Mississippi
-
రాకాసి మొసలి
ఈ రాకాసి మొసలి అమెరికాలోని మిసిసిపీ రాష్టంలో వేటగాళ్ల బృందానికి దొరికింది. యజూ నదిలో ఇటీవల వేటకు వెళ్లిన వేటగాళ్ల బృందానికి ఈ అతిభారీ మొసలి చిక్కింది. దీని పొడవు 14.3 అడుగులు, బరువు 364.007 కిలోలు. మిసిసిపీలో ఇదివరకు దొరికిన భారీ మొసలి కంటే ఇది పొడవులోను, బరువులోను ఎక్కువగా ఉండటంతో ఈ మొసలి కొత్త రికార్డును నెలకొల్పింది. మిసిసిపీలోనే 2017లో ఒక భారీ మొసలి దొరికింది. దాని పొడవు 14.0 అడుగులు, బరువు 347.67 కిలోలు. యజూ నది ఒడ్డుకు చేరువలో ఉండే జనాలు ఇక్కడకు తమ పెంపుడు కుక్కలను విహారానికి తీసుకొస్తుంటారు. కొంతకాలంగా ఈ మొసలి ఒడ్డుకు వచ్చి తిరుగుతూ, దొరికిన కుక్కనల్లా పలారం చేసేస్తుండటంతో దీనికోసం వేటగాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వేటగాళ్లు పట్టి తెచ్చిన ఈ మొసలి పొడవు, బరువు వివరాలను మిసిసిపీ వన్యప్రాణులు, జలచరాలు, ఉద్యానవనాల సంరక్షణ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల కిందట దొరికిన భారీ మొసలి రికార్డును ఇది అధిగమించిందని వారు ప్రకటించారు. -
మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి..
అమెరికాలోని మిసిసిపీలో ఒక సంచలన ఉదంతం చోటుచేసుకుంది. అనూహ్య పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలుడిని పోలీసులు జైలుకు తరలించారు. తన తల్లి కారు వెనుక మూత్ర విసర్జన చేయడమే ఆ చిన్నారి చేసిన తప్పిదం. దీనిపై ఆ చిన్నారి తల్లి న్యాయం పోరాటం చేసేందుకు సన్నద్దురాలైంది. పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారని, దీంతో తన పిల్లాడు బెంబేలెత్తిపోయాడని ఆమె ఆరోపించింది. ‘జనాలు ఉండే చోట కారు వెనుక ఎందుకు మూత్ర విసర్జన చేశావని’ ఆ బాలుడిని మీడియా ప్రశ్నించగా తన తల్లి, సోదరి ఆ సమయంలో.. ‘దగ్గరలో ఎటువంటి బాత్రూమ్లు లేవు.. నువ్వు కారు వెనక మూత్ర విసర్జన కానిచ్చేయమని’ తెలిపారన్నాడు. అయితే ఆ సమయంలో దీనిని చూసిన ఒక అధికారి ఆ పిల్లాడిని మందలించి, విడిచిపెట్టబోతున్నంతలో పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ పిల్లాడిని అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఆ ప్లిలాడి తల్లి ఇజోన్ మాట్లాడుతూ తన కుమారుడు పార్కింగ్ ప్లేస్‌లో మూత్ర విసర్జన చేయడం సరైనది కాదంటూనే, ఇంత చిన్న విషయానికే పోలీసులు పిల్లాడిని లాక్కుపోవడం దారుణమన్నారు. పదేళ్ల పిల్లాడిని పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించింది. తన కుమారుడు పోలీసులను చూసి భయపడిపోయాడని, వారు జైలుకు తరలిస్తుంటే పెద్దపెట్టున రోదించాడని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కొద్దిసేపటి తరువాత పోలీసులు ఆ బాలుడిని తల్లితో పాటు పంపించేశారు. సెంటోబియా పోలీస్ చీఫ్ రిచర్డ్ చాండ్లర్ మాట్లాడుతూ యూఎస్ యూత్ కోర్ట్ చట్టంలోని వివరాలు తెలిపారు. ఏడేళ్లలోపు పిల్లల విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమన్నారు. 10 ఏళ్ల పిల్లలు చట్టవిరుద్ధంగా ఏదైనా చేస్తే, చట్టాన్ని అమలు చేసేవారు దానిని ప్రభుత్వానికి నివేదించవచ్చని వివరించారు. ఇటువంటి కేసుల నుంచి పిల్లలను మినహాయించడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చాండ్లర్ తెలిపారు. ఇది కూడా చదవండి: తల్లి చేతులు అణిచింది.. అన్న కాళ్లు నొక్కి పెట్టాడు.. తండ్రి చేతుల్లో పాశవిక పరువు హత్య! -
ఇంత బరువున్నావ్.. ఎక్కువ రోజులు బతకవ్.. దెబ్బకు 165 కిలోలు తగ్గాడు..
