North Carolina
-
USA Presidential Elections 2024: వైట్‌హౌస్‌కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్‌కు 51, హారిస్‌కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్‌లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం: కమలా హారిస్
వాషింగ్టన్: మిల్టన్, హెలెన్ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. నార్త్ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్ సెంటర్లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు. కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హారిస్ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్ ప్రసంగానికి ముందు బైడెన్ గల్ఫ్ తీరంలోని టంపా, సెయింట్ పీట్ బీచ్ మధ్య హెలికాప్టర్లో హరికేన్ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్ రెస్పాండర్లను బైడెన్ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్‌కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి. -
రూ. మూడు కోట్ల ఇల్లు.. 11 సెకెన్లలో కొట్టుకుపోయిందిలా..
అతని కలల ఇల్లు సముద్ర కెరటాలకు కొట్టుకుపోయింది. అవును.. ఇది నిజం. ఈ ఉదంతం అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఇక్కడి సముద్రతీరంలో నిర్మించిన విలాసవంతమైన, అందమైన ఇల్లు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయింది.ఆగస్టు 16న వచ్చిన ఎర్నెస్టో హరికేన్ ఈ రూ. మూడు కోట్ల విలువైన ఈ ఇంటిని కేవలం 11 సెకెన్లలో ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తుఫానుకు ఎగసిపడుతున్న సముద్రపు అలలు ఆ ఇంటిని సముద్రంలోనికి లాక్కెళ్లిపోవడాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ అందమైన ఇల్లు 1973లో నిర్మితమయ్యింది. ఇంతకాలం ధృడంగా నిలిచిన ఈ ఇల్లు శక్తివంతమైన అలలకు కొట్టుకుపోయింది.ఈ వీడియోను ఆగస్టు 18న @CollinRugg హ్యాండిల్‌తో మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో.. నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున నిర్మించిన ఈ సముద్రతీర ఇల్లు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అట్లాంటిక్‌లో ఎర్నెస్టో హరికేన్ కారణంగా ఈ సంఘటన జరిగింది. ఇంటి యజమాని ఈ నాలుగు బెడ్రూమ్లు, రెండు బాత్రూమ్ ఇంటిని 2018లో సుమారు రూ. 3 కోట్లు ($339,000) వెచ్చించి కొనుగోలు చేశారు’ అని రాశారు.ఈ పోస్ట్‌కు లక్షలాది వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. వందలాది మంది యూజర్స్ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్..‘అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఒక మూర్ఖపు నిర్ణయం’ అని రాశారు. మరొక యూజర్ ‘నార్త్ కరోలినా సముద్రంలో తుఫానులు సర్వసాధారణం. ఈ ఇంటిని కొనుగోలు చేసిన వారు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని ఉండాల్సింది’ అని రాశారు. JUST IN: Beachfront home falls into the Atlantic Ocean on North Carolina’s Outer Banks. The incident was thanks to Hurricane Ernesto which is off the coast in the Atlantic. The unfortunate owners purchased the 4 bed, 2 bath home in 2018 for $339,000. The home was built in… pic.twitter.com/MvkQuXz5SG— Collin Rugg (@CollinRugg) August 17, 2024 -
భారత సంతతి వ్యాపారి కాల్చివేత
వాషింగ్టన్: దోపిడీకి యత్నించిన దుండగుడు భారతసంతతికి చెందిన దుకాణదారును కాల్చిచంపాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రొవాన్ కౌంటీలో చోటుచేసుకుంది. మైనాంక్ పటేల్(36) టొబాకో హౌస్ స్టోర్ పేరుతో దుకాణం నడుపుతున్నారు. మంగళవారం ఉదయం షాట్గన్తో దుకాణంలోకి ప్రవేశించిన శ్వేతజాతీయుడైన బాలుడు మైనాంక్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ∙బాలుడిని కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. -
అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
అమెరికాలో భారత సంతతి వ్యక్తి మైనాంక్ పటేల్(36) ఓ మైనర్ జరిపిన కాల్పుల్లో హత్య చేయబడ్డారు. నార్త్ కరోలినాలోని తన కన్వీనియన్స్ స్టోర్‌లో దోపిడీకి వచ్చిన మైనర్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 2580 ఎయిర్పోర్ట్ రోడ్‌లోని టొబాకో హౌస్ యజమాని అయన మైనాంక్ పటేల్‌పై మంగళవారం ఉదయం ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన మైనర్‌ను రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. ‘‘టొబాకో హౌస్ స్టోర్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించాం. స్టోర్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న తర్వాత పటేల్ బుల్లెట్ గాయాలతో పడి ఉన్నాడు. దీంతో అతన్ని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమించటంతో షార్లెట్లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించి చిక్సిత అందించినప్పటికీ చాలా తీవ్రమైన గాయాల వల్ల మృతి చెందాడు’’ అని రోవాన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్‌డానియల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సంఘటన స్థలం నుంచి పారిపోతున్నట్లు వెల్లడైందని తెలిపారు. అతను తుపాకీని పట్టుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కాల్పులకు ఖచ్చితమైన కారణం స్పష్టం కాలేదని, దోపిడీ వచ్చిన మైనర్.. కాల్పులు జరిపినట్లు ప్రథమికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు చెప్పారు. మృతి చెందిన మైనాంక్ పటేల్‌కు భార్య అమీ, 5 ఏళ్ల కుమార్తెను ఉన్నారు. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. ఆయన మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతికి బుధవారం పటేల్ షాప్ ముందు పలువురు పూలు, కార్డులు పెట్టి నివాళులు అర్పించారు. -
షార్లెట్‌లో వైఎస్సార్సీపీ సిద్ధం!
నార్త్ కరోలినా షార్లెట్‌లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కారుమూరు శివారెడ్డి నాయకత్వములో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ రెడ్డి, సబ్బసాని, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధం అని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డ తండ్రికి తగ్గ తనయుడుగా నేను విన్నాను నేను ఉన్నాను అని, కరోనా కష్టాలను కూడా అధికమించి ప్రజలకు ఎంతో మేలు చేసిన మన ప్రియతమా ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ని మళ్లీ గెలిపించు కోవడానికి మేము సిద్ధం అని అందరు నినదించారు. మహిళలు సైతం మేం సిద్ధం అంటూ మద్దతుగా కేరింతలు కొడుతూ.. సందడి చేశారు. జై జగన్ జై జగన్ అంటూ నినదించటంతో ఆడిటోరింలో సందడివాతావరణం నెలకొంది. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. (చదవండి: చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్‌పై మొత్తం 35 కేసులు) -
ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాం... యాత్ర 2 పబ్లిక్ టాక్
-
ఉత్తర కరోలినాలో శక్తి అవార్డ్స్ 2023
-
అమెరికాలో మరోసారి కాల్పులు
రాలీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. నార్త్ కరోలినా స్టేట్ ఛాపెల్ హిల్‌లోని యూనివర్సిటీ University Of North Carolina సైన్స్ భవనంలో తుపాకీతో వచ్చిన ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఓ సిబ్బంది(ఫ్యాకల్టీ) మృతి చెందినట్లు తెలుస్తోంది. సోమవారం క్యాంపస్‌లో లాక్డౌన్ ఎత్తేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఆ వెంటనే ఈ కాల్పలు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు గంటల తర్వాత అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడింది అతనేనా? అని ధృవీకరణ రావాల్సి ఉండగా.. దుండగుడు కాల్పులకు తెగబడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. గన్ కల్చర్‌కు సంబంధించిన ఈ ఘటనపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Law enforcement have Arrested the Suspect in University of North Carolina Shooting#ChapelHill #UNCShooting#UNC #NorthCarolina #shooting #breaking #chapelhill #Carolina #University #USA #Shotting #Firing pic.twitter.com/Nte6OxelM6 — Chaudhary Parvez (@ChaudharyParvez) August 29, 2023 -
విరిగిన రోలర్ కోస్టర్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం
నార్త్ కరోలినా: అత్యంత ఎత్తులో నిర్మితమైన ఓ రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతున్న సమయంలో వీడియో తీశాడు ఓ సందర్శకుడు. వీడియోలో ఒక సన్నివేశం చూసి గగుర్పాటుకు గురై వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేశాడు. ఈ రోలర్ కోస్టర్ తాలూకా బ్రిడ్జి పిల్లర్ ఒకదానికి బీట రావడంతో రైడ్ సమయంలో పక్కకు కదులుతూ ప్రమాదకరంగా కనిపించింది. అలాగే నిర్లక్ష్యంగా దీనిని నిర్వహించి ఉంటే ఎంతటి దారుణం జరిగేదోనని అంటున్నారు నెటిజన్లు. ఫ్యూరీ 325 పేరుతో నడిచే రోలర్ కోస్టర్ కు స్థానికంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ రైడ్ ను జీవితంలో ఒక్కసారి అయినా ఆస్వాదించాలని ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దీని నిర్వహకులు దీనిలోని ఒక పిల్లర్ కు బీట వచ్చిన విషయాన్ని గమనించలేదు. రోలర్ కోస్టర్ స్థితిగతులను పట్టించుకోకుండా యధావిధిగా నిర్వహిస్తూ కాసులు గడించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడికి విచ్చేసిన ఓ సందర్శకుడు తన మొబైల్ లో రోలర్ కోస్టర్ రైడ్ ను బంధించాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను ఓ ప్రమాదాన్ని పసిగట్టాడు. ఆయన తీసిన వీడియోని నిశితంగా గమనించగా దీని పిల్లర్లలో ఒక పిల్లర్ కు పెద్ద బీటే వచ్చినట్లు కనిపించింది. వీడియోలో బీట వచ్చిన పిల్లర్ గుండా రోలర్ కోస్టర్ వెళ్ళినప్పుడు పిల్లర్ కదులుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో ప్రస్తుతానికైతే ఈ రోలర్ కోస్టర్ రైడ్ ను నిలిపివేశారు. మరమ్మత్తులు పూర్తయిన తర్వాతే దీన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ వీడియోని ఆ సందర్శకుడు ట్విట్టర్లో పొందుపరిచాడు. రోలర్ కోస్టర్ ఏ మాత్రం పట్టుతప్పినా అందులో ఉన్నవారి ప్రాణాల సంగతేమి కాను. గాలిలోని ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. సందర్శకుడు ఈ అమ్యూజ్మెంటు సంస్థ మేనేజ్మెంటును అప్రమత్తం చేసి పెను విపత్తునే తప్పించాడని నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. A visitor at a North Carolina amusement park spotted a large crack on a roller coaster's pillar on Friday. The ride, which was billed as one of the tallest of its kind, has now been closed as crews make repairs. https://t.co/9xqRRgXyWl pic.twitter.com/HTHculBdl9 — The New York Times (@nytimes) July 2, 2023 ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
US: యూనివర్సిటీల్లో ఆ రిజర్వేషన్లపై నిషేధం
వాషింగ్టన్ డీసీ: అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు అడ్మిషన్ విధానాల్లో జాతి, తెగ పదాలను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇకపై ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. ఆ పదాలను నిషేధిస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 👨⚖️ ఈ మేరకు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆ సంచలన తీర్పు చదువుతూ.. ఒక స్టూడెంట్ను అతని అనుభవాల ఆధారంగా పరిగణించబడాలిగానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత అడ్మిషన్లు కొనసాగడానికి వీల్లేదు అంటూ తీర్పు కాపీని చదివి వినిపించారాయన. 👉 అమెరికాలో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యాసంస్థలు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC)ల్లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత కోరుతూ ఓ విద్యార్థి సంఘం వేసిన పిటిషన్ ఆధారంగా అమెరికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 👉 ఒకప్పుడు అఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష కొనసాగేది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో వాళ్లకు అవకాశాలు దక్కేవి కావు. 👉 అయితే.. 1960లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా యూనివర్సిటీలలో నల్ల జాతి పౌరులకు,ఇతర మైనారీటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో పలు నూతన విధానాలు తీసుకొచ్చారు. 👉 అయితే.. జాతి సంబంధిత అడ్మిషన్ విధానాల వల్ల సమానత్వానికి తావు లేకుండా పోయిందని, పైగా మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరం అవుతున్నాయని సదరు గ్రూప్ సుప్రీం ముందు వాదించింది. 👉 నల్లజాతి అమెరికన్లకు చోటు కల్పించేందుకు ఆసియన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్నది ప్రధాన అభ్యంతరం చాలా కాలంగా కొనసాగుతోందక్కడ. 👨⚖️ తాజాగా.. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని 6-3 న్యాయమూర్తుల మెజార్టీ సదరు రెండు యూనివర్సిటీలలో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ట్రంప్ తప్పా అంతా ఆగ్రహం యూనివర్శిటీ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై నిషేధం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారాయన. అమెరికాలో వివక్ష ఇంకా మనుగడలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. జాతుల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు తుది నిర్ణయం కాదంటూ ప్రధానంగా ప్రస్తావించారాయన. The odds have been stacked against working people for too long – we cannot let today's Supreme Court decision effectively ending affirmative action in higher education take us backwards. We can and must do better. pic.twitter.com/Myy3D5jUGH — President Biden (@POTUS) June 30, 2023 సుప్రీం తీర్పు.. భవిష్యత్తు తరాలకు అవకాశాలను నిరాకరించడమే అవుతుందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అభిప్రాయపడ్డారు. తీర్పును వర్ణాంధత్వం అంటూ అభివర్ణించిన ఆమె.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడమే అంటూ తీవ్రంగా వ్యతిరేకించారామె. Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation. Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d — Vice President Kamala Harris (@VP) June 29, 2023 రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాల పేరిటే ఈ విధానాలు తెరపైకి వచ్చాయని.. తద్వారానే తాను, తన భార్య మిచెల్లీ లాంటి వాళ్లం వృద్ధిలోకి వచ్చామని అంటున్నారాయన. ఆ విధానాలు తెచ్చిన ఉద్దేశ్యాన్ని న్యాయవ్యవస్థ గుర్తించి ఉంటే బాగుండేదని అంటున్నారాయన. Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table. In the… https://t.co/Kr0ODATEq3 — Barack Obama (@BarackObama) June 29, 2023 ట్రంప్ మాత్రం ఇలా.. ఇది గొప్ప శుభదినం అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ సైతం ఉంచారు. అమెరికాకు ఇది గొప్ప రోజు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన.. ఆశించిన తీర్పు. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్‌సోషల్‌లో పోస్ట్ చేశారాయన. -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ ప్రత్యర్థులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్(76) ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని అన్నారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి తనను తప్పించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విమర్శించారు. తాజాగా ఉత్తర కరోలినా, జార్జియాలో రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో తాను నెగ్గకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడడం ఖాయమని తేల్చిచెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. రిపబ్లికన్ను కావడం వల్లే తనను వేధిస్తున్నారని, తనపై ప్రారంభించిన విచారణ ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనను ఎన్నిక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా సరే రాజకీయాల నుంచి విరమించుకొనే ప్రసక్తే లేదన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు ప్రభుత్వ అధికారిక పత్రాలను ట్రంప్ తన ఇంటికి తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణలో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. -
అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్పాట్లు
అందరూ ఏదైనా మంచి జరగలాంటే మనకు అదృష్టం ఉండాలి అంటుంటారు. కాస్త మన హార్డ్‌వర్క్‌కి కొంచెం లక్ తోడైతే ఇక మనకు తిరుగుండదు. ఔనా! ఇంతకీ ఎందుకూ ఈ అదృష్టం గురించి చెబుతున్నానంటే ఇక్కడున్న మహిళకు అదృష్టం మాములుగా లేదు. ఒకేసారి ఉబ్బితబ్బిబై ఎగిరి గంతేసేంత పట్టరాని ఆనందం ఒకేసారి వరించింది. వివరాల్లోకెళ్లే...అమెరికాలోని నార్త్‌కరోలినాలోని ఒక మహిళ ఒకేసారి రెండు జాక్పాట్లు కొట్టేసింది. ఈ మేరకు బ్రెండా గోమెజ్ హెర్నాండెజ్ అనే 28 ఏళ్ల మహిళ పండటి బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపట్లోనే ఆమె రూ. 81 లక్షల లాటరీని గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమె అమెరికాలోని కాంకర్డ్ సిటీలోని ఒక క్విక్‌ట్రిప్ స్టోర్ నుంచి పవర్‌బాల్ టికెట్‌ను కొనుగోలు చేసింది. ఆమె సరిగ్గా నవంబర్ 9న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అదే రోజు కొద్ది నిమిషాల్లోనే ఆమె లాటరీ గెలిచుకున్నట్లు లాటరీ నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ మేరకు హెర్నాండెజ్ మాట్లాడుతూ...కచ్చితంగా ఈ చిట్టితల్లి వల్లే తాను ఈ లాటరీ గెలుచుకున్నాను, ఆమె నా అదృష్టదేవత అంటూ మురిసిపోయింది. అలాగే మిగతా నా ఇద్దరు మగ పిల్లలు కూడా ఈ అదృష్టంలో భాగమే. ఎందుకంటే ఈ లాటరీని ఆ ఇద్దరు పిల్లల పుట్టిన రోజుల నెంబర్లను ఆధారంగా లాటరీ టిక్కెట్‌ని ఎంచుకుని కొనుగోలు చేయడంతో గెలవగలిగానని ఆనందంగా చెబుతోంది. (చదవండి: వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు) -
అమెరికాలో కాల్పులు..పోలీస్ సహా ఐదుగురు మృతి
రేలీ: అమెరికాలోని నార్త్ కరోలినా రాజధాని రేలీలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. న్యూస్ రివర్ గ్రీన్‌వేలో నివాస ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిపై ఒక బాలుడు(15)తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యాడు. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని దిగ్బంధించి సోదాలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఓ ఇంట్లో దాక్కున్న బాలుడిని అరెస్ట్ చేశారు. -
ఉత్తర కరొలినాలో కాల్పుల కలకలం
రాలీ: యూఎస్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర కరొలినాలో (North Carolina) ఓ దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. రాజధాని రాలీ Raleigh నగరంలోని న్యూస్ రివర్ గ్రీన్వే సమీపంలో అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడినట్లు మేయర్ మేరీ బల్డవిన్ ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఓ టీనేజర్ ఈ కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు.. ఓ ఇంట్లో దాక్కున్నాడనే సమాచారంతో చుట్టుమట్టి అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. చివరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నార్త్ కరొలినా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంచనా వేస్తున్నారు. మరణించినవారిలో ఒక పోలీస్(ఆఫ్ డ్యూటీలో ఉన్నారు) కూడా ఉన్నాడని పేర్కొన్నారు. గన్ వయొలెన్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు(యూఎస్ఏ) ప్రధాన సమ్యగా మారింది. 2021 ఏడాదిలోనే 49వేల మందికిపైగా మరణించారు. ఈ లెక్కన రోజుకు సగటున 130 మంది మరణించారన్నమాట. అంటే.. ఇది ఆత్మహత్యల కేసుల కంటే బాగా ఎక్కువనేది విశ్లేషకుల అభిప్రాయం. The Raleigh Police Department is currently on the scene of an active shooting in the area of the Neuse River Greenway near Osprey Cove Drive and Bay Harbor Drive. Residents in that area are advised to remain in their homes. — Raleigh Police (@raleighpolice) October 13, 2022 -
బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్
వాషింగ్టన్: అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. అతని బ్రెయిన్ యాక్టివ్‌లోనే ఉన్నట్లు తెలిసి వైద్యులు నమ్మలేకపోయారు. వెంటనే అతనికి మళ్లీ చికిత్స ప్రారంభించారు. విల్క్స్ కౌంటీకి చెందిన ఈ వ్యక్తి పేరు ర్యాన్ మార్లో. పాస్టర్‌గా పని చేస్తున్నాడు. బాక్టీరియా ఇన్ఫెక్షన్తో వచ్చే అరుదైన లిస్టేరియా వ్యాధి బారినపడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు రెండు వారాల పాటు చికిత్స అందించారు. అనంతరం ఇన్ఫెక్షన్ వల్ల అతని మెదుడులో వాపు వచ్చిందని, బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు ప్రకటించారు. వైద్యపరంగా చెప్పాలంటే మరణించినట్లే అని పేర్కొన్నారు. తన భర్త పరిస్థితిని మేగన్ సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిపింది. తాను అవయవ దానం చేస్తానని ర్యానో గతంలోనే నమోదు చేసుకున్నాడు. దీంతో అతన్ని లైఫ్ సపోర్టుపై ఉంచారు వైద్యులు. అతని అవయవాలు పొందేందుకు సరైన రోగుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆగస్టు 30న ర్యాన్‌కు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు అందరూ సిద్ధమవుతుండగా.. మేగన్ కోడలు ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ర్యాన్ కాళ్లు కదిపారని, అది ఫోన్లో తీసిన వీడియోలో రికార్డయ్యిందని చెప్పింది. మళ్లీ పరీక్షలు.. వెంటనే మేగన్ వైద్యుల దగ్గరికి వెళ్లి తన భర్త బ్రెయిన్ పనితీరుపై మరోమారు పరీక్షలు చేయాలని కోరారు. ఆమె విజ్ఞప్తి మేరకు సీటీ స్కాన్ తీసిన వైద్యులు అవాక్కయ్యారు. ర్యాన్ బ్రెయిన్ యాక్టివ్‌లోనే ఉన్నట్లు అందులో తేలింది. దీంతో పొరపాటుగా వాళ్లు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించినట్లు స్పష్టమైంది. స్కాన్ రిపోర్టుల అనంతరం మేగన్ మళ్లీ సోషల్ మీడియాలో తన భర్త పరిస్థితి గురించి వెల్లడించింది. ర్యాన్‌కు బ్రెయిన్ డెడ్ కాలేదని చెప్పింది. దేవుడే తనను బతికించాడని పేర్కొంది. రీస్కాన్ తర్వాత ర్యాన్ హార్ట్‌బీట్ కొంచెం పెరిగింది. అయితే వైద్యుల చికిత్సకు స్పందనలో మాత్రం మార్పు లేదని మేగన్ చెప్పింది. ర్యాన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని పేర్కొంది. చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధం.. కొరియా కిమ్‌తో చేతులు కలిపిన పుతిన్! -
ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో అనూహ్య ఘటన!... దూకేశాడా? పడిపోయాడా!
