midnight
-
31న రాత్రి 12 గంటల దాకా వైన్‌షాపులు ఖుల్లా
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రంలో మద్యం విక్రయ వేళలను పొడిగించారు. 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు జరుపుకొనేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మవచ్చు. అదే విధంగా అన్ని వైన్‌షాపులను ఆ రోజు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల జిల్లాల అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు. -
హోటల్స్‌ను అర్ధరాత్రి వరకు అనుమతించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచేందుకు సహకరించాలని కోరుతూ ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి వినతిపత్రం అందజేసింది. ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.స్వామి, కార్యదర్శి ఎం.నాగరాజు, కోశాధికారి ఇ.వి.పూర్ణచంద్, విజయవాడ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ, కార్యదర్శి రాఘవ డీజీపీ ప్రధాన కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. 2018 అక్టోబరు 15వ తేదీన విడుదల చేసిన జీవో 25 ప్రతిని డీజీపీకి అందజేశారు.దీనికి కొనసాగింపుగా 2022 జూన్ 13వ తేదీన ఇచ్చిన మెమో ఉత్తర్వుల కాపీని కూడా జోడించారు. పొరుగున ఉన్న తెలంగాణలో అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని వివరించారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. -
రోజంతా ఆ తల్లి నరకయాతన!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది. ప్రాధేయపడ్డా ఫలితం లేదుఅనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. -
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి ‘టోల్’ బాదుడు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు నేటి అర్ధరాత్రి(జూన్ 3) నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఐఏ) వెల్లడించింది. టోల్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెరగనున్నాయి.టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఎన్హెచ్ఐఏ తెలిపింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు పేర్కొంది.ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్ హెచ్ఐఏ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్ హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది. -
Taylor Swift: జనం మెచ్చిన పాప్ ప్రభంజనం
పాప్ పవర్‌హౌజ్ టేలర్ స్విఫ్ట్ పేరు పలికితే ‘రికార్డ్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. 2024 గ్రామీ అవార్డ్‌లలో టేలర్ ఆల్బమ్ ‘మిడ్నైట్స్’ ‘బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్ గెలుచుకుంది. దీంతో బెస్ట్ ఆల్బమ్ విభాగంలో వరుసగా నాలుగు సార్లు అవార్డ్ గెల్చుకున్న తొలి మహిళా గాయనిగా రికార్డ్ సృష్టించింది టేలర్ స్విఫ్ట్.... ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అంటారు. పలుకే కాదు... పాట కూడా పాడుతుంది అనుకోవచ్చు. అయితే అందరి విషయంలోనూ ఇది నిజం కాకపోవచ్చు. టేలర్ స్విఫ్ట్ విషయంలో మాత్రం అక్షరాలా నిజమైంది. ‘పెన్సిల్వేనియాలోని రీడింగ్ హాస్పిటల్లో పుట్టిన టేలర్ పుట్టగానే ఏడ్చింది అంటే నేను నమ్మను. పుట్టగానే తీయగా పాట పాడి ఉంటుంది’ అని ఆమె అభిమానులు చమత్కరిస్తుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ‘ఇల్లంతా సంగీతమే’ అన్నట్లుగా ఉండేది టేలర్ ఇల్లు. తండ్రి స్కాట్ కింగ్స్ లీ స్విఫ్ట్ స్టాక్‌బ్రోకర్. సంగీతప్రేమికుడు. తల్లి ఆండ్రియా స్విఫ్ట్ మ్యూచువల్ ఫండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ఆ తరువాత ఇంటికే పరిమితమైంది. ఆండ్రియా గాయకురాలు. టేలర్ తమ్ముడు నటుడు. అమ్మమ్మ ఒపెరా సింగర్. తొమ్మిదేళ్ల వయసు నుంచి పాటలతో ప్రయాణం మొదలుపెట్టింది టేలర్. పాటలోనే కాదు నటనలోనూ అద్భుతమైన ప్రతిభ చూపేది. స్థానిక పండగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో టేలర్ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. షానియా ట్వైన్ పాటలతో స్ఫూర్తి పొందిన టేలర్ జానపదాలను ఇష్టపడింది. పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు స్థానిక కళాకారుడు రోనీ క్రీమర్ నుంచి గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. పాటలు రాసే విషయంలో కూడా రోనీ క్రీమర్ టేలర్‌కు సహాయపడేవాడు. కెరీర్ ప్రారంభంలోనే టేలర్ అనుభవజ్ఞులైన సంగీతకారులు, గేయ రచయితలతో కలిసి పనిచేసింది. ప్రపంచంలోని ప్రముఖులతో పోటీ పడి టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్–2023’కు ఎంపికైంది. గత సంవత్సరం యూఎస్ ఎకనామిక్ రిపోర్ట్‌లో టేలర్ ప్రస్తావన కనిపించింది. ‘పాప్ సింగర్ ప్రస్తావన ఈ రిపోర్ట్‌లో ఎందుకు వచ్చింది!’ అని చాలామంది ఆశ్చర్యపోయారు.‘ íఫిలడెల్ఫియాలో టేలర్ షోలకు జనాలు విపరీతంగా తరలివచ్చారు. బుకింగ్స్‌తో హోటళ్లు కిటకిటలాడిపోయాయి. ఒక్క నెలలోనే హోటళ్ల ఆదాయం భారీగా పెరగడానికి కారణం టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ షోకు వచ్చిన అభిమానులు’ అంటూ ఆ రిపోర్ట్‌లో టేలర్ స్విఫ్ట్ ప్రస్తావన కనిపిస్తుంది. నిద్రలేని రాత్రుల మిడ్నైట్స్ ‘నా నిద్రలేని రాత్రుల నుంచి వచ్చిన ఆల్బమ్ ఇది’ అని ‘మిడ్నైట్స్’ గురించి అంటోంది టేలర్ స్విఫ్ట్. ‘మిడ్నైట్స్’ను కాన్సెప్ట్ ఆల్బమ్‌గా రూపొందించింది. ఈ ఆత్మకథాత్మక గీతరచనలో పశ్చాత్తాపం నుంచి స్వీయ విమర్శ వరకు ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. పాటల రచన, సంగీత నిర్మాణానికి సంబంధించి ‘మిట్నైట్ ఆల్బమ్’ను విశ్లేషకులు ఆకాశాని కెత్తారు. తన గత ఆల్బమ్‌లతో పాటు ‘మిడ్నైట్స్’ను ప్రపంచవ్యాప్తంగా శ్రోతలకు వినిపించడానికి ఎరాస్ టూర్ (2023–2024)ని మొదలు పెట్టింది టేలర్ స్విఫ్ట్. -
అర్థరాత్రి తెల్లటి దుస్తుల్లో చెట్టుకు వేలాడుతున్న మహిళ.. తెల్లారేసరికి..!
సోషల్ మీడియాలో జనం తమకు ఎదురైన మంచి లేదా చెడు అనుభవాలను వెల్లడిస్తుంటారు. దీనిపై అదే సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఒక మహిళ ఇటువంటి విచిత్ర ఉదంతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఎదురైన అనుభవం తనకు నిద్రపట్టనీయలేదని ఆమె ఆ పోస్టులో వాపోయింది. ఆ మహిళ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ.. ‘నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దీంతో నేను మా ఇంటి బాల్కనీలోకి వచ్చాను. అయితే అక్కడి దృశ్యాన్ని చూసి భయపడిపోయాను’ అని పేర్కొంది. ఆమెకు చెట్టుకు వేలాడుతూ తెల్లని దుస్తుల్లో ఉన్న ఒక మహిళ ఆకృతి కనిపించింది. ఇది ఆమెను ఎంతో భయానికి గురిచేసింది. ఈ వీడియో చూశాక తాను విపరీతమైన భయంతో వణికిపోయానని, ఉపశమనం కోసం 10 నుంచి 15 సార్లు హనుమాన్ చాలీసా పఠించానని తెలిపారు. మర్నాటి ఉదయం ఏం జరిగిందో కూడా ఆ మహిళ తెలియజేసింది. ఉదయాన్నే తాను బాల్కనీలోకి వెళ్లి చూడగా, అప్పటి వరకూ మనసులో ఉన్న భయం తొలగిపోయిందని తెలిపింది. ఆ చెట్టుకు వేలాడుతున్నది దెయ్యం కాదని, ఎవరో మహిళ హ్యాంగర్‌కు ఆరబెట్టిన నైటీ చెట్టుపైన పడినట్లు గుర్తించానని తెలిపారు. అనిరుద్ధ్ జోషి అనే మహిళ తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేయగా, దీనికి లెక్కకు మించిన కామెంట్లు వస్తున్నాయి. ఒక యూజర్ ‘తాను ఇకపై రాత్రవేళ నిద్రపట్టకపోతే బాల్కనీలోకి వెళ్లను’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు రాత్రంతా బాల్కనీలోనే ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేదో’ అని కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ! 🤣🤣🤣😂😂🤣🤣🤣 pic.twitter.com/N60zQjFKPx — Aniruddha Joshi (@aniruddha3365) August 20, 2023 -
గిరిజన మహిళపై థర్డ్‌డిగ్రీ..
నాగోలు: ఒంటరిగా ఉన్న ఓ గిరిజన మహిళను అనుమానించారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అర్ధరాత్రివేళ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి లాఠీలు, బూటు కాళ్లతో తంతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా, ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లితండాకు చెందిన వడిడ్త్యా లక్ష్మి, భర్త శ్రీను చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో మీర్‌పేటలోని నందిహిల్స్‌కు వచ్చింది. స్థానికంగా ఇళ్లలో పనికి కుదిరి ఇక్కడే నివాసముంటోంది. ఇటీవల లక్ష్మి పెద్ద కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈనెల 30న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసమని దేవరకొండలోని బంధువుల ఇంటికి ఈ నెల 15వ తేదీన వెళ్లింది. వారి వద్ద రూ.3లక్షల నగదు అప్పుగా తీసుకుంది. అక్కడి నుంచి ఎల్బీనగర్కు బస్సులో వచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. మీర్‌పేటకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎల్బీనగర్ చౌరస్తాలో రోడ్డు పక్కన లక్ష్మి నిలబడింది. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఎక్కడకు వెళుతున్నావు...చేతిలో డబ్బు ఎక్కడిదని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. ఊరి నుంచి వస్తున్నానని, ఆటో కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. కూతురు పెళ్లికార్డు చూపించినా పట్టించుకోలేదు. అర్ధరాత్రి వేళ లక్ష్మిని ఎల్బీనగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లక్ష్మికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకే ఎదురు మాట్లాడతావా అంటూ లక్ష్మిపై హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత, మరో ఇద్దరు సిబ్బంది లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆటోలో పోలీసులు లక్ష్మిని ఇంటికి పంపించారు. లక్ష్మి నడవలేని పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి వైద్యం చేయించారు. పూజ ఫిర్యాదు.. పోలీసులపై అట్రాసిటీ కేసు లక్ష్మి కూతురు వడ్త్యా పూజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులపై ఎల్బీనగర్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. పూజ ఫిర్యాదు ప్రకారం...ఈనెల 15వ తేదీన తల్లి లక్ష్మి తన పెళ్లికి కోసం రూ. 3లక్షల అప్పుగా తేవడానికి మేనమామ చంద్రుని వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. సాయంత్రం వరకు నేనే నా తమ్ముడు అమ్మకోసం ఎదురుచూశాం. కానీ ఆమె రాలేదు. 16వ తేదీన ఎల్బీనగర్ స్టేషన్ అమ్మ ఉన్నట్టు సమాచారం తెలిసి కొంతమందితో కలిసి వెళ్లాను. అమ్మ గురించి పోలీసులను అడిగితే తనను కులం పేరుతో దూషించారని, తల్లిపై పోలీసులు తొడలు, మోకాలు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టి గాయాలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి వద్ద ఉన్న రూ. 3లక్షల నగదు, బంగారు చెవి రింగులు కూడా కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో వివరించింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు 354, 324, 379,సెక్షన్3(1) (ఆర్)(ఎస్), 3(2)(వీఏ), అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లక్ష్మికి సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా.. గాయపడిన లక్ష్మి వైద్య ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ఎల్బీనగర్ ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. లక్ష్మిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నారు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, రాత్రంతా అక్కడే ఉంచి చితకబాదారు. తన చేతిలోని నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ పోలీసులు బలవంతంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగింది. నాపై దాడి చేసిన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – బాధితురాలు లక్ష్మి అర్ధరాత్రి ముఠాగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి ఎల్బీనగర్ చౌరస్తాలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పెట్రోలింగ్ సమయంలో పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి ఈనెల 16న రిమాండ్‌కు తరలించారు. అయితే మర్నాడు ఉదయం లక్ష్మి మినహా మిగిలిన నిందితులు జరిమానా చెల్లించారని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. – ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ఇద్దరి సస్పెన్షన్.. జరిగిన సంఘటనపై ప్రాథమిక విచారణ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని, ఇతరుల పాత్ర రుజువైతే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీ మంత్రి రవీంద్రనాయక్ గిరిజన సంఘాల నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు గురువారం బాధితురాలు లక్ష్మితో కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ జరిగిన ఘటనపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి బాలు, ఆల్ ఇండియా బంజారాసేవా సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రాజు, గిరిజన విద్యార్థి నేత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ
ఉలవపాడు: అర్ధరాత్రి వేళ.. అందరూ నిద్రలో ఉన్నారు.. అంతలో ఒక్కసారిగా రైల్లో కలకలం.. బోగీలోకి ఎక్కిన దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని చైన్ లాగి దర్జాగా రైలు దిగి వెళ్లిపోయారు. చాగల్లు–తెట్టు మధ్య హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రాత్రి గం.1.50 సమయంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం (చాగల్లు–తెట్టు) వద్ద దొంగలు చైన్ లాగడంతో రైలు నిలిచింది. దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి నుంచి నగలు అపహరించి రైలు దిగారు. అనంతరం హైదరాబాద్ నుంచి తాంబరం వెళుతున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 2.30గం.ల. సమయంలో సిగ్నల్ వద్ద నిలిచిపోయింది. అక్కడే ఉన్న దొంగలు అక్కడే ఉండి ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేసేందుకు యతి్నంచారు. కానీ రైల్వే పోలీసులు టార్చ్లైట్లు వేసి వారిని చూడాలని ప్రయత్నించడంతో రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆటోలో దొంగలు పారిపోయారు. ఈ రెండు ఘటనలు 40 నిమిషాల వ్యవధిలో జరిగాయి. నలుగురు దొంగలు! హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం మూడు బోగీలలో కలిపి 111 గ్రాముల బంగారం దోపిడీ జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న మహేంద్రచౌదరి నుంచి 36 గ్రా. చైన్, నరేంద్రరెడ్డి, దీప్తిల దగ్గర్నుంచి 40 గ్రా. బంగారం, సరళ, తమిళనాడుకు చెందినవారు వారి వద్ద నుంచి 20 గ్రా. బంగారం, ఉమాజానకి నుంచి 15 గ్రా. చైన్.. మొత్తం 111 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు బెదిరించి తీసుకెళ్లినట్టు తెలిసింది. సూళ్లూరుపేట స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ దోపిడీ మొత్తం నలుగురు దొంగలున్నట్టు పోలీసులు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. ఆరుగురు ఎస్ఐలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లతో ఈ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్2 నుంచి ఎస్8 వరకు బోగీల్లో ప్రయాణికులను దొంగలు బెదిరించినట్లు తెలిపారు. అయితే ఆ బోగీల్లో పోలీస్ సిబ్బంది లేకపోవడం వల్లే భారీ దోపిడీ జరిగిందని ఆరోపణలున్నాయి. -
Independence Day: అంతా పగలు జెండా ఎగరువేస్తే..అక్కడ మాత్రం..
అందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉదయమే జరుపుకుంటే అక్కడ మాత్రం అర్థరాత్రే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అంతా ఒకలా చేస్తే ఆ రాష్ట్రంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారు? పైగా వారికి అనాదిగా వస్తున్న సంప్రదాయమట. వారి పూర్వీకుల నుంచి ఇలానే చేస్తున్నారట. అసలు ఎందుకిలా అంటే.. బిహార్‌లోని పుర్నియా అనే ప్రాంతంలోని వాసులు మాత్రం అర్థరాత్రి 12.01 గంటలకు జెండా చౌక్ అనే ప్రాంతంలో జెండా ఎగురవేసి సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని ఇప్పటి వరకు అలానే కొనసాగిస్తున్నారు. వారంతా నాటి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు.. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించింది, మనకు స్వాతంత్య్రం వచ్చింది అని ప్రకటించడం.. రేడియోలకి అతుక్కుపోయి మరీ విన్నారు. ఆ తర్వాత వెంటనే పుర్నియా వాసి రామేశ్వరప్రసాద్ సింగ్, దాదాపు పదివేలమంది వ్యక్తులంత కలిసి ఇలా నెహ్రు ప్రకటించగానే అర్థరాత్రి ఆ క్షణమే జెండా ఎగరువేసి వారంతా సంబరాలు చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి దీన్ని ఒక ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ ఈ వేడుకల్లో ఆటంకం ఎదురుకాలేదని చెబుతున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం అతని వారసులు దీన్నికొనసాగిస్తున్నట్లు చెప్పారు. రామేశ్వర ప్రసాద్ మరణాంతరం ఆయన కూతురు సురేఖ దీన్ని పాటించిందని, ఇప్పుడూ మనవడు విపుల్ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో తెలుసా!ఏంటీ డౌంట్? అంటే..) -
అర్ధరాత్రి ఆగంతకుడు !
భద్రాద్రి: ఇల్లెందులోని సింగరేణి కార్మికవాడల్లో అర్ధరాత్రి ఓ ఆగంతకుడు సంచరించిన సంఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ మొదటి లైన్లో శనివారం తెల్లారుజామున 3.35 గంటల ప్రాంతంలో 20 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆగంతకుడు ముఖానికి మంకీ క్యాప్, మాస్క్ ధరించి కొన్ని ఇళ్లల్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇల్లెందులోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో పని చేస్తున్న క్రాంతి, సింగరేణి స్కూల్లో పని చేస్తున్న ఆయన సతీమణి కృష్ణవేణి నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. వారి క్వార్టర్ ముందు కిటికీ తీసి ఇంట్లోకి మొబైల్ టార్చ్ వేసి చూశాడు. ఇంట్లోని కుక్క గమనించి అరవడంతో ఇంటి యజమాని కృష్ణవేణి నిద్ర లేచింది. కిటికీ ముందు నిలబడిన ఆగంతకుడు మొబైల్ టార్చ్ వేసుకుని చూస్తుండటంతో భయపడిన కృష్ణవేణి కేకలు వేసింది. ఆ సమయంలో భర్త క్రాంతి ఊరెళ్లాడు. పక్కింటివారికి ఫోన్ చేయగా, వారు నిద్రలేచి వెతికినా అప్పటికే ఆగంతకుడు పారిపోయాడు. అదే లైన్లో మరికొన్ని ఇళ్లల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. గతేడాది వేసవిలో కూడా ఇదే తరహాలో పట్టణంలో దుండుగులు చోరీలకు పాల్పడ్డారు. తాజాగా సింగరేణి కాలనీలో ఆగంతకుడి సంచారంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చిరంజీవి మిడ్ నైట్ విజువల్స్
-
ఆలా లారీ లో రాహుల్
-
ఆ టైంలో బయట ఉన్నందుకు...దంపతులకు రూ. 3000లు జరిమానా!
ఒక జంట అర్ధరాత్రి బయట ఉన్నందుకు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో బయటకు రావడం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ మూడు వేలు జరిమానా విధించారు పోలీసులు. కట్టేంత వరకు వారిని రకరకాలుగా వేధింపులకు గురిచేశారు. దీంతో సదరు బాధితుడు సహాయం కోసం కమిషనర్ ఆఫ్ పోలీసును ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...కర్ణాటకలోని బెంగళూరులో ఒక జంట తమ స్నేహితుడు బర్త్‌డే కేక్ కటింగ్ ఈవెంట్‌కి హజరై తిరిగి ఇంటికి పయనమయఆయరు. ఆ క్రమంలోనే ఆ జంట తమ ఇంటికీ సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వారికి సమీపంలో ఒక పెట్రోలింగ్ వ్యాన్ ఆగింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఐడీ కార్డులు చూపించమని ఆ జంటను డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ జంట అవాక్కయ్యింది. సాధారణ రోజుల్లోనే కదా మేము బయటకు వచ్చింది, ఎందకని తమను ఇలా ఐడీ కార్డులు చూపించమని నిలదీస్తున్నారో వారికి ఒక్కసారిగా అర్థం కాదు. ఆ తర్వాత ఆ దంపతలు తమ ఐడీ కార్డులను పోలీసులకు చూపించారు. ఆ తదనంతరం పోలీసులు ఆ జంట వద్ద నుంచి ఫోన్లు లాక్కుని వ్యక్తిగత వివరాలను విచారించడం ప్రారంభించారు. అర్థరాత్రి సమయం కావడంతో వారు కూడా ఓపికగా సమాధానాలు చెప్పారు. ఇంతలో వారిలో ఒక పోలీసు ఆ జంట పేర్లను, ఆధార్ నెంబర్లను నమోదు చేయడం చూసి...మాకు ఎందుకు చలానా జారీ చేస్తున్నారని ప్రశ్నించాం. అందుకు పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరగడానికి అనుమతి లేదని చెప్పారు. అలాంటి నియమం లేదని తెలిసినా...ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి తీవ్రతరం కాకూడదనే ఉద్దేశ్యంతో దీని గురించి తమకు తెలియదని మర్యాదపూర్వకంగా చెప్పడమే గాక క్షమాపణలు కూడా చెప్పింది ఆ జంట. అయినా పోలీసులు వారిని వదలకుండా వేధింపులకు గురి చేశారు. పైగా రూ. 3000లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ జంట ఎంతగా ప్రాథేయపడిన వినకపోగా అరెస్టులు చేస్తామని బెదిరించారు పోలీసులు. కాసేపటికి పోలీసుల్లో ఒకరూ ఆ జరిమానాలో కనీసం మొత్తం చెల్లించేస్తే వదిలిపెట్టేస్తారని చెప్పారు. ఆ తర్వాత తాను పేటీఎం ద్వారా చెల్లించేంత వరకు పోలీసులు తమను వదలలేదని బాధితుడు కార్తీక్ పత్రి అన్నారు. ఆఖరికి నా భార్య కన్నీరు పెడుతున్న దయాదాక్షిణ్యం చూపకుండా అత్యంత అమానుషంగా ప్రవర్తించారని వాపోయాడు కార్తీక్. ఈ వియషయాంలో తనకు సాయం చేయాల్సిందిగా బాధితుడు కార్తీక్ బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వివరించాడు. ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ అనూప్ శెట్టి స్పందించి...ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చినందకు కార్తీక్‌కి ధన్యావాదాలు. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: మొబైల్లో గేమ్ ఆడుతుండగా పేలుడు..తీవ్రంగా గాయపడ్డ చిన్నారి) -
‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’,అర్ధరాత్రి హైడ్రామా..ఉద్యోగులకు ఊహించని షాక్!
ప్రపంచ దేశాల్లో ఆర్ధిక మాంద్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ముఖ్యంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన సంస్థలు హైర్ అండ్ ఫైర్ పాలసీని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మెటా, ట్విటర్ నుంచి స్టార్టప్స్ వరకు ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా 20 ఏళ్లకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. మీరు రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దంటూ మెసేజ్ పెట్టింది.ఇతర అలవెన్స్ల్ని సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా మిస్సిస్సిప్పి (Mississippi)కి చెందిన ప్రముఖ యునైటెడ్ ఫర్నీచర్ ఇండస్ట్రీస్ (యూఎఫ్ఐ) సంస్థ 20 ఏళ్లగా బడ్జెట్ ధరలో సోఫాలు,రిక్లైనర్లు తయారు చేయడంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అయితే ఆ సంస్థ..అమెరికన్లు ప్రతిఏడాది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రేమను పంచుకునేందుకు థ్యాంక్స్ గివింగ్ డే అనే ఫెస్టివల్ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఆ పండగకు కేవలం రెండు రోజుల ముందు అర్ధరాత్రి సుమారు 2,700 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. మీరు రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు. ఆఫీస్ ల్యాప్‌ట్యాప్‌తో పాటు ఇతర వస్తువులు మీ వద్ద ఉంటే వాటిని వెంటనే సబ్మిట్ చేయండి అంటూ మెసేజ్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. క్షమించండి కంపెనీ ఉద్యోగులకు పంపిన టెక్ట్స్ మెసేజ్ ప్రకారం..‘బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సూచనల మేరకు...అనుకోని వ్యాపార పరిస్థితుల కారణంగా కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సినందుకు చింతిస్తున్నాం. నవంబరు 21న సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్న తక్షణమే అమల్లోకి వచ్చేలా చూస్తున్నట్లు వెల్లడించింది. సీఈవో నుంచి ఉద్యోగులను ఆకస్మికంగా ఎందుకు తొలగించారనే అంశంపై యునైటెడ్ ఫర్నీచర్ సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దాదాపు 20 ఏళ్ల నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ కంపెనీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమ్మర్ సీజన్లో కంపెనీలో పనిచేస్తున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లకు సైతం పింక్ స్లిప్‌లు జారీ చేసిందంటూ న్యూయార్క్ పోస్ట్ నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భారీ షాక్!, వచ్చే ఏడాది మిగిలిన రంగాల్లో.. చదవండి👉 రండి మీకు నేను ఉద్యోగాలిస్తా.. ట్విటర్, మెటా ఉద్యోగులకు రతన్ టాటా బంపరాఫర్! -
అర్థరాత్రి ప్రమాదం! బతుకులను చీకట్లో కలిపేసిన కాళరాత్రి
అర్ధరాత్రి.. చిమ్మ చీకటి.. దానికి తోడు గాలీవాన.. రోడ్డు పక్కన బోల్తా పడిన ట్రాక్టర్. దాని కింద ఇద్దరు యువకులు.. అంత రాత్రి పూట ఎవరూ వారిని చూడలేదు. ప్రకృతి సాయం చేసే వీలూ ఇవ్వలేదు. తెల్లారే సరికి వారిద్దరి బతుకులు తెల్లారిపోయాయి. ఒక్క ప్రమాదం వీరి ద్దరి ప్రయాణాలకు శాశ్వతంగా ముగింపు పలికింది. ఒక్క కాళరాత్రి వీరి బతుకులను చీకటిలో కలిపేసింది. లఖిదాసుపురం గ్రామానికి చెందిన బొంగి వంశీకృష్ణ(23), గున్న అజయ్‌కుమార్(19)లు ఆదివారం రాత్రి ప్రతాపవిశ్వనాథపురం రెవెన్యూ పరిధిలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందారు. నందిగాం: లఖిదాసుపురానికి చెందిన బొంగి అశోక్‌కుమార్, వనిత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు వంశీకృష్ణ ట్రాక్టర్, లగేజీ వ్యా న్ నడుపుతూ కుటుంబానికి అండగా ఉంటున్నా డు. అలాగే ఇదే గ్రామానికి చెందిన గున్న సీతా రాం, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో అజయ్‌కుమార్ చిన్నవాడు. ఇంటర్ సెకండియర్ చదువుతూ చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. వంశీకృష్ణ వాళ్ల ట్రాక్టర్‌తో సిమెంట్ లోడ్‌ను వజ్రపుకొత్తూరు మండలం పూండీ తీసుకువెళ్లేందుకు అజయ్‌కుమార్‌ను ఆదివారం రాత్రి తోడు తీసుకెళ్లాడు. పూండీలో లోడ్ దించేసి మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా ప్రతాపవిశ్వనాథపురం పరిధి మూలపొలం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న పొలంలో బోల్తా పడింది. ట్రాక్టర్ నడుపుతున్న వంశీకృష్ణ, అజయ్‌కుమార్ ఇద్దరూ బండి కింద పడిపోయారు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన చిన్న వర్షం వల్ల ఆ మార్గాన వెళ్లే వారు ఈ ప్రమాదాన్ని గుర్తించలేదు. ట్రాక్టర్ తీసు కెళ్లిన వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో వంశీకృష్ణ తండ్రి అశోక్‌కుమార్, అజయ్‌కుమార్ తండ్రి సీతారాంలు కుమారులకు కాల్ చేశారు. కానీ ఎవరూ రిసీవ్ చేసుకోకపోవడం, ఒకరి ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చి కణితూరు వరకు వెళ్లి చూశా రు. ఎక్కడా జాడ లేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేశారు. సోమవారం ఉదయం ఆ మార్గాన వెళ్లే వారు ట్రాక్టర్ ప్రమాదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ ప్రమాద సమాచారం అందుకుని మృతదేహాలను ట్రాక్టర్ కింద నుంచి తీయడానికి క్రేన్ తెప్పించారు. అజయ్‌కుమార్ తండ్రి సీతారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నందిగాం ఎస్ఐ మహమ్మద్ యాసిన్ తెలిపారు. (చదవండి: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి..) -
అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆటోలతో స్టంట్స్ .. వీడియో వైరల్
Auto Rickshaw Drivers Dangerous Stunts On Road: అర్ధరాత్రి నడిరోడ్డుపై అత్యంత ప్రమాదకరంగా ఆటోలతో విన్యాసాలు(స్టంట్స్) చేస్తూ.. పెద్దపెద్దగా కేకలు వేస్తూ తోటి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తూ.. తోటి వాహనాలు, లారీని ఓవర్ టేక్ చేస్తూ.. భయంకరంగా వ్యవహరించిన ఆరుగురు యువకులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాల ప్రకారం.. టోలిచౌకి ప్రాంతానికి చెందిన సయ్యద్ జుబేర్ అలీ(20), సయ్యద్ సాహిల్(21), మహ్మద్ ఇబ్రహీం(22), మహ్మద్ ఇనాయత్(23), గులాం సైఫ్‌ద్దీన్(23), మహ్మద్ సమీర్(19), అమీర్ ఖాన్(20) అద్దెకు ఆటోలను నడుపుతుంటారు. గురువారం అర్ధరాత్రి మూడు ఆటోలతో చాంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చారు. చాంద్రాయణగుట్ట నుంచి రాత్రి 12.30 గంటలకు బాబానగర్ మీదుగా డీఆర్డీఎల్ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకొని తిరిగి బాబానగర్ వైపు పయనమయ్యారు. మూడు ఆటోలను ఒళ్లు గగుర్పొడిచే రీతిలో రెండు టైర్లపై క్రాస్‌గా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురిచేశారు. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలిగించారు. రోడ్లపై వీరు చేసిన స్టంట్స్‌ను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆటోతో పాటు డ్రైవర్ మహ్మద్ ఇబ్రహీం పరారీలో ఉన్నాడు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ ఎ.మధుసూదన్‌రెడ్డి, ఎస్సైలు గౌస్‌ఖాన్, గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. Action required @HYDTP !#Santoshnagar#Chandrayangutta !! pic.twitter.com/oruw79VacZ — Dr Chaitanya Singh (@MidnightReportr) February 25, 2022 -
అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..
గుంటూరు రూరల్: మనసులోని బాధను ఎవ్వరితోనూ చెప్పుకోలేదు. తాను ఎక్కడుందో ఆమెకే తెలియదు. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎదుటివారు ఏమి మాట్లాడుతున్నారో ఆమెకు వినపడదు, అటువంటి మూగ, చెవిటి యువతి అర్ధరాత్రి ఒంటరిగా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై బిక్కుబిక్కుమంటూ నిలబడగా ఆమెను నల్లపాడు పోలీసులు రక్షించి మహిళా ప్రాంగణానికి తరలించారు. నగరమంతా దీపావళి వేడుకలు నిర్వహించుకుంటోంది. విధి నిర్వహణలో నల్లపాడు పోలీసులు విజుబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధం, హత్య కేసు.. నిందితుడిని పట్టించిన ‘చెప్పు’ ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఒక యువతి రోడ్డుపై నిలబడటం చూసి ఎందుకున్నావని సీఐ ప్రేమయ్య పలకరించారు. దీంతో ఆమె తనకు మాటలు రావని, చెవుడని సైగల ద్వారా తెలిపింది. ఆమె సైగల ద్వారా ఆమె నెల్లూరుకు చెందిన స్వాతిగా గుర్తించారు. ఎందుకు వచ్చావని ప్రశ్నించగా తన స్నేహితుడు లారీలో తెచ్చి, ఇక్కడ వదిలి వెళ్లాడని తెలిపింది. దీంతో విషయం అర్థం చేసుకున్న సీఐ ఆమెను నగరంలోని మహిళా ప్రాంగణానికి తరలించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. దీంతో ఆమె బంధువులు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం రాత్రి చేరుకున్నారు. వారిని విచారించి ఆమెను ఇంటికి పంపనున్నట్లు సీఐ తెలిపారు. అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై ఉన్న యువతిని కాపాడిన సీఐను స్థానికులు, ప్రజలు అభినందించారు. చదవండి: జూబ్లీహిల్స్: డ్రస్సింగ్ రూంలో మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరణ -
తెలంగాణ: హైదరాబాద్‌లో అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్చల్
-
Hyderabad: అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్లో కొందరు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే అలాంటి వారిపై పోలీసులు కాకుండా కొందరు ముప్పేట దాడి చేస్తున్నారు. ఓ గ్యాంగ్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఎవరైనా బయటికి వస్తే ముప్పేట దాడి చేస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే ఆ దాడికి పాల్పడుతున్న వారిని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీలో ఇద్దరిని గుర్తించినట్లు సమాచారం. దీనిపై బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అర్దరాత్రి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీన్ నగర్ రోడ్లపై ఒక్కో బైక్‌పై ఇద్దరిద్దరు వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. కొందరు బైకులపై తిరుగుతూ లాఠీలు చేత బట్టుకొని కనిపించిన వారిని చితకబాదుతున్నారు. అయితే వారిని మొదట పోలీసులుగా స్థానికులు భావించారు. కానీ వారు జులాయి గ్యాంగ్‌గా గుర్తించారు. నాలుగు, ఐదు బైక్‌లపై పోలీస్ డ్రెస్ లేకుండా సంచరిస్తూ లాఠీలతో దాడి చేస్తుండడంతో స్థానికులు సీసీ ఫుటేజీలో గమనించారు. వారు పోలీసులు కాదని గుర్తించి బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో అర్ధరాత్రి వరకు కొనసాగిన టీకా ఉత్సవ్
-
జగ్గయ్యపేటలో అర్ధరాత్రి హైడ్రామా
-
రాదేమి కునుకు!
ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ టెక్నాలజీ,టెలివిజన్ ప్రసారాలు సిటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి తొమ్మిది గంటలకే పడకెక్కాల్సిన నగరవాసులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కళ్లప్పగించే చూస్తున్నారు. అందివచ్చిన ఈ టెక్నాలజీకి మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు తోడు కావడంతో ప్రస్తుతం గ్రేటర్లో 40 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులపరిశీలనలో వెల్లడైంది. పరోక్షంగా ఇదితీవ్రమైన మానసిక ఆందోళన, ఏకాగ్రత లోపం, మధుమేహం, హైపర్ టెన్షన్లకే కాదు.. యువత దాంపత్య జీవితంపై కూడాతీవ్ర ప్రభావం చూపుతోంది. సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు రాత్రి 8 గంటలకే నిద్రకు ఉపక్రమించిన సిటీజన్లు ప్రస్తుతం తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ఆందోళనతో అర్ధరాత్రి దాటినా రెప్పవాల్చడం లేదు. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు విదేశాలకు అనుగుణంగా తమ పని వేళలను మార్చుకోవడం, వీకెండ్ పార్టీల పేరుతో వీరు ఎక్కువ సేపు డిస్కోలు, పబ్‌ల్లో గడుపుతున్నారు. ఇదే సమయంలో అర్ధరాత్రి దాకా మద్యం తాగడం, ఆయిల్, మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఆహారం జీర్ణం కాకముందే నిద్రకు ఉపక్రమించడంతో శ్వాసనాళాలపై ఒత్తిడి పెరుగుతోంది. పడకెక్కిన పది నిమిషాలకే గుర్ర్.. గుర్ర్.. అంటూ గురకపెడుతున్నారు. బాధితుల్లో కొంత మంది స్లీపింగ్ టాబ్లె ట్స్, ఇతర మత్తు పదార్థాలకు, మద్యానికి అల వాటు పడుతున్నారు. ఇలా ఒక సమస్య నుంచి బయట పడేందుకు యత్నించి మరో సమస్యలో చిక్కుకుంటున్నట్లు జాతీయ నిద్ర ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 12 శాతం మందిలో స్లీప్ అప్నియా.. ఢిల్లీలో 16– 18 శాతం మంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నీయా (గురక, నిద్రలో శ్వాస సరిగా తీసుకోలేక పోవడం) బాధితులు ఉంటే, బెంగళూరులో 15.5 శాతం, చెన్నైలో 15 శాతం ఉండగా హైదరాబాద్‌లో పది నుంచి 12 శాతం మంది ఉన్నట్లు స్టార్ ఈఎన్టీ వైద్యులు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే మేల్కొనాల్సి ఉండగా, చాలా మంది ఇలా నిద్రపోగానే అలా లేచి కూర్చుంటున్నట్లు గుర్తించింది. బలవంతంగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేసినా ఊపిరితిత్తులు, మెదడు, గుండెకు చేరడంలేదు. పరోక్షంగా ఇది ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్యలో వెలుగు చూస్తున్న 60 శాతం ఆకస్మిక గుండెపోటు మరణాలకు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నీయానే కారణమవుతున్నట్లు తేలింది. యువతలోనే అధికం: డాక్టర్ శ్రీనివాస్, ఈఎన్టీ, స్టార్ ఆస్పత్రి నవతరానికి నిద్రలేమి ఓ ప్లేగులా అంటుకుంది. ప్రతిపది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వారే. నిద్రలేమితో జబ్బులు రాకుండా ఉండాలంటే వ్యక్తికి కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. ఆరు, అంతకన్నా తక్కువ గంటలు నిద్రపోతే ఏకాగ్రత లోపిస్తుంది. జ్ఞాపకశక్తి సంబంధ సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఆయుష్షు తగ్గిపోతుంది. కేవలం నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో కేన్సర్‌పై పోరాడే శక్తి 70 శాతం తక్కువ ఉంటుంది. అంతేకాదు రాత్రి నిద్ర పోకపోవడం వల్ల మానసిక, శారీరక ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్స్ తగ్గడంతో పాటు సెక్స్‌వల్ హార్మోన్స్ ఉత్ప త్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలివీ.. ⇔ నిద్ర పోవడానికి.. మేల్కొనడానికికచ్చితమైన వేళలు పాటించాలి ⇔ నిద్రకు ముందు ఎక్కువ భోజనం చేయకూడదు ⇔ నిద్ర పోవడానికి 4 గంటల ముందే మద్యం తాగడం ఆపివేయాలి ⇔ నిద్రపోవడానికి ఆరు గంటల ముందె కాఫీ, టితో పాటు సోడా, చాక్లెట్ వంటి వాటిని తీసుకోవడం ఆపివేయాలి ⇔ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, కానీ నిద్రపోయే ముందు మాత్రం కాదు ⇔ సౌకర్యవంతమైన పరుపులను వాడాలి. గదిలో సౌండ్ పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి. ⇔ గదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి ⇔ శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రత, వెంటిలేషన్ ఉండాలి ⇔ పడక గదిలో కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు లేకుండా చూసుకోవాలి.-సుఖ నిద్రకోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి: డాక్టర్ రమణప్రసాద్, కన్సల్టెంట్ ఫల్మొనాలజిస్ట్, కిమ్స్ ఆస్పత్రి ♦ నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు, ఇతరత్రా డిజిటల్ స్క్రీన్లు చూడొద్దు. అవి నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీరు నిద్రపోయే గదిలో ఇవి ఉన్నట్లయితే.. మరో గదిలోకి మారిపోండి. ♦ కాఫీ తాగితే బాగా నిద్రపడుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు ఆలోచన. మెదడు చుట్టూ ప్రవహించే కెఫిన్ గాఢ నిద్రను దూరం చేస్తుంది. నిద్రపోయే ముందు కాఫీ తాగొద్దు. ♦ మద్యం సాధ్యమైనంత త్వరగా స్ఫృహను పోగొట్టి.. సహజసిద్ధమెన నిద్రను దూరం చేస్తుంది. రాత్రిపూట మధ్యమధ్యలో నిద్రలేచేలా చేస్తుంది. అలా లేచిన విషయం గుర్తుండకుండా చేస్తుంది. గాఢనిద్రను అడ్డుకుంటుంది. కాబట్టి మద్యం నిద్రకు ఉపకరించదు. ♦ సాధ్యమైనంత వరకు సాయంత్రం ఐదు గంటలకే ఇంటికి చేరుకుని, రాత్రి 7 లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ఆ తర్వాత టీవీ, సెల్‌ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్స్‌ను స్విచ్ ఆఫ్ చేసి పడక గదిలోకి వెళ్లాలి. ♦ పడక గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాయామం, యోగాసనాలు సుఖ నిద్రకు బాగా ఉపయోగపడతాయి. ఫిలిప్స్ సర్వే ప్రకారం ఇలా.. నిద్రలేమి సమస్యపై ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్ ఇటీవల హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో ఓ సర్వే చేసింది. పట్టణాల్లో 40 శాతానికిపైగా మంది నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. కంటికి తగినంత నిద్రలేకపోవడంతో ఆఫీసులో సరిగా పని చేయలేకపోతున్నామని 58 శాతం మంది చెప్పగా, పనిచేస్తున్న చోటే నిద్రపోతున్నామని చెప్పిన వారు 22 శాతం మంది ఉన్నారు. ఇక నిద్ర చాలకపోవడంతో పనికి సెలవు పెట్టేస్తున్నామని 11 శాతం మంది చెప్పారు. రాత్రిపూట కనీసం ఒకటి నుంచి మూడు సార్లు నిద్రలో లేస్తున్నామని 74 శాతం మంది చెప్పారు. నిద్రలేమితో ఆరోగ్యం దెబ్బ తింటోందని 87 శాతం మంది చెప్పారు. అత్యంత తీవ్రమైన నిద్రలేమి సమస్య (అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా)తో బాధపడుతున్నామని 10 నుంచి 12 శాతం మంది అంగీకరించారు. -
నిదురపోరా.. తమ్ముడా..!
సాక్షి,సిటీబ్యూరో: మహానగరాల వాసులకు నిద్రలేమి శాపంగా పరిణమించింది. ల్యాప్‌టాప్.. ట్యాబ్.. స్మార్ట్‌ఫోన్..ఐపాడ్.. తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకప్పుడు నట్టింట్లో మాత్రమే ఉండేవి..ఇప్పుడు పడకసమయంలోనూ ఇవి బెడ్‌మీదకు చేరడంతో సిటీజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. సెంచురీ మాట్రెసెస్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిటీజన్ల ’స్లీపింగ్ ట్రెండ్స్(నిద్ర అలవాట్లు)’పై జరిపిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. మన నగరంలో సుమారు 54 శాతం మంది నిత్యం సుమారు 5–6 గంటల నిద్రకు సైతం దూరమౌతున్నట్లు తేలింది. చాలా మంది అర్ధరాత్రి పన్నెండు దాటినా..తమకు నచ్చిన షోలను టీవీల్లో వీక్షించడంతోపాటు..స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా కనిపిస్తున్న తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో 75 శాతం, దేశ రాజధాని ఢిల్లీలో 73 శాతం మంది నిద్రసమయంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో కుస్తీ పడుతుండటం. బెంగళూరులో 50..పూణేలో 49 శాతం మందిదీ ఇదే వరసని ఈ సర్వే పేర్కొంది. 12 తరువాతేనిద్రలోకి.. దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో సెంచురీ మాట్రెసెస్ ప్రజల స్లీపింగ్ ట్రెండ్స్‌పై జరిపిన సర్వేలో సుమారు పదివేల మంది నుంచి ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్,సహా ..స్మార్ట్ఫోన్లలో ఫేస్బుక్,వాట్సప్,ట్విట్టర్,ఇన్‌స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్డేట్ అవుతోన్న ఫీడ్‌ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా ఐదు నగరాల్లో సరాసరిన 50 శాతం మంది రాత్రి సమయాలలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో కుస్తీపడుతూ..కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం రాత్రి 12 గంటల తరవాతే నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారట. అధికంగా వీక్షిస్తే కళ్లకు అనర్థమే రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ...ఉదయం 5–6 గంటల మధ్యన నిద్రలేవాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు ఈ సర్వేలో తేలింది. ఇక అధిక పనిఒత్తిడి..ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజులపాటు పనిప్రదేశాలు..జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వేలో తేలింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అవసరాన్ని బట్టి ఉపయోగించడమే మేలు. గంటలతరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే వాటి నుంచి వెలువడే రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లు, వాటిల్లో ఉండే సూక్ష్మమైన నరాలు అధిక ఒత్తిడికిగురవుతాయి. దీంతో మెడ,మెదడు, నరాలపైనే దుష్ప్రభావం పడుతుంది. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు దూరంగా ఉంటే మంచింది.– డాక్టర్ రవిశంకర్‌గౌడ్, సూపరింటెండెంట్, సరోజిని దేవి కంటి ఆస్పత్రి వివిధ నగరాల్లో నిద్రలేమి శాతం ఇలా.. -
మిడ్నైట్ మెట్రో
సాక్షి, బెంగళూరు: రాత్రి వేళ్లలో పని చేసే కార్మికులు, వారంతపు సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే వారు, రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి అనుకూలంగా ఉండేందుకు మెట్రో రైలు సేవలు రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉండాలనే డిమాండ్ నెరవేరింది. ఇప్పటివరకు తెల్లవారుజామున 5.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రజల డిమాండ్ల మేరకు అర్ధరాత్రి 12 గంటలు దాటే వరకు మెట్రో రైళ్లు నడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో రైలు సంచరిస్తే, రాత్రివేళ్లల్లో రద్దీ తక్కువ ఉంటుందని ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు సంచరిస్తుంది. లక్షలాది మందికి ఉపయోగం మెట్రోసేవలు రాత్రి 12 గంటల వరకు అందుబాటులోకి తేవడంతో బెంగళూరువాసులకు ప్రయాణం మరింత సులభమవుతుంది. ఐటీ బీటీ కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు రాత్రివేళ మెట్రో రైళ్లలో ఆఫీసులకు, ఇళ్లకు చేరుకోవచ్చు. రాజాజినగర, పీణ్య, దాసరహళ్లి, వైట్‌ఫీల్డ్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసే కార్మికులు, కంపెనీ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటోంది. రాజాజినగర, పీణ్యలో మహిళా కార్మికులు రాత్రి 10.30, 11 గంటల వరకు విధుల్లో ఉంటారు. డ్యూటీ అయ్యాక సొంత వాహనాలు, క్యాబ్‌లలో ఇంటికి వెళ్లేవారు. లేదా తెల్లవారుజాము వరకు వేచి ఉండి సిటీ బస్సుల్లో బయల్దేరేవారు. మెట్రోసేవలు అందుబాటులోకి రావడంతో పేదలకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వర్షాకాలంలో అనుకూలం వర్షాకాలం ఆరంభం కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. వర్షం వస్తే నగరంలోని రోడ్లన్నీ జలావృతమై ట్రాఫిక్ జామ్ అవుతోంది. చెట్లు కూలి రోడ్లపై వాహనాల సంచారానికి అంతరాయం ఏర్పడుతోంది. గంటలకొద్దీ రోడ్లపైనే చిక్కుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో మెట్రోలో సురక్షితంగా గమ్యం చేరవచ్చు. 3, 4 తేదీల్లో అంతరాయం మెట్రో నిర్వహణ పనుల కారణంగా ఈనెల 3వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఎంజీ రోడ్డు నుంచి బయప్పనహళ్లి వరకు మెట్రో సేవలు రద్దు చేస్తున్నట్లు బీఎంఆర్సీఎల్ అధికారులు తెలిపారు. ఎంజీ రోడ్డు నుంచి నాయుండనహళ్లి వరకు గ్రీన్లేన్లో నాగసంద్ర నుంచి యలచెనహళ్లి వరకు యథావిధిగా సర్వీసులు నడుస్తాయని చెప్పారు. -
అర్ధరాత్రి అదరగొట్టే గిఫ్ట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బర్త్ డేకు విష్ చేయాలన్నా, ప్రేమను వ్యక్తపరచాలన్నా.. సందర్భమేదైనా సర్ప్రైజ్ ఉంటేనే థ్రిల్. దీంతో ఆనందం, ఆశ్చర్యం రెండూ రెట్టింపవుతాయి. కేక్, బెలూన్స్ వంటివి అర్ధరాత్రి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి ఆశ్చర్యపర్చడమే కాదండోయ్... రోడ్డు మీద వెళ్తుంటే సడెన్‌గా ఓ డ్యాన్సర్ల బృందం మన చుట్టూ ఫ్లాష్‌మాబ్ చేయడం, మనల్ని కిడ్నాప్ చేసి ప్రైవేట్ జెట్‌లో తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేయడం... ఇలా ఒకటి రెండు కాదు బోలెడన్ని సర్ప్రైజ్లున్నాయంటున్నారు శక్తివేల్ పన్నీర్‌సెల్వం. ది6.ఇన్ పేరిట హైదరాబాద్‌లోనూ వందలాది మందిని ఆశ్చర్యపరుస్తున్న (సర్ప్రైజ్) తమిళనాడుకు చెందిన ఈ స్టార్టప్ గురించి మరిన్ని వివరాలు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది కోయంబత్తూరులోని ఓ మధ్యతరగతి కుటుంబం. అక్కడే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక పలు కంపెనీల్లో పనిచేశా. కేబుల్ టీవీ ఆపరేటర్‌గా నెలకు రూ.300 జీతంతో ప్రారంభించి బెంగళూరులోని ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి చేరా. ఉద్యోగరీత్యా విదేశాల్లో తిరగడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్టప్స్ ప్రారంభించడం, సక్సెస్ సాధించడం దగ్గరుండి చూశా. దీంతో మనమూ సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకొని ఇండియాకు తిరిగొచ్చేశా. మరో స్నేహితుడు రాధాకృష్ణన్‌తో స్టార్టప్స్ గురించి చర్చించా. ఇద్దరం కలిసి 64 రకాల వ్యాపార ఐడియాలను జాబితాగా రూపొందించాం. ఇందులో టీ షాపు, పెట్రోల్ పంపు, గ్రీనరీ వంటి చాలా ఐడియాలున్నాయి. చివరికి మూలధన పెట్టుబడి తక్కువగా ఉండే సర్ప్రైజ్ గిఫ్టింగ్ వద్ద ఆగింది. పెట్టుబడి కూడా తక్కువే కాబట్టి దీనికే ఓకే అనుకొని 2009 నవంబర్‌లో రూ.50 వేల పెట్టుబడితో కోయంబత్తూర్ కేంద్రంగా ది6.ఇన్ను ప్రారంభించాం. వ్యక్తిగత సర్ప్రైజ్లను అందించడం ది6 ప్రత్యేకత. 10 విభాగాలు; 38 రకాల సర్ప్రైజ్లు అర్ధరాత్రి కేక్, బొకేలు, బెలూన్స్, గిఫ్ట్స్ వంటివి డెలివరీ చేయడమే కాకుండా వ్యక్తిగత సర్ప్రైజ్లు ఇవ్వడం ది6 ప్రత్యేకత. లవ్ ప్రపోజల్ సీన్స్, ప్రైవేట్ జెట్‌లో ప్రపోజల్, ఫ్లాష్ మాబ్, బాక్స్ ఆఫ్ బెలూన్స్, మెసేజ్ బాటిల్ వంటి 10 విభాగాల్లో 38 రకాల సర్‌ప్రైజ్‌లున్నాయి. ధరలు రూ.3 వేల నుంచి రూ.3.5 లక్షల వరకున్నాయి. బాక్స్‌లో బెలూన్స్ ధర రూ.3 వేలు, రూ.3.5 లక్షల సర్ప్రైజ్ ఏంటంటే.. 7 నిమిషాల పాటు ప్రపోజల్ సీన్ ఉంటుంది. దీన్ని రెమో సినిమాలో వినియోగించుకున్నారు కూడా. 3 నెలల్లో ముంబై, ఢిల్లీలో.. ప్రస్తుతం కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా రెస్టారెంట్లు, మాల్స్, కాఫీ షాప్స్, సింగర్స్, డ్యాన్సర్లు, ఆర్టిస్టులతో ఒప్పందం చేసుకున్నాం. 3 నెలల్లో ముంబై, ఢిల్లీ, పుణే, అహ్మదాబాద్ నగరాలకు విస్తరించనున్నాం. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది లక్ష్యం. చెన్నై, బెంగళూరులో ఓ ప్రైవేట్ జెట్ ఆపరేటర్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతానికి జెట్ సర్ప్రైజ్లు కేవలం ఆ రెండు నగరాల్లోనే ఉంది. నెల రోజుల్లో హైదరాబాద్‌కూ విస్తరించనున్నాం. రూ.50 లక్షల ఆదాయం.. గతేడాది 5 వేల సర్ప్రైజ్లను అందించాం. ఈ ఏడాది ఇప్పటివరకు వెయ్యి వరకు అందించాం. ప్రస్తుతం నెలకు 100 ఆర్డర్లు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి 20 వరకుంటాయి. హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ఐటీ ఉద్యోగులే ఎక్కువ కస్టమర్లున్నారు. మా మొత్తం కస్టమర్లలో 80 శాతం మహిళలే. గతేడాది రూ.50 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది 20 శాతం వృద్ధిని లకి‡్ష్యంచాం. మా మొత్తం ఆదాయంలో 15 శాతం వాటా హైదరాబాద్ నుంచి ఉంటుంది. -
అర్ధరాత్రి వేళ వ్యక్తి కిడ్నాప్
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి వేళ బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నగరంలోని వెంకటేశ్వరపురం నేతాజీనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథ నం మేరకు.. నేతా జీనగర్ పాత లెట్రిన్ల సమీపంలో ఎస్కే మస్తాన్, గౌసియా దంపతులు నివాసం ఉంటున్నారు. మస్తాన్ నగరంలోని బృందావనంలో కృష్ణ అనే స్కూటర్ మెకానిక్ వద్ద పని చేస్తున్నాడు. మస్తాన్ శుక్రవారం రాత్రి పని నుంచి వచ్చి, భోజనం చేసి నిద్రించాడు. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఇంటి వెనుక వైపు ఉన్న తలుపునకు బయట వైపు గడియ పెట్టిన ముగ్గురు వ్యక్తులు ప్రధాన గేటు వద్దకు వచ్చి తలుపు తట్టారు. తలుపు తీసిన గౌసియాను మీ భర్తను పిలవమని చెప్పడంతో ఆమె మస్తాన్‌ను పిలిచింది. నిద్ర నుంచి లేచి మస్తాన్ వచ్చి ఎవరు కావాలి అని అడిగే లోపే గుర్తుతెలియని ముగ్గురు మస్తాన్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. పది నిమిషాల తర్వాత వారిలో ఒక వ్యక్తి తిరిగి మస్తాన్ ఇంట్లోకి వచ్చి మస్తాన్, అతని భార్య గౌసియా సెల్ఫోన్లు తీసుకెళ్లాడు. ఈ పరిణామాల నుంచి తేరుకున్న గౌసియా తమ బంధువులకు, తెలియజేయటంతో శనివారం ఉదయం నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరనేది తెలియడం లేదు. మస్తాన్‌కు ఇతరులతో ఎలాంటి తగాదాలు లేవని చెబుతున్నారు. అర్ధరాత్రి కిడ్నాప్‌నకు గురైన మస్తాన్ కోసం భార్య గౌసియా, పిల్లలు నాయబ్‌రసూల్, నస్రీన్ విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మస్తాన్ పనిచేసే యజమాని కృష్ణ, మస్తాన్ బంధువులు గాలిస్తున్నారు. -
డ్రంక్ అండ్ డ్రవ్ టెస్ట్‌లో యువతి బీభత్సం : ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : వారాంతం కావడంతో మందుబాబులకు చెక్‌పెట్టేందుకు నగర పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 76 కేసులు నమోదు చేయగా.. 32 కార్లు, 44 బైకులను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి మాత్రం నానా హంగామా సృష్టించింది. యువతి రాష్ డ్రైవింగ్ : జూబ్లీహిల్స్‌లోని డైమండ్ హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ యువతి హ్యుందయ్ క్రెట కారులో (టీఎస్ 09 ఈయూ 9450) అటుగా వచ్చింది. బ్రీత్ ఎనలైజర్‌తో మద్యం సేవించిందో లేదో తనిఖీచేసే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న హోండా సిటీ కారును ఢీకొట్టి వేగంగా డ్రైవింగ్ చేస్తూ పరారయ్యేందుకు చూసింది. ట్రాఫిక్ పోలీసులు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. అయితే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అవటంతో సదరు యువతి పోలీసులకు దొరికిపోయింది. మద్యం సేవించిందేమోననే ఉద్దేశంతో మరోసారి తనిఖీ చేయగా ఆల్కాహాల్ శాతం జీరో వచ్చింది. దీంతో యువతి పైన రాష్ డ్రైవింగ్ కేసును నమోదు చేసి కారును సీజ్ చేశారు. బీభత్సం సృష్టించిన కారు : బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ వైపు నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్న కారు మసీదు మలుపు వద్ద అతివేగంతో దూసుకొచ్చింది. భయాందోళనకు గురైన వాహనదారులు, బాటసారులు ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. కారు రోడ్డు మధ్య నున్న డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారు తుక్కుతుక్కైంది. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
హైదరాబాద్‌లో అర్థరాత్రి యువతి హల్చల్
-
అర్ధరాత్రి అగ్ని బీభత్సం
రామభద్రపురం: అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సరిగ్గా 12 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఏం జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. శనివారం అర్ధరాత్రి రామభద్రపురం మండల కేంద్రంలో సాలూరు వైపు వెళ్తున్న 26వ నంబర్ జాతీయ రహదారి పక్కనున్న చందానవీధి వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. పోలీసులు తెలియజేసిన వివరాలు ఉన్నాయి. విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ నుంచి నాప్తా పెట్రోలియం రసాయనాన్ని తీసుకువెళ్తున్న ట్యాంకర్ సాలూరు, ఒడిశా మీదుగా రాజస్థాన్ వెలుతోంది. సరిగ్గా రామభద్రపురం మండల కేంద్రంలోని చందానవీధి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి భారీ శబ్ధం రావడంతో డ్రైవర్, క్లీనర్ కిందకు దూకేశారు. ట్యాంకర్‌లోని రసాయనం ట్రాన్స్ఫార్మర్ మీద పడడంతో భారీ మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్లు వెంటనే స్పందించి గట్టిగా కేకలు వేస్తూ సమీపంలోని ఇళ్లల్లో ఉన్నవారిని లేపారు. స్థానికులు లేచేసరికి భారీ అగ్నికీలలు కనిపించడంతో భయాందోళనకు గురై ఇళ్లముందున్న పశువుల శాలల్లోని పశువులను ఇప్పేసి సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పేలిన ట్యాంకర్ విషయం తెలుసుకున్న సాలూరు, బాడంగి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ట్యాంకర్‌కు మంటలు అంటుకోవడంతో ఎక్కడ పేలుతుందోనని భయపడుతూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ట్యాంకర్ సుమారు రెండు గంటల పాటు కాలింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను చూసి జనం కకావికలమయ్యారు. చందానవీధితో పాటు సమీప వీధుల్లోని ప్రజలు ఇళ్లల్లోని గ్యాస్ దిమ్మలను బయట పడేసి బతుకు జీవుడా అంటూ సమీప పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏడు పశువుల శాలలు, తొమ్మిది విద్యుత్ మీటర్లు, ఒక మోటార్ సైకిల్, నాలుగు సైకిళ్లు కాలిపోగా, ఒక మేక, ఆవు గాయపడ్డాయి. అలాగే చిరువ్యాపారి అయిన ఊద చిన్నమ్మతల్లికి చెందిన సుమారు 25 వేల రూపాయల విలువ చేసే సిల్వర్ సామాన్లు కాలిపోయాయి. సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, టీటీడీ పాలక మండలి సభ్యుడు చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ నాయకులు డబ్ల్యూఎన్ రాయులు, పూడి సత్యం, డర్రు పైడిరాజు, చింతల రామకృష్ణ, మడక తిరుపతినాయుడు బాధితులను పరామర్శించారు. -
రాత్రిపూట చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
విజయవాడ : రాత్రిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడే ముఠాను సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశా రు. వారి నుంచి రూ.6.5 లక్షల విలువ చేసే బంగా రం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో లా అండ్ ఆర్డర్ ఏడీసీపీ షేక్ నవాబ్ జాన్ వివరాలు వెల్లడిం చారు. సీసీఎస్ పోలీసులకు అందిన సమాచారం మేరకు నలుగురు పాత నేర స్తులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన పాత నేరస్తులు తిల్లరి దుర్గారావు అలియాస్ పిచ్చి దుర్గారావు, షేక్ నాగూర్, దేవరకొండ దుర్గారావు అలియాస్ అఘోర, దేవరకొండ గోపి అలియాస్ పిట్ల.. చెడు అలవాట్లకు గురై అనేక దొంగతనాలు చేసి జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలై తిరిగి వారు దొంగతనాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులు తాజాగా నున్న ఏరియాలో 7, అజిత్‌సింగ్‌నగర్ పరిధిలో 5, భవానీ పురం పరిధిలో 1.. మొత్తం 13 నేరాలకు పాల్పడినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వీరి నుంచి రూ. 6.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీసీఎస్ ఏసీపీ వర్మ, లా అండ్ ఆర్డర్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వరకూ పన్నులు చెల్లించే సదుపాయం
విశాఖ సిటీ: ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లించేందుకు శనివారం తుది గడువు కావడంతో అర్ధరాత్రి వరకూ ట్యాక్స్ కట్టే సౌకర్యం కల్పిస్తున్నామని డీసీఆర్ సోమన్నారాయణ తెలిపారు. ఇందుకోసం అన్ని జోనల్ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాలతోపాటు మీ సేవా కేంద్రాలు అర్ధరాత్రి వరకూ పనిచేసే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండానే ఇంటి పన్ను, నీటిఛార్జీలు, వీఎల్టీ చెల్లించుకోవచ్చన్నారు. నిర్ణీత గడువులోపు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు, అపరాధ రుసుం విధిస్తామనీ, అలాంటి చర్యలకు ఉపక్రమించకముందే పన్ను చెల్లింపులు చెయ్యాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి 2 శాతం వడ్డీతో పన్నులు చెల్లించాల్సి వస్తుందనీ, ఈ అదనపు భారం లేకుండానే నగర ప్రజలు ట్యాక్స్‌లు కట్టాలని సోమన్నారాయణ విజ్ఞప్తి చేశారు. -
అర్ధరాత్రి హోంగార్డు సాహసం
రంగారెడ్డి/యాలాల(తాండూరు): అర్ధరాత్రి వేళ నిలిపి ఉంచిన లారీల నుంచి డీజిల్‌ను తస్కరించే ముఠాకు యాలాల పీఎస్‌కు చెందిన ఓ హోంగార్డు చెమటలు పట్టించాడు. నలుగురు సభ్యులున్న ఈ ముఠాను ఒక్కడే ధైర్యంగా దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెంటాడటంతో దుండగులు తాము ప్రయాణిస్తున్న కారును వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యాలాల ఠాణాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న భీంరెడ్డి విధుల్లో భాగంగా బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని తాండూరులో వదిలేసి తిరిగి యాలాల ఠాణాకు వాహనంలో ఒంటరిగా వెళుతున్నాడు. మార్గమధ్యలో లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నిలిపి ఉంచిన లారీల పక్కన ఓ తెల్లటి కారు (ఏపీ 28 ఏటీ 2889) అనుమానాస్పదంగా ఉండటం గమనించాడు. కారు దగ్గరకు వెళ్లి పరిశీలించగా నిలిపి ఉంచిన లారీ నుంచి డీజిల్‌ను తస్కరిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే తేరుకుని భీంరెడ్డి వారిని పట్టుకునేందుకు యత్నించాడు. భీంరెడ్డి రాకను గమనించిన ముఠా.. కారును కొడంగల్ మార్గంలో ముందుకు పోనిచ్చారు. భీంరెడ్డి పోలీసు వాహనంలోనే దుండగుల కారును వెంబడించాడు. ఇలా దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెంటాడగా, దౌలాపూర్–తిమ్మాయిపల్లి మార్గంలో ఉన్న మైసమ్మ ఆలయం వద్ద దుండగులు కారును వదిలేసి చెరో వైపు పరారయ్యారు. ఘటన స్థలంలో నిలిపి ఉంచిన కారు టైర్లలోంచి గాలిని తీసేసిన భీంరెడ్డి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే పలు లారీల నుంచి తస్కరించిన దాదాపు 250 లీటర్ల డీజిల్ డబ్బాలను కారులోంచి స్వాధీనం చేసుకున్నారు. కారును యాలాల ఠాణాకు తరలించారు. కారు నెంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా హోంగార్డు చేసిన సాహసంపై తోటి ఉద్యోగులు, మండలవాసులు అభినందిస్తున్నారు. -
అర్ధరాత్రి రహస్య సమావేశం
బద్వేలులో అధికారపార్టీ నాయకుల, పాలకుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఖాళీస్థలాలు కనిపిస్తే రాత్రికి రాత్రే కబ్జాచేయడం, ప్రతిపక్షనాయకుల గొంతునొక్కించడం ఇప్పటివరకు జరిగిన తంతుఅయితే, తాజాగా అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో పాలకవర్గం కుమ్మక్కుఅయ్యింది. బద్వేలు మున్సిపాలిటీలో అవినీతిని పంచుకునేందుకు అర్ధరాత్రిరహస్యసమావేశం జరిగింది. కాంట్రాక్టర్లకు టెండర్లు వేయవద్దు అంటూహుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బద్వేలు(అట్లూరు): బద్వేలు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచేందుకు 64 పనులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.5.25 కోట్ల నిధులు 2016–17 కింద మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టేందుకు ఈనెల 11వ తేదీన టెండర్లు పిలిచారు. ఈ నెల 27 చివరి తేదీ. బద్వేలు మున్సిపాలిటీలో పాలకపక్షం అధికారపార్టీ కావడంతో ఈ పనులకు సంబంధించి ఎవరైనా టెండర్లు వేస్తే పనులు చేయనివ్వం. మార్చి లోపల పనులు చేపట్టక నిధులు వెనక్కిపోతాయి అంటూ కాంట్రాక్టర్లకు చెబుతున్నట్లు సమాచారం. అందులోభాగంగా తమకు తెలియకుండా టెండర్లు వేయవద్దంటూ మున్సిపాలిటీ పాలకపక్షం ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రానట్లు తెలిసింది. అర్ధరాత్రి రహస్య సమావేశం మున్సిపాలిటీలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో పనులు చేపట్టాలంటే కాంట్రాక్టర్లు తాము చెప్పినట్లు వినాల్సిందే.. లేదంటే తాము పనులు చేయనివ్వం.. పనులు పూర్తికాకుంటే కాంట్రాక్టర్ బ్లాక్‌లిస్టులోకి వెళ్లాల్సి ఉంటుంది, కనుక అందరూ మున్సిపల్ కార్యాలయం వద్దకు రండి అంటూ బుధవారం రాత్రి కాంట్రాక్టర్లను అధికారపార్టీ నేతలు పిలిపించుకున్నారు. అలాగే టీడీపీకి చెందిన కౌన్సిలర్లు మాత్రం కార్యాలయంలో ముందుగా కాంట్రాక్టర్లను బయట వేచి ఉండమన్నారు. వారు మాత్రం లోపలకు వెళ్లి తలుపులకు గడులు పెట్టుకుని సహస్యంగా సమావేశమయ్యారు. అంతా ఓకే.. సమావేశంలో ఇక ఏడు నెలలు మాత్రమే అధికారం ఉంది. అయితే ఈ పనులలో కలసికట్టుగా కాంట్రాక్టర్లను పోటీలేకుండా చేయడంతో పాటు లెస్‌కు టెండరు వేయకుండా చూడాలని అనుకున్నారు. అవసరమైతే తమ పలుకుబడిని ఉపయోగించి కాంట్రాక్టర్ల నుంచి 10శాతం రాబట్టుకుని ఒక్కో కౌన్సిలర్‌కు రూ.2 నుంచి రూ.3లక్షలు వాటా వచ్చేలా వ్యవహారం నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి రహస్య సమావేశం అనంతరం అర్ధరాత్రి అక్కడే కాంట్రాక్టర్లతో వారు లోపల మాట్లాడుకున్న విషయాలు చెప్పి ఒప్పించుకున్నారు. 27వ తేదీ ఎవరు టెండర్లు లెస్‌కు వేయకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పాలకవర్గం టెండర్ల విషయంలో వేసిన ఎత్తుగడ ఫలించేందుకు మున్సిపల్ అధికారులు పూర్తి సహాయ, సహకారాలు అందించడంతో పాటు ‘అంతా ఓకే మీరు చెప్పినట్లే ’ అంటూ తలూపినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి బద్వేలు మున్సిపాలిటీ పాలకవర్గం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల పనులకు సంబంధించిన టెండర్లకు పోటీలేకుండా చేయడంతో పాటు అధికార యంత్రాంగం పూర్తి మద్దతు లభించడంతో ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.50లక్షల నుంచి రూ.60లక్షలు గండికొట్టనున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగి వారి ప్రణాళిక నెరవేరితే ఒక్కో వార్డు నేతకు రూ.3లక్షల వరకు కాంట్రాక్టర్ల నుంచి ముట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాకు తెలియదు: మున్సిపల్ డీఈ రవిప్రకాష్‌నాయుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనుల టెండర్లకు సంబంధించి కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు బుధవారం రాత్రి రహస్య సమావేశమైన విషయం నాకు తెలియదు. అయినా ఆన్లైన్ టెండర్లు ఎక్కడ నుంచి అయినా వేయవచ్చు. అంతకు మించి నాకు తెలియదు. -
అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
విజయనగరం టౌన్: అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంప్యూటరైజడ్ వుడ్ డిజైన్‌కి సంబంధించిన మెషీన్ ఆన్‌లో ఉంచేయడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. దీని ప్రభావంతో షాపుతో పాటు పక్కనే ఉన్న రెండు కర్రల డిపోలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో స్థానికుల సహకారంతో మంటలను అదుపు చేయగలిగారు. పట్టణ అగ్నిమాపక అధికారి దిలీప్ కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక మంగళవీధిలో కర్రల మార్కెట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో అదే ప్రదేశంలో ఉన్న కంప్యూటరైజడ్ వుడ్ డిజైన్ మెషీన్‌ను ఆన్‌లో ఉంచేయడం వల్ల ఆ షాపులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో షాపు పూర్తిగా దగ్ధమై, పక్కనే ఉన్న కర్రల డిపోలకు మంటలు తాకాయి. డిపోలో అధిక సంఖ్యలో కర్ర ఉండటం వల్ల రెండు డిపోల్లో ఉన్న కర్రలు కాలి బూడిదయ్యాయి. అక్కడే ఉన్న రెండు పూరిళ్లు మంటల ప్రభావానికి కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షలకు పైబడి ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అంచనా వేశారు. సకాలంలో స్ధానికులు గుర్తించి, సమాచారాన్ని అందించారు. స్పందించి సకాలంలో వచ్చిన ఫైర్ సిబ్బందికి స్థానికులు సహకారమందించారు. రెస్క్యూ టీమ్, అగ్నిమాపకాధికారి మాధవనాయుడు ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. -
అర్ధరాత్రి మందుబాబుల వీరంగం
-
అర్ధరాత్రి మందుబాబుల వీరంగం
హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. తప్పతాగి రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడికి దిగారు. దాడికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు అల్విన్ కాలనీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
అర్ధరాత్రి.. యువతి ఇంటి ముందు..
జయనగర(కర్నాటక): అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువతి తలుపు తట్టి గొడవకు దిగిన యువకుడు పోలీసులు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన జయనగర ఐదవబ్లాక్లో జరిగింది. నాలుగురోజుల క్రితం జయనగర ఐదవ బ్లాక్‌లోని ఓ ఇంట్లోకి యువతి కొత్తగా అద్దెకు దిగింది. యువతి ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టిన యువకుడు సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపు తట్టడంతో ఆమె బయటకు వచ్చింది. అతడు నానా యాగీ చేయడంతో భయపడిన యువతి ఇంటి యజమానికి ఫోన్ చేసింది. అంతేగాక అదే భవనంలో ఉన్న సీరియల్ నటుడు శ్రీధర్‌కు యువతి ఫోన్ చేసి సహాయం కోరింది. శ్రీధర్ వచ్చి యువకుణ్ని అడ్డుకుని, ఆ గొడవను సెల్ఫోన్లో వీడియో తీశారు. గొడవకు దిగిన యువకుడు కిరణ్ ఇదే కట్టడంలో నివాసముంటున్నాడు. మద్యం మత్తులో అల్లరికి దిగాడు. ఎందుకిలా ప్రవర్తించారని శ్రీధర్ నిలదీయడంతో పొరపాటున ఇలా జరిగిందంటూ శ్రీధర్ సెల్‌ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. కాగా, బాధితురాలు జయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. -
అర్ధరాత్రి హల్చల్
- నంద్యాలలో పోలీసుల అలజడి - కౌన్సిలర్ సుబ్బరాయుడు లక్ష్యంగా సోదాలు - కౌన్సిలర్ ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్లలోనూ తనిఖీలు - భయభ్రాంతులకు గురైన విశ్వనగర్ వాసులు - పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నాయకుల నిరసన నంద్యాల : నంద్యాలలోని విశ్వనగర్.. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటలు.. అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. 65 ఏళ్ల వృద్ధురాలు నాగేశ్వరమ్మ ఇంటి ఆరుబయట నిద్రిస్తోంది. ఇంతలోనే సైరన్ మోగిస్తూ వచ్చిన పోలీసు వాహనాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. వాటిలో నుంచి దిగిన పోలీసు అధికారులు, సిబ్బంది చకచకా ఇంట్లోకి ప్రవేశించారు. ఇటీవలే టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన 18వ వార్డు కౌన్సిలర్ సుబ్బరాయుడును అదుపులోకి తీసుకున్నారు. ‘మీ ఇంట్లో ఆయుధాలు, ఓటర్లకు పంచడానికి రూ.5కోట్ల నోట్ల కట్టలు ఉన్నాయంటూ మాకు సమాచారం ఉంద’ని బెదిరించారు. ఇల్లు మొత్తం తనిఖీ చేశారు. దొరికిన డబ్బంతా తమతో పాటు పట్టుకెళ్లారు. కనీసం ఆరు నెలల పసివాడి పాలకు కూడా డబ్బు మిగిల్చలేదు. అలాగే పక్కన ఉండే రజకుల ఇళ్లలోనూ సోదా చేశారు. కుటుంబ ఖర్చులకు కూడా డబ్బు మిగల్చకుండా తీసుకెళ్లారు. పోలీసుల హల్చల్ నేపథ్యంలో విశ్వనగర్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కౌన్సిలర్ సుబ్బరాయుడు పాల వ్యాపారంతో పాటు ఎలక్ట్రికల్ షాపును నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ పనులు కూడా చేస్తుంటారు. విశ్వనగర్‌లోని నాయీబ్రాహ్మణుల కాలనీలో సొంతింట్లో భార్య సుబ్బలక్ష్మమ్మ, తల్లి నాగేశ్వరమ్మ, ఆరు నెలల కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. ఆయన ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే స్థానిక టీడీపీ నేత ప్రతాప్‌గౌడ్, మరికొందరిని పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేర్పించారు. దీన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులను ఉసిగొల్పి భయపెట్టాలని చూస్తున్నారు. కౌన్సిలర్ ఇంటిని తనిఖీ చేయడానికి డీఎస్పీ గోపాలకృష్ణ, టూటౌన్ సీఐ శ్రీనివాసులుతో పాటు దాదాపు 40మంది పోలీసులు వెళ్లడం గమనార్హం. ఆయన చిన్నాన్నలు సుబ్బరాయుడు, చిన్నసుబ్బరాయుడు, సుబ్బరాయుడు కుమారులు నాగేష్, నాగేంద్ర, కౌన్సిలర్ సొంత తమ్ముడు సురేష్ ఇళ్ల వద్దకు కూడా వెళ్లి.. వారిని నిద్రలేపి సోదా చేశారు. వైఎస్సార్సీపీలో ఎందుకు చేరావంటూ.. టీడీపీలో నుంచి వైఎస్సార్సీపీలోకి ఎందుకు చేరావని మఫ్టీలో ఉన్న పోలీసులు కౌన్సిలర్ సుబ్బరాయుడును బెదిరించారు. తాను శిల్పా అనుచరుడినని, ఆయన వెంటే ఉంటానని సుబ్బరాయుడు సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం చెందారు. ‘నీ వార్డులో దాదాపు రూ.18లక్షల పనులు జరిగాయి. మరో రూ.20లక్షల పనులకు టెండర్లు జరుగుతున్నాయి కదా’ అని ఆరా తీశారు. రజకుల ఇళ్లలోనూ.. పగలంతా చాకిరేవులో దుస్తులు ఉతికి, రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న రజకులు మద్దిలేటి, బాలమద్దిలేటిలను కూడా నిద్రలేపి ఇళ్లంతా సోదా చేశారు. తమకు ఎలాంటి రాజకీయాలూ తెలియవని, ఏనాడూ గొడవలకు, ఘర్షణలకు పాల్పడలేదని వారు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంట్లో ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ దాచుకున్న రూ.1.20 లక్షల పొదుపు డబ్బును, స్థల విక్రయం, కాంట్రాక్ట్‌కు సంబంధించిన రూ.6.90లక్షల నగదును, రజకుల వద్ద నుంచి కూడా రూ.5.72 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భయపెట్టారు–నాగేశ్వరమ్మ, సుబ్బరాయుడు తల్లి పోలీసులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడటంతో ఉలిక్కిపడి లేచా. నీ కొడుకు దగ్గర కోట్ల డబ్బు, ఆయుధాలు ఉన్నాయి.. మేము ఇళ్లంతా చూడాలని బెదిరించారు. దీంతో తలుపులు తెరిపించారు. మా గురించి విశ్వనగర్ ప్రజలందరికీ తెలుసు. ఏ రోజూ ఎలాంటి దౌర్జన్యాలకూ దిగలేదు. కానీ నా కొడుకు సుబ్బరాయుడు పార్టీ మారాడని పోలీసులు దౌర్జన్యానికి దిగి మా పరువు తీయడం అన్యాయం. ఇలాంటి చర్యలకు భయపడం–సుబ్బరాయుడు, కౌన్సిలర్ అధికార పార్టీ నేతలు మమ్మల్ని బెదిరించి ఎన్నికల్లో వారి వైపునకు తిప్పుకోవడానికి పోలీసులతో సోదాలు చేయించారు. కానీ ఇలాంటి చర్యలకు భయపడేది లేదు. పాల వ్యాపారం, కాంట్రాక్ట్ కోసం దాచుకున్న డబ్బును కూడా తీసుకొని వెళ్లారు. ఏ పాపం ఎరుగని రజకుల డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు తిరిగిచ్చే వరకు న్యాయ పోరాటం చేస్తాం. -
నిదురపోరా తమ్ముడా..
► మారుతున్న నిద్ర వేళలు ► అర్ధరాత్రి వరకూ మేల్కొనే ఉంటున్న యువత ► ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు సూర్యోదయానికి గంటన్నర ముందు సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు. కచ్చితంగా చెప్పాలంటే.. ఒక గంటా 36 నిమిషాలు.. అంటే 96 నిమిషాలకు ముందు సమయం. ఈ సమయంలో మెలకువ వచ్చిందంటే.. ఆ వ్యక్తి ఆరోగ్యానికి దగ్గరగా ఉన్నట్టే. ఆ సమయంలో శక్తివంతమైన ఎలక్ట్రో మేగ్నటిక్, ఆధ్యాత్మిక వలయాలు వాయువ్య దిశలో పయనిస్తుంటాయని, వాటికి వ్యతిరేక దిశలో కూర్చుని యోగాలాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని యోగులు, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ సమయంలో నిద్ర లేచేవారు మనలో ఎంతమందున్నారో ఆలోచించండి. ఫోన్‌తో చేటు ఉద్యోగ ఒత్తిడి, వ్యాపారం నిర్వహణ కష్టాలు, ఆర్థిక సమస్యలు, చదువులో విపరీతమైన పోటీ వల్ల సాధారణంగా నిద్రలేమి సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం యువతరాన్ని బానిసలుగా మార్చేస్తున్న అతి పెద్ద సమస్య అంతర్జాల వినియోగం, స్మార్ట్ ఫోన్ ఫీవర్. వీటి కోసం నిద్రను మానుకుని ఫోన్‌తోనే అర్ధరాత్రి వరకూ గడిపేస్తున్నారు. నిద్రపోయే సమయాన్ని అలా.. అలా... రాత్రి 10.. 11... 12.. ఒంటి గంట ఇలా పెంచుకుంటూ పోతున్నారు. నిద్రలేమితో త్వరగా మరణం ఎయిమ్స్ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం.. ఢిల్లీలో ఏకంగా 70 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో యువత సైతం ఎక్కువగానే ఉన్నారు. రోజుకు 7 గంటలు నిద్రపోయిన వారిలో మరణశాతం రేటు తక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అలాగే 6 గంటల కంటే తక్కువ 8 గంటల కంటే ఎక్కువ పడుకున్నా.. 15 శాతం మరణరేటు పెరుగుతోందని గుర్తించారు. నిద్రమేల్కొంటే..? ► నిద్రను ఆపుకుని మరీ ఐఫోన్లలో రాత్రంతా గడిపే యువత మరుసటి రోజు మందకొడిగా మారిపోతారు. వారు సరిగ్గా గంట నిలబడలేరు.. కూర్చోలేరు.. తరగతి గదిలో ఓ గంట పాఠం వినడమే గగనమే. ► తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. జ్ఙాపకశక్తి తగ్గిపోతుంది. వీరికి తలనొప్పి, ఒంటినొప్పులు నిత్యకృత్యం. వీటిని తగ్గించుకునేందుకు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటారు. ఇది కడుపులో మంటకు దారితీస్తుంది. దానిని తగ్గించుకునేందుకు ఏదైనా తినేస్తుంటారు. ఇది ఒబిసిటికి దారి తీస్తుంది. ► ప్రధానంగా నిద్రలేమి వల్ల శరీర కాలచక్రం గతి తప్పుతుంది. దీనివల్ల ఏ సమయానికి చేయాల్సిన పనులు.. ఆ వేళకు జరగవు. ఏకాగ్రత లోపిస్తుంది. కళ్లు ఎర్రబడతాయి. కళ్లు లోపలికి పోయి.. దురదలు వస్తాయి. నీరు కారుతుంటాయి. నిద్రలేమి వల్ల వినికిడి శక్తి సైతం తగ్గిపోతుంది. ఉత్సాహం తగ్గిపోతుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. సరైన సమయానికి మలమూత్ర విసర్జన సైతం జరగదు. అందుకే నిద్ర అన్నింటికీ ప్రధానమని గుర్తించాలి. శారీరక చక్రానికి నిద్రే ప్రధానం నిద్రతోనే విశ్రాంతి దొరుకుతుంది. బాగా నిద్రపోతేనే శరీరంలోని గ్లూకోజ్‌ను అన్ని కణాలూ సమానంగా తీసుకుంటాయి. అప్పుడే శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. – డాక్టర్ నరసింహులు, కంటి వైద్య నిపుణులు, ధర్మవరం -
పార్లమెంట్ సెంట్రల్ హాల్ అర్థరాత్రి సమావేశాలు ఎన్నిసార్లు?
న్యూఢిల్లీ: జూన్ 30 అర్థరాత్రిన కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న జీఎస్టీ సంబరాలకు ప్రతి పక్షాలు డుమ్మాకొట్టనున్న సంగతి విదితమే. కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే జీఎస్టీ లాంచింగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు గురువారం ఢిల్లీలో గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ అజాద్ మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న జీఎస్టీ తీరు తెన్నులపై ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జీఎస్టీ లాంచింగ్ కార్యక్రమ్రాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అర్థరాత్రి నిర్వహించడంపై అభ్యంతరంపై వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో మూడే మూడుసార్లు పార్లమెంట్ సెంట్రల్ హాల్ అర్థరాత్రి సమావేశాలు జరిగాయని గులాం నబీ అజాద్ చెప్పారు. ముందుగా దేశానికి స్వాతంత్ర్యం లభించిన సందర్బంగా 1947 ఆగస్టులో 15 అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సమావేశమైనట్టు చెప్పారు. అలాగే సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 1972 సం.రంలోనూ, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 1997లో మాత్రమే జరిగాయన్నారు. పేదలు, మహిళలు, అల్ప సంఖ్యాక వర్గాలు, దళితుల సంక్షేమాన్ని బీజేపీ పక్కన పెట్టిందని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం గురించి పట్టించుకోవడంలేదన్నారు. క్షీణిస్తున్న జీడీపీపై ధ్యాస లేదని మండిపడ్డారు. ఈసందర్భంగా జీఎస్టీకి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని మెజారీటీ ప్రజానీకం ఆకాంక్షల్ని పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాము జీఎస్టీ లాంచింగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ ని జూలై 1 నుంచి అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 30న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రత్యేక సమావేశం ద్వారా జీఎస్టీని అధికారికంగా లాంచ్ చేయనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీనికి ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్ సహా ప్రతిపక్ష సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారుని తెలిపారు. వీరితోపాటు మాజీ ప్రధానులను కూడా ఆహ్వానించినట్టు జైట్లీ కటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జీఎస్టీ లాంచింగ్ వేడుకలకు సర్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ ఆదియా ప్రకటించారు. జీఎస్టీ అమలుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. శనివారం దీనికి సంబంధించిన నోటిషికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. -
అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్ టప్పాచబుత్ర
-
నగరంలో అర్ధరాత్రి అరాచకాలు
-
నగదు కోసం అర్ధరాత్రి నుంచే క్యూలో...
-
అర్ధరాత్రి దాటినా తగ్గని క్యూలైన్లు
-
అర్ధరాత్రి విషాదం
లారీ ఆటోను ఢీకొని నలుగురు మృతి మరో ఐదుగురికి తీవ్ర గాయాలు మృతులు బీహార్ వాసులు భవన నిర్మాణ పనుల కోసం గుంటూరు రాక స్వస్థలాలకు వెళ్తుండగా కుంచనపల్లి వద్ద ఘటన ఆ అర్ధరాత్రి వారి జీవితాల్లో కాళరాత్రిగా మారింది..మృత్యువు వారిని వెంటాడిందా?..వారే మృత్యువును వెతుక్కుంటూ వచ్చారా ?..అనిపించేలా విధి విషాద రాత రాసింది. సొంతూరుకు వెళుతున్నామనే ఆనందంలో ఉన్న ఇద్దర్ని.. వారి కోసం వచ్చిన మరో ఇద్దరిన్ని లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. తెల్లవారితే తమ వారు ఇంటికొస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు చావు వార్త పలకరించి..వారి గుండెలను కన్నీటి ధారలుగా మార్చింది. మంగళగిరి (తాడేపల్లి) : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరులో భవన నిర్మాణంలో పని చేస్తున్న ఎనిమిదిమంది బిహారీలు తమ సొంత ఊరు వెళ్లేందుకు ఆటోలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు రక్షక్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకుని ఆటోను బయటకు తీసి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈలోగా విషయం తెలియడంతో బిహారీలను కూలికి తీసుకువచ్చిన మేస్త్రీ గుంటూరు చంద్రమౌళినగర్‌కు చెందిన మసుమళ్ల అరుణ్‌కుమార్ (35), తన స్నేహితుడు రాజశేఖర్(32)ను తీసుకుని ద్విచక్రవాహనంపై ప్రమాద స్థలానికి చేరుకుని రక్షక్ వాహనం వెనుక ఆపి నిలబడ్డారు. ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన టెక్బహుదూర్(45), రాంబహుదూర్(42)లను ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డుపైకి చేర్చారు. ఇంతలో అదే మార్గంలో అతి వేగంగా వచ్చిన లారీ వారిద్దరితోపాటు అరుణ్‌కుమార్, రాజశేఖర్‌లను, రక్షక్ వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. టెక్బహుదూర్, రాంబహుదూర్ అక్కడికక్కడే మృతి చెందగా.. అరుణ్‌కుమార్, రాజశేఖర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రక్షక్ వాహనంలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ సైదాతోపాటు డ్రైవర్ లూర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న ఆరుగురు గాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ, తాడేపల్లి ఎస్ఐ వినోద్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించి మృతుల బంధువులకు సమాచారమిచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రూ.3 లక్షల ఆస్తినష్టం
కాలిబూడిదైన రూ.50వేల నగదు, వెండి ఆభరణాలు కిచ్చన్నపల్లిలో ఘటన జోగిపేట: అందోలు మండలం కిచ్చన్నపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇళ్లు దగ్ధమైంది. గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల విలువ చేసే ఆస్తినష్టం జరిగింది. బాధితుల కథనం ప్రకారం... కిచ్చన్నపల్లికి చెందిన అలవేణి ఇంట్లో ఆమెతోపాటు పాటు తండ్రి కిష్టయ్య, కొడుకు జోగినాథ్, ఆమె సోదరి సావిత్రి, చిన్నారులు దివ్య, శిరీష గురువారం రాత్రి నిద్రించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గుడిసెకు నిప్పంటుకోవడంతో నిప్పు మెరుగులు సావిత్రిపై పడ్డాయి. మేల్కొన్న ఆమె మంటలను గమనించింది. వెంటనే అందరిని నిద్రలేపగా బయటకు పరుగులు తీశారు. దివ్య అనే బాలిక నిద్రలోనే ఉండిపోవడంతో గుర్తించిన స్థానికులు ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే గుడిసె మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.50 వేల నగదు, 60 తులాల వెండి, రెండు తులాల బంగారు చెవుల కమ్మలు, మూడు క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల జొన్నలు, 50 కిలోల పెసర్లు, ఇతర పత్రాలు తగలబడి పోయినట్లు బాధితులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే తమ ఇంటికి నిప్పంటించారని వారు ఆరోపించారు. మూడు నెలల క్రితం కూడా ఇంటికి నిప్పంటించారనన్నారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని వారు కోరారు. -
తలలేని మొండెం తిరుగుతున్నట్టు...
వేలూరు: వానియంబాడి సమీపంలో తలలేని మొండెంతో రక్తకాటేరి తిరుగుతున్నట్లు పుకార్లు లేవడంతో గ్రామస్తులు భయాందోళనలతో అర్ధరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు చేసి సరిహద్దులో కాపలా కాశారు. స్థానిక బత్తాపేట గ్రామంలో సుమారు వెయ్యికి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో ఇంటి తలుపులు, కిటికీలు మూసి వేసి నిద్రించినా తలలేని మొండెంతో రక్తకాటేరి లోపలికి ప్రవేశించి ఉయ్యాల కట్టి ఊగుతోందని పుకార్లు షికార్లు చే స్తున్నాయి. అదే విధంగా మూసిన తలుపులు ఎవరో తడుతున్నారని, బయటకు వచ్చి చూస్తే ఎవరూ కనిపించడం లేదని, ఇంటి బయట నీటిని చల్లుతున్నట్లు శబ్దాలు విసిపిస్తున్నాయని, బయటకు వచ్చి చూస్తే నీళ్లు చల్లి ఉండడం చూసి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వీటిపై గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామంలో తలలేని మొండెం తిరుగుతోందని, తమ గ్రామానికి వచ్చిన రక్తకాటేరిని తరిమి వేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో మంగళవారం రాత్రి గ్రామస్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో గ్రామంలోని తొమ్మిది మంది మహిళలకు స్వామి వచ్చి గ్రామంలో రక్తకాటేరి ఉందని, దానివల్ల ఇది వరకే ఇద్దరు మృతి చెందారని, మరో ముగ్గురు మృతి చెందబోతున్నారని చెప్పారు. అనంతరం గ్రామస్తులు గ్రామ సరిహద్దులోని వంతెనపై రక్తకాటేరికి ప్రత్యేక పూజలు చేసి పంబ కొడుతూ గ్రామం చుట్టూ ఊరేగింపు చేశారు. ప్రతి ఇంటి ముందు మంచి నూనెతో దీపం వెలిగించి, జిల్లేడు కొమ్మలను ఉంచి కాపలా కాశారు. -
అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు
♦ తాండూరు తులసీనగర్‌లో ఆరు ఇళ్లలో చోరీ ♦ అర్బన్ సీఐ నివాసం ఉంటున్న భవనంలోనూ అపహరణ ♦ పక్క ఇళ్లకు గడియలు పెట్టిన దుండగులు ♦ 12 తులాల బంగారు, 8 తులాల వెండి నగల చోరీ ♦ వివరాలు సేకరించిన ఏఎస్పీ చందనదీప్తి తాండూరు: పట్టణంలో అర్ధరాత్రి దొంగ లు రెచ్చిపోయారు. పక్కఇళ్లకు గడియలు వేసి తమ ‘హస్తకళ’ను ప్రదర్శించారు. తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య నివాసం ఉండే భవనంలోనూ చోరీకి పాల్పడడం కలకలం రేపింది. దుండగులు బంగారు, వెండి ఆభరణాలతోపాటు కొంత నగదును అపహరించుకుపోయారు. చోరీలతో తులసీనగర్ వణికిపోయింది. ఏఎస్పీ చందనదీప్తి వివరాలు సేకరించారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. తాండూరు తులసినగర్‌లోని సిద్ధివినాయక్ దేవాలయం సమీపంలో శెట్టి నిలయంలోని పైఅంతస్తులో అర్బన్ సీఐ వెంకట్రామయ్య అద్దెకు ఉంటున్నారు. ఇదే భవనంలోని కింద భాగంలో పెద్దేముల్ మండలం కందనెల్లి ప్రభుత్వ పాఠశాల టీచర్ రవీందర్‌గౌడ్ కూడా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆయన తన కొడుకును తీసుకొని నగరంలోని ఆస్పత్రికి భార్యతో కలిసి వెళ్లాడు. అర్ధరాత్రి ఆయన ఇంటి తాళాన్ని పగులగొట్టిన దొంగలు లోపలికి చొరబడ్డారు. బీరువా తాళం పగులకొట్టి 10 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. దొంగలు వాటర్ బాటిల్‌ను, ఒక చిన్నగుడ్డ ముక్కను ప్రధాన ద్వారం వద్ద వదిలేసి వెళ్లారు. అయితే, దొంగలు తమ వేలిముద్రలు లభించకుండా తుడిచేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీఐ ఉంటున్న పక్కన భవనంలోని మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న రవిగౌడ్ ఇంటి తాళాన్ని పగులగొటి ్టన దొంగలు అక్కడ ఏమీ లభించకపోవడంతో సామగ్రి చిందరవందరగా పడేశారు. ఇదే కాలనీలో రిటైర్డ్ టీచర్ జగన్నాథ్ భవనంలో అద్దెకు ఉంటూ బషీరాబాద్ మండలంలో పని చేస్తున్న ప్రభుత్వ టీచర్లు పాండునాయక్, కవిత దంపతులు సెలవుల్లో తమ స్వగ్రామానికి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి దొంగలు వారి ఇంటి తాళాలను పగులకొట్టారు. బీరువాను ధ్వంసం చేసి, 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 వేల నగదు చోరీ చేశారు. రిటైర్డ్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నర్సిరెడ్డి శుక్రవారం విత్తనాలు వేసేందుకు తన స్వగ్రామం ఇందర్‌చెడ్ కు వెళ్లగా దొంగలు బీరువాలోని ఐపాడ్‌తోపాటు మరో విలువైన ఫోన్‌ను అపహరించారు. నర్సిరెడ్డి ఇంటి సమీపంలో నారాయణదాస్ భవనంలో టైలరింగ్ చే స్తూ అద్దెకు ఉండే మహిళ ప్రముఖ గురువారం బంధువుల ఇంటికి వెళ్లగా దొంగలు ఆమె ఇంటి తాళం పగులగొట్టగా ఏమీ లభించలేదు. ఇదే కాలనీలోని మల్లయ్య భవనంలో అద్దెకు ఉంటున్న రాఘవేందర్ గురువారం కుటుంబీకులతో కలిసి శ్రీశైలానికి వెళ్లారు. దొంగలు ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో సామగ్రిని చిందరవందరగాప డేశారు. ఆయా ఇళ్లల్లో చోరీలు జరిగినట్టు శనివారం ఉదయం పొరుగింటి వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జాగిలాలతో పరిశీలన డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగాయి. జాగిలాలు చోరీలు జరిగిన ఇళ్ల చుట్టూ తిరిగాయి. క్లూస్ టీం ఆరు ఇళ్లలో వేలి ముద్రలు సేకరించింది. వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉంటే తులసీనగర్‌లో రాత్రివేళ పెట్రోలింగ్ నామమాత్రంగా సాగుతుందని స్థానికులు విమర్శించారు. ఏఎస్పీ చందనదీప్తి, అర్బన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ నాగార్జున ఘటనా స్థలాలను సందర్శించి వివరాలు సేకరించారు. చోరీల తీరును బట్టి ప్రొఫెషనల్స్ దొంగలే ఈ పనికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఏఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు వేరే గ్రామాలకు వెళ్తే తమ విలువైన వస్తువులను లాకర్లో భద్రపర్చుకోవాలని ఈ సందర్భంగా ఏఎస్పీ సూచించారు. అయితే, శుక్రవారం రాత్రి తులసినగర్‌లో ఓ కారు అనుమానాస్పదంగా తిరిగిందని స్థానికులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బస్తీ మే దెయ్యం
చేత'న'బడి చీకట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి. గుండెల మీద ఎవరో కూర్చున్నట్టుగా ఉంది! చనిపోయిన బాలమ్మ కళ్లను దానం చేశారు కాబట్టి... బాలమ్మ దెయ్యం ఇంటింటికీ... ‘తడుముకుంటూ’ తిరుగుతోందని బస్తీలో పుకార్లు! ఓర్నాయనో! ఎవరిని ఆవహిస్తుందో ఏమో! బస్తీ గజగజలాడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వివేకంగా ఉండాలి! దేనికి జాగ్రత్త? దేనికి వివేకం. చదవండి. రెండు సంఘటనలు. మూడు మరణాలు. ఆ బస్తీని అతలాకుతలం చేస్తున్నాయి. ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీం పట్నంలో ముదిరాజ్ బస్తీ. మూడు శ్మశానాల మధ్య ఉంది ఆ బస్తీ. అక్కడ నివసించేవారంతా శ్రామికులే. రవి బేల్దారి పని చేస్తుంటాడు. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. లేస్తూనే ఇంట్లో వాళ్ల మీద విరుచుకు పడ్డాడు. ‘నేనెన్ని సార్లు మిమ్మల్ని గిచ్చి లేపినా ఒక్కరూ లేవరేం?’ అని అరిచాడు. ‘నువ్వెప్పుడు గిచ్చావయ్యా’ అంటే వినడు. ‘నా గుండెల మీద బ్రహ్మరాక్షసి కూర్చుంది. ఎంతకీ లేవలేదు. మిమ్మల్ని లేపుతుంటే ఒక్కరూ లేవలేదు’ అని రవి ఆరోపణ. అంతే... ఇంట్లో వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టడం మొదలైంది. ‘ఊరి వాళ్లంతా నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా వినకపోతిరి’ అని సణుగుతూ రవి తల్లి పక్కింటి వైపు తొంగి చూసింది. ఆ పెంకుటింటికి ఎప్పటిలాగే తాళం పెట్టి ఉంది. రవికి కూడా గుబులు మొదలైంది. రవి కళ్ల ముందు గతం మెదిలింది. అది సంతోష ఆత్మేనా?! ఆ పెంకుటిల్లు సంతోషది. ఆమె భర్తకు నల్గొండ జిల్లా చిట్యాలలో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. వారి కాపురమూ అక్కడే. సంతోష గర్భవతైంది. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎక్కువయ్యాయి. సంతోష ప్రాణాలు తీసుకుంది! చిట్యాలలో వారున్నది అద్దె ఇల్లు. ఆ ఇంటి నుంచి దహన సంస్కారాలు చేయడానికి ఇంటి యజమానులు ఒప్పుకోరు. సొంతూరికి వచ్చి సొంత వాళ్ల మధ్యన ఆ కర్మకాండలు నిర్వహించడమే మార్గం. అయితే ఇందుకు ఊరు ఒప్పుకోలేదు. రెండు ప్రాణాలు పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. సహాయ నిరాకరణ చేసింది. దాయాదులైన రవి కుటుంబం ఒక్కటే ఆదుకుంది. పాడె మోయడం దగ్గర నుంచి అంతిమ సంస్కారం వరకు ఆ కుటుంబం వారే దగ్గరుండి పూర్తి చేశారు. అయితే రోజులు గడిచినా ఊరివాళ్లకు సంతోష మరణం మీద శంకలు తగ్గలేదు. సంతోష ఆత్మ అక్కడే, ఆ ఇంట్లోనే ఉంటుందని, పాడె మోసిన వారిని పీడిస్తుందని భయపెట్టసాగారు. జరిగినదంతా గుర్తొచ్చి రవికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. సందేహం లేదు. సంతోష ఆత్మ తన గుండెల మీద కూర్చుని ప్రాణాలు తీయబోయింది అనే నిర్ధారణకు వచ్చేశాడు. ఈ సంగతి ఊరంతా పొక్కింది. అంతలోనే మరో సంఘటన. రెండో ఆత్మ... బాలమ్మ! అదే బస్తీలో ఉండే పోచమ్మ ఓ రోజు పొద్దున్నే కూతుర్ని పిలిచి అర్ధరాత్రి నట్టింట్లో ఏడుపు వినిపించిందని చెప్పింది. అది బాలమ్మ ఏడుపేనేమో అనుకున్నారు తల్లీకూతుళ్లు. అప్పటినుంచి ఆ ఇంట్లో అందరూ అస్థిమితంగానే నిద్రపోతున్నారు. ఊళ్లో దాదాపుగా అందరికీ ఏదో ఒక సమయంలో ఏడుపు వినిపిస్తోంది. ఇదంతా ఏదో అరిష్టానికి సంకేతం అని ఊరంతా నమ్మింది. గుబులుగా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు పోచమ్మ ఇంట్లో సందడి. కల్లు తాగి, తిళ్లు వండుకుని తిన్నారంతా. కొంతసేపటికి పోచమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. టీవీ సీరియళ్లలో, సినిమాల్లో దెయ్యం పాత్రలో కనిపించే హావభావాలన్నీ ఆమె ముఖంలో పలుకుతున్నాయి. వాంతి వస్తోందని కొంతసేపు హడావుడి చేసింది. గర్భిణి సంతోష దెయ్యమై పట్టిందేమోనని వెన్నులో నుంచి చలి మొదలైంది పోచమ్మ కూతురికి. ‘అన్నం అరగలేదేమో, జీర్ణమవడానికి ఏ నిమ్మకాయ రసమో ఇవ్వు’ అనేసి నిద్రకు ఉపక్రమించాడు పోచమ్మ అల్లుడు. మరికొంత సేపటికి పోచమ్మ ఆకలంటూ కేకలు పెట్టింది. ‘కార్జం (కాలేయం), మాంసం పెట్టండి’ అంటోంది. పొంతనలేని మాటలతో ఇంట్లో వాళ్లు భీతిల్లిపోతున్నారు. ‘నువ్వెవరు’ అనగానే ‘మీకు తెల్వదా, నన్ను మర్చిపోయిన్రా... మీ పక్కింటి బాలమ్మను కదా’ అంటోంది పోచమ్మ. ఆ పక్కింట్లోనే బాలమ్మ కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారు. ‘మీ ఇంటికి పోక, మా ఇంటికెందుకొచ్చావ్’ అన్నది పోచమ్మ కూతురు. ‘నా కొడుకు పూజ చేయించి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా కట్టడి చేసిండు’ అని చెప్పింది బాలమ్మ ఉరఫ్ పోచమ్మ. అలా మాట్లాడుకుంటూ ఇంటి బయటికొచ్చింది. కళ్లు కనిపించనట్లు తడుముకుంటూ శ్మశానం వైపు వెళ్లి పోయింది. చూపు లేని దెయ్యం! బాలమ్మ చనిపోయిన తర్వాత ఆమె కళ్లను దానం చేశాడు కొడుకు. దాంతో బాలమ్మ దెయ్యమైన తర్వాత చూపు కోల్పోయిందని, దారి కనిపించక తడుముకుంటూ తిరుగుతోందనేది బస్తీలో వదంతులు లేచాయి. బాలమ్మ దెయ్యమై తిరుగుతోందని, అర్ధరాత్రి వినిపించే ఏడుపు కూడా బాలమ్మదేనని పుకారు పుట్టింది. దాంతో బస్తీలో చాలా మంది భయంతో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కొందరి ప్రవర్తన బాలమ్మను స్ఫురింప చేస్తుంటే, కొందరి ప్రవర్తన సంతోషను గుర్తు చేస్తోంది. కాలనీలో మహిళలందరి చీర కొంగులకు, చుడీదార్ చున్నీలకు మంత్రించిన నిమ్మకాయల మూటలు కనిపిస్తున్నాయి. ఊరంతటికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కాస్తంత సమాధానపడినట్లు కనిపిస్తున్నారు. కానీ వారిలో భయం పూర్తిగా పోలేదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అసలేం జరిగింది? గత డిసెంబర్లో వృద్ధురాలు బాలమ్మ తుదిశ్వాస విడిచింది. అది జరిగి రెండు నెలలు గడవక ముందే ఫిబ్రవరిలో తొమ్మిది నెలల నిండు గర్భిణి సంతోష ఆత్మహత్య చేసుకుంది. గర్భిణి కాబట్టి అది ఒక మరణం కాదు, రెండు మరణాల పెట్టు. అందుకే ఊరికి అరిష్టం పట్టిందని బస్తీవాసులు నమ్మారు. ఏడిచిందెవరు? కుక్కలు... మనిషి చెవులు వినలేని చాలా తక్కువ పౌనఃపున్యం ఉన్న శబ్దాన్ని కూడా గ్రహి స్తాయి. దానికి ప్రతిస్పందనగా తిరిగి అదే లయతో అరుస్తాయి. ఆ అరుపు మనిషి ఏడుపును తలపిస్తుంది. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉండడంతో చాలా దూరం వినిపిస్తుంది. కల్లు, దెయ్యం కలిశాయి జెవివి సూచన మేరకు పోచమ్మను మరో కూతురు తనింటికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెకు ఎటువంటి భ్రాంతులూ కలగడం లేదు. ఈ విచిత్ర ప్రవర్తనకు కారణం దెయ్యం భయం, దానికి తోడు కల్తీ కల్లు. ఆ కల్లు చిన్న మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. విచిత్రమైన భ్రాంతులకు లోను చేస్తుంది. రవి పరిస్థితి కూడా అలాంటిదే. ఊరంతా సంతోష దెయ్యమై పట్టుకుంటుందని భయపెట్టడం, కల్తీ కల్లు తాగడం కలిసి ఆరోగ్యం పాడైంది. గుండెలు పట్టేసినట్లు అనిపించడంతో దెయ్యం గుండెల మీద కూర్చున్నదని భయపడ్డాడు. దానికితోడు టీవీ సీరియళ్లు, సినిమాల ప్రభావంతో ఆయాపాత్రల హావభావాలను ఆటోమేటిక్‌గా అనుకరించడం అలవాటైపోయింది. - టి. రమేశ్, జనరల్ సెక్రటరీ,ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
రెండు లారీలు ఢీ: ఒకరు మృతి
♦ రెండు లారీలు ఢీ క్యాబిన్లలో ఇరుకున్న డ్రైవర్లు, క్లీనర్లు ♦ మూడు గంటల పాటు అర్తనాదాలు ♦ మూడు గంటల తర్వాత చేరుకున్న 108 అంబులెన్సు ♦ ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం పిట్లం: మండల శివారులోని జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్న దుర్ఘటనలో డ్రైవర్లు, క్లీనర్లు లారీ క్యాబిన్లలో ఇరుక్కుని మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు. కాపాడండీ కాపాడండీ అంటూ అర్తనాదాలు చేశారు. వారి రోదనలు విన్న ఇతర లారీల వారితో పాటు పిట్లం పోలీసులు జేసీబీ వాహనం తీసుకొచ్చి అతి కష్టం మీద బయటకు తీశారు. సుమారు మూడు గంటలైనా 108 అంబులెన్సు రాకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుటూ ఒకరు మృతి చెందారు. పిట్లం శివారులోని రవి పటేల్ దాబా సమీపంలోని మూల మలుపు ఈ ప్రమాదం జరిగింది. నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ, హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఏఎస్ఐ బాబురావు, కానిస్టేబుళ్లు సాయిలు, రాజ్‌కుమార్, హోంగార్డు గౌరి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇతర వాహనాల చోదకులతో సహాయంతో వారిని బయటకు తీశారు. సుమారు అర్ధరాత్రి ఒంటి గంటకు 108 అంబెలెన్సు చేరుకుంది. అప్పటికే ఒకరు మృతి చెందారు. మిగతా ముగ్గురిని అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని కూడా అదే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయపడ్డ వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒడిశా బాలికల అరుదైన పోరాటం
భువనేశ్వర్: భారత గణతంత్ర దినోత్సవం రోజు ఒడిశాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల బాలికలు అరుదైన పోరాటాన్ని ఎంచుకున్నారు. సమస్యలతో విసిగి వేసారిన వారు.. చివరికి తాడోపేడో తేల్చుకోవాలనుకున్నారు. ఆరునూరైనా కలెక్టరును కలిసి తమ బాధలు చెప్పుకొని తీరాల్సిందేనని తీర్మానించుకున్నారు. దానికోసం పెద్ద సాహసమే చేశారు. 73 మంది బాలికలు దండుగా కదిలారు. సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. అర్థరాత్రి చలిలో 7 గంటలు పాటు నడిచి వెళ్లి మరీ తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ బాలికల వసతిగృహంలో విద్యార్థులు దుర్భర స్థితిలో చదువుకుంటున్నారు. సౌకర్యాలు దేవుడెరుగు.. కనీసం కడుపునిండా భోజనం కూడా ఉండదు. దీంతో చదువు కుంటుపడింది. హాస్టల్ అధికారులు తమను చిన్న చూపు చూస్తున్నారని, నాసిరకం భోజనం పెడుతున్నారని, పాఠశాలలో సరైన బోధన వనరులు లేవని ఎన్నోసార్లు అధికారులకు విజ్క్షప్తి చేశారు. అయినా ఫలితం శూన్యం. దీంతో పాపం.. ఆ చిన్నారులు తమ దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం రాత్రి కాలినడకన బయలుదేరారు. వద్దని ఎవరు ఎంత వారించినా వెనక్కి తగ్గలేదు. పోలీసులు, ఇతర అధికారులు, పెద్దలు వారి ప్రయత్నాలను విరమింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వాహనం ఏర్పాటుచేస్తామన్నా వినలేదు. పట్టిన పట్టు వీడకుండా ముందుకు సాగారు. చేసేదేమీ లేక పోలీసులే వారికి రక్షణగా వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ధర్నా మొదలుపెట్టారు. దీంతో కలెక్టర్ స్పందించక తప్పలేదు. కలెక్టర్ రాజేశ్ ప్రవకర్ పాటిల్ వెంటనే ఆ ప్రాంతంలో పర్యటిస్తాననీ, .. వారి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తానని హామీ యిచ్చారు. దీంతో బాలికలు ఆందోళనను విరమించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాలపై జిల్లా సంక్షేమ సంఘ కార్యాలయం అధికారులు అర్ధరాత్రి ఆ బాలికల్ని సురక్షితంగా వసతి గృహానికి తరలించారు. అయితే దీనిపై జిల్లా సంక్షేమ అధికారుల వాదన మరోలా ఉంది. కొత్తగా విధుల్లో చేరిన అధికారికి వ్యతిరేకంగా కొంతమంది గ్రామస్తులు ఈ కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. -
గీత... ద ఘోస్ట్!
రాత్రి, అర్ధరాత్రి, దెయ్యాల వేట, భయం భయం... హారర్ సీరియల్ అనగానే ఇలాంటి పేర్లే కనిపిస్తుంటాయి మనకి. హిందీలో అయితే ఆహట్, భూత్ ఆయా, ఫియర్ ఫైల్స్ అంటూ దెయ్యాల్ని మన మీదికి వదులుతున్నారు కొన్ని చానెళ్లవారు. అయితే వీటిని చూసి చూసి బోర్ కొట్టేసింది. అందుకేనేమో... ఓ కొత్త టైటిల్‌తో, కొత్త కాన్సెప్ట్‌తో, సరికొత్త కథనంతో ఓ సీరియల్ తీశారు. అదే... ‘గీతాంజలి’. * ఇద్దరు అక్కాచెల్లెళ్లు. చెల్లెలు మహా నెమ్మదస్తురాలు. అక్క పరమ భయంకరురాలు. అన్నీ తాను అను కున్నట్టే జరగాలంటుంది. అన్నింట్లో కల్పించుకుని చెల్లెలికి సంతోషమన్నదే లేకుండా చేస్తుంది. చివరికి ఊహించని పరిస్థితుల్లో చనిపోతుంది. మామూలుగానే కుదురుండనిది, దెయ్యమయ్యాక ఊరుకుంటుందా? నానా రభసా చేస్తోంది. ఆ రభస చూస్తే గుండెల్లో గుబులు పుడుతోంది. అందుకే గీతాంజలి సక్సెస్ఫుల్ సీరియళ్ల లిస్టులో చేరిపోయింది. * అయితే ఈ సీరియల్ సక్సెస్‌లో ముఖ్యభాగం హీరోయిన్ రూపకే చెందుతుంది. ‘చిన్న కోడలు’ సీరియల్‌తో సుపరిచితమైన ఈ అమ్మాయి... అంజలిలా అమాయకంగా ఆకట్టుకుంటూనే, దెయ్యంగా హడలెత్తిస్తోంది. ఆమె పర్ఫార్మెన్సే ఈ సీరియల్‌కి ప్రాణం పోసిందని ఒప్పుకుని తీరాలి! -
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని
-
అర్ధరాత్రి మద్యం కోరికకు 'మహా' చిట్కా
అప్పటిదాకా సేవించిన మద్యం ఇచ్చిన కిక్కు సరిపోదు. ఇంకా తాగాలనిపిస్తుంది. సమయం అర్దరాత్రి దాటింది. వైన్ షాపుల షట్టర్లన్నీ తాళలు వేసుంటాయి. ఎలా? ఒక్క బుక్క తాగితే చాలు, హాయిగా నిద్రపోవచ్చు, కానీ మందు దొరకదు.. ఇప్పుడెలా?.. ఈ తరహా బాధలకు త్వరలోనే కాలం చెల్లిపోనుంది. అర్దరాత్రా, పట్టపగలా అన్నిది మీ ఇష్టం ఇక ఎంతంటే అంత తాగి.. తందనాలొడొచ్చు. ఎందుకంటే ఇంట్లో దాచుకునే మద్యం బాటిళ్ల సంఖ్యను రెండు నుంచి ఏకంగా 12కు పెంచేసింది ప్రభుత్వం. బాధాకరమైన విషమేమంటే ఈ నిర్ణయం తీసుకున్నది తెలుగు రాష్ట్రాలు కావు. ముంబై రాజధానిగా గల మహారాష్ట్ర! ఆ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఇంట్లో రెండు మద్యం బాటిళ్ల కంటే ఎక్కువ నిలువ ఉంటే నేరంగా పరిగణించేవారు. ఆ సంఖ్యను ఇప్పుడు 12కు పెంచుతుండటంతో మందు బాబులు హర్షాతిరేకాలు ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన జీవోను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే మంగళవారం ముంబైలో ప్రకటించారు. మద్యం ప్రియులను సంతోషపెట్టే ఈ నిర్ణయం వెనుక గొప్ప విషాదం దాగుండటం గమనార్హం. మూడు నెలల కిందట మహారాష్ట్రలోని మల్వానీ ప్రాంతంలో కల్తీసారా తాగి 100 మందికిపైగా మృత్యువాత పడిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మందికి సారా తాగే అలవాటు లేనప్పటికీ, అర్ధరాత్రి కావడంతో సాధారణ మద్యం దొరకని కారణంగా వారు సారాయి సేవించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషాదంపై క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన ఫడ్నవిస్ సర్కారు.. మద్యం అందుబాటులో లేకపోవడం వల్లే జనం కల్తీసారాను ఆశ్రయిస్తున్నారని గుర్తించింది. అందుకే ఇంట్లో నిల్వ ఉంచుకునే మద్యం బాటిళ్ల సంఖ్యను 12కు పెంచింది. -
అర్ధరాత్రి ముహుర్తం ఎందుకు?