వాషింగ్టన్: బరువు విపరీతంగా పెరిగిపోయి సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తికి డాక్టర్లు చెప్పిన విషయం దిమ్మతిరిగేలా చేసింది. ఇలాగే ఉంటే 3-5 ఏళ్లకు మించి బతకవు, నీ టైం బాంబ్ కౌంట్ డైన్ స్టార్ట్ అయింది.. అనే మాట అతడి జీవితాన్ని మార్చేసింది. అమెరికా మిసిసిప్పికి చెందిన 42 ఏళ్ల ఈ వ్యక్తి పేరు నికోలస్ క్రాఫ్ట్. 2019లో ఇతని బరువు 294 కిలోలు. వైద్యులు షాకింగ్ విషయం చెప్పిన తర్వాత ఎలాగైనా బరువు తగ్గాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే డైట్ మొదలుపెట్టాడు. నెల రోజుల్లోనే 40 కిలోలు తగ్గాడు. దీంతో అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అప్పటి నుంచి డైట్‌తో పాటు వ్యాయామం చేస్తూ 165 కిలోల బరువు తగ్గాడు క్రాఫ్ట్. ప్రస్తుతం ఇతని బరువు 129 కేజీలు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడటమే గాక ఆరోగ్యంగా తయారయ్యాడు. అయితే తాను డిప్రెషన్లోకి వెళ్లి అధికంగా తినడం వల్లే బరువు పెరిగినట్లు క్రాఫ్ట్ చెప్పుకొచ్చాడు. తనకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని పేర్కొన్నాడు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతోనే ఒత్తిడి నుంచి బయటపడి బరువు తగ్గినట్లు చెప్పకొచ్చాడు. 165 కిలోల బరువు తగ్గడంతో క్రాఫ్ చర్మమంతా వదులైంది. దీంతో నొప్పి వచ్చి అతను ఇబ్బందిపడుతున్నాడు. శస్త్రచికిత్స చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే దీనికి ఇన్సూరెన్స్ వర్తించదని, ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు. చదవండి: ఆమె పోరాడింది.. టాప్‌లెస్ సమానత్వం సాధించింది -
అమెరికాలో కాల్పుల కలకలం.. మాజీ భార్య, కాబోయే భార్యపై కూడా!
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిసిసిప్పీ రాష్ట్రంలో శుక్రవారం మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మూడు చోట్ల కాల్పులకు పాల్పడింది ఒక్కడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడ్ని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. అర్కబుట్ల, టాటె కౌంటీల్లోని ఓ స్టోర్, రెండు ఇళ్లలో కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడ్ని రిచర్ డేల్ క్రమ్(52)గా గుర్తించారు. అయితే ఇతడు మొదట తన మాజీ భార్య, ఇతర కుటుంబసభ్యులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు కాబోయే భార్యను కాల్చి చంపినట్లు సమాచారం. అంతకుముందే ఓ స్టోర్‌లోనూ తుపాకీతో దాడి చేశాడు. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎందుకు ఈ దాడులు చేశాడో ఇంకా తెలియదని పోలీసులు చెప్పారు. అతడ్ని విచారించాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. అర్కబుట్లలో నిందితుడు ఓ ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరపడం పొరిగింటి మహిళ ప్రత్యక్షంగా చూసింది. అతి తక్కువ మంది నివసించే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది. నిందితుడు లోపలికి వెళ్లాక కాల్పుల శబ్దం వినిపించిందని, తాను బయటకు చూసే సరికి అతడు తుపాకీతో నడుచుకుంటూ వెళ్తున్నాడని వివరించింది. కాల్పులు జరిగిన ఇంట్లోకి వెళ్లి చూస్తే ఓ వ్యక్తి బుల్లెట్ గాయాలతో చనిపోయి ఉన్నట్లు వివరించింది. చదవండి: 75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ -
‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’,అర్ధరాత్రి హైడ్రామా..ఉద్యోగులకు ఊహించని షాక్!
ప్రపంచ దేశాల్లో ఆర్ధిక మాంద్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ముఖ్యంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన సంస్థలు హైర్ అండ్ ఫైర్ పాలసీని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మెటా, ట్విటర్ నుంచి స్టార్టప్స్ వరకు ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా 20 ఏళ్లకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. మీరు రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దంటూ మెసేజ్ పెట్టింది.ఇతర అలవెన్స్ల్ని సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా మిస్సిస్సిప్పి (Mississippi)కి చెందిన ప్రముఖ యునైటెడ్ ఫర్నీచర్ ఇండస్ట్రీస్ (యూఎఫ్ఐ) సంస్థ 20 ఏళ్లగా బడ్జెట్ ధరలో సోఫాలు,రిక్లైనర్లు తయారు చేయడంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అయితే ఆ సంస్థ..అమెరికన్లు ప్రతిఏడాది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రేమను పంచుకునేందుకు థ్యాంక్స్ గివింగ్ డే అనే ఫెస్టివల్ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఆ పండగకు కేవలం రెండు రోజుల ముందు అర్ధరాత్రి సుమారు 2,700 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. మీరు రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు. ఆఫీస్ ల్యాప్‌ట్యాప్‌తో పాటు ఇతర వస్తువులు మీ వద్ద ఉంటే వాటిని వెంటనే సబ్మిట్ చేయండి అంటూ మెసేజ్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. క్షమించండి కంపెనీ ఉద్యోగులకు పంపిన టెక్ట్స్ మెసేజ్ ప్రకారం..‘బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సూచనల మేరకు...అనుకోని వ్యాపార పరిస్థితుల కారణంగా కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సినందుకు చింతిస్తున్నాం. నవంబరు 21న సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్న తక్షణమే అమల్లోకి వచ్చేలా చూస్తున్నట్లు వెల్లడించింది. సీఈవో నుంచి ఉద్యోగులను ఆకస్మికంగా ఎందుకు తొలగించారనే అంశంపై యునైటెడ్ ఫర్నీచర్ సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దాదాపు 20 ఏళ్ల నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ కంపెనీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమ్మర్ సీజన్లో కంపెనీలో పనిచేస్తున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లకు సైతం పింక్ స్లిప్‌లు జారీ చేసిందంటూ న్యూయార్క్ పోస్ట్ నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భారీ షాక్!, వచ్చే ఏడాది మిగిలిన రంగాల్లో.. చదవండి👉 రండి మీకు నేను ఉద్యోగాలిస్తా.. ట్విటర్, మెటా ఉద్యోగులకు రతన్ టాటా బంపరాఫర్! -
ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్త సురేశ్ బండారి మృతి
హన్మకొండ: హనుమకొండకు చెందిన యువ ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బండారి కోవిడ్ అనంతర సమస్యలతో అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో మృతి చెందారు. 2017 మే నెలలో అమెరికాలోని మిసిసిపి యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసి అదే యూనివర్సిటీలో సీనియర్ సైంటిస్ట్ హోదా పొందారు. యూనివర్సిటీ యాజమాన్యం అయన ప్రతిభను గుర్తించి ఒక విభాగానికి అధిపతిగా నియమించింది. అతి తక్కువ సమయంలో అధిపతిగా నియమితులైన పిన్నవయస్కుడిగా డాక్టర్ సురేష్ బండారి పేరుగాంచారు. మొత్తం 110 పబ్లికేషన్స్, 2865 సైటేషన్స్ (అనులేఖనాలు) రూపొందించడంతో పలు పేటెంట్ హక్కులు పొందారు. అంతకుముందు హనుమకొండ విద్యా నగర్‌లోని సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో మొదటిసారి కోవిడ్‌కు గురై త్వరగానే కోలుకున్నారు. కోవిడ్ అనంతరం మళ్లీ అస్వస్థతకు గురై అస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు మిసిసిపిలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమా రులు ఉన్నారు. సురేష్ బండారి తండ్రి మొగిలయ్య యోగా గురువుగా హనుమకొండ నగర ప్రజలకు సుపరిచితుడు. (చదవండి: ప్రాణం తీసిన ‘ప్రేమ’ పంచాయితీ) -
ఫ్లైట్ చోరీ చేసి కూల్చేస్తానని పైలట్ బెదిరింపులు.. ఊరంతా ఖాళీ!
వాషింగ్టన్: ఓ మినీ విమానాన్ని చోరీ చేసిన పైలట్..నగరంపై చక్కర్లు కొడుతూ హల్చల్ సృష్టించాడు. రద్దీ ప్రాంతంలో విమానాన్ని కూల్చేస్తానని బెదిరింపు సందేశం పంపించాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సిసీపీ రాష్ట్రం ఈశాన్య నగరం ‘టుపెలో’లో జరిగింది. నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్స్‌పై కూల్చేస్తాని హెచ్చరించాడని, దాంతో స్టోర్స్‌ను ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలిపారు. పైలట్‌తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘పరిస్థితులు సద్దుమణిగే వరకు ఆ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ప్రజలకు సూచించాం. ఆ విమానం మొబిలిటీ ప్రకారం డెంజర్ జోన్ టుపెలో కంటే పెద్దగా ఉంటుంది.’ అని టుపెలో పోలీస్ విభాగం ఓ ప్రకటన చేసింది. ప్రజలు వాల్‌మార్ట్ స్టోర్స్ నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించారు. అన్ని అత్యవసర సేవలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. టుపెలో ఎయిర్పోర్ట్ నుంచి ‘బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90’ అనే మినీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పైలట్ ఎత్తుకెళ్లినట్లు తెలిసిందన్నారు. ఆ విమానం డబుల్ ఇంజిన్ 9 సీటర్‌గా తెలిపారు. Currently we have a 29yr old who stole this plane & is threatening to crash it into something. Polices ,ambulances ,& fire trucks are everywhere. Everything is shutdown rn pic.twitter.com/AzebdIa3tP — City King (@CityKing_Gank_) September 3, 2022 ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే? -
