పాత కక్షల కారణంగా ఓ పిక్ పాకెటర్ హత్యకు గురైన సంఘటన చాంద్రాయణగుట్ట హైదరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): పాత కక్షల కారణంగా ఓ పిక్ పాకెటర్ హత్యకు గురైన సంఘటన చాంద్రాయణగుట్ట హైదరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎన్.రామారావు తెలిపిన ప్రకారం...బండ్లగూడ దస్తగిర్ నగర్‌కు చెందిన మహ్మద్ షకీల్ అలియాస్ చోర్ షకీల్ (28) అనే వ్యక్తి ఆటో నడపటంతోపాటు అదను దొరికినప్పుడల్లా జేబు దొంగతనాలకు పాల్పడుతుంటాడు. కాగా బుధవారం రాత్రి షకీల్ ఇంటికి అతని స్నేహితుడు నాసర్ వచ్చాడు. అనంతరం ఇద్దరూ కలసి మరో స్నేహితుడు మోయిన్ వద్దకు వెళ్లారు.
అయితే అర్థరాత్రి 12.30 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట చౌరస్తా సమీపంలోని తాళ్లకుంట వద్ద షకీల్ దారుణహత్యకు గురయ్యాడు. అతడి ఛాతీ, వీపు, మెడ భాగాలలో 12 వరకు కత్తిపోట్లు ఉన్నాయి. షకీల్‌కు స్థానికంగా హజీ జాఫ్రీ, మతిన్ జాఫ్రీ, జుబేర్ జాఫ్రీ అనేవారితో గొడవలున్నాయని, తన భర్తను వారే చంపారంటూ షకీల్ భార్య అఫ్రీన్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షకీల్‌తో వెళ్లిన నాసర్, మోయిన్ కూడా కనిపించకుండాపోయారు. మృతుడికి ముగ్గురు పిల్లలున్నారు. పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.