరో రెండు విమానాలు జత కలిశాయి. * దాదాపు 15 నాటికల్ మైళ్లు భారతీయ జలాల్లోకి వచ్చేసి నెమ్మదిగా కదులుతున్న ఒక బోట్‌ను డోర్నియర్ యుద్ధ విమానం గుర్తించింది. తీరరక్షక నౌక ‘రాజారతన్’ ఆ బోట్ ఉన్న వైపునకు బయల్దేరింది. * ఆ బోట్‌ను రాజారతన్ నౌక గుర్తించి నేవిగేషన్ లైట్లు వేయాలని అందులోని సిబ్బందిని కోరినప్పుడు, వారు తమ ప్రయాణ మార్గాన్ని పలుమార్లు మార్చుకుని, వేగం పెంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. * గంటపాటు ఈ ఛేజింగ్ కొనసాగింది. బోట్లో ఇంధనం అయిపోవడం వల్ల కాబోలు బోట్ వేగం తగ్గింది. * జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో పాకిస్తాన్ బోట్లోంచి భారీ పేలుళ్లు, మంటలు ప్రారంభమయ్యాయి. పడవ మునిగిపోసాగింది. అంతకుముందు ఆ పడవ డెక్‌పై నలుగురు వ్యక్తులు కనిపించారు.