న్యూయార్క్: యూఎస్‌లోని నార్త్ కరోలినాలో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో కో పైలెట్ కిందపడి మృతి చెందాడు. ఐతే అతను విమానం అత్యవసర ల్యాండింగ్ టైంలో దూకేశాడా? లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియరాలేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో పారాచూట్ లేకుండా ఎలా దూకేశాడు అంటూ అధికారులు పలు అనుమానాలు లేవనెత్తారు. మృతి చెందిన సదరు కోపైలెట్ 23 ఏళ్ల చార్లెస్ హ్యూ క్రూక్స్‌గా గుర్తించారు అధికారులు. అతడి మృతదేహం విమానాశ్రయానికి దక్షిణంగా సుమారు 48 కిలోమీటర్లు దూరంలో లభించిందని అధికారులు తెలిపారు. అంతేకాదు విమానంలో మరో పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ సేఫ్టి బోర్డు ఈ ఘటనకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రమాదానికి ముందు విమానం కుడివైపు ఉన్న చక్రం కోల్పోవడంతో పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయం కోరినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం) -
నడి రోడ్డు పై ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్
ఇటీవల కాలంలో పైలెట్లు విమానాలను దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిన లేక ఏదైన ప్రమాద సంభవిస్తుందన్న అనుమానం వచ్చినా పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా సురకక్షితమైన ప్రదేశంలో దించేస్తారు. అచ్చం అలానే ఇక్కడొక పైలెట్ కూడా విమానాన్ని అత్యవసర ల్యాండిగ్ చేశాడు గానీ, అదీ కూడా రద్దీగా ఉండే హైవే పై ల్యాండ్ చేయడం విశేషం. వివరాల్లోకెళ్తే...యూఎస్‌లోని నార్త్ కరోలినాలో వాహనాల రద్దీ మధ్య ఒక విమానం ల్యాండ్ అయ్యింది. విన్సెంట్ ఫ్రేజర్ అనే పైలెట్ తన మామతో కలిసి స్వైన్ కౌంటీలోని ఫోంటాన్ లేక్ నుంచి సింగిల్ ఇంజన్ విమానాన్ని నడుపుతున్నాడు. ఐతే అకస్మాత్తుగా ఇంజన్ పనిచేయడం మానేయడం మొదలైంది. దీంతో అతను సమీపంలోని హైవే పై సురకక్షితంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఫ్రేజర్ గతేడాదే పైలెట్‌గా లైసెన్సు పొందాడు. ఫ్లోరిడాకు చెందిన మెరైన్ అనుభవజ్ఞుడు, కానీ అతనికి 100 గంటలకు పైగా విమానన్ని నడపగల అనుభవం మాత్రం లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. WATCH: New video shows a plane making an emergency landing on a Swain County highway Sunday morning. Hear from the pilot tonight on @WLOS_13 at 5 & 6! Video courtesy of Vincent Fraser. pic.twitter.com/hcxOGUUGgP — Andrew James (@AndrewJamesNews) July 7, 2022 (చదవండి: నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!) -
బొద్దింకను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.. అట్లాంటిది వాటిని పెంచితే రూ.లక్షన్నర!
కాక్రోచ్ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇంట్లో ఒక్క బొద్దింక కనబడితేనే దాన్ని చంపేదాకా మనసూరుకోదు. అలాంటిది ఇంటినిండా బొద్దింకలను ఒక నెలపాటు ఉంచడానికి... రెండు వేల డాలర్లు (సుమారు రూ.1,58,283) ఆఫర్ చేసిందో కంపెనీ. అందుకు 2,500మంది అంగీకరించారు కూడా. బొద్దింకలను పెంచమని ప్రోత్సహించ డం ఏంటనుకుంటున్నారా? వాటిని నిర్మూలించడానికి. అయితే పెంచడమెందుకు అంటే శాశ్వత నిర్మూలన ప్రయోగం కోసం. గతవారం నార్త్ కరోలినాకు చెందిన హైబ్రిడ్ పెస్ట్ కంట్రోల్/మీడియా కంపెనీ ‘ద పెస్ట్ ఇన్ఫార్మర్’ఒక ప్రకటన విడుదల చేసింది. 30 రోజులపాటు 100 అమెరికన్ బొద్దింకలను ఉంచి పరిశోధించడానికి ఏడు ఇళ్లు కావాలని తెలిపింది. ఆమోదం తెలిపేవాళ్ల వయసు 21ఏళ్లు నిండి ఉండాలి. సొంత ఇల్లు కలిగి ఉండాలి లేదా ఇంటి ఓనర్ ఆమోదం ఉన్నా సరిపోతుందని చెప్పింది. అలాగే వాటి నిర్మూలనకు ఎలాంటి పురుగుల మందులు వాడకూడదని, తాము ఇచ్చిన మందులను మాత్రమే ప్రయోగించాలని వివరించింది. వాళ్లు తయారు చేసిన పురుగుల మందు 30 రోజుల్లో ఆ బొద్దింకలను పూర్తిగా చంపలేకపోతే... 30 రోజుల తరువాత సాధారణ పద్ధతిలో వాటిని నిర్మూలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు వారికి రెండు వేల డాలర్లు అంటే దాదాపు రూ.లక్షా60వేలు ఇస్తామని పేర్కొన్నది. ఎవ్వరూ ఆసక్తి చూపరేమోనని జూలై 31వరకు గడువు విధించింది. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ.. 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అది చూసి ఆశ్చర్యపోవడం కంపెనీ వంతయ్యింది. ఎవరూ ఆసక్తిచూపరని తామనుకుంటే... ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలోంచి తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారిని ఎంపిక చేసుకుంటామని ప్రకటించింది. -
Viral Video: అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్
