ఇటీవల కాలంలో పైలెట్లు విమానాలను దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిన లేక ఏదైన ప్రమాద సంభవిస్తుందన్న అనుమానం వచ్చినా పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా సురకక్షితమైన ప్రదేశంలో దించేస్తారు. అచ్చం అలానే ఇక్కడొక పైలెట్ కూడా విమానాన్ని అత్యవసర ల్యాండిగ్ చేశాడు గానీ, అదీ కూడా రద్దీగా ఉండే హైవే పై ల్యాండ్ చేయడం విశేషం.
వివరాల్లోకెళ్తే...యూఎస్‌లోని నార్త్ కరోలినాలో వాహనాల రద్దీ మధ్య ఒక విమానం ల్యాండ్ అయ్యింది. విన్సెంట్ ఫ్రేజర్ అనే పైలెట్ తన మామతో కలిసి స్వైన్ కౌంటీలోని ఫోంటాన్ లేక్ నుంచి సింగిల్ ఇంజన్ విమానాన్ని నడుపుతున్నాడు. ఐతే అకస్మాత్తుగా ఇంజన్ పనిచేయడం మానేయడం మొదలైంది.
దీంతో అతను సమీపంలోని హైవే పై సురకక్షితంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఫ్రేజర్ గతేడాదే పైలెట్‌గా లైసెన్సు పొందాడు. ఫ్లోరిడాకు చెందిన మెరైన్ అనుభవజ్ఞుడు, కానీ అతనికి 100 గంటలకు పైగా విమానన్ని నడపగల అనుభవం మాత్రం లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
WATCH: New video shows a plane making an emergency landing on a Swain County highway Sunday morning. Hear from the pilot tonight on @WLOS_13 at 5 & 6!
— Andrew James (@AndrewJamesNews) July 7, 2022
Video courtesy of Vincent Fraser. pic.twitter.com/hcxOGUUGgP
(చదవండి: నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!)
Comments
Please login to add a commentAdd a comment