
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదం సంభవించింది. మత్స్యకారుల పడవ మునిగిపోవడంతో ఆరుగురు మృతిచెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఫాక్‌లాండ్ దీవుల తీరానికి 200 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 27 మంది ఉన్నారని, వారంతా చేపలు పట్టేందుకు వెళ్తున్నారని బ్రిటిష్, స్పానిష్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పడవ పేరు అర్గోస్ జార్జియా అని, ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిందని స్పెయిన్ అధికారులు తెలిపారు. ప్రమాదం బారినుంచి 14 మందిని రక్షించి, లైఫ్‌బోట్‌లో ఎక్కించారని తెలిపారు. చేపల వేటకు వెళ్లినవారిలో స్పెయిన్ దేశానికి చెందినవారితో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment