రూ. మూడు కోట్ల ఇల్లు.. 11 సెకెన్లలో కొట్టుకుపోయిందిలా.. | Hurricane Ernesto: 3 Crore House Collapses Into Atlantic Ocean On North Carolina Outer Banks, Watch Video Inside | Sakshi
Sakshi News home page

రూ. మూడు కోట్ల ఇల్లు.. 11 సెకెన్లలో కొట్టుకుపోయిందిలా..

Published Tue, Aug 20 2024 11:55 AM | Last Updated on Tue, Aug 20 2024 12:36 PM

3 Crore House Collapses into Atlantic Ocean North Carolina

అతని కలల ఇల్లు సముద్ర కెరటాలకు కొట్టుకుపోయింది. అవును.. ఇది నిజం. ఈ ఉదంతం అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఇక్కడి సముద్రతీరంలో నిర్మించిన విలాసవంతమైన, అందమైన ఇల్లు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయింది.

ఆగస్టు 16న వచ్చిన ఎర్నెస్టో హరికేన్ ఈ రూ. ​మూడు కోట్ల విలువైన ఈ ఇంటిని కేవలం 11 సెకెన్లలో ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తుఫానుకు ఎగసిపడుతున్న సముద్రపు అలలు ఆ ఇంటిని సముద్రంలోనికి లాక్కెళ్లిపోవడాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ అందమైన ఇల్లు 1973లో నిర్మితమయ్యింది. ఇంతకాలం ధృడంగా నిలిచిన ఈ ఇల్లు శక్తివంతమైన అలలకు కొట్టుకుపోయింది.

ఈ వీడియోను ఆగస్టు 18న @CollinRugg హ్యాండిల్‌తో మైక్రోబ్లాగింగ్ సైట్  ఎ‍క్స్‌లో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో.. నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున నిర్మించిన ఈ సముద్రతీర ఇల్లు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అట్లాంటిక్‌లో ఎర్నెస్టో హరికేన్ కారణంగా ఈ సంఘటన జరిగింది. ఇంటి యజమాని ఈ నాలుగు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్రూమ్ ఇంటిని 2018లో సుమారు రూ. 3 కోట్లు ($339,000) వెచ్చించి కొనుగోలు చేశారు’ అని రాశారు.

ఈ పోస్ట్‌కు లక్షలాది వ్యూస్‌, వేల సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి. వందలాది మంది యూజర్స్‌ పలు రకాలుగా కామెంట్‌ చేస్తున్నారు. ఒక యూజర్‌..‘అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఒక మూర్ఖపు నిర్ణయం’ అని రాశారు. మరొక యూజర్‌ ‘నార్త్ కరోలినా సముద్రంలో తుఫానులు సర్వసాధారణం. ఈ ఇంటిని కొనుగోలు చేసిన వారు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని ఉండాల్సింది’ అని రాశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement