ప్రపంచ దేశాల్లో ఆర్ధిక మాంద్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ముఖ్యంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన సంస్థలు హైర్ అండ్ ఫైర్ పాలసీని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మెటా, ట్విటర్ నుంచి స్టార్టప్స్ వరకు ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా 20 ఏళ్లకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. మీరు రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దంటూ మెసేజ్ పెట్టింది.ఇతర అలవెన్స్‌ల్ని సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
అమెరికా మిస్సిస్సిప్పి (Mississippi)కి చెందిన ప్రముఖ యునైటెడ్ ఫర్నీచర్ ఇండస్ట్రీస్ (యూఎఫ్‌ఐ) సంస్థ 20 ఏళ్లగా బడ్జెట్ ధరలో సోఫాలు,రిక్లైనర్‌లు తయారు చేయడంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అయితే ఆ సంస్థ..అమెరికన్లు ప్రతిఏడాది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రేమను పంచుకునేందుకు థ్యాంక్స్ గివింగ్ డే అనే ఫెస్టివల్ పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
ఆ పండగకు కేవలం రెండు రోజుల ముందు అర్ధరాత్రి సుమారు 2,700 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. మీరు రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు. ఆఫీస్ ల్యాప్‌ట్యాప్‌తో పాటు ఇతర వస్తువులు మీ వద్ద ఉంటే వాటిని వెంటనే సబ్మిట్ చేయండి అంటూ మెసేజ్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
క్షమించండి
కంపెనీ ఉద్యోగులకు పంపిన టెక్ట్స్ మెసేజ్ ప్రకారం..‘బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సూచనల మేరకు...అనుకోని వ్యాపార పరిస్థితుల కారణంగా కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సినందుకు చింతిస్తున్నాం. నవంబరు 21న సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్న తక్షణమే అమల్లోకి వచ్చేలా చూస్తున్నట్లు వెల్లడించింది.
సీఈవో నుంచి
ఉద్యోగులను ఆకస్మికంగా ఎందుకు తొలగించారనే అంశంపై యునైటెడ్ ఫర్నీచర్ సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దాదాపు 20 ఏళ్ల నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ కంపెనీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమ్మర్ సీజన్‌లో కంపెనీలో పనిచేస్తున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌లకు సైతం పింక్ స్లిప్‌లు జారీ చేసిందంటూ న్యూయార్క్ పోస్ట్ నివేదికలు చెబుతున్నాయి.
చదవండి👉 సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు భారీ షాక్!, వచ్చే ఏడాది మిగిలిన రంగాల్లో..
చదవండి👉 రండి మీకు నేను ఉద్యోగాలిస్తా.. ట్విటర్, మెటా ఉద్యోగులకు రతన్ టాటా బంపరాఫర్!
Comments
Please login to add a commentAdd a comment