Thanksgiving Day
-
‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’,అర్ధరాత్రి హైడ్రామా..ఉద్యోగులకు ఊహించని షాక్!
ప్రపంచ దేశాల్లో ఆర్ధిక మాంద్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ముఖ్యంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన సంస్థలు హైర్ అండ్ ఫైర్ పాలసీని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మెటా, ట్విటర్ నుంచి స్టార్టప్స్ వరకు ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా 20 ఏళ్లకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. మీరు రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దంటూ మెసేజ్ పెట్టింది.ఇతర అలవెన్స్ల్ని సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా మిస్సిస్సిప్పి (Mississippi)కి చెందిన ప్రముఖ యునైటెడ్ ఫర్నీచర్ ఇండస్ట్రీస్ (యూఎఫ్ఐ) సంస్థ 20 ఏళ్లగా బడ్జెట్ ధరలో సోఫాలు,రిక్లైనర్లు తయారు చేయడంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అయితే ఆ సంస్థ..అమెరికన్లు ప్రతిఏడాది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రేమను పంచుకునేందుకు థ్యాంక్స్ గివింగ్ డే అనే ఫెస్టివల్ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఆ పండగకు కేవలం రెండు రోజుల ముందు అర్ధరాత్రి సుమారు 2,700 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. మీరు రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు. ఆఫీస్ ల్యాప్‌ట్యాప్‌తో పాటు ఇతర వస్తువులు మీ వద్ద ఉంటే వాటిని వెంటనే సబ్మిట్ చేయండి అంటూ మెసేజ్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. క్షమించండి కంపెనీ ఉద్యోగులకు పంపిన టెక్ట్స్ మెసేజ్ ప్రకారం..‘బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సూచనల మేరకు...అనుకోని వ్యాపార పరిస్థితుల కారణంగా కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సినందుకు చింతిస్తున్నాం. నవంబరు 21న సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్న తక్షణమే అమల్లోకి వచ్చేలా చూస్తున్నట్లు వెల్లడించింది. సీఈవో నుంచి ఉద్యోగులను ఆకస్మికంగా ఎందుకు తొలగించారనే అంశంపై యునైటెడ్ ఫర్నీచర్ సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దాదాపు 20 ఏళ్ల నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ కంపెనీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమ్మర్ సీజన్లో కంపెనీలో పనిచేస్తున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లకు సైతం పింక్ స్లిప్‌లు జారీ చేసిందంటూ న్యూయార్క్ పోస్ట్ నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భారీ షాక్!, వచ్చే ఏడాది మిగిలిన రంగాల్లో.. చదవండి👉 రండి మీకు నేను ఉద్యోగాలిస్తా.. ట్విటర్, మెటా ఉద్యోగులకు రతన్ టాటా బంపరాఫర్! -
అలాగైతేనే వైదొలుగుతా!
వాషింగ్టన్: యూఎస్ ఎలక్టోరల్ కాలేజీ కనుక జోబైడెన్‌ను విజేతగా ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ నుంచి వైదొలుగుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తొలిసారి పదవి నుంచి దిగిపోవడం గురించి ట్రంప్ మాట్లాడారు. అయితే, ఎన్నికల ఫలితాలను అంగీకరించనన్నారు. ఒక డెమొక్రాటైన బైడెన్ గెలుపును అంగీకరించడం చాలా కష్టమని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. పదవి నుంచి వైదొలగడం గురించి మాట్లాడుతూ ‘‘తప్పక దిగిపోతాను. అది మీకు కూడా తెలుసు. కానీ ఎన్నికల్లో మోసం జరిగిందని అందరికీ తెలుసు, అందుకే ఓటమిని ఒప్పుకోవడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్స్ బైడెన్ వైపు మొగ్గు చూపితే దిగిపోతానన్నారు. థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘మీరంతా ఇది అధ్యక్షుడిగా నా చివరి థ్యాంక్స్గివింగ్డే అనుకోవచ్చు. కానీ ఎవరికి తెలుసు, ఇది రెండో దఫా అధ్యక్షుడిగా నా తొలి థ్యాంక్స్ గివింగ్‌డే కావచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవలే జీఎస్ఏకి అధికార బదిలీ ఏర్పాట్లు చేసేందుకు ట్రంప్ అనుమతించారు. 538 మంది సభ్యులుండే ఎలక్టోరల్ కాలేజీ డిసెంబర్ 14న సమావేశం కానుంది. అందులో కొత్త అమెరికా అధ్యక్షుడిని ప్రకటిస్తారు. యూఎస్‌లో ఓటర్లు నేరుగా అధ్యక్షున్ని ఎన్నుకోరు. బదులుగా వారు ఎలక్టోరల్స్‌ను ఎన్నుకుంటారు. వీరంతా కలిసి అధ్యక్షుణ్ని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌నకు 232 ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు 270 ఎలక్టోరల్ ఓట్లు కావాల్సిఉంటుంది. -
టీఆర్ఎస్లో హుజూర్ జోష్
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో 43వేల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి, నియోజకవర్గ కేంద్రంలో శనివారం ‘కృతజ్ఞత సభ’పేరిట బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొనాల్సిన బహిరంగ సభ వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. సుమారు పది రోజులక్రితం నిర్మించిన సభా వేదికను తొలగించక పోవడంతో శనివారం జరిగే బహిరంగ సభను అదే ప్రదేశంలో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ఎన్నిక ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌కు చేరుకుని, సాయంత్రం ఐదు గంటలకు జరిగే ‘కృతజ్ఞత సభ’లో ప్రసంగిస్తారు. హుజూర్నగర్ విజయంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి, పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఫోన్లో అభినందించిన కేసీఆర్, తనను కలిసేందుకు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, శనివారం జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ పర్యటనకు వస్తున్న కేసీఆర్‌కు భారీ స్వాగతం చెప్పేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సమన్వయ కమిటీలు..సామాజిక కోణాలు హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి వరుసగా మూడు పర్యాయాలు టీఆర్ఎస్ పోటీ చేసినా.. పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం రూపొందించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెప్టెంబర్ చివరివారంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కొందరు ఎంపిక చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రచార వ్యూహం అమలు, సమన్వయ బాధ్యతలను అప్పగిస్తూ సుమారు 70 మంది ఇన్‌చార్జీలకు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలతో పాటు కొన్ని ప్రధాన సామాజిక వర్గాల ఓట్లను రాబట్టేందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో తొమ్మిది మందితో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు కమిటీల ఏర్పాటు వ్యూహం టీఆర్ఎస్కు కలిసి వచ్చింది. పార్టీ వ్యూహం ఫలితాన్ని ఇవ్వడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ అభినందించగా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులను శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. మున్సిపోల్స్‌లోనూ ఇదే తరహా వ్యూహం క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం, ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలతో భారీ మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తమ నియోజకవర్గాల పరిధిలో మున్సిపాలిటీలు లేని ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం, సమన్వయం బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా ఇతర పార్టీల్లో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను గుర్తించి.. వారిని పార్టీ గూటికి చేర్చే బాధ్యతను కూడా ఇన్‌చార్జీలకు అప్పగిస్తారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కేటీఆర్ పార్టీ మున్సిపల్ ఇన్‌చార్జీలతో త్వరలో సమావేశం కానున్నారు. -
థ్యాంక్స్ గివింగ్ డే
-
‘కారు’చౌక బేరం!
హూస్టన్(అమెరికా): అదృష్టం రెండుసార్లు తలుపు తట్టడం అంటే ఇదే మరి! అమెరికాలో కృతజ్ఞతార్పణల దినోత్సవం(థ్యాంక్స్ గివింగ్ డే) అనంతరం నిర్వహించిన భారీ తగ్గింపు మేళాలో ఓ కుటుంబం కేవలం ఒకే ఒక డాలర్ చొప్పున చెల్లించి రెండు కార్లు సొంతం చేసుకుంది. వీరిద్దరూ తల్లీకొడుకులు కావటం మరో విశేషం. ‘బ్లాక్ ఫ్రైడే’ రోజు కారుచౌక విక్రయాలను పురస్కరించుకుని నైరుతి హూస్టన్‌లోని కార్ల విక్రయ కేంద్రం స్టెర్లింగ్ మెక్ కాల్ టయోటా ఎదుట జనం పెద్ద ఎత్తున బారులు తీరి రాత్రంతా జాగారం చేశారు. దాదాపు 200 మంది ఇందులో పాల్గొన్నారు. కొందరైతే తాము ఎంపిక చేసుకున్న వాహనం పక్కనే కునికిపాట్లు పడ్డారు. ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. రెగినాల్డ్ అనోక్వురు(15)ను తొలుత అదృష్ట లక్ష్మి వరించింది. డాలర్‌కే కారు సొంతమైంది. ఈ ఆనందం నుంచి తేరుకునేలోపే అతడి తల్లికి కూడా ఒక్క డాలర్‌కే కారు దక్కినట్లు తెలియటంతో ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైంది. ఈ పిల్లాడికి దక్కిన కారుకు దాదాపుగా అతడి వయసే ఉంది. మొత్తం 300 వాహనాలను ‘బ్లాక్ ఫ్రైడే’లో ప్రదర్శనకు ఉంచగా ఐదు కార్లను మాత్రం డాలర్‌కే విక్రయాలకు పెట్టారు. మిగతా కార్లను బయట మార్కెట్లో దొరికే ధరలకే అమ్మారు.