మిసిసిపీ ఫెస్టివల్లో అపశ్రుతి
మిసిసిపీలో శనివారం జరిగిన మడ్బగ్ ఫెస్టివల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటన మిసిసిపీ స్టేట్ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో చోటు చేసుకుంది ఈ మేరకు మిసిసిపీ అధికారి హిండ్స్ కౌంటీ షెరీఫ్ టైరీ జోన్స్ ఈ ఉత్సవంలో పలువురు గాయపడ్డారని వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఉత్సవంలో జరిగిన కాల్పుల్లో పాల్లొన్నవారిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫెస్టివల్లో ప్రత్యక్ష వినోదం, వంటల పోటీలు, వినోద ఉద్యానవనాలు తదితరాలు ఉంటాయి. మిసిసిపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్థానికుల సాయంతో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఐతే ఈ ఘటన పై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (చదవండి: ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్ షాక్) -
పిల్లాడి పెద్దమనసు..మేక్ ఎ విష్
భరించలేని బాధ, కష్టం కలిగినప్పుడు చుట్టపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోము. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, బయటపడే ఆలోచనల్లో మునిగిపోతాం. అటువంటిది ఓ చిన్నపిల్లాడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, ఎన్నాళ్లు జీవించి ఉంటాడో తెలియనప్పటికీ ... కూడు, గూడు లేనివాళ్ల ఆకలి తీర్చండి అని చెబుతూ, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నాడు. అమెరికాలోని మిస్సిసీపికి చెందిన పదమూడేళ్ల అబ్రహం ఒలెబెగికి గతేడాది ‘అప్లాస్టిక్ ఎనీమియా’ ఉన్నట్టు తెలిసింది. అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా కారణంగా..శరీరంలో సరిపడినంతగా కొత్త రక్తకణాలు ఉత్పత్తి కావు. దీని వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ విషయం తెలిసినప్పుడు అబ్రహం ఏ మాత్రం భయపడలేదు. రెగ్యులర్‌గా డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు. ఇటువంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతోన్న పిల్లల కోరికలను తీర్చే ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ అబ్రహం గురించి తెలిసి అతని విష్ను తీర్చేందుకు సంప్రదించింది. అందరు పిల్లలు కోరుకున్నట్లే తన జీవిత లక్ష్యాన్ని కోరుకుంటాడని ఫౌండేషన్ అనుకుంది. కానీ అందరికంటే భిన్నంగా ‘‘ఇల్లు లేని వారికి ఏడాది పాటు ఆకలి తీర్చండి, అదే నా మేక్ ఏ విష్’’ అని కోరాడు. అబ్రహం కోరిక నచ్చిన మేక్ ఏ విష్ అతని కోరిక మన్నించడంతోపాటు, మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చింది. పౌండేషన్ సాయంతో గూడులేని నిరాశ్రయులకు ఆహారం అందించి, ఆకలి తీరుస్తున్నాడు అబ్రహాం. తన తల్లితో కలిసి వందమంది ఆకలిని తీర్చాడు. అబ్రహం పెట్టే ఫుడ్ తిన్న వారంతా థ్యాంక్స్ బాబు అంటూ అబ్రహంకు కృతజ్ఞతలు చెబుతూ ..ఆయుష్షు పెరగాలని దీవిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫౌండేషన్ సాయంతో 2022 ఆగస్టు వరకు కొనసాగనుంది. అబ్రహం టేబుల్.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అబ్రహం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా దాత దొరికితే అతని సమస్య దాదాపు తీరుతుంది. ఫౌండేషన్ సాయంతో నిరాశ్రయుల ఆకలి తీరుస్తూ ఎంతో సంతోషంగా ఉన్న అబ్రహం భవిష్యత్‌లో ‘‘అబ్రహం టేబుల్’’ పేరు మీద ఓ ఎన్జీవోని ప్రారంభించి ఈ సేవలను మరింతగా విస్తరించాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రపంచ వ్యాప్త నెటిజన్లు అబ్రహంను మెచ్చుకోవడమేగాక, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. -
కుటుంబంలో ఒక్కరు తప్ప అందరూ బూడిదయ్యారు
మిస్సిస్సిప్పి : కళ్ల ముందే తన భార్య, ఆరుగురు పిల్లలు కాలి బూడిదైపోతుంటే వారిని కాపాడలేకపోయిన ఓ తండ్రి ఆవేదన ప్రతీ ఒక్కరిని కలచివేస్తోంది. ఈ విషాద ఘటన శనివారం మిస్సిస్సిప్పిలోని క్లింటన్ నగరంలో చోటుచేసుకుంది. కాగా అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వివరాలను క్లింటన్ నగర ప్రతినిధి మార్క్ జోన్స్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో బాధితుని భార్య బ్రిట్నీప్రెస్లీ(33), పిల్లలు లండన్ బ్రూక్‌షైర్(15), లేన్ ప్రెస్లీ(13), లాసన్ ప్రెస్లీ(12), గ్రేసన్ ప్రెస్లీ(6), మాల్కమ్ ప్రెస్లీ(4), ఫెలిసిటీ ప్రెస్లీ(1) చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ప్రమాదానికి సరైన కారణం ఏంటనేది తెలియదని జోన్స్ స్పష్టం చేశారు. 'బహుశా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుంది. కళ్ల ముందే తన కుటుంబం కాలిపోతుండడంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఇల్లంతా మంటలు వ్యాపించి పొగ కమ్ముకోవడంతో లోపలికి వెళ్లడానికి అతనికి సాధ్యపడలేదు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన అతన్ని ఆసుపత్రికి తరలించాం' అని జోన్స్ పేర్కొన్నాడు. తాము మరునాడు ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇళ్లు మొత్తం పూర్తిగా దగ్దమయిందని జోన్స్ తెలిపారు. ఇళ్లు మొత్తం వుడ్‌ప్రేమ్‌తో కట్టడంతోనే ప్రమాద తీవ్రత పెరిగి కుటుంబం మొత్తం మంటల్లో చిక్కుకుందని జోన్స్ పేర్కొన్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు, వారు వేసుకునే బట్టలు సహా ఇంటి సామాగ్రి పూర్తిగా కాలిపోయిందని మార్క్ జోన్స్ వెల్లడించారు. -
నాన్నను వదిలేయండి ప్లీజ్..!