-
పిలవని పెళ్లికి వెళ్లి... బీభత్సం సృష్టించారు
హైదరాబాద్ (గోల్కొండ) : ఆహ్వానం లేకుండా పెళ్లికి వచ్చి భోజనాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినందుకు షాదీఖానాలో యువకులు బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ దాడి గోల్కొండలో సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ లైన్స్‌కు చెందిన మహ్మద్ సిద్దిఖ్ కుమారుడు మహ్మద్ ఆమెర్ వివాహం గోల్కొండ జీన్సి బజార్‌కు చెందిన యువతితో శుక్రవారం రాత్రి గోల్కొండ బడా బజార్‌లోని మిర్జా గార్డెన్లో జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వధూవరుల కుటుంబాలు అప్పగింతల కార్యక్రమంలో పాల్గొనగా, డైనింగ్ హాల్లోకి వచ్చి 40 మంది యువకులు భోజనాలు చేస్తున్నారు. వీరిని చూసిన వరుడి తండ్రి మహ్మద్ సిద్దిఖ్ అక్కడకు వెళ్లి.. పిలవకుండానే వచ్చి భోజనాలు చేస్తున్నారంటూ ఆ యువకులను నిలదీశారు. దాంతో వారు తమ వెంట తెచ్చుకున్న తల్వార్లు, రాడ్లతో సిద్దిఖ్పై దాడి చేశారు. అతడి కేకలు విని బంధువులు డైనింగ్ హాల్లోకి వెళ్లారు. వారిపై కూడా యువకులు కత్తులు, రాడ్లతో దాడి చేసి అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరికేస్తామంటూ.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని దబాయించారు. గాయపడ్డవారు కింద పడిపోగా కొందరు యువకులు మహిళలపై కూడా దాడిచేశారు. సిద్దిఖ్ భార్య గౌసియా బేగాన్ని మెడపట్టి లాగి రాడ్లతో కొట్టి గాయపరిచారు. ఆమె మెడలోని ఆరు తులాల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. షాదీఖానాలోని వస్తువులను కర్రలు, రాడ్లతో కొట్టి ధ్వంసం చేశారు. మహ్మద్ సిద్దిఖ్ కారు అద్దాలు పగలకొట్టారు. గంటపాటు విధ్వంసం సృష్టించి దుండగులు పారిపోయారు. రాత్రి రెండు గంటలకు మహ్మద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారు గోల్కొండ ఖల్ఫాన్ తెగకు చెందిన వారని మహ్మద్ సిద్దిఖ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
అర్దరాత్రి సాక్షులను తీసుకొచ్చిన పోలీసులు
-
నేటి అర్ధరాత్రి నుంచి లారీల బంద్
హైదరాబాద్: నేటి (మంగళవారం) అర్ధరాత్రినుంచి తెలంగాణ వ్యాప్తంగా లారీలు ఎక్కడివక్కడే నలిపివేయనున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రకటించింది. పన్ను తగ్గింపు, పర్మిట్లు ఇతర డిమాండ్లపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంవల్లే అనివార్యంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు తెలిపింది. లారీల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల లారీలు నిలిచిపోనున్నాయి. ఇది సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. తెలంగాణ లారీ యజమానుల సంఘం చేపట్టిన సమ్మెకు ఇతర రాష్ట్రాల లారీ యజమానుల సంఘాలు మద్దతు పలికాయి. కాగా, కరీంనగర్ లారీ యజమానుల సంఘం మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. -
నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె
స్తంభించనున్న సరుకు రవాణా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సరుకు రవాణా స్తంభించనుంది! తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం నిరవధిక సమ్మె చేపట్టనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు లక్ష లారీలు సహా తెలంగాణ వ్యాప్తంగా 3.5 లక్షల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. లారీల బంద్ వల్ల నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి సాధారణ ప్రజలు సతమతమవుతుండగా లారీల సమ్మె వల్ల వాటి ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్ను విధానానికి వ్యతిరేకంగా లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఇవ్వడం సహా పెండింగ్‌లో ఉన్న 17 డిమాండ్లను పరిష్కరించాలని లారీ యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సీఎం, రవాణాశాఖ మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను కలసి విన్నవించుకున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు అందలేదని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. గత్యంతరం లేని స్థితిలో సమ్మెకు సిద్ధమయ్యామన్నారు. టాటా ఏస్‌లు, గూడ్స్ ఆటోలు మినహా ఇతర సరుకు రవాణా వాహనాలు బంద్‌లో పాల్గొంటాయన్నారు. అత్యవసర వస్తువులు రవాణా చేసే వాహనాలు, నీటి ట్యాంకర్లను సమ్మె నుంచి మినహాయించారు. డిమాండ్లు ఇవీ... ⇒ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్నుకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంచెల్లుబాటయ్యేలా తాము చెల్లించిన త్రైమాసిక పన్ను నుంచి ఏపీలోని 13 జిల్లాలకు పన్ను తగ్గించాలి. ⇒ ఇరు రాష్ట్రాల్లో తిరిగేందుకు అనుమతినిస్తూ ఏటా రూ.3 వేల నుంచి రూ. 5 వేల వరకు పన్ను తీసుకొని కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలి. ⇒ 15 ఏళ్లు నిండిన కాలం చెల్లిన సరుకు రవాణా లారీలపై నిషేధం విధించే అంశంపై సంప్రదింపులు జరపాలి. ⇒ లారీ యజమానుల నుంచి హమాలీ, గుమాస్తా మామూళ్ల వసూలును నిలిపేయాలి. ⇒ సరుకు లోడింగ్, అన్లోడింగ్ సమయంలో రక్షణ కల్పించాలి.టట్రక్ ఓనర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ (తోహాస్) నూతన కమిటీని ఏర్పాటు చేయాలి.టజిల్లా, తాలూకా కేంద్రాల్లో ట్రక్ టర్మినల్స్, ట్రక్ పార్కింగ్లు ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో సమ్మె వాయిదా.. ఏపీలో డీజిల్, పెట్రోలుపై పెంచిన వ్యాట్ రద్దు చేయడంతోపాటు మరో 10 డిమాండ్లు నెరవేర్చాలని పెట్రోల్ బంకులు, లారీల యజమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. సోమవారం రాత్రి వరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఏపీ పెట్రోలియం ట్రేడర్స్ ఫెడరేషన్, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, ఏపీ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్ల అసోసియేషన్ ఐక్య కార్యాచరణ సమితితో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. జూలై 8లోగా సమస్యల్ని పరిష్కరించడంతోపాటు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీనివ్వడంతో సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. జూలై 8లోగా సమస్యలు పరిష్కరించకపోతే 9 నుంచి సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ఈశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. -
అర్ధరాత్రి సబ్ కలెక్టర్ హడలెత్తించారు
ఇసుక అక్రమార్కులపై కొరడా ఒక ట్రాక్టర్, రెండు బైకుల స్వాధీనం సాయిపూర్లో ఇసుక డంప్ సీజ్ రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి 2 ట్రాక్టర్లు తీసుకెళ్లిన ఇసుకాసురులు తాండూరు రూరల్: వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి తాండూరులో శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేయడంతో ఇసుక అక్రమార్కులు హడలెత్తిపోయారు. రాత్రి 1.30 నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బైక్‌పై వచ్చి ఇసుక అక్రమకారుల భరతం పట్టారు. ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌తో పాటు అక్రమార్కులకు సంబంధించిన రెండు బైకులు, కొన్ని సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 1:30 నిమిషాలకు వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి ఓ బైక్‌పై తాండూరు వచ్చారు. ఆమె వెంట ఇద్దరు వీఆర్ఓలు, ఓ ఆర్ఐ ఉన్నారు. ముందుగా బైక్‌పై వెళ్తూ పాత తాండూరులో తనిఖీలు చేశారు. అనంతరం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా వద్ద సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా వద్ద సబ్ కలెక్టర్ బైకును పక్కకు నిలిపి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను గమనించించారు. అక్కడే ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నా అక్రమార్కులు ఇసుక అలాగే తరలించారు. ఓ ఇసుక ట్రాక్టర్ తాండూరు వైపు వెళ్లింది. సబ్‌కలెక్టర్ వర్షిణి ఓ ఇసుక ట్రాక్టర్‌ను తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అనంతరం అక్కడి నుంచి యాలాల మండలం బెన్నూర్ కాగ్నా నది సమీపంలోకి వెళ్లారు. కాగ్నా నది నుంచి వస్తున్న రెండు ట్రాక్టర్లను గమనించారు. రెవెన్యూ సిబ్బందిని ఆ ట్రాక్టర్లను అప్పగించారు. తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకె ళ్లాలని సూచించారు. అనంతరం ఆమె కాగ్నా నది సమీపంలో ఇసుక తరలిస్తున్న స్థలాలను పరిశీలించించారు. అయితే వాహనాలను తరలిస్తున్న రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన అక్రమార్కులు తమ ట్రాక్టర్లను పట్టణానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్ బైక్‌పై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి గురైన రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. దాడి చేసిన వారిని తాము గుర్తిస్తామని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో ఆమె వారిని తీసుకొని పట్టణానికి వ చ్చారు. అక్రమార్కులు సాయిపూర్ ప్రాంతంలో ఇసుక డంప్ చేయడంతో అక్కడికి వెళ్లి దానిని సీజ్ చేశారు. అప్పటికే ఇసుకాసులు పరారయ్యారు. ముందుగా పట్టుకున్న ట్రాక్టర్‌ను(ఏపీ 28 టీఆర్ 6647) సబ్ కలెక్టర్ తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. సబ్ కలెక్టర్ వర్షిణి తనిఖీలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అక్రమార్కులు అప్రమత్తమయ్యారు. కాగ్నా నది నుంచి ఇసుక ట్రాక్టర్లను వేరే మార్గంలో తీసుకెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల వరకు తాండూరు పరిసర ప్రాంతాల్లో సబ్‌కల్టెర్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం తాము పట్టుకున్న ఇసుక ట్రాక్టర్, బైకుల విషయమై తాండూరు ఏఏస్పీ చందనదీప్తికి సబ్ కలెక్టర్ వర్షిణి ఫోన్లో సమాచారం ఇచ్చారు. స్థానిక రెవెన్యూ, పోలీసులపై అసహనం! శనివారం అర్ధరాత్రి తనిఖీలకు వచ్చిన సబ్‌కలెక్టర్ వర్షిణి స్థానిక రెవెన్యూ, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెట్రోలింగ్ పోలీసులు ఇసుకతరలిస్తున్న అక్రమార్కులను పట్టుకోవడం లేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనిఖీల విషయమై సబ్ కలెక్టర్ స్థానిక తహసీల్దార్ గోవింద్‌రావుకు కూడా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. అక్రమార్కుల బెంబేలు.. సబ్ కలెక్టర్ వర్షిణి తనిఖీలకు వచ్చారనే స మాచారంతో ఇసుక వ్యాపారులు అప్రమత్తమయ్యారు. దీంతో వివిధ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఇసుక కోసం ట్రాక్టర్లతో వచ్చిన వారు దారి మళ్లించి పరారయ్యారు. సబ్ కలెక్టర్ రావడంతోఅక్రమార్కులు బెంబేలెత్తారు. ఇదిలా ఉండగా, సబ్‌కలెక్టర్ కొందరు అక్రమార్కుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. -
అర్ధరాత్రి యువకుల హల్చల్
ఇరువర్గాల మధ్య ఘర్షణ ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు, రిమాండ్ తరలింపు సిద్దిపేట రూరల్: పట్టణంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు వీరి తో పాటు మరో నలుగురిని పోలీసు లు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధిం చిన వివరాలను గురువారం వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిలు విలేకరులకు వెల్లడించారు. పట్టణానికి చెందిన ముద్రకోల సాయితేజ (19)తో పాటు అతడి స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి వద్ద గొడవ అవుతోందని సాయితేజకు ఫోన్ రావడంతో మిత్రులతో కలిసి సిని మా మధ్యలోనే బయటకు వచ్చేశారు. అనంతరం బైక్‌లపై ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో మెదక్ రోడ్డులో గల ఓ పెట్రోల్ బంక్‌లో బైక్‌కు పెట్రోల్ వేయించుకుని నజీర్, అతడి మిత్రులు రోడ్డుపైకి వస్తుండగా.. సాయితేజ, అత డి స్నేహితులు అతడిని తిట్టారు. ఈ క్ర మంలో వీరి మధ్య మాట మాటా పెరిగింది. దీంతో సాయితేజ తన సోదరుడైన ముద్రకోల శశికుమార్‌కు ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. దీంతో మందు పార్టీ చేసుకుంటున్న శివకుమార్.. తన స్నేహితులైన గౌరబోయిన వెంకటేష్, బైరాం చందు, మెరుగు ఉదయ్, కంకటి నవీన్‌లతో కలిసి (బీరు సీసాలతో) అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న నజీర్, అతడి మిత్రుడితో గొడవ పడ్డారు. అదే ప్రాంతంలో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు సమావేశం నిర్వహిస్తుండగా.. శశికుమార్ గ్యాంగ్ తమ వెంట తెచ్చిన బీరు సీసాలను వారిపైకి విసిరారు. ఓ బీరు సీసా దెబ్బకు అక్కడున్న ఒకరికి తాకడంతో గాయమైంది. దీంతో వారంతా రోడ్డుపై రావడంతో శశికుమార్, గ్యాంగ్ అక్కడి నుంచి ఉడాయించారు. సదరు సామాజిక వర్గానికి చెందిన వారు ఫిర్యాదు చేయడంతో శివకుమార్ గ్యాం గ్ ను పట్టుకుని రిమాండ్‌కు తరలించి నట్లు సీఐ వివరించారు. ముద్రకోల శశికుమార్, గౌరబోయిన వెంకటేష్‌లపై గతంలో ఫిర్యాదులున్నాయని, దీంతో రౌడీ షీట్‌ను ఓపెన్ చేసినట్లు ఆయన వివరించారు. పట్టణంలో రాత్రి ఏ పని లేకుండా ఇద్దరు, ముగ్గురు మాట్లాడినట్లు రోడ్లపై కనిపిస్తే వారిపై న్యూసెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిందితులను పట్టుకున్న ఐడీ పార్టీ కానిస్టేబుల్ బాల్‌రెడ్డి, వేణు, కమలాకర్‌రెడ్డి, ఇర్ఫాన్లను సీఐ అభినందించారు. -
అర్ధరాత్రి వరకూ హోటళ్లు, రెస్టారెంట్లు..
హైదరాబాద్: తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే హోటళ్లలో ఆహార పదార్థాలు లభించేవని, ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచే హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద గొడవలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత యజమానులదేనని అన్నారు. ఈ హోటళ్లలో తెలంగాణ వంటకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అంతకు ముందు హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి, కార్యదర్శి బి. జగదీష్రావు పాల్గొని ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను హోటళ్లలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. -
అర్ధరాత్రి వరకు హోటళ్లకు అనుమతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అర్థరాత్రి దారుణహత్య
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): పాత కక్షల కారణంగా ఓ పిక్ పాకెటర్ హత్యకు గురైన సంఘటన చాంద్రాయణగుట్ట హైదరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు తెలిపిన ప్రకారం...బండ్లగూడ దస్తగిర్ నగర్‌కు చెందిన మహ్మద్ షకీల్ అలియాస్ చోర్ షకీల్ (28) అనే వ్యక్తి ఆటో నడపటంతోపాటు అదను దొరికినప్పుడల్లా జేబు దొంగతనాలకు పాల్పడుతుంటాడు. కాగా బుధవారం రాత్రి షకీల్ ఇంటికి అతని స్నేహితుడు నాసర్ వచ్చాడు. అనంతరం ఇద్దరూ కలసి మరో స్నేహితుడు మోయిన్ వద్దకు వెళ్లారు. అయితే అర్థరాత్రి 12.30 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట చౌరస్తా సమీపంలోని తాళ్లకుంట వద్ద షకీల్ దారుణహత్యకు గురయ్యాడు. అతడి ఛాతీ, వీపు, మెడ భాగాలలో 12 వరకు కత్తిపోట్లు ఉన్నాయి. షకీల్‌కు స్థానికంగా హజీ జాఫ్రీ, మతిన్ జాఫ్రీ, జుబేర్ జాఫ్రీ అనేవారితో గొడవలున్నాయని, తన భర్తను వారే చంపారంటూ షకీల్ భార్య అఫ్రీన్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షకీల్‌తో వెళ్లిన నాసర్, మోయిన్ కూడా కనిపించకుండాపోయారు. మృతుడికి ముగ్గురు పిల్లలున్నారు. పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
నేటి అర్ధరాత్రి నుంచి 108 సేవలు బంద్
నల్లగొండ టౌన్ ఆపదలో ఉన్న వారికి నేనున్నానని కుయ్..కుయ్ అంటూ ఘటనా స్థలానికి చేరుకుని వైద్య సేవలు అందించే 108 వాహనాలు గురువారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్తుండడంతో ఎమర్జెన్సీ సేవలకు బ్రేక్ పడనుంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు.. గత సమ్మెకాలంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలని, కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని, 8గంటల పనివిధానాన్ని అమలు చేయాలని, 108 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి ఉద్యోగులు గతంలోనే సమ్మె నోటీసును ఇచ్చారు. ఈ విషయమై 108 సర్వీసుల యాజమాన్యం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. దీంతో జిల్లాలో పనిచేస్తున్న 36 వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. 108 వాహనాలలో సుమారు 152 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులందరూ సమ్మెలోకి వెల్తున్నందున ఎమర్జెన్సీ వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. ప్రమాదాల బారిన పడిన వారు, వివిధ అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వచ్చే వారికి తీవ్ర అసౌకర్యం కలగకతప్పదు. ఒక వేళ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లినట్లయితే అయితే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాలు తిరగడానికి అవసరమైన అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు 108 సేవల జిల్లా ప్రోగ్రాం మేనేజర్ బి.నాగేందర్ తెలిపారు. -
ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న కారు ఇద్దరు దుర్మరణం
కావలి: ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన ఆగిఉన్న టిప్పర్‌ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణ శివారులో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో పమిడి స్కూల్ కరస్పాండెంట్ పమిడి వెంకటసుబ్బయ్యనాయుడు(50), కలిగిరి మండలం అయ్యపురెడ్డిపాళెంకు చెందిన మన్నం చంద్రమౌళి(47) మృతి చెందారు. చిన్నారావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసుల కథనం మేరకు.. దగదర్తి మండలం మనుబోలుపాడు చెందిన పమిడి వెంకటసుబ్బయ్యనాయుడు ముసునూరులో పమిడి కాన్సెప్ట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సుభాషిణి దుండిగం ఎంపీటీసీ. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. కలిగిరి మండలం అయ్యపురెడ్డిపాళెంకు చెందిన మన్నం చంద్రమౌళి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆయన భార్య శిరీష, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిని తర్వాత మన్నం చంద్రమౌళి, ఆయన అన్న చిన్నారావు, మేనల్లుడు ఆనందరావు కారులో పట్టణం నుంచి జలదంకి మండలం జమ్మపాళెంలో ఉన్న ఓ డాబాకు వెళ్లారు. అక్కడ భోజనం చేసి శుక్రవారం వేకువన తిరిగి కావలికి బయలుదేరారు. పట్టణ శివారు ప్రాంతమైన బుడంగుంట ఇందిరమ్మ కాలనీకి సమీపించే సరికి ప్రమాదం జరిగింది. చంద్రమౌళి, వెంకట సుబ్బయ్యనాయుడు ప్రమాదస్థంలోనే చనిపోగా గాయపడిన ఆనందరావును 108 వాహన సిబ్బంది చికిత్స కోసం కావలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చిన్నారావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని వైద్యశాలకు తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. జెడ్పీచైర్మన్ పరామర్శ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఏరియా వైద్యశాలకు వచ్చి మృతుల కుటుంభ సభ్యులను, బంధువులను పరామర్శించారు. కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, వివిధ పార్టీల నాయకులు ఏరియా వైద్యశాలకు వచ్చారు. -
అడవి దారిలో...
కథ రోడ్డు మీద కారు మెత్తగా సాగిపోవడం లేదు... ఎందుకంటే మేం ప్రయాణిస్తున్నది గతుకుల మట్టిరోడ్డు. రాత్రి పదిగంటలు దాటింది... కానీ అర్ధరాత్రి అయిన ఫీలింగ్ కలుగుతోంది. దానిక్కారణం మేం ప్రయాణిస్తున్న దారి...! అది అడవిదారి లాగా ఉంది. నేను, రాఘవ, కిరణ్, శంకర్... మా నలుగురు స్నేహితులం ఉదయం ఐదున్నరకు విజయనగరం నుంచి అరకు వెళ్ళడానికి బయల్దేరాం. రొటీన్ లైఫ్ నుండి బైటపడ్డానికి అప్పుడప్పుడూ ఇలాంటి చిన్న చిన్న ట్రిప్పులు వేయడం మాకలవాటు. శంకర్గాడి సెకండ్ హ్యాండ్ కారులో ప్రయాణం. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో బయల్దేరాం. అయితే బొర్రాగుహల దగ్గర ఎక్కువ సమయం గడపడం, అరకులో మ్యూజియం, గార్డెన్స్ లాంటివి చూశాక చాపరాయి దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోవడం తదితర కారణాల వల్ల మేం అట్నుంచి బయల్దేరడం బాగా ఆలస్యమైంది. తిరిగి వచ్చేదారిలో బొర్రాగుహలు దాటాక ఓ అడ్డదారి ఉందంటే తొందరగా ఇల్లు చేరుకోవచ్చన్న ఆశతో అటువైపు కారు మళ్ళించాం. మాకు అడ్డదారిలో వెళ్ళొచ్చని చెప్పిన ఒక తాత తనను కూడా అటువైపు మెయిన్ రోడ్డు వరకూ దిగబెట్టమని అభ్యర్థించడంతో అతణ్ణి కూడా కార్లో ఎక్కించుకున్నాం. పది నిమిషాలు గడిచేసరికి ఆ దార్లోకి వచ్చి పొరపాటు చేశామని అర్థమైంది. కానీ వెనక్కు వెళ్ళిపోదామన్న మాట అంటే పలచనైపోతామన్న ఊహతో ఎవరికి వారే బింకంగా ఉండిపోయాం. శంకర్ ఏకాగ్రతతో బండి నడుపుతున్నాడు. పక్కనే కూర్చున్నాను నేను. చుట్టూ చెట్లు... మధ్యలో మట్టిదారి... ముందూవెనకా ఏ వాహనం లేదు. మనిషన్న వాడెవడూ ఎదురవడం లేదు. విండో అద్దం కొద్దిగా దించితే చాలు చలిగాలి ఈడ్చి కొడుతోంది. చలి సంగతి అలా ఉంచితే చెట్ల మధ్య నుంచి గాలి చేస్తోన్న శబ్దం ఒక రకమైన భయాన్ని కలిగిస్తోంది. దానికి తోడు కీచురాళ్ళ శబ్దం కారు చేస్తున్న శబ్దాన్ని అధిగమించి వినిపిస్తూ ఆ భయాన్ని అధికం చేస్తోంది. ఇలాంటి దారిలో వెళ్ళమని సలహా చెప్పిన వ్యక్తి మీద కంటే ముందూ వెనకా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బండిని ఇటువైపు తిప్పించిన రాఘవ మీద నాకు కోపం వచ్చింది. కాస్త ఆలస్యమైతే ఏవుంది, అర్ధరాత్రికైనా ఇంటికి చేరుకునేవాళ్ళమే కదా! ఆ మాత్రం దానికి ఈ అడ్డదారిలో ప్రయాణం చేయడం అవసరమా? అనిపించింది. ఆ మాటే బైటికి అన్నాను. మిగతా ఇద్దరు కూడా నన్ను సపోర్టు చేస్తూ మాట్లాడారు. రాఘవ నవ్వి వూరుకొన్నాడు. ఏమైనా వాడికి ధైర్యం ఎక్కువ! నేను వెనక్కి తిరిగి మాతో పాటు వస్తున్న తాత వైపు చూశాను. బహుశా అతడికి దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు ఉండొచ్చు. పంచె కట్టుకుని బనీనులాంటి చొక్కా ధరించి ఉన్నాడు. ఆ బట్టలు ఒకప్పుడు తెల్లగా ఉండేవేమో! ఉతికి ఎన్నాళ్ళయిందో గానీ ఇప్పుడు మాత్రం బూడిద రంగులోకి మారి ఉన్నాయి. పూర్తిగా తెల్లబడ్డ పల్చటి జుట్టు, మొహం మీద వదులుగా వేలాడుతున్న చర్మం, కాంతి లేని కళ్ళు, బక్క పల్చటి శరీరం... జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్టుగా ఒక రకమైన నిశ్చలత అతని మొహంలో కనబడుతోంది. నేను తనవైపు చూడ్డం చూసి చిన్నగా నవ్వి... ‘‘తవరు బయంపడతన్నట్టుందండి... రాత్రి మీద ఈ దార్లో ఎవరూ రారు గానండీ... పగటిపూట గొర్లు మేపుకునే పిలగాళ్ళు, అడపాదడపా అటూఇటూ వచ్చిపోయే మనుసుల్తో బానే వుంటదండి...’’ అన్నాడు. ‘‘ఏం బావుండడమో ఏంటో... ఇది దెయ్యాలు తిరిగే దారిలాగా ఉంది తప్ప మనుషులు నడిచే మార్గంలా లేదు...’’ కొద్దిగా విసుగ్గా అన్నాడు కిరణ్. వాడి మాటల్లో విసుగుతో పాటు అంతర్లీనంగా భయం తొంగి చూడడం మాకర్థమౌతూనే ఉంది. వాడికి మామూలుగానే భయం ఎక్కువన్నది మా అందరికీ తెలిసిన సంగతే! తాత ఈసారి కాస్త గట్టిగానే నవ్వాడు. మా భయం అతనికి నవ్వులాటగా ఉన్నట్టుంది. ‘‘ఎందుకు తాతా నవ్వుతున్నావ్?’’ అడిగాడు రాఘవ. ‘‘ఏం లేదు బాబూ... మన బయ్యమే దెయ్యవండి... అంతకంటే ఏవుందండి? దెయ్యం అనగానే ఓ సిన్న సంగతి గాపకానికొచ్చిందండి... అందుకే నవ్వినాను’’ అన్నాడు తాత. ‘‘ఏంటా సంగతి... మాక్కూడా చెప్పు తాతా’’ అన్నాడు శంకర్ డ్రైవింగ్ చేస్తూనే. ‘‘అవునవును... ఏంటో చెప్పు. కాలక్షేపంగా ఉంటుంది’’ సమర్థించాడు కిరణ్. ‘‘చాన్నాళ్ళ కిందట సంగతండి... ఇలాగే నలుగురు పెద్దమనుసులు కార్లో ఈ దారంట ఎల్తన్నారటండి. రాత్రి పదకొండు దాటుంటాది. అప్పుడే రోడ్డుకడ్డంగా ఓ పిల్ల కనబడిందటండి. ఆపమని సేతులూపుతందట. సరే ఎవురో ఆడకూతురు ఇక్కడ సిక్కుబడిపోయినట్టుందని కారాపేరటండి. ఆయమ్మ కారెక్కింది. ఈయేళప్పుడు ఇక్కడెందుకున్నా వనడిగితే ‘మా తాత పసరు వైద్యంసేస్తాడు. నాను పసరు మొక్కల కోసం ఎదుక్కుంటూ ఎళ్ళి తప్పొడిపోన్ను. తిరిగి తిరిగి ఇక్కడికెలాగో వొచ్చేనుగానీ ఇంత రాత్రి పూట ముందుకెల్నానికి బయవేసి చాంచేపట్నుంచి ఇక్కడే వుండిపోన్ను’ అందటండి. సరే కానీ అని అటుపక్క దిగబెట్టేత్తావని సెప్పేరట. కానీ వొయసులో ఉన్న పిల్లని సూసేసరికి ఆళ్ళకి దుర్భుద్ధి పుట్టింది. ఇంకేటుంది? ఆళ్ళ కామానికి ఆ పిల్ల బలైపోయింది. ఆళ్ళు కార్లోంచి దించీశాక అక్కడే దగ్గిర్లోని పాడుపడిన బావిలో దూకి పేణం తీసుకుందట ఆ పిల్ల. పాపం... ఆళ్ళ తాత ఆ కార్లోని మనుసుల కోసం చాన్నాళ్ళు యెతికాడని అంటారు. ఆ పిల్ల కూడా దెయ్యవై ఆళ్ళని యెతుకుతూ అప్పుడప్పుడూ ఇటేపు ఎళ్ళే కార్లని ఆపి యెక్కుతుంటుందని ఇప్పటికీ సాలామంది అంటుంటారండి’’ అన్నాడు. అతడు చెప్పడం పూర్తయ్యాక కొద్ది క్షణాల పాటు ఎవరూ మాట్లాళ్ళేదు. అనవసరంగా ఈ టైమ్‌లో ముసలాణ్ణి కదిపామేమో అనిపించింది. ‘‘ఇదంతా నిజమే అని నమ్ముతున్నావా తాతా?’’ అడిగాడు రాఘవ. ‘‘చాన్నాళ్ళ కిందట మా గూడెంలో ఈ ఇసయం పొగలాగా పుట్టిపోయింది బాబూ. అప్పున్నుంచీ ఎవరినోట ఆలకించినా ఇదేసంగతి. మరి నిజవేనా అంటే నాను మాత్రం ఏటి సెప్పగల్ను బాబూ!’’ అన్నాడు తాత. అది నిజమైనా కాకపోయినా తాత చెప్పింది విన్నాక మా మనసుల్లో మాత్రం భయం మరింతగా వ్యాపించిదన్న మాట మాత్రం వాస్తవం! కాసేపు మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కీచురాళ్ళ రొద మరింత గట్టిగా వినబడుతున్నట్టుగా ఉంది. చల్లటి వాతావరణంలో కూడా నాకు చెమటలు పడుతున్నట్టుగా అనిపిస్తోంది. రాఘవ సంగతేమో గానీ మిగతావారి పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పగలను. ‘‘ఇలాంటి కథలను నమ్మడానికి లేదులే..’’ కిరణ్ వాతావరణాన్ని తేలిక చెయ్యడానికే అన్నా వాడి గొంతులో భయం స్పష్టంగానే ధ్వనించింది. ‘‘నిజమైనా కావచ్చు. ఇలాంటివి చాలాచోట్ల జరిగాయని మనం చదివాం కదా. దెయ్యం ఉనికిని గుర్తించినవాళ్ళు కూడా ఉన్నారు కదా...’’ అదేదో మామూలు విషయం అన్నట్టుగా అన్నాడు రాఘవ. కానీ ఆ మాటలు కిరణ్‌ని మరింత టీజ్ చెయ్యడానికే అన్నాడని మాకు అర్థమైంది. ‘‘చాల్చాల్లే... నిన్నే అడగాలి ఇలాంటి సంగతులు!’’ అన్నాడు కిరణ్. ‘‘సరే... ఇంకా విషయం వదిలేయండి. ఇంకేదైనా మాట్లాడండి’’ అన్నాడు శంకర్. మా మనసుల నిండా అప్పటికే భయం ఆవరించింది. ఎవరూ కొద్ది క్షణాల పాటు ఏమీ మాట్లాడలేదు. అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఏర్పడుతున్న ఈ నిశ్శబ్దాన్ని ఎదుర్కోవడం మరింత కష్టంగా ఉంది. చివరికి రాఘవే చొరవ తీసుకొని ఆర్నెల్ల క్రితం మేమందరం దేవీపురానికి వెళ్ళినప్పటి సంగతుల గురించి మాట్లాడ్డం మొదలుపెట్టాడు. క్రమంగా ఆ సంభాషణలో అందరం పాల్గొంటూ తలో సంగతి గుర్తు చేసుకోసాగాం. ఈ సూత్రం బానే పనిచేసినట్టుంది. కాసేపటికి మేమంతా నార్మల్ మూడ్‌లోకి వచ్చే సూచనలు కనిపించాయి. సరిగ్గా అప్పుడు జరిగింది అది...! రోడ్డుకడ్డంగా ఓ అమ్మాయి నిలుచుని ఆపమని చేతులూపుతోంది. కాస్త దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూడగానే పోయిన భయం ఒక్కసారిగా రెట్టింపు ప్రభావంతో తిరిగొచ్చింది. ఈ టైమ్‌లో ఈ దారిలో నిలుచున్న ఆ అమ్మాయి ఎవరు? అసలు ఆమె మనిషేనా? లేక...? నా గుండె చప్పుడు స్పష్టంగా నాకే వినిపిస్తోంది. వెనక్కి తిరిగి రాఘవ వైపు చూశాను. వాడి మొహంలో ప్రశ్నార్థకం. కిరణ్ సంగతి చెప్పక్కర్లేదు. కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అసంకల్పితంగా శంకర్ కారు స్లో చేశాడు. ‘‘పోనియ్ నీకేమైనా పిచ్చా? వేగంగా పోనియ్... ఆపకు...’’ అరిచాడు కిరణ్. వెంటనే కారు వేగం పుంజుకుంది. ఆ అమ్మాయికి దూరం జరిగేటట్లుగా కుడివైపు సర్రున కోసి ఆమె దాటిపోగానే తిరిగి మెయిన్ రూట్లోకి వచ్చి దూసుకుపోయింది. ‘‘ఆపు... కారాపు...’’ గట్టిగా అన్నాడు రాఘవ. ‘‘ఎందుకురా ఆపమంటున్నావ్? కారు పోనీ శంకర్... ఆపొద్దు...’’ కిరణ్ కూడా గట్టిగానే అన్నాడు. ‘‘మీ మొహం... కొద్దిగానైనా ఆలోచించరేంట్రా...? తాత చెప్పిన కట్టుకథ విని ఆ మూడ్‌లోకి వెళ్ళిపోయి మీరేం చేస్తున్నారో మీకే తెలీడం లేదు. ఆ అమ్మాయి దెయ్యమేవిటి! దెయ్యమయితే కారాపకుండా వెళ్ళినంతమాత్రాన మనల్ని వదిలేస్తుందా? ఎగురుకుంటూ అయినా కార్లోకి వచ్చెయ్యదా? పాపం... ఆ అమ్మాయి ఏదో ఆపదలో వుందేమో? ఇలా వచ్చెయ్యడానికి మీకు మనసెలా ఒప్పుతోందిరా... దయచేసి నా మాట విని కారు వెనక్కి తిప్పిండి...’’ గుక్క తిప్పుకోకుండా అన్నాడు రాఘవ. ఎవరూ మాట్లాళ్ళేదు. ‘‘అవును బాబూ... నాను కాటికాపరి పంజేశాను. శవాల మద్దిన, దెయ్యాల మద్దిన తిరిగినోణ్ణి. ఆ పిల్ల దెయ్యం కాదు బాబూ... పాపం... ఏడుత్తున్నట్టుంది... ఎవరో, ఎంచేత ఇక్కడుండిపోయిందో... కారు ఎనక్కి తిప్పి ఎక్కించుకోండి బాబూ... ఈ ముసిలాడికున్న ధయిర్యం కూడా మీకు నేదా బాబూ...’’ అంతవరకూ మౌనంగా ఉన్న తాత మాట్లాడాడు. మిగతా ముగ్గురం ఆలోచన్లో పడ్డాం. ‘‘ఒరేయ్.... దయచేసి వెనక్కి తిప్పండ్రా. మనం కాపాడకపోతే ఆ అమ్మాయికేదైనా ప్రమాదం జరగొచ్చు. ఆ ఉసురు మనకు తగులుతుందిరా...’’ మమ్మల్ని కన్విన్స్ చేస్తూ అన్నాడు రాఘవ. కారు వెనక్కి తిరిగింది. అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చుని మొహం కప్పుకొని ఉంది. బహుశా ఏడుస్తోంది. కారు ఆగగానే ముందు రాఘవే దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆమె మొహం పెకైత్తి వాణ్ణి చూడగానే భోరున ఏడ్చింది. వాడు ఆ అమ్మాయిని సముదాయిస్తూ తీసుకొచ్చి కార్లోకి ఎక్కించాడు. వెనక సీట్లోనే నలుగురూ ఇరుక్కొని కూర్చున్నారు. కారు తిప్పి ముందుకు పోనిచ్చాడు శంకర్. ఆ అమ్మాయికి పదహారు, పదిహేడేళ్ళుండొచ్చు. రాఘవ నెమ్మదిగా ఆమె దగ్గర్నుంచి విషయం రాబట్టాడు. ఆ అమ్మాయి వైజాగ్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. విహారయాత్రకి వాళ్ళ క్లాసు పిల్లలంతా బస్సు మీద అరకు, బొర్రా గుహలకొచ్చారు. తిరిగి బైల్దేరేసరికి మాలాగే ఆలస్యం కావడంతో ఈ అడ్డదారి ఎన్నుకున్నారు. మధ్యలో బస్సు ఆగిపోయింది. తిరిగి స్టార్ట్ అవడం లేదు. ఏం జరిగిందో చూస్తున్నారు. ఈ అమ్మాయి తలనొప్పిగా ఉందని చెప్పి వెనక సీట్లో పడుకొని ఉంది. బస్సు ఆగడంతో వెనక డోర్గుండా బైటికి దిగింది. టాయిలెట్‌కి వెళ్ళే ఆలోచనతో కాస్త వెనగ్గా పొదల చాటుకు వెళ్ళింది. ఈలోగా సడన్‌గా బస్సు స్టార్ట్ అయి ముందుకు కదిలింది. వెనకసీట్లో ఈ ఒక్క అమ్మాయే పడుకొని ఉండడం వల్ల ఈమె బస్సు దిగిన సంగతి ఎవరూ గమనించలేదు. బస్సు వెళ్ళిపోతున్న విషయం గమనించి ఈ అమ్మాయి బస్సు వెనక పరిగెత్తుకుంటూ ఆపమని కేకలు వేస్తూ వచ్చినా అప్పటికే బస్సు స్పీడందుకొని వెళ్ళిపోవడంతో ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది. అదీ జరిగిన విషయం! అడవి నుంచి బైటపడుతున్నామనడానికి సూచనగా అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తున్నాయి. మరి కాసేపటికి కాస్త దూరంలో ఎదురుగా మెయిన్‌రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నట్లుగా లైట్లు కనిపించాయి. అప్పటికి మా మనసుల్లో భయం పోయింది. అట్నుంచి ఏదో వాహనం మావైపుగా వస్తోంది. కాస్త దగ్గరికి వచ్చాక అర్థమైంది... అదొక మినీ బస్సు. దాన్ని చూడగానే ఆ అమ్మాయి... ‘అది మా బస్సే...’ అంటూ అరిచింది. కారాపుచేసి ఆ అమ్మాయిని తీసుకొని బస్సుకు ఎదురుగా వెళ్ళాం. వాళ్ళు ఆ అమ్మాయి మిస్సయిందని గమనించి వెనక్కి వస్తున్నారు. ఆ పిల్లను వాళ్ళకు అప్పజెప్పి తిరిగి కారు దగ్గరకు వచ్చాం. రాఘవ మాతో బస్సు దగ్గరికి రాకుండా కారు దగ్గరే నిలబడి ఉన్నాడు. తాత మాతో రావడం లేదు. మెయిన్‌రోడ్డు ఎదురుగానే ఉంది కాబట్టి రాఘవతో చెప్పేసి వెళ్ళిపోయినట్టున్నాడు. జరిగిన సంగతుల గురించే మాట్లాడుకుంటూ ఈసారి మా ట్రిప్పు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటూ నవ్వుకున్నాం. రాఘవ మాత్రం మా సంభాషణలో పాలు పంచుకోలేదు. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మరో గంట ప్రయాణం తర్వాత విజయనగరం చేరుకున్నాం. ఇది జరిగిన వారం తర్వాత మరుసటి ఆదివారం అంతా ఓ చోట కలుసుకున్నాం. కిందటి వారం అరకు ట్రిప్ గురించే మాట్లాడుకుంటున్నాం. ‘‘మొత్తానికి గొప్ప ఎక్స్‌పీరియెన్స్!’’ అన్నాను నేను. ‘‘అవును... ఆ టైమ్‌లో ఆ పరిస్థితిలో వెనక్కు వెళ్ళడం ఒకరకంగా సాహసమే... కానీ దానివల్ల ఓ అమ్మాయి రక్షించబడింది. ఆ తృప్తి చాలు మనకి. లేకపోతే ఆ బస్సు వెనక్కి వచ్చేలోగా ఆ అమ్మాయికేదన్నా ప్రమాదం జరిగుండొచ్చు’’ అన్నాడు శంకర్. ‘‘ప్రమాదమేమిటి నీ మొహం... నాలాంటి వాడికైతే అక్కడ ఏ ప్రమాదం జరక్కపోయినా అడవిలో ఒంటరిగా చిక్కుబడిపోయామన్న భయంతోనే గుండాగిపోయి ఉండేది...’’ సిన్సియర్‌గా అన్నాడు కిరణ్. రాఘవ ఇంకేదో ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉన్నాడు. ‘‘నువ్వేం మాట్లాడవేంట్రా?’’ అన్నాన్నేను. ఒకసారి మావైపు చూసి ‘‘మనం సాహసం చేసింది నిజమేగానీ, అది ఆ అమ్మాయిని రక్షించడం కాదు...’’ సాలోచనగా అన్నాడు వాడు. ‘‘మరి...?’’ అడిగాడు. ‘‘తెలీకుండా మరో పెద్ద సాహసం చేశామేమో అనిపిస్తోంది. ఇది నిజమో కాదో గట్టిగా అడిగితే నేను చెప్పలేను. అందుకే ఈ విషయం ఇంతవరకూ మీకు చెప్పలేదు కూడా’’ అన్నాడు. ‘‘అబ్బ... అదేంటో చెప్పరా?’’ సస్పెన్స్ భరించలేనట్టు ఆతృతగా అన్నాడు కిరణ్. ‘‘ఆ రోజు మీరు బస్ దగ్గరకు వెళ్ళినప్పుడు నేను బైటికి వచ్చి కార్ డోర్ మూసేసి అక్కడే నిలబడ్డాను. డోర్ మూసినప్పుడు లోపల తాతను చూసినట్టే గుర్తుంది. మెయిన్‌రోడ్డు ఇంకాస్త దూరంలో ఉంది గదా... అక్కడ దిగుతాడేమో అనుకున్నా. తర్వాత మీరొచ్చారు. మళ్ళీ కార్ డోర్ తీసి చూసేసరికి తాత లోపల లేడు. నాకు అయోమయంగా అనిపించింది. నాకు చెప్పి వెళ్ళిపోయాడని మీరనుకున్నారు. అది నిజం కాదు. అసలతడు దిగినట్టుగానీ, వెళ్ళిపోయినట్టుగానీ నేను చూడనేలేదు. అసలా కార్ డోర్ తీసినట్టు కూడా అనిపించలేదు...!’’ అందరం షాక్ తిన్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఇది నిజమా? లేక రాఘవ పొరబడ్డాడా? తాత ఎవరికీ చెప్పకుండా సెలైంట్‌గా దిగి వెళ్ళిపోయాడా? లేక మాయమైపోయాడా? అసలతడు ఎవరు? అతడు చెప్పిన కథలోని తాత అతడేనా? మా అందరిలో ఎన్నో ప్రశ్నలు! మా ప్రశ్నల్లో దేనికీ సమాధానాలు లేవు. ఆ రోజు జరిగింది తల్చుకుంటే మాత్రం ఇప్పటికీ మా గుండె కొట్టుకునే వేగం పెరుగుతూనే ఉంటుంది. ఆ అమ్మాయికి పదహారు, పదిహేడేళ్ళుండొచ్చు. రాఘవ నెమ్మదిగా ఆమె దగ్గర్నుంచి విషయం రాబట్టాడు. ఆ అమ్మాయి వైజాగ్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. - ఎం.రమేశ్ కుమార్ -
యమపాశం
నెల్లూరు రవాణా: అర్థరాత్రి కరెంటు సరఫరా.. అన్నదాతల పాలిట యమపాశంగా మారింది. గడచిన నాలుగు నెలల కాలంలో 30 మందికిపైగా రైతులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డారు. అధికారంలోకి వస్తే నిరంతరాయంగా తొమ్మిదిగంటల పాటు సరఫరా అందిస్తామన్న చంద్రబాబు హామీలు అమలు కావటం లేదు. అరకొర విద్యుత్ సరఫరాతో పంటలను దక్కించుకునేందుకు అన్నదాతలు రాత్రిళ్లు పొలాలకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి రాలిపోతున్నారు. ప్రభుత్వం పగలు 4 గంటలు.. రాత్రి 3 గంటల పాటు సరఫరా చేస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రోజంతటికీ కలిపి కేవలం 5 గంటలు మాత్రం సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. అది కూడా అర్థరాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరా చేస్తుండటంతో రైతులు చూడకుండా వెళ్లి ప్రమాదాలబారిన పడుతున్నారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 1.43 లక్షలకుపైగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 80 శాతం మంది రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారందరికీ బోరుబావులే ఆధారం. జిల్లాలో ప్రధానంగా వరి, చెరకు, పండ్ల తోటలు, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం వరి చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో నీరందకపోతే పంట పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. కండలేరు, సోమశిల జలాశయాల్లో నీటిమట్టం పడిపోయింది. దీంతో కాలువలకు కూడా నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. పూర్తిగా బోర్లమీదే అధారపడ్డ రైతులు వేళాపాలా లేకుండా కరెంటు సరఫరా చేస్తుండడంతో రాత్రీ, పగలూ పొలాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు తీగలు తగిలో.. షాక్‌కు గురయ్యే అనేకమంది రైతులు మృత్యువాతకు గురవుతున్నారు. నాలుగు నెలల్లో 30 మంది మృతి చిట్టమూరు మండలం గునపాడు గ్రామానికి చెందిన పెంచలయ్య శనివారం పంటకు చుట్టిన కరెంటు తీగలు తగిలి మృత్యువాతపడ్డారు. ఈనెల 10న ఇందుకూరుపేట మండలం జంగవారిదరవు గ్రామానికి చెందిన జొన్నవాడ శేఖర్ (45) పొలంలో మోటార్ వేసేందుకు వెళ్లి షాక్కొట్టి మరణించారు. మర్రిపాడు మండలం చుంచులూరుకు చెందిన చిల్లపోగు పీచయ్య (58), కె.శీనయ్య (45) ఈనెల 6న పంటకు నీరుపెట్టేందకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి మృతిచెందారు. విడవలూరు మండలం ఊటుకూరులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్తీక్ రొయ్యలకు మేతపెడుతూ విద్యుత్ వైర్లు తగిలి మరణించారు. చిల్లకూరు మండలం బల్లవోలుకు చెందిన వి.మనోహర్ (45) గత నెల 17న విద్యుత్ మోటార్ వేసేందుకు వెళ్లి కరెంటు కాటుకు బలయ్యారు. పొదలకూరు మండలం డేగమూడికి చెందిన కౌలు రైతు జి.చంద్రశేఖరరెడ్డి (36) పంటకు చుట్టిన తీగలు తగిలి అకాలమరణం చెందారు. జనవరి 11న ఓజిలి మండలం కారూరుకు చెందిన పి.శ్రీనివాసులు(40) పొలానికి వెళ్లి విద్యుత్ షాక్ గురై మరణించారు. డక్కిలి మండలం మోపూరుకు చెందిన బి.హరిరెడ్డి వరి కోత కోస్తుండగా మిషన్‌కు విద్యుత్ వైరు తగిలి మృతిచెందారు. డిసెంబర్ 13న నెల్లూరు రూరల్ మండలం ఉప్పటూరు గ్రామానికి చెందిన బి.వెంకటేశ్వర్లు (38) స్తంభం నుంచి మోటారుకు తీగలాగుతూ షాక్‌కు గురై మరణించారు. ఇలా జిల్లావ్యాప్తంగా పొలం పనులకు వెళ్లిన అనేకమంది రైతులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. యజమానులు మరణించడంతో కుటుంబ సభ్యులు అనాథలుగా మారారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి పగటి పూటే కరెంటు సరఫరా చేయడంతో పాటు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలను బాగుచేసి రైతుల ప్రాణాలను కాపాడాలాని రైతు కుటుంబాలు కోరుతున్నాయి. -
పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న నటుడు
అర్ధరాత్రి బయటకు వెళ్లి... లాఠీ దెబ్బలతో తిరిగొచ్చాడు శాండల్‌వుడ్ నటుడు చేతన్. మిడ్నైట్ 1.45కు చర్చ్‌స్ట్రీట్‌లోని తన మిత్రులను కలిసి తిరిగొస్తుండగా... ఆపిన పోలీసులు పంచ్‌లతో పిచ్చెక్కిచ్చారట. కారణం చెప్పకుండానే... కారు ఆపేసీ... కీ లాగేసుకుని... ఆపై ఫటఫటా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడట లోకల్ ఎస్ఐ. ఇంతలో అక్కడికి చేరుకున్న ఏసీపీ కూడా ఎస్ఐని ఫాలో అయిపోయాడట. గుద్దులు కాక... ఇద్దరూ కలసి బూతులూ తిట్టి... వదిలేశారట. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు వెళితే... సదురు ఎస్ఐ అక్కడికీ వచ్చి మళ్లీ పంచ్‌లిచ్చి లాకప్‌లో పెట్టాడట. బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చిన చేతన్... తన బాధను నగర పోలీస్ కమిషనర్ ముందు మొరపెట్టుకున్నాడట! -
జల జగడం
కనగానపల్లి: పీఏబీఆర్ నీటి కోసం గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. నీటి పారుదలశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే వివాదాలకు కారణమవుతోంది. వివరాల్లోకెళ్తే.. పీఏబీఆర్ నుంచి ధర్మవరం కాలువ ద్వారా రాప్తాడు, కనగానపల్లి మండలాల మీదుగా నీరు వెళ్తున్నాయి. నెల రోజుల నుంచి అధికారులు రాప్తాడు మండలాలలోని చెరువులకు నీటిని వదులుతున్నారు. దిగువ ప్రాంతంలో ఉన్న కనగానపల్లి మండలంలోని ముక్తాపురం, పర్వతదేవరపల్లి. మామిళ్లపల్లి చెరువులకు, కుంటలకు నీరు చేరడం లేదు. దీంతో ఆ గ్రామాల రైతులు రెండు రోజుల క్రితం కాలువ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటిని దిగువకు తిప్పుకొన్నారు. అయితే శనివారం సాయంత్రం రాప్తాడు మండలంలోని మరూరు గ్రామం రైతులు దిగువకు వస్తున్న కాలువ నీటిని అడ్డుగించి వారి చెరువుకు మళ్లించుకొన్నారు. విషయం తెలుసుకొన్న కనగానపల్లి మండలంలోని గ్రామాల రైతులు శనివారం అర్ధరాత్రి నీటి మళ్లీంచుకోవడానికి మరూరు గ్రామ సమీపంలోని కాలువ గట్టు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఇరు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి రైతులను అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో ముక్తాపురం, పర్వతదేవరపల్లి. మామిళ్లపల్లి గ్రామాల రైతులు తమకు న్యాయం చేయాలని అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించారు. వందలాది వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడడంతో పోలీసులు రైతులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపచేశారు. కొరవడిన అధికారుల పర్యవేక్షణ... ఈ యేడాది అక్టోబర్ 20 నుంచి పీఏబీఆర్ నుంచి కాలువకు నీటిని వదిలారు. వీటి ద్వారా రాప్తాడు, ధర్మవరం, కనగానపల్లి మండలాలలోని 42 చెరువులకు 25 శాతం వరకు నీటిని నింపుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. అధికారుల పర్యవేక్షణా లోపంతో నీటిని వదలి రెండు నెలలు అవుతున్నా, ఇప్పటికీ రాప్తాడు మండలంలోని చెరువులకే నీరు వెళ్తోందని దిగువ ప్రాంత రైతులు వాపోతున్నారు. పైభాగం నుంచి ఒక్కొక్క చెరువుకు ఒక్కసారి నీటిని నింపుతూ వస్తామని చెప్పిన ఇరిగేషన్ అధికారులు, కొన్ని గ్రామాల రైతులతో డబ్బుతో తీసుకొని ఆ ప్రాంతానికే నీటిని వదులుతున్నారని కనగానపల్లి మండలం రైతులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పంచించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
భారీ చోరీ
విజయనగరం క్రైం: ఇంతవరకు తాళంవేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు..నేడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటుండగానే దర్జాగా చోరీలకు తెగబడుతున్నారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఇంటి గోడకు ఆనుకుని ఉన్న మరో ఇంట్లో శనివారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఇటీవల జరిగిన రెండుభారీ దొంగతనాలు మరువక ముందే తాజాగా విజయనగరం పట్టణంలో మరో దొంగతనం జరగడం పట్టణ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇందుకు సంబంధించి బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాన్సాస్ సంస్థ కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ పొందిన పాకలపాటి సత్యనారాయణరాజు(పీఎస్ఎన్.రాజు) పట్టణంలోని కుసుమగజపతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య పార్వతమ్మ మొదటి అంతస్తులో ఉంటుండగా కిందన ఆయన కార్యాలయం ఉంది. శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ మొదటి అంతస్తులోని ఓ గదిలో నిద్రిస్తున్నారు. కిటికీలు అన్నీ తెరిచిఉన్నాయి. దొంగలు కిటి కీ మెస్‌ను కత్తిరించి గడియను తీసి ప్రధాన ద్వారానికి ఉన్న సెంట్రల్ లాక్‌ను స్క్రూలతో తొలగించి లోపలికి చొరబడ్డారు. పీఎస్ఎన్.రాజు పడుకున్న గదికాకుండా పక్క గదిలో ఉన్న బీరువాలు, అలమరాల్లో ఉన్న బట్టలను చిందరవందరచేశారు. బీరువాలో ఉన్న రూ.40వేల నగదును అపహరించారు. ఆ తర్వాత దేవుడు గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న 55తులాల బంగారు అభరణాలు, 15కేజీల వెండి వస్తువులను అపహరించారు. ఆదివారం ఉదయం పీఎస్ఎన్.రాజు లేచి చూసేసరికితలుపులు తెరిచి ఉండడంతో వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సీఐ కె.రామారావు, ఎస్సై బి.రమణయ్య సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, సీసీఎస్ ఎస్సై లక్ష్మణరావు వచ్చి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ కె.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్జాగా మందు కొట్టిన దొంగలు.. పీఎస్ఎన్ రాజు ఇంట్లో బీరువాలో ఉన్న మద్యాన్ని దొంగలు తీసుకుని రెండు గ్లాసుల్లో పోసుకుని ఫ్రిడ్జ్‌లోని కూలింగ్ వాటర్ తీసుకుని దాంట్లో వేసుకుని దర్జాగా తాగినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. బంగారు అభరణాలు ఎక్కువగా ఉన్న దేవుడు గదిలో దొంగలు తెలివిగా నీరును చల్లి అనవాళ్లు లేకుండా చేశారు. గతంలో జరిగిన కొన్ని దొంగతనాల్లో ఫ్రిడ్జ్‌లో ఉన్న పెరుగును తినడం, కూల్‌డ్రింక్‌లను తాగిన వంటి సంఘటనలు ఉన్నాయి. ఇంట్లో ఉంటుండగానే దొంగతనం.. పీఎస్ఎన్.రాజు, భార్య ఇంట్లో పడుకుని ఉండగానే దొంగలు చోరీకి పాల్పడడం విశేషం. ఎపుడు ఆలస్యంగా పడుకునే రాజు శనివారం రాత్రి 9గంటలకే నిద్రలోకి వెళ్లారు. మద్యలో శబ్దం వచ్చిన గాలికి కిటికీలు కదులుతున్నాయేమోనని భావించారు. దొంగలు రాజు పడుకునే గదిని మాత్రం ముట్టలేదు. ఆయన ప్రతిరోజు పడుకునే ముందు పిస్టల్ పక్కనే పెట్టుకుంటారు. క్లూస్ టీం పరిశీలన సంఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి వేలి ముద్రలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని దొంగలు వెళ్లిన ప్రాంతాలను పరిశీలించింది. ఆ సమీపంలో ఉన్న ప్రముఖ లాయర్ ఎస్.ఎస్.ఎస్.ఎస్.రాజు ఇంటి వద్ద డాగ్ కాసేపు ఆగింది. దొంగలు అక్కడ కూడా రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. -
అర్ధరాత్రి హల్చల్
* మహిళతో అసభ్యప్రవర్తన * 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాటేదాన్: బెంగుళూరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 9 మంది యువకులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై లక్ష్మీకాంత్‌రెడ్డి ప్రకారం... మలక్‌పేట్, బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు చెందిన జోహెల్(28), డేవిడ్(20), జోహెల్ అహ్మద్(20), సాయికుమార్‌యాదవ్(18), పుక్రూద్(20), స్వప్లింగ్(25), అబ్దుల్ రెహ్మాన్(20), సాయికిశోర్(20), హష్మి (18) విలువైన స్పోర్ట్స్ బైక్‌లపై మంగళవారం రాత్రి మాదాపూర్‌లో జరిగిన విందుకు ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే ఫంక్షన్ పూర్తికావడంతో చేసేదిలేక శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్లో విందు చేసుకొనేందుకు మాదాపూర్ నుంచి రాత్రి 12 గంటలకు బయల్దేరారు. బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలోని బెంగళూరు జాతీయ రహదారిపక్కనే గల పెట్రోల్‌పంప్ వద్ద వాహనాల్లో పెట్రోల్ పోసుకునేందుకు వచ్చారు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉండటంతో జాతీయ రహదారిపై బైక్ రేసింగ్ నిర్వహించేందుకు యత్నించారు. దారినవెళ్లే ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవరిస్తూ, కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించారు. ఇదే క్రమంలో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, అల్లరి చేశారు. ఆమె పోలీసు కంట్రోల్ (100)కు సమాచారం అందించింది. కంట్రోల్ రూమ్ సిబ్బంది మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను అప్రమత్తం చేయడంతో వెంటనే వారు తొమ్మిది మంది యువకులతో పాటు 9 స్పోర్ట్స్ బైక్‌లను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం యువకుల తల్లిదండ్రులను పిలిపించారు. మరోసారి ఇలాంటి సంఘటనలకు పాల్పడకుంటా పోలీసు లు యువకులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించా రు. మరో రోడ్లపై బైక్రేసింగ్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుటుంబసభ్యుల హామీ మేరకు కౌన్సెలింగ్ అనంతరం యువకులను వదిలిపెట్టారు. -
అపాయంలో ఉపాయం
అందమైన యువతి, అర్ధరాత్రి, పైగా ఒంటరి.. ఇంతలో కారు పాడైపోయింది.. ఈ టైంలో కొందరు మగాళ్లు కంటపడ్డారు.. ఈ పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి తనను తాను ఎలా కాపాడుకుందో చూపించింది గోయింగ్ హోమ్ షార్ట్ ఫిల్మ్. వోగ్ ఎంపవర్ సోషల్ అవేర్నెస్ ఇనీషియేటివ్‌లో భాగంగా రూపొందిన గోయింగ్ హోమ్ షార్ట్ ఫిలిం చక్కటి ఆలోచనకు రూపం. ఈ షార్ట్ ఫిలింసిటీప్లస్ ఒక క్లిష్టమైన సందర్భాన్ని, సున్నితంగా హ్యాండిల్ చేసే అవకాశం గురించి అంతర్లీనంగా చెబుతుంది. ఇంట్లోంచి బయల్దేరిన అమ్మాయి మళ్లీ క్షేమంగా ఇంటికి చేరే వరకూ టెన్షనే. అర ్ధరాత్రి కారో, బస్సో పాడయితే ఎవరో ఒకరు సాయం చేయకపోతారా, ఇంటికి చేరే దారే ఉండకపోదా అనే నమ్మకం అమ్మాయిలను నడిపిస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఊహించే ఆ పరిస్థితి వుందా, లేదా అనే చర్చ ఎలా ఉన్నా, ఆడవాళ్లు కోరుకుంటున్న ఆ చక్కటి వాతావరణాన్ని 5 నిమిషాల షార్ట్ఫిలింగా మలిచారు దర్శకులు విశాల్భ ట్. ఆలియా భట్ నటించిన ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. గోయింగ్ హోమ్ టైటిల్‌తో రూపొందిన ఈ బుల్లి చిత్రాన్ని ఇప్పటికే 27 లక్షల మంది చూశారు. రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న ఆలియాభట్ కారు మధ్యలో చెడిపోతుంది. ఆ సమయంలో సహాయం కోసం చూస్తున్న ఆమెను ఒక వాహనం సమీపిస్తుంది. అందులో ఐదుగురు మగవాళ్లు. వారి నుంచి ఆ సమయంలో ఆమె కేవలం సహాయం పొంది, జాగ్రత్తగా ఇంటికి ఎలా చేరిందని ఈ చిత్రంలో చూపించారు. అయితే చూపించిన తీరు మాత్రం ఆలోచనాత్మకంగా సాగుతుంది. ఒక అమ్మాయి ఊహల్లో ఉన్న ప్రపంచాన్నిక్రియేట్ చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నతో ఈ చిత్రం ముగుస్తుంది. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
