Atlantic Ocean
-
సాటి లేరెవరూ నీ సాహసానికి!
బెంగళూరుకు చెందిన అనన్య ప్రసాద్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరి ప్రయాణం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. స్పానిష్ కానరీ దీవుల్లోని లా గోమెరా నుంచి 52 రోజుల్లో కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వాకు చేరుకుంది. 52 రోజుల్లో 3,000 మైళ్ల చారిత్రాత్మక యాత్రను ముగించింది. అనన్య ప్రముఖ కన్నడ కవి జీఎస్ శివరుద్రప్ప మనవరాలు.బెంగుళూరులో పుట్టిన అనన్య పెరిగింది, చదువుకున్నదీ యూకేలో. సరదాగా మొదలైన రోయింగ్ హాబీ ఆ తరువాత అంకితభావంతో కూడిన పాషన్‌గా మారింది.‘రోయింగ్‌ను వ్యాయామంగా ఆస్వాదిస్తాను. రోయింగ్ అనేది నా దృష్టిలో సాహసం’ అంటుంది అనన్య.వరల్డ్స్ టఫెస్ట్ రో’లో అన్ని వయసులు, అన్ని దేశాల వారు పాల్గొంటారు. ఈ రేసుకు అర్హత సాధించడానికి మూడున్నరేళ్లు శిక్షణ తీసుకుంది అనన్య. శిక్షణలో మానసిక, శారీరక ఫిట్నెస్, సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించింది.తన యాత్రలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిరోజు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించేది. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రం విశ్రాంతికి కేటాయించేది. ‘ఒంటరిగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. వాతావరణ, సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందాలతో ఎప్పుడూ టచ్‌లోనే ఉన్నాను’ అని తన ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంది అనన్య.తన సాహసానికి సామాజిక ప్రయోజనాన్ని కూడా జత చేసింది. మన దేశంలోని అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచే మెంటల్ హెల్త్ ఫౌండేషన్, దీనబంధు ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించింది. -
ట్రంప్ పనామా జపం వెనక..
పనామా కాలువ. వందేళ్ల క్రితం నిర్మించిన ఇంజనీరింగ్ అద్బుతం. చిన్నపాటి భూభాగం కారణంగా కలవకుండా ఉండిపోయిన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను వందల కోట్లు వెచ్చించి అక్కడి వారి కలను సాకారం చేసింది అగ్రరాజ్యం. పాతికేళ్ల తర్వాత దానిపై అజమాయిషీ కోసం పట్టుబడుతుండటం విచిత్రం. ఆ కాల్వపై అజమాయిషిని నాటి అమెరికా అధ్యక్షుడు స్థానిక దేశానికి ధారాదత్తం చేస్తే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అదేమీ చెల్లవంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. ట్రంప్ బెదిరింపులకు బెదిరేదిలేదని పనామా ప్రభుత్వం చెబుతుండటంతో ఏమౌతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అవసరమైతే సైనిక శక్తితో బెదిరించో, బలవంతపు దౌత్యంతోనో మాట నెగ్గించుకోవడం దశాబ్దాలుగా అమెరికాకు అలవాటు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వారమైనా తిరక్కుండానే ఏకంగా వందకు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులిచ్చిన తెంపరి ట్రంప్ పనామాపై ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి... భారీ రాకపోకలు, అనూహ్య రాబడి అమెరికా నౌకలు ఆసియా ఖండానికి వెళ్లాలంటే గతంలో దక్షిణ అమెరికా ఖండం చుట్టూతా వేల మైళ్లు సముద్రయానం చేయాల్సి వచ్చేది. ప్రయాణఖర్చలు విపరీతంగా ఉండేవి. వీటిని చాలా వరకు తగ్గించేందుకు, ప్రత్నామ్నాయ సముద్రమార్గంగా పనామా కాలువను తెరమీదకు తెచ్చారు. అనుకున్నదే తడవుగా వందల కోట్లు ఖర్చుపెట్టి కాలువను తవ్వి 1914 ఆగస్ట్ 15న కాలువను వినియోగంలోకి తెచ్చారు. కొత్తలో ఈ మార్గం గుండా రోజుకు మూడు నాలుగు నౌకలే రాకపోకలు సాగించేవి. అయితే అత్యంత దగ్గరి దారికావడంతో రానురాను దీని గుండా అంతర్జాతీయ సరకు రవాణా నౌకల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఏటా లక్షలాది నౌకలు వెళ్తున్నాయి. దీంతో కాల్వపై యాజమాన్య హక్కులున్న పనామా దేశానికి ఏటా నికర లాభం ఏకంగా రూ.43,000 కోట్లకు పెరిగిందని ఒక అంచనా. ఏటా ఇంతటి లాభాల పంట పండించే బంగారు కోడిని నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అప్పనంగా పనామాకు అప్పజెప్పారని నేటి అధ్యక్షుడు ట్రంప్ తెగ బాధపడిపోతున్నారు. పనామా దేశ వార్షిక ఆదాయంలో 23.6 శాతం ఒక్క ఈ కాలువ నుంచే వస్తుండటం గమనార్హం. పనామా వాదనేంటి? నాటి కాలువకు నేటి కాలువకు ఎంతో తేడా ఉంది. బాధ్యతలు తమ చేతుల్లోకి వచ్చాక పనామా దేశం ఈ కాలువను మరింతగా తవ్వి పెద్దగా విస్తరించింది. ఏకంగా 5 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో 2016 ఏడాది తర్వాత భారీ నౌకలు సైతం సులభంగా వెళ్లడం మొదలవడంతో యాజమాన్యం అధిక లాభాలను కళ్లజూస్తోంది. ‘‘ మేం సొంతంగా ఎంతో ఖర్చుపెట్టాం. గతంలో పోలిస్తే ఆదాయం 55 శాతం పెరగడానికి గతంలో మేం పెట్టిన పెట్టుబడులే కారణం’’ అని కాలువ మాజీ అడ్మిని్రస్టేటర్ జార్జ్ లూయిస్ క్విజానో తేల్చి చెప్పారు. ‘‘ కాలువ మా దేశంలో, దేశభక్తిలో అంతర్భాగం. దీనిపై యాజమాన్య హక్కులు మాకే దక్కుతాయి’’ అని పనామా దేశస్తులు తెగేసి చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన స్థానికులు పనామా సిటీలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పెద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ కాలువను దక్కించుకోవాలంటే పెద్ద ఘర్షణ చెలరేగి అది అంతర్జాతీయ నౌకాయానంపైనా పెను ప్రభావం పడే ప్రమా దముంది. అమెరికా నౌకలపై అధిక చార్జీలు ఈ కాలువను వాణిజ్య అవసరాలకు అత్యధికంగా వాడుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత చైనా, చిలీ, జపాన్, దక్షిణకొరియాలు అతిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సరకు రవాణా నౌకలతోపాటు చాలా ప్రపంచదేశాలపై నిఘా కోసం, తమ మిత్రదేశాల్లో తమ స్థావరాలకు సైన్యాన్ని తరలించేందుకు యుద్ధనౌకలనూ ఇదే మార్గం గుండా పంపుతోంది. వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికాకు రాకపోకలు చార్జీలు ఎక్కువ అవుతున్నాయి. అయితే మాపైనే అధిక చార్జీలు మోపుతున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే తన వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను ఆయన బయటపెట్టలేదు. పైగా చైనా రహస్యంగా ఈ కాలువ నిర్వాహణ యాజమాన్య హక్కులు పొందిందని ట్రంప్ ప్రధాన ఆరోపణ. కాలువను పనామా దేశం శాశ్వతంగా సొంతంగా మాత్రమే నిర్వహించుకోవాలన్న ‘ టోరిజోస్–కార్టర్’ ఒడంబడికను పనామా కాలదన్నిందని, తటస్థ వైఖరికి తిలోదకాలు ఇచ్చిందని అమెరికా ఆరోపిస్తోంది. కష్టపడి తవ్విన తమకే అధిక చార్జీల వాత పెడుతూ, శత్రుదేశం చైనాకు నిర్వహణ హక్కులు కట్టబెట్టారని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఎలాగైనా సరే పనామా కాలువపై యాజమాన్య హక్కులను తిరిగి సంపాదిస్తామని ప్రమాణస్వీకారం రోజే ట్రంప్ ప్రకటించారు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, పనామా పాలకుడు ఒమర్ టోరిజోస్కు పనామాకాలువ బాధ్యతలు అప్పగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంచుకొస్తున్న మెగాబర్గ్ ముప్పు?!
అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకం. ఎంతలా అంటే.. ముంబైలాంటి మహానగరాలు ఆరు కలిస్తే ఇది ఏర్పడిందట. అంతటి ఐస్‌బర్గ్ ఓ ద్వీపం వైపుగా దూసుకొస్తోంది. అలాంటప్పుడు ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా. అది ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు చర్చిద్దాం. A23a.. అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి 1986 ఆగష్టులో విడిపోయింది. అప్పటి నుంచి 34 ఏళ్లుగా అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అయితే 2020 నుంచి వెడ్డెల్ సముద్రం పశ్చిమం వైపు అది నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కిందటి ఏడాది జనవరిలో అది సుడిగుండంలో చిక్కుపోయింది. అయితే అనూహ్యంగా డిసెంబర్ మధ్యలో అది అక్కడి నుంచి బయటపడింది. బలమైన గాలుల ప్రభావమే దాన్ని అక్కడి నుంచి బయటపడేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మధ్యే యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ దీనిని ఈ భూమ్మీద అతిపెద్ద ఐస్బర్గ్గా ప్రకటించింది కూడా.ఇక.. సుమారు 4వేల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ఐస్‌బర్గ్.. బ్రిటీష్ సరిహద్దుల వైపు ప్రయాణిస్తోంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌత్ జార్జియాను అది ఢీ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దీవికి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మంచు ఫలకం. ఈ ఐస్‌బర్గ్ పైభాగానికి పదిరెట్లు సముద్రంలో ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే.. ట్రిలియన్ టన్నుల బరువుండొచ్చనేది ఒక అంచనా. ప్రపంచంలోనే భారీ మంచు ఫలకం కావడంతో.. అందరి కళ్లు దీని మీదే ఉన్నాయి. అందుకే దానిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే గంటకు ఒక మైలు వేగంతో పయనిస్తోందట!.ఢీ కొడితే ఏమౌతుందంటే..సౌత్ జార్జియా పెద్దగా జనావాసం లేని ద్వీపం. కానీ, వైవిధ్యమైన జంతుజాలం అక్కడ ఉంది. కింగ్ పెంగ్విన్స్, సాధారణ సీల్స్‌తో పాటు ఎలిఫెంట్ సీల్స్ ఈ దీవి ఆవాసం. అయితే గతంలో ఈ దీవిని ఈ తరహాలోనే ఐస్‌బర్గ్‌లు ఢీ కొట్టాయి. ఆ టైంలో పక్షులు, సీల్ చేపలు లాంటివి లెక్కలేనన్ని మరణించాయి. అలాగే ఇప్పుడు ఈ భారీ ఐస్‌బర్గ్ ఢీ కొడితే.. ఆ నష్టం ఊహించని స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన నెలకొంది. అంతేకాదు.. అది అక్కడి నౌకాయాన రంగంపైనా తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిశ మార్చుకుంటుందా?అయితే సౌత్ జార్జియాకు చేరుకునేలోపే మెగాబర్గ్.. ముక్కలయ్యే అవకాశం ఉందని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే అంచనా వేస్తోంది. అలాగే.. దీవి వైపు కాకుండా దిశ మార్చుకుని పయనించే అవకాశమూ లేకపోలేదని చెబుతోంది. ఇందుకు గతంలో జరిగిన పరిణామాలనే ఉదాహరణలుగా చెబుతోంది. అయితే.. ఢీ కొట్టనూ వచ్చు!మరోవైపు.. శాటిలైట్ వ్యవస్థ ద్వారా దీని కదలికలను పరిశీలించిన బ్రిటిష్ అంటార్కిటికా సర్వే ప్రతినిధి ఆండ్రూ మెయిజెర్స్ మాత్రం పై వాదనలతో ఏకీభవించడం లేదు. ఇది మిగతా ఐస్బర్గ్లాగా ముక్కలు కాకపోవచ్చనే ఆయన అంటున్నారు. పైగా అది దిశ మార్చుకునే అవకాశాలను ఆయన కొట్టిపారేశారు. ఇది గతంలోని ఐస్‌బర్గ్‌ల మాదిరి కనిపించడం లేదని అంచనా వేస్తున్నారాయన. ద్వీపాన్ని ఢీ కొట్టిన తర్వాత అది దక్షిణాఫ్రికా వైపు దారి మళ్లొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.ఏ23ఏ ఏర్పాటునకు క్లైమేట్ ఛేంజ్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ.. భవిష్యత్తులో ఈ తరహా భారీ మంచు ఫలకలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అంటార్కిటికాలో సముద్ర మట్టం పెరగడం, ఉష్ణోగ్రతల పెరుగుదల.. భవిష్యత్తులో ఈ తరహా భారీ ఐస్‌బర్గ్‌లను మన ముందు ఉంచే అవకాశాలే ఎక్కువ. A68aకి ఏమైందంటే.. ఏ68ఏ.. A23a కంటే ముందు ప్రపంచంలో అతిపెద్ద ఐస్బర్గ్గా రికార్డుల్లో నమోదైంది. పరిమాణంలో లండన్ నగరం కంటే మూడు రెట్లు పెద్దది. బరువు ఒక ట్రిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా. ఇది కూడా సౌత్ జార్జియాను ఢీ కొట్టవచ్చని అప్పట్లో ఆందోళన చెందారు. అయితే.. ఐల్యాండ్‌కు సరిగ్గా వంద మైళ్ల దూరంలో ఉండగానే దానికి భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆపై అది సముద్రంలోనే కరిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఒక సొరంగం.. రూ.16.96 లక్షల కోట్లు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ నగరాల మధ్య దూరం 3 వేల మైళ్లు(4,828 కిలోమీటర్లు). విమానంలో కాకుండా సముద్రంలో నౌకలపై ప్రయాణించాలంటే రోజుల తరబడి సమయం పడుతుంది. కానీ, సముద్రంలో కేవలం గంట సమయంలో ప్రయాణించే అవకాశం వస్తే? నిజంగా అద్భుతం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కీలక నగరాలను అనుసంధానించడానికి అట్లాంటిక్ మహాసముద్రంలో సొరంగం(టన్నెల్) నిర్మించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఇది సాధారణ సొరంగం కాదు. వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీతో నిర్మించే సొరంగం. ఈ ప్రాజెక్టుకు రూ.16.96 లక్షల కోట్లకుపైగా(20 ట్రిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర గర్భ టన్నెల్‌గా రికార్డుకెక్కడం ఖాయం. ప్రస్తుతం ఉత్తర యూరప్‌లో ఫెమార్న్బెల్ట్ సొరంగం నిర్మాణ దశలో ఉంది. డెన్మార్క్, జర్మనీని అనుసంధానించే ఈ సొరంగం 2029లో అందుబాటులోకి రానుంది. ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ అండ్ రైల్ టన్నెల్‌గా రికార్డు సృష్టించబోతోంది. మరోవైపు దక్షిణ యూరప్‌లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గ్రీస్, టర్కీని కలిపేలా సముద్రంపై కొత్త వంతెన నిర్మించబోతున్నారు. -
రూ. మూడు కోట్ల ఇల్లు.. 11 సెకెన్లలో కొట్టుకుపోయిందిలా..
అతని కలల ఇల్లు సముద్ర కెరటాలకు కొట్టుకుపోయింది. అవును.. ఇది నిజం. ఈ ఉదంతం అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఇక్కడి సముద్రతీరంలో నిర్మించిన విలాసవంతమైన, అందమైన ఇల్లు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయింది.ఆగస్టు 16న వచ్చిన ఎర్నెస్టో హరికేన్ ఈ రూ. మూడు కోట్ల విలువైన ఈ ఇంటిని కేవలం 11 సెకెన్లలో ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తుఫానుకు ఎగసిపడుతున్న సముద్రపు అలలు ఆ ఇంటిని సముద్రంలోనికి లాక్కెళ్లిపోవడాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ అందమైన ఇల్లు 1973లో నిర్మితమయ్యింది. ఇంతకాలం ధృడంగా నిలిచిన ఈ ఇల్లు శక్తివంతమైన అలలకు కొట్టుకుపోయింది.ఈ వీడియోను ఆగస్టు 18న @CollinRugg హ్యాండిల్‌తో మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో.. నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున నిర్మించిన ఈ సముద్రతీర ఇల్లు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అట్లాంటిక్‌లో ఎర్నెస్టో హరికేన్ కారణంగా ఈ సంఘటన జరిగింది. ఇంటి యజమాని ఈ నాలుగు బెడ్రూమ్లు, రెండు బాత్రూమ్ ఇంటిని 2018లో సుమారు రూ. 3 కోట్లు ($339,000) వెచ్చించి కొనుగోలు చేశారు’ అని రాశారు.ఈ పోస్ట్‌కు లక్షలాది వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. వందలాది మంది యూజర్స్ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్..‘అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఒక మూర్ఖపు నిర్ణయం’ అని రాశారు. మరొక యూజర్ ‘నార్త్ కరోలినా సముద్రంలో తుఫానులు సర్వసాధారణం. ఈ ఇంటిని కొనుగోలు చేసిన వారు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని ఉండాల్సింది’ అని రాశారు. JUST IN: Beachfront home falls into the Atlantic Ocean on North Carolina’s Outer Banks. The incident was thanks to Hurricane Ernesto which is off the coast in the Atlantic. The unfortunate owners purchased the 4 bed, 2 bath home in 2018 for $339,000. The home was built in… pic.twitter.com/MvkQuXz5SG— Collin Rugg (@CollinRugg) August 17, 2024 -
భూమి రెండో పొర నుంచి... రాళ్ల నమూనా!
బ్రిటన్ భూ భౌతిక శాస్త్రవేత్తలు అత్యంత అరుదైన ఘనత సాధించారు. భూమి రెండో పొర అయిన మ్యాంటల్ (ప్రవారం) నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాలను సేకరించగలిగారు. అట్లాంటిక్ మహాసముద్ర గర్భం నుంచి ఏకంగా 1,268 మీటర్ల మేర లోపలికి తవ్వి మరీ వాటిని వెలికితీశారు! భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించిన శిల నమూనా ఇదే!! భూ ప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్ చేయగలగడమూ ఇదే మొదటిసారి. మహాసముద్రాల్లో డ్రిల్లింగ్ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డున్న నౌక జోయిడిస్ రిజల్యూషన్ సాయంతో ఈ ఘనత సాధించారు. భూమి పుట్టుకకు సంబంధించిన ఇప్పటిదాకా మనకందని పలు కీలక రహస్యాల గుట్టు విప్పడంలో ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకంతగా తెలియని భూ ప్రవారం తాలూకు కూర్పు, అక్కడ నిత్యం జరిగే కీలక రసాయనిక ప్రక్రియల గురించి విలువైన సమాచారం కూడా తెలుస్తోందట. అతి పెద్ద ముందడుగు భూమి ప్రధానంగా మూడు పొరలుగా ఉంటుంది. బాహ్య పొరను పటలం అంటారు. రెండో పొర రాళ్లమయమైన ప్రవారం కాగా అత్యంత లోపలి భాగమైన కేంద్రమండలం మూడో పొర. భూమి మొత్తం పరిమాణంలో ప్రవారం వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో దాగున్న అట్లాంటిస్ పర్వత శ్రేణి నుంచి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ తాజా నమూనాలను సేకరించగలిగారు. భూ ప్రవార శిలా ఖండాలు సముద్ర జలాలతో ఎలా ప్రతిచర్య చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి తాజా నమూనాల విశ్లేషణ బాగా దోహదపడిందట. వందలాది కోట్ల ఏళ్ల కింద భూమిపై తొలిసారిగా జీవం ఎలా పురుడు పోసుకుందో తెలుసుకునే క్రమంలో ఈ తాజా వివరాలను అతి పెద్ద ముందడుగుగా సైంటిస్టులు అభివర్ణిస్తుండటం విశేషం. సేకరణ అంత ఈజీ కాదు...భూ ప్రవార శిలలు మానవాళికి ఇప్పటిదాకా అందరానివిగానే ఉండిపోయాయి. అందుకు కారణం లేకపోలేదు. భూ పలకలు పరస్పరం కలిసే చోట్ల, అదీ సముద్ర గర్భంలో మాత్రమే వాటిని సేకరించే వీలుంది. దాంతో సైంటిస్టులు అదే మార్గంలో ప్రయత్నించి ఫలితం సాధించారు. మహాసముద్ర గర్భంలో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్కు అతి సమీపంలో ఉన్న అట్లాంటిస్ పర్వతశ్రేణి వద్ద ప్రవార శిలలు మనకు గట్టి ప్రయత్నంతో అందేంతటి లోతులోనే ఉంటాయన్న అంచనాతో రంగంలోకి దిగారు. 2024 ఏప్రిల్ నుంచి జోయిడిస్ ఇదే పనిలో గడిపింది. చివరికి జూన్ నాటికి రికార్డు స్థాయి లోతు దాకా డ్రిల్లింగ్ చేసి 886 అడుగుల పొడవున్న శిలా నమూనాను వెతికి తీయగలిగారు. ఈ క్రమంలో సముద్రగర్భం నుంచి 200 మీటర్ల లోతుకు తవ్విన గత రికార్డు తుడిచిపెట్టుకుని పోయింది. పైగా నాటి ప్రయత్నంలో పెద్దగా ప్రవార శిలలేవీ చిక్కలేదు కూడా. కనుక ఎలా చూసినా తాజా నమూనాల వెలికితీత అన్ని రికార్డులనూ బద్దలు కొట్టిందని కార్డిఫ్ వర్సిటీ జియాలజిస్టు, ఈ అధ్యయన సారథి జొహాన్ లీసెన్‌బర్గ్ చెప్పారు. ‘‘ప్రవార శిలను పరిశీలించిన మీదట విలువైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలోని ఖనిజ మూలకాలు వివిధ ఉష్ణోగ్రతల వద్ద సముద్ర జలంతో పలు రకాలుగా ప్రతి చర్య జరుపుతున్నట్టు తేలింది. ఫలితంగా సూక్ష్మజీవజాల ఉనికికి అతి కీలకమైన మీథేన్ వంటి నమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా వీలైనన్ని ఉష్ణోగ్రతల వద్ద వాటిని విశ్లేషించిన మీదట భూమిపై జీవావిర్భావం తాలూకు రహస్యాలెన్నో విడిపోయే అవకాశముంది’’ అని ఆయన వివరించారు. ఈ పరిశోధన వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
South Atlantic: మత్స్యకారుల పడవ మునక.. ఆరుగురు మృతి
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదం సంభవించింది. మత్స్యకారుల పడవ మునిగిపోవడంతో ఆరుగురు మృతిచెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఫాక్లాండ్ దీవుల తీరానికి 200 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 27 మంది ఉన్నారని, వారంతా చేపలు పట్టేందుకు వెళ్తున్నారని బ్రిటిష్, స్పానిష్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పడవ పేరు అర్గోస్ జార్జియా అని, ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిందని స్పెయిన్ అధికారులు తెలిపారు. ప్రమాదం బారినుంచి 14 మందిని రక్షించి, లైఫ్బోట్లో ఎక్కించారని తెలిపారు. చేపల వేటకు వెళ్లినవారిలో స్పెయిన్ దేశానికి చెందినవారితో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం. -
పనామా ట్రాఫిక్‌జామ్!
అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌకలు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కారణమేమిటి? పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం. మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’ పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనేట్ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని ముందుకు వాలింది. ► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు. ► 2013 ఏడాదిలో హెచ్కేఎన్డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది. అంత ఈజీ కాదు... నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే... ► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్‌ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది. ► అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి. ► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే. ► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఇదీ పనామా కథ ► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. ► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. ► దీని పొడవు 80 కిలోమీటర్లు. ► పనామా కాలువ మధ్యలో గతూన్ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు ఈ కాలువకు రిజర్వాయర్‌గా ఉంది. ► ఇటు పసిఫిక్ మహా సముద్రం, అటు అట్లాంటిక్ మహా సముద్రం వైపు కరేబియన్ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్ ఆఫ్ పనామను ఆనుకుని పనామా కాలువ ఉంటుంది. ► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది. ► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి. ఏం జరగనుంది? ► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు. ‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’ – మిషెల్ వైస్ బోక్మ్యాన్, లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు -
టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే..
వాషింగ్టన్: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ అవశేషాలను సందర్శించడానికి వెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్ వాహనం విస్ఫోటం చెందడంతో అందులో ప్రయాణిస్తోన్న అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే జలాంతర్గామి శకలాలను కూడా వెలికితీశారు. ఈ సందర్బంగా మృతులలో ఒకరైన పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ భార్య భర్త, కుమారుడు చివరి రోజుల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన బిలియనీర్ షాహ్జాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ ఈ నాలుగు గంటల సాహస యాత్రకు ముందు మానసికంగా చాలా సిద్ధపడ్డారని తెలిపారు షాహ్జాదా భార్య క్రిస్టీన్ దావూద్. మా అబ్బాయి అయితే టైటానిక్ చూడటానికి వెళ్తున్నానని తెలియగానే చాలా సంబరపడ్డాడు. వాస్తవానికి నేను కూడా వారితో వెళ్లాల్సి ఉండగా అనుకోని పరిస్థితుల్లో ఈ ట్రిప్ వాయిదా పడటంతో నాకు బదులుగా మా అబ్బాయి అందులో ప్రయాణించాడు. ఈ ట్రిప్ జరిగిన రోజున కూడా ఫ్లైట్ ఆలస్యం కావడంతో పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామి మొదలైన చోటు) చేరుకోవడానికి ఆలస్యమైంది. ఆరోజు ఫ్లైట్ మరింత ఆలస్యమైనా బాగుండేది. ఓషన్ గేట్ సంస్థ వారు దీని వలన ఏ ప్రమాదం ఉండడదని చెబుతూ రావడంతో మాకు దాని పనితీరుపై కొంచెమైనా అనుమానం కలగలేదు. కానీ అందులో ప్రయాణం ఇంజిన్ సరిగా పనిచేయని ఫ్లైట్‌లో ఎగరడమేనని ఆరోజు గ్రహించలేకపోయాము. షాహ్జాదా , సులేమాన్ ఇద్దరూ చివరి రోజుల్లో బంక్ బెడ్ ల మీద పడుకోవడం, బఫెట్ తరహా భోజనాలు అలవాటు చేసుకోవడం, తరచుగా టైటానిక్ సినిమాను చూసేవారని చెప్పుకొచ్చారు. జలాంతర్గామి నీటిలోపలికి వెళ్ళగానే అందులోని లైట్లన్నిటిని ఆర్పేస్తారని మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ చిన్న వెలుతురులో చుట్టూ ఉన్న చేపలను మాత్రం చూడవచ్చని ఓషన్ గెట్ సంస్థ చెప్పినట్లు తెలిపారు క్రిస్టీన్. ఏదైతేనేం సరైన ప్రమాణాలు పాటించని ఈ ట్రిప్ నిర్వాహకుల అజాగ్రత్త, ప్రయాణికుల అవగాహనలేమి కలగలిసి విహారయాత్ర కాస్తా విషాద యాత్రగా ముగిసింది. ఇది కూడా చదవండి: రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్.. -
OceanGate: మళ్లీ ఛలో టైటానికా? సిగ్గుండాలి
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అండర్‌వాటర్ టూరిజం కంపెనీ ఓషన్‌గేట్ తీరుపై మరోసారి తారాస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఐదుగురి ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం జరిగి పట్టుమని పదిరోజులు గడవక ముందే.. టైటానిక్ శకలాలు చూద్దమురారండి అంటూ యాడ్స్‌తో మళ్లీ ఊదరగొడుతోంది. అట్లాంటిక్‌లో మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానమంటూ తాజాగా ఓషన్‌గేట్ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. ఒక వైపు శకలాలను బయటకు తీసుకురావడం.. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓషన్‌గేట్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లకు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య, అలాగే 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్ చేసినట్లు ఓషన్‌గేట్ కంపెనీ ఆ ప్రకటనల్లో పేర్కొంది. టికెట్ ధరను 2,50,000 డాలర్లుగా ప్రకటించింది. అయితే అది టైటాన్‌లోనా? మరేయిత సబ్‌మెర్సిబుల్‌లోనా? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక సబ్ పైలట్ పొజిషన్ కోసం సైతం కంపెనీ ఓ యాడ్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే.. టైటాన్ శకలాల గాలింపు కొనసాగిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోగా.. విమర్శల నేపథ్యంలో ఆ జాబ్ యాడ్‌ను తొలగించింది ఓషన్‌గేట్. టైటాన్ విషాదం తర్వాత వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ఓషన్‌గేట్ ఇకపై ఇలాంటి టూర్లు నిర్వహించదని అంతా భావించారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే కదా. కానీ, అనూహ్యంగా కంపెనీ మళ్లీ టైటానిక్ టూర్‌ను నిర్వహించేందుకు రెడీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓషన్‌గేట్ టైటాన్ ప్రయాణంపై గతంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. సబ్ మెర్సిబుల్ నిర్మాణం అట్లాంటిక్ లోతుల్లో ప్రయాణానికి అనుకూలం కాదంటూ పలువురు నిపుణులు తేల్చేశారు కూడా. పైగా వీడియో గేమ్‌ల తరహా రిమోట్‌కంట్రోల్‌తో టైటాన్‌ను కంట్రోల్ చేయించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ టైటాన్‌తోనే టూరిజం వైపు మొగ్గు చూపించి.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది కంపెనీ. ఇదీ చదవండి: ఐదు కోట్ల మందికి మూడేసి చొప్పున పుట్టిన తేదీలు! -
ఒడ్డుకు చేరిన టైటాన్, కుళ్లిన స్థితిలో అవశేషాలు?
న్యూయార్క్: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ పడవ సందర్శనం కోసం వెళ్లి.. ఐదుగురు దుర్మరణం పాలైన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఐదుగురిని నీటి అడుగునకు మోసుకెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్.. వాళ్ల పాలిట మృత్యు శకటంగా మారింది. అయితే ఎట్టకేలకు ఆ శకలాలను అధికారులు బయటకు తీసుకొచ్చారు!. జూన్ 18వ తేదీ ప్రారంభమైన టైటాన్ ప్రయాణం.. కాసేపటికే విషాదంగా ముగిసింది. తీవ్ర ఒత్తిడితో ఈ మినీ జలంతర్గామి పేలిపోగా.. అందులోని ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కానీ, నాలుగు రోజుల తర్వాత టైటాన్ ప్రమాదంపై యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక అట్లాంటిక్‌లో నీటమునిగిన టైటానిక్ పడవ ముందుభాగంలో 1,600 అడుగుల వద్ద.. దాదాపు 6.5 మీటర్ల పొడవు, 10,431 కిలోల దాకా బరువున్న టైటాన్ కూరుకుపోయినట్లు గుర్తించినట్లు ఇంతకు ముందు అధికారులు ప్రకటించారు. అతికష్టం మీద ఆ శకలాలను బయటకు తెచ్చినట్లు అమెరికా తీర రక్షణ దళం అధికారికంగా బుధవారం ఉదయం ప్రకటించింది. ఎస్యూవీ కారు సైజులో ఉండే టైటాన్ సబ్‌ను అతికష్టం మీద బయటకు తెచ్చారట. న్యూయార్క్‌కు చెందిన పెలాజిగ్ రీసెర్చ్ కంపెనీ తన ఒడీస్సెస్ రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్‌ను సబ్మెర్సిబుల్ వెతుకలాట కోసం ఉపయోగించింది. శకలాలను బయటకు తీయగానే.. అది తన ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించింది. అతిజాగ్రత్తగా బయటకు తీసిన శకలాల నుంచి మానవ అవశేషాలను బయటకు తీస్తారని, వాటిని వైద్య పరిశోధకులు పరిశీలిస్తారని యూఎస్ కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. తద్వారా ప్రమాదం జరిగిన తీరు.. వాళ్లెలా చనిపోయారనేదానిపై ఓ అంచనానికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే కెనడా అధికారులు మాత్రం శకలాల వెలికితీత అంశంపై స్పందిచకపోవడం గమనార్హం. బ్రిటిష్ సాహసికుడు హమీష్ హర్దింగ్, ఫ్రెంచ్ సబ్‌మెరిన్ ఎక్స్పర్ట్ పాల్ హెన్రీ, పాక్-బ్రిటిష్ బిలియనీర్ షాహ్జాదా దావూద్.. అతని థనయుడు సులేమాన్, ఈ మొత్తం ప్రయాణానికి కారణమైన ఓషన్‌గేట్ సీఈవో స్టాక్టన్ రష్‌లు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై యూఎస్కోస్ట్ గార్డు హయ్యెస్ట్ లెవల్ దర్యాప్తు ‘‘ మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’’కు ఆదేశించింది కూడా. The US Coast Guard said on Wednesday that it has recovered "presumed human remains" from the wreckage of the #Titan submersible. https://t.co/I9Hh5U8iku pic.twitter.com/9eCWdaMOFj — China Daily (@ChinaDaily) June 29, 2023 ఇదీ చదవండి: అట్లాంటిక్‌లో టైటాన్ ప్రమాదం.. అసలు జరిగింది ఇదే -
టైటాన్ విషాదం: వాళ్ళ చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు
యూఎస్: ఇటీవల అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లి దురదృష్టవశాత్తూ అటునుంచటే అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఐదుగురు. వారిలో పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు కూడా ఉన్నారు. దావూద్ తన కుమారుడితో చివరిగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఆయన భార్య క్రిస్టీన్ దావూద్. గంటలు గడిచే కొద్దీ.. పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ దావూద్ సముద్ర గర్భంలోకి సాహసయాత్రకు వెళ్లగా వారు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తారని పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామికి అనుబంధ పడవ) పైన క్రిస్టీన్ కూతురితో ఎదురుచూస్తూ ఉన్నారు. టైటాన్ జలాంతర్గామి తప్పిపోయిందనగానే ఏమాత్రం భయపడని ఆమె గతంలో కూడా ఒకసారి తన భర్త విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నారని తాను ధైర్యం కూడదీసుకుని అందరికీ ధైర్యం చెప్పారు. కానీ ఎప్పుడైతే 96 గంటలు గడిచాయో అప్పుడే ఆశలు వదులుకున్నట్లు ఆమె తెలిపారు. అమ్మా గిన్నిస్ రికార్డు సాధిస్తా.. ఈ సందర్బంగా చివరిగా తన భర్త, కుమారుడితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ.. టైటానిక్ శకలాలను చూడటానికి వెళ్తున్నానని సులేమాన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తనతో పాటు రూబిక్ క్యూబ్ ని తీసుకుని వెళ్లి సముద్రగర్భంలో రూబిక్ క్యూబ్ అమర్చిన మొట్టమొదటిగా వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని సంబరపడ్డాడని, అందుకోసం దరఖాస్తు కూడా చేశాడని తెలిపారు. ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేయాలని తన భర్త తనతోపాటు కెమెరాని కూడా తీసుకు వెళ్లినట్లు చెప్పారు. చివరికి.. వారు వెళ్లి 96 గంటలు గడిచాయని చెప్పగానే నాకు కీడు శంకించింది, విపత్తును గ్రహించాను. కానీ నా కూతురు మాత్రం వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకంతోనే ఉంది. తీర రక్షక దళాలు జలాంతర్గామి శకలాలు కనిపించాయని చెప్పాక గాని తను నమ్మలేదని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. Christine Dawood wanted to talk to the BBC and pay tribute to the son and husband she lost. #Titan Longer interview running on @BBCWorld on-air and online 🎥 @robtaylortv @EloiseAlanna pic.twitter.com/q1LW946xpn — Nomia Iqbal (@NomiaIqbal) June 25, 2023 ఇది కూడా చదవండి: ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ.. -
‘టైటాన్ మునుగుతుందని ముందే చెప్పా’.. అందుకే జాబ్ నుంచి పీకేశారు!
అట్లాంటిక్ మహా సముద్రంలో ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో ఓషన్ గేట్ యజమాని సహా ఐదుగురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. టైటానిక్ ఓడ శిథిలాల ఉన్న చోటుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన టైటాన్ జలాంతర్గామి నిర్మాణ సమయంలోనే అందులో లోపాలు ఉన్నట్లు ఓ నిపుణుడు గుర్తించాడు. ఈ విషయాన్ని యాజమాన్యం వద్దకు తీసుకెళ్లగా.. వారు ఆయన మాటలను వినిపించుకోలేదు. పైగా లోపాలను చెప్పిన ఆ నిపుణుడిని ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. అసలేం జరిగిందంటే.. ‘టైటాన్’ జలాంతర్గామి నిర్మాణ జరుగుతుండగా… దాని సామర్థత మీద ఆ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఓ నిపుణుడికి సందేహాలు మొదలయ్యాయి. దాంతో టైటాన్‌కు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి అవసరం ఉందని, నౌక తీవ్రమైన లోతులకు చేరినప్పుడు ప్రయాణికులకు ముప్పు తలెత్తే అవకాశముందని 2018లోనే ‘ఓషన్ గేట్’ సంస్థ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ తన నివేదికలో విశ్లేషించాడు. దీనిపై అప్పట్లో అమెరికాలోని సియాటెల్ జిల్లా కోర్టులో వ్యాజ్యం సైతం దాఖలైంది. కంపెనీ విషయాలను బహిర్గతం చేస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ ఆ నిపుణుడు మీద ‘ఓషన్ గేట్’ సంస్థ వ్యాజ్యం వేసింది. మరో వైపు ‘టైటాన్’ భద్రత గురించి, దాని లోపాలు ఎత్తిచూపానని, పరీక్షల గురించి ప్రశ్నించినందుకు తనను ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారంటూ సదరు వ్యక్తి కూడా కౌంటర్ దాఖలు చేశాడు. కంపెనీ ఆ రోజే నిర్మాణంలో నాణ్యత, భద్రత విషయంలో శ్రద్ధ చూపించి ఉంటే ఐదుగురు ప్రాణాలు గాల్లో కలిసేవి కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. చదవండి: ప్రయాణం.. విషాదాంతం -
టైటాన్ జలాంతర్గామిలో మేము వెళ్ళాలి.. కానీ అదృష్టవశాత్తూ..
అమెరికా: అట్లాంటిక్ మహా సముద్రంలో ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో ఓషన్ గేట్ యజమాని సహా ఐదుగురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ ల స్థానంలో తానూ తన కుమారుడు ప్రయాణించాల్సి ఉందని కానీ చివరి నిముషంలో తప్పుకోవడంతో ప్రాణాలు నిలుపుకున్నామాని అన్నారు లాస్ వేగాస్ కు చెందిన పెట్టుబడిదారుడు జే బ్లూమ్. జీవితంలో ఇలాంటి అనుభూతిని ఒక్కసారైనా పొందాలని, సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూడటమంటే అదృష్టముండాలని ఎలాగైనా తనను ఈ సాహస యాత్రకు ఒప్పించే ప్రయత్నం చేశారు ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ రష్. అయినా కూడా నాకెందుకో ఆ బుల్లి జలాంతర్గామి భద్రత విషయమై ఎక్కడో అనుమానం ఉండేది. రష్ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఒక హెలికాఫ్టర్‌లో ప్రయాణం కంటే ఇది చాలా సురక్షితమైనది చెప్పేవారు. కానీ ఎందుకో నా మనసు అంగీకరించక నేను చివరి నిముషంలో అతడి అభ్యర్ధనను తిరస్కరించానని చెప్పుకొచ్చారు జే బ్లూమ్. లేదంటే పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ స్థానంలో తానూ.. అతని కుమారుడు సులేమాన్ స్థానంలో 20 ఏళ్ల మా అబ్బాయి సీన్ ఉండేవారమని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు బ్లూమ్. ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ ఎంతగా చెప్పినా కూడా బ్లూమ్ ఒప్పుకోవకపోవడానికి ఆ వాహనం రిమోట్ ఆపరేటింగ్ వాహనం కావడం కూడా ఒక కారణమని చెప్పారు జె బ్లూమ్. సొంతంగా ఒక హెలికాఫ్టర్ ఉన్న బ్లూమ్ కు టైటాన్ భద్రతా ప్రమాణాలపై చాలా అనుమానాలు ఉండేవి. ఆరోజు నాకున్న స్పష్టమైన అవగాహన కారణంగానే నేను ఈ యాత్రకు ఒప్పుకోలేదు. అందుకే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామని, షాహ్జాదా దావూద్ - సులేమాన్ ఫోటోలు చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తుకు వస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: ఈజిప్టులో మోదీ తొలి అడుగు -
ప్రయాణం.. విషాదాంతం
బోస్టన్: ఒకరు ‘టైటానిక్’ నిపుణుడు.. మరొకరు సాహసి..ఇంకొకరు సీఈవో..ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకు..! వీరంతా ‘టైటాన్’అనే మినీ సబ్‌మెరైన్‌లో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్తూ అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయ్యారు. ఈ అయిదుగురూ మృతి చెందినట్లు భావిస్తున్నామని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యూఫౌండ్‌ల్యాండ్ రాష్ట్రం సెంట్ జాన్స్‌కు సుమారు700 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం ‘టైటాన్’సముద్రాంతర యాత్రకు బయలుదేరింది. టైటానిక్ వైపుగా నీటి అడుగుకు ప్రయాణం ప్రారంభించిన 1.45 గంటలకే ప్రధాన నౌక పోలార్ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. అందులోని ఆక్సిజన్ నిల్వలు గురువారం ఉదయం 6 గంటల వరకు మాత్రమే సరిపోతాయి. దీంతో, అమెరికా, కెనడా విమానాలు, నౌకలు, రోబోల సాయంతో టైటాన్ జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. చివరికి, టైటాన్ శకలాలను తమ రోబో టైటాన్ శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉన్న ఓషన్ గేట్ సంస్థ చీఫ్ పైలట్, సీఈవో స్టాక్టన్ రష్, సాహసి హామిష్ హార్డింగ్,, పాక్ జాతీయుడైన వాణిజ్యవేత్త షహ్జాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, టైటానిక్ నిపుణుడు నర్గియెలెట్ మృతి చెందారని తెలిపింది. అయితే, అది ఎందుకు? ఎలా? ఎప్పుడు? ప్రమాదం బారిన పడి ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తామన్నారు. -
టైటాన్ షిప్ పక్కనే శకలాలను గుర్తించిన అమెరికా కోస్ట్ గార్డ్
-
సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు
ఎప్పుడో వందేళ్ల కిందట.. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. టైటాన్ అనే మినీ సబ్‌మెరిన్(సబ్ మెర్సిబుల్)లో వీక్షణకు బయల్దేరి.. సముద్ర గర్భంలోనే కలిపిపోయారు వాళ్లు!. దాదాపు ఐదురోజులపాటు ప్రపంచం మొత్తం వాళ్ల జాడ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చింది. అమెరికా తీర రక్షణ దళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీంలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గురువారం నాడు గంట గంటకు ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారం.. చివరకు శకలాల గుర్తింపు ప్రకటనతో విషాదాంతంగా ముగిసింది. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటన ప్రకారం.. టైటానిక్ శకలాల సమీపంలోనే ఓడ ముందుభాగం నుంచి సుమారు 1,600 అడుగుల దూరంలో టైటాన్ శిథిలాలు పడి ఉన్నాయి. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్(ROV) వీటిని గురువారం ఉదయం గుర్తించినట్లు ప్రకటించింది కోస్ట్‌గార్డ్. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఐదుగురితో కూడిన ‘టైటాన్’ సాహసయాత్ర ప్రారంభం అయ్యింది. పోలార్ ప్రిన్స్ అనే నౌక సాయంతో టైటాన్‌ను నీటి అడుగుకు పంపించారు. గంటన్నర తర్వాత.. పోలార్‌ప్రిన్స్‌తో టైటాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే అమెరికా తీర రక్షణ దళం దృష్టికి తీసుకెళ్లింది ఈ యాత్ర నిర్వాహణ సంస్థ ఓషన్‌గేట్. న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్‌లో టైటాన్ అదృశ్యమై ఉంటుందని భావించింది కోస్ట్‌గార్డ్. అప్పటి నుంచి 13,000 అడుగుల (4,000 మీటర్లు) లోతుల్లో టైటాన్ జాడ కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు మొదటి నుంచి వేసిన అంచనా కొంతవరకు నిజమైంది కూడా. ఇలా జరిగిందేమో.. విపత్తు పేలుడు..Catastrophic Implosion టైటాన్ ప్రమాదానికి కారణం ఇదేనని యూఎస్ కోస్ట్‌గార్డ్ ఓ అంచనా వేస్తోంది. నీటి అడుగుకు వెళ్లే క్రమంలో.. ఛాంబర్లోని ఒత్తిడి వల్లే మినీసబ్‌మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని ప్రకటించింది. అయితే.. నీటి అడుగున సబ్మెర్సిబుల్(మినీజలంతర్గామి) విషయంలోనే కాదు.. సబ్మెరిన్ల(జలంతర్గాముల) విషయంలోనూ ఇది జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక అంతర్గత ఒత్తిడి వల్ల సబ్మెరిన్లు ఒక్కోసారి ఆగిపోయి.. నీటి అడుగుకు వెళ్లిపోతాయట. ఒక్కోసారైతే ఆ ఒత్తిడి భరించలేక అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. టైటాన్ పేలిపోయిన ఖచ్చితమైన క్షణం మాత్రం చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయే అవకాశమే ఉంది. ఒకవేళ టైటాన్ శకలాల చెంత మృతదేహాల జాడ కనిపించినా.. అట్లాంటిక్ అడుగున ఉన్న వాతావరణం నుంచి బయటకు తేలేని పరిస్థితి ఉందని యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటించింది. 🚨 Breaking News All five people onboard on #Submersible are all very sadly died, #OceanGate confirms. This video shows how the accident happened with the submarine. 💔#Titanic #Titan pic.twitter.com/W82X9OawuD — WOLF™️ (@thepakwolf) June 22, 2023 ఆది నుంచి విమర్శలే.. వాషింగ్టన్ ఎవరెట్టెకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఓషన్‌గేట్. 2009లో స్టాక్టన్ రష్, గుయిలెర్మో సోహ్నలెయిన్‌లు దీనిని స్థాపించారు. నీటి అడుగున టూరిజంతో పాటు అన్వేషణలకు, పరిశోధనలు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అందుకుగానూ ఛార్జి చేస్తుంటుంది. 2021 నుంచి టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ అనే సబ్ మెర్సిబుల్ ద్వారా యాత్రికులను తీసుకెళ్తూ వస్తోంది. ఈ అడ్వెంచర్ టూర్లో 400 మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. టైటాన్లో.. ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. వాళ్లకు తగ్గట్లే సీటింగ్ ఉంటుంది. దాదాపు 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల దాకా బరువు ఉంటుంది. కార్బన్, టైటానియం కలయిక గోడలు ఉన్నాయి. సోనార్ నేవిగేషన్ సిస్టమ్, హైఎండ్ కెమెరా ఎక్విప్మెంట్, పవర్ఫుల్ ఎల్ఈడీ లైట్లు.. వీటితో పాటు లోపలికి ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒక్కటే ద్వారం ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. తాజాగా వెళ్లిన ఐదుగురికి(ఒక పైలట్, మిగిలిన నలుగురు యాత్రికులు) 2.50 లక్షల డాలర్లు చెల్లించారు. మన కరెన్సీ లెక్కలో.. అది రూ.2 కోట్లకు పైమాటే. అయితే టైటాన్ నిర్మాణం అట్లాంటిక్ అగాధంలోకి వెళ్లడానికి పనికిరాదంటూ మొదటి నుంచి కొందరు నిపుణులు మొత్తుకుంటున్నా.. ఓషన్‌గేట్ మాత్రం యాత్రలు నిర్వహిస్తూనే వస్తోంది. అంతేకాదు దానిని ఆపరేట్ చేసేందుకు ఉపయోగించే రిమోట్ విషయంలోనూ తీవ్ర విమర్శలు.. మరోవైపు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. టైటానిక్ శకలాలకు చూసేందుకు గతంలో ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ప్రయత్నించి భంగపడ్డాయి. అయితే చాలామంది నిపుణులు ఈ యాత్రను ఆత్మహత్య సదృశ్యంగా వర్ణించారు కూడా. ఇదీ చదవండి: టిక్.. టిక్.. టిక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ కోసం.. డబ్బే కాదు.. గుండెధైర్యం ఉన్నోళ్లు కూడా! ‘టైటాన్ సబ్మెర్సిబుల్’ మొత్తం ఐదుగురు టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి యాత్రలకు ఎంపిక ప్రక్రియ కూడా పకడ్బందీగానే జరుగుతుంది. అయితే ఈసారి యాత్రలో వెళ్లిన వాళ్లంతా.. గతంలో సాహస యాత్రలు చేసిన అనుభవం ఉన్నవాళ్లూ ఉన్నారు. కానీ, ఈసారి సాహసయాత్ర వాళ్లను ప్రాణాలను బలిగొంది. డాషింగ్ అండ్ డేరింగ్ హార్డింగ్.. బ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్‌లు. బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. షాజాదా.. కరాచీ కేంద్రంగా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. సర్రేలో భార్యా, ఓ కూతురు, కొడుకుతో ఆయన సెటిల్ అయ్యారు. దావూద్‌కు యూకేలోని ఉన్నతవర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పలు సాహస యాత్రల్లో పాల్గొన్నారు కూడా. ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్.. ఓషన్‌గేట్ సహవ్యవస్థాపకుడు. ట్రైనింగ్ పైలట్ అయిన రష్.. గతంలో టైటానిక్ శకలాలను చూసి వచ్చారు కూడా. నిపుణుడి హోదాలో ఆయన ఆ బృందం వెంట వెళ్లారు. ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్.. నౌకాదళంలో కమాండర్‌గా పని చేసిన అనుభవం ఉంది ఈయనకి. అత్యంత లోతైన ప్రదేశాల్లో పని చేసే టీంలకు ఈయన కెప్టెన్‌గా వ్యవహరించారు. నావికుడిగా పాతికేళ్ల అనుభవమూ ఉంది. ది ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సీలో చేరి.. ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ పర్యటనలకు వెళ్లారాయన. విలాసవంతమైన టైటానిక్ నౌక.. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. ఇదీ చదవండి: వేల అడుగుల లోతుల్లో టైటానిక్.. మీరూ చూసేయండి -
టైటాన్ విషాదం.. అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!
