అందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉదయమే జరుపుకుంటే అక్కడ మాత్రం అర్థరాత్రే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అంతా ఒకలా చేస్తే ఆ రాష్ట్రంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారు? పైగా వారికి అనాదిగా వస్తున్న సంప్రదాయమట. వారి పూర్వీకుల నుంచి ఇలానే చేస్తున్నారట. అసలు ఎందుకిలా అంటే..
బిహార్‌లోని పుర్నియా అనే ప్రాంతంలోని వాసులు మాత్రం అర్థరాత్రి 12.01 గంటలకు జెండా చౌక్ అనే ప్రాంతంలో జెండా ఎగురవేసి సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని ఇప్పటి వరకు అలానే కొనసాగిస్తున్నారు. వారంతా నాటి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు.. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించింది, మనకు స్వాతంత్య్రం వచ్చింది అని ప్రకటించడం.. రేడియోలకి అతుక్కుపోయి మరీ విన్నారు. ఆ తర్వాత వెంటనే పుర్నియా వాసి రామేశ్వరప్రసాద్ సింగ్, దాదాపు పదివేలమంది వ్యక్తులంత కలిసి ఇలా నెహ్రు ప్రకటించగానే అర్థరాత్రి ఆ క్షణమే జెండా ఎగరువేసి వారంతా సంబరాలు చేసుకున్నారు.
దీంతో అప్పటి నుంచి దీన్ని ఒక ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ ఈ వేడుకల్లో ఆటంకం ఎదురుకాలేదని చెబుతున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం అతని వారసులు దీన్నికొనసాగిస్తున్నట్లు చెప్పారు. రామేశ్వర ప్రసాద్ మరణాంతరం ఆయన కూతురు సురేఖ దీన్ని పాటించిందని, ఇప్పుడూ మనవడు విపుల్ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
(చదవండి: ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో తెలుసా!ఏంటీ డౌంట్? అంటే..)
Comments
Please login to add a commentAdd a comment