వాషింగ్టన్: ఓ మినీ విమానాన్ని చోరీ చేసిన పైలట్..నగరంపై చక‍్కర్లు కొడుతూ హల్‌చల్ సృష్టించాడు. రద్దీ ప్రాంతంలో విమానాన్ని కూల్చేస్తానని బెదిరింపు సందేశం పంపించాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సిసీపీ రాష్ట్రం ఈశాన్య నగరం ‘టుపెలో’లో జరిగింది. నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్స్‌పై కూల్చేస్తాని హెచ్చరించాడని, దాంతో స్టోర్స్‌ను ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలిపారు. పైలట్‌తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
‘పరిస్థితులు సద్దుమణిగే వరకు ఆ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ప్రజలకు సూచించాం. ఆ విమానం మొబిలిటీ ప్రకారం డెంజర్ జోన్ టుపెలో కంటే పెద్దగా ఉంటుంది.’ అని టుపెలో పోలీస్ విభాగం ఓ ప్రకటన చేసింది. ప్రజలు వాల్‌మార్ట్ స్టోర్స్ నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించారు. అన్ని అత్యవసర సేవలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. టుపెలో ఎయిర్‌పోర్ట్ నుంచి ‘బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90’ అనే మినీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పైలట్ ఎత్తుకెళ్లినట్లు తెలిసిందన్నారు. ఆ విమానం డబుల్ ఇంజిన్ 9 సీటర్‌గా తెలిపారు.
Currently we have a 29yr old who stole this plane & is threatening to crash it into something. Polices ,ambulances ,& fire trucks are everywhere. Everything is shutdown rn pic.twitter.com/AzebdIa3tP
— City King (@CityKing_Gank_) September 3, 2022
ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే?
Comments
Please login to add a commentAdd a comment