-
టైటాన్ ఆశలు జల సమాధి
దుబాయ్/బోస్టన్: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉదంతం.. విషాదాంతం అయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ శకలాలను తిలకించడానికి టైటాన్ మినీజలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!. టైటాన్ శకలాలను టైటానిక్ సమీపంలోనే గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటించింది. ఓవైపు ఉత్కంఠగా అన్వేషణ కొనసాగుతున్న తరుణంలో.. ప్రాణవాయువు(ఆక్సిజన్) ముగిసిపోయే అంచనా గడువు దగ్గరపడుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడంది. తాము నీటి అడుగుకు పంపించిన రిమోటెడ్ ఆపరేటెడ్ వెహికిల్.. శకలాలను గుర్తించిందని వెల్లడించింది. అవి టైటాన్వేనని భావిస్తున్నట్లు తెలిపింది. ‘తమ సంస్థ చీఫ్ పైలట్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ప్రయాణికులైన షహ్జాదా దావూడ్, ఆయన కొడుకు సులేమాన్ దావూద్, హామిష్ హార్డింగ్, పౌల్–హెన్రీ నర్గియెలెట్ మృతి చెందారు’అని ఓషన్ గేట్ తెలిపింది. అయితే, వారు ఎలా ప్రాణాలు కోల్పోయారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఆదివారం ఉదయం బయలుదేరిన సమయంలో టైటాన్లో దాదాపు 96 గంటలపాటు మాత్రమే శ్వాసించేందుకు అవసరమైన ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కూడా ముగిసిపోయింది. గురువారం ఉదయానికల్లా జలాంతర్గామిలో ఆక్సిజన్ ఇక పూర్తిగా నిండుకున్నట్లే. అయితే, టైటాన్ గల్లంతైన రోజే వారు మరణించారా? అంటే..ఆ పరిస్థితిని కూడా కొట్టిపారేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టైటాన్ ఆదివారం ఉదయం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. టైటాన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాలుగా మారింది. అమెరికా కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో టైటాన్ కోసం తీవ్ర అన్వేషణ కొనసాగించింది. సెర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని నౌకలు, విమానాలను, ఇతర పరికరాలను రంగంలోకి దించారు. ఫ్రెంచ్ పరిశోధక సంస్థ కెమెరాలు, లైట్లతో కూడిన డీప్–డైవింగ్ రోబోట్‌ను సముద్రంలోకి పంపించింది. A debris field was discovered within the search area by an ROV near the Titanic. Experts within the unified command are evaluating the information. 1/2 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 Coast Guard holds press briefing about discovery of debris belonging to the 21-ft submersible, Titan. #Titanic https://t.co/aPSeEaBuG8 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 -
ఆక్సిజన్ అయిపోయింది.. అయిదుగురి ప్రాణాలపై సన్నగిల్లుతున్న ఆశలు
అట్లాంటిక్ మహా సముద్రం గల్లంతైన టైటానిక్ సబ్‌మెరైన్ ఆచూకీ కోసం భారీ ఎత్తున రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయిదుగురు పర్యాటకులతో ఆదివారం బయల్దేరిన జలంతర్గామి కనిపించకుండా పోయి 96 గంటలు కావొస్తుంది. అయినా దీని ఆచూకీ లభించలేదు. మరో వైపు మినీ సబ్‌మెరైన్‌లోని ఆక్సిజన్ సరఫరా కూడా దగ్గర పడింది. జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కాస్తా గడిచిపోవడంతో సందర్శకుల క్షేమంపై క్షణం క్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. ఆక్సిజన్ అయిపోవడంతో వారు ప్రాణాలతో తిరిగొస్తారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. కాగా టైటాన్ జలాంతర్గామి సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల(3,800 మీటర్లు) లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిని కనుగునేందుకు యూఎస్ కోస్ట్ గార్డుతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెస్క్యూసిబ్బంది రంగంలోకి దిగి పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. అమెరికా, కెనడాకు చెందిన యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, భారీ నౌకలను రంగంలోకి దించిసముద్రాన్నే జల్లెడ పడుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సముద్రపు రోబోలను సైతం మోహరించారు. అయితే గల్లంతైన టైటాన్ సముద్ర గర్భంలో ఏవైనా శకలాల మధ్య చిక్కుకుపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఈ రోబో జలాంతర్గామి సహాయం తీసుకున్నారు. సముద్రంలో దాదాపు 4 కిలోమీటర్ల లోతు వరకు రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. గాలిస్తున్న ప్రాంతం.. అమెరికాలోని ఓ రాష్ట్రంకంటే పెద్దగా ఉంటుందట. అందుకే ఆ ప్రాంతాన్నంతా గాలించడం అత్యంత కష్టంగా మారింది. టైటానిక్ నౌక శిథిలాల ఉన్న ప్రాంతాన్ని మిడ్నైట్ జోన్‌గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యంత శీతలంగా ఉంటాయి. అంతేగాక పూర్తిగా చీకటి ఉంటుంది. సబ్మెర్సిబుల్లో ఉన్న లైట్లతో కేవలం కొంత దూరం వరకే కనిపిస్తుందని, దాదాపు రెండున్నర గంటల పాటు కటిక చీకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఉడికి ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. మొత్తం 9 దేశాలు.. టాప్‌లో మనమే! మరోవైపు టైటానిక్ నౌక శకలాలు ఉన్న 12వేల అడుగుల లోతున వాతావరణ పీడనం అధికంగా ఉటుందని నిపుణులు చెబుతున్నారు. భూ ఉపరితలంతో పోలిస్తే అక్కడి పీడనం 380 రెట్లు అధికంగా ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక అయిదుగురు వ్యక్తులతో బయల్దేరిన సబ్‌మెరైన్ కేవలం రెండు గంట్లోనే కమ్యూకేషన్ కోల్పోయిన విషయం విదితమే. ఈ మినీ సబ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు సంపన్నులు, బ్రిటన్ బిలియనర్ హమీష్ హార్డింగ్ మరో ముగ్గురు ఉన్నారు. వీరి ఆచూకీ కోసం భారీగా రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సిబ్బందికి కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ అవి కచ్చితంగా ఎక్కుడనుంచి వస్తున్నాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ రెస్క్యూ ఆపరేషన్
బోస్టన్: ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ సందర్శన కోసం వెళ్లి గల్లంతయిన జలాంతర్గామి ‘టైటాన్’ జాడ ఇంకా తెలియరాలేదు. టైటాన్‌లోని ఐదుగురు సందర్శకుల పరిస్థితి ఏమిటన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారి ఆచూకీ గుర్తించేందుకు అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, సముద్ర అంతర్భాగం నుంచి శబ్దాలు వెలువడుతున్నట్లు కెనడా సైనిక నిఘా విమానం కనిపెట్టడం ఆశలు రేకెత్తిస్తోంది. టైటాన్ గల్లంతయినట్లు భావిస్తున్న ప్రాంతం నుంచి ప్రతి 30 నిమిషాలకోసారి బిగ్గరగా శబ్దాలు వెలువడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ శబ్దాలు టైటాన్‌కు సంబంధించినవేనా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టైటాన్లో కొంత ప్రాణవాయువు ఇంకా మిగిలే ఉందని, సందర్శకుల ప్రాణాలకు ఇప్పటికిప్పుడు అపాయం వాటిల్లకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. గురువారం ఉదయానికల్లా ఆక్సిజన్ మాయం! టైటాన్ ఆచూకీ కోసం జాన్ కాబోట్, స్కాండీ విన్‌ల్యాండ్, అట్లాంటక్ మెర్లిన్ అనే మూడు పడవలను అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దించారు. టైటాన్ జలాంతర్గామి ప్రస్తుతం సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల(3,800 మీటర్లు) లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సామాన్యమైన లోతు కాదు. అక్కడిదాకా సురక్షితంగా చేరుకోవడం కష్టమైన పని అని చెబుతున్నారు. అండర్‌వాటర్ రోబోను పంపించినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల కోసం అమెరికా సైన్యానికి చెందిన మూడు సి–17 రవాణా విమానాలను పంపించినట్లు యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ అధికార ప్రతినిధి చెప్పారు. ఒక పెట్రోలింగ్ విమానం, రెండు ఓడలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని కెనడా సైన్యం ప్రకటించింది. గురువారం ఉదయానికల్లా టైటాన్లో మొత్తం ఆక్సిజన్ ఖర్చయిపోతుంది. అప్పటిలోగా దాని జాడ తెలియకపోతే అందులోని సందర్శకులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ జలాంతర్గామి టైటానిక్ దిశగా తన ప్రయాణం ప్రారంభించింది. సరిగ్గా నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే అందులో ఉంది. టైటాన్లో రెండు రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. నీటిలోకి వెళ్లిన 1.45 గంటల లోపే అవి పనిచేయడం ఆగిపోయింది. క్షేమంగా రావాలంటూ.. టైటాన్ గల్లంతు కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐదుగురు సందర్శకులు క్షేమంగా తిరిగిరావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వివిధ దేశాల అధినేతలు పేర్కొన్నారు. సందర్శకుల క్షేమాన్ని కోరుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టైటాన్లో ఓషియన్గేట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమిష్ హర్డింగ్, పాకిస్తాన్‌కు చెందిన తండ్రీకొడుకులు షహజాదా, సులేమాన్ దావూద్, ఫ్రెంచ్ నావికాదళం మాజీ అధికారి పాల్–హెన్రీ నార్జియోలెట్ ఉన్నారు. వీరంతా 1912లో అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను సందర్శించడానికి టైటాన్ జలాంతర్గామిలో వెళ్లారు. ఆదివారం రాత్రి కెనడా తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ సముద్రంలో టైటాన్ గల్లంతయ్యింది. ఇదీ చదవండి: సాహస వీరుడు.. మహాసాగరంలో ఇరుక్కుని.. -
గల్లంతైన టైటాన్లో బ్రిటిష్ బిలియనీర్.. ఏవరీ హమీష్ హార్డింగ్?
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాల్ని చూడటానికి వెళ్లిన పర్యాటక జలంతర్గామి (Submarine)ఆదివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో అందులో ముగ్గురు టూరిస్ట్లతోపాటు మరో ఇద్దరు ఉన్నారు. సబ్ మెర్సిబుల్ గల్లంతై మూడు రోజులు దాటినా ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. దీంతో అంట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన జలాంతర్గామిని గుర్తించేందుకు అమెరికా, కెనాడా కోస్ట్‌గార్డ్ దళాలు ముమ్మరంగా జల్లెడపడుతున్నాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న జలగర్భాల్లో ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను, పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలో దించారు. కాగా మిస్సైన జలంతర్గామి ‘టైటానిక్ సబ్మెర్సిబుల్’లో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్, బ్రిటిష్ సంపన్నుడు, వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. చదవండి: టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్‌కు బిగ్ ఫెయిల్యూర్..? బ్రిటిష్ బిలియనీర్ అయితేబ్రిటన్కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాక్ సంపన్నులు బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. ఈ మేరకు వారి కుటుంబం ధృవీకరించింది. షాజాదా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. చదవండి: Titanic Sub: ఆక్సిజన్ అయిపోతోంది.. టైటాన్ జాడేది? కాగా ఓషియన్ గేట్ అనే సంస్థ టైటానిక్ శకలాల సందర్శన యాత్రను నిర్వహిస్తోంది. ఇందుకు ‘టైటాన్’ పేరుతో 21 అడుగుల పొడవైన మినీ జలంతర్గామిని వాడుతోంది. ఈ ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2 కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఈ సాహసయాత్ర ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే జలంతార్గామితో పోలార్ ప్రిన్స్‌కు సంబంధాలు ఎతగిపోయాయి. దీంతో టైటాన్ ఆచూకీ కనుగునేందుకు కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో 13,000 అడుగుల (4,000 మీటర్లు) నీటి లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్‌లో కోస్ట్‌గార్డ్‌లు గాలిస్తున్నారు. ఇక విలాసవంతమైన టైటానిక్ షిప్ 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. అక్కడి శిథిలాలను చూసేందుకు వెళ్తున్నప్పడే జలాంతర్గామి అదృశ్యమైంది. ఇక జలాంతర్గామిలో కొద్ది గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉండటంతో సమయం గడుస్తున్నా కొద్దీ వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. -
Titanic Sub: ఆక్సిజన్ అయిపోతోంది.. టైటాన్ జాడేది?
దాదాపు రెండు రోజులు గడిచాయి. సమయం గడిచే కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రాణవాయివు కొద్దిగంటలకే సరిపడా ఉండడంతో.. అదృశ్యమైన మినీ జలంతర్గామిలోని వాళ్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన నెలకొంది. దీంతో అట్లాంటిక్ లోతుల్లో వెతుకులాటను వేగవంతం చేశారు. కానీ, రెండు మైళ్ల కంటే ఎక్కువ లోతులో.. 20వేల చదరపుకిలోమీర్ల విస్తీర్ణం ఉన్న ఆ ప్రాంతంలో అదంతా సులువు అయ్యే పనేనా?. చిమ్మచీకట్లు.. గడ్డకట్టుకుపోయే చలి.. పైగా సముద్రపు బురద.. ఆ అగాథంలో ఎదురుగా ఏమున్నదనేది ఎంత వెలుగుతో వెళ్లినా కనిపించని స్థితి.. మొత్తంగా అంతరిక్షంలోకి వెళ్లినట్లే ఉంటుందట అక్కడి పరిస్థితి. అట్లాంటిక్ మహా సముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. ఇందులో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఉంది. ఆ మినీ సబ్‌మెరైన్‌లో కొద్దిగంటలపాటు సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో గంట గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. జలాంతర్గామిని కనుగొనేందుకు అమెరికా, కెనడా రక్షణ బృందాలు రంగంలోకి దిగినా.. కష్టతరంగా మారింది రెస్క్యూ ఆపరేషన్. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్ హార్డింగ్, పాకిస్థాన్ బిలియనీర్ షాజాదా దావూద్.. ఆయన కొడుకు సులేమాన్, మరో ఇద్దరు ఉన్నారు. ఏం జరిగింది.. ఓషన్‌గేట్ అనే సంస్థ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో టైటానిక్ శకలాల సందర్శన ఓ భాగం. ఇందుకోసం 22 అడుగుల పొడవైన మినీ జలాంతర్గామిని వాడారు. దాని పేరు టైటాన్. ఒక్కో టికెట్ ధర 2 లక్షల యాభై వేల డాలర్లు. ఐదుగురు సభ్యులతో కూడిన టైటాన్.. న్యూఫౌండ్లాండ్ నుంచి మొదలైంది. 400 నాటికల్ మైళ్ల దూరంలోని టైటానిక్ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో న్యూ ఫౌండ్ల్యాండ్లోని సెయింట్ జాన్స్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో టైటాన్.. మహా సాగరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. రెండు గంటల్లోపే.. టైటాన్ భాగం.. కార్బన్ ఫైబర్‌తో రూపొందింది. సాధారణ జలాంతర్గాములు సొంతంగా రేవు నుంచి బయల్దేరి వెళ్లి, తిరిగి అక్కడికి చేరుకోగలవు. సబ్మెర్సిబుల్గా పేర్కొనే ఈ మినీ జలాంతర్గామిని మాత్రం సాగరంలోకి పంపడానికి, వెలికి తీయడానికి ఒక నౌక అవసరం. ఇందుకోసం కెనడాకు చెందిన పోలార్ ప్రిన్స్ అనే షిప్ సేవలను ఓషన్‌గేట్ సంస్థ ఉపయోగించుకుంది. అయితే.. గంటా 45 నిమిషాల్లోనే ఆ జలాంతర్గామితో పోలార్ ప్రిన్స్‌కు సంబంధాలు తెగిపోయాయి. టైటానిక్ చూసేందుకు.. 1912లో మంచుకొండను ఢీకొట్టి టైటానిక్ నౌక అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 2,200 మంది ప్రయాణికులు, 700 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ శకలాలను తొలిసారి 1985లో గుర్తించారు. వాటిని చూసేందుకు 2021లో కొందరు పర్యాటకులు లక్ష నుంచి లక్షన్నర డాలర్లు చెల్లించి సముద్రగర్భంలోకి వెళ్లారు. ఇప్పటి యాత్రలో మాత్రం ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల డాలర్ల వరకూ ఓషన్‌గేట్ సంస్థ వసూలు చేసినట్లు తెలుస్తోంది. టైటాన్ ఇదివరకూ ఇలాంటి యాత్రలు చేపట్టినా.. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని కంపెనీ చెబుతోంది. Surface search underway for the OceanGate Titan Submersible. The five people stuck inside the Titanic submarine: Paul-Henry Nargeolet, 73 Stockton Rush, 61 Hamish Harding, 58 Shahzada Dawood, 48 Sulaiman Dawood, 19 pic.twitter.com/hzwBbQf9jY — quinn (@outtaminds) June 20, 2023 NEW. ⚠️Crews searching for the #Titan submersible heard banging sounds every 30 minutes Tuesday and four hours later, after additional sonar devices were deployed, banging was still heard, according to an internal government memo update on the search. (1/4) #titanic #Submersible pic.twitter.com/b6iItRINqB — Josh Benson (@WFLAJosh) June 21, 2023 టైటాన్ సబ్మెరీన్ కోసం వెతికే ప్రయత్నంలో సెర్చ్ టీంకు లోపల ఏదో పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయట. మంగళవారం ప్రతీ అరగంటకొకసారి.. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆ సౌండ్లు వినిపించాయట. యూఎస్ కోస్ట్‌గార్డ్ దీనిని ధృవీకరించింది కూడా. ఇంకోవైపు ఓషన్‌గేట్ సంస్థ నిర్వాహణ తీరుపై తీవ్ర విమర్శలతో పాటు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. Oceangate Expeditions remote control 2.0 for the Titan #Titanic pic.twitter.com/pYCucKq2Ba — Jewel Runner (@tosnoflA) June 21, 2023 The passengers on #Titan rn. #Titanic #titanicsubmarine #titanicsubmersible pic.twitter.com/z98uvzEQdx — kaleb (@medikaii) June 21, 2023 Coming soon..#OceanGate #Titanic #titanicsubmarine pic.twitter.com/uHq9BpzVNW — Maximus (@incognito_joe2) June 21, 2023 -
కలల నగరం, నిద్రపోని నగరం న్యూయార్క్ .. మునిగిపోనుందా?