బీబీనగర్ :అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడిచేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్తకు తీవ్రగాయాలయ్యా యి. బీబీనగర్ మండల కేంద్రంలో శనివారం ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పటి వరకు కబుర్లు చెప్పుకుని.. మండల కేంద్రానికి చెందిన ఖాజామియాకు అబ్జల్, ఖాజాఅసమొద్దీన్, హాజీ, బాబాజాన్, జానీపాషా అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరిలో హాజీ హైదరాబాద్‌లో నివసిస్తుండగా మిగతా నలుగురు మండల కేంద్రంలోని రైల్వే కాలనీలో ఇటీవల ఓ పెద్ద గృహాన్ని నిర్మించుకుని వేర్వేరు గదుల్లో నివసిస్తున్నారు. చివరి సంతానమైన జానీపాష వృత్తి రీత్యా గూడూరులోని టోల్‌ప్లాజాలో పనిచేస్తున్నాడు. శుక్రవారం తన విధులను ముగించుకుని ఇంటికి వచ్చాడు. అనంతరం సోదరులంతా రాత్రి పదిగంటలవరకు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. రాత్రి పదిగంటలకు భోజనాలు చేసి పడుకున్నారు. సోదరుల గదులకు గడియపెట్టి అర్ధరాత్రి దాటిన తరువాత నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే కాలనీలో నివాసిస్తున్న వీరి ఇంటికి వచ్చారు. తొలుత జానీపాష సోదరుల ఇంటి గదులకు గడియపెట్టా రు. అనంతరం జానీపాష గది ద్వారానికి పక్కనే ఉన్న కిటికి తెరిచి ఉండడంతో అందులోనుంచి కర్రసాయంతో తలుపు గడియతెరిచి లోనికి ప్రవేశించారు. అనంతరం బెడ్రూంలోకి చొరబడి బీరువాను తెరుస్తుడగా శబ్దం రావడంతో జానీ పా ష, అతడి భార్య షాజియా లేచి దుండగులను చూసి ఎదురు తిరిగారు. దీంతో వారు కర్రమొద్దుతో షాజీయాను(22) మంచంపై పడవేసి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆపై జానీపాషను విచక్షణా రహితంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం బీరువాలో ఉన్న నగలతో పాటు, షాజీయా ఒంటిపై ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. హత్య జరిగిన గంట తరువాత ఒకే ఇంటిలో వేర్వేరు గదుల్లో నివాసాముంటున్న జానీపాష సోదరులు దుండగుల దాడి సమయంలో మేల్కోలేకపోయారు.ఘటన జరిగిన గంట తరువాత ఒంటిగంట సమయంలో జానీపాష వదిన నసీమా బాత్రూం వెళ్లడానికి తలుపు డోరు తీయగా ఎంతకూ వెళ్లకపోవడంతో భర్తను లేపి ంది. బయట నుంచి గడియపెట్టి ఉం డడంతో ఇద్దరు వెనుక డోర్ నుంచి బయటకు వచ్చి చూడగా జానీపాష ఇంట్లోని వస్తువులు బయట వేసి ఉన్నాయి. దీం తో లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న షాజీ యాను, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జానీని చూసి నివ్వెరపోయి పెద్ద పెట్టున కేకలు వేశారు. దీంతో ఇంటి మేడపై గదిలో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులతో పాటు స్థాని కులు అక్కడకు చేరుకున్నారు. షాజీయా, జానీపాషను ఆటో లో గూడూరు వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో భువనగిరి ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షాజియా మృతిచెం దిందని వైద్యులు ధ్రువీకరించారు. పరిస్థితి విషమంగా ఉన్న జానీపాషను ఉప్పల్‌లో ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం 108 సిబ్బం ది విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ దుండగుల దాడి విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ ప్రభాకర్‌రావు తెల్లవారుజామున 4గంటలకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను గంటపాటు విచారిం చారు. అనంతరం నల్లగొండ నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి హత్యాస్థలంలో ఆధారాలు సేకరిం చారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ పని అయి ఉండవచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో కేసు ను దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చా రు. ఆయనతో పాటు భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు నరేందర్, సత్తీష్రెడ్డి, ఎస్ఐలు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌లు ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరేందర్ తెలిపారు. -
పెద్దేముల్లో అర్ధరాత్రి హైటెన్షన్
పెద్దేముల్: మండల పరిధిలోని తొర్మామిడి చౌరాస్తా వద్ద సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేట కోసం వచ్చిన నలుగురు వ్యక్తులు కాల్పులు జరపడంతో పోలీసులు అలర్టైపెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులను చూసిన వేటగాళ్లు బైక్‌పై పారిపోయే ప్రయత్నంలో బండరాయిని ఢీకొట్టారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు.. పెద్దేముల్ మండలం హన్మాపూర్ సర్పంచు లొంక నర్సిములు సోమవారం సాయంత్రం తాండూరుకు వచ్చి రాత్రి 10:30 గంటలకు తిరిగి గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గంమధ్యలోని పెద్దేముల్-తొర్మామిడి చౌరస్తా వద్దకు రాగానే ఆయన బైక్ పంక్చర్ అయింది. దీంతో దాన్ని నెట్టుకుంటూ వస్తున్న నర్సింలు తనను నలుగురు వ్యక్తులు వెంబడిస్తున్నట్లు గమనించాడు. దీంతో గ్రామస్తులకు, పెద్దేముల్ ఎస్ఐ రమేష్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. అంతలోనే ఆ నలుగురు వ్యక్తులు గొట్లపల్లి శివారులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు అనుమానంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనకుగురైన పెద్దేముల్ ఎస్ఐ వెంటనే తాండూరు డీఎస్పీ, రూరల్ సీఐలకు సమాచారం ఇచ్చాడు. దీంతో మరికొంత మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తం 30 మంది పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. తప్పించుకోబోయి ఢీకొట్టారు గాలింపులో దుండగుల ఆచూకీ తెలియకపోవడంతో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చౌరస్తా వద్ద పోలీసులు పికెటింగ్ వేశారు. ఇంతలోనే కొద్ది దూరం నుంచి నలుగురు వ్యక్తులు ఒకే బైక్‌పై రావడాన్ని గమనించిన పోలీసులు ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే దుండగులు ఆ బైక్‌ను ఆపకుండా అలాగే వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు బైక్‌ను వెంబడించారు. గొట్లపల్లి గేటు సమీపంలో వేగంగా వెళుతున్న బైక్ పెద్ద బండరాయికి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరొకరు అక్కడినుంచి పరారయ్యారు. కాల్పులు జరిపింది వీరే.. అంతకుముందు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి, కాల్పులు జరిపింది తామేనని గాయపడిన ఇద్దరు చెప్పినట్లు తెలిసింది. చనిపోయిన వ్యక్తి పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండాకు చెందిన రమేష్(29) అని గాయపడ్డ ఇద్దరు బద్రు, వినోద్లని పోలీసులు గుర్తించారు. రమేష్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హైదరాబాద్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. మంగళవారం ఉదయం జిల్లా అదనపు ఎస్పీ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మందుగుండు స్వాధీనం తాండూరు రూరల్: ఈ నలుగురు అటవీ ప్రాంతంలో నెమళ్లు, కుందేళ్ల వేటకు వచ్చారా లేక దారి దోపిడీకి వచ్చారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ షెక్ ఇస్మాయిల్ తెలిపారు. సంఘటన స్థలం నుంచి రెండు టార్చిలైట్లు, కొంత మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
రెప్పపాటులో పెను విషాదం
జాతీయ రహదారిపై మురారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురి మృతి, 37 మందికి గాయాలు గండేపల్లి/కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ : అర్ధరాత్రి... బస్సులోని ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. డ్రైవర్‌కు నిద్ర మత్తు ఆపుకోలేక రెప్పవాల్చాడు.. ఆ రెప్పపాటు కాలంలోనే ఆపద ముంచుకొచ్చింది. పెను ప్రమాదం కబళించింది. పలు కుటుంబాలను వేదనకు, యాతనకు గురిచేసింది. అంతులేని విషాదాన్ని నింపింది.16వ నంబర్ జాతీయ రహదారిపై మురారి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి 36 మంది ప్రయాణికులతో భద్రాచలం బయలుదేరింది. మురారి గ్రంథాలయం సమీపానికి వచ్చేసరికి ఆర్టీసీ బస్ డ్రైవర్ కునికిపాటుకు లోనయ్యాడు. అతడి రెప్పవాలడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ పైనుంచి అవతల రోడ్లోకి దూసుకెళ్లింది. పంచదార లోడుతో విశాఖపట్నం వైపు వెళుతున్న లారీని అతి వేగంగా ఢీకొంది. లారీ ముందు భాగంలోకి బస్సు డ్రైవర్ క్యాబిన్ వరకు దూసుకు పోవడంతో రెండు వాహనాలు నుజ్జయ్యాయి. ఏం జరిగిందో కూడా తెలియని బస్సు ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ముందు నుంచి బస్సు దిగే దారిలేకపోవడంతో అందరూ లోపలే చిక్కుకుపోయారు. గ్రామస్తులు, హైవే నిర్వహణ సిబ్బంది వెనుక అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు లాగారు. లారీని నడుపుతున్న క్లీనర్ అట్టా రోణిరాజు (22) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్, ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మూడు 108 అంబులెన్సుల్లోను, ఒక రాజకీయ పార్టీ ప్రచార వాహనంలోనూ రాజానగరంజీఎస్ఎల్కు, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కసింకోటకు చెందిన పొనకంపల్లి రమ్యకృష్ణ (25) బుధవారం ఉదయం మృతి చెందింది. అనకాపల్లికి చెందిన రమ్య అత్తింటికి ఆర్టీసీ బస్సులో వెళుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆమెకు రెండు కాళ్లు తెగిపోయాయి. ఆర్టీసీ బస్ డ్రైవర్ సులేమాన్ బేగ్‌ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుంటే దారిలో మృతి చెందాడు. పెద్దాపురం సీఐ నాగేశ్వరరావు, జగ్గంపేట ఎస్సై సురేష్‌బాబు, హైవే మెయింటెనెన్స్ సిబ్బంది, గ్రామస్తులు సంఘటన స్థలం వద్ద సహాయ కార్యక్రమాలు చేపట్టారు. -
అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
నిరాశ్రయమైన 13 కుటుంబాలు రూ.6 లక్షల ఆస్తినష్టంచోడవరంలో సంఘటన ద్రాక్షారామ, న్యూస్‌లైన్ : షార్ట్‌సర్క్యూట్ కారణంగా రామచంద్రపురం మండలం చోడవరంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా 13 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. చోడవరం నుంచి అరికరేవులుకు వెళ్లే రహదారిలో.. రోడ్డు పక్కనున్న 5 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. రామచంద్రపురం అగ్నిమాపకాధికారి ఎస్.బాబూరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారున ఉన్న దళితపేటలోని 5 తాటాకిళ్లలో మంజేటి అర్జునుడు, మంజేటి శ్రీను, కట్టంగ రమణ, మంజేటి సూరిబాబు, మంజేటి చిన్న, మంజేటి ఏసు, మంజేటి భీముడు, మంజేటి రమణ, దొండపాటి రాఘవ, దొండపాటి సత్తిబాబు, దొండపాటి అప్పన్న, దొండపాటి సత్యనారాయణ, దొండపాటి సతీష్ కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. కొందరు కొద్దిపాటి భూమిని కౌలుకు తీసుకుని వరిని పండించారు. ఆ ధాన్యం కూడా ఒకొక్కరు పది బస్తాలు తీసుకుని ఇళ్లల్లో నిల్వ చేసుకున్నారు. ఇలాఉండగా ఆదివారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ తాటాకింట్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఐదు తాటాకిళ్లకు మంటలు వ్యాపించాయి. ప్రాణాపాయాన్ని గమనించిన ఆయా కుటుంబాల వారు వృద్ధులు, మహిళలు, పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. కొందరు యువకులు మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. బంగారం, రేషన్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు, పిల్లల స్కూలు పుస్తకాలు, నగదు, టీవీలు, వంట సామగ్రి తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సర్వస్వం కోల్పోయాం అందరం నిద్రలో ఉన్న సమయంలోని ప్రమాదం సంభవించడంతో, ఇంట్లో వస్తువులను తెచ్చుకోలేకపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రెప్పపాటులో మంటలు వ్యాపించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశామన్నారు. తొలకరిలో పండించిన పంటను అందరూ పంచుకుని, ఇంట్లో పెట్టుకున్నామని, అవి కూడా బూడిదయ్యాయని విలపించారు. -
హైదరాబాద్‌లో అర్థరాత్రి బైక్ రేస్‌లు
-
సమ్మెబాట పట్టిన సీమాంద్ర ఉద్యోగులు
-
సైనికుడా సలాం
చీకటి పడిదంటే చాలు బయటకు వెళ్లాలంటేనే భయపడతాం. గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే అమ్మో..? అనుకుంటూ దాక్కుంటాం.. అలాంటిది ఎముకలు కొరికే చలిలో అర్ధరాత్రి.. అపరాత్రి తేడాలేకుండా.. భుజానికి తుపాకులు.. బరువైన బ్యాగులతో దేశ సరిహద్దులో కాపలా కాస్తూ.. ఎప్పుడు ఏ వైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో శుత్రువుల బారి నుంచి మనలను రక్షిస్తున్నారు సైనికులు. దేశం కోసం రక్తమైనా ఇస్తాం.. ప్రాణాలైనా అర్పిస్తాం.. దేశం మట్టి మాత్రం ఇవ్వమంటూ ప్రతినబూని సరిహద్దులో దూసుకుపోతున్నారు జిల్లా యువకులు. కన్నవారికి.. కట్టుకున్నవారికి దూరంగా ఉంటున్నా.. దేశం కోసం పనిచేస్తున్నామన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏటా జనవరి 15న భారత సైనిక దినోత్సవం జరుపుకుంటున్నారు. - న్యూస్‌లైన్, కోల్‌సిటీ/ధర్మపురి యువతలో పెరుగుతున్న తపన దేశం కోసం బార్డర్లో సేవలందించాలనే తపన నేటి యువతలో ఎక్కువగా పెరుగుతోంది. ఎల్-70 బోఫోర్స్గన్, ఏకే-47, ఏకే-57, ఇన్సాస్గన్, లైట్మిషన్గన్, ఎల్ఎంజీ తుపాకులు, రాకెట్ లాంచర్లు, ఎక్స్-95, ఎంఎంజీతో శత్రువులను మట్టుపెట్టడానికి యువత ముందుకొస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ కొండలు, నదులు దాటుతూ.. కనీసం తాగడానికి నీళ్లు దొరకని ప్రాంతాల్లోనూ రోజుల తరబడి దేశ రక్షణకు శ్రమిస్తున్నారు. జిల్లా నుంచి ఆర్మీకి ‘ఖని’ యువకులే అధికం జిల్లా నుంచి ఆర్మీలోకి చేరుతున్నవారిలో రామగుండం ప్రాంతానికి చెందినవారే ఎక్కువగా ఉంటున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు నిలిచిపోయిన తర్వాత యాజమాన్యం, ఉద్యోగుల పిల్లలను దేశరక్షణ కోసం ఆర్మీలో సిపాయిలుగా మార్చడానికి ఉచితంగా శిక్షణ ఇస్తూ కృషి చేస్తోంది. ఏటా నిర్వహించే రిక్రూట్మెంట్కు సింగరేణి వ్యాప్తంగా సుమారు వెయ్యి మందికిపైగా యువకులు పోటీపడుతున్నారు. రామగుండం రీజియన్ నుంచే కనీసం వంద మంది యువకు లు ఆర్మీలో చేరుతున్నారు. ఇప్పటికే సుమారు మూడు వేలకు పైగా సింగరేణి కార్మికుల బిడ్డలు సిపాయిలుగా దేశాన్ని కాపలా కాస్తున్నారు. ఉద్యోగంలో ఆరుగురు.. శిక్షణలో ఒకరు.. పాసిగామలో ఆరుగురు యువకులు ఆర్మీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, లక్నో, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో యువ జవాన్లు సేవలు అందిస్తున్నారు. ఇందులో గోపతి కిషన్, అత్తె రవీందర్, సిరిపురం శంకరయ్య, ఉపారపు రమేశ్, అత్తె రవీందర్, అత్తె రవి ఉన్నారు. కొట్టె తిరుపతి హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. పాసిగామతోపాటు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రామెల్ల గంగయ్య, రాయపట్నం గ్రామానికి చెందిన బుద్దె వెంకటేశ్, నాగారం గ్రామానికి చెందిన మరో యువకుడు ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. మా ఇద్దరు కొడుకులూ ఆర్మీలోనే.. మా ఇద్దరు కొడుకులు అబ్దుల్ హాకీం (28), అబ్దుల్ అలీం (26) దేశం రక్షణ కోసం బార్డర్లో కాపలా కాస్తున్నారు. అంతకంటే ఏం కావాలి మాకు. ‘సింగరేణిలో చనిపోతే ఏం వస్తది డాడీ... ఆర్మీగా వీరమణం పొందితే ఢిల్లీలో జెండా కప్పుతరు.. అప్పుడు గర్వపడండి...’ అని నా బిడ్డలు ధైర్మం చెప్పి ఆర్మీలో చేరిండ్లు. నేను 11వ గనిలో ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్‌గా పని చేస్తున్న. నా సేవలను గుర్తించి సింగరేణి యాజమాన్యం ఇప్పటికి రెండుసార్లు ఉత్తమ ఉద్యోగిగా సన్మానించిం ది. మాకు ముగ్గురు కొడుకులు, కూతురు సంతానం. పెద్ద కొడుకు ప్రైవేట్ స్కూల్ టీచర్. రెండో కొడుకు అబ్దు ల్ హాకీం తొమ్మిదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు భోపాల్‌లో డ్రైవర్‌గా సేవలందిస్తున్నాడు. చిన్న కొడు కు అబ్దుల్ అలీం ఏడేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం నేషనల్ స్పెషల్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో బాక్ల్ కమాండో గా దేశానికి కాపలాగా ఉంటున్నాడు. ఇద్దరూ సింగరేణి సేవా సమితి ద్వారానే ఆర్మీలో చేరారు. బిడ్డలిద్దరూ ఆర్మీలో పని చేస్తున్నారంటే గర్వంగా ఉంది. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకులను చూడకుండా నా భార్య ఉండకున్నా.. దేశం కోసం కన్న ప్రేమను కడుపులో దాచుకుంటోంది. - అబ్దుల్ రజాక్, రబియా బేగం, గోదావరిఖని సిపాయిగా చూడాలని మా ఊరి నుంచి పొలగాండ్లు మిలి టిరీల చేరిండ్రు. దేశసేవ సేత్తం డ్రు. మా కొడుకు తిరుపతి కూడా మిలిటిరీ చేర్పించినం. మేం కూలీ నాలీ చేసుకుంటన్నం. మా కొడుకును సిపాయిగా చూడాలనే అక్కడికి పంపిం చినం. ఇప్పుడు హైద్రబాద్ల శిక్షణ పొందుతండు. - లింగయ్య, లక్ష్మి (తిరుపతి తల్లిదండ్రులు) జన్మభూమి కోసం నా జన్మభూమి కోసం ఆర్మీల చేరిన, దేశ రక్షణ కోసం లాంటి కష్టాలనైనా ఎదుర్కొంట. నాతల్లిదండ్రులు సత్తమ్మ, మల్లేశం. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నరు. వాళ్లు కూలీ పనులు చేస్తూ బతుకుతున్నరు. నేను మధ్యప్రదేశ్‌లో శిక్షణ పొందిన. గుజరాత్లో పనిచేస్తున్న. - రవీందర్, పాసిగామ ఆర్మీయే నా జీవితం ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనేది నా జీవిత లక్ష్యం. అందుకోసమే నేను ఉద్యోగంలో చేరిన. పద్మ- మల్లేశం మా అమ్మానాన్నలు. ఒక సోదరి, సోదరుడు ఉన్నరు. నేను డిగ్రీ వరకు చదివిన. సైన్యంలో చేరిన. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తున్న. - అత్తె రవి, పాసిగామ డిగ్రీ చదివిన సిపాయిగా పనిచేయడం ఎంతో సంతోషంగాఉంది. నా జన్మ భూమి కోసం, నా ప్రజల కోసం సేవ చేయడమే లక్ష్యంగా ఆర్మీలో చేరిన. మా అమ్మానాన్న నర్సమ్మ-వెంకటి. ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. డిగ్రీ వరకు చదివిన. జార్ఖండ్‌లో పనిచేస్తున్న. - ఉపారపు రమేశ్, పాసిగామ అమ్మానాన్న ఆశీస్సులతోనే నేను ఆర్మీలో చేరానేది అమ్మానాన్న కళావతి, పోచయ్య లక్ష్యం. దేశ సేవ చేయాలనేది వారి కోరిక. నాకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఏడాది క్రితం ఆర్మీల చేరా. అమ్మానాన్న ఆశీస్సులతోనే నాకీ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పనిచేస్తున్న. - బుద్దె వెంకటేశ్, రాయపట్నం కొద్దిలో తప్పించుకున్న మొన్నటి ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు హెలీకాప్టర్‌లో ఇరవై మంది వెళ్లారు. రెండు నిమిషాల ముందే అందులోంచి కిందకు దిగిన. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ కూలి 19మంది చనిపోయారు. నేను అందులో ఉంటే చనిపోయేవాన్ని. - గోపతి కిషన్, జవాన్ ‘మిలటరీ’ మిడత ఈ ఫొటోలో కన్పిస్తున్న మిడత వెరైటీగా ఉంది కదూ: మిలటరీ జవాన్లు ధరించే డ్రెస్ రంగులో.. ఆకర్షిస్తోంది కదూ!! ఈ మిడతకు మిలటరీ డ్రెస్ రక్షణగా ఉంటుందట. ఎందుకంటే ఆకుపచ్చని చెట్టుపై ఉంటే ఏ శత్రువు కంట పడదట. మంథనిలోని రాజేశం అనే వ్యక్తి ఇంట్లోని చిక్కుడు చెట్టుపై వాలిన ఈ మిలటరీ మిడత ‘న్యూస్‌లైన్’ కెమెరాకు చిక్కింది. రేపు ఆర్మీడే జరుపుకుంటున్న సందర్భంలో ‘మిలటరీ’ మిడత కనిపించడం కాకతాళీయమే అయినా.. ఆసక్తిని గొలిపిస్తోంది కదూ! - న్యూస్‌లైన్, మంథనిరూరల్ -
అర్ధరాత్రి రోడ్డెక్కిన ఆడపిల్లలు
అమ్మలా ప్రేమను పంచి, నాన్నలా భద్రత కల్పించాల్సిన ఆ మహిళా అధికారి తీరుతో విసిగి, వేశారిన విద్యార్థినులు నిశిరాత్రి రోడ్డెక్కారు. ఓ మహిళా అధికారై ఉండి....బాలికలు పడే ఇబ్బందులను అర్థం చేసుకోవలసింది పోయి అసభ్యంగా మాట్లాడడంతో వారు భరించలేకపోయారు. ఆమె, అక్కడి సిబ్బంది వేధింపులు తాళలేకపోయారు. తిండి మాట అటుంచి కనీసం మెన్సెస్ ప్యాడ్స్ కూడా ఇవ్వకపోవడంతో తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేక బిక్కుబిక్కుమంటూ బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటపడి మూడు కిలోమీటర్లు నడిచి, అక్కడ నుంచి పార్వతీపురం బస్టాండ్‌కు చేరుకున్నారు. 18 మంది విద్యార్థినులు అర్ధరాత్రి హాస్టల్ దాటినా ఎవరూ పట్టించుకోలేదు. బెలగాం / గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్: గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూ ల గిరిజన గ్రామమైన పి.ఆమిటి ఆశ్రమ పాఠశాల సంక్షేమాధికారి సరస్వతి, అక్కడి వంట, ఇతర సిబ్బంది తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, పురుగులన్నం పెడుతున్నారని, తినలేకపోతున్నామని ఇదేమని ప్రశ్నిస్తే తీవ్ర భయాందోళన లకు గురిచేస్తున్నారని విద్యార్థినులు చెప్పా రు. మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, అసభ్యంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారని, గత్యంతరం లేకే తాము హాస్టల్ నుంచి బయటకు రావలసి వచ్చిందని పదో తరగతి చదువుతున్న మండంగి రూప, కె.స్వాతి, కె.షర్మిల, జి.మౌనిక, ఎ.రోహిణి, పి.దీపిక, టి.శిరీష, జి.శ్రీలత, కె.స్వాతి, కె.రజిని, టి.మల్లేశ్వరి తదితర 18 మంది విద్యార్థినులు విలేకరుల ఎదుట వాపోయారు. పార్వతీపురం బస్టాండ్‌కు చేరుకున్న విద్యార్థినులు తమ పరిస్థితిని ఫోన్ చేసి ఎస్ఎఫ్ఐ నాయకులకు వివరించా రు. దీంతో హుటాహుటిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎ.అశోక్‌తో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న విద్యార్థినుల వద్దకు గురువారం వేకువ జామున చేరుకున్నారు. వారిని పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయానికి తీసుకువెళ్లి ఆశ్ర యం కల్పించి ఆదుకున్నారు. అనంతరం విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ చాంబర్‌కు వెళ్లి ఫిర్యాదుచేశారు. స్పందించిన ఆయన తన చాంబర్లో విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారిని సముదాయించిన ఆయన, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చి రెండు రెండు కారుల్లో తిరిగి హాస్టల్‌కు పంపించారు. ఈ సందర్భంగా పీఓ విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ జరుపుతామని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తరగతుల బహిష్కరణ 18 మంది విద్యార్థినులు బయటకు వెళ్లిపోవడంతో మిగిలిన విద్యార్థినులంతా ఫలహారా లు మానివేసి, తరగతులు బహిష్కరించి పాఠశాల ఆవరణలో బైఠాయించారు. పీఓ ఆదేశాల మేరకు గురువారం పాఠశాలకు చేరుకున్న ఏటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడి, వివరాలు సేకరించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చి విద్యార్థినులందర్నీ భోజనాలకు పంపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ ఆశ్రమ పాఠ శాలలో గత కొన్ని రోజులుగా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, పురుగులతో కూడిన అన్నం, కూరలు పెడుతున్నారని, తమకు వచ్చిన పుస్తకాలు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు, బియ్యం తదితరవి అమ్మేస్తున్నారని తెలిపారు. 8,9,10వ తరగతుల విద్యార్థినులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి 50 రూపాయలు, 3 నుంచి 7వ తరగతి విద్యార్థులను నుంచి 30 రూపాయల చొప్పున వసూళ్లు చేశారని, అయినా నేటికి గుర్తింపుకార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. మేట్రిన్‌ను సస్పెండ్ చేయాలి. పి.ఆమిటి బాలికల ఆశ్రమ పాఠశాలలో మేట్రిన్‌గా పనిచేస్తున్న నెల్లి సరస్వతిని వెంటనే సస్పెండ్‌చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎ. అశోక్, జీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పి. సురేష్ ఎస్ఎఫ్ఐ మండల నాయకులు అశోక్, సుబ్బారావులు డిమాండ్ చేశారు. పురుగులన్నమే తింటున్నాం ఆశ్రమ పాఠశాలలో ప్రతి రోజూ పురుగుల అన్నమే తింటున్నాం. వంటవారిని, వసతి గృహ అధికారిని అడిగినా పట్టించుకున్న పాపానపోలేదు. తమను అసభ్యకరంగా తిడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. - కె.రజిని, పదోతరగతి వార్డెన్ పట్టించుకోకపోవడం వల్లే.. వసతి గృహంలో సమస్యలు తీర్చాలని పలుమార్లు వార్డెన్‌ను కోరినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే బుధవారం రాత్రి కాలినడకన మూడుకిలోమీటర్లు నడిచి ఆమిటి జంక్షన్ వరకు వెళ్లి అక్కడి నుంచి ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి పీఓకు ఫిర్యాదు చేశాం. - కె.ఝాన్సీరాణి, పదో తరగతి -
ఓరి దేవుడా..