మిస్సిస్సిపి : తల్లిదండ్రుల జాడకోసం ఓ పదకొండేళ్ల చిన్నారి పడుతున్న ఆవేదన మనసుల్ని కలచివేస్తోంది. సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా నివసిస్తున్నారనే కారణంతో మిస్సిస్సిపిలోని ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న వందలాది మందిని అరెస్టు చేశారు. పాఠశాలకు వెళ్లిన తమ చిన్నారులు ఆందోళనకు గురవుతారని, వారిని కూడా తమతో తీసుకెళ్లండని మొరపెట్టుకున్నా వినలేదు. ఇక స్కూల్ నుంచి తిరిగొచ్చిన ఆయా కుటుంబాల చిన్నారులు తమవారి జాడలేక కన్నీరుమున్నీరయ్యారు. ఆ పిల్లలందరికీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ సమీపంలోని కమ్యూనిటీ జిమ్‌లో ఆశ్రయం కల్పించారు. అమ్మానాన్నల వద్దకు తీసుకెళ్లండని ఓ చిన్నారి అధికారుల్ని ప్రాధేయపడిన వీడియో వైరల్ అయింది. ‘నాపై కాస్త కనికరం చూపండి. మా తల్లిదండ్రుల్ని విడిచి పెట్టండి. లేదా నన్ను వారి వద్దకుచేర్చండి. మా నాన్న ఏ నేరం చేయలేదు. ఆయన నేరస్తుడేం కాదు’అని భోరుమంది. ఇక క్రిస్టియానా పెరాల్టా అనే మహిళ మాట్లాడుతూ.. ‘చిన్నారి తండ్రి అడవిలో నివసించే లాటినో జాతివారికి ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తాడు. అతన్ని ఎందుకు అరెస్టు చేశారో తెలియదు. వారంతా ఎప్పుడు కలుసుకుంటారో’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అరెస్టు చేసిన వారిలో 300 మందిని విడుదల చేయగా.. మరో 377 మంది విడుదల కావాల్సి ఉందని తెలిసింది. -
నిరాహారదీక్ష చేస్తున్న శునకం
మిస్సిసిపి: కుక్కపిల్ల ఎదురు చూస్తోంది.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాదు..! తన యజమాని వస్తారని, తనతోపాటు తీసుకెళ్తారని..! ఆహార అన్వేషణను కూడా మానేసి ఉన్నచోటులోనే కదలకుండా ఉండిపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన మిస్సిసిపీలోని బ్రూక్హావెన్లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తనకు అవసరం లేదని భావించిన కుర్చీ, టీవీలను రోడ్డు పక్కన పాడేశాడు. ప్రాణం లేని వస్తువులతో పాటు అతను పెంచుకుంటున్న కుక్కపిల్లను సైతం కుర్చీలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన జంతు నియంత్రణ అధికారిని శారన్ నార్టన్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేయగా అనతికాలంలోనే వైరల్‌గా మారింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిని ఉద్దేశించి.. ‘కుక్కపిల్ల కుర్చీని వదలటానికి కూడా భయపడుతోంది. మీరు తిరిగి వస్తారేమోనని వేచి చూస్తూ తిండి కూడా మానేసి కుర్చీనంటిపెట్టుకుని కూర్చుంది. ఇలాగైతే ఆ కుక్కపిల్ల ఆకలితో అలమటిస్తూ.. చిక్కి శల్యమై చనిపోతుంది. దాన్ని అలా రోడ్డుపై వదిలేసి వెళ్లినందుకు సిగ్గనిపించట్లేదా..?’ అంటూ నార్టన్ పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా శునకాన్ని వదిలేసిన యజమానిపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ఎంతో దీనంగా చూస్తున్న కుక్కపిల్ల ఫోటోలను చూసి సోషల్ మీడియా చలించిపోయింది. మూగజీవిని రోడ్డు పక్కన పాడేయడానికి మనసెలా వచ్చిందంటూ జంతు ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. దానికున్న విశ్వాసంలో కొంతభాగమైనా ఆ యజమానికుంటే బాగుండేది అంటూ అభిప్రాయపడుతున్నారు. -
అమెరికాను కుదిపేస్తున్న టోర్నడో
డాలస్: బలమైన గాలులు, వరదలతో అమెరికా దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. టెక్సాస్, మిస్సిసిపి, లూసియానా, అర్కాన్సాస్ రాష్ట్రాల్లో భారీ వర్షంతోపాటు బలమైన టోర్నడోలు ఏర్పడటంతో భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడంతో పలు ప్రాంతాల్లో లక్షలాది ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. టెక్సాస్ రాష్ట్రం లుఫ్కిన్ పట్టణంలో ప్రయాణిస్తున్న కారుపై చెట్టు కూలడంతో అందులో ఉన్న ఇద్దరు చిన్నారులు(3, 8 ఏళ్లు) మృతి చెందారు. ముందు సీట్లో కూర్చున్న వారి తల్లిదండ్రులు సురక్షితంగా బయటపడ్డారు. టెక్సాస్ సమీపంలోని ఫ్రాంక్లిన్ నగరంలో టోర్నడోల తాకిడికి పలు నివాసాలు ధ్వంసం కాగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మగ్నోలియా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. స్కార్క్విల్లే లోని మిస్సిసిపి స్టేట్ యూనివర్సిటీకి చెందిన 21వేల మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టోర్నడోలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. -
తెలంగాణ రాష్ట్రం నచ్చింది
మహబూబాబాద్ రూరల్ : ‘తెలంగాణ ప్రజలు బాగుండాలి.. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిఒక్కరూ సుభిక్షంగా ఉండేందుకు లోక రక్షకుడైన ఏసుక్రీస్తును ప్రార్థిస్తున్నా’అని అమెరికా మిసిసిపీ రాష్ట్రం జాక్సన్ ప్రాంతానికి చెందిన రెవరెండ్ బిషప్ జోసెఫ్ కోపాజ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఫాతిమామాత దేవాలయ 45వ వార్షికోత్సవానికి వరంగల్ క్యాథలిక్ పీఠాధిపతులు, మేత్రాసనం బిషప్ డాక్టర్ ఉడుముల బాలతో కలసి జోసెఫ్ కోపాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌కు తాను తొలిసారి వచ్చానని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు చాలా బాగున్నాయన్నారు. తెలంగాణ నచ్చిందని, ఇక్కడి ప్రజల ఆప్యాయత మర్చిపోలేనిదన్నారు. గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వేషధారణ ఆకట్టుకున్నాయని చెప్పారు. -
అమెరికాను భయపెట్టిన ‘నేట్’
న్యూ ఆర్లియన్స్: అమెరికాను వణికించిన నేట్ హరికేన్ బలహీనపడి మిసిసిపి, అలబామా రాష్ట్రాల మధ్య ఆదివారం ఉదయం (భారత కాలమానం) రెండోసారి తీరాన్ని తాకింది. భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పినా తీర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో అలలు కొనసాగుతాయని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరించింది. నేట్ హరికేన్ తీవ్రతను ఉష్ణమండల తుఫాను స్థాయికి తగ్గించినా హెచ్చరికల్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి మిసిసిపి రాష్ట్రంలోని మెరిడియన్ నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన హరికేన్ ప్రభావంతో గంటకు 73 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. మిసిసిపి–అలబామా రాష్ట్రాల తీర ప్రాంతాలతో పాటు ఫ్లోరిడా రాష్ట్రంలోని వాల్టన్ కౌంటీలో భారీ అలలు ఎగసిపడవచ్చని, వరదలు సంభవించే ప్రమాదముందని, ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో హరికేన్ ఇర్మా.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని, కరీబియన్ దీవుల్లో కనీవిని ఎరుగని విధ్వంసం సృష్టించింది. -
అమెరికాలో కూలిన సైనిక విమానం
16 మంది దుర్మరణం వాషింగ్టన్: అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో సైనిక విమానం కూలిపోవడంతో 16 మంది సైనికులు మృతిచెందారు. సోమవారం సాయంత్రం మిసిసిపీలోని లీఫ్లోర్ కౌంటీలో 16 మందితో వెళ్తున్న కేసీ–130 అనే విమానం కుప్పకూలినట్లు అధికారులు ధ్రువీకరించారు. అందులో నుంచి ఎవరూ సజీవంగా బయటపడలేదని నిర్ధారించారు. విమానం ఉత్తర కరోలినాలోని చెర్రీ పాయింట్ మెరైన్ కార్ప్స్ నుంచి బయల్దేరిన తరువాత మిసిసిపీలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ రీఫుయెలింగ్ విమానం అయిన కేసీ–30 సైనికులతో పాటు సరుకులను కూడా రవాణాచేయగలదు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది. సైనిక విమానం కుప్పకూలిందన్న వార్త తనను కలచివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. -
అమెరికాలో కాల్పుల మోత..
8 మంది మృతి బ్రూక్‌హవెన్: కాల్పుల మోతతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. మిసిసిపీ రాష్ట్రంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. మిసిసిపీ పోలీసు అధికారి వారెన్ స్ట్రైన్ కథనం ప్రకారం... లింకన్ కౌంటీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్రూక్‌హవెన్, బొగ్యు చిట్టొల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పిల్లల విషయమై భార్య, ఆమె తల్లిదండ్రులతో గొడవపడ్డ కోరీ గాడ్‌బోల్ట్(35) ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పులు చోటుచేసుకున్న మూడిళ్లలో దర్యాప్తు బృందాలు సాక్ష్యాధారాల్ని సేకరిస్తున్నాయని ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలేమని స్ట్రైన్ చెప్పారు. అరెస్టు అనంతరం గాడ్‌బోల్ట్ స్థానిక పత్రికతో మాట్లాడుతూ.. ‘నా భార్య, ఆమె సవతి తండ్రి, తల్లితో పిల్లల్ని తీసుకెళ్లే విషయమై మాట్లాడుతున్నా.. ఇంతలో ఎవరో పోలీసు అధికారికి ఫోన్‌చేశారు. సంబంధం లేని వారు జోక్యం చేసుకున్నారు. ఈ పనికి పాల్పడ్డాక నేను బతకడానికి అనర్హుడిన’ని పేర్కొన్నాడు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మిసిసిపి రాష్ట్ర గవర్నర్ ఫిల్ బ్రైంట్ విచారం వ్యక్తంచేశారు. మిసిసిపీ రాజధాని జాక్సన్‌ను కాల్పులు జరిగిన ప్రాంతం 109 కి.మి. దూరంలో ఉంది. -
అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడోలు
మిసిసిపి: పెనుగాలి(టోర్నడో) అమెరికాను కుదిపేస్తోంది. టోర్నడోల కారణంగా దేశవ్యాప్తంగా కనీసం ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. 40 మందిపైగా గాయపడ్డారు. ముఖ్యంగా ఇండియానా, మిసిసిపి రాష్ట్రాలపై టోర్నడోలు ప్రతాపం చూపాయి. ఆర్కాన్సాస్ ప్రాంతంలో ఇల్లుపై చెట్టు కూలిపోవడంతో 18 ఏళ్ల యువతి మృతి చెందింది. ఏడాది శిశువును రక్షించారు. టెన్నెసీ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. బెంటన్ కౌంటీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆచూకీ లేకుండా పోయారు. వీరి జాడ కనుగొనేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. పెనుగాలికి క్లార్క్స్ డేల్ చిన్న విమానాశ్రయంలో విమానాలు తల్లక్రిందులయ్యాయని మేయర్ బిల్ లకెట్ తెలిపారు. టోర్నడోలు పలుచోట్ల విధ్వంసం సృష్టించాయని చెప్పారు. 10 నిమిషాల పాటు టోర్నడో సృష్టించిన బీభత్సాన్ని స్థానిక టీవీ చానళ్లు ప్రచారం చేశాయి. మరోవైపు ఇంటర్ స్టేట్ 55 రహదారిని రెండు వైపుల మూసివేసినట్టు మిసిసిపి హైవేస్ పాట్రోల్ అధికారులు తెలిపారు. మిసిసిపితో పాటు మిస్సౌరి, ఇలినాయిస్, కెంటుకీలకు టోర్నడోల ముప్పు పొంచివుందని ఒక్లాహామాలోని నేషనల్ స్టార్మ్ ప్రిడిక్షన్ సెంటర్ హెచ్చరించింది. 193 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముందని పౌరులను అప్రమత్తం చేసింది. -
మిసిసిపీ అమెరికా ప్రధాన నది
K. LALITHA BAI Associate Professor, English, Hyderabad. It is quite common in English that we get confused while using certain words. Hence, it is essential to know their meaning. These confusions occur in the use of homonyms, homographs and homophones. A homonym is one of a group of words that share the same spelling and pronunciation but have different meanings. Example: left (past tense of leave) and left (opposite of right) Homographs are usually defined as words that share the same spelling and different meaning, regardless of how they are pronounced. Example: close = nearby close = to shut Homophones are usually defined as words that share the same pronunciation and different meaning, regardless of how they are spelled. Example: pick a flower bake with flour It is a known fact that a good dictionary is a great source to verify the usages of words. Apart from this, listening to native speakers and possessing a general reading habit enhances your skills. Let us learn some of the words that are confused or misused. Accident - an unfortunate happening Incident- an event Adapt- to make suitable to Adopt- to take as someone's own Adept- expert Alternately- regular interchange Alternatively- a choice Anonymous- unknown Unanimous- in complete agreement Battle- a short conflict War- a long conflict Berth- a sleeping place Birth- act of being born Canvas- a strong rough material for painting Canvass- to support a person Corporal- a lower rank army officer Corporeal- physical Corpse- dead body Corps- a unit of army Deceased- dead Diseased- suffering from a disease Discover- to find something that was already existing Invent- to make something new Draught- flow of air in a room Drought- a long period with no rains Emigrant- a person who leaves his country to live in another country Immigrant- a person who has come to another country to live permanently Famous- known by many people Notorious- well known for being bad Few- not many (used with countable nouns) Less- not much (used with uncountable nouns) Further- to a greater degree Farther- a greater distance Historic- something important Historical- connected with history Industrial- related to industry Industrious- hard working Judicial- related with matters of judiciary Judicious- wise Later- at a time in future Latter- second of two things Luxuriant- dense growth Luxurious- related with luxury Lose- to miss something Loose- not firmly fixed Official- connected with a position of authority Officious- too ready to use power Principal- head or chief Principle- a rule Quite- to a great degree Quiet- calm Refuse- not to grant something Refuge- shelter Stationary- not moving Stationery- materials for writing Temporal- connected with time Temporary- not permanent Jealous- angry or unhappy Zealous- full of enthusiasm PRACTICE TESTS Directions (Q. 1-15): Each question below has a blank/ two blanks, each blank indicating that something has been omitted. Choose the word/ set of words from the five options for each blank that best fits the meaning of the sentence as a whole. 