అగ్రరాజ్యం అమెరికాలో ముఖ్యమైన సిటీ న్యూయార్క్. ఖరీదైన కలల నగరంగా, నిద్రపోని నగరంగా పేరుగాంచింది. న్యూయార్క్ సిటీ ఇప్పుడు ముంపు ముప్పును ఎదుర్కొంటోంది. క్రమక్రమంగా భూమిలోకి కూరుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణాలు సిటీలో ఉన్న వేలాది ఆకాశహర్మ్యాలు, వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరుగుతుండడం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉన్న న్యూయార్క్ ప్రతిఏటా 2 మిల్లీమీటర్ల మేర కుంగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్ సైంటిస్టుల తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ వివరాలను ‘అడ్వాన్సింగ్ ఎర్త్, స్పేస్ సైన్స్’ పత్రికలో ప్రచురించారు. సముద్ర మట్టం పెరుగుదలకు తోడు భారీ భవనాల వల్ల న్యూయార్క్‌లో భూమిపై ఒత్తిడి పెరుగుతోందని, అందుకే నగరం మునిగిపోతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని నివారణ చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఈ ముంపు తీవ్రత ఇంకా ఉధృతమవుతుందని అంటున్నారు. నగరం నివాస యోగ్యం కాకుండాపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం న్యూయార్క్ సిటీకే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు ముంపు బారిన పడుతున్నాయని పేర్కొంటున్నారు. ♦ భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషీమఠ్ పట్టణంలో ఇటీవల ఇళ్లు కూలిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. పగుళ్లు ఏర్పడడంతో చాలా ఇళ్లను కూల్చేయాల్సి వచ్చింది. జోషీమఠ్‌లో భూమి అంతర్భాగంలో ఒత్తిడి వల్లే ఇళ్లు కూలిపోయినట్లు గుర్తించారు. న్యూయార్క్‌లోనూ ఈ తరహా ఉత్పాతం పొంచి ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ♦ న్యూయార్క్ నగర జనాభా 80 లక్షల పైమాటే. ఆకాశాన్నంటే భారీ భవనాలతో సహా 10 లక్షల దాకా భవనాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఏటా 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగానే భూమిలోకి కూరుకుపోతున్నాయి. ♦ ఉత్తర అమెరికాలో అట్లాంటిక్ తీరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సముద్ర మట్టం పెరుగుదల వల్ల ముంపు ముప్పు న్యూయార్క్‌కు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉందని పరిశోధకులు తెలియజేశారు. ♦ మరో 80 ఏళ్లలో.. అంటే 2100వ సంవత్సరం నాటికి న్యూయార్క్ సిటీ 1,500 మిల్లీమీటర్లు కుంగిపోతుందని అధ్యయనంలో గుర్తించారు. ♦న్యూయార్క్‌పై ప్రకృతి విపత్తుల దాడి కూడా ఎక్కువే. 2012లో సంభవించిన శాండీ తుపాను కారణంగా సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకువచ్చింది. చాలా ప్రాంతాలు జలవిలయంలో చిక్కుకున్నాయి. 2021లో సంభవించిన ఇడా తుఫాను వల్ల సిటీలో మురుగునీటి కాలువలు ఉప్పొంగాయి. డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ♦ కోస్టల్ సిటీలకు ముంచుకొస్తున్న ప్రమాదానికి న్యూయార్క్ ఒక ఉదాహరణ అని ‘యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్’కు చెందిన గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఓషియనోగ్రఫీ సైంటిస్టులు చెప్పారు. ఈ సమస్య ప్రపంచానికి ఒక సవాలు లాంటిదేనని అన్నారు. సముద్ర మట్టాలు పెరగకుండా అన్ని దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలని, సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాల్లో భవనాల నిర్మాణంపై నియంత్రణ విధించాలని సూచించారు. ♦సముద్ర తీరంలో, నది ఒడ్డున, చెరువుల పక్కన నిర్మించే భారీ భవనాలు భవిష్యత్తులో వరద ముంచెత్తడానికి, తద్వారా ప్రాణ నష్టానికి కారణమవుతాయని వివరించారు. ♦ అన్నింటికంటే ముఖ్యంగా మితిమీరిన నగరీకరణ, పట్టణీకరణ అనేవి ప్రమాద హేతువులేనని తేల్చిచెప్పారు. ♦ అడ్డూ అదుపూ లేకుండా నగరాలు, పట్ట ణాలు విస్తరిస్తున్నాయి. వర్షం పడితే అవి చెరువుల్లా మారుతుండడం మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మళ్లీ వార్తల్లోకెక్కిన టైటానిక్ ఓడ
టైటానిక్.. ఈ పేరు వినగానే జేమ్స్ డైరెక్షన్లో వచ్చిన అద్భుత ప్రేమకావ్యం.. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలామందికి గుర్తొస్తుంటుంది. కానీ, వాస్తవంగా జరిగిన ఘోర ప్రమాదం.. అత్యంత భారీ విషాదమని గుర్తు చేసుకునేవాళ్లు చాలా కొద్దిమందే!. చరిత్రలో ఘోర ప్రమాదాలు గురించి పేజీలు తిప్పితే.. టైటానిక్‌కు కూడా అందులో చోటు ఉంటుంది. సినిమాగా తెర మీదకు వచ్చేదాకా ప్రపంచానికి పెద్దగా ఆసక్తిక కలిగించని ఈ ఓడ ప్రమాదం.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అదీ ఎందుకో మీరే లుక్కేయండి.. అట్లాంటిక్ మహాసముద్రంలో.. దాదాపు 13వేల అడుగుల లోతున కూరుకుపోయిన మోస్ట్ ఫేమస్ టైటానిక్ శకలాలను చూస్తారా?.. అదీ డిజిటల్ స్కాన్‌లో ఫుల్ సైజులో. తొలిసారిగా మానవ ప్రమేయం లేకుండా డీప్ సీ మ్యాపింగ్‌ను ఉపయోగించి త్రీడీ స్కాన్ చేశారు టైటానిక్ శకలాలను. అట్లాంటిక్ అడుగునకు ప్రత్యేక నౌక ద్వారా ఓ జలంతర్గామిని పంపించి.. సుమారు 200 గంటలపాటు శ్రమించి 7,00,000 చిత్రాలను తీసి స్కాన్‌ను రూపొందించారు. ఈ క్రమంలో శకలాలను ఏమాత్రం తాకకుండా జాగ్రత్త పడ్డారట. 1912లో జరిగిన టైటానిక్ ఘోర ప్రమాదంలో.. 1,500 మంది మరణించారు. లగ్జరీ ఓడగా సౌతాంప్టన్(ఇంగ్లండ్) నుంచి న్యూయార్క్‌కు తొలి ట్రిప్‌గా వెళ్తున్నటైటానిక్ ఓడ.. మార్గం మధ్యలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్ బర్గ్‌ను ఢీ కొట్టి నీట మునిగింది. 1985లో కెనడా తీరానికి 650 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్‌లో వేల అడుగుల లోతున టైటానిక్‌కు సంబంధించిన శకలాలను తొలిసారి గుర్తించారు. కానీ, ఇన్నేళ్లలో ఆ శకలాల పూర్థిస్తాయి చిత్రాలను మాత్రం ఏ కెమెరాలు క్లిక్ మనిపించలేకపోయాయి. తాజాగా.. కొత్తగా తీసిన స్కాన్‌లో టైటానిక్ శకలాలకు సంబంధించిన పూర్తి స్థాయి దృశ్యాలు బయటపడ్డాయి. రెండుగా విడిపోయిన ఓడ భాగాలు.. ఇందులో కనిపిస్తున్నాయి. త్రీడీ రీకన్స్ట్రక్షన్ ద్వారా ప్రతీ యాంగిల్లో ఏడులక్షల ఇమేజ్‌లను తీశారు. 2022 సమ్మర్లోనే డీప్-సీ మ్యాపింగ్ కంపెనీ అయిన మాగెల్లాన్ లిమిటెడ్ ఈ స్కాన్‌ను నిర్వహించగా.. అట్లాంటిక్ ప్రొడక్షన్స్ వాళ్లు దానిని డాక్యుమెంటరీగా ఓ ప్రాజెక్టు రిలీజ్ చేసింది. నీట మునిగిన టైటానిక్.. దానిని శకలాల త్రీడీ స్కాన్ ఫుల్ సైజ్ చిత్రాలను బుధవారం ప్రచురించింది ఓ ప్రముఖ మీడియా సంస్థ. ఈప్రమాదానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించాల్సి ఉంది అని ఏళ్ల తరబడి టైటానిక్‌పై పరిశోధనలు చేస్తున్న విశ్లేషకుడు పార్క్స్ స్టీఫెన్సన్ అంటున్నారు. -
శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన 'విచిత్ర జీవి': వీడియో వైరల్
సముద్రం ఎన్నో రకాల జీవుల సముదాయం. సమద్రం చీకటి లోతుల్లో నమ్మశక్యంకానీ జీవులను ఎన్నింటినో పరిచయం చేసింది. అలానే ఇప్పుడూ మరో మిస్టీరియస్ జీవిని మనకు పరిచయం చేస్తోందా అన్నట్లు ఉంది ఆ జీవి. ఆ జీవిన చూసి సముద్ర శాస్తవేత్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ జీవి చూసేందుకు జీవిలా కాకుండా నీటి కుంటలా ఉంటుంది. ఈ జీవి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. నేషనల్ ఓషియానిక్ అండ అట్మాస్సియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) ఓషన్ ఎక్స్‌ప్లోరర్ సిబ్బంది అట్లాంటిక్‌లో చేసిన యాత్రలో ఇది కనిపించింది. ఇది మృదువైన పగడపు స్పాంజ్ లేదా ట్యూనికేట్ కావచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది డెనిమ్ బ్లూ కలర్లో ఉంటుంది. కానీ ఇది ఇంకా ఒక అంతు చిక్కని జీవిగా మిస్టరీగానే ఉంది. ఆ విచిత్ర జీవికి సంబంధించిన వీడియోని ఎన్ఓఏఏ ఓషన్ ఎక్స్‌ప్లోరర్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ జీవిన 'బ్లూ గూ'[ జీవిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. Have you heard about the latest #Okeanos mystery? Seen multiple times during off St. Croix, this "blue #goo" animal stumped scientists, who thought it might be soft coral, sponge, or tunicate (but def not a rock!). More from Voyage to the Ridge 2022: https://t.co/feZj9IgCG3 pic.twitter.com/OM5hMaOr2m — NOAA Ocean Exploration (@oceanexplorer) September 7, 2022 (చదవండి: జిన్‌పింగ్ పుతిన్, మోదీని కలుస్తారా? నిరాకరించిన చైనా !) -
మూవీని మించిన బ్రతుకు పోరాటం.. నడి సంద్రాన ప్రాణాల కోసం ఆరాటం
మనిషి జీవితంలో కొన్ని ఘటనలు జీవించి ఉన్నంత కాలం గుర్తుండిపోతాయి. ప్రకృతి విపత్తు, మానవ తప్పిందం కారణంగానో జీవితంలో ఊహించిన పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. అలాంటి ఘటనల వల్ల చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పటో వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా గుర్తుండే ఉంటుంది. కరెక్ట్‌గా అలాంటి ఘటనే ఒకటి ఓ వ్యక్తి జీవితంలో ఎదురైంది. నడి సంద్రంలో ప్రాణాల కోసం పోరాడి.. చివరకు 11 రోజుల తర్వాత బతుకు జీవుడా.. అన్న చందంగా ఒడ్డుకు చేరుకున్నాడు. బ్రెజిల్‌కు చెందిన రోములాడో మసిడో రోడ్రోగస్ అనే వ్యక్తి.. చేపల వేట కోసం ఏకంగా అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్లాడు. వేటలో భాగంగా తన గాలానికి చేపలు చిక్కుతుడటంతో ఆనందపడ్డాడు. అప్పటి వరకు బాగానే ఉన్న తన జర్నీలో ఊహించని ఉపద్రవం వచ్చి పడింది. కొద్దిసేపటికే అతడి పడవ మునిగిపోవడం మొదలుపెట్టింది. దీంతో, తన ప్రాణం ఎక్కడ పోతుందో.. బ్రతుకుతానో లేదో అని భయపడ్డాడు. అయితే, ఆరోజు అతడికి అదృష్టం కలిసివచ్చింది. పడవ మునిగిపోయిన తర్వాత.. లక్కీగా తన పడవలోని ఫ్రీజర్ సముద్రంపై తేలడం చూశాడు. దీంతో వెంటనే దానిపైకి దూకేశాడు. ఈ క్రమంలో ఫీజర్ ఒకవైపునకు ఒరిగిపోయినా.. నీటిలో మాత్రం తేలుతూనే ఉంది. అప్పటికైతే ఫ్రీజర్ సాయంతో ప్రాణాలు దక్కించుకున్నా తాగేందుకు నీళ్లు, తినేందుకు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయాడు. ఇలా దాదాపు 11 రోజులపాటు ఫ్రీజర్‌లోనే తలదాచుకున్నాడు. ఈ క్రమంలో తన చుట్టూ షార్క్‌లు, తిమింగళాలు తిరిగినా భయపడకుండా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీశాడు. సరిగ్గా అదే సమయంలో అతడిలాగే సముద్రంలోకి బోటులో కొందరు వ్యక్తులు చేపల వేటకు వచ్చారు. ఈ సందర్భంగా నీటిపై తేలియాడుతున్న ఫ్రీజర్‌ను చూసి అటుగా బోటును అటుగా తిప్పారు. వారి ఊహించిన రీతిలో రోడ్రిగో కనిపించడంతో అతడిని తమ బోటులోకి ఎక్కించుకుని ప్రాణాలను కాపాడారు. అనంతరం అతడిని సురినామ్ అనే దక్షిణ అమెరికా దేశం తీరంలో అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో 11 రోజుల జీవితంలో విధితో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. 🇧🇷 Un pescador brasileño pasó 11 días en el mar sin comida ni agua, pero sobrevivió flotando dentro de un congelador. Romualdo Macedo Rodrigues, de 44 años, partió del norte de Brasil en un bote de madera a fines de julio. ⬇️⬇️ pic.twitter.com/rw8MSsCV5s — Tribuna Digital7 (@TribunaLibreES) September 4, 2022 -
నాచు.. భయపెడుతోంది!
కరీబియన్ దీవులు.. ప్రకృతి అందాలకు మారుపేరు. భువిలో స్వర్గంగా పేరుగాంచాయి. అలాంటి కరీబియన్ తీర ప్రాంతాలను ఇప్పుడు సముద్రపు నాచు తీవ్రంగా కలవరపెడుతోంది. సర్గాసమ్ అనే రకం నాచు విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి కరీబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, సెంట్రల్ వెస్ట్, ఈస్ట్ అట్లాంటిక్‌లో 24.2 మిలియన్ టన్నుల నాచు పేరుకుపోయినట్లు అంచనా. ప్రమాదకరమైన ఈ నాచు జీవజాలానికి, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తోంది. తీర ప్రాంతాల నుంచి విషపూరిత వాయువులు వెలువడుతున్నాయి. అంతేకాదు పర్యాటకం సైతం దెబ్బతింటోంది. పర్యాటకుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ఫలితంగా ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కరీబియన్ తీరంలోని నాచును పక్కపక్కనే పేరిస్తే అది ఫ్లోరిడా గల్ఫ్ తీరంలోని టాంపా బే వైశాల్యం కంటే ఆరు రెట్లు అధికంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన పరిశోధకుడు చువాన్మిన్ హూ చెప్పారు. ఒకప్పుడు జనంతో కళకళలాడిన బీచ్‌లు నాచు కారణంగా వెలవెలబోతున్నాయని, అక్కడ వ్యాపారాలు దారుణంగా పడిపోతున్నాయని యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ గవర్నర్ ఆల్బర్ట్ బ్రియాన్ చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని వాపోయారు. కరీబియన్ బీచ్‌లను నాచురహితంగా మార్చాలని, ఇందుకు సమయం పడుతుందన్నారు. మెక్సికోలో 18 బీచ్‌ల్లో నాచు తిష్ట సముద్ర ఉపరితలంపై నాచు దట్టంగా పేరుకుపోతుండడంతో నౌకలు, పడవల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. చేపల వేట సైతం ఆగిపోతోంది. సర్గాసమ్ నాచు వల్ల అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో ముక్కుపుటలు అదిరిపోయే దుర్గంధం వెలువడుతుండడంతో అటువైపు వెళ్లేందుకు సాధారణ జనంతోపాటు మత్స్యకారులు కూడా జంకుతున్నారు. ఈ వాసనను పీలిస్తే తల తిరగడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, గుండె కొట్టుకోవడంలో హెచ్చతగ్గులు వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నాచు నిర్జీవమైపోయిన తర్వాత సముద్రంలో అడుగు భాగానికి చేరుకుంటుంది. దీనివల్ల విలువైన పగడపు దిబ్బలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మెక్సికోలో 18 బీచ్‌లు నాచుతో నిండిపోయినట్లు గుర్తించారు. గత నెలలో యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారంటే నాచు ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్గాసమ్ నాచు ఇంతలా వ్యాప్తి చెందడానికి కారణం ఏమిటంటే.. బలంగా వీస్తున్న ఈదురు గాలులు, సముద్రపు అలల ఉధృతి. దక్షిణ అట్లాంటిక్ వాతావరణం నాచు పెరుగుదలకు అనుకూలంగా ఉందని అంటున్నారు. నాచు వల్ల కేవలం నష్టాలే కాదు, లాభాలూ ఉన్నాయి. పీతలు, డాల్ఫిన్లు, సీల్స్, చేపలు వంటి సముద్ర జీవులకు ఇది ఆహారంగా ఉపయోగడుతోంది. సంక్షోభంలోనూ అవకాశం అంటే ఇదే. నాచును సేకరించి, ఎరువు తయారు చేయొచ్చు. కొన్ని దేశాల్లో నాచును సలాడ్ల తయారీకి ఉపగియోస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్
ఇంతవరకు మనం హెలకాప్టర్ క్రాష్‌కి సంబంధించిన పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవల యూకేలోని యూనిస్ తుపాను కారణంగా వీచిన ఈదురు గాలుల బీభత్సానికి విమానం ఎంత ప్రమాదకరంగా ల్యాండ్ అయ్యిందో చూశాం. అయితే ఇక్కడొక హెలికాప్టర్ ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందో గానీ అందరూ చూస్తుండగానే బీచ్‌లోని అలల పైకి దూసుకుపోయింది. అసలు విషయంలోకెళ్తే...అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ఫ్లోరిడాలోని రద్దీగా ఉండే మియామీ బీచ్‌లో ముగ్గురు ప్రయాణికులతో కూడిన రాబిన్సన్ R44 హెలికాప్టర్ కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో హెలికాప్టర్ క్రాష్‌కి గల కారణాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు మయామి బీచ్ పోలీసులు, అగ్నిమాపక విభాగాలు ఘటనాస్థలికి వచ్చి ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. This afternoon at 1:10 p.m., MBPD received a call of a helicopter crash in the ocean near 10 Street. Police and @MiamiBeachFire responded to the scene along with several partner agencies. Two occupants have been transported to Jackson Memorial Hospital in stable condition. 1/2 pic.twitter.com/heSIqnQtle — Miami Beach Police (@MiamiBeachPD) February 19, 2022 (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్‌గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
అమ్మా నాన్నల కోసం
ఇదో వీరోచిత కథ. మార్చి రెండో వారంలో పోర్చుగల్ నుంచి ఒక కొడుకు సుమారు 5600 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న అర్జంటైనాలోని తన తల్లిదండ్రులను చూడటానికి చిన్న బోట్లో అట్లాంటిక్ సముద్రం మీద బయలుదేరాడు. కరోనా వల్ల పోర్చుగల్‌లో, అర్జంటైనాలో ఫ్లయిట్స్ ఆపేయడమే కారణం. ఒకటి కాదు రెండు కాదు 85 రోజులు ఒక్కడే చిన్న బోట్లో ప్రయాణించాడు. చివరకు తల్లిదండ్రులను చేరుకున్నాడు. గగుర్పాటు కలిగించే అతని ప్రయాణం ఏదైనా తల్లిదండ్రుల దీవెనలే రక్షగా నిలిచాయి. ‘గురూ... ముందే ఆలోచించుకో’ అన్నారు ఫ్రెండ్స్. ‘నువ్వు వెళ్తావా వెళ్లు. సగం దారిలో వెనక్కు వస్తే రానిచ్చేది లేదు’ అన్నారు పోర్చుగల్ అధికారులు. 47 ఏళ్ల బాలెస్టెరో ‘నా అమ్మా నాన్నలే రక్ష’ అనుకున్నాడు. కరోనా ప్రపంచం మీద బయలుదేరింది. మార్చి రెండో వారం వచ్చేసరికి పోర్చుగల్‌లో లాక్డౌన్ మొదలయ్యింది. ఫ్లయిట్స్ అన్నీ బంద్ అయ్యాయి. బాలెస్టెరో స్పెయిన్‌లో ఉంటాడు. ధనికుల విహార పడవలకు సరంగుగా పని చేస్తుంటాడు. అతనికి సొంతంగా చిన్న పడవ ఉంది. 29 అడుగుల పొడవు ఉండే ఆ పడవతో ఖాళీ సమయాల్లో చుట్టుపక్కల దేశాలు తిరుగుతుంటాడు. మార్చి రెండోవారంలో బాలెస్టెరో తన పడవతో స్పెయిన్‌కు పొరుగున ఉండే పోర్చుగల్‌లోని పోర్టో శాంటో దీవిలో ఉన్నాడు. అప్పుడే కరోనా కలకలం మొదలయ్యింది. దేశాలన్నీ దిగ్బంధనం అవుతూ వస్తున్నాయి. ‘నువ్వు ఇక్కడే ఉంటే క్షేమంగా ఉంటావు’ అన్నారు మిత్రులు. ఎందుకంటే పోర్టో శాంటో దీవిలో అప్పటికి ఒక్క కరోనా కేసు కూడా లేదు. ‘నేను మా అమ్మా నాన్నలను చూడాలి’ అనుకున్నాడు బాలెస్టెరో. అతని అమ్మా నాన్న అర్జంటైనాలోని ‘మాల్ దే ప్లాటా’లో ఉంటాడు. బాలెస్టెరో సొంత ఊరు అదే. వాళ్లది మత్స్యకార కుటుంబం. చేపలు పట్టడం వృత్తి. బాలెస్టెరోకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తండ్రి పడవ మీద సముద్రం మీదకు తీసుకెళుతూ ఉండేవాడు. 19 ఏళ్లు వచ్చాక బాలెస్టెరో కూడా మత్స్యకారుడు అయ్యాడు. అయితే ‘ఇందులో మజా ఏముందోయ్. ప్రపంచం చూడు’ అని ఒక మత్స్యకారుడు సలహా ఇస్తే ప్రపంచ దిమ్మరిగా మారాడు. 2017లో కష్టపడి ఒక చిన్న పడవ కొనుక్కున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులను చూడాలంటే ఆ పడవ తప్ప మరో మార్గం లేదు. కాని తల్లిదండ్రులను చూడటం అంత సులభమా. తను ఉంటున్న దీవి నుంచి అర్జంటైనా వరకు దాదాపు ఐదున్నర వేల నాటికల్ మైళ్ల దూరం. అట్లాంటిక్ సముద్రంపై ప్రయాణం. అట్లాంటిక్ పై ఒంటరి ప్రయాణం అంటే ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాలి. ‘నా దగ్గర అంతా చూస్తే 300 డాలర్లు (సుమారు 20 వేల రూపాయలు) ఉన్నాయి. వాటిని పెట్టి నిల్వ ఉండే ఆహారం కొనేశాను. ఇలాంటి కష్టసమయంలో అమ్మానాన్నల దగ్గర ఉండి వాళ్లను చూసుకోవాలని వెంటనే బయలు దేరాను’ అన్నాడు బాలెస్టెరో. అట్లాంటిక్ సముద్రంలో అంతా బాగుంటే అంతా బాగుంటుంది. కొంచెం తేడా వస్తే పడవ తల్లకిందులవుతుంది. మూడు వారాల పాటు అంతా సజావుగా సాగింది. తర్వాతే బాలెస్టెరోకు అగాధమైన నీలిమ తప్ప, నిశ్శబ్దం తప్ప ఏమీ మిగల్లేదు. ‘రోజూ రాత్రి ఒక అర్ధగంట రేడియో వినేవాణ్ణి. కరోనా వార్తలు తెలిసేవి. ఇలాంటి ఘోరమైన సమయంలో ఇది నా ఆఖరు ప్రయాణం ఏమోనని భయం వేసేది. అప్పుడప్పుడు కనిపించే డాల్ఫిన్లు నాకు తోడుగా నిలిచాయి. ఒక్కోసారి పడవ మీద పక్షులు ఎగిరేవి. అవి ఉత్సాహ పరిచేవి’ అన్నాడు. బ్రెజిల్ తీరంలో ఒక దశలో రాక్షస కెరటాలు అతణ్ణి చుట్టుముట్టాయి. ‘కాని ఎలాగో గట్టెక్కాను’ అన్నాడతను.‘ ఒక రాత్రయితే ఒక పెద్ద ఓడ వెనుక వస్తూ కనిపించింది. అది నన్ను గుద్దుకుంటూ నా మీద నుంచి వెళ్లిపోతుందని చాలా భయపడిపోయాను’ అన్నాడతను. ఒక మనిషి 85 రోజులు అంత పెద్ద భూతం వంటి సముద్రం పై గడపడం చాలా పెద్ద సాహసం. ‘ఇల్లు చేరుతాను. అమ్మా నాన్నలను చూస్తాను’ అని పదే పదే అతడు అనుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. చివరకు అతను మొన్నటి బుధవారం (జూన్ 24) తన మాతృభూమి మీద కాలు పెట్టాడు. అతడి రాకను అతని సోదరుడు ప్రెస్‌కు తెలియ చేయడం వల్ల తీరానికి పెద్దఎత్తున మిత్రులు, పత్రికా రచయితలు వచ్చారు. 90 ఏళ్ల తండ్రి, సోదరుడు, తల్లి కూడా వచ్చారు. బాలెస్టెరోకు కోవిడ్ టెస్ట్ నిర్వహించారు. నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ అదే పడవలో మరో 14 రోజులు క్వారంటైన్లో ఉండమన్నారు. తల్లిదండ్రుల కోసం అన్ని రోజులు సముద్రం మీద ఉన్నవాడికి ఆ కొద్దిరోజులు ఒక లెక్కా. ‘నాన్న 90వ పుట్టిన రోజు నాడు నేను లేను. ఇప్పుడు దానిని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం’ అన్నాడు బాలెస్టెరో తృప్తిగా. అతని తోడుగా నిలిచిన అతని చిన్న పడవ ‘స్కువా’ అతనితో పాటు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది. – సాక్షి ఫ్యామిలీ -
మృత్యువుతో పందెం వేసుకోవడమే!
అట్లాంటిక్ సముద్రంలో ఆ రూటు అత్యంత ప్రమాదకరమైనది. జలాలు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటాయి. 40 అడుగుల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసి పడుతుంటాయి. తుపాన్లు తరచుగా వస్తుంటాయి. పెద్ద పెద్ద సొరచేపలు ఆవురావురుమంటూ నరమాంసం కోసం తిరుగుతూ ఉంటాయి. చిన్న మర పడవలను కూడా బోల్తా కొట్టేంచే శక్తి వాటి సొంతం. ఆకాశాన చుక్కలు కూడా లేని చిమ్మ చీకటిలో అణు క్షణం ఈ ప్రమాదాలు ఎదుర్కొవాలి. అదే రూటులో తరచుగా వచ్చే పెద్ద సరకు రవాణా ఓడల బారిన పడకుండా తప్పించుకోవాలి. మర పడవ కాకుండా రోయింగ్ పడవలో ప్రయాణం చేయడమంటే సాహసం చేయడం కాదు, ప్రాణాలను పణంగా పెట్టడం. తెడ్ల వేసుకుంటూ మూడువేల మైళ్లు ప్రయాణించడమంటే మృత్యువుతో పందెం వేసుకోవడమే! అలా ముగ్గురు సోదరులు ఎవాన్ 27, జమీ 26, లచ్లాన్ 21 కలిసి డిసెంబర్ 12వ తేదీన ఈ సాహసానికి ఒడిగట్టారు. దాదాపు ఐదు లక్షల రూపాయలు విలువైన 28 అడుగుల రోయింగ్ (తెడ్లతో నడిపే) పడవలో అట్లాంటిక్ సముద్రంలో కానరీ దీవుల్లోని లా గొమెరా నుంచి మూడు వేల మైళ్ల దూరంలోని కరీబియన్‌లోని ఆంటిగ్వా నెల్సన్స్ హార్బర్‌కు గురువారం చేరుకున్నారు. ఇందుకు వారికి సరిగ్గా 35 రోజుల, తొమ్మిది గంటల, తొమ్మిది నిమిషాలు పట్టింది. ముగ్గురు సోదరులకు ప్రయాణంలో ‘సీ సిక్నెస్’ వచ్చింది. ఒంటి నిండా కురుపులు, దద్దులు లేచాయి. వాటికి ఎప్పటికప్పుడు యాంటీ బయాటిక్స్ పూసుకుంటూ, నిద్రలేమి రాత్రులు గడుపుతూ వారు ఈ సాహసాన్ని పూర్తి చేశారు. ఏ సాహసం చేయాలన్నా అందుకు ఓ లక్ష్యం ఉండాలి. అందుకని ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతూనే ప్రపంచంలో దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్న ‘ఫీడ్‌బ్యాక్ మడగాస్కర్’తో పాటు ‘చిల్డ్రన్ ఫస్ట్’ చారిటీ సంస్థకు రెండున్నర కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆర్జించేందుకు వారు కొత్త ప్రపంచ రికార్డును సష్టించారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్టలేదట. స్వతహాగా అన్నదమ్ములం అవడం వల్ల ఆ అనుబంధం, పరస్పర స్ఫూర్తితో ఈ విజయాన్ని సాధించామని, ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని వారు తమదైన శైలిలో చెప్పారు. -
‘థ్యాంక్ గాడ్.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’
ఓ సరదా సన్నివేశం.. ఒక్కక్షణం భయపడి.. ఆ తర్వాత ‘హమ్మయ్య’ అనుకుంటున్నారు చూసిన నెటిజన్లంతా. సముద్రంలో బోటింగ్‌కు వెళ్లిన కుటుంబానికి ఆ సన్నివేశం సరదా జ్ఞాపకాన్ని మిగిల్చింది. అట్లాంటిక్ సముద్రంలోని ‘కెప్కాడ్ బే’ వద్ద ఫాంక్లిన్కు చెందిన డఫ్ నెల్సన్ చేపలు పడుతుండగా.. తెల్లటి భారీ సొరచేప అతన్ని భయబ్రాంతులకు గురిచేసింది. అయితే సొరచేప పైకి వచ్చి వారి పడవపైకి దూకడానికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న అతని కుమారుడు చేపను చూసి ఉలిక్కిపడి వెనక్కు పరుగెత్తాడు. దీంతో వారంతా హమ్మయ్య అనుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అతను తన ట్విట్టర్లో జులై 21న ‘అంట్లాంటిక్ వైట్ షార్క్ కన్సర్వేన్సీ’ అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు 76వేల లైక్‌లు రాగా ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ‘థ్యాంక్ గాడ్.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ షాక్ నుంచి తేరుకున్న డాఫ్ నెల్సన్ ‘సొరచేప మాకు మర్చిపోలేని సరదా జ్ఞాపకాన్ని ఇచ్చిందంటూ’ చెప్పుకొచ్చాడు. -
చరిత్ర సృష్టించిన భారతీయ యువతి
‘మగాళ్లు చేస్తున్నారు.. మరి మహిళలెందుకు చేయలేరు?’ అని తన మదిలో మెదిలిన ప్రశ్న ఓ యువతిని ఉన్నత స్థానంలో నిలపింది. ఆ ప్రశ్నే ఆమెతో ప్రపంచ రికార్డు నమోదు చేసేలా చేసింది. ముంబైకి చెందిన 23 ఏళ్ల ఆరోహి పండిట్.. ఒక్కతే అల్ట్రా లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో అట్లాంటిక్ మహాసముద్రం చుట్టొచ్చి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆరోహి గుర్తింపు పొందింది. చిన్న పిట్టకు పెద్ద రెక్కలు ఉన్నట్లు ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌లో బలమైన గాలుల మధ్య సాహసోపేతంగా 3వేల కిలోమీటర్లు ప్రయాణించి ఔరా అనిపించింది. 17 ఏళ్ల నుంచే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపడం మొదలుపెట్టిన ఆరోహి.. తన అట్లాంటిక్ ప్రయాణాన్ని స్కాట్లాండ్లో ప్రారంభించి గత సోమవారమే గ్రీన్లాండ్లోని నుక్లో ముగించింది. ఈ రికార్డుపై ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘నాకు మహిళలు రికార్డులు సాధించడం కావాలి. కేవలం భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు వారి కలలను నేరవేర్చుకోవాలి. వారికి నేను స్పూర్తిగా నిలవాలి. మగాళ్లు ఈ తరహా రికార్డులు నెలకొల్పడం చూశాను. అప్పుడు నాకనిపించింది మగాళ్లు చేస్తున్నప్పుడు మహిళలు ఎందుకు చేయలేరని? వెంటనే నేను నా కలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. మొత్తానికి ఈ ప్రయాణం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఇదో అహ్లాదకరమైన రైడ్. నా ప్రయాణం చాలా అద్బుతంగా సాగింది. ప్రతి చోట నీలిరంగులోని నీరు.. అహ్లాదకరమైన ఆకాశం. ఎన్నటికి మరిచిపోలేని అద్భుతమైన మదురానుభూతిగా నా ప్రయాణం నిలిచిపోయింది.’ అని ఆరోహి సంతోషం వ్యక్తం చేసింది. ఆరోహి రైడ్ చేసిన ఎయిర్ క్రాప్ట్ పేరు మహి కాగా.. ఇది సినస్ 912 రకానికి చెందిన లైట్-స్పోర్ట్ ఎయిర్‌క్రాప్ట్. ఒకే ఇంజన్‌తో పనిచేసే ఈ ఎయిర్‌క్రాప్ట్ కేవలం 400 కేజీల బరువు మాత్రం ఉంటుంది. చూడటానికి తెల్లని పిట్టకు పెద్ద రెక్కలు ఉన్నట్లు ఉంటుంది. ఆరోహి భారత్ నుంచి తన రైడ్ ప్రారంభించి.. పాకిస్తాన్, ఇరాన్, టర్కీల మీదుగా ఆగుకుంటూ.. యూరప్ మీదుగా స్కాట్లాండ్ చేరింది. అక్కడి నుంచి తన అట్లాంటిక్ యాత్రను ప్రారంభించి ఐస్లాండ్, గ్రీన్లాండ్ మీదుగా చివరకు కెనడాలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఆమె అలస్కా, రష్యాలను చుట్టొచ్చిన అనంతరం ఇంటికి రావాలనుకుంటుంది. ఆమె అనుకున్నట్టుగా జరగాలని ఆరోహికి ఆల్‌దిబెస్ట్ చెబుదాం. -
దూసుకొస్తున్న ‘ఫ్లోరెన్స్’
మియామి: అట్లాంటిక్ మహా సముద్రంలో ఏర్పడిన ‘ఫ్లోరెన్స్’ హరికేన్ అగ్రరాజ్యం అమెరికాను కలవరపెడుతోంది. ప్రస్తుతం అమెరికా తూర్పు తీరంవైపు కదులుతున్న ఈ కేటగిరి–1 హరికేన్ క్రమంగా శక్తి పుంజుకుంటోందని జాతీయ హరికేన్ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి నాటికి ఇది కేటగిరి–4 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని వెల్లడించింది. దీని కారణంగా అమెరికా తూర్పుతీరంలో ఉన్న రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావంతో కొండ చరియలు విరిగిపడతాయని హెచ్చరించింది. ప్రస్తుతం బెర్ముడాకు 1,100 కి.మీ ఆగ్నేయంగా ఈ హరికేన్ కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. అమెరికా తూర్పు తీరంలో ఫ్లోరెన్స్ విధ్వంసం 2–3 రోజుల పాటు కొనసాగవచ్చని ఎన్‌హెచ్‌సీ తెలిపింది. ఉత్తర కరోలీనా, వర్జీనియా, దక్షిణ కరోలీనా రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశముందని వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కరోలీనా రాష్ట్రాల మధ్య హరికేన్ గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశముందంది. ప్రస్తుతం అట్లాంటిక్ సముద్రంలో కొత్తగా ఐజాక్, హెలెన్ హరికేన్లు ఏర్పడినప్పటికీ, ఇవి అమెరికా తీరంవైపు రావడానికి వారం రోజులు పడుతుందని తెలిపింది. ఫ్లోరెన్స్ హరికేన్‌ను ఎదుర్కొనేందుకు దక్షిణ కరోలినా, వర్జీనియా, ఉత్తర కరోలినా రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గు!
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇన్ని రోజులు వాహనదారుల జేబులకు భారీగా చిల్లులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు దేశీయంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయంగా మళ్లీ భగ్గుమననున్నాయట. దీనికి గల కారణం త్వరలో అట్లాంటిక్ మహాసముద్రంలో హారికేన్లు ప్రారంభం కానున్నాయట. అట్లాంటికా బేసిన్లో కనుక హారికేన్లు ప్రారంభమైతే, దేశీయంగా ఇంధన ధరలు భారీగానే పెరిగే అవకాశం కనిపిస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ నది, మెక్సికో గల్ఫ్ కలిగి ఉన్న ప్రాంతాన్ని అట్లాంటిక్ బేసిన్గా పేర్కొంటారు. ఈ బేసిన్లో జూన్ నుంచి నవంబర్ వరకు హారికేన్ సీజన్ ప్రారంభమవుతోంది. ఏ సమయంలోనైనా రాకాసి హారికేన్ల విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు మధ్యలో నుంచి అక్టోబర్ చివరి వరకు రాకాసి హారికేన్లకు పీక్ సీజన్. ఒకవేళ ఈ హారికేన్లు కనుక ఏర్పడితే, దేశీయంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను చవిచూడాల్సి వస్తోంది. గతేడాది కూడా భారీ ఎత్తున్న హార్వే హారికేన్, ఇర్మా హారికేన్ ఏర్పడటంతో, అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్ పుట్ 13 శాతం మేర పడిపోయింది. దీంతో ఇంధన ధరలు భారీగా పైకి ఎగిశాయి. ఈ ఏడాది కూడా మరికొన్ని రోజుల్లో అట్లాంటిక్ బేసిన్ ప్రాంతంలో ఏర్పడబోయే హారికేన్లు, ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో హారికేన్లకు, భారత్‌లో ఇంధన ధరలకు సంబంధం : గతేడాది సంభవించిన హార్వే, ఇర్మా హారికేన్లు, గల్ఫ్ కోస్ట్‌లోని అమెరికా రిఫైనరీ సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. దీంతో సరఫరా తగ్గిపోయింది. అవుట్‌పుట్ పడిపోవడంతో, అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. నైమెక్స్‌లో కూడా ఇంధన ధరల ఫ్యూచర్స్ పెరిగాయి. భారత్ ఇంధనాన్ని ఎక్కువగా గ్లోబల్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగానూ ధరలు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం రేటు పడిపోయింది. వీటన్నింటి పలితంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు మారేలా.. మన చమురు సంస్థలు రోజువారీ ధరల సమీక్షను చేపట్టాయి. ఈ రోజువారీ ధరల సమీక్షతో, తగ్గడం కంటే ఇంధర ధరలు పెరగడమే ఎక్కువగా ఉంది. -
అట్లాంటిక్ సముద్రంలో మిసైన సబ్‌మెరైన్
-
పురాతన ‘స్నేక్ షార్క్’ కనిపించింది..!
వాషింగ్టన్ : ఆది మానవుడి జీవన శైలిని గుర్తు చేసే సంఘటన అట్లాంటిక్ మహా సముద్రంలో వెలుగు చూసింది. డైనోసార్ల కాలానికి చెందిన ఆరు అడుగుల స్నేక్ షార్క్(పాము తల ఆకారం) 80 మిలియన్ల సంవత్సరాల తర్వాత పోర్చుగల్ తీరంలో మనిషి కంటికి కనిపించింది. ఆది మానవులు మహాసముద్రాల్లో వేటకు వెళ్లి స్నేక్ షార్క్‌కు బలైన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, కాలక్రమంలో డైనోసార్లు, ట్రైనోసార్లతో పాటు స్నేక్షార్క్లు అంతరించిపోయాయని అందరూ భావించారు. కానీ, అంటార్కింటిక్ మహాసముద్రంలోని సుదూర లోతుల్లో స్నేక్ షార్క్‌ను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆరు అడుగుల పొడవు పెరిగే స్నేక్ షార్క్‌లు 25 వరుసల్లో 300 పదునైన పళ్లను కలిగివుంటాయని చెప్పారు. ఇతర షార్క్‌లు, చేపలు, ఆక్టోపస్‌ల శరీరాలను తన పళ్లతో స్నేక్ షార్క్ చీర్చి ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లోని సముద్ర తీరాల్లో స్నేక్ షార్క్ నివాసం ఉంటున్నట్లు వెల్లడించారు. భూమిపై ఉన్న ప్రపంచంలో ఇప్పటివరకూ మనిషి అన్వేషించింది కేవలం 5 శాతం మాత్రమేనని చెప్పారు. మిగిలిన 95 శాతం ప్రపంచంలో నివసిస్తున్న జీవరాశి గురించి మనకు తెలియాల్సింది చాలానే ఉందని తెలిపారు. -
ఇది నిజం : ప్రపంచానికే కరెంట్ ఇద్దాం
మియామి : ఆధునిక ప్రపంచంలో ఒక్క క్షణం కరెంట్ పోతే? జనజీవనం స్థంభించి పోతుంది అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. నేడు ప్రపంచమంతా విద్యుత్ చుట్టే తిరుగుతోంది. విద్యుత్ ఉత్పాదన కోసం ప్రపంచ దేశాలన్నీ విపరీంగా ఖర్చు చేస్తున్నాయి. అన్ని రకాల వనరులను విపియోగించుకుంటున్నాయి. సంప్రదాయి ఇంధన వనరులతో పాటూ, సౌర, పవన, అణు విద్యుత్ ఉత్పాదన వైపు అడుగులు వేస్తున్నాయి. అయినా సరిపడ విద్యుత్ ఉత్పాదనను సాధించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు అమెరికాలోని కార్నెగీ విశ్వవిద్యాలయ సైంటిస్టులు తీపి కబురు అందించారు. అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర తీరంలో వపన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే.. మొత్తం ప్రపంచానికి సరిపడే విద్యుత్‌ను అందించవచ్చని తాజాగా కార్నెగీ సైంటిస్టులు ప్రకటించారు. అయితే ఇదేమంతా ఆషామాషీగా చేపట్టే ప్రాజెక్ట్ కాదని.. దీనికి అంతర్జాతీయ సహాయసహకారాలు అవసరమవుతాయని సైంటిస్టులు తెలిపారు. ఉత్తర అట్లాంటిక్ తీరంలో మూడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పవన విద్యుత్‌ను ఏర్పాటు చేస్తే.. మొత్తం ప్రపంచానికి అవసరమైన విద్యుత్‌ను అందించవచ్చని వారు చెబుతున్నారు. -
అట్లాంటిక్‌పై భయానక ప్రయాణం
ప్యారిస్ : వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.. అందులో వందల మంది ప్రయాణికులు.. అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణం.. హఠాత్తుగా ఇంజిన్ ఫెయిల్.. ఒక్కసారిగా ప్రయాణికులు పరిస్థితి ఊహించుకోండి.. అందులో మీరుంటే? ఇది ఇంకా భయానకం. సరిగ్గా ఇటువంటి ప్రయాణమే ఎయిర్ ఫ్రాన్స్-380 ప్రయాణికులకు ఎదురైంది. ప్యారిస్ నుంచి లండన్ మీదుగా.. లాస్ ఎంజెల్స్‌కు వెళుతోంది. సరిగ్గా లండన్ హీత్రూ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుని... అట్లాంటిక్ మీదుగా లాస్ ఎంజిల్స్‌కు వెళుతోంది. అప్పుడు ఫ్లయిట్ భూమికి 35 వేల అడుగుల ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. ఇంతలో ఒక పక్షి.. అంతే వేగంగా వచ్చి ఫ్లయింట్ ఇంజిన్‌ను ఢీ కొట్టింది. ఒక్కసారిగా విమానం కుదుపుకు గురయింది.. ప్రయాణికుల్లో కలవరం మొదలైంది. పక్షి ఢీ కొట్టిన కొన్ని క్షణాలకూ ఇంజిన్ పై భాగం మొత్తం డ్యామేజ్ అయింది.. ఏం జరుగుతుందో గుర్తించే లోపే.. అందకీ అర్థమయింది. ప్రమాదాన్ని అంచనా వేసిన పైలెట్ ఫ్లయిట్‌ని కెనడాలోని గూస్ బే ఎయిర్‌పోర్టుకు మళ్లించాడు.. అయితే అంత దూరం ప్రయాణించదనుకుని.. దగ్గర్లోని గడ్డి మీద అత్యంత సురక్షితంగా ఎయిర్ ఫ్రాన్స్‌ని ల్యాండ్ చేశాడు. పక్షి ఢీ కొట్టిన తరువాత ఇంజిన్ ఫొటోలు, ల్యాండింగ్ సమయంలో.. అక్కడే ఉన్న ఒక వ్యక్తి తీసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌గా మారాయి. -
అట్లాంటిక్‌పై భయానక ప్రయాణం
-
ఇర్మా ఎఫెక్ట్ : మాయమైన సముద్రం
-
33 ఏళ్ల తర్వాత బీచ్ కనిపించింది!
-
33 ఏళ్ల తర్వాత బీచ్ కనిపించింది!
ఐర్లాండ్: కాలగర్భంలో కలిసిసోయిందనుకున్న ఓ బీచ్ 33 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించింది. అదేంటి బీచ్ తప్పిపోయిందా అని షాకవుతున్నారు కదూ.. సాధారణంగా మనుషులు, జంతువులు, పక్షులు ఇలా తప్పిపోవడం మళ్లీ కొన్ని రోజులకో, సంవత్సరాలకో మళ్లీ కనిపించడంతో మనం ఆశ్చర్యపోతుంటాం. అయితే ఐర్లాండ్‌లో 1984లో కనుమరుగైన బీచ్ 33 ఏళ్ల తర్వాత కనువిందు చేస్తోంది. పశ్చిమ ఐర్లాండ్‌లోని స్థానిక దూగ్ ఏరియాలో అచిల్ ద్వీపంలో మొత్తం ఆరు బీచ్‌లు ఉండేవి. అయితే 33 ఏళ్ల కిందట వరదలు, తుపానులు రావడంతో ఓ బీచ్ అట్లాంటిక్ మహా సముద్రంలో కలిసిపోయింది. బీచ్ తీరంలోని ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోవడంతో రాళ్లు మాత్రమే ఇక్కడ మిగిలిపోయి రెండూ ఏకమయ్యామని స్థానికులు చెబుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తీరానికి ఇసుక కొట్టుకవచ్చి సముద్రం, బీచ్ వేరు పడ్డాయి. ఈ బీచ్‌ను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఐర్లాండ్ లో అచిలీద్వీపమే అతిపెద్దదని అచిల్ పర్యాటకశాఖ అధికారి సీన్ మోల్లాయ్ తెలిపారు. ఈ ప్రసిద్ధ బీచ్‌లో నాలుగు హోటళ్లు అధిక సంఖ్యలో అతిథిగృహాలు ఉన్నాయని చెప్పారు. ఇదివరకూ ఐదు బ్లూ ఫ్లాగ్ బీచ్లుండేవని, ఇప్పుడు వీటి సంఖ్య మళ్లీ ఆరుకు చేరిందని అధికారి హర్షం వ్యక్తంచేశారు. పర్యాటకశాఖ అధికారులు ఈ బీచ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. -
ప్రయోగం విజయవంతం
ఉపగ్రహాలను భూమిపై స్థిరప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించడం చూశాం. అందుకు భిన్నమైన ప్రయోగమిది. కింద బిగించిన ఉపగ్రహాలున్న రాకెట్‌ను విమానం మోసుకెళ్తుంది. ఆకాశంలో వెళ్తున్నపుడు దాని నుంచి విడివడి రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. తుపాన్ల జాడ పసిగట్టి, వాటి సామర్థ్యాన్ని అంచనావేసి, హెచ్చరించే 8 ఉపగ్రహాలున్న నాసా ‘సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్’ను రాకెట్ విజయవంతంగా అట్లాంటిక్ సముద్రంపై 39వేల అడుగుల ఎత్తులో ప్రయోగించింది. యూఎస్‌లోని కేప్ కనావరెల్లో తీసిందీ ఫొటో. -
హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం..చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్
అట్లాంటిక్ సముద్రంలో 6,600 కి.మీ. కేబుల్ ఏర్పాటుకు ప్రయత్నం శాన్ఫ్రాన్సిస్కో: హై-స్పీడ్ ఇంటర్నెట్ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు రెండూ చేతులు కలిపాయి. అట్లాంటిక్ సముద్రం అడుగున కేబుల్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఒకే వేదికపైకి వచ్చాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్, క్లౌడ్ సేవల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, దాన్ని అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు 6,600 కిలోమీటర్ల మేర కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీనికి ‘మరియా’ అని నామకరణం చేశాయి. దీని సామర్థ్యం 160 టీబీపీఎస్‌గా ఉంటుందని అంచనా. దీంతో అట్లాంటిక్ సముద్రంలో నిర్మితమౌతున్న అత్యధిక సామర్థ్యం ఉన్న కేబుల్‌గా మరియా అవతరించనున్నది. అలాగే అమెరికా, యూరప్‌ను కలుపుతూ ఏర్పాటవుతోన్న తొలి కేబుల్ కూడా ఇదే. కేబుల్ ఏర్పాటు వర్జీనియా బీచ్ (అమెరికా) నుంచి బిల్బావు (స్పెయిన్) వరకు జరగనున్నది. 2017 నాటికి పూర్తి: కేబుల్ నిర్మాణ పనులు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం అవుతాయని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఇక కేబుల్ ఏర్పాటు 2017 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని పేర్కొన్నాయి. -
అట్లాంటిక్ మీదుగా ‘నెట్’ కనె క్షన్
వాషింగ్టన్: అమెరికా నుంచి యూరోప్‌కు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వాలని మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సంయుక్తంగా నిర్ణయించాయి. ఇంటర్నెట్ సదుపాయాన్ని వేగంగా, సులభతరం చేయడానికే ఈ పనిని చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు సంయుక్తంగా తెలిపాయి. ‘మరియా’ అనే కొత్త కేబుల్ (సెకన్‌కు 160 టెరాబైట్స్ బ్యాండ్‌విడ్త్ వేగంతో) సహాయంతో అత్యధిక వేగంతో ఆన్లైన్ సేవలు అందించనున్నామని పేర్కొన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో దీని పనులు మొదలుపెట్టి 2017 అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు వెల్లడించాయి. -
టైటానిక్ ఢీకొన్న పర్వతానికి లక్ష ఏళ్లు
లండన్: అట్లాంటిక్ మహాసముద్రంలో 1912, ఏప్రిల్ 14న టైటానిక్ ఓడ మునిగిపోవడానికి కారణమైన మంచు పర్వతం (ఐస్‌బర్గ్) లక్ష ఏళ్ల నాటి దని శాస్త్రవేత్తలు తేల్చారు. బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాంట్ బిగ్ అనే శాస్త్రవేత్త తన సమష్టి అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. 1912 నుంచి వాతావరణ శాఖ జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని తన పరిశోధనకు తీసుకున్నారు. మహాసముద్రాల ప్రవాహాలు, గాలి అనే అంశంపై జరిపిన అధ్యయనంతో లభించిన ఆధునిక సమాచారాన్ని గత సమాచారంతో కలపి విశ్లేషించిన గ్రాం ట్ బిగ్ ‘టైటానిక్’ ఓడ ఢీకొన్న పర్వతం వయసును నిర్ధారించారు. మంచుపర్వతం వయసును లెక్కకట్టగలిగిన ఓ మోడల్ కంప్యూటర్ ను బిగ్ ఉపయోగించినట్లు సండేటైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ మంచు పర్వతం 400 అడుగుల పొడవు, సముద్ర ఉపరితలంపై 100 అడుగులకు పైగా ఎత్తు, 1.5 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు మంచు పర్వతం పరిమాణాన్ని మొదట అంచనా వేశారు. కానీ, బిగ్ అధ్యయనం ప్రకారం 1700 అడుగుల పొడవు, 75 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు చెబుతున్నారు. -
అట్లాంటి'క్' ఇట్లాంటి హీరోలు కాదు వీళ్లు!
ఫొటోలో ఉన్న ఇద్దరి పేర్లు రాబిన్ ఊల్ఫ్, డేవీ డూప్లెసీ. తల్లీ, కుమారులు. వీరిద్దరు ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి బ్రెజిల్‌లోని రియో డీ జెనీరో వరకు వెళ్లాలనుకుంటున్నారు. అంటే రెండింటికి మధ్య ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం దాటాలన్న మాట. అయితే విమానంలోనో.. షిప్లోనో కాదు.. పడవలో. అది కూడా తొక్కుడు పడవలో. ఈ పడవకు ఇంజన్, మోటార్ వంటివి ఏమీ ఉండవు కాబట్టి వాళ్ల కాళ్ల బలాన్ని నమ్ముకోవాల్సిందే.. ఇంతకీ ఆ రెండు ఊళ్ల మధ్య దూరం ఎంతో తెలుసా.. దాదాపు 6,450 కిలోమీటర్లు. అంత దూరం ఆ తొక్కుడు పడవలోనే వెళ్లాలన్నది వారి సంకల్పం. అంటే వీరు ఓ సాహస యాత్ర చేస్తున్నారన్న మాట.. మరి అంత కష్టపడి అక్కడికి వెళ్లాల్సిన అవసరం వారికేముందనే కదా మీ అనుమానం! జీవ జాతులు అంతరించిపోతున్నాయన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నది వారి ఆకాంక్ష. వాటిని కాపాడుకోకుంటే మన మనుగడకూ ముప్పు తప్పదని వారు హెచ్చరించేందుకే ఈ సాహస యాత్ర. కాగా, డూప్లెసీకి సాహస యాత్రలు చేయడం కొత్తేమీ కాదు. మూడేళ్ల కింద కయాకింగ్ బోటుపై అమెరికాలోని అమెజాన్ నదిపై సాహస యాత్ర చేశాడు. ఆ సమయంలో కొందరు దుండగులు అతడిపై కాల్పులు జరపగా, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి ఎలాగోలా బతికి బయటపడ్డాడు. ఇప్పుడు మరో సాహస యాత్రకు పూనుకున్నాడు. ఈ యాత్రలో తన తల్లి కూడా తోడు కావడం సంతోషంగా ఉందని డూప్లెసీ పేర్కొన్నాడు. ఈ యాత్రను నాలుగు నెలల్లోపు పూర్తి చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఇటీవలే తన సాహసయాత్రలపై ‘చూసింగ్ టు లివ్’ అనే పుస్తకం కూడా రాశాడు. ఇటీవలి కాలంలో అంతరించిపోతున్న జీవజాతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భూ చరిత్రలో మొత్తం ఇప్పటివరకు 5 సార్లు దాదాపు అన్ని జీవులు అంతరించిపోయి మళ్లీ పునరుద్ధరణ అయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. మానవ చర్యల కారణంగా జీవ జాతులు కనుమరుగవుతున్నాయన్నది నగ్న సత్యం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో 35 ఏళ్లలో భూమి మీదున్న సగం జీవజాతులు అంతరించిపోయే ప్రమాదముంది. -
అదృశ్యనౌక
మిస్టరీ * ఎప్పుడో మునిగిపోయిన ఓడ * ఇప్పుడెలా కనిపిస్తోంది? * ఎందుకు భయపెడుతోంది? నార్వే... 16వ శతాబ్దం... ‘‘హాయ్ డియర్... ఏం చేస్తున్నావ్? లంచ్ రెడీయా?’’... ఇంట్లో అడుగు పెడుతూనే భార్యను పలకరించాడు ఫ్రాంక్. ఎలిన్ మాట్లాడలేదు. సోఫాలో అలానే కూర్చుని ఉంది. ఎటో చూస్తోంది. ఆ కళ్లలో ఏదో భయం. నుదుటి మీద ఉన్న స్వేద బిందువుల్ని చూస్తుంటే ఆమె దేనికో భయపడుతోందని అర్థమవుతోంది. భార్యనాస్థితిలో చూసి కంగారు పడ్డాడు ఫ్రాంక్. గబగబా ఆమె దగ్గరకు వెళ్లాడు. ‘‘ఏంటి ఎలిన్... ఏమైంది? ఎందుకలా ఉన్నావ్? ఎందుకలా భయంగా చూస్తున్నావ్?’’ అన్నాడు పక్కనే కూర్చుంటూ. అప్పుడు కూడా ఎలిన్ మాట్లాడలేదు. మెల్లిగా తలతిప్పి భర్తవైపు చూసింది. మరుక్షణంలో ‘ఫ్రాంక్’ అంటూ అతడి గుండెలపై వాలిపోయి బావురుమంది. విస్తుపోయాడు ఫ్రాంక్. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఎలిన్ ఎందుకలా ఏడుస్తోందో తెలియక తికమకపడ్డాడు. ‘‘ఏమైంది డియర్? ఎవరికైనా ఏమైనా అయ్యిందా? ఏదైనా దుర్వార్త విన్నావా? మీ ఇంట్లోవాళ్లంతా బాగానే ఉన్నారా?’’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల్ని కురిపించాడు భార్యను గట్టిగా హత్తుకుంటూ. అతని ప్రశ్నలు పూర్తయ్యేసరికి కాస్త నెమ్మదించింది ఎలిన్. అందరూ బాగానే ఉన్నారన్నట్టు త లూపుతూనే తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని భర్తకు చూపించింది ఎలిన్. దాన్ని అందుకుని చదవడం మొదలుపెట్టాడు ఫ్రాంక్. ‘‘డియర్ ఎలిన్... ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు పదే పదే గుర్తొస్తున్నావు. నిన్ను చూసి చాలా రోజులయ్యింది కదా! అందుకేనేమో... ఒక్కసారి కళ్లారా చూడాలని మనసు తహతహలాడుతోంది. వీలు చూసుకుని వస్తాను. ఫ్రాంక్‌ని అడిగానని చెప్పు. టేక్ కేర్ తల్లీ.... ఇట్లు మీ నాన్న ఎరిక్.’’ ఉత్తరం చదువుతూనే కొయ్యబారిపోయాడు ఫ్రాంక్. ‘‘ఏంటి ఎలినా ఈ ఉత్తరం?’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో. ‘‘నాకూ అదే అర్థం కావడం లేదు ఫ్రాంక్. నాన్న ఏమిటి? ఉత్తరం రాయడం ఏమిటి? పోనీ పాత ఉత్తరమేదైనా ఇప్పుడు వచ్చిందా అంటే అదీ లేదు. కవర్ కొత్తగా ఉంది. ఇదెలా సాధ్యం?’’ ఫ్రాంక్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకో అతడికీ భయంగానే ఉంది. ఆ ఉత్తరాన్ని చూసేకొద్దీ అతడికి వణుకు పుడుతోంది. అందుకే ఆ విషయాన్ని తేలిగ్గా తీసి పారేయబుద్ధి కాలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. ఎలినాని తీసుకుని పోలీస్ స్టేషన్‌కి బయలుదేరాడు. ‘‘ఒక ఉత్తరాన్ని చూసి ఇంత భయపడుతున్నారేంటి మీరు? ఏం... మీ నాన్నగారు ఉత్తరం రాయకూడదా?’’ ఇన్స్పెక్టర్ ప్రశ్నకి ముఖముఖాలు చూసుకున్నారు ఫ్రాంక్, ఎలినా. ‘‘రాయకూడదని, రాయరని కాదు సర్. రాయడానికి అసలు ఆయన లేరు. ఎప్పుడో చనిపోయారు.’’ ఈసారి ఇన్స్పెక్టర్ ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏమంటున్నారు?’’ అన్నాడు చురుక్కున. ‘‘నిజం సర్. మా నాన్నగారు చనిపోయారు. అది కూడా ఇప్పుడు కాదు. ఎనభయ్యేళ్ల పైనే అయ్యింది. 1600 సంవత్సరంలో ఆయన ప్రయాణిస్తోన్న ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఒక్కరు కూడా మిగల్లేదు. మరి ఇప్పుడు ఆయన ఉత్తరం ఎలా రాస్తారు సర్?’’ ఎలినా చెప్పిన మాటలు వింటే చాలా విచిత్రంగా అనిపించింది ఇన్స్పెక్టర్కి. చనిపోయిన మనిషి ఉత్తరం ఎలా రాస్తాడు అన్న ఆలోచన అతని ఖాకీ గుండెని సైతం కాస్త కంగారు పెట్టింది. ‘‘ఒకవేళ ఆయన అప్పుడు చనిపోలేదేమో. తప్పించుకుని బయటపడ్డారేమో. ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఉత్తరం రాశారేమో’’ అన్నాడు లాజికల్‌గా ఆలోచిస్తూ. ‘‘ఆ ప్రమాదం జరిగేనాటికే ఆయనకు అరవయ్యేళ్లు దగ్గర పడ్డాయి. మరి ఇన్నేళ్లు ఆయన ఉండి ఉంటారంటారా? ఒకవేళ రాసినా ఉత్తరంలో ఆ విషయాలన్నీ రాస్తారు. కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. అవేమీ లేవే! కనీసం స్టాంపులు అంటించలేదు. పోస్టల్ ముద్ర కూడా లేదు.’’ ఫ్రాంక్ మాటలు విన్న తర్వాత ఇక మాట్లాడలేకపోయాడు ఇన్స్పెక్టర్. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పి చూశాడు. ఒకటికి రెండుసార్లు చదివి చూశాడు. ఏమీ తట్టలేదు. ఆ దంపతులిద్దరికీ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ‘‘నేను ఎంక్వయిరీ చేస్తాను. మీరు వెళ్లండి’’ అని పంపించేశాడు. ఆ తర్వాత కూడా చాలాసేపు జుత్తు పీక్కున్నాడు ఇన్స్పెక్టర్. ఆ ఉత్తరం గురించి ఎంక్వయిరీ చేయడానికి కూడా ప్రయత్నించాడు. కానీ ఎంత వెతికినా ఏ ఒక్క ఆధారమూ దొరకలేదు. దొరకదన్న విషయం అతనికి తెలియదు. ఎందుకంటే ఎలిన్ తండ్రి చనిపోయింది ‘ఫ్లయింగ్ డచ్‌మ్యాన్ షిప్’ ప్రమాదంలో. ఆ ఓడ ఒక మిస్టరీ. ఆ ఓడకు జరిగిన ప్రమాదం ఒక మిస్టరీ. దానికి సంబంధించిన ప్రతి విషయమూ ఒక మిస్టరీ. ఆ సంగతి ఇన్స్పెక్టర్కి తెలియదు పాపం. తెలిసి ఉంటే అతడు అంత కష్టపడేవాడు కూడా కాదు. అసలింతకీ ‘ఫ్లయింగ్ డచ్‌మ్యాన్’ కథ ఏంటి? ఫ్లయింగ్ డచ్‌మ్యాన్... ఓ అందమైన ఓడ. 1600 సంవత్సరంలో ఓ రోజు అట్లాంటిక్ సముద్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కెప్టెన్ డెకెన్తో పాటు, కొందరు సిబ్బంది, కొందరు ప్రయాణీకులతో హుందాగా జలాలపై నడిచింది. కానీ ఆ ప్రయాణమే దాని ఆఖరు ప్రయాణమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఓడ సముద్రం మధ్యలో సాగుతున్నప్పుడు హఠాత్తుగా తుపాను రేగింది. అలలు ఉవ్వెత్తున ఎగశాయి. ఓడను నిలువునా కుదిపేశాయి. తమ బలంతో దాన్ని ముక్కలు చేసేశాయి. వందలాది మందిని నీట ముంచేశాయి. వారి ప్రాణాలను గాలిలో కలిపేశాయి. అయితే కథ అక్కడితో ముగిసి పోలేదు. అక్కడే మొదలైంది. ఆ ఓడ కానీ, దాని శిథిలాలు కానీ ఎవరికీ దొరకలేదు. మృతదేహాలూ దొరకలేదు. కానీ కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ఆ ఓడ, ఆ మనుషులు అందరినీ వెంటాడసాగారు. సిబ్బంది కుటుంబ సభ్యుల్లో కొందరికి వారి నుంచి ఉత్తరాలు వచ్చాయి. అది కూడా చాలా యేళ్లు గడిచిపోయాక. చని పోయినవాళ్లు ఉత్తరాలు ఎలా రాశారో ఎవరికీ అర్థం కాలేదు. ఆరా తీస్తే ఆ ఉత్తరాలు ఎక్కడ్నుంచి వచ్చాయో కూడా ఎవరికీ అర్థమయ్యేది కాదు. అదే భయానకమైన అనుభవం అంటే... అట్లాంటిక్ సముద్రంలో... ఓడ ప్రమాదానికి గురైన చోట చిత్ర విచిత్రాలు జరగడం మొదలయ్యింది. ఓడలు, పడవలు ఆ దారి గుండా వెళ్తునప్పుడు ఉన్నట్టుండి ఎదురుగా ‘ఫ్లయింగ్ డచ్‌మ్యాన్’ ప్రత్యక్షమయ్యేది. వేగంగా దూసుకొచ్చేది. అది తమ ఓడను గుద్దేస్తుందేమోనని కెప్టెన్లు కంగారు పడేవారు. కానీ అలా జరిగేది కాదు. కొన్నిసార్లు ఆ ఓడ గాలిలోకి కూడా లేచేదట. అది మాత్రమే కాక కెప్టెన్ డెకెన్ కూడా చాలామందికి కనిపించేవాడు. నీళ్లమీద నడిచేవాడు. గాలిలో ఎగిరేవాడు. ఒక్కోసారి పడవల్లో, ఓడల్లో కూడా ప్రత్యక్షమయ్యేవాడు. దాంతో అందరూ హడలిపోయేవారు. కానీ అదృష్టం ఏమిటంటే... ఎవరికీ ఏ ప్రమాదమూ సంభవించలేదు. డెకెన్ ఆత్మ కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టేది కాదు. మొదట్లో వీటిని అందరూ భ్రమ అని కొట్టి పారేశారు. కానీ ఓడల్లో ప్రయాణిస్తు న్నప్పుడు కొందరు ప్రముఖులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదరవడంతో విస్తృతంగా ప్రచారం జరిగింది. దాంతో పరిశోధనలు మొదలయ్యాయి. నిజ నిర్ధారణ చేసేందుకు బృందాలు బయలుదేరాయి. చివరికి వారిలో కూడా కొందరు ఆ దెయ్యపు ఓడని, డెకెన్ ఆత్మని చూసి జడుసుకున్నారు. దాంతో ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడసాగారు. దెయ్యాలనీ భూతాలనీ నమ్మనివారు మాత్రం అదంతా వట్టి పుకారు అని కొట్టి పారేశారు. ఇలాంటి మిస్టరీల విషయంలో ఎప్పుడూ రెండు వాదనలు వినిపిస్తాయి. నిజమనే వారితో పాటు భ్రమ అనే వర్గం కూడా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం. ఒక్కసారి భయం మొదలయ్యాక దాన్ని తీసేయడం అంత తేలిక కాదు. అందుకే దెయ్యం అన్న మాట ఈ ఆధునిక యుగంలో కూడా ఎంతో మందిని వణికి స్తోంది. ఫ్లయింగ్ డచ్ మ్యాన్ ఉదంతం పుస్తకాలుగా, సినిమాలుగా మాటిమాటికీ ముందుకొచ్చి భయపెడుతూనే ఉంది. ఫ్లయింగ్ డచ్మ్యాన్ని ఘోస్ట్ షిప్, ఫాంటమ్ షిప్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. దీని గురించి అనేక రకాల వాదనలు ఉన్నాయి. సముద్రగర్భంలో ఓడ శిథిలాలు కనిపించలేదు. ఒక్కటంటే ఒక్క మృతదేహం కానీ, అవశేషాలు కానీ కనిపించలేదు. నేవీ రికార్డుల్లో కూడా ఫ్లయింగ్ డచ్‌మ్యాన్ గురించి సరైన ఆధారాలు లభించకపోవడంతో అసలు అలాంటి ఓడే లేదు అన్నారు కొందరు. ఒకవేళ అదే నిజమైతే మరి ఆ సిబ్బంది సంగతేంటి? వాళ్లందరూ ఓడలో వెళ్లారని వాళ్ల కుటుంబ సభ్యులు చెప్పారు. పైగా వాళ్లెవరూ ఎప్పుడూ ఇళ్లకు తిరిగా రాలేదు కూడాను. మరి అంతా అబద్ధమని, ఈ ఉదంతాన్ని భ్రమ అని ఎలా కొట్టి పారేయగలం?! ఈ ప్రశ్న దగ్గరే ప్రతిసారీ బ్రేక్ పడసాగింది. దాంతో ఈ ఓడ ఉదంతం నేటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. -
ఇంగ్లాండ్ ఈజ్ రిలేటడ్ టు అట్లాంటిక్ ఓషన్
Competitive Guidance:Banks English K. LALITHA BAI Associate Professor in English, Hyderabad. In the last session we have seen comprehension passages, cloze test, substitution and rearranging the sentences to form meaningful passage. To provide a better clarity let us take a look at the other areas and practice a few more tests. Directions: which of the phrases (a), (b), (c) and (d) given below each sentence should replace the phrase printed in bold type to make the sentence grammatically correct? If the sentence is correct as it is, mark (e) i.e. No correction required as the answer. 1.Lift the handset only after paid a one rupee coin. a) Paying a one-rupee coin b) You pay one rupee coin c) You paid rupee coin d) Pay one rupee coin e) No correction required 2.Good life according to many people is to making more and more money. a) Is making b) Is made c) Are made d) Are making e) No correction required 3.His behaviour with all his employees is so pleasing, that everyone come forward for helping him. a) Came towards him for help b) Comes towards him for help c) Comes forward to help him d) Comes forward for help him e) No correction required 4. A master should never impose his servants too much work. a) His servants with too much work b) Too much work with his servants c) Too much work on his servants d) Much work for his servants e) No correction required 5. What matter does most is the quality and not the quantity. a) What does matter b) What does it matter c) That matters d) What matters e) No correction required 6. The commissioner burst into rage and ordered immediately suspension of the inspector who had arrested the innocent boy. a) Order immediately b) Order immediate c) Ordered immediate d) Ordering immediate e) No correction required 7. He would be like to have some ice-cream. a) Would like to b) Would be liked to c) Was to be liking to d) Would being liked to e) No correction required 8. Not knowing the language and had no friends in the country, he found it impossible to get job. a) Has no b) With having c) With having not d) Having no e) No correction required 9. She will not attend the meeting until she is asked to. a) Except b) Even with c) Even except d) Unless e) No correction required 10. Because of his smart work, he is in the good books of his employer. a) In the better books b) In the good book c) In the best books d) Into the best book e) No correction required 11. A student was arrested for displaying an indecently artwork in public. a) An indecent b) Indecently c) The indecently d) Any of incident e) No correction required 12. He did not like me to smoking in the presence of teacher yesterday. a) That I smoke b) My smoking c) Me smoking d) Smoking by me e) No correction required 13. The scenery around the hill stations of Himachal Pradesh is quite picturesque and enjoyed. a) Quite picturesque and enjoyable b) Quite picturesque and enjoy c) Quietly picturesque and enjoyed d) Quietly picturesque and enjoyable e) No correction required 14. Within three years, he demonstrated a dramatic improved business performance. a) Dramatic improved b) The dramatically improved c) A dramatically improved d) A dramatic improvement e) No correction required 15. Had he been presented there, he would have put an end to the happenings. a) If he had been presented b) If he had been present c) Had he present d) If he present e) No correction required Answers: 1.A - the gerund form of the verb (-ing) should be used. 2.A - 'to making' is a wrong construction in this sentence 3.C - to infinitive form of the verb should be used instead of the gerund form 4.C 5.D - the usage of 'does' is not required in this sentence 6.C - the adjective form of the word is the correct usage 7.A 8.D 9.D - the right conjunction to be used in this sentence is not 'until' whereas it is 'unless' 10.E 'to be in the good books' an expression used for appreciation 11.A- adjective should be used to qualify a noun 12.B- After 'like' a gerund should come and before gerund pronoun should be in possessive form. 13.A- the adjective of 'enjoy' is required 14.C- Determiner+ Adverb + Adjective + Noun. Here 'a' is proper. 15.B- Past conditional sentence (If+ S + had +V3, S + would have + V3) Directions: Choose the correct analogy from the four alternatives given 1.'Braille' is related to 'Blindness' in the same way as 'Sign' is related to a) Exceptional b) touch c) deafness d) presentation 2.'Boat' is related to 'Oar' in the same way as 'Bicycle' is related to a) Road b) wheel c) seat d) paddle 3. 'Match' is related to 'Victory' in the same way as 'Examination' is related to a) write b) appear c) success d) attempt 4. 'Heart' is related to 'Blood' in the same way as 'Lung' is related to a) Oxygen b) chest c) purification d) air 5. 'Face' is related to 'Expression' in the same way as 'Hand' is related to a) Gesture b) work c) handshake d) pointing 6. 'Wine' is related to 'Grapes' in the same way as 'Vodka' is related to a) apples b) potatoes c) oranges d) flour 7. 'Golf' is related to 'Holes' in the same way as 'Baseball' is related to a) innings b) goal c) points d) serve 8. 'England' is related to 'Atlantic Ocean' in the same way as 'Greenland' is related to a) Pacific ocean b) Atlantic Ocean c) Arctic ocean d) Antarctica ocean 9. 'Demographer' is related to 'People' in the same way as 'Philatelist' is related to a) fossils b) stamps c) photography d) music 10. 'Eye' is to 'See' in the same way as 'Ear' is to a) Ring b) sound c) hear d) smell 11. 'Disease' is related to 'Pathology' in the same way as 'Planet' is related to a) sun b) satellite c) astronomy d) orbit 12. 'Mountain' is related to 'Valley' in the same way as 'Enemy' is related to a) cruel b) stranger c) friend d) country 13. 'Horse' is related to 'Hoof' in the same way as 'Eagle' is related to a) claw b) clutch c) leg d) foot 14. 'Cube' is related to 'Square' in the same way as 'Square' is related to a) plane b) triangle c) line d) point 15. 'Much' is related to 'Many' in the same way as 'Measure' is related to a) count b) calculate c) measure d) weight Answers: 1.C- 'Braille' is the technique of reading and writing for the blind persons. Similarly 'Sign language' is the technique of reading and writing for the deaf persons. 2.D- 'Oar' is a device to push a 'Boat'. In the same way 'Paddle' is used to push the 'Bicycle'. 3.C- 'Victory' may be an outcome of 'Match'. Likewise 'Success' is one of the outcomes of 'Examination'. 4.A- 'Heart' is the organ which deals with the pumping and flow of 'Blood'. In the same way 'Lungs' deals with the storage and flow of 'oxygen'. 5.A- 'Expression' a person is read from the 'Face'. Likewise 'Gesture' of a person is read from the position of the 'Hand'. 6.D- 'Wine' is made from 'grapes' and 'Vodka' is made from 'Flour'. 7.A- 'Holes' is related to 'Golf'. In the same way, 'innings' is related to 'baseball'. 8.C- 'England' is situated in 'Atlantic Ocean'. 'Greenland' is situated in 'Arctic Ocean'. 9.B- 'Demographer' is related with the study of Statistics related to 'People'. Similarly 'Philatelist' is related to the study of 'Stamps'. 10.C- The function of the 'Eye' is to see and that of 'Ear' is to 'Hear'. 11.C- 'Pathology' is the branch of medical science which helps to detect symptoms of 'Diseases' and 'Astronomy' is the study to know about 'Planets'. 12.C - 'Mountain' is antonym of 'Valley'. Likewise 'Friend' is the antonym of 'Enemy'. 13.A- The lower part of feet of 'Horse' is known as 'Hoof'. In the same way, lower part of the feet of 'Eagle' is known as 'Claw'. 14.C- 'Cube' comprises 'Square' on all of its surfaces, likewise 'Square' has 'Line' on all its side. 15.A- 'Much' is synonym of 'Many'. Similarly, 'Measure' is synonym of 'Count'. -
హత్య కేసులో ఇద్దరికి బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: అట్లాంటిక్ సముద్రంలో ఓ పడవలో నేవీ కెప్టెన్‌ను హత్య చేసిన కేసులో అరెస్టయిన ఇద్దరికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది తీవ్రమైన నేరమన్న జస్టిస్ కైలాశ్ గంబీట్, జస్టిస్ ఇందర్‌మీట్ కౌర్ నేతృత్వంలోని ధర్మాసనం వివేక్ మందోక్, శంకర్ భాటియాలకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. 2004, ఏప్రిల్ నాలుగున ఓ పడవలోని తన కేబీన్‌లో ఉన్న కెప్టెన్ రాజన్ అగర్వాల్‌ను హత్య చేసిన వివేక్, శంకర్లు మృతదేహాన్ని సముద్రంలోకి విసిరేశారు.