కణేకల్లు, న్యూస్‌లైన్ : ‘ఓరి దేవుడా...ఎంత పని చేశావయ్యా.. నీ దర్శనానికి వచ్చిన మా బిడ్డలను మాకు శాశ్వతంగా దూరం చేస్తావా.. ఇక మాకు దిక్కెవ రు సామీ..’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదించడం పలువుర్ని కంటతడి పెట్టించింది. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి.. బైక్‌పై వస్తూ నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి తుంబిగనూరు గ్రామానికి చెందిన బోయ భీమలింగ (20), కురుబ శివకుమార్ (16), బోయ నరసింహులు (16) అనే విద్యార్థులు మృతి చెందారు. వీరు స్నేహితులతో కలిసి ఎన్.హనుమాపురంలో లాలుస్వామి పీర్లదేవుని ఉత్సవాలు చూసి... ద్విచక్ర వాహనాలపై తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. అన్యాయంగా పొట్టన పెట్టుకొన్నావే...! ‘స్నేహితునితో కలిసి పండగకొచ్చిన మా కొడుకును అన్యాయంగా పొట్టన పెట్టుకొన్నావే! మేం ఏం పాపం చేశావని ఈ శిక్ష వేశావ్? ఆరాధ్య దైవంగా భావించే నిన్ను దర్శించుకొద్దామని వస్తే నీ వద్దకే ర ప్పించుకున్నావే! మాకు గుండెకోత మిగిల్చావా.. దేవుడా. సర్వం కొడుకేనని బతుకుతున్న మేము ఇంకెవరి కోసం బతకాలి’ అంటూ భీమలింగ తల్లిదండ్రులు పార్వతమ్మ, లక్ష్మణ్ణ కన్నీరు మున్నీరయ్యారు. వీరికి భీమలింగతో పాటు కూతురు రత్న సంతానం. రత్నకు వివాహమైంది. పేద రైతు అయిన లక్ష్మణ్ణ కష్టపడి వ్యవసాయం చేస్తూ కొడుకును నెల్లూరులోని శాస్త్ర కాలేజీలో బీఫార్మసీ చదివిస్తున్నాడు. ప్రస్తుతం అతను సెకండియర్ చదువుతున్నాడు. స్వగ్రామంతో పాటు ఎన్.హనుమాపురంలో లాలుస్వామి పీర్లదేవుని ఉత్సవాలు ఘనంగా జరుగుతుండటంతో భీమలింగ శనివారం ఊరికి వచ్చాడు. తన కాలేజీలోనే థర్డ్ ఇయర్ చదువుతున్న ఒంగోలుకు చెందిన మిత్రుడు ప్రసాద్‌ను కూడా వెంట తీసుకొచ్చాడు. ఎన్.హనుమాపురంలో చిన్నసరిగెత్తు ఉత్సవానికి స్నేహితులతో కలిసి వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ‘బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి.. మమ్మల్ని ఏ కష్టమూ లేకుండా చూసుకొంటానని చెప్పితివే. అప్పుడే మమ్మల్ని వదిలి పైకి వెళ్లిపోయావా తండ్రీ’ అంటూ భీమలింగ తల్లి పార్వతమ్మ విలపించడం అక్కడున్న అందరినీ కలచివేసింది. పండగ కోసం వచ్చి తన ప్రాణ స్నేహితుణ్ని కోల్పోయానంటూ ప్రసాద్ కన్నీటిపర్యంతమయ్యాడు. భీమలింగ బైక్‌లో తాను రావాల్సిందని, అయితే.. తనను మరో బైక్‌లో ఎక్కించాడని అతను తెలిపాడు. నా ప్రాణాలైనా తీసుకోలేకపోయావా... దేవుడా! ‘చెట్టంత కొడుకును బలి తీసుకొనేందుకు నీకు మనసెలా ఒప్పింది? నా ప్రాణాలైనా తీసుకోలేకపోయవా దేవుడా’ అంటూ శివకుమార్ తల్లి సిద్దమ్మ కన్నీరు మున్నీరైంది. సిద్దమ్మ, వెంకటేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లకు వివాహమైంది. పెద్ద కొడుకు శివకుమార్ కణేకల్లులో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. చిన్నకొడుకు అనిల్ అదే గ్రామంలో ఐదో తరగతి చదువుతున్నాడు. సంతోషంగా పండగ చేసుకుందామనుకొంటే మా ఇంట్లో దీపాన్నే అర్పేశావా అంటూ శివకుమార్ కుటుంబ సభ్యులు విలపించారు. త్వరగా వస్తానని.. శవంగా వచ్చావా నాయనా.. ‘లాలుస్వామిని దర్శించుకొని త్వరగా వస్తానని చెప్పి... శ వంగా వచ్చావా నాయనా’ అంటూ బోయ నరసింహులు తల్లి రుక్మిణమ్మ గుండెలవిసేలా విలపించింది. రుక్మిణమ్మ, గజేంద్ర దంపతులకు ముగ్గురు కొడుకులు. వీరిది నిరుపేద కుటుంబం. గజేంద్ర పెద్ద కొడుకు అశోక్‌తో కలిసి హమాలీ, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రెండో కొడుకు ఆనంద్, చిన్నకొడుకు నరసింహులును చదివిస్తున్నారు. ఆనంద్ ఉరవకొండ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. నరసింహులు పదో తరగతి ఫెయిలయ్యాడు. మళ్లీ పరీక్ష రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. బాగా చదివించి కొడుకులను ప్రయోజకులు చేయాలనే తల్లిదండ్రుల కోరిక. ఇంతలోనే నరసింహులు చనిపోవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
చెట్టును ఢీకొట్టిన ట్రాలీఆటో
ఉప్పునుంతల, న్యూస్‌లైన్ : చెట్టును ట్రాలీఆటో ఢీకొట్టడంతో ఇద్దరు యు వకులు అక్కడికక్కడే దుర్మరణం పా లయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి జరిగి న ఈ సంఘటన గ్యాస్ సిలిండర్లను తరలి స్తుండగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అమ్రాబాద్ మం డలం ఇప్పలపల్లికి చెందిన మేణావత్ చందులాల్(27), నల్గొండ జిల్లా చం దంపేట మండలం సండ్రల్గడ్డతం డా వాసి కేతావత్ నాగరాజు(17) హై దరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణికాలనీలో ఉంటూ ఆటోలు నడపడంతోపాటు కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి అచ్చంపేట మండ లం ఘనపురం గ్రామానికి చెందిన సభావత్ లక్పతీనాయక్కు చెందిన ట్రాలీఆటోను తీసుకుని అమ్రాబాద్ నుంచి ఇండియన్ గ్యాస్ సిలిండర్లను నగరానికి తరలిస్తున్నారు. మార్గమధ్యంలోని అయ్యవారిపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే ఆటోరోడ్డు పక్కనఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వాహనం క్యాబిన్లో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉప్పునుంతల ఎస్ఐ వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికితీసి పోస్టుమార్టం కోసం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆటోలోని సిలిండర్లను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మృతుడు చందులాల్‌కు భార్య లలితతోపాటు ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. నాగరాజు తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోగా, చెల్లెలు ఉంది. బ్లాక్ మార్కెట్‌కు తరలించే యత్నంలోనే.. వంటగ్యాస్ సిలిండర్లను ఆటోలో దొంగచాటుగా రాత్రివేళ తరలించే ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగి నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఇక్కడ ఒక్కో సిలిండర్ రూ.750కు కొనుగోలు చేసి నగరంలో రూ.1200కు బ్లాక్‌లో అమ్ముతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ఆటోలో ఉన్న 30 సిలిండర్లను ఎంఆర్ఐ సుల్తాన్, వీఆర్వో నిరంజన్ స్వాధీనం చేసుకుని అచ్చంపేటలోని భారత్‌గ్యాస్ గోదాంలో భద్రపర్చారు. దీనిపై విచారణచేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహశీల్దార్ సీహెచ్ నాగయ్య తెలిపారు. -
బాలికపై సామూహిక లైంగిక దాడి
నాగర్‌కర్నూల్ టౌన్, న్యూస్‌లైన్: మహిళలపై లైంగికదాడులను అరికట్టేందుకు ప్రభుత్వ నిర్భయ చట్టం తీసుకొచ్చినా...వారికి రక్షణ లేకుండాపోతోందనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలికను ముగ్గురు యువకులు బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ మండల ఎండబెట్లలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న కుర్మయ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. మంగళవారం కుర్మయ్య దంపతులు ఊరికి వెళ్లడంతో అన్న స్వామితో పాటు బాలిక (16) గుడిసెలోనే నిద్రించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అదే గ్రామానికి చెందిన శ్రీశైలం (21), ఉమాపతి(21), దేవరాజు(22) అనే ముగ్గురు యువకులు పీకల దాకా మద్యం సేవించి, గుడిసెలోకి చొరబబడి నిద్రిస్తున్న బాలిక నోట్లో గుడ్డలు కుక్కి, గుడిసె సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సావుహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీంంతో ఆబాలిక వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో గుడిసెలో నిద్రిస్తున్న ఆమె అన్న స్వామి మేల్కొని అక్కడికి చేరుకున్నాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందుతులు ముగ్గురు కలిసి అతనిపై దాడి చేసి ముళ్లపొదల్లోకి నెట్టివేశారు. దీంతో వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో మేలుకున్న ఇరుగుపొరుగు అక్కడికి చేరుకోగా వారిని చూసిన నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. దీంతో గ్రామస్తులు వారిని వెంబడించి శ్రీశైలం, ఉమాపతిలను పట్టుకుని చితకబాది నాగర్‌కర్నూలు పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు దేవరాజు పరారయ్యాడు. కాగా నిందితుల్లోఒకడైన ఉమాపతిపై గతంలో ఒక కేసులో శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి చిన్న కుర్మయ్య ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. -
దేవుని భయం విశ్వాసికి వరం
హంగరీ రాజైన లూయిస్‌కు దైవభీతి ఎక్కువ. చిన్న తప్పు చేయాలన్నా జంకేవాడు. అతని తమ్ముడైన ఫిలిప్దేమో విచ్చలవిడి జీవితం. దేవునికి అంత భయపడాలా? అంటూ అన్నను వెక్కిరించేవాడు. ఆ రోజుల్లో అర్ధరాత్రి ఎవరి ఇంటిముందైనా తలారి అంటే ఉరితీసే వ్యక్తి బాకా మోగిస్తే ఆ ఇంటి యజమానికి రాజుగారు ఉరిశిక్ష విధించారని అర్థం. అందువల్ల అంతా అర్ధరాత్రి బాకానాదానికి భయపడేవాళ్లు. ఒకరాత్రి ఫిలిప్ ఇంటిముందు బాకా మోగింది. అంతే! ఫిలిప్ భయంతో కుప్పకూలి, పిచ్చిపట్టినట్లు బిగ్గరగా ఏడ్వసాగాడు. తలారి అతన్ని ఉరికంబం ఎక్కిస్తే ఎదురుగా ఉన్న లూయిస్ రాజు ‘తలారి బాకా నాదానికే నువ్వంత భయపడితే, దేవదేవుని తీర్పు పీఠం ముందు నిలువడానికి మరెంత భయపడాలి?’ అని ప్రశ్నించి అతన్ని మందలించి ఇంటికి పంపేశాడు. ఇశ్రాయేలీయుల చరిత్రలో 40 ఏళ్ల అరణ్యవాసం అత్యంత ప్రాముఖ్యమైనది. జగద్ రక్షకుడైన యేసుక్రీస్తును లోకానికి తీసుకురావడానికి దేవుని చెంత ప్రత్యేకించబడిన జనాంగంగా అక్కడే దేవుడు తన రాజ్యాంగాన్ని లేదా ధర్మాశాస్త్రాన్నిచ్చాడు. మానవ చరిత్రలో అదే మొదటి రాజ్యాంగం. ఆ తర్వాతే దాన్ననుసరించి రోమా ప్రభుత్వంతో సహా అన్ని రాజ్యాలూ తమ తమ రాజ్యాంగాలు రాసుకున్నాయి. అంటే మాతృరాజ్యాంగమన్నమాట. దేవుని భయంతో ఆ రాజ్యాంగాన్ని తు.చ తప్పకుండా పాటించడం ద్వారా ఇశ్రాయేలీయులు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని దేవుడు ఆదేశించాడు. పైగా ‘దేవుని భయం’ అన్ని పాపాలు, ఇబ్బందుల నుండి కాపాడుతుందని వారి నాయకుడు మోషే వివరించాడు (నిర్గమ 20:20). దేవుణ్ణి ప్రేమించడం, ఆయనకు విధేయత చూపడం, భయపడటం అనే మూడు దశల్లో విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది, కష్టమైనది, కీలకమైనది మూడవదే. ఎందుకంటే ‘దేవుని భయం’అపారంగా సమకూరిన ఈ మూడవ దశలో విశ్వాసి అజేయుడవుతాడు. ఆశీర్వాదాల వరదలో తడుస్తాడు. అప్పుడు లోకమే అతని ముందు మోకరిల్లుతుంది. నలభై ఏళ్ల అరణ్యయాత్ర చివరి మజిలీగా ఇశ్రాయేలీయులు ఇప్పటి జోర్డన్ దేశమైన నాటి మోయాబుకు వచ్చారు. అక్కడినుండి ఎడమకు తిరిగితే పాలు తేనెలు ప్రవహించే దేశమని దేవుడే చెప్పిన వాగ్దాన దేశమైన కనాను వెళ్తారు. కుడికి తిరిగితే చమురు నిక్షేపాలతో సుసంపన్నంగా ఉన్న ఇప్పటి సౌదీ అరేబియాకు వెళ్తారు. ‘మా మోషేగారు మమ్మల్ని ఎడమకుగాక కుడివైపుకు నడిపించి ఉంటే తేనెకు బదులు నూనె (చమురు) లభ్యమయ్యేది’ అని కొందరు యూదులు ఇప్పటికీ వాపోతారు. ఎంత చమురున్నా అది వచ్చే ఇరవై ఏళ్లలో అడుగంటిపోయే నిక్షేపం. కాని ఎన్నటికీ తరగడం కాదు, నానాటికీ వృద్ధి చెందే అత్యంత అమూల్యమైన ‘దైవభయం’ అనే నిక్షేపాన్ని దేవుడు కనానులో ఇశ్రాయేలీయులకిచ్చాడు. అందుకే చమురు లేకున్నా, శ్రీలంకలో మూడోవంతు మాత్రమే ఉన్న అతి చిన్న దేశమైనా, ఇజ్రాయెల్ ప్రపంచ రాజకీయాలను, అర్థిక వ్యవస్థలను కూడా శాసిస్తోంది. దేవుడే వారినుద్దేశించి ‘యొహోవా భయము వారికి ఐశ్వర్యము’ అన్నాడు (యెషయా 33:6). కొత్త నిబంధన కాలపు ఇశ్రాయేలీయులైన మన జీవితాల్లో, కుటుంబాల్లో, చర్చిల్లో కూడా ‘దేవుని భయం’ అనే పరిమళం నిండి ఉంటే అదెంత భాగ్యం? అది లేకపోతే ఎంత దౌర్భాగ్యం? జ్ఞానానికే కాదు, ఐశ్వర్యానికి కూడా దేవుని భయమే కారణమని దేవుడు చెబితే, ఇంకా లోకైశ్వర్యాలకే పాకులాడటం ఎంత అవివేకం? - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ హితవాక్యం: రక్షణ కేవలం పాప విముక్తి మాత్రమే కాదు. దైవిక రాజ్యాంగం అమలులో ఉన్న ఒకకొత్త లోకంలో ఆ రాజ్యాంగానికి భయంతో, విధేయతతో జీవిస్తూ శాంతిని, పరమానందాన్ని సంపూర్ణంగా అనుభవించడం. - ఆస్వాల్డ్ చేంబర్స్ -
దైవదర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన
పిఠాపురం, న్యూస్‌లైన్ : తెల్లవారకముందే వెళ్లి దైవదర్శనం చేసుకోవాలని బయలుదేరిన వారు శని వారం అర్ధరాత్రి పిఠాపురం వద్ద 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 23 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు, బాధితుల బంధువులు తెలిపి న వివరాల ప్రకారం మండల కేంద్రమైన పెదపూడికి చెందిన గున్నం భద్రం కుటుం బ సభ్యులు మొక్కు తీర్చుకునేందుకు బంధువులతో కలసి మొత్తం 26 మంది ఒక ట్రాక్టర్‌పై తుని సమీపంలోని తలుపులమ్మ లోవకు బయలుదేరారు. ఆదివారం మరో శుభకార్యంలో పాల్గొనాల్సి ఉండడంతో తెల్లవారకముందే లోవ వెళ్లి త్వరగా తిరిగి రావాలని భావించారు. శని వారం రాత్రి పది గంటల సమయంలో ఒక ట్రాక్టరుపై పెదపూడి నుంచి తలుపుల మ్మ లోవకు బయలు దేరారు. వారి వాహ నం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో పిఠాపురం బైపాస్ రోడ్డులో రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలోకి రాగానే కత్తిపూడి నుంచి కాకినాడ వైపు కంకర లోడుతో వస్తున్న లారీ అతి వేగంగా ఢీకొంది. ట్రాక్టర్ ముందు భాగం నుజ్జునుజైంది. అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్రగాయాలపాలయారు. సంఘటన స్థలానికి సమీపంలో ఒక శుభకార్యం జరుగుతుండడంతో ఆ కార్యక్రమంలోని యువకులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రైవేటు వాహనాలపై ఆస్పత్రికి తరలించేం దుకు కృషి చేశారు. గున్నం పాపాయమ్మ (70) అక్కడికక్కడే మృతి చెందగా, బొడ్డు లోకేష్ (12) పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించే లోపు కన్నుమూశాడు. ఆర్.సూరిబాబు (55)ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బండారు రాజు, కాకర లోవ శుభాషిణి, గున్నం చిన వీర్రాజు, గున్నం లక్ష్మి, ఏ సత్యనారాయణ, కొంగర పాపారావు, పి సత్యనారాయణ, మాసిన సత్యవేణి, కోన శ్రీను, ఎస్. రామలక్ష్మి , బొడ్డు సురేఖ, జి. అనంతలక్ష్మి, కాకర గాయత్రి దేవి, సీహెచ్ లక్ష్మి ,కె.పద్మావతి, కాకర ఝాన్సీలక్ష్మి, ట్రాక్టరు డ్రైవరు ఎం.సత్తిబాబు, పందిరి వీరబాబు, నూనె వెంకటరావు, కె.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, గున్నం సత్యనారాయణ, పి.విజయలక్ష్మి, పి.సత్యప్రసాద్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా కాకినాడలో ప్రభుత్వాస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం కారణంగా 216 జాతీయ రహదారిపై ట్రాఫిక్ కొంత సేపు నిలిచి పోయింది. వంట చేసుకోవడానికి ట్రాక్టరుపై తీసుకు వెళుతున్న గ్యాస్ సిలిండర్ ఎగిరిపడినప్పటికీ అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం లో లారీ డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పిఠాపురం టౌన్ ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముంచెత్తిన జడి
పాలమూరు/అచ్చంపేట, న్యూస్‌లైన్: పాలమూరును జడివాన ముంచెత్తింది. గురువారం అర్ధరాతి నుంచి జిల్లాలో భారీ వర్షం కురియడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 41.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రో జంతా ముసురుపట్టి ఉండటంతో జన జీవనం స్తంభించిపోయింది. మహబూబ్‌నగర్‌కు సమీపంలోని హస్నాపూర్ వాగులో నీటి ఉధృతి పె రగడంతో బొంతల మాసమ్మ అనే మహిళ గ ల్లంతైనట్లు తెలుస్తోంది. కోయిలకొండ మం డలం సూరారం వాగు, దేవరకద్ర మండలం బండర్‌పల్లి వాగుల్లోకి నీటి ప్రవాహం పెరిగింది. జిల్లాలో నమోదైన వర్షపాతం ఖిల్లాఘనపూర్ మండలంలో అత్యధికంగా 100.2 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదు కాగా..వీపనగండ్లలో 96.2 మి.మీ, వనపర్తి 92.0, మహబూబ్‌నగర్ 90.4, పాన్‌గల్ 87.2, పెద్దకొత్తపల్లి 87.0, కొల్లాపూర్ 73.0, హ న్వాడ 71.2, పెద్దమందడి 70.0, పెబ్బేరు 68.0, కొందుర్గు 67.4, నవాబుపేట 64.4, కొ త్తకోట 64.0, భూత్పూర్ 61.0, లింగాల 60.0, నాగర్‌కర్నూల్ 59.8, అడ్డాకుల 57.4, చిన్నచిం తకుంట 55.0, ఆత్మకూర్, అచ్చంపేట 52.0, బల్మూర్ 49.0, కోయిలకొండ 45.2, ధన్వాడ 45.0, గోపాల్పేట 44.0, కొడంగల్ 43.0, బిజి నేపల్లి 41.6, బాలానగర్ 40.2, మిడ్జిల్, అలంపూర్, అమ్రాబాద్ 40.0, నారాయణపేట 38.0, కల్వకుర్తి, తలకొండపల్లి, దేవరకద్ర 36.0, మానవపాడు 35.0, కోడేరు, మాడ్గుల 32.0, గద్వాల 30.8, ఇటిక్యాల మండలాల్లో 30.2 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. తెగిపోయిన చంద్రవాగు బ్రిడ్జిరోడ్డు నల్లమలలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సమీపంలోని అచ్చంపేట సమీపంలో ని చంద్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అచ్చంపేట మండలం బొల్గట్‌పల్లి స్టేజీ వద్ద చంద్రవాగు ప్రవాహానికి తాత్కాలికంగా ని ర్మించిన కల్వర్టు మరోసారి తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో అచ్చం పేట నుంచి శ్రీశైలం, అమ్రాబాద్ మార్గంలో వె ళ్లే అన్ని వాహనాలను నడింపల్లి, హాజీపూర్, బ్రాహ్మణపల్లి మీదుగా మన్ననూర్ వైపు నడిపిస్తున్నారు. కాగా, జూన్6న కురిసిన భారీవర్షాని కి చంద్రవాగు కల్వర్టుకోతకు గురైంది. అప్పట్లో తాత్కలికంగా ఏర్పాటుచేసిన రోడ్డు కోతకు గు రికావడంతో మూడురోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం కురిసిన వర్షానికి అదే పరిస్థితి పునరావృతమైంది. కల్వర్టు స్థానం లో తాత్కాలిక రోడ్డు మళ్లీ కొట్టుకుపోవడంతో శ్రీశైలం- అచ్చంపేట మార్గంలో రాకపోకలు స్తంభించాయి. వర్షాలు తగ్గితే గాని పునరుద్ధర ణ పనులు చేపట్టే అవకాశం లేదని అచ్చంపేట ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ చంద్రశేఖర్ తెలిపారు. జల దిగ్బంధంలో ముక్కిడిగుండం కొల్లాపూర్ రూరల్: భారీ వర్షానికి మండలంలో ని ముకిడిగుండం, నార్లాపూర్ గ్రామాల మధ్యనున్న పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ముకిడిగుం డానికి మరోవైపు ఉన్న ఉడుముల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ముకిడిగుం డానికి రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాల కు వెళ్లేందుకు ఉపాధ్యాయులు, గ్రామంనుంచి విద్యార్థులు, ప్రజలు కొల్లాపూర్ వచ్చేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షానికి రూ.2కోట్ల నష్టం - డీఆర్వో రాంకిషన్ వెల్లడి కల్టెరేట్ : జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి రూ.2 కోట్ల నష్టంవాటిల్లిందని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. నష్టం అంచనాపై శుక్రవారం ఆయన మండల తహశీల్దార్లలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ..మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ డివిజన్ల ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని 19 మండలాల్లో 501 ఇళ్లు దెబ్బతిన్నాయి. నారాయణపేట్ డివిజన్ పరిధిలో 226 ఇళ్లకు నష్టం వాటిల్లింది. నాగర్‌కర్నూల్ డివిజన్లో 419 ఇళ్లు దెబ్బతిన్నాయి. వనపర్తి డివిజన్ పరిధిలో 169 ఇళ్లు కూలిపోయాయి. అలాగే ఈ డివిజన్లో 42ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. రెండు మూడురోజుల్లో పరిహారం వర్షానికి నష్టపోయిన వారందరికీ రెండు మూడు రోజుల్లో పరిహారాన్ని అందజేస్తామని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. నష్టం జరిగిన గ్రామాలకు తహశీల్దార్ సంబంధిత వీఆర్వోలతో కలిసి స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. అర్హులకు సంబంధించిన నివేదిక మా త్రమే పంపించాలని, మంజూరైన పరిహారాన్ని వారికే అందజేయాలని సూచించారు. దెబ్బతి న్న ఇళ్ల ఫొటోలతో సహా వివరాలను శనివారం లోగా పంపాలన్నారు. చెరువు, కుంటలు నిండి ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లయితే నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. -
సకలం సమ్మె
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సమైక్యాంధ్ర ఉద్యమం ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రూపు సంతరించుకుంటోంది. పన్నెండు రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ(కొన్ని మినహాయింపు), కార్మిక సంఘాలతో పాటు విద్యార్థులు సకలజనుల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోనుంది. రవాణా వ్యవస్థకు బ్రేక్ పడినట్టే. లారీ యజమానులు, ట్రక్ ఆటోలు, ఆటోయూనియన ్ల నాయకులు, సిటీ బస్సుల యజమానులు తొలిరోజు బంద్‌లో పాల్గొననున్నారు. పలు ప్రభుత్వశాఖల సేవలు కూడా నిలిచిపోనున్నాయి. ఇప్పటికే అంతంతమాత్రంగా నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు ఇక పనిచేసే అవకాశాలు లేవు. ఈ సమ్మెకు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు దూరంగా ఉంటున్నప్పటికీ పాఠశాలలు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం నెల్లూరులో సమావేశమైన 13 సీమాంధ్ర జిల్లాల్లోని 14 యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 13న బంద్‌కు పిలుపునివ్వగా, 14న సమైక్యాంధ్రకు అనుకూలంగా సంతకాల సేకరణ, 15న రహదాదాలు దిగ్బంధం, 16న ర్యాలీలు, 17న ప్రజప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమావేశాలు, 18న కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 19న కడపలో మరోసారి విద్యార్థి జేఏసీ నేతలు సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారు. ఆదివారం జరిగిన సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మేరిగ మురళీధర్, చాట్ల నరసింహారావు, బీద రవిచంద్ర హాజరై సంఘీభావం ప్రకటించారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంఘాల మద్దతు సకల జనుల సమ్మెలో భాగంగా ఈ నెల 13న జరిగే బంద్‌కు వ్యాపార, వాణిజ్య వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ రోజున వ్యాపార లావాదేవీలను స్వచ్ఛందంగా నిలపివేస్తున్నట్టు వెల్లడించాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సినిమాల ప్రదర్శన, హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమలు కూడా మూసివేయనున్నారు. మూడు రోజులు ప్రైవేటు పాఠశాలల మూత సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 13 వతేదీ నుంచి మూడు రోజు లపాటు జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు మూసివేస్తున్నట్టు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చాట్ల నరసింహారావు తెలిపారు. విద్యార్థుల చదువులను దృష్టిలో ఉంచుకు ని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సమ్మెలోకి 3000 మంది ఆర్టీసీ కార్మికులు జిల్లాలో పనిచేస్తున్న మూడు వేల మంది ఆర్టీసీ కార్మికులు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే సకల జనుల సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో పది డిపోలకు సంబంధించి 970 బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సుల ద్వారా ఆర్టీసీకి ప్రతిరోజూ రూ.90 లక్షలు ఆదాయం వస్తోంది. ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నట్టయితే ఆదాయానికి భారీగా గండిపడనుంది. ప్రధాన పార్టీల ఆందోళనలు సకల జనుల సమ్మెకు మద్దతుగా 12వ తేదీ నుంచి ప్రధాన రాజకీయపార్టీలు తమ ఆందోళనలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ముందంజలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఎక్కడిక్కడ పార్టీ పరంగా ఆందోళనలు జరిపేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. సమైక్యాం ధ్ర ఉద్యమంలో అయోమయంలో ఉ న్న కాంగ్రెస్, టీడీపీలు ఉనికి కోల్పోకుండా ఉండేందుకు సకల జనుల స మ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. కాగా సోమవారం ఉద్యోగులు, ఎన్జీవోల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మహాప్రదర్శన నిర్వహించనున్నారు.