1. It is the clerks job to order the ____. 1) Stationery 2) stationary 3) station 4) statutory 5) situation 2. The Mississippi is the ____ river of the United States. 1) Principle 2) principles 3) principled 4) principal's 5) principal 3. The teacher spoke so ____ I could ____ hear her. 1) Quiet… hardly 2) quietly… hardly 3) quite… hardly 4) quietly… hard 5) quiet… hard 4. Unfortunately, some ____ tend to be rather ____ . 1) Official… office 2) officials… office 3) officials…official 4) official… officers 5) officials… officious 5. They accepted they would have to ____ their jobs. 1) Lose 2) loose 3) lost 4) losing 5) loosing 6. He was charged with the offense but ____ released on bail. 1) Latter 2) late 3) later 4) latest 5) lately 7. Going to court to settle a dispute is a ____ procedure. 1) Judge 2) judicious 3) judicial 4) judging 5) Judaic 8. In ____ cities you'll find many factories. 1) Industry 2) industrious 3) industries 4) industrial 5) industrialize 9. The fact that the U.S., Russia and China now stand ____ against terrorism is a ____ development. 1) Unit… historical 2) unity… historic 3) uniform… history 4) united… historian 5) united… historical 10. I could not go any ____. 1) Farther 2) further 3) far 4) extra 5) fur 11. His prime-time TV appearance helped him ____ his cause. 1) Farther 2) further 3) far 4) more 5) former 12. The book of ____ quotations inspired us all. 1) Famous 2) notorious 3) famed 4) eminent 5) celebrated 13. America is home to ____ from all over the world. 1) Immigrants 2) immigrant 3) immigration 4) emigrant 5) migrant 14. He paints pictures on ____ and camps out in a ____ tent. 1) Canvas… canvass 2) canvass… canvas 3) canvas… canvas 4) canvassed… canvas 5) canvassing… canvas 15. You can sleep well on ____ because of the comfortable ____. 1) Board… berths 2) board… birth 3) berths… berths 4) berth… birth 5) births… berths Directions: (Questions 16 to 30) Which of the phrases (1), (2), (3) and (4) given below each sentence should replace the phrase printed in bold in the sentence to make it grammatically correct? If the sentence is correct as it is given and no correction is required, mark (5) as the answer. 16. The car rammed into a stationary lorry. 1) Stationery 2) Station 3) Statutory 4) Situation 5) No correction required 17. Korean workers are among the most industry in the world. 1) Industrious 2) Industrial 3) Induct 4) Induce 5) No correction required 18. Some people like reading calmness novels. 1) historic 2) Historical 3) History 4) Historians 5) No correction required 19. Many poorer work from Europe never reached America. 1) Emigration 2) Immigrant 3) Emigrants 4) Emigrant 5) No correction required 20. The crew says they can deal with anything, even the begin of a baby! 1) Births 2) Birth 3) Berth 4) Berths 5) No correction required 21. The country works on the role that all citizens are equal. 1) Principles 2) Principled 3) Principal 4) Principle 5) No correction required 22. The party's candidate wasn't able to canvasing enough support to win the election. 1) Canvas 2) Canvassing 3) Canvass 4) Canvassed 5) No correction required 23. You are much right in saying so. 1) Quiet 2) Quite 3) Quit 4) Quiets 5) No correction required 24. A temperature gap in the scenes is artistic. 1) Temporal 2) Template 3) Temporary 4) Tempting 5) No correction required 25. Saving money for a rainy day is a judicious decision by the poor man. 1) Judicial 2) Judging 3) Judge 4) Juggling 5) No correction required 26. Of the two scenes in the film, I liked the later. 1) A later 2) An later 3) A letter 4) The latter 5) No correction required 27. They are zealous of his newly acquired riches. 1) Are jealous 2) Were zealous 3) Is jealous 4) Are jealousy 5) No correction required 28. The players ran towards the pitch zealous. 1) Jealous 2) Jealousy 3) Zealously 4) Zeal 5) No correction required 29. Uganda refuge him a visa. 1) Refused 2) Refuse 3) Refusing 4) Reuse 5) No correction required 30. Madhubala has luxury hair. 1) Luxurious 2) Luxuriously 3) Luxuriant 4) Lush 5) No correction required ANSWERS: 1) 1 2) 5 3) 2 4) 5 5) 1 6) 3 7) 3 8) 4 9) 5 10) 2 11) 2 12) 1 13) 1 14) 3 15) 1 16) 5 17) 1 18) 2 19) 3 20) 2 21) 4 22) 3 23) 2 24) 1 25) 5 26) 4 27) 1 28) 3 29) 1 30) 3 -
యూఎస్ లో టోర్నాడో విధ్వంసం!