రాజకీయ నాయకులు, సినీ తారలు, స్పోర్ట్స్ స్టార్స్‌కు ఫాలోవర్స్ ఉండటం సహజమే.. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అభిమానులు వారిని ఫాలో అవుతూనే ఉంటారు. సెల్ఫీలు, వీడియోలు ఉంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే సమయంలో ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీకొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఒప్పిగ్గా ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇస్తారు. తాజాగా ఓ అమెరికన్ ర్యాపర్ అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నార్త్ కరోలినాకు చెందిన రాపర్ డాబాబీ ఓ కార్యక్రమం నుంచి బయటకు రాగా.. అతన్ని అభిమానులు చుట్టుముట్టారు. ఇందులో మహిళా అభిమానులు కూడ ఉన్నారు. అయితే వారు సెల్ఫీలు తీసుకుంటుండా బాబీ అభిమానుల గుంపు వద్దకు వెళ్లి వారిని కౌగిలించుకున్నాడు. అంతేగాక ఓ మహిళా అభిమాని వద్దకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకేందుకు ప్రయత్నించాడు. చదవండి: ఏం ఐడియా సామీ! పెళ్లిలో వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు #DaBaby getting curved by fans 😂 pic.twitter.com/EiiP7NMfsX — No Jumper (@nojumper) April 7, 2022 అయితే సదరు అభిమాని అతనికి దూరంగా జరుగుతున్నప్పటికీ ర్యాపర్ ఆమెను ముద్దు పెట్టుకోడానికి బలవంతం చేయడంతో వెంటనే ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాపర్ ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూవ్స్వచ్చాయి. చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది -
ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురు యువకులు..
వాషింగ్టన్ : ఓ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఔటర్ బ్యాంక్స్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎనిమిది మంది యువకులతో హైడ్ కౌంటీ ఎయిర్పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్అయింది. అనంతరం 25 నిమిషాల్లో 29 కిలోమీటర్ల(18 మైళ్లు) దూరం ప్రయాణించిన తర్వాత రాడార్‌తో ఆ విమాన సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని కోస్ట్ గార్డ్ అధికారులు నిర్ధారించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సముద్రంలో సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలో సముద్రంలో విమాన శకలాలను సిబ్బంది గుర్తించారు. ఆ ప్రాంతంలోనే ఓ వ్యక్తి మృతదేహాన్ని కూడా కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన మరో ఏడుగురి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, వీరంతా కార్టెరెట్ కౌంటీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. -
ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..
This 25 year old Woman wore tight jeans for 8 hours then had to be admitted in ICU: ఈ రోజుల్లో టైట్ జీన్సే.. ఫ్యాషన్ ఐకాన్! ప్రపంచవ్యాప్తంగా కాలేజ్ గర్ల్స్ నుంచి ముసలమ్మలదాకా క్యాజువల్ డ్రెస్సింగ్‌లో జీన్స్ భాగమైపోయింది. ఐతే గంటల తరబడి జీన్స్ ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒక మహిళ 8 గంటల పాటు జీన్స్ ధరించినందుకు ఐసీయూలో 4 రోజులపాటు చికిత్స తీసుకున్న అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది. నార్త్ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్ మూడేళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లింది. అప్పడు ప్రియుడి కోరిక మేరకు బిగుతుగా ఉండే షార్ట్ జీన్స్ ధరించింది. 8 గంటల తర్వాత ఇంటికి చేరిన సామ్‌కు నడుము క్రింద నొప్పి ప్రారంభమైంది. మరుసటి రోజు డాక్టర్ని సంప్రదించడంతో సెప్సిస్, సెల్యులైటీస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది (ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతరమైతే.. రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి, అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది). చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..! తొలుత ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకి మార్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్సనందించారు. మరి కొన్ని రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండి వైద్యం చేయించుకుంది కూడా. చికిత్స సమయంలో మాటిమాటికీ ప్యాంట్‌ను తీసి వైద్యులకు గాయాన్ని చూపించాల్సి వచ్చేదని, ఇది చాలా చేదు అనుభవమని, దాదాపు మృత్యు కుహరం నుంచి బయటికి వచ్చానని తెల్పింది. తను చవిచూసిన చేదు అనుభవాన్ని టిక్ టాక్ ద్వారా తాజాగా పంచుకుంది. ఇంత అరుదైన వ్యాధి జీన్స్ వల్ల ఎలా వస్తుందని సర్వత్రా చర్చ కోనసాగుతోంది. అందుకే ఇన్ఫెక్షన్లు వస్తాయి.. నిజానికి బిగుతైన దుస్తులు ధరించినప్పుడు చర్మం కోతకు గురై ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా జీవించడానికి అనుకూలంగా ఉండే తేమలాంటి పదార్థం (అనోరెక్టల్ అబ్సెస్) పేరుకుపోతుంది. దీనికి తక్షణమే చికిత్స చేయకపోతే, ఆ ప్రదేశంలో చర్మగ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్గా మారుతుంది. సాధారణంగా ఇమ్యునిటీ బలహీణంగా ఉండే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. జీన్స్‌తో జర జాగ్రత్త!! చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది...
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మైనర్ బాలిక కొన్ని రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైంది. నిందితుడు బాలికను తనతో పాటు తీసుకెళ్తుండగా కారు ఓ చోట ట్రాఫిక్‌లో ఆగింది. అతడి చెర నుంచి బయటపడాలని భావించిన బాలిక తన చేతులతో పదే పదే ఒక సైగ చేయసాగింది. ఆమె చేతి సైగను గమనించి, అర్థం చేసుకున్న కొందరు విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు మైనర్ని కాపాడి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. నోరు విప్పకుండా.. అరవకుండా.. కేవలం ఓ సైగ ద్వారా సదరు బాలిక తన జీవితాన్ని కాపాడుకుంది. ఆ వివరాలు.. నార్త్ కరోలినాకు చెందిన ఓ మైనర్ బాలిక కొన్ని రోజుల క్రితం తన బంధువు అయిన నిందితుడితో కలిసి బయటకు వెళ్లింది. నమ్మి వెంట వచ్చిన బాలికను కిడ్నాప్ చేశాడు నిందితుడి. బయటకు వెళ్లిన కుమార్తె రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. బాధితురాలి అసభ్య ఫోటోలతో ఆమెను బెదిరించసాగాడు కిడ్నాపర్. ఈ క్రమంలో ఓ రోజు నిందితుడు సదరు బాలికను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. (చదవండి: 18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు) ఓ చోట కారు ట్రాఫిక్‌లో ఆగింది. అతడి చెర నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న బాలిక.. చుట్టూ ఉన్న వ్యక్తులకు తన పరిస్థితిని వివరించడం కోసం చేతితో ప్రత్యేక సైగ చేయసాగింది. బొటనవేలిని ముడిచి.. మిగతా వెళ్లను ఎత్తి.. ఆ తర్వాత వాటిని బొటన వేలు మీదుగా బిగించి చూపించే ఆ సైగకు తాను గృహహింస బాధితురాలినని.. సాయం చేయాల్సిందిగా అర్థం. ఈ సైగ టిక్‌టాక్‌లో చాలా ట్రెండ్ అవ్వడంతో ఆమె సైగలు గమనించిన కొందరు విషయాన్ని పోలీసులకు తెలిపారు. (చదవండి: చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ) వారు నిందితుడి కారును వెంబండించి.. బాలికను కాపాడారు. నిందితుడి మొబైల్‌ని స్వాధీనం చేసుకుని చూడగా.. దానిలో బాలిక అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటన్నింటిని తొలగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: కాబూల్‌లో భారతీయుని అపహరణ ! -
బుల్లెట్ బండి: వైరల్ అవుతున్న ఎన్నారై బేబీ వీడియో
-
బుల్లెట్టు బండి: సూపర్.. జూనియర్ సాయి పల్లవిలా..
నార్త్ కరోలినా: సోషల్ మీడియాలో బుల్లెట్ బండి పాట ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ పాట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారిని ఆకట్టుకుంటోంది. మంచిర్యాలకు చెందిన నవ వధువు సాయి శ్రీయ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త.. పా అంటూ భర్తతో డ్యాన్స్ చేసిన వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు నైనిక అనే ఎన్నారై బేబీ సింగిల్ టేక్‌లో ఈ జానపదానికి తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. లిరిక్స్ ఆలపిస్తూ.. జోష్‌గా స్టెప్పులేస్తూ పురివిప్పిన నెమలిలా వీక్షకులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘‘నువ్వు సూపర్ బుజ్జీ.. అచ్చమైన.. స్వచ్ఛమైన పల్లె పదాలకు ఎంతో అందంగా ఆడిపాడావు. హ్యాట్సాఫ్’’ అంటూ నెటిజన్లు ఆమెను ఆశీర్వదిస్తున్నారు. జూనియర్ సాయిపల్లవి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నైనిక అమెరికాలోని నార్త్ కరోలినాలో నివసిస్తున్నట్లు సమాచారం.